Andhra Pradesh AP Board 3rd Class EVS Solutions 3rd Lesson మన చుట్టూ ఉన్న జంతువులు Textbook Exercise Questions and Answers.
AP State Syllabus 3rd Class EVS Solutions Lesson 3 మన చుట్టూ ఉన్న జంతువులు
I. విషయావగాహన:
ప్రశ్న 1.
పెంపుడు జంతువుల పేర్లు ఐదింటిని చెప్పండి. రాయండి.
జవాబు.
కుక్క, ఆవు, ఎద్దు, గొర్రె, మేక, దున్నపోతు, గుఱ్ఱం మరియు పిల్లి.
ప్రశ్న 2.
జంతువులు ఒక చోటి నుంచి ఇంకో చోటికి ఎలా కదులుతాయి ?
జవాబు.
కొన్ని జంతువులు నడుస్తాయి. కొన్ని పాకుతాయి, కొన్ని దుముకుతాయి, కొన్ని ఈదుతాయి. పక్షులు ఒక చోట నుంచి ఇంకో చోటికి ఎగురుతాయి.
ప్రశ్న 3.
మన చుట్టూ ఉన్న పక్షులు, జంతువులకు నీవు ఎలా సహాయ పడతావు ?
జవాబు.
- పక్షులు, జంతువులకు మనం ఏదేని పాత్రలో నీటిని ఉంచాలి. ముఖ్యంగా వేసవిలో ఇలా చేయాలి.
- మొక్కలను నాశనం చేయరాదు.
- పక్షులకు జంతువులకు కావలసిన ఆహారాన్ని అనగా వరి, జొన్న, మొదలగు ధాన్యాలను వేయాలి.
- పక్షులను జంతువులను కాపాడాలి.
- పక్షుల, జంతువుల గుడ్లు, గూడులను నాశనం చేయరాదు.
II. ప్రశ్నించడం – పరికల్పనలు చేయడం:
ప్రశ్న 4.
నేనెవరినో చెప్పండి.
అ) పొడవుగా ఉంటాను, నాకు కాళ్ళు, చెవులు లేవు. పాకుతాను, చీమలో పుట్టలో నివసిస్తాను. ఎవరిని? నేనెవరిని ?
జవాబు.
పాము
ఆ) వీటిలో వివసిస్తారు. ఎప్పుడు నిద్రించము. మొప్పలతో శ్వాసిస్తారు. ఎవరిని ? నేనెవరిని ?
జవాబు.
చేప
ఇ) వాకు నాలుగు కాళ్ళున్నాయి. పాలు ఇస్తాను. ఆకులు తింటాము. ఎవరిని ? నేనెవరిని?
జవాబు.
ఆవు, మేక
ఈ) నాకు రెక్కలున్నాయి. ఆకాశంలో చాలా ఎత్తు ఎగర గలను. నేల పైన ఉన్న చిన్న వస్తువులను కూడా చూడగలను. ఎవరిని ? నేనెవరిని ?
జవాబు.
పక్షి.
III. ప్రయోగాలు – క్షేత్ర పరిశీలనలు:
ప్రశ్న 5.
కొన్ని పక్షులు ఎగురగలవు. కొన్ని ఎగుర లేవు. నీ చుట్టూ ఉన్న పక్షులను పరిశీలించి పక్క పేజీలో ఇచ్చిన పట్టికలో వాటి పేర్లు రాయండి.
జవాబు.
క్రమ సంఖ్య | ఎగురగలవు | ఎగురలేవు |
1. | కాకి | కోడి |
2. | పావురం | నెమలి |
3. | పిచ్చుక | పెంగ్విన్ |
4. | చిలుక | ఆస్ట్రిచ్ |
IV. సమాచార నైపుణ్యాలు – ప్రాజెక్టులు:
ప్రశ్న 6.
కింది జంతువుల రకాలకు సంబంధించి రెండు చిత్రాలు సేకరించి ఇచ్చిన ఖాళీ స్థలాల్లో అతికించండి.
జవాబు.
విద్యార్థి కృత్యము.
V. పటనైపుణ్యాలు, బొమ్మలు గీయడం, నమునాలు తయారు చేయడం ద్వారా భావ ప్రసారం:
ప్రశ్న 7.
క్రింద ఇవ్వబడిన బొమ్మలకు రంగులు వేయండి.
జవాబు.
విద్యార్థి కృత్యము.
VI. ప్రశంస – విలువలు జీవవైవిధ్యంపట్ల స్పృహ కల్గి ఉండడం:
ప్రశ్న 8.
దోమలు మనకు హాని చేస్తాయి అని నీకు తెలుసు. దోమలను అరికట్టడానికి తీసుకోవలసిన జాగ్రత్తలు పాటించవలసిన ఏవైనా మూడు పద్ధతులు రాయండి.
జవాబు.
దోమలను అరికట్టడానికి తీసుకోవలసిన జాగ్రత్తలు :
- ఇంటి పరిసరాలలో నీరు నిల్వ ఉండకుండా చూడాలి.
- దోమ తెరలను వాడాలి.
- లేత రంగు దుస్తులను ధరించాలి.
- దోమల వికర్షకాలను వాడాలి.
అదనపు ప్రశ్నలు – జవాబులు:
I. విషయావగాహన:
ప్రశ్న 1.
పెంపుడు జంతువులు మనకు ఏ విధంగా సహాయపడతాయి ?
జవాబు.
కుక్కలు, పిల్లులు, ఆవులు, మేకలు, ఎద్దులు, బాతులు, కోళ్ళు మొదలైనవి పెంపుడు జంతువులకు ఉదాహరణలు. పెంపుడు జంతువుల వల్ల ప్రయోజనాలు :
- కుక్కలు ఇండ్లకు కాపలా కాస్తాయి.
- పిల్లులు ఎలుకలను పట్టుకొనడంలో సహాయపడతాయి.
- ఆవులు, మేకలు పాలు ఇస్తాయి.
- ఎద్దులు వ్యవసాయంలో సహాయపడతాయి.
- కోళ్ళు, బాతులు గుడ్లు పెడతాయి.
- మేకలు, గొట్టెలు, కోళ్ళు మాంసాన్నిస్తాయి.
- గుజ్రాలు, గాడిదలు బరువులు మోస్తాయి.
ప్రశ్న 2.
‘వన్య మృగాలు’ అనగానేమి ? ఉదాహరణ లివ్వండి ?
జవాబు.
అడవులలో నివసించే జంతువులను “వన్యమృగాలు” అంటారు.
ఉదా : సింహం, పులి, ఎలుగుబంటి, ఏనుగు.
ప్రశ్న 3.
“భూచరజీవులు” అనగా నేమి ? ఉదాహరణలివ్వండి.
జవాబు.
నేలపై నివసించే జంతువులను “భూ చరజీవులు” అంటారు.
ఉదా : ఆవు, కుక్క, పిల్లి, కోడి మొదలైనవి.
ప్రశ్న 4.
“జలచర జీవులు” అనగానేమి ?
జవాబు.
నీటిలో నివసించే జంతువుల్ని “జలచరజీవులు” అంటారు.
ఉదా : చేపలు, డాల్ఫిన్, అక్టోపస్, … స్టార్ ఫిష్ మొదలగునవి.
ప్రశ్న 5.
“ఉభయచర జీవులు” అనగానేమి ? వాటికి ఏవి సహాయపడతాయి ?
జవాబు.
- నేలమీదా, నీటిలోనూ నివసించే జీవుల్ని “ఉభయచర జీవులు” అంటారు.
- తేమగా ఉంటే చర్మం, వేళ్ళ మధ్య చర్మం, బలమైన వెనుక కాళ్ళు వీటికి నేలమీదా, నీటిలోనూ నివసించటానికి ఉపయోగపడతాయి.
- ఉదా : కప్ప, సాలమాండర్.
ప్రశ్న 6.
“శాఖాహారులు” అనగానేమి ? ఉదాహరణ ల్విండి ?
జవాబు.
గడ్డి మరియు మొక్కల నుంచి లభించే ఆహార పదార్థాలను మాత్రమే తిని జీవించే జంతువుల్ని “శాఖాహారులు” అంటారు.
ఉదా : ఆవులు, ఎద్దులు, గాడిదలు, గుర్రాలు, ఏనుగులు, జింకలు మొదలైనవి.
ప్రశ్న 7.
“మాంసాహారులు” అనగానేమి ? ఉదాహరణ లివ్వండి ?
జవాబు.
జంతువుల మాంసాన్ని తిని జీవించే జంతువుల్ని “మాంసాహారులు” అంటారు.
ఉదా : సింహం, పులి, నక్క, మొసలి మొ||నవి.
ప్రశ్న 8.
“ఉభయాహారులు” అనగా నేమి ? ఉదాహరణలివ్వండి.
జవాబు.
మొక్కల్ని మరియు జంతువుల్ని తిని జీవించే జంతువుల్ని “ఉభయహారులు” అంటారు.
ఉదా : కాకి, కోతి, కుక్కలు మొదలైనవి.
II. ప్రశ్నించడం – పరికల్పనలు చేయడం:
ప్రశ్న 9.
ఎ) నేను జంతువుల రక్తాన్ని పీలుస్తాను. నేను ఎవరు ?
జవాబు.
దోమ
బి) మేము పుప్పాల మకరందాన్ని పీలుస్తాము. మేము ఎవరు ?
జవాబు.
సీతాకోకచిలుక, తేనెటీగలు.
సి) మేము చనిపోయిన జంతువుల్ని, కళేబరాల్ని తింటాను. మమ్మల్ని “పారిశుద్ధ్య కార్మికులు” అంటారు.
జవాబు.
రాబందులు, గ్రద్దలు, నక్కలు.
III. ప్రయోగాలు – క్షేత్ర పరిశీలనలు:
ప్రశ్న 8.
ఈ క్రింది వ్యవసాయ క్షేత్రాన్ని పరిశీలించండి.
జవాబు.
విద్యార్థి కృత్యము.
ప్రశ్న 9.
చిత్రంలోని జంతువుల పేర్లు చెప్పండి ?
జవాబు.
ఎద్దు, కోతి, ఉడుత, కప్ప, కొంగ, కాకి, చిలుక, కుక్క, పాము.
ప్రశ్న 10.
మీ పరిసరాలలో మీరు ఏయే జంతువుల్ని చూశారు?
జవాబు.
నేను పైన పేర్కొన్న అన్ని జంతువుల్ని మా పరిసరాలలో చూశాను.
విద్యార్థి కృత్యము.
ప్రశ్న 11.
పై చిత్రాన్ని చూసి పెంపుడు జంతువుల్ని Dతోనూ, వన్య మృగాలను W తోనూ గుర్తించండి.
జవాబు.
విద్యార్థి కృత్యము.
కుత్వము 2: (TextBook page No.53)
ప్రశ్న 12.
పై పటంలో జంతువులను పరిశీలించండి. పై జంతువులు ఏ విధంగా ఒక చోటు నుంచి ఇంకో చోటుకు చలిస్తాయి ?
_______, _______ ఎగరగలవు.
_______, _______ పాకగలవు.
_______, _______ నడవగలవు.
_______, _______ గెంతగలవు.
_______, _______ ఈదగలవు.
_______, _______ దుమకగలవు
జవాబు.
1) పావురం మరియు కాకి ఎగరగలవు.
2) బల్లి, పాము పాకగలవు.
3) పిల్లి, కుక్క నడవగలవు.
4) కంగారూ, కప్ప గెంతగలవు.
5) చేప, ఆక్టోపస్ ఈదగలవు.
6) కుందేలు, కోతి దుమకగలవు
కృత్యము 3: (TextBook page No.56)
ప్రశ్న 13.
క్రింది చిత్రం చూసి జంతువుల పేర్లు, అవి నివసించే ప్రదేశాలు వ్రాయండి.
జవాబు.
విద్యార్థి కృత్యము.
కృత్వము 4: (TextBook page No.57)
ప్రశ్న 14.
జంతువులు నివసించే ప్రదేశాన్ని బట్టి వాటిని విభజించి ఈ క్రింది పట్టికలో నమోదు చేయండి.
జవాబు.
విద్యార్థి కృత్యము.
జతపరచుము:
ప్రశ్న 15.
క్రింది జంతువులను అవి నివసించే ప్రదేశాలతో జతపరచండి.
జవాబు.
1. i
2. c
3. d
4. e
5. g
6. f
7. a
8. b
9. h
ప్రశ్న 16.
క్రింది జంతువులను వాటి ఆహారంతో జతపరచండి.
జవాబు.
ప్రశ్న 17.
క్రింది జంతువుల అరుపులు పేర్కొనండి.
జవాబు.
దూడ అరుపు, కోయిల కూత, బల్లి అరుపు, కీచు ధ్వని, కావ్ కాప్, మ్యాచ్, గర్జించటం, బీ, సకలింపు, పంది అరుపు, మొరుగు
- ఆవుదూడ – దూడ అరుపు (అంబా)
- కోయిల – కోయిల కూత (కూ.. ఊ)
- బల్లి – బల్లి అరుపు
- కీచురాయి – కీచు ధ్వని
- కుక్క – బౌ బౌ, మొరుగును
- పిల్లి – మ్యావ్
- కాకి – కావ్ కావ్
- పులి – గర్జించును
- గుఱ్ఱం – సకలించును
- పంది – పంది అరుపు (గుర్రుగుర్రు)
- గాడిద – బ్రీ
- మేక – మే…మే
VI. ప్రశంస – విలువలు జీవ వైవిధ్యంపట్ల స్పృహ కల్గి ఉండడం:
ప్రశ్న 18.
నీవు దారిలో పిల్ల పక్షి చెట్టు మీదనుంచి క్రింద పడటం చూస్తే ఏమిచేస్తావు?
జవాబు.
నా దారిలో పిల్ల పక్షి చెట్టు మీద నుంచి క్రింద పడటం చూస్తే నేను వెంటనే దానిని తీసి జాగ్రత్తగా ఆ పక్షి గూడుకు చేర్చుతాను.
బహుళైచ్ఛిక ప్రశ్నలు:
ప్రశ్న 1.
పిల్ల ఆవును _____________ అంటారు.
A) కోయిలపిల్ల
B) గొర్రె పిల్ల
C) లేగదూడ
D) పప్పీ
జవాబు.
C) లేగదూడ
ప్రశ్న 2.
కీచురాయి చేయు శబ్దము _____________
A) బల్లి అరుపు
B) కీచుధ్వని
C) దూడ అరుపు
D) కోయిలశబ్దం
జవాబు.
B) కీచుధ్వని
ప్రశ్న 3.
కోళ్ళను ఉంచే ప్రదేశం _____________
A) చికెన్ కోప్స్
B) గుఱ్ఱపుశాల
C) పందులదొడ్డి
D) కలుగు
జవాబు.
A) చికెన్ కోప్స్
ప్రశ్న 4.
రాబందులు, కాకులు, నక్కలు చనిపోయిన కుళ్ళిన జంతు కళేబరాల్ని తింటాయి. వీటిని _____________ అంటారు.
A) విఘటన కాదలు
B) పారిశుద్ధ్య కార్మికులు
C) శాఖాహారులు
D) ఉభయహారులు
జవాబు.
B) పారిశుద్ధ్య కార్మికులు
ప్రశ్న 5.
కప్ప, సాలమండర్ ఏ జాతికి చెందినవి ?
A) జలచరాలు
B) భూచరాలు
C) ఉభయచరజీవులు
D) ఏదీకాదు
జవాబు.
C) ఉభయచరజీవులు
ప్రశ్న 6.
నేలపై నివసించే జీవులను _____________ అంటారు.
A) భూచరజీవులు
B) జలచరజీవులు
C) ఉభయచరజీవులు
D) ఏదీకాదు
జవాబు.
A) భూచరజీవులు
ప్రశ్న 7.
మనం జంతువులు, పక్షుల పై _____________ కల్గి ఉండాలి.
A) బాధ
B) దయ
C) చెడ్డగా
D) ఏదీకాదు
జవాబు.
B) దయ
ప్రశ్న 8.
క్రింది వాటిలో మకరందంను (పుష్పంలోని) పీల్చుకునేవి.
A) సీతాకోక చిలుక
B) దోమలు
C) చీమలు
D) ఏవీకావు
జవాబు.
A) సీతాకోక చిలుక
ప్రశ్న 9.
____________ మనుషులు, జంతువుల రక్తాన్ని పీల్చుకుంటాయి.
A) ఈగలు
B) దోమలు
C) చీమలు
D) ఏవీకావు
జవాబు.
B) దోమలు
ప్రశ్న 10.
కుక్కల నివాస స్థావరం _____________.
A) గుజ్జాలశాల
B) గూడు
C) కెన్నెల్ (కుక్కలబోను)
D) ఏమీకావు
జవాబు.
C) కెన్నెల్ (కుక్కలబోను)