Andhra Pradesh AP Board 3rd Class EVS Solutions 5th Lesson ఆహారం – ఆరోగ్యం Textbook Exercise Questions and Answers.
AP State Syllabus 3rd Class EVS Solutions Lesson 5 ఆహారం – ఆరోగ్యం
I. విషయావగాహన:
ప్రశ్న 1.
మనం ఆహారం తినకపోతే ఏమి జరుగుతుంది ?
జవాబు.
మనం ఆహారం తినకపోతే ఏ పనీ చేయలేము. ఆటలు ఆడలేము. పని చేయుటకు, ఆటలు ఆడుకు, పరిగెత్తుటకు మనకు శక్తి అవసరం. ఆహారం మనకు శక్తిని ఇస్తుంది. పెరుగుదలకు, జీవించుటకు, పని చేయుటకు కావలసిన శక్తి కొరకు మనం ఆహారాన్ని తినాలి.
ప్రశ్న 2.
వండకుండానే తినగలి పదార్థాల పేర్లు చెప్పండి ?
జవాబు.
వండకుండా తినగలిగే పదార్థాలు :- కేరట్, దోస, టమాట, పళ్ళు, ఖర్జూరాలు, చెరకు, గింజలు మొదలైనవి.
ప్రశ్న 3.
ఆహారం ప్రాముఖ్యత ఏమిటి ?
జవాబు.
ఆహారం శరీరానికి కావలసిన పోషకాలను అందిస్తుంది. ఈ పోషకాలు శరీర పెరుగుదలకు, శక్తికి, వివిధ జీవక్రియల నిర్వహణకు తోడ్పడతాయి. పోషకాలు రోగ నిరోధక శక్తిని కూడా పెంపొందిస్తాయి.
II. ప్రశ్నించడం – పరికల్పనలు చేయడం:
ప్రశ్న 4.
పులిహోర చేయటానికి మీ అమ్మగారిని ఏయే ప్రశ్నలు అడుగుతావు ?
జవాబు.
అమ్మను ఈ క్రింది ప్రశ్నలు అడుగుతాను.
- పులిహోర తయారీకి ఏఏ పదార్థాలు కావాలి ?
- పులిహోర తయారీలో దశలేవి ?
- చింతపండు లేక నిమ్మకాయ వాడవచ్చా ?
- 1/4 kg బియ్యానికి ఎంత ఉప్పు తీసుకోవాలి ?
III. ప్రయోగాలు – క్షేత్ర పరిశీలనలు:
ప్రశ్న 5.
పెసలను నీటిలో 3 గంటల పాటు నానబెట్టండి. నీటిని పారబోసి ఈ నానబెట్టిన వాటిని తడి గుడ్డలోకి ” మార్చి గట్టిగా కట్టండి. ఒక రాత్రంతా ఉంచండి. మరుసటిరోజు తెరవండి. ఏమి పరిశీలించావు ?
జవాబు.
విద్యార్థికృత్యము.
IV. సమాచార నైపుణ్యాలు – ప్రాజెక్టులు:
ప్రశ్న 6.
మీ ప్రాంతంలోని మొక్కలు, జంతువుల నుంచి లభించే ఆహార పదార్థాల జాబితా తయారు చేయండి.
జవాబు.
మొక్కల నుంచి ఆహారం |
జంతువుల నుంచి ఆహారం |
1. పళ్ళు | 1. మాంసం |
2. కూరగాయలు | 2. పాలు |
3. ఆకు కూరలు | 3. చేపలు, రొయ్యలు వంటి సముద్ర జీవులు |
4. గింజలు | 4. గ్రుడ్లు మొదలైనవి |
V. బొమ్మలు గీయడం – నమునాలు తయారు చేయడం:
ప్రశ్న 7.
మీ కిష్టమైన పండ్లు, కూరగాయల బొమ్మలు గీయండి.
జవాబు.
విద్యార్థికృత్యము.
VI. ప్రశంస:
ప్రశ్న 8.
ఏయే మంచి ఆహారపు అలవాట్లను మీ మిత్రులకు సూచిస్తావు ?
జవాబు.
నా మిత్రులకు సూచించే ఆహారపు అలవాట్లు :
- ఆహారం తీసుకోటానికి ముందు, తర్వాత చేతులు శుభ్రంగా కడుక్కోవాలి.
- అన్ని రకాల కూరగాయలను తినాలి.
- ఆహారాన్ని బాగా నమిలి తినాలి.
- ఆహారం తినేటప్పుడు క్రింద పడిపోకుండా జాగ్రత్తగా తినాలి.
- కూరగాయలు, పళ్ళు బాగా శుభ్రపరచిన తర్వాతనే తినాలి.
ప్రశ్న 9.
ఆహారం వృధాను అరికట్టడానికి 2 నినాదాలు రాయండి.
జవాబు.
” బ్రతక టానికి తినాలి. కానీ తినటానికి బ్రతకరాదు” .
” మనం వృధాచేసే ఆహారం పై ఒక దేశం బ్రతకగలదు”.
అదనపు ప్రశ్నలు – జవాబులు:
I. విషయావగాహన:
ప్రశ్న 1.
వేర్వేరు వయస్సు వారు వేర్వేరు ఆహార పదార్థాలు తింటారు. ఎందుకు ?
జవాబు.
- చిన్న పిల్లల్లో దంతాలు ఉండవు. కావున వారు ఆహారాన్ని నమల లేరు. కావున వారు మెత్తని ఆహారం, పాలు తీసుకుంటారు. .
- వృద్ధుల్లో దంతాలు ఊడిపోయి ఉంటాయి. కావున వారు నమల లేరు. వారు మెత్తని ఆహారాన్ని తీసుకుంటారు.
- యుక్త వయస్సులో ఉన్నవారు అన్ని రకాల ఆహార పదార్థాలు తింటారు. ఈ
విధంగా వేర్వేరుగా వయస్సు వారి ఆహారపు అలవాట్లు వేర్వేరు ఉంటాయి.
ప్రశ్న 2.
మనకు ఆహారం వేని ద్వారా లభిస్తుంది. మొక్కల నుంచి జంతువుల నుంచి లభ్యమయ్యే ఆహార పదార్థాలను పేర్కొనండి.
జవాబు.
ఆహారం మనకు జంతువుల నుంచి, మొక్కల నుంచి లభ్యమగును. మొక్కల నుంచి లభ్యమయ్యే ఆహారాలు :
- కూరగాయలు : ఉదా : వంకాయ, ములక్కాయ, దోసకాయ, సొరకాయ, బీరకాయ మొదలైనవి.
- ఆకు కూరలు : మునగాకు, పాలకూర, తోటకూర, కరివేపాకు మొదలైనవి.
- పళ్ళు : ఆపిల్, నారింజ, మామిడి, ద్రాక్ష మొదలైనవి.
- ధాన్యాలు : వరి, గోధుమ, జొన్న మొదలైనవి.
- గింజలు : జీడిపప్పు, వేరుశనగపప్పు మొదలైనవి. .
- పప్పుధాన్యాలు : కందులు, పెసలు, మినుములు మొదలైనవి.
ప్రశ్న 3.
మనకు జంతువుల నుంచి లభ్యమయ్యే ఆహార పదార్థాలేవి?
జవాబు.
- మనకు మాంసం, పాలు, గుడ్లు, జంతువుల నుంచి లభ్యమౌతాయి.
- పాల పదార్థాలైన పెరుగు, వెన్న, నెయ్యి, జున్ను, వంటివి.
- సముద్ర జీవులైన చేపలు, రొయ్యలు, నత్తలు వంటి వాటి మాంసము జంతువుల నుంచి లభ్యమగును.
ప్రశ్న 4.
మనం వండిన ఆహారాన్ని తింటాము. ఎందుకు?
జవాబు.
వండటం వల్ల ఆహార పదార్థాలు మెత్తగా, రుచిగా తయారౌతాయి. మరియు వండిన ఆహారం త్వరగా జీర్ణం అవుతుంది.
ప్రశ్న 5.
ఏఏ అంశాలపై ఒక ప్రదేశంలోని ప్రజల ఆహార అలవాట్లు ఆధారపడతాయి?
జవాబు.
ఒక ప్రదేశంలోని ప్రజల ఆహారపు అలవాట్లు క్రింది అంశాలపై ఆధారపడి ఉంటాయి.
అవి:
- ఆ ప్రదేశంలో పండించే పంటలు
- అక్కడి వాతావరణంలో పంటల లభ్యత.
ప్రశ్న 6.
కూరగాయలు గుర్తించి వాటి పేర్లను రాయండి. హెల్ప్ బాక్స్ను ఉపయోగించండి.
జవాబు.
ప్రశ్న 7.
మీ నాన్నగారిని, అమ్మను అడిగి ఈ పట్టిక నింపండి. మీ జాబితాను మీ స్నేహితుల జాబితాతో సరిపోల్చండి.
జవాబు.
విద్యార్ధికృత్యం.
ప్రశ్న 8.
జతపరచండి :
జవాబు.
1. C
2. B
3. A
బహుళైచ్ఛిక ప్రశ్నలు:
ప్రశ్న 1.
జీవించుటకు, పని చేయటానికి ___________ కావాలి.
A) ఆహారం
B) మాంసం
C) గ్రుడ్లు
D) ఏదీకాదు
జవాబు.
A) ఆహారం
ప్రశ్న 2.
తేనెటీగలు పువ్వులనుంది ___________ ను సేకరిస్తాయి.
A) దువ్వెన
B) రక్తం
C) తేనే
D) అన్నీ
జవాబు.
C) తేనే
ప్రశ్న 3.
ఆహారం మనకు ___________ ఇస్తుంది.
A) శక్తి
B) పని
C) ధనం
D) ఏదీకాదు
జవాబు.
A) శక్తి
ప్రశ్న 4.
మొక్కలో అధిక పోషకాలు కల్గిన భాగం. ___________
A) గింజలు
B) ఆకులు
C) కొమ్మలు
D) ఈనెలు
జవాబు.
B) ఆకులు
ప్రశ్న 5.
చెరకు నుంచి లభ్యమయ్యేది. ___________
A) బెల్లం
B) పంచదార
C) A మరియు B
D) ఏదీకాదు
జవాబు.
C) A మరియు B
ప్రశ్న 6.
పుట్ట గొడుగు ___________ కు ఉదాహరణ.
A) పచ్చని మొక్క
B) శిలీంధ్రం
C) కీటకం
D) ఏదీకాదు
జవాబు.
B) శిలీంధ్రం
ప్రశ్న 7.
వండటం ద్వారా ఆహారానికి ___________ వస్తాయి.
A) మెత్తదనం
B) రుచి
C) A మరియు B
D) ఏదీకాదు
జవాబు.
C) A మరియు B
ప్రశ్న 8.
జంతువుల నుంచి లభ్యమయ్యేవి.
A) గ్రుడ్లు
B) మాంసం
C) పాలు
D) పైవన్నీ
జవాబు.
D) పైవన్నీ
ప్రశ్న 9.
ఆహారాన్ని ___________ చేయరాదు.
A) తినటం
B) వృధా
C) అరుగుదల
D) ఏదీకాదు
జవాబు.
B) వృధా
ప్రశ్న 10.
మనకు తేనె ___________ నుంచి లభిస్తుంది.
A) మొక్కలు
B) జంతువులు
C) బెరడు
D) తేనెపట్టు
జవాబు.
D) తేనెపట్టు.