AP 8th Class Social Important Questions Chapter 5 అడవులు – వినియోగం, సంరక్షణ

These AP 8th Class Social Important Questions 5th Lesson అడవులు – వినియోగం, సంరక్షణ will help students prepare well for the exams.

AP Board 8th Class Social 5th Lesson Important Questions and Answers అడవులు – వినియోగం, సంరక్షణ

ప్రశ్న 1.
మీ ప్రాంతంలో అటవీ చట్టాల అమలు తీరు ఎలా ఉంది? ఇలా చట్టాలు ఉన్నా కూడా అడవులు అంతరించిపోవడానికి గల కారణాలు ఏమై ఉంటాయి?
జవాబు:
మా ప్రాంతంలో అటవీ చట్టాల అమలు తీరు అంతంత మాత్రంగానే ఉన్నాయి.

ఆక్రమణదారులు, గనుల యాజమానులు, గ్రామీణ వర్గాలవారు అడవులను దురుపయోగం చేస్తున్నారు. అడవుల పరిరక్షణ పట్ల సరియైన అవగాహన లేకపోవడం కూడా ఒక కారణం. రాజకీయ నాయకులలో చిత్తశుద్ధి లేకపోవడం దీనికి మరొక కారణంగా చెప్పవచ్చును. . యివేకాక అడవులు అంతరించిపోవడానికి ఇంకా అనేక కారణాలను చెప్పుకోవచ్చును.

ప్రశ్న 2.
నీకు తెలుసున్న వన మూలికా సంరక్షణ కేంద్రాల పేర్లను తెలుపుము.
జవాబు:

  1. వాలి, సుగ్రీవ ఔషధ మొక్క సంరక్షణ కేంద్రము
  2. కోరింగ వనమూలికల సంరక్షణ ప్రదేశము
  3. కార్తీకవనము. ఈ మూడు తూర్పుగోదావరి జిల్లాలో కలవు.

ప్రశ్న 3.
అడవి అంటే ఏమిటి?
జవాబు:
చెట్లతో ఉన్న విశాలమైన భూ భాగాన్ని అడవి అని అంటారు.

నిర్వచనం :

  1. ఒక స్థలం యొక్క పరిసరాలు అన్ని వైపులా చెట్లతో ఆవరించబడి ఉంటే దానిని అడవి అంటారు.
  2. పర్యావరణాన్ని అనేక రకాల చెట్లతో ప్రభావితం చేసే ప్రాంతాన్ని అడవి అంటారు.

AP 8th Class Social Important Questions Chapter 5 అడవులు – వినియోగం, సంరక్షణ

ప్రశ్న 4.
అడవులను ప్రజలు ఉపయోగించుకుంటూ వాటిని సంరక్షించడం సాధ్యమేనా?
జవాబు:
సాధ్యమే. మన ప్రస్తుత సమాజంలో తోటలున్న వారు వాటి కాయలను, పళ్ళను అమ్ముకుని సంరక్షించుకున్నట్లే వీటిని రక్షించవచ్చు.

ప్రశ్న 5.
ఆంధ్రప్రదేశ్ చిత్తు పటాన్ని గీసి అందులో మీ జిల్లా కేంద్రాన్ని గుర్తించండి.
జవాబు:
AP 8th Class Social Important Questions Chapter 5 అడవులు – వినియోగం, సంరక్షణ 1
గమనిక : విద్యార్థులు వారి జిల్లాను గుర్తించగలరు.

ప్రశ్న 6.
“స్వాతంత్ర్యం వచ్చిన సమయంలో గిరిజన ప్రజలను అడవులలో తమ సంప్రదాయ జీవితాలు కొనసాగించడానికి వదిలేయాలా లేదా స్థిర వ్యవసాయం, ఆధునిక విద్య, పారిశ్రామిక పని అవలంబించేలా చేయాలా అని జాతీయనాయకులు చర్చించారు”. – ఆ నాయకులలో మీరు కూడా ఒకడై ఉంటే ఎటువంటి అభిప్రాయాలను వ్యక్తీకరించి ఉండేవారు? వివరించండి.
జవాబు:
నా అభిప్రాయం ఏమిటంటే గిరిజనులను అక్కడే జీవనం కొనసాగించమని చెబుతూ, అవకాశం ఉన్నంతవరకు వారికి అక్కడ నివాసానికి, వ్యవసాయానికి విద్యకు, వైద్యానికి, పనులు చేసుకోవడానికి కావలసిన సదుపాయాలు కల్పిస్తే బాగుంటుంది. వారు అక్కడ తయారుచేసిన . ఉత్పత్తులను మార్కెట్లకు తరలించి వాటికి గిరాకీ ఉండేలా అవకాశం కల్పించాలి. అలాగేవారు మిగతా పట్టణ ప్రాంత మరియు గ్రామీణ ప్రాంతాల వారితో సంబంధాలను ఏర్పాటు చేసుకునేలాగా అవకాశాలను కల్పించడం.

ప్రశ్న 7.
వివిధ రకాల అడవులను గురించి వివరించండి.
జవాబు:
1. సతత హరిత అడవులు:
చాలా ఎ్కువ వర్షపాతంలో పాటు అధిక ఉష్ణోగ్రతలు ఉండే భూమధ్యరేఖా ప్రాంతాలు, కేరళ, అండమాన్లలో సతత హరిత (ఎల్లప్పుడూ పచ్చగా ఉండే చెట్ల) అడవులు ఉంటాయి. చెట్లు ఆకులు రాల్చటానికీ, తిరిగి చిగుళ్లు తొడగటానికీ మధ్య చాలా తక్కువ వ్యవధి ఉంటుంది. కాబట్టి అవి ఎప్పుడూ పచ్చగా ఉంటాయి. కదంబం, వెదురు, నేరేడు వంటి చెట్లు ఈ అడవులలో ఉంటాయి. ఇటువంటి అడవులు మన రాష్ట్రంలో లేవు.

2. ఆకురాల్చే అడవులు :
కొన్ని నెలలపాటే వర్షాలు పడి, సంవత్సరంలో అధిక భాగం పొడిగా, వెచ్చగా ఉండే ప్రాంతాలలో ఈ రకమైన అడవులు పెరుగుతాయి. బాగా వేడిగా ఉండే నెలల్లో ఈ చెట్లు ఆకులను రాలుస్తాయి. మన రాష్ట్రంలో ఆకులు రాల్చే అడవులు రెండు రకాలు ఉన్నాయి. ఒక రకంలో ఎక్కువ మరొక రకంలో తక్కువ వర్షం పడుతుంది. వానలుపడే ప్రాంత ఆకులు రాల్చే అడవులలో వేగి, ఏగిస, మద్ది (అర్జున) బండారు, జిట్టెగి వంటి చెట్లు ఉంటాయి. తక్కువ వర్షపాతం ఉండే ప్రాంతంలో మద్ది, టేకు, వెలగ, ఏగిస, ఏపి, చిగురు, బిల్లు, వేప, దిరిశన, బూరుగ, మోదుగ వంటి చెట్లు ఉంటాయి.

3. ముళ్ల అడవులు :
చాలా తక్కువ వర్షపాతం అధిక ఉష్ణోగ్రతలు ఉండే పొడి ప్రాంతాలలో ఈ రకమైన అడవులు పెరుగుతాయి. తుమ్మ బులుసు, రేగు, చందనం, వేప వంటి చెట్లు ఇక్కడ పెరుగుతాయి. ఇటువంటి అడవులు వైఎస్ఆర్ కడప, చిత్తూరు, అనంతపురం జిల్లాలో ఉన్నాయి.

4. సముద్ర తీరపు చిత్తడి అడవులు :
ఈ అడవులు ఎక్కువగా సముద్ర తీరాల్లో చిత్తడి నేలల్లోనూ. సముద్ర అలల ప్రభావిత నేలల్లోనూ పెరుగుతాయి. ఉప్పునీటికీ, సముద్ర అలల ప్రవాహానికి అనుగుణంగా ఈ చెట్లు పెరుగుతాయి.

AP 8th Class Social Important Questions Chapter 5 అడవులు – వినియోగం, సంరక్షణ

ప్రశ్న 8.
సుదీర్ఘ చర్చల తరువాత 2006 లో పార్లమెంటు “అటవీ హక్కుల చట్టాన్ని” చేసింది. గిరిజనులకు చెందిన అడవులలో వాళ్లకు సాంప్రదాయంగా వస్తున్న హక్కులను తిరస్కరించి గత రెండు వందల సంవత్సరాలుగా గిరిజనులకు తీవ్ర అన్యాయం చేశామని మొదటిసారి అంగీకరించారు. గిరిజనుల హక్కులు పునరుద్దరించకుండా అడవులను సంరక్షించడం అసాధ్యమని కూడా గుర్తించారు.
గిరిజనులకు జరిగిన అన్యాయం ఏమిటి? గిరిజనులకు అటవీ హక్కుల చట్టం – 2006 ఎంతవరకు సహాయ పడుతుందో వివరించండి.
జవాబు:
గిరిజనులకు జరిగిన అన్యాయం ఏమిటి?

  1. బ్రిటీష్ ప్రభుత్వ పాలనలో గిరిజనులు అడవులపై తమ హక్కును, నియంత్రణను క్రమక్రమంగా కోల్పోయారు.
  2. రైల్వే, రోడ్ల నిర్మాణం కోసం అడవులను నరికి వేయడం.
  3. కాగిత పరిశ్రమకు అవసరమైన చెట్లను నరకడం
  4. గిరిజనులను సహజ నివాసం అయిన అడవుల నుండి బలవంతంగా ఖాళీ చేయించడం.

2006 చట్టం

ఈ కొత్త చట్టం చేయటానికి మూడు ప్రధాన కారణాలను అది పేర్కొంది. అవి :
i) మొదటిది, అడవులను సంరక్షించటమే కాకుండా అదే సమయంలో అటవీ వాసులకు జీవనోపాధినీ, ఆహార భద్రతను కల్పించాల్సి ఉండడం.
ii) రెండవది, అడవుల సుస్థిరత, మనుగడలలో అంతర్భాగమైన అటవీ వాసులు తరతరాలుగా సాగుచేస్తున్న భూములపై, నివాస ప్రాంతాలపై హక్కులను వలసపాలనలో, స్వతంత్రం వచ్చిన తరవాత కూడా గుర్తించకపోవటం వల్ల జరిగిన చారిత్రక అన్యాయాన్ని సరిచేయాల్సి ఉండడం.
iii) మూడవది, ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనుల వల్ల (ఆనకట్టలు, పులుల అభయారణ్యాలు వంటివి) నిర్వాసితులైన వారితో సహా అటవీ వాసుల భూమీ హక్కులు, అడవిలోకి వెళ్ళే హక్కుల విషయంలో దీర్ఘకాలంగా కొనసాగుతున్న అభద్రతను పరిష్కరించాల్సి ఉండటం.
7) ఈ చట్టం వల్ల అటవీ వాసులకు, సంప్రదాయంగా అటవీ వస్తువులపై ఆధారపడిన వాళ్లకు అడవుల పై తమ హక్కులు తిరిగి లభించాయి, సాగుచేస్తున్న భూములకు పట్టాలు వచ్చాయి.
8) ఈ చట్టాన్ని సరిగా అమలు చేస్తే తరతరాలుగా గిరిజనులకు జరుగుతున్న అన్యాయాన్ని కొంతమేరకు సరిదిద్దవచ్చు.