Students can go through AP Board 9th Class Maths Notes 12th Lesson వృత్తాలు to understand and remember the concept easily.
AP Board 9th Class Maths Notes 12th Lesson వృత్తాలు
→ ఒక తలంలో ఒక స్థిర బిందువు నుండి స్థిర దూరంలో గల అదే తలానికి చెందిన బిందువుల సముదాయాన్ని వృత్తం అంటారు. ఈ స్థిర బిందువును వృత్త కేంద్రం అని, స్థిర దూరాన్ని వృత్తవ్యాసార్ధం అని అంటారు.
→ ఒక వృత్తంపై ఏదేని రెండు బిందువులను కలిపే రేఖా ఖండాన్ని జ్యా అంటారు.
→ వ్యాసము జ్యాలన్నింటిలోకి పొడవైనది మరియు వృత్త కేంద్రం గుండా కూడా పోయే డ్యాను నృత్త వ్యాసము అంటరు.
→ ఒకే వ్యాసార్ధం (సమాన వ్యాసార్ధాలు) గల వృత్తాలను సర్వసమాన వృత్తాలు అంటారు.
→ ఒకే కేంద్రం కలిగి విభిన్న వ్యాసార్ధాలు గల వృత్తాలను ఏక కేంద్ర వృత్తాలు అంటారు.
→ వ్యాసము, వృత్తాన్ని రెండు అర్ధ వృత్తాలుగా విభజిస్తుంది.
→ వృత్తముపై గల ఏ రెండు బిందువుల మధ్యనైనా గల వృత్త భాగాన్ని చాపము అంటారు.
→ ఒక జ్యా మరియు చాపరేఖల మధ్య ఆవరింపబడిన ప్రాంతాన్ని వృత్తఖండము అంటారు. చాపరేఖ అల్ప చాపమైతే అల్ప వృత్తఖండమని, అధిక చాపమైతే అధిక వృత్తఖండమని అంటారు.
→ ఒక చాపరేఖ మరియు దాని చివరి బిందువులను కేంద్రానికి కలిపే వ్యాసార్ధాల మధ్య ఆవరింపబడిన ప్రాంతాన్ని సెక్టర్ (జ్యాంతరము) అంటారు.
→ సమాన పొడవులు గల జ్యాలు కేంద్రం వద్ద చేసే కోణాలు సమానం.
→ ఒకే వృత్తఖండంలోని కోణాలు సమానం. అర్ధవృత్తంలోని కోణం లంబకోణం అవుతుంది. , రెండు జ్యాలు వృత్త కేంద్రం వద్ద చేసే కోణాలు సమానమైన, ఆ జ్యాలు సమానం.
→ వృత్త కేంద్రం నుండి జ్యాకు గీచిన లంబం, జ్యాను సమద్విఖండన చేస్తుంది. దీని విపర్యయం కూడా సత్యమే.
→ సరేఖీయాలు కాని మూడు బిందువులు గుండా పోయే ఒకే ఒక వృత్తం ఉంటుంది.
→ త్రిభుజ శీర్షాల గుండా పోయే వృత్తాన్ని త్రిభుజ పరివృత్తం అంటారు.
→ సమాన పొడవులు గల జ్యాలు వృత్త కేంద్రం నుండి సమాన దూరంలో ఉంటాయి. విపర్యయంగా వృత్త కేంద్రం నుండి సమాన దూరంలో గల జ్యాలు పొడవులు సమానం.
→ ఒక చాపము, వృత్త కేంద్రం వద్ద ఏర్పరచే కోణం, అదే చాపం మిగిలిన వృత్తంపై ఏదేని బిందువు వద్ద ఏర్పరచే కోణానికి రెట్టింపు.
→ ఒక చాపము మిగిలిన వృత్తంపై ఏదేని బిందువు వద్ద ఏర్పరచే కోణం 90° అయిన, ఆ చాపం అర్ధవృత్తం అవుతుంది.
→ రెండు బిందువులను కలిపే రేఖా ఖండం, ఆ రేఖా ఖండానికి ఒకే వైపున గల రెండు వేర్వేరు బిందువుల వద్ద ఏర్పరచే కోణాలు సమానం అయిన, ఆ నాలుగు బిందువులు ఒకే వృత్తంపై ఉంటాయి.
→ ఒక చక్రీయ చతుర్భుజంలోని ఎదుటి జతల కోణాల మొత్తం 180°.