AP 9th Class Social Notes Chapter 10 ధరలు – జీవనవ్యయం

Students can go through AP Board 9th Class Social Notes 10th Lesson ధరలు – జీవనవ్యయం to understand and remember the concept easily.

AP Board 9th Class Social Notes 10th Lesson ధరలు – జీవనవ్యయం

→ తల్లిదండ్రులు ఏదో ఒక పనిని చేయడం ద్వారా ఆదాయాన్ని పొందుతున్నారు.

→ వచ్చిన ఆదాయాన్ని కుటుంబ ఖర్చులకు. వినియోగిస్తారు.

→ బడ్జెట్ ను సర్దుబాటు చేయడమంటే ఖర్చులను తగ్గించుకోవడమే.

→ ధరలు నిరంతరం పెరగడాన్ని “ద్రవ్యోల్బణం” అంటారు.

→ జీవన ప్రమాణం ఒక కుటుంబానికి మరొక కుటుంబానికి, ఒక వృత్తికి మరొక వృత్తికి, ఒక ఆదాయ వర్గానికి మరొక ఆదాయ వర్గానికి, ఒక దేశానికి మరొక దేశానికి వేరుగా ఉంటుంది.

AP 9th Class Social Notes Chapter 10 ధరలు – జీవనవ్యయం

→ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలలో, కొన్ని సంస్థలలో పనిచేసే ఉద్యోగులు కరవు భత్యం (డి.ఎ)ను అదనంగా పొందుతారు.

→ వ్యాపార కార్యకలాపాలు చేసే ప్రజలు వారు అమ్మే వస్తువుల ధరలు పెంచడం ద్వారా అధిక జీవన వ్యయంను రాబట్టుకుంటారు.

→ డ్రైక్లీనర్లు, క్షురకులు, లాయర్లు, డాక్టర్లు మొదలగు వివిధ సేవలను అందించే ప్రజలు ధరలు పెరిగినప్పుడు . వారి ఫీజును కూడా పెంచుతారు.

→ వివిధ వృత్తుల వారికి ప్రభుత్వం కూడా ఎప్పటికప్పుడు తగు వేతనాలను నిర్ణయిస్తుంది.

→ ధరలలో వచ్చిన మార్పులను కొలుచుటకు ఉపయోగపడే గణాంక సాధనం ధరల సూచిక.

→ ఎంపిక చేసిన మొదటి సంవత్సరంలో అన్ని వస్తుసేవల సరాసరి ధరలను ఆధార సంవత్సరం అంటారు.

→ ధరల సూచికలు మనకు కాలక్రమేణా కొన్ని వస్తువుల ధరల మొత్తాలలో వచ్చిన మార్పులను తెలియజేస్తాయి.

→ ప్రభుత్వం వివిధ వినియోగదారుల ధరల సూచికలను ఉపయోగించి ఉద్యోగులకు డి.ఎ.ను లెక్కించి అందజేస్తుంది.

→ ఒక కుటుంబ బడ్జెట్ లోని ప్రాముఖ్యత గల వస్తువులపై చేసే ఖర్చును లెక్కించే విధంగానే వినియోగదారుల ధరల సూచికను కూడా లెక్కిస్తారు.

→ ఆహార ధరల సూచికలో బియ్యం, గోధుమ, కూరగాయలు, పంచదార, పాలు, గుడ్లు, మాంసం, చేపలు, ఆహార పదార్థాల తయారీకి ఉపయోగించే వంటనూనెల టోకు ధరలు ఉంటాయి.

→ ద్రవ్యోల్బణం అనగా దీర్ఘకాలంలో వస్తువుల, సేవల సాధారణ ధరల స్థాయిలో పెరుగుదల.

→ PDS (Public Distribution System) ద్వారా ప్రభుత్వం నిత్యావసర వస్తువులైన గోధుమ, వరి, పంచదార, వంటనూనెలు, కిరోసిన్లను పంపిణీ చేసే బాధ్యతను చేపట్టింది.

AP 9th Class Social Notes Chapter 10 ధరలు – జీవనవ్యయం

→ మన రాష్ట్రంలో 4.5 లక్షల చౌక ధరల దుకాణాలున్నాయి.

→ కిరోసిన్, డీజిల్, LPG, CNG, PNG మొదలగు వాటికి ప్రభుత్వం కొంతమేర లేదా మొత్తంగా సబ్సిడీ ఇచ్చి ధరల పాలనా యంత్రాంగం ద్వారా విక్రయిస్తుంది.

→ RBI, దాని నియంత్రణలో ఉన్న అన్ని బ్యాంకుల ఖాతాదారుల నుండి స్వీకరించే, చెల్లించే వడ్డీలను కూడా నియంత్రిస్తుంది.

→ కొరతగా ఉన్న వస్తువులను ప్రభుత్వం ఇతర దేశాల నుంచి తెప్పించి మార్కెట్ ధరల కంటే తక్కువ ధరలకు నేషనల్ అగ్రికల్చరల్ కో ఆపరేటివ్ మార్కెటింగ్’ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా లాంటి సహకార సంఘాల ద్వారా అందిస్తుంది.

→ జీవన ప్రమాణం : ప్రజల కొనుగోలు శక్తి

→ ద్రవ్యోల్బణం నిరంతరం ధరలు పెరగటం

AP 9th Class Social Notes Chapter 10 ధరలు – జీవనవ్యయం

→ వినియోగదారుల ధరల సూచిక : కుటుంబంలో వినియోగించడానికి కొనే కొన్ని వస్తువుల ధరలను నిర్ణయించే పట్టిక

→ టోకు ధరల సూచిక : ఈ సూచికలో అన్ని వస్తువులు అనగా ఉత్పాదక వస్తువులు, వినియోగ వస్తువులను కొలవడానికి ఉపయోగించే గణాంక సాధనం.

→ ధరల పరిపాలనా యంత్రాంగం : వస్తువుల యొక్క ధరలను ప్రభుత్వమే నిర్ణయించి వాటిని అమలు జరిగేటట్లు చూడటం.

AP 9th Class Social Notes Chapter 10 ధరలు – జీవనవ్యయం 1