AP 7th Class Science Notes Chapter 5 చలనం – కాలం

Students can go through AP Board 7th Class Science Notes 5th Lesson చలనం – కాలం to understand and remember the concept easily.

AP Board 7th Class Science Notes 5th Lesson చలనం – కాలం

→ మన నిత్య జీవితంలో చలనం అనేది ఒక సాధారణమైన అనుభవము.

→ వస్తువు ఒకచోట నుంచి మరొక చోటుకు ప్రయాణం చేసిన మార్గం యొక్క మొత్తం పొడవును దూరం అంటాం.

→ దూరమునకు ప్రాథమిక ప్రమాణం సెంటీ మీటర్.

→ వస్తువు పరిసరాల పరంగా తన స్థానాన్ని మార్చుకుంటే అది చలనంలో ఉన్నట్లు, అలాగే ఒక వస్తువు తన స్థానాన్ని మార్చుకోకపోతే అది విరామంలో ఉంది అని అంటాం.

→ వస్తువుల్లో చలనం మూడు రకాలుగా ఉంటుంది స్థానాంతర చలనం, భ్రమణ చలనం, డోలన చలనం.

→ స్పీడోమీటర్ వాహనాల యొక్క వడిని తెలుసుకొనుటకు ఉపయోగపడుతుంది.

→ వడి యొక్క ప్రమాణాలు మీటర్/ సెకండ్.

AP 7th Class Science Notes Chapter 5 చలనం – కాలం

→ సమాచార ప్రసారం మరియు నావిగేషన్లో కృత్రిమ ఉపగ్రహాలు ఉపయోగపడతాయి.

→ దూరానికి S.I ప్రమాణం మీటరు. కాని ఎక్కువ దూరాలను కొలవటానికి కిలోమీటరును ఉపయోగిస్తారు.

→ రెండు ప్రదేశాల మధ్యగల అతి తక్కువ దూరాన్ని ‘స్థానభ్రంశం’, అంటారు.

→ కొన్ని సందర్భములలో కాలం అనే పదం వాడకుండా త్వరగా, ఆలస్యంగా వంటి పదాలను వాడతాము.

→ చలనం మూడురకాలు అవి

  1. స్థానాంతర చలనం
  2. భ్రమణ చలనం
  3. డోలన చలనం.

→ ఒక వస్తువు ఏకకాలంలో స్థానాంతర మరియు భ్రమణ చలనం రెండింటిని కల్గి ఉండవచ్చు.
ఉదా : కదులుతున్న సైకిల్ చక్రం

→ ఒక వస్తువు సమాన కాల వ్యవధులలో సమాన దూరాలు ప్రయాణిస్తే దానిని సమచలనం అంటారు.
ఉదా : గడియారం ముల్లు.

→ నిర్ణీత కాలవ్యవధిలో ప్రయాణించిన దూరం ఆధారంగా ఒక వస్తువు యొక్క చలనం వేగంగా ఉన్నదో లేక నెమ్మదిగా ఉన్నదో మనం నిర్ణయించవచ్చు.

→ స్పీడోమీటరు వాహనం యొక్క వేగాన్ని, ఓడో మీటరు వాహనం ప్రయాణించిన దూరాన్ని కొలుస్తుంది.

→ 1 కిలోమీటర్ / గంట = 5/18 మీటర్/సెకన్.

→ దూరం – కాలం గ్రాఫ్ సరళరేఖ అయితే ఆ వస్తువు స్థిరమైన వడితో ప్రయాణిస్తుందని అర్థం.

→ రాకెట్ల ద్వారా ఉపగ్రహాలను ప్రవేశపెడతారు.

→ చలనము : ఒక వస్తువు యొక్క స్థానము పరిసరాల పరంగా మారినట్లయితే ఆ వస్తువు చలనంలో ఉంది అంటారు.

→ విరామ స్థితి : ఒక వస్తువు యొక్క స్థానము దాని పరిసరాల పరంగా మారకుండా ఒకేవిధంగా ఉన్నట్లయితే ఆ వస్తువు విరామస్థితిలో ఉందని అంటారు.

AP 7th Class Science Notes Chapter 5 చలనం – కాలం

→ దూరము : వస్తువు రెండు స్థానాల మధ్య ప్రయాణించిన మార్గం యొక్క మొత్తము పొడవును దూరము అంటారు. దూరం యొక్క ప్రాథమిక ప్రమాణం సెంటీమీటర్.

→ స్థానాంతర చలనం : చలించే వస్తువు యొక్క అన్ని భాగాలు, వస్తువుతో పాటుగా ఒకేదిశలో కదులుతూ ఉంటే అటువంటి చలనాన్ని స్థానాంతర చలనం అంటారు.

→ భ్రమణ చలనం : చలిస్తున్న వస్తువు యొక్క అన్ని బిందువులు ఒక స్థిరకేంద్రం లేదా అక్షం చుట్టూ వక్రరేఖా మార్గంలో చరిస్తూ ఉంటే ఆ చలనాన్ని భ్రమణ చలనం అంటారు.
ఉదా : బొంగరం

→ భ్రమణాక్షం : భ్రమణ చలనంలో వస్తువు స్థిరకేంద్రం గుండా పోయే ఊహారేఖ ‘భ్రమణ అక్షం’ అని అంటారు.

→ డోలన చలనం : ఒక స్థిరబిందువు ఆధారంగా ముందుకు వెనుకకూ ఒకే మార్గంలో ఉండే చలనాన్ని డోలన లేదా కంపన చలనం అంటారు.
ఉదా : ఊయల.

→ వడి : ఒక వస్తువు ఏకాంక కాలంలో ప్రయాణించిన మొత్తం దూరాన్ని వడి అంటారు.

→ సగటు వడి : వస్తువు ప్రయాణించిన మొత్తం దూరం మరియు పట్టిన కాలముల నిష్పత్తిని సగటు వడి అంటారు.

→ కాలం : రెండు సంఘటనల మధ్య కొలవదగిన వ్యవరిని కాలం అంటారు. కాలానికి ప్రమాణం సెకన్.

→ కృత్రిమ ఉపగ్రహం : మానవ నిర్మితమైన భూమి యొక్క కక్ష్యలోనికి ప్రయోగింపబడే వస్తువును కృత్రిమ ఉపగ్రహం అంటారు.

→ బలం : వస్తువును కదిలించేవి లేదా కదిలించటానికి ప్రయత్నించే దానిని బలం అంటారు.

→ స్థానభ్రంశం : రెండు ప్రదేశాల మధ్యగల అతి తక్కువ దూరాన్ని స్థానభ్రంశం అంటారు.

→ సమచలనం : ఒక వస్తువు సమాన కాలవ్యవధులలో సమాన దూరాలు ప్రయాణించినట్లయితే దానిని సమచలనం అంటారు.

AP 7th Class Science Notes Chapter 5 చలనం – కాలం

→ అసమచలనం : ఒక వస్తువు సమాన కాలవ్యవధులలో అసమాన దూరాలు ప్రయాణించినట్లయితే దానిని అసమచలనం అంటారు.

→ ఓడో మీటరు : వాహనం ప్రయాణించి ఓడో దూరాన్ని కిలోమీటర్లలో సూచించే పరికరము.

→ స్పీడోమీటరు : వాహన వడిని గంటకు కిలోమీటర్లలో చూపే పరికరము.

→ రాకెట్ : ఒక వస్తువును ముందుకు నెట్టటానికి అవసరమయ్యే బలాన్ని అందించే పరికరం రాకెట్.

AP 7th Class Science Notes Chapter 5 చలనం – కాలం 1