These AP 9th Class Social Important Questions 22nd Lesson మహిళా రక్షణ చట్టాలు will help students prepare well for the exams.
AP Board 9th Class Social 22nd Lesson Important Questions and Answers మహిళా రక్షణ చట్టాలు
9th Class Social 22nd Lesson 1 Mark Important Questions and Answers in Telugu Medium
ప్రశ్న 1.
అక్రమ రవాణా రూపాలు ఏవి?
జవాబు:
లైంగిక దాడి, చట్ట వ్యతిరేక కార్యగ-2 వెస్ట్ – 30, ఇళ్లలో పని, వ్యవసాయకూలీ, నిర్మాణకూలీల చేత ఎక్కువ పని చేయించుకొని వారి శ్రమను దోచుకోవడం, పైశాచిక ఆనందం మొ||నవి అక్రమ రవాణా రూపాలు.
ప్రశ్న 2.
సెక్స్ వర్కర్స్ అనగా నారు?
జవాబు:
బలవంతంగా వ్యభిచారం చేయించడం నేరం. ఈ విధంగా వ్యభిచారం చేసే వారిని సెక్స్ వర్కర్స్ అంటారు. వీరి రక్షణకు సంబంధించిన ఎన్నో చట్టాలు అమల్లో ఉన్నాయి.
(లేదా)
బలషంతంగా వ్యభిచారం చేయించి, ఆ తదుపరి తప్పనిసరి పరిస్థితులలో వ్యభిచారం చేసే వారిని సెక్స్ వర్కర్స్ అంటారు.
ప్రశ్న 3.
అక్రమ రవాణాకు శిక్ష ఎలాంటిది?
జవాబు:
అక్రమ రవాణా ఒక పెద్ద నేరం. ఈ నేరానికి 7 సం||రాల కఠిన కారాగార శిక్ష నుండి జీవిత ఖైదు వరకు శిక్షతో పాటు జరిమానా కూడా విధించవచ్చు.
ప్రశ్న 4.
గృహ హింస రూపాలు ఏవి?
జవాబు:
గృహ హింస రూపాలు :
లైంగిక అత్యాచారం, భౌతిక అత్యాచారం, మానసిక క్షోభకు గురిచేయటం, మానసిక అత్యాచారం, ఆర్థిక అత్యాచారం.
ప్రశ్న 5.
న్యాయ సహాయం పొందటానికి అర్హులు ఎవరు?
జవాబు:
షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలవారు, మానవ అక్రమ రవాణా బాధితులు, యాచకులు, స్త్రీలు, పిల్లలు, మతిస్థిమితం లేని వారు, అవిటివారు, ప్రకృతి వైపరీత్యాల బాధితులు, వ్యవసాయ, పారిశ్రామిక కార్మికులు, హిరసాకాండ, కులవైషమ్యాల బాధితులు, రూ. 50,000 కంటే తక్కువ సాంవత్సరిక ఆదాయం కలవారు న్యాయసహాయం పొందటానికి అర్హులు.
ప్రశ్న 6.
ఉచిత న్యాయసహాయం కోరేవారు ఎవరికి దరఖాస్తు చేసుకోవాలి?
జవాబు:
ఉచిత న్యాయ సహాయం కోరువారు తమ తమ జిల్లాలకు చెందిన జిల్లా కోర్టులందు, రాష్ట్ర హైకోర్టునందు గల జిల్లా ఆ న్యాయసేవా అధికార సంస్థలకు గాని తమ కేసు వివరాలను తెలుపుతూ దరఖాస్తు చేసుకోవచ్చును.
ప్రశ్న 7.
న్యాయ సహాయ విధానాలు ఏవి?
జవాబు:
న్యాయ సహాయ విధానాలు – న్యాయవాదిచే ఉచితంగా న్యాయ సలహా ఇప్పించుట, కోర్టులో కేసులు చేపట్టడం, కోర్టు ఫీజు, కేసుకు సంబంధించిన కోర్టు ఖర్చులు భరించడం, కేసులలో తీర్పుల నకళ్లు ఉచితంగా ఇవ్వడం మొదలైన సహాయాలు అందించబడతాయి.
ప్రశ్న 8.
మహిళల మరియు బాలికల సంరక్షణకు భారత ప్రభుత్వం అనేక చట్టాలను చేసింది. భారత ప్రభుత్వం అమలు చేసిన .. అలాంటి ఏవైనా రెండు చట్టాలను పేర్కొనండి.
జవాబు:
- బాల్య వివాహాల నిషేధ చట్టం – 2006
- అక్రమ రవాణా నిరోధక చట్టం – 1956
- వరకట్న నిషేధ చట్టం – 1961
- అత్యాచారం, లైంగిక వేధింపుల చట్టం (నిర్భయ చట్టం) – 2013
9th Class Social 22nd Lesson 2 Marks Important Questions and Answers in Telugu Medium
ప్రశ్న 1.
బాల్య వివాహ నిషేధ చట్టం అమలులో ఉన్నా అక్కడక్కడా బాల్య వివాహాలు ఇంకా జరుగుతూనే ఉన్నాయి. ఈ దురాచారాన్ని ఆపడానికి కొన్ని చర్యలను సూచించండి. ,
జవాబు:
- మొదటగా తల్లిదండ్రులకు బాలికలకు విద్యను ఇవ్వడం వల్ల కలిగే లాభాలను వివరించడం.
- బాల్య వివాహం వలన కలిగే అనర్థాలను వివరించి వారిలో చైతన్యం తీసుకువచ్చి బాల్య వివాహాలను ఆపివేయించాలి.
- కొంతమంది తల్లిదండ్రులు మూర్బంగా వ్యవహరిస్తే అప్పుడు అధికారులకు సమాచారం అందించి వివాహాలను ఆపివేయించాలి.
- బాల్యవివాహాల వలన కలిగే అనర్థాలను టి.వి., షార్ట్ ఫిలిమ్ ల ద్వారా వారికి ప్రత్యక్ష సంఘటనలను మరియు పరోక్ష సంఘటనలను గురించి వివరించాలి.
ప్రశ్న 1.
అక్రమ రవాణా అంటే ఏమిటి?
జవాబు:
అక్రమ రవాణా అంటే వ్యక్తులను వారి ఇష్టానికి విరుద్దంగా తరలించడం, అధికారికంగా లొంగదీసుకోవటం, భయపెట్టి పని చేయించుట, జీవనోపాధి లేదా వివాహం లాంటి ఆశ చూపి తెలియని ప్రాంతాలకు తరలించి వెట్టిచాకిరి చేయించడం, లైంగిక దోపిడీ లాంటి కృత్యాలకు పాల్పడటం లేదా అమ్మకానికి పెట్టడం.
ప్రశ్న 2.
బాల్య వివాహం చేసుకుంటే పురుషుడికి విధించే శిక్ష?
జవాబు:
18 సం||లు నిండని బాలికను పురుషుడు వివాహం చేసుకుంటే 2 సంవత్సరాల జైలు శిక్ష లేదా లక్ష రూపాయల వరకు జరిమానా.
ప్రశ్న 3.
బాలల హక్కులు ఏవైనా నాలుగు వ్రాయుము.
జవాబు:
బాలల హక్కులు :
- జీవితం – జీవించే హక్కు
- సాధ్యమైనంతవరకూ బాలలు తల్లిదండ్రులతో కలసి ఉండడం.
- బాలల విద్యకు, ఆరోగ్యానికి హాని కలిగించే పని చేయకుండా ఉండడం.
- బాలలు సంపూర్ణ ఆరోగ్యం, వైద్య సౌకర్యం పొందే హక్కు,
ప్రశ్న 4.
బాల్య వివాహం అంటే ఏమిటి?
జవాబు:
పురుషునికి 21 సం||లు, స్త్రీకి 18 సం||లు నిండకుండా జరిపించే పెండ్లి.
ప్రశ్న 5.
పాఠ్య పుస్తకంలోని ఆప ‘బడి” న బాల్య వివాహం – ఒక విజయగాథ ఏ జిల్లాలో జరిగింది? ఆ బాలిక పేరేమి?
జవాబు:
మహబూబ్ నగర్ జిల్లా, అచ్చంపేట మండలం, బొమ్మనపల్లి గ్రామం. ఆ బాలిక పేరు ఎర్రమోని సరిత.
ప్రశ్న 6.
చట్ట వ్యతిరేక కార్యకలాపాలు ఏవి?
జవాబు:
- అక్రమ రవాణాకు గురైన వారిచే భిక్షాటన
- మానవ అవయవాల అమ్మకం
- మత్తు మందుల అక్రమ వ్యాపారం
ప్రశ్న 7.
కార్మికులు అంటే ఎవరు?
జవాబు:
వెట్టిచాకిరి చేసేవారు, ఇళ్ళలో పనిచేసేవారు, వ్యవసాయ కూలీ, నిర్మాణ కూలీలు మొ||వారు.
ప్రశ్న 8.
వరకట్న నిషేధ చట్టం పరిధిలోకి వచ్చే అంశాలు ఏవి?
జవాబు:
వివాహం అనంతరం అమ్మాయిని వేధించడం, తిట్టడం, కొట్టడం, ఒక్కోసారి చంపివేయటం, కొన్నిసార్లు బాధలు భరించలేక స్త్రీలు ఆత్మహత్యలు చేసుకోవడం మొదలైనవి ఈ చట్టం పరిధిలోకి వస్తాయి.
ప్రశ్న 9.
లైంగిక దాడి అంటే ఏమిటి?
జవాబు:
లైంగిక దాడి అంటే బలవంతపు వ్యభిచారం, సాంఘిక, మతపరమైన వ్యభిచారం (జోగిని, మాతాంగి, దేవదాసి మొ||నవి) పర్యాటక రంగంలో లైంగిక దోపిడి, అసభ్యత అశ్లీల రచనలు – చిత్రాలు ‘మొ||నవి.
ప్రశ్న 10.
వరకట్న నిషేధ చట్టం ఉల్లంఘించిన వారికి విధించే శిక్ష ఏమిటి?
జవాబు:
5 సం||ల వరకు జైలు శిక్ష, 15 వేలు వరకు జరిమానా లేదా కట్నం విలువ మొత్తంలలో ఏది ఎక్కువైతే ఆ మొత్తం జరిమానా విధించబడును.
ప్రశ్న 11.
గృహహింస అంటే ఏమిటి?
జవాబు:
కుటుంబ సంబంధాల్లో ఉన్న స్త్రీకి లేదా ఆమె సంతానానికి అదే కుటుంబంలోని వ్యక్తుల వల్ల హింసాపూరిత చర్యలు, ఇబ్బందులు కలిగినట్లయితే దానిని గృహహింసగా చెప్పవచ్చును.
ప్రశ్న 12.
సమాజంలో మహిళలు ఎదుర్కొను సమస్యలు ఏవి?
జవాబు:
మన సమాజంలో మహిళలు అనేక సమస్యలు, ఇంటా బయటా ఎదుర్కొంటున్నారు. ఆడ పిల్లలు బడికి వెళ్ళడానికి కూడా భయపడుతున్నారు. ముఖ్యంగా స్త్రీలను మాటలతో వేధించడం, బాధించడం, తక్కువ చేసి మాట్లాడటం, ఎగతాళి చేయడం, శారీరకంగా, మానసికంగా, లైంగికంగా హింసించడం.
ప్రశ్న 13.
అంతర్జాతీయ బాలల హక్కుల ఒడంబడిక ఎప్పుడు జరిగింది? ఎన్ని దేశాలు సంతకం చేశాయి?
జవాబు:
అంతర్జాతీయ బాలల హక్కుల ఒడంబడిక, 1989లో జరిగింది. 191 దేశాలు సంతకం చేశాయి.
ప్రశ్న 14.
ఉచిత న్యాయ సహాయం ఎవరికి అందించబడుతుంది?
జవాబు:
న్యాయ సహాయం పొందుటకు అర్హులు :
- షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలకు చెందినవారు.
- మానవ అక్రమ రవాణా బాధితులు, యాచకులు, స్త్రీలు, పిల్లలు, మతి స్థిమితం లేనివారు, అవిటివారు.
- ప్రకృతి వైపరీత్యాల బాధితులు, వ్యవసాయ, పారిశ్రామిక కార్మికులు.
- రూ. 50,000 కంటే తక్కువ సాంవత్సరిక ఆదాయం కలవారు.
ప్రశ్న 15.
లోక్ అదాలత్ అంటే ఏమిటి?
జవాబు:
ఆర్థిక పరిస్థితులు, ఇతర బలహీనతలు కారణంగా న్యాయాన్ని పొందే అవకాశాలను కోల్పోకుండా ఉండటం కోసం ఉద్దేశించినదే ఉచిత న్యాయస్థానం. దీనినే లోక్ అదాలత్ అంటాం.
ప్రశ్న 16.
న్యాయ సహాయ విధానాలు తెలుపుము.
జవాబు:
న్యాయ సహాయ విధానాలు :
- న్యాయవాదిచే ఉచితంగా న్యాయ సలహా ఇప్పించుట.
- కేసులను పరిశీలించిన మీదట అవసరమైనచో దరఖాస్తుదారుని తరపున న్యాయవాదులను నియమించి ఆయా కోర్టులలో కేసులు చేపట్టడం.
- న్యాయ సహాయం పొందినవారికి కోర్టు ఫీజు, కేసుకు సంబంధించిన కోర్టు ఖర్చులు భరించడం.
- న్యాయ సహాయం పొందినవారికి కేసులలో తీర్పుల నకళ్ళు ఉచితంగా ఇవ్వడం మొ||లగు సహాయాలు అందించబడతాయి.