AP 7th Class Social Important Questions Chapter 6 విజయనగర సామ్రాజ్యం

These AP 7th Class Social Important Questions 6th Lesson విజయనగర సామ్రాజ్యం will help students prepare well for the exams.

AP Board 7th Class Social 6th Lesson Important Questions and Answers విజయనగర సామ్రాజ్యం

ప్రశ్న 1.
విజయనగర సామ్రాజ్య గొప్పతనం గురించి తెల్పండి.
జవాబు:
14 మరియు 15 శతాబ్దాలలో మొత్తం దక్షిణ భారతదేశంలో విస్తరించిన, ప్రపంచంలో రెండవ అతి పెద్ద రాజధాని నగరం గల సామ్రాజ్యపు రాజధాని ఆ సమయంలో లండన్, పారిన్ల కంటే పెద్దదిగా పేరుగాంచినది. ఆ నగర వీధుల్లో వ్యాపారులు రత్నాలు మరియు విలువైన రాళ్ళతో వర్తకం చేసేవారు. విజయనగర సామ్రాజ్యానికి హంపి రాజధానిగా ఉండేది. విజయనగరం ఆ కాలంలో ప్రపంచంలోనే అత్యంత ధనిక రాజ్యం . అంతే కాకుండా అన్ని రకాల కళలు, కవిత్వం, నృత్యం, సంగీతం మరియు శిల్పం ఆ కాలంలో అభివృద్ధి చెందాయి. విద్యారణ్య, సాయన, అల్లసాని పెద్దన, ధూర్జటి, పింగళి సూరన మరియు తెనాలి రామకృష్ణ వంటి ఈ రోజు మనకు తెలిసిన పేర్లన్నీ విజయనగర యుగానికి చెందినవి. మన తెలుగు తరగతులలో మనం చదివే గొప్ప రచనలు వీరివే.

ప్రశ్న 2.
విజయనగర సామ్రాజ్య స్థాపన జరిగిన విధానము గురించి వివరించండి.
జవాబు:
దక్షిణ భారతదేశంలోని ప్రసిద్ధి చెందిన విజయనగర సామ్రాజ్యము క్రీ.శ. 1336లో సంగమ వంశానికి చెందిన మొదటి హరిహరరాయలు మరియు మొదటి బుక్కరాయ సోదరుల చేత విద్యారణ్యస్వామి వారి ప్రోత్సాహముతో విజయనగర సామ్రాజ్యము స్థాపించబడినది. విజయనగర రాజధాని ప్రస్తుత కర్ణాటక రాష్ట్రంలోని హంపి. మొదటి హరిహరరాయలు మరియు మొదటి బుక్కరాయలు మొదటగా వరంగల్లుకు చెందిన కాకతీయ రాజు రెండవ ప్రతాపరుద్రుని ఆస్థానంలో క్రీ.శ. 1323 లో పనిచేసేవారు.

కాకతీయ రాజ్యాన్ని ముస్లింలు అక్రమించడంతో హరిహర, బుక్కరాయ సోదరులు ఇద్దరు కంపిలి రాజ్యానికి (ఆధునిక కర్ణాటకలో) వెళ్ళారు. వారు అక్కడ మంత్రులుగా పనిచేశారు. అయితే కంపిలి పాలకులు ముస్లిం తిరుగుబాటుదారునికి ఆశ్రయం ఇచ్చినందుకు కంపిలిని ముహమ్మద్ తుగ్లక్ ఆక్రమించాడు. మొదటి హరిహరరాయలు మురియు మొదటి బుక్కరాయలను ఇద్దరిని ఖైదు చేసి ఇస్లాం మతంలోకి మార్చారు మరియు కంపిలి రాజ్యంలోని తిరుగుబాట్లను పరిష్కరించడానికి సోదరులిద్దరిని మరలా కంపిలిలో నియమించారు. తరువాత వారు విద్యారణ్యస్వామి చొరవతో హిందూ మతంలోకి తిరిగి వచ్చారు. తుగ్లక్ సామ్రాజ్యము బలహీనపడటంతో వారు కూడా తమ స్వాతంత్ర్యాన్ని ప్రకటించుకొన్నారు. క్రీ.శ. 1336లో విజయనగరము అనే కొత్త నగరాన్ని తుంగభద్రా నదికి దక్షిణ ఒడ్డున స్థాపించారు.

AP 7th Class Social Important Questions Chapter 6 విజయనగర సామ్రాజ్యం

ప్రశ్న 3.
విజయనగర రాజుల సైన్యంలో జంతువులు, పక్షుల పాత్ర గురించి తెల్పండి.
జవాబు:
ఏనుగులు నెమ్మదిగా నడిచే జంతువులు అయినప్పటికీ, యుద్ధ సమయాలలో శక్తివంతంగా దాడిచేస్తాయి. యుద్ధ సమయాలలో జంతువులు కీలక పాత్ర పోషించాయి. గుర్రాలు, గాడిదలు మరియు ఒంటెలు పురుషులకు ఆహారం, నీరు, ముందుగుండు సామగ్రి మరియు వైద్య సామగ్రిని అందించడంలో ముందు వరుసలో ఉంటాయి. కుక్కలు మరియు పావురాలు సందేశాలను తీసుకువెళ్తాయి. విష వాయువులను గుర్తించడానికి “పక్షులను” ఉపయోగించేవారు. పిల్లులకు, కుక్కలకు కందకాలలోని ఎలుకల వేటకు ఉపయోగపడే శిక్షణనిచ్చేవారు.

ప్రశ్న 4.
సంగమ రాజవంశం గురించి వివరించండి.
జవాబు:
సంగమ రాజవంశం :
సంగమ రాజవంశంలో గొప్ప పాలకుడు రెండవ దేవరాయలు. అతను సమర్ధుడైన ‘ఫాలకుడు, యోధుడు మరియు పండితుడు. ఆయనను ప్రౌఢ దేవరాయలు అని కూడా అంటారు. సంగమ రాజ ! వంశం యొక్క పాలకులందరిలో ఆయన గొప్పవాడు. అతను ‘కళింగ సైన్యాన్ని ఓడించాడు. అతను కొండవీడును స్వాధీనం చేసుకొని రాజమండ్రి వరకు తన అధికారాన్ని సుస్థిరం చేశాడు. కానీ అతను బహమనీ సుల్తాన్ అహ్మద్ షా చేత ఓడించబడ్డాడు. ఆయన మరణం తరువాత సంగమ రాజవంశం బలహీనపడింది. విరుపాక్షరాయ, దేవ రాయ, రామచంద్రరాయ మరియు మల్లికార్జున రాయలు మొదలగువారు సంగమ రాజవంశం యొక్క ఇతర పాలకులు.

ప్రశ్న 5.
విజయనగర సామ్రాజ్యాన్ని పాలించిన వంశాలేవి? వాటి పాలనా కాలము మరియు ఆయా రాజవంశాలలో ప్రముఖ రాజుల జాబితాను తయారుచేయండి.
జవాబు:

రాజవంశం పేరుపాలించిన కాలమురాజవంశంలో ప్రముఖ రాజులు
1. సంగమ రాజవంశముక్రీ.శ. 1336 – 1485మొదటి హరిహరరాయలు (క్రీ.శ. 1336-1357)
మొదటి బుక్కరాయలు (క్రీ.శ. 1357-1377)
రెండవ హరిహర రాయలు (క్రీ.శ. 1377-1404)
రెండవ దేవరాయలు (క్రీ.శ. 1426-1446)
2. సాళువ వంశముక్రీ. శ. 1485 – 1505సాళువ నరసింహరాయలు (క్రీ.శ. 1485-1491)
3. తుళువ రాజవంశముక్రీ.శ. 1505 – 1570శ్రీకృష్ణదేవరాయలు (క్రీ.శ. 1509-1529) అచ్యుతరాయలు (క్రీ.శ. 1529-1542)
4. అరవీటి వంశముక్రీ.శ. 1570 – 1646అళియరామరాయలు (క్రీ.శ. 1543-1565)
వెంకటపతి రాయలు (క్రీ.శ. 1585-1614)

ప్రశ్న 6.
సాళువ రాజవంశం గురించి క్లుప్తంగా తెలియజేయండి.
జవాబు:
సాళువ రాజవంశం :
సంగమ రాజవంశం తరువాతి రెండవ రాజవంశం సాళువ రాజవంశం. ఇది సాళువ నరసింహరాయలచే స్థాపించబడింది. అతని తరువాత ఇమ్మడి నరసింహరాయలు రాజ్యపాలన చేశాడు.

ప్రశ్న 7.
అరవీటి వంశము గూర్చి తెల్పుము.
జవాబు:
అరవీటి వంశము :
విజయనగర సామ్రాజ్యం యొక్క నాల్గవ మరియు చివరి రాజవంశం అరవీడు రాజవంశం. తళ్ళికోట యుద్ధం తరువాత విజయనగర సామ్రాజ్యం క్షీణించింది మరియు బీజాపూర్ లోని ముస్లిమ్ రాజ్యాలు ముఖ్యమైనవిగా మారాయి.

AP 7th Class Social Important Questions Chapter 6 విజయనగర సామ్రాజ్యం

ప్రశ్న 8.
విజయనగర రాజుల పాలన గురించి వివరించండి.
జవాబు:
పరిపాలన : విజయనగర రాజుల పాలనాకాలంలో పరిపాలన వ్యవస్థ చక్కగా రూపుదిద్దుకుంది. కార్యనిర్వాహక, న్యాయ మరియు శాసన విషయాలలో రాజు సంపూర్ణ అధికారాన్ని కలిగి ఉండేవాడు. అతను అత్యున్నత న్యాయాధికారి. రాజ్యాధికారం సాధారణంగా వంశపారంపర్యతపై ఆధారపడి ఉండేది. రాజుకు తన రోజువారీ పరిపాలనలో మంత్రి మండలి సహాయపడుతుంది.

ఈ సామ్రాజ్యాన్ని మండలాలు, నాడులు, స్థలాలు, గ్రామాలుగా విభజించారు. మండల పాలకుని మండలేశ్వరుడు లేదా నాయక్ అని పిలిచేవారు. విజయనగర పాలకుల పరిపాలనలో స్థానిక అధికారులకు ఎక్కువ అధికారాలు ఇచ్చారు. భూ ఆదాయంతో పాటు, సామంతులు మరియు భూస్వాముల నుండి పన్నులు మరియు బహుమతులు వసూలు చేసేవారు. ఓడరేవులలో ఎగుమతి, దిగుమతి సుంకాలు వసూలు చేసేవారు.

వివిధ వృత్తులపై వేసే పన్నులు ప్రభుత్వానికి ఇతర ఆదాయ వనరులు. సాధారణంగా ఉత్పత్తిలో ఆరవ వంతును భూమి శిస్తుగా నిర్ణయించారు. ప్రభుత్వ వ్యయంలో రాజు వ్యక్తిగత ఖర్చులు మరియు అతను ఇచ్చిన విరాళాలు సైనిక ఖర్చులు ఉంటాయి. సైన్యంలో అశ్వికదళం, పదాతిదళం, ఫిరంగి మరియు ఏనుగులు ఉండేవి. మేలు జాతి గుర్రాలను విదేశీ వ్యాపారుల నుండి సేకరించారు. సైన్యంలోని ఉన్నతస్థాయి అధికారులను నాయకులు లేదా పాలిగార్లు అని పిలిచేవారు. వారి సేవలకు బదులుగా వారికి భూమి మంజూరు చేయబడింది. ఈ భూములను అమరం అని పిలిచేవారు. సైనికుల జీతాలు సాధారణంగా నగదు రూపంలో చెల్లించేవారు.

ప్రశ్న 9.
శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలోని అష్టదిగ్గజాలు, వారి రచనల జాబితా తయారుచేయండి.
జవాబు:

కవిరచన
1. అల్లసాని పెద్దనమనుచరిత్ర, హరికథాసారం
2. నంది తిమ్మనపారిజాతపహరణం
3. మాదయ గారి మల్లనరాజశేఖర చరితం
4. ధూర్జటిశ్రీ కాళహస్తీశ్వర మహత్యం
5. అయ్యలరాజు రామభద్రుడుసకల నీతిసార సంగ్రహం
6. పింగళి సూరనరాఘవ పాండవీయం
7. రామరాజ భూషణుడువసుచరిత్ర
8. తెనాలి రామకృష్ణుడుపాండురంగ మహత్యం

ప్రశ్న 10.
విజయనగర సామ్రాజ్యంలో సామాజిక జీవనం గురించి వివరించండి.
జవాబు:
సామాజిక జీవితం :
సమాజం వ్యవస్థీకృతంగా ఉండేది. విజయనగరంలో భవనాల నిర్మాణం వైభవోపేతంగాను మరియు విలాసవంతంగానూ ఉన్నట్లు విదేశీ ప్రయాణికులు తమ రచనలలో తెలిపినారు. దుస్తులుగా ప్రధానంగా సిల్క్ మరియు కాటన్ వస్త్రాలను ఉపయోగించేవారు. పరిమళ ద్రవ్యాలు, పువ్వులు మరియు ఆభరణాలను ప్రజలు ఉపయోగించేవారు. నృత్యము, సంగీతము, మల్ల యుద్దము, జూదము మరియు కోడిపందెముల వంటి కొన్ని వినోదాలు ఉండేవి. మహిళలు విజయనగర సామ్రాజ్యంలో ఉన్నత స్థానాన్ని పొందడమేగాక రాజకీయ, సామాజిక మరియు సాహితీ కార్యక్రమాలలో చురుకుగా పాల్గొనేవారు. వారు విద్యావంతులే కాక కుస్తీ, సంగీతం మరియు లలిత కళలలో శిక్షణ పొందేవారు. కుమారకంపన భార్య గంగాదేవి “మధురా విజయం” అనే ప్రసిద్ధమైన రచన చేసింది. తాళ్ళపాక తిమ్మక్క మరియు ఆతుకూరి మొల్ల ఈ కాలానికి చెందిన తెలుగు ప్రసిద్ధ కవయిత్రులు. న్యూనిజ్ ప్రకారం, రాజభవనాలలో పెద్ద సంఖ్యలో మహిళలు నృత్యకారిణీలు, గృహ సేవకులు మరియు పల్లకీ మోసేవారుగా ఉండేవారు.

ఏకపత్నీవ్రతము సాధారణంగా అమలులో ఉండేది. కానీ రాజ కుటుంబాలలో బహు భార్యత్వం ఉండేది. వితంతువులు తిరిగి వివాహం చేసుకోవచ్చు.

ప్రశ్న 11.
విజయనగర సామ్రాజ్య ఆర్థిక పరిస్థితుల గురించి వివరించండి.
జవాబు:
ఆర్థిక పరిస్థితులు :
విదేశీ ప్రయాణీకుల కథనాల ప్రకారం విజయనగర సామ్రాజ్యం ప్రపంచంలోని అత్యంత సంపన్న ప్రాంతాలలో ఒకటి. వ్యవసాయం ప్రజల ప్రధాన వృత్తిగా కొనసాగింది. నీటిపారుదల సౌకర్యాలు మెరుగుపరచబడ్డాయి. వారు వారి నీటిపారుదల వ్యవస్థను నియంత్రించుకొన్నారు. కొత్త చెరువులు నిర్మించారు. తుంగభద్రా నది వంటి వాటిపై ఆనకట్టలు కట్టించారు. అనేక పరిశ్రమలు స్థాపించబడ్డాయి. లోహ కార్మికులు మరియు ఇతర హస్తకళాకారులు అభివృద్ధి చెందారు. కర్నూలు మరియు అనంతపూర్ జిల్లాల్లో వజ్రాల గనులు ఉండేవి.

ప్రశ్న 12.
విజయనగర రాజవంశం కాలంలో సందర్శించిన విదేశీ యాత్రికుల జాబితా తయారుచేయండి.
జవాబు:

యాత్రికుని పేరుఎవరి కాలంలో
1. ఇబన్ బటూటా – మొరాకో యాత్రికుడుహరిహర – I
2. నికోలో కాంటి, ఇటాలియన్ యాత్రికుడుదేవరాయ – II
3. అబ్దుల్ రజాక్, పర్షియన్ యాత్రికుడుదేవరాయ – II
4. డువార్టే హర్బోసా, పోర్చుగీస్ యాత్రికుడుశ్రీకృష్ణదేవరాయ
5. డొమింగో పేస్, పోర్చుగీస్ యాత్రికుడుశ్రీకృష్ణదేవరాయ
6. ఫెర్నాండో నూనిజ్, పోర్చుగీస్ యాత్రికుడుఅచ్చుత దేవరాయ

AP 7th Class Social Important Questions Chapter 6 విజయనగర సామ్రాజ్యం

ప్రశ్న 13.
రెడ్డి రాజ్యము యొక్క స్థాపన, రాజ్య విస్తరణ గురించి తెల్పండి.
జవాబు:
రెడ్డి రాజ్యము (1325-1448) :
రెడ్డి రాజ్యా న్ని దక్షిణ భారతదేశంలో ప్రోలయ వేమారెడ్డి స్థాపించారు. రెడ్డి రాజులు క్రీ.శ. 1325 నుండి 1448 వరకు వంద సంవత్సరాల పాటు తీరప్రాంతముతోపాటు మధ్య ఆంధ్రాను పాలించారు. రెడ్డి రాజులలో ప్రోలయ వేమారెడ్డి, అనపోతారెడ్డి, కొమరగిరి రెడ్డి, పెదకోమటి వేమారెడ్డి మొదలగువారు ముఖ్యులు రెడ్డిరాజ్యం ఉత్తరాన ఒరిస్సాలోని కటక్ మరియు దక్షిణా శాకంచి వరకు మరియు పశ్చిమాన శ్రీశైలం వరకు విస్తరించింది. వీరి మొదటి రాజధాని అద్దంకి (ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ లోని ప్రకాశం జిల్లాలోని ఒక పట్టణం). తరువాత దీనిని కొండవీడుకు మార్చారు. రాజమండ్రి వద్ద అనుబంధ శాఖను ఏర్పాటు చేశారు. విజయవాడకు వాయవ్య దిశలోని కొండపల్లి వద్ద ఒకటి, గుంటూరుకు పశ్చిమాన కొండవీడు వద్ద మరొక పెద్ద పర్వత దుర్గాలను నిర్మించారు. పల్నాడు ప్రాంతంలోని బెల్లంకొండ, వినుకొండ మరియు నాగార్జునకొండలు కూడా రెడ్డి రాజ్యంలో భాగంగా ఉండేవి.

ప్రశ్న 14.
బహమనీ సామ్రాజ్యము గురించి నీకేమి తెలియును?
జవాబు:
బహమనీ సామ్రాజ్యము :
అల్లావుద్దీన్ బహ్మన్‌షా క్రీ.శ. 1347లో బహమనీ రాజ్యాన్ని స్థాపించాడు. ఇతనిని హసన్‌గంగూ అని కూడా పిలుస్తారు. ఇతని రాజధాని గుల్బర్గా, ఈ రాజ్యాన్ని మొత్తం పద్నాలుగు మంది సుల్తాన్లు పాలించారు. వారిలో, అల్లావుద్దీన్ బహమనీషా, మొదటి మహమ్మద్ షా మరియు ఫిరోజ్ షా ముఖ్యమైనవారు. అహ్మదాలిషా రాజధానిని గుల్బర్గా నుండి బీదరు మార్చాడు. మూడవ ముహమ్మద్ షా పాలనలో బహమనీ రాజ్యం యొక్క బలం బాగా ఉన్నత స్థాయికి చేరుకుంది. వీరి రాజ్యము అరేబియా సముద్రం నుండి బంగాళాఖాతం వరకు విస్తరించింది. పశ్చిమాన ఇది గోవా నుండి బొంబాయి వరకు విస్తరించింది. తూర్పున
ఇది కాకినాడ నుండి కృష్ణా నది ముఖద్వారం వరకు విస్తరించింది. మూడవ ముహమ్మద్ షా విజయానికి కారణం ఆయన మంత్రి మహమూద్ గవాన్ సలహాలు, సేవలు.

ప్రశ్న 15.
తుళువ వంశంలో ముఖ్య రాజులను తెల్పి, శ్రీకృష్ణ దేవరాయల పాలన విశిష్టతను, గొప్పతనమును తెల్పుము.
జవాబు:
తుళువ రాజవంశం :
తుళువ రాజవంశం విజయనగర సామ్రాజ్యంలోని మూడవ రాజవంశం. దీని పాలకులు వీరనరసింహ రాయలు, శ్రీకృష్ణదేవరాయలు, అచ్యుతదేవరాయలు మరియు సదాశివరాయలు. కృష్ణదేవరాయలు విజయనగరాన్ని పాలించిన పాలకులలో చాలా శక్తివంతమైన పాలకుడు.

శ్రీకృష్ణదేవరాయలు (క్రీ.శ. 1509-1529) :
తుళువ వంశ స్థాపకుడు వీరనరసింహరాయలు. విజయనగర పాలకులలో గొప్పవాడైన శ్రీకృష్ణదేవ రాయలు తుళువ వంశానికి చెందినవాడు. ఇతను సమర్థుడైన పాలకుడు. గొప్ప సైనిక సామర్థ్యాన్ని కలిగి ఉండేవాడు. ఇతను విదేశీ వాణిజ్యం యొక్క ప్రాధాన్యతను అర్థం చేసుకుని ఓడల ద్వారా వ్యాపారాన్ని అభివృద్ధి చేశాడు. అతని మొదటి పని విజయనగరంపై దండెత్తే బహమనీ దళాలను నిరోధించడం. ఇతని కాలం నాటికి బహమనీ రాజ్యం స్థానంలో దక్కన్ సుల్తానుల పాలన ప్రారంభమైనది. దివానీ యుద్ధంలో ముస్లిం సైన్యాలు శ్రీకృష్ణదేవరాయలు చేత నిర్ణయాత్మకంగా ఓడించబడ్డాయి. ఆ తరువాత శ్రీకృష్ణదేవరాయలు రాయ చూర్ దోఆబ్ పై దాడి చేశాడు. దీని ఫలితంగా బీజాపూర్ సుల్తాన్ ఇస్మాయిల్ ఆదిల్ షాతో ఘర్షణ జరిగింది. ఈ యుద్ధంలో శ్రీకృష్ణదేవరాయలు అతన్ని ఓడించి క్రీ.శ. 1520లో రాయచూర్ నగరాన్ని స్వాధీనం చేసుకున్నాడు. అతని గొప్ప తెలివైన మంత్రి అయిన తిమ్మరుసు శ్రీకృష్ణదేవరాయలకు తన పరిపాలనలో సహాయకుడుగా మార్గదర్శిగా ఉండేవాడు.
AP 7th Class Social Important Questions Chapter 6 విజయనగర సామ్రాజ్యం 1

ప్రశ్న 16.
మహ్మద్ గవాస్ గురించి నీకేమి తెలియును?
జవాబు:
మహ్మద్ గవాన్ :
మహ్మద్ గవాన్ మార్గదర్శకత్వంలో బహమనీ రాజ్యం ఉన్నత స్థాయికి చేరుకుంది. అతను పర్షియన్ వ్యాపారి. నలభై రెండేళ్ల వయసులో భారత్ కు వచ్చి బహమనీ రాజ్యంలో చేరాడు. ఆయన కొద్ది కాలంలోనే తన వ్యక్తిగత సామర్థ్యాల వల్ల ముఖ్యమంత్రి అయ్యాడు. అతను రాజ్యానికి విధేయుడిగా ఉన్నాడు. అతను గొప్ప విద్వాంసుడు మరియు సైనిక మేధావి కూడా. అతను విజయనగరం, ఒరిస్సా మరియు కృష్ణ-గోదావరి డెల్టాపై విజయవంతమైన యుద్ధాలు చేశాడు. అతను తన వరుస విజయాల ద్వారా బహమనీ సామ్రాజ్యాన్ని విస్తరించాడు.

మీకు తెలుసా?

7th Class Social Textbook Page No. 157

హంపి వద్ద ఉన్న శిధిలాలు 1805లో ఇంజనీర్, పురాతత్వవేత్త అయిన కల్నల్ కొలిన్ మెకంజీ కాలంలో వెలుగులోకి వచ్చాయి. ఇతడు ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఉద్యోగి మరియు మొదటి భారతీయ సర్వేయర్ జనరల్.

7th Class Social Textbook Page No. 163

కవిరచన
1. అల్లసాని పెద్దనమనుచరిత్ర, హరికథాసారం
2. నంది తిమ్మనపారిజాతపహరణం
3. మాదయ గారి మల్లనరాజశేఖర చరితం
4. ధూర్జటిశ్రీ కాళహస్తీశ్వర మహత్యం
5. అయ్యలరాజు రామభద్రుడుసకల నీతిసార సంగ్రహం
6. పింగళి సూరనరాఘవ పాండవీయం
7. రామరాజ భూషణుడువసుచరిత్ర
8. తెనాలి రామకృష్ణుడుపాండురంగ మహత్యం

7th Class Social Textbook Page No. 165

1. ఏనుగులు నెమ్మదిగా నడిచే జంతువులు అయినప్పటికీ, యుద్ధ సమయాలలో శక్తివంతంగా దాడిచేస్తాయి.

2. యుద్ధ సమయాలలో జంతువులు కీలక పాత్ర పోషించాయి. గుర్రాలు, గాడిదలు మరియు ఒంటెలు పురుషులకు ఆహారం, నీరు, మందుగుండు సామగ్రి మరియు వైద్య సామగ్రిని అందించడంలో ముందు వరుసలో ఉండేవి. కుక్కలు మరియు పావురాలు సందేశాలను తీసుకువెళ్ళేవి. విషవాయువులను గుర్తించడానికి “పక్షులను” ఉపయోగించేవారు. పిల్లులకు, కుక్కలకు కందకాలలోని ఎలుకల వేటకు ఉపయోగపడే శిక్షణనిచ్చేవారు.

AP 7th Class Social Important Questions Chapter 6 విజయనగర సామ్రాజ్యం

7th Class Social Textbook Page No. 167

విజయనగర రాజవంశం కాలంలో సందర్శించిన విదేశీ యాత్రికుల జాబితా.

యాత్రికుని పేరుఎవరి కాలంలో
1. ఇబన్ బటూటా – మొరాకో యాత్రికుడుహరిహర – I
2. నికోలో కాంటి, ఇటాలియన్ యాత్రికుడుదేవరాయ – II
3. అబ్దుల్ రజాక్, పర్షియన్ యాత్రికుడుదేవరాయ – II
4. డువార్టే హర్బోసా, పోర్చుగీస్ యాత్రికుడుశ్రీకృష్ణదేవరాయ
5. డొమింగో పేస్, పోర్చుగీస్ యాత్రికుడుశ్రీకృష్ణదేవరాయ
6. ఫెర్నాండో నూనిజ్, పోర్చుగీస్ యాత్రికుడుఅచ్చుత దేవరాయ