AP Inter 1st Year Commerce Study Material Chapter 4 ఉమ్మడి హిందూ కుటుంబ వ్యాపార వ్యవస్థ, సహకార సంఘం

Andhra Pradesh BIEAP AP Inter 1st Year Commerce Study Material 4th Lesson ఉమ్మడి హిందూ కుటుంబ వ్యాపార వ్యవస్థ, సహకార సంఘం Textbook Questions and Answers.

AP Inter 1st Year Commerce Study Material 4th Lesson ఉమ్మడి హిందూ కుటుంబ వ్యాపార వ్యవస్థ, సహకార సంఘం

వ్యాసరూప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
ఉమ్మడి హిందూ కుటుంబ వ్యాపారం అంటే ఏమిటి ? దాని ముఖ్య లక్షణాలను చర్చించండి. [A.P & T.S. Mar. ’15]
జవాబు:
అవిభక్త హిందూ కుటుంబ వ్యాపార సంస్థలు హిందూ న్యాయశాస్త్రము ప్రకారము అమలులోనికి వచ్చినవి. హిందూ శాస్త్రములో రెండు వాదాలు ఉన్నవి. 1) మితాక్షరవాదము, 2) దయాభాగవాదము. మితాక్షరవాదము, పశ్చిమ బెంగాల్, అస్సాం రాష్ట్రాలకు మినహాయించి మిగతా భారతదేశానికి వర్తిస్తుంది. దయాభాగవాదం పై రెండు రాష్ట్రాలకు వర్తిస్తుంది.
అవిభక్త హిందూ కుటుంబము ఏవిధమైన ఒప్పందము వలన ఏర్పడదు. హిందూ న్యాయశాస్త్రములోని మితాక్షరవాదం వలన ఏర్పడినది. అవిభక్త హిందూ కుటుంబము సభ్యులలో కుటుంబ యజమాని, కొడుకులు కాక వారి భార్యలు, అవివాహిత కుమార్తెలు కూడా ఉంటారు. ‘అంటే ఎటువంటి ఒప్పందము వలన కాక కుటుంబములో జన్మించడంవలన, కుటుంబ వ్యాపారములో హక్కును పొందుతారు. వీరిని దాయాదులు అంటారు.

అవిభక్త హిందూ కుటుంబ వ్యాపారమును కుటుంబ యజమాని నిర్వహించును. అతను సామాన్యముగా కుటుంబ సభ్యులలో పెద్దవాడై ఉంటాడు. అతనిని ‘కర్త’ లేదా ‘మేనేజర్’ అంటారు. కుటుంబ వ్యాపారము మీద అతనికి సంపూర్ణ అధికారము, నియంత్రణ ఉంటుంది. వ్యవహారములన్నీ అతడే నిర్వహించును. సమిష్టి ఆస్తికి, దాయాదుల సంక్షేమానికి కుటుంబ కర్తయే పరిరక్షకుడు. కర్త ఋణబాధ్యత అపరిమితము కాని దాయాదుల ఋణబాధ్యత సమిష్టి ఆస్తిలోని వారి వాటాకే పరిమితమై ఉంటుంది. కర్త చర్యలను కుటుంబ సభ్యులు ప్రశ్నించడానికి వీలు లేదు. ఒకవేళ కుటుంబ వ్యాపారములో కొనసాగటము ఇష్టము లేకపోతే కుటుంబము ఆస్తి పంపకమును కోరవలెను.

ముఖ్య లక్షణాలు:
1. స్థాపన: హిందూ అవిభక్త కుటుంబ వ్యాపారానికి కనీసము ఇద్దరు సభ్యులు ఉండి పూర్వీకుల ఆస్తులుండాలి. ఇది ఒప్పందము మీద కాక హిందూ న్యాయశాస్త్రము ప్రకారము ఏర్పడుతుంది.

2. సభ్యత్వము: సమిష్టి హిందూ కుటుంబ వ్యాపారములో సభ్యత్వం కేవలము ఆ కుటుంబములో జన్మించడమువలన మాత్రమే కలుగుతుంది. బయట వ్యక్తులు ఒప్పందము వలన ఇందులో ప్రవేశించలేరు.

3. లాభనష్టాల పంపిణీ: వ్యాపార లాభాలలో దాయాదులందరికి సమాన వాటా ఉంటుంది.

AP Inter 1st Year Commerce Study Material Chapter 4 ఉమ్మడి హిందూ కుటుంబ వ్యాపార వ్యవస్థ, సహకార సంఘం

4. నిర్వహణ: ఈ వ్యాపారాన్ని కుటుంబ సభ్యులలో పెద్దవాడు మాత్రమే నిర్వహిస్తాడు. అతనిని కర్త అంటారు. మిగిలిన సభ్యులకు సంస్థ నిర్వహణలో పాల్గొనే హక్కు ఉండదు. కర్త తన ఇష్టానుసారము వ్యాపారాన్ని నిర్వహించడానికి అధికారము ఉన్నది. అతడి అధికారాన్ని ప్రశ్నించే హక్కు ఎవరికి లేదు. ఒకవేళ కుటుంబ వ్యాపారములో కొనసాగడం ఇష్టము లేకపోతే అందరి ఒప్పందముతో హిందూ అవిభక్త కుటుంబ వ్యాపారాన్ని రద్దుచేయవచ్చు.

5. ఋణబాధ్యత: దాయాదుల ఋణబాధ్యత సమిష్టి ఆస్తిలోని వారి వాటాలకు మాత్రమే పరిమితము. కాని కర్త యొక్క ఋణబాధ్యత అపరిమితము. వ్యాపార ఋణాలకు అతని సొంత ఆస్తులను కూడా ఉపయోగించవలెను.

6. మనుగడ: కుటుంబ సభ్యులలో ఎవరు మరణించినా వ్యాపార మనుగడకు అంతరాయము కలగదు. కర్త మరణించినపుడు, దాయాదులలో పెద్దవాడు కర్త స్థానాన్ని తీసుకుంటాడు. హిందూ అవిభక్త కుటుంబ వ్యాపారము అందరి సభ్యుల అంగీకారముతో రద్దుకావచ్చు లేదా కోర్టు చేసిన పంపకాలతో రద్దు అవుతుంది.

ప్రశ్న 2.
సహకార సంఘాలను నిర్వచించి, దాని ముఖ్య లక్షణాలను వివరించండి.
జవాబు:
ప్రజాస్వామ్య పద్ధతిలో లాభాపేక్షలేని పరస్పర సహాయము, సేవాశయాల కొరకు పరిమిత వనరులు గల వ్యక్తులు వ్యాపారము మరియు ఆర్థిక ప్రయోజనాలు పెంపొందించుటకే సమానత్వ ప్రాతిపదికపైన ఏర్పడిన స్వచ్ఛంద సంఘము సహకార సంఘము. సమిష్టి కృషికి, సాంఘిక శ్రేయస్సు దృష్టికి, సమాజ సేవకు పాటుపడుటయే ఈ సంస్థ లక్ష్యము. దీని ప్రధాన ధ్యేయము లాభార్జన కాదు. సభ్యులకు సేవ చేయుటయే. ఒకరికోసము అందరూ, అందరి కోసము ఒక్కరు అనేది ఆశయము. పరస్పర సహాయము ద్వారా స్వయం సహాయము దీని మార్గదర్శకమైన సూత్రము.

1912 సహకార సంఘాల చట్టము ప్రకారము ‘సహకార సూత్రాలకు అనుగుణముగా సభ్యుల ఆర్థిక ప్రయోజనాలను పరిరక్షించే ధ్యేయముతో స్థాపించబడిన సంస్థను సహకార సంస్థ’ అంటారు.

లక్షణాలు:
1. స్వచ్ఛంద సంఘము: ఒక ప్రాంతానికి లేదా ఒక వర్గానికి చెందిన ప్రజలు తమంతట తాముగా స్వప్రయోజనాల కోసము ఏర్పాటు చేసుకున్న సంఘమే సహకార సంస్థ. ఈ సంస్థలో చేరడానికిగాని, వదిలివెళ్ళడానికి సభ్యులకు పూర్తి స్వేచ్ఛ ఉంటుంది.

2. బహిరంగ సభ్యత్వము: సహకార సంఘములో చేరడానికి కులము, మతము, జాతి, రాజకీయ సిద్ధాంతాలు, విశ్వాసాలు మొదలైన వాటితో సంబంధము లేదు. సభ్యత్వము అందరికీ లభిస్తుంది.

3. సభ్యుల సంఖ్య: సహకార సంస్థలను స్థాపించడానికి 10 మంది సభ్యులు కావలెను. రాష్ట్ర సహకార సంఘాలలో వ్యక్తులు 50 మంది కావలెను. గరిష్ట సభ్యులకు పరిమితి లేదు..

4. ప్రభుత్వ నియంత్రణ: సహకార సంఘాల నమోదు తప్పనిసరి. వాటిపై ప్రభుత్వ అజమాయిషీ, నియంత్రణ ఉంటాయి. ఇవి ప్రభుత్వ నిబంధనలను పాటించాలి. ప్రతి సంవత్సరము వార్షిక నివేదికలను, లెక్కలను తయారుచేసి ప్రభుత్వానికి సమర్పించవలెను. సహకార శాఖ ఆడిటర్ వీటిని తనిఖీ చేస్తాడు.

5. మూలధనము: సంఘాల మూలధనమును సభ్యులే సమకూరుస్తారు. మూలధనము పరిమితముగా ఉండటమువలన ప్రభుత్వము నుంచి ఋణాలు, రాష్ట్ర, కేంద్ర సహకార సంస్థల నుంచి గ్రాంటు, రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల నుంచి సహయాన్ని పొందుతాయి.

AP Inter 1st Year Commerce Study Material Chapter 4 ఉమ్మడి హిందూ కుటుంబ వ్యాపార వ్యవస్థ, సహకార సంఘం

6. ప్రజాస్వామ్యబద్ధమైన నిర్వహణ: ఈ సంస్థ నిర్వహణ ప్రజాస్వామిక సూత్రాలమీద జరుగుతుంది. ప్రతి సభ్యునికి సంఘ నిర్వహణలో పాల్గొనే అవకాశము ఉంటుంది. సంఘములోని సభ్యులందరికి ఓటు హక్కు సమానము. ఒక మనిషికి ఒక ఓటు ఉంటుంది.

7. సేవాశయము: సహకార సంస్థల ప్రధాన ధ్యేయము సభ్యులకు సేవచేయుటయే. లాభార్జన కాదు.

8. పెట్టుబడిపై రాబడి సభ్యులకు తమ పెట్టుబడులపై డివిడెండు లభిస్తుంది.

9. మిగులు పంపిణీ: సహకార సంస్థలు వ్యాపారము చేయగా వచ్చిన మిగులు నుంచి కొంత మొత్తాన్ని విరాళాలకు (విద్య, వైద్యం మొదలైనవి) మరికొంత మొత్తాన్ని రిజర్వు నిధులకు కేటాయించి, మిగిలిన దానిని సభ్యులకు పరిమితమైన లాభాంశాలుగా పంచుతారు.

10. సహకార సంస్థల నమోదు: సహకార సంస్థను సహకార సంఘాల చట్టము 1912 క్రింద నమోదు చేయించవలెను. అప్పుడు దానికి కంపెనీ హోదా వస్తుంది. దాని వలన సంస్థకు న్యాయాత్మకమైన వ్యక్తిత్వము, నిర్దిష్టమైన న్యాయసత్వము కలుగుతుంది.

ప్రశ్న 3.
‘స్వయం-సహాయం అనే ప్రాతిపదికపై ఏర్పడిన వ్యవస్థ సహకార సంఘం’ చర్చించండి.
జవాబు:
సమాజములోని బలహీనవర్గాల ఆసక్తులను రక్షించుటకై సహకార ఉద్యమము ఏర్పడినది. సొంత వ్యాపారము, భాగస్వామ్య వ్యాపారము, కంపెనీ వ్యాపారము చేసే సంస్థల ధ్యేయము లాభ సముపార్జనే లాభాన్ని సంపాదించడానికి ఈ సంస్థలు వినియోగదారులకు అందించే సేవలు చాలా పరిమితముగా ఉంటాయి. లాభార్జన దృష్టితో అవి ధరలను పెంచడము, కల్తీ సామానులు అమ్మడం మొదలైన హీనమైన చర్యలకు పాల్పడతాయి. సాంఘిక ప్రయోజనము బాధ్యతల కంటే తమ స్వప్రయోజనము, స్వలాభము సూత్రాలుగా ఉండేవి. పెట్టుబడిదారులు, శ్రామికులు, ‘వినియోగదారులు దోపిడీచేస్తున్నారు. వస్తు పంపిణీలో మధ్యవర్తుల వలన ఉత్పత్తిదారులకు వినియోగదారులకు మధ్య అగాధము ఏర్పడినది. లోపభూయిష్టమైన పెట్టుబడిదారీ విధానాన్ని సంస్కరించి సామ్యవాది రీతి సమాజ స్థాపనకై సహకార సంఘాలను ఏర్పాటుచేయడం జరిగినది.
ప్రజాస్వామ్య పద్ధతిలో లాభాపేక్షరహితమైన పరస్పర సహాయము, సేవాశయము కొరకు పరిమిత నిధులు గల వ్యక్తులు వ్యాపారము మరియు ఆర్థిక ప్రయోజనాలు పెంపొందించటానికి సర్వమానవ సమానత్వ ప్రాతిపదికమీద ఏర్పరచిన స్వచ్ఛంద సంఘము సహకార సంస్థలు. సమిష్టి కృషికి, సాంఘిక శ్రేయస్సు, సమాజ సేవకు పాటుబడుటయే ఈ సంస్థల లక్ష్యము. దీని ప్రధాన ఆశయము లాభార్జనకాదు. సభ్యులకు సేవ చేయుటయే. ఒకరికోసం అందరూ, అందరికోసం ఒక్కరు అనేది దీని ఆశయం. పరస్పర సహాయము ద్వారా స్వయం సహాయం దీని మార్గదర్శక సూత్రము.

మన దేశములో సహకార సంస్థలను లాభాల కొరకు ఆకలిగొన్న వ్యాపారస్తుల కబంధ హస్తాల నుంచి బలహీనవర్గాలవారి ఆసక్తులను రక్షించుటకు సహకార సంస్థలు ఏర్పడినవి.

ప్రశ్న 4.
ఉమ్మడి హిందూ కుటుంబ వ్యాపార సంస్థ ప్రయోజనాలను, లోపాలను చర్చించండి.
జవాబు:
ఉమ్మడి హిందూ కుటుంబ వ్యాపార సంస్థ యొక్క ప్రయోజనాలు:
1. నిరంతరము కొనసాగుతుంది: ఈ తరహా వ్యాపార సంస్థ కుటుంబ సభ్యుల మధ్య ఒప్పందము వలన ఏర్పడదు. ఉమ్మడి కుటుంబములో తండ్రి, తన తండ్రి నుంచి సంపాదించిన ఆస్తిని తన కుమారునకు, తిరిగి తన కుమారుడు ఆ తర్వాత అతని కుమారుని పుట్టుక ద్వారా ఆస్తిని పొందుతాడు. దాయాదులు, కర్త మరణంతో సంస్థ మూతపడదు. అది నిరంతరము కొనసాగుతుంది.

AP Inter 1st Year Commerce Study Material Chapter 4 ఉమ్మడి హిందూ కుటుంబ వ్యాపార వ్యవస్థ, సహకార సంఘం

2. కేంద్రీకృత నిర్వహణ: వ్యాపారసంస్థ నిర్వహణ కర్త చేతిలో కేంద్రీకృతమై ఉంటుంది. కర్త కుటుంబ సభ్యులలో పెద్దవాడు, అనుభవజ్ఞుడు అయి ఉండటమువలన, అతడు సంస్థకు క్రమశిక్షణతో కూడిన నిర్వహణ ఇవ్వగలడు.

3. గరిష్ట సభ్యుల సంఖ్యపై పరిమితి లేదు: భాగస్వామ్యము వలె ఈ తరహా కుటుంబ వ్యాపార సంస్థలో గరిష్ట సభ్యులకు పరిమితిలేదు.

4. పరపతీ సౌకర్యాలు: ఈ సంస్థలో పరపతి సౌకర్యాలు ఎక్కువ. దీనికి కారణం కర్త యొక్క ఋణబాధ్యత అపరిమితము.

5. వ్యాపార రహస్యాలు: సంస్థ యావత్తు నిర్వహణ కర్త చేతులలో ఉంటుంది. కాబట్టి అతడు వ్యాపార రహస్యాలు గోప్యముగా ఉంచగలడు. రహస్యాలు బయటకు పొక్కవు.

6. శీఘ్ర నిర్ణయాలు: సమిష్టి హిందూ కుటుంబములో కర్తకు మాత్రమే నిర్ణయాలు చేసే అధికారము ఉంటుంది. అందువలన ‘శీఘ్రముగా నిర్ణయాలు తీసుకొనగలడు. ఇతర కుటుంబ సభ్యులతో సంప్రదించవలసిన పనిలేదు.

7. సమర్థతను బట్టి పని అప్పగించుట: కుటుంబ సభ్యులకు వారి సామర్ధ్యాన్ని బట్టి పనులు అప్పగించబడతాయి. కర్త సొమ్ము వినియోగములో జాగ్రత్త, పొదుపరితనం పాటిస్తాడు.

ఉమ్మడి హిందూ కుటుంబ వ్యాపార సంస్థ యొక్క లోపాలు:
1. శ్రమకు, ప్రతిఫలానికి సహసంబంధము ఉండదు: వ్యాపారాన్ని కర్త ఒక్కడే నిర్వహిస్తాడు. కాని లాభాలు వచ్చినపుడు సభ్యులందరూ సమానముగా పంచుకుంటారు. దాయాదుల సోమరితనాన్ని ఇది ప్రోత్సహిస్తుంది.

2. పరిమిత నిర్వహణా సామర్థ్యము: ఈ వ్యాపారాన్ని కుటుంబ సభ్యులలో పెద్దవాడు కర్త మాత్రమే నిర్వహిస్తాడు. నిర్వహణ విధులన్నీ అతనే చూసుకుంటాడు. వ్యాపార నైపుణ్యానికి సంబంధించిన పూర్తి పరిజ్ఞానము అతనికి ఉండకపోవచ్చు.

3. పరిమిత మూలధనము: ఇందులోని పెట్టుబడి ఒక కుటుంబ ఆర్థిక వనరులకు మాత్రమే పరిమితమై ఉంటుంది. వ్యాపార విస్తృతికి సంబంధించిన నిధులు లభించకపోవచ్చు.

4. కష్టం ఒకరిది, సుఖం ఇంకొకరిది: ఉమ్మడి కుటుంబ వ్యాపారములో కర్తకు పూర్తి స్వేచ్ఛ ఉన్నది. వ్యాపారము కోసం అతడు కష్టించి కృషి చేస్తాడు. దాయాదులు
కష్టపడకుండా అనుభవిస్తారు.

5. ` నిర్వహణను కర్తకు వదిలివేయడము: వ్యాపార నిర్వహణను పూర్తిగా కర్తకే వదిలివేయడం జరుగుతుంది. కొన్ని సమయాలలో అతడు తప్పుడు నిర్ణయాలు తీసుకోవచ్చు. తత్ఫలితముగా వ్యాపారము దెబ్బతినవచ్చు. కర్త చేసిన తప్పిదాలకు దాయాదులు కూడా బాధ్యతను వహించవలసి ఉంటుంది.

6. అనుమానము: కర్త ఈ వ్యాపారాన్ని అత్యంత గోప్యముగా నిర్వహిస్తాడు. ముఖ్యమైన విషయాలను దాయాదుల నుంచి రహస్యముగా ఉంచుతాడు. దీని వలన కుటుంబ సభ్యులకు అతని మీద అనుమానం వచ్చే అవకాశము ఉన్నది..

ప్రశ్న 5.
సహకార సంఘాల ప్రయోజనాలను, లోపాలను వివరించండి.
జవాబు:
సహకార సంఘాల వలన ప్రయోజనాలు:
1. స్థాపనా సౌలభ్యము: సహకార సంస్థలను స్థాపించుట సులభము. పదిమంది కలసి తమ ఆర్థిక ప్రయోజనాల కోసము ఒక సంస్థగా ఏర్పడవచ్చు. నమోదుచేయుటకు అవలంబించవలసిన చట్టబద్ధమైన లాంఛనాలు చాలా తక్కువ.

2. ప్రజాస్వామ్య పరిపాలన: సంస్థల నిర్వహణ ప్రజాస్వామిక సూత్రాలపై ఆధారపడి ఉంటుంది. వ్యాపార నిర్వహణలో పాల్గొనే హక్కు ప్రతి సభ్యునకు ఉంటుంది. ఒక మనిషికి ఒకే ఓటు. అతనికి ఎన్ని వాటాలు అయినా ఉండవచ్చు.

3. నిర్వహణ ఖర్చులు తక్కువ: సహకార సంస్థలలో పరిపాలన ఖర్చులు తక్కువ. పాలక మండలి సభ్యులు వేతనము తీసుకోకుండా నిర్వహణ పనులు చేపడతారు.

4. సేవాశయము: సహకార సంస్థల ముఖ్య ఉద్దేశము సేవలను అందించుట. సభ్యులకు చౌక ధరలకు వస్తువులను అందజేస్తుంది. తక్కువ వడ్డీలకు ఋణాలను అందిస్తుంది. సభ్యుల మధ్య సహకార భావనను కలుగజేస్తుంది.

5. పరిమిత ఋణబాధ్యత: సభ్యుల ఋణబాధ్యత వారు చెల్లించిన వాటా మూలధనానికే పరిమితమై ఉంటుంది.

6. స్థిరత్వము: సభ్యుల మరణము, విరమణ లేదా దివాలా తీయడంవలన సంస్థ మనుగడకు భంగముకలగదు.

7. పన్ను రాయితీలు: సహకార సంఘాల ఆదాయముపై కొంత పరిమితి మేరకు పన్ను మినహాయింపు ఉంటుంది. అంతేగాక నమోదు రుసుములోను, స్టాంపు డ్యూటీలోను మినహాయింపు ఉంటుంది.

AP Inter 1st Year Commerce Study Material Chapter 4 ఉమ్మడి హిందూ కుటుంబ వ్యాపార వ్యవస్థ, సహకార సంఘం

8. ప్రభుత్వ ఆదరణ: ప్రభుత్వము సహకార సంఘాలకు అప్పులు, గ్రాంట్ల రూపములో ఆర్థిక సహాయం అందిస్తుంది. సమాజములో ఆర్థికముగా, సాంఘికముగా వెనుకబడిన వర్గాలకు సహాయపడే ధ్యేయముతో ఈ సంఘాలకు ఉదారముగా ధన సహాయం అందిస్తుంది.

9. వాటాలలో స్పెక్యులేషన్ ఉండదు: ఈ సంఘాలలో సభ్యుడు ఎప్పుడైనా వాటాలను కొనవచ్చు కాబట్టి వాటాలలో స్పెక్యులేషన్ ఉండదు.

10. సాంఘిక ప్రయోజనాలు: ఈ సంస్థలు ప్రజాస్వామ్యములో విద్య, శిక్షణ, స్వయం పరిపాలన, స్వయం సహాయం, పరస్పర సహాయము మొదలైన సూత్రాలను ప్రతిపాదిస్తుంది.

11. వ్యాపారాలపై నియంత్రణ: ఇతర వ్యాపారసంస్థలు అధిక ధరలతో వినియోగదారులను దోచుకుంటున్నప్పుడు, ఇవి తక్కువ ధరలకు వస్తువులను అందజేస్తుంది.

12. మధ్యవర్తులు ఉండరు: సహకార సంస్థలు వస్తువులను నేరుగా ఉత్పత్తిదారుల నుంచి కొనుగోలుచేసి వాటిని వినియోగదారులకు అందజేస్తాయి. మధ్యవర్తుల బెడద ఉండదు.

13. సభ్యుల మధ్య సుహృద్భావము: ఒకరి కోసము అందరూ, అందరికోసం ఒకరు అనే సూత్రముపై సహకార సంఘాలు పని చేస్తాయి. కాబట్టి సభ్యుల మధ్య సోదరభావం, సంఘీభావము పెంపొందిస్తాయి.

సహకార సంఘాల వలన లోపాలు:
1. అసమర్థ నిర్వహణ: పాలకవర్గ సభ్యులకు గౌరవ వేతనము మాత్రమే లభిస్తుంది. కాబట్టి వారు నిర్వహణలో పూర్తి ఆసక్తిని చూపరు. ఆదాయ వనరులు స్వల్పముగా ఉంటాయి. కాబట్టి సమర్థవంతులైన, వృత్తి నిపుణులైన నిర్వాహకులను నియమించుట కష్టము.

2. పరిమిత ఆర్థిక వనరులు: డివిడెండ్ల పరిమితి మరియు ఒక వ్యక్తికి ఒక ఓటు అనే సూత్రము వలన ధనవంతులు ఈ సంఘాలలో చేరడానికి ఇష్టపడరు. పరిమితమైన వనరుల వలన విస్తృతికి అవకాశముండదు.

3. సభ్యులమధ్య సంఘీభావము లోపించుట: సభ్యుల మధ్య మనస్పర్థలు, తగాదాల వలన సహకార సంస్థలు విఫలమవుతాయి..

4. కష్టపడేవారికి ప్రోత్సాహము ఉండదు: సంఘాలకు ఎక్కువ లాభాలు వచ్చినా వారి సేవలకు చెల్లింపు జరగదు కాబట్టి మేనేజ్మెంట్ కమిటీ సభ్యులు నిర్వహణలో ఎక్కువ ఆసక్తిని చూపరు.

5. వాటాల బదిలీ ఉండదు: ఏ సభ్యుడు తన వాటాలను బదిలీచేయడానికి, వీలులేదు కాని మూలధనాన్ని వాపసు తీసుకోవచ్చు.

6. కఠినమైన ప్రభుత్వ నియంత్రణ: సహకార సంఘములు చట్టములోని నియమ నిబంధనలను మరియు ప్రభుత్వ నిబంధనలు పాటించవలెను.

7. అన్ని సంస్థలకు వర్తించకపోవడం: ఇవి చిన్న, మధ్యతరహా వ్యాపారాలకే అనువుగా ఉంటుంది.

8.. రహస్యాలు దాగవు: సంస్థ వ్యవహారాలు సభ్యులందరికి తెలుస్తాయి కాబట్టి వ్యాపార రహస్యాలు దాగవు.

9. నిస్వార్థ సేవకులు దొరుకుట కష్టము: సంస్థ విజయానికి నిస్వార్థ సేవకులు, నాయకుల ఆవశ్యకత ఉన్నది. కాని అటువంటివారు లభించుట అరుదు.

10. రాజకీయాల జోక్యము: మేనేజ్మెంట్ కమిటీలో ప్రభుత్వము సభ్యులను నామినేట్ చేస్తుంది. ప్రతి ప్రభుత్వము -తమ సొంతపార్టీ సభ్యులను ఈ సంఘాలకు పంపుతుంది.

11. పోటీతత్వము లేకపోవుట: సహకార సంస్థలకు పరిమిత వనరులు ఉండటము వలన పెద్ద సంస్థల పోటీని తట్టుకోలేవు. అవి భారీ ఉత్పత్తి ద్వారా ఓవర్హెడ్ ఖర్చులను తగ్గించుకోగలవు.

స్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
వివిధ రకాల సహకార సంఘాలను గురించి క్లుప్తంగా వివరించండి. [AP & TS Mar 15]
జవాబు:
ప్రజల అవసరాల ప్రకారము భారతదేశములో వివిధ రకాల సహకార సంఘాలను స్థాపించడం జరిగినది. అవి దిగువ పేర్కొనబడినవి.
1. వినియోగదారుల సహకార సంఘాలు: నిత్యావసర వస్తువులను సరసమైన ధరలకు కొనుగోలు చేసే నిమిత్తము వినియోగదారులు ఈ రకమైన సంఘాలను ఏర్పాటుచేసుకుంటారు. ఈ సంఘాలు నేరుగా వస్తువులను టోకు వర్తకుల నుంచి పెద్ద మొత్తములో తక్కువ ధరకు కొనుగోలు చేసి చిన్న మొత్తాలలో ఈ సంఘ సభ్యులకు విక్రయించడం జరుగుతుంది. సభ్యులు కానివారికి ఎక్కువ ధరకు అమ్మి ఆ విధముగా వచ్చిన లాభాలను సభ్యుల సంక్షేమం కోసం కొంత ఖర్చు చేసి మిగతా మొత్తాన్ని డివిడెండ్ల రూపములో సభ్యులకు పంచడం జరుగుతుంది.

AP Inter 1st Year Commerce Study Material Chapter 4 ఉమ్మడి హిందూ కుటుంబ వ్యాపార వ్యవస్థ, సహకార సంఘం

2. ఉత్పత్తిదారుల సహకార సంఘాలు: చిన్న ఉత్పత్తిదారులు, చేతివృత్తుల వారు ముడిపదార్థాలు, పనిముట్లు, సాంకేతిక పరిజ్ఞానము మొదలైన సమస్యలు ఎదుర్కొంటారు. ఇలాంటి సమస్యలను ఎదుర్కొంటున్న ఉత్పత్తిదారులకు, చేతివృత్తుల వారికి అవసరమైన సౌకర్యాలు కల్పించి వారి ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడంకోసం ఈ సంఘాలను ఏర్పాటుచేసుకుంటారు.

3. మార్కెటింగ్ సహకార సంఘాలు: తాము ఉత్పత్తిచేసిన వస్తువులను మధ్యవర్తుల ప్రమేయం లేకుండా నేరుగా వినియోగదారులకు అమ్మే నిమిత్తము చిన్న ఉత్పత్తిదారులు స్వచ్ఛందముగా ఏర్పాటుచేసుకున్న సంఘాలే మార్కెటింగ్ సహకార సంఘాలు. ఇవి మార్కెటింగ్ చేయడంలో ఎదురయ్యే సమస్యలను అధిగమించడానికి చిన్న ఉత్పత్తిదారులకు సహాయపడతాయి.

4. గృహ నిర్మాణ సహకార సంఘాలు: అల్పాదాయవర్గ ప్రజలు ఆర్థిక ఇబ్బందుల కారణముగా సొంతముగా ఇళ్ళు నిర్మించుకోలేని వారికి ఈ సంఘాలు వారి’ సభ్యులకు ప్రభుత్వము ద్వారా స్థలము పొందడానికి, ప్లాట్లుగా ఇవ్వడానికి ఋణ సౌకర్యాన్ని కల్పిస్తాయి. దీర్ఘకాలానికి సులభ వాయిదాలలో నిర్మాణ వ్యయాన్ని సభ్యులు చెల్లిస్తారు. కొంతకాలము తరువాత సభ్యులు వారి ఇంటికి సొంతదారులు / యజమానులు అవుతారు.

5. వ్యవసాయ సహకార సంఘాలు: శాస్త్రీయపద్ధతిలో వ్యవసాయము చేస్తూ భారీ వ్యవసాయ ప్రయోజనాలను పొందడానికి చిన్న వ్యవసాయదారులు స్వచ్ఛందంగా కలిసి ఏర్పాటుచేసుకున్న సంఘాలే వ్యవసాయ సహకార సంఘాలు. ఈ సంఘాలు వ్యవసాయదారులకు ట్రాక్టర్లు, ఖరీదైన యంత్రాలను అద్దెకు అందజేస్తుంది. నీటి సరఫరా, ఎరువులు, విత్తనాల సరఫరా మొదలైన వసతులను సమకూరుస్తుంది.

6. సహకార పరపతి సంఘాలు: ఆర్థిక సమస్యలు ఉన్న రైతులు, చేతి వృత్తులవారు, కార్మికులు, ఉద్యోగులు వీటిని స్థాపిస్తారు. ఈ సంఘాలు సభ్యుల నుంచి పొదుపు మొత్తాలను సేకరించి, అవసరము ఉన్న సభ్యులకు తక్కువ వడ్డీ రేట్లకు ఋణాలు అందిస్తాయి. ఇచ్చిన ఋణాన్ని సభ్యుల నుంచి సులభ వాయిదాలలో తిరిగి వసూలు చేసుకుంటాయి.

అతి స్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1. కర్త [T.S. Mar. ’15]
జవాబు:
హిందూ అవిభక్త కుటుంబములో పెద్దవాడిని కర్త లేదా మేనేజరు అంటారు. వ్యాపార నిర్వహణ అంతా అతని చేతుల మీదగానే జరుగుతుంది. వ్యాపారము మీద అతని సంపూర్ణ అధికారాలు ఉంటాయి. అతని అధికారాన్ని ప్రశ్నించే హక్కు ఎవరికి లేదు. కర్త యొక్క ఋణబాధ్యత అపరిమితము.

ప్రశ్న 2.
సహవారసులు
జవాబు:
కర్త కాకుండా సమిష్టి హిందూ కుటుంబ వ్యాపార సంస్థ సభ్యులందరిని సహవారసులుగా పిలుస్తారు. సంస్థ లాభాలను వీరు సమానముగా పంచుకుంటారు. వీరి ఋణబాధ్యత వారి వాటాల మేరకు పరిమితము.

ప్రశ్న 3.
దయాభాగ
జవాబు:
దయాభాగము అస్సాం, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలకు వర్తిస్తుంది. ఈ వాదనలోని నిబంధనలు కొన్ని మినహాయించి మితాక్షరవాదం వలె ఉంటాయి. ఈ వాదన ప్రకారము దాయాదులకు ఆస్తిపై గల హక్కు వారసత్వము ద్వారా సంక్రమిస్తుంది కాని పుట్టుకతో రాదు. కాబట్టి హిందూ అవిభక్త కుటుంబములోని వాటా సభ్యుల మరణము, జననం వలన మార్పురాదు.

AP Inter 1st Year Commerce Study Material Chapter 4 ఉమ్మడి హిందూ కుటుంబ వ్యాపార వ్యవస్థ, సహకార సంఘం

ప్రశ్న 4.
మితాక్షర
జవాబు:
ఈ వాదము అస్సాం, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలకు తప్ప మిగిలిన భారతదేశమంతా వర్తిస్తుంది. అవిభక్త హిందూ కుటుంబ సభ్యులలో కుటుంబ యజమాని, కొడుకులు కాక వారి’ భార్యలు, అవివాహిత కుమార్తెలు కూడా ఉంటారు. పుట్టుక ద్వారా సభ్యునకు ఆస్తిలో వాటా వస్తుంది. ఈ హక్కు అతని / ఆమె మరణము వరకు ఉంటుంది. కాబట్టి ఆస్తిలో వాటా దాయాదుల సంఖ్యను బట్టి మారుతుంది. అనగా జీవించి ఉన్న సభ్యులకే ఆస్తిహక్కు ఉంటుంది. భర్త పోయిన స్త్రీకి ఆస్తిహక్కు ఉండదు. కాని మనోవర్తి క్రింద కొంత మొత్తాన్ని అడగవచ్చు.

ప్రశ్న 5.
సహకార సంఘం అర్థం ఏమిటి ?
జవాబు:
ప్రజాస్వామ్య పద్ధతిలో లాభాపేక్షలేని, పరస్పర సహాయము సేవాశయాల కొరకు పరిమిత వనరులు గల వ్యక్తులు వ్యాపారము మరియు ఆర్థిక ప్రయోజనాలు పెంపొందించుటకు సమానత్వ ప్రాతిపదికపైన ఏర్పడిన స్వచ్ఛంద సంఘము ‘సహకార సంఘము, 1912 సహకార సంఘాల చట్టం ప్రకారము సహకార సూత్రాలకు అనుగుణముగా సభ్యుల ఆర్థిక ప్రయోజనాలను పరిరక్షించే ధ్యేయముతో స్థాపించబడిన సంస్థను సహకార సంఘము అంటారు.

AP Inter 1st Year Commerce Study Material Chapter 3 వ్యాపార వ్యవస్థ స్వరూపాలు

Andhra Pradesh BIEAP AP Inter 1st Year Commerce Study Material 3rd Lesson వ్యాపార వ్యవస్థ స్వరూపాలు Textbook Questions and Answers.

AP Inter 1st Year Commerce Study Material 3rd Lesson వ్యాపార వ్యవస్థ స్వరూపాలు

వ్యాసరూప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
సొంత వ్యాపారాన్ని నిర్వచించి, దానివలన కలిగే ప్రయోజనాలను, దానికి ఉన్న పరిమితులను చర్చించండి. [A.P. Mar. ’15]
జవాబు:
సొంత యాజమాన్యము, నియంత్రణ కలిగిన వ్యాపార సంస్థను సొంత వ్యాపార సంస్థ అంటారు. ఈ వ్యాపార వస్థలో మూలధనాన్ని ఒక వ్యక్తే సమకూర్చుకొని వ్యాపారానికి అవసరమయ్యే నిధులను స్నేహితుల నుండి, బంధువుల ఒంచి, బ్యాంకు నుంచి అప్పు తీసుకుంటాడు. వ్యాపార నిర్ణయాలు అతడు ఒక్కడే తీసుకుంటాడు. కొనుగోళ్ళు, మొదలైన కార్యకలాపాలన్నీ అతడే నిర్వహించుకొని వచ్చే లాభనష్టాలను అతడే భరిస్తాడు. అవసరమయితే బ సభ్యులను లేదా ఉద్యోగులను నియమిస్తాడు.

తన అభిప్రాయము ప్రకారము “ఎవరైతే వ్యాపార బాధ్యతను మోస్తారో, ఎవరైతే కార్యకలాపాలు నిర్వహిస్తారో, నష్టభం ఎవరైతే స్వీకరిస్తారో, ఆ వ్యక్తి నడిపే సంస్థ సొంతవ్యాపారము”.

జేమ్స్ స్టీఫెన్సన్ అభిప్రాయము ప్రకారము “సొంత వ్యాపారాన్ని ఒక వ్యక్తి తన సొంత నిధులు, నిర్వహణా సామర్థ్యముతో నిర్వహిస్తాడు. ఈ వ్యాపారానికి సంబంధించిన జయాపజయాలకు అతడే బాధ్యత వహించవలసి ఉంటుంది”.

ప్రయోజనాలు:
1. సులభముగా స్థాపించుట: సొంత వ్యాపార సంస్థను స్థాపించడానికి చట్టబద్ధమైన లాంఛనాలు ఉండవు కాబట్టి దీనిని సత్వరము ప్రారంభించవచ్చును. రద్దుపరుచుట కూడా తేలిక.

2. శీఘ్ర నిర్ణయాలు: వ్యాపార నిర్ణయాలు తీసుకోవడములో జాప్యము ఉండరాదు. ఆలస్యము వలన అవాంఛనీయమైన పరిస్థితులు ఏర్పడవచ్చు. సొంతవ్యాపారి తనకుతానే యజమాని, ఇతరులతో సంప్రదించవలసిన పనిలేదు. కాబట్టి వ్యాపార నిర్ణయాలు శీఘ్రముగా తీసుకోవచ్చు.

AP Inter 1st Year Commerce Study Material Chapter 3 వ్యాపార వ్యవస్థ స్వరూపాలు

3. వ్యక్తిగత శ్రద్ధాసక్తులు: వ్యాపారములో లభించే లాభమంతా సొంతవ్యాపారికి చెందుతుంది. అంతేగాక అతని ఋణబాధ్యత కూడా అపరిమితము. అందుచేత వ్యాపార కార్యకలాపాలలో అతనికి శ్రద్ధాసక్తులు ఉంటాయి. తన ప్రత్యక్ష పర్యవేక్షణలో వ్యవహారాలను సమర్థవంతముగా, ఆదాయపూర్వకముగా నడపవచ్చు.

4. మార్పులకు సౌలభ్యము: అవసరాలను బట్టి సంస్థను ఒక చోటు నుంచి మరొక చోటుకు మార్చవచ్చును లేదా వ్యాపార స్వభావాన్ని మార్చవచ్చును. దీనికి చట్టబద్దమైన ప్రతిబంధకాలు ఉండవు.

5. వ్యాపార రహస్యాలు: వ్యాపార సుస్థిరతకు, విజయానికి కొన్ని మెళుకువలు, కిటుకులు ఉంటాయి. వీటిని వ్యాపార రహస్యాలు అంటారు. సొంత వ్యాపారి ఒకడే కాబట్టి వ్యాపార రహస్యాలు బయటకు పొక్కవు. అంతేగాక లాభనష్టాలను ప్రచురించవలసిన అవసరములేదు.

6. వ్యక్తిగత సంబంధము: వ్యాపారము అభివృద్ధి చెందడానికి ఖాతాదారులతో మైత్రి అవసరము. సొంతవ్యాపారములో యజమానే అన్ని వ్యవహారములు స్వయముగా చూసుకుంటాడు. కాబట్టి ఖాతాదారుల మన్ననలను చూరగొంటాడు. ఖాతాదారులతో మైత్రిని ఏర్పరచుకొని, వారి అవసరాలకు అనుగుణముగా తన వ్యాపారములో మార్పులను చేయవచ్చు.

పరిమితులు:
1. పరిమిత నిధులు: సొంతవ్యాపారి ఆర్థికస్థోమత పరిమితముగా ఉండటము వలన అవసరమైనప్పుడు నిధులను సమకూర్చుకొనలేడు. కాబట్టి వ్యాపారాన్ని విస్తృతపరుచుట కష్టము.

2. అనిశ్చిత మనుగడ: న్యాయశాస్త్ర దృష్టిలో సొంతవ్యాపారము సొంతవ్యాపారి వేరుకాదు. కాబట్టి వ్యాపారములో అనుకోని పరిస్థితులు ఏర్పడి అతడు మరణించినా, దివాలా తీసినా సంస్థ మూతపడుతుంది.

3. అపరిమిత ఋణబాధ్యత: సొంతవ్యాపారి యొక్క ఋణబాధ్యత అపరిమితము. వ్యాపారములో నష్టాలు ఎక్కువగా వచ్చి అప్పులపాలయితే, అప్పులను తీర్చడానికి వ్యాపార ఆస్తులు చాలకపోతే, సొంత ఆస్తులను అమ్మి అప్పులను తీర్చవలెను. అందువలన సొంత ఆస్తులకు రక్షణ లేదు.

4. భారీతరహా కార్యకలాపాలకు అనువుగా ఉండదు: పరిమిత వనరులు, నిర్వహణా సామర్థ్యము వలన సొంతవ్యాపారము భారీ తరహా వ్యాపారాలకు అనువుగా ఉండదు.

5. పరిమిత నిర్వహణా సామర్థ్యము: వ్యాపారములో కొనుగోళ్ళు, అమ్మకాలు, ఆర్థిక వ్యవహారాలు మొదలైన అనేక విధులు ఉంటాయి. వీటన్నింటిని చూసుకొనే శక్తియుక్తులు, అనుభవము సొంతవ్యాపారికి ఉండకపోవచ్చు. నిపుణులను నియమించుటకు నిధులు సరిపోవు.

ప్రశ్న 2.
“అన్ని విషయాలను నిర్వహించుకోగల శక్తిమంతుడై ఉండాలేగాని, ప్రపంచములో సొంతవ్యాపారానికి మించినది మరొకటి లేదు” – వివరించండి.
జవాబు:
సొంతవ్యాపారము నాగరికత పుట్టినప్పటి నుంచి అమలులో ఉన్నది. ఇది అతిపురాతనమైనది. చరిత్రగతిని పరిశీలిస్తే వాణిజ్యము సొంత వ్యాపారముతోనే ఆరంభమైనట్లు కనిపిస్తున్నది. అన్ని దేశాలలోనూ ఈ రకం వ్యాపారమే అధికముగా ఉన్నట్లు గోచరిస్తున్నది. ఎవరైనా వ్యాపారము ప్రారంభించదలిస్తే మొదట కొద్దిపాటి మూలధనముతో సొంతవ్యాపారము ప్రారంభించి, అనుభవము గడించి క్రమేణ అభివృద్ధి చేసుకుంటూ ఉంటారు. చిన్నకార్లను తయారుచేసే ప్రఖ్యాతిచెందిన ఫోర్డు కంపెనీ ఒకనాడు సొంతవ్యాపారముగా స్థాపితమై, తరువాత అభివృద్ధి చెందినదే. ఈ రకముగా సొంతవ్యాపార సంస్థ అత్యంత ముఖ్యమైనది.

AP Inter 1st Year Commerce Study Material Chapter 3 వ్యాపార వ్యవస్థ స్వరూపాలు

ఒక వ్యక్తి యాజమాన్యము, నియంత్రణ కలిగి ఉండే వ్యాపార సంస్థను సొంతవ్యాపార సంస్థ అంటారు. వ్యాపారానికి కావలసిన మూలధనాన్ని అతడు ఒక్కడే సమకూర్చుకొని వ్యాపారానికి కావలసినవన్నీ ఏర్పాటుచేసుకుంటాడు. వ్యాపార నిర్ణయాలు తానొక్కడే తీసుకుంటాడు. తన కుటుంబసభ్యుల సహకారముతో లేదా ఉద్యోగులను నియమించుకొని తానే స్వయముగా వ్యాపారాన్ని నిర్వహించుకుంటాడు. సంస్థకు కావలసిన నిధులను అవసరమైతే తన బంధువులు, స్నేహితులు లేదా బ్యాంకుల నుంచి అప్పులు తెస్తాడు. కొనుగోళ్ళు, అమ్మకాలు మొదలగు వ్యాపార కార్యకలాపాలన్నీ తానే స్వయముగా నిర్వహించుకుంటూ మిక్కిలి పొదుపుతో అధిక లాభాలను పొందడానికి ప్రయత్నిస్తాడు. లాభాలను తానొక్కడే అనుభవిస్తాడు, కాబట్టి ఎక్కువ లాభాల కోసము అహర్నిశలు శ్రమిస్తాడు. తన పొరపాట్ల వలన సంస్థకు నష్టము వస్తే తానే భరించాలి కాబట్టి మిక్కిలి జాగురూకతతో నిర్వహణా బాధ్యతను చేపడతాడు. ఈ విధముగా ‘అన్నీ తానే, తనకే అన్నీ’ అనే తరహాలో సొంతవ్యాపారము నడుస్తుంది.

వ్యాపార రథానికి సారథిగా, వ్యాపార విజయానికి నాయకుడిగా నిలబడాలి అంటే సొంతవ్యాపారికి దూరదృష్టి, చొరవ, సరైన నిర్ణయాలు తీసుకునే శక్తి, వ్యాపార దక్షత, సామర్థ్యము, ఓర్పు, చిత్తశుద్ధి, ఆత్మవిశ్వాసము, లౌక్యము మొదలైన లక్షణాలు కలిగి ఉండవలెను.

ఈ విధముగా పైవిషయాలన్నీ నిర్వహించగల శక్తిమంతుడై వ్యాపారస్తుడు ఉన్నయెడల సొంతవ్యాపారానికి మించినది మరొకటి లేదు. అతడు స్వేచ్ఛగా, హాయిగా వ్యాపారము చేసుకుంటూ తాను సాధించదలచిన వ్యాపార విజయాన్ని, సంతృప్తిని పొందుతాడు.

స్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
సొంత వ్యాపారము అంటే ఏమిటి ?
జవాబు:
ఒక వ్యక్తి యాజమాన్యము, నియంత్రణ కలిగి ఉండే వ్యాపార సంస్థను సొంత వ్యాపార సంస్థ అంటారు. వ్యాపారానికి కావలసిన మూలధనాన్ని అతడే సమకూర్చుకొని వ్యాపారానికి కావలసిన ఏర్పాట్లు అతడే చేసుకుంటాడు. వ్యాపార నిర్ణయాలు అతడు ఒక్కడే తీసుకుంటాడు. తన కుటుంబసభ్యుల సహకారముతో లేదా ఉద్యోగులను నియమించుకొని తానే స్వయముగా వ్యాపారాన్ని నిర్వహిస్తాడు. సంస్థకు కావలసిన నిధులను అవసరమయితే తన బంధువులు, స్నేహితులు లేదా బ్యాంకుల నుంచి అప్పులు తెస్తాడు. కొనుగోళ్ళు, అమ్మకాలు మొదలగు వ్యాపార కార్యకలాపాలన్నీ తానే స్వయముగా నిర్వహించుకుంటూ మిక్కిలి పొదుపుతో అధిక లాభాలను పొందడానికి ప్రయత్నిస్తాడు. లాభాలను తానొక్కడే అనుభవిస్తాడు, కాబట్టి ఎక్కువ లాభాల కోసము అహర్నిశలు శ్రమిస్తాడు. తన పొరపాట్ల వలన సంస్థకు నష్టమువస్తే తానే భరించాలి కాబట్టి మిక్కిలి జాగురూకతతో నిర్వహణా బాధ్యతను చేపడతాడు. ఈ విధముగా ‘అన్నీ తానే, తనకే అన్నీ’ అనే తరహాలో సొంతవ్యాపారము నడుస్తుంది.

ప్రశ్న 2.
సొంత వ్యాపారము లక్షణాలను వివరించండి.
జవాబు:
సొంత వ్యాపార సంస్థ లక్షణాలు:

  1. ఒకే యజమాని: సొంత వ్యాపారములో ఒకే యజమాని ఉండి, వ్యాపారానికి కావలసిన నిధులను అతడే సమకూర్చుకుంటాడు.
  2. యాజమాన్యానికి, నిర్వహణకు పొత్తు: సొంతవ్యాపారములో ఒకడే తన తెలివితేటలు, నైపుణ్యముతో వ్యాపారాన్ని నిర్వహిస్తాడు. కంపెనీల వలెకాక యాజమాన్యము, నిర్వహణ సొంతవ్యాపారి చేతిలో ఉంటుంది.
  3. చట్టబద్ధమైన లాంఛనాలు తక్కువ: సొంతవ్యాపార సంస్థ స్థాపనకు, నిర్వహణకు చట్టబద్ధమైన లాంఛనాలు తక్కువ. దీనిని స్థాపించుట తేలిక.
  4. ప్రత్యేక అస్థిత్వము ఉండదు: చట్టము దృష్టిలో సొంతవ్యాపారి, సొంతవ్యాపార సంస్థ ఒక్కటే. వ్యాపారములో జరిగే అన్ని విషయాలకు అతడే బాధ్యతను స్వీకరించాలి:
  5. లాభనష్టాలలో వేరేవారికి వాటా లేకపోవడం: లాభాలన్నీ సొంత వ్యాపారే అనుభవిస్తాడు. నష్టాలన్నీ అతడే భరించవలెను. లాభనష్టాలలో వేరేవారికి వాటా ఉండదు.
  6. అపరిమిత ఋణబాధ్యత: సొంతవ్యాపారి ఋణబాధ్యత అపరిమితము. నష్టము వచ్చినప్పుడు వ్యాపార అప్పులను తీర్చడానికి వ్యాపార ఆస్తులు సరిపోకపోతే సొంత ఆస్తుల నుంచీ అప్పులను చెల్లించవలెను.
  7. ఏకవ్యక్తి నియంత్రణ: సొంతవ్యాపారములో నియంత్రణ యజమాని చేతిలో ఉంటుంది. అతడు తన ఇష్టానుసారము. వ్యాపారాన్ని నిర్వహించవచ్చును.

AP Inter 1st Year Commerce Study Material Chapter 3 వ్యాపార వ్యవస్థ స్వరూపాలు

ప్రశ్న 3.
సొంత వ్యాపారి పరిమితులను వివరించండి.
జవాబు:
సొంత వ్యాపారము పరిమితులు:

  1. పరిమితమైన నిధులు: సొంతవ్యాపారి ఆర్థికస్థోమత పరిమితముగా ఉండుటవలన అవసరమైనప్పుడు నిధులను సమకూర్చుకొనలేడు. కాబట్టి వ్యాపారాన్ని విస్తృతపరచడము కష్టము.
  2. అనిశ్చిత మనుగడ: న్యాయశాస్త్ర దృష్టిలో సొంతవ్యాపార సంస్థ, సొంతవ్యాపారి వేరుకాదు. కాబట్టి వ్యాపారములో అనుకోని పరిస్థితులు ఏర్పడి అతడు మరణించినా, దివాలా తీసినా సంస్థ మూతపడుతుంది.
  3. అపరిమిత ఋణబాధ్యత: సొంతవ్యాపారి యొక్క ఋణబాధ్యత అపరిమితము. వ్యాపారములో నష్టాలు ఎక్కువగా వచ్చి, అప్పులపాలైతే, అప్పులను తీర్చడానికి వ్యాపార ఆస్తులు చాలకపోతే సొంత ఆస్తులను అమ్మి, అప్పులను తీర్చవలెను. అందువలన సొంత ఆస్తులకు రక్షణ లేదు.
  4. భారీ వ్యాపారానికి అనువుగా లేకపోవడం: పరిమిత వనరులు, పరిమిత నిర్వహణా సామర్థ్యము వలన సొంతవ్యాపారి భారీ తరహా వ్యాపారము చేయలేడు.
  5. పరిమిత నిర్వహణా సామర్ధ్యము.: వ్యాపారములో కొనుగోళ్ళు, అమ్మకాలు, ఆర్థిక వ్యవహారాలు మొదలైన అనేక విధులు ఉంటాయి. సొంతవ్యాపారికి అన్నింటిలోనూ ప్రావీణ్యము, అనుభవము ఉండకపోవచ్చు. నిపుణులను నియమించడానికి నిధులు సరిపోవు.

AP Inter 1st Year Commerce Study Material Chapter 7 కంపెనీ స్థాపన

Andhra Pradesh BIEAP AP Inter 1st Year Commerce Study Material 7th Lesson కంపెనీ స్థాపన Textbook Questions and Answers.

AP Inter 1st Year Commerce Study Material 7th Lesson కంపెనీ స్థాపన

వ్యాసరూప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
వ్యవస్థాపనలోని వివిధ దశలను వివరించండి.
జవాబు:
కంపెనీ తనంతట తాను ఉద్భవించదు. ఇది మానవ కృషి ఫలితముగా ఏర్పడుతుంది. ఎవరో ఒకరు పూనుకొని నిధులను, ఆస్తులను, నిర్వహణా సామర్థ్యమును సమీకరించాలి. కంపెనీ ఏర్పాటుకు ముందు జరిగే కార్యక్రమాన్ని అంతటిని వ్యవస్థాపన అంటారు. అంటే వ్యాపార ఉద్దేశాన్ని ఏర్పరచుకొని, అవకాశాన్ని కనుక్కొని, లాభార్జనకై ఉత్పత్తి సాధనాలు సమీకరించి సమర్థవంతముగా నిర్వహించే ప్రక్రియను వ్యవస్థాపన అంటారు. వ్యవస్థాపనను గెస్టిన్ బర్గ్ ఇట్లా నిర్వచించినాడు. “వ్యాపార అవకాశాలు కనుక్కోవడం, ఆ తరువాత, లాభార్జనకై నిధులను, ఆస్తులను, నిర్వహణా సామర్థ్యమును వ్యాపార సంస్థలో వెచ్చించడము”. కంపెనీ వ్యవస్థాపన వ్యయ ప్రయాసలతో కూడినది.

వ్యవస్థాపనలోని దశలు :
1) వ్యాపార అవకాశాలు కనుగొనుట : వ్యాపార విజయము సరైన వ్యాపార ఎన్నికపై ఆధారపడి ఉంటుంది. ఏదైనా కొత్త వ్యాపార అవకాశాలు తటస్థించినపుడు ఆ అవకాశాలను ఎంతవరకు అమలుపరచవచ్చును ? లాభదాయకమా ? కాదా ? అనే అంశములు నిశ్చితముగా పరిశీలించి, ఆచరణ యోగ్యము, లాభదాయకమని భావిస్తే వ్యాపార సంస్థ ఏర్పాటుకు తగిన చర్యలు తీసుకుంటాడు.

2) సమగ్ర పరిశోధన : ప్రారంభించవలసిన వ్యాపారాన్ని గురించి సమగ్రమైన పరిశోధన జరపాలి. పెట్టుబడిదారుల మనస్తత్వము, మార్కెట్ పరిస్థితులు, కంపెనీకి అవసరమయ్యే ఆర్థిక వనరులు, శ్రామికులు, ముడిపదార్థాలు, యంత్రాల లభ్యత వస్తువుకు ఉండే డిమాండ్ మొదలైన అంశాలను గురించి సమగ్ర పరిశోధన చేయాలి.

3) వనరుల సమీకరణ : వ్యవస్థాపకుడు తాను ఎంపిక చేసిన వ్యాపారము లాభసాటిగా, ఆమోద యోగ్యముగా ఉందని నిర్ధారణ చేసుకున్న తరువాత వ్యాపార సంస్థకు అవసరమయ్యే ముడిపదార్థాలు, ఆస్తులు, యంత్రాలు, నిర్వాహకుల, సాంకేతిక నిపుణుల సేవలు మొదలైనవి సమకూరే లాగా ఒప్పందాలు చేసుకుంటాడు.

AP Inter 1st Year Commerce Study Material Chapter 7 కంపెనీ స్థాపన

4) ఆర్థిక ప్రతిపాదన : వ్యవస్థాపకుడు కంపెనీకి ఉండవలసిన మూలధన స్వరూపాన్ని నిర్ణయిస్తాడు. ఏ రకమైన వాటాలు, డిబెంచర్లు జారీ చేయాలి ? ఎంత మొత్తము జారీచేయాలో నిర్ణయిస్తాడు. వివిధ ఆర్థిక సంస్థల నుంచి సేకరించవలసిన దీర్ఘకాలిక ఋణాలను కూడా నిర్ధారణ చేస్తాడు.

ప్రశ్న 2.
కంపెనీ నమోదు గురించి విశదీకరించండి.
జవాబు:
కంపెనీ ఒక కల్పిత వ్యక్తి నమోదు ద్వారా దీనికి అస్తిత్వము వస్తుంది. నమోదు అనేది చట్టపరమైన చర్య. ప్రైవేటు కంపెనీగాని, పబ్లిక్ కంపెనీగాని కంపెనీ రిజిస్ట్రారు కార్యాలయములో అవసరమైన ముఖ్యమైన పత్రాలు దాఖలు చేసి, రిజిస్ట్రేషన్ చేయవలెను.

కంపెనీ నమోదు విధానము : కంపెనీ నమోదు కోసము దిగువ ముఖ్య పత్రాలను తయారు చేసి జతపరచాలి. 1) పేరు అనుమతి కోసం దరఖాస్తు: ‘కంపెనీ నమోదుకోసం మొదట పేరు అనుమతి కోరుతూ ఆ రాష్ట్ర కంపెనీల రిజిస్ట్రారుకు దరఖాస్తు చేయాలి. పేర్ల చట్టం 1950 పరిధిలోపు ఏ పేరైనా కంపెనీ పెట్టుకోవచ్చు. కంపెనీ రిజిస్ట్రారు దరఖాస్తు అందిన 14 రోజులలోపు అనుమతిని ఇస్తారు. ఆ తేదీనుంచి 3 నెలల లోపు ఆ పేరును రిజిస్ట్రేషన్ చేయాలి.

2) సంస్థాపనా పత్రము : ఈ పత్రము కంపెనీకి రాజ్యాంగము వంటిది. ఇందులో కంపెనీ ధ్యేయాలు, అధికారాలు, బయటవారితో ఉన్న సఁ న నిర్వచిస్తుంది. ఇది చాలా ముఖ్యమైన పత్రము దీనిని జాగ్రత్తగా తయారు చేసి తగిన స్టాంపులు అతికించాలి. పబ్లిక్ కంపెనీ అయితే ఏడుగురు, ప్రైవేటు కంపెనీ అయితే ఇద్దరు ఈ పత్రముపై
సంతకాలు చేయాలి.

3) కంపెనీ నియమావళి : ఈ పత్రము కంపెనీ అంతర్గత పరిపాలనకు సంబంధించి నియమ నిబంధనలు ఉంటాయి. సంస్థాపనా పత్రము మీద సంతకాలు చేసినవారు దీని మీద సంతకాలు చేయవలెను. ప్రైవేటు కంపెనీ నియమావళిని తప్పని సరిగా రిజిస్ట్రారుకు దాఖలు చేయాలి. పబ్లిక్ కంపెనీ నియమావళిని తయారుచేయకపోతే కంపెనీ చట్టంలోని షెడ్యూల్ 1, టేబుల్ A ని అనుసరించవచ్చును.
అవి :

4) అదనపు పత్రాలు : కంపెనీ నమోదుకు మరికొన్ని అదనపు పత్రాలు తయారు చేసి రిజిస్ట్రారుకు దాఖలు చేయాలి.
ఎ) డైరెక్టర్ల అంగీకార పత్రము : డైరెక్టర్లుగా వ్యవహరించడానికి వారి సమ్మతిని తెలియజేస్తూ ఒక పత్రాన్ని రిజిస్ట్రారుకు దాఖలు చేయవలెను.

బి) పవర్ ఆఫ్ అటార్నీ : కంపెనీ నమోదుకు కావలసిన లాంఛనాలు పూర్తి చేసినట్లు ధృవీకరించడానికి, అవసరమయితే తగిన మార్పులు చేయడానికి ఒక న్యాయవాదిని వ్యవస్థాపకులు నియమించాలి. అతనిని అటార్నీ అంటారు. అతని నియామకపు పత్రాన్ని కూడా రిజిస్ట్రారుకు దాఖలు చేయాలి.

సి) కంపెనీ రిజిష్టర్డ్ కార్యాలయము తెలిపే నోటీసు : కంపెనీ రిజిష్టర్డ్ కార్యాలయము ఎక్కడ ఏర్పాటు చేయవలెనో ముందు నిర్ణయము అయితే, నమోదైన 30 రోజులలోపు రిజిష్టర్డ్ కార్యాలయ వివరాలను రిజిస్ట్రారుకు తెలియజేయాలి.

డి) డైరెక్టర్ల వివరాలు : కంపెనీ డైరెక్టర్లు, మేనేజరు లేదా సెక్రటరీ మొదలైన వారి వివరాలను ఫారం 32లో పొందుపరిచి నమోదుకు 30 రోజులలోపు రిజిస్ట్రారుకు దాఖలు చేయాలి.

5) శాసనాత్మక ప్రకటన .: కంపెనీల చట్టం ప్రకారము నమోదుకు సంబంధించి అన్ని లాంఛనాలు సక్రమముగా నిర్వర్తించినట్లు కంపెనీ న్యాయవాది గాని, ఛార్టర్డ్ అకౌంటెంట్ లేదా సెక్రటరీగాని చట్టపూర్వకమైన ప్రకటన చేయించాలి.

6) నమోదు రుసుం చెల్లింపు : కంపెనీ నమోదుకు చట్టప్రకారము నిర్దేశించిన రుసుము చెల్లించి రశీదును పొందాలి.

పైన తెలిపిన పత్రాలన్నింటిని రిజిస్ట్రారు పరిశీలించి సంతృప్తి చెందితే నమోదు పత్రాన్ని జారీ చేస్తాడు. ఈ పత్రాన్ని పొందిన వెంటనే ప్రైవేటు కంపెనీ వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు. కాని పబ్లిక్ కంపెనీ వ్యాపార ప్రారంభ ధృవపత్రము పొందనిదే వ్యాపారాన్ని ప్రారంభించరాదు.

AP Inter 1st Year Commerce Study Material Chapter 7 కంపెనీ స్థాపన

ప్రశ్న 3.
సంస్థాపన పత్రం అంటే ఏమిటి ? అందులోని క్లాజులను పేర్కొనండి. [A.P & T.S. Mar. ’15 ]
జవాబు:
భారత కంపెనీల చట్టము క్రింద నమోదైన అన్ని కంపెనీలకు ఆవశ్యకమైన పత్రము సంస్థాపన పత్రము. సంస్థాపనా పత్రమనే పునాది మీదనే కంపెనీ అనే భవనము నిర్మాణము అవుతుంది. ఈ పత్రము కంపెనీ అధికార ఎల్లలను, కంపెనీ వ్యవహారాలకు హద్దులను ఏర్పాటు చేస్తుంది. కంపెనీ ధ్యేయాలను, అధికారాలను, కార్యకలాపాలను వాటాదారులు, ఋణదాతలు, కంపెనీతో ప్రత్యక్షముగా సంబంధమున్న ప్రతివారికి ఖచ్చితముగా తెలియపరచడమే ఈ పత్రము ముఖ్య ఉద్దేశ్యము. కనుక దీనిని కంపెనీ రాజ్యాంగము అంటారు.

ఈ పత్రము కంపెనీకి, బయటవారికి గల సంబంధాలను నిర్వచిస్తుంది. ఈ పత్రములో పొందుపరిచిన వ్యవహారాలు, నిర్వచించిన అధికారాలను, నిర్ణయించిన సంబంధాలను అతిక్రమించి ఏ కంపెనీ నడుచుకోవడానికి వీలులేదు. అలా నడుచుకుంటే ఆ వ్యవహారాలు, అధికారాలు, సంబంధాలు న్యాయవిరుద్ధము అవుతాయి. అవి చెల్లుబాటు కావు:
దీనిని పేరాలుగా విభజించి, వరుసగా సంఖ్యలు వేసి ముద్రించవలెను. పబ్లిక్ కంపెనీ అయితే ఏడుగురు, ప్రైవేటు కంపెనీ అయితే ఇద్దరు సాక్షి సమక్షములో ఈ పత్రాల మీద సంతకాలు చేయవలెను. సంతకము చేసిన ప్రతి వ్యక్తి కనీసం ఒక వాటానైనా తీసుకొనవలెను.

సంస్థాపనా పత్రములోని క్లాజులు.
1) నామధేయపు క్లాజు : ఈ క్లాజులో కంపెనీ పూర్తి పేరు వ్రాయవలెను. పబ్లిక్ కంపెనీ అయితే పేరు చివర ‘లిమిటెడ్’, ప్రైవేటు కంపెనీ అయితే పేరు చివర ‘ప్రైవేటు లిమిటెడ్’ అనే పదములు ఉండాలి. కంపెనీ ఏ పేరునైనా పెట్టుకోవచ్చుగాని అంతకముందు స్థాపితమైన మరొక కంపెనీ పేరును పోలిగాని, సమీపములోగాని ఉండరాదు. అంతేగాక అవాంఛనీయమైన పేర్లు, చట్టముచే బహిష్కరింపబడిన పేర్లు కంపెనీకి పెట్టరాదు.

2) కంపెనీ స్థానపు క్లాజు : కంపెనీ రిజిష్టర్డ్ ఆఫీసు ఏ రాష్ట్రములో ఉన్నదో ఆ రాష్ట్రము పేరు ఈ క్లాజులో తెలిపాలి. కంపెనీతో ఉత్తర ప్రత్యుత్తరాలు జరపడానికి కార్యాలయ చిరునామా అవసరము. కంపెనీ నమోదు సమయములో గాని, నమోదు అయిన 30 రోజులలోపు కార్యాలయపు చిరునామాను రిజిస్ట్రారుకు

3) ధ్యేయాల క్లాజు : ఇది అతి ప్రధానమైన క్లాజు. ఇందులో కంపెనీ ధ్యేయాలు, అధికారాలు, వ్యాపార వ్యవహారాల పరిధి స్పష్టముగా పేర్కొనబడి ఉంటాయి. న్యాయపూరితమైన ఎన్ని ధ్యేయాలనైనా ఇందులో చేర్చవచ్చును. వాటినన్నింటిని కంపెనీ చేపట్టనవసరం లేదు. ఈ క్లాజులో చేర్చని కార్యకలాపాలను, ధ్యేయాలను అతిక్రమించి ఏ పని చేయరాదు. అలా చేస్తే అవి న్యాయవిరుద్ధము అవుతాయి.

4) ఋణబాధ్యత క్లాజు : కంపెనీ వాటాదారుల యొక్క స్వభావాన్ని ఈ క్లాజులో వ్రాయవలెను. వాటాదారుల ఋణబాధ్యత వారు తీసుకున్న వాటాల విలువ మేరకు పరిమితమని తెలియజేస్తుంది. ఒకవేళ వాటాలో కొంత మొత్తము చెల్లిస్తే, వారి ఋణబాధ్యత ఆ చెల్లించని మొత్తానికే పరిమితము అవుతుంది.

5) మూలధనపు క్లాజు : ఎంత మూలధనాన్ని జారీ చేయడానికి అనుమతి కావలెనో ఈ క్లాజులో తెలియజేస్తారు. దీనిని అధీకృత మూలధనము, నమోదు మూలధనము అంటారు. ఈ మూలధనాన్ని ఎన్ని వాటాలుగా విభజించినారు, వాటా విలువ ఎంతో తెలియపరచవలెను.

6) వ్యవస్థాపన – చందాల క్లాజు : తాము కంపెనీని స్థాపించడానికి ఒక సంస్థగా ఏర్పడినట్లు, తమ పేర్లకు ఎదురుగా ఉన్న వాటాలను తీసుకోవడానికి ఒప్పుకున్నట్లు ఒక ప్రకటన ద్వారా ఈ క్లాజులో తెలియజేయాలి. వారందరూ సాక్షి సమక్షములో సంతకాలు చేయాలి.

ప్రశ్న 4.
నియమావళి గురించి నీకేమి తెలుసు ? దానిలోని అంశాలను వ్రాయండి. [A.P Mar. ’15]
జవాబు:
కంపెనీ నమోదు చేసేటప్పుడు రిజిస్ట్రారు వద్ద దాఖలు చేయవలసిన పత్రాలలో రెండవది నియమావళి. కంపెనీ ఆంతరంగిక వ్యవహారములు సమర్థవంతముగా నిర్వహించుటకు కొన్ని నియమాలు, నిబంధనలు అవసరము. ఆ నియమ నిబంధనలు గల పత్రమే నియమావళి. కంపెనీ నియమావళి ఆంతరంగిక వ్యవహారములకు చుక్కాని వంటిది. నిర్వహణాధికారులకు ఈ నియమావళి మార్గదర్శకముగా ఉంటుంది. కంపెనీకి వాటాదారులకు మధ్య గల సంబంధాన్ని ఇది స్పష్టపరుస్తుంది. ఇది డైరెక్టర్లు, నిర్వహణాధికారులు, వాటాదారులు, ఋణపత్రధారులు అధికారాలను విధులను, బాధ్యతలను స్పష్టముగా నిర్వచిస్తుంది.

కంపెనీ నియమావళిని వివిధ పేరాలుగా విభజించి, వరుసగా సంఖ్యలు వేసి, ముద్రించవలెను. సంస్థాపనా పత్రము మీద సంతకాలు చేసినవారు నియమావళి మీద సాక్షి సమక్షములో సంతకాలు చేయవలెను.

AP Inter 1st Year Commerce Study Material Chapter 7 కంపెనీ స్థాపన

ప్రైవేటు కంపెనీలు, వాటాపరిమిత కంపెనీలు, పూచీ పరిమిత కంపెనీలు, అపరిమిత కంపెనీలు నియమావళిని తప్పని సరిగా తయారు చేసుకొనవలెను. పబ్లిక్ కంపెనీ తన సొంత నియమావళిని తయారుచేసుకోవచ్చు. లేకపోతే కంపెనీల చట్టము షెడ్యూల్ 1లో Table A అనే ఆదర్శ నియమావళి వర్తిస్తుంది.

నియమావళిలో ఉండే అంశాలు :

  1. వాటా మూలధనము దాని తరగతులు, వాటాల సంఖ్య, వాటాల విలువ, వాటాదారుల హక్కులు, వాటా పిలుపులు.
  2. వాటాల బదిలీ, వాటాల జప్తు, తిరిగి జారీచేసే విధానము.
  3. డిబెంచర్లు, స్టాకు జారీ.
  4. వాటా మూలధనము మార్చుట, మూలధన తగ్గింపు.
  5. డైరెక్టర్ల నియామకము, వారి అధికారాలు, బాధ్యతలు, పారితోషికము.
  6. మేనేజింగ్ డైరెక్టర్ నియామకము.
  7. కంపెనీ సమావేశాలు – తీర్మానాలు.
  8. డివిడెండ్లు, రిజర్వులు, లాభాలను మూలధనంగా మార్చుట.
  9. ప్రాథమిక ఒప్పందాలు ఆమోదించే తీరు.
  10. కంపెనీ అధికార ముద్ర.
  11. కంపెనీ లెక్కలు, వాటి తనిఖీ.
  12. సభ్యుల ఓటింగ్ పద్దతి.
  13. సమావేశానికి కోరం నిర్ణయించుట.
  14. బ్యాంకు ఖాతాల నిర్వహణ.
  15. కనీసపు చందా.
  16. మధ్యవర్తిత్వము.
  17. కంపెనీని రద్దు చేసే విధానము.

ప్రశ్న 5.
పరిచయ పత్రం అంటే ఏమిటి ? అందులోని అంశాలు ఏమిటి ? [A.P. Mar. ’15]
జవాబు:
కంపెనీ : వస్థాపకులు నమోదు పత్రము రూపొందిన తర్వాత మూలధన సేకరణకై వాటాలు, డిబెంచర్లు జారీ చేస్తారు. పెట్టుబడి పెట్టే ప్రజలను ఆహ్వానించుటకు, ఆకర్షించుటకు వ్యవస్థాపకులు ఒక ప్రకటన చేస్తారు. ఆ ప్రకటనను పరిచయు పము అంటారు. కంపెనీ వాటాలను, ఋణపత్రాలు కొనమని ప్రజలను ఆహ్వానించే విజ్ఞప్తి పత్రమే, పరిచను పత్రము. ఇది నోటీసు రూపములోగాని, సర్క్యులర్ రూపములోగాని, వ్యాపార ప్రకటన లేదా మరేవిధమైన వివర పత్రములోగాని ఉండవచ్చు. కంపెనీల చట్టము ‘పరిచయ పత్రాన్ని ఇలా నిర్వచించినది. కంపెనీ వాటాలకు లేదా డిబెంచర్లకు చందాలు సమకూర్చడానికి లేదా వాటిని కొనడానికి గాని – పరిచయ పత్రము, నోటీసు, ప్రకటన పత్ర వ్యాపార ప్రకటన లేదా మరో విధమైన ప్రతిపాదనల ద్వారా పెట్టుబడి పెట్టే ప్రజలను ఆహ్వానించడము.”

పరిచయ పత్రమును జారీచేయడములో ఉద్దేశ్యము కొత్తగా ఒక కంపెనీ స్థాపించబడినదని, దానిలోని డైరెక్టర్లు దక్షత గల వారిని, కంపెనీకి ఉజ్వల భవిష్యత్తు ఉన్నదని ప్రజలకు తెలియచేయడం. అంతేగాక ప్రకటించిన విషయాలకు డైరెక్టర్లదే పూర్తి బాధ్యత అని తెలియజేయడం.

AP Inter 1st Year Commerce Study Material Chapter 7 కంపెనీ స్థాపన

పరిచయపత్రములో ఉండే అంశాలు :

  1. సంస్థాపనా పత్రములోని అంశాలు, ముఖ్యముగా కంపెనీ ధ్యేయాలు.
  2. సంస్థాపనా పత్రము మీద సంతకము చేసినవారి పేర్లు, వారి వృత్తులు, చిరునామాలు, వారు తీసుకున్న వాటాల వివరాలు.
  3. డైరెక్టర్లు, సెక్రటరీ, మేనేజర్ల పేర్లు, విలాసాలు, పారితోషికం.’
  4. కనీసపు చందా మొత్తము.
  5. చందా జాబితాలు తెరిచి ఉంచే కాలము.
  6. వాటా మూలధనాన్ని ఎన్ని తరగతులుగా విభజించినారు, ఎన్ని వాటాలుగా విభజించినది; వాటాదారుల హక్కులు.
  7. దరఖాస్తు మీద, కేటాయింపు మీద, పిలుపుల మీద చెల్లించవలసిన సొమ్ము.
  8. చందా పూచీదారుల పేర్లు, వారి కమీషన్.
  9. ప్రాథమిక ఖర్చులు.
  10. రిజర్వులు – మిగుళ్ళు వాటిని నిర్వహించే పద్ధతి.
  11. కంపెనీ ఆడిటర్లు, లాయర్ల పేర్లు, చిరునామాలు.
  12. కంపెనీ ఆస్తులను విక్రయించిన వారి పేర్లు, వారికి చెల్లించే కొనుగోలు ప్రతిఫలము.
  13. కంపెనీ వ్యవస్థాపకులకు చెల్లించవలసిన ప్రతిఫలము.
  14. వాటాదారుల ఓటింగ్ హక్కులు, సమావేశాల వివరాలు.
  15. ఆస్తి అప్పుల పట్టిక, లాభనష్టాల ఖాతా తనిఖీ చేసే ప్రదేశము, సమయము.
  16. వ్యాపారము గూర్చి నిపుణుల అభిప్రాయము.
  17. వాటాదారుల సమస్యలు పరిష్కరించే విధానము.

ప్రశ్న 6.
కంపెనీ స్థాపనా విధానాన్ని కూలంకషంగా విపులీకరించండి.
జవాబు:
కంపెనీ స్థాపనలో నాలుగు దశలుంటాయి. అవి. 1) వ్యవస్థాపన 2) నమోదు లేదా రిజిస్ట్రేషన్ 3) మూలధన సమీకరణ 4) వ్యాపార ప్రారంభము.
1) వ్యవస్థాపన : కంపెనీ ఏర్పాటుకు ముందు జరిగే కార్యక్రమాన్ని వ్యవస్థాపన అంటారు. అనగా వ్యాపార ఉద్దేశ్యాన్ని ఏర్పరచుకొని, అవకాశాలను కనుగొని లాభార్జన కోసము ఉత్పత్తి సాధనాలను సమీకరించుకొని సమర్ధవంతముగా నిర్వహించే ప్రక్రియను వ్యవస్థాపన అంటారు. వ్యవస్థాపనలో నాలుగు దశలుంటాయి. 1. వ్యాపార అవకాశాలను కనుగొనుట 2. సమగ్రమైన పరిశోధన, 3. వనరుల సమీకరణ, 4. ఆర్థిక ప్రతిపాదన.

2) కంపెనీ నమోదు లేదా రిజిస్ట్రేషన్ : ఏ కంపెనీ అయినా చట్టబద్ధముగా గుర్తింపు పొందవలెనంటే నమోదు అవసరము. నమోదు కొరకు కొన్ని ముఖ్యమైన పత్రాలను రిజిస్ట్రారు వద్ద దాఖలుచేసి రిజిస్ట్రేషన్ చేయాలి. కంపెనీ, నమోదుకొరకు దాఖలు చేయవలసిన ముఖ్య పత్రాలు.

  1. పేరు అనుమతి కోసము దరఖాస్తు
  2. సంస్థాపనా పత్రము
  3. నియమావళి
  4. క్రింది అదనపు పత్రాలను కూడా రిజిస్ట్రారు వద్ద, దాఖలు చేయాలి.
    i) మొదటి డైరెక్టర్ల సమ్మతి పత్రము
    ii) పవర్ ఆఫ్ అటార్నీ
    iii) కంపెనీ రిజిష్టర్డ్ కార్యాలయం తెలిపే నోటీసు
    iv) డైరెక్టర్లు, మేనేజరు, సెక్రటరీ వివరాలు 5. శాసనాత్మక ప్రకటన
  5. నమోదు రుసుం చెల్లింపు
  6. నమోదు పత్రము
    పై పత్రాలను రిజిస్ట్రారు పరిశీలించి సంతృప్తి చెందిన మీద కంపెనీ నమోదు పత్రాన్ని జారీ చేస్తాడు. నమోదు పత్రము పొందిన వెంటనే ప్రైవేటు కంపెనీ వ్యాపారమును ప్రారంభించవచ్చును. కాని పబ్లిక్ కంపెనీ వ్యాపారమును ప్రారంభించుటకు వ్యాపార ప్రారంభ ధ్రువ పత్రాన్ని పొందవలెను.

3) మూలధన సేకరణ : కంపెనీ వాటాలను జారీచేసి మూలధనాన్ని సేకరిస్తుంది. కంపెనీ నమోదుకు ప్రాథమిక ఖర్చులు, ఆస్తుల కొనుగోలు మొదలైన వాటికి అవసరమయ్యే మొత్తాన్ని కనీసపు చందా అంటారు. కంపెనీ పరిచయ పత్రములో పేర్కొన్న కనీసపు చందా మొత్తాన్ని సేకరించకుండా వ్యాపారమును ప్రారంభించలేదు. కంపెనీ జారీ చేసిన మూలధనములో మొత్తాన్ని, 90% పరిచయ పత్రాన్ని జారీ చేసిన 120 రోజులలోపు సేకరించాలి. అలా సేకరించకపోతే సెబీ సూచనల మేరకు 10 రోజులలోపు దరఖాస్తు దారులకు తిరిగి చెల్లించవలెను.

AP Inter 1st Year Commerce Study Material Chapter 7 కంపెనీ స్థాపన

4) వ్యాపార ప్రారంభము పబ్లిక్ కంపెనీ వ్యాపార ప్రారంభ ధ్రువపత్రాన్ని పొందుటకు ఈ క్రింది పత్రాలను రిజిస్ట్రారుకు సమర్పించాలి.

  1. పరిచయ పత్రము లేదా ప్రత్యామ్నాయ పరిచయ పత్రము..
  2. డైరెక్టర్ల అర్హత వాటాలు తీసుకొని చెల్లించినట్లు ధృవీకరణ పత్రము.
  3. కనీసపు చందా వసూలైనట్లు, దాని మేరకు వాటాలను కేటాయించినట్లుగా ధృవీకరణ పత్రము.
  4. వ్యాపార ప్రారంభానికి అవసరమైన లాంఛనాలు పాటించినట్లుగా కంపెనీ డైరెక్టరు లేదా సెక్రటరీ ప్రకటన. పై పత్రాలను రిజిస్ట్రారు పరిశీలించి, సంతృప్తి చెందినట్లయితే వ్యాపార ప్రారంభ ధృవపత్రాన్ని జారీ చేస్తాడు. ఈ పత్రము పొందడముతో కంపెనీ స్థాపన పూర్తి అవుతుంది.

స్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
వివిధ రకాల వ్యవస్థాపకుల గురించి వ్రాయండి.
జవాబు:
వ్యవస్థాపకులను దిగువ విధాలుగా వర్గీకరించవచ్చును.

  1. వృత్తిగా స్వీకరించిన వ్యవస్థాపకులు : ఈ రకమైన వ్యక్తులు కంపెనీ వ్యవస్థాపనలో ప్రత్యేకీకరణ చూపుతారు. ఒకసారి కంపెనీ వ్యాపారాన్ని ప్రారంభించిన తర్వాత దానిని వాటాదారులకు అప్పగిస్తారు. వీరు వ్యవస్థాపన పూర్తికాల వృత్తిగా నిర్వహిస్తారు.
  2. యాదృచ్ఛిక వ్యవస్థాపకులు : ఈ వ్యవస్థాపకులు కంపెనీ వ్యవస్థాపనను వృత్తిగా స్వీకరించనప్పటికి కొన్ని సమయాలలో కంపెనీ వ్యవస్థాపనలో ఆసక్తిని చూపుతారు. ఉదా : లాయర్లు, ఇంజనీర్లు.
  3. ఆర్థిక వ్యవస్థాపకులు : కొన్ని సందర్భాలలో కొన్ని ఆర్థిక సంస్థలు కంపెనీ వ్యవస్థాపనను చేపట్టవచ్చును.
  4. సాంకేతిక వ్యవస్థాపకులు: ఈ తరహా వ్యవస్థాపకులు తమకున్న ప్రత్యేక పరిజ్ఞానము ద్వారా కొత్త సంస్థలను స్థాపించడము జరుగుతుంది.
  5. సంస్థాగత వ్యవస్థాపకులు : కంపెనీ స్థాపనకు కావలసిన సాంకేతిక, నిర్వహణ, ఆర్థిక సహాయాలను అందించడానికి ప్రత్యేకముగా ఏర్పాటయ్యే సంస్థలను సంస్థాగత వ్యవస్థాపకులు అంటారు. మన దేశములో మేనేజింగ్ ఏజెంట్లు నూతన సంస్థల వ్యవస్థాపనలో ముఖ్యమైన పాత్రను పోషించినారు.

ప్రశ్న 2.
సంస్థాపనా పత్రానికి, నియమావళికి మధ్య ఉన్న వ్యత్యాసాలను తెలపండి.
జవాబు: సంస్థాపనా పత్రానికి, నియమావళికి మధ్య గల వ్యత్యాసాలు :
సంస్థాపనా పత్రము

  1. ధ్యేయాలు: సంస్థాపనా పత్రము కంపెనీకి రాజ్యాంగము వంటిది.
  2. ఉద్దేశ్యాలు : కంపెనీకి, బాహ్య ప్రపంచానికి మధ్యగల సంబంధాలను విశదీకరిస్తుంది.
  3. ఆవశ్యకత : ప్రతి కంపెనీ సంస్థాపనా పత్రాన్ని తప్పనిసరిగా తయారుచేయాలి. ఇది ప్రధాన పత్రము.
  4. మార్పులు : మార్పులు చేయడానికి కేంద్ర ప్రభుత్వము, కోర్టు అనుమతించాలి.
  5. ఒప్పందము : ఇది చట్టానికి మాత్రమే లోబడి ఉంటుంది.
  6. చట్ట ప్రభావము : సంస్థాపనా పత్రములో పేర్కొన్న అంశాలకు విరుద్ధముగా కంపెనీ వ్యవహరిస్తే అవి న్యాయాతీతముగా భావించబడతాయి. చెల్లుబడి • కావు.
  7. హోదా : రెండు పత్రాలకు మధ్య వివాదము ఉంటే ‘సంస్థాపనా పత్రములోని అంశాలకు ప్రాధాన్యత ఉంటుంది.

AP Inter 1st Year Commerce Study Material Chapter 7 కంపెనీ స్థాపన

నియమావళి

  1. నియమావళి కంపెనీకి చట్టములాంటిది. అంతర్గత వ్యవహారాలకు చుక్కాని వంటిది.
  2. కంపెనీ అంతర్గత వ్యవహారాలకు సంబంధించిన నియమ నిబంధనలను తెలియజేస్తుంది.
  3. పబ్లిక్ కంపెనీలకు సొంత నియమావళి అవసరము లేదు. ఇది ద్వితీయ ముఖ్య పత్రము.
  4. మార్పు కోసం వాటాదారుల ప్రత్యేక తీర్మానము చాలు.
  5. ఇది కంపెనీల చట్టానికి, సంస్థాపనా పత్రానికి రెండింటికి లోబడి ఉంటుంది.
  6. నియమావళిలోని అంశాలకు విరుద్ధముగా సంస్థాపనా పత్రానికి లోబడి తీసుకున్న చర్యలను సభ్యులు అంగీకరిస్తే చెల్లుబడి అవుతాయి.
  7. నియమావళిలోని అంశాలు ఎప్పుడూ సంస్థాపనా పత్రములోని అంశాలకు లోబడి ఉంటాయి.

ప్రశ్న 3.
వ్యవస్థాపకుల విధులను పేర్కొనండి.
జవాబు:
వ్యవస్థాపకుని విధులు :

  1. వ్యవస్థాపకుడు వ్యాపార అవకాశాలను శోధిస్తాడు. ఎప్పుడు, ఎక్కడ, ఎలాంటి వ్యాపారము ప్రారంభించవలెననే విషయములపై పరిశోధనలను జరిపి ఒక నిర్ణయానికి వస్తాడు.
  2. వ్యాపార ఉద్దేశ్యము ఏర్పడగానే ఆ ఉద్దేశాన్ని ఆచరణలో పెట్టడానికి సవిస్తరమైన శోధనలు చేస్తాడు. ఉత్పత్తి వస్తువుల డిమాండు, ముడిపదార్థాల లభ్యత, రవాణా సౌకర్యాలు, అవసరమైన మూలధనము, లాభాలు మొదలైన అంశాల గురించి పరిశీలన చేసి, ఇవి అనుకూలముగా ఉంటే స్థాపనకు ముందంజ వేస్తాడు.
  3. ఫ్యాక్టరీ నిర్మాణానికి స్థలాన్ని సేకరించాలి. భవన నిర్మాణాలు, యంత్రాలు, యంత్ర పరికరాలు సేకరించాలి. నిర్వహణా సామర్థ్యాన్ని సమీకరించుకోవాలి.
  4. కంపెనీ బ్యాంకర్లను, ఆడిటర్లను, సొలిసిటర్లను ఎన్నుకోవాలి.
  5. కంపెనీ నమోదుకు కావలసిన ముఖ్య పత్రాలను తయారు చేయాలి.
  6. కంపెనీకి కావలసిన ఆస్తుల కొనుగోలుకు సంబంధించి ఒప్పందాలు చేసుకోవాలి.
  7. కంపెనీని నిర్వహించడానికి కావలసిన మూలధనాన్ని సేకరించాలి.
  8. పరిచయ పత్రాన్ని జారీచేసి, వ్యాపార ప్రారంభ ధ్రువపత్రాన్ని పొందవలెను.

అతి స్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
వ్యవస్థాపన నిర్వచనం.
జవాబు:
కంపెనీని ఏర్పాటు చేయడానికి ముందు జరిగే కార్యక్రమమును వ్యవస్థాపన అంటారు. అనగా వ్యాపార ఉద్దేశ్యాన్ని ఏర్పరచుకొని, అవకాశాన్ని కనుగొని, లాభార్జనకై ఉత్పత్తి సాధనాలను సమీకరించుకొని సమర్థవంతముగా నిర్వహించే ప్రక్రియ. గెస్టిన్ బర్గ్ వ్యవస్థాపనను ఇలా నిర్వచించినాడు. ‘వ్యాపార అవకాశాలు కనుక్కోవడము, ఆ తరువాత లాభార్జనకై నిధులను, ఆస్తులను, నిర్వహణా సామర్థ్యాన్ని ఆ సంస్థలో వెచ్చించడము’

ప్రశ్న 2.
కనీసపు చందా
జవాబు:
పబ్లిక్ కంపెనీ స్థాపనకు కావలసిన కనీసపు మూలధనాన్ని కనీసపు చందా అంటారు. కనీసపు చందాను పరిచయ పత్రాన్ని జారీ చేసిన 120 రోజుల లోపు సేకరించాలి. ఈ మొత్తాన్ని సేకరించకుండా పబ్లిక్ కంపెనీ వాటాలను కేటాయించరాదు. కనీసపు చందా మొత్తాన్ని క్రింది అంశాల ఆధారముగా నిర్ణయిస్తారు.

  1. కంపెనీ స్థిరాస్థుల కొనుగోలుకు,
  2. ప్రాథమిక ఖర్చులు చెల్లించడానికి
  3. నిర్వహణకు అవసరమైన మూలధన సేకరణకు
  4. కంపెనీ స్థాపనకు, నిర్వహణకు అవసరమయ్యే ఇతర వ్యయాలకు.

 

ప్రశ్న 3.
సంస్థాపనా పత్రం
జవాబు:
భారత కంపెనీల చట్టము క్రింద నమోదయిన అన్ని కంపెనీలకు అత్యావశ్యకమైన పత్రము సంస్థాపనా పత్రము. సంస్థాపనా పత్రము అనే పునాది మీదనే కంపెనీ అనే భవనము నిర్మాణము అవుతుంది. ఈ పత్రము కంపెనీ అధికారానికి గల ఎల్లలను, వ్యవహారాలకు హద్దులను ఏర్పాటు చేస్తుంది. కంపెనీ ధ్యేయాలను, అధికారాలను, కార్యకలాపాలను వాటాదారులు, ఋణదాతలు, కంపెనీతో ప్రత్యక్షముగా సంబంధమున్న ప్రతివారికి ఖచ్చితముగా తెలియపరచడమే ఈ పత్రము యొక్క ముఖ్య ఉద్దేశ్యము. కనుక దీనిని కంపెనీ రాజ్యాంగమంటారు.

AP Inter 1st Year Commerce Study Material Chapter 7 కంపెనీ స్థాపన

ప్రశ్న 4.
ప్రత్యామ్నాయ పరిచయ పత్రం.
జవాబు:
పబ్లిక్ కంపెనీలు తామే మూలధనాన్ని సేకరించుకోగలిగితే పరిచయ పత్రాన్ని జారీచేయనక్కర్లేదు. ప్రత్యామ్నాయముగా పరిచయపత్ర నివేదికను వాటాల కేటాయింపుకు కనీసము మూడు రోజులు ముందుగా కంపెనీల రిజిస్ట్రారుకు దాఖలు చేయాలి. పరిచయ పత్రములోని అంశాలే దాదాపుగా దీనిలో ఉంటాయి. ఈ నివేదికపై డైరెక్టర్లు అందరూ సంతకాలు చేయవలెను.

ప్రశ్న 5.
పరిచయ పత్రంలోని అసత్య ప్రకటనలకు విధించే క్రిమినల్ బాధ్యత
జవాబు:
పరిచయ పత్రములో అసత్య ప్రకటనలు ఉండి, వాటిని నమ్మి ఎవరైనా వాటాలను గాని, డిబెంచర్లను గాని కొని నష్టపోయామని నిరూపించినట్లయితే, పరిచయ పత్రము జారీతో సంబంధమున్న ప్రతి వ్యక్తికి 50,000 జరిమానా లేదా రెండు సంవత్సరాల జైలుశిక్ష లేదా రెండింటిని విధించవచ్చును.

AP Inter 1st Year Commerce Study Material Chapter 2 వ్యాపార కార్యకలాపాలు

Andhra Pradesh BIEAP AP Inter 1st Year Commerce Study Material 2nd Lesson వ్యాపార కార్యకలాపాలు Textbook Questions and Answers.

AP Inter 1st Year Commerce Study Material 2nd Lesson వ్యాపార కార్యకలాపాలు

వ్యాసరూప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
పరిశ్రమ అంటే ఏమిటి ? వివిధ రకాలైన పరిశ్రమలను సోదాహరణముగా వివరించండి. [T.S. Mar. ’15]
జవాబు:
వ్యాపారము తాలూకు ఉత్పాదనాంశమే పరిశ్రమ. వస్తువుల ఉత్పత్తికి సంబంధించిన కార్యకలాపాల సమూహాన్ని పరిశ్రమగా పేర్కొనవచ్చు. వస్తువుల సేకరణ, ఉత్పత్తి, ప్రాసెసింగ్ నిర్మాణము మొదలైన వాటికి సంబంధించిన కార్యకలాపాలనే పరిశ్రమగా నిర్వచించవచ్చు.

తయారయ్యే వస్తువులు వినియోగ వస్తువులు లేదా ఉత్పాదక వస్తువులు కావచ్చు. వినియోగదారులు ఉపయోగించే వస్తువులు అనగా ఆహార పదార్థాలు, నూలు మొదలైనవి వినియోగిత వస్తువులు. ఉత్పాదక వస్తువులు అనగా ఉత్పత్తిదారులు వాటిని మరల ఉత్పత్తికి ఉపయోగించేవి. ఉదా : యంత్రాలు, పరికరాలు, ఎక్విప్మెంట్ మొ||నవి.
పరిశ్రమలను సాధారణముగా దిగువ విధాలుగా వర్గీకరించవచ్చును.

1) ప్రాథమిక పరిశ్రమ : ఈ పరిశ్రమ ప్రకృతి సహాయంతో వస్తువులను ఉత్పత్తి చేస్తుంది. దీనిలో మానవుని శ్రమ చాలా తక్కువ. ఇది ప్రకృతిపై ఆధారపడినది. ఉదా : వ్యవసాయము, చేపలు పట్టుట, అటవీకరణ మొ||నవి.

2) ప్రజనన పరిశ్రమలు : ఈ పరిశ్రమలు వంశ క్రమానికి చెందుతాయి. కొన్ని జాతి మొక్కలను, పశువులను, పక్షులను పునరుత్పత్తి చేసి, వాటిని అమ్మడం ద్వారా లాభాన్ని ఆర్జించే కార్యకలాపాన్ని ప్రజనన పరిశ్రమలు అంటారు. నర్సరీలు, కోళ్ళ పరిశ్రమ, పట్టు పురుగుల పెంపకము మొ||నవి ఈ పరిశ్రమల క్రిందకు వస్తాయి.

3) ఉద్గ్రహణ పరిశ్రమలు : ప్రకృతి వనరుల నుంచి వస్తువులను వెలికితీసే. కార్యకలపాలతో ముడిపడివున్న పరిశ్రమలను ఉద్గ్రహణ పరిశ్రమలు అంటారు. ఖనిజాల త్రవ్వకము, బొగ్గు ఖనిజము, నూనె, ఇనుప ఖనిజము, అడవుల నుంచి కలప, రబ్బరు వెలికితీయడము ఉద్గ్రహణ పరిశ్రమకు ఉదాహరణలు.

AP Inter 1st Year Commerce Study Material Chapter 2 వ్యాపార కార్యకలాపాలు

4) వస్తుతయారీ పరిశ్రమలు : ముడి పదార్థాలు లేదా సగము తయారైన వస్తువుల నుంచి పూర్తిగా తయారైన వస్తువులను ఉత్పత్తి చేసేవాటిని వస్తు తయారీ పరిశ్రమలు అంటారు. ఈ వస్తు తయారీ పరిశ్రమ ప్రధానముగా కర్మాగారాలలో సాగుతూ ఉంటుంది. ఇనుము-ఉక్కు, యంత్ర పరికరాలు, సిమెంటు, వస్త్రాలు మొదలైనవాటికి సంబంధించిన పరిశ్రమలను వస్తు తయారీ పరిశ్రమలకు ఉదాహరణలుగా చెప్పవచ్చును. వస్తు తయారీ పరిశ్రమలను మరల వర్గీకరించవచ్చును.

  1. విశ్లేషణాత్మక పరిశ్రమలు
  2. ప్రక్రియాత్మక పరిశ్రమలు
  3. మిశ్రమ పరిశ్రమలు
  4. జోడింపు పరిశ్రమలు.

5) వస్తు నిర్మాణ పరిశ్రమలు : రోడ్లు, వంతెనలు, భవనాలు, కాలువలు, ప్రాజెక్టులు- మొదలైన నిర్మాణాలను చేపట్టేవాటిని వస్తు నిర్మాణ పరిశ్రమలుగా పేర్కొనవచ్చును. ఉద్గ్రహణ మరియు వస్తు తయారీ పరిశ్రమలలో తయారైన వస్తువులలో అధిక భాగము ఈ రకమైన పరిశ్రమలలో ముడిపదార్థముగా వాడతారు.

6) సేవారంగ పరిశ్రమలు : ప్రస్తుతము సేవారంగము ఒక దేశ అభివృద్ధిలో ముఖ్యమైన పాత్రను పోషిస్తున్నది కాబట్టి దీనిని సేవారంగ పరిశ్రమగా పేర్కొంటారు. సేవారంగ పరిశ్రమలకు చెందిన ఉదాహరణలు పరిశ్రమ, టూరిజం పరిశ్రమ, వినోద పరిశ్రమ, ఆసుపత్రులు, హోటల్, కళాశాలలు మొదలైనవి.

ప్రశ్న 2.
వాణిజ్యం అంటే ఏమిటి.? వాణిజ్యంలోని వివిధ భాగాలను పేర్కొనండి.
జవాబు:
వాణిజ్యము వస్తువుల మారకానికి సంబంధించినది. వస్తువులు ఉత్పత్తి అయ్యే స్థానము నుంచి తుది వినియోగదారునకు చేరడానికి సంబంధించిన అన్ని కార్యకలాపాలతోను వాణిజ్యానికి సంబంధము ఉంటుంది. వస్తు సేవల పంపిణీ విధానాన్ని వాణిజ్యము అంటారు. పారిశ్రామిక ప్రపంచములో వ్యక్తుల మధ్య వస్తువుల పంపిణీ కోసము ఏర్పరచిన క్రమబద్ధమైన వ్యవస్థే వాణిజ్యమని జేమ్స్ ఫెన్సన్ నిర్వచించినాడు. వాణిజ్యము ఉత్పత్తిదారులకు, వినియోగదారులకు మధ్య సత్సంబంధాలు ఏర్పరచి వస్తువుల సరఫరా సరళముగా, సులువుగా జరగడానికి సౌకర్యాలను వాణిజ్యము ఏర్పరుస్తుంది. సులభముగా వస్తుసేవలు ఉత్పత్తిదారుల నుంచి వినియోగదారునకు చేరవేసే ప్రక్రియలో ఉన్న అవరోధాలను తొలగించి, వస్తుసేవల ప్రవాహాన్ని సులభతరం చేస్తుంది.

వాణిజ్యములో రెండు భాగాలు ఉంటాయి. 1. వర్తకము 2. వర్తక సదుపాయాలు. వస్తుసేవల మార్పిడికి చెందినది వర్తకము. వస్తుసేవలు వినియోగదారునకు సరఫరా అయ్యేందుకు సహాయపడే పంపిణీ మార్గమే వర్తకము వర్తకము అనేది అనేక సాధక బాధకాలతో కూడిన ప్రక్రియ. ఇందులో అనేక అవరోధాలు, అడ్డంకులు ఉన్నాయి. ఇవి వ్యక్తులకు, స్థలానికి, కాలానికి, వినిమయానికి, సమాచారమునకు సంబంధించినవి కావచ్చు. వీటిని తొలగించి, వస్తు సరఫరాను సులభతరము చేయడానికి అనేక సాధనాలు ఉన్నవి. ఈ సదుపాయాల సముదాయమే వాణిజ్యము.

1) వ్యక్తులకు సంబంధించిన అవరోధాలు : ఉత్పత్తిదారులు దేశము నలుమూలలా వ్యాపించివున్న వినియోగదారులతో ప్రత్యక్ష సంబంధాలను ఏర్పరచుకొనలేరు. ఉత్పత్తిదారునకు, వినియోగదారునకు మధ్య అనేకమంది మధ్యవర్తులు ఉండి వాణిజ్య కార్యకలాపాలు సులభముగా జరగడానికి సహాయపడతారు. వారు ఉత్పత్తిదారుల నుంచి సరుకును కొని, వినియోగదారులకు అమ్ముతారు.

2) స్థలానికి సంబంధించిన అవరోధాలు : వస్తువులు ‘ఒక ప్రదేశములో ఉత్పత్తి అయితే వాటిని వివిధ ప్రదేశాలకు, ఇతర దేశాలకు పంపిణీ చేయవలెను. ఉత్పత్తి ప్రదేశాలకు, వినియోగ కేంద్రాలకు దూరము పెరుగుచున్నది. ఉత్పత్తి అయిన సరుకు వినియోగదారునకు చేరవేయడానికి రవాణా తోడ్పడుతుంది.

3) కాలానికి సంబంధించిన అవరోధాలు’: ఉత్పత్తిదారులు వస్తువుల ఉత్పత్తిని డిమాండునుబట్టి చేస్తారు. కొన్ని వస్తువులను డిమాండు లేని కాలములో ఉత్పత్తిచేసి, డిమాండును అనుసరించి అమ్ముతారు. కాబట్టి అవి వినియోగమయ్యే వరకు నిల్వ చేయవలసి ఉంటుంది. గిడ్డంగుల సౌకర్యాల ద్వారా ఈ అవరోధాన్ని అధిగమించవచ్చును.

4) ద్రవ్యమునకు సంబంధించిన అవరోధాలు : వస్తూత్పత్తికి, వినియోగానికి మధ్య కాలవ్యవధి ఉంటుంది. కొన్ని వస్తువులను సంవత్సరమంతా ఉత్పత్తి చేయవలసి ఉంటుంది. వీటికి ద్రవ్యము అవసరము. వాణిజ్యబ్యాంకులు వీరికి ఋణాలిచ్చి ద్రవ్యానికి సంబంధించిన అవరోధాలను తొలగిస్తాయి.

5) రిస్కుకు సంబంధించిన అవరోధాలు : ఒక ప్రదేశము నుండి మరొక ప్రదేశానికి సరుకును రవాణా చేసేటప్పుడు నష్టభయము ఉంటుంది. దొంగతనాలు, అగ్నిప్రమాదాలు సంభవించవచ్చును. ఈ నష్టాలను, ఆస్తులను సంరక్షించుకోవడానికి బీమా కంపెనీలు తోడ్పడతాయి.

6) సమాచారానికి సంబంధించిన అవరోధాలు : వినియోగదారులకు తమకు కావలసిన వస్తువులు ఎక్కడ ఏ విధముగా లభిస్తాయో తెలియకపోవచ్చు. వస్తువుల సమాచారాన్ని ప్రజలకు తెలియజేయటానికి వ్యాపార ప్రకటనలు ఉత్తమ సాధనాలు. వస్తువుల విక్రయానికి వ్యాపార ప్రకటనలు దోహదము చేస్తాయి.

AP Inter 1st Year Commerce Study Material Chapter 2 వ్యాపార కార్యకలాపాలు

ప్రశ్న 3.
వర్తకాన్ని నిర్వచించండి. వర్తక సదుపాయాలలో రకాలను వివరించండి.
జవాబు:
వస్తువుల కొనుగోలు, అమ్మకాల ప్రక్రియను వర్తకము అంటారు. వర్తకము వాణిజ్యములో ప్రధాన భాగము. వస్తుసేవల ఉత్పత్తిదారులు వాటిని వినియోగించే వినియోగదారుల వద్దకు చేర్చి, వారిమధ్య సంబంధాలను నెలకొల్పేటట్లు చేస్తుంది. అనగా ఉత్పత్తిని వినియోగములోనికి తేవటమే వర్తకము. వాణిజ్య కార్యకలాపాలన్నీ వర్తకము చుట్టూ తిరుగుతాయి.

వర్తక సదుపాయాలు : వర్తకము అనేక సాధక బాధకాలతో కూడిన ప్రక్రియ. దీనిలో అనేక అడ్డంకులు ఉంటాయి. వీటిని తొలగించి వస్తు. సరఫరాను సులభతరము ‘ చేయడానికి ఉన్న సదుపాయాలే వర్తక సదుపాయాలు. వర్తక సదుపాయాలలో రవాణా, సమాచారము, గిడ్డంగులు, బ్యాంకులు, బీమా, వ్యాపార ప్రకటనలు ఉంటాయి.
1) రవాణా : ఉత్పత్తి, వినియోగ కేంద్రాలకు మధ్యదూరము పెరుగుచున్నది. ఈ అడ్డంకిని రవాణా సౌకర్యాలు తొలగిస్తున్నవి. రవాణా వస్తువులకు స్థల ప్రయోజనాన్ని కల్గిస్తుంది. ఉత్పత్తి అయిన సరుకు వినియోగదారుల వద్దకు చేర్చడానికి రవాణా తోడ్పడుచున్నది. ఆధునిక రోడ్డు, రైలు, విమాన, సముద్రయాన రవాణా సౌకర్యాల వలన వస్తు పంపిణీ వేగముగా, భద్రముగా జరుగుతున్నది.

2) కమ్యూనికేషన్ : కమ్యూనికేషన్ అనగా ఒక వ్యక్తికి మరొక వ్యక్తికి మధ్య సమాచార మార్పిడి. ఇది నోటిమాటల రూపములో లేదా వ్రాతపూర్వకముగా ఉండవచ్చు. వ్యాపారములో ఉన్న షరతులు ‘ పరిష్కరించుకోవడానికి, సమాచారం ‘ఒకరి నుండి మరొకరికి స్పష్టంగా చేరాలి.
ఉదా : వస్తువుల ధర, డిస్కౌంట్, పరపతి సౌకర్యము మొదలైన సమాచారమును కమ్యూనికేట్ చేయవలసి ఉంటుంది. టెలిఫోన్, టెలెక్స్, టెలిగ్రాం, ఈ-మెయిల్, టెలీకాన్ఫరెన్స్ మొదలైనవి వ్యాపారస్తులు, వినియోగదారుల మధ్య సంబంధాలు నెలకొల్పడానికి తోడ్పడుచున్నవి.

3) గిడ్డంగులు : ఉత్పత్తి అయిన వస్తువులన్నీ వెంటనే అమ్ముడు కాకపోవచ్చు. వస్తూత్పత్తికి, వినియోగానికి మధ్య కాలవ్యవధి ఉంటుంది. ఈ కాలవ్యవధిలో అమ్మకము జరిగేంతవరకు వస్తువులను గిడ్డంగులలో నిల్వచేయాలి. బియ్యము, గోధుమ మొదలైన వ్యవసాయ ఉత్పత్తులు కొన్ని మాసములలోనే జరుగుతుంది. కాని వాటి డిమాండు సంవత్సరము పొడవునా ఉంటాయి. గొడుగులు, ఉన్ని వస్తువులను సంవత్సరమంతా ఉత్పత్తి చేసినా వాటి డిమాండు కొన్ని కాలములలోనే ఉంటుంది. కాబట్టి వస్తువులకు డిమాండు వచ్చేవరకు గిడ్డంగులలో నిల్వచేయవలసి ఉంటుంది. గిడ్డంగులు కాలప్రయోజనాన్ని కల్గిస్తాయి.

4) బీమా : సరుకులు గిడ్డంగులలో ఉన్నప్పుడు, రవాణా చేస్తున్నప్పుడు అనేక కారణాల వలన సరుకు చెడిపోవడం, ప్రమాదానికి గురికావడము జరుగుతుంది. వర్తకులకు ఇలాంటి నష్టములు కలిగినపుడు బీమా సంస్థలు రక్షణ కల్పించి, వర్తకాభివృద్ధికి తోడ్పడతాయి.

5) బ్యాంకింగ్ : వాణిజ్యము అభివృద్ధి చెందేటందుకు అవసరమైన ద్రవ్యము, పరపతి, అడ్వాన్సులను అందించే ఒక వర్తక సదుపాయమే బ్యాంకింగ్. ఆర్థికపరమైన ఇబ్బందులను తొలగించుటలో బ్యాంకులు ముఖ్యమైన పాత్రను వహిస్తున్నవి. ఇది ప్రధానమైన వాణిజ్య కార్యకలాపము.

6) ప్రకటనలు : ఉత్పత్తిదారులు తాము ఉత్పత్తిచేసిన వస్తువులకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని ప్రకటనల ద్వారా వినియోగదారులకు తెలియజేస్తారు. ప్రకటనలు వస్తువులను కొనుగోలు చేయాలి అనే భావనను వినియోగదారులలో కలుగజేస్తుంది. టి.వి., రేడియో, వార్తాపత్రికలు, మ్యాగజైన్లు, హోర్డింగులు, ఇంటర్నెట్ ద్వారా ప్రకటనలను అందజేయడం జరుగుతుంది.

ప్రశ్న 4.
వర్తకము, వాణిజ్యము, పరిశ్రమల మధ్య వ్యత్యాసాలను, అంతర్గత సంబంధాలను వివరించండి.
జవాబు:
వ్యాపారము అనే ప్రక్రియలో వర్తకము, వాణిజ్యము, పరిశ్రమ కూడా అంతర్భాగాలే. ఈ మూడు కార్యకలాపాల ఉద్దేశ్యము లాభాపేక్షయే. నిరంతరం పెరిగే మానవుని కోర్కెలను ‘సంతృప్తిపరచటమే.

పరిశ్రమ అనగా సంపద లేదా విలువల ఉత్పత్తి అని అర్ధము. వస్తువుల తయారీ, వ్యవసాయము, గనుల త్రవ్వకము, అడవుల పెంపకము, రవాణా మొదలైనవి పరిశ్రమలో ఇమిడివుంటాయి.

పరిశ్రమ కేవలము వస్తుసేవల ఉత్పత్తికి మాత్రమే సంబంధించినది. వాణిజ్యము ఉత్పత్తి అయిన వస్తువులను అంతిమ వినియోగదారులకు పంపిణీ చేయడానికి సంబంధించినది. అనగా వినియోగదారులకు వస్తువులను అమ్మడం అని అర్ధము. వాణిజ్యము, వర్తకము అనే పదాలను తరుచూ పర్యాయపదాలుగా వాడతారు. కాని వీటికి ప్రత్యేకమైన అర్థాలున్నవి. వర్తకము అనేది వాణిజ్యములో ప్రధాన అంశము. వర్తకము వస్తు సేవల కొనుగోలు, అమ్మకాలకు ప్రాతినిధ్యము వహిస్తుంది. వాణిజ్యము అనేది విస్తృతమైనది. ఇందులో వర్తకమే కాకుండా, వర్తక సహాయకములైన రవాణా, భీమా, బ్యాంకింగ్ మొదలైన కార్యకలాపాలు కూడా ఇమిడి ఉన్నాయి. ఈ కార్యకలాపాలు కొనుగోలు, అమ్మకాల ప్రక్రియను సుగమము చేస్తాయి.

వ్యాపార కార్యకలాపాలలో ప్రధాన రంగాలైన పరిశ్రమ, వాణిజ్యము ఒకటి తర్వాత మరొకటి సంభవిస్తుంది. . వర్తక, వాణిజ్యాలకు పరిశ్రమ వెన్నెముకలాంటిది. పరిశ్రమ లేనిదే వర్తకము, వర్తక సదుపాయాలు ఉండవు.. కేవలము పరిశ్రమ వలననే వ్యాపార ఉద్దేశ్యము నెరవేరదు. ఈ విధముగా పరిశ్రమ, వర్తక, వాణిజ్యాల అభివృద్ధి పరస్పరము | ఆధారపడి ఉంటాయి.

AP Inter 1st Year Commerce Study Material Chapter 2 వ్యాపార కార్యకలాపాలు

పరిశ్రమ, వాణిజ్యము, వర్తకముల మధ్యగల తేడాలు:
AP Inter 1st Year Commerce Study Material Chapter 2 వ్యాపార కార్యకలాపాలు 1

స్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
పరిశ్రమను నిర్వచించండి.
జవాబు:
వస్తు సేవల ఉత్పత్తికి చెందిన కార్యకలాపాల సమూహాన్ని స్థూలముగా పరిశ్రమ అని నిర్వచించవచ్చును. అందుబాటులో ఉన్న భౌతిక వనరులను వివిధ ప్రక్రియల ద్వారా తుది వినియోగదారుల కోర్కెలను సంతృప్తిపరచడానికి గాను వస్తు సేవల రూపములో ఉత్పత్తి చేయడం జరుగుతుంది. వస్తు సేవలను ఉత్పత్తి చేసి వినియోగదారులకు సౌకర్యవంతముగా ఆమోదయోగ్యముగా అందించడమే పారిశ్రామిక ప్రక్రియలో ఇమిడివున్న అంశము. ఫ్యాక్టరీలు, పారిశ్రామిక సంస్థలు, ప్రజోపయోగ సంస్థలు, వ్యవసాయ క్షేత్రాలు మొదలైనవి ఎన్నో వస్తు సేవలను అందిస్తున్నవి.

పరిశ్రమ ఆకార ప్రయోజనాన్ని సృష్టిస్తుంది. అంటే ఉత్పత్తి కారకాల ద్వారా తుది వినియోగదారునకు పనికివచ్చేటట్లు లభ్యమైన వనరులను వివిధ రూపాలలో అందజేస్తుంది.
పారిశ్రామిక సంస్థలు వివిధ ప్రయోజనాల నిమిత్తము రకరకాల వస్తువులను ఉత్పత్తిచేస్తాయి. వాటిని స్థూలముగా ప్రాథమిక వస్తువులు, తయారీలో ఉన్న వస్తువులు, తయారైన వస్తువులు అని విభజించవచ్చును. తయారైన వస్తువులను ఉత్పత్తి వస్తువులు, వినియోగదారు వస్తువులని కూడా విభజించవచ్చును.

ప్రశ్న 2.
వాణిజ్యం అంటే నీకేమి అర్థమైంది ?
జవాబు:
వాణిజ్యము వస్తువుల మారకానికి సంబంధించినది. వస్తువులు ఉత్పత్తి అయ్యే స్థానము నుంచి తుది వినియోగదారునకు చేరడానికి సంబంధించిన అన్ని కార్యకలాపాలతోను వాణిజ్యానికి సంబంధము ఉంటుంది. వస్తుసేవల పంపిణీ విధానాన్ని వాణిజ్యము అంటారు. పారిశ్రామిక ప్రపంచములో వ్యక్తుల మధ్య వస్తువుల పంపిణీ కోసం ఏర్పరచిన | క్రమబద్ధమైన వ్యవస్థే వాణిజ్యమని జేమ్స్ స్టీఫెన్ సన్ నిర్వచించినాడు. వాణిజ్యము ఉత్పత్తిదారులకు, వినియోగదారులకు మధ్య సత్సంబంధాలు ఏర్పరచి వస్తువుల సరఫరా సరళముగా, సులువుగా జరగడానికి సౌకర్యాలను వాణిజ్యము ఏర్పరుస్తుంది. సులభముగా వస్తుసేవలు ఉత్పత్తిదారుల నుంచి వినియోగదారులకు చేరవేసే ప్రక్రియలో ఉన్న అవరోధాలను తొలగించి, వస్తుసేవల ప్రవాహాన్ని సులభతరము చేస్తుంది.

వాణిజ్యములో రెండు భాగాలు ఉంటాయి. 1. వర్తకము 2. వర్తక సదుపాయాలు. వస్తుసేవల మార్పిడికి చెందినది వర్తకము. వస్తు సేవలు వినియోగదారులకు సరఫరా అయ్యేందుకు సహాయపడే పంపిణీ మార్గమే వర్తకము. వర్తకము అనేది అనేక సాధక బాధకాలతో కూడిన ప్రక్రియ. ఇందులో అనేక అవరోధాలు, అడ్డంకులు ఉన్నాయి. ఇవి వ్యక్తులకు, స్థలానికి, కాలానికి, వినిమయమునకు, సమాచారమునకు సంబంధించినవి కావచ్చు. వీటిని తొలగించి, వస్తు సరఫరాను సులభతరము చేయడానికి అనేక సదుపాయాలున్నవి. ఈ సదుపాయాల సముదాయమే వాణిజ్యము అని చెప్పవచ్చును.

ప్రశ్న 3.
వర్తకము అంటే ఏమిటి ?
జవాబు:
వస్తువుల కొనుగోలు, అమ్మకాల ప్రక్రియను వర్తకము అని అంటారు. వర్తకము వాణిజ్యములో ప్రధాన భాగము. వస్తుసేవల ఉత్పత్తిదారులు వాటిని వినియోగించే వినియోగదారుల వద్దకు చేర్చి, వారి మధ్య సత్సంబంధాలు నెలకొల్పేందుకు తోడ్పడుతుంది. అంటే ఉత్పత్తిని వినియోగములోనికి తేవటమే వర్తకము. వాణిజ్య కార్యకలాపాలన్నీ వర్తకము చుట్టూ తిరుగుతాయి. వాణిజ్య కార్యకలాపాల వ్యాప్తికి, విజయానికి వర్తకము తోడ్పడుతుంది. వర్తకమును రెండు విధాలుగా విభజించవచ్చును.

  1. స్వదేశీ వర్తకము
  2. విదేశీ వర్తకము.

1) స్వదేశీ వర్తకము : ఒక దేశ సరిహద్దులలో జరిగే వర్తకాన్ని స్వదేశీ వర్తకము అంటారు. అమ్మకం, కొనుగోలు ఒకే దేశములో జరుగుతాయి. స్వదేశీ వర్తకాన్ని అది చేపట్టే కార్యకలాపాల ప్రాతిపదికతనుబట్టి టోకు వర్తకమని, చిల్లర వర్తకమని విభజించవచ్చును.

2) విదేశీ వర్తకము : ఇతర దేశాలతో వర్తకాన్ని కొనసాగించడాన్ని విదేశీ వర్తకము అని అంటారు. దేశ సరిహద్దులు దాటి కొనసాగించే వర్తకమే విదేశీ వర్తకము. విదేశీ వర్తకాన్ని మరల మూడు విధాలుగా విభజించవచ్చును. a) దిగుమతి వర్తకము b) ఎగుమతి వర్తకము c) మారు వర్తకము.

AP Inter 1st Year Commerce Study Material Chapter 2 వ్యాపార కార్యకలాపాలు

ప్రశ్న 4.
విదేశీ వర్తకములోని రకాలను పేర్కొనండి.
జవాబు:
ఇతర దేశాలతో వర్తకమును కొనసాగించడాన్ని విదేశీ వర్తకము అంటారు. దేశ సరిహద్దులు దాటే వర్తకమును విదేశీ వర్తకము అనవచ్చు. అనగా అమ్మకపుదారు ఒక దేశములోను, కొనుగోలుదారు మరొక దేశములోను ఉంటారు. కొనుగోలుదారు విదేశీ మారకపు ద్రవ్యాన్ని పొంది, అమ్మకపుదారుకు పంపవలెను. విదేశీ వర్తకాన్ని అంతర్జాతీయ వర్తకము అని కూడా వ్యవహరిస్తారు.
విదేశీ వర్తకాన్ని మూడు రకాలుగా వర్గీకరించవచ్చును.
a) దిగుమతి వర్తకము
b) ఎగుమతి వర్తకము
c) మారు వర్తకము.

a) దిగుమతి వర్తకము : ఒక దేశము మరొక దేశము నుంచి సరుకు కొనుగోలు చేయడాన్ని లేదా తెప్పించుకోవడాన్ని దిగుమతి వర్తకము అని అంటారు. ఇండియా అమెరికా నుంచి యంత్రాలను కొనుగోలు చేస్తే అది ఇండియా దృష్ట్యా దిగుమతి వర్తకము అవుతుంది.

b) ఎగుమతి వర్తకము : ఒక దేశము ఇంకొక దేశానికి సరుకును అమ్మడాన్ని ఎగుమతి వర్తకము అంటారు. ఈ రకమైన వర్తకములో వస్తువులను విదేశీయుల అవసరాలకు సరఫరా చేయడం జరుగుతుంది. ఇండియా అమెరికాకు తేయాకును అమ్మితే అది మనదేశము దృష్ట్యా ఎగుమతి వర్తకము అవుతుంది.

c) మారు వర్తకము : దీనినే ఎంట్రిపోట్ వర్తకము అంటారు. ఏదైనా ఒక దేశము తన సొంత ఉపయోగానికి కాక వేరొక దేశానికి ఎగుమతి చేసే ఉద్దేశ్యముతో మరొక దేశము నుండి సరుకును దిగుమతి చేసుకున్నట్లయితే దానిని ఎంట్రిపోట్ వర్తకము అంటారు.

ప్రశ్న 5.
పరిశ్రమల వర్గీకరణను వివరించండి.
జవాబు:
పరిశ్రమలను సాధారణముగా దిగువ విధాలుగా వర్గీకరించవచ్చు.
1) ప్రాథమిక పరిశ్రమలు : ఈ పరిశ్రమ ప్రకృతిపై ఆధారపడి, ప్రకృతి సహాయముతో వస్తువులను ఉత్పత్తి చేస్తుంది. ఉదా : వ్యవసాయము, చేపలు పట్టుట, అటవీకరణ మొదలైనవి.

2) ప్రజనన పరిశ్రమలు : ఈ పరిశ్రమలు వంశ క్రమానికి చెందిన కొన్ని జాతి మొక్కలను, పశువులను, పక్షులను పునరుత్పత్తి చేసి, వాటిని అమ్మడం ద్వారా లాభాన్ని ఆర్జిస్తాయి. ఉదా : నర్సరీలు, కోళ్ళ పరిశ్రమ, పట్టు పురుగుల పరిశ్రమ.

3) ఉద్గ్రహణ పరిశ్రమలు: ప్రకృతి వనరుల నుంచి వస్తువులను వెలికితీసే కార్యకలాపాలతో ముడిపడివున్న పరిశ్రమలను ఉద్గ్రహణ పరిశ్రమలు అంటారు. ఉదా : ఖనిజాల త్రవ్వకము, బొగ్గు, ఇనుప ఖనిజము మొదలైనవి. గనుల నుంచి వెలికితీయడము మొదలైనవి.

4) వస్తు తయారీ పరిశ్రమలు : ముడిపదార్థాలు లేదా సగం తయారైన వస్తువుల నుంచి పూర్తిగా తయారైన వస్తువులుగా ఉత్పత్తిచేసే వాటిని వస్తు తయారీ పరిశ్రమలు అంటారు. ఉదా : ఇనుము – ఉక్కు, యంత్ర పరికరాలు, సిమెంటు మొదలైనవి.

5) వస్తు నిర్మాణ పరిశ్రమలు : రోడ్లు, వంతెనలు, భవనాలు, ప్రాజెక్టులు మొదలైనవాటి నిర్మాణాన్ని చేపట్టే పరిశ్రమలను వస్తు నిర్మాణ పరిశ్రమలుగా చెప్పవచ్చును.

6) సేవారంగ పరిశ్రమలు : ప్రత్యక్షముగా గాని, పరోక్షముగా గాని ప్రజలకు ఆవశ్యకమైన సేవలను అందజేసే ప్రజోపయోగ సంస్థలను సేవా పరిశ్రమలు అంటారు. ఉదా : హోటల్ పరిశ్రమ, టూరిజమ్ పరిశ్రమ మొదలైనవి.

AP Inter 1st Year Commerce Study Material Chapter 2 వ్యాపార కార్యకలాపాలు

ప్రశ్న 6.
మారు వర్తకం (ఎంట్రీపోట్) ను నిర్వచించండి.
జవాబు:
దీనినే ఎంట్రిపోట్ వర్తకము అంటారు. ఏదైనా ఒక దేశము తన సొంత ఉపయోగానికి కాక వేరొక దేశానికి ఎగుమతి చేసే ఉద్దేశ్యముతో మరొక దేశము నుండి సరుకును దిగుమతి చేసుకున్నట్లయితే దానిని ఎంట్రిపోట్ వర్తకము అంటారు.

అదనపు ప్రశ్నలు

ప్రశ్న 7.
వాణిజ్యము యొక్క ప్రాముఖ్యతను వివరించండి.
జవాబు:
1) మానవుల కోర్కెలకు అంతము లేదు. వాణిజ్యము వస్తువుల పంపిణీ మార్గాన్ని సులభతరము చేసింది. ప్రపంచములో ఏ మూల ఉన్నా వినియోగదారుడు వస్తువులను కొనుక్కోగలుగుతున్నాడు.

2) జీవన ప్రమాణము అనగా సమాజములోని సభ్యులు నాణ్యమైన జీవనాన్ని గడపడమే. వాణిజ్యము వస్తువులను అవసరమయ్యే సమయములో, ప్రదేశములో, సరసమైన ధరలకు లభ్యమయ్యేటట్లు చేయడం వలన వారి జీవన ప్రమాణము పెరుగుతుంది.

3) వస్తూత్పత్తి వినియోగించడం కోసమే జరుగుతుంది. వాణిజ్యము ఉత్పత్తిదారులను, వినియోగదారులను, టోకు వర్తకుల, చిల్లర వర్తకుల మరియు వర్తక సదుపాయాల ద్వారా అనుసంధానము చేస్తుంది.

4) పరిశ్రమ, వర్తకము మరియు వాణిజ్యము అభివృద్ధి చెందడం ద్వారా వర్తక ఏజెన్సీలైన బ్యాంకింగ్, బీమా, రవాణా, ప్రకటనలు మొదలైనవి కూడా అభివృద్ధి చెంది ప్రజలకు ఎక్కువ ఉద్యోగ అవకాశాలను కల్పిస్తాయి.

5) ఉత్పత్తి పెరగడం ద్వారా జాతీయ ఆదాయము పెరుగుతుంది. దిగుమతులపై డ్యూటీని విదేశీ మారకద్రవ్యాన్ని సంపాదించవచ్చును.

6) వర్తక, వాణిజ్యాల అభివృద్ధి జరిగినపుడు విస్తృతి, ఆధునీకరణ ఆవశ్యకము అవుతుంది. వీటిద్వారా వర్తక సదుపాయాలైన బ్యాంకింగ్, బీమా, రవాణా మొదలైనవి విస్తృతి చెంది వాణిజ్య కార్యకలాపాలు సజావుగా జరగడానికి తోడ్పడతాయి.

7) రవాణా, సమాచార వ్యవస్థలు అభివృద్ధి చెందితే దేశాలు మిగులు వస్తువులను విదేశాలకు అమ్మి, విదేశీ మారక ద్రవ్యాన్ని సంపాదించవచ్చు.

8) వెనుకబడిన దేశాలు. నైపుణ్యము గల పనివారిని, సాంకేతిక పరిజ్ఞానాన్ని దిగుమతి చేసుకోవచ్చు. అలాగే అభివృద్ధి చెందిన దేశాలు ఈ దేశాల నుంచి ముడిసరుకు దిగుమతి చేసుకోవచ్చు. వెనుకబడిన దేశాలలో పారిశ్రామికీకరణ జరుగుతుంది.

ప్రశ్న 8.
వస్తు తయారీ పరిశ్రమలలో గల రకాలను తెలపండి.
జవాబు:
ముడిపదార్థాలు, సగం తయారైన వస్తువుల నుంచి పూర్తిగా తయారైన వస్తువులను ఉత్పత్తిచేసే వాటిని వస్తు. తయారీ పరిశ్రమలు అంటారు. ఇనుము-ఉక్కు, యంత్రపరికరాలు, సిమెంటు, వస్త్రాలు మొదలైనవి ఈ పరిశ్రమక ఉదాహరణలుగా చెప్పవచ్చును.
వస్తు తయారీ పరిశ్రమలో గల రకాలు :
1) విశ్లేషణాత్మక పరిశ్రమ ముఖ్యమైన ముడిపదార్థాలను వివిధ ప్రక్రియల ద్వారా విశ్లేషణ చేసి, విడ వివిధ వస్తువులను ఈ పరిశ్రమలు తయారుచేస్తాయి.
ఉదా : ముడిచమురును నూనె బావుల నుంచి తీసి, శుభ్రపరిచి, పెట్రోలు, డీజిల్, కిరోసిన్ మొదలైనవి తయారుచేయుట.

2) ప్రక్రియాత్మక పరిశ్రమలు : ముడిపదార్థాలను వివిధ దశలలో, వివిధ ప్రక్రియలను జరపడం ద్వారా వస్తువులను తయారుచేయడం ఈ పరిశ్రమల ద్వారా జరుగుతుంది.
ఉదా : వస్త్రపరిశ్రమ, కాగితం, పంచదార పరిశ్రమలు.

3) మిశ్రమ పరిశ్రమలు : వివిధ రకాల ముడిపదార్థాలను శాస్త్రీయ పద్ధతిలో వివిధ నిష్పత్తులలో మిశ్రమము చేసి కొత్త వస్తువులను తయారుచేసే పరిశ్రమలను మిశ్రమ పరిశ్రమలు అంటారు.
ఉదా : కాంక్రీట్, జిప్సమ్, బొగ్గు కలిపి సిమెంటు తయారుచేయుట.

4) జోడింపు పరిశ్రమలు : వివిధ పరిశ్రమలలో తయారైన వస్తువులను నిర్దిష్ట పద్ధతిలో, క్రమములో జతపరిచి కొత్త వస్తువులను తయారుచేసే పరిశ్రమలను జోడింపు పరిశ్రమలు తయారుచేస్తాయి.
ఉదా : టెలివిజన్, స్కూటర్, సైకిల్ మొదలైన వస్తువులను తయారుచేసే పరిశ్రమలు.

AP Inter 1st Year Commerce Study Material Chapter 2 వ్యాపార కార్యకలాపాలు

అతి స్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
పరిశ్రమ
జవాబు:
వ్యాపారము తాలూకు ఉత్పాదనాంశమే పరిశ్రమ. వస్తువుల ఉత్పత్తికి సంబంధించిన కార్యకలాపాల సమూహాన్ని పరిశ్రమగా పేర్కొనవచ్చు. వస్తువుల సేకరణ, ఉత్పత్తి, ప్రాసెసింగ్, నిర్మాణము మొదలైనవాటికి సంబంధించిన కార్యకలాపాలను పరిశ్రమగా నిర్వచించవచ్చును.

ప్రశ్న 2.
వాణిజ్యము
జవాబు:
వాణిజ్యము వస్తువు రక్తానికి సంబంధించినది. వస్తువులు ఉత్పత్తి జరిగే ప్రదేశము నుంచి తుది వినియోగదారునకు చేరే వరకు జరిగే అన్ని కార్యకలాపాలతోను వాణిజ్యానికి సంబంధము ఉంటుంది. జేమ్స్ ఫెన్సన్ అభిప్రాయం ప్రకారము వాణిజ్యము అనగా “వస్తుసేవల మార్పిడిలో వ్యక్తులకు, స్థలానికి, కాలానికి సంబంధించి తలెత్తే అవరోధాలను తొలగించడానికి సహాయపడే కార్యకలాపాల సముదాయమే వాణిజ్యము”.

ప్రశ్న 3.
వర్తకము [T.S. Mar. ’15]
జవాబు:
వస్తువుల కొనుగోలు, అమ్మకాల ప్రక్రియను వర్తకము అంటారు. వర్తకము వాణిజ్యములో ప్రధాన భాగము. వస్తు సేవల ఉత్పత్తిదారులు వాటిని వినియోగించే వినియోగదారుల వద్దకు చేర్చి వారి మధ్య సంబంధాలను నెలకొల్పేటట్లు చేస్తుంది. అనగా ఉత్పత్తిని వినియోగములోనికి తేవటమే వర్తకము, వాణిజ్య కార్యకలాపాలన్నీ వర్తకము చుట్టూ తిరుగుతాయి.

ప్రశ్న 4.
స్వదేశీ వర్తకము
జవాబు:
ఒక దేశ సరిహద్దులకు లోబడి జరిపే వస్తువుల కొనుగోలు, అమ్మకాల ప్రక్రియను స్వదేశీ వర్తకము అంటారు. వర్తకానికి తోడ్పడే అనుషంగిక కార్యకలాపములైన రవాణా, బీమా, గిడ్డంగులు మొదలైనవి కూడా ఒక దేశానికి మాత్రమే పరిమితమై ఉంటాయి. స్వదేశీ వర్తకాన్ని దాని స్థల పరిధి ఆధారముగా స్థానిక, ప్రాంతీయ వర్తకము అనికూడా వర్గీకరించవచ్చు.

ప్రశ్న 5.
మారు వర్తకము (ఎంట్రిపోట్)
జవాబు:
వర్తకమును ఒక దేశము నుంచి వస్తువులను దిగుమతి చేసుకొని వాటిని మరొక దేశానికి ఎగుమతి చేయడాన్ని ఎంట్రిపోట్ వర్తకము లేదా మారు వర్తకము అంటారు. ఉదా : తైవాన్ లో తయారైన కాలిక్యులేటర్లను భారతదేశము దిగుమతి చేసుకొని, వాటిని ఆఫ్రికా దేశాలకు మళ్ళీ ఎగుమతి చేయడాన్ని ఎంట్రిపోట్ వర్తకము అంటారు. ఈ ఆయా దేశాల మధ్య మంచి సంబంధాలు లేనప్పుడు, కొన్ని రవాణా తదితర సౌలభ్యాల వలన కూడా జరుగుతుంది.

AP Inter 1st Year Commerce Study Material Chapter 2 వ్యాపార కార్యకలాపాలు

ప్రశ్న 6.
రవాణా
జవాబు:
ఉత్పత్తి, వినియోగ కేంద్రాలకు మధ్యదూరము పెరుగుతున్నది. ఈ అడ్డంకిని రవాణా సౌకర్యాలు తొలగిస్తున్నవి. రవాణా వస్తువులకు స్థల ప్రయోజనాన్ని కల్గిస్తుంది. ఉత్పత్తి అయిన సరుకు వినియోగదారుల వద్దకు చేర్చడానికి రవాణా తోడ్పడుతున్నది. ఆధునిక రోడ్లు, రైలు, విమాన, సముద్రయాన రవాణా సౌకర్యాల వలన వస్తు పంపిణీ వేగముగాను, భద్రముగా జరుగుతుంది.

ప్రశ్న 7.
గిడ్డంగులలో దాయటం
జవాబు:
వస్తూత్పత్తికి, వినియోగానికి మధ్య కాలవ్యవధి ఉంటుంది. ఈ కాలవ్యవధిలో అమ్మకము జరిగేంతవరకు వస్తువులను గిడ్డంగులలో నిల్వ చేయాలి. బియ్యము, గోధుమ మొదలైన వ్యవసాయ ఉత్పత్తులు కొన్ని మాసాలలోనే జరుగుతుంది. కాని వాటి డిమాండు సంవత్సరమంతా ఉంటుంది. గొడుగులు, ఉన్ని వస్తువులను సంవత్సరమంతా ఉత్పత్తి చేసినా వాటి డిమాండు కొన్ని కాలాలలోనే ఉంటుంది. కాబట్టి వస్తువులకు డిమాండు వచ్చే వరకు గిడ్డంగులలో నిల్వ చేయాలి. గిడ్డంగులు కాల ప్రయోజనాన్ని కల్గిస్తాయి.

ప్రశ్న 8.
ప్రజనన పరిశ్రమలు [A.P. Mar. ’15]
జవాబు:
ఈ పరిశ్రమలు వంశ క్రమానికి చెందుతాయి. కొన్ని జాతుల మొక్కలను, పశువులను, పక్షులను పునరుత్పత్తి చేసి, వాటిని అమ్మడం ద్వారా లాభాన్ని ఆర్జించే కార్యకలాపాన్ని ప్రజనన పరిశ్రమ అంటారు.. నర్సరీలు, చేపల పెంపకము, కోళ్ళ పరిశ్రమ ఇందుకు ఉదాహరణలు.

ప్రశ్న 9.
ఉద్గ్రహణ పరిశ్రమలు
జవాబు:
ప్రకృతి వనరుల నుంచి వస్తువులను వెలికితీసే కార్యకలాపాలతో ముడిపడివున్న ఉన్న పరిశ్రమలను ఉద్గ్రహణ పరిశ్రమలు అంటారు. ఖనిజాల త్రవ్వకము, బొగ్గు, నూనె, అడవుల నుంచి కలప, రబ్బరు వెలికితీయడం ఉద్గ్రహణ పరిశ్రమలకు ఉదాహరణలు.

ప్రశ్న 10.
బ్యాంకింగ్
జవాబు:
వాణిజ్యము అభివృద్ధి చెందేందుకు అవసరమైన ద్రవ్యము, పరపతి అడ్వాన్సులను అందజేసే ఒక వర్తక సదుపాయమే బ్యాంకింగ్. ఆర్థికపరమైన ఇబ్బందులను తొలగించడములో బ్యాంకులు ముఖ్యపాత్ర వహిస్తున్నవి. బ్యాంకింగ్ ఒక ప్రధానమైన వాణిజ్య కార్యకలాపము.

AP Inter 1st Year Commerce Study Material Chapter 2 వ్యాపార కార్యకలాపాలు

ప్రశ్న 11.
టోకు వర్తకము
జవాబు:
వస్తు, సేవల కొనుగోళ్ళు, అమ్మకాలు పెద్ద మొత్తములో జరిగితే దానిని టోకు వర్తకము అంటారు. – టోకు వర్తకుడు ఉత్పత్తిదారుల నుంచి పెద్ద మొత్తాలలో సరుకును కొనుగోలు చేసి చిన్న మొత్తాలలో చిల్లర వర్తకులకు అమ్ముతారు.

AP Inter 1st Year Commerce Study Material Chapter 6 జాయింట్ స్టాక్ కంపెనీ స్థాపన

Andhra Pradesh BIEAP AP Inter 1st Year Commerce Study Material 6th Lesson జాయింట్ స్టాక్ కంపెనీ స్థాపన Textbook Questions and Answers.

AP Inter 1st Year Commerce Study Material 6th Lesson జాయింట్ స్టాక్ కంపెనీ స్థాపన

వ్యాసరూప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
జాయింట్ స్టాక్ కంపెనీ అనగానేమి ? వాటి లక్షణాలేవి ?
జవాబు:
సొంత వ్యాపారము, భాగస్వామ్య వ్యవస్థలలోని పరిమితులు అధిగమించడానికి కంపెనీ వ్యవస్థ ఉద్భవించినది. ఉమ్మడి వాటాల ద్వారా రూపుదిద్దుకొనే సంస్థ కాబట్టి దీనిని జాయింట్ స్టాక్ కంపెనీ అంటారు. కంపెనీ కొంతమంది వ్యక్తుల స్వచ్ఛంద సంఘము. కొంతమంది వ్యక్తులు కలసి ఒక ధ్యేయమును సాధించడానికి ఏర్పడిన సంస్థ. కంపెనీల
చట్టము దీనికి ప్రత్యేకమైన వ్యక్తిత్వాన్ని ప్రసాదించినది. దీనికి న్యాయాత్మకమైన వ్యక్తిత్వము, పారంపర్యాధికారము, పరిమిత ఋణబాధ్యత ఉన్నవి. కంపెనీలకు ప్రత్యేక వ్యక్తిత్వము ఉండటము అది తన పేరుతోనే ఆస్తులను కొనవచ్చు, అమ్మవచ్చు ఒడంబడికలు చేసుకోవచ్చు. అందుకే అటువంటి సంస్థను కంపెనీల చట్టము సృష్టించిన కల్పిత వ్యక్తిగా వర్ణించడమైనది.

“అధికార ముద్రతో, పారంపర్యాధికారముతో చట్టం సృష్టించిన కల్పిత వ్యక్తిత్వముతో రిజిస్టర్ అయిన స్వచ్ఛంద సంస్థ” – కంపెనీల చట్టము.

“సమిష్టి ధ్యేయం కోసం ఐచ్ఛికముగా ఏర్పడిన వ్యక్తుల సముదాయమే కంపెనీ”

– లార్డ్ జస్టీస్ జేమ్స్ “న్యాయశాస్త్ర దృష్టిలో అదృశ్యముగా కంటికి కనిపించకుండా జీవించే కల్పిత మానవుడు. కేవలం న్యాయ శాస్త్ర సృష్టి వలన ఏర్పడినది కాబట్టి రాజ్యాంగము నిర్దేశించిన ధర్మాలే దానికి ఉంటాయి. ఆ ధర్మాలలో అతి ముఖ్యమైనవి శాశ్వతత్వము, వ్యక్తిత్వము” – ప్రధాన న్యాయాధికారి మార్షల్.

కంపెనీల లక్షణాలు :
1. న్యాయాత్మకమైన వ్యక్తిత్వము కంపెనీ చట్టము ద్వారా సృష్టించబడుతుంది. మానవునకు సహజముగా ఉండే హక్కులన్నీ కంపెనీలకు ఉంటాయి. కంపెనీ ఆస్తులను సేకరించి, అప్పులు తీసుకోవచ్చు. తన పేరుమీదగానే కోర్టులో దావా వేయవచ్చు. ఇతరులు కూడా కంపెనీ మీద దావా వేయవచ్చు.

2. న్యాయసత్వము : కంపెనీ నమోదు అయిన తర్వాత ప్రత్యేకమైన అస్థిత్వము ఏర్పడుతుంది. కంపెనీ వేరు, కంపెనీ సభ్యులు వేరు. సభ్యులతో కంపెనీకి సంబంధము ఉండదు.

AP Inter 1st Year Commerce Study Material Chapter 6 జాయింట్ స్టాక్ కంపెనీ స్థాపన

3. స్థాపన : భారత కంపెనీల చట్టము, 1956 క్రింద నమోదు అయినప్పుడే కంపెనీ మనుగడలోనికి వస్తుంది.

4. అధికార ముద్ర : కంపెనీకి భౌతిక రూపము లేదు కాబట్టి అది సంతకాలు చేయలేదు. అందుచేత చట్టం ప్రకారము అధికార ముద్ర ఉండవలెను. ఇది కంపెనీ సంతకము వలె చెలామణి అవుతుంది. అధికార ముద్ర మీద కంపెనీ పేరును, వ్యాపార చిహ్నాన్ని చెక్కుతారు.

5. పారంపర్యాధికారము : చట్టము సృష్టించిన అసహజ మానవుడు కావున కంపెనీ ఛిరకాలము కొనసాగుతుంది. వాటాదారుల మరణముతోగాని, దివాలా తీయడం ద్వారా కంపెనీ మనుగడకు అంతరాయముండదు.

6. పరిమిత ఋణబాధ్యత : వాటాదారుల ఋణబాధ్యత వారు తీసుకున్న వాటాల మేరకు పరిమితము.

7. వాటాల బదిలీ : పబ్లిక్ కంపెనీలోని వాటాదారులు తమ వాటాలను యథేచ్చగా బయటవారికి బదిలీ చేయవచ్చును.

8. యాజమాన్యానికి, నిర్వహణకు పొత్తుండదు : వాటాదారులు కంపెనీ యజమానులు అయినా వారందరూ నిర్వహణలో పాల్గొనలేరు. వారు ఎన్నుకున్న డైరెక్టర్ల బోర్డు నిర్వహణ చేస్తుంది. కాబట్టి యాజమాన్యం వేరు, నిర్వహణ వేరు,

9. సభ్యుల సంఖ్య : జాయింట్ స్టాక్ కంపెనీలలో ప్రధానముగా పబ్లిక్ కంపెనీలు, ప్రైవేటు కంపెనీలు ఉంటాయి. పబ్లిక్ కంపెనీలలో కనిష్ట సభ్యుల సంఖ్య 7, గరిష్ట సభ్యుల సంఖ్య అపరిమితము. ప్రైవేటు కంపెనీలలో కనిష్ట సభ్యుల సంఖ్య 2. గరిష్ట సభ్యుల సంఖ్య 50.

10. చట్టబద్ధమైన నిబంధనలు : కంపెనీ వ్యవహారములన్నీ భారత కంపెనీల చట్టము అజమాయిషీలో జరుగును.

ప్రశ్న 2.
జాయింట్ స్టాక్ కంపెనీకి గల ప్రయోజనాలను, పరిమితులను వివరింపుము. ‘
జవాబు:
కంపెనీ వ్యవస్థ వలన ఈ క్రింది ప్రయోజనాలు ఉంటాయి.
1. భారీ ఆర్థిక వనరులు : ప్రజల నుంచి విస్తారముగా నిధులు సేకరించడానికి కంపెనీ వ్యవస్థ అనువైనది. కంపెనీ వాటాలను చిన్నచిన్న మొత్తాలుగా విభజించి అమ్మడం వలన స్వల్ప ఆదాయముగల ప్రజలు కూడా వాటాలను సులభముగా కొనగలరు. అందువలన భారీ మూలధనాన్ని తేలికగా సేకరించవచ్చు.

2. పరిమిత ఋణబాధ్యత : వాటాదారుల ఋణబాధ్యత వారి వాటా విలువకు పరిమితము అవుతుంది. కంపెనీ అప్పులు తీర్చడానికి సొంత ఆస్తులు తేనవసరము లేదు. వాటా సొమ్ము మాత్రమే కోల్పోతారు. నష్టభయం తక్కువ. అందువలన కంపెనీలో పెట్టుబడి పెట్టడానికి ప్రజలు ముందుకు వస్తారు.

3. శాశ్వతత్వము : కంపెనీల చట్టం ప్రకారము కంపెనీకి ప్రత్యేక న్యాయసత్వము ఉన్నది. అందువలన కంపెనీ నిరాటంకముగా కొనసాగుతుంది. వాటాదారుల మరణము, దివాలా తీయడం వలన కంపెనీ మనుగడకు ఎటువంటి అంతరాయం కలగదు. అది నిరాటంకముగా కొనసాగుతుంది.

4. వాటాల బదిలీ : పబ్లిక్ కంపెనీ వాటాలను ఇతరులు అనుమతి లేకుండా సులభముగా బదిలీ చేయవచ్చును. కంపెనీ వాటాలను స్టాక్ ఎక్స్చేంజిలో అమ్ముతారు. బదిలీ సౌకర్యము ద్వారా వీటిని తేలికగా నగదులోనికి మార్చుకొనవచ్చు. కాబట్టి వాటాలకు ద్రవ్యత్వ లక్షణం ఉండటంవలన కంపెనీకి స్థిరత్వము కల్పిస్తుంది.

5. పెద్దతరహా కార్యకలాపాల ఆదాలు : అధిక నిధుల వలన కంపెనీలు ఉత్పత్తిని భారీగా చేపడతాయి. అందువలన కొనుగోళ్ళు, మార్కెటింగ్, సిబ్బంది వినియోగం, రవాణా తదితర వ్యవహారాలలో అనేక ఆదాలు లభిస్తాయి. ఖర్చులు తగ్గి, లాభాలు పెరుగుతాయి.

6. సమర్థవంతమైన నిర్వహణ : కంపెనీకి అపారమైన నిధులు ఉండటం వలన నిర్వహణ నిపుణులను, వ్యయగణకులను, ఛార్టర్డ్ అకౌంటెంట్లు, సాంకేతిక నిపుణులను నియమిస్తే వారు నిర్వహణను సమర్థవంతముగా చేపడతారు.

7. పరిశోధన మరియు అభివృద్ధి : ఒక కంపెనీ ఉత్పత్తి ప్రక్రియను మెరుగుపరచడానికి, నూతన వస్తువుల రూపకల్పనకు, కార్మికులకు శిక్షణ ఇవ్వడానికి ఎక్కువ మొత్తాన్ని పెట్టుబడిగా పెట్టవలసి ఉంటుంది. ఈ విస్తరణ కంపెనీలలోనే సాధ్యము.

8. పన్ను ఆదాలు : కంపెనీలు ఆదాయపు పన్ను ఎక్కువ కట్టవలసి వచ్చినప్పటికి, ఎన్నో పన్ను మినహాయింపులు ఇవ్వడం వలన వీటికి పన్ను చెల్లించే బాధ్యత మొత్తంమీద తగ్గుతుంది.

AP Inter 1st Year Commerce Study Material Chapter 6 జాయింట్ స్టాక్ కంపెనీ స్థాపన

పరిమితులు :
1. స్థాపనలో సౌలభ్యము లేకపోవడము : ఒక కంపెనీని స్థాపించడం చాలా కష్టముతోనూ, ఖర్చుతో కూడుకున్నది. అనేక పత్రాలు తయారుచేసి రిజిస్ట్రారుకు సమర్పించాలి. ఇందుకు నిపుణులు కావలెను. కంపెనీని తప్పనిసరిగా నమోదు చేయవలెను. కాబట్టి కంపెనీ స్థాపన సులభమైన ప్రక్రియ కాదు.

2. డైరెక్టర్ల స్వార్ధపరత్వము : కంపెనీ యజమానులైన వాటాదారులు కంపెనీని పరిపాలన చేయరు. నిర్వహణ కోసం డైరెక్టర్లను ఎన్నుకుంటారు. డైరెక్టర్లు తమ అధికారాలను ముఖ్యకార్యనిర్వహణాధికారికి దత్తం చేస్తారు. ఆయన తన అధికారాలను కింద ఉద్యోగులకు అప్పగిస్తారు. వీరిలో ఎవరు అసమర్థులైనా, స్వార్థపరులైనా కంపెనీ నష్టాలపాలై దివాలా తీసే పరిస్థితి ఏర్పడుతుంది.

3. శ్రద్ధాసక్తులు తక్కువ : యాజమాన్యానికి, నిర్వహణకు అంతరము ఉంటుంది. నిర్వహణ అంతా సిబ్బంది ‘ద్వారా జరుగుతుంది. సిబ్బందికి వ్యక్తిగత చొరవ, శ్రద్ధాసక్తులు ఉండకపోవచ్చు. సిబ్బంది కష్టపడినా ప్రోత్సాహముండదు కాబట్టి వారిలో అలసత్వము ఏర్పడుతుంది.

4. కొద్దిమంది పరిపాలన : సిద్ధాంతరీత్యా కంపెనీ నిర్వహణ ప్రజాస్వామిక సూత్రాలను అనుసరించి ఉంటుంది. కాని ఆచరణలో ఇది అల్ప సంఖ్యాకుల నిర్వహణ. ఓటింగ్ హక్కులు, నిర్వహణాధికార్డులు చేజిక్కించుకున్న ‘ కొంతమంది డైరెక్టర్లు లోపలి వృత్తముగా ఏర్పడి సర్వాధికారాలు చెలాయిస్తారు.

5. అధికమైన ప్రభుత్వ నియంత్రణ : కంపెనీ నిర్వహణలో అనేక నిబంధనలు పాటించాలి. వార్షిక నివేదికలు, తనిఖీ చేసిన లెక్కలను విధిగా రిజిస్ట్రారుకు సమర్పించాలి. డైరెక్టర్ల నియామకానికి ప్రభుత్వ అనుమతి పొందాలి. కంపెనీ ధ్యేయాలు మార్పుచేయడానికి అనేక చట్టబద్దమైన లాంఛనాలు పాటించాలి.

6. వాటాలలో అనుచిత స్పెక్యులేషన్: పబ్లిక్ కంపెనీల వాటాలను స్టాక్ ఎక్స్చేంజ్ జాబితాలో చేర్చి సులభముగా కొనుగోలు, అమ్మకాలు చేయవచ్చు. వాటా ధరలు కంపెనీ ఆర్థిక పరిస్థితి, డివిడెండ్ల చెల్లింపు, కంపెనీ పేరు ప్రతిష్ట, కంపెనీ అభివృద్ధికి అవకాశాలు మొదలైనవాటి మీద ఆధారపడతాయి. కంపెనీ డైరెక్టర్లు కంపెనీ లెక్కలను తారుమారుచేసి, వాటా విలువను తమకు అనుకూలముగా మార్చుకొని స్పెక్యులేషన్ ద్వారా డైరెక్టర్లు లాభపడతారు.

7. వ్యాపార నిర్ణయాలు తీసుకోవడములో జాప్యము : కంపెనీ వ్యాపారానికి సంబంధించిన నిర్ణయాలను డైరెక్టర్ల సమావేశాలలోనూ, వాటాదారుల సమావేశాలలోను తీసుకొనవలెను. ఈ సమావేశాలు ఏర్పాటు చేయడానికి కొంత కాలయాపన జరుగుతుంది.

8. వ్యాపార రహస్యాలు : వ్యాపార నిర్వహణ వాటాదారులు, డైరెక్టర్లు, ఉద్యోగుల చేతులలో ఉంటుంది. కాబట్టి కంపెనీ రహస్యాలను కాపాడటానికి వీలులేదు.

9. ఆసక్తుల సంఘర్షణ : ఈ తరహా వ్యాపారములో ఆసక్తులకు సంబంధించి నిరంతరము సంఘర్షణ జరుగుతుంది. సాధారణముగా వాటాదారులు, డైరెక్టర్ల మధ్య లేదా వాటాదారులు, ఋణదాతల మధ్య లేదా మేనేజ్మెంట్, సిబ్బందికి మధ్య ఎప్పుడూ కలహాలు, కొనసాగుతూనే ఉంటాయి.

10. గుత్తాధిపత్యము కంపెనీలు గుత్తాధిపత్య ధోరణులను ప్రోత్సహిస్తుంది. వీరు వినియోగదారులను, శ్రామికులను దోచుకోవడం జరుగును.

ప్రశ్న 3.
ప్రైవేటు కంపెనీ, పబ్లిక్ కంపెనీలకు మధ్యగల తేడాలేవి ?
జవాబు:
ప్రైవేటు కంపెనీకి, పబ్లిక్ కంపెనీకి ఈ క్రింది వ్యత్యాసాలున్నవి.
ప్రైవేటు కంపెనీ

  1. సభ్యుల సంఖ్య : కనీసము ఇద్దరు సభ్యులు ఉండాలి. గరిష్ట సభ్యుల సంఖ్య యాభైకి మించరాదు.
  2. కనీస చెల్లింపు మూలధనము 1,00,000.
  3. పేరు : పేరు చివర ప్రైవేటు లిమిటెడ్ అనే మాటలుండాలి.
  4. మూలధన సేకరణ : మూలధన సేకరణకు పరిచయ పత్రాన్ని జారీ చేయరాదు.
  5. వ్యాపార ప్రారంభము : నమోదు పత్రాన్ని పొందిన వెంటనే వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు.
  6. శాసనాత్మక సమావేశము : శాసనాత్మక సమావేశము ఏర్పాటుచేయనవసరం లేదు.
  7. కనీసపు చందా : కనీసపు చందా నిమిత్తము లేకుండా వాటాలను కేటాయించవచ్చును.
  8. డైరెక్టర్లు : కనీసం ఇద్దరు డైరెక్టర్లు ఉండాలి. డైరెక్టర్లుగా ఉండటానికి అర్హత వాటాలు తీసుకోనవసరము లేదు. డైరెక్టర్లు రొటేషన్ పద్ధతిలో పదవీ విరమణ చేయనవసరము లేదు.
  9. నియామకము : డైరెక్టర్లు అందరిని ఒకే తీర్మానము ద్వారా నియామకం చేయవచ్చును.
  10. నిర్వాహక పారితోషికము : డైరెక్టర్లకు, ఇతర నిర్వాహకులకు చెల్లించే పారితోషికంపై ‘ పరిమితి లేదు.
  11. కోరమ్ : సమావేశాలకు ఉండవలసిన కోరమ్ 2.
  12. డైరెక్టర్లకు కేంద్ర ప్రభుత్వపు అనుమతి లేకుండా ఋణాలు ఇవ్వవచ్చును.

AP Inter 1st Year Commerce Study Material Chapter 6 జాయింట్ స్టాక్ కంపెనీ స్థాపన

పబ్లిక్ కంపెనీ

  1. కనీసము ఏడుగురు సభ్యులుండాలి. గరిష్ట సభ్యుల సంఖ్య అపరిమితము.
  2. కనీస చెల్లింపు మూలధనము 5,00,000
  3. పేరు చివర లిమిటెడ్ అనే మాటను వాడాలి.
  4. పరిచయ పత్రము లేదా ప్రత్యామ్నాయ పరిచయపత్ర నివేదికను విధిగా రిజిస్ట్రారుకు దాఖలు చేయాలి.
  5. వ్యాపార ప్రారంభ ధ్రువపత్రము పొందకుండా వ్యాపారాన్ని ప్రారంభించరాదు.
  6. శాసనాత్మక సమావేశము ఏర్పాటుచేసి శాసన నివేదికను రిజిస్ట్రారుకు దాఖలుచేయవలెను.
  7. కనీసపు చందా నిర్ణీత సమయములో రాకపోతే వాటాలను కేటాయించడానికి వీలులేదు.
  8. కనీసము ముగ్గురు డైరెక్టర్లు ఉండాలి. -డైరెక్టర్లుగా ఉండటానికి అర్హత వాటాలు తీసుకొనవలెను. ప్రతి ఏటా మూడోవంతు డైరెక్టర్లు పదవీ విరమణ చేయవలెను.
  9. ప్రతి డైరెక్టరు ఎన్నికకు ఒక ప్రత్యేక తీర్మానము చేయవలెను.
  10. డైరెక్టర్లకు, నిర్వాహకులకు చెల్లించే పారితోషికం నికర లాభములో 11%నకు మించరాదు.
  11. సమావేశాలకు ఉండవలసిన కోరమ్ 5.
  12. కేంద్ర ప్రభుత్వము అనుమతి లేకుండా డైరెక్టర్లకు ఋణాలను మంజూరు చేయరాదు

ప్రశ్న 4.
భాగస్వామ్యము, కంపెనీ వ్యాపారముల మధ్య గల వ్యత్యాసము లేవి ?
జవాబు:
భాగస్వామ్యానికి, కంపెనీలకు మధ్య ఈ క్రింది వ్యత్యాసాలున్నవి.
భాగస్వామ్యము

  1. స్థాపన : 1932 భారత భాగస్వామ్య చట్టముననుసరించి స్థాపించబడుతుంది.
  2. నమోదు : నమోదు తప్పనిసరి కాదు.”
  3. సభ్యుల సంఖ్య : కనీస సభ్యుల సంఖ్య 2. గరిష్ట సభ్యుల సంఖ్య బ్యాంకింగ్ వ్యాపారాలలో 10, ఇతర వ్యాపారాలలో 20.
  4. వ్యాపార ప్రారంభము : భాగస్తులు ఒప్పందము కుదుర్చుకున్న వెంటనే ప్రారంభించవచ్చును.
  5. వ్యక్తిత్వము : సభ్యులకు సంస్థకు తేడా లేదు.
  6. ఋణబాధ్యత : భాగస్తుల ఋణబాధ్యత వ్యక్తిగతము, సమిష్టిగతము, అపరిమితము.
  7. వాటాలబదిలీ : ఇతర భాగస్తుల అనుమతి లేకుండా ఏ భాగస్తుడు తన వాటాను బయటవారికి బదిలీ చేయరాదు.
  8. పారంపర్యాధికారము : భాగస్తుల మరణం, విరమణ, దివాలా మూలముగా భాగస్వామ్యము రద్దవుతుంది.
  9. మూలధనము : సంస్థే మూలధనాన్ని సమకూర్చుకుంటుంది.
  10. ఖాతాల ఆడిట్: ఖాతాలను ఆడిట్ చేయనవసరము లేదు.
  11. బాధ్యత : భాగస్తుల కార్యకలాపాలకు సంస్థ బాధ్యత వహిస్తుంది.
  12. నిర్వహణ : భాగస్తులే నిర్వహణ చేపడతారు.

కంపెనీ

  1. 1956 భారత కంపెనీల చట్టముననుసరించి స్థాపన జరుగుతుంది.
  2. నమోదు తప్పనిసరి.
  3. ప్రైవేటు కంపెనీలలో కనిష్ట సభ్యుల సంఖ్య 2. గరిష్ట సభ్యుల సంఖ్య 50. పబ్లిక్ కంపెనీలలో కనిష్ట సభ్యుల సంఖ్య 7. గరిష్ట సభ్యుల సంఖ్య అపరిమితము.
  4. ప్రైవేటు కంపెనీలు నమోదు పత్రాన్ని పబ్లిక్ కంపెనీలు వ్యాపార ప్రారంభ ధృవపత్రాన్ని పొందితేగాని వ్యాపారాన్ని ప్రారంభించుటకు వీలులేదు.
  5. కంపెనీ వేరు. కంపెనీలో ఉండే సభ్యులు వేరు.
  6. వాటాదారుల ఋణబాధ్యత వారు తీసుకున్న వాటాల విలువ మేరకే పరిమితము అవుతుంది.
  7. వాటాదారులు తమ వాటాలను స్వేచ్ఛగా బదిలీ చేయవచ్చును.
  8. వాటాదారులు, డైరెక్టర్లు మరణించినా, విరమించినా కంపెనీ యథావిధిగా కొనసాగుతుంది.
  9. వాటాలను జారీచేసి, మూలధనాన్ని సేకరించుకుంటుంది.
  10. ఖాతాలను తప్పనిసరిగా ఆడిట్ చేయించాలి.
  11. వాటాదారుల చర్యలు కంపెనీని బంధించలేవు.
  12. కంపెనీలలో నిర్వహణ బాధ్యతను డైరెక్టర్ల బోర్డుకు అప్పగిస్తారు.

AP Inter 1st Year Commerce Study Material Chapter 6 జాయింట్ స్టాక్ కంపెనీ స్థాపన

స్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
ఏవైనా ఐదు రకాల కంపెనీలను వివరింపుము.
జవాబు:
కంపెనీలను వ్యవస్థాపన, ప్రజల ఆసక్తి, ఋణబాధ్యత, నియంత్రణ, జాతీయత ఆధారముగా అనేక రకాలుగా విభజించవచ్చును.
1. చార్టర్డ్ కంపెనీలు : ఒక దేశము యొక్క రాజు జారీ చేసిన రాజశాసనమును అనుసరించి ఏర్పడిన కంపెనీలను రాజశాసన కంపెనీలు అంటారు. ఇలాంటి కంపెనీలకు ప్రత్యేక హక్కులు ఉంటాయి. ఉదా : ఈస్ట్ ఇండియా కంపెనీ, ఛార్టర్డ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.

2. శాసనాత్మక కంపెనీలు : ఒక దేశ పార్లమెంటుగాని, రాష్ట్ర శాసనసభ ఆమోదించి ప్రత్యేక చట్టము ద్వారా’ ఏర్పడిన కంపెనీలను శాసనాత్మక కంపెనీలు అంటారు. ఉదా : భారత రిజర్వ్ బ్యాంక్, స్టేట్ బ్యాంక్, జీవిత భీమా కార్పొరేషన్ మొదలైనవి.

3. రిజిష్టర్డ్ కంపెనీలు : కంపెనీల చట్టము క్రింద రిజిస్ట్రారు వద్ద నమోదైన కంపెనీలను రిజిస్టర్డ్ కంపెనీలు అంటారు. ఉదా : ఆంధ్రప్రదేశ్ పేపర్ మిల్స్ లిమిటెడ్, ఇండోనిప్పన్ బాటరీస్ లిమిటెడ్.

4. ప్రభుత్వ కంపెనీలు : కంపెనీల చట్టము 1956 సెక్షన్ 617 ప్రకారము ఏ రిజిస్టర్అయినా కంపెనీలో అయినా కేంద్ర ప్రభుత్వానికి లేదా రాష్ట్ర ప్రభుత్వానికి లేదా రెండింటికి చెల్లించిన మూలధనములో 51 శాతానికి ఎక్కువ వాటాలున్న కంపెనీని ప్రభుత్వ కంపెనీ అంటారు. ప్రభుత్వము పూర్తిగా లేదా పాక్షికముగా యాజమాన్యాన్ని నిర్వహించవచ్చును. ఉదా : విశాఖ స్టీల్ ప్లాంటు, భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ మొదలైనవి.

5. ప్రైవేటు కంపెనీలు : కంపెనీ నియమావళి ప్రకారము వాటాలను బదిలీ చేయడానికి వీలులేదని, సభ్యుల సంఖ్య 50కి మించరాదని, మూలధన సేకరణకోసం పరిచయ పత్రము జారీచేయడానికి వీలులేని కంపెనీలు ప్రైవేటు కంపెనీలు.

6. పబ్లిక్ కంపెనీలు : చట్టము ప్రకారము ప్రైవేటు కంపెనీలుకాని కంపెనీలు పబ్లిక్ కంపెనీలే. 7. వాటా పరిమిత కంపెనీలు : ఏ కంపెనీలో అయితే వాటాదారుల ఋణబాధ్యత వారు తీసుకున్న వాటా విలువకు పరిమితము అవుతుందో ఆ కంపెనీలను వాటా పరిమిత కంపెనీలు అంటారు.

8. పూచీ పరిమిత కంపెనీలు : ఈ కంపెనీలలో వాటాదారులు కంపెనీ పరిసమాప్తి సమయములో ఒక స్థిర · మొత్తాన్ని చెల్లించడానికి పూచీ ఇస్తారు.

9. అపరిమిత కంపెనీలు : ఈ తరహా కంపెనీలలో వాటాదారుల ఋణబాధ్యత అపరిమితముగా ఉంటుంది.

10. హోల్డింగ్ కంపెనీ : ఒక కంపెనీ వేరొక కంపెనీలో 51 శాతము వాటాలుండి ఆ కంపెనీ విధి విధానాలను నియంత్రించే అధికారము ఉంటే ఆ కంపెనీని హోల్డింగ్ కంపెనీ అంటారు.

11. అనుబంధ కంపెనీ : ఒక కంపెనీని వేరొక కంపెనీ నిర్వహణను నియంత్రించగలిగినపుడు, నియంత్రించబడే కంపెనీని అనుబంధ కంపెనీ అంటారు.

12. స్వదేశ కంపెనీలు : ఒక కంపెనీ మన దేశపు కంపెనీల చట్టం క్రింద నమోదై, మన దేశములో గాని, విదేశాలలో గాని వ్యాపారాన్ని కొనసాగిస్తే దానిని స్వదేశ కంపెనీ అంటారు.

13. విదేశ కంపెనీలు : వేరే దేశములో నమోదై, మన దేశములో వ్యాపార కేంద్రాన్ని ఏర్పరచుకున్న కంపెనీలను విదేశ కంపెనీలు అంటారు.

14. జాతీయ కంపెనీలు : కంపెనీగా నమోదైన దేశపు సరిహద్దులను దాటకుండా వ్యాపారము చేయు కంపెనీలను జాతీయ కంపెనీలు అంటారు.

15. బహుళ జాతీయ కంపెనీలు : తమ దేశపు సరిహద్దులు దాటి ఇతర దేశాలలో కూడా వ్యాపార కార్యకలాపములను నిర్వర్తించే కంపెనీలను బహుళ జాతీయ కంపెనీలు అంటారు.

AP Inter 1st Year Commerce Study Material Chapter 6 జాయింట్ స్టాక్ కంపెనీ స్థాపన

ప్రశ్న 2.
పబ్లిక్ కంపెనీ లక్షణాలను వివరింపుము.
జవాబు:
కంపెనీల చట్టము 1956 సెక్షన్ 3 ప్రకారము ప్రైవేటు కంపెనీలు కానివన్నీ పబ్లిక్ కంపెనీలే. ఈ కంపెనీని స్థాపించడానికి కనీసము ఏడుగురు సభ్యులుండాలి. గరిష్ట సభ్యుల సంఖ్యపై పరిమితి లేదు. ఈ కంపెనీలు వాటాలను ప్రజలకు అమ్మవచ్చును. అందుకోసము ప్రజలకు పరిచయ పత్రాన్ని జారీచేయవచ్చును. సభ్యులు (వాటాదారులు) తమ వాటాలను తేలికగా బదిలీ చేసుకొనవచ్చును. ఈ కంపెనీ వ్యాపారాన్ని ప్రారంభించవలెనంటే రిజిస్ట్రారు నుంచి వ్యాపార ప్రారంభ ధృవపత్రాన్ని తప్పనిసరిగా పొందవలెను. ఈ కంపెనీల కనీసపు చెల్లింపు మూలధనము 5,00,000.

భారీ మొత్తములో మూలధనమును వెచ్చించి పెద్ద తరహా కార్యకలాపాలను చేపట్టే వ్యాపార సంస్థలకు పబ్లిక్ కంపెనీ అనువైనది. ఒక పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ తన పేరు చివర లిమిటెడ్ అనే పదాన్ని ఉపయోగించాలి. స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్, బజాజ్ ఆటోలిమిటెడ్, రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, హిందూస్థాన్ లీవర్ లిమిటెడ్లు పబ్లిక్ కంపెనీలకు ఉదాహరణలు.

 

అతి స్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
కంపెనీ – నిర్వచనం.
జవాబు:
కంపెనీల చట్టము ప్రకారము “అధికార ముద్రతో, పారంపర్యాధికారముతో చట్టము సృష్టించిన కల్పిత వ్యక్తిత్వముతో రిజిస్టర్ అయిన స్వచ్ఛంద సంస్థ”.
ప్రధాన న్యాయాధికారి కంపెనీలను ఈ విధముగా నిర్వచించినాడు. “న్యాయశాస్త్ర దృష్టిలో అదృశ్యముగా కంటికి కనిపించకుండా జీవించే కల్పిత మానవుడు. కేవలము న్యాయశాస్త్ర సృష్టి వలన ఏర్పడినది. కాబట్టి రాజ్యాంగము నిర్దేశించిన ధర్మాలే ఉంటాయి. ఆ ధర్మాలలో అతిముఖ్యమైనవి శాశ్వతత్వము, వ్యక్తిత్వము.”

ప్రశ్న 2.
ప్రభుత్వ కంపెనీ
జవాబు:
కంపెనీల చట్టము 1956 సెక్షన్ 617 ప్రకారము ఏ రిజిష్టరు అయిన కంపెనీలోనైనా కేంద్రప్రభుత్వానికి లేదా రాష్ట్ర ప్రభుత్వానికి లేదా రెండింటికి చెల్లించిన మూలధనములో 51 శాతమునకు ఎక్కువ వాటాలున్న కంపెనీని ప్రభుత్వ కంపెనీ అంటారు. ప్రభుత్వము పూర్తిగా గాని, పాక్షికముగా గాని యాజమాన్యాన్ని నిర్వహించవచ్చు. ఉదా : విశాఖ స్టీల్ ప్లాంటు, భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్.

AP Inter 1st Year Commerce Study Material Chapter 6 జాయింట్ స్టాక్ కంపెనీ స్థాపన

ప్రశ్న 3.
శాసనాత్మక కంపెనీ
జవాబు:
ప్రజాశ్రేయస్సు దృష్ట్యా లోక్సభలోనూ, శాసనసభలోను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక శాసనము చేసి కంపెనీలను ఏర్పాటుచేస్తాయి. ఇలాంటి కంపెనీలను ప్రత్యేక శాసనాల ద్వారా ఏర్పరచిన కంపెనీలు లేదా శాసనాత్మక కంపెనీలు అంటారు. ఉదా : రిజర్వ్ బ్యాంక్, స్టేట్ బ్యాంక్, ఎయిర్ ఇండియా లిమిటెడ్, జీవిత భీమా కార్పొరేషన్, పారిశ్రామిక ద్రవ్య సహాయ సంస్థ మొదలైనవి.

AP Inter 1st Year Commerce Study Material Chapter 1 వ్యాపార భావన

Andhra Pradesh BIEAP AP Inter 1st Year Commerce Study Material 1st Lesson వ్యాపార భావన Textbook Questions and Answers.

AP Inter 1st Year Commerce Study Material 1st Lesson వ్యాపార భావన

వ్యాసరూప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
వ్యాపారాన్ని నిర్వచించండి. వ్యాపార లక్షణాలను తెలపండి.
జవాబు:
“వస్తువుల కొనుగోలు, అమ్మకాల ప్రక్రియ ద్వారా సంపదను ఉత్పత్తిచేయడానికి లేదా ఆర్జించడానికి మళ్ళించిన మానవ యత్నము వ్యాపారము అని” హాని నిర్వచించినాడు.
“ప్రయివేటు లాభార్జనాపేక్షతో సంఘమునకు వస్తుసేవలను అందించడానికి స్థాపించి, నిర్వహించే సంస్థ వ్యాపారమని” వీలర్ చెప్పినాడు.

“వస్తువుల ఉత్పత్తి మరియు అమ్మకాలకు సంబంధించిన అన్ని వ్యాపకాలు వ్యాపార కార్యకలాపములే” అని స్పీగల్ నిర్వచించినాడు.

పైన చెప్పబడిన నిర్వచనాలను విశ్లేషించగా వ్యాపారానికి క్రింది లక్షణాలు ఉంటాయి.
1) ఆర్థిక కార్యకలాపాలు: వ్యాపారములో ఆర్థిక కార్యకలాపాలు మాత్రమే ఇమిడి ఉంటాయి. వస్తూత్పత్తి, తయారైన వస్తువుల పంపిణీ మరియు సేవలకు సంబంధించిన కార్యకలాపములే ఆర్థిక కార్యకలాపములు. ఆర్థిక ప్రయోజనాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ కార్యకలాపాలను నిర్వహిస్తారు. ఈ ఆర్థిక ప్రయోజనమే లాభార్జన.

2) వస్తుసేవల ఉత్పత్తి లేదా కొనుగోలు: ప్రతి వ్యాపార సంస్థ వస్తుసేవలను లాభానికి అమ్మకము చేసే ఉద్దేశ్యముతో ఉత్పత్తి లేదా కొనుగోలు చేస్తుంది. వస్తువులు వినియోగదారు వస్తువులు కావచ్చు లేదా ఉత్పత్తిదారు వస్తువులు కావచ్చు. వినియోగదారు వస్తువులు అయిన కాఫీ, చెప్పులు, రొట్టె మొదలైనవి. వినియోగదారుల ప్రత్యక్ష వినియోగానికి అందజేస్తారు. ఉత్పత్తిదారు వస్తువులను వినియోగదారు వస్తువులు లేదా మూలధన వస్తువుల తయారీకి ఉపయోగిస్తారు. ఉదా: ముడిపదార్థాలు, యంత్రాలు మొదలైనవి. రవాణా, గిడ్డంగి వసతి మొదలైన సేవలు కంటికి కనిపించని వస్తువులుగా పరిగణిస్తారు.

AP Inter 1st Year Commerce Study Material Chapter 1 వ్యాపార భావన

3) వస్తు సేవల వినిమయము: వ్యాపారములో లాభార్జనాపేక్షతో వస్తుసేవల వినిమయము జరుగుతుంది. స్వవినియోగానికి వస్తుసేవల ఉత్పత్తి లేదా కొనుగోలు చేస్తే అది వ్యాపారమనిపించుకోదు. తిరిగి అమ్మే ఉద్దేశ్యముతో వస్తువులను కొనుగోలు చేయాలి. ఒక వ్యక్తి తన గృహములో భోజనము వండితే అది వ్యాపారము కాదు. కాని అదే వ్యక్తి ఒక హోటలు నడిపి వండితే అది వ్యాపారము. కారణము అతడు తన సేవలను ద్రవ్యమునకు వినిమయం చేస్తున్నాడు.

4) వ్యాపార వ్యవహారాలు అవిచ్ఛిన్నముగా కొనసాగుట: వ్యాపార కార్యకలాపాలు నిరాటంకముగా, అవిచ్ఛిన్నముగా కొనసాగవలెనన్నది వ్యాపారానికి మరొక లక్షణము. ఒక పర్యాయము లేదా అప్పుడప్పుడు వస్తువులను అమ్మితే అది వ్యాపారమనిపించుకొనదు. ఒక వ్యక్తి కౌ 10,000 లకు ఒక టి.వి.ని కొని శ 12,000 లకు అమ్మితే అది వ్యాపారము కాదు. అయితే ఆ వ్యక్తి కొన్ని టి.వి. లను కొని, దుకాణములో నిల్వ ఉంచి, వాటిని నిరంతరము అమ్ముతూ ఉంటే అది వ్యాపారము అవుతుంది.

5) లాభాపేక్ష: వ్యాపారములో లాభాపేక్ష అనేది ముఖ్య ఉద్దేశ్యము. వ్యాపారములో నిలబడడానికి, వ్యాపార వృద్ధికి లాభాలు అవసరము. కాని లాభాలను న్యాయబద్ధముగా, సక్రమమైన రీతిలో ఆర్జించాలి. లాభాలను సంపాదించే ఉద్దేశ్యముతో వ్యాపారస్తుడు సంఘమును దోపిడీ చేయకూడదు. అధిక ధరలతో వినియోగదారులను పీడించకూడదు.

6) రిస్క్ మరియు అనిశ్చయత: రాబడిలో అనిశ్చయత అనేది వ్యాపార లక్షణము. ఏ కారకాల మీదనయితే వ్యాపారము ఆధారపడి ఉంటుందో వాటికి నిశ్చయత ఉండదు కాబట్టి వ్యాపార అవకాశాలు కూడా నిశ్చయముగా ఉండవు. డిమాండులో మార్పులు, ఉద్యోగుల సమ్మె, వరదలు, యుద్ధము, ధరలు పడిపోవుట మొదలైనవి సంభవించ “వచ్చును. సరైన అంచనాలు మరియు భీమా ద్వారా వ్యాపారస్తుడు నష్టభయాన్ని తగ్గించుకోగలడు. కాని పూర్తిగా నివారించలేడు.

7) ప్రయోజనాల సృష్టి: వినియోగదారుల అభిరుచులు, అపేక్షితాలకు అనుగుణముగా వస్తువులను తయారుచేసి పంపిణీ చేస్తారు. వినియోగదారుల అవసరాల నిమిత్తము వ్యాపారము వస్తువులకు అనేక ప్రయోజనాలను కలుగజేస్తుంది. ఆ ప్రయోజనము ఆకార ప్రయోజనము, స్థల ప్రయోజనము, కాల ప్రయోజనము కావచ్చు. ముడి పదార్థాలను, తయారీ వస్తువులుగా మార్చడం ద్వారా ఆకార ప్రయోజనాలను, తయారైన వస్తువులను ఉత్పత్తి స్థలాల నుంచి వినియోగదారుల ప్రాంతాలకు రవాణా చేసి స్థల ప్రయోజనాలను, ఉత్పత్తులను గిడ్డంగులలో నిల్వ ఉంచి వినియోగదారులకు కావలసిన వెంటనే సరఫరా చేసి కాల ప్రయోజనాలను వ్యాపారము కలుగజేస్తుంది.

8) వ్యాపారము కళ మరియు శాస్త్రము: వ్యాపారమునకు వ్యక్తిగత నైపుణ్యము, అనుభవము అవసరము కాబట్టి దీనిని కళగా భావిస్తారు. అంతేగాక వ్యాపారము కొన్ని సూత్రాలు, చట్టాలపై ఆధారపడుతుంది. కాబట్టి శాస్త్రముగా కూడా పరిగణిస్తారు.

ప్రశ్న 2.
వ్యాపార లక్ష్యాలను వివరించండి.
జవాబు:
వ్యాపార ధ్యేయాలను ఆర్థిక ధ్యేయాలు, సాంఘిక ధ్యేయాలు, మానవ ధ్యేయాలు, జాతీయ ధ్యేయాలుగా విభజించవచ్చును.

ఆర్థిక ధ్యేయాలు: వ్యాపారము యొక్క ఆర్థిక ధ్యేయాలు దిగువ వివరించబడినవి.
1) లాభార్జన: వ్యక్తులు వ్యాపారములో ప్రవేశించడానికి ముఖ్య కారణము లాభార్జన. వ్యాపారము నడుపుటకు లాభమే ముఖ్యమైన ప్రోత్సాహకము. ఒక వ్యాపారము నిలబడవలెనంటే లాభాలు ఆవశ్యకము. లాభాలు వ్యాపార సంస్థ ఉనికికే కాక, వ్యాపార వృద్ధికి, విస్తరణకు కూడా అవసరము.

2) వినియోగదారులను పొందుట: వినియోగదారులు తమ అవసరాలను, కోర్కెలను తీర్చుకొనడానికి వస్తు సేవలను కొనుగోలుచేసి, చెల్లించడానికి తగినంత మంది వినియోగదారులు ఉన్నప్పుడే వ్యాపారము లాభాలను ఆర్జించ గలదు. వినియోగదారులకు నాణ్యమైన వస్తువులను, సమంజసమైన ధరలకు అందించవలెను. కాబట్టి వినియోగదారులను పొందటమే ముఖ్యమైన ఆర్థిక ధ్యేయము.

AP Inter 1st Year Commerce Study Material Chapter 1 వ్యాపార భావన

3) సాంకేతిక అభివృద్ధి: ప్రస్తుత పోటీ ప్రపంచములో ప్రతి సంస్థ నాణ్యమైన సరుకును సమంజసమైన ధరలకు అమ్మడానికి ప్రయత్నము చేస్తుంది. వ్యాపార సంస్థ విజయవంతము కావలెనంటే కొత్త డిజైన్లు, మంచి యంత్రాలు, కొత్త కొత్త వెరైటీలు అవసరము. అంతేగాక నూతన సాంకేతిక పద్ధతులను ఉపయోగించి ఉత్పత్తిని పెంచుట ద్వారా వ్యయాలను తగ్గించుకోవచ్చును.

సాంఘిక ధ్యేయాలు: హెన్రీ ఫోర్డ్ ఉద్దేశ్యము ప్రకారము వ్యాపారము యొక్క ప్రాథమిక ధ్యేయము సేవలనందించుట మరియు అనుబంధ ధ్యేయము లాభాలను సంపాదించుట. సాంఘిక ధ్యేయాలను దిగువ విధముగా చెప్పవచ్చును.
1) నాణ్యమైన సరుకు అందుబాటులో ఉంచి సరఫరా చేయుట: సంఘానికి అవసరమయ్యే వస్తువులను వ్యాపారము అందజేయవలెను. నాణ్యమైన సరుకు, సరసమైన ధరలకు అందజేయుట వ్యాపారము యొక్క సాంఘిక బాధ్యత.

2) ఉద్యోగులకు న్యాయమైన ప్రతిఫలము: వేతనాలు, జీతాలకు అదనముగా లాభాలలో సమంజసమైన భాగాన్ని ఉద్యోగులకు బోనస్ రూపములో పంపిణీ చేయాలి. పనిచేయడానికి సుముఖమైన వాతావరణాన్ని ఏర్పాటుచేయుట యజమాని యొక్క విధి.

3) ఎక్కువ ఉద్యోగావకాశాలు కల్పించుట: వ్యాపారాన్ని విస్తరించుట ద్వారా ఎక్కువ ఉద్యోగ అవకాశాలు కల్పించి, సంఘానికి సేవ చేయవచ్చు. సంపూర్ణ ఉద్యోగిత అనేది సంఘానికి చేసే ముఖ్యమైన సేవగా పేర్కొనవచ్చు.

4) ప్రభుత్వానికి సహకరించుట: జాతీయ ధ్యేయాలను సాధించుటకు వ్యాపారము ప్రభుత్వముతో సహకరించవలెను. వ్యాపారము పన్నులను సకాలములో చెల్లించాలి. ప్రజాహిత సంక్షేమ కార్యములకు, ప్రభుత్వానికి ఇది రాబడిని ఏర్పరుస్తుంది.

5) సాంఘిక సంక్షేమము: వ్యాపారము సాంఘిక, కల్చరల్ మరియు మతపరమైన వ్యవస్థలకు సహాయము చేయాలి. ఇవి స్కూళ్ళు, ఆసుపత్రులు, లైబ్రరీలు, వ్యాయామ సంఘాలు, ప్రయోగ సంస్థలను నిర్మిస్తాయి.

మానవతా ధ్యేయాలు: మానవతా ధ్యేయాలు పనివారి బాగోగులు, వినియోగదారులు, వాటాదారుల సంతృప్తితో ముడిపడి ఉన్నది..
1) యాజమాన్యము, పనివారి మధ్య సహకారము: పనిచేసేవారు కూడా మానవులేనని యాజమాన్యము గుర్తించాలి. ఉద్యోగుల కృషి ద్వారానే లాభదాయకత పెరుగుతుంది. కాబట్టి, వారుపడ్డ కష్టానికి ప్రతిఫలమును అందించాలి.

2) పనివారి సంక్షేమము: పనివారికి భౌతిక అవసరాలు, గుర్తింపు, గౌరవాన్ని కాపాడుట మరియు పనిచేయడానికి తగిన వాతావరణాన్ని కల్పించుట ద్వారా వారు కష్టపడి పనిచేస్తారు. పనివారి ఆరోగ్యము, రక్షణ మరియు సాంఘిక భద్రతకు తగిన ఏర్పాట్లు చేయవలెను.

3) మానవ వనరుల అభివృద్ధి: మానవ వనరులు వ్యాపారములో విలువగల ఆస్తి. వాటిని అభివృద్ధిచేయుట ద్వారా వ్యాపార వృద్ధి జరుగుతుంది. పనివారికి శిక్షణ, వైఖరి, నైపుణ్యాల అభివృద్ధికి వర్క్షాపులు నిర్వహించుట ద్వారా ఇది సాధ్యపడుతుంది.

4) పనివారికి యాజమాన్యములో చోటు: పనివారిని నిర్ణయాలు తీసుకునే ప్రక్రియలో పాల్గొనేటట్లు చేయుట ద్వారా వారి వ్యక్తిగత వికాసము అభివృద్ధి చెందుతుంది.

జాతీయ ధ్యేయాలు: వ్యాపారము యొక్క జాతీయ ధ్యేయాలను దిగువ విధముగా వివరించవచ్చును.
1) జాతీయ అవసరాలు: వ్యాపారము వస్తువులను జాతీయ అవసరాలు, ఆసక్తులను దృష్టిలో ఉంచుకొని ఉత్పత్తి చేయవలెను. అరుదుగా లభ్యమయ్యే సహజ వనరుల వృథాను తగ్గించవలెను.

AP Inter 1st Year Commerce Study Material Chapter 1 వ్యాపార భావన

2) వనరుల అభిలషణీయమైన వినియోగము: వనరుల సక్రమమైన కేటాయింపు, అరుదుగా లభ్యమయ్యే వనరుల అభిలషణీయమైన వినియోగము ద్వారా దేశము త్వరితగతిన ఆర్థికాభివృద్ధిని సాధించగలదు.

3) వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి: అన్ని ప్రాంతాలు సమానముగా అభివృద్ధి చెందవలెనంటే పరిశ్రమలను వెనుకబడిన ప్రాంతాలలో స్థాపించవలెను. దీనివలన ఆ ప్రాంతములో జీవన ప్రమాణము పెరగడానికి తోడ్పడుతుంది.

4).ఎగుమతులను పెంచుట: ఎగుమతులను పెంచడానికి, దిగుమతులపై ఆధారపడుట తగ్గించడానికి వ్యాపారము ప్రభుత్వానికి సహాయపడవలెను.

5) చిన్నతరహా పరిశ్రమల అభివృద్ధి: ఉద్యోగ అవకాశాలు కల్పించుటకు, పెద్దతరహా పరిశ్రమలకు అవసరమయ్యే ఇన్పుట్లను ఏర్పాటు చేయడానికి చిన్నతరహా పరిశ్రమల ఆవశ్యకత ఎంతైనా ఉన్నది.

ప్రశ్న 3.
వ్యాపారం సామాజిక బాధ్యతను చర్చించండి.
జవాబు:
ప్రతి వ్యాపార సంస్థ సమాజములో తన కార్యకలాపాలను నిర్వహిస్తుంది. సమాజము యొక్క వనరులను ఉపయోగించి సమాజముపైన ఆధారపడుతుంది. దీని వలన సమాజము యొక్క సంక్షేమాన్ని చూడవలసిన బాధ్యత వ్యాపారము మీదనే ఉంటుంది. అందువలన వ్యాపార సంస్థ చేపట్టే అన్ని కార్యకలాపాలు సమాజము యొక్క ఆసక్తులను పరిరక్షించే విధముగా ఉండవలెను. అందువలన ఏ సమాజములో అయితే ఒక వ్యాపారము తన కార్యకలాపాలను నిర్వహిస్తుందో ఆ సమాజ శ్రేయస్సును కాపాడటానికి వ్యాపారానికి ఉండే బాధ్యతను సామాజిక బాధ్యతగా చెప్పుకోవచ్చు.

సామాజిక బాధ్యత భావన: వ్యక్తులు లాభాన్ని ఆర్జించటానికి వ్యాపారాన్ని నిర్వహిస్తారు. వ్యాపారము యొక్క ధ్యేయము కేవలము లాభాలను ఆర్జించటమే కాదు. వ్యాపార సంస్థ కూడా సమాజంలో భాగమే కాబట్టి అనేక సాంఘిక విధులను కూడా నిర్వర్తించవలసి ఉంటుంది. వ్యాపారస్తుడు సమాజానికి చెడు చేసే కార్యకలాపాలను చేపట్టకూడదు. అందువలన సామాజిక బాధ్యత భావన ఒక వ్యాపారస్తుడిని లాభాలను ఆర్జించటానికి వస్తువులకు కృత్రిమ కొరత కల్పించడము, దొంగ వ్యాపారము, కల్తీచేయుట, పన్నులు ఎగగొట్టుట మొదలైన వాటిని నిరుత్సాహపరుస్తుంది. లాభాలను ఆర్జించటానికి సక్రమమైన రీతిలో వ్యాపారాన్ని నిర్వహించుట, ఉద్యోగస్తులు పనిచేయడానికి మంచి వాతావరణాన్ని ఏర్పరచుట, వినియోగదారులకు నాణ్యమైన వస్తువులను అందించుట, వాతావరణ కాలుష్యాన్ని నివారించుట, జాతీయ వనరులను కాపాడుట మొదలైన వాటికి తోడ్పడేటట్లు చేస్తుంది.

వివిధ ఆసక్తిగల వర్గాలకు గల బాధ్యత: వ్యాపారము యజమానులు, ఉద్యోగస్తులు, సరఫరాదారులు, వినియోగదారులు, ప్రభుత్వము మరియు సమాజముతో వ్యవహరిస్తుంది. వ్యాపారము చేపట్టి ప్రతి కార్యకలాపము పై వర్గాలకు ప్రత్యక్షముగా లేదా పరోక్షముగా ప్రభావము ఉంటుంది. కాబట్టి వారిని ఆసక్తిగల వర్గాలుగా వర్ణించినారు. వివిధ వర్గాలకు సామాజిక బాధ్యతలు:
1) యజమానులకు: వ్యాపారము యొక్క యజమానులు వ్యాపారమునకు అవసరమయ్యే మూలధనాన్ని సమకూర్చి నష్టభయాన్ని స్వీకరిస్తారు.
యజమానికి, వ్యాపారానికి గల బాధ్యతలు:

  • పెట్టుబడులపై న్యాయమైన ఆర్జనలను డివిడెండ్ల రూపములో పంచడం.
  • మూలధనానికి భద్రత కల్పించి, మూలధన వృద్ధికి తోడ్పడటం.
  • వ్యాపారాన్ని సమర్థవంతముగా నిర్వహించుట.

AP Inter 1st Year Commerce Study Material Chapter 1 వ్యాపార భావన

2) ఉద్యోగులకు: వ్యాపార సంస్థ భవిష్యత్తు, అందులో పనిచేసే ఉద్యోగస్తుల శక్తి, సామర్థ్యాలపై ఆధారపడి ఉంటుంది. సంస్థలోని ఉద్యోగులపట్ల వ్యాపారానికి వారి ఆసక్తులను పరిరక్షించవలసిన సామాజిక బాధ్యత ఉన్నది.
ఉద్యోగులపట్ల వ్యాపారానికి గల బాధ్యతలు:

  • వేతనాలు, అలెవెన్సులు వారికి చెల్లించడము.
  • పనిచేయడానికి మంచి వాతావరణాన్ని కల్పించి, వారి శ్రేయస్సుకు తోడ్పడుట.
  • తగిన శిక్షణ ద్వారా వారి నైపుణ్యాన్ని, సామర్థ్యాన్ని పెంచుట.
  • ఉద్యోగ భద్రత, సామాజిక బాధ్యత పథకాలు పెన్షన్, పదవీ విరమణ సౌకర్యాలు, గ్రూపు భీమాలు కల్పించుట.

3) సరఫరాదారులకు: సంస్థ ఉత్పత్తికి అవసరమయ్యే ముడిపదార్థాలను, ఇతర మెటీరియల్స్ను వీరు సప్లయి చేస్తారు.
వ్యాపారానికి వారిపైగల బాధ్యతలు:

  • సకాలములో డబ్బును చెల్లించడము.
  • న్యాయమైన షరతులు ఏర్పాటు చేయుట.
  • సమంజసమైన పరపతి కాలాన్ని వినియోగించుకొనుట.

4) వినియోగదారులకు: వ్యాపార సంస్థ మనుగడను సాగించవలెనంటే వారికి ఈ క్రింది వసతులు సమకూర్చ వలెను. వినియోగదారుని పట్ల వ్యాపారానికి గల బాధ్యతలు:

  • మంచి నాణ్యతగల వస్తుసేవలను అందించవలెను.
  • వస్తువులను సకాలములో డెలివరీ చేయవలెను.
  • తక్కువ ధరలకు వస్తువులను అమ్మవలెను..
  • అమ్మకానంతరము సేవలు అందించుట.
  • తక్కువ తూకము, వస్తువులలో కల్తీ మొదలైన అనుచిత చర్యలకు పాల్పడరాదు.

5) ప్రభుత్వానికి: వ్యాపారము ప్రభుత్వము రూపొందించిన నియమ నిబంధనలకు అనుగుణముగా నిర్వహించవలెను.
ప్రభుత్వముపట్ల వ్యాపారానికి బాధ్యతలు:

  • పన్నులు, డ్యూటీలు నిజాయితీగా సకాలములో చెల్లించుట.
  • ప్రభుత్వ నిబంధనలకు అనుగుణముగా సంస్థలను స్థాపించుట.
  • వాతావరణ కాలుష్యాన్ని నివారించే చర్యలను పాటించుట.
  • అనుచిత కార్యకలాపాలకు పాల్పడకుండా ఉండటము.

6) సమాజానికి: వ్యాపారము సమాజములో ఒక భాగము అయినందున సమాజములోని ఇతర సభ్యులతో సంబంధాలను ఏర్పరచుకొనవలెను.
వ్యాపారానికి సమాజముపట్ల బాధ్యతలు:

  • సమాజములో బలహీన, వెనుకబడిన వర్గాలకు సహాయం చేయడం.
  • ఉద్యోగ అవకాశాలను కల్పించడం.
  • వాతావరణ పరిరక్షణ.
  • ప్రకృతి వనరులను సక్రమముగా వినియోగించుట.
  • క్రీడలు, సాంఘిక, సాంస్కృతిక కార్యకలాపాలను ప్రోత్సహించడం.

ప్రశ్న 4.
ఆర్థిక కార్యకలాపాలను వర్గీకరించి, ఒక్కొక్క రకాన్ని వర్ణించండి.
జవాబు:
మానవులు తమ కోర్కెలను తీర్చుకోవడానికి ఏదో ఒక వ్యాపకములో నిమగ్నమై ఉంటారు. కోర్కెల స్వభావాన్నిబట్టి మానవ కార్యకలాపాలను ఆర్థిక, ఆర్థికేతర కార్యకలాపాలుగా విభజించవచ్చు. ద్రవ్యార్జన కోసము కాని, జీవనోపాధిని సంపాదించడానికి కాని మానవుడు చేయు పనులను ఆర్థిక సంబంధమైన కార్యకలాపాలు అంటారు. ఇవి వస్తుసేవల ఉత్పత్తి, వినిమయము మరియు పంపిణీతో సంబంధము కలిగి ఉంటాయి. ప్రేమాభిమానాలతోగాని, సాంఘిక బాధ్యతతో గాని, దేశభక్తితో మానవుడు చేసే పనులను ఆర్థికేతర కార్యకలాపాలు అనవచ్చు. ఈ కార్యకలాపాల ఉద్దేశ్యము సేవలను అందించి తృప్తి పొందడమేకాని లాభార్జన కాదు.

AP Inter 1st Year Commerce Study Material Chapter 1 వ్యాపార భావన

ఆర్థిక కార్యకలాపాల వర్గీకరణ: ఆర్థిక కార్యకలాపాలను మరల మూడు రకాలుగా విభజించవచ్చును. అవి:

  1. వ్యాపారము
  2. వృత్తి
  3. ఉద్యోగము

1) వ్యాపారము: వ్యాపారము ఆర్థిక సంబంధమైన వ్యాపకము. ద్రవ్యార్జన మరియు సంపాదన కూడబెట్టుట అనే ఉద్దేశాలతో వస్తుసేవలను ఉత్పత్తిచేసి పంపిణీ చేసే ప్రక్రియ వ్యాపారము. వ్యాపారము చేయుటలో ప్రధాన ఉద్దేశ్యము లాభాన్ని సంపాదించడమే. వ్యాపారము అనే పదానికి అర్థము ఏదో ఒక పనిలో నిమగ్నమై ఉండుట. ప్రతి వ్యక్తి ఏదో ఒక వ్యాపకాన్ని చేపడతాడు. రైతు పొలములో పనిచేస్తాడు. పనివాడు ఫ్యాక్టరీలో పనిచేస్తాడు. గుమాస్తా ఆఫీసులో పనిచేస్తాడు. ఉపాధ్యాయుడు క్లాసులో పాఠాలను బోధిస్తాడు. అమ్మకాల ప్రతినిధి వస్తువుల అమ్మకాలను చేస్తాడు. ఉద్యమదారుడు ఫ్యాక్టరీని నడుపుతాడు. వీరందరి ప్రధాన ఉద్దేశ్యము జీవనోపాధికై ఏదో ఒక పనిని నిర్వహించడమే.

2) వృత్తి: ప్రత్యేకమైన విజ్ఞానము, విద్య, శిక్షణలు ప్రాతిపదికగా ప్రత్యేక స్వభావము కలిగిన సేవలను వ్యక్తిగతముగా అందజేసే వ్యాపకాన్ని వృత్తి అనవచ్చు. డాక్టర్లు, లాయర్లు, ఛార్టర్డ్ అకౌంటెంట్లు మొదలైనవారు అందజేయు. సేవలు వృత్తి కిందకు వస్తాయి. సాధారణముగా ఒక్కొక్క వృత్తికి ఒక్కొక్క సంఘము ఉంటుంది. ఇండియన్ మెడికల్ కౌన్సిల్ అనేది వైద్యవృత్తికి సంబంధించిన సంఘము. బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అనేది లాయర్లకు సంబంధించిన సంఘము.

ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా అనేది అకౌంటెంట్లకు సంబంధించిన వృత్తిపరమైన సంఘము. ఒక వృత్తిని చేపట్టుటకు వ్యక్తికి ఉండవలసిన విద్యార్హతలు ఏమిటి, అతనికి ఎటువంటి శిక్షణ ఉండాలి, ఆ వృత్తిలో పాటించవలసిన నియమాలు మొదలైన విషయాలను వృత్తి సంఘాలు నిర్ణయిస్తాయి. ఒక వృత్తిని చేపట్టే వ్యక్తి దానికి సంబంధించిన సంఘములో సభ్యుడై ఉండాలి. దాని నియమ నిబంధనలను తూ.చ తప్పకుండా పాటించాలి. వృత్తి సంబంధమైన సేవలను అందజేసినందుకు ప్రతిఫలముగా కొంత సొమ్మును వసూలు చేయవచ్చును.

3) ఉద్యోగము: ఒక ఒప్పందము ప్రకారముగాని లేదా సేవా నియమాల ప్రకారముగాని ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తికి ఒక పనిని అప్పగించినట్లయితే అది ఉద్యోగము క్రిందకు వస్తుంది. పని అప్పగించిన వ్యక్తిని యజమాని అని, ఎవరికయితే పని అప్పగించబడినదో ఆ వ్యక్తిని ఉద్యోగి అని అంటారు. ఉద్యోగి యజమాని యొక్క ఆదేశాల ప్రకారము పనిని చేస్తాడు. తన సేవలను అందించినందుకు ఉద్యోగి, యజమాని నుంచి కొంత ప్రతిఫలాన్ని పొందుతాడు. ఆ ప్రతిఫలాన్ని వేతనము లేదా జీతము అంటారు. కొన్ని సమయాలలో వృత్తిని చేపట్టినవారు కూడ ఉద్యోగ కాంట్రాక్టు కింద పనిచేయవచ్చును. ఛార్టర్డ్ అకౌంటెంట్లను కంపెనీ నియమించవచ్చును. ప్రభుత్వ విభాగములోగాని, ప్రయివేటు వ్యవస్థలోగాని సేవలను అందించవచ్చును.

స్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
వ్యాపార లక్ష్యాలు.
జవాబు:
వ్యాపార ధ్యేయాలను ఆర్థిక, సాంఘిక, మానవత మరియు జాతీయ ధ్యేయాలుగా విభజించవచ్చును.
1) ఆర్ధిక ధ్యేయాలు:

  1. లాభార్జన.
  2. ఖాతాదారుల సృష్టి.
  3. సాంకేతిక అభివృద్ధి.

2) సాంఘిక ధ్యేయాలు:

  1. నాణ్యమైన సరుకు అందుబాటులో ఉంచి సరఫరా చేయుట.
  2. ఉద్యోగులకు న్యాయమైన ప్రతిఫలము.
  3. ఉద్యోగ అవకాశాల కల్పన.
  4. ప్రభుత్వానికి సహకారము.
  5. సాంఘిక సంక్షేమము.

AP Inter 1st Year Commerce Study Material Chapter 1 వ్యాపార భావన

3) మానవత ధ్యేయాలు:

  1. యాజమాన్యానికి, పనివారికి మధ్య సహకారము.
  2. పనివారి సంక్షేమము.
  3. మానవ వనరుల అభివృద్ధి.
  4. యాజమాన్యములో పనివారు పాల్గొనుట.

4) జాతీయ ధ్యేయాలు:

  1. జాతీయ అవసరాలకు అనుగుణముగా వస్తువుల ఉత్పత్తి.
  2. సహజ వనరుల అభిలషణీయమైన వినియోగము.
  3. వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి.
  4. చిన్నతరహా పరిశ్రమల అభివృద్ధి.
  5. ఎగుమతులను పెంచి, దిగుమతులను తగ్గించుట.

ప్రశ్న 2.
సామాజిక లక్ష్యాలు.
జవాబు:
హెన్రీ ఫోర్డ్ ఉద్దేశ్యము ప్రకారము వ్యాపారము యొక్క ప్రాధమిక ధ్యేయము సేవలను అందించుట మరియు అనుబంధ ధ్యేయము లాభాలను సంపాదించుట వ్యాపారము యొక్క సామాజిక లక్ష్యాలు.
1) నాణ్యమైన సరుకు అందుబాటులో ఉంచి సరఫరా చేయుట: సంఘానికి అవసరమయ్యే వస్తువులను వ్యాపారము అందజేయవలెను. నాణ్యమైన సరుకు సరసమైన ధరలకు అందజేయుట, వ్యాపారము యొక్క సాంఘిక బాధ్యత.

2) ఉద్యోగులకు న్యాయమైన ప్రతిఫలము వేతనాలు, జీతాలకు అదనముగా లాభాలలో సమంజసమైన భాగాన్ని ఉద్యోగులకు బోనస్ రూపములో పంపిణీ చేయాలి. పని చేయడానికి సుముఖమైన వాతావరణాన్ని ఏర్పాటు
చేయడం యజమాని విధి.

3) ఎక్కువ ఉద్యోగ అవకాశాలు కల్పించుట: వ్యాపారాన్ని విస్తరించుట ద్వారా ఎక్కువ ఉద్యోగ అవకాశాలు కల్పించి సంఘానికి సేవ చేయవచ్చు. సంపూర్ణ ఉద్యోగిత అనేది సంఘానికి చేసే ముఖ్యమైన సేవగా పేర్కొనవచ్చు.

4) ప్రభుత్వానికి సహకరించుట: జాతీయ ధ్యేయాలను సాధించుటకు వ్యాపారము ప్రభుత్వముతో సహకరించ వలెను. వ్యాపారము పన్నులను సకాలములో చెల్లించాలి. ప్రజాహిత సంక్షేమ కార్యాలకు ఇది ప్రభుత్వానికి రాబడిని ఏర్పరుస్తుంది.

5) సాంఘిక సంక్షేమము: వ్యాపారము సాంఘిక, కల్చరల్ మరియు మతపరమైన వ్యవస్థలకు సహాయము చేయాలి. ఇవి స్కూళ్ళు, ఆసుపత్రులు, లైబ్రరీలు, వ్యాయామ సంఘాలు, ప్రయోగశాలలను నిర్మిస్తాయి.

AP Inter 1st Year Commerce Study Material Chapter 1 వ్యాపార భావన

ప్రశ్న 3.
వ్యాపారములో లాభం పాత్ర.
జవాబు:
వ్యాపారములో లాభాపేక్ష ముఖ్యమైనది. లాభాపేక్ష లేని ఏ వ్యాపకమైనా వ్యాపారమనిపించుకోదు. ఒక వ్యాపారస్తుడు తన వ్యాపార కార్యకలాపాల ద్వారా ఎక్కువ లాభాలు గడించడానికి ప్రయత్నిస్తాడు. ఈ ఆసక్తే అతనిని వ్యాపారములో ఉంచుతుంది. అంతేగాక వ్యాపారము కొంతకాలముపాటు కొనసాగటానికి లాభాలు అవసరము. వ్యాపార చక్రాలు, డిమాండులో మార్పులు, ద్రవ్య మార్కెట్లో హెచ్చుతగ్గులు మొదలైన అనిశ్చిత పరిస్థితులు ఎదుర్కొనవలెనంటే లాభాలు అవసరము. ఒక సంస్థ తన మనుగడను సాధించడానికే కాక వ్యాపార విస్తరణకు, బహుళ వస్తువుల ఉత్పత్తికి లాభాలు కావలెను. పెట్టుబడిదారులు తమ పెట్టుబడులపై సముచితమైన ఆర్జన, పనివారికి ఎక్కువ వేతనాలు, ఉద్యమదారులు తిరిగి పెట్టుబడి పెట్టడానికి లాభాలు కావలెను. ఇవన్నీ లాభాలు గడించినపుడే సాధ్యపడతాయి. లాభాపేక్షతో వ్యాపారస్తుడు నాసిరకం వస్తువులను ఎక్కువ ధరలకు అమ్మి వినియోగదారులను దోచుకొనరాదు. ఇందువలన వారి మధ్య సంబంధాలు దెబ్బతింటాయి. నాణ్యమైన వస్తువులు సముచితమైన ధరలకు అందిస్తే వ్యాపారస్తునకు, ఖాతాదారునకు కూడా ప్రయోజనము కలుగుతుంది.

ప్రశ్న 4.
ఆర్థిక కార్యకలాపాల సంక్షిప్త వివరణ.
జవాబు:
వ్యాపార ఆర్థిక కార్యకలాపాలను వ్యాపారము, వృత్తి, ఉద్యోగము అని మూడు రకాలుగా విభజించవచ్చును. వ్యాపారము: సాహిత్యపరముగా వ్యాపారము అంటే నిరంతరము శ్రమిస్తూ ఉండే స్థితి. ప్రతి వ్యక్తి ఏదో ఒక పనిచేస్తూ నిమగ్నమై ఉంటాడు. లాభార్జన ధ్యేయంతో చేపట్టే వ్యాపకమే వ్యాపారము. వ్యాపార కార్యకలాపాలు వస్తు సేవల ఉత్పత్తి లేదా వినిమయం లాభార్జన లేదా జీవనోపాధి కోసము జరుగుతాయి.

వృత్తి: ప్రత్యేకమైన విజ్ఞానము, విద్య, శిక్షణల ప్రాతిపదికగా ప్రత్యేక స్వభావము కలిగిన సేవలను వ్యక్తిగతముగా అందజేసే వ్యాపకాన్ని వృత్తి అంటారు. వృత్తి సంబంధమైన సేవలను అందజేసినందుకు ప్రతిఫలముగా కొంత సొమ్మును వసూలు చేయవచ్చును. ఉదా: ఒక డాక్టరు వైద్యశాస్త్రంలో తనకున్న పరిజ్ఞానము ద్వారా పేషెంట్లకు సహాయము చేసి ఫీజును వసూలు చేయవచ్చును.

ఉద్యోగము: ఒక ఒప్పందము ప్రకారముగాని లేదా సేవా నియమాల ప్రకారము ఒక వ్యక్తి మరొక వ్యక్తికి పనిని అప్పగించినట్లయితే అది ఉద్యోగము క్రిందకు వస్తుంది. పనిని అప్పగించిన వ్యక్తిని యజమాని అని, పని స్వీకరించిన వ్యక్తిని ఉద్యోగి అని అంటారు. ఉద్యోగి యజమాని ఆదేశాల ప్రకారం పని చేసి కొంత ప్రతిఫలాన్ని జీతము రూపములో పొందుతాడు.

అతి స్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
వ్యాపారమును నిర్వచించండి.
జవాబు:
సాహిత్యపరముగా వ్యాపారము అంటే నిరంతరము శ్రమిస్తూ ఉండే స్థితి. వ్యాపారాన్ని హాని దిగువ విధముగా నిర్వచించినాడు. “వస్తువు కొనుగోలు, అమ్మకాల ప్రక్రియ ద్వారా సంపదను ఉత్పత్తి చేయడానికి లేదా ఆర్జించడానికి మళ్ళించిన మానవయత్నము వ్యాపారము”. వీలర్ అభిప్రాయము ప్రకారము “ప్రయివేటు లాభార్జనాపేక్షతో సంఘమునకు వస్తుసేవలను అందించడానికి స్థాపించి, నిర్వహించే సంస్థ వ్యాపారము”.

AP Inter 1st Year Commerce Study Material Chapter 1 వ్యాపార భావన

ప్రశ్న 2.
వృత్తి అంటే ఏమిటి ? [A.P & T.S. Mar. ’15]
జవాబు:
ప్రత్యేకమైన విజ్ఞానము, విద్య, శిక్షణల ప్రాతిపదికగా ప్రత్యేక స్వభావము కలిగిన సేవలను వ్యక్తిగతముగా అందజేసే వ్యాపకాన్ని వృత్తి అంటారు. వృత్తి సంబంధమైన సేవలను అందజేసినందుకు ప్రతిఫలముగా కొంత సొమ్మును వసూలు చేయవచ్చును. ఉదా: ఒక డాక్టరు వైద్యశాస్త్రంలో తనకున్న పరిజ్ఞానము ద్వారా పేషెంటుకు సహాయము చేసి ఫీజును వసూలు చేయవచ్చును.

ప్రశ్న 3.
ఉద్యోగము అంటే ఏమిటి ?
జవాబు:
ఒక ఒప్పందము ప్రకారముగాని లేదా సేవా నియమాల ప్రకారముగాని ఒక వ్యక్తి మరొక వ్యక్తికి పనిని అప్పగించినట్లయితే అది ఉద్యోగము క్రిందకు వస్తుంది. పనిని అప్పగించిన వ్యక్తిని యజమాని అని, పని స్వీకరించిన వ్యక్తిని ఉద్యోగి అని అంటారు. ఉద్యోగి యజమాని ఆదేశాల ప్రకారం పని చేసి ప్రతిఫలాన్ని జీతము రూపములో
పొందుతాడు.

AP Inter 1st Year Commerce Study Material Chapter 5 భాగస్వామ్య వ్యాపార సంస్థ

Andhra Pradesh BIEAP AP Inter 1st Year Commerce Study Material 5th Lesson భాగస్వామ్య వ్యాపార సంస్థ Textbook Questions and Answers.

AP Inter 1st Year Commerce Study Material 5th Lesson భాగస్వామ్య వ్యాపార సంస్థ

వ్యాసరూప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
భాగస్వామ్యాన్ని నిర్వచించి, ప్రయోజనాలు, పరిమితులను చర్చించండి. [A.P & T.S. Mar. ’15]
జవాబు:
కొంత మంది వ్యక్తులు కలిసి ఉమ్మడిగా చేసే వ్యాపారాన్ని భాగస్వామ్య వ్యాపారము అని చెప్పవచ్చును. 1932 భారత భాగస్వామ్య చట్టం ప్రకారం భాగస్వామ్యాన్ని దిగువ విధముగా నిర్వచించినారు. – “అందరుకుగాని, అందరి తరపున కొందరుగాని వ్యాపారాన్ని నిర్వహిస్తూ అందులోని లాభాలను పంచుకోవడానికి వ్యక్తుల మధ్య ఏర్పరచుకున్న సంబంధమే భాగస్వామ్యము”.

భాగస్వామ్య సంస్థ ప్రయోజనాలు:
1. స్థాపనా సౌలభ్యము: భాగస్వామ్య వ్యాపారాన్ని స్థాపించడానికి చట్టబద్ధమైన లాంఛనాలు తక్కువ. నమోదు తప్పని సరికాదు. దీనిని స్థాపించడానికి వ్రాత పూర్వకమైన లేదా నోటిమాటల ద్వారా ఏర్పరచుకున్న సాధారణ ఒప్పందము సరిపోతుంది.

2. అధిక నిధులు లభ్యము: భాగస్తులందరూ పెట్టుబడి పెడతారు కాబట్టి, సొంత వ్యాపారానికంటే భాగస్వామ్యానికి ఎక్కువ నిధులు లభిస్తాయి.

3. సత్వర నిర్ణయాలు: భాగస్తులందరూ స్థానికులే కాబట్టి తరచూ కలుసుకుంటూ ఉంటారు. వ్యాపార నిర్ణయాలు జాప్యము లేకుండా తీసుకోవచ్చు. త్వరిత నిర్ణయాల వలన వ్యాపార లాభాలు పెరుగుతాయి.

4. మార్పునకు అనుకూలము: అవసరాన్ని బట్టి వ్యాపారములో మార్పులు చేయడానికి న్యాయపరమైన అవరోధాలు తక్కువ. వ్యాపారస్వభావాన్ని, ప్రదేశాన్ని సులభముగా మార్చుకోవచ్చును.

5. వ్యాపార రహస్యాలు: వ్యాపార రహస్యాలు భాగస్తులకు మాత్రమే తెలిసి ఉంటుంది. లాభనష్టాలను, ఆస్తి-అప్పుల వివరాలను బయటకు వెల్లడిచేయరు. రహస్యాలను జాగ్రత్తగా కాపాడతారు.

AP Inter 1st Year Commerce Study Material Chapter 5 భాగస్వామ్య వ్యాపార సంస్థ

6. నష్టాల పంపిణీ: భాగస్వామ్య వ్యాపారములో వచ్చిన నష్టాలను భాగస్తులందరూ అంగీకరించిన నిష్పత్తిలో పంచుకుంటారు. విడివిడిగా ఒక్కొక్క భాగస్తుడు భరించే నష్టము తక్కువ.

7. వ్యక్తిగత శ్రద్ధ: భాగస్వామ్య వ్యాపారాన్ని ప్రత్యక్షముగాను, అతి సన్నిహితముగాని పర్యవేక్షణ చేస్తారు. అందువలన వృథాలు తగ్గి, వ్యాపారము విజయవంతము అవుతుంది.

8. ప్రత్యేకీకరణ: భాగస్వామ్యములో మూలధనము, నిర్వహణా సామర్థ్యము, సాంకేతిక నైపుణ్యము తదితర లక్షణాలు గల భాగస్తుల కలయిక వలన ప్రత్యేకమైన సేవలను ఉపయోగించుకొని సంస్థ రాణిస్తుంది.

9. ఆసక్తుల పరిరక్షణ: భాగస్వామ్యములో ప్రతిభాగస్తుని హక్కులు, ఆసక్తులు పూర్తిగా కాపాడబడతాయి. ఏ. భాగస్తుడైనా ఒక నిర్ణయం పట్ల అసంతృప్తి చెందితే, అతడు రద్దును కోరవచ్చు లేదా వైదొలగవచ్చు.

పరిమితులు/లోపాలు: భాగస్వామ్య సంస్థలకు క్రింది పరిమితులున్నవి.
1. పరిమిత మూలధనము: వాటాదారుల సంఖ్యకు పరిమితిలేని జాయింట్ స్టాకు కంపెనీలతో పోలిస్తే భాగస్వామ్య సంస్థ నిధులను సేకరించే శక్తి తక్కువ. భాగస్వామ్యములో 20 మందికి మించి భాగస్తులు ఉండరాదు.

2. స్థిరత్వము లేకపోవుట: భాగస్తులలో ఎవరు మరణించినా, విరమించినా లేదా దివాలాతీసినా భాగస్వామ్యము రద్దు అవుతుంది. అసంతృప్తి చెందిన ఏ భాగస్తుడైనా సంస్థను రద్దుపరచడానికి ఏ సమయములోనైనా నోటీసు ఇవ్వవచ్చును.

3. అపరిమిత ఋణబాధ్యత: భాగస్తుల ఋణ బాధ్యత పరిమితము. సంస్థ నష్టాలపాలై వ్యాపార అప్పులను సంస్థ ఆస్తుల నుంచేకాక భాగస్తుల సొంత ఆస్తుల నుంచి తీర్చవలసి ఉంటుంది.

4. వాటాను బదిలీ చేయరాదు: ఏ భాగస్తుడు సహభాగస్తుల అంగీకారము లేకుండా తన వాటాను బయటవారికి బదిలీ చేయడానికి వీలులేదు. దీనికి ప్రత్యామ్నాయం సంస్థను రద్దు పరచడమే.

5. భాగస్తుల మధ్య ఐక్యత లోపము: ప్రతి భాగస్తుడు నిర్వహణలో పాల్గొనవచ్చు. ఏ విషయములోనైనా తన అభిప్రాయాన్ని వెల్లడించవచ్చు. ఇది కొన్నిసార్లు భాగస్తుల మధ్య అభిప్రాయభేదాలు, తగాదాలకు దారితీయవచ్చును.

6. ప్రచ్ఛన్న అధికారము: సంస్థ తరపున లావాదేవీలు జరపడానికి ప్రతిభాగస్తునకు హక్కు ఉంటుంది. ఇది ఆసరాగా తీసుకొని కొంతమంది భాగస్తులు నిర్లక్ష్యముగాను, ‘దురుద్దేశముతో వ్యవహరిస్తే సంస్థ నష్టాలపాలయ్యే అవకాశమున్నది.

7. ప్రజలకు విశ్వాసము లేకపోవడం: భాగస్వామ్యములో లెక్కలను ప్రచురించరు. అంతాగోప్యముగా ఉంటుంది, కాబట్టి ప్రజలకు వీటిపై విశ్వాసము ఉండదు.

ప్రశ్న 2.
భారత భాగస్వామ్య చట్టము, 1932 ప్రకారము భాగస్వామ్య నమోదు తప్పనిసరియా ? సంస్థ నమోదుకు సంబంధించిన విధానాన్ని వివరించండి.
జవాబు:
భాగస్వామ్య సంస్థ నమోదు తప్పనిసరి అని భారత భాగస్వామ్య చట్టము, 1932లో చెప్పలేదు. కాని సంస్థ నమోదు కాకపోతే కొన్ని ఇబ్బందులను ఎదుర్కొనవలసి ఉంటుంది. అందువలన నమోదు ఆవశ్యకము అవుతుంది. నమోదును ఏ సమయములోనైనా చేయించవచ్చును. సంస్థను నమోదు చేయడానికి క్రింది విధానాన్ని అవలంబించవలసి
ఉంటుంది.

నమోదు పద్ధతి: భాగస్వామ్య సంస్థ నమోదు కొరకు భాగస్తులు దిగువ సమాచారముతో ఒక నివేదికను తయారుచేసి దరఖాస్తు చేసుకోవాలి.

AP Inter 1st Year Commerce Study Material Chapter 5 భాగస్వామ్య వ్యాపార సంస్థ

  1. భాగస్వామ్య సంస్థ పేరు.
  2. సంస్థ వ్యాపారము చేసే ప్రదేశము లేదా ప్రదేశాలు.
  3. భాగస్తుల పూర్తి పేర్లు, చిరునామాలు.
  4. ప్రతి భాగస్తుడు సంస్థలో చేరిన తేది.
  5. సంస్థ ప్రారంభమైన తేది, వ్యాపారస్వభావము. .
  6. భాగస్వామ్య వ్యాపార సంస్థ కాలపరిమితి.
  7. భాగస్వామ్య వ్యాపార సంస్థకు సంబంధించిన ఇతర అంశాలు.

భాగస్తులు ఈ దరఖాస్తు పత్రముపై సంతకాలు చేసి క్ 3 నమోదు రుసుము చెల్లించి రిజిష్ట్రారుకు దాఖలు చేయాలి. చట్ట ప్రకారము ఉన్న నియమ నిబంధనలతో దరఖాస్తును పరిశీలించిన పిమ్మట రిజిష్ట్రారు సంతృప్తిపడితే, సంస్థ పేరును, భాగస్తుల పేర్లను రిజిష్టరులో నమోదు చేసి, అధికార ముద్రవేసిన నమోదు పత్రాన్ని రిజిష్టారు సంబంధిత సంస్థకు జారీ చేస్తాడు..

ప్రశ్న 3.
భాగస్తులలో రకాలను వివరించండి.
జవాబు:
భాగస్తులకు భాగస్వామ్యములో ఉండే ఆసక్తిని బట్టి వారి బాధ్యతలు, విధులనుబట్టి, నిర్వహణలో వారికున్న హక్కులనుబట్టి భాగస్తులను అనేక రకాలుగా వర్గీకరిస్తారు.
1. సక్రియ భాగస్తుడు: భాగస్వామ్య వ్యాపార నిర్వహణలో చురుకుగా పాల్గొని ప్రధాన పాత్రను నిర్వహించే భాగస్తుని ‘సక్రియ భాగస్తుడు’ లేదా ‘నిర్వాహక భాగస్తుడు’ అంటారు. ఇటువంటి భాగస్తుడు అవసరమైన మూలధనాన్ని సమకూర్చడమే కాక, సంస్థ యొక్క వ్యవహారాలలో ఆసక్తిని చూపించి, సంస్థను నిర్వహించడములో ముఖ్యమైన పాత్రను ” వహిస్తాడు.

2. నిష్క్రియ భాగస్తుడు: భాగస్వామ్య సంస్థకు మూలధనాన్ని సమాకూర్చి నిర్వహణలో పాల్గొనని భాగస్తుని ‘నిష్క్రియ భాగస్తుడు’ అంటారు. ఇతడు నిర్వహణలో పాల్గొనకపోయినా లాభనష్టాలను పంచుకుంటాడు.

3. నామమాత్రపు భాగస్తుడు: యదార్థముగా భాగస్వామ్య సంస్థలో భాగస్తుడు కాకపోయినా తన పేరును, పరపతిని వినియోగించడానికి అంగీకరిస్తే అటువంటి భాగస్తుని నామమాత్రపు భాగస్తుడు అంటారు. ఇతడు మూలధనాన్ని సమకూర్చడు. నిర్వహణలో పాలుపంచుకోడు. లాభాలను పంచుకోడు. అయినప్పటికీ సంస్థ బయటవారితో చేసే కార్యకలాపాలకు ఇతను కూడా బాధ్యత వహిస్తాడు.

4. లాభాలలో భాగస్తుడు: సంస్థ నష్టాలతో సంబంధము లేకుండా లాభాలలో మాత్రమే వాటా పొందే భాగస్తుని లాభాలలో భాగస్తుడు అంటారు. ఇది ‘మైనర్లకు మాత్రమే వర్తిస్తుంది. కారణము మైనర్లు సంస్థ లాభాలలోని భాగాన్ని పొందుతాడు. వారి ఋణ బాధ్యత వారి మూలధనానికి మాత్రమే పరిమితము అవుతుంది.

5. పరిమిత భాగస్తుడు: భాగస్వామ్యములో భాగస్తుని ఋణబాధ్యత సాధారణముగా అపరిమితముగా, సమిష్టిగా, వ్యక్తిగతముగా ఉంటుంది. కాని భాగస్తుని ఋణబాధ్యత అతడు సమకూర్చిన మూలధనానికే పరిమితము అయితే అతనిని పరిమిత భాగస్తుడు అంటారు.

6. సాధారణ భాగస్తుడు: అపరిమిత ఋణ బాధ్యత ఉన్న భాగస్తులను సాధారణ భాగస్తులు అంటారు.

7. భావిత భాగస్తుడు: ఒక వ్యక్తి తన మాటల ద్వారాగాని, చేష్టల ద్వారాగాని ఎదుటి వ్యక్తికి తాను ఫలానా సంస్థలో భాగస్తుడు అని నమ్మించిన భాగస్తుని భావిత భాగస్తుడు అని అంటారు. అలా నమ్మకం కలిగించటము వలన ఎదుటి వ్యక్తి ఋణం ఇచ్చినా, సరుకులు అమ్మినా లేదా మరొక విధముగా నష్టపోయినా భావిత భాగస్తుడే బాధ్యత
వహించాలి.

8. మౌన నిర్ణీత భాగస్తుడు: ఒక భాగస్తుడు లేదా భాగస్వామ్య సంస్థ ఒక వ్యక్తిని భాగస్తునిగా ప్రకటించినపుడు, భాగస్తుడు కాకపోతే ఆ ప్రకటనను ఖండించవలెను. అలా ఖండించకుండా మౌనముగా ఉండే అతనిని మౌన నిర్ణీత భాగస్తుడు అంటారు. ఇతనికి సంస్థ లాభాలలో వాటా ఉండదు కాని సంస్థ చేసే అప్పులకు మాత్రము పూర్తి బాధ్యత
వహించాలి.

AP Inter 1st Year Commerce Study Material Chapter 5 భాగస్వామ్య వ్యాపార సంస్థ

ప్రశ్న 4.
భాగస్వామ్య ఒప్పందము అంటే ఏమిటి ? అందులోని ముఖ్యాంశాలను వివరించండి.
జవాబు:
హారానికి దారము ఎంత ముఖ్యమో భాగస్వామ్యానికి ఒప్పందము అంత ముఖ్యమైనది. వ్యాపారము నిర్వహించడానికి, లాభాలు పంచుకోవడానికి, పెట్టుబడికి సొంతవాడకాలకు సంబంధించి భాగస్తుల మధ్య ఒక ఒడంబడిక కుదురుతుంది. దీనిని భాగస్వామ్య ఒప్పందము అంటారు. ఇది నోటి మాటలద్వారాగాని, వ్రాతపూర్వకముగాగాని ఉండవచ్చు. అయితే ఇది వ్రాత పూర్వకముగా ఉంటే మంచిది. దీని మీద భాగస్తులందరూ సంతకాలు చేయాలి. దీనిని రిజిష్ట్రారు వద్ద నమోదు చేసుకుంటారు. సంస్థ వ్యాపార నిర్వహణలో భాగస్తుల మధ్య సంబంధము, వారి హక్కులు, విధులు, బాధ్యతలను ఈ ఒప్పందము నిర్వచిస్తుంది. దీనితో బయట వ్యక్తులకు సంబంధము లేదు. ఇందులో పేర్కొన్న అంశాలు భాగస్వామ్య చట్టములోని అంశాలకు విరుద్ధముగా ఉండరాదు. భారత స్టాంపుల చట్టము 1989 ప్రకారము తగిన స్టాంపులను ఈ పత్రముపై అతికించవలసి ఉంటుంది. ప్రతి భాగస్తుని వద్ద ఒప్పందపు నకలు ఉంటుంది. సాధారణముగా ఒప్పందములో దిగువ పేర్కొనబడిన అంశాలు ఉంటాయి.

  1. వ్యాపార సంస్థ పేరు
  2. వ్యాపార స్వభావము
  3. వ్యాపార కాలపరిమితి
  4. భాగస్తుల పేర్లు, చిరునామాలు
  5. వ్యాపార ప్రదేశము
  6. భాగస్తులు సమకూర్చవలసిన మూలధనము
  7. లాభనష్టాల పంపిణీ నిష్పత్తి
  8. భాగస్తుల పెట్టుబడిపై చెల్లించవలసిన వడ్డీ
  9. భాగస్తుల సొంతవాడకాలు, అట్టి సొంతవాడకాలపై భాగస్తుడు చెల్లించవలసిన వడ్డీ
  10. భాగస్తులకు చెల్లించే జీతాలు, పారితోషికము
  11. భాగస్తుల హక్కులు, విధులు, బాధ్యతలు
  12. సంస్థ ఖాతాలను తయారు చేసే పద్ధతి, ఆడిట్ చేయించుట
  13. భాగస్వామ్య సంస్థ రద్దుపరిచే విధానము
  14. భాగస్తుల మధ్య తగాదాలు ఏర్పడినపుడు మధ్యవర్తుల ద్వారా పరిష్కార పద్ధతి.

అదనపు ప్రశ్నలు

ప్రశ్న 5.
సొంత వ్యాపారానికి, భాగస్వామ్య వ్యాపారానికి మధ్యగల వ్యత్యాసాలను తెలపండి.
జవాబు:
సొంత వ్యాపారానికి, భాగస్వామ్య వ్యాపారానికి మధ్యగల తేడాలు:
సొంత వ్యాపార సంస్థ

  1. వ్యక్తుల సంఖ్య: దీనిలో ఒకే వ్యక్తి ఉండును.
  2. స్థాపన: దీనిని స్థాపించుట చాలా సులభం.
  3. ఋణ బాధ్యత: సొంతవ్యాపారి ఋణబాధ్యత అపరిమితము.
  4. నమోదు: వ్యాపార సంస్థ నమోదు తప్పని సరికాదు.
  5. మూలధనము: ఒకే వ్యక్తి మూలధనాన్ని సమ కూరుస్తాడు, కాబట్టి మూలధనము తక్కువ.
  6. ఒప్పందము: ఒప్పందము అవసరము లేదు.
  7. వ్యాపార రహస్యాలు: ఒకే వ్యక్తి ఉండటం వలన వ్యాపార రహస్యాలు కాపాడుకోవచ్చు.
  8. శీఘ్ర నిర్ణయాలు: వ్యాపార నిర్ణయాలు త్వరగా తీసుకోవచ్చు.
  9. శ్రమ విభజన: ఒకే వ్యక్తి ఉండటము వలన శ్రమ విభజనకు అవకాశము లేదు.
  10. మంచి నిర్ణయాలు: ఒకే వ్యక్తి ఉండటం వలన తప్పుడు నిర్ణయాలు తీసుకోవచ్చు.

భాగస్వామ్య వ్యాపార సంస్థ

  1. కనిష్ట సభ్యుల సంఖ్య 2. గరిష్ట సభ్యుల సంఖ్య బ్యాంకింగ్ వ్యాపారమయితే 10, ఇతర వ్యాపారమైతే 20.
  2. వ్యాపార స్థాపనకు భాగస్తుల మధ్య అంగీకారముకావలెను.
  3. భాగస్తుల ఋణ భాధ్యత అపరిమితం, వ్యక్తిగతం, సమిష్టిగతము.
  4. నమోదు తప్పనిసరి కాకపోయినా అవసరము.
  5. ఎక్కువ మంది భాగస్తులు ఉండటము వలన ఎక్కువ మూలధనము ఉంటుంది.
  6. ఒప్పందము లేకుండా భాగస్వామ్యము ఏర్పడదు.
  7. ఎక్కువ మంది వ్యక్తులు ఉండటము వలన వ్యాపార రహస్యాలు కాపాడలేరు.
  8. నిర్ణయాలు తీసుకోవడములో ఆలస్యము జరుగుతుంది.
  9. ఎక్కువ మంది ఉండటము వలన శ్రమ విభజనను ప్రవేశపెట్టవచ్చును.
  10. భాగస్తులందరూ సమిష్టిగా ఆలోచించి మంచి నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశమున్నది.

AP Inter 1st Year Commerce Study Material Chapter 5 భాగస్వామ్య వ్యాపార సంస్థ

ప్రశ్న 6.
భాగస్వామ్య వ్యాపారము, సమిష్టి హిందూ కుటుంబ వ్యాపారాలకు మధ్యగల తేడాలను తెలపండి.
జవాబు:
సమిష్టి.హిందూ కుటుంబానికి, భాగస్వామ్యానికి మధ్య గల తేడాలు:
భాగస్వామ్య సంస్థ,

  1. స్థాపన: భాగస్తుల మధ్య ఒప్పందము.
  2. సభ్యుల సంఖ్య: కనిష్ట సభ్యుల సంఖ్య 2 గరిష్ట సభ్యుల సంఖ్య బ్యాంకింగ్ వ్యాపారాలయితే 10, ఇతర వ్యాపారాలయితే 20.
  3. నిర్వహణ: భాగస్తులందరూ లేదా అందరు తరపున కొందరు వ్యాపారాన్ని నిర్వహిస్తారు.
  4. ఋణబాధ్యత: భాగస్తుల ఋణభాధ్యత వ్యక్తిగతం, సమిష్టిగతము, అపరిమితము.
  5. లాభాల పంపిణీ: ఒప్పందము ప్రకారము లాభనష్టాలను పంపిణీ చేస్తారు.
  6. రద్దు: భాగస్తుని విరమణ, మరణం లేదా దివాలా తీయడం వలన భాగస్వామ్య ఒప్పందము రద్దవుతుంది.
  7. మైనర్ భాగస్తుడు: చట్టము ప్రకారము మైనరు భాగస్తుడు కాలేడు.
  8. సభ్యులను భాగస్తులు అంటారు.
  9. అధికారము: సంస్థ తరపున వ్యవహరించ- డానికి భాగస్తులకు ప్రచ్ఛన్న అధికారము ఉంటుంది.
  10. నూతన సభ్యులు: సహభాగస్తుల అంగీకారముతో కొత్త వారిని భాగస్తులుగా చేర్చుకోవచ్చు.

సమిష్టి హిందూ కుటుంబము

  1. హిందూ చట్టము ద్వారా ఏర్పడుతుంది.
  2. కనిష్ట సభ్యుల సంఖ్య లేదు. సహవారసుల సంఖ్యకు పరిమితి లేదు.
  3. కర్త మాత్రమే నిర్వహణను చేపడతాడు.
  4. కర్త ఋణబాధ్యత అపరిమితము. సహవారసుల ఋణబాధ్యత వారి వాటాలకే పరిమితము. 5. సహవారసుల జనన, మరణాల ద్వారా లాభ నష్టాల వాటా మారుతూ ఉంటుంది.
  5. ఎవరు మరణించినా వ్యవస్థ రద్దు కాదు. కుటుంబము విడిపోతే వాటాలను పంచడం జరుగుతుంది.
  6. మైనరు అయినా ఉమ్మడి కుటుంబములో సహవారసుడు అవుతాడు.
  7. సభ్యులను సహవారసులు అంటారు.
  8. సహవారసులకు ప్రచ్ఛన్న అధికారము ఉండదు.
  9. సహవారసులు అంగీకరించినా బయటి వారిని సహవారసులుగా చేర్చుకొనడానికి వీలులేదు.

ప్రశ్న 7.
సహకార సంస్థలకు, భాగస్వామ్యానికి మధ్య గల వ్యత్యాసములేవి ?
జవాబు:
సహకార సంస్థలకు, భాగస్వామ్య సంస్థలకు గల తేడాలు:
సహకార సంస్థ

  1. స్థాషన: సహకార సంస్థల చట్టం 1912 క్రింద ఇవి స్థాపించబడతాయి..
  2. సభ్యత్వము: కనిష్ట సభ్యుల సంఖ్య 10, గరిష్ట సభ్యుల సంఖ్య అపరిమితము.
  3. ముఖ్య ఉద్దేశ్యము: సేవాశయము.
  4. ఋణ బాధ్యత: పరిమితము.
  5. నిర్వహణ: ప్రజాస్వామ్యబద్ధముగా సంస్థ నిర్వహించబడుతుంది.
  6. మినహాయింపులు, సౌకర్యములు ; ఆదాయపు పన్ను చెల్లింపులో, స్టాంపు రిజిస్ట్రేషన్ ఫీజులో మినహాయింపు ఉంటుంది.
  7. మిగులు లాభాల పంపిణీ: లాభాలలో కొంత శాతము మాత్రమే సభ్యులకు డివిడెండ్లుగా పంచుతారు.
  8. మూలధనము: మొత్తము వాటాలలో 10%నకు మించిన వాటాలను ఏ వ్యక్తి కొనరాదు.

భాగస్వామ్య సంస్థ

  1. భారత భాగస్వామ్య చట్టం 1932 క్రింద ఇవి ఏర్పడతాయి.
  2. కనిష్ట సభ్యుల సంఖ్య 2. గరిష్ట సభ్యుల సంఖ్య బ్యాంకింగ్ వ్యాపారము అయితే 10, ఇతర వ్యాపారాలలో 20.
  3. ముఖ్య ఉద్దేశ్యము లాభాశయము.
  4. ఋణబాధ్యత అపరిమితము, వ్యక్తిగతము, సమిష్టి
  5. భాగస్వామ్య ఒప్పందము సంస్థ నిర్వహణలో పాల్గొనవచ్చు.
  6. ఎలాంటి సౌకర్యాలు, మినహాయింపులు ఉండవు.
  7. మొత్తము లాభాలను ఒప్పందము ప్రకారం భాగస్తులకు పంపిణీ చేస్తారు.
  8. ఒప్పందము ప్రకారము మూలధనాన్ని తేవడం జరుగుతుంది.

AP Inter 1st Year Commerce Study Material Chapter 5 భాగస్వామ్య వ్యాపార సంస్థ

స్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
భాగస్వామ్యాన్ని నిర్వచించి, ముఖ్య లక్షణాలను తెలపండి.
జవాబు:
హాని ప్రకారము “లాభం ఆర్జించే నిమిత్తము చట్టబద్ధమైన వ్యాపారము చేయడానికి అంగీకరించిన అర్హులైన వ్యక్తుల మధ్య ఏర్పరచుకున్న సంబంధమే భాగస్వామ్యము”.

జాన్ శుఖిన్ ప్రకారం “ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది వ్యక్తులు వ్యాపారాన్ని ఉమ్మడిగా, బాధ్యతాయుతముగా నిర్వహించడం కోసం వ్రాతపూర్వకముగాగాని, నోటిమాటల ద్వారాగాని కుదుర్చుకున్న ఒప్పందమే భాగస్వామ్యము”. 1932 భారత భాగస్వామ్య చట్టము ప్రకారము “అందరూగాని, అందరి తరపున కొందరుగాని వ్యాపారాన్ని నిర్వహిస్తూ అందులోని లాభాలను పంచుకోవడానికి వ్యక్తుల మధ్య ఉన్న సంబంధమే భాగస్వామ్యము”.

లక్షణాలు: భాగస్వామ్య సంస్థకు ఈక్రింది లక్షణాలు ఉంటాయి.
1. స్థాపన: లాభాన్ని ఆర్జించే ఉద్దేశ్యముతో చట్టబద్ధమైన వ్యాపారాన్ని నిర్వహిస్తూ, లాభనష్టాలను పంచుకోవడానికి వ్యక్తుల మధ్య సంబంధాన్ని ఏర్పరచుకోవడానికి న్యాయాత్మక ఒప్పందము ద్వారా భాగస్వామ్య సంస్థలు అమలులోనికి వస్తాయి..

2. నమోదు ఐచ్ఛికము: భాగస్వామ్య సంస్థల నమోదు తప్పనిసరికాదు. నమోదు కాని సంస్థలు కొన్ని ఇబ్బందులను ఎదుర్కొనవలసి ఉంటుంది.

3. అపరిమిత ఋణబాధ్యత: భాగస్తుల ఋణబాధ్యత అపరిమితము, వ్యక్తిగతము, సమిష్టిగతము. ఋణదాతలు తమ బాకీలను అందరి నుంచి లేదా ఏ ఒక్కరి నుంచైనా వసూలు చేసుకోవచ్చు. వ్యాపార అప్పులకు వ్యాపార ఆస్తులు సరిపోకపోతే, సొంత ఆస్తులనుంచి అప్పులను తీర్చవలసి ఉంటుంది.

4. యజమాని ప్రతినిధి సంబంధము: భాగస్వామ్యములో భాగస్తులు యజమానిగాను, ప్రతినిధులగానూ వ్యవహరిస్తారు. ఏ భాగస్తుడు అయినా బయటవారితో లావాదేవీలు జరపవచ్చు. వారు చేసే పనులకు ఇతర భాగస్తులు కూడా బాధ్యత వహించవలెను.

5. చట్టబద్ధమైన వ్యాపారము: లాభాలను పంచుకోవడానికి అంగీకరించిన వ్యక్తులు చేసే వ్యాపారము చట్టసమ్మతమైనదిగా ఉండాలి.

ప్రశ్న 2.
భాగస్వామ్య నమోదు ప్రక్రియను వివరించండి.
జవాబు:
సమాధానానికి వ్యాసరూప సమాధాన ప్రశ్న నెంబరు 2 ను చూడండి.

ప్రశ్న 3.
భాగస్తుని హక్కులను సంక్షిప్తముగా వివరించండి.
జవాబు:
భాగసుని హక్కులు:

  1. ప్రతి భాగస్తునకు వ్యాపార నిర్వహణలో పాల్గొనే హక్కు ఉంటుంది.
  2. వ్యాపారములో వచ్చే లాభనష్టాలు, ఒప్పందములో లేకపోతే, సమానముగా పంచుకోవడానికి హక్కు ఉన్నది.
  3. వ్యాపార నిర్ణయాలు చేయడంలో ప్రతి భాగస్వామికి తన అభిప్రాయాలను యథేచ్ఛగా వెలుబుచ్చు హక్కు కలదు.
  4. ప్రతి భాగస్తుడు సంస్థ లెక్కలను తనిఖీ చేసే హక్కు ఉన్నది. అవసరమైన నకళ్ళు తీసుకునే హక్కు కూడా ఉన్నది.
  5. భాగస్వామ్య సంస్థకు ఏ భాగస్తుడైనా అప్పు ఇచ్చినట్లయితే దానిపై వడ్డీని పొందే హక్కు ఉంటుంది.
  6. సాధారణ వ్యాపార నిర్వహణలో ప్రతి భాగస్తుడు తాను చేసిన ఖర్చులను లేదా తనకు సంభవించిన నష్టాలను సంస్థ నుంచి రాబట్టుకోవడానికి హక్కు కలిగి ఉంటాడు.
  7. భాగస్తులకు సంస్థ యొక్క ఆస్తులపై సమిష్టి హక్కు ఉన్నది.
  8. సంస్థ కొరకు ప్రతి భాగస్తుడు సంస్థ ప్రతినిధిగా పనిచేసి తన చర్యలచే సంస్థకు బాధ్యత వహింపజేయు హక్కు ఉన్నది.

AP Inter 1st Year Commerce Study Material Chapter 5 భాగస్వామ్య వ్యాపార సంస్థ

ప్రశ్న 4.
భాగస్తుని విధులను సంక్షిప్తముగా వివరించండి.
జవాబు:
భాగస్తుని విధులు:

  1. ప్రతి భాగస్తుడు తన విధులను నీతిగాను, నిజాయితీగాను నిర్వహించవలెను.
  2. ఇతర భాగస్తులతో అత్యంత విశ్వాసముగా వ్యవహరించాలి.
  3. సక్రియ భాగస్తుడు వ్యాపారము తాలూకు లెక్కలను నిజాయితీగా వ్రాయవలెను.
  4. వ్యాపార నిర్వహణలో వచ్చిన లాభనష్టాలను భాగస్వామ్య ఒప్పందములో పేర్కొనబడిన నిష్పత్తిలో పంచుకోవాలి.
  5. ఒక భాగస్వామి యొక్క అశ్రద్ధ వలన సంభవించిన నష్టమును ఆ భాగస్వామియే పూర్తిగా భరించవలెను.
  6. భాగస్తుడు తన సంస్థకు పోటీ వ్యాపారము చేయరాదు.
  7. ఏ భాగస్వామి వ్యాపార ఆస్తులను, పేరును ఉపయోగించి రహస్య లాభాలు లేదా కమీషన్ పొందరాదు.
  8. భాగస్తుల లిఖిత పూర్వకమైన అంగీకారము లేకుండా కొత్త వారిని భాగస్తునిగా చేర్చుకోరాదు.
  9. సహభాగస్తుల అంగీకారము లేకుండా తన వాటాను బయటవారికి బదిలీ చేయరాదు..
  10. ప్రతి భాగస్తుడు తన అధికార పరిధిలోనే నడుచుకోవాలి.

ప్రశ్న 5.
భాగస్వామ్య సంస్థ రద్దు రకాలను వివరించండి.
జవాబు:
భాగస్వామ్యము రద్దు, భాగస్వామ్య సంస్థ రద్దుకు తేడా ఉన్నది. భాగస్తుని మరణము, విరమణ, మతిభ్రమించడం, దివాలా తీయడం వలన భాగస్వామ్యము రద్దు అవుతుంది. కాని భాగస్వామ్య సంస్థ రద్దుకానవసరము లేదు. సంస్థను |పునర్వవస్థీకరణచెంది అదే పేరు మీద వ్యాపారాన్ని కొనసాగించవచ్చును. కాబట్టి భాగస్వామ్య రద్దులో సంస్థ రద్దు కావచ్చును లేదా కాకపోవచ్చును. కాని భాగస్వామ్య సంస్థ రద్దయితే వ్యాపారమును కొనసాగించే ప్రశ్న ఉండదు. సంస్థ ఆస్తులను అమ్మి, ఋణదాతలకు చెల్లించగా ఏమైనా మిగిలితే మిగిలిన భాగస్తులు పంచుకుంటారు.

భాగస్వామ్య సంస్థ రద్దు దిగువ పద్ధతుల ద్వారా జరుగుతుంది.

  1. ఒప్పందము ద్వారా రద్దు: భాగస్వామ్య సంస్థను భాగస్తుల పరస్పర అంగీకారముతో లేదా ఒప్పందములో పేర్కొన్న షరతుల ప్రకారము రద్దు చేయవచ్చును.
  2. నోటీసు ద్వారా రద్దు: ఏ భాగస్తుడైనా సంస్థను రద్దు చేయాలని ‘వ్రాతపూర్వకముగా ఇతర భాగస్తులకు నోటీసు పంపడం ద్వారా కూడా రద్దు పరచవచ్చును.
  3. ఆగంతుక రద్దు: -ఒక భాగస్తుడు మరణించినా, మతిభ్రమించినా లేదా దివాలా తీసిన ఆ సంస్థను రద్దు చేయవచ్చును.
  4. తప్పనిసరిగా రద్దు: ఒక భాగస్తుడు లేదా భాగస్తులందరూ దివాలాదారుగా ప్రకటించబడినపుడు లేదా సంస్థ వ్యాపారము చట్ట వ్యతిరేకము అయినపుడు సంస్థ రద్దవుతుంది.
  5. కోర్టు ద్వారా రద్దు: సంస్థలో ఏ భాగస్తుడైనా శాశ్వతముగా అశక్తుడు అయినా, అనుచితముగా ప్రవర్తించినా, ఉద్దేశ్యపూర్వకముగా ఒప్పందాన్ని అతిక్రమించినా, ఇతరుల అంగీకారము లేకుండా తన వాటాను బయటవారికి బదిలీ చేసినా కోర్టు సంస్థను రద్దు చేయవచ్చును.

AP Inter 1st Year Commerce Study Material Chapter 5 భాగస్వామ్య వ్యాపార సంస్థ

అతి స్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
భాగస్వామ్య సంస్థ
జవాబు:
కింబల్ నిర్వచనము ప్రకారము “ఒక వ్యాపారము నడపడానికి కొంతమంది వ్యక్తులు కలసి మూలధనాన్ని లేదా సేవలను సేకరించుకునే సంస్థను భాగస్వామ్య సంస్థ అనవచ్చు”. “లాభం ఆర్జించే నిమిత్తము చట్టబద్ధమైన వ్యాపారము చేయడానికి అంగీకరించిన అర్హులైన వ్యక్తుల మధ్య ఏర్పరచుకున్న సంబంధమే భాగస్వామ్యము” అని హాని నిర్వచించినాడు. 1932 భారత భాగస్వామ్య చట్టము భాగస్వామ్యాన్ని ఈ విధముగా నిర్వచించినది “అందరూగాని అందరి తరపున కొందరు గాని వ్యాపారము చేస్తూ లాభాన్ని పంచుకోవడానికి అంగీకరించిన వ్యక్తుల మధ్య ఉన్న సంబంధమే భాగస్వామ్యము”.

ప్రశ్న 2.
భాగస్వామ్య ఒప్పందము
జవాబు:
హారానికి దారము ఎంత ముఖ్యమో భాగస్వామ్యానికి ఒప్పందము అంత ముఖ్యమైనది. వ్యాపారము నిర్వహించడానికి, లాభాలు పంచుకోవడానికి, పెట్టుబడికి, సొంతవాడకాలకు సంబంధించి భాగస్తుల మధ్య ఒక ఒడంబడిక కుదురుతుంది. దీనిని భాగస్వామ్య ఒప్పందము అంటారు. ఇది నోటిమాటల ద్వారాగాని, వ్రాతపూర్వకముగాగాని ఉండవచ్చు. అది వ్రాతపూర్వకముగా ఉంటేనే శ్రేయస్కరము. భాగస్వామ్య ఒప్పందము వ్రాతపూర్వకముగా ఉంటే దానిని రిజిష్ట్రారు వద్ద నమోదు చేసుకుంటారు.

ప్రశ్న 3.
సక్రియ భాగస్తుడు. [TS. Mar. ’15]
జవాబు:
భాగస్వామ్య వ్యాపార నిర్వహణలో చురుకుగా పాల్గొని ప్రధాన పాత్రను నిర్వహించే భాగస్తుని ‘సక్రియ భాగస్తుడు’ లేదా ‘నిర్వాహక భాగస్తుడు’ అంటారు. ఇటువంటి భాగస్తుడు అవసరమైన మూలధనాన్ని సమకూర్చడమే కాక, సంస్థ యొక్క వ్యవహారాలలో ఆసక్తిని చూపించి, సంస్థను నిర్వహించడములో ముఖ్యమైన పాత్రను వహిస్తాడు.

ప్రశ్న 4.
నిష్క్రియ భాగస్తుడు
జవాబు:
భాగస్వామ్య సంస్థకు మూలధనాన్ని సమాకూర్చి నిర్వహణలో పాల్గొనని భాగస్తుని నిష్క్రియ భాగస్తుడు అంటారు. ఇతడు నిర్వహణలో పాల్గొనకపోయినా లాభనష్టాలను పంచుకుంటాడు.

AP Inter 1st Year Commerce Study Material Chapter 5 భాగస్వామ్య వ్యాపార సంస్థ

ప్రశ్న 5.
భావిత భాగస్తుడు
జవాబు:
ఒక వ్యక్తి తన మాటలద్వారాగాని, చేష్టలద్వారాగాని, ఎదుటి వ్యక్తికి తాను ఫలానా సంస్థలో భాగస్తుడు అని నమ్మించిన భాగస్తుని భావిత భాగస్తుడు అని అంటారు. అలా నమ్మకం కలిగించటము వలన ఎదుటి వ్యక్తి ఋణం ఇచ్చినా, సరుకులు అమ్మినా లేదా మరొక విధముగా నష్టపోతే భావిత భాగస్తుడే అందుకు బాధ్యత వహించాలి.

ప్రశ్న 6.
మౌన నిర్ణీత భాగస్తుడు
జవాబు:
ఒక భాగస్తుడు లేదా భాగస్వామ్య సంస్థ ఒక వ్యక్తిని భాగస్తునిగా ప్రకటించినపుడు, భాగస్తుడు కాకపోతే ఆ ప్రకటనను ఖండించవలెను. అలా ఖండించకుండా మౌనముగా, ఉంటే అతనిని మౌన నిర్ణీత భాగస్తుడు అంటారు. ఇతనికి సంస్థ లాభాలలో వాటా ఉండదు. కాని, సంస్థ చేసే అప్పులకు మాత్రము పూర్తి బాధ్యతను వహించాలి.

AP Inter 1st Year Zoology Study Material Chapter 7 పెరిప్లానెటా అమెరికానా (బొద్దింక)

Andhra Pradesh BIEAP AP Inter 1st Year Zoology Study Material 7th Lesson పెరిప్లానెటా అమెరికానా (బొద్దింక) Textbook Questions and Answers.

AP Inter 1st Year Zoology Study Material 7th Lesson పెరిప్లానెటా అమెరికానా (బొద్దింక)

అతిస్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
బొద్దింకను చీడపురుగు అని ఎందుకు అంటారు?
జవాబు:
బొద్దింకలు విసర్జన పదార్థాలతో ఆహార పదార్థాలను కలుషితం చేసే హానికర కీటకం. దీనివలన అనేక బాక్టీరియల్ వ్యాధులు సంక్రమిస్తాయి. కనుక దీనిని చీడపురుగు అంటారు.

ప్రశ్న 2.
బొద్దింక ఉరః ఖండింతంలో ఉన్న పృష్ఠఫలకాలను తెలపండి.
జవాబు:
బొద్దింక ఉరః ఖండితంలో ప్రాగ్వక్షంలో – పూర్వ పృష్టకం
అంత్య వక్షంలో – మధ్యపృష్ఠకం, అంత్యపృష్టకం అనే పృష్ఠ ఫలకాలుంటాయి.

ప్రశ్న 3.
బొద్దింక ఏయే నిర్మాణాలతో నునుపు, గరుకు తలాలపై నడుస్తుంది?
జవాబు:
బొద్దింక గరుకుతలంపై కాలి చివరన ఉండే నఖాలు, అరోలియమ్ సహాయంతో, ప్లాంటులాల సహాయంతో నునుపు తలపై గమనం చేస్తుంది.

ప్రశ్న 4.
బొద్దింక తల అమరికను హైపోగ్నాథస్ అని ఎందుకంటారు?
జవాబు:
బొద్దింక తల దేహానికి లంబకోణంలో వేలాడుతున్నట్లు ఉంటుంది. నోటి భాగాలు క్రిందికి వంగి ఉంటాయి. ఇటువంటి తల అమరికను హైపోగ్నాథస్ తల అంటారు.

ప్రశ్న 5.
బొద్దింక గమనంలో త్రిపాది ఏవిధంగా ఏర్పడుతుంది?
జవాబు:
బొద్దింక గమనంలో మూడు జత కాళ్ళను రెండు త్రిపాదులుగా ఏర్పరుచుకుంటుంది. ఒక్కో త్రిపాది ఒక వైపున ఉన్న పూర్వకాలు, పరకాలు మరోప్రక్క నున్న మధ్యకాలు ఏర్పడుతుంది. ఒక త్రిపాది మూడు కాళ్ళు నేలమీద ఉంటాయి. మరో త్రిపాది మూడుకాళ్ళు ముందుకు సాగుతాయి.

AP Inter 1st Year Zoology Study Material Chapter 7 పెరిప్లానెటా అమెరికానా (బొద్దింక)

ప్రశ్న 6.
బొద్దింకలో రెక్కలు లేపడానికీ, కిందికి దించడానికీ ఉపయోగపడే కండరాలు ఏవి?
జవాబు:
బొద్దింకలో రెక్కలు పృష్టోదర కండరాల సంకోచం వల్ల రెక్కలు పైకి లేస్తాయి. పృష్ఠ ఆయత కండరాల సంకోచంవల్ల రెక్కలు క్రిందికి దించబడతటాయి.

ప్రశ్న 7.
బొద్దింకలోని వివిధ రక్త కోటరాలను పేర్కొనండి.
జవాబు:
బొద్దింకలో మూడు రక్త కోటరాలుంటాయి. అవి.
1. హృదయావరణ రక్తకుహరం లేదా పృష్ఠకోటరం,
2. పర్వాంతరాంగ రక్తకుహరం లేదా మధ్యకోటరం,
3. ఉదరఫలక రక్తకుహరం లేదా ఉదరకోటరం లేదా పరినాడీ కోటరం.

ప్రశ్న 8.
కొవ్వు దేహాలు సకశేరుకాల కాలేయంతో ఏవిధంగా సమానం?
జవాబు:
బొద్దింకలోని కొవ్వు దేహాలను సకశేరుకాలలోని కాలేయంతో పోల్చవచ్చును. ఇవి కొన్ని విధులలో సకశేరుకాల కాలేయాన్ని పోలి ఉంటాయి. కొవ్వు దేహా కణాల విధులు.

  1. ట్రోఫోసైట్స్ – ఆహారాన్ని నిలువచేసే కణాలు.
  2. మైసిటోసైట్స్ – సహ జీవన బాక్టీరియాను కలిగి ఉంటాయి.
  3. ఈనోసైట్స్ – కొవ్వులను స్రవిస్తాయి.
  4. యూరేట్ కణాలు – యూరిక్ ఆమ్లాన్ని నిలువచేస్తాయి.

ప్రశ్న 9.
బొద్దింక ఆహార నాళంలో ఏ భాగం పెరిట్రాఫిక్ త్వచాన్ని స్రవిస్తుంది?
జవాబు:
బొద్దింక ఆహార నాళంలో పెరిట్రాఫిక్ త్వచాన్ని అంతర జఠరపు గరాటులాంటి ఆద్వముఖ కవాటం స్రవిస్తుంది.

ప్రశ్న 10.
బొద్దింక ఆహారనాళంలోని ఏ భాగం నీటిని పునఃశోషణ చేస్తుంది?
జవాబు:
బొద్దింక ఆహారనాళంలోని పురీషనాళంలోని పురీషనాళ సూక్ష్మాంకురాలు జీర్ణంకాని ఆహారంలోని నీటిని పునఃశోషణ జరుపుతాయి.

ప్రశ్న 11.
బొద్దింకలో ఆహారం కొరకడానికీ, రుచి తెలుసుకోడానికీ ఉపయోగపడే నోటి భాగాలను తెలపండి.
జవాబు:
బొద్దింకలో ఆహారాన్ని కొరకడానికి హనువులు, రుచి తెలుసుకోవడానికి అధరం ఉపయోగపడతాయి.

AP Inter 1st Year Zoology Study Material Chapter 7 పెరిప్లానెటా అమెరికానా (బొద్దింక)

ప్రశ్న 12.
పక్షాకార కండరాలు అంటే ఏవి?
జవాబు:
బొద్దింక దేహంలోని ప్రతికండితానికి పార్శ్వతలంలో ఒక జత త్రిభుజాకార కండరాలు ఒక శ్రేణిలో ఉంటాయి. వీటిని పక్షాకార కండరాలు అంటారు.

ప్రశ్న 13.
రక్తకుహరం అంటే ఏమిటి?
జవాబు:
బొద్దింకలో రక్తనాళాలలో ప్రవహించదు. దేహంకురం రక్తంలో నింపబడి ఉంటుంది. కనుక బొద్దింక శరీర కుహరాన్ని రక్త కుహరం అంటారు.

ప్రశ్న 14.
బొద్దింకలోని మూడు కోటరాలు పరిమాణంలో సమానంగా లేవు. ఎందుకు?
జవాబు:
బొద్దింకలోని మూడు కోటరాలు పరిమాణంలో సమానంగా ఉండవు. వీటిలో మధ్య కోటరం పెద్దది. ఎందుకంటే దీనిలో చాలా అంతరాంగ అవయవాలు ఉంటాయి. పృష్ఠ, ఉదర కోటరాలు చిన్నవి. వీటిలో గుండె, నాడీదండం మాత్రమే ఉంటాయి.

ప్రశ్న 15.
పెరిప్లానెటా రక్తాన్ని హీమోలింఫ్/రక్తశోషరసం అని ఎందుకంటారు?
జవాబు:
పెరిప్లానెటా (బొద్దింక) రక్తం వర్ణరహితం, కనుక దీనిని రక్తశోషరసం/హీమోలిఫ్ అంటారు. దీనిలో జీవ ద్రవ్యం, స్వేచ్ఛారక్త కణాలు లేదా హీమోసైట్లు ఉంటాయి.

ప్రశ్న 16.
పెరిప్లానెటా రక్తంలో ఉన్న హీమోసైట్ల విధి ఏమిటి?
జవాబు:
పెరిప్లానెటా రక్తంలోని హీమోసైట్లు భక్షక లక్షణాన్ని కలిగి ఉండి బాక్టీరియావంటి అన్య పదార్థాలను ‘అంతర్గ్రహణం’ చేస్తాయి.

AP Inter 1st Year Zoology Study Material Chapter 7 పెరిప్లానెటా అమెరికానా (బొద్దింక)

ప్రశ్న 17.
పెరిప్లానెటా రక్తం యొక్క ముఖ్య విధులను తెలపండి.
జవాబు:
పెరిప్లానెటా రక్తం :

  1. ఆహార నాళం నుండి జీర్ణమైన ఆహారపదార్థాలను దేహ అంగాలకు చేరవేస్తుంది.
  2. దేహ భాగాలనుండి నత్రజని సంబంధిత వ్యర్థాలను విసర్జిక అవయవాలకు చేరవేస్తుంది.
  3. రక్షక కణాలను వ్యాధి సాంక్రమిక ప్రదేశాలకు చేరవేస్తుంది.
  4. వినాళగ్రంథి స్రావకాలను వాటి లక్ష్య అవయవాలను రవాణా చేస్తుంది.

ప్రశ్న 18.
పెరిప్లానెటా రక్తం ఎరుపు రంగులో లేదు. దీనిలో ఏ వర్ణం లోపించిందని మీరు తలుస్తారు?
జవాబు:
పెరిప్లానెటా రక్తంలో హిమోగ్లోబిన్ (రక్త వర్ణకం) లేదు కనుక రక్తం ఎరుపురంగులో లేక తెల్లగా ఉంటుంది.

ప్రశ్న 19.
బొద్దింకలో ఎన్ని శ్వాసరంధ్రాలు ఉన్నాయి ? వాటి ప్రాంతాలను తెలపండి.
జవాబు:
బొద్దింకలో మొత్తం 10 జతల శ్వాసరంధ్రాలున్నాయి. మొదటి జత మధ్య వక్షంలోను, రెండవ జత అంత్య వక్షంలోను, మిగిలిన 8 జతల శ్వాస రంధ్రాలు ఉదరం మొదటి ఎనిమిది ఖండితాలలోను ఉంటాయి. ఈ రంధ్రాలు ఆయా ఖండితాల పార్శ్వ ఫలకాలపై తెరుచుకుంటాయి.

ప్రశ్న 20.
ట్రైకోమ్స్ అంటే ఏమిటి? వాటి విధులను తెలపండి.
జవాబు:
ధూళి రేణువులు శ్వాసరంధ్రాలలోకి ప్రవేశించకుండా ఉండేందుకు శ్వాసరంధ్రాలకు ఉండే చిన్న రోమాలను ట్రైకోమ్లు అంటారు.

ప్రశ్న 21.
బొద్దింక శ్వాసవ్యవస్థను పాలీన్యూస్టిక్, హోలోన్యూస్టిక్ వ్యవస్థ అని అంటారు ఎందుకు?
జవాబు:
కనీసం మూడు జతల శ్వాసరంధ్రాలు క్రియాత్మకంగా ఉంటే దాన్ని పాలీన్యూస్టిక్ శ్వాసవ్యవస్థ అని అంటారు. శ్వాసరంధ్రాలన్ని క్రియాత్మకంగా ఉంటే దానిని హోలోన్యూస్టిక్ రకం అంటారు. బొద్దింకలో అన్ని శ్వాసరంధ్రాలు క్రియాత్మకంగా ఉంటాయి. గనుక దీనిని హోలీన్యూస్టిక్, హోలోన్యూస్టిక్ శ్వాసవ్యవస్థ అంటారు.

ప్రశ్న 22.
ఇంటిమా అంటే ఏమిటి?
జవాబు:
బొద్దింకలో వాయునాళం లోపలి అవభాసినిస్తరాన్ని ఇంటిమా అంటారు.

ప్రశ్న 23.
బొద్దింక వాయునాళికను ఆవరించిన ప్రోటీన్ ను పేర్కొనండి.
జవాబు:
బొద్దింక వాయునాళికను ఆవరించి ఉండే ప్రోటీన్ ట్రేకిన్.

AP Inter 1st Year Zoology Study Material Chapter 7 పెరిప్లానెటా అమెరికానా (బొద్దింక)

ప్రశ్న 24.
ఉచ్ఛ్వాస సమయంలో ఏ శ్వాసరంధ్రాలు తెరుచుకుంటాయి? ఏ శ్వాసరంధ్రాలు మూసుకుంటాయి?
జవాబు:
ఉచ్ఛ్వాస సమయంలో వక్షంలోని శ్వాసరంధ్రాలు తెరుచుకుంటాయి. ఉదర భాగంలోని శ్వాసరంధ్రాలు మూసుకుంటాయి.

ప్రశ్న 25.
శ్వాసరంధ్రాలు తెరుచుకోవడాన్ని నియంత్రించగల కారకాలేవి?
జవాబు:
శ్వాసరంధ్రాలు తెరుచుకోవడం క్రియ పృష్టోదర కండరాలు ఆయుత కండరాలు సంకోచ, వ్యాకోచం వలన జరుగుతుంది.

ప్రశ్న 26.
బొద్దింకలో ఉచ్ఛ్వాస ప్రక్రియ నిష్క్రియాత్మకం, నిశ్వాస, సక్రియాత్మకం అని నిరూపించండి.
జవాబు:
బొద్దింకలో ఉచ్ఛ్వాస క్రియలో పృష్టోదర కండరాలు, ఆయుత కండరాలు సడలటంవలన గాలిలోనికి తీసుకోబడుతుంది. కనుక దీనిని నిష్క్రియాచర్య అంటారు. అంటారు.

నిశ్వాసంలో పృష్టోదర కండరాలు సంకోచం వలన శక్తిని వినియోగించుకుంటాయి. కనుక దీనిని సక్రియాత్మక చర్య అంటారు.

ప్రశ్న 27.
పెరిప్లానెటాలో ఆహారనాళం నత్రజని సంబంధ వ్యర్థాలను తొలగిస్తుంది. ఎందుకు?
జవాబు:
పెరిప్లానెటా ఆహార నాళం నత్రజని సంబంధిత వ్యర్థాలను తొలగించే ప్రక్రియ. వ్యర్థాలనుంచి నీటిని పునః శోషణ చేయడానికి అనార్థ యూరిక్ ఆమ్లం తయారవడానికి తోడ్పడుతుంది. ఇది దేహంలోని నీటిని సంరక్షించుకునే అనుకూలనం.

ప్రశ్న 28.
బొద్దింక అవభాసిని ఏ విధంగా విసర్జనక్రియలో తోడ్పడుతుంది?
జవాబు:
బొద్దింకలో కొన్ని నత్రజని సంబంధిత వ్యర్థ పదార్థాలు అవభాసినిపై నిక్షేపం చెంది నిర్మోచన సమయంలో విసర్జించబడతాయి.

ప్రశ్న 29.
విసర్జనక్రియలో కొవ్వు దేహాలు ఏవిధంగా తోడ్పడతాయి?
జవాబు:
బొద్దింలో కొవ్వు దేహంలోని యూరేట్ కణాలు యూరికామ్లాన్ని శోషణచేసి నిలువ చేస్తాయి.

AP Inter 1st Year Zoology Study Material Chapter 7 పెరిప్లానెటా అమెరికానా (బొద్దింక)

ప్రశ్న 30.
‘నిల్వ విసర్జనక్రియ’ అంటే ఏమిటి?
జవాబు:
బొద్దింకలోని కొవ్వు దేహాలలో యూరేట్ కణాలు జీవితాంత యూరిక్ ఆమ్లాన్ని శోషణ చేసి తమతో నిలువ చేస్తాయి. కొవ్వు దేహాలు లేదా వసాదేహాలు ఈ విధంగా యూరికామ్ల విసర్జనాలను నిలువ చేయడాన్ని ‘నిల్వ విసర్జన’ అంటారు.

ప్రశ్న 31.
బొద్దింకలో గల ఏ నిర్మాణం జ్ఞాన, వినాళ కేంద్రంగా పనిచేస్తుంది.
జవాబు:
బొద్దింకలోగల అధ్వాహారవాహికా నాడి సంధులు (మెదడు) జ్ఞాన, వినాళ కేంద్రంగా పనిచేస్తాయి.

ప్రశ్న 32.
స్కోలోపీడియా, సెన్సిల్లాలు మధ్య భేదాలు తెలపండి.
జవాబు:
సెన్సిల్లాల :
ఇది అవభాసిని గ్రాహక ప్రమాణాలు. ఇవి రసాయన గ్రాహకాలు. స్కాలోపీడియా. ఇవి అధ్యఅవభాసిని ఏర్పడిన కార్డోటోనల్ అంగంలోని యాంత్రిక గ్రాహకాలు.

ప్రశ్న 33.
బొద్దింక నేత్రాంశం, దివాచర కీటకం కంటే ఏ విధంగా భిన్నమైనది?
జవాబు:
బొద్దింక నిశాచర కీటకం, దివాచర కీటకాలలో నేత్రాంశంలోని ఉండే శంకుకణాల కింద ఉండే రెటిన్యూ స్థానం మరియు, ప్రతిబింబాలు ఏర్పడే విధానం భిన్నంగా ఉంటుంది. బొద్దింకలో ఏర్పడే ఎప్పొజిజేషన్ ప్రతిబింబం, సూపర్ పొజిషన్ ప్రతిబింబం ఏర్పడే విధానం కూడా భిన్నంగా ఉంటుంది.

ప్రశ్న 34.
ఏ ఉదర నాడీసంధి అతిపెద్దది? ఎందుకు?
జవాబు:
ఆరవ ఉదర నాడీ సంధి అతిపెద్దది. ఇది ఉదరానికి చెందిన 7, 8, 9, 10 ఖండితాలు నాడీ సంధులన్ని కలసిపోవడంవల్ల ఏర్పడుతుంది.

ప్రశ్న 35.
బొద్దింక సంయుక్త నేత్ర నిర్మాణాత్మక, క్రియాత్మక ప్రమాణం పేరు తెలపండి. ఒక సంయుక్త నేత్రంలో అలాంటి ప్రమాణాలు ఎన్ని?
జవాబు:
బొద్దింక సంయుక్త నేత్ర నిర్మాణాత్మక, క్రియాత్మక ప్రమాణం నేత్రాంశం. ఒక సంయుక్త నేత్రంలో ఇలాంటి నేత్రాంశాలు సుమారు 2,000 వరకు ఉంటాయి.

ప్రశ్న 36.
బొద్దింక మెదడును ప్రధాన జ్ఞానకేంద్రం అని ఎందుకంటారు?
జవాబు:
బొద్దింక మెదడు ప్రధానంగా నేత్రాలు, నోటి భాగాలు మిగిలిన అన్ని అవయవాలనుండి జ్ఞాన ప్రచోదనాలను గ్రహిస్తుంది. కనుక మెదడును ప్రధాన జ్ఞాన కేంద్రం అంటారు.

AP Inter 1st Year Zoology Study Material Chapter 7 పెరిప్లానెటా అమెరికానా (బొద్దింక)

ప్రశ్న 37.
ఎప్పొజిషన్, సూపర్ పొజిషన్ ప్రతిబింబాల మధ్య భేదం తెలపండి.
జవాబు:

ఎప్పొజిషన్సూపర్ పొజిషన్
1. ఈ రకమైన ప్రతిబింబ దివాచర, కీటకాలలో ఏర్పడతాయి.1. ఈ రకమైన ప్రతిబింబాలు నిశాచర కీటకాలలో ఏర్పడతాయి.
2. ఈ రకమైన దృష్టిలో ఏర్పడిన ప్రతిబింబం అనేక సూక్ష్మ ప్రతిబింబాల మెజాయిక్గా కనిపిస్తుంది.2. అనేక ప్రతిబింబాలు ఒకదాని పక్కన ఒకటి ఉంటాయి.
3. దీనిని మొజాయిక్ దృష్టి అంటారు.3. దీనిని అస్పష్ట దృష్టి అంటారు.

ప్రశ్న 38.
మగ, ఆడ బొద్దింకల మధ్య బేదాలను తెలిపే లక్షణాలను పేర్కొనండి.
జవాబు:

మగ బొద్దింకఆడ బొద్దింక
1. ఉదరం సన్నగా, పొడవుగా ఉంటుంది.1. ఉదరం పొట్టిగా, వెడల్పుగా ఉంటుంది.
2. పరాంతంలో ఒక జత పాయుశూకాలుంటాయి.2. పరాంతంలో అండనిక్షేపంకం ఉంది.
3. ఎనిమిదవ పృష్ఠ ఫలకం కనపడదు.3. ఎనిమిది, తొమ్మిదవ పృష్ఠ ఫలకాలు కనిపించవు.
4. తొమ్మిది ఉరః పలకాలు కనిపిస్తాయి.4. 7 ఉరః ఫలకాలు కనిపిస్తాయి.
5. పాయు కీలాలు ఉంటాయి.5. పాయు కీలాలు ఉండవు.

ప్రశ్న 39.
బొద్దింకలో గల మష్రూమ్ (పుట్ట గొడుగు) గ్రంథి విధి ఏమిటి?
జవాబు:
బొద్దింకలో 6, 7 ఉదర ఖండితాలలో ఒక పుట్ట గొడుగు ఆకారపు గ్రంధి ఉంటుంది. ఇది అదనపు ప్రత్యుత్పత్తి గ్రంథిలా పనిచేస్తుంది.

ప్రశ్న 40.
మష్రూమ్ గ్రంథి యొక్క యుట్రిక్యులై మేజోర్స్, యుట్రికులై బ్రివోర్స్ విధులను పోల్చండి.
జవాబు:
మష్రూమ్ గ్రంథియొక్క యుట్రిక్యులై మేజోర్స్ శుక్ర గుళిక లోపలి స్తరాన్ని ఏర్పరుస్తుంది. యుట్రిక్యులై బ్రివోర్స్ పోషణ ఇస్తుంది.

ప్రశ్న 41.
ఫెలోమియర్ అంటే ఏమిటి?
జవాబు:
మగ బొద్దింకలో సంపర్కానికి తోడ్పడే, బాష్పీ జనన నిర్మాణాలను ఫెలోమియర్ లేదా గొనాపోఫైసిస్లు లేదా ఫేలిక్ అవయవాలు అంటారు. ఇవి పురుష జననరంద్రం చుట్టూ ఉండే కైటిన్ నిర్మితాలు.

AP Inter 1st Year Zoology Study Material Chapter 7 పెరిప్లానెటా అమెరికానా (బొద్దింక)

ప్రశ్న 42.
గొనపోఫైసిస్ అంటే ఏమిటి?
జవాబు:
మగ బొద్దింక జనన రంద్రం చుట్టూ ఉండే కైటిన్ నిర్మాణాలను గోనాపోఫైసిస్, లేదా ఫెలోమియర్ అంటారు. ఇవి సంపర్కంలో తోడ్పడే బాహ్య జనన నిర్మాణాలు.

ప్రశ్న 43.
పెరిప్లానెటా ప్రత్యుత్పత్తిలో కొల్లాటీరియల్ గ్రంథి ఏ విధంగా తోడ్పడుతుంది?
జవాబు:
పెరిప్లానేటాలో స్త్రీ బీజకోశాల వెనుక ఒక జత కొల్లాటీరియ గ్రంథులుంటాయి. వీటి స్రావాలు గుడ్లచుట్టు ఒక దృడమైన పెట్టెను ఏర్పరుస్తాయి. ఈ పెట్టెను గుడ్ల పెట్టె అంటారు.

ప్రశ్న 44.
పారామెటాబోలస్ అభివృద్ధి అంటే ఏమిటి?
జవాబు:
బొద్దింక అభివృద్ధిలో గుడ్ల నుండి అపరిపక్వ పిల్ల బొద్దింకలు విడుదలవుతాయి. వీటిని సరూపశాభకాలు అంటారు. ఇలా ఏర్పడిన సరూపశాభకం ప్రౌఢ బొద్దింక ఏర్పడటాన్ని పారామెటాబోలస్ అంటారు.

స్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
బొద్దింక నోటి భాగాలను చక్కని పటాన్ని గీసి భాగాలను గుర్తించండి. [Mar. ’14]
జవాబు:
AP Inter 1st Year Zoology Study Material Chapter 7 పెరిప్లానెటా అమెరికానా (బొద్దింక) 1

ప్రశ్న 2.
బొద్దింకలో జీర్ణక్రియా విధానాన్ని వివరించండి.
జవాబు:
బొద్దింక సర్వభక్షక కీటకం. దీని నోటి భాగాలు ఆహారాన్ని కొరికి నమిలే విధంగా ఉంటాయి.

కీటకం ఆహారాన్ని కొరికి ముక్కలుగా చేసి, నోటిలో నమిలే సమయంలో ఆహారం నోటిలోని లాలాజలంతో కలుస్తుంది.

జీర్ణక్రియ :
ఆహార సంగ్రణ తరువాత ఆహారం గ్రసని, ఆహారవాహికల ద్వారా అన్నాశయాన్ని చేరుతుంది. ఇక్కడ ఆహారం లాలాజలంతోను, అంతర జఠరం నిలువు గాడుల ద్వారా మధ్యాంత్రం నుండి వచ్చి చేరిన జీర్ణ రసాలతోను కలుస్తుంది. అందువలన చాలావరకు ఆహారం అన్నాశయంలోనే జీర్ణమవుతుంది. పాక్షికంగా జీర్ణమైన ఆహారం అంతర జఠరంలోని గండు రోమాల ద్వారా వడపోయబడి, ఆద్యముఖ కవాటం ద్వారా మధ్యాంత్రాన్ని చేరుతుంది.

నమిలే సమయంలో ఆహారం నోటిలోని లాలాజలంతో కలుస్తుంది.

  1. లాలాజల అమైలేస్ పిండి పదార్థాలను మొదట డైసాకరైడ్లుగా తరువాత సుక్రోజ్ మారుస్తుంది.
  2. ఇన్వర్టేస్ లేదా సుక్రేస్ ఎంజైమ్ సుక్రోస్ను గ్లూకోస్ మరియు ఫ్రక్టోస్ మారుస్తుంది.
  3. మాల్టేజ్ ఎంజైమ్ మాల్టోస్ ను గ్లూకోస్ గా మారుస్తుంది.
  4. లైపేస్ అనే ఎంజైమ్ కొవ్వులను కొవ్వు ఆమ్లాలు గాను, గ్లీసరాల్గా జలవిశ్లేషణ గావిస్తుంది.
  5. ప్రోటియేస్లు అనబడే ఎంజైములు మాంసకృత్తులను అమినో ఆమ్లాలుగా జీర్ణం చేస్తుంది.
  6. అంత్యాహార నాళంలో ఉండే సూక్ష్మజీవులు సెల్యులేస్ అనే ఎంజైమును స్రవించి సెల్యులోస్ న్ను గ్లూకోస్గా జీర్ణం చేస్తాయి.

జీర్ణమైన ఆహారం మధ్యాంత్రంలో శోషణం చెందుతుంది. జీర్ణం కాని ఆహార పదార్థాలు శేషాంత్రికం, పెద్దపేగు గుండా ప్రయాణించి పురుషనాళాన్ని చేరుతుంది. ఇక్కడ ఆహార పదార్థాలతో బాటుగా ఉన్న నీరు పునఃశోషణ గావించబడి జీర్ణంకాని ఆహార పదార్థాలు పొడిగా, ఘనరూపంలో ఉండే పెంటికలుగా విసర్జించబడతాయి.

ప్రశ్న 3.
బొద్దింక లాలాజల పరికరపు చక్కని పటాన్ని గీచి భాగాలను గుర్తించండి.
జవాబు:
AP Inter 1st Year Zoology Study Material Chapter 7 పెరిప్లానెటా అమెరికానా (బొద్దింక) 2

ప్రశ్న 4.
పెరిప్లానెటా హృదయ నిర్మాణం, విధిని వివరించండి.
జవాబు:
పెరిప్లానెటా హృదయం :
హృదయం హృదయావరణ రక్తకుహరంలో లేదా పృష్ఠకోటరంలో ఉంటుంది. ఇది పొడవాటి, కండరయుత, సంకోచశీల నాళం. ఇది పృష్ఠమధ్యాయుతంగా పక్షం, ఉదరంలోని పృష్ఠఫలకాల దిగువన ఉంటుంది. దీనిలో పదమూడు గదులుంటాయి. ప్రతీ గది దాని ముందరనున్న గదిలోకి తెరుచుకుంటుంది. పదమూడు గదుల్లో మూడు గదులు వక్షంలో, పది గదులు ఉదరంలో ఉంటాయి. దీని పరాంతం మూసుకొని ఉంటుంది. పూర్వాంతం, ముందుకు సాగి పూర్వ మహాధమనిగా కొనసాగుతుంది. చివరి గది తప్ప ప్రతీ గది పరాంతపు అంచులో ‘ఆస్టియా’ (Ostia) అనే ఒక జత చిన్న కవాటయుత రంధ్రాలుంటాయి. ఇవి రెండు వైపులా ఒక్కొక్కటి చొప్పున ఉంటాయి. కవాటాలు పృష్ఠ కోటరం నుంచి హృదయంలోకి మాత్రమే రక్తం ప్రసరించేలా అనుమతిస్తాయి.

AP Inter 1st Year Zoology Study Material Chapter 7 పెరిప్లానెటా అమెరికానా (బొద్దింక)

ప్రశ్న 5.
పెరిప్లానెటాలో రక్తప్రసరణ ప్రక్రియను వర్ణించండి.
జవాబు:
పెరిప్లానెటాలో రక్తం వర్ణరహితంగా ఉంటుంది. దీనిలో రక్త వర్ణకాలు ఉండవు. కనుక దీనిని రక్తశోషరసం అంటారు. దీనిలో జీవద్రవ్యం, స్వేచ్ఛా రక్తకణాలు ఉంటాయి.

బొద్దింక రక్తప్రసరణలో రక్తం రక్తనాళాలలో ప్రవహించదు. శరీర కుహరం రక్తంచే నింపబడి రక్త శరీర కుహరంగా పిలువబడుతుంది. రక్త ప్రసరణ వ్యవస్థలో ప్రధానంగా రక్తకుహరం, గుండె, రక్తం అనే భాగాలుంటాయి.

గుండె గదుల సంకోచం వల్ల గుండెలోని రక్తం ముందుకు ప్రవహిస్తుంది. ఈ రక్తం మహాధమనిలోకి ప్రవహించి, అక్కడి నుండి తలలోని కోటరానికి ప్రవహిస్తుంది. తల కోటరం నుంచి పర్యాంతరాగ కోటరాలకు, ఉదరఫలక కోటరాలకు ప్రవహిస్తుంది. పక్షాకార కండరాల సంకోచంతో హృదయావరణ విభాజకం కిందికి నెట్టబడుతుంది. ఈ చర్య హృదయావరణ కోటర ఘనపరిమాణాన్ని పెంచుతుంది. అందువల్ల రక్తం పర్యాంతరాంగ కోటరం నుంచి హృదయావరణ కోటరంలోకి హృదయావరణ విభాజకం రంధ్రాల ద్వారా ప్రవహిస్తుంది. పక్షాకార కండరాల సడలిక వల్ల, హృదయావరణ విభాజకం పైకి అంటే దాని అసలైన ప్రదేశంలోకి చేరుతుంది. ఇది రక్తాన్ని ఒత్తిడి చేసి హృదయావరణ కోటరం నుంచి ఆస్టియంల ద్వారా గుండె గదులకు చేరుతుంది.
AP Inter 1st Year Zoology Study Material Chapter 7 పెరిప్లానెటా అమెరికానా (బొద్దింక) 3

ప్రశ్న 6.
పక్షాకార కండరాల సంకోచ సడలికలు ఏ విధంగా రక్తప్రసరణలో తోడ్పడతాయి?
జవాబు:
రక్త ప్రసరణలో పక్షాకార కండరాల సంకోచ, వ్యాకోచాలు చాలా ముఖ్యమైన పాత్ర వహిస్తాయి. రక్త, రక్తనాళాలలో కాక . కోటరాలలో ప్రవహిస్తుంది. పక్షాకార కండరాల సంకోచంతో హృదయావరణ విభాజకం క్రిందికి నెట్టబడుతుంది. ఈ చర్య హృదయావరణ కోటర ఘనపరిమాణాన్ని పెంచుతుంది. అందువలన పర్యాంతరాంగ కోటరం నుండి హృదయావరణ కోటరంలోకి రక్తం హృదయావరణ విభాజకం రంధ్రాల ద్వారా ప్రవహిస్తుంది.

పక్షాకార కండరాల సడలిక వలన హృదయావరణ విభాజకం పైకి అనగా దాని అసలు ప్రదేశానికి చేరుతుంది. దీనివలన హృదయావరణ కోటరంలోని రక్తంపై ఒత్తిడి కలుగజేయటం వలన రక్తం హృదయావరణ కోటరం నుండి ఆస్టియంల ద్వారా గుండె గదులకు చేరుతుంది.

ప్రశ్న 7.
పెరిప్లానెటాలో గల వివిధ విసర్జక అవయవాలు ఏవి ? విసర్జనక్రియను వివరంగా వర్ణించండి.
జవాబు:
బొద్దింక విసర్జక వ్యవస్థ నత్రజని సంబంధిత వ్యర్థాలను దేహం నుండి గ్రహించి యూరిక్ ఆమ్ల రూపంలో వెలుపలికి విసర్జించడానికి తోడ్పడుతుంది. అందువలన పెరిప్లానేటాను యూరికోటెలిక్ జీవి అంటారు. బొద్దింకలో విసర్జన క్రియను నిర్వర్తించే సంబంధింత అవయవాలు లేదా నిర్మాణాలు మాల్ఫీజియన్ నాళికలు, కొవ్వు దేహాలు, యూరికోజ్ గ్రంథులు, వృక్కకణాలు, అవభాసిని.

మాల్ఫీజియన్ నాళికలు :
మాల్ఫీజియన్ నాళికల గ్రంథి కణాలు నీటిని, CO2, లవణాలను నత్రజని వ్యర్థాలను రక్తం నుంచి శోషించి, నాళికా కుహరంలోకి స్రవిస్తాయి. నాళికల సమీపాగ్ర భాగ కణాలు నీటిని, కొన్ని ఉపయుక్త లవణాలను పునఃశోషణ చేస్తాయి. మిగిలిన విసర్జిత భాగం శేషాంత్రికంలోకి నెట్టబడుతుంది. ఇందులోని చాలా నీరు పునఃశోషణ చేయబడి, పురీష నాళాన్ని చేరినప్పుడు మరింత నీరు పునఃశోషణ జరిగి యూరిక్ ఆమ్లం దాదాపు ఘనరూపంలో మలంతోబాటు విసర్జించబడుతుంది.

కొవ్వు దేహాలు :
కొవ్వు దేహం అనేది తెల్లటి లంబికల నిర్మాణం. ఈ దేహంలోని యూరేట్ కణాలు విసర్జనలో తోడ్పడతాయి. ఈ కణాలు జీవితాంతం యూరిక్ ఆమ్లాన్ని శోషణం చేసి నిల్వ చేస్తాయి. వసాదేహం కణాలలో ఉన్న ఈ విధమైన నిల్వ పద్ధతిని ‘నిల్వవిసర్జన’ (Storage excretion) అంటారు.

యూరికోజ్ గ్రంథులు :
మగ బొద్దింక మష్రూమ్ గ్రంథిలో ఉన్న యూరికోజ్ గ్రంథి (Uricose gland) లేదా యుట్రిక్యులై మేజోర్స్ (Utriculi majores) లో యూరిక్ ఆమ్లం నిల్వ ఉంటుంది. అవి సంపర్క సమయంలో దీన్ని విసర్జిస్తాయి.

అవభాసిని :
కొన్ని నత్రజని సంబంధిత వ్యర్థపదార్థాలు అవభాసినిపై నిక్షేపం చెంది నిర్మోచన సమయంలో తొలగించబడతాయి.

ప్రశ్న 8.
పెరిప్లానెటా నీటిని ఏ విధంగా సంరక్షిస్తుంది? దీన్ని విసర్జనక్రియ ఆధారంగా తెలపండి.
జవాబు:
బొద్దింక మామూలుగా నీటిని తీసుకొని ఆహారంతో పాటుగా వచ్చే నీటిని ఇది దేహంలో కొన్ని పొదుపు చర్యలు పాటిస్తూ సంరక్షించుకుంటుంది.
1) దేహం మొత్తం కైటిన్ నిర్మిత ఫలకాలచే కప్పబడి ఉండుట వలన స్వేదం రూపంలో వ్యర్థం కానివ్వదు.

2) విసర్జన యూరికామ్ల రూపంలో విసర్జిస్తుంది కనుక నీరు వ్యర్థమవదు. నీటిని సంరక్షించుకోవడంలో బొద్దింకలో విసర్జన అవయావలు, మాల్ఫీజియన్ నాళికలు, పురీషనాళం, కొవ్వు దేహాలు, యూరికోస్ గ్రంథులు, అవభాసిని విసర్జన క్రియలో ముఖ్య పాత్ర వహిస్తాయి. మాల్ఫీజియన్ నాళికలు రక్తంలోని నత్రజని సంబంధిత వ్యర్థాలను, CO2 ను ఇతర విసర్జక పదార్థాలను, నీటిని శోషిస్తుంది. దీనిలో సమీపాగ్ర భాగం ఉపయుక్త పదార్థాలను, నీటిని పునఃశోషణ కావిస్తుంది. ఇప్పుడు విసర్జక పదార్థం శేషాత్రికంలోకి నెట్టబడుతుంది. ఇక్కడ చాలా వరకు నీరు పునఃశోషణ గావించబడుతుంది. తరువాత విసర్జక పదార్థం పురీషనాళం చేరుతుంది. ఇక్కడ మరింతగా నీరు పునఃశోషణ జరిగి యూరిక్ ఆమ్ల రూపంలో దాదాపు ఘన పదార్థ విసర్జింపబడుతుంది.

పై విధంగా ఆహార నాళం ద్వారా నత్రజని సంబంధ వ్యర్థాలను విసర్జిస్తూ, వ్యర్థ పదార్థాలలోని నీటిని పూర్తిగా పునఃశోషణ గావిస్తూ యూరికామ్ల రూపంలో విసర్జించడం నీటిని సంరక్షించుకునే అనుకూలనం.

ప్రశ్న 9.
నేత్రాంశాన్ని చక్కని పటం గీసి భాగాలతో వివరించండి.
జవాబు:
AP Inter 1st Year Zoology Study Material Chapter 7 పెరిప్లానెటా అమెరికానా (బొద్దింక) 4

ప్రశ్న 10.
మగ, ఆడ బొద్దింకలను ఏ విధంగా గుర్తిస్తారు ? వాటి బాహ్య, అంతర జననాంగాలను, లక్షణాలను వివరించండి.
జవాబు:
పెరిప్లానేటా ఏకలింగ జీవి. స్త్రీ, పురుష జీవుల్లో బాగా అభివృద్ధి చెందిన ప్రత్యుత్పత్తి అవయవాలుంటాయి. లైంగిక ద్విరూపకత బాహ్యంగాను, అంతర్గతంగాను స్పష్టంగా కనిపిస్తుంది. స్త్రీ జీవి ఉదరం పొట్టిగా, వెడల్పుగా ఉంటుంది. దాని పరాంతంలో అండ నిక్షేపం ఉంటుంది. పురుష జీవి ఉదరం సన్నగా, పొడవుగా ఉంటుంది. దీని పరాంతంలో ఒక జత పాయు శూకాలు ఉంటాయి.

జీవి ఉదరభాగాన్ని పరిశీలిస్తే పృష్ఠ ఫలకాలు 10 ఉంటాయి కాని ఉరఃఫలకాలు తొమ్మిది మాత్రమే ఉంటాయి. పదో ఉరః ఫలకం ఉండదు. మగజీవిలో ఎనిమిదో పృష్ఠఫలకం, స్త్రీ జీవులలో ఎనిమిదో, తొమ్మిదో పృష్ఠ ఫలకాలు కనపడవు. మగజీవిలో తొమ్మిది ఉరఃఫలకాలు, స్త్రీ జీవిలో ఏడు ఉరఃఫలకాలు కనబడతాయి. ఏడో, ఎనిమిదో, తొమ్మిదవ ఉరఃఫలకాలు కలిసి గుడ్ల సంచిని ఏర్పరుస్తాయి.

మగ జీవిలో ఉదరానికి పరభాగంలో ఒక జత పాయు ఉపాంగాలు, ఒక జత పాయుకీలాలు, గొనాపోఫైసిస్లు ఉంటాయి. పాయువాంగాలు అతుకుల సహితంగా ఉండి పదోషృష్ఠఫలకం పార్శ్వ భాగాల నుంచి ఏర్పడతాయి. ఇవి స్త్రీ, పురుష జీవులలోనూ ఉంటాయి. పాయుకీలాలు అతుకుల రహితంగా ఉండి తొమ్మిదో ఉరః ఫలకం నుండి ఏర్పడతాయి. ఇవి మగ జీవులలో మాత్రమే ఉంటాయి. ఐనాపోఫైసిస్లు మగ జీవులలో తొమ్మిదో ఉరఃఫలకం, స్త్రీ జీవులలో ఎనిమిదో, తొమ్మిదో ఉరః ఫలకాల నుండి వచ్చే చిన్న కైటిన్ నిర్మితాలు. ఇవి బాహ్య జననాంగాలు. ఉదరానికి పరభాగంలో పాయువు ఉంటుంది. మగ జీవులలో జనన రంధ్రం పాయువు కింద, ఒక గొనాపోఫైసిస్ పైన ఉంటుంది. స్త్రీ జీవుల్లో అది ఎనిమిదో ఉరఃఫలకంపై ఉంటుంది.

AP Inter 1st Year Zoology Study Material Chapter 7 పెరిప్లానెటా అమెరికానా (బొద్దింక)

ప్రశ్న 11.
బొద్దింక పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థను వర్ణించండి.
జవాబు:
AP Inter 1st Year Zoology Study Material Chapter 7 పెరిప్లానెటా అమెరికానా (బొద్దింక) 5
పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థ :
పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థలో ఒక జత ముష్కాలు ఉంటాయి. ఇవి పొడవుగా ఉండే లంబికలు గల నిర్మాణాలు. ఇవి నాలుగు నుంచి ఆరు ఉదర ఖండితాలు పార్శ్వ భాగాలలో ఇరువైపులా కొవ్వు దేహాల్లో ఇమిడి ఉంటాయి. ఒక్కో ముష్కం పరభాగం నుంచి సన్నటి శుక్రవాహిక (Vas deferens) ఆరంభమవుతుంది. రెండు శుక్రవాహికలు వెనుకకు లోపలి వైపుగా ప్రయాణించి ఏడో ఖండితంలోని వెడల్పైన మధ్యస్థ స్కలననాళం (Ductus ejaculatus) లోకి తెరచుకుంటాయి. ఆ ఆరో ఏడో ఉదర ఖండితాల్లో ఒక పుట్టగొడుగు ఆకారపు గ్రంథి ఉంటుంది. ఇది అదనపు ప్రత్యుత్పత్తి గ్రంథిలాగా పనిచేస్తుంది. ఈ గ్రంథిలో రెండు రకాల నాళికలు ఉంటాయి. 1) పొడవైన సన్నటి నాళికలు యుట్రిక్యులై మేజోర్స్ (Utriculi majores) లేదా ‘పరిధీయ నాళికలు’, 2) పొట్టిగా ఉండే యుట్రిక్యులై బ్రివోర్స్ నాళికలు (Utriculi breviores) యుట్రిక్యులై మేజోర్స్ శుక్రగుళిక లోపలి స్తరాన్ని ఏర్పరచగా, యుట్రిక్యులై బ్రివోర్స్ శుక్రకణాలకు పోషణనిస్తాయి. ఈ నాళికలు స్కలననాళిక (Ejaculatory duct) పూర్వభాగంలో తెరుచుకుంటాయి.

శుక్రాశయాలు, స్కలన నాళిక ఉదరంలో ఉంటాయి. ఇవి శుక్రకణాలను కట్టలుగా చేసి నిల్వ ఉంచుతాయి. వీటిని శుక్రగుళికలు (Spermatophores) అంటారు. స్కలన నాళం కండరయుతమైంది. ఇది పరాంతం వరకు సాగి ‘పురుష జననరంధ్రం’ (Gonopore) లోకి తెరుచుకుంటుంది. బొద్దింక పురుష జననాంగాలతో పాటూ, ఒక ఫేలిక్ (Phallic) లేదా కాంగ్లోబేట్ (Conglobate) గ్రంథి ఉంటుంది. దీని నాళం జననరంధ్రం దగ్గర తెరుచుకుంటుంది. దీని విధి ఇంతవరకు తెలియదు. పురుష జననరంధ్రం చుట్టూ అసౌష్ఠవమైన కైటినస్ నిర్మాణాలు అంటే, ఫేలిక్ అవయవాలు లేదా గొనాపోఫైసిస్లు లేదా ఫెలోమియర్లు ఉంటాయి. ఇవి సంపర్కంలో తోడ్పడతాయి. ఇవి పురుషజీవి బాహ్య జననాంగాలు.

ప్రశ్న 12.
బొద్దింక స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థను వర్ణించండి.
జవాబు:
స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థ :
స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థలో ఒక జత స్త్రీ బీజకోశాలు, ఒక జత స్త్రీ బీజవాహికలు, యోని, శుక్రగ్రాహికలు, శుక్రగ్రాహిక సూక్ష్మాంకురం మరియు కొల్లాటీరియల్ గ్రంథులు ఉంటాయి.

స్త్రీ బీజకోశాలు :
ఒక జత పెద్ద స్త్రీ బీజకోశాలు 2-6 ఉదర ఖండిత పార్శ్వ భాగాలలో ఉంటాయి. ఇవి లేత పసుపు రంగులో కొవ్వు దేహాలతో చుట్టబడి ఉంటాయి. ప్రతి స్త్రీ బీజకోశానికి ఎనిమిది స్త్రీ బీజకోశనాళికలు లేదా ఒవేరియోల్స్ (Ovarioles) ఉంటాయి. ఒక్కొక్క ఒవేరియోల్కు జర్మేరియమ్ (Germarium) అనే సాగి మొనదేలి ఉన్న పూర్వాంత పోగు, వెడల్పైన పరాంత విటలేరియం (Vitellarium) ఉంటాయి. జర్మేరియంలో అభివృద్ధి చెందుతున్న అనేక అండదశలు, విటలేరియంలో సొనతో పాటు పరిపక్వ అండాలు ఉంటాయి. ఒక్కొక్క స్త్రీ బీజకోశంలో ఉన్న ఒవేరియోల్ల సన్నగా సాగిన అంచులన్నీ కలిసి ఒక తాడుగా మారి పృష్ఠ దేహకుడ్యానికి అతుక్కొంటుంది. పరాంత అంచులు కలిసి కురచని వెడల్పైన స్త్రీ బీజవాహిక (Oviduct) గా ఏర్పడుతుంది. స్త్రీ బీజవాహికలు కలసిపోయి మధ్యలో అతి చిన్న యోని (Vagina) ఏర్పడుతుంది.
AP Inter 1st Year Zoology Study Material Chapter 7 పెరిప్లానెటా అమెరికానా (బొద్దింక) 6

యోని నిలువు రంధ్రాన్ని స్త్రీ జననరంధ్రం అంటారు. ఇది ఎనిమిదో ఉరఃఫలకంలో పెద్ద జననాశయం (Genital pouch) లోకి తెరుచుకుంటుంది., శుక్రగ్రాహిక లేదా శుక్రధానం (Seminal receptacle) ఎడమవైపున తిత్తితో, కుడివైపున పోగులాంటి అంధనాళంతో 6వ ఖండితంలో ఉంటుంది. ఇది 9వ ఉరః ఫలకంలోని జననాశయంలో ఒక మధ్యస్థ రంధ్రం ద్వారా తెరుచుకుంటుంది. ఫలవంతమైన స్త్రీ జీవిలో శుక్రగ్రాహికలు సంపర్కం ద్వారా గ్రహించిన శుక్రగుళికలను కలిగి ఉంటాయి.

స్త్రీ బీజకోశాల వెనక ఒక జత శాఖాయుతమైన కొల్లాటీరియల్ గ్రంథులు (Colleterial glands) ఉంటాయి. ఈ గ్రంథులు శుక్రగ్రాహిక రంధ్రం పైన వేర్వేరుగా జననాశయంలోకి తెరుచుకుంటాయి. ఈ రెండు కొల్లాటీరియల్ గ్రంథుల స్రావకాలు గుడ్ల చుట్టూ ఒక దృఢమైన పెట్టెను ఏర్పరుస్తాయి. దీన్నే గుడ్లుపెట్టె లేదా గుడ్లకోశం లేదా ఊథీకా (Ootheca) అంటారు. జననాశయం ఏడో, ఎనిమిదో, తొమ్మిదో ఉదర ఖండితాల ఉరఃఫలకాలతో ఏర్పడుతుంది. ఏడో ఖండిత ఉరః ఫలకం పడవ ఆకారంలో ఉంటుంది. ఇది జననాశయం అడుగు, పక్క భాగంలో గోడలను ఏర్పరుస్తుంది. ఎనిమిదో, తొమ్మిదో ఖండితాల ఉరఃఫలకాలు ఏడో ఖండితంలో చొచ్చుకొని వరుసగా జననాశయం పూర్వాంతపు గోడ, దాని పైకప్పుగా ఏర్పడతాయి. జననాశయానికి రెండు గదులు ఉంటాయి. అవి : పూర్వాంతపు గైనాట్రియం (Gynatrium) లేదా జననకోశం, పరాంతపు వెస్టిబ్యులమ్ (Vestibulum) లేదా గుడ్లకోశం.

స్త్రీ జననరంధ్రం చుట్టూ మూడు జతల కైటిన్ నిర్మిత ఫలకాలు ఉంటాయి. వీటిని గొనాపోఫైసిస్లు అంటారు. ఇవి అండ విక్షేపకం (Ovipositor) గా ఏర్పడి అండాలకు గుడ్లకోశంలోకి మార్గం చూపుతాయి. ఇవి స్త్రీ బాహ్య జననాంగాలు.

దీర్ఘ సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
బొద్దింక జీర్ణవ్యవస్థను భాగాలు గుర్తించిన చక్కని పటం సహాయంతో వర్ణించండి.
జవాబు:
బొద్దింక జీర్ణవ్యవస్థ :
బొద్దింక జీర్ణవ్యవస్థలో ఆహారనాళం, దానికి సంబంధించిన అనుబంధ గ్రంథులు ఉంటాయి. నోటి ముందు, నోటి భాగాలు చుట్టి ఉన్న పూర్వకుహరం ఉంటుంది. అధోగ్రసని ఈ కుహరాన్ని రెండు కక్ష్యలుగా విభజిస్తుంది. అవి సిబేరియమ్ (Cibarium) (పూర్వభాగం), సెలైవేరియమ్ (Salivarium) (పరభాగం).

AP Inter 1st Year Zoology Study Material Chapter 7 పెరిప్లానెటా అమెరికానా (బొద్దింక) 7
ఆహారనాళం :
బొద్దింక ఆహారనాళం అక్కడక్కడా మెలికలు పడి చాలా పొడవుగా ఉంటుంది. ఇది నోరు, పాయువుల మధ్య విస్తరించి ఉంటుంది. ఇది మూడు ప్రాంతాలుగా విభజించబడింది. లాలాజల గ్రంథులు
అవి – పూర్వాహారనాళం లేదా ఆద్యముఖం (Stomodaeum), మధ్యాహార నాళం లేదా మధ్యాంత్రం (Mesenteron), అంత్యాహార నాళం లేదా పాయుపథం (Proctodaeum), పూర్వాహారనాళం, అంత్యాహార నాళం లోపలివైపు బాహ్యస్త్వచంతో ఆవరించబడ్డాయి. మధ్యాహారనాళం అంతస్త్వచ కణాలతో ఆవరించి ఉంటుంది.

పూర్వాహారనాళం :
పూర్వాహారనాళంలో గ్రసని, ఆహార వాహిక, అన్నాశయం, అంతరజఠరం ఉంటాయి. దీని లోపలితలంలో కైటిన్ నిర్మిత అవభాసిని ఉంటుంది. నోరు గ్రసని (Pharynx) లోకి, మాల్ఫీజియన్ గ్రసని సన్నని గొట్టం లాంటి ఆహారవాహిక (Oesophagus) లోకి తెరుచు కుంటుంది. ఆహారవాహిక పరభాగంలోని సాగే గుణం గల సంచి లాంటి అన్నాశయం (crop) లోకి తెరచుకొంటుంది. అన్నాశయం ఆహారాన్ని నిల్వ ఉంచుతుంది. దీని వెలుపలి తలం వాయునాళాల జాలకంతో ఆవరించబడి ఉంటుంది.

అన్నాశయానికి పరభాగంలో కండరాలతో కూడిన మందమైన గోడలు గల పూర్వగ్రంథుల జఠరిక (Proventriculus) లేదా అంతర జఠరం (Gizzard) ఉంటుంది. దాని లోపలి కైటిన్ పొరకు గల ఆరు శక్తిమంతమైన దంతాలు ప్రభావవంతమైన నమిలే పరికరంగా ఏర్పడతాయి. ప్రతి దంతం వెనకగా రోమాలు కలిగిన మెత్త ఉంటుంది. వీటికి వెనకవైపు గండు రోమాలు ఉంటాయి. ఈ ఫలకాల మధ్య ఆహారం సన్నటి రేణువులుగా విసరబడుతుంది. గండు రోమాలు ఆహారాన్ని వడపోస్తాయి. అంతర జఠరం పిండిమరలాగా, జల్లెడగా పనిచేస్తుంది. అంతర జఠరం నుంచి ఏర్పడిన త్వచ నిర్మాణం ఒక గరాటు లాంటి ఆద్యముఖ కవాటంగా (Stomodeal valve) ఏర్పడుతుంది. మధ్యాంత్రం చేరిన ఆహారం తిరిగి అంతర జఠరంలోకి ప్రవేశించకుండా (వెనకకు మళ్లడం) ఈ కవాటం నివారిస్తుంది.

మధ్యాహారనాళం (మధ్యాంత్రం లేదా గ్రంథుల జఠరిక) :
మధ్యాహారనాళం లేదా మధ్యాంత్రం అంతర జఠరం వెనక ఒక సన్నటి కురచ గొట్టంలా ఉంటుంది. దీన్ని మధ్యాంత్ర (Mesenteron) లేదా గ్రంథుల జఠరిక (Ventriculus) అంటారు. మధ్యాంత్రానికి అంతర జఠరానికి మధ్యలో 6 నుంచి 8 వేళ్ళ లాంటి అంధ బాహువులు మధ్యాంత్రం నుంచి ఉత్పన్నమవుతాయి, వీటిని కాలేయాంధ నాళాలు (Hepatic caecae) అంటారు. ఆహారపదార్థాలను జీర్ణం చేయడం, శోషణ జరపడం కాలేయాంధనాళాల విధి. మధ్యాంత్రంలో రెండు భాగాలు ఉంటాయి. అవి – పూర్వ స్రావక భాగం, పర శోషణ భాగం.

మధ్యాంత్రంలోని స్రావక భాగంలో గ్రంథి కణాలుండి చాలా రకాల ఎంజైమ్లను స్రవిస్తాయి. మధ్యాంత్రాన్ని చేరిన ‘ఆహారపు ముద్ద’ చుట్టూ రంధ్రయుతమైన కైటిన్ నిర్మిత పొర, పెరిట్రాఫిక్ త్వచం (Peritrophic membrane) ఉంటుంది. ఈ త్వచాన్ని అంతరజఠరపు గరాటు లాంటి ఆద్యముఖ కవాటం స్రవిస్తుంది.

మధ్యాంత్రపు పరభాగంలో పెరిట్రాఫిక్ త్వచం ద్వారా జీర్ణమైన ఆహారం రక్తంలోకి శోషణ చెందుతుంది. గట్టిగా ఉన్న ఆహారరేణువుల వల్ల మధ్యాంత్రకుడ్యం దెబ్బతినకుండా పెరిట్రాఫిక్ త్వచం రక్షిస్తుంది. మధ్యాంత్రం అంత్యాహారనాళంలోకి తెరచుకొనే రంధ్రాన్ని సంవరణి కండరం (Sphincter muscle) నియంత్రిస్తుంది. ఇది జీర్ణం కాని ఆహారాన్ని, యూరిక్ ఆమ్లాన్ని అంత్యాహారనాళం నుంచి తిరిగి మధ్యాంత్రంలోకి ప్రవేశించకుండా నివారిస్తుంది.

AP Inter 1st Year Zoology Study Material Chapter 7 పెరిప్లానెటా అమెరికానా (బొద్దింక) 8
అంత్యాహారనాళం లేదా పాయుపథం :
అంత్యాహార నాళాన్ని పాయుపథం అని కూడా అంటారు. ఇది పొడవైన మెలికలు తిరిగిన నాళం. దీనిలో మూడు భాగాలు ఉంటాయి. అవి శేషాంత్రికం (lleum), పెద్దపేగు (Colon), పురీషనాళం (Rectum). అంత్యాహారనాళ లోపలి తలాన్ని ఆవరించి కైటినన్ అవభాసిని ఉంటుంది. మధ్యాంత్రానికి వెనకవైపున ఉన్న పొట్టి నాళాన్ని శేషాంత్రికం అంటారు. మధ్యాంత్రం శేషాంత్రికం కలిసేచోట ఆరు కట్టలుగా అమరిన లేత పసుపురంగు అంధనాళికలైన మాల్ఫీజియన్ నాళికలు (Malpighian tubules) ఉంటాయి. ఇవి విసర్జకావయవాలు. శేషాంత్రికం మధ్యాంత్రం నుంచి జీర్ణం కాని ఆహారపదార్థాన్ని, మాల్ఫీజియన్ నాళికల నుంచి యూరిక్ఆమ్లాన్ని గ్రహిస్తుంది. ఇది తరవాతి పొడవైన మెలికలు తిరిగిన కోలాన్ లేదా పెద్ద పేగులోకి తెరుచుకొంటుంది. పెద్దపేగు పొట్టిగా వెడల్పుగా ఉన్న పురీషనాళంలోకి తెరుచుకొంటుంది. ఇది పాయువు ద్వారా బయటికి తెరుచుకొంటుంది. దీని లోపలితలంలో ఆరు నిలువు మడతలు ఉంటాయి. వీటిని పురీషనాళసూక్ష్మాంకురాలు (Rectal papillae) అంటారు. ఇవి జీర్ణం కాని ఆహారపదార్థం నుంచి నీటిని పునఃశోషణ కావిస్తాయి.

బొద్దింక ఆహారనాళానికి అనుబంధంగా ఉండే జీర్ణగ్రంథులు – లాలాజల గ్రంథులు, కాలేయాంధనాళాలు, మధ్యాంత్రంలోని గ్రంథి కణాలు.

లాలాజల గ్రంథులు (Salivary glands) :
ఒక జత లాలాజలగ్రంథులు అన్నాశయానికి ఇరువైపులా ఒక్కొక్కటి చొప్పున ఉదర పార్శ్వతలంలో అంటిపెట్టుకొని ఉంటాయి. ఒక్కొక్క లాలాజల గ్రంథిలో రెండు లంబికలు ఉంటాయి. ఒక్కొక్క లంబికలో ఎసినై (Acini) అనబడే అనేక సూక్ష్మ లంబికలు ఉంటాయి.

ప్రతి ఎసినస్ సూక్ష్మనాళికను కలిగి ఉన్న స్రావక కణాలైన జైమోజన్ కణాలను (Zymogen cells) కలిగి ఉంటుంది. ఒక వైపున ఉన్న రెండు లంబికలకు చెందిన సూక్ష్మనాళికలన్నీ ఐక్యలాలాజలనాళాన్ని (Common salivary duct) ఏర్పరుస్తాయి. రెండు వైపుల నుంచి ఏర్పడిన ఈ ఐక్య లాలాజల నాళాలు కలిసి మధ్య లాలాజలనాళంగా (Median salivary duct) ఏర్పడతాయి. మధ్యభాగంలో ఒక్కొక్కవైపున ఉన్న రెండు లాలాజల లంబికల మధ్య తిత్తిలాంటి లాలాజలాశయం (salivary receptacle) ఉంటుంది. ఇది లాలాజలాన్ని నిలువ చేస్తుంది. ఇది లాలాజలాశయ నాళం లేదా ‘ఆశయనాళం’కు ఏర్పడుతుంది.

ఇరువైపుల నుంచి ఏర్పడిన లాలాజలాశయనాళాలు కలిసి ఐక్య లాలాజలాశయనాళం లేదా ‘ఐక్య ఆశయనాళం’ (Reservoir duct) ఏర్పడుతుంది. మధ్య లాలాజలనాళం ఐక్య లాలాజలనాళంలోకి తెరుచుకొంటుంది. తరువాత ఇవి రెండూ కలిసి అపవాహి లాలాజలనాళంగా (Efferent salivary duct) ఏర్పడతాయి. అపవాహి లాలాజలనాళం అధోగ్రసని పీఠభాగం వద్ద తెరుచుకొంటుంది. ఎసినార్ కణాలు లాలాజలాన్ని స్రవిస్తాయి. దీనిలో పిండిపదార్థాలను జీర్ణం చేసే అమైలేస్ (Amylase) లాంటి ఎంజైములు ఉంటాయి. కాలేయాంధనాళాలు (Hepatic Caecae).

వీటిని ‘మధ్యాంత్ర అంధనాళాల’ని కూడా అంటారు. వీటిలో స్రావక సంబంధమైన, శోషణం జరిపే కణాలు ఉంటాయి. మధ్యాంత్ర గ్రంథి కణాలు.

మధ్యాంత్ర గ్రంథికణాలు మాల్టేస్, ఇన్వర్టేస్, ప్రోటియేజెస్, లైపేన్ లాంటి ఎంజైములను స్రవిస్తాయి.

AP Inter 1st Year Zoology Study Material Chapter 7 పెరిప్లానెటా అమెరికానా (బొద్దింక)

ప్రశ్న 2.
పెరిప్లానెటా రక్తప్రసరణవ్యవస్థను వివరంగా వర్ణించి, చక్కని పటాన్ని గీసి భాగాలను గుర్తించండి. [Mar. ’14]
జవాబు:
పెరిప్లానెటా రక్తప్రసరణ వ్యవస్థ :
రక్తప్రసరణవ్యవస్థ జీర్ణమైన ఆహారాన్ని హార్మోనులను మొదలైనవాటిని దేహంలో ఒక భాగం నుంచి మరొక భాగానికి రవాణా చేయడంలో తోడ్పడుతుంది. పెరిప్లానెటా రక్తప్రసరణవ్యవస్థ వివృత రకం (Open type), ఎందుకంటే దీనిలో రక్తం, రక్తశోషరసం, శరీరకుహరంలో లేదా రక్తకుహరంలో స్వేచ్ఛగా ప్రవహిస్తాయి. రక్తనాళాలు అంతగా అభివృద్ధి చెందలేదు. అవి వివిధ కోఠరాల్లోకి తెరుచుకొంటాయి. రక్తకుహరంలో ఉన్న అంతరాంగ అవయవాలు రక్తంలో మునిగి ఉంటాయి. పెరిప్లానెటా రక్తప్రసరణవ్యవస్థలో మూడు ముఖ్యమైన అనుబంధిత భాగాలు – రక్తకుహరం, గుండె, రక్తం ఉంటాయి.

రక్తకుహరం :
బొద్దింక రక్తకుహరం రెండు కండరయుత అడ్డు త్వచాలలో అంటే పృష్ఠ విభాజక పటలం (Dorsal diaphragm) లేదా హృదయావరణ విభాజకం, ఉదర విభాజకం (Ventral diaphragm) తో మూడు కోటరాలుగా విభజించబడింది. రెండు విభాజక పటలాలకు రంధ్రాలు ఉంటాయి. దేహంలోని ప్రతీ ఖండితానికి పార్శ్వతలాల్లో ఒక జత త్రిభుజాకార పక్షాకార కండరాలు (Alary muscles) ఒక శ్రేణిలో ఉంటాయి. ఇవి వెడల్పైన ఆధారంతో హృదయావరణ విభాజకానికి మొనదేలిన అంచు లేదా అగ్రంతో పృష్ఠ ఫలకాలకు అతుక్కొని ఉంటాయి. రక్తకుహరంలో ఉన్న మూడు కోటరాలు – హృదయావరణ రక్తకుహరం (Pericardial haemocoel) లేదా ‘పృష్ఠకోటరం’ (Dorsal sinus) పర్యాంతరాంగ రక్తకుహరం లేదా ‘మధ్యకోటరం’, ఉదరఫలక రక్తకుహరం (Perivisceral haemocoel) లేదా ‘ఉదరకోటరం’ లేదా పరినాడీ కోటరం’ (Perineural sinus) . అన్నింటిలో మధ్యకోటరం చాలా పెద్దది. ఎందుకంటే దీనిలో చాలా అంతరాంగ అవయవాలు ఉంటా ఉంటాయి. పృష్ఠ, ఉదర కోటరాలు చిన్నవి. వీటిలో గుండె, నాడీదండం మాత్రమే ఉంటాయి.
AP Inter 1st Year Zoology Study Material Chapter 7 పెరిప్లానెటా అమెరికానా (బొద్దింక) 9

హృదయం :
హృదయం హృదయావరణ రక్తకుహరంలో లేదా పృష్ఠకోటరంలో ఉంటుంది. ఇది పొడవాటి, కండరయుత, సంకోచశీల నాళం. ఇది పృష్ఠమధ్యాయుతంగా వక్షం, ఉదరంలోని పృష్ఠఫలకాల దిగువన ఉంటుంది. దీనిలో పదమూడు గదులుంటాయి. ప్రతీ గది దాని ముందరనున్న గదిలోకి తెరుచుకొంటుంది. పదమూడు గదుల్లో మూడు గదులు వక్షంలో, పది గదులు ఉదరంలో ఉంటాయి. దీని పరాంతం మూసుకొని ఉంటుంది. పూర్వాంతం, ముందుకు సాగి పూర్వ మహాధమనిగా కొనసాగుతుంది. చివరి గది తప్ప ప్రతీ గది పరాంతపు అంచులో ‘ఆస్ట్రియా’ (Ostia) అనే ఒక జత చిన్న కవాటయుత రంధ్రాలుంటాయి. ఇవి రెండు వైపులా ఒక్కొక్కటి చొప్పున ఉంటాయి. కవాటాలు పృష్ఠ కోటరం నుంచి హృదయంలోకి మాత్రమే రక్తం ప్రసరించేలా అనుమతిస్తాయి.

ప్రశ్న 3.
బొద్దింకలో శ్వాసవ్యవస్థను భాగాలు గుర్తించిన చక్కని పటం సహాయంతో వర్ణించండి.
జవాబు:
బొద్దింక శ్వాసవ్యవస్థ :
బొద్దింక రక్తంలో ఆక్సిజన్ని గ్రహించి రవాణా చేసే శ్వాసవర్ణకం ఉండదు. అందువల్ల అది అవసరమైన ఆక్సిజన్ను కణజాలాలకు అందించలేదు. వాతావరణంలోని ఆక్సిజన్ను నేరుగా కణజాలాలకు అందించే విధంగా శ్వాసనాళ వ్యవస్థ అభివృద్ధి. చెందింది. బొద్దింక శ్వాసవ్యవస్థలో శ్వాసరంధ్రాలు, వాయునాళాలు, వాయునాళికలు అనే భాగాలు ఉంటాయి.

శ్వాసరంధ్రాలు :
10 జతల శ్వాసరంధ్రాల (Stigmata or spiracles) ద్వారా శ్వాసనాళ వ్యవస్థ పరిసరాలతో సంబంధాన్ని కలిగి ఉంటుంది. మొదటి రెండు జతల శ్వాసరంధ్రాలు వక్ష ఖండితాలలో ఉంటాయి. వీటిలో ఒక జత మధ్యవక్షంలోనూ, రెండో జత అంత్యవక్షంలోనూ ఉంటాయి. మిగిలిన ఎనిమిది జతలు ఉదరం మొదటి ఎనిమిది ఖండితాలలో ఉంటాయి. ఈ రంధ్రాలు ఆయా ఖండితాల పార్శ్వఫలకాలలో ఉంటాయి. శ్వాసరంధ్రాల సంఖ్య, వాటి స్వభావాన్ని బట్టి కీటకాల శ్వాసవ్యవస్థను వర్గీకరిస్తారు. కనీసం మూడు జతల క్రియాత్మక శ్వాసరంధ్రాలు ఉంటే దాన్ని పాలీన్యూస్టిక్ (Polyneustic type) రకం అంటారు. మొత్తం జతలూ క్రియాత్మక శ్వాసరంధ్రాలయితే దాన్ని హోలోన్యూస్టిక్ రకం (Holoneustic type) అంటారు. అన్ని శ్వాసరంధ్రాలు కవాటయుతంగా ఉంటాయి. ప్రతి రంధ్రాన్ని చుట్టి కైటిన్తో తయారైన పెరిట్రీమ్ (Peretreme) అనే వర్తులాకార ఫలకం ఉంటుంది. ధూళి రేణువులు లోపలికి ప్రవేశించకుండా నివారించేందుకు శ్వాసరంధ్రాలకు చిన్న రోమాలు ట్రైకోమ్లు (Trichomes) ఉంటాయి. ప్రతి శ్వాసరంధ్రం ఏట్రియమ్ (Atrium) అనే కక్ష్యలోకి తెరుచుకొంటుంది.
AP Inter 1st Year Zoology Study Material Chapter 7 పెరిప్లానెటా అమెరికానా (బొద్దింక) 10

వాయునాళాలు :
వక్ష భాగంలోని శ్వాసరంధ్రాల ఏట్రియమ్ నుంచి అనేక క్షితిజ సమాంతరనాళాలు లోపలికి వ్యాపించి ఒకదానితో మరొకటి కలుసుకొంటూ ముఖ్య పృష్ఠ శిరోనాళాలు ముఖ్య ఉదర శిరోనాళాలను, వాటి శాఖలను ఏర్పరుస్తాయి. ఈ శాఖలన్నీ తలలోని అవయవాలకు వ్యాపిస్తాయి. వక్ష భాగంలో ముఖ్య పార్శ్వఆయత శ్వాసనాళాలు ఉంటాయి. ఉదరభాగపు శ్వాసరంధ్రాలు ఏ ఏట్రియమ్లలోకి తెరుచుకొంటాయి. ప్రతి ఉదరశ్వాసరంధ్రం యొక్క ఏట్రియమ్ నుంచి మూడు వాయునాళాలు ఉత్పన్నమవుతాయి.

ఒకవైపు ఉన్న ఈ నాళాలన్నీ మూడు వేరు వేరు ముఖ్య ఆయతనాళాల్లోకి తెరుచుకొంటాయి. వీటిని పృష్ఠ ఉదర, పార్శ్వ ప్రధాన ఆయత నాళాలు అంటారు. వీటిలో పార్శ్వనాళాలు అన్నింటికంటే పొడవుగా ఉంటాయి. రెండువైపులా ఉన్న ప్రధాన ఆయత నాళాలను కలుపుతూ, వాటి మధ్య సంధాయక నాళాలు (Commissural tracheae) ఉంటాయి. అన్ని ప్రధాన వాయునాళాల నుంచి అనేక ఉపశాఖలు బయలుదేరి వివిధ అవయవాల్లోకి వ్యాపిస్తాయి. ఇవి ఒక్కొక్క అంగంలోకి ప్రవేశించి ప్రత్యేక వాయునాళికా కణాల్లో (Tracheole cells) అంతమవుతాయి.

వాయునాళ కుడ్యం మూడు పొరలతో ఏర్పడుతుంది. అవి వెలుపలి ఆధారత్వచం (Basement membrane), మధ్య ఒక కణ మందంతో ఏర్పడిన ఉపకళ (Epithelium), లోపలి ఇంటిమా (Intima) అనే అవభాసిని స్తరం. ఇంటిమా వాయునాళాల్లో టినీడియా (Taenidia) అనే సర్పిలాకార మందాలను ఏర్పరుస్తుంది. టినీడియా వల్ల వాయునాళాలు ముకుళించుకుపోకుండా ఎల్లప్పుడూ తెరుచుకొనే ఉంటాయి.

వాయునాళికలు :
వాయునాళం చివరి కణాన్ని ట్రాకియోబ్లాస్ట్ (Tracheoblast) లేదా వాయునాళ కణం అంటారు. దీనిలో చాలా కణాంతస్థ వాయునాళ అంత్యాలు ఉంటాయి. వీటిని వాయునాళికలు (Tracheoles) అంటారు. వాయునాళికలకు ఇంటిమా, టినీడియాలు ఉండవు. ఇవి ట్రేకిన్ (Trachein) అనే ప్రొటీన్ నిర్మితాలు. ఈ నాళికల్లో వాయునాళికాద్రవం ఉంటుంది. బొద్దింకలు శారీరకంగా, జీవక్రియాత్మకంగా చురుకుగా ఉన్నప్పుడు వాయునాళికల్లోని వాయునాళికాద్రవం కణజాలాల్లోకి పీల్చుకోబడి దాని స్థాయి తగ్గుతుంది. బొద్దింక విరామస్థితిలో నిస్తేజంగా ఉన్నప్పుడు నాళికాద్రవం స్థాయి పెరుగుతుంది. వాయునాళికలు కణంలోకి చొచ్చుకొనిపోయి మైటోకాండ్రియాకు సన్నిహితంగా ఉంటాయి (వాటికి ఆక్సిజన్ సరఫరా చేయడానికి).

AP Inter 1st Year Zoology Study Material Chapter 7 పెరిప్లానెటా అమెరికానా (బొద్దింక)

ప్రశ్న 4.
పెరిప్లానేటా ప్రత్యుత్పత్తి వ్యవస్థను వివరించి, చక్కని పటాన్ని గీసి భాగాలను గుర్తించండి.
జవాబు:
పెరిప్లానేటా ఏకలింగజీవి. స్త్రీ, పురుష జీవులు లైంగిక ద్విరూపకతను అంతర్గతంగా, బహిర్గతంగా కూడా ప్రదర్శిస్తాయి. స్త్రీ జీవి ఉదరం పొట్టిగా, వెడల్పుగా ఉంటుంది. పరాంతంలో అండ నిక్షేపం ఉంటుంది. పురుషజీవి ఉదరం సన్నగా, పొడవుగా ఉంటుంది. పరాంతంలో ఒక జత పాయు శూకాలుంటాయి.

పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థ :
పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థలో ఒక జత ముష్కాలు ఉంటాయి. ఇవి పొడవుగా ఉండే లంబికలు గల నిర్మాణాలు. ఇవి నాలుగు నుంచి ఆరు ఉదర ఖండితాలు పార్శ్వ భాగాలలో ఇరువైపులా కొవ్వు దేహాల్లో ఇమిడి ఉంటాయి. ఒక్కో ముష్కం పరభాగం నుంచి సన్నటి శుక్రవాహిక (Vas deferens) ఆరంభమవుతుంది. రెండు శుక్రవాహికలు వెనుకకు లోపలి వైపుగా ప్రయాణించి ఏడో ఖండితంలోని వెడల్పైన మధ్యస్థ స్కలననాళం (Ductus ejaculatus) లోకి తెరచుకుంటాయి. ఆరో, ఏడో ఉదర ఖండితాల్లో ఒక పుట్టగొడుగు ఆకారపు గ్రంథి ఉంటుంది. ఇది అదనపు ప్రత్యుత్పత్తి గ్రంథిలాగా పనిచేస్తుంది. ఈ గ్రంథిలో రెండు రకాల నాళికలు ఉంటాయి. 1) పొడవైన సన్నటి నాళికలు యుట్రిక్యులై మేజోర్స్ (Utriculi majores) లేదా ‘పరిధీయ నాళికలు’, 2) పొట్టిగా ఉండే యుట్రిక్యులై బ్రివోర్స్ నాళికలు (Utriculi breviores), యుట్రిక్యులై మేజోర్స్ శుక్రగుళిక లోపలి స్తరాన్ని ఏర్పరచగా, యుట్రిక్యులై బ్రివోర్స్ శుక్రకణాలకు పోషణనిస్తాయి.

ఈ నాళికలు స్కలననాళిక (Ejaculatory duct) పూర్వభాగంలో తెరుచుకుంటాయి. శుక్రాశయాలు, స్కలన నాళిక ఉదరతంలో ఉంటాయి. ఇవి శుక్రకణాలను కట్టలుగా చేసి నిల్వ ఉంచుతాయి. వీటిని శుక్రగుళికలు (Spermatophores) అంటారు. స్కలన నాళం కండరయుతమైంది. ఇది పరాంతం వరకు సాగి ‘పురుష జననరంధ్రం’ (Gonopore) లోకి తెరుచుకుంటుంది. బొద్దింక పురుష జననాంగాలతో పాటూ, ఒక ఫేలిక్ (Phallic) లేదా కాంగ్లోబేట్ (Conglobate) గ్రంథి ఉంటుంది. దీని నాళం జననరంధ్రం దగ్గర తెరుచుకుంటుంది. దీని విధి ఇంతవరకు తెలియదు. పురుష జననరంధ్రం చుట్టూ అసౌష్ఠవమైన కైటినస్ నిర్మాణాలు అంటే, ఫేలిక్ అవయవాలు లేదా గొనాపోఫెసిస్లు లేదా ఫెలోమియర్లు ఉంటాయి. ఇవి సంపర్కంలో తోడ్పడతాయి. ఇవి పురుషజీవి బాహ్య జననాంగాలు.
AP Inter 1st Year Zoology Study Material Chapter 7 పెరిప్లానెటా అమెరికానా (బొద్దింక) 5

స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థ :
స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థలో ఒక జత స్త్రీ బీజకోశాలు, ఒక జత స్త్రీ బీజవాహికలు, యోని, శుక్రగ్రాహికలు, శుక్రగ్రాహిక సూక్ష్మాంకురం మరియు కొల్లాటీరియల్ గ్రంథులు ఉంటాయి.

స్త్రీ బీజకోశాలు :
ఒక జత పెద్ద స్త్రీ బీజకోశాలు 2-6 ఉదర ఖండిత పార్శ్వ భాగాలలో ఉంటాయి. ఇవి లేత పసుపు రంగులో కొవ్వు దేహాలతో చుట్టబడి ఉంటాయి. ప్రతి స్త్రీ బీజకోశానికి ఎనిమిది స్త్రీ బీజకోశనాళికలు లేదా ఒవేరియోల్స్ (Ovarioles) ఉంటాయి. ఒక్కొక్క ఒవేరియోల్కు జర్మేరియమ్ (Germarium) అనే సాగి మొనదేలి ఉన్న పూర్వాంత పోగు, వెడల్పైన పరాంత విటలేరియం (Vitellarium) ఉంటాయి. జర్మేరియంలో అభివృద్ధి చెందుతున్న అనేక అండదశలు, విటలేరియంలో సొనతో పాటు పరిపక్వ అండాలు ఉంటాయి. ఒక్కొక్క స్త్రీ బీజకోశంలో ఉన్న ఒవేరియోల్ల సన్నగా సాగిన అంచులన్నీ కలిసి ఒక తాడుగా మారి పృష్ఠ దేహకుడ్యానికి అతుక్కొంటుంది. పరాంత అంచులు కలిసి కురచని వెడల్పైన స్త్రీ బీజవాహిక (Oviduct) గా ఏర్పడుతుంది. స్త్రీ బీజవాహికలు కలసిపోయి మధ్యలో అతి చిన్న యోని (Vagina) ఏర్పడుతుంది.
AP Inter 1st Year Zoology Study Material Chapter 7 పెరిప్లానెటా అమెరికానా (బొద్దింక) 6

యోని నిలువు రంధ్రాన్ని స్త్రీ జననరంధ్రం అంటారు. ఇది ఎనిమిదో ఉరఃఫలకంలో పెద్ద జననాశయం (Genital pouch) లోకి తెరుచుకుంటుంది. శుక్రగ్రాహిక లేదా శుక్రధానం (Seminal receptacle) ఎడమవైపున తిత్తితో, కుడివైపున పోగులాంటి అంధనాళంతో 6వ ఖండితంలో ఉంటుంది. ఇది 9వ ఉరః ఫలకంలోని జననాశయంలో ఒక మధ్యస్థ రంధ్రం ద్వారా తెరుచుకుంటుంది. ఫలవంతమైన స్త్రీ జీవిలో శుక్రగ్రాహికలు సంపర్కం ద్వారా గ్రహించిన శుక్రగుళికలను కలిగి ఉంటాయి.

స్త్రీ బీజకోశాల వెనక ఒక జత శాఖాయుతమైన కొల్లాటీరియల్ గ్రంథులు (Colleterial glands) ఉంటాయి. ఈ గ్రంథులు శుక్రగ్రాహిక రంధ్రం పైన వేర్వేరుగా జననాశయంలోకి తెరుచుకుంటాయి. ఈ రెండు కొల్లాటీరియల్ గ్రంథుల స్రావకాలు గుడ్ల చుట్టూ ఒక దృఢమైన పెట్టెను ఏర్పరుస్తాయి. దీన్నే గుడ్లుపెట్టె లేదా గుడ్లకోశం లేదా ఊథీకా (Ootheca) అంటారు. జననాశయం ఏడో, ఎనిమిదో, తొమ్మిదో ఉదర ఖండితాల ఉరఃఫలకాలతో ఏర్పడుతుంది. ఏడో ఖండిత ఉరః ఫలకం పడవ ఆకారంలో ఉంటుంది. ఇది జననాశయం అడుగు, పక్క భాగంలో గోడలను ఏర్పరుస్తుంది. ఎనిమిదో, తొమ్మిదో కండితాల ఉరఃఫలకాలు ఏడో ఖండితంలో చొచ్చుకొని వరుసగా జననాశయం పూర్వాంతపు గోడ, దాని పైకప్పుగా ఏర్పడతాయి. జననాశయానికి రెండు గదులుంటాయి. అవి : పూర్వాంతపు గైనాట్రియం (Gynatrium) లేదా జననకోశం, పరాంతపు వెస్టిబ్యులమ్ (Vestibulum) లేదా గుడ్లకోశం.

స్త్రీ జననరంధ్రం చుట్టూ మూడు జతల కైటిన్ నిర్మిత ఫలకాలు ఉంటాయి. వీటిని గొనాపోఫైసిస్లు అంటారు. ఇవి అండ విక్షేపకం (Ovipositor) గా ఏర్పడి అండాలకు గుడ్లకోశంలోకి మార్గం చూపుతాయి. ఇవి స్త్రీ బాహ్య జననాంగాలు.

AP Inter 1st Year Zoology Study Material Chapter 4 జంతు వైవిధ్యం-II: కార్డేటాల క్లుప్త చరిత్ర

Andhra Pradesh BIEAP AP Inter 1st Year Zoology Study Material 4th Lesson జంతు వైవిధ్యం-II: కార్డేటాల క్లుప్త చరిత్ర Textbook Questions and Answers.

AP Inter 1st Year Zoology Study Material 4th Lesson జంతు వైవిధ్యం-II: కార్డేటాల క్లుప్త చరిత్ర

అతిస్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
కార్డేట్లు, ఇకైనోడరు పంచుకొనే లక్షణాలను పేర్కొనండి.
జవాబు:
ఎంటిరోసీలోమ్, డ్యుటిరోస్టోములు మరియు ద్విపార్శ్వ సౌష్టవము చూపును.

ప్రశ్న 2.
సైక్లోస్టోముల నాలుగు ముఖ్య లక్షణాలు రాయండి.
జవాబు:
1) ఇవి దౌడలు లేని జలచర జీవులు.
2) శరీరము సన్నగా, పొడవుగా ఈకలాగా పొలుసులు లేకుండా ఉండును.
3) అంతరాస్థి పంజరము మృదులాస్థి నిర్మితము.
4) నోరు వలయాకారముగా ఉండి, చూషకము వలే పనిచేయును.

ప్రశ్న 3.
లాన్సిలెట్లు, ఎసీడియన్లలో ఎండోస్టైల్ ప్రాముఖ్యం ఏమిటి?
జవాబు:
ఎండో స్టైల్, ఇది శైలికాయుతమైన, గ్రంథులను కలిగి గ్రసని ఉదరకుడ్యంపై ఉంటుంది. ఇది ఆహార పోషణలో గాలన పద్ధతిగా ఉపయోగపడుతుంది.

ప్రశ్న 4.
షార్క్లు, కట్ల చేపలలో పుచ్ఛవాజం రకం, పొలుసుల పేర్లు తెలపండి.
జవాబు:
షార్కులలో పుచ్ఛవాజం విషమపాలి రకము, చర్మముపై ప్లాకాయిడ్ పొలుసులు ఉండును. కట్ల చేపలో పుచ్ఛవాజము సమపాల రకము, చర్మముపై సైక్లాయిడ్ పొలుసులు ఉండును.

ప్రశ్న 5.
చేపలలో వాయుకోశాల ప్రాముఖ్యం ఏమిటి?
జవాబు:
చేపలలోని వాయుకోశాలు వాయు మార్పిడికి లేదా నీటిలో తేలిక జీవి తేలియాడుటకు హైడ్రోస్టాటిక్ అవయవముగా ఉపయోగపడును.

AP Inter 1st Year Zoology Study Material Chapter 4 జంతు వైవిధ్యం-II: కార్డేటాల క్లుప్త చరిత్ర

ప్రశ్న 6.
‘చేపల హృదయం జలశ్వాస హృదయం’ ఈ వ్యాఖ్యను ఎలా సమర్థిస్తారు?
జవాబు:
రక్తప్రసరణ వ్యవస్థలో రక్తము మొప్పలకు మాత్రమే పంపుతుంది. ఇటువంటి హృదయమును జలశ్వాస హృదయము అని అందురు.

ప్రశ్న 7.
సంపర్క కంటకాలు అంటే ఏమిటి? ఇవి ఏ చేపల సమూహంలో ఉంటాయి?
జవాబు:
మగచేపలలో సంపర్క కంటకాలు ఉండును. శ్రోణవాజము మార్పుచెంది సంపర్క కంటకముగా మారును. ఇది సంపర్క సమయములో ఉపయోగపడును. కాండ్రాక్టిస్ లేదా ఇలాస్మోబ్రాంకి చేపలలో ఉండును.

ప్రశ్న 8.
ఉభయచరాల హృదయం సరీసృపాల హృదయంతో ఎలా విభేదిస్తుంది?
జవాబు:
ఉభయచరాల హృదయంలో రెండు కర్ణికలు, ఒక జఠరిక ఉండును. అనగా హృదయము మూడు గదులుగా విభజింపబడి ఉండును.

సరీసృప హృదయములో అసంపూర్తిగా విభజన చెందిన నాలుగు గదులు ఉండును.

ప్రశ్న 9.
పరిణామక్రమములో ఉభయచరాలలో మొట్టమొదటగా కనిపించిన నిర్మాణాల పేర్లు తెలపండి.
జవాబు:
రెండు జతల సమాన లేదా అసమాన పంచాంగుళీయక గమనాంగాలు ఏర్పడినవి.

ప్రశ్న 10.
స్త్రీ, పురుష కప్పలను ఎలా గుర్తిస్తారు?
జవాబు:
పురుష కప్పలలో శబ్దము చేయుటకు స్వరకోశాలను, పూర్వాంగాల వేలికి సంపర్కమెత్తను కలిగి ఉండును. స్త్రీ కప్పలలో ఇవి ఉండవు

ప్రశ్న 11.
కప్పలో శక్తియుత పంపు (Force Pump) అని దేన్ని అంటారు? దీనికి ఆ పేరు ఎందుకు పెట్టారు?
జవాబు:
పుపుస శ్వాసక్రియలో ఆస్యగ్రసని కుహరం ఒక బలమైన పంపులాగా పనిచేస్తుంది. ఆస్యగ్రసనీ కుహరం అడుగుభాగం పైకి లేచినప్పుడు గాలి ఒత్తిడికి కంఠబిలం తెరుచుకొని, గాలి ఊపిరితిత్తులను చేరుతుంది.

ప్రశ్న 12.
కార్పొరాబైజెమీనా అంటే ఏమిటి? వీటి ముఖ్యవిధి తెలపండి.
జవాబు:
దృష్టి లంబికలను అడ్డముగా విభజింపబడి ఉండే వాటిని కార్పొరాజైజెమీనా అందురు. ఇవి జీవిలో దృష్టి జ్ఞానమును కలుగజేయును.

AP Inter 1st Year Zoology Study Material Chapter 4 జంతు వైవిధ్యం-II: కార్డేటాల క్లుప్త చరిత్ర

ప్రశ్న 13.
ముష్కయోజని, స్త్రీ బీజకోశ యోజని మధ్య భేదాన్ని గుర్తించండి.
జవాబు:
మూత్రపిండాలకు, పృష్ట శరీర కుడ్యానికి రెండు మడతల ఆంత్రవేష్టనంతో అతకబడి ఉంటాయి. ఆంత్రవేష్టనాన్ని ముష్క యోజని అని అందురు. స్త్రీబీజకోశాలు మూత్రపిండాలకు, పృష్ట శరీర కుడ్యానికి రెండు మడతల ఆంత్రవేష్టనంతో అతకబడి ఉంటాయి. ఈ ఆంత్రవేష్టనాన్ని స్త్రీబీజకోశ యోజని అని అందురు.

ప్రశ్న 14.
మిల్ట్, స్పాన్ మధ్య భేదాలను గుర్తించండి.
జవాబు:
ఆడకప్ప విడుదల చేసిన గుడ్లరాశిని “స్పాన్” అని, పురుష కప్పలు విడుదల చేసే శుక్రకణాల రాశిని “మిస్ట్” అని అందురు.

ప్రశ్న 15.
మొట్టమొదటి దవడల సకశేరుకాలు, మొదటి ఉల్బధారులు ‘సర్ణయుగాలను’ తెలపండి.
జవాబు:
“డివోనియన్” కాలాన్ని మొదటి దవడలను సకశేరుకాలు, మొదటి ఉల్బదారులు స్వర్ణయుగముగా పేర్కొనెదరు. చేపలు మొదటి దవడల సకశేరుకాలు.

ప్రశ్న 16.
దక్షిణ భారతదేశంలో గల రెండు విషయుత, విషరహిత సర్పాల పేర్లు తెలపండి.
జవాబు:
విషయుత సర్పములు :
1) నాజనాజ (నాగుపాము)
2) బుంగారస్ (కట్లపాము)

విషరహిత సర్పములు :
1) ట్యాప్ (రాట్ స్నేక్)
2) ట్రోపిడోనోటస్ (నీళ్ళపాము)

ప్రశ్న 17.
సరీసృప చర్మం కప్ప చర్మంతో ఏ లక్షణాలలో విభేదిస్తుంది?
జవాబు:
సరీసృప చర్మము గరుకుగా, పొడిగా ఉండును. బాహ్యస్థి పంజరములో కొమ్ము సంబంధిత బహిత్త్వచ పొలుసులు, ఫలకాలు, నఖాలు ఉంటాయి. కప్ప చర్మము పలచగా, పొలుసులు లేకుండా, తేమగా ఉండును.

ప్రశ్న 18.
పిల్లి, బల్లిని అవి విసర్జించే ముఖ్య నత్రజని వ్యర్థాల ఆధారంగా వివరించండి.
జవాబు:
బల్లులు యూరిక్ ఆమ్లమును విసర్జించును. అందువలన ఇవి యూరికోటెలిక్ ప్రాణులు.

పిల్లులు క్షీరదములు. అందువలన వీటి విసర్జక పదార్థము యూరియా రూపములో ఉండును. అందువలన వీటిని యూరియోటెలిక్ జీవులు అందురు.

AP Inter 1st Year Zoology Study Material Chapter 4 జంతు వైవిధ్యం-II: కార్డేటాల క్లుప్త చరిత్ర

ప్రశ్న 19.
నాలుగు పిండ బాహ్యత్వచాల పేర్లు తెలపండి.
జవాబు:
1) ఉల్బము 2) అళింద 3) పరాయువు 4) సొనసంచి.

ప్రశ్న 20.
జాకబ్సన్ అవయవాలు అంటే ఏమిటి? వాటి విధి ఏమి?
జవాబు:
ప్రత్యేక ఘ్రాణ నిర్మాణాలను జాకబ్సన్ అవయవములు అందురు. ఇవి వాసనను తెలుసుకొనుటకు ఉపయోగపడును.

ప్రశ్న 21.
వాతిలాస్థులు అంటే ఏమిటి? అవి పక్షులకు ఎలా తోడ్పడతాయి?
జవాబు:
పక్షులలో ఎముకలు బోలుగా ఉండి గాలికుహరాలను కలిగి ఉంటుంది. ఇది పక్షులు గాలిలో తేలికగా ఎగురుటకు తోడ్పడును.

ప్రశ్న 22.
విష్ బోన్ అంటే ఏమిటి? దీన్ని ఏర్పరచే అస్థిఘటకాలను తెలపండి.
జవాబు:
జత్రుకలు, అంతరజత్రుకతో కలిసి ‘V’ ఆకారపు అస్థిని ఏర్పరుస్తాయి. దాన్ని ఫర్కులా లేదా విష్్బన్ అందురు.

ప్రశ్న 23.
రక్తం నిరంతర ఆక్సిజినేషన్ (ఆక్సీకరణం) అంటే ఏమిటి? ఇది పక్షులలో ఎలా సాధ్యమవుతుంది?
జవాబు:
ఊపిరితిత్తులు కుదించినట్లు స్పంజికలాగా ఉంటాయి. వాయుకోశాలు ఉండవు. ఇవి వ్యాకోచించలేవు. వాయుగోణులు ఊపిరితిత్తులతో సంబంధాన్ని కలిగి ఉంటాయి. వాయుగోణులు నిరంతరం రక్తానికి ఆక్సిజన్ అందిస్తాయి.

ప్రశ్న 24.
పక్షులలో అన్నకోశం, అంతరజఠరం మధ్య భేదాలను తెలపండి.
జవాబు:
పక్షులలో అన్నకోశము ఆహారాన్ని నిల్వచేయును. అంతర జఠరము ఆహారమును మెత్తగాజేయు, విసిరే మరగా విభజింపబడి ఉండును.

ప్రశ్న 25.
ఆల్ట్రీషియల్, ప్రికోషియల్ పక్షిపిల్లల మధ్య తేడాలను తెలపండి.
జవాబు:
ఎగిరే పక్షులలో బాల్యజీవులు తల్లిదండ్రులపై ఆధారపడతాయి. అందువలన వీటిని ఆల్ట్రీషియల్ అందురు.
ఎగరని పక్షులలో బాల్యజీవులు తల్లిదండ్రులపై ఆధారపడవు. అందువలన వీటిని ప్రికోషియల్ అని అందురు.

ప్రశ్న 26.
ఏ సమూహ జంతువులలో ప్రతీ పార్శ్వంలో మూడు కర్ణాస్థికలు ఉంటాయి. వాటి పేర్లను లోపలి నుంచి వెలుపలికి వరస క్రమంలో తెలపండి.
జవాబు:
క్షీరదములలోని మధ్యచెవిలో ఉండే మూడు కర్ణాస్థి ఖండాలు కలవు. అవి 1) కూటకము, 2) దాగలి, 3) కర్ణాంతరాస్థి.

AP Inter 1st Year Zoology Study Material Chapter 4 జంతు వైవిధ్యం-II: కార్డేటాల క్లుప్త చరిత్ర

ప్రశ్న 27.
క్షీరదాల పరిపక్వ RBC, ఇతర సకశేరుకాల RBCతో ఎలా విభేదిస్తుంది?
జవాబు:
క్షీరదముల RBC ద్విపుటాకారముగా ఉండి, కేంద్రకమును కలిగి ఉండదు.

మిగిలిన సకశేరుకములలో RBC నందు కేంద్రకము ఉండును.

ప్రశ్న 28.
సరీసృపాలు, పక్షులు, క్షీరదాలలో ముఖ్య కశేరుకాల రకాల పేర్లను తెలపండి.
జవాబు:
1) సరీసృప కశేరుకములు – ప్రోసీలస్ లేదా పురోగర్తి రకమునకు చెందినవి.
2) పక్షుల కశేరుకములు – విషమగర్తి రకమునకు చెందినవి.
3) క్షీరద కశేరుకములు – ఉభయ సమతల రకానికి చెందినవి.

ప్రశ్న 29.
మూడు మెనింజెస్ పేర్లను తెలపండి. ఈ మూడూ ఏ సమూహ జంతువులలో కనిపిస్తాయి ?
జవాబు:
మూడు మెనెంజెస్లు :

  1. పరాశిక
  2. ఆర్కినాయిడ్ పొర
  3. మృద్వి. ఈ మూడు పొరలు క్షీరదముల మెదడును కప్పి ఉంచును.

ప్రశ్న 30.
వృక్క నిర్వాహకవ్యవస్థ లోపించిన సకశేరుక సమూహాల పేర్లు తెలపండి.
జవాబు:
క్షీరదములలో వృక్క నిర్వాహక వ్యవస్థ లోపించియుండును.

స్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
సకశేరుకాలు, అకశేరుకాల మధ్య మూడు ముఖ్య తేడాలను తెలపండి. ఈ లక్షణాలను చూపే సకశేరుక శరీర పటాన్ని గీయండి.
జవాబు:
కార్దేట్లు, అకశేరుకాల మధ్య పోలికలు :

కార్దేట్లుఅకశేరుకాలు
1. పృష్ఠవంశం ఉంటుంది.పృష్ఠవంశం ఉండదు.
2. కేంద్రనాడీ వ్యవస్థ పృష్ఠభాగంలో బోలుగా, ఒకే ఒకటిగా, నాడీసంధిరహితంగా ఉంటుంది.కేంద్రనాడీవ్యవస్థ ఉదర భాగంలో, కడ్డీ లాగా, ద్వంద్వంగా, నాడీసంధిసహితంగా ఉంటుంది.
3. గ్రసని మొప్ప చీలికలతో ఉంటుంది.మొప్ప చీలికలు ఉండవు.
4. ఉదరభాగంలో హృదయం ఉంటుంది.పృష్ఠ హృదయం (ఉంటేనే).
5. పాయుపరపుచ్ఛం ఉంటుంది.పాయుపరపుచ్ఛం ఉండదు.

AP Inter 1st Year Zoology Study Material Chapter 4 జంతు వైవిధ్యం-II కార్డేటాల క్లుప్త చరిత్ర 1

ప్రశ్న 2.
కార్డేట్లలో నాలుగు ముఖ్య లక్షణాలు పేర్కొని ప్రతిదాని ముఖ్య విధిని తెలపండి.
జవాబు:
కార్డేటాల నాలుగు ముఖ్య లక్షణాలు :
1. పృష్ఠవంశం :
ఇది పృష్ఠమధ్యరేఖ మీదుగా ఆహారనాళానికీ, పృష్ఠ నాడీదందానికీ మధ్య ఉండే ఒక స్థితిస్థాపక కడ్డీలాంటి నిర్మాణం. పిండంలో కనిపించే మొట్టమొదటి అంతరాస్థిపంజర భాగం. ఇది పిండ పృష్ఠవంశ మధ్యత్వచం నుంచి ఏర్పడుతుంది. దీని అంతర్భాగంలో రిక్తికాయుత కణాలు ఉండి వాటిని ఆవరిస్తూ లోపలి మందమైన తంతుయుత సంయోజక కణజాలపు తొడుగు, వెలుపల పలచని స్థితిస్థాపక సంయోజక కణజాలపు తొడుగులు ఉంటాయి. ఇది లాన్స్లట్లు, సైక్లోస్టోమ్స్లో జీవితాంతం ఉంటుంది. ఎసిడియన్లలో టాడ్పోల్ డింభకపు తోకలో మాత్రమే ఉంటుంది. తిరోగామి రూపవిక్రియలో తోకను, పృష్ఠవంశాన్ని కోల్పోయి, ప్రౌఢ జీవిగా మారుతుంది. ఉన్నత సకశేరుకాలలో పృష్ఠవంశం పిండదశలో కనిపించి ప్రౌఢజీవులలో దీని స్థానంలో పాక్షికంగా గానీ, సంపూర్ణంగా గానీ వెన్నెముక ఏర్పడుతుంది. పృష్ఠవంశం అనశేషాలు పల్పోసి కేంద్రకాలుగా క్షీరదాల కశేరుకాంతర చక్రికలలో ఉంటాయి.

2. పృష్ఠనాళికాయుత నాడీదండం :
పృష్ఠవంశానికి పైన, పృష్ఠశరీర కుడ్యానికి కింద ఒకే ఒక నాడీదండం ఉంటుంది. ఇది బోలుగా, నాళం లాగా ఉండి, ద్రవంతో నిండి ఉంటుంది. ఇది అకశేరుకాలలో లాగా కాకుండా నాడీకణసంధి రహితంగా ఉంటుంది. పిండదశలో పృష్ఠవంశంపై గల బహిత్వచపు పొర పృష్ఠ మధ్యభాగం కిందికి కుంగి నాడీదండం ఏర్పడుతుంది. ఉన్నత కార్డేటాలలో దీని పూర్వభాగం పెద్దదై విస్తరించి మెదడుగా, మిగతా భాగం వెన్నుపాముగా విభేదనం చెందుతుంది.

3. గ్రసనీ మొప్ప చీలికలు లేదా రంధ్రాలు :
గ్రసనీ పార్శ్వ కుడ్యంలో వరసగా గ్రసనీ చీలికలు లేదా రంధ్రాలు ఉంటాయి. వీటి ద్వారా గ్రసనీ కుహరం నుంచి నీరు వెలుపలికి ప్రవహిస్తుంది. ఇవి బాహ్య-అంతస్త్వచం నుంచి ఏర్పడతాయి. ప్రాథమిక కార్డేట్లు, చేపలు మరియు కొన్ని ఉభయచరాలలో ఇవి జీవితాంతం ఉంటాయి. గ్రసనీ కుడ్యరంధ్రాలు ప్రసరణ పటలికల అభివృద్ధితో మొప్పలు (బ్రాంకి)గా మారి శ్వాస వాయువుల మార్పిడికి తోడ్పడతాయి. అనేక ఉభయచరాలలో ఇవి డింభకదశలో ఉండి ప్రౌఢజీవులలో కనిపించవు. ఉల్బధారులలో క్రియారహిత గ్రసనీకోశాలు పిండాభివృద్ధి ప్రారంభంలో ఏర్పడి ఆ తరవాత అదృశ్యమవుతాయి. ఉల్బధారుల పిండాభివృద్ధి ప్రారంభంలో ఇవి కనిపించడం వల్ల ఈ జీవుల పూర్వీకులు జలచరాలని తెలుస్తుంది.

4. పాయు పర పుచ్ఛం :
సకశేరుకాల పుచ్ఛం పాయువుకు పరభాగంలో పొడిగించబడి ఉంటుంది. చాలా జాతులలో ఇది పిండాభివృద్ధి చివరిదశలో అదృశ్యమవుతుంది. దీనిలో అస్థిపంజర మూలపదార్థాలు, కండరాలు ఉంటాయి. అయితే దీనిలో శరీరకుహరం, అంతరాంగ అవయవాలు ఉండవు.

AP Inter 1st Year Zoology Study Material Chapter 4 జంతు వైవిధ్యం-II: కార్డేటాల క్లుప్త చరిత్ర

ప్రశ్న 3.
కార్డేటా ఉనికిని తెలిపే ట్యునికేట్ లక్షణాలను వివరించండి.
జవాబు:
యూరోకార్డేటా లేదా ట్యునికేటా: (GR.oura – తోక ; L.chorda – పృష్ఠవంశం)
AP Inter 1st Year Zoology Study Material Chapter 4 జంతు వైవిధ్యం-II కార్డేటాల క్లుప్త చరిత్ర 2
యూరోకార్డేట్లన్నీ సముద్ర జీవులు. నీటి ఉపరితలం నుంచి అధిక లోతు వరకు కనిపిస్తాయి. ఇవి వృంతరహిత (ఎసీడియన్స్) లేదా నీటిపై తేలియాడే (సాల్ప, డోలియోలం), ఏకాంత (ఎసీడియా) లేదా సహనివేశ (పైరోసోమా) జంతువులు. శరీరం ఖండితరహితమై, సెల్యులోజ్ మిగతా జంతువులలో వలె కాకుండా నిర్మితమైన కంచుకంతో ఆవరించి ఉంటుంది. శరీరకుహరం లేదు. అయితే గ్రసని చుట్టూ బహిస్త్వచంతో ఆవరించి ఉన్న ఏట్రియల్ కుహరం ఉంటుంది. మొప్ప చీలికలు, పాయువు, జననేంద్రియ నాళాలు దీనిలోకి తెరచుకొంటాయి. గ్రసని ఉదరకుడ్యంపై ఉండే అంతర్ కీలితం మున్ముందు సకశేరుకాల థైరాయిడ్ గ్రంథి ఏర్పాటును సూచిస్తుంది. ఏట్రియమ్ పృష్ఠ లేదా పర ఏట్రియల్ రంధ్రం ద్వారా బయటికి తెరుచుకొంటుంది. సంపూర్ణ జీర్ణనాళం ఉంటుంది.

గ్రసనీ కుడ్యంలో రెండు లేదా లెక్కలేనన్ని మొప్ప చీలికలు ఉంటాయి. వివృత రక్త ప్రసరణ వ్యవస్థ ఉంటుంది. హృదయం నాళాకారంలో ఉదరభాగంలో ఉంటుంది. రక్త ప్రవాహాన్ని ఏకాంతరంగా వ్యతిరేక దిశలలో పంపడం దీని విశిష్టత. నాడీ వ్యవస్థ ప్రౌఢజీవులలో ఒక పృష్ఠ నాడీసంధిగా ఉంటుంది. ఇవి ద్విలింగ లేదా ఉభయలైంగిక జీవులు. జీవి అభివృద్ధిలో తోకతో స్వేచ్ఛగా ఈదే టాడ్పోల్ డింభకం ఉంటుంది. ఈ డింభకంలో తోక భాగాన, బోలుగా ఉన్న నాడీదండం, తోకకు పరిమితమైన పృష్ఠవంశం ఉంటాయి. అందువల్ల ఈ జీవులను యూరోకార్డేటాలు అంటారు.
ఉదా : ఎసీడియా, సాల్ప, డోలియోలం, పైరోసోమా, ఆయికోప్లూరా.

ప్రశ్న 4.
స్క్వీర్ట్లు, లాన్సిలెట్ల పోలికలు, భేదాలు చూపండి.
జవాబు:

స్క్వీర్ట్లాన్సిలెట్లు
1. ఇవి సముద్రములలో గాని, సముద్రతీరాలలో ఆధారము లను అంటిపెట్టుకొని జీవిస్తాయి.1. పృష్ఠవంశం పరాంతం నుంచి వాటి పూర్వాంతం వరకు వ్యాపించి ఉంటుంది.
2. దేహముపై ట్యునిసిన్తో చేయబడిన కవచముండుటచే ఈ సమూహమును ‘ట్యూనికేటా’ అని పిలుస్తారు.2. పృష్ఠ పార్శ్వ కండరాలు మందంగా ఉండి, కండర ఖండితాలు ఖండీభవనం చెంది ఉంటాయి.
3. ఈ జీవులకు ముఖరంధ్రం, ఏట్రియల్ రంధ్రం ఉంటాయి. నీరు ముఖరంధ్రం ద్వారా లోనికి ప్రవేశించి ఏట్రియల్ రంధ్రము ద్వారా బయటకు పోతుంది.3. గ్రసనిని ఆవరించి ఉండే ఏట్రియంలోకి మొప్ప చీలికలు, ప్రాథమిక వృక్కాలు, బీజకోశాలు తెరచుకొంటాయి.
4. ప్రౌఢజీవులు ఖండీభవనం చూపవు. రక్తప్రసరణ వివృతంగా ఉంటుంది.4. గ్రసని ఉదర కుడ్యంలో ఎండో స్టైల్ ఉంటుంది.
5. ఈ జీవులలో గల ఎండో స్టైల్ను సకశేరుకాల థైరాయిడ్ గ్రంథితో పోల్చవచ్చును.5. ప్రత్యేక శ్వాసాంగాలుండవు. శ్వాసవాయువుల వినిమయం వ్యాపన పద్ధతిలో జరుగుతుంది.
6. ప్రౌఢట్యునికేట్లలో పృష్ఠవంశం లోపిస్తుంది. కాని డింభక దశలో తోకలో ఉంటుంది. దీన్ని యూరోకార్డేటా అందురు.6. సొలినోసైట్లను కలిగిన ప్రాథమిక వృక్కాలు విసర్జక అవయవాలుగా పనిచేస్తాయి.
7. కొన్ని జీవులలోని రక్త కణాలలో వెనెడియంను కలిగి ఉండే వెనేడియం అనే వర్ణదము ఉండును.7. ఇవి ఏకలింగ జీవులు.
8. అభివృద్ధిలో తిరోగమన రూప విక్రియను చూపును.8. బాహ్యఫలదీకరణ జరుగుతుంది. మరియు డింభక దశ గల పరోక్ష అభివృద్ధి జరుగుతుంది.

ప్రశ్న 5.
చేపలను ఇతర సకశేరుకాల నుంచి వేరుచేసే ఎనిమిది లక్షణాలను రాయండి.
జవాబు:
సాధారణ లక్షణాలు :

  1. ఇవి శీతలరక్త సంపూర్ణ జలచర జంతువులు.
  2. వీటి శరీరం కండె ఆకారంలో తల, మొండెం, తోకగా విభేదనం చెంది ఉంది.
  3. అంతరాస్థి పంజరం మధ్యస్త్వచ పొలుసులు లేదా అస్థిఫలకాలతో ఏర్పడింది. కొన్ని చేపలలో పొలుసులు ఉండవు.
  4. మృదులాస్థి లేదా అస్థి నిర్మిత అంతరాస్థి పంజరం ఉంటుంది. పుర్రె ఒక అనుకపాలకందంతో ఉంటుంది. కశేరుకాలు ఉభయగర్తి రకం (కశేరుమధ్యం పూర్వ పర తలాలు పుటాకారంగా ఉంటాయి).
  5. చలనానికి అద్వంద్వ వాజాలు (మాధ్యమిక, పుచ్ఛవాజాలు, ద్వంద్వ వాజాలు (ఉరో, శ్రోణి వాజాలు) ఉంటాయి.
  6. నోరు ఉదరంగా లేదా పూర్వాంతంలో ఉంటుంది. దంతాలు అగ్రదంత, సమదంత మరియు బహువార దంత రకాలు.
  7. మొప్పలతో శ్వాసవాయువుల మార్పిడి జరుగుతుంది. హృదయం రెండు గదులతో మొప్పలకు రక్తాన్ని అందిస్తుంది. దీన్ని జలశ్వాస హృదయం అంటారు. చేపలలో ఏకప్రసరణ జరుగుతుంది. అంటే ప్రసరణలో రక్తం ఒకసారి మాత్రమే హృదయాన్ని చేరుతుంది. హృదయం ‘సిరా హృదయం’ (శరీర అవయవాల నుంచి సిరా రక్తం/ఆక్సిజన్ లేని రక్తం మాత్రమే హృదయానికి చేరుతుంది). మూత్రపిండాలు మధ్యవృక్క రకం. సాధారణంగా అమ్మోనోటెలిక్ మృదులాస్థి చేపలు మాత్రం యూరియోటెలిక్.
  8. కపాల నాడులు 10 జతలు. కేంద్రనాడీవ్యవస్థను కప్పి మెనింక్స్ ప్రిమిటివా మాత్రమే ఉంటుంది.
  9. లోపలి చెవిలో మూడు అర్థచంద్రాకార కుల్యలు ఉంటాయి. పార్శ్వరేఖ జ్ఞానాంగ వ్యవస్థ (నీటి కదలికలు, కంపనాలు గుర్తించడానికి) కనుగుడ్డును రక్షిస్తూ ఉంటుంది.
  10. స్త్రీ పురుష జీవులు వేరుగా ఉంటాయి. అంతర లేదా బాహ్య ఫలదీకరణం జరుగుతుంది. అభివృద్ధి ప్రత్యక్షం లేదా పరోక్షంగా జరుగుతుంది. చేపలలో ప్రస్తుతం రెండు విభాగాలున్నాయి. అవి : కాండ్రికిస్ (మృదులాస్థి చేపలు), ఆస్టిక్తిస్ (అస్థి చేపలు).

ప్రశ్న 6.
మృదులాస్థి, అస్థి చేపల పోలికలు, భేదాలు రాయండి. [Mar. ’14]
జవాబు:

కాండ్రిక్టిస్అస్టిక్టిస్
1. వీటిని సామాన్యంగా మృదులాస్థి చేపలు అందురు.1. వీటిని సామాన్యంగా అస్థి చేపలంటారు.
2. పుచ్చ వాజము విషమపాలి రకము.2. పుచ్ఛవాజము సమవిభక్త రకము.
3. చర్మాన్ని కప్పుతూ ప్లాకాయిడ్ పొలుసులు ఉంటాయి.3. చర్మాన్ని కప్పుతూ గానాయిడ్, సైక్లాయిడ్ లేదా టీనాయిడ్ పొలుసులుంటాయి.
4. నీటి అంతరాంగస్థిపంజరము మృదులాస్థితో నిర్మితమై ఉంటుంది.4. నీటి అంతరాంగస్థిపంజరము అస్థితో నిర్మితమై ఉంటుంది.
5. నోరు మరియు నాసికా రంధ్రాలు ఉదరతలంలో అమరి ఉంటాయి.5. నోరు ముట్టె అగ్రభాగంలో ఉంటుంది.
6. ఆహారనాళం అవస్కరంలోకి తెరచుకుంటుంది.6. ఆహారనాళం పాయువు ద్వారా వెలుపలికి తెరచుకుంటుంది.
7. మొప్పచీలికలు నగ్నంగా, ఉపరికుల లేకుండా ఉంటుంది.7. మొప్పచీలికలు ఉపరికులచే కప్పబడి ఉంటుది.
8. మొప్ప చీలికల ముందు శ్వాసరంధ్రాలుంటాయి.8. శ్వాసరంధ్రాలు ఉండవు.

AP Inter 1st Year Zoology Study Material Chapter 4 జంతు వైవిధ్యం-II: కార్డేటాల క్లుప్త చరిత్ర

ప్రశ్న 7.
కప్ప హృదయ నిర్మాణాన్ని వివరించండి.
జవాబు:
AP Inter 1st Year Zoology Study Material Chapter 4 జంతు వైవిధ్యం-II కార్డేటాల క్లుప్త చరిత్ర 3
రక్త ప్రసరణ వ్యవస్థ :
దీనిలో హృదయం, రక్తనాళాలు, రక్తం ఉంటాయి. శరీరకుహరం పైభాగంలో కండరయుత హృదయం ఉంటుంది. దీనిలో రెండు కర్ణికలు, ఒక జఠరిక ఉంటాయి. హృదయం రెండు స్తరాల హృదయావరణ త్వచంతో కప్పి ఉంటుంది. హృదయం పృష్ఠతలంలో కుడి కర్ణికను త్రికోణాకార సిరాసరణి కలుస్తుంది. ఇది మూడు మహాసిరల ద్వారా రక్తాన్ని గ్రహిస్తుంది. ఉదరతలంలో జఠరిక ధమనీ శంకువులోకి తెరుచుకొంటుంది. ధమనీ శంకువు రెండు శాఖలుగా, తిరిగి అవి ఒక్కొక్కటి మూడు ధమనీ చాపాలుగా ఏర్పడతాయి. అవి కరోట, దైహిక, పుప్పుస చర్మీయ చాపాలు. హృదయం నుంచి రక్తాన్ని శరీర భాగాలకు ధమనీ చాపాల శాఖలు సరఫరా చేస్తాయి. శరీర భాగాల నుంచి మూడు ముఖ్య సిరలు రక్తాన్ని గ్రహించి సిరాసరణికి చేరవేస్తాయి.

ప్రశ్న 8.
ఉభయచరాల విభాగం ఎనిమిది ముఖ్య లక్షణాలను తెలపండి.
జవాబు:
సాధారణ లక్షణాలు :

  1. ఇవి మొట్టమొదటి చతుష్పాదులు. రెండు ఆవాసాలలో జీవిస్తాయి. అంటే నేల మీద, మంచి నీటిలో జీవిస్తాయి.
  2. శరీరం తల, మొండెంగా స్పష్టంగా విభజించబడింది. తోక ఉండవచ్చు లేదా ఉండకపోవచ్చు.
  3. చర్మం నున్నగా, పొలుసులు లేకుండా (ఎపోడాకు చెందిన జీవులలో ఉంటాయి), తేమగా, గ్రంథులతో ఉంటుంది.
  4. రెండు జతల సమాన లేదా అసమాన పంచాంగుళీయక గమనాంగాలు (సిసీలియన్లలో గమనాంగాలు ఉండవు) ఉంటాయి.
  5. క్షీరదాలలోలాగా కపాలానుకందాలు డైకాండైలిక్ (ద్వికంద) రకానికి చెందుతాయి. కశేరుకాలు ఎన్యూరన్లలో పురోగర్తి (కశేరుమధ్యం పూర్వతలం మాత్రమే పుటాకారంగా ఉంటుంది). సిసీలియన్లలో ఉభయగర్తి, యూరోడీలాలో పరగర్తి – కశేరుమధ్యం పరతలం మాత్రమే (పుటాకారంగా ఉంటుంది) రకానికి చెందినవి. ఉరోస్థి మొదటిసారిగా ఉభయచరాల్లో కనిపిస్తుంది.
  6. నోరు పెద్దది. దంతాలు అగ్రదంత, సమదంత, బహువార రకానికి చెందినవి.
  7. శ్వాసవాయువుల వినిమయం ఎక్కువగా చర్మంతో జరుగుతుంది. పుప్పుస, ఆస్యగ్రసని శ్వాసక్రియలు కూడా జరుగుతాయి. జలశ్వాస (బ్రాంకియల్) శ్వాసక్రియ డింభకాలు, కొన్ని ప్రౌఢ యూరోడీలన్లలో కనిపిస్తుంది.
  8. మూడు గదుల హృదయం, సిరాసరణి, మూల మహాధమని ఉంటాయి. మూడు జతల ధమనీ చాపాలు, అభివృద్ధి చెందిన నిర్వాహక వ్యవస్థలు ఉంటాయి. ఎర్రరక్తకణాలు కేంద్రక సహితంగా ఉంటాయి.
  9. మూత్రపిండాలు మధ్యవృక్క రకానికి చెందినవి. ఇవి యూరియోటెలిక్ జీవులు.
  10. వెలుపలి పరాశిక, లోపలి మృద్వి అనే మెనింజెస్ ఉంటాయి. పది జతల కపాలనాడులు ఉంటాయి.
  11. మధ్య చెవిలో కర్ణస్తంభిక అనే ఒకేఒక శ్రవణార్థిక ఉంటుంది. ఇది చేపలలోని అధోహనువు రూపాంతరం. మొట్టమొదటిసారిగా ఉభయచరాలలో కర్ణభేరి, లాక్రిమల్, హల్దేరియన్ గ్రంథులు ఏర్పడ్డాయి.
  12. లైంగిక జీవులు వేరువేరు. సాధారణంగా బాహ్య ఫలదీకరణం జరుగుతుంది. అభివృద్ధి చాలావరకు పరోక్షంగా ఉంటుంది.
    ఉదా : బ్యూఫో (గోదురుకప్ప), రానా (కప్ప), హైలా (చెట్టుకప్ప), సాలమండ్రా (సాలమండర్), ఇక్తియోఫిస్ (ఉపాంగరహిత ఉభయచరం), రాకోఫోరస్ (ఎగిరేకప్ప).

ప్రశ్న 9.
చక్కని పటంతో కప్ప పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థను వివరించండి.
జవాబు:
AP Inter 1st Year Zoology Study Material Chapter 4 జంతు వైవిధ్యం-II కార్డేటాల క్లుప్త చరిత్ర 4
పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థలో ఒక జత పసుపురంగు అండాకార ముష్కాలు ఉంటాయి. ఇవి మూత్ర పిండాలకు, పృష్ఠ శరీర కుడ్యానికి రెండు మడతల ఆంత్రవేష్టనంతో అతకబడి ఉంటాయి. ఆంత్రవేష్టనాన్ని ముష్కయోజని అంటారు. ప్రతీ ముష్కంలో లెక్కలేనన్ని శుక్రోత్పాదక నాళికలు ఉంటాయి. ఇవి కలిసి 10-12 ఇరుకైన శుక్రనాళికలను ఏర్పరుస్తాయి. ఇవి మూత్రపిండంలోకి ప్రయాణించి బిడ్డర్ కాలువలోకి తెరుచుకొంటాయి. ఇది మూత్రనాళానికి మూత్రపిండ అడ్డుకుల్యల ద్వారా కలపబడి ఉంటుంది. ఇరువైపుల ఉన్న ‘మూత్ర జనన నాళాలు అవస్కరంలోకి తెరుచుకొంటాయి.

ప్రశ్న 10.
కప్ప ప్రత్యేక జ్ఞానాంగాల గురించి లఘుటీక రాయండి.
జవాబు:
ప్రత్యేక జ్ఞానాంగాలు :
కప్పలో స్పర్శ, రుచి, వాసన, దృష్టి, శ్రవణానికి జ్ఞానాంగాలు ఉన్నాయి. ఇందులో నేత్రాలు, లోపలి చెవి చక్కగా వ్యవస్థీకరణ చెందిన నిర్మాణాలు. మిగిలినవన్నీ నాడీ అంత్యాల చుట్టూ ఏర్పడిన కణ సమూహాలు, చర్మంలో స్పర్శకు సంబంధించిన గ్రాహకాలు ఉంటాయి. నాలుకపై ఉన్న చిన్న సూక్ష్మాంకురాలలో గల రుచిగుళికలు రుచికి తోడ్పడతాయి, ఒక జత నాసికా గదులు ఘ్రాణ అవయవాలుగా తోడ్పడతాయి.

దృష్టికి ఒక జత నేత్రాలు ఉంటాయి. ఇవి పుర్రె నేత్రకోటరంలో ఉంటాయి. నేత్రాలకు కనురెప్పలు ఉంటాయి. పై రెప్ప కదలదు. కింది రెప్ప పారదర్శక నిమేషక పటలం రూపంలో మడతపడి ఉంటుంది. ఈ పటలం కంటి ఉపరితలాన్ని పూర్తిగా కప్పే సామర్థ్యం కలిగి ఉంటుంది. కంటి నేత్రపటలంలో కడ్డీలు లేదా దండాలు, శంఖువులు ఉంటాయి. రంగుల దృశ్యానికి శంకువులు, మసక వెలుతురులో దృష్టికి కడ్డీలు తోడ్పడతాయి.

చెవులు వినికిడి, సమతుల్యతకు తోడ్పడతాయి. దీనిలో మధ్య చెవి ఉంటుంది. ఇది బాహ్యంగా పెద్ద కర్ణభేరిత్వచంతో కప్పబడి ఉంటుంది. ప్రకంపనాలను లోపలి చెవికి అందించడానికి స్తంభిక ఉంటుంది. లోపలి చెవిలోని పేటికలో మూడు అర్ధచంద్రాకార కుల్యలు ఒక చిన్న గోణిక ఉంటాయి.

AP Inter 1st Year Zoology Study Material Chapter 4 జంతు వైవిధ్యం-II: కార్డేటాల క్లుప్త చరిత్ర

ప్రశ్న 11.
సరీసృపాల బాహ్య, అంతరాస్థిపంజర ముఖ్య లక్షణాలను రాయండి.
జవాబు:
చర్మం గరుకుగా, పొడిగా ఉంటుంది. బాహ్యాస్థిపంజరంలో కొమ్ము సంబంధిత బహిస్త్వచ పొలుసులు, ఫలకాలు, నఖాలు (మొట్టమొదటగా సరీసృపాలలో ఏర్పడినవి) ఉంటాయి.

దంతవిన్యాసం అగ్రదంత, సమదంత, బహువార దంత రకాలు (మొసళ్ళలో క్షీరదాల మాదిరిగా థీకోడాంట్ దంతరకం ఉంటుంది). కిలోనియాలో దంతాలుండవు.

ఏకకంద కపాలం అనేక జీవులలో శంఖాఖాతాలు ఉంటాయి. కింది దవడ ప్రతి అర్థభాగంలో సాధారణంగా ఆరు ఎముకలు ఉంటాయి. కశేరుకాలు చాలావరకు పురోగర్తి రకానికి చెందినవి. మొదటి రెండు కశేరుకాలు శీర్షధరం, అక్ష కశేరుకంగా ప్రత్యేకత కలిగి ఉంటాయి. దీనివల్ల తల స్వతంత్రంగా మిగిలిన శరీరంతో సంబంధం లేకుండా కదలడానికి అవకాశం ఏర్పడుతుంది. రెండు త్రిక కశేరుకాలు ఉంటాయి.

ప్రశ్న 12.
సరీసృపాల విభాగంలో వర్తమాన క్రమాలను తెలపండి. ప్రతీ క్రమానికి రెండు ఉదాహరణలు ఇవ్వండి.
జవాబు:
వర్తమాన సరీసృపాలను నాలుగు క్రమాలుగా ఏర్పరచారు :
1. కిలోనియా :
కిలోన్ (సముద్ర ఆకుపచ్చ తాబేలు), టెస్టుడో (భౌమ్య తాబేలు), ట్రియోనిక్స్ (మంచినీటి తాబేలు).

2. రింకోసెఫాలియా :
స్ఫీనోడాన్ (సజీవ శిలాజం-న్యూజిలాండ్కి పరిమితమై ఉంటుంది)

3. క్రొకోడీలియ :
క్రొకోడైలస్ పాలుస్ట్రీస్ (భారతదేశం మొసలి లేదా మగర్), అలిగేటర్, గేవియాలిస్, గాంజిటికస్ (భారతదేశ గేవియాల్ లేదా ఘరియాల్)

4. స్వామేటా
ఎ) బల్లులు/తొండలు : హెమిడాక్టైలస్ (గోడబల్లి), కెమిలియాన్ (ఊసరవెల్లి), డ్రాకో (ఎగిరే బల్లి)
బి) పాములు (సర్పాలు)
1) విష సర్పాలు : నాజ నాజ (నాగుపాము), ఒఫియోఫాగస్ హన్న (రాచనాగు), బంగారస్ (కట్లపాము/క్రెయిట్), డబొయ/వైపరా రసెల్లి (గొలుసు రక్తపింజరి)
2) విషరహిత సర్పాలు : ట్యాస్ (రాట్ స్నేక్/జెర్రిగొడ్డు), ట్రోపిడోనోటస్ (నీటి పాము/నీరుకట్టె)

ప్రశ్న 13.
పక్షులలో ఎగరడానికి ఏర్పడిన అనుకూలనాలను పేర్కొనండి.
జవాబు:

  1. దేహం ఎగరటానికి అనువుగా కదురు ఆకారంలో ఉంటుంది.
  2. పూర్వాంగాలు రెక్కలుగా మార్పు చెంది ఉంటాయి.
  3. చరమాంగాలు పెద్దవిగా ఉండి దేహం బరువును మోస్తాయి. మరియు ఆహార సేకరణ, కొమ్మలను పట్టుకొనడంలో సహాయపడతాయి.
  4. దేహం ఈకలతో కప్పబడి ఉంటుంది.
  5. క్విల్ ఈకలు ఇంటర్ లాకింగ్ అమరికను కలిగి ఉంటాయి.
  6. క్విల్ ఈకలు తోక మీద ఉండి చుక్కాని వలె పనిచేస్తుంది.
  7. వీటిలో పొడవుగా ఉండే ఎముకలు వాతులాస్థులు.
  8. పరపుచ్ఛ కశేరుకాలు కలియడం వల్ల నాగలి ఆకారపు ఎముక లేదా హలాస్థి ఏర్పడుతుంది.
  9. ఉడ్డయక కండరాలు బాగా అభివృద్ధి చెంది ఉంటాయి.
  10. ఊపిరితిత్తులు స్పంజికాయుతంగా ఉంటాయి.
  11. వాయుకోశాల విస్తరణను కలిగి ఉండే వాతిలాస్థులు ఉంటాయి.

ప్రశ్న 14.
రాటిటే పక్షుల విలక్షణ లక్షణాలను తెలపండి. రెండు ఉదాహరణలు ఇవ్వండి.
జవాబు:
రాటిటే/పేలియోనేతె/ఎగరలేని పక్షులు :
ఇవి పరిగెత్తే, ఎగరలేని ఆధునిక పక్షులు. ఇవి డిప్నాయ్ (ఊపిరితిత్తి చేపలు), మార్సూపియల్స్ లాగా విచ్ఛిన్న విస్తరణను ప్రదర్శిస్తాయి. వీటిలో రెక్కలు క్షీణించి, ఉరోస్థి ద్రోణి లేకుండా తెప్పలాగా ఉంటుంది. మగ పక్షులలో మేహనం ఉంటుంది. వీటిలో శబ్దిని, జత్రుకలు మరియు ప్రీన్ గ్రంథి ఉండదు.
ఉదా : స్ట్రుతియో కామిలస్ (ఆఫ్రికన్ ఆస్ట్రిచ్), కివి (న్యూజిలాండ్ జాతీయపక్షి), రియా (అమెరికన్ ఆస్ట్రిచ్), డ్రోమియస్ (ఇము), కాసువారియస్.

ప్రశ్న 15.
క్షీరదాలలో నాడీ వ్యవస్థ, జ్ఞానాంగాల ముఖ్య లక్షణాలను పేర్కొనండి.
జవాబు:
• శరీర పరిమాణాన్ని అనుసరించి ఇతర జంతువులతో పోల్చినప్పుడు క్షీరదాలలో మెదడు పెద్దగా ఉంటుంది. నాలుగు దృష్టిలంబికలు కలిసి కార్పొరా క్వాడ్రిజెమీనాను ఏర్పరుస్తాయి. కార్పస్ కెలోసం రెండు మస్తిష్కార్ధ గోళాలను కలుపుతుంది. కేంద్రనాడీవ్యవస్థను ఆవరిస్తూ మూడు మెనింజెస్ ఉంటాయి. మధ్య మెనింజెస్ అరక్నాయిడ్ త్వచం కేవలం క్షీరదాలలో మాత్రం ఉంటుంది. 12 జతల కపాలనాడులు ఉంటాయి.

• నేత్రాలు కదిలే కనురెప్పలు, పక్ష్మాలతో ఉంటాయి. బాహ్య చెవి వెడల్పుగా, కండరయుతంగా మృదులాస్థితో ఉన్న తమ్మె లాగ ఉంటుంది. దీన్ని పిన్నా లేదా చెవిడొప్ప అంటారు. మధ్య చెవిలో మూడు కర్ణాస్థిఖండాలు ఉంటాయి. అవి కూటకం, దాగలి, కర్ణాంతరాస్థి. లోపలి చెవిలో కర్ణావర్తం మెలితిరిగి ఉంటుంది. దీనిలో శబ్ద గ్రాహకం, కోర్టి అవయవం ఉంటుంది.

AP Inter 1st Year Zoology Study Material Chapter 4 జంతు వైవిధ్యం-II: కార్డేటాల క్లుప్త చరిత్ర

ప్రశ్న 16.
యూథీరియన్ల కింది లక్షణాల గురించి క్లుప్తంగా రాయండి.
ఎ) దంత విన్యాసం బి) అంతరాస్థి పంజరం.
జవాబు:
ఎ) అంతరాస్థి పంజరము :
పుర్రె డైకాండైలిక్ (ద్వికంద) రకానికి చెందింది. ప్రతి కింది దవడ అర్ధభాగంలో దంతాస్థి (డెంటరీ) అనే ఒకే ఎముక ఉంటుంది. చాలావరకు క్షీరదాలలో ఏడు గ్రీవకశేరుకాలు ఉంటాయి. కొలియోపస్ (రెండు కాలివేళ్ల స్లాత్), ట్రెకికస్ (మనాటి) లలో ఆరు, బ్రాడిపస్ (మూడు కాలివేళ్ళ స్లాత్) లో తొమ్మిది గ్రీవ కశేరుకాలు ఉంటాయి. రెండు నుంచి ఐదు త్రికకశేరుకాలు ఉంటాయి. కశేరుకాలు ఉభయ సమతల రకానికి చెందినవి (కశేరుమధ్యం రెండు తలాలు చదునుగా ఉంటాయి). పర్శుకలు రెండు శీర్షాలతో ఉంటాయి.

బి) దంత విన్యాసము :
నాసికా కుహరం ఆస్యకుహరం నుంచి ద్వితీయ అంగిలిచే వేరు చేయబడుతుంది. దంతాలు ఢీకోడాంట్, విషమదంత, ద్వివారదంత రకాలు. ఆస్యకుహరంలో 4 జతల లాలాజల గ్రంథులు ఉంటాయి. (మానవులలో మూడు జతలు).

ప్రశ్న 17.
కింది వాటికి ఉదాహరణలు ఇవ్వండి.
ఎ) శిశూత్పాదక చేప
బి) విద్యుత్ అవయవాలు గల చేప
సి) విషపుకొండి గల చేప,
డి) చేప నీటిలో తేలియాడటాన్ని క్రమపరచడానికి దాని శరీరంలోని అవయవం
ఇ) క్షీరగ్రంథులు గల అండోత్పాదక జంతువు.
జవాబు:
ఎ) స్కోలియోడాన్ (సొరచేప)
బి) టార్పిడో (విద్యుత్ చేప)
సి) డాసియాటిస్/టైగాన్
డి) అద్వంద్వ వాజాలు చేప నీటిలో తేలియాడటానికి సహాయపడును (పృష్ఠవాజము, ఉదరవాజము)
ఇ) ఆర్నితోరింకస్ (బాతు ముక్కు ప్లాటిపస్)

ప్రశ్న 18.
కింది వాటిలో రెండు పోలికలు రాయండి.
ఎ) పక్షులు, క్షీరదాలు బి) కప్ప, మొసలి సి) బల్లి, పాము
జవాబు:
ఎ) 1. ఉష్ణ రక్తప్రాణులు
2. 12 జతల కపాలనాడులు

బి) 1. శీతల రక్తప్రాణులు
2. పూర్వాంగములు చర్మాంగములకంటే పొట్టిగా ఉండును
3. అండోత్పాదక జీవులు
4. వ్రేళ్ళు మధ్య అంతరాంగజాలము ఉండును.

సి) 1. ఒక జత హేమిపెనిస్ ఉండును.
2. జాకోబ్సన్ అవయవము ఉండును.

ప్రశ్న 19.
కింది జంతువుల పేర్లు రాయండి.
ఎ) అంగవిహీన ఉభయచరం,
బి) సజీవ జంతువులలో అతిపెద్ద జంతువు
సి) పొడి, కార్నిఫైడ్ చర్మం గల జంతువు,
డి) భారతదేశ జాతీయ జంతువు
జవాబు:
ఎ) ఇస్తియోపిస్,
బి) నీలి తిమింగలం (బెలనాప్టిరా మస్కులస్)
సి) పొడి, కార్నిపైడ్ చర్మంగల జంతువులు-సర్పములు, బల్లులు,
డి) పాంగెరా టైగ్రిస్ (పులి)

AP Inter 1st Year Zoology Study Material Chapter 4 జంతు వైవిధ్యం-II: కార్డేటాల క్లుప్త చరిత్ర

ప్రశ్న 20.
కింది జంతువుల ప్రజాతులను తెలపండి.
ఎ) అండోత్పాదక క్షీరదం,
బి) ఎగిరే నక్క,
సి) నీలి తిమింగలం,
డి) కంగారు.
జవాబు:
ఎ) ఆర్నితోరింకస్,
బి) టిరోపస్,
సి) బెలనాప్టెరా,
డి) మాక్రోఫస్

AP Inter 1st Year Botany Study Material Chapter 10 జీవ అణువులు

Andhra Pradesh BIEAP AP Inter 1st Year Botany Study Material 10th Lesson జీవ అణువులు Textbook Questions and Answers.

AP Inter 1st Year Botany Study Material 10th Lesson జీవ అణువులు

అతిస్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
ఔషధాలు కృత్రిమంగాగానీ, మొక్కలు, బాక్టీరియా, జంతువులు మొదలైన వాటినుంచి గానీ (సహజసిద్ధమైన ఉత్పన్నాలు) తయారవుతాయి. కొన్ని సమయాల్లో సహజ ఉత్పన్నాల విషప్రభావాన్ని (side effects) తగ్గించటానికి రసాయనికంగా మార్పులు జరుపుతారు.
ఈ క్రిందివానిలో ఏవి సహజమైనవో, ఏవి కృత్రిమంగా తయారు చేయబడినవో తెల్పండి.
a) పెన్సిలిన్ …………….
b) సల్ఫోనమైడ్ …………….
c) విటమిన్ సి …………….
d) పెరుగుదల హార్మోన్లు …………….
జవాబు:
a) పెన్సిలిన్ – సహజ ఉత్పత్తి
b) సల్ఫోనమైడ్ – కృత్రిమ ఉత్పత్తి
c) విటమిన్ సి – సహజ ఉత్పత్తి
d) పెరుగుదల హార్మోన్లు – సహజ ఉత్పత్తి

ప్రశ్న 2.
దిగువనిచ్చిన పదార్థాలలో ఎస్టర్ బంధం, గ్లైకోసైడిక్ బంధం, పెప్టైడ్ బంధం, హైడ్రోజన్ బంధాలను గుర్తించండి.
a) పాలీశాఖరైడ్లు …………….
b) ప్రోటీనులు …………….
c) కొవ్వులు …………….
d) నీరు …………….
జవాబు:
a) పాలీశాఖరైడ్లు – గ్లైకోసైడిక్ బంధము
b) ప్రోటీనులు – పెప్టైడ్ బంధము
c) కొవ్వులు – ఎస్టర్ బందము
d) నీరు – హైడ్రోజన్ బందము

ప్రశ్న 3.
అమైనో ఆమ్లాలు, చక్కెరలు, న్యూక్లియోటైడ్లు, కొవ్వు ఆమ్లాలకు ఒక్కొక్క ఉదాహరణ నివ్వండి.
జవాబు:
a) అమైనో ఆమ్లాలు – గ్లైసిన్, అలనిన్
b) చక్కెరలు – గ్లూకోస్, రైబోస్
c) న్యూక్లియోటైడ్లు – ఎడినైలిక్ ఆమ్లము
d) కొవ్వు ఆమ్లాలు – గ్లిసరాల్, లెసిథిన్

ప్రశ్న 4.
అమైనో ఆమ్లం యొక్క జ్విట్టర్ అయాన్ రూపాన్ని వివరించండి. [Mar. ’14]
జవాబు:
ఒక నిర్దిష్ట PH వద్ద అమైనో ఆమ్లము ధనాత్మక ఋణాత్మక విలువలను సమాన సంఖ్యలో కలిగి ఉంటుంది. ఇది ద్విద్రువం వలె కనిపిస్తుంది. దీనిని జ్విట్టర్ అయాను రూపము అంటారు.
AP Inter 1st Year Botany Study Material Chapter 10 జీవ అణువులు 1

ప్రశ్న 5.
DNA లోని ఏ ఘటకాలు గ్లైకోసైడిక్ బంధాన్ని చూపిస్తాయి.
జవాబు:
ప్రక్కప్రక్కన ఉండే చక్కెర అణువులలోని కార్బన్ల మధ్య ఉండే బంధము – గ్లైకోసైడిక్ బంధము

AP Inter 1st Year Botany Study Material Chapter 10 జీవ అణువులు

ప్రశ్న 6.
గ్లెసిన్, అలానిన్లు వాటి (or) కార్బన్లోని ప్రతిక్షేపకాలననుసరించి వేర్వేరుగా ఉంటాయి. రెంటిలో ఉండే ప్రతిక్షేపక గ్రూపులేవి?
జవాబు:
హైడ్రోజన్, కార్బాక్సిల్ సముదాయము, అమైనో సముదాయము మరియు ‘R’ సమూహము.

ప్రశ్న 7.
స్టార్చ్, (పిండి పదార్థాలు), సెల్యూలోస్, గ్లైకోజన్, కైటిన్ అనే పాలిశాఖరైడ్లను ఈ కింది వాటితో జతపరచండి.
a) నూలుపోగు ………….
b) బొద్దింక ఎక్సోస్కెలిటిన్ ………….
c) కాలేయం ………….
d) తొక్కతీసిన బంగాళదుంప ………….
జవాబు:
a) నూలుపోగు – సెల్యూలోస్
b) బొద్దింక ఎక్సోస్కెలిటిన్ – కైటిన్
c) కాలేయం – గ్లైకోజన్
d) తొక్కతీసిన బంగాళదుంప – స్టార్చ్ (పిండి)

ప్రశ్న 8.
ప్రాథమికద్వితియ జీవ క్రియోత్పన్నాలు అంటే ఏమిటి? ఉదాహరణలు ఇవ్వండి.
జవాబు:
ప్రాథమిక జీవ క్రియోత్పన్నాలు: జీవులలో గుర్తించదగిన విధాలు కలిగి, శరీర ధర్మ శాస్త్ర విధానాల్లో పాత్ర కలిగిన జీవక్రియోత్పన్నాలును ప్రాథమిక జీవ క్రియోత్పన్నాలు అంటారు.
ఉదా : ఉదజని, కర్బనం, ఆక్సిజన్, నత్రజని మొదలగునవి.

ద్వితీయ జీవ క్రియోత్పన్నాలు : జీవులలో చెప్పుకోదగిన విధాలు లేని జీవ క్రియోత్పన్నాలను ద్వితియ జీవ క్రియోత్పన్నాలు అంటారు.
ఉదా : ఆల్కలాయిడ్లు, ఫావనాయిడ్లు, రబ్బర్లు, జిగురు పదార్థాలు.

స్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
పాలిశాఖరైడ్ల గురించి క్లుప్తంగా వ్రాయండి.
జవాబు:
పాలిశాఖరైడ్లు చక్కెరలతో ఏర్పడిన పొడవైన గొలుసు లేదా శృంఖలాలు. ఉదా : పత్తిదారం, సెల్యులోస్ మొదలగునవి. సెల్యులోస్ ఒక సమజాతీయ బహ్వణువు. ఇది ఒకే రకమైన మోనోశాఖరైడు (గ్లూకోజ్) తో ఏర్పడతాయి. సెల్యులోజ్ రూపాంతరమైన స్టార్స్ మొక్కల కణజాలాల్లోకి శక్తి మూలాధారంగా ఉంటుంది. మొక్కల కణత్వచాలు సెల్యుజోజుతో నిర్మితమై ఉంటాయి. ప్రకృతిలో ఇంకా ఎక్కువ సంక్లిష్ట పాలిశాఖరైడ్లు కలవు. ఆర్థోపోడ్ ల బాహ్య అస్థిపంజరంలోనూ, శిలింధ్రాల కణత్వచాల్లోను కైటిన్ అనే సంక్లిష్ట విషమ బహ్వణువు పాలిశాఖరైడ్లుంటాయి. ఇన్యులిన్ అనేది ఫ్రక్టోజ్ యొక్క పాలిశాఖరైడు. బాక్టీరియా కణవచంలో పెప్టిడోగ్లైకాన్ అనే బహ్వణువు గ్లూకోజమైన్ N – సిటైల్గా లక్టోజమైన్లను కలిగి ఉంటుంది. ఇది అమైనో చక్కెరలు పాలిశాఖరైడుకు ఉదాహరణగా చెప్పవచ్చు.

ప్రశ్న 2.
ప్రోటీన్ని ఉదాహరణ చేసుకొని దాని పరికల్పనాత్మక (hypothetical) ప్రాథమిక, ద్వితీయ, తృతీయ నిర్మాణాలను పటాల ద్వారా సూచించండి.
జవాబు:
ప్రోటీన్లు సన్నని దారం రూపంలో అమరిన అమైనో ఆమ్లాలు కలిగిన విషమ పాలిమర్లు. ప్రోటీన్లులో ఏ అమైనో ఆమ్లము మొదటిది, ఏది రెండవది అనే సమాచారాన్ని ప్రోటీను ప్రాథమిక నిర్మాణము అంటారు. ఒక ప్రోటీనును ఒక గీతిగా ఊహిస్తే ఎడమ కొనను మొదటి అమైనోఆమ్లాన్ని కలిగినదిగాను, కుడికొనను అంత్య అమైనోఆమ్లాన్ని కలిగినదిగాను సూచిస్తారు. మొదటి అమైనోఆమ్లాన్ని N – కొన అని, ఆఖరి అమైనో ఆమ్లాన్ని C – కొన అంటారు. ప్రోటీన్లులలో కుడివైపు సర్పిలాలనే గమనించారు. ప్రోటీను పోగులోని మిగిలిన ప్రాంతాలలో వేర్వేరు విధాలుగా మడతలు పడి ఉంటుంది. దీని ద్వితీయ నిర్మాణం అంటారు. పొడవైన ప్రోటీను గొలుసు దాని మీద అదే మడతలు పడి ఒక డొల్లగా ఉన్న ఊలు బంతివలె ఉంటె దానిని తృతీయ నిర్మాణం అంటారు. దీని వల్ల ప్రోటీన్లుకు ఒక త్రిమితీయ రూపం వస్తుంది.

AP Inter 1st Year Botany Study Material Chapter 10 జీవ అణువులు 2
AP Inter 1st Year Botany Study Material Chapter 10 జీవ అణువులు 3

AP Inter 1st Year Botany Study Material Chapter 10 జీవ అణువులు

ప్రశ్న 3.
కేంద్రకామ్లం ద్వితీయ నిర్మాణాన్ని ప్రదర్శిస్తుంది. సోదాహరణంగా సమర్థించండి.
జవాబు:
కేంద్రకామ్లాలు ద్వితీయ నిర్మాణాన్ని ప్రదర్శిస్తాయి. ఉదా : వాట్సన్ – క్రిక్ నమూనా DNA ప్రదర్శించే ఒక ద్వితీయ నిర్మాణము. దీని ప్రకారం DNA ద్విసర్పిలాకారంలో ఉంటుంది. పాలిన్యూక్లియోటైడ్ లు కల ఈ రెండు పోచలు వ్యతిరేక దిశలలో సమాంతరంగా ఉంటాయి. చక్కెర – ఫాస్పేట్ – చక్కెర గొలుసు కేంద్ర కామ్లాలలో వెన్నెముక వలె ఉంటుంది. నత్రజని క్షారాలు వెన్నెముకకు లంబంగా లోపలి వైపుకు ప్రక్షేపించబడి ఉంటాయి. ఒకపోచలోని ఎడినిన్ (A) గ్వానిన్ (G) లు వరుసగా రెండవ పోచలోని థైమిన్ (T) సైటోసిన్ (C) తో బంధాలు కలిగి ఉంటాయి. A-T ల మధ్య రెండు ఉదజని బంధాలు, G – C ల మధ్య 3 ఉదజని బంధాలు ఉంటాయి. ప్రతి ఒక్కపోచ సర్పిలాకార మేడమెట్లును పోలి ఉంటుంది. ప్రతి ఆరోహణ మెట్టు ఒక జతనత్రజని క్షారాలను కలిగి 36° కోణాన్ని చూపుతుంది. ద్విసర్పిలంలోని ఒక పూర్తి మెలికకు పదిమెట్లు లేదా పదిజతల నత్రజని క్షారాలు ఉంటాయి. ఒక మెలిక నిడివి 34 A° నత్రజని క్షారాల జతల మధ్య దూరము 3.4 A° ఉంటుంది. ఈ రకమైన DNA ను B – DNA అంటారు.
AP Inter 1st Year Botany Study Material Chapter 10 జీవ అణువులు 4

దీర్ఘ సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
ద్వితీయ జీవనక్రియోత్పన్నాలంటే ఏమిటి? అవి మానవునికి ఏవి ఏవిధంగా ఉపయోగపడతాయో తెలపండి.
జవాబు:
అతిథేయిలో చెప్పుకోదగ్గ విదులులేవి జీవక్రియ ఉత్పన్నాలను ద్వితీయ జీవక్రియోత్పన్నాలు అంటారు. ఉదా : ఆల్కలాయిడ్లు, ఫ్లావనాయిడ్లు, రబ్బరు, ఆవశ్యక నూనెలు, ఆంటిబయోటిక్స్, వర్ణద్రవ్యాలు, అత్తర్లు, జిగురులు, సుగంధ ద్రవ్యాలు.

1) ఆల్కలాయిడ్లు :
ఇవి సేంద్రియ నత్రజని సంయోగ పదార్థాలు. జీవన క్రియల ఫలితంగా అమైనో ఆమ్లాల నుండి ద్వితీయ పదార్థాలుగా ఏర్పడతాయి. వీటిని ద్రవరూప ఔషదాలు తయారీలోను, విష పదార్థాలలో వాడతారు. పురాతన కాలంలో మొక్కల నుండి లభించే ఆల్కలాయిడ్లను పాముకాటుకు విరుగుడుగా, జ్వరము నివారణకు వాడేవారు.

2) ప్లావనాయిడ్లు :
రెండు బెంజీన్ వలయాలు, పైరేన్ వలయంచే కలుపబడి ఉన్న ఫీనాలిక్ గ్లైకోసైడులను ప్లావనాయిడ్లు అంటారు. ఇవి మొక్కల ఆకులు, పుష్పాలు, ఫలాలలో ఉంటాయి. వీటిని కాన్సర్ నివారణలో, వైరస్ వ్యాధుల నివారణకు, వాపుల నివారణకు వాడతారు. వీటిని మానవ రక్త ఫలకికల సమూహం ఏర్పడకుండా వాడతారు.

3) రబ్బరు :
శుద్ధిచేయని రబ్బరును సిమెంట్ పరిశ్రమలలో ఇన్సులేటింగ్ టేపుల తయారీలోను వాడతారు. రబ్బరుకు సాగే గుణం, నమ్యత ఉండుట వల్ల వీటిని రబ్బరు పైపులు, టైరులు తయారీలో వాడతారు. దీని సాగే గుణమును వివిధ ఘాతశోషకాలలో ఉపయోగిస్తారు. ఇది వాయువులకు అపార గమ్యంగా ఉంటుంది. దీనిని రబ్బరు పైపులు, బెలూన్లు, బంతులు, కుషన్ల తయారీలో వాడతారు.

సుగంధతైలాలు :
జల విరోది ద్రావణీయత కల ఆవిరి అయ్యే నూనెలు. వీటిలో ముఖ్యమైనవి.
a) కొత్తిమీర నుండి తీసిన తైలమును నొప్పుల నివారణకు అజీర్ణ వ్యాధి నివారణకు వాడతారు.
b) మందారిన్ తైలమును కాలి పగుళ్ళు నివారణకు మచ్చల నివారణకు వాడతారు.
c) లావెండర్ తైలమును అస్మా నివారణలో, తలనొప్పి చెవినొప్పి నివారణలో వాడతారు.

సూక్ష్మజీవ నాశకాలు :
వ్యాధి జనక జీవులను నాశనం చేసే సహజ రసాయనాలు. అతిథేయిపై ఏవిధమైన ప్రభావం చూపకుండా వ్యాధిని కలుగచేయు బాక్టీరియా వంటి క్రిములను నాశనం చేస్తాయి. ఉదా : స్ట్రెప్టోమైసిన్ – స్ట్రెప్టోమైసిస్ గ్రీనియస్ నుండి లభిస్తుంది.

సుగంధద్రవ్యాలు :
ఇంగువ, యాలకులు, దాల్చినచెక్క ముఖ్యమైనవి. ఇంగువ దగ్గు నివారణకు, కడుపునొప్పి నివారణకు వాడతారు. యాలకులు నోటి దుర్వాసన పోగొట్టటానికి చక్కెరవ్యాధి నివారణలో వాడతారు. లవంగాలు పంటినొప్పి నివారణకు, జలుబు, దగ్గు నివారణకు వాడతారు.

AP Inter 1st Year Botany Study Material Chapter 10 జీవ అణువులు

ప్రశ్న 2.
మూలకాల సంఘటకాలను, జీవకణ సముదాయాల్లోని కర్బన అకర్బన ఘటకాలను ఏ విధమైన పద్ధతుల ద్వారా విశ్లేషిస్తారు? జీవ కణజాలాల్లో అత్యధిక సమృద్ధిగాగల ఘటకాల అనుమతి లేమిటి? సరైన దత్తాంశాలతో అనుమతులను సమర్థించండి.
జవాబు:
ఒక సజీవ కణజాలము (ఒక కూరగాయ లేదా కాలేయపు బాగము) తీసుకుని ట్రైక్లోరో ఎసిటిక్ ఆమ్లముతో, రోకలి, కల్వం సహాయంతో నూరినప్పుడు ఒక చిక్కని ద్రవం తయారవుతుంది. దీనిని వడగట్టే గుడ్డతో వడబోసినప్పుడు రెండు బాగాలు లభిస్తాయి.
1) వడబోసిన లేదా ఆమ్లం కరగ గల బాగము.
2) అవశేషము లేదా ఆమ్లంలో కరగని భాగము ఆమ్ల ద్రావణీయత భాగంలో వేలాది కర్బన సంయోగ పదార్థాలు కనుగొన్నారు. సజీవ కణజాలమునుంచి లభ్యమయ్యే అన్ని కర్బన సమ్మేళనాలను జీవాణువులు అంటారు.

ఒక జీవకణ సముదాయాన్ని (ఒక పత్రం లేదా కాలేయపు ముక్క) తీసుకొని, తూచి తడి బరువు తీసుకుని, దానిని నీరు ఆవిరి అయ్యేంతవరకు ఎండబెట్టాలి. ఈ మిగిలిన పదార్థపు బరువును పొడి బరువు అంటారు. ఈ కణజాలాన్ని కాల్చినప్పుడు అందులో ఉండే కర్బన సమ్మేళనాలన్ని (co, నీటిఆవిరి) ఆక్సీకరణం చెంది వాయురూపంలో తొలగిపోతాయి. ఈ రకంగా మిగిలిన దానిని బూడిద అంటారు. ఈ బూడిదలో అకర్బన మూలకాలైన సోడియం, పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం ఉంటాయి. ఆమ్లంలో కరిగే భాగంలో సల్ఫేట్, ఫాస్ఫేట్ వంటి సమ్మేళనాలు ఉంటాయి. కావున జీవ కణజాలాలు మూలక విశ్లేషణలో ఉదజని, ఆమ్లజని, కర్బనము క్లోరిన్ మొదలైన రూపాల్లో మూలకాల సంఘటన సమ్మేళనాల విశ్లేషణలో ఎటువంటి కర్బన, అకర్బన పదార్థాలు ఉన్నాయో తెల్సుకోవచ్చు జీవకణజాలాల్లో ఉదజని, కర్బనము అత్యధిక సమృద్ధిగా ఉంటాయి. 0.5, కర్బనము
ఉదా : ఉదజని = 0.5, = 18.5

ప్రశ్న 3.
కేంద్రకామ్లాలు ద్వితీయ నిర్మాణాన్ని ప్రదర్శిస్తాయి. వాట్సన్, క్రిక్ నమూనా ద్వారా వివరించండి.
జవాబు:
కేంద్రకామ్లాలు ద్వితీయ నిర్మాణాన్ని ప్రదర్శిస్తాయి. ఉదా : వాట్సన్ – క్రిక్ నమూనా DNA ప్రదర్శించే ఒక ద్వితీయ నిర్మాణము. దీని ప్రకారం DNA ద్విసర్పిలాకారంలో ఉంటుంది. పాలిన్యూక్లియోటైడ్ లు కల ఈ రెండు పోచలు వ్యతిరేక దిశలలో సమాంతరంగా ఉంటాయి. చక్కెర – ఫాస్పేట్ – చక్కెర గొలుసు కేంద్ర కామ్లాలలో వెన్నెముక వలె ఉంటుంది. నత్రజని క్షారాలు వెన్నెముకకు లంబంగా లోపలి వైపుకు ప్రక్షేపించబడి ఉంటాయి. ఒకపోచలోని ఎడినిన్ (A) గ్వానిన్ (G) లు వరుసగా రెండవ పోచలోని థైమిన్ (T) సైటోసిన్ (C) తో బంధాలు కలిగి ఉంటాయి. A-T ల మధ్య రెండు ఉదజని బంధాలు, G – C ల మధ్య 3 ఉదజని బంధాలు ఉంటాయి. ప్రతి ఒక్కపోచ సర్పిలాకార మేడమెట్లును పోలి ఉంటుంది. ప్రతి ఆరోహణ మెట్టు ఒక జతనత్రజని క్షారాలను కలిగి 36° కోణాన్ని చూపుతుంది. ద్విసర్పిలంలోని ఒక పూర్తి మెలికకు పదిమెట్లు లేదా పదిజతల నత్రజని క్షారాలు ఉంటాయి. ఒక మెలిక నిడివి 34 A° నత్రజని క్షారాల జతల మధ్య దూరము 3.4 A° ఉంటుంది. ఈ రకమైన DNA ను B – DNA అంటారు.
AP Inter 1st Year Botany Study Material Chapter 10 జీవ అణువులు 5

ప్రశ్న 4.
న్యూక్లియోటైడ్, న్యూక్లియోసైడ్కు గల భేదమేమి? రెండేసి ఉదాహరణలతో వాటి నిర్మాణాలను తెలపండి.
జవాబు:
AP Inter 1st Year Botany Study Material Chapter 10 జీవ అణువులు 6

ప్రశ్న 5.
వివిధ లిపిడ్ల రూపాలను సోదాహరణంగా వివరించండి.
జవాబు:
లిపిడ్లు సాదారణంగా నీటిలో కరగవు. ఇవి కొవ్వులు, కొవ్వు ఆమ్లాలు, నూనెలు, ట్రైగ్లిసరైడ్లు, ఫాస్ఫోలిపిడ్లు, స్టిరాయిడ్లు మరియు మైనం రూపాలలో ఉంటాయి.

ఒక ఫాటీ ఆమ్లంలో R సమూహాన్ని అతుక్కుని ఒక కార్బాక్సిల్ సమూహం ఉంటుంది. R సమూహం మిథైల్, ఇథైల్ లేదా అంతకంటే ఎక్కువ – CH2 సముదాయాలను కలిగి ఉండవచ్చు.
ఉదా : పామిటిక్ ఆమ్లములో కార్బోక్సిల్ కార్బను కలుపుకొని 16 కార్బన్లు ఉంటాయి. కొవ్వు ఆమ్లాలు సంతృప్తమైనవిగాను లేదా అసంతృప్తమైనవిగాను ఉంటాయి.

గ్లైకోలిపిడ్లు :
చాలా లిపిడ్లు కొవ్వు ఆమ్లాలను, గ్లిసరాల్ను కలిగి ఉంటాయి. కొవ్వు ఆమ్లాలు గ్లిసరాల్తో కలిసి ఎస్టర్ రూపంలో ఉంటాయి. ఆ రకంగా అవి మోనోగ్లిసరైడ్లు, డైగ్లిసరైడ్లు, ట్రైగ్లిసరైడ్లుగా ఉంటాయి.

ఫాస్ఫోలిపిడ్లు :
కొన్ని లిపిడ్లు ఫాస్పరస్ను, ఫాస్ఫారిలేటెడ్ కర్బన సమ్మేళనాన్ని గాని కలిగి ఉంటాయి. ఇవి కణత్వచంలో ఉంటాయి. నాడీకణజాలాలు ఎక్కువ సంక్లిష్టమైన నిర్మాణాలు గల లిపిడ్లను కలిగి ఉంటాయి.

Intext Question and Answers

ప్రశ్న 1.
బృహదణువులంటే ఏమిటి? ఉదాహరణలివ్వండి.
జవాబు:
ఆమ్ల అద్రావణీయ బాగాలలోని, ఎక్కువ అణుబారం కల స్థూల అణువులను బృహదణువులు అంటారు.
ఉదా : పోలీశాఖ రైడ్లు, కేంద్రకామ్లాలు

ప్రశ్న 2.
గ్లైకోసైడిక్, పెప్టైడ్, ఫాస్ఫోడైఎస్టర్ బంధాలను పటాలలో విశదీకరించండి.
జవాబు:
గ్లైకోసైడిక్ బంధము :
ప్రక్కప్రక్కన ఉండే చక్కెర అణువులలోని కార్బన్ల మధ్య ఉండే రసాయన బంధం.

పెప్టైడ్ బంధము :
ప్రోటీనులోని అమైనో ఆమ్లాల మధ్య ఉన్న బంధము

ఫాస్పోడై ఎస్టర్ బంధము :
ఫాస్ఫేట్ అణువు చక్కెరలోని హైడ్రాక్సిల్ గ్రూప్ మద్యకాల బంధమును ఎస్టర్ బంధం అంటారు. ఫాస్పేటి కిరువైపులా ఉన్న ఒక్కొక్కొ ఎస్టర్ బంధంను ఫాస్ఫోడై ఎస్టర్ బంధం అంటారు.

ప్రశ్న 3.
ప్రోటీన్ల తృతీయ నిర్మాణాన్ని తెలపండి.
జవాబు:
పొడవైన ప్రోటీను గొలుసు దానిమీద అదే ముడతలు పడి ఒక డొల్లగా ఉన్న ఊలు బంతిలాంటి తృతీయ నిర్మాణంగా ఏర్పడుతుంది. దీనివల్ల ప్రోటీనుకు ఒక త్రిమితీయ రూపం వస్తుంది. ఇది ఎన్నో జీవక్రియలకు అవసరము.

ప్రశ్న 4.
అల్ప అణుభారం కలిగిన 10 ఆసక్తికరమైన జీవాణువుల నిర్మాణాన్ని తెలపండి. వేరుచేసే పద్ధతుల ద్వారా వాటిని తయారు చేసే పరిశ్రమలుంటే తెలపండి. వాటిని కొనేదెవరో తెలుసుకోండి.
జవాబు:
అమైనో ఆమ్లాలు, మోనోశాఖరైడ్లు, డై శాఖరైడ్లు, చక్కెరలు, ఫాటీ ఆమ్లాలు, గ్లిసరాల్, న్యూక్లియోటైడ్లు, నత్రజని క్షారాలు.

ప్రశ్న 5.
ప్రోటీన్లకు ప్రాథమిక నిర్మాణం కలదు. మీకు ఏ అమైనో ఆమ్లం ఏ కొనలో ఉందో తెలిపితే, ఈ సమాచారంతో ప్రోటీను యొక్క శుద్ధత గాని సమ జాతీయతను గాని తెలుసుకోగలరా?
జవాబు:
ప్రోటీన్లు అమైనో ఆమ్లాలు కలిగిన విషమ పాలీమర్లు. ప్రోటీన్లలో ఏ అమైనోఆమ్లం మొదటిది, ఏది రెండవది అనే
సమాచారాన్ని ప్రాధమిక నిర్మాణం అంటారు. ఒక ప్రోటీనును ఒకే గీతిగా ఊహిస్తే ఎడమకొనను మొదటి అమైనో ఆమ్లం కలిగినదిగాను (N – కొన), కుడికొనను అంత్య అమైనో ఆమ్లము కలిగినదిగాను (C – కొన) సూచిస్తారు. ఈ సమాచారం ప్రకారం ప్రోటీను యొక్క శుద్ధతి గాని, సమజాతీయతకాని తెలుసుకోలేము.
ఉదా : అనేక ప్రోటీనులు మిథియోనైన్ అను అమైనో ఆమ్లంతో మొదలవుతాయి, కాని అవి ప్రోటీన్లుకు సమజాతీయంకాదు.

AP Inter 1st Year Botany Study Material Chapter 10 జీవ అణువులు

ప్రశ్న 6.
చికిత్సకుపకరించే ప్రోటీన్ల జాబితాను తయారుచేయండి. ప్రోటీన్ల (సౌందర్యసాధనాల) లాంటి ఉపయోగాలను తెలపండి.
జవాబు:
ఎరిథ్రో ప్రోటీన్లు, మోనోక్లోనల్ ఆంటీబాడీలు, ఇంటర్ఫెరాన్లు థ్రాంబిన్, ఫైబ్రినోజన్, ఆంటిజెన్, ఇన్సులిన్, రెనిన్, ప్రోటీనులను సౌందర్యపోషకాల తయారీలో, టాక్సిన్లు, జీవక్రియా బఫర్లు తయారీలో వాడతారు.

ప్రశ్న 7.
ట్రైగ్లిసరైడు సంఘటనాన్ని వివరించండి.
జవాబు:
ట్రైగ్లిసరైడ్లు మూడు మూలకాలతో ఏర్పడతాయి. అవి కార్బన్ ఉదజని, ఆమ్లజని, వీటిలో కార్బన్, ఉదజని ఎక్కువగాను ఆమ్లజని తక్కువగాను ఉంటాయి. ట్రైగ్లిసరైడ్లు 4 మూలభాగాలతో ఏర్పడతాయి. అవి 1) గ్లిసరాల్ అణువు, 2) కొవ్వు ఆమ్లాలు గ్లిసరాల్ 3 కర్బన పరమాణువులు 5 అణువు కొవ్వు ఆమ్లాలు కర్బన, ఉదజని గొలుసులు కలిగి, ఒక కొనలో 0, ను కలిగిఉంటాయి.

ప్రశ్న 8.
ప్రోటీన్ల అవగాహననుసరించి పాలు, పెరుగుగా మారేటప్పుడు ఏమి జరుగుతుందో తెలపండి.
జవాబు:
పాలలో ఉన్న ఎంజైమ్లు లాక్టోజెనన్ను లాక్టిక్ ఆమ్లముగా మారుస్తాయి. దీనివల్ల పాల PH విలువ తగ్గి పాలు-పెరుగుగా మారుతుంది.

ప్రశ్న 9.
అలనిన్ అనే అమైనోఆమ్ల నిర్మాణాన్ని చూపండి.
జవాబు:
AP Inter 1st Year Botany Study Material Chapter 10 జీవ అణువులు 7

ప్రశ్న 10.
జిగురు పదార్థాలు దేనినుంచి తయారవుతాయి? ఫెవికాల్ వేరుగా ఉంటుందా?
జవాబు:
జిగురులు, మొక్కల లేటెక్స్ నుండి లభిస్తాయి. ఇది రెసిన్లు హైడ్రోకార్బన్లతో ఉంటాయి. జిగురులు విషమ పాలీశాఖరైడ్లు. ఫెవికాల్ పాలీవినైల్ ఆల్కాహాలు. దీనిలో పాలీ శాఖరైడ్లు ఉండవు. కావున జిగురులు, ఫెవికాల్ వేర్వేరు పదార్థాలు.

AP Inter 1st Year Zoology Study Material Chapter 6 మానవ సంక్షేమంలో జీవశాస్త్రం

Andhra Pradesh BIEAP AP Inter 1st Year Zoology Study Material 6th Lesson మానవ సంక్షేమంలో జీవశాస్త్రం Textbook Questions and Answers.

AP Inter 1st Year Zoology Study Material 6th Lesson మానవ సంక్షేమంలో జీవశాస్త్రం

అతిస్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
పరాన్న జీవనాన్ని నిర్వచించి, వివరించండి.
జవాబు:
రెండు వేరువేరు జాతులకు చెందిన జీవుల మధ్య గల ఒక రకమైన సహవాసంలో ఒక జీవి రెండవ దానికి తీవ్రంగా నష్టం కలిగిస్తూ లేదా ఎటువంటి నష్టం లేకుండా తాను లాభం పొందుతూ జీవించడాన్ని పరాన్న జీవనం అంటారు.
ఉదా : మానవ దేహంలో నివసించే ఎంటమీబా హిస్టాలిటికా. చెదపురుగు జీర్ణవ్యవస్థలో నివసించే ట్రెకోనింఫా.

ప్రశ్న 2.
వాహకం, ఆశయ అతిథేయి మధ్యగల భేదాన్ని గుర్తించండి.
జవాబు:
వాహకం :
పరాన్నజీవుల సాంక్రమిక దశలను ముఖ్య అతిథేయి నుంచి వేరొక అతిథేయికి చేరవేసే జీవిని వాహకం (vector) అంటారు.
ఉదా : ఈగలు, బొద్దింకలు

ఆశయ అతిథేయి :
ముఖ్య అతిథేయి దొరకనప్పుడు పరాన్నజీవుల సంక్రమణ దశలకు ఆశ్రయం కల్పించే అతిథేయిలను ఆశ్రయాతిథేయి అంటారు. వీటిలో పరాన్నజీవులు అభివృద్ధి చెందవు, వ్యాధులను కలిగించవు. ఉదా : ప్లాస్మోడియంకు కోతి.

ప్రశ్న 3.
యాంత్రిక వాహనం, జీవసంబంధ వాహకం మధ్య ఉండే భేదాన్ని గుర్తించండి.
జవాబు:
యాంత్రిక వాహనం :
పరాన్నజీవి సాంక్రమిక దశలను ఒక అతిథేయి నుండి వేరొక అతిథేయికి రవాణా మాత్రమే చేసే జీవులను యాంత్రిక వాహనం అంటారు. ఈ విషయంలో వాహక జీవికి, పరాన్న జీవికి ఎటువంటి సంబంధం ఉండదు.
ఉదా : ఎంటమీబాకు ఈగలు.

జీవ సంబంధ వాహకం :
ఈ వాహకంలో పరాన్నజీవి సాంక్రమిక దశలు మనుగడ సాగించగలిగి, ఇంకొక జీవికి సంక్రమించేలోపు కొంతవరకు అభివృద్ధి చెందుతాయి.
ఉదా : ప్లాస్మోడియంకు ఆడ ఎనాఫిలిస్ దోమ.

ప్రశ్న 4.
అథి పరాన్నజీవి అంటే ఏమిటి? ఒకదాని పేరు రాయండి. [Mar. ’14]
జవాబు:
ఒక పరాన్నజీవిపై బాహ్యంగా గాని, అంతర్గతంగా గాని పరాన్న జీవనం సాగించే పరాన్నజీవిని అధి పరాన్నజీవి అంటారు.
ఉదా : టోడ్ చేప (అతిథేయి) – స్పీరోస్పోరా పాలిమార్పా (పరాన్నజీవి) – నోసిమా నొటాబిలిస్ (అధి పరాన్నజీవి)

ప్రశ్న 5.
పరాన్నజీవ కాస్ట్రేషన్ అంటే ఏమిటి ? ఉదాహరణ రాయండి.
జవాబు:
కొన్ని పరాన్న జీవులు వాటి అతిథేయి బీజకోశాలను నాశనం చేసి వాటిని వంధ్య జీవులుగా మారుస్తాయి. ఈ విషయాన్ని పరాన్నజీవ కాస్ట్రేషన్ అంటారు.
ఉదా : సాక్యులినా అనే పరాన్నజీవి తన అతిథేయి కార్సినస్ మీనాస్ అనే పీత బీజకోశాలను నాశనం చేస్తుంది. దీని వలన మగ పీతలోని లైంగిక హార్మోన్ల సమతుల్యత దెబ్బతిని మగపీత ఆడ లక్షణాలను సంతరించుకుంటుంది.

AP Inter 1st Year Zoology Study Material Chapter 6 మానవ సంక్షేమంలో జీవశాస్త్రం

ప్రశ్న 6.
ఫాసియోల హెపాటికాలో అంతర్ పరాన్నజీవ అనుకూలనాలను తెలపండి.
జవాబు:
ఫాసియోల హెపాటికా నత్తలో పరాన్న జీవనం సాగిస్తాయి. వీటి డింభకాలు నత్త దేహం విపరీతంగా పెరిగేలా ప్రభావితం చేస్తాయి. దీనిని అతికాయత (Gigantism) అంటారు.

ప్రశ్న 7.
నియోప్లాసియాను నిర్వచించండి. దీనికి ఒక ఉదాహరణ తెలపండి.
జవాబు:
కొన్ని పరాన్నజీవులు అతిథేయి కణజాలంలో కణాల సంఖ్యను విపరీతంగా పెరిగేలా ప్రభావితం చేసి కొత్త నిర్మాణాలను ఏర్పరుస్తాయి. దీనినే నియోప్లాసియా అంటారు. ఇది క్యాన్సర్కు దారితీస్తుంది.
ఉదా : కొన్ని వైరస్లు.

ప్రశ్న 8.
ఆరోగ్యాన్ని చక్కగా నిర్వచించి, ఆరోగ్యాన్ని ప్రభావితం చేసే రెండు అంశాలను తెలపండి.
జవాబు:
ఆరోగ్యం అంటే పరిపూర్ణమైన భౌతిక, మానసిక, సామాజిక స్థితిని కలిగి ఉండటం. ఆరోగ్యాన్ని ప్రభావితం చేసే ప్రధాన జన్యు రుగ్మతలు, సంక్రమణలు, వ్యక్తి జీవన విధానం. అంశాలు

ప్రశ్న 9.
సంక్రమణ, అసంక్రమణ వ్యాధుల మధ్య భేదాన్ని తెలపండి. ఒక్కొక్క దానికి రెండు ఉదాహరణలు తెలపండి.
జవాబు:
సంక్రమణ వ్యాధులు :
ఒక వ్యక్తి నుండి మరొక వ్యక్తికి సంక్రమించే వ్యాధులను సంక్రమణ వ్యాధులు అంటారు.
ఉదా : అమీబిక్ విరేచనాలు, మలేరియా జ్వరం, బోదకాలు వ్యాధి, సాధారణ జలుబులు, AIDS మొదలైనవి.

అసంక్రమణ వ్యాధులు :
ఒక వ్యక్తి నుండి మరొక వ్యక్తికి వ్యాపించని వ్యాధులను అసంక్రమణ వ్యాధులు అంటారు.
ఉదా : జన్యు సంబంధ వ్యాధులు, మూత్రపిండ వ్యాధులు, హృదయ సమస్యలు.

ప్రశ్న 10.
‘ఎంటమీబా హిస్టోలైటికా అవికల్పిక అవాయు పరాన్నజీవి’ అని ఎలా చెప్పగలవు?
జవాబు:
ఎంటమీబా హిస్టోలైటికా మానవ దేహంలో మాత్రమే జీవించగలదు. కనుక ఇది అవికల్పక పరాన్నజీవి. ఇది మానవ జీర్ణవ్యవస్థలో అవాయు శ్వాసక్రియ జరుపుకుంటుంది. కనుక ఇది ‘అవికల్పక అవాయు పరాన్నజీవి’ అని చెప్పవచ్చును.

ప్రశ్న 11.
ఎంటమీబా హిస్టోలైటికా పూర్వ కోశస్థ దశ మరియు కోశస్థ దశ మధ్య భేదాన్ని గుర్తించండి.
జవాబు:
పూర్వ కోశస్థ దశ :
జీవి చిన్నగా, గుండ్రంగా లేదా అండాకారంగా ఉంటుంది. జీవ పదార్థంలో గ్లైకోజన్ రేణువులు, కడ్డీల వంటి క్రొమాటిడ్ దేహాలు ఉంటాయి.

కోశస్థ దశ :
జీవి దేహం గుండ్రంగా ఉండి పలుచని, మృదువైన అధిక నిరోధక శక్తి కలిగి కోశకుడ్యాన్ని ఏర్పరచుకుంటుంది. జీవి దేహంలో నాలుగు పిల్ల కేంద్రకాలుంటాయి.

AP Inter 1st Year Zoology Study Material Chapter 6 మానవ సంక్షేమంలో జీవశాస్త్రం

ప్రశ్న 12.
ఎంటమీబా హిస్టోలైటికా పూర్వకోశస్థ దశ మరియు కోశస్థ ప్రారంభ (early) దశలో నిల్వ ఆహారమేది?
జవాబు:
ఎంటమీబా హిస్టోలైటికా పూర్వ కోశస్థ దశ మరియు కోశస్థ ప్రారంభ దశలో నిలువ ఆహారము గ్లైకోజన్ రేణువుల రూపంలో, క్రొమాటిడ్ దేహాల రూపం (రైబోన్యూక్లియో ప్రొటీన్)లో ఉంటుంది.

ప్రశ్న 13.
ఒక వ్యక్తి పేగులో క్రమరహితం, ఉదర నొప్పి, మలంలో రక్తం, శ్లేష్మం ఉన్నాయి. ఈ లక్షణాల ఆధారంగా జీవి పేరు, వ్యాధిని తెలపండి.
జవాబు:
మానవ పేగులో క్రమరహితం, ఉదర నొప్పి, మలంలో రక్తం, శ్లేష్మం మొదలైన లక్షణాలను ఎంటమీబా హిస్టోలైటికా పరాన్న జీవి కారణం. ఈ వ్యాధిని అమీబిక్ విరేచనాలు లేదా అమీబిక్ డిసెంట్రి లేదా అమీబియాసిస్ అంటారు.

ప్రశ్న 14.
ఒక వ్యక్తి డాక్టరు సలహాతో క్లినికల్ ప్రయోగశాలలో మల పరీక్షకు వెళ్లాడు. అందులోని టెక్నీషియన్ మలంను పరీక్షించి అమీబియాసిస్తో బాధపడుతున్నాడని గుర్తించాడు. టెక్నీషియన్ గుర్తించిన రెండు లక్షణాలను తెలపండి.
జవాబు:
అమీబియాసిస్తో బాధపడే వ్యక్తి మలంను పరీక్షించినట్లయితే మానవ మలంలో శ్లేష్మం, రక్తంతో బాటుగా చతుష్కేంద్రక దశలో ఉండే ఎంటమీబా హిస్టోలైటికా కోశస్థ దశలను గమనించవచ్చును.

ప్రశ్న 15.
ఎంటమీబా హిస్టోలైటికాను ఉద్దేశించి ఎసింప్టమాటిక్ సిస్ట్ పాసర్స్ను నిర్వచించండి.
జవాబు:
కొందరి వ్యక్తులలో ఎంటమీబా హిస్టోలైటికా పరాన్నజీవి ఉన్నప్పటికి వీరిలో అమీబియాసిస్ లక్షణాలు కనపడవు. కాని వీరి మలాన్ని పరిశీలించినట్లయితే చతుష్కేంద్రక కోశాలుంటాయి. ఇటువంటి వారిని ‘ఎసింప్టమాటిక్ సిస్టాపాసర్స్’ అంటారు.

ప్రశ్న 16.
మానవునిలో హిపాటోసైట్స్ను సంక్రమించే ప్లాస్మోడియం వైవాక్స్ దశలను తెలపండి.
జవాబు:
ప్లాస్మోడియం యొక్క స్పోరోజాయిట్ దశలు మానవ కాలేయ కణాలను (హిపాటోసైట్స్) సంక్రమణ దశలు.

AP Inter 1st Year Zoology Study Material Chapter 6 మానవ సంక్షేమంలో జీవశాస్త్రం

ప్రశ్న 17.
ప్రీపేటెంట్ కాలంను నిర్వచించండి. ప్లాస్మోడియం వైవాక్స్ జీవితచక్రంలో దీనికి ఎంత కాలం ఉంటుంది?
జవాబు:
ప్లాస్మోడియం ప్రప్రథమంగా స్పోరోజాయిట్ రూపంలో మానవ రక్తంలోకి ప్రవేశించినప్పటి నుండి, రెండవసారి క్రిప్టోజాయిట్లు రక్తంలోకి విడుదలయ్యే వరకు పట్టే కాలాన్ని ప్రీపేటెంట్ కాలం అంటారు. దీనికి ఎనిమిది రోజుల కాలం పడుతుంది.

ప్రశ్న 18.
పొదిగే కాలంను నిర్వచించండి. ప్లాస్మోడియం వైవాక్స్ జీవితచక్రంలో ఇది ఎంతకాలం ఉంటుంది?
జవాబు:
ప్లాస్మోడియం స్పోరోజాయిట్ దశలో మొదట మానవ దేహంలో ప్రవేశించిన నాటినుండి, మొదటిసారి మలేరియా జ్వరం వచ్చే వరకు పట్టే కాలాన్ని పొదిగే కాలం అంటారు. ఇది 10 నుండి 14 రోజులు పడుతుంది.

ప్రశ్న 19.
షఫ్నర్ చుక్కలు అంటే ఏమిటి? వీటి ప్రాముఖ్యం తెలపండి.
జవాబు:
ప్లాస్మోడియం పరాన్నజీవి RBC లోని హిమోగ్లోబిన్లోని హిమ్ను జీర్ణం చేసుకొని, జీర్ణం కాని హిమోజాయిను కణికలుగా ఏర్పరుస్తుంది. ఈ దశలో చిన్న ఎర్రని మచ్చలు ఎర్ర రక్తకణాల జీవపదార్థంలో ఏర్పడతాయి. వీటినే షఫ్నర్ చుక్కలు అంటారు.

ప్రశ్న 20.
హీమోజాయిన్ రేణువులు అంటే ఏమిటి ? వీటి ప్రాముఖ్యం తెలపండి.
జవాబు:
ప్లాస్మోడియం RBC లోని హిమోగ్లోబిన్ లోని గ్లోబిన్ భాగాన్ని గ్రహించిన తరువాత మిగిలిన జీర్ణంకాని హిమటిన్ భాగం హిమోజాయిన్ కణికలుగా ఏర్పడుతుంది. ఇది మలేరియా జ్వరాన్ని కలుగజేసే విష పదార్థం. ఇది రక్తంలోని ప్లాస్మాతో కలిసినప్పుడు మలేరియా జ్వరం వస్తుంది.

ప్రశ్న 21.
కశాభ నిర్మోచనం అంటే ఏమిటి? దీనివల్ల ఏర్పడినవి ఏవి?
జవాబు:
ప్లాస్మోడియం దోమలలో జరుపుకునే లైంగిక ప్రత్యుత్పత్తిలో పురుష లేదా సూక్ష్మ సంయోగ బీజాలు కొరడా మాదిరి కదలికలను చూపుతూ జీవ పదార్థం నుండి విడుదలవుతాయి. ఈ విధంగా ఏర్పడిన పురుష సంయోగ బీజాలు విడుదల కావడాన్ని ‘కశాభ నిర్మోచనం’ అంటారు.

ప్రశ్న 22.
ప్లాస్మోడియంలో బీజకణాల కలయికను అసమసంయోగం అని ఎందుకంటారు?
జవాబు:
ప్లాస్మోడియంలో సంయోగ బీజాలు పరిమాణ రీత్యా అసమానంగా ఉంటాయి. కనుక వీటి మధ్య జరిగే సంయోగం లేదా కలయికను అసమసంయోగం అంటారు.

ప్రశ్న 23.
గమన సంయుక్తబీజం అంటే ఏమిటి ? క్రోమోసోముల స్థితిని (sets) అనుసరించి దీన్ని ఎలా వివరిస్తావు?
జవాబు:
ప్లాస్మోడియంలో లైంగిక ప్రత్యుత్పత్తిలో ఏర్పడే సంయుక్త బీజం సన్నగా, పొడవుగా, కదలిక చూపే క్రిమి రూపాన్ని పొందుతుంది. దీనిని గమన సంయుక్త బీజం అంటారు. దీని క్రోమోసోముల స్థితి ద్వయస్థితికం.

ప్రశ్న 24.
ఒక వ్యక్తి చలి, వణుకుడు, అధిక ఉష్ణోగ్రతతో బాధపడుతున్నాడు. విపరీతమైన చెమటలతో ఉష్ణోగ్రత సాధారణ స్థాయికి చేరింది. ఈ లక్షణాల ఆధారంగా వ్యాధిని, కారక జీవిని తెలపండి.
జవాబు:
రోగి చలి, వణుకుడు, అధిక ఉష్ణోగ్రతతో బాధపడుతూ, విపరీతమైన చెమటతో ఉష్ణోగ్రత సాధారణ స్థాయికి చేరే లక్షణం ఉన్నట్లయితే అతడు మలేరియా జ్వరంతో బాధపడుతున్నాడు. దీనికి ప్లాస్మోడియం వైవాక్స్ అనే పరాన్నజీవి కారణం.

AP Inter 1st Year Zoology Study Material Chapter 6 మానవ సంక్షేమంలో జీవశాస్త్రం

ప్రశ్న 25.
దోమలను అరికట్టడానికి జీవసంబంధమైన నియంత్రణ తెలపండి.
జవాబు:
దోమలను అరికట్టడానికి జీవసంబంధమైన నియంత్రణ : దోమ డింభకాలను తినే గంబూసియా చేపలను, కీటకాహార మొక్కలైన ముట్రిక్యులేరియాలను దోమలు వృద్ధిచెందే ప్రాంతాలలో పెంచాలి.

ప్రశ్న 26.
ఆస్కారిస్ గుడ్లను ‘మామ్మిల్లేటిడ్ గుడ్లు’ అని ఎందుకు అంటారు?
జవాబు:
ఆస్కారిస్ అండము ఉపరితలంలో బుడిపెలుగా ఏర్పడిన ప్రొటీన్ పొరచే కప్పబడి ఉంటుంది. అందువలన ఆస్కారిస్ గుడ్లను మామిల్లేటిడ్ గుడ్లు అంటారు.

ప్రశ్న 27.
మీరు చదివిన నిమటోడా పరాన్నజీవి జీవితచక్రంలో నిశా కాలగమనం అంటే ఏమిటి?
జవాబు:
నిమటోడా పరాన్నజీవి ఉకరేరియా యొక్క మైక్రోఫైలేరియా డింభకాలు వేరొక అతిథేయిని చేరడానికి అనువుగా రాత్రి సమయంలో 10 నుండి ఉదయం 4 వరకు రోగి పరిధీయ రక్త ప్రసరణలో ఉంటాయి. ఇటువంటి రాత్రి సమయంలో చూపే గమనాన్ని ‘నిశా కాల అంటారు.

ప్రశ్న 28.
లింఫాడినైటిస్ మరియు లింఫాంజైటిస్ మధ్య భేదాన్ని తెలపండి.
జవాబు:
లింఫాంజైటిస్ :
సాధారణంగా ఫైలేరియా సంక్రమణతో శోషరస నాళాలు, వాపు కనిపిస్తుంది. దీనిని లింఫాంజైటిస్ అంటారు.

లింఫాడినైటిస్ :
శోషరస గ్రంథులలో కలిగే వాపును లింఫాడినైటిస్ అంటారు.

ప్రశ్న 29.
ఫైలేరియాసిస్ వ్యాధి చివరి ఘట్టం బోదకాలు / ఎలిఫెంటియాసిస్ నిరూపించండి.
జవాబు:
ఫైలేరియాసిస్ వ్యాధి తీవ్రత వలన వాపు చెందిన భాగాలలో ఫైబ్రోబ్లాస్ట్లు అభివృద్ధి చెంది తంతుయుత కణజాలంగా మారతాయి. ప్రభావిత భాగాలలో స్వేదగ్రంథులు క్షీణించి, అక్కడి చర్మం పొడిగాను, గరుకుగాను అవుతుంది. ఈ చివరి స్థితిని బోదకాలు లేదా ఎలిఫెంటియాసిస్ వ్యాధి అంటారు.

ప్రశ్న 30.
పొగాకు ఏ విధంగా శ్వాసక్రియను ప్రభావితం చేస్తుంది? దీనిలో గల ఆల్కలాయిడ్ ఏది?
జవాబు:
పొగాకులో నికోటిన్ అనే ఆల్కలాయిడ్ ఉంటుంది. పొగాకు పీల్చడం వలన పొగలలో ఉండే కార్బన్ మోనాక్సైడ్ ఎర్ర రక్తకణాలలోని హిమోగ్లోబిన్ లో కలిసి, Hb యొక్క ఆక్సిజన్ రవాణా సామర్థ్యాన్ని తగ్గించడం ద్వారా శ్వాసక్రియపై దుష్ప్రభావాన్ని చూపిస్తుంది.

ప్రశ్న 31.
మందుల దుర్వినియోగాన్ని నిర్వచించండి.
జవాబు:
వ్యాధులను నివారించి తద్వారా శారీరక, మానసిక సుఖశాంతులు పొందడానికి మనం మందులు వాడుతున్నాం. వీటిని వైద్యపరంగా కాకుండా వేరే విధంగా వినియోగించడం వల్ల శారీరక లేదా మానసిక రుగ్మతలకు గురవుతున్నాం. దీనినే మందుల దుర్వినియోగం అంటారు. ఉదా : హోలీ రోజున వాడే బంగ్, డాక్టర్ సలహాపై మత్తుకు వాడే వివిధ మందులు – డాక్టరు ద్వారా కాకుండా విపరీతంగా తీసుకోవడం.

ప్రశ్న 32.
కోక్, స్మాక్ దేని నుంచి లభిస్తాయి?
జవాబు:
కోక్ :
దీనిని ఎరిత్రోజైలం కొకా అనే మొక్క ఆకుల నుండి తయారుచేస్తారు.

స్మాక్ :
హెరాయిన్ను స్మాక్ అంటారు. దీనిని ఓపియం పాపి, పపావర్ సోమ్నిఫెరం (నల్లమందు మొక్క) అనే మొక్కల నుండి తయారు చేస్తారు.

ప్రశ్న 33.
మొక్కలలో చాలా ద్వితీయ జీవాణువులకు ఔషధ ధర్మాలు ఉన్నాయి. వీటి దుర్వినియోగం వల్ల సమస్యలు ఏర్పడుతున్నాయా? సరైన ఉదాహరణలతో నిరూపించండి.
జవాబు:
చాలా మొక్కల ద్వితీయ జీవాణువులకు ఔషధ ధర్మాలున్నాయి. ఇవి ఓపియోడ్స్, కనభినాయిడ్స్, కొకా ఆల్కలాయిడ్స్. వీటిని మందు రూపంలో కాక అతిగా మాదక ద్రవ్యాలుగా వినియోగిస్తూ దుర్వినియోగం చేయడం వలన అనేక ఆరోగ్య, సామాజిక సమస్యలు ఏర్పడుతున్నాయి.

ప్రశ్న 34.
ఆటలు, క్రీడలలో నిషేధించిన కనబినాయిడ్స్, అనబాలిక్ స్టీరాయిడ్స్ ఏవి?
జవాబు:
కొందరు క్రీడాకారులు ఆటలలో అలసత్వం రాకుండా ఉత్తేజాన్నిచ్చే స్థాయిలో కనబినాయిడ్స్, అనబాలిక్ స్టిరాయిడ్ను ఉపయోగిస్తున్నారు. ఇలా స్టిరాయిడ్ను ఉపయోగించడం చట్టరీత్యా నేరం కనుక వీటిని నిషేధించారు.

AP Inter 1st Year Zoology Study Material Chapter 6 మానవ సంక్షేమంలో జీవశాస్త్రం

ప్రశ్న 35.
కుంగిపోవడం, నిద్రలేమి మొదలైన మానసిక జబ్బులకు వాడే తరచుగా దుర్వినియోగం అయ్యే నాలుగు మందులను తెలపండి.
జవాబు:
కుంగిపోవడం, నిద్రలేమి మొదలైన మానసిక జబ్బులకు వాడే మందులు తరచుగా దుర్వినియోగమయ్యేవి.

  1. బార్బిటురేట్ – నిద్రమాత్రలు
  2. ఆంఫిటమైన్స్ – నిద్రహరిణి మాత్రలు
  3. బెంజోడయాజిపైన్స్ – ప్రశాంతకాలు
  4. లైసర్జిక్ ఆమ్ల డైఈథైల్ అమైడ్స్ – ప్రశాంతకాలు

స్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
పరాన్నజీవులలో ప్రత్యేక అనుకూలనాల అభివృద్ధి అవసరమేమిటి? పరాన్నజీవులలో ఏర్పడిన కొన్ని ప్రత్యేక అనుకూలనాలను తెలపండి.
జవాబు:
అతిథేయిలో విజయవంతమైన జీవనం కొనసాగించడానికి అనువుగా పరాన్నజీవులు ప్రత్యేక అనుకూలనాలను ఏర్పర్చుకుంటాయి.

  1. ఆస్కారిస్ వంటి ఆంత్ర పరాన్నజీవులైన గుండ్రటి పురుగులు వాటి అతిథేయిలు స్రవించే జీర్ణక్రియా ఎంజైముల నుంచి రక్షించుకోవడానికి అవభాసినిని ఏర్పరుచుకుంటాయి.
  2. బద్దె పురుగువంటి జీవులు వాటి అతిథేయి పేగు గోడలకు అంటి పెట్టుకోవడానికి చూషకాలు, కొక్కేలు వంటి అంగాలను ఏర్పరచుకుంటాయి.
  3. ఎంటమీబా హిస్టోలైటికా వంటి పరాన్న జీవులు తమ జీవిత చరిత్రలో కోశస్థ దశను ఏర్పరచుకుంటాయి. ఈవిధంగా ఇవి కొత్త అతిథేయిలోకి ప్రవేశిస్తాయి.
  4. పరాన్న జీవుల్లో ప్రత్యుత్పత్తి వ్యవస్థ బాగా అభివృద్ధిచెంది ఉంటుంది. వీటి స్త్రీ జీవులు అధిక సంఖ్యలో అండాలను విడుదల చేస్తాయి.
  5. ద్వంద్వ అతిథేయి వంటి లివరూక్ పరాన్నజీవులలో బహుపిండత్వాన్ని వ్యక్తంచేస్తూ క్లిష్టమైన జీవిత చరిత్రను కలిగి ఉంటుంది.
  6. ప్లాస్మోడియంవంటి పరాన్న జీవులు అవి ఉత్పత్తిచేసే ప్రతిజనకాలను తరచుగా మారుస్తాయి.

ప్రశ్న 2.
హైపర్ ట్రోఫీ మరియు హైపర్ ప్లాసియాల మధ్య భేదాలను ఒక్కొక్క ఉదాహరణతో వివరించండి.
జవాబు:
హైపర్ ట్రోఫీ :
ప్లాస్మాడియం వైవాక్స్ మానవ ఎర్ర రక్తకణంలోకి ప్రవేశించి రక్తకణంలోని జీవ పదార్థాన్ని, వర్ణకాన్ని తిన్న తరువాత తన ఆకృతిని పెంచుకుంటుంది. దీని ప్రభావం వలన RBC పరిమాణం కూడా పెరుగుతుంది. ఇలా పరాన్నజీవి ప్రభావంవలన అతిథేయి కణాకృతి పెరగడాన్ని హైపర్ ట్రోఫీ అంటారు.

హైపర్ ప్లాసియా :
ప్లాటి హెల్మింథస్ వర్గానికి చెందిన ఫాసియోలా హెపాటికా పరాన్నజీవి గొర్రెలలో పరాన్నజీవనం సాగిస్తుంది. దీని ప్రభావం వలన ఈ పరాన్నజీవి ఉండే గొర్రెలలో పైత్యరసనాళాలలో కణాలసంఖ్య పెరిగి పైత్యరస నాళాలు మందంగా మారతాయి. ఇలా పరాన్నజీవి ప్రభావం వలన అతిథేయి దేహంలో కణాల సంఖ్య పెరగడాన్ని హైపర్ ప్లాసియా అంటారు.

ప్రశ్న 3.
ఎంటమీబా హిస్టోలైటికా పోషకజీవి నిర్మాణాన్ని వివరించండి.
జవాబు:
AP Inter 1st Year Zoology Study Material Chapter 6 మానవ సంక్షేమంలో జీవశాస్త్రం 1
ఎంటమీబా హిస్టోలైటికా మానవుడి పెద్దపేగు, అంధనాళాలలో ఉండే ఆంత్ర పరాన్నజీవి. ఇది 20 నుంచి 30 మైక్రానుల లోతైన కణజాలాల్లో ఉంటుంది. పోషకజీవిని ఆవరించి ఉన్న పొరను ప్లాస్మాలెమ్మా అంటారు. జీవ పదార్థం వెలుపలి కణికారహితమైన బాహ్యజీవద్రవ్యంగాను, లోపలి కణికాయుతమైన అంతర్జీవ ద్రవ్యంగాను విభజించబడి ఉంటుంది. పోషక జీవి కదిలే వైపు పొట్టిగా, మొండిగా ఉండే మిథ్యాపాదం ఉంటుంది. ఎంటమీబా హిస్టోలైటికా అంతర్జీవ ద్రవ్యం మధ్యలో తిత్తి వంటి కేంద్రకం ఉంటుంది. కేంద్రక త్వచం లోపలి తలాన్ని అంటిపెట్టుకొని పూసలలాగా ‘క్రొమోటిన్ పదార్థముంటుంది. కేంద్రకం మధ్యలో ఎండోసోమ్ ఉంటుంది. సన్నని క్రొమాటిన్ తంతువులు, పూసల వంటి నిర్మాణాల నుంచి ఎండోసోమ్ వైపుకు చక్రంలోని చువ్వల మాదిరిగా ప్రసరించి ఉంటాయి. ఈ స్థితి కేంద్రకానికి బండి చక్రం రూపాన్నిస్తుంది. దీని ఆహారరిక్తికలలో ఎర్రరక్త కణాలుంటాయి.

AP Inter 1st Year Zoology Study Material Chapter 6 మానవ సంక్షేమంలో జీవశాస్త్రం

ప్రశ్న 4.
ఎంటమీబా హిస్టోలైటికా జీవిత చక్రంను తెలపండి.
జవాబు:
ఎంటమీబా హిస్టోలైటికా మానవ పెద్దపేగులో నివసించే పరాన్నజీవి. దీనివలన మానవులలో అమీబియాసిస్ లేదా అమీబిక్ డిసెంట్రీ (బంక విరేచనాలు) అనే వ్యాధి వస్తుంది. ఇది కలుషిత ఆహారం, నీరు వలన మానవ జీర్ణ వ్యవస్థలో ప్రవేశిస్తుంది.

జీవిత చక్రం :
పెద్దపేగు కుడ్యంలో ఎంటమీబా పోషక జీవులు ద్విధా విచ్ఛిత్తి జరిపి అనేక ఎంటమీబాలను ఏర్పరుస్తాయి. ఇవి బాక్టీరియా, అతిథేయి కణజాల భాగాలను పెరిగి మళ్ళీ విభజనచెంది, అనేకసార్లు జరిగిన ద్విధావిచ్ఛిత్తి వలన అనేక పోషకజీవులు ఏర్పడతాయి. వీటిలో కొన్ని పెద్ద పేగును చేరి పూర్వ కోశస్థ దశలుగా మారతాయి. తిరిగి ఈ దశలు కోశస్థ దశలుగా మారి చివరికి చతుష్కేంద్రక కోశాలుగా ఏర్పడతాయి. ఈ ప్రక్రియ మొత్తం కొన్ని గంటలలో జరుగుతుంది. చతుష్కేంద్రక దశలు మలంతోబాటు బయటకు విడుదలై సుమారు 10 రోజులు జీవంతో ఉంటాయి. ఈ కోశాలు కలుషితమైన నీరు, ఆహారంతోబాటు కొత్త అతిథేయిని చేరతాయి. ఇవి మానవ చిన్నపేగును చేరిన తరవాత ట్రిప్సిన్ ఎంజైమ్ చర్యవలన కోశం జీర్ణమై చతుష్కేంద్రక అమీబాలు విడుదలవుతాయి. వికోశీకరణం చెందిన చతుష్కేంద్రక అమీబాలను మెటాసిస్ట్ అంటారు.

మెటాసిస్ట్లోని నాలుగు కేంద్రకాలు సమవిభజనలో ఎనిమిది కేంద్రకాలుగా విభజన చెందుతాయి. ప్రతి కేంద్రకం కొంత జీవ పదార్థంతో ఎనిమిది పిల్ల ఎంటమీబాలు లేదా మెటాసిస్టిక్ పోషక జీవులు ఏర్పడతాయి. ఇవి పెద్దపేగు శ్లేష్మపొరలోకి ప్రవేశించి పరిపక్వ పోషక జీవులుగా పెరుగుతాయి.
AP Inter 1st Year Zoology Study Material Chapter 6 మానవ సంక్షేమంలో జీవశాస్త్రం 2

ప్రశ్న 5.
ఎంటమీబా హిస్టోలైటికా వ్యాధికారకతపై లఘుటీక రాయండి.
జవాబు:
ఎంటమీబా హిస్టోలైటికా పరాన్నజీవి మానవ పెద్దపేగులో ఉండే పరాన్నజీవి. ఇది కలుషిత ఆహారం, నీరు నుండి మరొకరికి వ్యాప్తి చెందుతుంది.

ఎంటమీబా పోషకజీవులు హిస్టోలైసిన్ అనే ఎంజైము స్రవించి అతిథేయి శ్లేష్మ స్థరాన్ని కరిగించిలోనికి ప్రవేశించి పెద్దపేగు కుడ్యంలో పుండ్లను ఏర్పరుస్తాయి. పుండ్లలో కణశిథిలాలు, లింఫోసైట్, ఎర్రరక్తకణాలు, బాక్టీరియాలు ఉంటాయి. పెద్దపేగు కుడ్యంలో చీముగడ్డలు ఏర్పడటానికి దారితీస్తాయి. చివరగా మలంలో రక్తం, శ్లేష్మం కనిపిస్తాయి. ఈ స్థితిని అమీబిక్ విరేచనాలు లేదా ఆంత్ర అమీబియాసిస్ లేదా ఉష్ణ అమీబియాసిస్ అంటారు. కొందరిలో ఎటువంటి వ్యాధి లక్షణాలు కనిపించవు. వీరిని వాహకులు లేదా ఎసింప్టోమాటిక్ సిస్ట్ పాసర్స్ అంటారు. వీరి మలంలో చతుష్కేంద్రక కోశాలు ఉంటాయి. ఇవి పరాన్నజీవి వ్యాప్తికి తోడ్పడతాయి.

ప్రశ్న 6.
ప్లాస్మోడియమ్ వైవాక్స్ స్పోరోజాయిట్ నిర్మాణాన్ని వివరించండి.
జవాబు:
ప్లాస్మోడియమ్ వైవాక్స్ స్పోరోజాయిట్ నిర్మాణం :
AP Inter 1st Year Zoology Study Material Chapter 6 మానవ సంక్షేమంలో జీవశాస్త్రం 3

  1. ప్లాస్మోడియమ్ వైవాక్స్ స్పోరోజాయిట్ యొక్క సూక్ష్మ నిర్మాణాన్ని గారోమ్ అధ్యయనం చేశాడు.
  2. ఇది కొడవలి ఆకారంలో ఒకవైపు వంగి ఉంటుంది. కణ దేహం కండె ఆకారంలో ఉంటుంది. మధ్యలో బొద్దుగా, కొన భాగాలు మొనదేలి ఉంటాయి. ఇది 15 మైక్రానుల పొడవు, 1 మైక్రాను వెడల్పు ఉంటుంది.
  3. స్పోరోజాయిట్ దేహాన్ని ఆవరించి సాగే గుణం కలిగిన పెలికల్ ఉంటుంది.
  4. పెలికిల్ మూడు పొరలలో ఏర్పడి ఉంటుంది. దీనిలో సూక్ష్మ నాళికలు లేదా పరిధీయ తంతువులు నిలువుగా అమరి ఉంటాయి. వీటి సంకోచాలు పరాన్నజీవి దేహంలో జరిగే క్రిమి చలనానికి తోడ్పడతాయి.
  5. కణ పూర్వభాగంలో ఒక “అగ్రచూషకం” లేదా “ఎపికల్ కప్” ఉంటుంది. ఒక జత పొడవైన స్రావక సూక్ష్మాంగాలు దీనిలోకి తెరుచుకుంటాయి. ఇవి కణవిచ్ఛిన్న ఎంజైములను స్రవిస్తూ, స్పోరోజాయిట్ కాలేయ కణాల్లోకి ప్రవేశించడానికి సహాయపడతాయి.
  6. కణదేహంలో అనేక సంవళిత నాళికలుంటాయి. వాటి నిర్దిష్టమైన విధి ఏమిటో తెలియదు.

AP Inter 1st Year Zoology Study Material Chapter 6 మానవ సంక్షేమంలో జీవశాస్త్రం

ప్రశ్న 7.
ప్లాస్మాడియం వైవాక్స్ జీవితచక్రంలో గాల్జి చక్రాన్ని వివరించండి.
జవాబు:
కాలేయ కణాలలో రక్తకణ పూర్వ, రక్తకణ బాహ్య జీవిత చక్రాలను పూర్తి చేసుకున్న పిదప ప్లాస్మోడియం పూర్వ తరంలోని క్రిప్టోజాయిట్స్ రూపంలోగాని, రక్తకణ బాహ్య చక్రంలోని సూక్ష్మ మెటాక్రిప్టోజాయిట్ల రూపంలోగాని రక్తంలోని RBC ని చేరి రక్తకణ జీవిత చక్రాన్ని ప్రారంభిస్తాయి. ఈ రక్తకణ జీవిత చక్రాన్ని మొదటగా కామిల్లోగాల్జి అనే శాస్త్రవేత్త వివరించాడు. కనుక ఈ చక్రాన్ని గాల్జిచక్రం అంటారు..

గాల్జి చక్రం :
ఇది పూర్వ తరంలోని క్రిప్టోజాయిట్లతో గాని లేదా రక్తకణబాహ్య జీవితచక్రంలోని సూక్ష్మ మెటాక్రిప్టోజాయిట్లతో గాని ప్రారంభమవుతుంది. ఎర్రరక్తకణాల్లోకి ప్రవేశించగానే మీరోజాయిట్లు గోళాకార ట్రోఫోజాయిట్లుగా మారతాయి. వీటిలో ఒక చిన్న రిక్తిక ఏర్పడి పరిమాణంలో పెరుగుతూ పోషకజీవిలోని జీవపదార్థాన్ని, కేంద్రకాన్ని అంచువైపుకు నెట్టడం వల్ల ఉంగరం మాదిరిగా కనిపిస్తుంది. ఈ దశను అంగుళీక దశ అంటారు. తరవాత రిక్తిక అదృశ్యమవుతుంది. పరాన్నజీవి మిథ్యాపాదాలను అభివృద్ధి చేసుకొని అమీబాయిడ్ దశగా మారుతుంది. ఇది RBC లోని పదార్థాలను మిథ్యాపాదాలతో గ్రహించి పోషణతో పరిమాణాన్ని పెంచుకొంటుంది. దీనివల్ల ఎర్రరక్తకణాల పరిమాణం రెండింతలు పెరుగుతుంది. ఈ స్థితిని అతివృద్ధి అంటారు. ఈ చక్రంలో ఎర్ర రక్తకణాల్లోని హీమోగ్లోబిన్ను పరాన్నజీవి ఆహారంగా తీసుకుంటుంది.

పరాన్నజీవి హీమోగ్లోబిన్లోని హీమ్ను జీర్ణం చేసుకొని మరియు కరిగే హీము కరగని హీమోజాయిన్ కణికలుగా ఏర్పరుస్తుంది. దీన్నే మలేరియా వర్ణకం అంటారు. ఈ దశలో చిన్న ఎర్రని మచ్చలు షఫ్నర్ చుక్కలు ఎర్రరక్తకణాల జీవపదార్థంలో ఏర్పడతాయి. ఇవి పరాన్నజీవి విడుదల చేసే ప్రతిజనకాలు. ప్లాస్మోడియం,మిథ్యాపాదాలను కోల్పోయి బాగా పెరిగి RBC ని మొత్తంగా ఆక్రమించి విఖండంగా మారుతుంది. ఇది రక్తకణపూర్వ చక్రంలో మాదిరిగా విఖండ జననం చెంది 12-24 ఎర్రరక్తకణ మీరోజాయిట్లను ఏర్పరుస్తుంది. ఇవన్నీ RBC లో గులాబీ రేకులా అమరి రోజెట్టిశగా మారుతుంది. చివరిగా ఎర్రరక్తకణం పగిలి హీమోజాయినను, మీరోజాయిట్లను రక్తంలో విడుదల చేస్తుంది. ఈ చక్రం దాదాపు 48 గంటలలో పూర్తవుతుంది.

స్పోరోజాయిట్లు దేహంలో ప్రవేశించిన నాటి నుంచి మొట్టమొదటిగా, మలేరియా లక్షణాలు జ్వరం వచ్చేవరకు పట్టే కాలాన్ని పొదిగే కాలం అంటారు. ఇది దాదాపు 10-14 రోజులలో పూర్తవుతుంది.

ప్రశ్న 8.
ఉకరేరియా బాంక్రాఫ్టి వల్ల మానవునిలో కలిగే వ్యాధి కారకతను తెలపండి.
జవాబు:
ఉకరేరియా బాంక్రాఫ్టి అనే నిమటొడా పరాన్నజీవి కారణంగా మానవులలో బోదకాలు వ్యాధి సంక్రమిస్తుంది. ఇది ఫైలేరిఫాం డింభక దశలో దోమకాటు ద్వారా మానవులకు సంక్రమిస్తుంది.

వ్యాధి కారకత :
సంక్రమణ స్వల్పంగా ఉంటే ఫైలేరియా జ్వరం, తలనొప్పి, మానసిక ఆందోళన, శరీర ఉష్ణోగ్రత పెరగడం లాంటి లక్షణాలు కనిపిస్తాయి. సాధారణంగా ఫైలేరియా సంక్రమణతో శోషరస నాళాలు, శోషగ్రంథులలో వాపు (infalmation) కలుగుతుంది. శోషనాళాలలో కలిగే వాపును లింఫాంజైటిస్ (Lymphangitis) ( Gr. angeos – నాళాలు, itis – మంట) అనీ, శోషరస గ్రంథులలో కలిగే వాపును లింఫాడెంటిస్ (Lymphadenitis) (Gr. adenos – గ్రంథి, itis – మంట) అని అంటారు. పరాన్న జీవుల సంక్రమణ అధికంగా ఉంటే, చనిపోయి పేరుకుపోయిన పురుగులు శోషరస నాళాలలోనూ, శోషరస గ్రంథులలోనూ శోషరస ప్రవాహాన్ని ఆటంకపరుస్తాయి.

ఫలితంగా అధిక వాపు ఏర్పడుతుంది. దీన్ని లింఫోఎడిమా (Lymphoedema)(Gr. oiedema – వాపు) అంటారు. ఈ వాపు గమనాంగాల చివరి భాగాలు, పురుషుల్లో ముష్కగోణులు, స్త్రీల స్తనాలలో అనూహ్యంగా కనిపిస్తుంది. ఈ వాపు చెందిన భాగాలలో ఫైబ్రోబ్లాస్ట్లు అభివృద్ధి చెంది తంతుయుత కణజాలంగా మారతాయి. వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు ప్రభావిత భాగాలలో స్వేదగ్రంథులు క్షీణించి, అక్కడ చర్మం పొడిగాను, గరుకుగాను అవుతుంది. ఈ చివరి స్థితిని ఎలిఫెంటియాసిస్ (Elephantiasis) లేదా బోదకాలు అంటారు.

ప్రశ్న 9.
టైఫాయిడ్ జ్వరం మరియు రోగనిరోధకతపై లఘుటీక రాయండి.
జవాబు:
టైఫాయిడ్ జ్వరం :
ఈ వ్యాధి సాల్మొనెల్ల టైఫీ అనే గ్రామ్ నెగిటివ్ బాక్టీరియా వల్ల వస్తుంది. ఇది ముఖ్యంగా మానవుడి చిన్నపేగులో నివసిస్తూ రక్తం ద్వారా ఇతర అవయవాలలోకి ప్రవేశిస్తుంది. ఈ వ్యాధిని వైడాల్ పరీక్ష చేసి నిర్ధారిస్తారు. సంక్రమణ విధానం : ఈ వ్యాధి కలుషితమైన ఆహారం, నీరు ద్వారా వ్యాప్తి చెందుతుంది.

వ్యాధి లక్షణాలు :
ఈ వ్యాధి సోకిన రోగికి 104°F వరకు పెరిగే ఉష్ణోగ్రతతో స్థిరంగా ఉండే జ్వరం, నీరసం, కడుపునొప్పి, మలబద్దకం, తలనొప్పి, ఆకలి మందగించడం మొదలైన లక్షణాలు కనిపిస్తాయి. వ్యాధి తీవ్రతలో పేగుకు రంధ్రాలు ఏర్పడటం, తీవ్రమైన స్థాయిలో మరణం సంభవించడం జరుగుతుంది.

ప్రశ్న 10.
న్యుమోనియా మరియు రోగనిరోధకతపై లఘుటీక రాయండి.
జవాబు:
న్యుమోనియా వ్యాధి శ్వాస వ్యవస్థలో బాధలు గురిచేసే వ్యాధి. ఇది స్ట్రెప్టోకోకస్ న్యుమోనియే, హీమోఫిలస్ ఇన్ఫ్లుయోంజాల వంటి గ్రామ్ పాజిటివ్ బాక్టీరియాల వల్ల వస్తుంది. ఈ బాక్టీరియా మానవ వాయుకోశాలపై దాడి చేస్తాయి.

సంక్రమణ :
వ్యాధి సోకిన వ్యక్తి నోటి తుంపర్లు (గాలిద్వారా వ్యాప్తి) పీల్చడం వలన లేదా వ్యాధిగ్రస్తుని యొక్క వంట పాత్రలు, వారు వాడిన తువాలు (టవల్స్) వాడటం వలన ఇతరులు ఈ వ్యాధి బారిన పడతారు.

వ్యాధి లక్షణాలు :
ఈ వ్యాధిగ్రస్తుల వాయుకోశాలు ద్రవంతో పూర్తిగా నిండి శ్వాసక్రియలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారు. వాయుకోశాల శ్వాస వాయువుల మార్పిడి ఆటంకం ఏర్పడుతుంది. వ్యాధి తీవ్రతలో దేహంలో ఆక్సిజన్ శాతం తగ్గి, కార్బన్ డైఆక్సైడ్ శాతం పెరగడం వలన పెదవులు, వేలిగోర్లు బూడిద లేదా నీలిరంగుకు మారతాయి.

AP Inter 1st Year Zoology Study Material Chapter 6 మానవ సంక్షేమంలో జీవశాస్త్రం

ప్రశ్న 11.
సాధారణ జలుబు మరియు రోగనిరోధకతపై లఘుటీక రాయండి.
జవాబు:
సాధారణ జలుబు :
ఈ వ్యాధి రైనోవైరస్ సమూహానికి చెందిన వైరస్ల వలన వస్తుంది. ఇది ముక్కు, వాయు మార్గానికి మాత్రమే సంక్రమిస్తుంది. ఊపిరితిత్తులపై ప్రభావం చూపదు. దీనికారణంగా ముక్కులో, వాయునాళంలో శ్లేష్మం స్రవించి శ్వాసలో ఇబ్బందులు (ముక్కు దిబ్బడ) ఎదురవుతాయి.

సంక్రమణ :
వ్యాధి సోకిన వ్యక్తి తుమ్ములు, దగ్గు వలన వెలువడిన నీటి తుంపరలను పీల్చడం ద్వారా (గాలి ద్వారా వ్యాప్తి) నేరుగాను, కలుషితమైన వస్తువులు అనగా రోగి వినియోగించే వస్తువు ద్వారా కర్చీఫ్, పెన్నులు, పుస్తకాలు, కప్పులు, డోర్ హాండిల్స్, కంప్యూటర్ కీబోర్డు, మౌస్ మొదలైన వాటిని శుభ్రపరచకుండా ఇతరులు వినియోగించడం వలన ఇతరులకు వ్యాప్తి చెందుతుంది.

వ్యాధి లక్షణాలు :
ముక్కు మూసుకుపోవడం (ముక్కు దిబ్బడ, ముక్కు కారడం, తుమ్ములు, దగ్గడం, గొంతునొప్పి, బొంగురు గొంతు, తలనొప్పి, అలసట మొదలైన లక్షణాలు కనిపిస్తాయి. సాధారణంగా 3 నుంచి 7 రోజులు ఉంటాయి.

ఈ వ్యాధి సోకినవారు ముఖ్యంగా విశ్రాంతి తీసుకొనవలెను. దుమ్ము, పొగ పీల్చకూడదు. గాటైన వాసనలు పీల్చరాదు. వేడి నీటి ఆవిరి పట్టినట్లయితే త్వరగా ఉపశమనం లభిస్తుంది.

ప్రశ్న 12.
తామర మరియు రోగనిరోధకతపై లఘుటీక రాయండి.
జవాబు:
తామర మానవులలో కలిగే సాధారణమైన, శిలీంధ్రాలవల్ల సంక్రమించే సంక్రమణ వ్యాధి. ఇది మైక్రోస్పోరం, ట్రైకోఫైటాన్, ఎఫిడెర్మోఫైటాన్ అనే ప్రజాతుల శిలీంధ్రాల వలన సంక్రమిస్తుంది. వేడిమి, తేమ ఈ శిలీంధ్రాల పెరుగుదలను ప్రోత్సహిస్తాయి. ఇది సాధారణంగా చర్మపు ముడుతలలో అంటే గజ్జలు, కాలివేళ్ళు, చంకలు మొదలైన భాగాలలో పెరుగుతాయి.

సంక్రమణ :
వ్యాధి సోకిన వ్యక్తి వాడిన వస్తువులు అనగా తువ్వాలు, దుస్తులు, దువ్వెన మొదలైన వస్తువుల వలన మరియు మట్టి ద్వారా ఈ వ్యాధి వ్యాప్తి చెందుతుంది.

వ్యాధి లక్షణాలు :
పొడిగా, పొలుసులు గల గుండ్రటి పుండ్లు లేదా దద్దురులు ఏర్పడతాయి. దీని వలన తీవ్రమైన దురద ఉంటుంది. ఇవి చర్మం, గోరు, తలపై కూడా ఏర్పడతాయి.

ఈ వ్యాధి నివారణకు పరిశుభ్రత ప్రధానమైన మార్గం.

ప్రశ్న 13.
పొగాకు వల్ల జరిగే దుష్పరిణామాలను తెలపండి. [Mar. ’14]
జవాబు:
పొగాకును మానవుడు వివిధ రూపాలలో 400 సం॥రాలుగా వినియోగిస్తున్నాడు. దీనిలో వివిధ రసాయన పదార్థాలతోబాటుగా నికోటిన్ అనే ఆల్కలాయిడ్ ఉంటుంది. పొగాకును గుట్కా రూపంలో, పొగత్రాగడం (చుట్ట, బీడి, సిగరెట్), నమలడం లేదా నశ్యం రూపంలో పీల్చడం మొదలైన రూపాలలో వినియోగిస్తారు.

పొగాకును పొగరూపంలో (చుట్ట, బీడి, సిగరెట్) వినియోగించడం వలన పొగలో ఉండే కార్బన్మౌనాక్సైడ్ ఎర్రరక్త కణాలలోని హిమోగ్లోబిన్తో కలిసి, Hb యొక్క ఆక్సిజన్ రవాణా సామర్థ్యాన్ని తగ్గిస్తుంది. దీనిలోని నికోటిన్ ఎడ్రినల్ గ్రంథిని ప్రేరేపించి ఎడ్రినాలిన్, నార్ – ఎడ్రినాలిన్ను రక్తంలోకి విడుదల చేస్తుంది. ఈ హార్మోన్లు రక్త పీడనాన్ని, గుండె కొట్టుకునే వేగాన్ని పెంచుతాయి. పొగతాగడం వల్ల బ్రాంకైటిస్, ఎంఫిసిమా, కరోనరీ గుండె వ్యాధి, జఠరంలో పుండ్లు, గొంతు, ఊపిరితిత్తులు, మూత్రాశయం మొదలైన వాటిలో కాన్సర్ వచ్చే అవకాశాలున్నాయి.

పొగతాగే అలవాటు తీవ్రమైన మత్తుమందులు – మార్ఫిన్, హెరాయిన్, కొకైన్ను కూడా తీసుకునే అలవాటుకు దారితీస్తుంది. పొగాకును నమలడం వలన, గుట్కా రూపంలో నమలడం వలన నోటి కాన్సర్కు అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఇటువంటి పరిణామాలు చూస్తున్నా ఇంకా యువతలో, ముసలివారిలో పొగత్రాగడం, పొగాకు ఉత్పత్తుల వినియోగం ఇంకా మాన్పించలేకపోతున్నాము.

ప్రశ్న 14.
ఓపియోడ్స్పై లఘుటీక రాయండి.
జవాబు:
ఓపియోడ్స్ :
ఓపియోడ్స్ అనునవి మాదకద్రవ్యాలు. మందులను ఓపియం పాపి, పపావర్ సోమ్నిఫెరం (దీన్ని వాడుకలో నల్లమందు మొక్క అంటారు) నుంచి సేకరిస్తారు. ఈ మందులు మన కేంద్రనాడీ వ్యవస్థ, జీర్ణనాళంలోని ప్రత్యేక ఓపియోడ్ గ్రాహకాలతో బంధనం (bind) చెంది తమ ప్రభావాన్ని ప్రదర్శిస్తాయి. వీటిలో మార్ఫిన్, హెరాయిన్ మొదలైనవి ఉన్నాయి.

i) మార్ఫిన్ :
దీన్ని పాపి మొక్క అపరిపక్వ విత్తన గుళిక (capsule pad) యొక్క ఎండిన లేటెక్స్ (latex) నుంచి సేకరిస్తారు. ఇది రంగులేని స్ఫటికం (crystal) లేదా తెలుపు పటికపొడి రూపంలో లభిస్తుంది.

దుర్వినియోగ విధానం :
సాధారణంగా నీరు లేదా సూది (injection) ద్వారా తీసుకొంటారు.

ప్రభావం :
ఇది చాలా సమర్థమైన మత్తుమందు నొప్పి/బాధ నుంచి (pain killer) ఉపశమనం కలిగిస్తుంది. శస్త్ర చికిత్స చేసుకున్న రోగులకు ఈ మందు చాలా ఉపయోగపడుతుంది.

ii) హెరాయిన్ :
ఇది తెల్లని, వాసన రహిత, ఘాటుగా ఉండే స్ఫటిక సంయోగ పదార్థం. మార్ఫిన్ ను ఎసిటైలేషన్ చేయడం వల్ల ఇది ఏర్పడుతుంది. రసాయనికంగా దీన్ని డైఎసిటైల్ మార్ఫిన్ (diacetyl morphine) అంటారు. దీన్ని స్మాక్ (smack) అని కూడా అంటారు.

దుర్వినియోగ విధానం :
బలవంతంగా పీల్చుకోవడం (స్నార్టింగ్ – snorting) లేదా సూది ద్వారా తీసుకోవడం.

ప్రభావం :
ఇది ఉపశమనం కలిగించే మందు (anti depressant). ఇది శరీర చర్యలను నెమ్మదిస్తుంది.

AP Inter 1st Year Zoology Study Material Chapter 6 మానవ సంక్షేమంలో జీవశాస్త్రం

ప్రశ్న 15.
కనబినాయిడ్స్పై లఘుటీక రాయండి.
జవాబు:
కనాబినాయిడ్స్ :
కనాబినాయిడ్స్ అనునవి మాదకద్రవ్యాలు. ఇవి సమూహ రసాయనాలు. వీటిని భారత హెంప్ మొక్క కనాబిస్ సటైవా (Indian hemp plant – Cannabis sativa) (దీన్ని వాడుకలో గంజాయి మొక్క అంటారు) నుంచి సంగ్రహిస్తారు. ఇవి మెదడులోని కనబినాయిడ్ గ్రాహకాలకు బంధించబడతాయి. మొక్క పుష్పాల చివరలు, పత్రాలు, రెసిన్ ను వివిధ పాళ్లలో వినియోగించి మరిజువాన, హాషిష్, చరస్, గంజా (marijuana, hashish, charas, ganja) ను ఉత్పత్తి చేస్తారు. ఈ మధ్యకాలంలో కనబినాయిడ్స్ను క్రీడాకారులు (డోపింగ్ -doping ) కూడా దుర్వినియోగం చేస్తున్నారు.

దుర్వినియోగ విధానం :
ముక్కుతో పీల్చడం లేదా నోటితో మింగడం.

ప్రభావం :
ఇది హృదయ ప్రసరణవ్యవస్థపై ప్రభావాన్ని చూపిస్తుంది.

ప్రశ్న 16.
కొకైన్పై లఘుటీక రాయండి.
జవాబు:
కోకా ఆల్కలాయిడ్ లేదా కొకైన్ :
దక్షిణ అమెరికాలో పెరిగే కోకా యొక్క ఎరిత్రోజైలం కోకా (Erythroxylum coca) ఆకుల నుంచి తెల్లటి ఆల్కలాయిడ్ పటికను తీస్తారు. దీన్ని సాధారణంగా కోక్ లేదా క్రాక్ (crack) అంటారు.

దుర్వినియోగ విధానం :
బలవంతంగా పీల్చడం (snorting).

ప్రభావం :
ఇది కేంద్ర నాడీవ్యవస్థను శక్తివంతంగా ప్రేరేపిస్తుంది. డోపమైన్ అనే నాడీ అభివాహకం (neurotransmitter) రవాణాలో జోక్యం చేసుకొంటుంది. దీనివల్ల ఉల్లాసస్థితి (euphoria), శక్తి పెరుగుదల కలుగుతుంది. అధిక మోతాదులు భ్రాంతికి (hallucinations) కారణమవుతాయి.

బాగా ప్రాచుర్యం గల హాల్లుసినోజెనిక్ ధర్మాలు గల మొక్కలలో అట్రోపా బెల్లడొనా, దతూరా ఉన్నాయి. బార్బిటురేట్ (barbiturates – నిద్రమాత్రలు), ఆంఫీటమైన్స్ (నిద్రహారిణి మాత్రలు),

బెంజోడయాజిపైన్స్ (Benzodiazepines : ప్రశాంతకాలు – tranquilizers), లైసర్జిక్ ఆమ్ల డైఈథైల్ అమైడ్స్ (LSD), ఇతర మందులను సాధారణంగా మానసిక వ్యాధిగ్రస్తులకు అంటే వ్యాకులత/కుంగిపోవడం(depression), నిద్రలేమి (insomnia) మొదలైన వాటిలో బాధపడే రోగుల చికిత్సలో వినియోగించే మందులను దుర్వినియోగం చేస్తున్నారు.

ప్రశ్న 17.
కౌమారదశను భేద్యమైన దశగా ఎందుకంటారు?
జవాబు:
కౌమార దశ :
దీన్ని యవ్వనారంభ దశ (Puberty) కు ప్రౌఢ దశకు మధ్యకాలం అంటారు. ఈ దశ చిన్నతనానికి (childhood), ప్రౌఢ దశకు వారధి. 12-18 సం|| వయస్సు మధ్యకాలాన్ని కౌమారదశ అంటారు. ఈ కాలంలో పిల్లలు పరిపక్వత చెందుతారు. దీనితో అనేక జీవసంబంధ, ప్రవర్తనా మార్పులు ముడిపడి ఉంటాయి. ఒక వ్యక్తి మానసిక, మనోవిజ్ఞాన అభివృద్ధిలో కౌమారదశను హానిపొందే (vulnerable) దశగా పరిగణిస్తారు. కనుక ఈ దశను భేద్యమైన దశగా వర్ణిస్తారు. ఈ వయస్సులో యువత జిజ్ఞాస (curiosity), కోరిక (desire)తో సాహసం (adventure) మరియు ప్రకోపం/రెచ్చగొట్టుట (excitement) వల్ల చేసే ప్రయోగాలు (experiments) యువతను పొగాకు, మందులు, ఆల్కహాలు వినియోగానికి ప్రేరేపించే (motivate) కారణాలు. కానీ మొట్టమొదటసారిగా మందులు లేదా ఆల్కహాల్ వినియోగం కేవలం జిజ్ఞాస, ప్రయోగాలతోనే ప్రారంభమవుతుంది.

ఆ తరవాత ఇబ్బందులనుంచి తప్పించుకోవడానికి వీటిని వినియోగిస్తారు. ఈ మధ్యకాలంలో యువత పరీక్షలు లేదా విద్యా విషయాలలో(academics) ప్రగతి సాధించే క్రమంలో ఒత్తిడి (stress) వల్ల మత్తుమందుల వైపు మొగ్గుతున్నారు. దీనికి తోడుగా టెలివిజన్, సినిమాలు, వార్తాపత్రికలు, ఇంటర్నెట్లు దోహదపడుతున్నాయి. వీటితో పాటు ఆసరా ఇవ్వని లేదా చపలచిత్త (unstable) కుటుంబం, తోటివారి వల్ల ఒత్తిడి (peer pressure) అనే అంశాలు కూడా యువతలో పొగాకు, మందులు, ఆల్కహాల్ దుర్వినియోగానికి ప్రేరేపిస్తాయి.

ప్రశ్న 18.
వ్యసనం, ఆధారం మధ్య భేదాలను తెలపండి.
జవాబు:
వ్యసనం (addiction) మరియు ఆధారపడటం (dependence) :
పొగాకు, మందులు, ఆల్కహాలు దుర్వినియోగం వ్యసనానికి, ఇతరులపై ఆధారపడటానికి దారితీస్తుంది.

వ్యసనం :
ఇది మానసిక ఉల్లాసస్థితితో కూడిన బంధం. ఇది పొగాకు, మందులు, ఆల్కహాలు వినియోగానికి తనలో గల వ్యసన ప్రవృత్తే (addictive nature) ముఖ్యమైందని ఎవ్వరూ గుర్తించరు. TDA లను తరచుగా వినియోగించడం వల్ల శరీరంలో గ్రాహకాల సహనస్థాయి (tolerance level) పెరుగుతుంది. దీనివల్ల గ్రాహకాలు ఎక్కువ మోతాదు (dose) కు స్పందిస్తాయి. దీనితో TDAలను ఎక్కువ తీసుకోవడం వల్ల వ్యసనపరులవుతారు. TDAలను ఒక్కసారి తీసుకొన్నా అది వ్యసనానికి దారి తీయవచ్చు అనే విషయాన్ని బాగా గుర్తుంచుకోవాలి. వ్యసనశక్తి (addictive potential) గల పొగాకు, మందులు, ఆల్కహాల్స్ (TDAలు), వ్యసన స్వభావంగల (vicious circle) గుంపులోకి లాగేస్తాయి. దీనితో మందుల దుర్వినియోగం క్రమం తప్పకుండా మొదలై అందులోనుంచి బయటకు రాలేని స్థితికి త్వరగా దారితీస్తుంది. ఈ స్థితిలో సరైన సలహా లేదా కౌన్సిలింగ్ లేనప్పుడు ప్రజలు పూర్తిగా వ్యసనపరులై దానిపైనే ఆధారపడతారు.

ఆధారపడటం :
ఇది క్రమం తప్పని మోతాదులో మత్తుమందులు లేదా ఆల్కహాల్ వినియోగాన్ని ఒకేసారి మానివేయడం వల్ల శరీరంలో కనిపించే అసంతృప్తి లక్షణం లేదా ఉపసంహరణ సిండ్రోమ్ (withdrawl syndrome) . ఈ సిండ్రోమ్లో ఆందోళన(anxiety), వణకడం (tremors), వికారం(nausia), చెమట పట్టడం మొదలైన లక్షణాలు కనిపిస్తాయి. TDAలను వాడటం మళ్ళీ మొదలెడితే ఇవి కనిపించవు. ఆధారం అనేది అన్ని సామాజిక కట్టుబాట్లను వదిలే స్థితికి దారితీస్తుంది.

AP Inter 1st Year Zoology Study Material Chapter 6 మానవ సంక్షేమంలో జీవశాస్త్రం

ప్రశ్న 19.
TDA దుర్వినియోగాన్ని దృష్టిలో ఉంచుకుని “వ్యాధి చికిత్స కంటే నివారణ మంచిది” నిరూపించండి.
జవాబు:
TDA అనగా పొగాకు (Tobacco), మత్తుమందులు – మాదకద్రవ్యాలు (Drugs), సారాయి (Alcohol)లు. వీటి వినియోగం యువతపై చాలా చెడు ప్రభావాన్ని చూపిస్తున్నాయి. పొగాకు వినియోగం ఊపిరితిత్తులలో, నోటిలో కాన్సర్కు దారితీసే అవకాశం ఉంది. ఇంకా దీని ప్రభావం జీర్ణవ్యవస్థ, గుండె, రక్తప్రసరణ, శ్వాసవ్యవస్థపై విపరీత పరిణామాలు చోటు చేసుకుంటాయి.

మత్తుమందులు – మాదకద్రవ్యాలు – వీటి వినియోగాల మానసిక, శారీరక రుగ్మతలకు దారి తీస్తుంది.

ఆల్కహాల్ వినియోగం మానసిక దౌర్బల్యానికి దారితీసి వ్యక్తి వికాసాన్ని నాశనం చేస్తుంది. ఆరోగ్యాన్ని క్షీణింపజేస్తుంది. TDA కు అలవాటు పడిన వ్యక్తులు మానసికంగా, శారీరకంగా, సామాజికంగా పతనానికి గురి అవుతారు. చికిత్స కంటే నివారణ మంచిది కనుక TDA కి అలవాటు పడిన వారిని క్రింది జాగ్రత్తలు పాటించినట్లయితే మంచి పౌరులుగా మార్చవచ్చును.

  1. తల్లిదండ్రులు తమ పిల్లలపై ఇతరులతో పోల్చి వత్తిడి తేకూడదు.
  2. తల్లిదండ్రులు, ఉపాధ్యాయ యువతకు వారి ప్రవర్తనను గుర్తించి హితబోధ చేయాలి.
  3. మత్తుమందులు, పొగతాగడం, ఆల్కహాల్ త్రాగడం వంటి వాటి వలన సంభవించే అనారోగ్యాలను వారికి తెలియజేయాలి. వాటి పీడితులను గూర్చి వారికి తెలియజేయాలి.
  4. యువతకు విద్యావిషయాలు, మానసిక వత్తిడి, సామాజిక సమస్యలు, వయస్సుతోపాటు వచ్చే మార్పులు జీవితంలో ఒక భాగం అని, ప్రత్యేకత ఏమీ కాదని, వాటిని అధిగమించే విధంగా హితబోధ చేయాలి.
  5. మనోవిజ్ఞాన వేత్తలు, మానసిక వైద్యులు, రిహాబిలిటేషన్ ప్రోగ్రామ్స్, డీఅడిక్షన్ సలహాలు, వైద్యుల సూచనలు వారికి అందుబాటులో తీసుకురావాలి.

పై విధంగా వివిధ కార్యక్రమాల ద్వారా యువతను దుర్వినియోగం నుండి దూరంగా ఉంచి మంచి పౌరులుగా తీర్చిదిద్దవచ్చును.

దీర్ఘ సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
ఎంటమీబా హిస్టోలైటికా నిర్మాణాన్ని, జీవిత చక్రాన్ని వివరించండి. పటం గీసి భాగాలను గుర్తించండి.
జవాబు:
ఎంటమీబా హిస్టోలైటికా మానవుడి పెద్దపేగు, అంధనాళంలో ఉండే అంతర పరాన్న జీవి. దీని వలన మానవుడికి అమీబిక్ డిసెంటరీ లేదా అమీబియాసిస్ అనే వ్యాధి కలుగుతుంది. ఇది తన జీవిత చక్రంను ఒకే అతిథేయిలో పూర్తి చేసుకొనును. కనుక దీనిని “మోనోజెనిటిక్” పరాన్న జీవి అందురు. దీని జీవిత చక్రములో రెండు దశలుంటాయి.

  1. మాగ్నదశ లేక పోషకజీవి.
  2. మైన్యూట దశ లేక కోశస్థ పూర్వ దశ

1. మాగ్నదశ లేక పోషకజీవి :
పోషకజీవి పెద్ద ప్రేగు గోడలలో వుంటుంది. దీనిని ఆవరించి ప్లాస్మాలెమ్మా అనే పొర ఉంటుంది. దీనిలో బాహ్య జీవ ద్రవ్యం మందంగా పారదర్శకంగా కణికారహితంగావుంటుంది. అంతర్జీవ ద్రవ్యం కణికాయుతంగా ఉంటుంది. అంతరజీవ ద్రవ్యంలో తిత్తివంటి కేంద్రకంవుంటుంది. కేంద్రకం మధ్యలో ఎండోసోమ్ అనే నిర్మాణమువుంటుంది. కేంద్రక త్వచం యొక్క లోపలి తలాన్ని అంటి పెట్టుకొని పూసలవంటి క్రొమాటిన్ పదార్థం వుంటుంది. దీని నుండి సన్నని క్రొమాటిన్ తంతువులు, కేంద్రక బిందువు వైపుకు చక్రంలోని చువ్వల మాదిరిగా ప్రసరించి ఉంటాయి. దీని వలన కేంద్రకం బండి చక్రం రూపంలో కనిపిస్తుంది. పోషకజీవి ఒక వేలు వంటి మిధ్యాపాదాన్ని కలిగి ఉంటుంది. దీని ఆహార రక్తికల్లో ఎర్రరక్త కణాలుంటాయి. పోషక జీవి ద్విదావిచ్ఛిత్తి ద్వారా తన సంఖ్యను పెంచుకుంటుంది. వీటిలో కొన్ని పిల్ల జీవులు ప్రేగు కుహరంలోకి ప్రవేశించి కోశస్థ పూర్వదశగా మారతాయి.

2. కోశస్థ పూర్వదశ :
ఈ దశలో ఎంటమీబా ఆహార రక్తికలను, మిథ్యాపాదాన్ని కోల్పోతుంది, గోళాకారంగా మారుతుంది. పరిమాణం తగ్గుతుంది. గ్లైకోజన్ కణికలను, ఒకటి లేదా రెండు క్రొమాటాయిడ్ దేహాలను కణ ద్రవ్యంలో నిల్వచేసుకుంటుంది. క్రొమాటాయిడ్ దేహాలు రైబోన్యూక్లియో ప్రోటీను తత్వాన్ని కలిగి ఉంటాయి.
AP Inter 1st Year Zoology Study Material Chapter 6 మానవ సంక్షేమంలో జీవశాస్త్రం 1

కోశస్థ దశ :
కోశస్థ పూర్వదశ తన చుట్టూ సున్నితమైన కోశాన్ని తయారుచేసుకొని కోశస్థ దశను చేరుతుంది. కోశికరణం జరగగానే పరాన్న జీవిలోని కేంద్రకం రెండు సమవిభజనలను జరుపుకొని చతుష్కేంద్రక కోశంగా రూపొందుతుంది. ఈ దశ ఏర్పడటం ఎంటమీబా హిస్టోలైటికా యొక్క ప్రత్యేక లక్షణం.

సంక్రమణం :
చతుష్కేంద్రక దశలు మానవునికి సంక్రమణ దశలు. ఇవి మలముతో పాటు బయటకి విసర్జింపబడతాయి. ఈ కోశాలు కాయగూరకు అంటుకొని గాని, ఆహారపదార్థాలతో కలిసిగాని నీటిలో తేలుతూ గాని ఉంటాయి. ఈ విధంగా కలుషితమైన నీటిని లేదా ఆహారాన్ని మానవుడు స్వీకరించుట వలన పరాన్నజీవి అతిథేయిని చేరుతుంది. ఈ దశలను అతిథేయికి చేరవేయటంలో, బొద్దింకలు, ఈగలు కూడ ఏజెంట్లుగా పనిచేస్తాయి.

వికోశీకరణ :
చతుష్కేంద్రక కోశాలు కొత్త అతిథేయి పేగులోకి ప్రవేశించిన తరువాత అక్కడి ఎంజైముల చర్య వలన కోశము కరుగుతుంది. నాలుగు కేంద్రకములు గల జీవులు బయటకు వస్తాయి. ఈవిధంగా కోశం నుండి పరాన్నజీవి బయటకు రావడాన్ని వికోశికరణము అంటారు. వికోశీకరణ చెంది విడుదలైన నాలుగు కేంద్రకాలు గల పరాన్నజీవి “మెటాసిస్టిక్” దశ అంటారు.

మెటాసిస్టిక్ దశ :
మెటాసిస్టిక్ రూపములోని నాలుగు కేంద్రకాలు విభజన చెంది, ఎనిమిది కేంద్రకాలుగా ఏర్పడతాయి. జీవ ద్రవ్యం కూడా విభజన చెంది కేంద్రకాల చుట్టు చేరుతుంది. దీనివలన మొత్తం 8 పిల్ల ఎంటమీబాలు ఏర్పడి, పెద్దపేగు గోడను చేరి పోషక జీవులుగా మారతాయి.
AP Inter 1st Year Zoology Study Material Chapter 6 మానవ సంక్షేమంలో జీవశాస్త్రం 2

ప్రశ్న 2.
మానవుడిలో ప్లాస్మోడియం వైవాక్స్ జీవితచక్రాన్ని వివరించండి. దాని పటం గీసి భాగాలు గుర్తించండి.
జవాబు:
మానవునిలో (మాధ్యమిక అతిథేయి) ప్లాస్మాడియం’ జీవిత చక్రం :
మాధ్యమిక అతిథేయి అయిన మానవుడిలో ప్లాస్మాడియం విఖండ జననం అనే అలైంగిక పద్ధతిలో తన జీవిత చక్రాన్ని పూర్తి చేస్తుంది. ఇది రెండు భాగాలుగా ఉంటుంది. కాలేయంలో జరిగే దానిని కాలేయ విఖండ జననం అని, ఎర్ర రక్తకణాలలో జరిగేదానిని రక్తకణ విఖండ జననం అని అంటారు.

కాలేయ విఖండ జననం :
ఇది రెండు రకాలుగా ఉంటుంది. రక్తకణపూర్వ, రక్తకణ బాహ్య జీవిత చక్రం.

రక్తకణ పూర్వ జీవితచక్రం :
స్పోరోజాయిట్ దశలున్న దోమ మానవుడిని కుట్టినప్పుడు దోమ లాగా జలంతో బాటుగా స్పోరోజాయిట్లు మానవ రక్తంలో ప్రవేశిస్తాయి. రక్తంలోకి ప్రవేశించిన స్పోరోజాయిట్లు అర్థగంటలోపులోనే కాలేయకణాలలోకి చేరి, కాలేయకణ పదార్థాన్ని ఆహారంగా తీసుకుంటు తమ ఆకృతిని గోళాకారంగా మార్చుకుంటాయి. వీటిని షైజాంట్ అంటారు. వీటిలోని కేంద్రకం బహుధావిచ్ఛిత్తి చెంది అనేక పిల్ల కేంద్రకాలను ఏర్పరుస్తుంది. ఈ కేంద్రకాల చుట్టూ కణద్రవ్యం చేరి అనేక పిల్లజీవులు ఏర్పడతాయి. ఇప్పుడు షైజాంట్ పగిలి అనేక పిల్ల క్రిప్టోజాయిట్స్ కాలేయ కణాలలోకి విడుదలవుతాయి. వీటిలో కొన్ని ఎర్ర రక్తకణాలలో ప్రవేశిస్తాయి. కొన్ని తిరిగి కొత్తగా కాలేయ కణాలలోకి ప్రవేశిస్తాయి. ఈ ప్రక్రియ 8 రోజులు పడుతుంది.

రక్తకణ బాహ్య జీవిత చక్రం :
క్రిప్టోజాయిట్స్ తిరిగి కాలేయ కణాలను చేరి రక్తకణ పూర్వ చక్రంలో మాదిరిగా అనేక మార్పులు చెంది రెండోదశ మీరోజాయిట్లను మెటాక్రిప్టోజాయిట్లను విడుదల చేస్తాయి. వీటిలో రెండు రకాలుంటాయి. చిన్నవిగా ఉండే సూక్ష్మమెటాక్రిప్టోజాయిట్లు, పెద్దవిగా ఉండే స్థూల మెటాక్రిప్టోజాయిట్లు. ఈ ప్రక్రియ దాదాపు 2 రోజులలో పూర్తి అవుతుంది. వీటిలో స్థూల మెటాక్రిప్టోజాయిట్లు తిరిగి కొత్త కాలేయకణాలను చేరి రక్తకణ బాహ్యిజీవితచక్రాన్ని ప్రారంభిస్తాయి. సూక్షక్రిప్టోజాయిట్లు ఎర్రరక్తకణాలను చేరి రక్తకణ జీవిత చక్రాన్ని ప్రారంభిస్తాయి.

ప్లాస్మోడియం స్పోరోజాయిట్ రూపంలో మానవ రక్తంలో ప్రవేశించినప్పుడినుండి తిరిగి రెండవసారి క్రిప్టోజాయిట్లు ఎర్రరక్తకణాలోకి ప్రవేశించడానికి పట్టేకాలాన్ని ప్రీపేటెంట్ కాలం అంటారు. ఈ సమయంలో ఎలాంటి రోగలక్షణాలు కనిపించవు.

రక్తకణ జీవిత చక్రం :
ప్లాస్మోడియం జీవితచక్రంలో ఈ భాగాన్ని కామిల్లోగాల్జి అనే శాస్త్రవేత్త వివరించాడు. కనుక దీనిని గాల్జిచక్రం అని కూడా అంటారు. ఇది రక్తకణ పూర్వ లోని క్రిప్టోజాయిట్లతోగాని, రక్తకణ బాహ్యజీవితచక్రంలోని సూక్ష్మమెటాక్రిప్టోజాయిట్స్ లాగా ప్రారంభమవుతుంది.

ఎర్రరక్తకణాలోకి ప్రవేశించగానే మీరోజాయిట్లు గోళాకార పోషక జీవులుగా మారతాయి. ఇవి RBC లోని హిమోగ్లోబిన్ను ఆహారంగా తీసుకోవడం ప్రారంభమవుతుంది. వీటిలో ఒక చిన్న రిక్తిక ఏర్పడి, పరిమాణంలో పెరుగుతూ పోషకజీవిలోని జీవపదార్థాన్ని కేంద్రకాన్ని అంచువైపు నెట్టడం వలన ఉంగరం మాదిరిగా కనిపిస్తుంది. ఈ దశను అంగూళీక దశ అంటారు. తరువాత రిక్తిక అదృశ్యమవుతుంది. పరాన్నజీవి మిథ్యాపాదాలను ఏర్పరుచుకుంటుంది. ఈ దశను అమీబాయిడ్ దశ అంటారు. ఎర్రరక్తకణ జీవ పదార్థాన్ని తింటు పోషకజీవి పరిమాణం పెరుగుతుంది, దీనివలన RBC పరిమాణం పెరుగుతుంది. పరాన్నజీవి హిమోగ్లోబిన్ లోని గ్లోబిన్ ప్రోటీన్ ను జీర్ణం చేసుకొని జీర్ణం కాని హిమ్ బాగాని హిమోజాయిన్ అనే కణికలుగా ఏర్పరుస్తుంది.

ఇది మలేరియా జ్వరాన్ని కలుగుజేసే విష పదార్థం. ఇది చిన్న ఎర్రని మచ్చలుగా RBC జీవ పదార్థంతో ఏర్పడతాయి. వీటిని షఫ్నర్ చుక్కలు అంటారు. ప్లాస్మోడియం మిథ్యాపాదాలను కోల్పోయి బాగా పెరిగి RBC ని మొత్తంగా ఆక్రమించి షైజాంట్గా మారుతుంది. దీనిలోని కేంద్రకం విఖండజనన జరుపుట 12 నుండి 24 ఎర్రరక్తకణ మీరోజాయిట్స్ను ఏర్పరుస్తుంది. ఇవి RBC తో గులాబిరేకులాగా మారి రోజెట్ దశగా మారుతుంది. చివరిగా ఎర్రరక్తకణం పగిలి మీరోజాయిట్స్, హీమోజాయిన్ రక్తంలోకి విడుదలవుతాయి.

రక్తంలోకి విడుదలైన మీరోజాయిట్స్ తిరిగి కొత్త RBC లలోకి ప్రవేశిస్తాయి. హీమోజాయి విషపదార్థం ప్రభావం వలన మలేరియా జ్వరం వస్తుంది. స్పోరోజాయిట్ మొదట మానవుడిలో ప్రవేశించింది మొదలు మలేరియా జ్వర లక్షణాలు వచ్చే వరకు పట్టేకాలాన్ని పొదిగేకాలం అంటారు. ఇది దాదాపు 10 నుండి 14 రోజులు పడుతుంది.

సంయోగ బీజమాతృకలు ఏర్పడటం :
అనేక పర్యాయాలు రక్తకణ జీవితచక్రం పూర్తిచేసుకున్న ప్లాస్మోడియం మీరోజాయిట్స్ కొన్ని సంయోగబీజ మాతృకలుగా మారతాయి. వీటిలో రెండురకాలుగా ఉంటాయి. సూక్ష్మంగా ఉన్న వాటిని సూక్ష్మ లేదా పురుష సంయోగబీజమాతృకలు అని, పెద్దవిగా ఉన్న వాటిని స్థూల లేదా స్త్రీ సంయోగ బీజమాతృకలు అంటారు. ఈ దశలు తదుపరి దోమలో ప్రవేశించి మాత్రమే అభివృద్ధి చెందుతాయి.
AP Inter 1st Year Zoology Study Material Chapter 6 మానవ సంక్షేమంలో జీవశాస్త్రం 4

ప్రశ్న 3.
దోమలో ప్లాస్మోడియం వైవాక్స్ జీవితచక్రాన్ని పటం సహాయంతో వివరించండి. [Mar. ’14]
జవాబు:
ప్లాస్మోడియం వైవాక్స్ దోమలో జరుపుకునే జీవిత చక్రాన్ని సర్ రోనాల్డ్స్ వివరించడం వలన దీనిని రాస్ చక్రం అని కూడా అంటారు.

ఈ ఎనాఫిలిస్ దోమ వ్యాధిగ్రస్తుడైన మానవుణ్ని కుట్టి రక్తాన్ని పీల్చినప్పుడు రక్తం సంయోగబీజ మాతృకలు, ఇతర దశలు దోమ అన్నాశయాన్ని చేరతాయి. దోమ జీర్ణ వ్యవస్థలో సంయోగబీజ మాతృకలు మాత్రమే జీవించి ఉంటాయి. మిగతా దశలు జీర్ణమవుతాయి.

ప్లాస్మోడియం తన జీవిత చక్రంలో లైంగిక ప్రత్యుత్పత్తి దోమలో పూర్తి అవుతుంది. దీనిలో క్రింది దశలుంటాయి.

  1. బీజకణోత్పత్తి (Gametogony)
  2. ఫలదీకరణం (Fertilization)
  3. గమనసంయుక్తబీజం, సంయుక్త బీజకోశాలు ఏర్పడటం (Formation of ookinite and oocysts)
  4. సిద్ధబీజోత్పత్తి (sporogony)

i) బీజకణోత్పత్తి (Gametogony) :
సంయోగబీజ మాతృకణాల నుంచి పురుష, స్త్రీ బీజకణాలు ఏర్పడటాన్ని బీజకణోత్పత్తి అంటారు. దోమ అన్నాశయకుహరంలో బీజకణాలు ఏర్పడతాయి.

పురుష సంయోగబీజకణాలు ఏర్పడటం :
ఈ ప్రక్రియలో సూక్ష్మ సంయోగబీజమాతృక యొక్క కేంద్రకం విభజనతో ఎనిమిది పిల్ల కేంద్రకాలను ఏర్పరుస్తాయి. వీటిని ప్రాక్కేంద్రాలు (Pronuclei) అంటారు. ఈ కేంద్రకాలు అంచులను చేరతాయి. జీవపదార్థం ఎనిమిది కశాభాలను పోలిన కీలితాలను ఏర్పరుస్తుంది. ఒక్కొక్క కేంద్రక భాగం ఒక్కొక్క జీవపదార్థ కీలితంలోకి ప్రవేశించి కశాభం లాంటి సూక్ష్మ సంయోగబీజాలు లేదా పురుష సంయోగబీజాలను ఏర్పరుస్తుంది. ఈ సూక్ష్మ సంయోగబీజాలు విసిరిన కొరడా మాదిరి కదలికలను (lashing movements) చూపుతూ జీవపదార్థం నుంచి విడుదలవుతాయి. ఈ విధంగా పురుష సంయోగబీజాలు విడుదల కావడాన్ని కశాభ నిర్మోచనం (exflagellation) అంటారు.

స్త్రీ సంయోగబీజకణాలు ఏర్పడటం :
స్త్రీ సంయోగబీజ మాతృకణాలు కొద్ది మార్పులతో స్త్రీ సంయోగ బీజకణంగా ఏర్పడుతుంది. దీన్ని పరిపక్వత (maturation) అంటారు. స్త్రీ సంయోగ బీజకణాల కేంద్రకం పరిధి వైపు కదులుతుంది. ఆ ప్రాంతంలో జీవపదార్థం ఉబ్బుతుంది. ఉబ్బిన ఈ భాగాన్ని ఫలదీకరణ శంకువు (fertilization cone) అంటారు.

ii) ఫలదీకరణం :
స్త్రీ, పురుష బీజకణాలు కలవడాన్ని ఫలదీకరణ అంటారు. ఇది దోమ అన్నాశయ కుహరంలో జరుగుతుంది. సూక్ష్మ సంయోగబీజాలు చురుకుగా కదులుతూ స్థూల సంయోగబీజం యొక్క ఫలదీకరణ శంకువును తాకగానే, దానిలోకి ప్రవేశిస్తుంది. రెండు బీజకణాల ప్రాక్కేంద్రకాలు, జీవపదార్థం కలిసి సంయుక్త కేంద్రకం (synkaryon) ఏర్పడుతుంది. ఈ కలయికలో సంయోగబీజాలు పరిమాణరీత్యా అసమానంగా ఉంటాయి.

కాబట్టి దీన్ని అసమసంయోగం (anisogamy) అంటారు. సంయుక్త కేంద్రకాన్ని కలిగిన స్త్రీ సంయోగ బీజాన్ని సంయుక్త బీజం (zygote) అంటారు. ఇది గుండ్రంగా ఉండి కదలలేదు.
AP Inter 1st Year Zoology Study Material Chapter 6 మానవ సంక్షేమంలో జీవశాస్త్రం 5

i) గమన సంయుక్తబీజం, సంయుక్త బీజకోశం ఏర్పడటం :
సంయుక్త బీజం కొంతకాలం చైతన్యరహితంగా ఉంటుంది. 18-24 గంటలలో ఇవి ఊకినైట్ / గమనసంయుక్తబీజం అనే పొడవైన, సన్నటి, కదలిక చూపే క్రిమి రూపాన్ని పొందుతుంది. ఇది అన్నాశయ కుడ్యాన్ని తొలుచుకొని, ఆధారత్వచం కింద చేరుతుంది. ఇది గుండ్రంగా మారి తన చుట్టూ ఒక కోశాన్ని స్రవిస్తుంది. ఈ కోశస్థ దశను ఊసిస్ట్ (Oocyst) అంటారు. అన్నాశయ కుడ్యంపై 50-500 ఊసిస్ట్లు ఏర్పడి చిన్నచిన్న బుడిపెలుగా కనిపిస్తాయి. (ఈ ఊసిస్ట్లను సర్ రొనాల్డ్ రాస్ మొట్టమొదటగా గుర్తించాడు).

AP Inter 1st Year Zoology Study Material Chapter 6 మానవ సంక్షేమంలో జీవశాస్త్రం 6
iv) సిద్ధబీజోత్పత్తి :
ఊసిస్ట్ స్పోరోజాయిట్లు ఏర్పడటాన్ని సిద్ధబీజోత్పత్తి అంటారు. బానో (Bano) అనే శాస్త్రజ్ఞుడు చెప్పిన ప్రకారం కేంద్రకం మొదట క్షయకరణ విభజన జరుపుకుంటుంది. ఆ తరువాత అనేకసార్లు సమవిభజనలను కొనసాగిస్తూ 1000 వరకు పిల్ల కేంద్రకాలను ఏర్పరుస్తుంది. ప్రతీ కేంద్రకం చుట్టూ కొంత జీవపదార్థం చేరి కొడవలి ఆకారం స్పోరోజాయిట్స్ ఏర్పడతాయి. స్పోరోజాయిట్స్ గల ఊసిస్ట్ను సిద్ధబీజకోశం (sporocyst) అంటారు. సిద్ధబీజకోశం పగిలినప్పుడు స్పోరోజాయిట్లు దోమ రక్తకుహరం (haemocoel) లోకి విడుదలవుతాయి. ఇవి అక్కడి నుంచి లాలాజలగ్రంథులలోనికి చేరి సంక్రమణకు సిద్ధంగా ఉంటాయి. దోమలో ప్లాస్మోడియం జీవితచక్రం పూర్తికావడానికి దాదాపుగా 10-24 రోజులు పడుతుంది.

AP Inter 1st Year Zoology Study Material Chapter 6 మానవ సంక్షేమంలో జీవశాస్త్రం

ప్రశ్న 4.
ఆస్కారిస్ లుంబ్రికాయిడిస్ నిర్మాణాన్ని, జీవితచక్ర పటాలతో వివరించండి.
జవాబు:
AP Inter 1st Year Zoology Study Material Chapter 6 మానవ సంక్షేమంలో జీవశాస్త్రం 7
నిమటోడా వర్గానికి చెందిన ఆస్కారిస్ లుంబ్రికాయిడిస్ మాన ఆంత్రంలో నివశించే అతి సాధారణ పరాన్నజీవి. ఇది కలుషిత నీరు, ఆహారం ద్వారా వ్యాప్తి చెందుతుంది. దీని పిండసహిత అండాలు మానవులకు సాంక్రమిక దశలు.

నిర్మాణం :
స్త్రీ, పురుష జీవులు వేరువేరుగా ఉంటాయి. స్పష్టమైన లైంగిక ద్విరూపకత ఉంటుంది. రెండు జీవులు స్తూపాకారంలో, సన్నగా ఉంటాయి. పూర్వాంతంలో నోరు మూడు కైటిన్ పెదవులతో ఆవరించి ఉంటుంది. నోటికి దగ్గరగా ఉదర మధ్యంగా చిన్న విసర్జక రంధ్రం ఉంటుంది.

పురుషజీవి :
దీని తోక వంపు తిరిగి ఉంటుంది. పరాంతంలో అవస్కర రంధ్రం, ఒక జత కైటిన్ నిర్మిత పీనియల్ కంటకాలు (pineal spicules) లేదా పీనియల్ శూకాలు (pineal saetae) ఉంటాయి. ఇది సంపర్కంలో శుక్రకణాలను ప్రవేశపె ట్టడానికి తోడ్పడుతుంది.

స్త్రీ జీవి :
దీని తోక నిటారుగా ఉంటుంది. జనన రంధ్రం లేదా యోనిరంధ్రం ఉదరతలంలో నోటి కింద 1/3 వంతుల దూరంలో ఉంటుంది. తోకకు కొంచెం పైగా పాయువు ఉంటుంది.

AP Inter 1st Year Zoology Study Material Chapter 6 మానవ సంక్షేమంలో జీవశాస్త్రం 8
జీవిత చక్రం :
మానవుడి చిన్నపేగులో సంపర్కం జరుగుతుంది. సంపర్కం తరువాత స్త్రీ జీవి రోజుకు దాదాపుగా రెండు లక్షల గుడ్లను విడుదల చేస్తుంది. ప్రతి గుడ్డుకూ ఉపరితంలో బుడిపెలుగా ఏర్పడిన ప్రోటీన్ పొర ఉంటుంది. అందువల్ల ఆస్కారిస్ గుడ్లను మామ్మిల్లేటెడ్ గుడ్లు (mammilated eggs) అంటారు. ప్రోటీన్ పొరకు లోపల కైటిన్ కర్పరం, లిపిడ్ పొరలు ఉంటాయి. మలంతో పాటు గుడ్లు విడుదలవుతాయి. తేమ నేలలో గుడ్డులో పిండాభివృద్ధి జరిగి మొదటి దశ రాబ్దిటిఫార్మ్ డింభకం ఏర్పడుతుంది. ఇది మొదటి నిర్మోచనంతో రెండో దశ రాబ్దిటిఫార్మ్ డింభకంగా మారుతుంది. ఇది మానవుడికి వ్యాధిని కలిగించే సాంక్రమికదశ. కలుషిత ఆహారం, నోటితో ఈ దశలు మానవుడి ఆహారనాళాన్ని చేరతాయి.
AP Inter 1st Year Zoology Study Material Chapter 6 మానవ సంక్షేమంలో జీవశాస్త్రం 9

చిన్నపేగులో కర్పరం కరిగి రెండోదశ డింభకం విడుదల అవుతుంది. ఇది బాహ్యాంత్రవలస (extra intestinal migration) చేస్తుంది. కాలేయ నిర్వాహక సిర ద్వారా మొదట కాలేయాన్ని చేరుతుంది. అక్కడి నుండి పరమహాసిర ద్వారా హృదయాన్ని చేరుతుంది. అక్కడి నుండి పుపుస ధమని ద్వారా ఊపిరితిత్తులను చేరి వాయుకోశాలలో రెండో నిర్మోచనం చెంది మూడోదశ డింభకంగా మారుతుంది. ఆ తరువాత మూడో నిర్మోచనాన్ని కూడా వాయుకోశాలలో పూర్తిచేసి నాలుగోదశ డింభకంగా మారుతుంది. చివరగా ఈ డింభకం శ్వాసనాళికలు (bronchi), వాయునాళం (trachea) స్వరపేటిక (larynx), కంఠబిలం (glottis), గ్రసని, (pharynx) ఆహారవాహిక, జీర్ణాశయ మార్గంలో ప్రయాణించి చిన్నపేగు చేరుతుంది. చిన్నపేగులో నాల్గవ, చివరి నిర్మోచనం చెంది పిల్లజీవిగా మారుతుంది. ఇది 8-10 వారాలలో లైంగిక పరిపక్వతను పొందుతుంది.

వ్యాధి కారకత :
ఆస్కారిస్ లుంబ్రికాయిడిస్ వల్ల ఆస్కారియాసిస్ వ్యాధి వస్తుంది. వీటి సంఖ్య తక్కువైనప్పుడు వ్యాధి లక్షణాలు కనిపించవు. అధిక సంక్రమణ వల్ల పోషణ లోపాలు, ఉదరంలో తీవ్రమైన నొప్పి కలుగుతుంది. దీనివల్ల పిల్లలలో పెరుగుదల నిరోధించబడుతుంది.

నివారణ చర్యలు :
ఎంటమీబాకు వివరించిన అంశాలే వర్తిస్తాయి.

AP Inter 1st Year Zoology Study Material Chapter 6 మానవ సంక్షేమంలో జీవశాస్త్రం

ప్రశ్న 5.
ఉకరేరియా బాంక్రాఫ్టి జీవితచక్రాన్ని వివరించండి.
జవాబు:
ఉకరేరియా బాంక్రాఫ్టి తన జీవితచక్రాన్ని రెండు అతిథేయిలలో పూర్తి చేసుకుంటుంది.

  1. మానవుడు – ప్రాథమిక అతిథేయి,
  2. ఆడ క్యులెక్స్ దోమ – ద్వితీయ అతిథేయి.

మానవునిలో జీవితచక్రం :
ఉచరేరియా బాంక్రాఫ్టి యొక్క ఆడ, మగ జీవులు మానవుడి శోషరస వ్యవస్థలో నివాసముంటాయి. ఇక్కడే సంపర్కం జరుపుతాయి. స్త్రీ జీవులు అందశిశూత్పాదకాలు. ఇవి మైక్రోఫైలేరియా అనే డింభకాలను విడుదల చేస్తాయి. మైక్రోఫైలేరియాలు 0.2-0.3 మి.మీ. పొడవు ఉంటాయి. దీనిని ఆవరించి వదులుగా ఉండే అవభాసిని తొడుగు ఉంటుంది. డింభకం బాహ్య కేంద్రక స్థితిలో ఉంటుంది. డింభక పూర్వాంతంలో ఒక శూకిక ఉంటుంది. దీనిలో నాడీవలయం, వృక్కరంధ్రం, పాయురంధ్రం, లీనెటి కణం, నాలుగు పెద్ద జనన కణాలు, అధికంగా వర్ణకాలను గ్రహించిన కణ సముదాయం. అవశిష్ట ఆహార వాహిక ఉంటాయి.

శోషరస నాళికలోకి విడుదల చేయబడిన మైక్రొఫైలేరియాలు రక్తప్రసరణను చేరతాయి. మైక్రోఫైలేరియాలు అంతరాంగ అవయవాలలో లోతుగా ఉన్న రక్తనాళాలలో నివసిస్తూ రాత్రిపూట 10 గం. నుండి 4 గం.ల మధ్య పరిధీయ రక్తనాళాలోకి వస్తాయి. ఈ గమనాన్ని ‘నిశాకాల గమనం’ అంటారు. ఈ గమనానికి కారణం మాధ్యమిక అతిథేయి అయిన క్యూలెక్స్ దోమ మానవుని రక్తాన్ని రాత్రి సమయంలో పీల్చడమేనని తెలుస్తుంది. రోగగ్రస్తుని దోమ కుట్టి రక్తాన్ని పీల్చినపుడు రక్తంతో పాటుగా మైక్రోఫైలేరియా డింభకాలు క్యూలెక్స్ దోమలోకి చేరతాయి. 70 రోజుల లోపల దోమను చేరకపోతే మైక్రోఫైలేరియా డింభకాలు చనిపోతాయి. మైక్రోఫైలేరియా దోమకు సాంక్రమిక దశలు.

దోమలో జీవిత చరిత్ర :
దోమ ఆహారనాళంలో 2-6 గం.లలో డింభకం తొడుగు కరిగిపోతుంది. ఈ డింభకం దోమ ఆహార కుడ్యాన్ని తొలుచుకొని దోమ రక్త కుహరాన్ని చేరుతుంది. ఇక్కడి నుండి ఉరఃకండరాలను చేరి రెండు రోజులలో సాసేజ్ ఆకార డింభకంగా మారుతుంది. దీన్ని మొదటి డింభకదశ లేదా మొదటిదశ మైక్రోఫైలేరియా అంటారు. ఇది 10-20 రోజులలో రెండు నిర్మోచనాలు పూర్తి చేసుకొని పొడవైన సాంక్రమిక మూడోదశ మైక్రోఫైలేరియాగా మారుతుంది. ఇది దోమ అధరాన్ని చేరుతుంది.

మూడోదశ మైక్రొఫైలేరియా డింభకాలు కలిగిన దోమ మానవుని కుట్టినప్పుడు డింభకాలు మానవ రక్త ప్రవాహాన్ని చేరి అక్కడి నుండి శోషరస నాళాలు చేరతాయి. ఇక్కడ డింభకాలు మూడో, నాలుగో నిర్మోచనాలు జరుపుకొని ప్రౌఢజీవులుగా మారతాయి. ఇవి 5 నుండి 18 నెలల కాలంలో లైంగిక పరిపక్వతను పొందుతాయి.
AP Inter 1st Year Zoology Study Material Chapter 6 మానవ సంక్షేమంలో జీవశాస్త్రం 10

వ్యాధి కారకత :
ఉకరేయా సంక్రమణ వలన ఫైలేరియా జ్వరం, తలనొప్పి, మానసిక ఆందోళన, శరీర ఉష్ణోగ్రత పెరగడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. శోషరస నాళాలలో శోషరస గ్రంథులలో వాపు కనిపిస్తుంది. శోషరస నాళాలలో కలిగే వాపును లింఫాంజైటిస్ అంటారు. శోషరస గ్రంథులలో వాపును లింఫాడెంటిస్ అంటారు. శోషరస నాళాలలో ఆటంకం వలన శోషరసం సంచిత మవడం వలన అవయవాలలో వాపు ఏర్పడుతుంది. దీనిని లింఫొఎడిమా అంటారు.

వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు ప్రభావిత భాగాలు (గమనాంగాలు, ముష్కగోణులు, స్తనాలు) అనూహ్యంగా వాపు కనిపిస్తుంది. ఈ భాగాలలో స్వేదగ్రంథులు క్షీణించి చర్మం పొడిబారి, గరుకుగా అవుతుంది. ఈ స్థితిని ఎలిఫెంటియాసిస్ లేదా బోదకాలు వ్యాధి అంటారు.

AP Inter 1st Year Botany Study Material Chapter 9 కణం: జీవప్రమాణం

Andhra Pradesh BIEAP AP Inter 1st Year Botany Study Material 9th Lesson కణం: జీవప్రమాణం Textbook Questions and Answers.

AP Inter 1st Year Botany Study Material 9th Lesson కణం: జీవప్రమాణం

అతిస్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
వృక్షకణంలో రిక్తిక ప్రాముఖ్యం ఏమిటి?
జవాబు:
రిక్తికలో ప్రధానంగా నీరు, జీవక్రియా ఉపఉత్పన్నాలు, విసర్జక పదార్థాలు, వ్యర్థపదార్థాలతో కూడిన రసం ఉంటుంది. ఇది కణద్రవాభిసరణచర్యల నియంత్రణలో ముఖ్యపాత్ర వహిస్తాయి.

ప్రశ్న 2.
705, 805 రైబోసోమ్లో ‘S’ అంటే అర్థం ఏమిటి?
జవాబు:
705, 805 రకపు రైబోసోమ్లలో ‘S’ అనగా స్వెడ ్బర్గ్ ప్రమాణంలో చెప్పబడే అవసాధన గుణకము, ఇది పరోక్షంగా సాంద్రత, పరిమాణమును తెలిపే అంశము.

ప్రశ్న 3.
హైడ్రోలైటిక్ ఎంజైమ్ల (జలవిశ్లేషణ) తో నిండి ఉన్న త్వచయుత కణాంగాన్ని పేర్కొనండి.
జవాబు:
లైసోసోమ్.

ప్రశ్న 4.
వాయురిక్తికలు అంటే ఏమిటి? వాటి విధులు ఏమిటి?
జవాబు:
సైనో బ్యాక్టీరియా కణాలలోని రిక్తికలు నిజకేంద్రక కణాలలోవలె టోన్స్ట్ పొర వుండదు, దీనిలో వాయువు వుంటుంది. అందుచే దీనిని వాయురిక్తికలు అంటారు.

విధులు :

  1. ఈ రిక్తికలు జీవ రసాయన చర్యలవలన కణాలలో ఏర్పడిన వాయువులను నిల్వచేయబడి వుంటాయి.,
  2. అధిక కాంతి తీక్షతనలో ఇవి బద్ధలై అదృశ్యమవుతాయి. అలాగే కాంతి తీక్షతనుపట్టి రిక్తికల సాయంతో ఇవి తమ స్థానాన్ని మార్చుతాయి.

ప్రశ్న 5.
పాలీసోమ్ల విధులు ఏమిటి?
జవాబు:
అనేక రైబోసోమ్లు ఒకే రాయబారి RNA పోచకు అతుక్కుని గొలుసు వలె కనిపిస్తాయి. వీటిని పాలిరైబోసోమ్లు లేదా పాలిసోమ్లు అంటారు. వీటిలోని రైబోసోమ్లు రాయబారి RNA లోని సమాచారాన్ని ప్రోటీన్లుగా అనువదిస్తాయి.

AP Inter 1st Year Botany Study Material Chapter 9 కణం: జీవప్రమాణం

ప్రశ్న 6.
మోటాసెంట్రిక్ క్రోమోసోమ్ యొక్క లక్షణం ఏమిటి?
జవాబు:
మెటాసెంట్రిక్ క్రోమోసోమ్లో మధ్యలో సెంట్రోమియర్ ఉంటుంది. దీనివల్ల 2 బాహువులు సమానంగా ఉంటాయి. చలనదశలో ఇవి ‘V’ ఆకారంలో కనిపిస్తాయి.

ప్రశ్న 7.
శాటిలైట్ క్రోమోసోమ్ అంటే ఏమిటి?
జవాబు:
కొన్ని క్రోమోసోమ్లు అభిరంజకాన్ని గ్రహించని ద్వితీయ కుంచనాలను సుస్థిర స్థానాలలో చూపిస్తాయి. దీనివల్ల క్రోమోసోమ్లో ఒక చిన్న ఖండికలాంటి భాగం కనిపిస్తుంది. దీన్ని శాటిలైట్ అంటారు. శాటిలైట్ ఉన్న క్రోమోసోమ్ను శాటిలైట్ క్రోమోసోమ్ అంటారు.

ప్రశ్న 8.
సూక్ష్మదేహాలంటే ఏవి? వాటిలో ఉన్న పదార్థాలేమిటి?
జవాబు:
పెరాక్సీసోమ్లు మరియు గ్లైఆక్సీసోమ్లను సూక్ష్మదేహాలు అంటారు. పెరాక్సీసోమ్లు ఫాస్ఫోలిపిడ్ల సంశ్లేషణలోను, కాంతి శ్వాసక్రియలోను పాల్గొంటాయి. గ్లె ఆక్సీసోమ్లు క్రొవ్వు సంమృద్ధిగా గల అంకురించే విత్తనాలలో ఉంటాయి. వీటిలో ఉన్న లిపిడ్లను కార్భోహైడ్రేటులుగా మార్చే గ్లైఆక్సీలేట్ వలయానికి చెందిన ఎంజైమ్లు ఉంటాయి.

ప్రశ్న 9.
మధ్యపటలిక దేనితో ఏర్పడి ఉంటుంది ? దాని విధులు ఏ విధంగా ముఖ్యమైనవి?
జవాబు:
మధ్యపటలిక ముఖ్యంగా కాల్షియం పెక్టేట్తో నిర్మితమై, ప్రక్కనున్న కణాలను బంధించి ఉంచుతుంది. ఇది కణవిభజన సమయంలో ఏర్పడిన కణఫలకం నుంచి తయారవుతుంది. కణకవచం, మధ్యపటలిక ద్వారా కణద్రవ్య బంధాలు కణకణానికి వ్యాపించి పొరుగున ఉన్న కణాల కణద్రవ్య పదార్థాలతో సంబంధాన్ని ఏర్పరుస్తాయి.

ప్రశ్న 10.
ద్రవాభిసరణ అంటే ఏమిటి?
జవాబు:
అయానులు లేక నీటి అణువులు అల్పగాఢతకల ప్రదేశం నుండి అధిక గాఢత కల ప్రదేశంలోనికి పారగమ్య త్వచం ద్వారా చలించుటను ద్రవాభిసరణ అంటారు.

ప్రశ్న 11.
గ్రామ్ అభిరంజన పద్ధతికి బాక్టీరియమ్ కణంలోని ఏ భాగం గురి అవుతుంది? [Mar. ’14]
జవాబు:
కణ ఆచ్ఛాదనలోని రసాయన నిర్మాణంలో గల భిన్నత్వం.

AP Inter 1st Year Botany Study Material Chapter 9 కణం: జీవప్రమాణం

ప్రశ్న 12.
ఈ కింది వాటిలో ఏవి సరైనవి కావు?
a) రాబర్ట్ బ్రౌన్ కణాన్ని కనుక్కొన్నారు,
b) ప్లీడన్, ష్వాన్ కణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు,
c) కొత్త కణాలు అంతకుముందు ఉన్న కణాల నుంచి ఏర్పడతాయని నిర్షా వివరించారు.
d) ఏకకణజీవి జీవ చర్యలన్నింటిని కణంలోపలే నిర్వహిస్తుంది.
జవాబు:
a) కాదు. కణమును కనుగొన్న వారు రాబర్ట్ హుక్.
b) సరైనది
c) సరైనది
d) సరైనది

ప్రశ్న 13.
కొత్త కణాలు దీని నుంచి ఉత్పత్తి అవుతాయి.
a) బాక్టీరియల్ కిణ్వనం
b) పాత కణాల పునరుత్పత్తి
c) అంతకుముందు ఉన్న కణాలు (pre-existing cells) d) నిర్జీవ పదార్థాలు.
జవాబు:
c) సరి అయినది.

ప్రశ్న 14.
కింది వాటిని జతపరచండి.
a) క్రిస్టే i) ఆవర్ణికలోని చదునైన త్వచయుత కోశాలు
b) సిస్టిర్నే ii) మైటోకాండ్రియాలోని అతర్వలనాలు
c) థైలకాయిడ్లు iii) గాల్జీ పరికరంలోని బిళ్లల వంటి కోశాలు
జవాబు:
a) క్రిస్టే – మైటో కాండ్రియాలోని అంతర్వలనాలు
b) సిస్టర్నే – గాల్జి పరికరంలోని బిళ్ళల వంటి కోశాలు
c) థైలకాయిడ్లు – అవర్ణికలోని చదునైన త్వచయుతాకేశాలు.

ప్రశ్న 15.
ఈ కింది వానిలో సరియైనది
a) జీవరాశుల కణాలన్నింటిలో కేంద్రకం ఉంటుంది.
b) వృక్ష, జంతు కణాలు రెండింటిలో స్పష్టమైన కణకవచం ఉంటుంది.
c) కేంద్రక పూర్వ జీవులలో త్వచంతో ఆవరించబడిన కణాంగాలు ఉండవు.
d) నిర్జీవ పదార్థాల నుంచి (denovo) నవజాతంగా కణాలు ఏర్పడతాయి.
జవాబు:
c సరిఅయినది.

స్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
పత్రహరితాన్ని కలిగిన కణాంగాన్ని వర్ణించండి.
జవాబు:
పత్రహరితాన్ని కలిగిన కణాంగము హరితరేణువు. హరితరేణువులు అత్యధిక సంఖ్యలో పత్రం యొక్క పత్రాంతర కణజాలంలో కనిపిస్తాయి. ఇవి కటకాకారం లేదా అండాకారంలో ఉంటాయి. వీటి పరిమాణం 5-10 µm పొడవు, 2-4 µm వెడల్పు ఉంటుంది.
AP Inter 1st Year Botany Study Material Chapter 9 కణం జీవప్రమాణం 1

హరితరేణువులు రెండు పొరలచే ఆవరింపబడి ఉంటాయి. లోపలి పొరచేత ఆవరింపబడి ఉన్న అంతరప్రదేశాన్ని ఆవర్ణిక అంటారు. అనేక చదునైన త్వచయుత కోశాలు ఆవర్ణికలో కలిగి ఉంటాయి. వీటిని థైలకాయిడ్లు అంటారు. థైలకాయిడ్లు నాళాల రూపంలో ఒకదానిపై మరొకటి దొంతరలవలే అమరి ఉంటాయి. వీటిని (గానా) థైలకాయిడ్లు అంటారు. వీటితోపాటు అనేక చదునైన త్వచయుత నాళికలు ఆవర్ణికలో ఉన్న పటలికారాశులను కలుపుతూ ఉంటాయి. వీటిని పటలికలు అంటారు. థైలకాయిడ్లు లోపలి ప్రదేశాన్ని అవకాశిక అంటారు. హరితరేణువు ఆవర్ణికలో కార్బొహైడ్రేట్లు, ప్రోటీన్ల సంశ్లేషణకు కావలిసిన ఎంజైమ్లు ఉంటాయి. థైలకాయిడ్లలో కిరణ జన్య సంశ్లేషణ వర్ణ ద్రవ్యాలు ఉంటాయి.

AP Inter 1st Year Botany Study Material Chapter 9 కణం: జీవప్రమాణం

ప్రశ్న 2.
కణ శక్త్యాగారాల నిర్మాణం, విధులను వివరించండి.
జవాబు:
AP Inter 1st Year Botany Study Material Chapter 9 కణం జీవప్రమాణం 2
మైటోకాండ్రియాను కణశక్త్యాగారాల కణాంగముగా పేర్కొంటారు. మైటోకాండ్రియా దండాకారంలో, 0-2-1.0 µm వ్యాసం, 1.0-4.1 µm పొడవుగల చిన్న గొట్టాలుగా లేక స్థూపాలుగా కనిపిస్తాయి. ప్రతి మైటోకాండ్రియా చుట్టూ రెండు పొరలు ఆవరించి ఉంటాయి. లోపలిపొర లోపలికి ముడతలును ఏర్పరుస్తుంది. వీటిని క్రిస్టే అంటారు. లోపలిపొరలోపల ప్రదేశాన్ని మాత్రిక అంటారు. మాత్రికలో శ్వాసక్రియకు సంబంధించిన ఎంజైమ్లు ఉంటాయి. క్రిస్టేలో శ్వాసక్రియ ఎలక్ట్రాన్ రవాణా సంక్లిష్టాలు ఉంటాయి. మైటోకాండ్రియాలు వాయు సహితి శ్వాసక్రియ జరిపి ATP రూపంలో కణశక్తి ఉత్పత్తి చేస్తాయి. కావున వీటిని కణశాక్త్యాగారాలు అంటారు. మాత్రికలు ఒక వృత్తాకార DNA అణువు, 70 S రైబోసోమ్లు ఉంటాయి.

విధులు :

  1. మైటోకాండ్రియాలో కణ వాయు సహితి శ్వాసక్రియ జరుగుతుంది. కావున దీనిని కణశక్తిగారాలుగా పేర్కొంటారు.
  2. మైటోకాండ్రియాలో వృత్తాకార DNA అణువు 70S రైబోసోమ్లు ఉండటంవల్ల వాటికి కావలిసిన ప్రొటీన్లను స్వయంగా సంశ్లేషణ చేసుకుంటాయి. కావున దీనిని స్వయం ప్రతిపత్తి కలిగిన కణాంగముగా పేర్కొంటారు.

ప్రశ్న 3.
సెంట్రియోల్ యొక్క బండిచక్రం నిర్మాణంపై వ్యాఖ్యానించండి.
జవాబు:
సెంట్రోసోమ్ అనే కణాంగము సాధారణంగా సెంట్రియోల్లు అనే రెండు స్థూపాకార నిర్మాణాలను చూపిస్తుంది. ఇవి రూపరహిత పెరిసెంట్రియోలార్ పదార్థాలతో ఆవరించి ఉంటాయి. సెంట్రోసోమ్లోని సెంట్రియోల్లు ఒకదానికి మరొకటి లంబంగా అమర్చబడి ప్రతిదానిలో బండి చక్రంలాంటి నిర్మాణాన్ని కలిగి ఉంటుంది. సెంట్రియోల్లో తొమ్మిది సమదూరంకల ట్యూబ్యులిన్చే నిర్మించబడిన పరిధీయ పోచలు ఉంటాయి. ప్రతి పరిధీయ పోచలో 3 సూక్ష్మ నాళికలు ఉంటాయి. ప్రక్క ప్రక్కనున్న పరిధీయ పోచలు త్రికాలు కలుపబడి ఉంటాయి. సెంట్రియోల్ కేంద్రభాగము ప్రోటీను పదార్థం నిర్మితమై హబ్ (Hub) గా పిలవబడుతుంది. హబ్ భాగము ప్రోటీనాయుతమైన వ్యాసార్ధ పోచలతో పరిధీయంగా ఉన్న ట్రిప్లెట్ పోచలకు కలపబడి ఉంటుంది. సెంట్రియోల్లు శైలికలు లేదా కశాభాలను, కండెపోగులను ఉత్పత్తి చేసే ఆధారకణికలుగా పనిచేస్తాయి. కణవిభజన సమయంలో జంతుకణాలు కండెపోగుల నుంచి కండె పరికరమును ఉత్పత్తి చేస్తాయి.

AP Inter 1st Year Botany Study Material Chapter 9 కణం: జీవప్రమాణం

ప్రశ్న 4.
కణసిద్ధాంతంను సంగ్రహంగా వర్ణించండి.
జవాబు:
వృక్ష, జంతు శరీరాలు కణాలు, కణ ఉత్పత్తులతో ఏర్పడి ఉంటాయనే పరికల్పనని ష్వాన్ ప్రతిపాదించారు. ప్లీడన్ అను జర్మన్ శాస్త్రవేత్త పెద్ద సంఖ్యలో మొక్కలను పరిశీలించి, మొక్కలన్ని వివిధ రకాల కణాలతో ఏర్పడి ఉన్న కణజాలాలతో నిర్మింపబడి ఉంటాయని గుర్తించారు. ప్లీడన్, ష్వాన్లు సంయుక్తంగా కణ సిద్ధాంతంను ప్రతిపాదించారు. కాని ఈ సిద్ధాంతము కొత్త కణాలు ఎలా పుడతాయనే అంశాన్ని వివరించలేదు. 1855లో రుడాల్ఫ్ విర్షా కొత్త కణాలు అంతకు పూర్వము ఉన్న కణాల నుంచి విభజనవల్ల ఏర్పడతాయని వివరించారు. దీనిని ‘ఆమ్నిస్ సెల్లులా-ఇ-సెల్లులా’ అంటారు. ఈయన ప్లీడన్, ష్వాన్ల పరికల్పనకి రూపాంతరం చేసి కణసిద్ధాంతానికి పరిపూర్ణతను కల్పించారు. ప్రస్తుతం కణసిద్ధాంతము అనగా జీవులన్నీ కణాలు, కణ ఉత్పత్తులతో ఏర్పడి ఉంటాయి. అన్ని కణాలు పూర్వమున్న కణాల నుంచి పుడతాయి.

ప్రశ్న 5.
గరుకు అంతర్జీవ ద్రవ్యజాలం (RER) నునుపు అంతర్జీవ ద్రవ్యజాలం (SER) ల మధ్యగల భేదాల్ని తెలపండి.
జవాబు:

గరుకు అంతర్జీవ ద్రవ్య జాలమునునుపు అంతర్జీవ ద్రవ్య జాలము
1) అంతర్జీవ ద్రవ్యజాలం ఉపరితలంపై రైబోసోమ్లు ఉంటాయి.1) అంతర్జీవ ద్రవ్యజాలం ఉపరితలంపై రైబోసోమ్లు ఉండవు.
2) ఇది సిస్టర్నేలను కల్గి ఉంటుంది.2) ఇది నాళికలను కల్గి ఉంటుంది.
3) ఇది కేంద్రక త్వచంను అంటిపెట్టుకొని ఉంటుంది.3) ఇది ప్లాస్మా పొరను అంటి పెట్టుకొని ఉంటుంది.
4) ఇది ప్రోటీనుల సంశ్లేషణలో పాల్గొంటుంది.4) ఇది లిపిడ్ సంశ్లేషణలో పాల్గొంటుంది.

ప్రశ్న 6.
ప్లాస్మాపొర జీవ రసాయనిక నిర్మాణాన్ని తెలపండి. పొర లోపల లిపిడ్ అణువుల అమరిక ఎలా ఉంటుంది?
జవాబు:
ప్లాస్మా పొర రెండు వరుసల లిపిడ్ అణువులతో ఏర్పడి ఉంటుంది. పొరలోపలి లిపిడ్ అణువుల ధృవ శీర్షాలు వెలుపలి వైపునకు, అధృవ తోకలు లోపలివైపునకు అమర్చబడి ఉంటాయి. ఈ అమరిక వల్ల సంతృప్త హైడ్రోకార్బన్ తోకలు జల వాతావరణం నుంచి రక్షింపబడతాయి. పొరలోని లిపిడ్ పదార్థము ముఖ్యంగా ఫాస్ఫోలిపిడ్లను కలిగి ఉంటుంది. తరువాత జరిగిన జీవరసాయన పరిశోధనలు కణపొరలో ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్లు కూడా ఉంటాయని స్పష్టంగా తెలిపాయి. త్వచప్రోటీన్లను, వాటి స్థానంను బట్టి అంతర్గత ప్రోటీనులు, పరిధీయ ప్రోటీన్లుగా వర్గీకరిస్తారు. పరిధీయ ప్రోటీన్లు త్వచ ఉపరితల భాగాలలో ఉంటే, అంతర్గత ప్రోటీన్లు త్వచంలో పాక్షికంగా లేక సంపూర్ణంగా దిగబడి ఉంటాయి.

కణత్వచ నమూనాను 1972లో సింగర్ మరియు నికల్సన్లు ప్రతిపాదించారు. దీనిని ఫ్లూయిడ్, మొజాయిక్ నమూనా అంటారు. దీని ప్రకారం అర్ధద్రవస్థితిలో ఉన్న లిపిడ్ పొర ప్రోటీను అణువుల పార్శ్వ కదలికలకు వీలు కల్పిస్తుంది.

ప్రశ్న 7.
కేంద్రకం నిర్మాణాన్ని వివరించండి.
జవాబు:
AP Inter 1st Year Botany Study Material Chapter 9 కణం జీవప్రమాణం 3
కేంద్రకం :
దీనిని ప్రధాన కణాంగము / కణమేధస్సు అంటారు. దీనిని రాబర్ట్ బ్రౌన్ కనుగొన్నారు. అంతర్థశ కేంద్రకంలో క్రోమాటిన్ అనే న్యూక్లియో ప్రోటీనులు, కేంద్రకమాత్రిక, గోళాకారంలో ఉన్న కేంద్రకాంశాలు ఉంటాయి. కేంద్రకంలోని పదార్థాలను కణద్రవ్యం నుంచి వేరుచేస్తూ రెండు పొరలు ఆచ్ఛాదనగా ఉంటాయి. ఈ పొరల మధ్య ప్రదేశాన్ని పరిన్యూక్లియార్ ప్రదేశము అంటారు. వెలుపలి పొర అంతర్జీవ ద్రవ్యజాలంతో అనుసంధానం చెంది, ఉపరితలంపై రైబోసోమ్లను గల్గి’ ఉంటుంది. కేంద్రక తొడుగులో రెండు పొరలు కలుసుకోవడం వల్ల సూక్ష్మరంధ్రాలు ఏర్పడతాయి. వీటిద్వారా RNA మరియు ప్రోటీను అణువులు కేంద్రకం మరియు కణద్రవ్యాల మధ్య ద్విదిశాపధంలో చలనం చెందుతాయి.

కేంద్రకంలోని ద్రవపదార్థంలో కేంద్రకాంశం, క్రోమాటిన్ ఉంటాయి. కేంద్రకాంశం కేంద్రకరసంలో కలిసిపోయి ఉంటుంది. కేంద్రకాంశం రైజోసోమల్ RNA చురుకుగా సంశ్లేషణ జరిపే ప్రదేశాలు. అంతర్ధశ కేంద్రకంలో క్రోమాటిన్ అనే వదులైన అస్పష్టంగా కనిపించే న్యూక్లియో ప్రోటీను పొగులతో ఏర్పడిన వలవంటి నిర్మాణం ఉంటుంది. కాని కణ విభజన సమయంలో క్రోమాటిన్ అనేది క్రోమోసోమ్లుగా మారతాయి. క్రోమాటిన్ DNA హిస్టోనులు, కొన్ని నాన్ హిస్టోన్లు, RNA లను కలిగి ఉంటాయి.

ప్రశ్న 8.
సెంట్రోమియర్ స్థానాన్ని ఆధారంగా క్రోమోసోమ్ల రకాలను గురించి క్లుప్తంగా వ్రాయండి.
జవాబు:
ప్రతి క్రోమోసోమ్లో సంట్రోమియర్ ఉంటుంది. క్రోమోసోమ్లో గుర్తించారు. అవి. సెంట్రోమియర్ స్థానాన్ని 4 రకాల క్రోమోసోమ్లను

1) మెటాసెంట్రిక్ :
సెంట్రోమియర్ / క్రోమోసోమ్ మధ్యస్థానంలో ఉండి రెండు వైపులా బాహువులు సమానంగా ఉంటాయి. చలన దశలో ఈ క్రోమోసోమ్లు ‘V’ ఆకారంలో కనిపిస్తాయి.

2) సబ్ మెటాసెంట్రిక్ :
సెంట్రోమియర్ / క్రోమోసోమ్ మధ్య స్థానంలో కాకుండా కొంచెం పక్కగా ఉంటుంది. బాహువులు అసమానంగా ఉంటాయి. చలనదశలో ఈ క్రోమోసోమ్లు ‘L’ ఆకారంలో కనిపిస్తాయి.

3) ఎక్రోసెంట్రిక్ :
సెంట్రోమియర్ ఒక వైపుగా ఏర్పడి ఉంటుంది. ఒక బాహువు పొడవుగా, మరొకటి పొట్టిగా ఉంటాయి. చలనదశలో ఈ క్రోమోసోమ్లు ” ఆకారంలో కనిపిస్తాయి.

4) టిలోసెంట్రిక్ :
సెంట్రోమియర్ క్రోమోసోమ్ బాహువు కోనలో ఉంటుంది. దీనివల్ల ఒకే బహువు ఉంటుంది. ఈ క్రోమోసోమ్లు చలనదశలో ‘” (పుడక) ఆకారంలో కనిపిస్తాయి.
AP Inter 1st Year Botany Study Material Chapter 9 కణం జీవప్రమాణం 4

ప్రశ్న 9.
కణ అస్థిపంజరం అనగానేమి? అది చేసే పనులేమిటి?
జవాబు:
కణద్రవ్యంలో ప్రోటీనులతో నిర్మితమైన, తంతురూప, విస్తారమైన వలలాంటి ఆకారాలను సమిష్టిగా కణఅస్థి పంజరము అంటారు. ఇది నిజకేంద్రక జీవులలో మూడు ప్రధాన అంశాలను చూపుతుంది. అవి సూక్ష్మ తంతువులు, మధ్యస్థ తంతువులు, సూక్ష్మనాళికలు. ఇది యాంత్రిక ఆధారము, కణరూపాన్ని నిలపటం, కణచలనము, కణాంతర్గత రవాణా, కణం వెలుపలికి సంకేతాలు పంపడం, కేంద్రక విభజన వంటి విధులలో పాల్గొంటుంది.

AP Inter 1st Year Botany Study Material Chapter 9 కణం: జీవప్రమాణం

ప్రశ్న 10.
అంతరత్వచ వ్యవస్థ అనగానేమి? ఏ కణాంగాలు దీనిలో భాగం కాదు? ఎందుకు?
జవాబు:
కణంలో కనిపించే వివిధ త్వచయుత కణాంగాలు నిర్మాణంలో విధులలో విస్పష్టంగా ఉన్నప్పటికీ వాటిలో జరిగే జీవక్రియల మధ్య అనుసంధానం కనిపిస్తుంది. కావున వీటిని అన్నింటిని కలిపి అంతరత్వచ వ్యవస్థగా గుర్తిస్తారు.

మైటోకాండ్రియా, హరితరేణువు, పెరాక్సిసోమ్లు, వీటిలో భాగము కావు. ఇవి అంతర్జీవద్రవ్యజాలం, గాల్జి సంక్లిష్టం, లైసోజోమ్లతో సంబంధం చూపవు.

ప్రశ్న 11.
సక్రియ రవాణా మరియు నిష్క్రియా రవాణాల మధ్య తేడాను గుర్తించండి.
జవాబు:

సక్రియ రవాణానిష్క్రియా రవాణా
1) అయానులు లేదా అణువులు ప్లాస్మాపొర ద్వారా జీవక్రియా శక్తిని ఉపయోగించుకుని రవాణా అగు ప్రక్రియ.1) అయానులు లేదా అణువులు ప్లాస్మాపొర ద్వారా జీవక్రియా శక్తి ప్రమేయం లేకుండా రవాణా అగు ప్రక్రియ.
2) ఇది గాఢతా ప్రవణతకు వ్యతిరేకంగా జరుగుతుంది.
ఉదా : సోడియం పంప్ ద్వారా కణాలు లవణాలను గ్రహిస్తాయి.
2) ఇది గాఢతా ప్రవణతకు అనుకూలంగా జరుగుతుంది.
ఉదా : కణాలలోనికి నీరు విసరణ ప్రక్రియ ద్వారా చేరుట.

ప్రశ్న 12.
న్యూక్లియోసోమ్లు అంటే ఏమిటి ? అవి దేనితో చేయబడతాయి? [Mar. ’14]
జవాబు:
ఎలక్ట్రాన్ సూక్ష్మదర్శినిలో చూసినపుడు క్రొమాటిన్ పూసలు గుచ్చిన దారపు పోగువలె కనిపిస్తాయి. ఈ పూసలవంటి భాగాలను న్యూక్లియోసోమ్లు అంటారు. న్యూక్లియోసోమ్లో 200 క్షార జతల పొడవున్న ద్విసర్పిల DNA అణువు కోర్ను చుట్టి ఉంటుంది. కోర్ భాగము 8 హిస్టోన్ అణువులతో ఏర్పడి ఉంటుంది. అవి H2A, H2B, H3, H4. ఇవి ఒక్కొక్కటి రెండు నకళ్ళుగా ఉంటాయి. H1 హిస్టోన్ అణువు న్యూక్లియోసోమ్ కోర్ వెలుపల, DNA కోర్లోనికి ప్రవేశించేచోట, నిష్క్రమించే చోట DNA రెండు చుట్లను కోర్కు అతికిస్తుంది. రెండు అనుక్రామిక న్యూక్లియోసోమ్ల మధ్యన కొనసాగివున్న
DNA ను లింకర్ DNA అంటారు.

ప్రశ్న 13.
రెండు త్వచాలతో ఆవరించబడి ఉన్న రెండు కణాంగాలను తెలపండి. వీటి లక్షణాలు ఏమి? వాటి విధులను తెలిపి వాటి పటాలను గీసి భాగాల్ని గుర్తించండి.
జవాబు:
మైటోకాండ్రియా, హరితరేణువు :
మైటోకాండ్రియాలు దండాకారంలో లేక స్థూపాలులాగా ఉంటాయి. ఇవి 0.2 – 1.0 µm వ్యాసం, 1.0 – 4.1 µm పొడవులో ఉంటాయి. దీనికి ఉన్న రెండు పొరలలో వెలుపలి పొరను నునుపుగాను, లోపలిపొర లోపలి వైపుకు ముడతలను ఏర్పరుస్తుంది. వీటిని క్రిస్టే అంటారు. మైటోకాండ్రియాలు వాయు సహిత శ్వాసక్రియ జరిగే ప్రదేశాలు. వీటిని కణశక్త్యాగారాలు అంటారు.
AP Inter 1st Year Botany Study Material Chapter 9 కణం జీవప్రమాణం 5

హరితరేణువులు అండాకారం, గోళాకారం లేక రిబ్బన్ ఆకారంలో ఉంటాయి. ఇది 5 – 10 µm పొడవు, 2- 4 µm వెడల్పు కలిగి ఉంటాయి. హరితరేణువు యొక్క అవర్ణికలో కార్బోహైడ్రేటులు, ప్రోటీనులు సంశ్లేషణకు అవసరమయిన అనేక ఎంజైమ్లు ఉంటాయి.

ప్రశ్న 14.
కేంద్రక పూర్వకణం యొక్క లక్షణాలు తెలపండి.
జవాబు:

  1. కేంద్రక త్వచము ఉండదు. కణం మధ్యలో ఒకే ఒక వలయాకార, నగ్న DNA ఉంటుంది. దీనిని న్యూక్లియాయిడ్ అంటారు.
  2. కేంద్రకాంశం ఉండదు.
  3. అంతర త్వచ వ్యవస్థ ఉండదు.
  4. మైటోకాండ్రియా, ప్లాస్టిడ్లు, లైసోజోమ్లు, పెరాక్సిజోమ్లు, కణ అస్థిపంజరము ఉండవు.
  5. 70 S రకానికి చెందిన రైబోజోమ్లు ఉంటాయి.
  6. కణ కవచము పాలీశాఖరైడ్లు, లిపిడ్లు, ప్రోటీనులతో నిర్మితమై ఉంటుంది.
  7. శ్వాసక్రియా ఎంజైమ్లు కణత్వచంలో ఉంటాయి.
  8. కణాలు ద్విధావిచ్చిత్తి ద్వారా సాధారణ అలైంగిక ప్రత్యుత్పత్తి జరుపుకుంటాయి.

ప్రశ్న 15.
కణసిద్ధాంతాన్ని ప్రతిపాదించడంలో ఈ కింది శాస్త్రజ్ఞుల పాత్ర గురించి సంగ్రహంగా వివరించండి.
a) రుడాల్ఫ్ విర్షా b) ప్లీడన్, ష్వాన్
జవాబు:
a) రుడాల్ఫ్ విర్షా :
1855 లో ఈయన కొత్త కణాలు అంతకు పూర్వము ఉన్న కణాల నుంచి విభజన వల్ల ఏర్పడతాయని వివరించారు. దీనిని “ఆమ్నిస్ సెల్లులా -ఇ-సెల్లులా” అంటారు. ఈయన ప్లీడన్ మరియు ష్వాన్ల పరికల్పనకు రూపాంతరం చేసి కణ సిద్ధాంతానికి పరిపూర్ణత కల్పించారు. దీని ప్రకారము జీవులన్ని కణాలు, కణ ఉత్పత్తులతో ఏర్పడి ఉంటాయి. అన్ని కణాలు పూర్వమున్న కణాల నుంచి పుడతాయి.

b) ప్లీడన్ మరియు ష్వాన్ :
1838 లో ప్లీడన్ అను జర్మన్ వృక్షశాస్త్రవేత్త ఎక్కువ సంఖ్యలో మొక్కలను పరిశీలించి మొక్కలన్ని వివిధ రకాల కణాలతో ఏర్పడి వున్న కణజాలాలతో నిర్మింపబడి ఉంటాయని గుర్తించారు. థియోడార్ ష్వాన్ అను బ్రిటిష్ జంతుశాస్త్రవేత్త వివిధ రకాల జంతుకణాలను అధ్యయనంచేసి, కణాలు పలుచని పొరతో కప్పబడి ఉంటాయని కనుగొన్నారు. దానిని ఇప్పుడు ప్లాస్మాపొర అని అంటున్నారు. ఆయన వృక్షకణాలపై చేసిన పరిశోధనల ఆధారంగా కణకవచం ఉండుట.

వృక్ష కణాల ప్రత్యేక లక్షణంగా నిర్ధారించారు. ఈ పరిజ్ఞానం ఆధారంగా, ష్వాన్ వృక్ష, జంతు శరీర కణాలు, కణ ఉత్పత్తులతో ఏర్పడి ఉంటాయి అనే పరికల్పనను ప్రతిపాదించారు.

దీర్ఘ సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
ఒక కణం సజీవకణంగా పిలువబడడానికి దానిలో ఏ నిర్మాణాత్మక, క్రియాత్మక గుణాలు ఉండాలి?
జవాబు:
అన్ని వృక్ష, జంతు శరీరాలు కణాలు, వాటి ఉత్పత్తులతో తయారయి ఉంటాయి. కణము జీవి యొక్క మౌళికమైన నిర్మాణాత్మక మరియు క్రియాత్మక ప్రమాణము ప్రతి కణంలో వివిధ రకాల కణాంగాలు వివిధ రకాల చర్యలను జరుపుతుంటాయి.

  1. కణాలు శక్తి సూత్రాలు అనుసరిస్తాయి అనగా శక్తిని రవాణా చేస్తాయి.
  2. కణాలు బహిర్గత లక్షణాలు కల నిర్మాణాలు.
  3. కణాలు పరిణామ క్రమ ఉత్పత్తిని కల్గి ఉంటాయి.
  4. కణాలులో జీవక్రియా మార్గాలు, పోషకాల వినిమయము, వాతావరణానికి అనువుగా మారడంవంటి లక్షణాలు ఉంటాయి.
  5. కణాలు స్వయం ప్రతికృతి చెందే కేంద్రకామ్లాలను కల్గిఉంటాయి.
  6. కణద్రవాభిసరణక్రమ చర్యలను నియంత్రించే రిక్తికలను కల్గిఉంటాయి.
  7. కణములు వార్తా ప్రసార వ్యవస్థను కల్గి ఉంటాయి.
  8. కణాలు కదలికలు చూపుతాయి.
  9. కణాలు పెరుగుతాయి. విభజన చెందుతాయి.
  10. కణాలు చనిపోతాయి.

AP Inter 1st Year Botany Study Material Chapter 9 కణం: జీవప్రమాణం

ప్రశ్న 2.
నిజకేంద్రక కణాలలోని కణాంగాలు
a) త్వచంలో చుట్టబడి ఉండవు
c) రెండు త్వచాలతో చుట్టబడి ఉంటాయి.
b) ఒకే త్వచంతో చుట్టబడి ఉంటాయి
కణంలోని విభిన్న కణాంగాలను పై మూడు వర్గములలో చేర్చండి.
జవాబు:
a) కేంద్రకాంశము
b) లైసోజోమ్లు, రిక్తికలు
c) మైటోకాండ్రియా, హరితరేణువు, కేంద్రకము

ప్రశ్న 3.
కేంద్రకం లోపలి జన్యు పదార్థం ప్రతి ఒక జాతికి స్థిరంగా ఉంటుంది. కాని, క్రోమోసోమేతర DNA జనాభాలోని విభిన్న జీవుల మధ్య వైవిధ్యంగా ఉంటుంది. వివరించండి.
జవాబు:
కేంద్రక పూర్వజీవులలో జీనోమిక్ DNA తో పాటు, కణద్రవ్యంలో జీనోమేతర DNA ముక్కలు ఉంటాయి. వాటిని ప్లాస్మిడ్లు అంటారు. ఇవి బాక్టీరియమ్లకు కొన్ని ప్రత్యేక దృశ్య రూపలక్షణాలను (సూక్ష్మజీవ నాశకాలకు నిరోదకత) ఆపాదిస్తాయి. ఇదీ బాక్టీరియంలలో బయటినుంచి వచ్చే DNA తో జన్యు పరివర్తన చర్యను కలుగచేయుటలో తోడ్పడతాయి.

నిజకేంద్రక కణాలలో జీనోమేతర DNA లు హరితరేణువు అవర్ణికలోను, మైటోకాండ్రియా మాత్రికలోనూ ఉంటాయి. వీటివలన ఇవి పాక్షిక స్వయం ప్రతిపత్తికల కణాంగాలు అని అంటారు.

ప్రశ్న 4.
“మైటోకాండ్రియాలు కణశక్త్యాగారాలు” దీన్ని సమర్ధించండి?
జవాబు:
AP Inter 1st Year Botany Study Material Chapter 9 కణం జీవప్రమాణం 2
మైటోకాండ్రియాలు దండాకారంలో, 0.2 – 1.0 µm వ్యాసం, 1.0 – 4.1 µm పొడవుగల చిన్న గొట్టాలుగా లేక స్థూపాలుగా కనిపిస్తాయి. ప్రతిమైటోకాండ్రియా చుట్టూ రెండు పొరలు ఉంటాయి. బాహ్యపొర ఈ కణాంగానికి హద్దుగా ఉంటుంది. లోపలి పొర లోపలికి ముడతలను ఏర్పరుస్తుంది. వీటిని క్రిస్టే అంటారు. లోపలి పొరలోపల మాత్రిక ఉంటుంది. ఈ రెండు పొరలలో విశిష్ట ఎంజైమ్లు మైటోకాండ్రియాలో జరిగే ప్రత్యేక విధులకు సంబంధించి ఉంటాయి. మైటో కాండ్రియాలు వాయు సహిత శ్వాసక్రియ జరిపి ATP రూపంలో కణశక్తి ఉత్పత్తి చేస్తాయి. కావున వీటిని కణశక్త్యాగారాలు అంటారు. మాత్రికలో ఒక వృత్తాకార DNA అణువు, కొన్ని RNA అణువులు 70 S రైబోసోమ్లు, ప్రోటీనుల సంశ్లేషణకు కావలసిన అంశాలు ఉంటాయి.

ప్రశ్న 5.
జాతి విశిష్టమైన లేదా ప్రాంత విశిష్టమైన ప్లాస్టిడ్ రకాలున్నాయా? వీటిలో, ఒక దానిని మరొకదాని నుంచి గుర్తించడమెలా?
జవాబు:
ప్లాస్టిడ్లు జాతి విశిష్టము. ఇవి వృక్షజాతులన్నింటిలో యూగ్లినాయిడ్లలో ఉంటాయి. వీటిలో వున్న విశిష్ట వర్ణద్రవ్యాలవల్ల అవి ఉన్న వృక్ష భాగాలకు విశిష్టరంగులనిస్తాయి. లోపల ఉన్న వర్ణద్రవ్యాల ఆధారంగా ప్లాస్టిడ్లు 3 రకాలు. అవి శ్వేతరేణువులు, వర్ణ రేణువులు, హరిత రేణువులు.

1) శ్వేతరేణువులు :
ఇవి వర్ణ రహిత ప్లాస్టిడ్లు. ఇవి పోషకాలను నిల్వచేస్తాయి. నిల్వచేయు పోషకంను బట్టి 3 రకాలు. అవి “కార్బోహైడ్రేట్లను నిల్వచేస్తే అమైలోప్లాస్ట్లు అని, ప్రొటీనులను నిల్వచేస్తే అల్యురోప్లాస్ట్లు అని, నూనెలు, కొవ్వులను నిల్వచేస్తే ఇలియోప్లాస్ట్లు అని అంటారు. ఇవి మొక్క భూగర్భ భాగాలలో ఉంటాయి.

2) వర్ణరేణువులు :
కెరోటిన్, జాంథోఫిల్లు, కెరోటినాయిడ్ వర్ల ద్రవ్యాలను కలిగి ఉంటాయి. ఇవి మొక్కల బాగాలకు పసుపు, నారింజ లేదా ఎరుపు వర్ణంను కలుగచేస్తాయి.

3) హరితరేణువులు :
కిరణజన్య సంయోగ క్రియకు సంబంధించిన పత్రహరితం, కెరోటినాయిడ్ వర్ల ద్రవ్యాలు కాంతి వికిరణ శక్తిని గ్రహిస్తాయి. ప్రతి హరితరేణువు రెండు పొరలచే ఆవరించబడి ఉంటుంది. పొరల లోపల ఆవర్ణిక ఉంటుంది. దీనిలో చదునైన త్వచయుత కోశాలు ఉంటాయి. వీటిని థైలకాయిడ్లు అంటారు. ఇవి ఒక దానిపై మరొకటి నాణాల రూపంలో అమరి ఉంటాయి. వీటిని పటలికా రాశులు అంటారు. వీటితోపాటు ఆవర్ణికా పటలికలు ఉంటాయి. ఆవర్ణిక్లో కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు సంశ్లేషణకు కావలసిన ఎంజైమ్లు ఉంటాయి.

ప్రశ్న 6.
ఈ క్రింది వాని విధులను వివరించండి.
a) సెంట్రోమియర్ b) కణకవచం c) నునుపు అంతర్జీవ ద్రవ్యజాలం d) గాల్జీ పరికరం e) సెంట్రియోల్లు
జవాబు:
a) సెంట్రోమియర్ :
క్రోమోజోమ్ లోని వర్ణరహిత భాగంను సెంట్రోమియర్ అంటారు. క్రొమోసోంల విభజనకు అవసరము, సోదర క్రొమాటిడ్లను కలుపుతూ ఉంటుంది. సెంట్రోమియర్ ఇరువైపులా రెండు బిళ్ళల వంటి నిర్మాణాలు ఉంటాయి. వీటిని కైనిటోకోర్లు అంటారు. కణ విభజన సమయంలో కైనిటోకోర్లకు కండెతంతువులు అతుక్కుంటాయి.

b) కణకవచము :
కణం నకు ఒక నిర్దిష్ట ఆకారాన్ని ఇస్తుంది. కణంను మాత్రిక హని నుండి వ్యాధికారక సూక్ష్మ జీవుల నుండి రక్షిస్తుంది. ఇది ప్రక్క ప్రక్క కణాలను కలుపుతూ, అవాంఛనీయ అణువులకు అడ్డుగోడవలె పనిచేస్తుంది.

c) నునుపు అంతర్జీవ ద్రవ్యజాలము :
రైబోసోమ్లు లేని అంతర్జీవ ద్రవ్యజాలము. ఇది లిపిడ్ల సంశ్లేషణలోను, కార్బోహైడ్రేట్ల జీవ క్రియలోను, కాల్షియం గాఢతను సమతుల్యత చేయుటలో పాల్గొంటుంది. దీనిలో గ్లోకోసన్ను గ్లూకోస్ – 6 ఫాస్పేట్గా మార్చి గ్లూకోజ్ 6-ఫాస్పోట్రాన్స్ఫరేజ్ అను ఎంజైం ఉంటుంది.

d) గాల్జి సంక్లిష్టము :
గ్లైకోప్రోటీన్లు, గ్లైకోలిపిడ్లను ఉత్పత్తిచేసే ముఖ్య కేంద్రంగా ఉంటుంది. కవచ పదార్థాల తయారీకి, కణ విభజన సమయంలో కణఫలకం ఏర్పాటులోను పాల్గొంటుంది.

e) సెంట్రియోల్ :
శైలికలు లేదా కశాభాలను, కండె పోగులను ఉత్పత్తి చేసే ఆధారకణికలుగా పనిచేస్తాయి. కణవిభజన సమయంలో జంతుకణాలు కండెపోగుల నుంచి కండె పరికరంను ఉత్పత్తి చేస్తాయి.

ప్రశ్న 7.
విభిన్న రకాల ప్లాస్టిడ్లు ఒక రూపం నుంచి వేరొక రూపంలోకి మార్పు చెందగలవా? అయితే ఉదాహరణలతో వివరించండి.
జవాబు:
ప్లాస్టిడ్లు ఒకరూపం నుంచి వేరొక రూపానికి మార్పు చెందగలవు. మొక్కలలో సాధారణంగా శ్వేతరేణువులు, వర్ణరేణువులు, హరితరేణువులు అను మూడు ప్లాస్టిడ్లు ఉంటాయి. శ్వేత రేణువులు నిల్వకు, వర్ణరేణువులు ఆయా మొక్కల బాగాలకు రంగును ఇవ్వడానికి, హరితరేణువులు కిరణజన్యసంయోగ క్రియకు తోడ్పడతాయి. టమాటో ఎరుపులో ఉండుట అనేది లైకోపిన్ అను వర్ణద్రవ్యం వల్ల వస్తుంది. ఎరుపు శైవలాలలో ఫైకోసమనిన్, ఫైకోఎరిథ్రిన్ అను వర్ణద్రవ్యాలు ఉంటాయి. గోధుమ శైవలాల్లో ప్యూకోజాంథిన్ ఉంటుంది.

పరిస్థితులను బట్టి ఒక ప్లాస్టిడ్ వేరొకరకంగా మారుతుంది. ఉదా : 1) బంగాళదుంపలోని శ్వేత రేణువులను కాంతికి గురిచేసిన హరిత రేణువులుగా మారతాయి.

2) మిరపలో అండాశయంలోని కణాలు శ్వేతరేణువులను కల్గి ఉంటాయి. అండాశయం, ఫలంగా మారేటప్పుడు అవి హరితరేణువులు, వర్ణరేణువులుగా మారతాయి.

ప్రశ్న 8.
ఈ క్రిందివాటిని భాగాలు గుర్తించబడిన పటాల సహాయంతో వివరించండి?
1) కేంద్రకం 2) సెంట్రోసోమ్
జవాబు:
AP Inter 1st Year Botany Study Material Chapter 9 కణం జీవప్రమాణం 3
1) కేంద్రకం :
దీనిని ప్రధాన కణాంగము / కణ మేధస్సు అంటారు.

దీనిని రాబర్ట్ బ్రౌన్ కనుగొన్నారు. అంతర్థశ కేంద్రకంలో క్రొమాటిన్ అనే న్యూక్లియోప్రొటీనులు, కేంద్రకమాత్రిక, గోళాకారంలో ఉన్న కేంద్రకాంశాలు ఉంటాయి. కేంద్రకంలోని పదార్ధాలను కణద్రవ్యం నుంచి వేరుచేస్తూ రెండుపొరలు ఆచ్ఛాదనగా ఉంటాయి. ఈ పొరల మధ్య పరిన్యూక్లియార్ ప్రదేశము ఉంటుంది. వెలుపలిపొర అంతర్జీవ ద్రవ్యజాలంతో అనుసంధానం చెంది, ఉపరితలంపై రైబోసోమ్లను గల్గి ఉంటుంది. కేంద్రక తొడుగులో రెండు పొరలు కలుసుకోవడం వల్ల ఏర్పడిన సూక్ష్మరంధ్రాలు ఉంటాయి. వీటి ద్వారా RNA మరియు ప్రోటీను అణువులు కేంద్రకము మరియు కణద్రవ్యాల మధ్య ద్విదిశాపధంలో చలనం చెందుతాయి. కేంద్రక ద్రవ్యంలో కేంద్రకాంశం, క్రొమాటిన్ ఉంటాయి. కేంద్రకాంశాల చుట్టూ పొర ఉండదు. దీనిలోని పదార్ధము కేంద్రకంసంలో కలిసిపోయి ఉంటుంది. ఇవి రైబోసోమల్ RNA చురుకుగా సంశ్లేషణ జరిపే ప్రదేశాలు అంతర్ధశ కేంద్రకంలో క్రొమాటిన్ అనే వదులైన అస్పష్టంగా కనిపించే న్యూక్లియో ప్రోటీను పోగులతో ఏర్పడిన వల వంటి నిర్మాణం ఉంటాయి. కాని కణ విభజన సమయంలో క్రోమోసోమ్లుగా మారతాయి. క్రొమాటిన్లో DNA హిస్టోనులు, కొన్ని నాన్ హిస్టోన్లు, RNA ఉంటాయి.

2) సెంట్రోసోమ్ :
AP Inter 1st Year Botany Study Material Chapter 9 కణం జీవప్రమాణం 6
సెంట్రిసోమ్ అనే కణాంగము సాధారణంగా -సెంట్రియోల్లు అనే రెండు స్థూపాకార నిర్మాణాలను చూపిస్తుంది. ఇవి రూపరహిత పెరియోసెంట్రియోలార్ పదార్థాలతో ఆవరించి ఉంటాయి. సెంట్రోసోమ్లోని సెంట్రియోలు ఒకదానికి మరొకటి లంబంగా అమర్చబడి ప్రతిదానిలో బండిచక్రం లాంటి నిర్మాణాన్ని కలిగి ఉంటుంది. సెంట్రియోల్లో తొమ్మిది సమదూరంకల ట్యూబ్యులిన్చే నిర్మించబడిన పరిధీయ పోచలు ఉంటాయి. ప్రతి పరిధీయ పోచలో 3 సూక్ష్మ నాళికలు ఉంటాయి. ప్రక్క ప్రక్క నున్న పరిధీయ పోచలు త్రికాలు కలుపబడి ఉంటాయి. సెంట్రియోల్ కేంద్రభాగము ప్రోటీను పదార్థంచే నిర్మితమై హబ్ (Hub) గా పిలవబడుతుంది. హబ్ భాగము ప్రోటీనుయుతమైన వ్యాసార్ధ పోచలతో పరిధీయంగా ఉన్న ట్రిప్లెట్ పోచలకు కలపబడి ఉంటుంది. సెంట్రియోల్లు శైలికలు లేదా కశాభాలను, కండెపోగులను ఉత్పత్తి చేసే ఆధారకణికలుగా పనిచేస్తాయి. కణవిభజన సమయంలో జంతుకణాలు కండెపోగుల నుంచి కండె పరికరమును ఉత్పత్తి చేస్తాయి.

AP Inter 1st Year Botany Study Material Chapter 9 కణం: జీవప్రమాణం

ప్రశ్న 9.
సెంట్రోమియర్ అనగా నేమి? క్రోమోజోమ్ల వర్గీకరణలో సెంట్రోమియర్ స్థానం ఎలాంటి ప్రాధాన్యతను కలిగి ఉంటుంది. విభిన్న రకాల క్రోమోసోమ్లలో సెంట్రోమియర్ స్థానాలను చూపే పటం గీసి వివరించండి.
జవాబు:
ప్రతి క్రోమోసోమ్లో ప్రాథమిక కుంచనం లేక సెంట్రోమియర్ ఉంటుంది. దీనికి ఇరువైపులా రెండు బిళ్లల వంటి నిర్మాణాలు ఉంటాయి. వీటిని కైనిటోకోర్లు అంటారు. వీటికి కండెతంతువులు అతుక్కుని క్రొమోసోమ్ల విభజనకు సహాయపడతాయి. క్రోమోసోంలో సెంట్రోమియర్ స్థానాన్ని బట్టి 4 రకాల క్రోమోసోంలు గుర్తించారు. అవి :
1) మెటాసెంట్రిక్ :
సెంట్రోమియర్ క్రోమోసోమ్ మధ్యస్థానంలో ఉండి రెండు వైపులా బాహువులు సమానంగా ఉంటాయి. చలన దశలో ఈ క్రోమోసోమ్లు ‘V’ ఆకారంలో కనిపిస్తాయి.

2) సబ్మెటా సెంట్రిక్ :
సెంట్రోమియర్ క్రోమోసోమ్ మధ్య స్థానంలో కాకుండా కొంచెం పక్కగా ఉంటుంది. బాహువులు అసమానంగా ఉంటాయి. చలనదశలో ఈ క్రోమోసోమ్లు ‘L’ ఆకారంలో కనిపిస్తాయి.
AP Inter 1st Year Botany Study Material Chapter 9 కణం జీవప్రమాణం 4

3) ఎక్రోసెంట్రిక్ :
సెంట్రోమియర్ ఒక వైపుగా ఏర్పడి ఉంటుంది. ఒక బాహువు పొడవుగా, మరొకటి పొట్టిగా ఉంటాయి. చలనదశలో ఈ క్రోమోసోమ్లు ” ఆకారంలో కనిపిస్తాయి.

4) టీలోసెంట్రిక్ :
సెంట్రోమియర్ క్రోమోసోమ్ బాహువు కొనలో ఉంటుంది. దీనివల్ల ఒకే బాహువు ఉంటుంది. ఈ క్రోమోసోమ్లు చలనదశలో ” (పుడక) ఆకారంలో కనిపిస్తాయి.

Intext Question and Answers

ప్రశ్న 1.
కేంద్రక పూర్వకణంలోని మీసోసోమ్ అంటే ఏమిటి? అది నిర్వహించే విధులు ఏవి?
జవాబు:
ప్లాస్మా పొర కణంలోనికి అనేక చోట్ల వ్యాపనం చెందడం వల్ల కనిపించే త్వచయుత ఆకారాలను మీసోసోమ్లు అంటారు. ఇవి కోశికలు, నాళికలు, పటలికలు వలె కనిపిస్తాయి. అవి కణ కవచం ఏర్పడటానికి, DNA ప్రతికృతి చెందడానికి, పిల్ల కణాలకు DNA వితరణ చెందడానికి తోడ్పడతాయి. ఇవి శ్వాసక్రియలో, స్రావక క్రియలో ప్లాస్మాపొర ఉపరితల వైశాల్యాన్ని పెంచడం ద్వారా పోషకాల శోషణ క్రియలో, ఎంజైమ్ల పరిమాణం పెంచడంలో తోడ్పడతాయి.

ప్రశ్న 2.
తటస్థ అణువులు ప్లాస్మాత్వచం ద్వారా ఎలా చలిస్తాయి ? ధృవ అణువులు కూడా వాటివలెనే చలిస్తాయా? కానిచో అవి త్వచంలో ఏ పద్ధతిలో రవాణా చెందుతాయి?
జవాబు:
తటస్థ ద్రావితాలు కణ పొర ద్వారా సామాన్య విసరణ పద్ధతిలో గాఢతా ప్రవణతను అనుసరించి అంటే అధిక గాఢత నుంచి అల్ప గాఢత దిశలో ప్రయాణిస్తాయి. ధృవ ధర్మంగల అణువులు అధృవ స్వభావం ఉన్న ద్విపటలికాయుత లిపిడ్ పొర ద్వారా ప్రయాణించలేవు. కనుక వాటికి త్వచం గుండా రవాణా చెయ్యటానికి వాహక ప్రోటీన్ల సాయం కావాలి. కొద్ది అయానులు లేదా అణువులు వాహక ప్రోటీన్ల సహాయంతో వాటి గాఢతా ప్రవణతకు వ్యతిరేకదిశలో అంటే అల్పగాఢతనుంచి అధికగాఢతలవైపు త్వచం గుండా రవాణా చెందుతాయి.

ప్రశ్న 3.
రెండు త్వచాలచే ఆవరించబడిఉన్న రెండు కణాంగాలను తెలపండి. వాటి లక్షణాలు ఏవి? వాటి విధులను తెలిపి, వాటి భాగాలు గుర్తించిన పటాలు గీయండి.
జవాబు:
AP Inter 1st Year Botany Study Material Chapter 9 కణం జీవప్రమాణం 5
మైటోకాండ్రియా, హరితరేణువు :
మైటోకాండ్రియాలు దండాకారంలో లేక స్థూపాలులాగా ఉంటాయి. ఇవి 0.2 – 1.0 µm వ్యాసం, 1.0 – 4.1 µm పొడవులో ఉంటాయి. దీనికి ఉన్న రెండు పొరలలో వెలుపలి పొరను నునుపుగాను, లోపలిపొర లోపలి వైపుకు ముడతలను ఏర్పరుస్తుంది. వీటిని క్రిస్టే అంటారు. మైటోకాండ్రియాలు వాయు సహిత శ్వాసక్రియ జరిగే ప్రదేశాలు. వీటిని కణశక్త్యాగారాలు అంటారు.

హరితరేణువులు అండాకారం, గోళాకారం లేక రిబ్బన్ ఆకారంలో ఉంటాయి. ఇది 5 10 µm పొడవు, 2.4 µm వెడల్పు కలిగి ఉంటాయి. హరితరేణువు యొక్క ఆవర్ణికలో కార్బోహైడ్రేటులు, ప్రోటీనుల సంశ్లేషణకు అవసరమయిన అనేక ఎంజైమ్లు ఉంటాయి.

ప్రశ్న 4.
కేంద్రక పూర్వజీవుల కణాల లక్షణాలు ఏమిటి?
జవాబు:

  1. కేంద్రక త్వచము ఉండదు. కణం మధ్యలో ఒకే ఒక వలయాకార, నగ్న DNA ఉంటుంది. దీనిని న్యూక్లియాయిడ్ అంటారు.
  2. కేంద్రకాంశం ఉండదు.
  3. అంతర త్వచ వ్యవస్థ ఉండదు.
  4. మైటోకాండ్రియా, ప్లాస్టిడ్లు, లైసోజోమ్లు, పెరాక్సిజోమ్లు, కణ అస్థిపంజరము ఉండవు.
  5. 70 S రకానికి చెందిన రైబోజోమ్లు ఉంటాయి.
  6. కణ కవచము పాలీశాఖరైడ్లు, లిపిడ్లు, ప్రోటీనులతో నిర్మితమై ఉంటుంది.
  7. శ్వాసక్రియా ఎంజైమ్లు కణత్వచంలో ఉంటాయి.
  8. కణాలు ద్విధావిచ్చిత్తి ద్వారా సాధారణ అలైంగిక ప్రత్యుత్పత్తి జరుపుకుంటాయి.

ప్రశ్న 5.
బహుకణయుత జీవులలో శ్రమవిభజన ఉంటుంది. వివరించండి.
జవాబు:
బహుకణజీవులు మిలియన్, ట్రిలియన్ కణాలతో నిర్మితమై ఉంటాయి. ఈ కణాలు అన్ని వేరు వేరు పనులు నిర్వర్తిస్తాయి. ఒకేరకమైన విధులు నిర్వర్తించే కణాల సముదాయమును కణజాలము అంటారు. కావున జీవి దేహంలో, ప్రత్యేక విధిని ప్రత్యేకకణజాలం ఒక ప్రదేశంలో నిర్వహిస్తుంది.

అదేవిధంగా వివిధ రకాల కణాలు వివిధ రకాల విధులను నిర్వహిస్తాయి. ఈ విధమైన శ్రమ విభజన వల్ల బహుకణయుత జీవులు, సంక్లిష్ట పరిస్థితులను కూడా ఎదుర్కొనగలుగుతాయి.

AP Inter 1st Year Botany Study Material Chapter 9 కణం: జీవప్రమాణం

ప్రశ్న 6.
కణం జీవానికి మౌళిక ప్రమాణము. సంగ్రహంగా చర్చించండి.
జవాబు:
ప్లీడన్ అను జర్మన్ వృక్షశాస్త్రవేత్త అనేక మొక్కలను పరిశీలించి మొక్కలన్నీ వివిధ రకాల కణాలతో ఏర్పడి వున్న కణజాలాలతో నిర్మితమై ఉంటాయని గుర్తించారు. దీని ఆధారంగా వృక్ష, జంతు శరీరాలు కణాలు, కణ ఉత్పత్తులతో ఏర్పడి ఉంటాయనే పరికల్పనను ప్రతిపాదించారు. ప్లీడన్ మరియు ష్వాన్లు కణ సిద్ధాంతంను ప్రతిపాదించారు. రుడాల్ఫ్ విర్షా, కొత్త కణజాలాలు అంతకు పూర్వమున్న కణాల నుంచి విభజన వల్ల ఏర్పడ్డాయని వివరించారు. దీనిని ‘ఆమ్నిస్ సెల్యులా సెల్యులా’ అంటారు. కణం ఒక జీవ భౌతికాధారము. కణము జీవులన్నింటిలో మౌళికమైన నిర్మాణాత్మక మరియు క్రియాత్మక ప్రమాణము. – కణంను సజీవస్థితిలో ఉంచడానికి కావలసిన వివిధ రసాయన చర్యలు కణద్రవ్యంలోనే జరుగుతాయి. కొన్ని నిర్మాణాలు (కణాలు) రవాణాలోను, కొన్ని ఆహారపదార్థాల తయారీలోను మరికొన్ని శక్తిని విడుదల చేస్తాయి.

ఒక ఆకుపచ్చని మొక్కను పరిశీలించిన దానిలో పత్రహరితము ఉండి, సూర్యరశ్మిని గ్రహించి, కావలసిన శక్తి పూరిత ఆహార పదార్ధములను తయారుచేసుకుంటుంది. ఇది కణంలోని భాగము, దీనిని హరితరేణువు అంటారు. మొక్కల జంతువులోని కణాలలో కేంద్రకము ప్రధాన కణాంగంగా పనిచేసి, కణచర్యలను నియంత్రిస్తుంది. కణ ద్రవ్యంలో వివిధ కణాంగాలు వివిధ రకాల జీవక్రియలను నియంత్రిస్తూ ఉంటాయి.

ప్రశ్న 7.
కేంద్రక త్వచ రంధ్రాలు అంటే ఏమిటి? వాటి విధులను తెలియజేయండి.
జవాబు:
కేంద్రక త్వచంలో అనేక ప్రదేశాలలో సూక్ష్మరంధ్రాలను కలిగి ఉంటుంది. ఇవి తొడుగులోని రెండు పొరలు కలుసుకోవడంవల్ల ఏర్పడతాయి. వీటిని కేంద్రక రంధ్రాలు అంటారు. వీటి ద్వారా RNA మరియు ప్రోటీను అణువులు కేంద్రకం మరియు కణ ద్రవ్యాల మధ్య ద్విదిశాపథంలో చలనం చెందుతాయి. నిజకేంద్రక కణాలలో కేంద్రకము, కణద్రవ్యం నుండి కేంద్రక త్వచంచే వేరు చేయబడి ఉంటుంది. ఇది కేంద్రకంలోని DNA కు రక్షణగా పనిచేస్తుంది. ఈ వారధితోపాటు కేంద్రక రంధ్రాల ద్వారా కేంద్రక ద్రవ్యానికి, కణద్రవ్యానికి మధ్య సంబంధం ఉంటుంది.

ప్రతి కేంద్రక రంధ్రము ప్రోటీను సంక్లిష్టంతో నిర్మితమై, చిన్న అణువులు, అయానులను స్వేచ్ఛగా కేంద్రకం నుండి విసరణ చెయ్యడానికి తోడ్పడుతుంది మరియు కణద్రవ్యం నుండి అవసరమైన ప్రోటీనులను కేంద్రకంలోనికి అనుమతిస్తుంది. కేంద్రకంలో తయారయిన RNA మరియు ప్రోటీనులను కణ ద్రవ్యంలోనికి పంపడానికి కూడా కేంద్రక రంధ్రాలు తోడ్పడతాయి.

ప్రశ్న 8.
లైసోసోమ్లు, రిక్తికలు రెండు అంతరత్వచ వ్యవస్థకు చెందినవే అయినా వాటి విధులు భిన్నంగా ఉంటాయి. వ్యాఖ్యానించండి.
జవాబు:
హైడోలైటిక్, ఎంజైములను సమృద్ధిగా కలిగి కార్బోహైడ్రేట్లు, ప్రోటీనులు, లిపిడ్లు, కేంద్రకామ్లములను జీర్ణంచేసే త్వచయుత కణాంగాలను లైసోసోమ్లు అంటారు. ఈ ఎంజైమ్లు ఆమ్ల PH ల వద్ద యుక్తతమంగా పనిచేస్తాయి. కరువు పరిస్థితులలో లైసోసోమ్లు కణంలోని అంశాలను ఎంజైమ్ల ద్వారా జీర్ణింపచేసి కణం మృతికి కారణం అవుతాయి. ఈ చర్యను స్వయంవిచ్ఛిత్తి అంటారు.

కణంలో, కణద్రవ్యంలో కనిపించే త్వచయుత ఆచ్ఛాదన కల ప్రదేశాలును రిక్తికలు అంటారు. వీటిలో ప్రధానంగా నీరు, జీవక్రియా ఉపఉత్పన్నాలు విసర్జక పదార్థాలు, వ్యర్థ పదార్థాలతో కూడిన రసం ఉంటుంది. దీనిని రిక్తికరసం అంటారు. దీనిలో మొక్క భాగాలకు రంగు నిచ్చే ఆంథోసయనిన్ లాంటి వర్ణద్రవ్యాలు ఉంటాయి. రిక్తిక చుట్టూ ఏకపొర త్వచం ఉంటుంది. దీనిని రిక్తిక పొర (Tonoplast) అంటారు. ఇది అనేక అయాన్లు వాటి గాఢతా ప్రవణతకు వ్యతిరేకంగా రిక్తికలోనికి రవాణా చెందడానికి తోడ్పడుతుంది. రిక్తికలు కణ ద్రవాభిసరణ చర్యల నియంత్రణలో ముఖ్యపాత్ర వహిస్తాయి.

ప్రశ్న 9.
ఈ క్రింది వానిని భాగాలు గుర్తించిన పటాలతో వర్ణించండి.
1) కేంద్రకము
2) సెంట్రోసోమ్
జవాబు:
AP Inter 1st Year Botany Study Material Chapter 9 కణం జీవప్రమాణం 3
1) కేంద్రకం :
దీనిని ప్రధాన కణాంగము / కణ మేధస్సు అంటారు. దీనిని రాబర్ట్ బ్రౌన్ కనుగొన్నారు. అంతర్థశ కేంద్రకంలో క్రొమాటిన్ అనే న్యూక్లియోప్రొటీనులు, కేంద్రకమాత్రిక, గోళాకారంలో ఉన్న కేంద్రకాంశాలు ఉంటాయి. కేంద్రకంలోని పదార్థాలను కణద్రవ్యం నుంచి వేరుచేస్తూ రెండుపొరలు ఆచ్ఛాదనగా ఉంటాయి. ఈ పొరల మధ్య పరిన్యూక్లియార్ ప్రదేశము ఉంటుంది. వెలుపలిపొర అంతర్జీవ ద్రవ్యజాలంతో అనుసంధానం చెంది, ఉపరితలంపై రైబోసోమ్లను గల్గి ఉంటుంది. కేంద్రక తొడుగులో రెండు పొరలు కలుసుకోవడం వల్ల ఏర్పడిన సూక్ష్మరంద్రాలు ఉంటాయి. వీటి ద్వారా RNA మరియు ప్రోటీను అణువులు కేంద్రకము మరియు కణద్రవ్యాల మధ్య ద్విదిశాపధంలో చలనం చెందుతాయి. కేంద్రక ద్రవ్యంలో కేంద్రకాంశం, క్రొమాటిన్ ఉంటాయి. కేంద్రకాంశాల చుట్టూ పొర ఉండదు. దీనిలోని పదార్ధము కేంద్రకంసంలో కలిసిపోయి ఉంటుంది. ఇవి రైబోసోమల్ RNA చురుకుగా సంశ్లేషణ జరిపే ప్రదేశాలు అంతర్దశ కేంద్రకంలో క్రొమాటిన్ అనే వదులైన అస్పష్టంగా కనిపించే న్యూక్లియో ప్రోటీను పోగులతో ఏర్పడిన వల వంటి నిర్మాణం ఉంటాయి. కాని కణ విభజన సమయంలో క్రోమోసోమ్లుగా మారతాయి. క్రొమాటిన్లో DNA హిస్టోనులు, కొన్ని నాన్ హిస్టోన్లు, RNA ఉంటాయి.

AP Inter 1st Year Botany Study Material Chapter 9 కణం జీవప్రమాణం 6
2) సెంట్రోసోమ్ :
సెంట్రిసోమ్ అనే కణాంగము సాధారణంగా పరిధీయ సూక్ష్మ నాళికల జతలు సెంట్రయోల్లు అనే రెండు స్థూపాకార నిర్మాణాలను చూపిస్తుంది. కేంద్రస్థ తొడుగు ఇవి రూపరహిత పెరిసెంట్రియోలార్ పదార్థాలతో ఆవరించి ఉంటాయి. సెంట్రోసోమ్లోని సెంట్రియోల్లు ఒకదానికి మరొకటి లంబంగా అమర్చబడి ప్రతిదానిలో బండిచక్రం లాంటి నిర్మాణాన్ని కలిగి ఉంటుంది. సెంట్రియోల్లో తొమ్మిది సమదూరంకల ట్యూబ్యులిన్చే నిర్మించబడిన పరిధియ పోచలు ఉంటాయి. ప్రతి పరిధియ పోచలో 3 సూక్ష్మ నాళికలు ఉంటాయి. ప్రక్క ప్రక్క నున్న పరిధియ పోచలు త్రికాలు కలుపబడి ఉంటాయి. సెంట్రియోల్ కేంద్రభాగము ప్రోటీను పదార్థంచే నిర్మితమై హబ్ (Hub) గా పిలవబడుతుంది. హబ్ భాగము ప్రోటీనుయుతమైన వ్యాసార్ధ పోచలతో పరిధేయంగా ఉన్న ట్రిప్లెట్ పోచలకు కలపబడి ఉంటుంది. సెంట్రియోల్లు శైలికలు లేదా కశాభాలను, కండెపోగులను ఉత్పత్తి చేసే ఆధారకణికలుగా పనిచేస్తాయి. కణవిభజన సమయంలో జంతుకణాలు కండెపోగుల నుంచి కండె పరికరమును ఉత్పత్తి చేస్తాయి.

ప్రశ్న 10.
సెంట్రోమియర్ అనగానేమి? క్రోమోసోమ్ల వర్గీకరణకు సెంట్రోమినం ఏ రకంగా ఆధారమౌతుంది. వివిధ రకాల క్రోమోసోమ్లలోని సెంట్రోమియర్ స్థానాన్ని చూపే పటంతో మీ సమాధానాన్ని బలపరచండి.
జవాబు:
ప్రతి క్రోమోసోమ్లో ప్రాథమిక కుంచనం లేక సెంట్రోమియర్ ఉంటుంది. దీనికి ఇరువైపులా రెండు బిళ్లల వంటి నిర్మాణాలు ఉంటాయి. వీటిని కైనిటోకోర్లు అంటారు. వీటికి కండెతంతువులు అతుక్కుని క్రొమోసోమ్ల విభజనకు సహాయపడతాయి. క్రోమోసోంలో సెంట్రోమియర్ స్థానాన్ని బట్టి 4 రకాల క్రోమోసోంలు గుర్తించారు. అవి :
1) మెటాసెంట్రిక్ :
సెంట్రోమియర్ క్రోమోసోమ్ మధ్యస్థానంలో ఉండి రెండు వైపులా బాహువులు సమానంగా ఉంటాయి. చలన దశలో ఈ క్రోమోసోమ్లు ‘V’ ఆకారంలో కనిపిస్తాయి.

2) సబ్మెటా సెంట్రిక్ :
సెంట్రోమియర్ క్రోమోసోమ్ మధ్య స్థానంలో కాకుండా కొంచెం పక్కగా ఉంటుంది. బాహువులు అసమానంగా ఉంటాయి. చలనదశలో ఈ క్రోమోసోమ్లు ‘L’ ఆకారంలో కనిపిస్తాయి.
AP Inter 1st Year Botany Study Material Chapter 9 కణం జీవప్రమాణం 7

3) ఎక్రోసెంట్రిక్ :
సెంట్రోమియర్ ఒక వైపుగా ఏర్పడి ఉంటుంది. ఒక బాహువు పొడవుగా, మరొకటి పొట్టిగా ఉంటాయి. చలనదశలో ఈ క్రోమోసోమ్లు ” ఆకారంలో కనిపిస్తాయి.

4) టీలోసెంట్రిక్ :
సెంట్రోమియర్ క్రోమోసోమ్ బాహువు కొనలో ఉంటుంది. దీనివల్ల ఒకే బాహువు ఉంటుంది. ఈ క్రోమోసోమ్లు చలనదశలో ” (పుడక) ఆకారంలో కనిపిస్తాయి.