Students can go through AP Board 6th Class Science Notes 7th Lesson కొలుద్దాం to understand and remember the concept easily.
AP Board 6th Class Science Notes 7th Lesson కొలుద్దాం
→ అడుగు, మూర, బార, జాన పొడవులను కొలవడానికి సంప్రదాయ పద్ధతులు.
→ పొడవుకు ప్రమాణం మీటరు. పొడవు యొక్క అతి చిన్న ప్రమాణం సెంటీమీటర్ / మిల్లీమీటర్ (సెం.మీ / మి.మీ) మరియు పొడవు యొక్క పెద్ద ప్రమాణం మీటర్ / కిలోమీటర్ (మీ / కి.మీ).
→ ఒక వస్తువు యొక్క ఉపరితలాన్ని దాని వైశాల్యం అంటారు.
→ చదరపు సెంటీమీటర్ (సెం.మీ) అనేది ఉపరితల వైశాల్యానికి ప్రమాణము.
→ ఘనపరిమాణం అనేది ఒక వస్తువు ఆక్రమించిన స్థలం యొక్క కొలత.
→ క్యూబిక్ మీటర్, క్యూబిక్ సెంటీమీటర్ అనేవి ఘనపరిమాణానికి ప్రమాణాలు.
→ ద్రవాల ఘనపరిమాణాన్ని లీటరు లేదా మిల్లీ లీటర్లలో కొలుస్తారు.
→ పొడవులను ఖచ్చితంగా కొలవడానికి మనకు ప్రామాణిక సాధనాలు అవసరం.
→ వైశాల్యం అనేది ఒక వస్తువు ఆక్రమించిన ఉపరితలం యొక్క కొలత.
→ ప్లాటినం, ఇరిడియం లోహాలను కలిపి చేసిన నిర్దిష్ట పొడవు కలిగిన కడ్డి ఫ్రాన్స్ తయారు చేసింది. దీని పొడవును మీటర్కు ప్రామాణికంగా తీసుకొంటారు.
→ నిజమైన ప్రామాణిక స్కేల్ ఫ్రాన్స్ మ్యూజియంలో భద్రపరచబడింది.
→ మన దైనందిన జీవితంలో చెక్క, ఇనుము మరియు ప్లాస్టిక్ తో తయారైన వివిధ పరిమాణాల సాధారణ స్కేలు మరియు గుండ్రని టేపులను కొలతలకు ఉపయోగిస్తాము.
→ వస్తువుల పొడవును కొలిచేటప్పుడు స్కేల్ యొక్క సున్నా బిందువు వద్ద నుండి ప్రారంభించాలి.
→ బకెట్ యొక్క చుట్టుకొలత మరియు వంటపాత్ర చుట్టుకొలతలు వక్ర ఉపరితలాలకు ఉదాహరణ.
→ ప్రయోగశాలలో పాలు మరియు నూనె వంటి ద్రవాల పరిమాణాన్ని కొలవటానికి వారు కొలజాడీ లేదా కొల పాత్రలను ఉపయోగిస్తారు.
→ పెట్టె యొక్క ఘనపరిమాణం = పొడవు × వెడల్పు × ఎత్తు
→ ఒక ఘన సెం.మీ = 1 మి.లీ
→ కొలత : ఒక వస్తువు యొక్క పరిమాణం మరియు బరువును తెలుసుకోవడానికి ఉపయోగించే ప్రమాణం (లేదా) తెలియని వస్తు పరిమాణాలను తెలిసిన ప్రమాణాలలోనికి మార్చటాన్ని కొలత అంటారు.
→ ప్రమాణ కొలత : నిర్దిష్టంగా దేనినైనా కొలుచుటకు తీసుకొనే ప్రమాణం.
→ వైశాల్యం : ఒక వస్తువు ఆక్రమించిన ఉపరితలం.
→ సమతలం : క్రమమైన ఆకృతి ఉదాహరణకు వృత్తాకార, చతురస్రాకార, ఘనాకార గల వస్తువుల తలాన్ని సమతలం అంటారు.
→ గజం : ముక్కు చివర నుండి మధ్య వేళ్ల వరకు గల దూరాన్ని గజం అంటారు.
→ ఘనపరిమాణం : ఒక వస్తువు ఆక్రమించిన స్థలాన్ని ఘనపరిమాణం అంటారు. ఇది వస్తువు యొక్క పొడవు, వెడల్పు, ఎత్తుల లబ్దానికి సమానం.
→ దీర్ఘ ఘనాకార వస్తువు : పొడవు, వెడల్పు, ఎత్తులు వేరువేరు కొలతలుగా గల వస్తువును దీర్ఘ ఘనాకార వస్తువు అంటారు.
ఉదా : అగ్గిపెట్టె, బీరువా మొ||
→ కొల పాత్ర : ద్రవాలు మరియు ఘనపదార్థాల పరిమాణాన్ని కొలవడానికి ఉపయోగించే పొడవైన బోలు (గాజు గొట్టం).
→ గ్రాఫ్ పేపర్ : సమాన విభజనలతో కూడిన కాగితం. దీనిని క్రమరహిత ఉపరితల శరీరాల వైశాల్యాన్ని కొలవడానికి ఉపయోగిస్తారు.
→ క్రమ ఉపరితలం : పొడవు మరియు వెడల్పు సులభంగా కొలవగల ఒక క్రమమైన ప్రాంతం.
→ క్రమరహిత ఉపరితలం : పొడవు మరియు వెడల్పు సులభంగా కొలవలేని ఒక క్రమరహిత ప్రాంతం.
→ జాన : బొటనవేలు చివర నుండి చిన్నవేలు చివర వరకు ఉన్న దూరం.
→ మూర : మోచేయి నుండి మధ్య వేలు కొనవరకు ఉండే దూరం. దీనిని సాధారణంగా పూల మాల, చిన్న దూరాలు కొలవటానికి వాడతారు.
→ చిర్రాగోనే : మన రాష్ట్రములో ఆడే ప్రసిద్ధ గ్రామీణ ఆట (కర్రా బిళ్ళా).
→ అడుగు : 12 అంగుళాల పొడవును అడుగు అంటారు.
→ స్కేల్ : పొడవు మరియు వెడల్పును కొలవడానికి ఉపయోగించే సార్వత్రిక ప్రమాణం.
→ మీటర్ : 100 సెం.మీ పొడవును మీటర్ అంటారు. చిన్న పొడవులను, దుస్తులను మీటర్లో కొలుస్తారు.