These AP 9th Class Social Important Questions 13th Lesson 17, 18వ శతాబ్దాలలో ప్రజాస్వామిక, జాతీయవాద విప్లవాలు will help students prepare well for the exams.
AP Board 9th Class Social 13th Lesson Important Questions and Answers 17, 18వ శతాబ్దాలలో ప్రజాస్వామిక, జాతీయవాద విప్లవాలు
9th Class Social 13th Lesson 1 Mark Important Questions and Answers in Telugu Medium
ప్రశ్న 1.
పౌరయుద్ధం అంటే ఏమిటి?
జవాబు:
ఒక దేశంలో జరిగే అంతర్యుద్ధాన్ని పౌర యుద్ధం అంటారు.
ప్రశ్న 2.
సుదీర్ఘ పార్లమెంట్ అని దేనిని అంటారు?
జవాబు:
1640 నుంచి 1660 వరకు కొనసాగిన పార్లమెంటును సుదీర్ఘ పార్లమెంట్ అంటారు.
ప్రశ్న 3.
రక్తరహిత విప్లవం అనగానేమి?
(లేదా)
ఇంగ్లండ్ విప్లవం ఎందువలన రక్తరహిత విప్లవంగా పిలవబడింది?
జవాబు:
ఇంగ్లండ్ విప్లవం ఎందువలన రక్తరహిత విప్లవంగా పిలువబడింది. అత్యున్నత అధికారాన్ని పార్లమెంటుకి బదిలీ చేశారు, ఈ మార్పులన్నీ ఒక్క తుపాకీ గుండు పేలకుండా, ఒక్క రక్తం బొట్టు చిందకుండా జరగడం వలన దానిని ‘మహోన్నత లేక రక్తరహిత విప్లవం’ అంటారు.
ప్రశ్న 4.
ఎస్టేటులో ఎవరెవరు ఉండేవారు?
జవాబు:
మొదటి ఎస్టేటులో ‘మతాధిపతులు’, రెండవ ఎస్టేటులో ‘కులీన వర్గం’, మూడవ ఎస్టేటులో వ్యాపారస్తులు, వాణిజ్యవేత్తలు, న్యాయస్థాన అధికారులు, న్యాయవాదులు, రైతులు, చేతివృత్తి కళాకారులు, చిన్న రైతులు, భూమిలేని కూలీలు, సేవకులు ఉన్నారు.
ప్రశ్న 5.
‘టైద్’ అంటే ఏమిటి?
జవాబు:
‘టైద్’ అనగా చర్చి విధించిన పన్ను, దీని ప్రకారం వ్యవసాయ ఉత్పత్తిలో 10వ వంతు చెల్లించాలి.
ప్రశ్న 6.
జూన్ 20న టెన్నిస్ కోర్టు మైదానంలో ఏం జరిగింది?
జవాబు:
టెన్నిస్ కోర్టు మైదానంలో జూన్ 20న మూడవ ఎస్టేట్ సభ్యులు సమావేశమయ్యారు. వాళ్లు తమను తాము జాతీయ శాసనసభగా ప్రకటించుకుని రాజు అధికారాలను పరిమితం చేసే రాజ్యాంగాన్ని తయారు చేసే దాకా విడిపోమని ప్రతినబూనారు.
ప్రశ్న 7.
కన్వెన్షన్ అని దేన్ని పిలవసాగారు?
జవాబు:
కొత్తగా ఎన్నికైన శాసనసభను ‘కన్వెన్షన్’ అని పిలవసాగారు.
ప్రశ్న 8.
డైరెక్టరీ అంటే ఏమిటి?
జవాబు:
అయిదుగురు సభ్యులతో కూడిన కార్యనిర్వాహక వర్గాన్ని (శాసనసభ) ఎన్నుకునే పాలన (జాకోబిన్ ప్రభుత్వం పడిపోవటంతో) ఫ్రాన్స్ లో ప్రారంభమయ్యింది. దీనినే ‘డైరెక్టరీ’ అంటారు.
ప్రశ్న 9.
మహోన్నత విప్లవ ఫలితం ఏమిటి?
జవాబు:
రాజు నుండి అత్యున్నత అధికారం పార్లమెంటుకు బదిలీ చేయబడినది.
ప్రశ్న 10.
1793 నుండి 1794 వరకు ఫ్రాన్స్ లో భీతావహ పాలనగా పిలవబడింది. కారణం రాయండి.
జవాబు:
- ఫ్రెంచి పరిపాలనా కాలంలో విప్లవం అనంతరం ఫ్రాన్స్ లో జరిగిన అత్యంత ముఖ్యమైన ఘట్టం భీతావహ పాలన.
- ఇది 1793-1794 మధ్యలో జరిగింది. ఈ కాలంలో రాబిస్పియర్ తీవ్ర నియంత్రణ, శిక్షల విధానాన్ని ఈయన అనుసరించాడు.
- రిపబ్లిక్ కి శత్రువులుగా గుర్తించబడిన మత గురువులు, కులీనులు, రాజకీయ పార్టీ సభ్యులను అరెస్టు చేసి జైలుకు పంపించి విప్లవ ట్రిబ్యునల్ ద్వారా విచారించి, నేరం రుజువైనచో “గిల్లెటిన్” ద్వారా చంపేసేవాళ్లు.
- ఖరీదైన తెల్ల పిండి (మైదా) వాడటాన్ని నిషేధించారు.
పట్టికను పరిశీలించి 11, 12 ప్రశ్నలకు సమాధానాలు రాయండి.
లివర్లు | ఫ్రాన్స్ లో ద్రవ్య కొలమానం (కరెన్సీ) 1794 నుంచి నిలిపివేయబడినది. |
మతాధిపతులు | చర్చిలో ప్రత్యేక విధులతో సంబంధం ఉన్న వ్యక్తుల బృందం. |
టైద్ | చర్చి విధించిన పన్ను. దీని ప్రకారం వ్యవసాయ ఉత్పత్తిలో పదవ వంతు చర్చికి చెల్లించాలి. |
టెయిలే | ప్రభుత్వానికి నేరుగా కట్టే పన్ను. |
కులీనులు | ధనిక భూస్వాములు, రాజకుటుంబీకులు, పాలకవర్గం. |
ప్రశ్న 11.
చర్చిచే విధించబడిన పన్ను ఎంత శాతంగా ఉండేది?
జవాబు:
చర్చిచే విధించబడిన పన్ను టైడ్. దీని ప్రకారం ఉత్పత్తిలో పదవ వంతు చర్చికి చెల్లించాలి.
ప్రశ్న 12.
పై పట్టికలో ‘పన్ను’కి సంబంధించిన పదాలేవి?
జవాబు:
పన్నుకి సంబంధించిన పదాలు
- టైద్,
- టెయిలే.
ప్రశ్న 13.
అమెరికా స్వాతంత్ర్య పోరాటంలో ప్రముఖ నినాదం ఏది?
జవాబు:
అమెరికా స్వాతంత్ర్య పోరాటంలోని ప్రముఖ నినాదమేమనగా “ప్రాతినిధ్యం లేకుండా పన్ను చెల్లింపు లేదు”.
ప్రశ్న 14.
రక్తరహిత విప్లవము యొక్క విశిష్టత ఏమిటి?
జవాబు:
రక్తరహిత విప్లవం యొక్క విశిష్టత ఏమిటంటే అత్యున్నత అధికారాన్ని రాజు నుండి పార్లమెంటుకి బదిలీ చేయడం. ఈ పని ఒక్క తుపాకీ గుండు పేలకుండానే, ఒక్క రక్తం బొట్టు కూడా చిందించకుండా జరగడమే.
9th Class Social 13th Lesson 2 Marks Important Questions and Answers in Telugu Medium
ప్రశ్న 1.
“మహోన్నత”, లేక “రక్తరహిత విప్లవం” అంటే ఏమిటి?
(లేదా)
“మహోన్నత లేదా రక్త రహిత విప్లవం” గురించి మీకేమి తెలియును ?
జవాబు:
చార్లెస్ – I మరణం తర్వాత 1688లో ఆరెంజ్ కి చెందిన విలియంని అతని భార్య మేరీని (చార్లెస్ – I మనవరాలు) ఇంగ్లాండ్ సింహాసనాన్ని అధిష్టించాల్సిందిగా పార్లమెంట్ కోరింది. అనంతరం ఒక కొత్త విధానాన్ని రూపొందించారు. దీని ప్రకారం మంత్రులు పార్లమెంట్ కి జవాబుదారీగా ఉంటారు. రాజు అధికారాలను పరిమితం చేశారు. పార్లమెంటుకు సర్వోన్నత అధికారాన్ని ఇచ్చి ప్రజాస్వామ్యానికి దారివేశారు. రాజు అధికారం దైవదత్తం అయింది. కాక పార్లమెంట్ ఇచ్చినదిగా ఉంటుంది. అత్యున్నత అధికారం పార్లమెంట్ కి బదిలీ చేసారు. ఈ మార్పులన్నీ ఒక్క తుపాకీ గుండు పేలకుండా, ఒక్క రక్తం బొట్టు చిందించకుండా జరిగాయి. అందుకే ఈ మార్పుని మహోన్నత లేదా రక్తరహిత విప్లవం అంటారు.
ప్రశ్న 2.
జాకోబిన్స్ క్లబ్ నాయకుడెవరు? ఇందులో సభ్యులెవరు?
(లేదా)
జాకోబిన్ క్లబ్బులు అనగా నేమి?
జవాబు:
ప్రభుత్వ విధానాలను చర్చించటానికి, తమ కార్యాచరణ ప్రణాళికను తయారు చేసుకోటానికి ప్రజలకు రాజకీయ చైతన్యంకై ఏర్పడ్డదే జాకోబిన్ క్లబ్. దీని నాయకుడు మాక్సిమిలియన్ రాబిస్పియర్.
ఇందులో ప్రధానంగా సమాజంలోని పేద ప్రజల నుంచి ఉండే వాళ్ళు. చిన్న దుకాణదారులు, చేతివృత్తులవాళ్ళు, చెప్పులు తయారుచేసే వాళ్ళు, వంటలు వండే వాళ్ళు, రోజువారీ కూలీవాళ్ళు సభ్యులు.
ప్రశ్న 3.
మూడవ ఎస్టేట్ లోని మహిళల జీవన చిత్రం ఏ విధంగా ఉండేది?
జవాబు:
మూడవ ఎస్టేట్ లోని మహిళలు జీవనోపాధి కోసం శ్రమించాల్సి వచ్చేది. బట్టలు కుట్టడం, ఉతకడం వంటి పనులు చేసేవాళ్ళు. బజారులో పూలు, పళ్ళు, కూరగాయలు అమ్మేవాళ్ళు లేదా ధనికుల ఇళ్లల్లో పనులు చేసేవాళ్ళు. అధికశాతం మహిళలకు చదువురాదు. పిల్లల సంరక్షణ, వంట, నీళ్ళు తేవడం, రొట్టె కోసం బారులలో నిలబడటం వంటి పనులు చేసేవాళ్ళు.
పురుషుల కంటే స్త్రీల వేతనాలు తక్కువగా ఉండేవి.
ప్రశ్న 4.
పౌరులకు 1791 రాజ్యాంగం ఇచ్చిన రాజకీయ హక్కులను (చూడండి – పేజీ 160 లోని బాక్స్) హక్కుల ప్రకటనలోని 1 నుంచి 6 అధికరణాలను పోల్చండి. రెండు పత్రాలలో సారూప్యత ఉందా? రెండూ ఒకే భావనను తెలియజేస్తున్నాయా?
జవాబు:
జాతీయ శాసనసభ 1791 లో రాజ్యాంగ ముసాయిదా ప్రతిని తయారుచేసింది. దీని ప్రధాన ఉద్దేశం రాచరిక అధికారాలను పరిమితం చేయటం. ఈ అన్ని అధికారాలు ఒకే వ్యక్తి దగ్గర ఉండటానికి బదులు శాసనసభ, కార్యనిర్వాహక, న్యాయ విభాగాల మధ్య విభజించారు. చట్టాలను చేసే అధికారాన్ని జాతీయ శాసనసభకు ఇచ్చింది. పౌరులందరికీ ఓటు హక్కు లేదు. 25 సం||లు పైబడి కనీసం 3 రోజులు కూలీ అంతకన్నా పన్ను, చెల్లిస్తున్న వారికే ఓటు అధికారం.
పౌరహక్కుల ప్రకటనలో పౌరులందరికీ సమాన హక్కులు అందరికీ ఉన్నాయి. చట్టం ప్రజల అభీష్టాన్ని వ్యక్తపరుస్తుంది. అందరూ సమానమే.
ఈ రెండింటి మధ్య కొన్ని విషయాలలో సారూప్యత మరి కొన్నింటిలో వైరుధ్యం కన్పిస్తుంది.
9th Class Social 13th Lesson 4 Marks Important Questions and Answers in Telugu Medium
ప్రశ్న 1.
క్రింది చిత్రం 1791 నాటి ఫ్రెంచి రాజ్యాంగం అందించిన రాజ్యాంగ పరిపాలన వ్యవస్థను తెలియజేస్తుంది. పరిశీలించి కింది ప్రశ్నలకు సమాధానాలు రాయండి.
ఎ) న్యాయవ్యవస్థను ఎన్నుకొనుటకు ఎవరు అధికారం కలిగి వున్నారు?
బి) పై రాజకీయ వ్యవస్థలో ఎవరు రాజు మరియు మంత్రులపై నియంత్రణాధికారం కలిగి ఉన్నారు?
సి) జాతీయ శాసనసభ చేసిన చట్టాలను “వీటో” చేసే అధికారం ఎవరికి కలదు?
డి) ఏ ప్రభుత్వ విభాగం చట్టాలు అమలు చేసే బాధ్యత కలిగి వుంది?
జవాబు:
ఎ) క్రియాశీలక పౌరులు – ఓటు హక్కు కలిగినవాళ్ళు.
బి) జాతీయ శాసనసభ రాజు మరియు మంత్రులపై నియంత్రణను కలిగి ఉంది.
సి) జాతీయ శాసనసభ చేసిన చట్టాలను ‘వీటో’ చేసే అధికారం రాజుకు కలదు.
డి) చట్టాలు అమలు చేసే బాధ్యత కార్యనిర్వాహక విభాగానికి కలదు.
ప్రశ్న 2.
పై (ప్రశ్న 1లోని) పట్టికను పరిశీలించి ప్రశ్నలకు జవాబులు రాయండి.
ఎ) “వీటో” అధికారం ఎవరికి ఉంటుంది?
బి) న్యాయమూర్తి ఎన్నికలలో ఓటు హక్కును ఎవరు కలిగి వుంటారు?
జవాబు:
ఎ) జాతీయ శాసనసభ చేసిన చట్టాలను ‘వీటో’ చేసే అధికారం రాజుకు కలదు.
బి) క్రియాశీలక పౌరులు – ఓటు హక్కు కలిగినవాళ్ళు.
ప్రశ్న 3.
ఫ్రెంచి మహిళలు ఏ హక్కుల కొరకు పోరాడారు ? భారతదేశం నేపథ్యంలో మహిళలకు ఆ హక్కులన్నీ ఇవ్వబడినవా? విశ్లేషించండి.
జవాబు:
1) ఫ్రెంచి మహిళలు ఓటు హక్కు కావాలని
2) శాసనసభకు పోటీ చేసే హక్కు కావాలని
3) రాజకీయ పదవి చేపట్టే హక్కు కావాలని పోరాడారు.
అయితే భారతదేశ నేపథ్యంలో మహిళలకు ఆ పై పేర్కొన్న హక్కులన్నీ పొందారు. అయితే ఆ హక్కులు పొందే విషయంలో కొంత నిర్లక్ష్యం ఉంది అని చెప్పవచ్చు.
భారతీయ మహిళలు అందరికీ ఓటు హక్కును ఇవ్వడం జరిగింది.
4) శాసన సభలలో పోటీ చేసే హక్కు పొందినప్పటికీ ఇంకా భారతదేశ శాసనసభలలో మహిళల ప్రాధాన్యం చాలా తక్కువ ఉన్నది అని చెప్పవచ్చు.
5) ఇప్పటికీ మహిళా రిజర్వేషన్ బిల్లు లోక్ సభలో ఆమోదం పొందలేదు.
6) రాజకీయ పదవులను చేపట్టే హక్కును మహిళలకు ఇచ్చినప్పటికీ ప్రస్తుత పరిస్థితి దృష్ట్యా రాజకీయ పదవులు చేపట్టే విషయంలో మహిళల సంఖ్య చాలా తక్కువగా ఉందని గమనించవచ్చు.
ప్రశ్న 4.
ఇవ్వబడిన సమాచారం పరిశీలించి క్రింది ప్రశ్నలకు సమాధానములు వ్రాయండి.
ఎ) మొదటి ఎస్టేట్ లో ఎవరు ఉంటారు?
బి) పై చార్టులో ఏ దేశ సమాచారం చూపబడింది?
సి) మూడవ ఎస్టేట్ లోని సంపన్న వర్గాలేవి?
డి) పై వారిలో పన్ను చెల్లించే వర్గమేది?
జవాబు:
ఎ) మొదటి ఎస్టేట్లో మతాధిపతులు ఉంటారు.
బి) పై చార్టులో ఫ్రాన్సు దేశపు సమాచారం చూపబడింది.
సి) మూడవ ఎస్టేటులో ఉన్న సంపన్నవర్గాల వారు :
- పెద్ద వ్యాపారస్తులు
- వాణిజ్యవేత్తలు
- న్యాయస్థాన అధికారులు
- న్యాయవాదులు
డి) పై వారిలో 3వ ఎస్టేటులోని ప్రజలు అందరూ ప్రభుత్వానికి పన్ను చెల్లించే వర్గం.
ప్రశ్న 5.
పై (ప్రశ్న 4లోని) పట్టికను చదివి ఈ క్రింది ప్రశ్నలకు సమాధానాలు రాయండి.
i) ఫ్రెంచి సమాజం ఎన్ని ఎస్టేట్లుగా వర్గీకరించబడింది?
ii) ఫ్రెంచి సమాజంలోని అత్యున్నత వర్గమేది?
iii) మూడవ ఎస్టేట్ లోని సంపన్న వర్గాల వారెవరు?
iv) ఫ్రెంచి సమాజంలో ఏ ఎస్టేట్ ప్రజలు మాత్రమే పన్నులు చెల్లించేవారు?
జవాబు:
i) ఫ్రెంచి సమాజం మూడు ఎస్టేట్లుగా వర్గీకరించబడింది.
ii) ఫ్రెంచి సమాజంలోని అత్యున్నత వర్గం మతాధిపతులు.
iii) మూడవ ఎస్టేటులోని పెద్ద వ్యాపారస్తులు, వాణిజ్యవేత్తలు, న్యాయస్థాన అధికారులు, న్యాయవాదులు సంపన్న వర్గాల వారు.
iv) ఫ్రెంచి సమాజంలో మూడవ ఎస్టేటు ప్రజలు మాత్రమే పన్నులు చెల్లించేవారు.
ప్రశ్న 6.
పై (ప్రశ్న 4లోని) పట్టికను పరిశీలించి క్రింది ప్రశ్నలకు జవాబులు యివ్వండి.
ఎ) ఫ్రెంచి సమాజము ఎన్ని వర్గాలుగా వర్గీకరించబడింది?
బి) మూడవ ఎస్టేటు అనగా ఎవరు ? అందులో ఎవరెవరు వుంటారు?
సి) 3వ ఎస్టేట్ ప్రజలు ఎదుర్కొన్న సమస్యలేమిటి?
డి) ఫ్రెంచి సమాజంలో ఉన్నత వర్గం ఏది?
జవాబు:
ఎ) ఫ్రెంచి. సమాజం మూడు ఎస్టేట్లుగా వర్గీకరించబడింది.
బి) కొంతమంది ధనికులు, ఎక్కువ మంది పేదవారితో కూడినదే మూడవ ఎస్టేటు. మూడవ ఎస్టేటులో పెద్ద వ్యాపారస్తులు, వాణిజ్యవేత్తలు, స్యాయస్థాన అధికారులు, న్యాయవాదులు, రైతులు, చేతివృత్తులవారు, చిన్న రైతులు, భూమిలేని కూలీలు, సేవకులు ఉన్నారు.
సి) మూడవ ఎస్టేటు ప్రజల సమస్యలు :
- ప్రభుత్వం మరియు చర్చిచే విధించబడే పన్నుల భారం అధికం.
- ఎక్కువ రైతాంగానికి భూమి లేదు.
- ఆహారపు కొరత
- సమానత్వం లేకపోవడం మొదలైనవి.
డి) ఫ్రెంచి సమాజంలోని ఉన్నత వర్గం మతాధిపతులు.
ప్రశ్న 7.
“1791లో ఫ్రెంచి విప్లవకారులు” మానవహక్కుల ప్రకటన తయారు చేస్తున్నప్పుడు ఫ్రెంచి మహిళలు చాలా మంది దానిని నిరసించి “మహిళల హక్కుల ప్రకటన”ను వేరేగా తయారు చేశారు. “మహిళలు స్వేచ్ఛా జీవులుగా జన్మించారు, హక్కులలో పురుషులతో సమానులుగా వుంటారు.”
పై పేరాగ్రాఫ్ ను ఆధారంగా చేసుకుని “మహిళలు ఓటు వేసే హక్కు” అనే అంశంపై మీ అభిప్రాయాన్ని వ్యాఖ్యానించండి.
జవాబు:
మహిళలకు పురుషులతో పాటు సమానంగా ఓటు హక్కు కల్పించినట్లయితే వారు తమ ప్రతినిధిని ఎన్నుకోవడంలో తమ వంతు పాత్ర పోషించడమేకాక ఎవరైతే తమకు సరియైన నాయకుడో గమనించగలరు.
మహిళలకు ఓటు హక్కు ఇవ్వడం వలన సమాజం అభివృద్ధి చెందుతుంది. కొన్ని సందర్భాలలో పురుషుల కన్నా మహిళల ఆలోచనా శక్తి చాలా పదునుగా అనిపిస్తుంది. వారికి సమాన హోదా కల్పించడం వల్ల సమాజంలోని అన్ని కార్యక్రమాలలో చురుకుగా పాల్గొని సమాజాభివృద్ధికి తోడ్పడతారు.
మహిళలకు ఓటు హక్కు కాకుండా శాసనసభలకు పోటీచేసే హక్కు మరియు అధికారాలను, పదవులను పొందే హక్కును కల్పించినట్లయితే పురుషులతో పాటు సమానంగా దేశాన్ని ముందుకు మరియు అభివృద్ధిలోనికి తీసుకు రావడానికి దోహదపడుతుంది.
మహిళల గొప్పతనం ఏమిటంటే తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా బాగా లోతుగా ఆలోచించి ఏది మంచి ఏది చెడు అని విశ్లేషణ చేసి సరియైన నిర్ణయం తీసుకోగలరు.
నా అభిప్రాయంలో మహిళలకు ఓటు హక్కు కల్పించడం అనేది సరైన నిర్ణయం
ప్రశ్న 8.
క్రింది పట్టికను పరిశీలించి ప్రశ్నలకు జవాబులు వ్రాయండి.
అంశం | వివరణ |
1. జాకోబిన్ రాజ్యాంగం | ప్రజలందరికీ ఓటు వేసే హక్కు, తిరుగుబాటు చేసే హక్కులుంటాయి. ప్రజలకు పని లేదా జీవనోపాధిని కల్పించాలని పేర్కొంది. |
2. కులీనవర్గం | ఐరోపా ఖండంలో సామాజికంగా, రాజకీయంగా భూమి కలిగిన వర్గం. ఈ.వర్గ ప్రజలు ఒకే రకమైన జీవన విధానం కలిగి ఉండి, ఒకటిగా ఉండేవారు. |
3. ఉదారవాదం | జాతీయ సమైక్యతా భావనలకు ఉదారవాద సిద్ధాంతంతో దగ్గర సంబంధం ఉండేది. వ్యక్తిగత స్వేచ్ఛ, జాతీయతావాద చట్టం ముందు అందరూ సమానులుగా వుండడం అన్న వాటికి ఉదారవాదం ప్రతీకగా నిలిచింది. |
ఎ) జాకోబిన్ రాజ్యాంగం ఏ దేశానికి చెందినది?
బి) జాతీయసమైక్యతా భావనలకు సామీప్యత కల్గిన సిద్ధాంతం ఏది?
సి) వ్యక్తిగత స్వేచ్ఛ, చట్టం ముందు అందరూ సమానమే అన్నవాటికి ఏది ప్రతీకగా నిలిచింది?
డి) ఒకే రకమైన జీవన విధానం కలిగిన వారెవరు?
జవాబు:
ఎ) జాకోబిన్ రాజ్యాంగం ఫ్రాన్సు దేశానికి చెందినది.
బి) జాతీయ సమైక్యతా భావనలకు ఉదారవాద సిద్ధాంతంతో దగ్గర సంబంధం ఉంది.
సి) వ్యక్తిగత స్వేచ్ఛ, చట్టం ముందు అందరూ సమానమే అన్న వాటికి ఉదారవాదం ప్రతీకగా నిలిచింది.
డి) కులీనవర్గం వారు’ ఒకే రకమైన జీవనవిధానం కలిగి యుండేవారు.