AP Inter 2nd Year History Notes Chapter 13 సమాకాలీన ప్రపంచ చరిత్ర

Students can go through AP Inter 2nd Year History Notes 13th Lesson సమాకాలీన ప్రపంచ చరిత్ర will help students in revising the entire concepts quickly.

AP Inter 2nd Year History Notes 13th Lesson సమాకాలీన ప్రపంచ చరిత్ర

→ పారిశ్రామిక దేశాలు తమ ఉత్పత్తులు అమ్ముకోవడానికి ప్రారంభించిన విదేశీ మార్కెట్లు అన్వేషణ సామ్రాజ్యవాదానికి దారితీసింది.

→ పారిశ్రామిక దేశాలు తాము జయించిన దేశాల ఆర్థిక వ్యవస్థలను తమదేశ వాణిజ్య, పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా ఉండేట్లు నియంత్రించడమే సామ్రాజ్యవాదం.

→ వలసల స్థాపనల మధ్య పోటీతో సామ్రాజ్యవాద దేశాల మధ్య విభేదాలు ఏర్పడ్డాయి. ఈ విభేదాలు క్రమంగా రెండు ప్రపంచ యుద్ధాలకు దారితీశాయి.

→ రెండవ ప్రపంచ యుద్ధం తరువాత ప్రపంచ దేశాల మధ్య శాంతి నెలకొల్పడానికి స్థాపించబడింది ఐక్యరాజ్య సమితి.

→ 1945 అక్టోబర్ 24న ఐక్యరాజ్య సమితి (U.N.O) ఏర్పడింది.

→ ఐక్యరాజ్య సమితిలో సాధారణ సభ, భద్రతామండలి, సచివాలయం, అంతర్జాతీయ న్యాయస్థానం, ధర్మకర్తృత్వ మండలి, ఆర్థిక సాంస్కృతిక మండలి అనే విభాగాలున్నాయి.

→ ఐ.రా.స అనేక దేశాల మధ్య ఉన్న విభేదాలు తొలగించడానికి కృషిచేసింది.

→ రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత, అమెరికా, రష్యాల నేతృత్వంలో ప్రపంచం రెండు కూటములుగా విడిపోయి ప్రచ్ఛన్న యుద్ధ పరిస్థితులు ఏర్పడ్డాయి.

→ యూరప్ ఖండంలో కమ్యూనిస్ట్ ప్రభావాన్ని అరికట్టడానికి అమెరికా ట్రూమన్ సిద్ధాంతాన్ని మార్షల్ ప్రణాళికను రూపొందించింది.

AP Inter 2nd Year History Notes Chapter 13 సమాకాలీన ప్రపంచ చరిత్ర

→ సోవియట్ రష్యా కూటమికి వ్యతిరేకంగా అమెరికా విభిన్న యూరప్ దేశాలతో ఏర్పరచుకున్న ఒప్పందమే నాటో (నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్).

→ నాటో కూటమికి ప్రతిగా సోవియట్ యూనియన్ ‘వార్సా’ సంధితో కూటమిని ఏర్పాటు చేసింది.

→ సోవియట్ కూటమిలో గాని, అమెరికా కూటమిలో గాని చేరకుండా తటస్థంగా ఉండటాన్ని అలీనోద్యమం అంటారు.

→ ఒకప్పుడు ఆంగ్లేయుల పాలనలో ఉన్న వలస దేశాలు, స్వాతంత్ర్యాన్ని పొందిన పిదప వారందరూ కలిసి ఏర్పరచుకున్న కూటమి కామన్వెల్త్.

→ ఐరోపా దేశాల వారు తమ మధ్య పరస్పర రాజకీయ, సైనిక, ఆర్థిక సహకారానికై ఏర్పాటు చేసుకున్న సమాఖ్య యూరోపియన్ ఎకనామిక్ కన్ఫెడరేషన్.

→ పెట్రోలియం ఉత్పత్తి చేసే దేశాల వారు అందరూ కలిసి OPEC అనే కమిటి ఏర్పాటు చేసుకున్నారు.

→ SWAPO (స్వాపో) అనే సంస్థలను నమీబియా స్వాతంత్ర్యం కోసం ఏర్పాటు చేసారు.

→ దక్షిణ ఆసియా దేశాల మధ్య వ్యాపార, వాణిజ్య సాంస్కృతిక సంబంధాల కొరకు ఏర్పడిన సంస్థ సార్మ్.