Students can go through AP Board 6th Class Social Notes 8th Lesson రాజ్యాలు మరియు సామ్రాజ్యాలు to understand and remember the concept easily.
AP Board 6th Class Social Notes 8th Lesson రాజ్యాలు మరియు సామ్రాజ్యాలు
→ షోడశ మహాజన పదాలలో మగధ శక్తివంతమైన రాజ్యంగా ఆవిర్భవించింది.
→ ఒకరాజు పరిపాలించబడే భూభాగాన్ని ‘రాజ్యం’ అంటారు.
→ సువిశాలమైన రాజ్యాలను ‘సామ్రాజ్యాలు’ అంటారు.
→ మౌర్య చంద్రగుప్తుడు కౌటిల్యుని సహాయంతో మగధ రాజ్యానికి రాజయి, మౌర్య (వంశ) సామ్రాజ్యాన్ని స్థాపించాడు. వీరి రాజధాని పాటలీపుత్రం.
→ మెగస్తనీస్ ఒక గ్రీకు రాయబారి. ఇతను ‘ఇండికా’ అనే గ్రంథాన్ని రచించాడు.
→ కౌటిల్యుడిని విష్ణుగుప్తుడు మరియు చాణుక్యుడు అని కూడా పిలుస్తారు. ఇతను ‘అర్థశాస్త్రము’ అనే గ్రంథంను రచించినాడు.
→ అశోకుడు భారతదేశానికి తూర్పు తీరంలోని ‘కళింగ’ రాజ్యంపై యుద్ధం చేసాడు.
→ 13వ నంబరు రాతిశాసనంలో అశోకుడు కళింగ యుద్ధం గురించి ప్రస్తావించడం జరిగింది.
→ అశోకుని శాసనాలు ప్రాకృత భాషలో, బ్రహ్మి లిపిలో ఉన్నాయి.
→ ధర్మము అనే పదాన్ని ప్రాకృత భాషలో దమ్మము అని పిలుస్తారు.
→ నాలుగు సింహాల గుర్తు భారతదేశ జాతీయ చిహ్నం. దీనిని సారనాథ్ లోని అశోకుని శిలా స్తంభంలో నుండి స్వీకరించారు.
→ 1950 జనవరి 26 నుండి దీనిని అధికార చిహ్నంగా గుర్తించారు.
→ ‘సత్యమేవ జయతే’ అనే పదాన్ని ‘మండూకోపనిషత్’ నుండి గ్రహించబడింది.
→ గుప్తవంశ రాజులలో మొదటి చంద్రగుప్తుడు, సముద్రగుప్తుడు ప్రసిద్ధి చెందిన రాజులు.
→ సముద్ర గుప్తుడు దక్షిణాధిన 12మంది రాజులను ఓడించాడు.
→ రెండవ చంద్రగుప్తుని కాలంలో తొమ్మిది మంది గొప్ప పండితులు ఉండేవారు. వీరినే నవరత్నాలు అంటారు.
→ నవరత్నాలలో ‘కాళిదాసు’ ప్రసిద్ధ కవి.
→ గుప్తుల వాస్తు శిల్ప కళా నైపుణ్యానికి అజంతా, ఎల్లోరా గుహలు గొప్ప ఉదాహరణలు.
→ భారతీయ శాస్త్రవేత్తలు ‘సున్నా’ భావనను అభివృద్ధి చేశారు.
→ బ్రహ్మగుప్తుడు గుప్తుల కాలంలో ప్రముఖ ఖగోళ శాస్త్రవేత్త. ఇతను పౌర సంవత్సరాన్ని దాదాపు ఖచ్చితంగా లెక్కించగల్గినాడు.
→ భారతదేశంలో మొట్టమొదటి ఉపగ్రహం పేరు ‘ఆర్యభట్ట’. దీనిని 1975లో అంతరిక్షంలోకి ప్రయోగించారు.
→ చరకుడు మరియు సుశ్రుతుడు గుప్తుల కాలంలో గొప్ప వైద్య పరిజ్ఞానం గల నిపుణులు.
→ గాయపడిన ముక్కులకు ‘ప్లాస్టిక్ సర్జరీ’ చేసిన మొట్టమొదటి భారతీయ శస్త్రచికిత్స నిపుణుడు సుశ్రుతుడు.
→ గుప్తుల కాలంలో శాస్త్రవేత్తలు లోహశాస్త్ర పరిజ్ఞానంలో నిపుణులు.
→ హుణుల దండయాత్ర వలన భారతదేశంలో గుప్త సామ్రాజ్యం అంతరించింది.
→ గుంటూరు జిల్లాలోని అమరావతి సమీపంలోని ధాన్యకటకం నుండి శాతవాహనులు పరిపాలించేవారు.
→ గౌతమీపుత్ర శాతకర్ణి శాతవాహన రాజులందరిలో గొప్పవాడు.
→ గౌతమీపుత్ర శాతకర్ణికి త్రిసముద్రాధీశ్వర’ అనే బిరుదు కలదు.
→ శాతవాహన కాలంలో ఉన్న ఓడ నాణేలు ప్రసిద్ధి చెందినవి.
→ రోమ్ దేశాలతో శాతవాహనులకు మంచి వ్యాపార సంబంధాలు కలవు.
→ ప్రముఖ బౌద్ధ వేదాంతి ఆచార్య నాగార్జునుడు. శాతవాహనుల కాలంలో నివసించాడు.
→ ఇక్ష్వాకులు ‘విజయపురి’ ప్రధాన కేంద్రంగా పరిపాలించారు.
→ ఇక్ష్వాకులు శ్రీరాముని వారసులుగా చెప్పుకుంటారు.
→ పల్లవులు క్రీ.శ. 300 నుండి 900 సం||రాల మధ్య దక్షిణ భారతదేశాన్ని పరిపాలించారు.
→ తమిళనాడులో కాంచీపురం పల్లవుల రాజధాని.
→ వీరికాలంలో వాస్తుశిల్పకళ రాతిని తొలిచి నిర్మించే ఆలయాల నుంచి రాతితో నిర్మించే ఆలయాల స్థాయికి మారినది.
→ మొదటి నరసింహవర్మ మహాబలిపురంలో అయిదు రథాలు నిర్మించాడు. ఇవి పంచ పాండవ రథాలుగా పేరొందాయి. వీటిని ఏకశిలారథాలు అంటారు.
→ కాంచీపురంలోని ప్రసిద్ధ కైలాసనాథ దేవాలయం రాజసింహుని (రెండవ నరసింహ వర్మ) వాస్తు శిల్పకళారీతికి చక్కటి ఉదాహరణ.
→ కర్ణాటకలోని బాదామిని రాజధానిగా చేసుకుని చాళుక్యులు పరిపాలించారు.
→ తొలి చాళుక్య రాజులలో రెండవ పులకేశి ప్రసిద్ధ రాజు.
→ హర్ష చక్రవర్తి రెండవ పులకేశిని ఓడించాడు. ఈ విషయాన్ని ‘ఐహోలు’ శిలాశాసనంలో పేర్కొనబడినది.
→ రెండవ పులకేశి కొలువులోని రవికీర్తి ఐహోలు శాసనాన్ని తయారు చేశాడు.
→ ‘వేశారా’ అను నూతన వాస్తు శిల్ప కళారీతి (చాళుక్యుల కాలంలో) అభివృద్ధి చెందింది.
→ దక్షిణ భారతదేశములోని ద్రవిడ’ మరియు ఉత్తర భారతదేశంలోని ‘నగారా’ వాస్తు శిల్ప కళాకృతుల మేలి కలయికే ‘వెశారా’.
→ స్వదేశీ తయారీ : స్వదేశీ వస్తువులు
→ తెగ : ఒకే జాతికి చెందిన వ్యక్తులు
→ సామ్రాజ్యం : ఒకే కుటుంబానికి చెందిన రాజుల క్రమం
→ వంశం : పెద్ద రాజ్యము
→ శిలా శాసనాలు : రాళ్ళపై చెక్కబడిన సందేశాలు
→ ఖగోళ శాస్త్రం : అంతరిక్ష అధ్యయన శాస్త్రము
→ రాజ్యం : ఒక రాజుచే పరిపాలించబడే భూభాగాన్ని రాజ్యం అంటారు.
→ సామ్రాజ్యం : సువిశాలమైన రాజ్యాలను సామ్రాజ్యాలు అంటారు.
→ మెగస్తనీసు : గ్రీకు రాయబారి, చంద్రగుప్త మౌర్యుని కొలువులో ఉండేవాడు. ఇండికా అను గ్రంథాన్ని రచించాడు.
→ కౌటిల్యుడు : ఇతనినే విష్ణుగుప్తుడు మరియు చాణుక్యుడు అని కూడా పిలుస్తారు. చంద్రగుప్త మౌర్యుని ప్రధానమంత్రి “అర్థశాస్త్రము” అనే గ్రంథాన్ని రచించాడు.
→ కళింగ : భారతదేశ తూర్పు తీరంలోని ప్రస్తుత ఒడిషాలో ‘కళింగ’ రాజ్యం ఉంది.
→ ప్రాకృతం : అశోకుని కాలంలోని శాసనాలు ఈ భాష (లిపి) లోనే ఉన్నాయి.
→ దమ్మము : ధర్మము అనే పదాన్ని ప్రాకృత భాషలో దమ్మము అని పిలుస్తారు.
→ జాతీయ చిహ్నం : ఒక దేశం యొక్క అధికారిక చిహ్నం. ఇది దేశం యొక్క సార్వభౌమాధికారాన్ని తెలియజేస్తుంది. నాలుగు సింహాల గుర్తును భారత ప్రభుత్వం అధికార జాతీయ చిహ్నం.
→ నవరత్నాలు : రెండవ చంద్రగుప్తుని కొలువులోని తొమ్మిది మంది గొప్ప పండితులు.
→ ఆర్యభట్ట : గుప్తుల కాలంలో ప్రముఖ ఖగోళ శాస్త్రవేత్త, ఇతని పేరు మీదనే 1975లో భారతదేశ మొట్టమొదటి ఉపగ్రహంకు ఆర్యభట్ట అని పేరు పెట్టారు.
→ “త్రిసముద్రాధీశ్వర” : గౌతమీపుత్ర శాతకర్ణి బిరుదు.
→ ఆచార్య నాగార్జునుడు : ప్రముఖ బౌద్ధ వేదాంతి, శాతవాహనుల కాలం నాటి వాడు.
→ మహేంద్రుని రీతి శిల్పకళ : పల్లవ మొదటి మహేంద్రవర్మ ప్రవేశపెట్టిన నూతన ద్రవిడ వాస్తు శిల్పకళ.
→ మహామల్లుని వాస్తు శిల్పకళా రీతి : పల్లవ మొదటి నరసింహ వర్మ ప్రవేశపెట్టిన నూతన ద్రవిడ వాస్తు శిల్పకళ.
→ రాజసింహుని వాస్తు శిల్పకళారీతి : పల్లవ రెండవ నరసింహ వర్మ ప్రవేశపెట్టిన నూతన ద్రవిడ వాస్తు శిల్పకళ.
→ ద్రవిడ నిర్మా ణ శైలి : దక్షిణ భారతదేశములోని వాస్తు శిల్పకళ.
→ నగారా నిర్మాణ శైలి : ఉత్తర భారతదేశములోని వాస్తు శిల్పకళ.
→ వెశారా : చాళుక్యుల కాలంలోని ద్రవిడ, నగారా శిల్పాకృతల మెలుకలయికే ఈ వెశారా నిర్మాణ (శిల్ప) శైలి.
→ మౌర్యవంశం (322-187 B.C.E.) : చంద్రగుప్త మౌర్యుడు → బిందుసారుడు → అశోకుడు
→ శాసనాలు : రాతిపై, రాగిరేకులపై చెక్కబడిన రాజు ఆజ్ఞలు మరియు సందేశాలు.
→ ఐహోలు శాసనం : రెండవ పులకేశి విజయాలను (హర్పునిపై) తెల్పుతుంది. దీనిని రవికీర్తి వేసాడు. ఇది ప్రస్తుతం కర్ణాటకలోని బాగల్ కోట్ జిల్లాలో ఉంది.