AP State Syllabus AP Board 9th Class Telugu Important Questions Chapter 8 చూడడమనే కళ.
AP State Syllabus 9th Class Telugu Important Questions 8th Lesson చూడడమనే కళ
9th Class Telugu 8th Lesson చూడడమనే కళ Important Questions and Answers
I. అవగాహన – ప్రతిస్పందన
క్రింది పరిచిత గద్యాలను చదివి, ప్రశ్నలకు జవాబులు రాయండి.
1. పరిశీలించడం వల్ల మనలో ప్రజ్ఞ కలుగుతుంది. ప్రజ్ఞ ఉంటే అంతరంగంలో ఎలా దర్శించాలో తెలుస్తుంది. విమర్శనాత్మకంగా గమనించాలి. సరియైన లక్ష్యాన్ని నిర్దేశించుకొని గమనించాలి. వినడం, మాట్లాడడం, పరిశీలించడంపై స్పష్టమైన అవగాహన ఉండాలి. పరిశీలించడంలో క్రమం, సమన్వయం ఉండాలి. అప్పుడే క్రమశిక్షణ అలవడుతుంది.
ప్రశ్నలు:
1. పరిశీలించడం వల్ల మనలో కలిగేది?
2. దేనిపైన అవగాహన ఉండాలి?
3. క్రమశిక్షణ ఎప్పుడు అలవడుతుంది?
4. దేనిని నిర్దేశించుకోవాలి?
జవాబులు:
1. ప్రజ్ఞ
2. వినడం, మాట్లాడడం, పరిశీలించడం
3. పరిశీలించడంలో క్రమం, సమన్వయం ఉన్నప్పుడు
4. సరియైన లక్ష్యం
2. ప్రతి దానిని ఉన్నది ఉన్నట్లుగా చూడడం ఒక కళ. లెక్కలు, చరిత్ర, భూగోళశాస్త్రం నేర్చుకోవడం ఎంత కష్టమో ఉన్నవాటిని ఉన్నట్లుగా చూడడం అంతే కష్టం. బయట నడుస్తూ వెళ్తున్నప్పుడు పేదల అశుభ్రతను, దైన్యాన్ని, రోడ్డుమీది బురదను, జబ్బు చేసిన కుక్కలను చూడరు.
ప్రశ్నలు:
1. ఉన్నది ఉన్నట్లుగా చూడడం?
2. ఏ చదువులు నేర్చుకోవడం కష్టం?
3. ఏది చూడడం కష్టం?
4. ఏమేమి చూడము?
జవాబులు:
1. కళ
2. లెక్కలు, చరిత్ర, భూగోళశాస్త్రం
3. ఉన్నవాటిని ఉన్నట్లుగా
4. పేదల అశుభ్రతను, దైన్యాన్ని, రోడ్డుమీద బురద, జబ్బు చేసిన కుక్క.
క్రింది అపరిచిత గద్యాలను చదివి, ప్రశ్నలకు జవాబులు రాయండి.
3. “పుస్తకముల నిండ మస్తుగా చదువుండ, మస్తకముల నిండ మట్టియుండె !” అని చమత్కరించారు శ్రీ సత్యసాయి బాబావారు. కేవలం పుస్తక జన్య జ్ఞానం వలననే ప్రయోజనం లేదు. అనుభవ జ్ఞానమును సంపాదించాలి. వివేక జ్ఞానమును అభివృద్ధి పరచుకోవాలి. విచక్షణా జ్ఞానమును పెంపొందించుకోవాలి.
ప్రశ్నలు – జవాబులు:
1. దేనివల్ల ప్రయోజనం లేదు?
జవాబు:
కేవలం పుస్తక జన్య జ్ఞానం
2. దేనిని సంపాదించాలి?
జవాబు:
అనుభవ జ్ఞానం
3. దేనిని పెంపొందించుకోవాలి?
జవాబు:
విచక్షణ జ్ఞానం
4. “మస్తకముల నిండ మట్టి’ అన్నదెవరు?
జవాబు:
శ్రీ సత్యసాయిబాబావారు
4. ‘పితృదేవోభవ’ అన్నారు. తండ్రి కూడా దైవంతో సమానమే. తల్లి తండ్రిని చూపిస్తుంది. తండ్రి గురువును చూపిస్తాడు. నవమాసాలు మోసి, కనిపెంచిన తల్లిని ఏ విధంగా ప్రేమిస్తామో, పూజిస్తామో, అదేవిధంగా జన్మనిచ్చిన తండ్రిని కూడా గౌరవించాలి. పిల్లల అభివృద్ధికి, అనుక్షణం తాపత్రయపడే తండ్రిని మనసారా ప్రేమించాలి. వార్థక్యంలో సకల సపర్యలు చేసి ‘పితృఋణం’ తీర్చుకోవాలి పిల్లలు.
ప్రశ్నలు – జవాబులు:
1. పిల్లల అభివృద్ధి కోసం తాపత్రయ పడేది ఎవరు?
జవాబు:
తండ్రి
2. ‘వార్డక్యం ‘ అంటే ఏమిటి?
జవాబు:
ముసలితనం
3. ‘నవమాసాలు’ ఏ సమాసం?
జవాబు:
ద్విగు సమాసం
4. ఈ పేరాలో తండ్రిని గూర్చి విశేషమైన వాక్యం ఏది?
జవాబు:
పితృదేవోభవ
5. ఈ కింది వార్తను చదివి ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు రాయండి.
ఈనాడు : 15.12.2015
మసక బారుతున్న అజంతా అందాలు
ఈనాడు, ఔరంగాబాద్ జనవరి 30, భారతీయ చరిత్ర, సంస్కృతులను ప్రతిబింబించే కట్టడాలెన్నో అజ్ఞానం, నిర్లక్ష్యం | వలన పాడైపోతున్నాయి. వాటిని రక్షించుకోవలసిన ఆవశ్యకత ఉన్నది. భారతీయ జీవితాన్ని, సంస్కృతిని ప్రతిబింబించే దర్పణాలు అజంతా గుహలు, బౌద్ధ జాతక కథల నుండి బుద్దుని కారుణ్య సందేశాల వరకు, అందాలొలుకుతున్న స్త్రీల నుంచి వివిధ వృత్తులు, వ్యాసంగాల వరకు అజంతా చిత్రాల్లో కనిపిస్తాయి. గతకాలంలో రాజ మందిరాలు, రాజుల వేష భాషలు, సైనిక బల నిర్మాణం వంటి విభిన్న అంశాలు అజంతా చిత్రాల్లో చూడవచ్చు. అందువల్ల గుహలను నిర్లక్ష్యం చేయకుండా మనదేశ వారసత్వ సంపదగా గుర్తించి పరిరక్షించుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది.
ప్రశ్నలు:
1. అజంతా చిత్రాలలో గతకాలంలో చూడదగిన అంశం ఏదైనా ఒకటి రాయండి.
జవాబు:
రాజమందిరాలు / రాజుల వేషభాషలు / సైనిక బలం
2. భారతీయ చరిత్ర, సంస్కృతులను ప్రతిబింబించే అంశాలు ఎందువలన పాడైపోతున్నాయి?
జవాబు:
అజ్ఞానం, నిర్లక్ష్యం వల్ల
3. ప్రాచీన సంపదను పరిరక్షించడానికి మనం ఏమి చేయాలి?
జవాబు:
మనదేశ వారసత్వ సంపదగా గుర్తించాలి.
4. పై పేరా ఆధారంగా ఒక ప్రశ్న తయారుచెయ్యండి.
జవాబు:
దేనిని ప్రతిబింబించే దర్పణాలు అజంతా గుహలు?
II. స్వీయరచన
ప్రశ్న 1.
‘అనువాద’ ప్రక్రియను గూర్చి రాయండి.
జవాబు:
ఒక భాషలోని సమాచారాన్ని / విషయాన్ని మరొక భాషలో ప్రకటించే పద్ధతిని తెలుగులో భాషాంతరీకరణమని, అనువాదమని, తర్జుమా అని అంటారు. సంస్కృతి, విజ్ఞానం అనువాదాల ద్వారా మానవులందరి ఉమ్మడి సంపద అవుతుంది. ప్రస్తుత పాఠ్యభాగం ‘చూడడమనే కళ’ పాఠ్యము అనువాద ప్రక్రియకు చెందినది.
III. భాషాంశాలు (పదజాలం, వ్యాకరణం)
1. పర్యాయపదాలు :
సూర్యుడు : ఆదిత్యుడు, దివాకరుడు, భానుడు, భాస్కరుడు, ద్యుమణి
ప్రాతఃకాలం : ప్రభాతం, ప్రత్యుష, ఉషస్సు, అహర్ముఖము
శుభ్రము : తెలుపు, ప్రకాశించునది, నిర్మలం, స్వచ్ఛము
సిగ్గు : లజ్జ, త్రప, బ్రీడ
ప్రేమ : అనురాగం, అనురక్తి, అభిమానం, ప్రణయం
చెట్టు : వృక్షం, తరువు, విటపి, మహీరుహం
మేఘం : మొగులు, మబ్బు, నీరదము, అభ్రము
2. వ్యుత్పత్త్యర్థాలు :
హృదయం : హరింపబడునది (మనస్సు)
మిత్రుడు : సర్వభూతములందు స్నేహయుక్తుడు (స్నేహితుడు, సూర్యుడు)
ఉపాధ్యాయుడు : చదువు చెప్పేవాడు (గురువు)
పక్షి : రెక్కలు (పక్షములు కలది) (విహంగము)
3. నానార్థాలు :
చర్య : నడవడి, అనుష్టానము
ఉదయం : పుట్టుక, ఉన్నతి, తూర్పుకొండ, పొడవు
భానువు : సూర్యుడు, శివుడు, వృద్ధుడు
ఉపాధ్యాయుడు : చదువు చెప్పేవాడు, పురోహితుడు, వేదము చెప్పువాడు
మతం : జాతి, అభిప్రాయం, సమ్మతి, శాస్త్రం
కష్టం : దుఃఖం, శ్రమ, పాపం, హాని
మాసం : నెల, త్రోవ, మార్గశిర మాసం, వెదకుట
క్రియ : ధాత్వర్ధము, చేష్ట, శ్రాద్ధము, పూజ, ప్రాయశ్చిత్తం
శక్తి : బలిమి, చిల్లకోల, పార్వతి, బల్లెం, వశిష్ఠుని కుమారుడు
కళ : చంద్రునిలో పదహారవ భాగం, అందం, విద్య
శ్రద్ధ : ఆసక్తి, నమ్మకం, ఆదరం
4. ప్రకృతి – వికృతులు :
మేఘం – మొయిలు, మొగులు
కష్టం – కస్తి
చంద్రుడు – చందురుడు
మర్యాద – మరియాద
స్నానం – తానం
స్థానం – ఠాణా, తానము (తావు) పుస్తకం
ప్రశ్న – పన్నము
శాస్త్రం – చట్టం
సహజం – సాజం
ప్రజ్ఞా పగ్గె
శక్తి – సత్తి
ఉదయం – ఒదవు
నిజం – నిక్కం
కఠినం – కడిది (కష్టం)
శ్రద్ధ – సడ్డ
పుస్తకం – పొత్తం
సాక్షి – సాకిరి
భిక్ష – బిచ్చం
నిత్యము – నిచ్చలు
ప్రజా – పజ
5. సంధులు :
సూర్య + ఉదయం = సూర్యోదయం – గుణసంధి
సూర్య + అస్తమయం = సూర్యాస్తమయం – సవర్ణదీర్ఘ సంధి
తల్లి + తండ్రి = తల్లిదండ్రులు – గసడదవాదేశ సంధి
స్వతః + సిద్ధం = స్వతస్సిద్ధం – విసర్గసంధి
ప్రజ + అభిప్రాయం = ప్రజాభిప్రాయం – సవర్ణదీర్ఘ సంధి
లోతు + ఐన = లోతైన – ఉత్వసంధి
ఒక్క + ఒక్క = ఒక్కొక్క – అత్వసంధి
శ్రవణ + ఆనందం = శ్రవణానందం – సవర్ణదీర్ఘ సంధి
ప్రపంచము + అంతా = ప్రపంచమంతా – ఉత్వసంధి
పేరు + ఉన్నట్లు = పేరున్నట్లు – ఉత్వసంధి
6. సమాసాలు :
హీనస్థితి = హీనమైన స్థితి – విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
తల్లిదండ్రులు = తల్లి మరియు తండ్రి – ద్వంద్వ సమాసం
భూగోళశాస్త్రం = భూగోళమను పేరుగల శాస్త్రం – సంభావనా పూర్వపద కర్మధారయ సమాసం
ప్రపంచశాంతి = ప్రపంచము యొక్క శాంతి – షష్ఠీ తత్పురుష సమాసం
ప్రజాభిప్రాయం = ప్రజల యొక్క అభిప్రాయం – షష్ఠీ తత్పురుష సమాసం
అసాధారణం = సాధారణం కానిది – నఞ్ తత్పురుస సమాసం
భయంకర తుఫాను = భయంకరమైన తుఫాను – విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
శ్రవణానందం = చెవులకు ఆనందం – షష్ఠీ తత్పురుష సమాసం
7. అలంకారాలు :
1. ఉత్క్ష : ఊహ. ఉపమేయమునకు ఉపమానము గాని, ఉపమానమును ఉపమేయంగాగాని ఊహించుట ఉత్ప్రేక్ష.
ఉదా :
ఈ వేసవి తాపం మండుచున్న నిప్పు కొలిమియా అనునట్లున్నది.
2. చంద్రుడు వెండి తునక లాగా ఆకాశంలో వేలాడుతున్నాడు – ఏ అలంకారమో గుర్తించండి.
జవాబు:
ఉపమాలంకారం.
9th Class Telugu 8th Lesson చూడడమనే కళ 1 Mark Bits
1. గురువుల పట్ల గౌరవం కలిగి ఉండాలి – (గీత గీసిన పదానికి వికృతి పదం గుర్తించండి) (S.A. II. 2018-19)
ఎ) గారవం
బి) గరువం
సి) గర్వం
డి) కావరం
జవాబు:
ఎ) గారవం
2. పెద్దలను గారవముగా చూడాలి. (ప్రకృతి పదాన్ని గుర్తించండి.) (S.A. III – 2016-17)
ఎ) గౌరవము
బి) గర్వము
సి) గార్వం
డి) గరువము
జవాబు:
ఎ) గౌరవము
3. ఆహా ! ఎంత బాగుందో. (ఇది ఏ రకమైన వాక్యమో గుర్తించండి) , (S.A. I – 2018-19)
ఎ) విధ్యర్ధకం
బి) ఆశ్చర్యార్ధకం
సి) అనుమత్యర్థకం
డి) నిషేధార్థకం
జవాబు:
బి) ఆశ్చర్యార్ధకం
4. ఆయన వస్తాడో రాడో ! (ఇది ఏ రకమైన వాక్యమో గుర్తించండి) (S.A. I – 2018-19)
ఎ) సంభావనార్థక వాక్యం
బి) హేత్వర్థక వాక్యం
సి) సామర్థ్యార్థకం
డి) సందేహార్థకం
జవాబు:
డి) సందేహార్థకం
5. “పరీక్షలు రాయడం.” (అనుమత్యర్థకం గుర్తించండి) , (S.A. I – 2018-19)
ఎ) పరీక్షలు రాయవచ్చు
బి) పరీక్షలు రాయి
సి) పరీక్షలు రాయవద్దు
డి) పరీక్షలు రాయగలడు
జవాబు:
ఎ) పరీక్షలు రాయవచ్చు
6. ఇందిర అందమైనది మరియు తెలివైనది (ఏ రకపు వాక్యమో గుర్తించండి) (S.A. II – 2018-19)
ఎ) సంయుక్త వాక్యం
బి) సంక్లిష్ట వాక్యం
సి) విధ్యర్థక వాక్యం
డి) చేదర్థక వాక్యం
జవాబు:
ఎ) సంయుక్త వాక్యం
7. కింది వానిలో ప్రశ్నార్థకం గుర్తించండి. (S.A. II – 2018-19)
ఎ) నాగరాజు వస్తాడో ! రాడో !
బి) నాగరాజు రావచ్చు
సి) నాగరాజు వస్తాడా?
డి) నాగరాజు రాగలడు
జవాబు:
సి) నాగరాజు వస్తాడా?
8. ప్రవీణ చురుకైనది మరియు తెలివైనది (ఏ రకపు వాక్యమో గుర్తించండి) (S.A. II – 2017-18)
ఎ) సంక్లిష్టం
బి) సంయుక్తం
సి) విధ్యర్థకం
డి) ప్రార్ధనార్థకం
జవాబు:
బి) సంయుక్తం
9. అశుభ్రంగా ఉన్న వీధులను చూడండి. అశుభ్రంగా ఉన్న మనుషులను చూడండి. (రెండు వాక్యాలను కలిపిన సంయుక్త వాక్యాన్ని గుర్తించండి.) (S.A. III – 2016-17)
ఎ) అశుభ్రంగా ఉన్న వీధులను, అశుభ్రంగా ఉన్న మనుషులను చూడండి.
బి) అశుభ్రంగా ఉన్న వీధులను, శుభ్రంగా ఉన్న మనుషులను చూడండి.
సి) అశుభ్రంగా ఉన్న వీధులను, మనుషులను చూడండి.
డి) వీధులను, మనుషులను అశుభ్రంగా చేయండి.
జవాబు:
సి) అశుభ్రంగా ఉన్న వీధులను, మనుషులను చూడండి.
భాషాంశాలు (పదజాలం, వ్యాకరణం)
1. అర్థాలు :
10. మహాత్ముల మాటలు ఆచరణతో ప్రతిబింబిస్తాయి – గీత గీసిన పదానికి అర్థాన్ని గుర్తించండి.
A) కనబడదు
B) ప్రతిఫలించు
C) తేడా
D) అద్దం
జవాబు:
B) ప్రతిఫలించు
11. ప్రవర్తన బాగుంటే అందరి మన్నన పొందుతాము – గీత గీసిన పదానికి అర్థాన్ని గుర్తించండి.
A) పొగడ్త
B) పెత్తనం
C) గౌరవం
D) అధికారం
జవాబు:
C) గౌరవం
12. ప్రతి స్పందనకు ప్రతిస్పందన ఉంటుంది – గీత గీసిన పదానికి అర్థాన్ని గుర్తించండి.
A) కదలిక
B) నడక
C) మాట
D) కొట్టుకోవడం
జవాబు:
A) కదలిక
13. ‘చేపలు పట్టేవారు‘ అనే అర్థానిచ్చే పదం గుర్తించండి – గీత గీసిన పదానికి అర్థాన్ని గుర్తించండి.
A) కుమ్మరులు
B) రజకులు
C) వడ్రంగి
D) బెస్తవారు
జవాబు:
D) బెస్తవారు
14. విద్యార్థులు చదువుల్లో ప్రజ్ఞ కలిగి ఉండాలి – గీత గీసిన పదానికి అర్థాన్ని గుర్తించండి.
A) శ్రద్ధ
B) ఆసక్తి
C) తెలివి
D) ఇష్టం
జవాబు:
C) తెలివి
15. మనుషులంటే నిజమైన ఆప్యాయత ఉండాలి – గీత గీసిన పదానికి అర్థం ఏమిటి?
A) ద్వేషం
B) ప్రేమ
C) ఇష్టం
D) కోపం
జవాబు:
B) ప్రేమ
2. పర్యాయపదాలు :
16. విద్యార్థులు ప్రాతఃకాలంలో నిద్రలేచి చదువుకోవాలి – గీత గీసిన పదానికి పర్యాయపదాలు గుర్తించండి.
A) ప్రభాతం, సూర్యుడు
B) ప్రభాతం, ప్రత్యుషం
C) వికర్షించేది
D) కోపగించేది
జవాబు:
B) ప్రభాతం, ప్రత్యుషం
17. కాంతి నిచ్చువాడు భాస్కరుడు – గీత గీసిన పదానికి
A) భానుడు, సోముడు
B) ద్యుమణి, కుజుడు
C) సూర్యుడు, ఆదిత్యుడు
D) దివాకరుడు, గురుడు
జవాబు:
C) సూర్యుడు, ఆదిత్యుడు
18. ప్రతి ఒక్కరు శుభ్రము ఉండాలి – గీత గీసిన పదానికి పర్యాయపదాలు గుర్తించండి.
A) తెలుపు, స్వచ్ఛం
B) నిర్మలం, మాలిన్యం
C) ప్రకాశం, గుంటూరు
D) స్వచ్ఛం, మురికి
జవాబు:
A) తెలుపు, స్వచ్ఛం
19. సిగ్గుపడే పనులు చేయకూడదు – గీత గీసిన పదానికి పర్యాయపదాలు గుర్తించండి.
A) లజ్జ, కాజ
B) త్రప, తాపం
C) వ్రీడ, వాడ
D) లజ్జ, త్రప
జవాబు:
D) లజ్జ, త్రప
20. చెట్టు ప్రగతికి మెట్టు – గీత గీసిన పదానికి పర్యాయపదాలు గుర్తించండి.
A) వృక్షం, ఋక్షం
B) తరువు, తెరువు
C) మహీరుహం, వృక్షం
D) విటపి, అటవి
జవాబు:
C) మహీరుహం, వృక్షం
21. వానలు కురవాలంటే మబ్బులు రావాలి – గీత గీసిన పదానికి పర్యాయపదాలు గుర్తించండి.
A) మేఘం, మాఘం
B) మొగులు, అభ్రం
C) నీరదం, నారదం
D) మేఘం, అభ్రకం
జవాబు:
B) మొగులు, అభ్రం
22. గురువులు చెప్పింది వినడం అలవాటయ్యింది – గీత గీసిన పదానికి పర్యాయపదాలు గుర్తించండి.
A) అధ్యాపకులు, శిష్యులు
B) ఒజ్జలు, ఆచార్యులు
C) గురువులు, ఒజ్జలు
D) ఆచార్యులు, ఛాత్రులు
జవాబు:
B) ఒజ్జలు, ఆచార్యులు
23. చంద్రుడు లేని ఆకాశాన్ని చూడండి – గీత గీసిన పదానికి పర్యాయపదాలు గుర్తించండి.
A) భానుడు, రవి
B) హిమాంశుడు, భాస్కరుడు
C) చందమామ, జాబిల్లి
D) సుధాంశుడు, బుధుడు
జవాబు:
C) చందమామ, జాబిల్లి
24. ఆకాశములో తిరిగే పక్షులను గగనములో చూడండి – గీత గీసిన పదాల పర్యాయపదాన్ని గుర్తించండి.
A) అంబరము
B) భానుడు
C) జాబిల్లి
D) తరువు
జవాబు:
A) అంబరము
25. ప్రాతఃకాల భానుణ్ణి మీరు గమనించారా? – గీత గీసిన పదానికి సమానార్థకపదం గుర్తించండి.
A) సాయంత్రము
B) మధ్యాహ్నము
C) ఉదయ కాలము
D) సంధ్యా కాలము
జవాబు:
C) ఉదయ కాలము
3. వ్యుత్పత్యర్థాలు :
26. ‘హృదయం’ వ్యుత్పత్తి గుర్తించండి.
A) ఆకర్షించేది
B) హరింపబడునది
C) ఉషస్సు, సాయంత్రం
D) అహర్ముఖం, రాత్రి
జవాబు:
B) హరింపబడునది
27. ‘సర్వ భూతములందు స్నేహయుక్తుడు’ – ఈ వ్యుత్పత్తికి అర్థాన్ని గుర్తించండి. పర్యాయపదాలు గుర్తించండి.
A) గురువు
B) తండ్రి
C) మిత్రుడు
D) తల్లి
జవాబు:
C) మిత్రుడు
28. “అజ్ఞానమనే అంధకారాన్ని పోగొట్టేవాడు” – అనే వ్యుత్పత్తి గల పదం గుర్తించండి.
A) అధ్యాపకుడు
B) ఉపాధ్యాయుడు
C) దేశికుడు
D) గురువు
జవాబు:
D) గురువు
29. ‘ఉపాధ్యాయుడు’ పదానికి వ్యుత్పత్తిని గుర్తించండి.
A) పాఠం చెప్పేవాడు
B) వేదాన్ని చదివించేవాడు
C) శాస్త్రము బోధించేవాడు
D) గురువు
జవాబు:
B) వేదాన్ని చదివించేవాడు
4. నానార్థాలు :
30. చర్యకు ప్రతిచర్య జరుగుతుంది – గీత గీసిన పదానికి నానార్థాలు గుర్తించండి.
A) నడవడి, పద్దతి
B) కదలిక, నడక
C) పూజ, పని
D) అర్చన, హోమం
జవాబు:
A) నడవడి, పద్దతి
31. సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు – గీత గీసిన పదానికి నానార్థాలు గుర్తించండి.
A) పొడవు, వెడల్పు
B) పుట్టుక, ఉన్నతి
C) తూర్పు కొండ, పడమర
D) ఉన్నతి, ప్రగతి
జవాబు:
B) పుట్టుక, ఉన్నతి
32. ‘శ్రద్ధావల్ లభతే జ్ఞానం’ అన్నారు పెద్దలు – గీత గీసిన పదానికి నానార్థాలు గుర్తించండి.
A) ఆసక్తి, ఆశక్తి
B) నమ్మకం, భయం
C) ఆదరం, ఆసక్తి
D) నమ్మకం, కష్టం
జవాబు:
C) ఆదరం, ఆసక్తి
33. మాసాలలో మార్గశిరం శ్రేష్ఠమైనది – గీత గీసిన పదానికి నానార్థాలు గుర్తించండి.
A) నెల, పక్షం
B) మార్గశిరం, మాఘం
C) త్రోవ, దారి
D) నెల, వెదకుడు
జవాబు:
D) నెల, వెదకుడు
34. మనస్సు, వాక్కు, క్రియ ఒకటిగా ఉండేవారు మహాత్ములు – గీత గీసిన పదానికి నానార్థాలు గుర్తించండి.
A) ధాత్వర్థం, ధాతువు
B) చేష్ట, జేష్ఠ
C) పూజ, ధాత్వర్ధం
D) ప్రాయశ్చిత్తం, దోషం
జవాబు:
C) పూజ, ధాత్వర్ధం
35. ఆలోచనా శక్తి పెరగాలంటే నిదానంగా ఉండాలి – గీత గీసిన పదానికి నానార్థాలు గుర్తించండి.
A) ఓలమి, బలం
B) పార్వతి, వశిష్ఠుని కుమారుడు
C) బల్లెం, బాకు
D) చిల్లకోల, బాణం
జవాబు:
B) పార్వతి, వశిష్ఠుని కుమారుడు
36. నీకు మిత్రుడు పెద్ద అండగా ఉన్నాడు – గీత గీసిన పదానికి నానార్థాలు ఏవి ?
A) స్నేహితుడు, నేస్తము
B) సూర్యుడు, రవి
C) సూర్యుడు, స్నేహితుడు
D) చంద్రుడు, సూర్యుడు
జవాబు:
C) సూర్యుడు, స్నేహితుడు
37. దేవేంద్రుడికి గురువు హితాన్ని చెప్పాడు – గీత గీసిన పదానికి నానార్థాలు గుర్తించండి.
A) అధ్యాపకుడు, ఆచార్యుడు
B) అధ్యాపకుడు, బృహస్పతి
C) గురువు, శిష్యుడు
D) రక్షకుడు, పాలకుడు
జవాబు:
B) అధ్యాపకుడు, బృహస్పతి
38. తోటలను పెంచుకోడానికి, అడవులను కాపాడుకోడానికి, కావలసిన జలమును సమకూర్చుకోవాలి – గీత గీసిన పదాలకు నానార్థ పదం గుర్తించండి.
A) వనం
B) చీడ
C) నీరు
D) ధనం
జవాబు:
A) వనం
5. ప్రకృతి – వికృతులు :
39. పున్నమి చంద్రుడు వెన్నెల కురిపిస్తాడు – గీత గీసిన పదానికి వికృతి పదం గుర్తించండి.
A) చందురుడు
B) సోముడు
C) శశాంకుడు
D) నెలరాజు
జవాబు:
A) చందురుడు
40. మన కర్మలకు సూర్యచంద్రులు సాక్షీ భూతాలు – గీత గీసిన పదానికి వికృతి పదం గుర్తించండి.
A) చూసేవారు
B) ముద్దాయి
C) సాకి
D) సాకిరి
జవాబు:
D) సాకిరి
41. పిల్లల పట్ల కఠినంగా ప్రవర్తించకూడదు – గీత గీసిన పదానికి వికృతి పదం గుర్తించండి.
A) కష్టం
B) కడిది
C) కటినం
D) కట్టె
జవాబు:
B) కడిది
42. సడ్డ లేని విద్య ఎందుకు కొరగాదు – గీత గీసిన పదానికి ప్రకృతి పదం గుర్తించండి.
A) శుభ్రం
B) శాస్త్రం
C) శ్రద్ధ
D) శిక్ష
జవాబు:
C) శ్రద్ధ
43. ఉదయం ఆకాశం ప్రశాంతంగా ఉంటుంది – గీత గీసిన పదానికి ప్రకృతి పదం గుర్తించండి.
A) ఒదవు
B) పొద్దు
C) మాపు
D) సంధ్య
జవాబు:
A) ఒదవు
44. చట్ట సభలలో ప్రజా సమస్యల కన్నా పంతాలు ఎక్కువయ్యా యి – గీత గీసిన పదానికి ప్రకృతి పదం గుర్తించండి.
A) అసెంబ్లీ
B) లోక్ సభ
C) గ్రంథ
D) శాస్త్రం
జవాబు:
D) శాస్త్రం
45. ఆకాశం మేఘావృతంగా ఉంది – గీత గీసిన పదానికి వికృతి పదం గుర్తించండి.
A) మెయిలు
B) మొయిలు
C) మొగుడు
D) మేగు
జవాబు:
B) మొయిలు
46. సరియైన ఆహారాన్ని తీసుకోవాలి – గీత గీసిన పదానికి వికృతి గుర్తించండి.
A) అహారం
B) ఆహారం
C) ఓగిరం
D) జాగరం
జవాబు:
C) ఓగిరం
47. ఉపాధ్యాయుడు పాఠాలు చెపుతున్నాడు – గీత గీసిన పదానికి వికృతి పదాన్ని గుర్తించండి.
A) అజ్ఞ
B) ఒట్ట
C) అధ్యాపకుడు
D) గురువు
జవాబు:
B) ఒట్ట
6. సంధులు :
48. సూర్యాస్తమయం పడమర వైపు జరుగును – గీత గీసిన పదానికి సంధిని గుర్తించండి.
A) గుణసంధి
B) సవర్ణదీర్ఘసంధి
C) వృద్ధి సంధి
D) యణాదేశసంధి
జవాబు:
B) సవర్ణదీర్ఘసంధి
49. ‘తల్లిదండ్రులు’ పదాన్ని విడదీయుము.
A) తల్లి + దండ్రి
B) తల్లి + తండ్రులు
C) తల్లి + తండ్రి
D) తల్లి + దండ్రులు
జవాబు:
C) తల్లి + తండ్రి
50. ‘స్వతస్సిద్ధం’ సంధి పేరేమిటి?
A) విసర్గసంధి
B) జశ్వసంధి
C) శ్చుత్వసంధి
D) వృద్ధి సంధి
జవాబు:
A) విసర్గసంధి
51. సూర్య + ఉదయం – సంధి పేరేమిటి?
A) సవర్ణదీర్ఘ సంధి
B) యణాదేశ సంధి
C) వృద్ధి సంధి
D) గుణసంధి
జవాబు:
D) గుణసంధి
52. పేరున్నట్లు – విడదీయుము.
A) పేరున్న + అట్లు
B) పేరు + ఉన్నట్లు
C) పేర + ఉన్నట్లు
D) పేరి + ఉన్నట్లు
జవాబు:
B) పేరు + ఉన్నట్లు
53. ‘ధీరురాలు’ పదాన్ని విడదీసి చూపండి.
A) ధీరు + రాలు
B) ధీరు + ఆలు
C) ధీర + ఆలు
D) ధీరా + ఆలు
జవాబు:
C) ధీర + ఆలు
54. ‘బాలింతరాలు’ – దీనిలో గల సంధి ఏది?
A) రుగాగమ సంధి
B) యడాగమ సంధి
C) టుగాగమ సంధి
D) ద్విరుక్తటకారాదేశ సంధి
జవాబు:
A) రుగాగమ సంధి
55. సూర్య + ఉదయము’ – సంధి జరిగిన పిమ్మట ఏర్పడిన రూపమును గుర్తించండి.
A) సూర్యోదయము
B) సూర్య ఉదయము
C) సూర్యాదయము
D) సూర్యాస్తమయము
జవాబు:
A) సూర్యోదయము
56. ఇదంతా నీ పన్నాగంలా ఉంది – గీత గీసిన పదం విడదీసి, సంధిని గుర్తించండి.
A) ఇద + అంతా (అత్వ సంధి)
B) ఇది + అంతా (ఇత్వ సంధి)
C) ఇది + యంతా (యడాగమ సంధి)
D) ఇది + ఇంతే (ఇత్వ సంధి)
జవాబు:
B) ఇది + అంతా (ఇత్వ సంధి)
7. సమాసాలు :
57. సంభావనా పూర్వపద కర్మధారయ సమాసానికి కింది ఉదాహరణను గుర్తించండి.
A) భయంకర తుపాను
B) అసాధారణం
C) చిత్తూరు జిల్లా
D) తల్లిదండ్రులు
జవాబు:
C) చిత్తూరు జిల్లా
58. ‘ప్రజల యొక్క అభిప్రాయం’ – దీనిలోని విభక్తి ప్రత్యయాన్ని గుర్తించండి.
A) కొఱకు
B) యొక్క
C) చేత
D) వలన
జవాబు:
B) యొక్క
59. “ప్రపంచం యొక్క శాంతి” లోని విభక్తిని గుర్తించండి.
A) షష్టీ
B) చతుర్టీ
C) తృతీయా
D) పంచమీ
జవాబు:
A) షష్టీ
60. సాధారణం కానిది – సమాసం పేరేమిటి?
A) అవ్యయీభావ
B) రూపకం
C) ద్వంద్వ
D) నఞ్
జవాబు:
D) నఞ్
61. ‘చెత్తకుండీ’ – దీనికి విగ్రహవాక్యాన్ని గుర్తించండి.
A) చెత్త యొక్క కుండీ
B) చెత్త యందు కుండీ
C) చెత్త కొఱకు కుండీ
D) చెత్తలో కుండీ
జవాబు:
C) చెత్త కొఱకు కుండీ
62. ప్రజల యొక్క అభిప్రాయము – సమాస పదంగా కూర్చండి.
A) ప్రజాభిప్రాయము
B) ప్రజ అభిప్రాయము
C) ప్రజల అభిప్రాయము
D) ప్రజలు, అభిప్రాయములు
జవాబు:
A) ప్రజాభిప్రాయము
63. మర్యాద మన్ననలు – ఇది ఏ సమాసమో గుర్తించండి.
A) బహుజొహి
B) ద్విగు
C) ద్వంద్వము
D) షష్ఠీ తత్పురుషము
జవాబు:
C) ద్వంద్వము
64. ‘ప్రాతఃకాల భానుడు’ – విగ్రహవాక్యాన్ని గుర్తించండి.
A) ప్రాతఃకాలము, భానుడు .
B) ప్రాతఃకాలము నందు భానుడు
C) ప్రాతఃకాలమైన, భానుడు
D) ప్రాతఃకాలమున ఉదయించేవాడు
జవాబు:
B) ప్రాతఃకాలము నందు భానుడు
65. సాధారణం కానిది ఈ రోజుల్లో ఏమీ లేదు – సమాస పదం గుర్తించండి.
A) ఆసాధారణం
B) అసాధారణం
C) సాధారణం
D) అసధరణం
జవాబు:
B) అసాధారణం
8. అలంకారాలు :
66. ఈ వేసవి తాపం మండుచున్న నిప్పుల కొలిమియా అన్నట్లున్నది – దీనిలోని అలంకారాన్ని గుర్తించండి.
A) ఉపమా
B) ఉత్ర్ఫేక్ష
C) రూపక
D) శ్లేష
జవాబు:
B) ఉత్ర్ఫేక్ష
67. చంద్రుడు వెండి తునకలాగా ఆకాశంలో వేలాడుతున్నాడు – దీనిలోని అలంకారాన్ని గుర్తించండి.
A) శ్లేష
B) వృత్త్యనుప్రాస
C) ఉపమా
D) యమకం
జవాబు:
C) ఉపమా
9. ఆధునిక వచనాన్ని గుర్తించడం :
68. మీరు స్వేచ్ఛగా మీ పనులు చేసుకొనవచ్చును – ఈ వాక్యానికి ఆధునిక వచనాన్ని గుర్తించండి.
A) మీరు స్వేచ్ఛగా మీ పనులు చేసుకొంటారు.
B) మీరు స్వేచ్ఛగా మీ పనులు చేసుకోవచ్చు.
C) మీరు మీ పనులు చేసుకోగలరు.
D) మీరు మీ పనులు చేయండి.
జవాబు:
B) మీరు స్వేచ్ఛగా మీ పనులు చేసుకోవచ్చు.
69. మీ గతి యెంత ఉభయభ్రష్టమైనదో చూచుకొంటిరా – ఈ వాక్యానికి ఆధునిక వచనాన్ని గుర్తించండి.
A) మీగతి ఎంత ఉభయభ్రష్టమైందో చూసుకున్నారా?
B) మీగతెంత ఉభయభ్రష్టం అయ్యిందో చూసుకుంటారా?
C) మీగతి ఎంత ఉభయభ్రష్టం అవుతుందో చూసుకోండి.
D) మీగతి ఉభయభ్రష్టమైనదో చూసుకోవాలి.
జవాబు:
A) మీగతి ఎంత ఉభయభ్రష్టమైందో చూసుకున్నారా?
70. ‘కాకంబు రాయంచల్గోనా ?’ – ఈ వాక్యానికి ఆధునిక వచనాన్ని గుర్తించండి.
A) కాకము రాజహంస కారు
B) కాకి రాజహంస అవుతుందా?
C) కాకి రాయంచ కానే కాదు
D) కాకం రాయంచ కాదు
జవాబు:
B) కాకి రాజహంస అవుతుందా?
10. కర్తరి, కర్మణి వాక్యాన్ని గుర్తించడం :
71. ‘నేనెన్నో పుస్తకాలు రాశాను’ – ఈ కర్తరి వాక్యానికి కర్మణి వాక్యాన్ని గుర్తించండి.
A) నేనెన్నో పుస్తకాలు రాయబడ్డాయి
B) నా చేత పుస్తకాలను రాయబడ్డాయి
C) నాచేత ఎన్నో పుస్తకాలు రాయబడ్డాయి
D) నేను ఎన్నో పుస్తకాలను రాయగలను
జవాబు:
C) నాచేత ఎన్నో పుస్తకాలు రాయబడ్డాయి
72. ‘పుస్తకం వ్రాసే అర్హత ఉన్నదని ఆమెచే నిరూపించ బడింది’ – ఈ కర్మణి వాక్యానికి కర్తరి వాక్యాన్ని గుర్తించండి.
A) పుస్తకం వ్రాయగల అర్హత ఉందని నిరూపించావు
B) పుస్తకమును వ్రాసే అర్హత ఉన్నదని ఆమె నిరూపించింది
C) పుస్తకము వ్రాసే అర్హత ఆమెకు ఉందని నిరూపించారు
D) ఈ పుస్తకం వ్రాసే అర్హతను నిరూపించింది
జవాబు:
B) పుస్తకమును వ్రాసే అర్హత ఉన్నదని ఆమె నిరూపించింది
11. ప్రత్యక్ష, పరోక్ష కథనాలను గుర్తించడం
73. “అలాగా !” అని అన్నాడు నందగోపుడు – ఈ ప్రత్యక్ష కథనానికి పరోక్ష కథనాన్ని గుర్తించండి.
A) ‘అలాగా’ అని అన్నాడు నందగోపుడు
B) అలాగేయని అన్నాడు నందగోపుడు
C) అలాగని అన్నాడు నందగోపుడు
D) ఇలాగా! అని అన్నాడు నందగోపుడు
జవాబు:
D) ఇలాగా! అని అన్నాడు నందగోపుడు
74. “నేనొక్కడినే అదృష్టవంతుడినా ?” అన్నాడు జంఘాల శాస్త్రి – దీని పరోక్ష కథనాన్ని గుర్తించండి.
A) తానొక్కడినే అదృష్టవంతుడినా అని జంఘాల శాస్త్రి అడిగాడు.
B) నేనొక్కడినే అదృష్టవంతుడినా యని ప్రశ్నించాడు జంఘాల శాస్త్రి.
C) తాను ఒక్కడూ అదృష్టవంతుడిని కానని జంఘాల శాస్త్రి అన్నాడు.
D) అందరూ అదృష్టవంతులే అని జంఘాల శాస్త్రి అన్నాడు.
జవాబు:
A) తానొక్కడినే అదృష్టవంతుడినా అని జంఘాల శాస్త్రి అడిగాడు.
12. వ్యతిరేకార్థక వాక్యాన్ని గుర్తించడం :
75. ఇది సరయింది – వ్యతిరేక వాక్యం గుర్తించండి.
A) ఇది సరైంది
B) ఇది సరయింది కాదు
C) సరయింది కాదు
D) అది సరయింది కాదు
జవాబు:
B) ఇది సరయింది కాదు
76. చిన్న పాపకు అలా చేయమని చెప్పలేదు – వ్యతిరేక వాక్యం గుర్తించండి.
A) చెప్పారు
B) అలా చేయమని చెప్పారు
C) చిన్నపాపకు అలా చేయమని చెప్పారు
D) చెప్పలేదు
జవాబు:
C) చిన్నపాపకు అలా చేయమని చెప్పారు
77. మిమ్మల్ని ఊహించుకుంటారు – వ్యతిరేక వాక్యం గుర్తించండి.
A) మిమ్మల్నే ఊహించుకుంటారు
B) ఊహించుకోరు
C) ఊహే
D) మిమ్మల్ని ఊహించుకోరు
జవాబు:
D) మిమ్మల్ని ఊహించుకోరు
78. “నేను చిత్రాన్ని చూస్తున్నాను’ – ఈ వాక్యానికి వ్యతిరేకార్థక వాక్యాన్ని గుర్తించండి.
A) నేను చిత్రాన్ని చూడలేదు
B) నేను చిత్రాన్ని చూడటం లేదు
C) నేను చిత్రాన్ని చూడను
D) నేను చిత్రాన్ని చూడబోను
జవాబు:
B) నేను చిత్రాన్ని చూడటం లేదు
79. ‘యాత్రల వలన ఫలము లేదు’ – ఈ వాక్యానికి వ్యతిరేకార్థక వాక్యాన్ని గుర్తించండి. (S.A. II – 2018-19)
A) యాత్రల వలన ఫలితం లేదు
B) యాత్రల వలన ఫలము ఉంది
C) యాత్రల వలన ఫలం అనవసరం
D) యాత్రలు లేకుండా ఫలం లేదు
జవాబు:
B) యాత్రల వలన ఫలము ఉంది
80. పుస్తక రచనను పూర్తి చేయడానికి నెలరోజుల వ్యవధి కావాలి – దీని వ్యతిరేకార్థక వాక్యాన్ని గుర్తించండి.
A) పుస్తక రచనను పూర్తి చేయడానికి నెలరోజుల వ్యవధి అవసరం
B) పుస్తక రచనను పూర్తి చేయడానికి నెలరోజుల వ్యవధి ఎందుకు?
C) పుస్తక రచనను పూర్తి చేయడానికి నెలరోజుల వ్యవధి అక్కర్లేదు
D) పుస్తక రచనను నెలరోజుల్లో పూర్తి చేస్తాను
జవాబు:
C) పుస్తక రచనను పూర్తి చేయడానికి నెలరోజుల వ్యవధి అక్కర్లేదు
13. వాక్య రకాలను గుర్తించడం :
81. ‘నన్ను మీరు క్షమింపవలయును. మఱియెప్పుడైన ఈ సభ తిరుగుజేసికొనుడు’ – ఈ వాక్యాలతో ఏర్పడిన సంక్లిష్ట వాక్యాన్ని గుర్తించండి.
A) నన్ను మీరు క్షమించి, మటియెప్పుడైన ఈ సభ తిరుగు జేసికొనుడు
B) నన్ను మీరు క్షమించండి. ఈ సభ తిరిగి చేసుకోండి
C) నన్ను మీరు క్షమిస్తే మరియొకసారి ఈ సభ పెట్టుకోండి
D) నన్ను మీరు క్షమింపవలసింది. మఱియొకసారి ఈ సభ తిరుగజేసుకోండి
జవాబు:
A) నన్ను మీరు క్షమించి, మటియెప్పుడైన ఈ సభ తిరుగు జేసికొనుడు
82. ‘మాధవి ఆలోచిస్తూ పుస్తకం చదువుతున్నది’ – ఇది ఏ రకమైన సంక్లిష్ట వాక్యం?
A) శత్రర్థకం
B) అప్యకం
C) విద్యర్థకం
D) చేదర్థకం
జవాబు:
A) శత్రర్థకం
83. సీత సంగీతం, నృత్యం నేర్చుకుంటున్నది – ఇది ఏ రకమైన వాక్యం?
A) సామాన్య వాక్యం
B) సంయుక్త వాక్యం
C) సంక్లిష్ట వాక్యం
D) మహా వాక్యం
జవాబు:
B) సంయుక్త వాక్యం
14. ప్రక్రియలను గుర్తించడం :
84. ‘వర్షాకాలంలో వానలు పడితే పంటలు పండుతాయి’ – గీత గీసిన పదం ఏ ప్రక్రియకు చెందింది?
A) క్వార్థకం
B) శత్రర్థకం
C) చేదర్థకం
D) ప్రశ్నార్థకం
జవాబు:
C) చేదర్థకం