Students can go through AP Board 8th Class Maths Notes 2nd Lesson ఏకచరరాశిలో రేఖీయ సమీకరణాలు to understand and remember the concept easily.
AP Board 8th Class Maths Notes 2nd Lesson ఏకచరరాశిలో రేఖీయ సమీకరణాలు
→ ఒక బీజీయ సమీకరణం అనేది స్థిరరాశులు, చరరాశులు గల బీజీయ సమాసాల సమానత్వంను తెలుపుతుంది.
→ ‘ =’ గుర్తు గలిగిన గణిత వాక్యాన్ని సమీకరణం అంటారు.
→ ‘=’ గుర్తునకు ఎడమవైపున ఉండే పదాన్ని L.H.S అని, కుడివైపున ఉండే పదాన్ని R.H.S అని అంటారు.
→ ఒక సర్వసమీకరణం L.H.S = R.H.S అవుతుంది.
→ ఒక రేఖీయ సమీకరణంలో ఒకే ఒక చరరాశి ఉన్న దానిని ఏక చరరాశిలో రేఖీయ సమీకరణం అంటారు.
→ గమనించండి :
- ‘+’ రాశి పక్షాంతరం చెందిన ‘-‘ రాశి గానూ
- ‘-‘ రాశి పక్షాంతరం చెందిన ‘+’ రాశి గానూ
- ‘×’ రాశి పక్షాంతరం చెందిన ‘÷’ రాశి గానూ
- ‘÷’ రాశి పక్షాంతరం చెందిన ‘×’ రాశి గానూ మార్పు చెందును.