These AP 9th Class Social Important Questions 24th Lesson రోడ్డు భద్రతా విద్య will help students prepare well for the exams.
AP Board 9th Class Social 24th Lesson Important Questions and Answers రోడ్డు భద్రతా విద్య
9th Class Social 24th Lesson 1 Mark Important Questions and Answers in Telugu Medium
ప్రశ్న 1.
వాహనాల రద్దీ ఎలా పెరిగింది?
జవాబు:
జనాభా, పారిశ్రామికీకరణ, నగరీకరణ, ప్రపంచీకరణ (గ్లోబలైజేషన్) వలన వాహనాల రద్దీ కూడా పెరిగింది.
ప్రశ్న 2.
క్రమబద్ధీకరణ అంటే ఏమిటి?
జవాబు:
రవాణా సులభతరం కావడానికి ఒక క్రమబద్ధీకరణ అవసరం. క్రమబద్దీకరణ అనగా రోడ్డును ఉపయోగించే వారందరూ కచ్చితంగా రోడ్డు భద్రతా నియమాలను పాటించటమే.
ప్రశ్న 3.
ట్రాఫిక్, రోడ్డు ట్రాఫిక్ అంటే ఏమిటి?
జవాబు:
ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి వెళ్ళే వాటిని ట్రాఫిక్ అంటాం. అలాగే వాహనాలు ఒక చోటు నుంచి మరొక చోటుకు రోడ్డుమీద వెళ్లటాన్నే రోడ్డు ట్రాఫిక్ అంటాం.
ప్రశ్న 4.
ట్రాఫిక్ విద్య అంటే ఏమిటి?
జవాబు:
ట్రాఫిక్ నియమ నిబంధనలు సరళంగా, స్పష్టంగా వివరించి తెలియజేయడాన్ని ట్రాఫిక్ విద్య అంటాం.
ప్రశ్న 5.
రోడ్డును ఉపయోగించే వారి సంఖ్య ఎలా పెరిగింది?
జవాబు:
జనాభా పెరగడం, వాహనాల వినియోగం కూడా పెరగడం మూలంగా రోడ్డును ఉపయోగించుకునే వారి సంఖ్య పెరిగింది.
ప్రశ్న 6.
డ్రైవింగ్ లైసెన్స్ ఎన్ని రకాలు? అవి ఏవి?
జవాబు:
డ్రైవింగ్ లైసెన్స్ రెండు రకాలు :
- లెర్నర్ లైసెన్స్, ఇది తాత్కాలికమైనది. డ్రైవింగ్ నేర్చుకొనుటకు ఆరు నెలల కాలపరిమితితో దీనిని జారీ చేస్తారు.
- శాశ్వత లైసెన్స్ తాత్కాలిక లైసెన్స్ జారీ చేసిన ఒక నెల తరువాత నుంచి శాశ్వత లైసెన్స్ పొందుటకు అర్హత లభిస్తుంది.
ప్రశ్న 7.
ట్రాఫిక్ గుర్తులు ఎన్ని రకాలు? అవి ఏవి?
జవాబు:
ట్రాఫిక్ గుర్తులు మూడు రకాలు.
- తప్పనిసరిగా పాటించవలసిన గుర్తులు (ఎర్ర వృత్తాలు ఏమి చేయగూడదో తెలుపుతాయి)
- సమాచార గుర్తులు (నీలంరంగు దీర్ఘచతురస్రంలోని గుర్తులు)
- జాగ్రత్తపరచే గుర్తులు (ముక్కోణంలో ఉన్న గుర్తులు జాగ్రత్త పడేలా చేస్తాయి)
ప్రశ్న 8.
జీబ్రా క్రాసింగ్ అంటే ఏమిటి?
జవాబు:
జీబ్రా క్రాసింగ్ – పాదచారులు రోడ్డును ఒక వైపు నుంచి మరొకవైపుకు దాటడానికి ఉద్దేశించినది. ట్రాఫిక్ ఎక్కువగా ఉండే ప్రాంతాలలో వీటిని సూచిస్తారు.
ప్రశ్న 9.
ట్రాఫిక్ గుర్తులు అనగానేమి?
జవాబు:
వాహనాలను ప్రమాదరహితంగా నడపటానికి వీలుగా రెండు లేదా అంతకన్నా ఎక్కువ రోడ్లు కలిసిన ప్రాంతంలో ఏర్పాటు చేసిన గుర్తులను సూచించే పరికరాన్ని ట్రాఫిక్ గుర్తులు అంటారు.
ప్రశ్న 10.
రోడ్డు భద్రతకు అడ్డంకులు ఏవి?
జవాబు:
పౌరుల నిర్లక్ష్యం, రోడ్డుల స్థితి మంచిగా లేకపోవడం, రోడ్డు భద్రతా ప్రమాదాలు అమలు జరగకపోవడం, అత్యవసర సేవలు తక్కువగా ఉండటం, చట్టాల అమలు సక్రమంగా లేకపోవటడం రోడ్డు భద్రతకు అడ్డంకులు.
ప్రశ్న 11.
రోడ్డు ప్రమాదాలకు ప్రధానమైన ఏవేని రెండు కారణాలను రాయండి.
జవాబు:
- ట్రాఫిక్ విద్యపట్ల అవగాహన లేకపోవడం
- అపరిమితమైన వేగం
- త్రాగి వాహనాలు నడపడం
- ఫుట్ బోర్డుపై నిలబడి ప్రయాణించడం
- సీట్ బెల్ట్, హెల్మెట్ లను ఉపయోగించకపోవడం మొ||వి.
9th Class Social 24th Lesson 2 Marks Important Questions and Answers in Telugu Medium
ప్రశ్న 1.
కింది ‘పై’ చార్టు 2006 సం||లో రోడ్డు ప్రమాదాలు, బాధితుల వయస్సు, వారి వివరాలు వున్నాయి. చార్టును పరిశీలించి ప్రశ్నకు సమాధానం రాయండి.
‘పై’ చార్టులోని వివరాల ఆధారంతో విర్ధారణకు రాదగిన ప్రధానమైన విషయం ఏమిటి?
జవాబు:
పై చార్టులోని వివరాల ఆధారంతో నిర్ధారణకు రాదగిన ప్రధానమైన విషయం ఏమిటంటే.
- రోడ్డు ప్రమాదబాధితులలో అన్ని వయస్సుల వారూ ఉన్నారు.
- రోడ్డు ప్రమాద బాధితుల సంఖ్య 25-35 సంవత్సరాల మధ్య వయస్సు కలవారిలో ఎక్కువగా ఉంటోంది.
- యుక్త వయస్సు పిల్లలు స్వతంత్రతను ఎక్కువగా కోరుకోవడంతో ఎక్కువ ప్రమాదాల బారిన పడుతు.
- కౌమార దశలోని పిల్లలే రోడ్డును ఉపయోగించే వారిలో ఎక్కువ.
- వీటన్నింటికీ కారణం ప్రజలకు ట్రాఫిక్ విద్య పట్ల అవగాహన లేకపోవడం.
- ప్రమాదాల నివారణకి ప్రజలకు ట్రాఫిక్ విద్య, రోడ్డు భద్రత పట్ల అవగాహన కలిగించడం తప్పనిసరి.
9th Class Social 24th Lesson 4 Marks Important Questions and Answers in Telugu Medium
ప్రశ్న 1.
ప్రశ్న : పై సమాచారాన్ని విశ్లేషించి దాని ఆధారంగా ట్రాఫిక్ విద్య యొక్క అవసరాన్ని, ప్రాముఖ్యతను తెలపండి.
జవాబు:
- ట్రాఫిక్ గుర్తులను పాటించకపోవడం వలన ప్రమాదాలు జరగటానికి అవకాశం ఉంటుంది.
- ప్రమాదాలు ఒక్కొక్కసారి తీవ్ర గాయాలు, అంగవైకల్యానికి దారితీయవచ్చు.
- ఘోర ప్రమాదాలు జరిగి విలువైన ప్రాణాలను కోల్పోవటానికి అవకాశం ఉంటుంది.
- ట్రాఫిక్ గుర్తులను పాటించకపోవడం వలన మనకు మాత్రమేగాక ఎదుటివారికి కూడా హాని జరగవచ్చు.
- విలువైన వాహనాలు దెబ్బతింటాయి.
- అందువల్ల ట్రాఫిక్ గుర్తులను పాటిస్తూ మన ప్రాణాలను కాపాడుకుంటూ, ఎదుటివారి ప్రాణాలకు కూడా రక్షిణ కల్పిస్తే మానవ జీవితానికి సార్థకత చేకూరుతుంది.
ప్రశ్న 1.
శ్వాస పరీక్ష పరికరం ఎలా పనిచేస్తుంది?
జవాబు:
- ఎవరైనా ఆల్కహాల్ తీసుకున్నట్లయితే అది రక్తంలో కలిసిపోయి, వారి శరీరం మొత్తానికి రక్తం ద్వారా వ్యాపిస్తుంగ్.
- ఊపిరితిత్తులలోకి చేరడం ద్వారా ఆ వ్యక్తి విడిచిపెట్టే గాలిలో ఆల్కహాల్ కు సంబంధించిన ఆనవాలును ఒక ఎలక్ట్రానిక్ పరికరం ద్వారా గుర్తించగలం.
- ఆల్కహాల్ తీసుకున్న వ్యక్తి విడిచి పెట్టే గాలిలో కార్బన్ డై ఆక్సైడ్ తో పాటుగా ఆల్కహాల్ ఆనవాలు కూడా ఉంటుంది.
- ఇది తక్కువ మోతాదులో ఉన్నప్పటికీ ఈ పరికరం గుర్తించగలదు.
- ఒకవేళ ఈ పరికరం ద్వారా పరీక్షించిన అనంతరం సంబంధిత అధికారులు నిందితులకు మేలు చేయాలని ప్రయత్నించినా ఆ పరికరంలో నమోదైన విషయాలను తొలగించే అవకాశం లేదు.
ప్రశ్న 2.
డ్రైవింగ్ లైసెన్స్ ను ఎలాంటి పరిస్థితులలో రద్దు చేయవచ్చును?
జవాబు:
ఈ కింది సందర్భాల్లో ప్రాంతీయ ట్రాన్స్పోర్టు అధికారి లైసెన్సులను రద్దు చేయు అధికారం కలిగి ఉన్నారు.
ఒక వ్యక్తి :
- నిత్య తాగుబోతు అయినా
- ప్రమాదభరిత మత్తు పదార్థాలకు అలవాటుపడినా
- తన వాహనాన్ని నేరపూరిత విషయాలకు ఉపయోగించినా
- ప్రమాదభరితంగా వాహనాన్ని నడిపినా
- రిజిస్ట్రేషన్ చేయించకుండా వాహనాలను ఉపయోగించినా
- పోలీసు అధికారులు అడిగిన సమాచారాన్ని అందించకున్నా
- ప్రమాదం జరిగిన సందర్భంలో బాధితులను దగ్గరలోని హాస్పిటల్ కు చేర్చకపోయినా
- పోలీసులు అడిగినపుడు కింద ఇవ్వబడిన ధ్రువపత్రాలను చూపకపోయినా
– ఇన్స్యూరెన్స్ సర్టిఫికెట్
– రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్
– డ్రైవింగ్ లైసెన్స్
– కాలుష్య నియంత్రణ సర్టిఫికెట్
ప్రశ్న 3.
ప్రమాదాలను నివారించడానికి డ్రైవరకు ఎలాంటి సలహాలు ఇవ్వవలెను?
జవాబు:
డ్రైవరుకు సలహాలు :
- రోడ్డుకు ఎడమవైపున ఉండి కుడివైపున వేగంగా వెళ్లే వాహనాలకు దారి వదలాలి.
- ఎడమవైపు నుంచి వాహనాలను దాటరాదు.
- రక్షిత ప్రయాణానికి ఎల్లప్పుడూ హెల్మెట్ ధరించాలి.
- తక్కువ కార్బన్ మోనాక్సైడ్ వదిలే వాహనాలనే ఉపయోగించాలి.
- అనవసరంగా హారన్ మోగించరాదు.
- భారీ వాహనదారులు తప్పనిసరిగా సీటు బెల్టులు ఉపయోగించాలి.
- ట్రాఫిక్ సిగ్నల్స్ ను అతిక్రమించరాదు.
- తమ వాహనాన్ని మంచి స్థితిలో ఉంచుకోవాలి.
ప్రశ్న 4.
రోడ్డు భద్రతకు అడ్డంకులు ఏవి?
జవాబు:
రోడ్డు భద్రతకు అడ్డంకులు :
- పౌరుల నిర్లక్ష్యం
- రోడ్ల నాణ్యత మంచిగా లేకపోవడం
- వాహనాల నిర్మాణం రక్షణపరంగా లేకపోవడం
- రోడ్డు భద్రతా ప్రమాణాలు అమలు జరగకపోవడం
- చట్టాల అమలు సక్రమంగా లేకపోవడం
- అత్యవసర సేవలు తక్కువగా ఉండటం
ప్రశ్న 5.
పాదచారులు పాటించవలసిన నిబంధనలు ఏవి?
జవాబు:
పాదచారులకు నిబంధనలు :
- పాదచారులు తమకు’ నిర్దేశించిన మార్గంలోనే నడవాలి. ఒకవేళ అలాంటి ప్రత్యేక మార్గం లేకుంటే, రోడ్డు ఇరుకుగా ఉంటే రోడ్డుకు కుడివైపున ఎదురుగా వస్తున్న వాహనాలను పరిశీలిస్తూ నడవాలి.
- రాత్రివేళ బయట రోడ్డుపై నడుస్తున్నప్పుడు తప్పనిసరిగా ప్రతిబింబించే దుస్తులను ధరించాలి.
- రాత్రివేళల్లో నడిచేటప్పుడు విధిగా టార్చిలైట్ దగ్గర ఉంచుకోవాలి.
- రోడ్డును దాటునపుడు ఎడమవైపు, కుడివైపు చూసి వాహనాలు రాకుండా ఉన్నప్పుడు దాటాలి.
- ఒకవేళ వాహనాలు రెండువైపులా, వస్తూ ఉంటే అవి వెళ్లే వరకు వేచి ఉండాలి.
- వాహనాలు రాకుండా ఉన్నప్పుడు వేగంగా నడుచుకుంటూ రోడ్డును దాటాలి. రెండువైపులా వాహనాలు వస్తున్నాయో లేదో గమనించాలి.
- రోడ్డును దాటుటకు జీబ్రా క్రాసింగ్ ను ఉపయోగించుకోవాలి.
- రోడ్డుపై నడుస్తున్నపుడు, రోడ్డును దాటుతున్నపుడు మొబైల్ ఫోన్ ను ఉపయోగించరాదు.
- ట్రాఫిక్ పోలీస్ సహాయంతో రోడ్డును దాటాలి.
ప్రశ్న 6.
ద్విచక్ర వాహనదారులు పాటించవలసిన నిబంధనలు ఏవి?
జవాబు:
ద్విచక్ర వాహనదారులకు నిబంధనలు :
- గడువు తీరని డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి.
- బీమా చేయించుకుని మాత్రమే వాహనాన్ని రోడ్డుపై నడపాలి.
- వాహనదారులు హెల్మెట్ ధరించాలి.
- వాహనం వెనుక సీటుపై ఒక్కరినే కూర్చోబెట్టుకోవాలి. అతడు కూడా సక్రమంగా కూర్చోవాలి.