Andhra Pradesh AP Board 4th Class EVS Solutions 8th Lesson రవాణా Textbook Exercise Questions and Answers.
AP State Syllabus 4th Class EVS Solutions Lesson 8 రవాణా
I. విషయావగాహన:
ప్రశ్న 1.
మీ గ్రామంలో లేక పట్టణాల్లో వినియోగించే రవాణా వాహనాలేమిటి?
జవాబు.
మా గ్రామంలో ఉపయోగించే రవాణా వాహనాలు
- సైకిలు
- స్కూటర్
- కార్లు
- ఆటో
- బస్
- లారీ
- రైలు
ప్రశ్న 2.
మీరెప్పుడైనా ఎడ్లబండిలో ప్రయాణించారా? ఎప్పుడు? ఎక్కడ?
జవాబు.
నేను మా తాతగారి ఊరికి వెళ్ళేటప్పుడు ఎడ్లబండిలో ప్రయాణించాను.
ప్రశ్న 3.
ఒంటెను ఎడారి ఓడ అనడానికి కారణమేమిటి?
జవాబు.
- ఎడారి ప్రాంతాలలో ప్రధానమైన రవాణా సౌకర్యం ఒంటె.
- ఇసుకలో సునాయసంగా నీరు కూడా తాగకుండా ఎక్కవ దూరం ప్రయాణించగలదు
- అందుకే ఒంటెను ఎడారి ఓడ అంటారు.
II. ప్రశ్నించడం – పరికల్పనలు చేయడం:
ప్రశ్న 4.
మీ మామయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి గల ప్రయాణ సౌకర్యాలు గురించి తెలుసుకోవడానికి మీ నాన్నగారిని ఏయే ప్రశ్నలు వేస్తావు?
జవాబు.
- మన మామయ్య వాళ్ళ ఊరికి ఎలా వెళ్ళాలి?
- మామయ్య వాళ్ళ ఊరికి రైలు సౌకర్యం ఉందా?
- మామయ్య వాళ్ళ ఊరికి మోటార్ సైకిల్ మీద వెళ్ళవచ్చా?
- ఇక్కడి నుండి మామయ్య వాళ్ళ ఊరికి దూరం ఎంత?
III. ప్రయోగాలు – క్షేత్ర పరిశీలనలు:
ప్రశ్న 5.
మీకు దగ్గరలోని ఒక బస్టాండును సందర్శించి అక్కడ లభ్యమయ్యే సౌకర్యాల గురించి డిపోమేనేజర్ గారిని అడిగి, బస్సుల రాకపోకల సమాచారాన్ని సేకరించండి?
జవాబు.
విజయవాడ నుండి తిరుపతి కి వెళ్ళే బస్సుల రాకపోకలు ?
బస్సు | వచ్చే సమయం | బయలుదేరు సమయం |
1. | 10.40 am | 11.00 am |
2. | 12.40 pm | 1.00 pm |
3. | 2.00 pm | 2.15 pm |
4. | 4.10 pm | 4.30 pm |
5. | 9.00 pm | 9.20 pm |
IV. సమాచార నైపుణ్యాలు – ప్రాజెక్టులు:
ప్రశ్న 6.
వివిధ రవాణా సాధనాల బొమ్మలను సేకరించి స్క్రిప్ పుస్తకం తయారు చేయండి?
జవాబు.
V. బొమ్మలు గీయడం – నమునాలు తయారు చేయడం:
ప్రశ్న 7.
ఇవ్వబడిన ఆంధ్రప్రదేశ్ పటంలో ఏవైనా రెండు ఓడరేవులను గుర్తించండి?
జవాబు.
ఆంధ్ర ప్రదేశ్ లో ఓడరేవులు.
1) విశాఖపట్నం
2) కాకినాడ
VI. ప్రశంస:
ప్రశ్న 8.
మీరు కారులో / ఎడ్లబండిలో ప్రయాణించేటప్పుడు ఎలా అనుభూతి చెందుతావు? ఏమైనా తేడా గమనించావా?
జవాబు.
- నేను కారులో వెళ్ళినపుడు అది వేగంగా ప్రయాణించడం వల్ల నేను ప్రకృతి అందాలను చూడ లేక పోయాను.
- అదే నేను ఎడ్ల బండిలో వెళ్ళినపుడు అది నెమ్మదిగా ప్రయాణించడం వల్ల, ప్రకృతి అందాలను చూడగలిగాను.
కృత్యము: (TextBook Page No.67)
ఆంధ్రప్రదేశ్ పటంలోని విమానశ్రయాలను ఓడ రేవులను పరిశీలించండి?
జవాబు.
విమానశ్రయాలు | ఓడరేవులు |
1. విశాఖపట్టణం | విశాఖపట్టణం |
2. రాజమండ్రి | కాకినాడ |
3. గన్నవరం | కృష్ణపట్నం |
4. వై.స్.ఆర్ కడప | మచిలీపట్నం |
5. రేణిగుంట | |
6. పుట్టపర్తి |
కృత్యము: (TextBook Page No.68)
జంతువులను ఉపయోగించి మనం టాంగా, ఎడ్లబండి వంటి వాటిలో ప్రయాణిస్తున్నాం. మీరు అలాంటి జంతువుల పట్ల ఎటువంటి శ్రద్ధ వహిస్తారు?
జవాబు.
- జంతువు గిట్టలను లోహపు తొడుగులతో రక్షించాలి.
- జంతువులకు ఆరోగ్యకరమైన మేతను అందించాలి
- జంతువులకు ప్రత్యేకమైన షెడ్డును నిర్మించి వాటిని ప్రేమగా చూసుకోవాలి.
అదనపు ప్రశ్నలు:
ప్రశ్న 1.
గ్రామీణ ప్రాంతాలలో ఎటువంటి రవాణా వ్యవస్థను ఉపయోగిస్తారు?
జవాబు.
గ్రామీణ ప్రాంతాలలో రోడ్డు సౌకర్యం సరిగా లేని చోట గ్రామస్థులు ఎడ్లబండ్లు, ట్రాక్టర్లు, గుర్రపుబళ్ళు లేక టాంగా (జట్కా) ఉపయోగించి సమీప ఊళ్ళకు వెళతారు.
ప్రశ్న 2.
కొంత ప్రాంతాలలో ఏ విధమైన రవాణా వ్యవస్థ ఉంటుంది?
జవాబు.
- కొండ ప్రాంతాలలో ప్రజలు కాలిబాటలో ప్రయాణిస్తారు.
- గాడిదలను, గుర్రాలను వస్తు రవాణా కొరకు ఉపయోగిస్తారు.
- కొండ ప్రాంతాలో రోప్ వేలను కూడా రవాణా కొరకు వినియోగిస్తున్నారు.
ప్రశ్న 3.
అడవులలో రవాణా వ్యవస్థ గురించి రాయండి?
జవాబు.
- అడవులలో శాశ్వత రోడ్డు మార్గాలు ఉండవు.
- అడవులలో నివసించే గిరిజనులు కాలిబాటలను ఉపయోగించి ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి ప్రయాణిస్తారు.
- అడవులలో వృద్ధులను, రోగులను డోలీలలో మోసుకెళతారు.
ప్రశ్న 4.
ఎడారులలో రవాణా గురించి సమాచారాన్ని సేకరించండి?
జవాబు.
- ఎడారి ప్రాంతాలలో రవాణా సౌకర్యం చాలా పరిమితంగా ఉంటుంది.
- ఇక్కడ ప్రధానమైన రవాణా సౌకర్యం ఒంటె.
- ఒంటె నీరు కూడా తాగకుండా ఇసుకలో ఎక్కవ దూరం ప్రయాణించగలదు.
ప్రశ్న 5.
“మూపురం” ఒంటెకు ఎలా ఉపయోగపడుతుంది?
జవాబు.
ఒంటె మూపురం వేడిగా ఉన్న ఎడారి ప్రాంతలలో వారాల పాటు నీరు తాగకుండా జీవించడానికి సహాయపడుతుంది.
ప్రశ్న 6.
మంచు ప్రాంతాలలో ఎటువంటి రవాణా వ్యవస్థ ఉంటుంది?
జవాబు.
- ధృవ ప్రాంతాలు ఎప్పుడూ మంచుతో కప్పబడి ఉంటాయి.
- కుక్కలు లాగే స్లెడ్జ్ లను రవాణా సాధనంగా వినియోగిస్తారు.
ప్రశ్న 7.
భవిష్యత్తులో మన రవాణా ఎలా ఉండబోతుంది?
జవాబు.
భవిష్యత్తులో మన రవానా సాధనాలుగా అత్యంత వేగంగా ప్రయాణించే బుల్లెట్ రైళ్ళు, నీటిలో ప్రయాణించే కార్లు, ఎగిరే డ్రోన్లు ఉంటాయి.
ప్రశ్న 8.
మన భారతదేశాన్ని “భిన్నత్వంలో ఏకత్వం” అని ఎందుకు అంటారు?
జవాబు.
భారతదేశం ఒక అందమైన ప్రదేశం. ప్రజలు భిన్న రకాలుగా విస్తరించి ఉన్నా, అందరూ కలిసి ఉంటారు. దీనినే ” భిన్నత్వంలో ఏకత్వం” అంటారు.
ప్రశ్న 9.
లంక గ్రామాలలో రవాణా గురించి సమాచారాన్ని సేకరించి రాయండి.
జవాబు.
(i) నదుల మధ్య అనేక లంక గ్రామాలు ఉన్నాయి.
(ii) ప్రజలు అక్కడకు దగ్గరగా ఉన్న పట్టణానికి గాని గ్రామానికి గాని పుట్టీలు,
పడవలు ద్వారా ప్రయాణిస్తారు.
ప్రశ్న 10.
రవాణా అనగానేమి?
జవాబు.
మనుషులు, వస్తువులు ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి భూ జల, వాయు మార్గాలలో జరిపే కదలికలను రవాణా అంటారు.
బహుళైచ్ఛిక ప్రశ్నలు:
సరియైన సమాధానాలను గుర్తించండి:
ప్రశ్న 1.
ఎడారులలో ప్రధాన రవాణా సాధనం _____________
A) గాడిద
B) ఎద్దుల బండి
C) ఒంటె
D) ఏనుగు
జవాబు.
C) ఒంటె
ప్రశ్న 2.
స్లెడ్జ్ బండ్ల ను _____________ ప్రాంతాలలో ఉపయోగిస్తారు.
A) మంచు
B) అటవీ
C) కొండ
D) ఎడారి
జవాబు.
A) మంచు
ప్రశ్న 3.
వేరుగా ఉన్న దానిని గుర్తించండి _____________
A) బస్సు
B) విమానం
C) కారు
D) లారీ
జవాబు.
B) విమానం
ప్రశ్న 4.
వస్తు రవాణా కొరకు _____________ ప్రాంతాలో గాడిదలను, గుర్రాలను వినియోగిస్తారు. –
A) మంచు
B) ఎడారి
C) నది
D) కొండ
జవాబు.
D) కొండ
ప్రశ్న 5.
_____________ ను ఎడారి ఓడ అంటారు.
A) ఒంటె
B) గాడిద
C) గుర్రము
D) ఏనుగు
జవాబు.
A) ఒంటె
ప్రశ్న 6.
అడువులలో వృద్ధులను. రోగులను మోసుకెళ్ళడానికి _____________ లను ఉపయోగిస్తారు.
A) అంబులెన్స్
B) డోలీ
C) బస్సు
D) ఎద్దుల బండి
జవాబు.
B) డోలీ
ప్రశ్న 7.
కొన్ని _____________ ప్రాంతాలలో రోప్ వేలను కూడా రవాణ కొరకు వినియోగిస్తున్నారు.
A) మంచు
B) ఎడారి
C) కొండ
D) గ్రామీణ
జవాబు.
C) కొండ
ప్రశ్న 8.
మనుషులు, వస్తువులు ఒక ప్రాంతం నుండి మరోక ప్రాంతానికి జరిపే కదలికలను _____________ అంటారు.
A) వ్యాపారం
B) బదిలీ
C) మార్పిడి
D) రవాణా
జవాబు.
D) రవాణా
ప్రశ్న 9.
క్రింది వాటిలో ఓడరేవు కల్గి ఉన్నది _____________
A) కాకినాడు
B) విశాఖపట్టణం
C) క్రిష్ణ పట్నం
D) పైవన్ని
జవాబు.
D) పైవన్ని
ప్రశ్న 10.
కింద వానిలో విమానాశ్రయం లేని పట్టణం _____________
A) గన్నవరం
B) తిరుపతి
C) పుట్టపర్తి
D) రాజమండ్రి
జవాబు.
B) తిరుపతి