AP Board 6th Class Maths Solutions Chapter 7 బీజ గణిత పరిచయం Unit Exercise

AP SCERT 6th Class Maths Textbook Solutions Chapter 7 బీజ గణిత పరిచయం Unit Exercise Questions and Answers.

AP State Syllabus 6th Class Maths Solutions 7th Lesson బీజ గణిత పరిచయం Unit Exercise

ప్రశ్న 1.
ఒక ఫ్యాన్ ధర ₹1500 అయిన ‘n’ ఫ్యాన్ల ధర ఎంత?
సాధన.
ఒక ఫ్యాన్ ధర = ₹ 1500
n ఫ్యాన్ల ధర = ₹ 1500 × n = ₹ 1500n

AP Board 6th Class Maths Solutions Chapter 7 బీజ గణిత పరిచయం Unit Exercise

ప్రశ్న 2.
శ్రీను దగ్గర కొన్ని పెన్సిళ్లు ఉన్నాయి. రహీం దగ్గర శ్రీను దగ్గర ఉన్న పెన్సిళ్లకు 4 రెట్లు ఎక్కువ పెన్సిళ్లు ఉన్నాయి. అయితే రహీం దగ్గర గల పెన్సిళ్లను ఒక సమాస రూపంలో రాయండి.
సాధన.
శ్రీను దగ్గర గల పెన్సిళ్లు = p అనుకొందాం.
రహీం దగ్గర శ్రీను దగ్గర గల పెన్సిళ్లకు 4 రెట్లు పెన్సిళ్లు కలవు.
∴ రహీం దగ్గర గల పెన్సిళ్లు = 4 × p = 4p

ప్రశ్న 3.
సోఫియా దగ్గర కంటే పార్వతి దగ్గర 5 పుస్తకాలు ఎక్కువగా ఉన్నాయి. పార్వతి దగ్గర ఎన్ని పుస్తకాలున్నాయి? పుస్తకాల సంఖ్యను సూచించడానికి ఏదేని ఒక చరరాశిని తీసుకొని సమాసంను రాయండి.
సాధన.
సోఫియా దగ్గర గల పుస్తకాలు = x అనుకొందాం.
సోఫియా దగ్గర పార్వతి దగ్గర 5 పుస్తకాలు ఎక్కువ కలవు.
∴ పార్వతి దగ్గర గల పుస్తకాలు = x + 5

ప్రశ్న 4.
కింది వానిలో సమీకరణాలు ఏవి?
(అ) 10 – 4p = 2
(ఆ) 10 + 8 = p – 22
(ఇ) x + 5 = 8
(ఈ) m + 6 = 2
(ఉ) 22x – 5 = 8
(ఊ) 4k + 5 > 100
(ఋ) 4p + 7 = 23
(ౠ) y < – 4
సాధన.
(అ) 10 – 4p = 2 – సమీకరణము
(ఆ) 10 + 8 = p – 22 – సమీకరణము
(ఇ) x + 5 = 8 – సమీకరణము
(ఈ) m + 6 = 2 – సమీకరణము
(ఉ) 22x – 5 = 8 – సమీకరణము
(ఊ) 4k + 5 > 100 – సమీకరణము కాదు
(ఋ) 4p + 7 = 23 – సమీకరణము
(ౠ) y < – 4 – సమీకరణము కాదు

AP Board 6th Class Maths Solutions Chapter 7 బీజ గణిత పరిచయం Unit Exercise

5. కింది సమీకరణాలకు L.H.S మరియు R.H.S లను రాయండి.

ప్రశ్న (అ)
7x + 8 = 22
సాధన.
7x + 8 = 22
LHS = 7x + 8
RHS = 22

ప్రశ్న (ఆ)
9y – 3 = 6
సాధన.
9y – 3 = 6
LHS = 9y – 3
RHS = 6

ప్రశ్న (ఇ)
3k – 10 = 2 4
సాధన.
3k – 10 = 2
LHS = 3k – 10
RHS = 2

ప్రశ్న (ఈ)
3p – 4q = 19
సాధన.
3p – 4q = 19
LHS = 3p – 4q
RHS = 19

AP Board 6th Class Maths Solutions Chapter 7 బీజ గణిత పరిచయం Unit Exercise

6. యత్నదోష పద్ధతిలో కింది సమీకరణాలను సాధించండి.

ప్రశ్న (అ)
x – 3 = 5
సాధన.
AP Board 6th Class Maths Solutions Chapter 7 బీజ గణిత పరిచయం Unit Exercise 1
అవును x = 8 అయిన LHS = RHS
∴ x – 3 = 5 యొక్క సాధన x = 8

ప్రశ్న (ఆ)
y + 6 = 15
సాధన.
AP Board 6th Class Maths Solutions Chapter 7 బీజ గణిత పరిచయం Unit Exercise 2
y = 9 అయిన LHS = RHS
కావున y + 6 = 15 యొక్క సాధన y = 9

ప్రశ్న (ఇ)
\(\frac {m}{2}\)
సాధన.
AP Board 6th Class Maths Solutions Chapter 7 బీజ గణిత పరిచయం Unit Exercise 3
m = 2 అయిన LHS = RHS కావున \(\frac {m}{2}\) = 1 యొక్క సాధన m = 2.

AP Board 6th Class Maths Solutions Chapter 7 బీజ గణిత పరిచయం Unit Exercise

ప్రశ్న (ఈ)
2k – 1 = 3
సాధన.
AP Board 6th Class Maths Solutions Chapter 7 బీజ గణిత పరిచయం Unit Exercise 4
k= 2 అయిన LHS = RHS.
కావున 2k – 1 = 3 యొక్క సాధన k = 2.