SCERT AP 8th Class Social Study Material Pdf 1st Lesson పటాల అధ్యయనం – విశ్లేషణ Textbook Questions and Answers.
AP State Syllabus 8th Class Social Solutions 1st Lesson పటాల అధ్యయనం – విశ్లేషణ
8th Class Social Studies 1st Lesson పటాల అధ్యయనం – విశ్లేషణ Textbook Questions and Answers
Improve your learning (మీ అభ్యసనాన్ని మెరుగుపడుచుకోండి)
ప్రశ్న 1.
మీ పాఠశాలలోని అట్లాస్ లో వివిధ విషయ నిర్దేశిత పటాలను క్షుణ్ణంగా అధ్యయనం చేయండి. (AS2)
జవాబు:
స్వయం అధ్యయనం
ప్రశ్న 2.
ప్రాచీన గ్రీకుల కాలం నాటికి, నేటికి పటాల వినియోగంలో మార్పులు వచ్చాయని భావిస్తున్నారా? పోలికలు, తేడాలు కింది పట్టికలో పొందుపరచండి. (AS1)
విషయం | ప్రాచీన గ్రీకుల కాలంలో | ప్రస్తుతం |
పోలికలు | ||
తేడాలు |
జవాబు:
విషయం | ప్రాచీన గ్రీకుల కాలంలో | ప్రస్తుతం |
పోలికలు | వారు అక్షాంశాలు, రేఖాంశాలు ఊహించి, వాటి సహాయంతో పటాలను కచ్చితంగా గీయడానికి ప్రయత్నించేవారు. | నేడు ఉపగ్రహాల సహాయంతో పటాలను ఒంపులతో సహా కచ్చితంగా గీస్తున్నారు. |
తేడాలు | పటాలు నావికులకు ఉపయోగపడటానికి రచించే వారు. వర్తక, వ్యాపార అభివృద్ధికి కూడా ఉపయోగించేవారు. | తేడాలు నేడు పటాలను ప్రణాళికల కొరకు, దేశాభివృద్ధికి, వ్యూహరచనకు ఉపయోగిస్తున్నారు. |
ప్రశ్న 3.
వలసపాలకులు తుపాకుల ద్వారా కంటే పటాలు తయారు చేయడం ద్వారా ఆ ప్రాంతాలను బాగా దోచుకోగలిగారని, అదుపులో ఉంచగలిగారని చాలామంది భావిస్తారు. మీరు దీంతో ఏకీభవిస్తారా? కారణాలను తెలపండి. (AS1)
జవాబు:
అవును. నేను కూడా దీనితో ఏకీభవిస్తాను. ఇందుకు గల కారణాలు :
- ఐరోపా దేశాలు ఇతర ప్రపంచ దేశాలను తమ వలసలుగా మార్చుకోవడంతో, ఆ ప్రాంత వివరాలను తెలుసు కోవలసిన అవసరం ఏర్పడింది.
- వీరు పటాలను తయారుచేసేవారిని శాస్త్రబృందాలతో కలిపి ఆయా ప్రాంతాలకు పంపారు.
- వారు అక్కడ అన్ని ప్రాంతాలలోనూ ప్రయాణించి, శాస్త్రీయంగా అధ్యయనం చేసి పటాలు రచించారు.
- ఆ పటాలు ఆ ప్రాంత రవాణా సౌకర్యాలు, పంటలు, ఇతర వనరుల సమాచారాన్ని వెల్లడి చేశాయి.
- వీటి ఆధారంగా వలసపాలకులు ఆయా ప్రాంతాలపై తమ పాలనను పటిష్టపరచుకొని అక్కడి వనరులను దోచుకున్నారు.
ప్రశ్న 4.
టాలమీ లేదా ఇద్రిసీ తయారుచేసిన పటాలకు బ్రిటిష్ వాళ్లు తయారుచేసిన పటాలకు గల తేడాలు ఏమిటి? (AS5)
జవాబు:
బ్రిటిష్ వారి పటాలు | టాలమీ ఇద్రిసి పటాలు |
1. వీరు పటాలను ఆ ప్రాంతాలను, ఆ ప్రాంతాలలోని వనరులను దోచుకోవడానికి తయారుచేశారు. | 1. వీరు పటాలను వారి ఆసక్తి కోసం, వారి రాజుల కోసం తయారుచేశారు. |
2. వీరి పటాలు వీరి వలసల సమాచారాన్ని అందిస్తున్నాయి. | 2. వీరి పటాలు ఐరోపా ఖండాన్ని, దాని చుట్టుప్రక్కల దేశాల్ని చూపించాయి. |
3. ఇవి నేటి పటాలకు, వాస్తవానికి దగ్గరగా ఉన్నాయి. | 3. ఇవి వారి దేశాలను భూమికి మధ్యలో ఉంచాయి. |
4. ఇవి పటానికి పైభాగాన ఉత్తరాన్ని సూచించాయి. | 4. అల్ ఇద్రిసి పటము పైభాగాన దక్షిణాన్ని సూచించింది. |
ప్రశ్న 5.
ఎనిమిదవ పేజిలోని “మన కాలంలో పటాల వినియోగం” అనే అంశం చదివి ప్రశ్నకు జవాబు రాయండి.
వ్యాపారం, నౌకాయానం, యుద్ధాలు, వలస ప్రాంతాలను ఏర్పరచుకోవటం వంటి వాటికోసం పటాలు తయారుచేసి ఉపయోగించారని మనం తెలుసుకున్నాం. నేటి కాలంలో దేశ అభివృద్ధికి, ప్రణాళికలు తయారు చేయటానికి పటాలను విస్తృతంగా వినియోగిస్తున్నారు. ఒక ప్రాంతంలోని వనరులు, ఆ ప్రాంతం ఎదుర్కొంటున్న సమస్యలు వంటివి ప్రణాళికలు తయారు చేసేవాళ్లకు తెలియాలి. పటాల ద్వారా ఈ విషయాలు తెలుస్తాయి. ఉదాహరణకు తాగునీటి సమస్య ఉన్న ప్రదేశాలను చూపించే పటాన్ని తయారు చేయవచ్చు. ఈ పటాన్ని నీటి వనరులైన వర్షపాతం, భూ గర్భజలాలు, నదుల పటాలతో పోల్చవచ్చు. ఈ పోలికల ఆధారంగా ఆ ప్రాంతం ప్రజలందరికీ తాగునీరు అందించటానికి బోరుబావులు తవ్వటం, నదులకు అడ్డంగా ఆనకట్టలు కట్టడం, చెరువులు తవ్వటం లేదా దూర ప్రాంతం నుంచి పైపుల ద్వారా నీటిని చేరవేయడం – వీటిలో ఏది ఉత్తమమైన విధానమో నిర్ణయించవచ్చు. అదే విధంగా పటాల సహాయంతో వ్యవసాయ అభివృద్ధికీ, కొత్తగా పరిశ్రమలు నెలకొల్పటానికీ, రోడ్డు వెయ్యటానికి, ఆసుపత్రులు, పాఠశాలల నిర్మాణానికి ప్రణాళికలు తయారు చెయ్యవచ్చు.
ప్రస్తుతం పటాలను వివిధ ఉద్దేశాలతో ఉపయోగిస్తున్నారు? అవి ఏవి? (AS1)
జవాబు:
- నేటి కాలంలో దేశాభివృద్ధికి, ప్రణాళికలు తయారుచేయటానికి పటాలను విస్తృతంగా ఉపయోగిస్తున్నారు.
- పటాల సహాయంతో వ్యవసాయ అభివృద్ధికి, కొత్తగా పరిశ్రమలు నెలకొల్పడానికి, రోడ్లు వేయడానికి, ఆసుపత్రులు, పాఠశాలల నిర్మాణానికి ప్రణాళికలు తయారుచేయవచ్చు.
- కంపెనీలు తమ వ్యాపార కార్యకలాపాలు రూపొందించుకోవడానికి పటాలు తయారుచేస్తాయి.
ప్రశ్న 6.
వివిధ రకాల పటాలను గురించి తెలుసుకోవడానికి కొన్ని ప్రశ్నలను తయారుచేయండి. (AS5)
జవాబు:
- ప్రపంచంలో దేశాల సరిహద్దులతో ముద్రించిన పటాలనేమంటాం? (ప్రపంచం – రాజకీయ పటం)
- ప్రపంచంలోని వివిధ భూ స్వరూపాలతో ముద్రించిన పటాలను ఏమంటాం? (ప్రపంచం – భౌగోళిక పటం)
- భారతదేశంలోని రాష్ట్రాలను సూచించే పటాన్ని ఏమంటాం? (భారతదేశం – రాజకీయపటం)
- భారతదేశంలో రవాణా సౌకర్యాలను సూచించే మానచిత్రాన్ని ఏమంటారు? (భారతదేశం – రవాణా సౌకర్యాలు)
- మన గ్రామం – చిత్తు పటాన్నేమంటాం? (గ్రామం – స్కెచ్ పటం)
- అల్ ఇద్రిసి, దామింగ్ హయితు, మెర్కేటర్ రూపొందించిన పటాల విశిష్టత ఏమిటి?
- పవిత్ర బైబిలు ప్రకారం ప్రపంచనమూనా ఎట్లా ఉండేది?
8th Class Social Studies 1st Lesson సూర్యుడు – శక్తి వనరు InText Questions and Answers
8th Class Social Textbook Page No.6
ప్రశ్న 1.
ప్రాచీన కాలంలో పటాల తయారీని నావికులు ఏ విధంగా ప్రభావితం చేశారు?
జవాబు:
ప్రాచీన కాలంలో నావికులు విస్తృతంగా సముద్ర ప్రయాణాలు చేసేవారు. వారు సందర్శించిన భూమిని గురించి, కలిసిన వ్యక్తులను గురించి, విన్న చరిత్రను గురించి, పుస్తకాలను రచించేవారు. దానికి సంబంధించిన పటాలను కూడా తయారుచేసేవారు. అవి పెద్దగా ప్రాచుర్యంలోనికి రానప్పటికీ చరిత్రకారులు వాటిని ఉపయోగించి తిరిగి పటాలను తయారుచేసేవారు.
ప్రశ్న 2.
పటాలను తయారు చేసేవాళ్ళు తమ దేశాన్ని పటం మధ్యలో ఎందుకు ఉంచారు?
జవాబు:
పటాలను తయారు చేసేవారు వాటిని తయారుచేయటానికి నావికుల, అన్వేషకుల రచనల మీద ఆధారపడేవారు. అంతేకాక వీరు అమిత దేశభక్తులని చెప్పవచ్చు. వీరు తమ దేశం ప్రపంచానికి మూలమని, చాలా ముఖ్యమైనదని భావించేవారు. అందుకే వీరు తమ దేశాన్ని పటం మధ్యలో ఉంచారు.
8th Class Social Textbook Page No.8
ప్రశ్న 3.
పటాలు అందరికీ అందుబాటులో ఉండటం మంచిదేనా? ఎందుకు?
జవాబు:
పటాలు అందరికీ అందుబాటులో ఉండటం మంచిది కాదు అని నా అభిప్రాయము. ఏ దేశ ప్రభుత్వానికైనా కొంత రహస్యత అవసరము. దేశ రక్షణకు సంబంధించిన పటాలు శత్రువుల చేతిలో పడినట్లయితే వాటిని దుర్వినియోగం చేసే అవకాశం ఉంటుంది. దేశ భద్రతకు ముప్పు వాటిల్లుతుంది. కానీ ఈ రోజుల్లో ఉపగ్రహ ఛాయాచిత్రాలు అందరికీ అందుబాటులోకి వచ్చేస్తున్నాయి.
ప్రశ్న 4.
ఆసుపత్రి నెలకొల్పటానికి అనువైన ప్రాంతాన్ని ఎంచుకోవాలనుకుంటున్న వ్యక్తికి ఏ ఏ పటాలు అవసరమవుతాయి? జాబితా తయారుచేయండి.
జవాబు:
- ఆసుపత్రుల పటము
- లాబొరేటరీల పటము
- స్కానింగ్ సెంటర్ల పటము
- అనారోగ్యం ఎక్కువగా ఏ ప్రాంతంలో ఉందో చూపించే పటము
- బస్సు రవాణా పటము
- రైలు రవాణా పటము
- బ్లడ్ బ్యాంకుల పటము
ప్రశ్న 5.
కొత్త పాఠశాలలు, కళాశాలలు నెలకొల్పటానికి పటాలను ఎలా ఉపయోగించవచ్చో చెప్పండి. దీని కోసం ఏఏ పటాలను అధ్యయనం చేయవలసి ఉంటుంది?
జవాబు:
కొత్త పాఠశాలలు, కళాశాలలు నెలకొల్పడానికి ఆ ప్రాంతంలో పాఠశాలకు, కళాశాలకు వెళ్ళే విద్యార్థులు ఎంతమంది ఉన్నారు, వారు ఏయే ప్రాంతాలకు ఎంత దూరం వెళుతున్నారు, ఆ ప్రాంతంలో విద్యాలయం స్థాపించడానికి తగిన వసతి ఎక్కడ ఉన్నది, ఫీజు నిర్ణయించడానికి వారు ఏ స్థాయికి చెందినవారు మొదలైన అంశాలను తెలుసుకోవాలి. దీని కోసం జనాభా పటము, నివాస పటము, రవాణా పటము, నీటివసతి పటము మొదలైన వాటిని అధ్యయనం చేయాలి.
ప్రశ్న 6.
డేవిడ్ లివింగ్స్టన్, స్టాన్లీ, అముద్సన్ వంటి ప్రముఖ అన్వేషకుల జీవితాల గురించి తెలుసుకోండి. వారి అన్వేషణలకు అయ్యే ఖర్చును ఎవరు భరించారు? ఎందుకు?
జవాబు:
1. డేవిడ్ లివింగ్స్టన్ : 19-3-1813 నుండి 1-5-1873 వరకు జీవించాడు.
స్కాట్లాండ్ దేశస్థుడు. ఆఫ్రికాను కనుగొన్నాడు. లండన్ మిషనరీ సొసైటీ వారు పంపించారు.
ఈ వ్యాపారాన్ని వృద్ధి చేసి, క్రైస్తవాన్ని వ్యాపింపచేయడానికి.
2. సర్ హెన్రీ మోర్టన్ స్టాన్లీ : 21-1-1841 నుండి 10-5-1904 వరకు జీవించాడు.
డెంబిగ్-వేల్స్-యు.కె. దేశస్థుడు. న్యూయార్క్ హెరాల్డ్ పత్రికవారు పంపారు.
డేవిడ్ లివింగ్ స్టనను వెతికి పట్టుకోవడానికి.
3. రోల్డ్ అముడ్సన్ : 16-7-1872 నుండి 18-6-1928.
బోర్డ్-ఓ ఫోల్డ్ – నార్వే దేశస్థుడు.
బెల్జియన్ అంటార్కిటిక్ ఎక్స్ పెడిషన్ వారు పంపారు.
దక్షిణ ధృవ అన్వేషణకు పంపారు.
4. అల్ఫోన్సా డి అల్బుకర్క్ : పోర్చుగీసు నావికుడు.
పోర్చుగల్ రాజైన ఇమ్మాన్యుయేల్-I పంపారు.
హిందూ మహాసముద్రంలో పోర్చుగీసు వలస సామ్రాజ్యాన్ని స్థాపించడానికి
ప్రశ్న 7.
అన్ని వివరాలతో కూడిన పటాలను తయారు చేయటానికి వలస పాలకులు పెద్ద ఎత్తున నిధులు ఎందుకు వెచ్చించారు?
జవాబు:
పటాల తయారీ వలన వలసపాలకులకు తమ వలసల పట్ల, వాటి వనరుల పట్ల పూర్తి అవగాహన కలిగేది. తద్వారా వారు తమ వలస దేశాలను దోచుకోవడానికి వీలు కలిగేది. అందువలన వలస పాలకులు పటాల తయారీకి పెద్ద ఎత్తున నిధులు వెచ్చించారు.
ప్రశ్న 8.
యుద్ధ సమయంలో సైన్యానికి పటాలు ఏ విధంగా ఉపయోగపడతాయి?
జవాబు:
యుద్ధ సమయంలో సైన్యానికి, ఎయిర్ ఫోర్స్ వారికి పటాలు అత్యంత ఆవశ్యకం. వారు ప్రాంతాల వివరాలను, సంస్థల ప్రాంతాలను, వారి గమ్యాల నిర్దేశానికి స్ట్రాటజీ’ పటాలను ఉపయోగిస్తారు.
ప్రశ్న 9.
పూర్వకాలంలో వారు పటాలను ఎలా తయారుచేసేవారు?
జవాబు:
నాటి భౌగోళిక శాస్త్రవేత్తలు విరివిగా ప్రయాణాలు చేసి వాటికి సంబంధించిన వివరాలను పుస్తకాల రూపంలో నమోదు చేసేవారు. పటాలను తయారు చేసేవారు. వీటిని ఆధారంగా చేసుకుని పటాలను తయారు చేసేవారు. ఇవి వాస్తవ దూరంగా ఉండి పెద్దగా వాడుకలోనికి రాలేదు. కానీ, చరిత్రకారులు వీటిని ఉపయోగించి పటాలను తిరిగి తయారు చేసేవారు.
ప్రశ్న 10.
ఎవరెస్టు శిఖరానికి ఆ పేరు ఎట్లు వచ్చింది?
జవాబు:
1802లో విలియం లాంటన్ ఒక ప్రముఖ సర్వేను చెన్నై నుండి ప్రారంభించారు. ఇది హిమాలయాల వరకు రేఖాంశాలను, ఇతర ఎత్తులను తెలుసుకోవడానికి ఉద్దేశించబడినది. ఈ సర్వే జార్జి ఎవరెస్ట్ చే పూర్తి చేయబడింది. ఈ సర్వేలోనే ‘ఎవరెస్ట్’ అన్ని శిఖరాలలోకి ఎత్తైనది అని ప్రపంచానికి వెల్లడైంది. కాబట్టి ఆ శిఖరానికి ఆయన పేరు పెట్టడం జరిగింది.
ప్రశ్న 11.
పటాలకు, చిత్రాలకు మధ్య గల భేదమేమి?
జవాబు:
పటం :
ముఖ్యమని భావించే అంశాలను చూపించడానికి భౌగోళిక శాస్త్రజ్ఞులు పటాలను ఉపయోగిస్తారు.
చిత్రం :
చిత్రం పటం వలే ఆ ప్రాంతంలోని నిజమైన అంశాలను కాక కేవలం కంటికి కనిపించే వాటిని మాత్రమే చూపిస్తుంది.
ప్రశ్న 12.
నిర్దేశిత పటాలను ఎట్లు చదవాలి?
జవాబు:
- ఒకే అంశంపై కేంద్రీకరించబడే పటాలను నిర్దేశిత పటాలు అంటారు.
- వీటిని చదవడానికి మనకు పటాలలో ఉపయోగించే గుర్తులు, రంగులు, వివిధ ఆచ్ఛాదనలు తెలిసి ఉండాలి.
ఉదా : ముదురు ఊదా : కొండలు, నలుపు : సరిహద్దులు
అప్పుడు మాత్రమే నిర్దేశిత పటాలను మనం చదవగలగుతాం.
ప్రశ్న 13.
ఐసోలైన్స్ అంటే ఏమిటి?
జవాబు:
సముద్ర మట్టం నుంచి ఒకే ఎత్తులో ఉన్న ప్రదేశాలన్నింటినీ కలిపే వాటిని ఐసోలైన్స్ అంటారు.
ప్రశ్న 14.
కాంటూరు రేఖల వలన ఉపయోగమేమి?
జవాబు:
కాంటూరు రేఖల వలన ఒక ప్రాంతపు ఎత్తును, పల్లాన్ని సులభంగా తెలుసుకోవచ్చును.
ప్రశ్న 15.
పూర్వకాలం నాటి పటం తయారీదారుల పేర్లను తెలపండి.
జవాబు:
గ్రీకులు, అరబ్బులు, చైనీయులు, సుమేరియన్లు, బాబిలోనియన్లు మరియు యూరోపియన్లు మొదలైనవారు పూర్వకాలం ఆనాటి పటం తయారీదారులు.
ప్రశ్న 16.
సాంప్రదాయ సంకేతాలు అంటే ఏమిటి?
జవాబు:
పూర్వకాలం నాటి నుండి పటాల తయారీదారులు తమ సౌలభ్యం కోసం కొన్ని గుర్తులను ఉపయోగించేవారు. వాటినే సాంప్రదాయ సంకేతాలు అంటారు.
ప్రశ్న 17.
ఈ ప్రక్క నీయబడిన చిత్రాన్ని గమనించి మీ అభిప్రాయాన్ని రాయండి.
జవాబు:
- ఈ పటం బైబిలును అనుసరించి ప్రపంచ నమూనా.
- ఇది చుట్టూ సముద్రంచే ఆవరించబడి, మూడు ఖండాలుగా విభజించబడినది.
- అవి ఆసియా, ఐరోపా మరియు ఆఫ్రికా.
- వీటిలో ఆసియా జెరూసలెంను కలిగి ఉన్న కారణంగా ప్రాముఖ్యతను సంతరించుకుని ఆ పటంలో సగభాగాన్ని ఆక్రమించింది.
- జెరూసలెం క్రీస్తు జన్మస్థలం. కావున అది పై భాగంలో చూపబడినది.
ప్రశ్న 18.
ప్రక్కనీయబడిన చిత్రాన్ని పరిశీలించి, ‘మెర్కేటర్ ప్రక్షేపణ’ పై మీ అభిప్రాయాన్ని తెలియచేయండి.
జవాబు:
- గెరార్డస్ మెర్కేటర్ ప్రఖ్యాతి గాంచిన భౌగోళిక శాస్త్రవేత్త మరియు కార్టో గ్రాఫర్.
- ఈయన ప్రక్షేపణ ప్రకారం భూమధ్యరేఖ నుండి ధృవాల వైపుకు వెళ్ళేకొలదీ ప్రదేశాల ఆకారాలు పెద్దవిగా కనబడతాయి.
ఉదా : 1. గ్రీన్‌లాండ్ వాస్తవానికి చిన్నదైనా, ప్రపంచ పటంలో ఆఫ్రికా ఖండం అంత కనబడుతుంది. వాస్తవానికి ఆఫ్రికా గ్రీన్‌లాండ్, కన్నా 14 రెట్లు పెద్దది. గ్రీన్ లాండ్ అర్జెంటీనా దేశమంత మాత్రమే ఉంటుంది.
2. అలాస్కా – బ్రెజిల్
3. ఫిలాండ్ – ఇండియా
ప్రశ్న 19.
అల్ ఇద్రిసి జీవితాన్ని గురించి సమాచారాన్ని సేకరించి ఒక చిన్న వ్యాసం వ్రాయండి.
జవాబు:
అప్రఫ్ అల్ ఇద్రిసి 1099లో జన్మించారు. ఆయన ముస్లిం భౌగోళిక శాస్త్రవేత్త. కార్టోగ్రాఫర్ మరియు యాత్రికుడు. రోజర్ – II అనే రాజు కొలువులో, సిసిలీలో నివసించేవారు. ఆయన చిన్నతనంలో చాలా జీవితం ఉత్తర ఆఫ్రికా, స్పెయిన్స్ లో ప్రయాణం చేశారు. ఆఫ్రికా, హిందూ మహాసముద్రం, దూర ప్రాచ్యానికి సంబంధించి ఇస్లాం వర్తకులు, అన్వేషకులు సేకరించి ఇచ్చిన సమారాన్ని క్రోడీకరించి ఇస్లాం పటాలను తయారుచేశారు. ఆయన దీనికి సంబంధించి ఒక గ్రంథాన్ని కూడా రచించారు. (ది టాబులా రోజియానా). ఈ పుస్తకాన్ని నార్మన్ రాజు అయినటువంటి రోజర్-II కోసం రచించారు. ఈయన సిసిలీలో 1165/1166లో మరణించారు.
ప్రశ్న 20.
ఈ క్రింది సమాచారాన్ని చదివి, ఈయబడిన ప్రశ్నలకు సమాధానమునిమ్ము.
పటాలలో ఎత్తు, పల్లాలను చూపడం : భూమిపై ఎత్తులు, పల్లాలు అంటే కొండలు, లోయలు, పీఠభూములు, మైదానాలు, నదీ పరీవాహక ప్రాంతాలు, రాళ్లు, ఇసుకతో కూడిన ప్రదేశాలు ఉంటాయి. పటాలు బల్లపరుపుగా ఉంటాయి. కాబట్టి వాటిలో ఎత్తు, పల్లాలను చూపించలేం. అందుకని వీటిని చూపించటానికి కాంటూరు రేఖలు అనే ప్రత్యేక సంకేతాలను ఉపయోగిస్తాం. సముద్ర మట్టం నుంచి ఒకే ఎత్తులో ఉన్న ప్రదేశాలన్నిటినీ కలిపే వాటిని కాంటూరు రేఖలు అంటారు. ఇంకోరకంగా చెప్పాలంటే ఒక కాంటూరు రేఖ మీద ఉన్న ప్రదేశాలన్నీ సముద్ర మట్టం నుంచి ఒకే ఎత్తులో ఉంటాయి. కాంటూరు రేఖలను ఐసోలైన్స్ అని కూడా అంటారు.
1. భూమిపై ఎత్తు, పల్లాలు అంటే ఏమిటి?
జవాబు:
భూమిపై ఎత్తు, పల్లాలు అంటే కొండలు, లోయలు, పీఠభూములు, మైదానాలు, నదీ పరీభాహక ప్రాంతాలు, రాళ్లు, ఇసుకతో కూడిన ప్రదేశాలు మొదలగునవి.
2. పటాలలో ఎత్తు, పల్లాలను ఎందుకు చూపించలేము?
జవాబు:
పటాలు బల్ల పరుపుగా ఉంటాయి. కాబట్టి వాటిలో ఎత్తు, పల్లాలను చూపించలేము.
3. ప్రత్యేక సంకేతాలు అంటే ………………………
జవాబు:
కాంటూరు రేఖలు
4. …………. నుంచి ఒకే ఎత్తులో ఉన్న ప్రదేశాలను కలిపే వాటిని కాంటూరు రేఖలు అంటారు.
జవాబు:
సముద్ర మట్టం
5. కాంటూరు రేఖలను …………………. అని కూడా అంటారు.
జవాబు:
ఐసోలైన్స్)
ప్రశ్న 21.
ఇచ్చిన వివరాలను పరిశీలించి ఈ క్రింది ప్రశ్నలకు జవాబులిమ్ము.
1. పోర్చుగీసు అన్వేషకులు ఎవరు?
జవాబు:
ఫెర్డినాండ్ మాజిలాన్, వాస్కోడిగామా, బార్త్ లోవ్ మ్యూడియాస్.
2. మార్కోపోలో గురించి నీకేమి తెలుసును?
జవాబు:
మార్కోపోలో ఇటలీ దేశస్థుడు. 1254లో జన్మించాడు. ఆసియా ఖండాన్ని, చైనా దేశాన్ని అన్వేషించాడు. 1324లో మరణించాడు.
3. అమెరికాను కనుగొన్నదెవరు?
జవాబు:
క్రిస్టోఫర్ కొలంబస్
4. మాజిలాన్ జీవితకాలం ఏది?
జవాబు:
1480 నుండి 1521 వరకు
5. మొదటగా ప్రపంచాన్ని చుట్టి వచ్చినదెవరు?
జవాబు:
ఫెర్డినాండ్ మాజిలాన్
ప్రశ్న 22.
మీ పాఠశాలకు సంబంధించి జనాభా పటాన్ని తయారుచేయుము.
జవాబు:
నేను గాంధీజీ మునిసిపల్ కార్పొరేషన్ ఎలిమెంటరీ పాఠశాలలో చదువుతున్నాను. మా పాఠశాలలో 5 తరగతి గదులు, ఒక ప్రధానోపాధ్యాయుని గది, స్టాఫ్ రూమ్, వంట గది, టాయ్ లెట్లు ఉన్నాయి. పాఠశాలలో విద్యార్థుల సంఖ్య 176.
తరగతివారీగా | విద్యార్థులు |
1వ తరగతి | 44 |
2వ తరగతి | 40 |
3వ తరగతి | 42 |
4వ తరగతి | 28 |
5వ తరగతి | 22 |
ప్రశ్న 23.
ఇద్రిసి తయారుచేసిన పటంలో ‘దక్షిణం’ పై వైపు ఉండగా, గ్రీకులు తయారుచేసిన పటాలలో పై వైపు ఉత్తర దిశ ఎందుకు ఉంది?
జవాబు:
ఇస్లాం సాంప్రదాయాలు చాలా వరకు ప్రపంచంలోని ఇతర సాంప్రదాయాల కన్నా భిన్నంగా ఉంటాయి.
ఉదా : వారు వ్రాసే విధానం. అదేవిధంగా ఇద్రిసి పటంలో దక్షిణం పై వైపు ఉండి ఉండవచ్చు.
(లేదా)
సూర్యుని వైపు తిరిగి దానిని తూర్పుగా భావించి వారు కుడి చేతి వైపుకి ప్రాముఖ్యత యిచ్చి (అంటే దక్షిణానికి) దానిని పటంలో పైకి చూపించి ఉండవచ్చును.
ప్రశ్న 24.
ఈ క్రింది వివరణను చదివి దానికి సంబంధించి ఒక ప్రశ్నను వ్రాయుము.
“పటం తయారుచేసేవాళ్ళు ముఖ్యమనుకునే వాటిని చూపించే నమూనాగా పటాన్ని తయారుచేస్తారు. వీరు దేని – కోసం అన్న దాన్ని బట్టి వివిధ రకాల పటాలను తయారుచేస్తారు.”
జవాబు:
వివిధ రకాల పటాలను ఎందుకు తయారుచేస్తారు?
ప్రశ్న 25.
గ్రీకులు, రోమన్లు పటాల తయారీలో ఎందుకు ఆసక్తిని కలిగి ఉండేవారు?
జవాబు:
నాటి గ్రీకులకు, రోమన్లకు ప్రపంచ విజేతలు కావాలనే కోరిక ఎక్కువగా ఉండేది. అందుకే వారు పటాల తయారీలో ఎక్కువ ఆసక్తిని కలిగి ఉండేవారు.
పట నైపుణ్యాలు
8th Class Social Textbook Page No.4
ప్రశ్న 26.
అల్ ఇద్రిసి గీసిన పటంలో శ్రీలంకను, భారతదేశాన్ని గుర్తించండి.
జవాబు:
అల్ ఇద్రిసి పటంలో ద్వీపకల్ప పీఠభూమి ఉత్తర భారతదేశంలోనికి నెట్టివేయబడింది. తూర్పు, పశ్చిమ తీరాలు బాగా కలిసిపోయినాయి. దక్కను పీఠభూమి ఉత్తర, దక్షిణాలుగా వ్యాపించి కన్యాకుమారి వద్ద సూదిమొనగా తేలింది. శ్రీలంకను వాస్తవంగా ఉన్న దానికన్నా బాగా పెద్దదిగా చూపించారు. కావున అల్ ఇద్రిసి పటంలో భారతదేశాన్ని, శ్రీలంకను గుర్తించుట చాలా కష్టము.
గమనిక : ఈ మ్యాపును చదువుటకు దీనిని తలక్రిందులు చేయాలి.
ప్రశ్న 27.
‘పటం -4లో భారతదేశం, అరేబియా, ఆఫ్రికాలను గుర్తించండి.
జవాబు:
ఈ పటంలో భారతదేశం, అరేబియా, ఆఫ్రికాలు హిందూ మహాసముద్రంను దృష్టిలో వుంచుకొని చూపించారు. కావున అవి వాటి ఆకారాన్ని కొంతవరకు మాత్రమే పొందగలిగాయి. అవి పటంలో ఎడమచేతి వైపు క్రింది భాగంలో చిత్రించబడ్డాయి.
ప్రశ్న 28.
పటం 8ను చూడండి. బ్రిటిష్ కాలంలో తయారు చేసిన భారతదేశ పటంతో, నేటి భారతదేశాన్ని పోల్చండి.
జవాబు:
- పటం 8లో ఉన్న భారతదేశ పటం బ్రిటిష్ కాలంలో 19వ శతాబ్దం ప్రారంభంలో తయారు చేశారు. అనగా ఇది 200 సం||ల క్రితం తయారైంది. ప్రస్తుత భారతదేశ పటం ఎప్పటికప్పుడు సవరించబడి నేటి రూపంలో ఉంది.
- నాడు బ్రిటిష్ వారు రూపొందించిన ఊహాపటం కాదిది. సర్వే నిర్వహించి రూపొందించిందే. అయితే నాడు ఉపగ్రహచిత్రాలు లేకపోవడం, సాంకేతిక అభివృద్ధి ప్రారంభంలో ఉండటంతో కొంత సమగ్రత లోపించింది. నేడు సాంకేతిక పరిజ్ఞానం సహకారంతో కచ్చితమైన పటాలను రూపొందించగలుగుతున్నాం.
- నాడు హిందుస్థాన్ లేక బ్రిటిష్ ఇండియా పేరుతో ఈ పటాన్ని రూపొందించారు. నేడు ఇండియా (భారతదేశం) పేరుతో దేశ పటాలను తయారు చేస్తున్నాం.
- ఇన్ బాక్స్ లో నాటి ఈస్ట్ ఇండియా కంపెనీ ప్రావన్సీలైన బొంబాయి, మద్రాస్, కలకత్తాలు ముద్రించారు. నాటి పటంలో జమ్మూ, కాశ్మీర్ ప్రాంతాన్ని గుర్తించలేదు. నేటి మయన్మార్, బంగ్లాదేశ్, కాంబోడియా, వియత్నాం దేశాలను హిందూస్థాన్లో చేర్చారు. నేటి పటంలో ఈ దేశాలు మన సమీపంలోని దేశాలుగా తెల్లరంగులో ముద్రిస్తున్నాం.
- ఇండియన్ ఓషన్, బే ఆఫ్ బెంగాల్, అరేబియన్ సీ (హిందూమహా సముద్రం, బంగాళాఖాతం, అరేబియా ‘సముద్రం) నాడు, నేడూ ఒకే రకంగా ఉన్నాయి.
- పాకిస్థాన్‌ను బ్రిటిష్ వారి .హిందూస్థాన్ పటంలో చూపలేదు.
ప్రశ్న 29.
క్రిందనీయబడిన ప్రపంచ పటములో ఈ క్రింది వాటిని గుర్తించుము.
1. ప్రస్తుత బాబిలోనియా (సుమేరియా
2. గ్రీసు
3. సిసిలీ
4. లిబియా
5. ఆసియా
6. ఐరోపా
7. అరేబియా
8. చైనా
9. ఉత్తర అమెరికా
10. దక్షిణ అమెరికా
ప్రశ్న 30.
క్రిందనీయబడిన పటాన్ని చూచి, ఈ క్రింది. ప్రశ్నలకు సమాధానములిమ్ము.
1. అరేబియా సముద్రంలోని దీవులేవి?
జవాబు:
లక్షదీవులు
2. గుర్తు దేనిని సూచిస్తుంది.
జవాబు:
గుర్తు సరిహద్దులను సూచిస్తుంది.
3. పటం యొక్క స్కేలు ఎంత?
జవాబు:
1 సెం.మీ. = 200 కిలోమీటర్లు
4. తూర్పు తీరంలోని ఏదేని ఒక రాష్ట్రం పేరు తెలుపుము.
జవాబు:
ఆంధ్రప్రదేశ్
5. పశ్చిమతీరంలోని ఏదేని ఒక రాష్ట్రం పేరు తెలుపుము.
జవాబు:
గుజరాత్
ప్రశ్న 31.
క్రిందనీయబడిన పటాన్ని చూచి, ఈ క్రింది ప్రశ్నలకు సమాధానములిమ్ము.
1. ఆంధ్రప్రదేశ్ లో రెండు నదీ వ్యవస్థ పేర్లు రాయండి.
జవాబు:
కృష్ణా, గోదావరి.
2. ఉభయ గోదావరి జిల్లాల సాధారణ భౌగోళిక ఉన్నతి ఎంత?
జవాబు:
సముద్ర మట్టము నుండి 0 నుండి 150 మీటర్ల ఎత్తులో ఉన్నాయి.
3. మీ జిల్లా సాధారణ భౌగోళిక ఉన్నత ఎంత?
జవాబు:
విద్యార్థి కృత్యం.
ప్రశ్న 32.
క్రిందనీయబడిన పటాన్ని చూచి, ఈ క్రింది ప్రశ్నలకు సమాధానములిమ్ము.
1. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పశ్చిమంగా ఉన్న రాష్ట్రం ఏది?
జవాబు:
తెలంగాణ
2. ఆంధ్రప్రదేశ్ లో అధిక వర్షపాతం (100 సెం.మీ.) కన్నా ఎక్కువ పొందే జిల్లాలు ఏవి?
జవాబు:
శ్రీకాకుళం, విశాఖపట్నం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలు.
3. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సాధారణ వర్షపాతం (70 సెం.మీ. – 100 సెం.మీ.) వర్షపాతం పొందే జిల్లాలు ఏవి?
జవాబు:
కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాలు.
ప్రశ్న 33.
క్రిందనీయబడిన పటాన్ని చూచి, ఈ క్రింది ప్రశ్నలకు సమాధానములిమ్ము.
1. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నందలి ఎన్ని రకాల మృత్తికాలున్నాయి?
జవాబు:
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నందు ప్రధానంగా నాలుగు రకాల మృత్తికలున్నాయి.
2. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నందలి మృత్తికలు ఏ రకానికి చెందినవి?
జవాబు:
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నందలి మృత్తికలు ఎర్ర, నల్లరేగడి, ఇసుక మరియు రాతి రకానికి చెందినవి.
3. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నందు నల్లరేగడి మృత్తికలు ఏ ఏ జిల్లాలలో ఉన్నాయి?
జవాబు:
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నందు నల్లరేగడి మృత్తికలు ఉన్న జిల్లాలు
- కృష్ణా
- కర్నూలు
- ఉభయగోదావరి జిల్లాలలోని మధ్య ప్రాంతాలు.
4. పై పటాన్ని పరిశీలించగా అత్యధిక ప్రాంతంలో నల్లరేగడి నేలలు ఉన్న జిల్లా ఏది?
జవాబు:
కర్నూలు.
5. మీ జిల్లాలో ఏ రకమైన మృత్తికలు ఉన్నాయి?
జవాబు:
విద్యార్థి కృత్యం.
ప్రశ్న 34.
బాబిలోనియన్ల మట్టి పలకపై ఉన్న ప్రపంచ పటాన్ని ప్రశంసించండి.
జవాబు:
బాబిలోనియన్ల మట్టి పలకపై ప్రపంచపటం పర్షియన్ల కాలం నాటిది. అది సమతలంగాను, గుండ్రంగాను ఉన్నది. లోపలి ‘0’ లో వారికి తెలిసిన అన్ని ప్రాంతాలను చర్చించారు. బాబిలోనియాను పలక మధ్యలో చిత్రించారు. బయటి భాగంలో ఉప్పు సముద్రాన్ని చిత్రించారు. దానిలో 7 త్రికోణాకారపు దీవులను చూపించారు.
వారి ఆలోచనా శక్తి, ఊహాశక్తి, దానిని తయారుచేసిన కళానైపుణ్యం చాలా ప్రశంసించతగినది.
ప్రశ్న 35.
అక్షాంశ, రేఖాంశాలను, గ్రిడ్ ను ఎవరు కనిపెట్టారు?
జవాబు:
హిప్పొర్కస్ గ్రీకు ఖగోళవేత్త (190-120 BC). ఈయన అక్షాంశ, రేఖాంశాల ఆధారంగా ఒక ప్రాంతాన్ని తెలుసుకోవచ్చని భావించాడు. టాలమీ గ్రీకు ఖగోళవేత్త మరియు గణిత విద్యా పారంగతుడు. ఈయన ఈజిప్టులో జీవించాడు. ఈయన – కూడా ఈ అక్షాంశ, రేఖాంశ విధానాన్ని అవలంబించాడు. ఇది తరువాత తరం నాటి పటాల తయారీదార్లను అనుసరించేలా చేసింది. కావున టాలమీ ఈ పటాల రచనకు శాస్త్రీయత అనే పునాది వేశాడని భావించవచ్చు.