SCERT AP 9th Class Biology Guide Pdf Download 1st Lesson కణ నిర్మాణం – విధులు Textbook Questions and Answers.
AP State Syllabus 9th Class Biology 1st Lesson Questions and Answers కణ నిర్మాణం – విధులు
9th Class Biology 1st Lesson కణ నిర్మాణం – విధులు Textbook Questions and Answers
అభ్యసనాన్ని మెరుగుపరుచుకోండి
ప్రశ్న 1.
కింది వాటిలో భేదాలను గుర్తించండి. (AS 1)
A) వృక్ష కణం మరియు జంతు కణం
B) కేంద్రక పూర్వకణం మరియు నిజకేంద్రక కణం
జవాబు:
A) వృక్ష కణం మరియు జంతు కణం :
వృక్ష కణము | జంతు కణము |
1. సాధారణంగా పెద్ద పరిమాణంలో ఉంటుంది. | 1. సాధారణంగా చిన్న పరిమాణంలో ఉంటుంది. |
2. కణకవచము ఉంటుంది. | 2. కణకవచము ఉండదు. |
3. ప్లాస్టిడ్లు (క్రోమోప్లాస్టులు, ల్యూకోప్లాస్టులు) ఉంటాయి. | 3. ప్లాస్టిడ్లు ఉండవు. |
4. సెంట్రియోల్స్ ఉండవు. | 4. సెంట్రియోల్స్ ఉంటాయి. |
5. రిక్తికలు పెద్దవిగా ఉంటాయి. | 5. రిక్తికలు చిన్నవిగా ఉంటాయి. |
B) కేంద్రక పూర్వకణం మరియు నిజకేంద్రక కణం
కేంద్రక పూర్వకణం | నిజకేంద్రక కణం |
1. కేంద్రకం చుట్టూ కేంద్రక త్వచం ఉండదు. | 1. కేంద్రకం చుట్టూ కేంద్రక త్వచం ఉంటుంది. |
2. త్వచముతో కూడిన కణాంగాలు ఉండవు. | 2. త్వచముతో కూడిన కణాంగాలు ఉంటాయి. |
3. కేంద్రక పూర్వకణాలు ఎక్కువగా ఏకకణజీవులలో ఉంటాయి. | 3. నిజకేంద్రక కణాలు బహుకణజీవులలో ఉంటాయి. |
4. దీనిలో ఒకే క్రోమోసోము ఉంటుంది. | 4. దీనిలో ఒకటి కంటే ఎక్కువ క్రోమోసోములు ఉంటాయి. |
5. కేంద్రకాంశము ఉండదు. | 5. కేంద్రకాంశము ఉంటుంది. |
6. కణవిభజన సమవిభజన ద్వారా జరుగుతుంది. | 6. కణవిభజన సమవిభజన మరియు క్షయకరణ విభజనల ద్వారా జరుగుతుంది. |
7. కణపరిమాణము చిన్నగా ఉంటుంది. | 7. కణ పరిమాణము పెద్దగా ఉంటుంది. |
8. కేంద్రక పూర్వకణాలు బాక్టీరియా మరియు సయానో బాక్టీరియాలలో ఉంటాయి. | 8. నిజకేంద్రక కణాలు శిలీంధ్రాలు, మొక్కలు మరియు జంతు కణాలలో ఉంటాయి. |
ప్రశ్న 2.
కణం నుండి కేంద్రకాన్ని తొలగిస్తే ఏమవుతుంది? మీ జవాబులను బలోపేతం చేయడానికి రెండు కారణాలు రాయండి. (AS 1)
జవాబు:
- కణాంగాలలో కేంద్రకము అతిముఖ్యమైనది.
- కేంద్రకము కణవిధులను అన్నింటిని నియంత్రిస్తుంది.
- కేంద్రకము అన్ని కణాంగాలను మరియు కేంద్రకాంశమును కూడా నియంత్రిస్తుంది.
- కణ మెదడు అయిన కేంద్రకమును తొలగించినట్లయితే కణము ఆ వెంటనే చనిపోతుంది.
- కనుక కేంద్రకమును తొలగించినట్లయితే కేంద్రక నియంత్రణలో పనిచేసే కణాంగాలు చనిపోతాయి. తద్వారా ఆ జీవి చనిపోతుంది.
ప్రశ్న 3.
లైసోజోమ్ లను స్వయం విచ్ఛిత్తి సంచులని ఎందుకు అంటారు? (AS 1)
జవాబు:
- లైసోజోములు విచ్ఛిన్నకర ఎంజైములను కలిగి ఉంటాయి.
- విచ్ఛిన్నం చేయవలసిన పదార్థములు లైసోజోమ్ నకు రవాణా చేయబడతాయి.
- కొన్ని సందర్భాలలో లైసోజోముల విచ్ఛిన్నం ద్వారా విడుదలైన ఎంజైములు కణమును జీర్ణం చేస్తాయి.
- అందువలన లైసోజోమ్ ను స్వయం విచ్ఛిత్తి సంచులు అంటారు.
ప్రశ్న 4.
వృక్ష కణంలో పెద్ద రిక్తికలు ఎందుకు ఉంటాయి? (AS 1)
జవాబు:
- మొక్కల రిక్తికలు నీటి నిలువకు, ద్రవాభిసరణ క్రమతకు, వ్యర్థ పదార్థాల సంగ్రహణకు ఉపయోగపడుట ద్వారా ఆకులు, రక్షకపత్రాల కణముల యొక్క నిర్మాణాత్మక రూపమును నియంత్రిస్తాయి.
- కణము మధ్యన గల రిక్తిక, కణకవచముపై కలిగించే ఒత్తిడి ద్వారా కణము యొక్క ఆకారము స్థిరంగా ఉంచబడుతుంది.
- నియంత్రిత పెరుగుదలలో భాగంగా మొక్కలు కణము పొడవుగా అగుటకు కణము అంతర్గతశక్తిని ఉపయోగించుకుంటాయి.
- జంతువుల రిక్తిక కంటె వృక్షము యందు ఉండు రిక్తిక క్లిష్టమైన విధులను నిర్వహిస్తుంది.
- అందువలన వృక్ష కణములలో పెద్ద రిక్తికలు ఉంటాయి.
ప్రశ్న 5.
“జీవుల మౌళిక ప్రమాణం కణం” వివరించండి. (AS 1)
జవాబు:
- కణ సిద్ధాంతం ప్రకారం జీవుల నిర్మాణాత్మక, క్రియాత్మక ప్రమాణం కణం, జీవులు కణ నిర్మితాలు మరియు కణములన్నీ ముందుతరం కణం నుంచి ఏర్పడతాయి.
- జీవి జీవించడానికి అవసరమయ్యే జీవక్రియలన్నీ కణస్థాయిలోనే జరుగుతాయి.
- అందువలన కణమును జీవుల మౌళిక ప్రమాణం అని చెప్పవచ్చు.
ప్రశ్న 6.
కణ సిద్ధాంతమును ఎవరు, ఎప్పుడు ప్రతిపాదించారు ? దీనిలోని ముఖ్యమైన అంశాలు ఏవి? (AS 1)
జవాబు:
ప్రతిపాదించినవారు :
ఎమ్.జె. ప్లీడన్ మరియు థియోడర్ ష్వాన్ 1838-39 సంవత్సరంలో కణ సిద్ధాంతమును
ప్రతిపాదించారు. ముఖ్యమైన అంశములు :
- జీవరాసులన్నీ కణాలు, వాటి ఉత్పన్నాలతో నిర్మించబడి ఉంటాయి.
- కణాలన్నీ ముందు తరం కణం నుంచే ఏర్పడతాయి.
- అన్ని కణాలు ఒకే రకమైన రసాయన నిర్మాణం కలిగి, ఒకే రకమైన జీవక్రియలు నెరవేరుస్తాయి.
- జీవి యొక్క జీవక్రియలు ఆ జీవిలోని కణములు నిర్వర్తించే విధులను బట్టి, ఆ జీవిలో వివిధ కణముల మధ్య ఉండే సంబంధ బాంధవ్యాల మీద ఆధారపడి ఉంటాయి.
ప్రశ్న 7.
ప్లాస్మా పొర పగిలిపోతే/ విరిగితే కణానికి ఏమి జరుగుతుంది? (AS 2)
జవాబు:
ప్లాస్మా పొర పగిలిపోతే / విరిగితే :
- విసరణ లేదా ద్రవాభిసరణ ద్వారా కణము లోపలకు, బయటకు జరిగే పదార్థాల రవాణాను ప్లాస్మా పొర నియంత్రిస్తుంది.
- అందువలన ప్లాస్మాపొర పగిలిపోతే కణము, దాని లోపలి అంశములను బయటకు విడుదల చేయవచ్చు.
- అందువలన కణము చనిపోతుంది.
ప్రశ్న 8.
గాల్జీ సంక్లిష్టాలు లేకపోతే కణానికి ఏమవుతుంది? (AS 2)
జవాబు:
గాల్జీ సంక్లిష్టాలు లేకపోతే :
- వీటి ద్వారా జరుగవలసిన కార్యకలాపాలు జరుగవు.
- వివిధ రకాల పదార్థములను మార్పుచేయడం కణము నందు జరుగదు.
- గాల్జీ సంక్లిష్టము నుండి పదార్థాలన్నీ ప్లాస్మాపొర వైపు కాని లేదా మరొక కణాంగమైన లైసోజోమ్స్ వైపు కాని పంపబడవు.
- రైబోజోములచే తయారుచేయబడిన ప్రోటీనులు మరియు ఇతర పదార్థములు లైసోజోమ్ లకు రవాణా చేయబడవు.
- పదార్ధముల రవాణా జరుగకపోయినట్లయితే ప్లాస్మా పొరకు మరమ్మత్తులు జరుగక కణం చనిపోతుంది.
- గాల్జీ సంక్లిష్టము నుండి విషపదార్థములు లైసోజోమ్స్ నకు పంపబడనట్లయితే విషపదార్ధములు కణము నందు నిల్వచేయబడి కణము చనిపోతుంది.
ప్రశ్న 9.
బుగ్గకణంలో కేంద్రకాన్ని చూడడానికి నీవు ప్రయోగశాలలో ఏమేమి జాగ్రత్తలు తీసుకున్నావు? (AS 3)
జవాబు:
బుగ్గకణంలో కేంద్రకాన్ని చూడడానికి ప్రయోగశాలలో తీసుకోవలసిన జాగ్రత్తలు :
- చెంప (బుగ్గ) లోపలి భాగాన్ని ఎక్కువగా గీకకూడదు. ఎక్కువగా గీకితే గాయమయ్యే అవకాశం ఉంటుంది.
- గీకిన భాగాన్ని స్లెడ్ పైన వ్యాపించేటట్లు చేయవలెను.
- ఎక్కువగా రంగు ఉన్నట్లయితే దానిని తొలగించవలెను.
ప్రశ్న 10.
ప్రస్తుత పాఠాన్ని పూర్తిగా, క్షుణ్ణంగా చదివి వివిధ రకాల కణాంగాల విధులకు సంబంధించిన సమాచారాన్ని సేకరించి క్రమసంఖ్య, కణాంగాలు, విధులు అనే అంశాలను పట్టికలో నమోదు చేయండి. నమోదు చేసేటపుడు నూతన ప్రత్యేక అంశాలు ఉన్నట్లయితే పట్టిక క్రింద నమోదు చేయండి. (AS 4)
జవాబు:
కణాంగము | విధులు |
1. కేంద్రకము | కణవిధుల క్రమబద్దీకరణ మరియు నియంత్రణ, జీవుల లక్షణాల నిర్ధారణ. |
2. అంతర్జీవ ద్రవ్యజాలము | కణంలో ఒక భాగం నుండి మరియొక భాగానికి పదార్థాల రవాణా, జీవరసాయన చర్యలకు వేదిక. |
3. గాల్జీ సంక్లిష్టము | ప్రోటీనుల రూపమును మార్చుట, అనేక పదార్థములను ఒకటిగా చేయుట. |
4. లైసోజోములు | కణాంతర జీర్ణక్రియ, కణభాగములను నాశనం చేయుట. |
5. మైటోకాండ్రియా | కణ శ్వాసక్రియ ద్వారా కణమునందు శక్తి ఉత్పాదన. |
6. ప్లాస్టిడ్లు | మొక్కల కణాలకు రంగులను ఇస్తుంది. |
A) క్రోమోప్లాస్టులు | రకరకాల పూలు, పండ్లకు రంగునిచ్చుట. |
B) క్లోరోప్లాస్టులు | కిరణజన్య సంయోగక్రియలో కాంతి శక్తిని రసాయనశక్తిగా మార్చుట. |
C) ల్యూకోప్లాస్టులు | రంగులేని ప్లాస్టిడ్లు, పిండిపదార్ధాలు, నూనెలు మరియు ప్రోటీనుల నిల్వ. |
ప్రత్యేక అంశాలు :
- కేంద్రకము జన్యు సమాచారాన్ని కలిగి ఉంటుంది.
- గరుకు అంతర్జీవ ద్రవ్యజాలము ప్రోటీన్లను సంశ్లేషణ చేస్తుంది. నునుపు అంతర్జీవ ద్రవ్యజాలము లిపిడ్లను సంశ్లేషణ చేస్తుంది.
- గాల్టీ సంక్లిష్టము రైబోజోములు తయారు చేసిన ప్రోటీనులను ఒకటిగా చేర్చుటకు సహాయం చేస్తుంది.
- కణ వినాశమునకు కారణమగుట వలన లైసోజోములను స్వయంవిచ్చిత్తి సంచులు అంటారు.
- కణ శ్వాసక్రియ ద్వారా కణము శక్తిని ఉత్పాదన చేయుట వలన మైటోకాండ్రియాలను కణ శక్త్యా గారాలు అంటారు.
- క్లోరోప్లాస్టులు, ల్యూకోప్లాస్టులు, క్రోమోప్లాస్టులు మొక్కలలో ఉండే ప్లాస్టిడ్లు.
ప్రశ్న 11.
వృక్ష కణం లేదా జంతు కణం నమూనాను పరిసరాలలో లభ్యమయ్యే పదార్థాలతో తయారుచేయండి. (AS 15)
జవాబు:
ప్రశ్న 12.
మీరు సేకరించిన పత్రం పొరతో తాత్కాలిక స్లెడను తయారుచేసి పత్రరంధ్రాలను పరిశీలించి పటమును గీయండి. వాటి గురించి రాయండి. (AS 5)
జవాబు:
పెద్దదిగా చూపబడిన పత్రరంధ్రము ఈ క్రింది కణాలను చూపిస్తుంది.
- పత్రరంధ్రము రెండు రక్షక కణములచే ఆవరించబడినది.
- రక్షక కణములు మూత్రపిండాకారములో ఉన్నాయి.
- రక్షక కణమందు కేంద్రకము, క్లోరోప్లాస్టులు కలవు.
- రెండు రక్షక కణముల మధ్య చిన్న పత్రరంధ్రము కలదు.
- ఆకునందలి పత్రరంధ్రముల ద్వారా వాయువుల మార్పిడి జరుగును.
- ఆకు వైశాల్యం నందు పత్రరంధ్రములు సుమారు 1 నుండి 2 శాతం ఆక్రమించి ఉన్నాయి.
ప్రశ్న 13.
నమూనా జంతు కణం పటము గీచి భాగాలు గుర్తించండి. (AS 5)
జవాబు:
ప్రశ్న 14.
కింది కార్టూనును చూడండి. కణాంగాల విధులను గురించి రాయండి. (AS 5)
జవాబు:
కణంలోని ముఖ్యమైన కణాంగాలు అనగా అంతర్జీవ ద్రవ్యజాలం, గాల్టీ సంక్లిష్టాలు, లైసోజోములు, మైటోకాండ్రియా, – ప్లాస్టిడ్స్ మరియు రిక్తికలు.
కణాంగాలు, విధులు :
1) అంతర్జీవ ద్రవ్యజాలం :
కణ ద్రవ్యంలో వల వంటి నిర్మాణాన్ని అంతర్జీవ ద్రవ్యజాలం అంటారు. ఇది ప్రోటీన్ల వంటి పదార్థాలను కణద్రవ్యంలోని వివిధ ప్రాంతాలకు ఇక్కడ నుండి కేంద్రకానికి రవాణా మార్గంగా పని చేస్తుంది. క్రొవ్వు మరియు లిపిడ్ల సంశ్లేషణకు తోడ్పడుతుంది. విష పదార్థాలను నిర్వీర్యం చేస్తుంది.
2) గాల్జీ సంక్లిష్టాలు :
ఇవి వివిధ రకాల పదార్థాలను కణంలోని ఇతర భాగాలకు పంపే ముందు, తమలో నిల్వ చేసుకుని, అక్కడ నుండి ప్లాస్మాపొర వైపు లేదా లైసోసోమ్స్ వైపు పంపిస్తాయి.
3) లైసోజోములు :
వినాశకర పదార్థాలను ఇవి ఎంజైముల ద్వారా వినాశనం చేస్తాయి.
4) మైటోకాండ్రియా :
కణానికి కావలసిన శక్తిని ఉత్పత్తి చేసి కణ శ్వాసక్రియను జరుపుతాయి.
5) ప్లాస్టిడ్లు :
కిరణజన్య సంయోగక్రియలో సౌరశక్తిని గ్రహించి రసాయనిక శక్తిగా మార్చటమే వీటి యొక్క ముఖ్య
6) రిక్తికలు :
రిక్తికలు కార్బోహైడ్రేటులు, అమైనో ఆమ్లాలు, ప్రోటీనులు, వర్ణద్రవ్యాలు విసర్జన పదార్థాలను నిల్వ చేస్తాయి.
ప్రశ్న 15.
సజీవులలో కణ వ్యవస్థీకరణను ఎలా అభినందిస్తావు? (AS 6)
జవాబు:
- జీవులలో ఐదు రకాల స్థాయిలను గమనిస్తాను. కణము-కణజాలము-అవయవము-అవయవ వ్యవస్థ – జీవి.
- జీవులలో కణము చక్కగా వ్యవస్థీకృతమైంది. కణము కణజాలముగాను, కణజాలములు అవయవముగాను, అవయవములు కలిసి అవయవ వ్యవస్థలుగాను, అవయవ వ్యవస్థలు జీవిగాను రూపొందినాయి.
- మౌలికమైన మరియు ప్రాథమికమైన కణము ఏకకణ జీవులను, బహుకణ జీవులను ఏర్పరుస్తుంది.
- జీవులు తరువాత క్రమంలో జనాభాలను, సంఘాలను, ఆవరణ వ్యవస్థలను మరియు జీవావరణంగాను వ్యవస్థీకృతమైనవి.
ప్రశ్న 16.
భౌతిక మరియు రసాయనిక చర్యల వలన కణ వ్యవకరణం నాశనమైతే ఏమి జరుగుతుంది? (AS 6)
జవాబు:
- జీవమునకు ప్రమాణమైన కణము, జీవక్రియలన్నింటిని నిర్వహించగల సామర్యము కలిగినది.
- భౌతిక మరియు రసాయనిక చర్యల వలన కణవ్యవస్థ నాశనమైతే జీవక్రియల నిర్వహణ అనగా శ్వాసక్రియ, పోషణ, విసర్జన మొదలగు క్రియల నిర్వహణకు కణ సామర్థ్యము సక్రమముగా ఉండదు.
ప్రశ్న 17.
అతి సూక్ష్మకణం విధిని అతి పెద్దగా ఉండే జీవిలో ఏ విధంగా అభినందిస్తావు? (AS 6)
జవాబు:
- కణ సిద్ధాంతం ప్రకారం జీవులన్నియూ కణనిర్మితాలు.
- జీవమునకు ప్రమాణమైన చిన్నకణము అన్ని జీవక్రియలను నిర్వహించగల సామర్థ్యం గలది.
- జీవి యొక్క జీవక్రియలు ఆ జీవిలోని కణములు నిర్వహించే విధుల మీద ఆధారపడి ఉంటాయి.
- కణములు జీవనిర్మాణ సౌధములు.
- అందువలన కణములను జీవమునకు నిర్మాణాత్మక మరియు క్రియాత్మక ప్రమాణము అంటారు.
- కణములు ఆకారములోను, పరిమాణములోను మరియు క్రియలపరంగా వేరుగా ఉంటాయి.
- ఒక కణము యొక్క పరిమాణము కచ్చితంగా ఆ కణము నిర్వహించే పని మీద ఆధారపడి ఉంటుంది.
- జీవిలోని కణములు సక్రమముగా విధులను నిర్వహించినట్లయితే జీవి శరీరము విధులను సక్రమముగా నిర్వహిస్తుంది.
9th Class Biology 1st Lesson కణ నిర్మాణం – విధులు Textbook InText Questions and Answers
9th Class Biology Textbook Page No. 1
ప్రశ్న 1.
ఉల్లిపొరలో కణాలు దీర్ఘచతురస్ర ఆకారంలో ఉంటే, బుగ్గ కణాలు గుండ్రంగా ఉంటాయని తెలుసుకున్నాం. ఇలాగే కణం గురించి మీరు గుర్తించిన మరికొన్ని ముఖ్యాంశాలు రాయండి.
జవాబు:
- జీవులన్నిటికి కణం ప్రధానమైన మూలం.
- కణాలలో కేంద్రకం ఉంటుంది.
- వృక్ష కణాలలో కణకవచం ఉంటుంది. కానీ జంతు కణాలలో కణకవచం ఉండదు.
- కణమును నిర్మాణాత్మక ప్రమాణంగా పరిగణించవచ్చు.
- బహుకణజీవులలో ఈ కణాల ఆకారంలో వైవిధ్యం కనపడుతుంది.
9th Class Biology Textbook Page No. 2
ప్రశ్న 2.
ఈ క్రింది కణాలను పరిశీలించండి.
జవాబు:
a) పై రెండు కణాలలో కనబడే సాధారణ లక్షణాలు ఏవి?
జవాబు:
పై రెండు కణాలలో కనబడే సాధారణ లక్షణాలు : పై రెండు కణాలు మైటోకాండ్రియా, గాల్టీ సంక్లిష్టం, కేంద్రకం, అంతర్జీవ ద్రవ్యజాలం అనే కణాంగాలను కలిగి ఉన్నాయి.
b) వృక్ష కణంలో మాత్రమే కనబడే కణాంగాలేవి?
జవాబు:
వృక్ష కణంలో మాత్రమే కనబడే కణాంగాలు : రిక్తికలు, ప్లాస్టిడ్లు, కణకవచం మొదలగునవి.
c) వృక్ష కణంలోని రిక్తకలు జంతుకణంలోని రిక్తికలను పోల్చండి. రెండింటి మధ్య మీరు గమనించిన భేదాలను రాయండి.
జవాబు:
వృక్ష కణంలో రిక్తికలు ఉంటాయి. జంతుకణంలో రిక్తికలు ఉండవు.
ప్రశ్న 3.
వృక్ష కణాలలో కణకవచం యొక్క ఆవశ్యకత ఏమిటి?
జవాబు:
- కణరసం ద్వారా ఏర్పడే బాహ్యపీడనాన్ని నిరోధించడానికి కణకవచం అంతర పీడనాన్ని కలిగిస్తుంది.
- అందువల్ల పరిసరాలలో జరిగే మార్పులను జంతుకణం కంటే వృక్షకణం తట్టుకునే అవకాశం ఎక్కువ.
9th Class Biology 1st Lesson కణ నిర్మాణం – విధులు Textbook Activities (కృత్యములు)
కృత్యం – 1
1. ప్లాస్మా పొర పరిశీలన :
a) సూక్ష్మదర్శినితో పత్రంనందలి ప్లాస్మా పొరను నీవు ఏ విధముగా పరిశీలిస్తావు? నీ పరిశీలనలు రాయుము.
జవాబు:
- రియో పత్రాన్ని తీసుకొని ఒక్కసారిగా మధ్యకు చించాలి.
- చించిన భాగాన్ని వెలుతురులో ఉంచి పరిశీలించాలి. పత్రంలోని లేతరంగులో ఉన్న భాగాన్ని తీసుకొని స్లెడ్ పైన పెట్టాలి.
- నీటి చుక్కను వేసి కవర్ స్లితో కప్పాలి. తరువాత స్లెడ్ ను సూక్ష్మదర్శినితో పరిశీలించాలి.
పరిశీలనలు :
- కణములు వరుసలలో అమరి ఉన్నాయి.
- ప్లాస్మా పొర స్పష్టముగా కనిపిస్తుంది.
- కణము నందు కేంద్రకము కలదు.
b) రియో పత్రపు పొరపై 1 లేదా 2 చుక్కల సజల ఉప్పు ద్రావణము వేసిన ఏమి జరుగుతుంది? సూక్ష్మదర్శిని ద్వారా పరిశీలించి బొమ్మను గీయుము. కేంద్రకముతో కూడిన జీవపదార్థము కుదించుకుపోవడానికి కారణములు రాయుము.
జవాబు:
పరిశీలనలు :
- రియో పత్రపు పొరపై జల ఉప్పు ద్రావణము వేసినప్పుడు రియో పత్రము నందలి కణముల నుండి నీరు బయటకు ప్లాస్మాపొర వచ్చును.
- నీరు బయటకు రావడము వలన కణద్రవ్యం, కణత్వచంతో పాటు కుదించబడుతుంది.
- మనకు కనబడే రంగుభాగపు బాహ్య అంచును కణత్వచం అంటారు. ఆ భాగం కణకవచం నుంచి వేరైపోతుంది.
2. కేంద్రక పరిశీలన :
జవాబు:
ఉద్దేశ్యం : చెంప (బు) కణంలో కేంద్రకం పరిశీలించుట.
కావాల్సిన పదార్థాలు :
టూత్ పిక్, స్లెడ్, కవర్ స్లిప్, వాచ్ గ్లాస్, నీడిల్, బ్లాటింగ్ పేపర్, 1% మిథిలీన్ బ్లూ, ఉప్పు ద్రావణం, గ్లిజరిన్, సూక్ష్మదర్శిని మొదలైనవి.
విధానం :
- ముందుగా నోటిని శుభ్రంగా కడగవలెను. టూత్ పిక్ తో గాని లేదా ఐస్ క్రీమ్ చెంచాతో గాని నోటిలోపలి చెంప (బుగ్గ)లోని భాగాన్ని కొద్దిగా గీకవలెను.
- గీకిన భాగాన్ని ఉప్పు ద్రావణం కలిగి ఉన్న వాచ్ గ్లాసులో పెట్టవలెను. (పదార్థం ఉప్పు ద్రావణంలో కలిసిపోకుండా జాగ్రత్త పడండి).
- తరువాత స్లెడ్ పైన పెట్టవలెను.
- ఒక చుక్క మిథిలీన్ బ్లూ ద్రావణాన్ని వేసి రెండు నిమిషాల సేపు కదపకుండా ఉండవలెను.
- అద్దుడు కాగితం ఉపయోగించి ఎక్కువగా ఉన్న రంగును తొలగించవలెను.
- ఒక చుక్క గ్లిజరిన్ వేయవలెను.
- కవర్ స్లితో కప్పి నీడిల్ లో కవర్ స్లిప్ ని కొద్దిగా తట్టవలెను. దాని వలన కణాలన్నీ వ్యాపిస్తాయి.
జాగ్రత్తలు:
- చెంప (బుగ్గ) లోపలి భాగాన్ని ఎక్కువగా గీకవద్దు. గాయమయ్యే అవకాశముంటుంది.
- గీకిన భాగాన్ని స్లెడ్ పైన వ్యాపించేటట్లు చేయవలెను.
- ఎక్కువగా రంగు ఉన్నట్లయితే తొలగించవలెను.
ఈ విధముగా తయారుచేసిన తాత్కాలిక సైడ్ ను సూక్ష్మదర్శిని ఎక్కువ, తక్కువగా కాంతిని వర్ధనం చేస్తూ పరిశీలించవలెను.
పరిశీలనలు:
- కణాల ఆకారంను పరిశీలించగా కణాలు వివిధ ఆకారాలలో ఉన్నవి.
- కణ మధ్య భాగంలో రంగుతో కూడిన గుండ్రటి చుక్క కనబడుతుంది. అదే కణ కేంద్రకం.
కృత్యం – 2
3. మైటోకాండ్రియా పరిశీలన :
ఉల్లిపొర కణాలతో మైటోకాండ్రియాను నీవు ఏ విధంగా పరిశీలిస్తావు?
(లేదా)
నిర్మల ఉల్లిపొరలోని కణాలను పరిశీలించాలనుకుంటుంది. అందుకు కావలసిన పరికరాలను, ప్రయోగ విధానాన్ని ఆమెకు వివరించండి.
జవాబు:
పరికరాలు :
ఉల్లిపొర, బ్లేడ్, జానస్ గ్రీన్ – B ద్రావణం కవర్ స్లిప్, వాచ్ గ్లాస్, సూక్ష్మదర్శిని
మైటోకాండ్రియా పరిశీలన :
- బీకరులో జానస్ గ్రీన్-బి ద్రావణాన్ని తయారుచేయాలి.
- 200 మి.గ్రా. జానస్ గ్రీన్-‘బి’ ను 100 మి.లీ. నీటిలో కలపాలి.
- ఒక వాచ్ గ్లాలో ఈ ద్రావణం కొంత తీసుకుని దానిలో ఉల్లిపొరను దాదాపు అరగంటసేపు ఉంచాలి.
- ఉల్లిపొరను వాచ్ గ్లాస్ నుండి తీసి స్లెడ్ పైన పెట్టి నెమ్మదిగా నీటితో కడగాలి.
- కవర్ స్లిప్ నుంచి ఉల్లిపొరను సూక్ష్మదర్శినిలో (ఎక్కువ మాగ్నిఫికేషన్) పరిశీలించాలి.
- పరిశీలించిన అంశాన్ని బొమ్మ గీయాలి.
పరిశీలనలు :
ఆకుపచ్చ రంగులో గుండ్రంగా కాని పొడవుగా ఉండే రేణువులు కణద్రవ్యంలో వెదజల్లినట్లు కనబడే నిర్మాణాలు మైటోకాండ్రియా.
కృత్యం – 3
4. రియో పత్రంలో హరితరేణువులను (Chloroplast) పరిశీలిద్దాం.
సూక్ష్మదర్శిని సహాయముతో రియో పత్రమునందలి క్లోరోప్లాస్టు (హరితరేణువులు)లను పరిశీలించుము. బొమ్మను గీచి, పరిశీలనలు రాయుము.
జవాబు:
క్లోరోప్లాస్టులను పరిశీలించుట :
- రియో పత్రం పొరను తీసుకొని స్లెడ్ పైన ఉంచి నీటి చుక్క వేయాలి.
- ఎక్కువ మాగ్నిఫికేషన్ గల సూక్ష్మదర్శినితో పరిశీలించాలి.
పరిశీలనలు:
- స్లెడ్ రియో పత్రమునందు ఆకుపచ్చని చిన్నటి రేణువులు కనబడుతున్నాయి. వీటిని హరితరేణువులు అంటారు.
- హరితరేణువులు పత్రహరిత వర్ణద్రవ్యమును కలిగి ఉంటాయి.
కృత్యం – 4
5. శైవలాలలో హరితరేణువులు పరిశీలిదాం :
శైవలములందలి హరితరేణువులను నీవు ఏ విధముగా సూక్ష్మదర్శినిలో పరిశీలిస్తావు ? పరిశీలించిన బొమ్మను గీచి, నీవు కనుగొనిన విషయమును రాయుము.
జవాబు:
శైవల హరితరేణువులను పరిశీలించుట :
- నీటి కొలను నుండి ఆకుపచ్చని శైవలాలను సేకరించాలి.
- వాటి సన్నని తంతువులను వేరుచేయాలి.
- కొన్ని తంతువులను స్లెడ్ పైన ఉంచి సూక్ష్మదర్శినితో పరిశీలించాలి.
పరిశీలనలు:
- శైవలాలలో హరితరేణువులు నిచ్చెన ఆకారంలో గాని, నక్షత్ర ఆకారంలో గాని, సర్పిలాకారంలో గాని, జాలాకారంలో గాని ఉంటాయి.
- కిరణజన్య సంయోగక్రియలో సూర్యకాంతిలోని సౌరశక్తిని గ్రహించి రసాయనశక్తిగా హరితరేణువులు మార్చుతాయి.
కృత్యం – 5
6. రిక్తికలను పరిశీలిద్దాం :
కలబంద వంటి రసభరిత మొక్క కాండం లేదా పత్రాన్ని నీవు ఏ విధముగా సూక్ష్మదర్శినితో పరిశీలిస్తావు?
జవాబు:
రిక్తికల పరిశీలన చేయు విధం :
- కలబంద వంటి రసభరిత మొక్క కాండం లేదా పత్రాన్ని తీసుకోవాలి.
- కాండం నుండి పల్చటి భాగాన్ని తీసుకొని నీరు ఉన్న వాగ్లాలో ఉంచాలి.
- స్లెడ్ మీద ఉంచి సజల సాఫ్రనిలో రంజనం చేయాలి.
- స్లెడు సంయుక్త సూక్ష్మదర్శినితో పరిశీలించాలి.
పరిశీలనలు :
- కణంలో పెద్ద పెద్ద ఖాళీ ప్రదేశాలు ఉన్నాయి. వాటిని రిక్తికలు అంటారు.
- ఇవి రసభరితంగా ఉండే సంచుల వంటి నిర్మాణాలు.