Students can go through AP Board 8th Class Maths Notes 13th Lesson త్రిమితీయ వస్తువులను ద్విమితీయంగా చూపుట to understand and remember the concept easily.
AP Board 8th Class Maths Notes 13th Lesson త్రిమితీయ వస్తువులను ద్విమితీయంగా చూపుట
→త్రిరిపరిమాణ వస్తువుల ఆకారములు సమాన మాపము గల చుక్కల కాగితముపై గీయు విధానము.
→ త్రిపరిమాణ వస్తువులను పై నుండి, ప్రక్క నుండి, ఎదుటి నుండి చూసినపుడు కనబడు వివిధ ఆకారములు.
→ బహుముఖి : సమతలములు కలిగిన వస్తువులు.
→ పట్టకము : బహుముఖి నందు సమాంతరముగా ఎదురెదురుగా గల రెండు తలములు సర్వసమానముగాను, మిగిలిన తలములు దీర్ఘచతురస్రములు (సమాంతర చతుర్భుజము)గా కలిగిన వస్తువులను పట్టకము అంటారు.
→ పిరమిడ్ : బహుముఖి నందు అడుగు భాగము యొక్క తలము బహుభుజిగాను, మిగిలిన ప్రక్కతలములు త్రిభుజములుగా కలిగిన వస్తువులను పిరమిడ్ అంటారు.
→ త్రిపరిమాణ వస్తువులు తయారుచేయుటకు ద్విమితీయ వల రూపములు ఉపయోగించుట.
→ బహుముఖిల కోసం ఆయిలర్ సూత్రము E + 2 = F + V
→ త్రిపరిమాణ వస్తువుల యొక్క తలములు, అంచులు, శీర్షములు : మనం నివసించే గది యొక్క గోడలు, కిటికీలు, తలుపులు, గది యొక్క పై భాగము, అడుగు తలము, మూలలు మొదలైనవి మరియు మన చుట్టూ గల వస్తువులు టేబుల్స్,
బాలు మొ||నవి గమనించండి. వాటి యొక్క తలములు సమతలములు. వాటి తలములు అంచుల వద్ద కలియుచున్నవి. రెండు లేక అంతకంటే ఎక్కువ అంచులు మూలల వద్ద కలియుచున్నవి. ఈ మూలను శీర్షము అంటారు. ఒక సమఘనము లేదా పిరమిడ్ ను గమనించండి.
→ ప్లేటోనిక్ వస్తువుల వలరూపాలు :
బహుముఖి పేరు | బహుభుజి తలాలు | వలరూపము |
చతుర్ముఖీయం | 4 త్రిభుజాలు | |
అష్టముఖీయం | 8 త్రిభుజాలు | |
షష్టిముఖీయం | 6 చతురస్రాలు | |
ఇరవై ముఖాలు కలది | 20 త్రిభుజాలు | |
ద్వాదశముఖీయం | 6 పంచభుజిలు |
→ బహుముఖి యొక్క అంచులు, తలములు, శీర్షముల సంఖ్య
ప్రక్క పటంలో బహుముఖి యొక్క అంచులు, తలములు, శీర్షములను లెక్కించెదము.
తలముల సంఖ్య – 5
అంచుల సంఖ్య – 9
శీర్షముల సంఖ్య – 6
→ కింది పట్టికను గమనించండి.
పై పట్టిక యొక్క చివరి రెండు నిలువు వరుసలు పరిశీలిస్తే అన్ని బహుముఖిలకు మనము F + V = E + 2 అని గమనించగలము.