AP 8th Class Social Important Questions Chapter 3 భూ చలనాలు – రుతువులు

These AP 8th Class Social Important Questions 3rd Lesson భూ చలనాలు – రుతువులు will help students prepare well for the exams.

AP Board 8th Class Social 3rd Lesson Important Questions and Answers భూ చలనాలు – రుతువులు

ప్రశ్న 1.
భూమి యొక్క అక్షంను మనం ఎక్కడ నుండి చూడవచ్చు?
జవాబు:
భూమి యొక్క అక్షం ఒక ఊహా జనితరేఖ. దీనిని మనం కంటితో చూడలేము.

ప్రశ్న 2.
భూమి యొక్క అక్షంను మనం ఎక్కడ నుండి చూడవచ్చు?
జవాబు:
చూడలేము. ఎందుకంటే భూమి యొక్క అక్షం ఒక ఊహాజనిత రేఖ. దీనిని మనం కంటితో చూడలేము.

ప్రశ్న 3.
భూమి రోజూ ఎంతో వేగంతో తిరుగుతున్నది. కానీ ఆ విషయం భూమిపై నున్న మనకు ఎందుకు తెలియటం లేదు?
జవాబు:
భూమి, భూమిపై నున్న మనుషులు, ఇళ్ళు, చెట్లు, జంతువులు, భూమిని ఆవరించియున్న వాతావరణము, అన్నిటితో సహా తిరుగుచున్నది. అందువలన ఈ విషయం మనకు తెలియటం లేదు.

ప్రశ్న 4.
ఏ కాలంలో భూమి సూర్యుని వైపుకి వాలి ఉంటుంది?
జవాబు:
వేసవి కాలంలో భూమి సూర్యుని వైపుకి వాలి ఉంటుంది.

AP 8th Class Social Important Questions Chapter 3 భూ చలనాలు – రుతువులు

ప్రశ్న 5.
కాలాలను ప్రభావితం చేసే అంశాలు ఏవి?
జవాబు:
కాలాలను ప్రభావితం చేసే అంశాలు : వీటిని అర్థం చేసుకోవటానికి అనేక అంశాల మధ్య ఉండే సంక్లిష్ట సంబంధాలను అర్థం చేసుకోవాలి. ఇవి :

  1. భూమి బంతిలాగా గోళాకారంలో ఉండటం, దాని ఉపరితలం ఒంపు తిరిగి ఉండటం.
  2. భూమి తన అక్షం మీద రోజుకు ఒకసారి తన చుట్టూ తాను తిరగటం (భూభ్రమణం).
  3. సూర్యుడి చుట్టూ భూమి తిరిగే తలంతో పోలిస్తే తన చుట్టూ తాను తిరిగే అక్షం ఒంపు కలిగి ఉండటం.
  4. సంవత్సర కాలంలో సూర్యుని చుట్టూ భూమి తిరగటం (పరిభ్రమణం).

ప్రశ్న 6.
భూమి భ్రమణాన్ని, పరిభ్రమణాన్ని ప్రశంసించండి.
జవాబు:
భూమి పుట్టినది మొదలు ఈనాటి వరకూ అలుపెరగక భ్రమణ, పరిభ్రమణాలను జరుపుతోంది. అది ఒక్క క్షణం అలుపు తీర్చుకున్నా భూమి మీద ప్రాణికోటి మిగలదు. కాబట్టి భూమికి కృతజ్ఞతాపూర్వక వందనములు.

ప్రశ్న 6.
భూమిపైన ఉన్న కాలాలన్నింటిలోకి ఏది ముఖ్యమని నీవు భావిస్తున్నావు?
జవాబు:
భూమిపై ఉన్న కాలాలన్నీ ముఖ్యమైనవే అని నా భావన. ఎండాకాలంలో ఎండిన నేలకి వాన స్వాంతన. ఈ రెండింటి తర్వాత చలి ఎంతో హాయినిస్తుంది. చలికాలం తరువాత ఎండ కూడా హాయిగానే ఉంటుంది. అయితే వాస్తవంగా ఏ కాలం లేకపోయినా భూమి మీద మానవ మనుగడ అసాధ్యం అని నేను భావిస్తున్నాను.

ప్రశ్న 8.
ముఖ్యమైన కాలాలు చెప్పండి.
జవాబు:
ముఖ్యమైన కాలాలు ఎండాకాలం, వానాకాలం మరియు చలికాలం.

ప్రశ్న 9.
భూ భ్రమణం, భూ పరిభ్రమణం ప్రశంసించండి.
జవాబు:
భూ భ్రమణం, భూ పరిభ్రమణం సమస్త జీవరాసులకు ప్రాణాధారం.

ప్రశ్న 10.
భూమిపైన ఉన్న కాలాలన్నింటిలో ఏది ముఖ్యమైనది?
జవాబు:
భూమిపై ఉన్న కాలాలన్నీ ముఖ్యమైనవే. ఏ కాలం లేకపోయినా మానవాళి మనుగడ శూన్యమౌతుంది.

ప్రశ్న 11.
1. క్రింది పటాన్ని పరిశీలించి ప్రశ్నలకు సమాధానాలు రాయంది.
AP 8th Class Social Important Questions Chapter 3 భూ చలనాలు – రుతువులు 1
ఎ) కర్కటరేఖ పై సూర్యకిరణాలు నిట్టనిలువుగా ప్రసరించే రోజు?
బి) సూర్యుడు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు దక్షిణార్ధగోళంలో ఉంటాడు ?
జవాబు:
ఎ) కర్కటరేఖ పై సూర్యకిరణాలు నిట్టనిలువుగా ప్రసరించే రోజు జూన్ – 21
బి) సెప్టెంబర్ 23 నుండి డిసెంబర్ 22 వరకు దక్షిణార్ధ గోళంలో ఉంటాడు.

ప్రశ్న 12.
శీతోష్ణస్థితి ఆధారంగా భారతదేశంలోని కాలాలను ఎన్ని ఋతువులుగా విభజించారు? అవి ఏవి?
జవాబు:
శీతోష్ణస్థితిని బట్టి భారతదేశంలోని కాలాలను 6 ఋతువులుగా విభజించారు. అవి :

  1. వసంత ఋతువు
  2. గ్రీష్మ ఋతువు
  3. వర్ష ఋతువు
  4. శరదృతువు
  5. హేమంత ఋతువు
  6. శిశిర ఋతువు

AP 8th Class Social Important Questions Chapter 3 భూ చలనాలు – రుతువులు

ప్రశ్న 13.
విషువత్తులు అనగానేమి? అవి ఏ రోజులలో సంభవిస్తాయి?
జవాబు:
విషువతులు అనగా పగటి కాల సమయం మరియు రాత్రికాల సమయం రెండూ సమానంగా ఉండటం.

సాధారణంగా మార్చి 21, సెప్టెంబర్ – 23 ఈ రెండు తేదీలలో ప్రపంచ వ్యాప్తంగా పగలు, రాత్రి సమానంగా ఉంటాయి. కావున ఈ రెండు రోజులను విషువత్తులు అంటారు.

AP 8th Class Social Important Questions Chapter 2 సూర్యుడు – శక్తి వనరు

These AP 8th Class Social Important Questions 2nd Lesson సూర్యుడు – శక్తి వనరు will help students prepare well for the exams.

AP Board 8th Class Social 2nd Lesson Important Questions and Answers సూర్యుడు – శక్తి వనరు

ప్రశ్న 1.
కింద ఉన్న పట్టికలో భారతదేశంలోని కొన్ని పట్టణాలలో జనవరి 10న సూర్యోదయ, సూర్యాస్తమయ సమయాలు ఉన్నాయి. వీటి ఆధారంగా పట్టిక కింద ఉన్న ప్రశ్నలకు సమాధానం ఇవ్వండి.

ప్రదేశంసూర్యోదయంసూర్యాస్తమయం
హైదరాబాదు, తెలంగాణ6 : 495:58
ఆగ్రా, ఉత్తరప్రదేశ్7: 095: 42
మధురై, తమిళనాడు6: 376: 12
నాగపూర్, మహారాష్ట్ర6:535: 48
విశాఖపట్టణం , ఆం.ప్ర.6: 295:38
కోహిమా, నాగాలాండ్6: 024 : 40

1. పైన ఉన్న ఆరు పట్టణాలలో ముందుగా సూర్యోదయం ఎక్కడ అవుతుంది?
జవాబు:
కోహిమా, నాగాలాండ్

2. ఏ పట్టణంలో అన్నిటికంటే చివర సూర్యాస్తమయం అవుతుంది?
జవాబు:
మధురై, తమిళనాడు

3. ఈ ఆరు పట్టణాలలో పగటికాలం ఎంత? (సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం మధ్య ఉన్న కాలం పగటి కాలం అవుతుంది.)
జవాబు:
హైదరాబాదు : 11.09 ని॥లు
ఆగ్రా : 10.33 ని॥లు
మధురై : 11.35 ని॥లు
నాగపూర్ : 10.55 ని॥లు
విశాఖపట్టణం : 11.09 ని॥లు
కోహిమా : 10.38 ని॥లు

ప్రశ్న 2.
ఉష్ణోగ్రత, వర్షపాతం జీవితాలను ప్రభావితం చేస్తాయని ఎట్లు చెప్పగలవు?
జవాబు:
ఉష్ణోగ్రత, వర్షపాతం జీవితాలను ఎంతగానో ప్రభావితం చేస్తాయి. సూర్యరశ్మి, నీటిపై ఆధారపడి చెట్లు, జంతువులు బతుకుతాయి. చాలా కొద్ది రకాల చెట్లు మాత్రమే వేడిగా ఉండే ప్రాంతాలలో పెరుగుతాయి. చలి ప్రాంతాలలో మరికొన్ని పెరుగుతాయి. బాగా చలి ప్రాంతాలలో ఏవీ పెరగవు. ఈ విధంగా వృక్ష, జంతుజాలాలలో వైవిధ్యత ఉంది.

ప్రశ్న 3.
ఉష్ణోగ్రతకు, వర్షపాతానికి మధ్య గల సంబంధమేమి?
జవాబు:
రెండు ప్రదేశాల మధ్య గల ఉష్ణోగ్రతలలోని తేడాలు గాలులు, వానలను ప్రభావితం చేస్తాయి. ఉష్ణోగ్రత అధికంగా ఉన్నప్పుడు వర్షాలు కూడా బాగా కురుస్తాయి.

ప్రశ్న 4.
సౌరశక్తి ఏయే రూపాలలో ఉంటుంది?
జవాబు:
సౌరశక్తి కాంతి, వేడి, అల్ట్రావయొలెట్ తరంగాలు, రేడియో తరంగాలు మరియు X – కిరణాల రూపంలో ఉంటుంది.

ప్రశ్న 5.
భూగోళం వేడెక్కటం అంటే ఏమిటి?
జవాబు:
భూమి మీద వాతావరణంలో (CO) కార్బన్-డై-ఆక్సెడ్ అధికమవడం మూలంగా, వేడి వికిరణం తగ్గుతుంది. భూమి మీద ఉష్ణోగ్రతలు పెరుగుతాయి. దీనినే భూగోళం వేడెక్కటం అంటారు.

AP 8th Class Social Important Questions Chapter 2 సూర్యుడు – శక్తి వనరు

ప్రశ్న 6.
వేడిమి సమతుల్యం అంటే ఏమిటి?
జవాబు:
సూర్యుని నుండి భూమి పొందే వేడి వివిధ పద్ధతులలో తిరిగి వికిరణం చెందుతుంది. కొంతమాత్రమే భూమి గ్రహిస్తుంది. దీనివలన భూమి మీద భరించగలిగే స్థాయిలో మాత్రమే వేడి ఉంటుంది. దీనినే వేడిమి సమతుల్యం అంటారు.

ప్రశ్న 7.
భూమి మీద ఉష్ణోగ్రతలలో మార్పులకు గల కారణాలు ఏవి?
జవాబు:
భూమి మీద ఉష్ణోగ్రతలలో మార్పులకు అనేక కారణాలున్నాయి. అవి :

  1. అక్షాంశము
  2. ఎత్తు
  3. సముద్రం నుండి దూరము
  4. సముద్ర తరంగాలు
  5. పర్వతాలు
  6. గాలులు మొ||నవి.

ప్రశ్న 8.
సూర్యకిరణాలు, సౌరశక్తి అనగా నేమి?
జవాబు:
భూగోళంపై శక్తికి సూర్యుడు మూలవనరు. సూర్యుడు ఒక పెద్ద శక్తి కేంద్రం. కాంతి, వేడిమి రూపంలో అది శక్తిని విడుదల చేస్తూ ఉంటుంది. సూర్యుడి నుంచి నిరంతరాయంగా వెలువడే ఈ శక్తిని సౌర వికిరణం అంటారు. ఏదైనా ఒక వస్తువు శక్తిని వెలువరించటాన్ని వికిరణం అంటారు. సూర్యుడి నుంచి మనకు శక్తి సూర్యకిరణాల రూపంలో వస్తుంది.

ప్రశ్న 9.
ఏఏ ప్రాంతాల ఉష్ణోగ్రతలలో తేడాలు ఉంటాయి?
జవాబు:
సముద్రానికి దగ్గరగా, దూరంగా ఉన్న ప్రాంతాల మధ్య సాధారణంగా ఉష్ణోగ్రతలలో తేడాలు ఉంటాయి. కొండపైన కొండ కింద ఉష్ణోగ్రతలలో తేడాలు ఉంటాయి. భూమధ్య రేఖ నుంచి ఉత్తరానికి లేదా దక్షిణానికి ప్రయాణం చేస్తుంటే ఉష్ణోగ్రతలు తగ్గుతాయి.

ప్రశ్న 10.
హరిత గృహాలు గూర్చి వ్రాయుము.
జవాబు:
మొక్కలకు అనువైన వాతావరణాన్ని కృత్రిమంగా కల్పించటం ద్వారా అన్ని చోట్ల పంటలు పండించటానికి మానవులు ప్రయత్నించటం ఆశక్తికరంగా ఉంటుంది. బాగా చలిగా ఉండే ప్రదేశాలలో హరిత గృహాలు నిర్మించి కూరగాయలు, పళ్ళు పండిస్తున్నారు. హరిత గృహాల గోడలు పారదర్శకంగా ఉండి ఎండను లోపలికి రానిస్తాయి. కానీ బయటకు వెళ్ళనివ్వవు. వారికి అనువుగా మడులు కట్టి సాగునీరు ఇచ్చి నీటిని నిల్వ కడతారు.

AP 8th Class Social Important Questions Chapter 2 సూర్యుడు – శక్తి వనరు

ప్రశ్న 11.
సూర్యుడు ప్రాణకోటికి ప్రాథమిక శక్తి వనరు. సూర్యరశ్మిని చెట్లు ఆహారంగా మార్చేసే ఫ్యాక్టరీలు, అటువంటి చెట్లను, అడవులను మనం పెంచుతున్నామా? తగ్గిస్తున్నామా? చెట్ల వల్ల కలిగే ప్రయోజనాలు చెట్లను పెంచే మన బాధ్యతను గురించి వివరించండి.
జవాబు:
మనం పెంచే చెట్లకన్నా అధికశాతం చెట్లను నరికివేస్తున్నాము.

చెట్లు వలన ఉపయోగాలు :

  1. చెట్లు వాతావరణంలోని గాలి వేడిని తగ్గిస్తాయి.
  2. చెట్లు సహజ ఎయిర్ కండిషనర్లుగా పనిచేస్తాయి.
  3. చెట్లు ధ్వని కాలుష్యాన్ని తగ్గిస్తాయి.
  4. చెట్ల నుంచి రాలిన ఆకులు నేలలోని ఉష్టాన్ని తగ్గిస్తాయి.
  5. చెట్లు పక్షులకు, కొన్ని జంతువులకు ఆవాసాన్నీ, ఆహారాన్ని అందిస్తాయి.
  6. చెట్లు CO2 ను తీసుకుని O2 ను వదిలి మనకు ఊపిరినిస్తాయి.
  7. చెట్లు నీటిని సముద్రంలోనికి పోకుండా పట్టి ఉంచుతాయి. నేలలో సారం కొట్టుకుపోకుండా ఉంచుతాయి. నీటిని నేలలోనికి ఇంకిపోయేలా చేస్తాయి. దీనిమూలంగా కలుషితమైన ఎక్కువ చోటు పారకుండా నేలలోనికి యింకిపోతాయి.

ప్రశ్న 12.
హరిత గృహాలను ప్రశంసించండి.
జవాబు:
హరిత గృహాలనే గాజు గృహాలుగా కూడా పిలుస్తారు. ఇవి మొక్కలను పెంచడానికి నిర్మిస్తారు. ఇవి నియంత్రించబడిన వాతావరణాన్ని కలిగి ఉంటాయి. ఇవి మంచి వేడిని, నీటిని మొక్కలకి అందిస్తాయి. వీటి సృష్టి చాలా అద్భుతం.

ప్రశ్న 13.
‘భూగోళం వేడెక్కడం’ మూలంగా ఏం జరుగుతుంది?
జవాబు:
‘భూగోళం వేడెక్కడం’ మూలంగా ధృవాలలో ఉన్న మంచు కరిగి, సముద్రమట్టాలు పెరుగుతాయి. భూమి మీద ఖండాలన్నీ నీట మునుగుతాయి.

ప్రశ్న 14.
హరిత గృహాలను ప్రశంసించండి.
జవాబు:
హరిత గృహాలనే గాజు గృహాలుగా కూడా పిలుస్తారు. ఇవి మొక్కలను పెంచడానికి నిర్మిస్తారు. ఇవి నియంత్రించబడిన వాతావరణాన్ని కలిగి ఉంటాయి. ఇవి మంచి వేడిని, నీటిని మొక్కలకి అందిస్తాయి. వీటి సృష్టి చాలా అద్భుతం.

AP 8th Class Social Important Questions Chapter 2 సూర్యుడు – శక్తి వనరు

ప్రశ్న 15.
భూగోళం వేడెక్కడం,మూలంగా ఏం జరుగుతుంది?
జవాబు:
భూగోళం వేడెక్కడం మూలంగా ధృవాలలో ఉన్న మంచు కరిగి, సముద్రమట్టాలు పెరుగుతాయి. భూమి మీద ఖండాలన్నీ నీట మునిగిపోతాయి.

ప్రశ్న 16.
ఈ క్రింది ఉన్న పట్టికను పరిశీలించి ప్రశ్నలకు సమాధానాలు రాయండి.

ప్రదేశంసూర్యోదయంసూర్యాస్తమయం
హైదరాబాదు, తెలంగాణ6 : 495 : 58
ఆగ్రా, ఉత్తరప్రదేశ్7 : 095 : 42
మధురై, తమిళనాడు6 : 375 : 12
నాగపూర్, మహారాష్ట్ర6 : 535 : 48
విశాఖపట్టణం, ఆంధ్రప్రదేశ్6 : 295 : 38
కోహిమా, నాగాలాండ్6 : 024 : 40

ఎ) ముందుగా సూర్యోదయం అయ్యే పట్టణం ఏది?
బి) ఏ పట్టణంలో అన్నిటికంటే చివరిగా సూర్యాస్తమయం అవుతుంది?
సి) విశాఖపట్టణం పగటి కాలం ఎంత?
డి) ఏ కాలంలో (సీజన్స్) పగటి వ్యవధి తక్కువ?
జవాబు:
ఎ) ముందుగా సూర్యోదయం అయ్యే పట్టణం నాగాలాండ్ రాష్ట్రములోని కోహిమా.
బి) చివరిగా సూర్యాస్తమయం అయ్యే పట్టణం తమిళనాడులోని, మధురై.
సి) విశాఖపట్టణం పగటికాలం సమయం 11 గంటల 9 నిముషాలు.
డి) పగలు వ్యవధి తక్కువగా ఉండే కాలం శీతాకాలం

ప్రశ్న 17.
సముద్ర ప్రభావిత, ఖండాంతర్గత శీతోష్ణస్థితుల మధ్యగల భేదమును వివరించండి.
జవాబు:
సముద్ర ప్రభావిత శీతోష్ణస్థితి :
సముద్ర తీరాన ఉండే ప్రదేశాలలో సాధారణంగా సంవత్సరమంతా శీతోష్ణస్థితులు ఒకేరకంగా ఉంటాయి. దీనిని సముద్ర ప్రభావిత శీతోష్ణస్థితి అంటారు.

ఖండాతర్గత శీతోష్ణస్థితి :
సముద్రతీరానికి దూరంగా ఉండే ప్రాంతాలలో గరిష్ట మరియు కనిష్ట ఉష్ణోగ్రతలలో చాలా తేడాలు ఉంటాయి. ఇలా ఉండటాన్ని ఖండాతర్గత శీతోష్ణస్థితి అంటారు.

ప్రశ్న 18.
ప్రస్తుతం ప్రపంచం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య భూగోళం వేడెక్కటం (Global warming) దీనియొక్క రెండు దుష్పరిణామాలు రాయండి.
జవాబు:
భూగోళం వేడెక్కడం మూలంగా ధృవాలలో ఉన్న మంచు కరిగి, సముద్రమట్టాలు పెరుగుతాయి. భూమి మీద ఖండాలన్నీ నీట మునిగిపోతాయి.

ప్రశ్న 19.
క్రింది పట్టికు పరిశీలించి ఇవ్వబడిన ప్రశ్నలకు సమాధానాలు రాయండి.
AP 8th Class Social Important Questions Chapter 2 సూర్యుడు – శక్తి వనరు 1
ఎ) పై పట్టిక ప్రకారం ఎక్కువ శక్తిని గ్రహించునది?
బి) అన్ని అంశాల ద్వారా మొత్తం ఎంత శాతం శక్తి పరావర్తనం చేయబడుతుంది?
జవాబు:
ఎ) భూమి ఎక్కువ శక్తిని గ్రహిస్తుంది – 54%
బి) పరావర్తనం చెందే శక్తి శాతం – 30%

ప్రశ్న 20.
“కార్బన్ డై ఆక్సైడ్” లాంటి వాయువులు వాతావరణంలో పెరగటం భూగోళం వేడెక్కడానికి ఎలా దారి తీస్తున్నది?
జవాబు:
భూ వికిరణం ద్వారా వెలువడే వేడి వాతావరణం నుంచి బయటకు పోకుండా కార్బన్ డై ఆక్సెడ్ లాంటి వాయువులు అడ్డుకుంటున్నాయి. ఇది ప్రపంచ ఉష్ణోగ్రతలు పెరగటానికి కారణమవుతున్నది. తద్వారా భూగోళం వేడెక్కడానికి దారి తీస్తున్నది.

ప్రశ్న 21.
క్రింది గ్రాఫ్ ను చదివి కింది ప్రశ్నలకు సమాధానాలు రాయండి.
AP 8th Class Social Important Questions Chapter 2 సూర్యుడు – శక్తి వనరు 2
ఎ) ప్రాంతం A యొక్క సంవత్సరంలోని ఉష్ణోగ్రత క్రమం ఏమిటి?
బి) రెండు ప్రాంతాలలో ఏది పర్వత ప్రాంతం అయి వుంటుంది?
జవాబు:
ఎ) ప్రాంతం A యొక్క సంవత్సరంలోని ఉష్ణోగ్రత క్రమంలో ఏ మార్పులు పెద్దగా లేవు.
బి) ప్రాంతం A పర్వత ప్రాంతం అయ్యే అవకాశాలు ఎక్కువ.

ప్రశ్న 22.
పునరుద్ధరింపబడే వనరులు మరియు అంతరించిపోయే వనరుల మధ్య తేడా ఏమిటి? ఒక్కొక్క దానికి ఉదాహరణ ఇవ్వండి.
జవాబు:

  1. పునరుద్దరించేబడే వనరులు అనగా ఒకసారి ఉపయోగించిన తరువాత కూడా తిరిగి ఉపయోగించడానికి లేదా తిరిగి ఉత్పత్తి చేయడానికి అవకాశం గల వనరులు
    ఉదా : సౌరశక్తి.
  2. అంతరించిపోయే వనరులు అనగా ఒకసారి ఉపయోగించిన తరువాత తిరిగి ఉపయోగించడానికి లేదా ఉత్పత్తి చేయడానికి వీలు కానివి.
    ఉదా : బొగ్గు, పెట్రోలియం.

AP 8th Class Social Important Questions Chapter 2 సూర్యుడు – శక్తి వనరు

ప్రశ్న 23.
“కార్బన్ డై ఆక్సైడ్” లాంటి వాయువులు వాతావరణంలో పెరగటం భూగోళం వేడెక్కడానికి ఎలా దారి తీస్తున్నది?
జవాబు:
భూ వికిరణం ద్వారా వెలువడే వేడి వాతావరణం నుంచి బయటకు పోకుండా కార్బన్ డై ఆక్సెడ్ లాంటి వాయువులు అడ్డుకుంటున్నాయి. ఇది ప్రపంచ ఉష్ణోగ్రతలు పెరగటానికి కారణమవుతున్నది.. తద్వారా భూగోళం వేడెక్కడానికి దారి తీస్తున్నది.

AP 8th Class Social Important Questions Chapter 1 పటాల అధ్యయనం – విశ్లేషణ

These AP 8th Class Social Important Questions 1st Lesson పటాల అధ్యయనం – విశ్లేషణ will help students prepare well for the exams.

AP Board 8th Class Social 1st Lesson Important Questions and Answers పటాల అధ్యయనం – విశ్లేషణ

ప్రశ్న 1.
పూర్వకాలంలో వారు పటాలను ఎలా తయారుచేసేవారు?
జవాబు:
నాటి భౌగోళిక శాస్త్రవేత్తలు విరివిగా ప్రయాణాలు చేసి వాటికి సంబంధించిన వివరాలను పుస్తకాల రూపంలో నమోదు చేసేవారు. పటాలను తయారు చేసేవారు. వీటిని ఆధారంగా చేసుకుని పటాలను తయారు చేసేవారు. ఇవి వాస్తవ దూరంగా ఉండి పెద్దగా వాడుకలోనికి రాలేదు. కానీ, చరిత్రకారులు వీటిని ఉపయోగించి పటాలను తిరిగి తయారు చేసేవారు.

ప్రశ్న 2.
ఎవరెస్టు శిఖరానికి ఆ పేరు ఎట్లు వచ్చింది?
జవాబు:
1802లో విలియం లాంటన్ ఒక ప్రముఖ సర్వేను చెన్నై నుండి ప్రారంభించారు. ఇది హిమాలయాల వరకు రేఖాంశాలను, ఇతర ఎత్తులను తెలుసుకోవడానికి ఉద్దేశించబడినది. ఈ సర్వే జార్జి ఎవరెస్ట్ చే పూర్తి చేయబడింది. ఈ సర్వేలోనే ‘ఎవరెస్ట్’ అన్ని శిఖరాలలోకి ఎత్తైనది అని ప్రపంచానికి వెల్లడైంది. కాబట్టి ఆ శిఖరానికి ఆయన పేరు పెట్టడం జరిగింది.

ప్రశ్న 3.
పటాలకు, చిత్రాలకు మధ్య గల భేదమేమి?
జవాబు:
పటం :
ముఖ్యమని భావించే అంశాలను చూపించడానికి భౌగోళిక శాస్త్రజ్ఞులు పటాలను ఉపయోగిస్తారు.

చిత్రం :
చిత్రం పటం వలే ఆ ప్రాంతంలోని నిజమైన అంశాలను కాక కేవలం కంటికి కనిపించే వాటిని మాత్రమే చూపిస్తుంది.

ప్రశ్న 4.
నిర్దేశిత పటాలను ఎట్లు చదవాలి?
జవాబు:

  1. ఒకే అంశంపై కేంద్రీకరించబడే పటాలను నిర్దేశిత పటాలు అంటారు.
  2. వీటిని చదవడానికి మనకు పటాలలో ఉపయోగించే గుర్తులు, రంగులు, వివిధ ఆచ్ఛాదనలు తెలిసి ఉండాలి.
    ఉదా : ముదురు ఊదా : కొండలు, నలుపు : సరిహద్దులు
    అప్పుడు మాత్రమే నిర్దేశిత పటాలను మనం చదవగలగుతాం.

ప్రశ్న 5.
ఐసోలైన్స్ అంటే ఏమిటి?
జవాబు:
సముద్ర మట్టం నుంచి ఒకే ఎత్తులో ఉన్న ప్రదేశాలన్నింటినీ కలిపే వాటిని ఐసోలైన్స్ అంటారు.

ప్రశ్న 6.
కాంటూరు రేఖల వలన ఉపయోగమేమి?
జవాబు:
కాంటూరు రేఖల వలన ఒక ప్రాంతపు ఎత్తును, పల్లాన్ని సులభంగా తెలుసుకోవచ్చును.

ప్రశ్న 7.
పూర్వకాలం నాటి పటం తయారీదారుల పేర్లను తెలపండి.
జవాబు:
గ్రీకులు, అరబ్బులు, చైనీయులు, సుమేరియన్లు, బాబిలోనియన్లు మరియు యూరోపియన్లు మొదలైనవారు పూర్వకాలం ఆనాటి పటం తయారీదారులు.

AP 8th Class Social Important Questions Chapter 1 పటాల అధ్యయనం – విశ్లేషణ

ప్రశ్న 8.
సాంప్రదాయ సంకేతాలు అంటే ఏమిటి?
జవాబు:
పూర్వకాలం నాటి నుండి పటాల తయారీదారులు తమ సౌలభ్యం కోసం కొన్ని గుర్తులను ఉపయోగించేవారు. వాటినే సాంప్రదాయ సంకేతాలు అంటారు.

ప్రశ్న 9.
ఈ ప్రక్క నీయబడిన చిత్రాన్ని గమనించి మీ అభిప్రాయాన్ని రాయండి.
AP Board 8th Class Social Solutions Chapter 1 పటాల అధ్యయనం - విశ్లేషణ 1
జవాబు:

  1. ఈ పటం బైబిలును అనుసరించి ప్రపంచ నమూనా.
  2. ఇది చుట్టూ సముద్రంచే ఆవరించబడి, మూడు ఖండాలుగా విభజించబడినది.
  3. అవి ఆసియా, ఐరోపా మరియు ఆఫ్రికా.
  4. వీటిలో ఆసియా జెరూసలెంను కలిగి ఉన్న కారణంగా ప్రాముఖ్యతను సంతరించుకుని ఆ పటంలో సగభాగాన్ని ఆక్రమించింది.
  5. జెరూసలెం క్రీస్తు జన్మస్థలం. కావున అది పై భాగంలో చూపబడినది.

ప్రశ్న 10.
ప్రక్కనీయబడిన చిత్రాన్ని పరిశీలించి, ‘మెర్కేటర్ ప్రక్షేపణ’ పై మీ అభిప్రాయాన్ని తెలియచేయండి.
AP Board 8th Class Social Solutions Chapter 1 పటాల అధ్యయనం - విశ్లేషణ 2
జవాబు:

  1. గెరార్డస్ మెర్కేటర్ ప్రఖ్యాతి గాంచిన భౌగోళిక శాస్త్రవేత్త మరియు కార్టో గ్రాఫర్.
  2. ఈయన ప్రక్షేపణ ప్రకారం భూమధ్యరేఖ నుండి ధృవాల వైపుకు వెళ్ళేకొలదీ ప్రదేశాల ఆకారాలు పెద్దవిగా కనబడతాయి.
    ఉదా : 1. గ్రీన్‌లాండ్ వాస్తవానికి చిన్నదైనా, ప్రపంచ పటంలో ఆఫ్రికా ఖండం అంత కనబడుతుంది. వాస్తవానికి ఆఫ్రికా గ్రీన్‌లాండ్, కన్నా 14 రెట్లు పెద్దది. గ్రీన్ లాండ్ అర్జెంటీనా దేశమంత మాత్రమే ఉంటుంది.
    2. అలాస్కా – బ్రెజిల్
    3. ఫిలాండ్ – ఇండియా

ప్రశ్న 11.
అల్ ఇద్రిసి జీవితాన్ని గురించి సమాచారాన్ని సేకరించి ఒక చిన్న వ్యాసం వ్రాయండి.
AP Board 8th Class Social Solutions Chapter 1 పటాల అధ్యయనం - విశ్లేషణ 3
జవాబు:
అప్రఫ్ అల్ ఇద్రిసి 1099లో జన్మించారు. ఆయన ముస్లిం భౌగోళిక శాస్త్రవేత్త. కార్టోగ్రాఫర్ మరియు యాత్రికుడు. రోజర్ – II అనే రాజు కొలువులో, సిసిలీలో నివసించేవారు. ఆయన చిన్నతనంలో చాలా జీవితం ఉత్తర ఆఫ్రికా, స్పెయిన్స్ లో ప్రయాణం చేశారు. ఆఫ్రికా, హిందూ మహాసముద్రం, దూర ప్రాచ్యానికి సంబంధించి ఇస్లాం వర్తకులు, అన్వేషకులు సేకరించి ఇచ్చిన సమారాన్ని క్రోడీకరించి ఇస్లాం పటాలను తయారుచేశారు. ఆయన దీనికి సంబంధించి ఒక గ్రంథాన్ని కూడా రచించారు. (ది టాబులా రోజియానా). ఈ పుస్తకాన్ని నార్మన్ రాజు అయినటువంటి రోజర్-II కోసం రచించారు. ఈయన సిసిలీలో 1165/1166లో మరణించారు.

ప్రశ్న 12.
ఈ క్రింది సమాచారాన్ని చదివి, ఈయబడిన ప్రశ్నలకు సమాధానమునిమ్ము.

పటాలలో ఎత్తు, పల్లాలను చూపడం : భూమిపై ఎత్తులు, పల్లాలు అంటే కొండలు, లోయలు, పీఠభూములు, మైదానాలు, నదీ పరీవాహక ప్రాంతాలు, రాళ్లు, ఇసుకతో కూడిన ప్రదేశాలు ఉంటాయి. పటాలు బల్లపరుపుగా ఉంటాయి. కాబట్టి వాటిలో ఎత్తు, పల్లాలను చూపించలేం. అందుకని వీటిని చూపించటానికి కాంటూరు రేఖలు అనే ప్రత్యేక సంకేతాలను ఉపయోగిస్తాం. సముద్ర మట్టం నుంచి ఒకే ఎత్తులో ఉన్న ప్రదేశాలన్నిటినీ కలిపే వాటిని కాంటూరు రేఖలు అంటారు. ఇంకోరకంగా చెప్పాలంటే ఒక కాంటూరు రేఖ మీద ఉన్న ప్రదేశాలన్నీ సముద్ర మట్టం నుంచి ఒకే ఎత్తులో ఉంటాయి. కాంటూరు రేఖలను ఐసోలైన్స్ అని కూడా అంటారు.
1. భూమిపై ఎత్తు, పల్లాలు అంటే ఏమిటి?
జవాబు:
భూమిపై ఎత్తు, పల్లాలు అంటే కొండలు, లోయలు, పీఠభూములు, మైదానాలు, నదీ పరీభాహక ప్రాంతాలు, రాళ్లు, ఇసుకతో కూడిన ప్రదేశాలు మొదలగునవి.

2. పటాలలో ఎత్తు, పల్లాలను ఎందుకు చూపించలేము?
జవాబు:
పటాలు బల్ల పరుపుగా ఉంటాయి. కాబట్టి వాటిలో ఎత్తు, పల్లాలను చూపించలేము.

3. ప్రత్యేక సంకేతాలు అంటే ………………………
జవాబు:
కాంటూరు రేఖలు

4. …………. నుంచి ఒకే ఎత్తులో ఉన్న ప్రదేశాలను కలిపే వాటిని కాంటూరు రేఖలు అంటారు.
జవాబు:
సముద్ర మట్టం

5. కాంటూరు రేఖలను …………………. అని కూడా అంటారు.
జవాబు:
ఐసోలైన్స్)

ప్రశ్న 13.
ఇచ్చిన వివరాలను పరిశీలించి ఈ క్రింది ప్రశ్నలకు జవాబులిమ్ము.
AP Board 8th Class Social Solutions Chapter 1 పటాల అధ్యయనం - విశ్లేషణ 4
1. పోర్చుగీసు అన్వేషకులు ఎవరు?
జవాబు:
ఫెర్డినాండ్ మాజిలాన్, వాస్కోడిగామా, బార్త్ లోవ్ మ్యూడియాస్.

2. మార్కోపోలో గురించి నీకేమి తెలుసును?
జవాబు:
మార్కోపోలో ఇటలీ దేశస్థుడు. 1254లో జన్మించాడు. ఆసియా ఖండాన్ని, చైనా దేశాన్ని అన్వేషించాడు. 1324లో మరణించాడు.

3. అమెరికాను కనుగొన్నదెవరు?
జవాబు:
క్రిస్టోఫర్ కొలంబస్

4. మాజిలాన్ జీవితకాలం ఏది?
జవాబు:
1480 నుండి 1521 వరకు

5. మొదటగా ప్రపంచాన్ని చుట్టి వచ్చినదెవరు?
జవాబు:
ఫెర్డినాండ్ మాజిలాన్

AP 8th Class Social Important Questions Chapter 1 పటాల అధ్యయనం – విశ్లేషణ

ప్రశ్న 14.
మీ పాఠశాలకు సంబంధించి జనాభా పటాన్ని తయారుచేయుము.
జవాబు:
నేను గాంధీజీ మునిసిపల్ కార్పొరేషన్ ఎలిమెంటరీ పాఠశాలలో చదువుతున్నాను. మా పాఠశాలలో 5 తరగతి గదులు, ఒక ప్రధానోపాధ్యాయుని గది, స్టాఫ్ రూమ్, వంట గది, టాయ్ లెట్లు ఉన్నాయి. పాఠశాలలో విద్యార్థుల సంఖ్య 176.

తరగతివారీగావిద్యార్థులు
1వ తరగతి44
2వ తరగతి40
3వ తరగతి42
4వ తరగతి28
5వ తరగతి22

AP 8th Class Social Important Questions Chapter 1 పటాల అధ్యయనం – విశ్లేషణ 5

ప్రశ్న 15.
ఇద్రిసి తయారుచేసిన పటంలో ‘దక్షిణం’ పై వైపు ఉండగా, గ్రీకులు తయారుచేసిన పటాలలో పై వైపు ఉత్తర దిశ ఎందుకు ఉంది?
జవాబు:
ఇస్లాం సాంప్రదాయాలు చాలా వరకు ప్రపంచంలోని ఇతర సాంప్రదాయాల కన్నా భిన్నంగా ఉంటాయి.
ఉదా : వారు వ్రాసే విధానం. అదేవిధంగా ఇద్రిసి పటంలో దక్షిణం పై వైపు ఉండి ఉండవచ్చు.
(లేదా)
సూర్యుని వైపు తిరిగి దానిని తూర్పుగా భావించి వారు కుడి చేతి వైపుకి ప్రాముఖ్యత యిచ్చి (అంటే దక్షిణానికి) దానిని పటంలో పైకి చూపించి ఉండవచ్చును.

ప్రశ్న 16.
ఈ క్రింది వివరణను చదివి దానికి సంబంధించి ఒక ప్రశ్నను వ్రాయుము.
“పటం తయారుచేసేవాళ్ళు ముఖ్యమనుకునే వాటిని చూపించే నమూనాగా పటాన్ని తయారుచేస్తారు. వీరు దేని – కోసం అన్న దాన్ని బట్టి వివిధ రకాల పటాలను తయారుచేస్తారు.”
జవాబు:
వివిధ రకాల పటాలను ఎందుకు తయారుచేస్తారు?

ప్రశ్న 17.
గ్రీకులు, రోమన్లు పటాల తయారీలో ఎందుకు ఆసక్తిని కలిగి ఉండేవారు?
జవాబు:
నాటి గ్రీకులకు, రోమన్లకు ప్రపంచ విజేతలు కావాలనే కోరిక ఎక్కువగా ఉండేది. అందుకే వారు పటాల తయారీలో ఎక్కువ ఆసక్తిని కలిగి ఉండేవారు.

ప్రశ్న 18.
బాబిలోనియన్ల మట్టి పలకపై ఉన్న ప్రపంచ పటాన్ని ప్రశంసించండి.
జవాబు:
బాబిలోనియన్ల మట్టి పలకపై ప్రపంచపటం పర్షియన్ల కాలం నాటిది. అది సమతలంగాను, గుండ్రంగాను ఉన్నది. లోపలి ‘0’ లో వారికి తెలిసిన అన్ని ప్రాంతాలను చర్చించారు. బాబిలోనియాను పలక మధ్యలో చిత్రించారు. బయటి భాగంలో ఉప్పు సముద్రాన్ని చిత్రించారు. దానిలో 7 త్రికోణాకారపు దీవులను చూపించారు.
AP 8th Class Social Important Questions Chapter 1 పటాల అధ్యయనం – విశ్లేషణ 15
వారి ఆలోచనా శక్తి, ఊహాశక్తి, దానిని తయారుచేసిన కళానైపుణ్యం చాలా ప్రశంసించతగినది.

ప్రశ్న 19.
అక్షాంశ, రేఖాంశాలను, గ్రిడ్ ను ఎవరు కనిపెట్టారు?
జవాబు:
హిప్పొర్కస్ గ్రీకు ఖగోళవేత్త (190-120 BC). ఈయన అక్షాంశ, రేఖాంశాల ఆధారంగా ఒక ప్రాంతాన్ని తెలుసుకోవచ్చని భావించాడు. టాలమీ గ్రీకు ఖగోళవేత్త మరియు గణిత విద్యా పారంగతుడు. ఈయన ఈజిప్టులో జీవించాడు. ఈయన – కూడా ఈ అక్షాంశ, రేఖాంశ విధానాన్ని అవలంబించాడు. ఇది తరువాత తరం నాటి పటాల తయారీదార్లను అనుసరించేలా చేసింది. కావున టాలమీ ఈ పటాల రచనకు శాస్త్రీయత అనే పునాది వేశాడని భావించవచ్చు.

ప్రశ్న 20.
గ్రామ పటాల తయారీలో ఈ క్రింది రంగుల ద్వారా ఏయే అంశాలను సూచిస్తారో తెలపండి.
i) ముదురు ఆకుపచ్చ
ii) ముదురు నీలిరంగు
iii) తెలుపు
iv) నలుపు
జవాబు:
గ్రామ పటాల తయారీలో

  1. ముదురు ఆకుపచ్చ రంగును అడువులను సూచించటానికి వాడతారు.
  2. ముదురు నీలిరంగును మహా సముద్రాలు మరియు సముద్రాలను సూచించడానికి వాడతారు.
  3. తెలుపు రంగును ఖనిజాలు లభ్యమయ్యే ప్రదేశాలను సూచించడానికి వాడతారు.
  4. నలుపు రంగును సరిహద్దులను సూచించడానికి వాడతారు.

AP 8th Class Social Important Questions Chapter 1 పటాల అధ్యయనం – విశ్లేషణ

ప్రశ్న 21.
అట్లాస్ అనగానేమి? మీ వంటి విద్యార్థులకు అది ఏ విధంగా ఉపయోగపడుతుంది?
జవాబు:
వివిధ రకాల మ్యాన్లు లేదా పటాలతో కూడిన పుస్తకాన్ని అట్లాస్ అని పిలుస్తాము. దానిలో ప్రపంచ పటాలు, వివిధ ఖండాల పటాలు మరియు దేశాల పటాలు కూడా ఉంటాయి.

ఈ అట్లాసు విద్యార్థులకు వివిధ రకాలుగా ఉపయోగపడుతుంది. వారు దానిని అధ్యయనం చేసి ఖండాలు, ‘ సముద్రాలు, దేశాల భౌగోళిక, రాజకీయ పరిస్థితులను గురించి తెలుసుకోగలుగుతారు.

AP 6th Class Social Important Questions Chapter 2 గ్లోబు – భూమికి నమూనా

These AP 6th Class Social Important Questions 2nd Lesson గ్లోబు – భూమికి నమూనా will help students prepare well for the exams.

AP Board 6th Class Social 2nd Lesson Important Questions and Answers గ్లోబు – భూమికి నమూనా

ప్రశ్న 1.
భూ అక్షం అనగా నేమిటి?
జవాబు:
భూమి తన చుట్టూ తాను తిరగటానికి ఉత్తర దక్షిణ ధృవాల గుండా పోయే ఊహారేఖను భూమియొక్క అక్షం అని పిలుస్తారు.

ప్రశ్న 2.
గ్లోబు యొక్క ఆవిర్భావ చరిత్రను వివరించండి, గ్లోబు యొక్క ఉపయోగాలు తెల్పండి.
జవాబు:

  • పురాతన ఖగోళ గోబును 1492లో మార్టిన్ బెహెమ్ రూపొందించాడు. మరొక ఆధునిక ఖగోళ గోబును కానిస్టాంట్ నోపిల్ అబ్జర్వేటరీ నందు 1570 సంవత్సరంలో “టకి-ఆల్-దిన్” రూపొందించాడు.
  • ప్రపంచంలో మొట్టమొదటి అతుకులు లేని ఖగోళ గ్లోబును జహంగీర్ సామ్రాజ్యంలో మొఘల్ శాస్త్రవేత్తలు రూపొందించారు.
  • గ్లోబల్ అనే పదం ‘గ్లోబస్’ అనే లాటిన్ పదం నుండి వచ్చింది. గోళం అని దాని అర్థం.

ఉపయోగాలు:

  • భూమి ఆకారాన్ని చక్కగా చూపుతుంది. ఖండాలు, మహాసముద్రాలను చూపుతుంది.
  • భూభ్రమణాన్ని చూపిస్తుంది. ప్రపంచంలోని దేశాలను చూపిస్తుంది.

ప్రశ్న 3.
ఉత్తర మరియు దక్షిణార్ధగోళాలు అంటే ఏవి? చిత్రం ద్వారా చూపించండి.
జవాబు:
AP 6th Class Social Important Questions Chapter 2 గ్లోబు – భూమికి నమూనా 2
గ్లోబుకు మధ్యభాగంలో అడ్డంగా గ్లోబును రెండు సమభాగాలు చేస్తూ ఒక ఊహారేఖ పోతుంది. దీనిని భూమధ్యరేఖ (0° అక్షాంశం) అంటారు. భూమధ్యరేఖకు ఉత్తరంగా ఉన్న అర్ధభాగాన్ని ఉత్తరార్ధ గోళమని, భూమధ్యరేఖకు దక్షిణంగా ఉన్న అర్ధభాగాన్ని దక్షిణార్ధ గోళమని అంటారు.

ప్రశ్న 4.
అక్షాంశాలు అనగానేమి? ముఖ్యమైన అక్షాంశాలను గూర్చి వివరించండి.
జవాబు:
భూమధ్యరేఖకు సమాంతరంగా ఉన్న ఊహారేఖలను అక్షాంశాలు అంటారు. అక్షాంశం (Latitude) అను పదం లాటిట్యూడో (Latitudo) అనే లాటిన్ పదానికి చెందినది. దీని అర్థం వెడల్పు, మందం, పరిధి, పరిమాణం.

మీరు గ్లోబును నిశితంగా పరిశీలించినట్లయితే భూమధ్యరేఖకు సమాంతరంగా గీసిన కొన్ని రేఖలను చూడవచ్చును. ఇవే అక్షాంశాలు. ఇవి ఒకదానికొకటి సమాంతరంగా ఉంటూ ఒకదానికొకటి ఎప్పటికీ కలవవు. అక్షాంశాలు భూమధ్యరేఖకు (0″ నుండి 90° వరకు, దక్షిణంగా (0°నుండి 90 వరకు విస్తరించి ఉంటాయి. భూమధ్యరేఖకు ఉత్తరంగా 90° అక్షాంశాలు, దక్షిణంగా 90° అక్షాంశాలు ఉన్నాయి. ధృవాలు తప్ప అన్ని అక్షాంశాలు వృత్తాలు.

ఉత్తర ధృవం, ఆర్కిటిక్ వలయం, కర్కటరేఖలు ఉత్తరార్ధ గోళంలోని ముఖ్యమైన అక్షాంశాలు. రెండవ వైపున దక్షిణ ధృవం, అంటార్కిటిక్ వలయం, మకర రేఖలు దక్షిణార్ధ గోళంలోని ముఖ్యమైన అక్షాంశాలు. భూమి యొక్క వాతావరణ విభజనను అక్షాంశాల సహాయంతో అధ్యయనం చేయవచ్చు.

AP 6th Class Social Important Questions Chapter 2 గ్లోబు – భూమికి నమూనా

ప్రశ్న 5.
రేఖాంశాలు అంటే ఏమిటి ? ముఖ్యమైన రేఖాంశాలను గూర్చి వివరించండి. తూర్పు, పశ్చిమార్ధగోళాలు అని వేటినంటారు?
జవాబు:
ఉత్తర, దక్షిణ ధృవాలను కలిపే అర్ధవృత్తాలను రేఖాంశాలంటారు. లాంగిట్యూడ్ (Longitude) అనే పదం Longitudo అనే లాటిన్ పదానికి సంబంధించినది. నిడివి, వ్యవధి పొడవు అని దీని అర్థం.
AP 6th Class Social Important Questions Chapter 2 గ్లోబు – భూమికి నమూనా 1

గ్లోబు మీద అక్షాంశాలకు లంబంగా గీసినట్లు ఉన్న కొన్ని రేఖలను మనం చూస్తాం. ఈ రేఖలు ఉత్తర, దక్షిణ ధృవాలను అనుసంధానిస్తాయి. వీటిని రేఖాంశాలు అని అంటారు. ఈ

రేఖాంశాలను మధ్యాహ్న రేఖలు అంటారు. (0° రేఖాంశాన్ని ముఖ్య రేఖాంశం / ప్రామాణిక రేఖాంశం (Prime – Meridian) లేదా గ్రీనిచ్ రేఖాంశం అని అంటారు. ఈ రేఖాంశానికి వ్యతిరేక దిశలో 180° రేఖాంశం ఉంటుంది. దీనిని అంతర్జాతీయ దినరేఖ (International Date Line) అంటారు. ఈ రెండు రేఖల ఆధారంగా భూమిని రెండు అర్ధగోళాలుగా విభజించారు. గ్రీనిచ్ (Greenwich) రేఖాంశానికి తూర్పుగా ఉన్న అర్ధగోళాన్ని తూర్పు అర్ధగోళమని, పశ్చిమంగా ఉన్న అర్ధగోళాన్ని పశ్చిమార్ధ గోళమని అంటారు.

ప్రశ్న 6.
రాత్రి, పగలులు, ఎలా ఏర్పడతాయి వివరించండి.?
జవాబు:
భూభ్రమణం వలన రాత్రి పగలు ఏర్పడతాయి. భూభ్రమణ సమయంలో అంటే భూమి తన అక్షంపై తాను తిరిగేటప్పుడు సూర్యునికి ఎదురుగా ఉన్న అర్ధగోళంపై వెలుతురుపడి కాంతివంతంగాను, మిగిలిన అర్ధభాగం చీకటిలోనూ ఉంటుంది. సూర్యకాంతిపడిన అర్ధభాగమే పగలు, మిగిలిన అర్ధభాగం రాత్రి. భూమి తన చుట్టూ తాను తిరుగుతున్నప్పుడు కాంతిలో ఉన్న భాగం కొద్దికొద్దిగా చీకటిలోనికి, చీకటిలో ఉన్న భాగం క్రమేపి వెలుతురులోనికి జరుగుతుంది. అందుచేతనే రాత్రి పగలు ఒకదాని తరువాత ఒకటి సంభవిస్తాయి. భూమి ఒకసారి తన చుట్టూ తాను తిరిగిరావటానికి 23 గంటల 56 నిమిషాల 4.09 సెకండ్లు (సుమారు 24 గంటలు) సమయం అనగా ఒక రోజు పడుతుంది.

ప్రశ్న 7.
ఋతువులు ఎలా ఏర్పడతాయి? చిత్రం ద్వారా వివరించండి.
జవాబు:
AP 6th Class Social Important Questions Chapter 2 గ్లోబు – భూమికి నమూనా 3
పై చిత్రం ననుసరించి భూమి సూర్యుని చుట్టూ దీర్ఘ వృత్తాకార కక్ష్యలో తిరుగుతున్నట్లు స్పష్టమవుతుంది. కక్ష్య అంతటా భూమి ఒకేదిశలో వంగి ఉంటుంది. ఒక సంవత్సరం సాధారణంగా వేసవికాలం, శీతాకాలం, వసంతకాలం మరియు శరదృతువులుగా విభజించబడుతుంది. సూర్యుని చుట్టూ భూమి తిరిగే స్థితులలో మార్పురావటం వలన ఋతువులు ఏర్పడతాయి.

పై చిత్రంలో జూన్ 21వ తేదీన ఉత్తరార్ధగోళం సూర్యునివైపు వంగి ఉన్నట్లు మీరు చూస్తారు. కర్కటరేఖ మీద సూర్యకిరణాలు నిట్టనిలువుగా పడటం వలన ఈ ప్రాంతాలు ఎక్కువ వేడిని గ్రహిస్తాయి. ఇదే సమయంలో సూర్య కిరణాలు ఏటవాలుగా ధృవప్రాంతాలపై పడటం వలన తక్కువ వేడిని గ్రహిస్తాయి.

ఉత్తరధృవం సూర్యునివైపు వంగి ఉండటం వలన ఆర్కిటిక్ వలయం నుండి ఉత్తరధృవం వరకు పగటికాలం నిరంతరంగా 6 నెలలు ఉంటుంది. దీనివలన ఉత్తరార్ధగోళంలో ఎక్కువ ప్రాంతం సూర్యుని నుండి కాంతిని పొందుతుంది. అందువలన భూమధ్యరేఖకు ఉత్తరంగా ఉన్న ప్రాంతంలో వేసవికాలం ఏర్పడుతుంది. ఇక్కడ జూన్ 21వ తేదీ పగటికాలం అత్యధికంగాను, రాత్రి నిడివి అతి తక్కువగానూ ఉంటుంది. ఇదే సమయంలో దక్షిణార్ధగోళంలో పరిస్థితులు ఇందుకు భిన్నంగా ఉంటాయి. ఇక్కడ చలికాలం ఉంటుంది. పగటి సమయం కంటే రాత్రి సమయం ఎక్కువగా ఉంటుంది. భూమి యొక్క స్థితి ఇలా ఉండటాన్ని వేసవి అయనాంతం (Summer Solstice) అంటారు.

దక్షిణ ధృవం సూర్యునివైపు వాలి ఉండటం వలన డిసెంబరు 22వ తేదీన సూర్యకిరణాలు మకరరేఖ మీద నిట్టనిలువుగా పడతాయి. మకరరేఖపై సూర్యకిరణాలు నిట్టనిలువుగా పడటం వలన దక్షిణార్ధగోళంలో ఎక్కువ భాగం కాంతిని పొందుతుంది. అందువలన దక్షిణార్ధగోళంలో వేసవికాలం (Summer) తీవ్రంగా ఉండి పగటికాలం — ఎక్కువగానూ, రాత్రి సమయం తక్కువగాను ఉంటుంది. ఇందుకు భిన్నంగా ఉత్తరార్ధగోళంలో ఉంటుంది. భూమి యొక్క స్థితి ఇలా ఉండటాన్ని శీతాకాల అయానంతం (Winter Solstice) అంటారు.

ప్రశ్న 8.
గ్రహణాలు అనగానేమి? గ్రహణాలు ఎన్ని రకాలు?
జవాబు:
సూర్యుని చుట్టూ భూమి, భూమి చుట్టూ చంద్రుడు తిరుగుతున్నాయని మనం చదువుకున్నాం. అవి ఇలా తిరిగేటప్పుడు ఒకే సరళరేఖ పైకి అవి వచ్చినప్పుడు సూర్యగ్రహణం లేక చంద్రగ్రహణం ఏర్పడుతుంది. ఈ గ్రహణాల సమయంలో సూర్యునిపైన లేదా చంద్రునిపైన నీడపడినట్లు కనబడుతుంది. గ్రహణాలు రెండు రకాలు.

ప్రశ్న 9.
సూర్యగ్రహణం ఎప్పుడు సంభవిస్తుంది?
జవాబు:
భూమికి మరియు సూర్యునికి మధ్యలో చంద్రుడు వస్తే సూర్యగ్రహణం సంభవిస్తుంది. సూర్యుని కాంతి భూమి మీద పడకుండా అడ్డుకోవటంతో పాటు చంద్రుని నీడ భూమి యొక్క ఉపరితలంపై ప్రయాణిస్తుంది. సూర్యగ్రహణం అమావాస్య రోజున మాత్రమే సంభవిస్తుంది. అయితే అన్ని అమావాస్య రోజులలో అది సంభవించదు.

AP 6th Class Social Important Questions Chapter 2 గ్లోబు – భూమికి నమూనా

ప్రశ్న 10.
చంద్రగ్రహణం ఎప్పుడు సంభవిస్తుంది?
జవాబు:
ఏ సమయంలోనైనా భూమి సగభాగం మాత్రమే సూర్యునికి ఎదురుగా ఉంటుంది. మిగిలిన సగభాగం నీడలో అనగా చీకటిలో ఉంటుంది. చంద్రుడు భూమి యొక్క వెనుకభాగంలో లేదా భూమి నీడలోనికి వెళ్ళినప్పుడు చంద్రగ్రహణం సంభవిస్తుంది. సూర్యుడు, భూమి, చంద్రుడు చాలా దగ్గరగా మరియు సూర్యునికి చంద్రునికి మధ్య భూమి ఖచ్చితంగా వచ్చినప్పుడే చంద్రగ్రహణం సంభవిస్తుంది. పౌర్ణమి రోజులలో మాత్రమే చంద్రగ్రహణం సంభవిస్తుంది. అయితే అన్ని పౌర్ణమి రోజులలో చంద్రగ్రహణం సంభవించదు.

ప్రశ్న 11.
క్రింది పటం దేనిని తెలియజేస్తుంది?
AP 6th Class Social Important Questions Chapter 2 గ్లోబు – భూమికి నమూనా 4
జవాబు:
1) భూమి యొక్క చలనమును.
2) రాత్రి, పగలు ఏర్పడుటను తెలియజేస్తుంది.

ప్రశ్న 12.
భూ పరిభ్రమణం అనగానేమి? భూమి కక్ష్య అంటే ఏమిటి? దీనిని గురించి సవివరంగా చర్చించండి.
జవాబు:
భూమి తన అక్షంపై తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరిగి రావడాన్ని “భూపరిభ్రమణం” అంటారు. భూమి సూర్యుని చుట్టూ తిరిగే నిర్ణీత మార్గాన్ని “క్య” అంటారు. ఈ “క్ష్య” దీర్ఘవృత్తాకారంలో ఉంటుంది. ఈ కక్ష్య పొడవు 965 మిలియన్ కిలోమీటర్లు. భూపరిభ్రమణానికి ఒక సంవత్సరకాలం పడుతుంది. ఖచ్చితంగా చెప్పాలంటే 365 4 రోజుల సమయం పడుతుంది. సాధారణ సంవత్సరంలో 365 రోజులు ఉంటాయి. మిగిలిన ఆ రోజును నాలుగు సంవత్సరాలకొకసారి కలిపి ఆ సంవత్సరాన్ని “లీపు సంవత్సరం” అంటారు. అందువలన లీపు సంవత్సరంలో 366 రోజులు ఉంటాయి. లీపు సంవత్సరంలో ఫిబ్రవరి నెలకు 29 రోజులు, సాధారణ సంవత్సరంలో ఫిబ్రవరి నెలలో 28 రోజులు మాత్రమే ఉంటాయి.

ప్రశ్న 13.
అంతర్జాతీయ దినరేఖ అనగానేమి?
జవాబు:
గ్రీనిచ్ రేఖాంశం నుండి ‘అంతర్జాతీయ దినరేఖ’ వరకు తూర్పుకు ఉండే రేఖాంశాలను (0 నుండి 180°తూ) తూర్పు రేఖాంశాలుగానూ, గ్రీనిచ్ రేఖాంశం నుండి అంతర్జాతీయ దినరేఖ వరకు (0°నుండి 180 పశ్చిమ) – పశ్చిమానికి ఉండే రేఖాంశాలను పశ్చిమ రేఖాంశాలుగాను పరిగణిస్తారు. వాస్తవానికి 180° తూర్పు రేఖాంశం, 180° పశ్చిమ రేఖాంశం ఒకటే. దానినే 180° అంతర్జాతీయ దినరేఖ అంటారు. 180 తూర్పు రేఖాంశాలు, 180 పశ్చిమ రేఖాంశాలు అంతర్జాతీయ దినరేఖను కలుపుకొని మొత్తం 360 రేఖాంశాలు ఉన్నాయి.

ప్రశ్న 14.
క్రింది ఫ్లోచార్టను పరిశీలించి ఇచ్చిన ప్రశ్నలకు సరియైన సమాధానములు రాయండి.
AP 6th Class Social Important Questions Chapter 2 గ్లోబు – భూమికి నమూనా 5
i) భూమికి నమూనా ఏది?
జవాబు:
గ్లోబు

ii) గ్రహణాలు ఏర్పడటానికి భూమి యొక్క ఏ చలనము కారణము?
జవాబు:
భూ పరిభ్రమణము

iii) పశ్చిమార్ధగోళంలో ఎన్ని అక్షాంశాలు కలవు?
జవాబు:
పశ్చిమార్ధగోళంలో అక్షాంశాలు ఉండవు. రేఖాంశాలు మాత్రమే ఉంటాయి.

iv) 180°W, E రేఖాంశాన్ని ఏమంటారు?
జవాబు:
అంతర్జాతీయ దినరేఖ.

AP 6th Class Social Important Questions Chapter 1 సౌర కుటుంబంలో మన భూమి

These AP 6th Class Social Important Questions 1st Lesson సౌర కుటుంబంలో మన భూమి will help students prepare well for the exams.

AP Board 6th Class Social 1st Lesson Important Questions and Answers సౌర కుటుంబంలో మన భూమి

ప్రశ్న 1.
నక్షత్రరాశులు అనగానేమి? కొన్ని నక్షత్ర రాశుల పేర్లు తెల్పండి.
జవాబు:
మీరు ఎప్పుడైనా వివిధ నక్షత్రాల సమూహాలతో ఏర్పడిన నమూనాలను గమనించారా? వాటిని ‘నక్షత్రరాశులు’ అంటారు. అవి కనిపించే ఆకారాన్ని బట్టి వివిధ జంతువుల, వస్తువుల, జీవుల పేర్లను పెట్టారు. ఉర్సా మేజర్ లేదా బిగ్ బేర్ అనేది అటువంటి ఒక నక్షత్ర రాశి. చాలా తేలికగా గుర్తించదగిన నక్షత్రరాశులలో ఒకటి సప్తర్షి ఇది ఏడు నక్షత్రాల సమూహం.

ప్రశ్న 2.
ప్రాచీనకాలంలో ప్రజలు రాత్రి సమయంలో దిక్కులను ఎలా గుర్తించేవారు? ధృవ నక్షత్రం అంటే ఏమిటి? వివరించండి. సప్తర్షి మండల నుండి ధృవ నక్షత్రం ఏ దిశలో ఉంటుందో బొమ్మగీచి చూపండి.
జవాబు:
AP 6th Class Social Important Questions Chapter 1 సౌర కుటుంబంలో మన భూమి 1
ప్రాచీన కాలంలో ప్రజలు రాత్రి సమయంలో నక్షత్రాల సహాయంతో దిక్కులను గుర్తించేవారు. ఉత్తరార్ధగోళంలోని ప్రజలు ఉత్తర నక్షత్రం సహాయంతో ఉత్తర దిక్కును గుర్తించేవారు. ఈ నక్షత్రం ఉత్తర దిక్కును సూచిస్తుంది. దీనిని ‘ధృవ నక్షత్రం’ అని కూడా అంటారు. ఇది ఎల్లప్పుడూ ఆకాశంలో ఒకే స్థితిలో ఉంటుంది. సప్తర్షి నక్షత్రరాశి సహాయంతో ఈ ధృవ నక్షత్రాన్ని మనం గుర్తించవచ్చు.

ప్రశ్న 3.
సౌర కుటుంబంలోని ప్రతి సభ్యుడు సూర్యుని చుట్టూ తిరగడానికి కారణమేమి? సూర్యుని ఉపరితలం గురించి వివరించండి.
జవాబు:
సూర్యుడు సౌర కుటుంబం మధ్యలో ఉన్నాడు. ఇది చాలా పెద్దది మరియు వేడి వాయువులతో కూడి ఉంది. ఇది సౌర కుటుంబాన్ని ఒక క్రమంలో బంధించి ఉంచగలిగే అయస్కాంత శక్తిని (తన వైపు లాగ గల శక్తి) అందిస్తుంది. సౌర కుటుంబంలోని ప్రతి సభ్యుడు సూర్యుని చుట్టూ తిరుగుతాడు. సౌర కుటుంబానికి అవసరమైన వేడి, కాంతిని సూర్యుడు అందిస్తాడు. సూర్యుని ఉపరితలంపై దాదాపు 6000° సెల్సియస్ ఉష్ణోగ్రత ఉంటుంది. కానీ ఆ విపరీతమైన వేడి మనకు అంతగా అనిపించదు, ఎందుకంటే అది మనకు దూరంగా ఉంది. భూమి నుండి సూర్యుడు సుమారు 15 కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉంది.

AP 6th Class Social Important Questions Chapter 1 సౌర కుటుంబంలో మన భూమి

ప్రశ్న 4.
మన సౌర కుటుంబంలోని గ్రహాల గురించి సోదాహరణంగా వివరించండి.
జవాబు:
మన సౌర కుటుంబంలో ఎనిమిది గ్రహాలు ఉన్నాయి. సూర్యుడి నుండి వాటి దూరం ప్రకారం గ్రహాల క్రమం – బుధుడు, శుక్రుడు, భూమి, అంగారకుడు, బృహస్పతి (గురుడు), శని, ఇంద్రుడు, వరుణుడు, సౌర కుటుంబంలోని ఎనిమిది గ్రహాలు సూర్యుని చుట్టూ స్థిర మార్గాల్లో తిరుగుతాయి. ఈ మార్గాలు పొడవుగా ఉంటాయి. వాటిని కక్ష్యలు అంటారు. సూర్యుడికి దగ్గరగా ఉన్న నాలుగు గ్రహాలను అంతర గ్రహాలు అంటారు. అవి బుధుడు, శుక్రుడు, భూమి, అంగారకుడు. అంతర గ్రహాలు చిన్నవిగా ఉండి రాళ్ళతో కూడి ఉంటాయి. చివరి నాలుగు గ్రహాలను బాహ్య గ్రహాలు అంటారు. అవి బృహస్పతి (గురుడు), శని, ఇంద్రుడు. అవి పెద్దవి మరియు వాయువులు, ద్రవాలతో కూడి ఉంటాయి. సూర్యునికి దగ్గరగా ఉన్న గ్రహం బుధుడు. శుక్రుడిని ‘భూమికి కవల గ్రహం’ (ఎర్త్ – ట్విన్) గా పరిగణిస్తారు.. ఎందుకంటే దాని పరిమాణం, ఆకారం భూమిని చాలా వరకు పోలి ఉంటాయి. గ్రహాలలో పెద్దది బృహస్పతి చిన్నది బుధుడు.

ప్రశ్న 5.
మనం నివసిస్తున్న భూ గ్రహం గురించి నీకేమి తెలుసో వివరించు.
జవాబు:
AP 6th Class Social Important Questions Chapter 1 సౌర కుటుంబంలో మన భూమి 2
మనం నివసిస్తున్న భూమి సూర్యుని నుండి మూడవ గ్రహం. పరిమాణంలో ఇది ఐదవ అతిపెద్ద గ్రహం. ఇది ధృవాల వద్ద కొద్దిగా సమతలంగా ఉండి మధ్యలో ఉబ్బెత్తుగా ఉంటుంది.. అందుకే దాని ఆకారాన్ని జియోయిగా అభివర్ణించారు. జియోయిడ్ అంటే భూమి లాంటి ఆకారం. భూమి యొక్క ఏకైక సహజ ఉపగ్రహం చంద్రుడు. బాహ్య అంతరిక్షం నుండి, భూమి నీలం రంగులో కనిపిస్తుంది. ఎందుకంటే దాని మూడింట రెండు వంతుల * ఉపరితలం నీటితో కప్పబడి ఉంటుంది. కాబట్టి దీనిని నీలి గ్రహం అంటారు.

ప్రశ్న 6.
ఉపగ్రహాలు అని వేటినంటారు? ఉపగ్రహాలు కల్గిలేని గ్రహాలు ఏవి?
జవాబు:
సూర్యుని చుట్టూ గ్రహాలు తిరుగుతున్నట్లే, గ్రహాల చుట్టూ కొన్ని ఖగోళ వస్తువులు తిరుగుతున్నాయి. వాటినే ఉపగ్రహాలు అంటారు. బుధుడు, శుక్ర గ్రహాలకు ఉపగ్రహాలు లేవు. మిగిలిన అన్ని గ్రహాలకు ఉపగ్రహాలు ఉన్నాయి.

ప్రశ్న 7.
ఆవరణములు ఎన్ని? అవి ఏవి? వివరించండి.
జవాబు:
జీవులు జీవించడానికి అత్యంత అనుకూలమైన గ్రహం భూమి. ఇది నాలుగు ప్రధాన ఆవరణలు. శిలావరణం, జలావరణం, వాతావరణం, జీవావరణం కలిగి ఉంది. శిలావరణం : శిలావరణం అనగా మనం నివసించే భూమి. ఇది రాళ్ళు, నేలలతో కూడిన భూమి యొక్క ఘనబాహ్య పొర.

జలావరణం :
భూమిపై గల జల భాగాలైన మహాసముద్రాలు, సముద్రాలు, నదులు, సరస్సులు, పర్వతాలపై గల మంచుపొరలు, చెరువులు మొదలైన వాటినన్నింటినీ కలిపి జలావరణంగా పిలువబడుతుంది.

వాతావరణం :
భూమి చుట్టూ విస్తరించి ఉన్న గాలి పొరను వాతావరణం అంటారు. వాతావరణంలో వివిధ రకాలైన వాయువులు ఉన్నాయి. వీటిలో ప్రధాన వాయువులు నత్రజని (78%) మరియు ఆక్సిజన్ (21%) కార్బన్‌డయాక్సెడ్, హైడ్రోజన్, హీలియం, ఆర్గాన్, ఓజోన్ వంటి ఇతర వాయువులు తక్కువ మొత్తంలో ఉంటాయి. జీవావరణం : భూమిపై, నీటిలో, గాలిలో గల అన్ని రకాల జీవులను కలిపి ‘జీవావరణం’ అని పిలుస్తారు. ఇది మొక్కలు, జంతువులు, బ్యాక్టీరియా, ఇతర జీవులను కలిగి ఉంటుంది.

ప్రశ్న 8.
భూమికి గల ఏకైక సహజ ఉపగ్రహం ఏది? దాని గురించి మీకు తెలిసిన రెండు వాక్యాలు రాయండి.
జవాబు:
మన భూమికి గల ఏకైక సహజ ఉపగ్రహం చంద్రుడు. దీని వ్యాసం భూమి యొక్క వ్యాసంలో నాలుగవ వంతు మాత్రమే. ఇది ఇతర ఖగోళ వస్తువుల కంటే మన గ్రహానికి దగ్గరగా ఉండడం వల్ల చాలా పెద్దదిగా కనిపిస్తుంది. చంద్రుడు భూమి నుండి 3,84,000 కిలోమీటర్ల దూరంలో ఉంది.

AP 6th Class Social Important Questions Chapter 1 సౌర కుటుంబంలో మన భూమి

ప్రశ్న 9.
భారతదేశంలో అంతరిక్షంలోకి ఉపగ్రహాలను ప్రవేశపెట్టే సంస్థ ఏది? కొన్ని భారతీయ ఉపగ్రహాల పేర్లు తెల్పండి.
జవాబు:
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO) శ్రీహరికోటలోని తన ప్రయోగ కేంద్రం నుండి ఉపగ్రహాలను అంతరిక్షంలోకి ప్రవేశపెడుతుంది. ఇస్రో మాజీ చైర్మన్ సతీశ్ ధావన్ జ్ఞాపకార్థం దీనికి “సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ (SDSC) శ్రీహరికోట హై ఆల్టిట్యూడ్ రేంజ్ (SHAR)” అని పేరు పెట్టారు.

కొన్ని భారతీయ ఉపగ్రహాలు : ఇన్సాట్ (INSAT), ఐ ఆర్ ఎస్ (IRS), ఎడ్యుశాట్ (EDUSAT) మొదలైనవి.

ప్రశ్న 10.
మంగళయాన్ (MOM) గురించి నీవు తెలుసుకున్న విషయాలను ప్రస్తావించండి.
జవాబు:
అంగారక గ్రహ వాతావరణం, స్థలాకృతిని అన్వేషించడానికి భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO) ప్రారంభించిన మంగళయాన్ (మార్స్ ఆర్బిటర్ మిషన్ – MOM) అంగారక కక్ష్యకు సెప్టెంబర్ 24, 2014న చేరుకుంది. ప్రపంచంలో సోవియట్ స్పేస్ ప్రోగ్రాం, నాసా, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ తర్వాత అంగారక గ్రహాన్ని చేరుకున్న నాల్గవ అంతరిక్ష సంస్థగా ఇస్రో మారింది.

ప్రశ్న 11.
గ్రహశకలాలు అని వేటినంటారు? ఇవి ఎక్కడ ఉంటాయి?
జవాబు:
AP 6th Class Social Important Questions Chapter 1 సౌర కుటుంబంలో మన భూమి 3
గ్రహాలు, ఉపగ్రహాలు కాకుండా, సూర్యుని చుట్టూ తిరిగే చిన్న రాతి వస్తువులు కూడా చాలా ఉన్నాయి. వీటిని గ్రహ శకలాలు (Asteroids) అంటారు. ఇవి అంగారక గ్రహం, బృహస్పతి కక్ష్యల మధ్య కనిపిస్తాయి. ఈ గ్రహశకలాలు చాలా సంవత్సరాల క్రితం పేలిన గ్రహం యొక్క భాగాలు అని శాస్త్రవేత్తలు అభిప్రాయం.

ప్రశ్న 12.
‘ఉల్కలు’ గురించి వివరించండి.
జవాబు:
సూర్యుని చుట్టూ తిరిగే చిన్న చిన్న రాళ్ళను ఉల్కలు (Meteoroids) అంటారు. కొన్నిసార్లు ఈ ఉల్కలు భూమి దగ్గరకు వచ్చి దానిపై పడిపోతాయి. ఈ ప్రక్రియలో గాలితో ఘర్షణ కారణంగా అవి వేడెక్కి కాలిపోతాయి. ఆ సందర్భంలో ఇవి వెలుతురును కలుగజేస్తాయి. కొన్నిసార్లు పూర్తిగా కాలిపోకుండా ఒక ఉల్కాపాతం భూమిపై పడినపుడు గుంతలను సృష్టిస్తుంది.

ప్రశ్న 13.
తోకచుక్కలు అనగానేమి? భూమికి దగ్గర వచ్చే తోకచుక్కకు ఉదాహరణ నివ్వండి. ఇది చివరిసారిగా ఎప్పుడు కన్పించింది?
జవాబు:
AP 6th Class Social Important Questions Chapter 1 సౌర కుటుంబంలో మన భూమి 4
తోకచుక్క అంటే తల, తోకతో కనిపించే ఖగోళ వస్తువు. తోకచుక్క యొక్క తల మంచుతో కలిసి ఉండే ఘన కణాలను కలిగి ఉంటుంది మరియు తోక వాయువులతో తయారవుతుంది. హేలీ తోకచుక్క ప్రతి 76 సంవత్సరాలకు ఒకసారి భూమికి దగ్గరగా వస్తుంది. ఇది చివరిసారిగా 1986లో కనిపించింది. మరలా ఇది 2061లో కనిపిస్తుంది.

ప్రశ్న 14.
గెలాక్సీ/ పాలపుంత అనగానేమి?
జవాబు:
నిర్మలమైన ఆకాశంలో రాత్రి సమయంలో తెల్లగా ప్రకాశించే మార్గాన్ని మనం చూడవచ్చు. ఇది కొన్ని కోట్ల నక్షత్రాల సమూహం. గెలాక్సీ అనేది అనేక నక్షత్రాలతో కూడిన పెద్ద సమూహం. మన సౌర కుటుంబం ఈ గెలాక్సీలో ఒక భాగం. దీనినే ‘పాలపుంత’ అని కూడా అంటాం. ప్రాచీన భారతదేశంలో దీనిని ఆకాశంలో ప్రవహిస్తున్న కాంతి నదిగా భావించారు. అందువలన దీనిని ‘ఆకాశగంగ’ అని కూడా పిలుస్తారు.

ప్రశ్న 15.
పగటిపూట మనం చంద్రుడిని ప్రకాశవంతమైన నక్షత్రాలను ఎందుకు చూడలేము?
జవాబు:
సూర్యుని యొక్క ప్రకాశవంతమైన కాంతి రాత్రిపూట కనిపించే ఆకాశంలోని ఈ ప్రకాశవంతమైన వస్తువులన్నింటినీ కనపడకుండా చేస్తుంది. అందువలన పగటిపూట మనం చంద్రుడిని, ఇతర నక్షత్రాలను చూడలేము.

AP 6th Class Social Important Questions Chapter 1 సౌర కుటుంబంలో మన భూమి

ప్రశ్న 16.
నక్షత్రాలు అనగానేమి? నీకు తెలిసిన ఒక నక్షత్రంను తెల్పి, మిగతా నక్షత్రాల వేడి/కాంతి భూమికి అంతగా చేరకపోవడానికి కారణమేమిటి?
జవాబు:
కొన్ని ఖగోళ వస్తువులు చాలా పెద్దవిగా, వేడిగా ఉంటాయి. అవి వాయువులను కలిగి ఉంటాయి. అవి సొంతంగా వేడి, కాంతిని కలిగి ఉండి వాటిని పెద్ద మొత్తంలో విడుదల చేస్తాయి. ఈ ఖగోళ వస్తువులను నక్షత్రాలు అంటారు. సూర్యుడు ఒక నక్షత్రం. రాత్రి ఆకాశంలో మనకు కనబడే లెక్కలేనన్ని నక్షత్రాలు సూర్యుడు వంటివే. కానీ మనకు వాటి వేడి లేదా కాంతి అంతగా చేరదు. ఎందుకంటే అవి మనకు చాలా దూరంగా ఉన్నాయి. అందువల్ల అవి చిన్నవిగా కనిపిస్తాయి.

ప్రశ్న 17.
భూమి నీలం రంగులో కన్పించడానికి కారణమేమి?
జవాబు:
భూమిపై మూడింట రెండు వంతుల ఉపరితలం నీటితో కప్పబడి ఉంటుంది. కాబట్టి బాహ్య అంతరిక్షం నుండి, భూమి నీలం రంగులో కనిపిస్తుంది.

AP Board 6th Class Social Solutions Chapter 12 సమానత్వం వైపు

SCERT AP 6th Class Social Study Material Pdf 12th Lesson సమానత్వం వైపు Textbook Questions and Answers.

AP State Syllabus 6th Class Social Solutions 12th Lesson సమానత్వం వైపు

6th Class Social 12th Lesson సమానత్వం వైపు Textbook Questions and Answers

Improve your learning (మీ అభ్యసనాన్ని మెరుగుపడుచుకోండి)

ప్రశ్న 1.
1. కింది వాక్యాలలో తప్పొప్పులను గుర్తించండి.
i) కులవ్యవస్థ అనేది భారతదేశంలో చాలా సాధారణంగా కనపడే అసమానతల్లో ఒకటి. ( ✓ )
ii) ప్రతి వ్యక్తికీ గౌరవం ఇవ్వాల్సిన అవసరం లేదు. ( ✗ )
iii) ప్రజాస్వామిక సమాజంలో సమానత్వాన్ని నెలకొల్పడం అనేది నిరంతరం కొనసాగే పోరాటం. ( ✓ )

ప్రశ్న 2.
సమస్యలలో చిక్కుకున్నప్పుడు, ఈ సంఖ్యలను ఏ విధంగా ఉపయోగిస్తారు?
AP Board 6th Class Social Solutions Chapter 12 సమానత్వం వైపు 1
జవాబు:
100 : పోలీసులకు సంబంధించిన నంబరు. –
దొంగతనం, హత్య, దోపిడి మొదలైన అఘాయిత్యాలపుడు చేయవలసిన నంబరు

112 : మహిళలు అత్యవసర సమయాల్లో చేయవలసిన నంబరు.
‘దిశ’ మహిళా రక్షణకై ఏర్పాటు చేయబడింది మహిళలపై జరిగే ఎటువంటి దాడుల నుండైనా రక్షణ కల్పిస్తుంది. అత్యవసర సేవలు కూడా అందిస్తుంది.

181 : కేవలం మహిళా రక్షణకై ఏర్పాటు చేయబడిన నంబరు.
శారీరక వేధింపులు, గృహహింస, అత్యాచారాలు మొదలైన అఘాయిత్యాలు జరగకుండా (దిశ) నంబరును ఏర్పాటు చేసారు. మహిళా సమస్యలపై స్పందనకై ఏర్పాటైంది.

1091 : మహిళల ‘ఈవ్ టీజింగ్’ లాంటి సమస్యల నుండి రక్షణకై ఏర్పాటు చేసారు. మహిళామిత్ర, మహిళ రక్షక్, శక్తిటీమ్స్ మొ||న పోలీసు బృందాలు తక్షణం స్పందిస్తారు.

1098 : పిల్లల హక్కుల సంరక్షణకై ఏర్పాటు చేయబడింది. అన్నిరకాల పిల్లల వేధింపులపై ఫిర్యాదు చేయవచ్చు. ఈ నంబర్లు అన్నీ 24 గం|| పని చేస్తాయి మరియు (టోల్ ఫ్రీ) ఉచితం.

AP Board 6th Class Social Solutions Chapter 12 సమానత్వం వైపు

ప్రశ్న 3.
ఈ రోజుకి కుల వ్యవస్థ ఎందుకు ఇంత వివాదాస్పదమైన అంశంగా మిగిలి ఉంది?
జవాబు:
ఈ రోజుకి కుల వ్యవస్థ ఇంత వివాదాస్పదమైన అంశంగా మిగలటానికి కారణం :

  • అనాదిగా వస్తున్న మూఢ నమ్మకాలు, విశ్వాసాలు.
  • నిరక్షరాస్యత, పేదరికం.
  • స్వార్థపూరితమైన రాజకీయ నాయకులు, వ్యవస్థ
  • బ్రిటిషువారి విభజించు పాలించు విధానంలో కులవ్యవస్థ పాత్ర కూడ ఉంది.
  • చట్టాలు కఠినంగా అమలు పరచలేకపోవడం (వానిలోని లొసుగులు కారణం)

ప్రశ్న 4.
స్వాతంత్ర్యానికి ముందు ప్రజలు బాలికలను బడికి పంపించకపోవడానికి గల వేర్వేరు కారణాలేవి?
జవాబు:
స్వాతంత్ర్యానికి ముందు ప్రజలు బాలికలను బడికి పంపించకపోవడానికి గల కారణాలు :

  • బాల్య వివాహాలు, (కన్యాశుల్కం)
  • తల్లిదండ్రుల నిరక్షరాస్యత
  • తల్లిదండ్రుల పేదరికం
  • మూఢనమ్మకాలు, విశ్వాసాలు (ఆడపిల్లకు చదువు ఎందుకు అని అంటుండేవారు)
  • పాఠశాలలు అందుబాటులో లేకపోవడం (పాఠశాలలో సరైన సౌకర్యాలు లేకపోవడం)
  • పెద్ద కుటుంబాల (ఉమ్మడి కుటుంబాలు) అవ్వటం వలన ఆడపిల్లలను ఇంటి పనులకు పరిమితం చేయటం.
  • చిన్న పిల్లల సంరక్షణ బాధ్యతను ఇంటిలోని ఆడపిల్లలకు అప్పజెప్పడం.

ప్రశ్న 5.
భారతదేశంలో గల అసమానత యొక్క సాధారణ రూపాలు ఏమిటి?
జవాబు:
భారతదేశంలో గల అసమానత యొక్క రూపాలు :
ఆర్థిక అసమానతలు :

  • పేద, ధనిక (ఉన్నవారు, లేనివారు) వర్గాల మధ్య అసమానత.
  • సంపాదనల్లో అసమానత ఈ రోజుల్లో స్పష్టంగా కన్పిస్తుంది.

సామాజిక అసమానత :

  • సమాజంలోని వివిధ సమాజాలకు, కులాల మధ్య అసమానత.
  • అగ్రకులం, అణగారిన కులం మధ్య అసమానతలు.
    స్త్రీ, పురుషుల అవకాశాలలో, ఉద్యోగ, ఉపాధుల్లో అసమానత.
    బాగా చదువుకున్నటువంటి వారు నిరక్షరాస్యుల మీద అసమానత.

రాజకీయ అసమానత:
భారతదేశ రాజ్యాంగం అందరికి (రాజకీయంగా) సమాన హక్కులు ప్రసాదించినప్పటికీ, కొన్ని హక్కులు మాత్రం (ఉదా : ఎన్నికలలో పోటీచేయడం) కొన్ని వర్గాలకి పరిమితం అవుతుంది.

ప్రశ్న 6.
భారత ప్రజాస్వామ్యంలో సమానత్వంపై ఒక చిన్న వ్యాసం రాయండి.
జవాబు:

  • 1947లో భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పుడు మన నాయకులు సమాజంలో ఉన్న వివిధ రకాల అసమానతలు గురించి ఆందోళన చెందారు.
  • సమానత్వ సూత్రంపై సమాజం పునర్నిర్మించబడాలని ప్రజలు భావించారు.
  • కనుకనే భారత రాజ్యాంగంలో సమానత్వ సాధనకు ప్రాధాన్యత ఇవ్వబడింది.
  • అంటరానితనం చట్టం ద్వారా రద్దు చేయబడింది.
  • ప్రజలకు తాము చేయాలనుకుంటున్న పనిని ఎంచుకోవడానికి స్వేచ్ఛ ఇవ్వబడింది.
  • ప్రభుత్వ ఉద్యోగాలలో అందరికీ అవకాశం కల్పించబడింది. ప్రజలందరికీ సమాన ప్రాముఖ్యత లభించింది.

AP Board 6th Class Social Solutions Chapter 12 సమానత్వం వైపు

ప్రశ్న 7.
భారతీయ సమాజంలో అసమానత మరియు వివక్షతలను తొలగించడానికి సూచనలు ఇవ్వండి.
జవాబు:
అసమానత మరియు వివక్షతలను తొలగించడానికి సూచనలు :
AP Board 6th Class Social Solutions Chapter 12 సమానత్వం వైపు 2

  • గొప్ప మార్పు తల్లిదండ్రుల నుండే రావాలి. ఇతరుల పట్ల తమ వైఖరులు, మాటలు, ప్రవర్తనలకు తల్లిదండ్రులే ఉత్తమ నమూనాలుగా నిలవాలి.
  • ఇతర మతాల గురించి తెలుసుకోవడానికి సిద్ధంగా ఉండాలి, వారి నమ్మకాలను గౌరవించాలి.
  • స్త్రీలను సమానంగా భావించి గౌరవించాలి
  • అంగ వైకల్యం కలవారి పై ప్రత్యేక శ్రద్ధ చూపాలి, ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలను ప్రోత్సహించాలి.
  • ఆరోగ్య సంరక్షణ మరియు విద్య వంటి నాణ్యమైన ప్రాథమిక సేవలను అందరికీ విస్తృతంగా అందుబాటులోకి తేవాలి.

ప్రశ్న 8.
అసమానత మరియు వివక్షతల మధ్య తేడాను తెలపండి.
జవాబు:

  • అసమానత్వము అనేది వ్యక్తులు లేదా వర్గంలోని సామాజిక స్థాయి, సంపద, అవకాశాలలో బేధమును తెలుపుతుంది.
  • వివకత అనేది వ్యక్తుల లేదా వ్యక్తుల నైపుణ్యం, యోగ్యత, గుణము మొదలైన వాటిని కాకుండా వారి వర్గాన్ని (కులము), ప్రాంతాన్ని, చర్మ రంగును (జాతి) లింగం మొ||న వాటిని పరిగణలోకి తీసుకుని సదరు వర్గాలు (బృందాల) పట్ల అన్యాయంగా, అసమానంగా చూడటం.

6th Class Social Studies 12th Lesson సమానత్వం వైపు InText Questions and Answers

6th Class Social Textbook Page No.137

ప్రశ్న 1.
ప్రస్తుత సమాజంలో స్త్రీలు ఏ విధమైన వివక్షతకు గురవుతున్నారు?
జవాబు:
ప్రస్తుత సమాజంలో స్త్రీలు వివక్షతకు గురవుతున్న అంశాలు :

  • ప్రభుత్వేతర పనుల్లో స్త్రీ, పురుషుల మధ్య వేతనాల్లో అసమానత ఉంటుంది.
  • వివాహ సందర్భంలో (కట్న కానుకలు ఆడపిల్లవారికి తలకి మించిన భారమవుతుంది)
  • వివాహం తరువాత ఆడపిల్లను (పెండ్లికొడుకు) భర్త ఇంటికి పంపటం, ఆచారంగా ఉంది. దీనివలన ఆడపిల్ల తన తల్లిదండ్రులను విడిచి వెళ్ళిపోవాల్సి వస్తుంది.
  • ఉన్నత విద్యను అందించే విషయంలో కొంతమేర ఆడపిల్లలు వివక్షతను ఎదుర్కొంటున్నారు. (మగపిల్లలతో పోల్చితే)
  • వేసుకొనే దుస్తుల్లో కూడా వివక్షత కన్పిస్తుంది.
  • కార్యాలయాల్లో, ఉపాధి ప్రదేశాలలో స్త్రీలు వివక్షతకు గురవుతున్నారు.
  • ఆచార, సాంప్రదాయాల్లో (ఉదా : తలకొరివి పెట్టడం) పురుషాధిక్యత కన్పిస్తుంది.

ప్రశ్న 2.
ఇతర మతాలకు చెందిన ప్రాంతాలకు నీవెప్పుడైనా వెళ్ళావా? అక్కడ నీవు గమనించిన మంచి విషయాలు ఏవి? ఏ సారూప్యతలు నీవు గమనించావు?
జవాబు:
ఇతర మతాలకు చెందిన ప్రాంతాలకు నేను తరచుగా వెళతాను.
అక్కడ గమనించిన మంచి విషయాలు :

  1. వారు అందరూ కలసి మెలసి ఉంటూ, నన్ను కూడా కలుపుకున్నారు.
  2. వారు వారి పెద్దలను గౌరవిస్తూ, వారు చెప్పేది శ్రద్ధగా పాటిస్తున్నారు.
  3. వారి పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుతూ, శుభ్రతకు ప్రాధాన్యత ఇస్తున్నారు.
  4. అందరి మంచిని కోరుకుంటున్నారు. (సర్వేజనా సుఖినోభవంతు అని)

గమనించిన సారుప్యతలు :

  1. అందరి భావాలు దేవుడు ఒక్కడే అని చెబుతున్నాయి.
  2. ప్రేమతత్వాన్ని బోధిస్తున్నాయి.
  3. తోటి ప్రాణి మంచిని కోరుతున్నారు.
  4. పాప, పుణ్యాల గురించి తెల్పుతున్నాయి.

6th Class Social Textbook Page No.139

ప్రశ్న 3.
లింగ వివక్షతను నీవు సమర్థిస్తావా? తరగతి గదిలో చర్చించండి.
జవాబు:
లింగ వివక్షతను నేను సమర్థించను. ఎందుకంటే

  1. స్త్రీలు, ఈనాడు మగవారితో సమానంగా చదువుకుంటున్నారు.
  2. స్త్రీలు, ఈనాడు మగవారితో సమానంగా ఉద్యోగ, ఉపాధులు పొందుతున్నారు.
  3. స్త్రీలు, ఈనాడు మగవారితో సమానంగా శాస్త్ర, సాంకేతిక రంగాలలో ముందు ఉన్నారు.
  4. స్త్రీలు, ఈనాడు మగవారితో సమానంగా రవాణా, వ్యాపార, వాణిజ్య, పారిశ్రామిక రంగాల్లో దూసుకు పోతున్నారు
  5. స్త్రీ, పురుషులు శారీరకంగా ప్రకృతి సహజంగా కొన్ని బేధాలుండవచ్చు. అంతేగాని మిగతా విషయాల్లో సమానమే.

6th Class Social Textbook Page No.140

ప్రశ్న 4.
AP Board 6th Class Social Solutions Chapter 12 సమానత్వం వైపు 3
ఎ) ఈ సంఘటనపై మీ అభిప్రాయాన్ని రాయండి.
జవాబు:
ఇది దక్షిణాఫ్రికాలో జరిగిన సంఘటన, ఈ విధమైన జాతి వివక్షత చూపించడం నిజంగా దురదృష్టకరం, అవాంఛనీయం, ఖండనీయం. ఇటువంటి చర్యలు భవిష్యత్తులో జరగకుండా చర్యలు చేపట్టాలి.

బి) ఇది ఏ రకమైన వివక్ష? తరగతి గదిలో చర్చించండి.
జవాబు:
ఇది జాతి వివక్షత:

  • ఇది వ్యక్తి యొక్క చర్మపు రంగు లేదా జాతి లేదా జాతి మూలం ఆధారంగా చూపే వివక్ష.
  • గాంధీజి దక్షిణాఫ్రికాలోని ప్రిటోరియాకు రైలులో ప్రయాణించేటప్పుడు ఈ వివక్షతలను ఎదుర్కొన్నారు.
  • రైలులో మొదటి తరగతి టికెట్లు తీసుకున్నప్పటికి తెల్లజాతీయుల ప్రోద్బలంతో ఆయన విచక్షణా రహితంగా రైలు నుండి తోసివేయబడ్డారు.
  • ఇదే విధంగా నెల్సన్ మండేలా దక్షిణాఫ్రికాలో వర్ణ వివక్ష వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడారు.
  • వర్ణ వివక్షత వ్యవస్థ అనగా జాతి ప్రాతిపదికన ప్రజలను వేరుచేయడం.

AP Board 6th Class Social Solutions Chapter 12 సమానత్వం వైపు

ప్రశ్న 5.
మీరెప్పుడైనా ఏ రకమైనా వివక్షతనైనా ఎదుర్కొన్నారా? అప్పుడు మీకెలా అనిపించింది? Page No. 140
జవాబు:
నేను ఎప్పుడు ఏ విధమైన వివక్షతను ఎదుర్కొలేదు. మా పాఠశాలలో అందరం ఎంతో స్నేహంతో కలసి, మెలిసి, ఉంటాం. ఉపాధ్యాయులు కూడా మాతో ఎంతో ప్రేమగా వ్యవహరిస్తారు.

అయితే క్రీడల విషయంలో దివ్యాంగుడైన నా స్నేహితుడు పాల్గొనలేకపోవడం చాలా బాధగా అన్పించింది.

కింది చిత్రాలను పరిశీలించండి.
AP Board 6th Class Social Solutions Chapter 12 సమానత్వం వైపు 4 AP Board 6th Class Social Solutions Chapter 12 సమానత్వం వైపు 5

6th Class Social Textbook Page No.141

ప్రశ్న 6.
మీరిక్కడ ఏమి గమనించారు? మీ టీచర్ సహాయంతో చర్చించండి.
జవాబు:
మేము ఇక్కడ గమనించిన విషయాలు : .

  • ఇవి వివిధ రకాల వివక్షతను తెలియజేస్తున్న చిత్రాలు.
  • మొదటి రెండు బొమ్మల్లో బాలికల, బాలుర ఆటబొమ్మలు చూస్తే ఆడపిల్లల బొమ్మలు వంటసామాన్లు (కిచెన్), బేబీ బొమ్మలు ఇలా వారిని ఆయా పనులను భవిష్యత్తులో చేసేందుకు ఉన్ముఖీకరిస్తున్నట్లుంది. అదే బాలుర ” బొమ్మలు జీపులు, రోబోట్లు మొ||నవి ఇవి మగవారు మాత్రమే చేసేవిగా చూపిస్తున్నట్లుంది.
  • రెండవ చిత్రంలో చర్మరంగు (కులం కూడా కావచ్చు) ఆధారంగా వివక్షతను చూపుతుంది.
  • మూడవ చిత్రంలో ఆర్థికపరంగా (కులం కూడా కావచ్చు) ఆధారంగా వివక్షతను చూపుతుంది.
  • నాల్గవ చిత్రంలో కూడా (స్త్రీ) బాలికా వివక్షతను చూపుతుంది. ఇల్లు ఊడవటం, వంటచేయడం మొ||నవి సీలు (బాలిక) చేస్తున్నారు. పురుషుడు (బాలుడు) చదువుకుంటున్నారు.

6th Class Social Textbook Page No.141

ప్రశ్న 7.
గతానికీ, ఇప్పటికీ మీరేమైనా మార్పులు గమనించారా? ఈ మార్పులు ఎలా వచ్చాయి?
జవాబు:

  • గతానికీ, ఇప్పటికీ మార్పులు గమనించాను. ఈ మార్పులు ఎలా వచ్చాయి. అంటే,
  • భారత రాజ్యాంగం ప్రసాదించిన సమాన హక్కులు, చట్టాలు వలన,
  • ప్రభుత్వాలు అందిస్తున్న అనేక అభివృద్ధి సంక్షేమ పథకాల వలన.
  • అందరూ చదువు కోవటం, విద్యావంతులవ్వటం వలన.
  • శాస్త్ర సాంకేతిక రంగాలు అభివృద్ధి చెందటంతో సాంఘిక దురాచారాలు, మూఢ విశ్వాసాలు రూపుమాసిపోవడం వలన.
  • నేటి సమాచార ప్రసార సాధనాల వలన ప్రపంచమే ఒక కుగ్రామంగా (గ్లోబలైజేషన్) మారిపోవటం వలన.
  • జనాభా పెరగటం, పట్టణీకరణ పెరగటం వలన

6th Class Social Textbook Page No.144

ప్రశ్న 8.
ప్రభుత్వం మధ్యాహ్న భోజనం, అమ్మఒడి, ఉచిత పాఠ్యపుస్తకాలు, పాఠశాల యూనిఫాంలు, బూట్లు పంపిణీ మొదలైన అనేక కార్యక్రమాలను ప్రవేశపెట్టింది. ఇవి సమానత్వ సాధనకు ఎలా సాయపడతాయో చర్చించండి.
జవాబు:

  • ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమాల వలన విద్యార్థులందరూ ఒక విధమైన (యూనిఫాం) దుస్తులు, బూట్లు ధరించటంతో, వారిలో ధనిక పేద తేడా లేకుండా సమానంగా భావిస్తారు.
  • మధ్యాహ్న భోజన కార్యక్రమంలో విద్యార్థులందరూ కుల, మత, ప్రాంతీయ, ఆర్థిక బేధాలు లేకుండా కలసి కూర్చోని భోంచేస్తారు.
  • అలాగే ఆర్థిక విషయాల కారణంగా ఎవరూ బడి మానకుండా, ఉచిత పాఠ్యపుస్తకాలు అమ్మఒడి చేయూతనిస్తోంది. అందరూ విద్య నేర్చుకుంటారు, తద్వారా విద్యలో సమానత్వం సాధించవచ్చు.
  • అలాగే పాఠశాలలో చేపట్టే అన్ని కార్యక్రమాలు ఏ విధమైన వివక్షత చూపకుండా అందరికి సమానంగా అందేలా చూస్తారు.

AP Board 6th Class Social Solutions Chapter 12 సమానత్వం వైపు

ప్రశ్న 9.
వివక్షకు వ్యతిరేకంగా పోస్టర్లను తయారు చేయండి. పాఠశాలలోని ఇతర విద్యార్థులు కూడా వివక్షను వ్యతిరేకించేలా, తయారు చేసిన పోస్టర్లను పాఠశాల అంతటా ప్రదర్శించండి.
జవాబు:
విద్యార్థులు స్వయంగా చేయగలరు.
ఆధారం :
AP Board 6th Class Social Solutions Chapter 12 సమానత్వం వైపు 7
AP Board 6th Class Social Solutions Chapter 12 సమానత్వం వైపు 6

ప్రశ్న 10.
మన పాఠ్యపుస్తకంలో ప్రవేశిక ఉన్నది. అది ఎక్కడ ఉన్నదో కనుక్కోండి. శ్రద్ధగా చదవండి. సమానత్వం గురించి మీరేమి అవగాహన చేసుకున్నారో తరగతి గదిలో చర్చించండి.
జవాబు:
మన పాఠ్యపుస్తకంలో ప్రవేశిక మొదటి పేజిలో ఉంది.

సమానత్వం గురించి నేను అవగాహన చేసుకున్న అంశాలు :

  • మన రాజ్యాంగం అన్ని అంశాలలో (ఉదా॥ ఆదాయం, ఆస్తుల విషయంలో) సమానత ఇవ్వటం లేదు, కానీ ఈ అందరికీ ఒకే హోదా ఉండేలా చూస్తుంది. దీని అర్థం ప్రతి ఒక్కరికీ ఒకే చట్టాలు వర్తిస్తాయి.
    AP Board 6th Class Social Solutions Chapter 12 సమానత్వం వైపు 8
  • ఆటోమూ స్వేచ్ఛ, ఆవ ప్రకటనా స్వేవు నమ్ముతాన్ని పర్నాసార్లు కలిగివుంది ఆసక్తి అందాన్ని పెంపొందించడం.
  • రెండవది అది ‘అవకాశాలలో’ సమానత్వానికి హామీ ఇస్తోంది. దీని అర్థం. ప్రభుత్వ అవకాశాలన్నీ కులం, మతంతో సంబంధం లేకుండా అందరికి అందుబాటులో ఉంటాయి.
  • ఒక పదవికి ప్రత్యేక అర్హతలు ఉండాల్సి వస్తే, ఆ అర్హతలు కూడా అందరికీ సమానంగా అందుబాటులో ఉండేలా చేస్తారు.

AP Board 6th Class Social Solutions Chapter 11 భారతీయ సంస్కృతి, భాషలు మరియు మతాలు

SCERT AP 6th Class Social Study Material Pdf 11th Lesson భారతీయ సంస్కృతి, భాషలు మరియు మతాలు Textbook Questions and Answers.

AP State Syllabus 6th Class Social Solutions 11th Lesson భారతీయ సంస్కృతి, భాషలు మరియు మతాలు

6th Class Social 11th Lesson భారతీయ సంస్కృతి, భాషలు మరియు మతాలు Textbook Questions and Answers

Improve your learning (మీ అభ్యసనాన్ని మెరుగుపడుచుకోండి)

ప్రశ్న 1.
ముస్లింల పవిత్ర గ్రంథం పేరేమి?
జవాబు:
ముస్లింల పవిత్ర గ్రంథం పేరు ఖురాన్.

ప్రశ్న 2.
అష్టాంగ మార్గం అనగా నేమి?
జవాబు:
బుద్ధుని ప్రకారం, మోక్షం సాధించడమే జీవిత పరమార్థం. మోక్షాన్ని బలుల ద్వారా లేదా ప్రార్థనల ద్వారా సాధించలేము. (మధ్యేమార్గం) అష్టాంగ మార్గంను అనుసరించడం ద్వారా మోక్షం సాధించవచ్చని తెలిపాడు.
AP Board 6th Class Social Solutions Chapter 11 భారతీయ సంస్కృతి, భాషలు మరియు మతాలు 1

అష్టాంగ మార్గాలు
1. సరైన దృష్టిసత్యాన్ని తెలుసుకోవడంసమ్యక్ దృష్టి
2. సరైన ఉద్దేశంమనసును చెడు నుండి విడిపించడంసమ్యక్ సంకల్ప
3. సరైన ప్రసంగంఇతరులను బాధపెట్టేలా మాట్లాడకపోవడంసమ్యక్ వాక్కు
4. సరైన క్రియఇతరుల మంచికోసం పనిచేయడంసమ్యక్ కర్మ
5. సరైన, జీవితంజీవితాన్ని గౌరవించడంసమ్యక్ జీవన
6. సరైన కృషిచెడును ఎదిరించడంసమ్యక్ సాధన
7. సరైన ఏకాగ్రతధ్యానం సాధన చేయడంసమ్యక్ సమాధి
8. సరైన బుద్ధిఆలోచనలను నియంత్రించడంసమ్యక్ స్మృతి

ప్రశ్న 3.
మత సామరస్యాన్ని ప్రోత్సహించడానికి రెండు నినాదాలు రాయండి.
జవాబు:

  • దేవుడు ఒక్కడే – మతం మార్గమే.
  • మతము కన్నా – మానవత్వం మిన్న
  • మతాలు వేరైనా – మాధవుడు ఒక్కడే
  • మతతత్వం కాదు ముఖ్యం – మానవత్వం ముఖ్యం
  • మతం మంచి నీళ్ళు ఇవ్వదు – మమకారమే మంచిని పంచుతుంది

ప్రశ్న 4.
యేసుక్రీస్తు ప్రధాన బోధనలు ఏవి?
జవాబు:
యేసుక్రీస్తు ప్రధాన బోధనలు :

  • మానవులందరూ దేవుని పిల్లలు.
  • పాపాలు చేయకుండా పవిత్రమైన జీవితాన్ని గడపండి.
  • నిన్ను నీవు ప్రేమించుకున్నట్లు నీ పొరుగువారిని కూడా ప్రేమించండి.
  • ఒక చెంపపై కొట్టినప్పుడు, మరొక చెంప చూపించు.
  • మానవసేవే మాధవసేవ.
  • శాంతి, ప్రేమ, కరుణ కల్గి ఉండాలి.
  • తనను తాను తగ్గించుకొనువాడు దేవునిచే హెచ్చింపబడును.
  • శత్రువును కూడా ప్రేమతో జయించవచ్చు.

AP Board 6th Class Social Solutions Chapter 11 భారతీయ సంస్కృతి, భాషలు మరియు మతాలు

ప్రశ్న 5.
ఇస్లాం మత ప్రధాన బోధనలు ఏవి?
జవాబు:
ఇస్లాం మత ప్రధాన బోధనలు :

  • మానవులందరూ అల్లాచే సృష్టించబడ్డారు.
  • మానవులందరూ దేవుని ముందు సమానం.
  • దేవునికి ఆకారం లేదు కాబట్టి విగ్రహారాధన సరియైనది కాదు.
  • ప్రతి ముస్లిం దేవుని సేవకునిగా మారి నిజాయితీగా ఉండాలి.
  • మానవులంతా అన్నదమ్ముల్లా మెలగాలి.

ప్రశ్న 6.
ఆర్య సత్యా లు ఏవి?
జవాబు:
ఆర్య సత్యాలు నాలుగు:

  • ప్రపంచం దుఃఖమయం.
  • దుఃఖం కోరికల వల్ల కలుగుతుంది.
  • కోరికలను త్యజించడం ద్వారా మోక్షం పొందవచ్చు.
  • అష్టాంగ మార్గాన్ని పాటించడం ద్వారా మోక్షాన్ని సులభంగా పొందవచ్చు.

ప్రశ్న 7.
“భిన్నత్వంలో ఏకత్వం భారత ప్రధాన సాంస్కృతిక లక్షణం” – దీనితో మీరు ఏకీభవిస్తారా లేదా? వ్యాఖ్యానించుము.
జవాబు:
భారతదేశ ప్రధాన సాంస్కృతిక లక్షణం – “భిన్నత్వంలో ఏకత్వం” అని నేను ఏకీభవిస్తున్నాను.
భిన్నత్వంలో ఏకత్వం భారతదేశ విశిష్ట లక్షణం :
భారతదేశం అనేక వైవిధ్యాలతో కూడిన ప్రాంతం. మతం, భాష, సంస్కృతి, జీవనశైలి, వేషధారణ, దేవునిపై విశ్వాసం, ఆరాధనా, విధానాలు, ఆహారపు అలవాట్లు వంటి వాటిలో కూడా వైవిధ్యత కనిపిస్తుంది.

చంద్రగుప్తుడు, అశోకుడు, గౌతమీపుత్ర శాతకర్ణి. సముద్రగుప్తుడు, అక్బర్ మొదలగు రాజులు, చక్రవర్తులు. దేశాన్ని రాజకీయంగా ఏకం చేయడానికి ప్రయత్నించారు.
AP Board 6th Class Social Solutions Chapter 11 భారతీయ సంస్కృతి, భాషలు మరియు మతాలు 2
దేశంలోని వివిధ ప్రాంతాలలో జన్మించిన మహావీరుడు. గౌతమ బుద్ధుడు, గురునానక్, కబీర్, నిజాముద్దీన్ ఔలియా, షేక్ సలీం చిస్తి, రవీంద్రనాథ్ ఠాగూర్, డాక్టర్ రాధా కృష్ణన్ వంటి మహానీయులను, సాధువులను, తత్వవేత్తలను భారతీయులందరూ గౌరవిస్తారు.

ప్రజలు హోలీ, దీపావళి, రంజాన్, క్రిస్మస్, గుడ్ ఫ్రైడే, మహావీర్ జయంతి, బుద్ధ జయంతి వంటి పండుగలను ఇతర మతస్థులను ఇబ్బంది పెట్టకుండా చాలా ప్రశాంతంగా జరుపుకుంటారు. భారతదేశం బహుళ సంస్కృతుల మరియు జాతుల (కులాల) సంక్లిష్టతను సూచిస్తుంది. విభిన్న సంస్కృతులు మరియు మతాలు ఉన్న ప్రజలలో ఐక్యతను సూచించే భావననే “భిన్నత్వంలో ఏకత్వం” అని అంటారు. ఇది భారతదేశం యొక్క అత్యున్నత సాంస్కృతిక లక్షణం.

AP Board 6th Class Social Solutions Chapter 11 భారతీయ సంస్కృతి, భాషలు మరియు మతాలు

ప్రశ్న 8.
ప్రస్తుతం భారతదేశంలో జాతీయ సమైక్యతను భగ్నం చేసే అనేక సమస్యలు కలవు. దీనికి గల కారణాలు ఏమిటి? వీటిని ఎలా పరిష్కరించవచ్చు?
జవాబు:
ప్రస్తుతం భారతదేశంలో జాతీయ సమైక్యతను భగ్నంచేసే సమస్యలు (అంశాలు) :

  1. మతతత్వం
  2. కులతత్వం
  3. ప్రాంతీయ తత్వం
  4. స్వార్థ రాజకీయాలు
  5. సమాచార ప్రసార సాధనాల అత్యుత్సాహం
  6. భాషా దురాభిమానం
  7. సాంఘిక అసమానతలు.

కారణాలు :

  • అధిక జనాభా, ఉండటం ప్రధాన కారణం. (అనేక కులాలు, మతాలు, ప్రాంతాల వారుండటం).
  • బ్రిటిషు పాలనలో ఉండటం ; వీరు అనుసరించిన విభజించు పాలించు విధానం.
  • సమాజంలోని అసమానతలు (ఆర్థిక, సామాజిక అంశాలు)
  • స్వార్థ పర రాజకీయ నాయకులు తమ స్వార్థం కోసం (విభజించడం) విభజన రాజకీయాలు చేయడం.

పరిష్కారాలు :

  • పౌరులకు దేశ సమైక్యత పట్ల అవగాహన కల్పించాలి. విద్యార్థి దశ నుంచే దేశభక్తిని పెంపొందించాలి.
  • చట్టాలు నిర్దిష్టంగా, ఖచ్చితంగా ఉండాలి.
  • రాజ్యాంగబద్ధంగా పాలన సాగాలి.
  • కుల, మత, ప్రాంతీయ, భాషాతత్వాలనే సంకుచిత భావాలను పారద్రోలాలి.

ప్రశ్న 9.
భారతదేశ పటంలో క్రింద ఇవ్వబడిన ప్రాంతాలను గుర్తించండి.
సింధూ నది, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, బీహార్, భట్టిప్రోలు, కృష్ణానది, గంగా నది, యమునా నది, వింధ్య . పర్వత శ్రేణులు, ఉత్తర ప్రదేశ్.
జవాబు:
AP Board 6th Class Social Solutions Chapter 11 భారతీయ సంస్కృతి, భాషలు మరియు మతాలు 3

ప్రశ్న 10.
మత ఐక్యతను పెంపొందించేలా ఒక చిత్రాన్ని గీయండి.
జవాబు:
విద్యార్థులు స్వయంగా గీయగలరు. ఉదా :
AP Board 6th Class Social Solutions Chapter 11 భారతీయ సంస్కృతి, భాషలు మరియు మతాలు 4
(లేదా)
AP Board 6th Class Social Solutions Chapter 11 భారతీయ సంస్కృతి, భాషలు మరియు మతాలు 5

ప్రశ్న 11.
మత ఐక్యతను పెంపొందించడానికి నాలుగు నినాదాలు రాయండి.
జవాబు:
మత ఐక్యతను పెంపొందించే నినాదాలు :

  • ఎన్ని మతాలున్నా – అసలైన మతం మానవత్వం మాత్రమే
  • మతం గమ్యం కాదు – మార్గదర్శిని మాత్రమే
  • మత విలువలు – పెంచాలి మనిషి నైతిక విలువని
  • పరమత సహనం – కల్పించును పరమాత్మ దర్శనం
  • మతాల మార్గదర్శకం – పరమాత్మక సన్నిధానం
  • మతాలు వేరైనా – గమ్యం ఒక్కటే
  • సర్వమత సారం – సర్వ మానవ సౌభాగ్యం

ప్రశ్న 12.
కింద ఇవ్వబడిన ఖాళీలను సరైన పదాలతో నింపండి.
I. మతం : హిందూమతం, సిక్కుమతం, క్రైస్తవ మతం, ఇస్లాం మతం, జైన మతం, బౌద్ధ మతం
II. దేవుడు ప్రవక్త : సిద్ధార్థుడు, యేసుక్రీస్తు, మహావీరుడు, మహమ్మద్ ప్రవక్త, శ్రీకృష్ణుడు, గురునానక్
III. పవిత్ర గ్రంథం : త్రిపీఠికలు, బైబిల్, భగవద్గీత, ఖురాన్, గురుగ్రంథ సాహిబ్, అంగాలు
IV. పూజ ప్రదేశం : మసీదు, ఆలయం, గురుద్వారా, చర్చి, మఠం, జైన దేవాలయం
AP Board 6th Class Social Solutions Chapter 11 భారతీయ సంస్కృతి, భాషలు మరియు మతాలు 6
జవాబు:
AP Board 6th Class Social Solutions Chapter 11 భారతీయ సంస్కృతి, భాషలు మరియు మతాలు 7

6th Class Social Studies 11th Lesson భారతీయ సంస్కృతి, భాషలు మరియు మతాలు InText Questions and Answers

6th Class Social Textbook Page No.123

ప్రశ్న 1.
భారతదేశంలో అనేక భాషలు కలవు. భాష అవసరం ఏమిటి? భాషలు ఎలా పరిణామం చెంది ఉంటాయి?
జవాబు:
భాష అవసరం ఏమిటంటే :

  • భాష మనం ఆలోచించి అర్థం చేసుకోవడానికి ఉపయోగపడుతుంది.
  • మన పనులన్నీ క్రమపద్ధతిలో ప్రణాళికాబద్ధంగా చేసుకోవడానికి మనకి భాషే ఉపయోగపడుతుంది.
  • ఇతరుల దృష్టిని మనవైపు తిప్పుకోవడానికి మనకి భాష అవసరం.
  • కొత్త విషయాలను సృష్టించడానికి కనిపెట్టడానికి, లేదా సరదాగా నవ్వించడానికి భాష అవసరం.
  • అనేక విషయాలను ఊహించుకోవడానికి, బాహ్య ప్రపంచాన్ని అర్థం చేసుకోవడానికి భాష అవసరం.
  • మన భావాలను, అనుభవాలను పంచుకోవడానికి భాష అవసరం. ఈ రకంగా భాష మనకు ఎంతో ప్రముఖమైనది.
  • తరతరాలుగా పెద్దలు తమ పిల్లలకు సమాచారాన్ని అందించటానికి భాష అవసరం.

భాష ఎలా పరిణామం చెందింది అని చెప్పటానికి ప్రత్యక్ష ఆధారాలు తక్కువ.

  • ముందుగా అనేక (చేతి) గుర్తులను వాడారు (సంజ్ఞలను) తర్వాత శబ్దాలను వాడారు.
  • ఒక తరం నుండి మరొక తరానికి, ఒక తెగ (జాతి) నుండి మరో తెగ (జాతి)కు
  • ఒక భౌగోళిక ప్రాంతం నుండి మరొక భౌగోళిక ప్రాంతానికి, ఒక సమాజం నుండి మరొక సమాజంకు భాష ప్రసారం జరిగింది.

AP Board 6th Class Social Solutions Chapter 11 భారతీయ సంస్కృతి, భాషలు మరియు మతాలు

ప్రశ్న 2.
ఇతర భాషకు చెందిన మీ స్నేహితుడిని ఆహ్వానించండి మరియు అతనితో/ఆమెతో సంభాషించండి.
జవాబు:
విద్యార్థులు స్వయంగా చేయగలరు. ఉదాహరణ ఆధారంగా (కన్నడ స్నేహితునితో)

  • నిన్న హెసరు ఏను? (నీ పేరు ఏమిటి)
  • నన్న హెసరు రాము.’ (నా పేరు రాము)
  • నీను పను కెలస మాడువి ? (నీవు ఏం పని చేస్తావు ?)
  • నాను శాలియల్లి ఓదుత్తిదేన్. (నేను బడిలో చదువుతున్నాను.)
  • నీను యావ తరగతియల్లి ఓదుత్తీ? (నీవు ఏ తరగతి చదువుచున్నావు?)
  • నాను ఆరునే క్లాసివల్లి ఓదుత్తిద్దేనె (నేను ఆరవ క్లాస్ చదువుతున్నాను)
    ఈ విధంగా ఏదైనా భాషలో రాయగలరు.

6th Class Social Textbook Page No.124

ప్రశ్న 3.
AP Board 6th Class Social Solutions Chapter 11 భారతీయ సంస్కృతి, భాషలు మరియు మతాలు 8
1516కాలం నాటి కృష్ణదేవరాయలు శాసనాన్ని చదవడానికి ప్రయత్నించండి. మీ ఉపాధ్యాయుని సహాయంతో శాసనంలో ఏముందో అర్థం చేసుకోండి.
జవాబు:

  • శుభమస్తు : శ్రీమాన్ మహారాజాధిరాజ రాజపరమేశ్వర మూరురాయర
  • గండ అరిరాయనిబాట భాషగెతపువ రాయరగండ యవన రాజ్య
  • స్థాపనాచార్య శ్రీ వీరప్రతాప కృష్ణదేవ మహారాయలు విజయ
  • నగరాన సింహాసనారూఢుడై పూవజీ దిగ్విజయ యాత్రకు విచ్చేశి
  • ఉద్దగిరి, కొండవీడు, కొండపల్లి రాజమహేంద్రవరం మొదలైన
  • దుగాజాలు సాధించి సింహ్యాద్రిక విచ్చేసి స్వస్తిశ్రీ జయాభ్యుదయ
  • ఈ శాసనము శ్రీకృష్ణదేవరాయలు, దిగ్విజయయాత్ర గురించి వివరిస్తున్నది. అలాగే సింహాచలం విచ్చేసినట్లుగా తెలుస్తుంది.

6th Class Social Textbook Page No.125

ప్రశ్న 4.
భారత అధికార భాషలు హిందీ మరియు ఇంగ్లీష్, ప్రియమైన విద్యార్థులారా “ఇండియా” అనే పదాన్ని అనేక భారతీయ భాషలలో ఎలా రాయవచ్చో గమనించండి.
జవాబు:
AP Board 6th Class Social Solutions Chapter 11 భారతీయ సంస్కృతి, భాషలు మరియు మతాలు 9

ప్రశ్న 5.
ఇంగ్లీషులో 26, తెలుగులో 56 అక్షరాలు కలవు. తమిళం, కన్నడ, మలయాళం, ఒడియాలో ఎన్ని అక్షరాలు కలవు? Page No. 125
జవాబు:
తమిళంలో – 247, కన్నడంలో – 49, మలయాళంలో- 56 (57) ఒడియాలో – 64 అక్షరాలు కలవు.

AP Board 6th Class Social Solutions Chapter 11 భారతీయ సంస్కృతి, భాషలు మరియు మతాలు

ప్రశ్న 6.
భారతదేశాన్ని లౌకిక దేశం అంటారు. ఎందుకు?
జవాబు:
భారతదేశంలో ప్రభుత్వానికి ఎటువంటి మతం లేదు. అంటే ప్రభుత్వం ఏ మతాన్ని ప్రోత్సహించదు, ఏ మతాన్ని వ్యతిరేకించదు మత విషయాల్లో తటస్థంగా ఉంటుంది. అంటే మత విషయాల్లో ప్రభుత్వం జోక్యం చేసుకోదు. అలాగే దేశ పౌరులందరికి మత స్వాతంత్ర్యపు హక్కు ఉంది. అంటే పౌరులు ఏ మతాన్నైనా అనుసరించవచ్చు, ప్రచారం చేసుకోవచ్చు, ప్రోత్సహించుకోవచ్చును. కాబట్టి భారతదేశాన్ని లౌకిక దేశం అని అంటారు.

6th Class Social Textbook Page No.126

ప్రశ్న 7.
మన ఆరోగ్యం మరియు పరిశుభ్రతను పెంపొందించడంలో సహాయపడుతున్న మన పూర్వికులు ఆచారాలు మరియు సంప్రదాయాలపై చర్చించండి.
జవాబు:

  • ఏదైనా శుభకార్యం (ఉత్సవం) జరిగేటపుడు మామిడి (పచ్చ) తోరణాలు కడుతారు. కారణం ఎక్కువమంది ఒకచోట చేరినపుడు ఎక్కువ ఆక్సిజన్ అవసరం కాబట్టి మామిడి ఆకులు ఎక్కువ (సేపు) సమయం పచ్చగా ఉండి, ఆక్సిజన్‌ను విడుదలచేస్తాయి.
  • గ్రామీణ ప్రాంతాలలో ఇంటిముందు (పేడ) కళ్ళాపి చల్లుతారు, ఇల్లు అలుకుతారు. కారణం ఆవు పేడలో యాంటి బ్యాక్టీరియల్ గుణం ఉండి ఎటువంటి క్రిమి, కీటకాలు ఇంట్లోకి రావు. అలాగే గొబ్బిళ్ళు పెట్టడం, ముగ్గులు వేయడం కూడా.
  • రాగి పాత్రలలో నీరు త్రాగటం. రాగి (పాత్రల్లో) రేకులో బ్యాక్టీరియా, వైరస్లు త్వరగా మృతుమవుతాయి కనుక.
  • ఇంటిముందు తులసి, (ఇంటివెనుక కరివేపాకు) వేప వంటి ఔషధ గుణాలున్న మొక్కలు ఉంచడం. ఇవన్నీ క్రిమి, కీటకాలను చంపే ఔషధాలు వీటి యొక్క ఆవశ్యకతను తెల్పుటకు వీటిని పూజించమంటు అందుబాటులో ఉంచినారు.
  • గడపకు పసుపు పూయటం, పసుపు యాంటీ బ్యాక్టీరియల్ ఔషధంగా పనిచేస్తుంది. అందుకనే వంటలలో కూడా వాడతారు. అలాగే పాములు చూడగలిగే రంగు పసుపు కనుక గడపకు పసుపుంటే అవి లోపలకి రావు.
  • అలాగే ముఖానికి, కాళ్ళకు పసుపు రాసుకుంటారు కారణం ఇది యాంటి బ్యాక్టీరియల్.
    ఉగాది పచ్చడి సేవనం, ఉగాది పచ్చడిలో అన్ని రకాల రుచులు ఉంటాయి. అవి ఔషధంగా ఉపయోగపడుతుంది.
  • సూర్యనమస్కారాలు చేయడం వలన విటమిన్ ‘డి’ లభిస్తుంది.
  • ఉపవాసాలు ఉండటం వెనుక కారణం ఇది మన జీర్ణవ్యవస్థను అభివృద్ధి చేస్తుంది.
  • ఉత్తర దిక్కున తల ఉంచి, నిద్రపోరాదు అని ఎందుకు చెబుతారంటే భూమి యొక్క అయస్కాంత క్షేత్రం వలన బిపి మొదలైన వ్యాధులు వస్తాయని.
  • అయితే సంప్రదాయాలు మూఢాచారాలుగా, మూఢ విశ్వాసాలుగా రూపాంతరం చెందకుండా, వాటి యొక్క ఉద్దేశ్యమును గ్రహించాలి.

AP Board 6th Class Social Solutions Chapter 10 స్థానిక స్వపరిపాలన

SCERT AP 6th Class Social Study Material Pdf 10th Lesson స్థానిక స్వపరిపాలన Textbook Questions and Answers.

AP State Syllabus 6th Class Social Solutions 10th Lesson స్థానిక స్వపరిపాలన

6th Class Social 10th Lesson స్థానిక స్వపరిపాలన Textbook Questions and Answers

Improve your learning (మీ అభ్యసనాన్ని మెరుగుపడుచుకోండి)

ప్రశ్న 1.
గ్రామసభ మరియు గ్రామ పంచాయితీ మధ్య తేడాలు ఏమిటి?
జవాబు:

గ్రామసభగ్రామపంచాయితీ
1. గ్రామ స్థాయిలో సాధారణ సభ.1. గ్రామ స్థాయి అసెంబ్లీ లాంటిది.
2. దీనిలో గ్రామంలోని ఓటర్లు అందరూ సభ్యులే.2. దీనిలో ఎన్నుకోబడిన వార్డు సభ్యులే సభ్యులు.
3. ప్రత్యక్ష ప్రజాస్వామ్యానికి నిదర్శనం.3. ఇది పరోక్ష (ప్రాతినిధ్య) ప్రజాస్వామ్యానికి నిదర్శనం
4. గ్రామ పంచాయితీ పనితీరును సమీక్షిస్తుంది.4. గ్రామ సభ పనితీరును సమీక్షించలేదు.
5. దీనికి ఎన్నికలుండవు.5. దీనిని ఎన్నికల ద్వారా ఏర్పాటు చేస్తారు.

ప్రశ్న 2.
మీరు మీ స్థానిక ప్రభుత్వ సంస్థలో ప్రతినిధి అయితే మీరు ఏ సమస్యలు ప్రస్తావిస్తారు?
జవాబు:
నేను మా స్థానిక ప్రభుత్వ సంస్థలో ప్రతినిధి అయితే ఈ క్రింది సమస్యలు ప్రస్తావిస్తాను.

  • ప్రజా సౌకర్యాలైన త్రాగునీరు, రోడ్లు, వీధి దీపాల ఏర్పాటు, నిర్వహణ, మురుగు నీటి కాల్వల నిర్మాణం, నిర్వహణ, చెత్త సేకరించుట, నిర్వహణ గురించి
  • ప్రభుత్వ పాఠశాలలో నమోదు, హాజరు పెంచుట గురించి మరియు మధ్యాహ్న భోజన పథకం అమలు (నిర్వహణ), నాడు – నేడు అమలు గురించి ప్రస్తావిస్తాను.

AP Board 6th Class Social Solutions Chapter 10 స్థానిక స్వపరిపాలన

ప్రశ్న 3.
మీ పంచాయితీ / మున్సిపాలిటీలో సామాన్య ప్రజలు ఏ సమస్యపైన అయినా నిర్ణయం తీసుకోవడంలో పాలుపంచుకొంటున్నారా? కొన్ని ఉదాహరణలు ఇవ్వండి.
జవాబు:
మా మున్సిపాలిటీలో కొన్ని విషయాలలో సామాన్య ప్రజలు నిర్ణయం తీసుకోవడంలో పాలు పంచుకుంటున్నారు.
ఉదాహరణలు :

  • మా వారులో పాఠశాల దగ్గర ఒక మద్యం షాపు పెట్టారు. దానితో పాఠశాల నడపటం కష్టంగా ఉండేది. దానితో ప్రజలందరూ కలిసి వార్డు సభ్యునికి తెలియపరిచారు. వార్డు సభ్యుడు చైర్మన్, కమిషనర్ తో మాట్లాడి ఆ షాపును అక్కడి నుంచి తీయించేశారు.
  • మా వార్డులో వర్షం పడితే మురుగునీరు రోడ్లపైకి పారుతోంది. కాబట్టి ప్రజలు చాలామంది మున్సిపాలిటీ సమావేశాలు జరిగే సమయంలో అక్కడికి వెళ్ళి వారికి సమస్యను కాగితం రూపంలో సమర్పించాము. వారు సమావేశంలో చర్చించి ‘భూగర్భ మురికి కాలువలను’ మా వార్డుకు శాంక్షన్ చేశారు.

ప్రశ్న 4.
అభివృద్ధి కార్యక్రమాలు జరపడానికి పంచాయితీలు పన్నులు పెంచాలా, లేదా ప్రభుత్వ నిధుల మీద ఆధారపడాలా? మీ అభిప్రాయం తెలపండి.
జవాబు:
అభివృద్ధి కార్యక్రమాలు జరపడానికి పంచాయితీలు పన్నులు పెంచితే అది ప్రజలకు భారమవుతుంది. ప్రభుత్వ నిధుల మీద ఆధారపడితే అది కూడా పరోక్షంగా ప్రజలకు భారమౌతుంది. కాబట్టి పంచాయితీలు కొన్ని స్వావలంబనా కార్యక్రమాలు జరపాలి. పోరంబోకు స్థలాల్లో గడ్డి పెంచడం, చెరువుగట్లపై కొబ్బరి, ఈతచెట్లు పెంచడం, వాటిని వినియోగించేవారికి వేలంపాట నిర్వహించి ఆ సొమ్మును అభివృద్ధి కార్యక్రమాలకు నిర్వహించాలి.

ప్రశ్న 5.
అంకితభావంతో పనిచేసే సర్పంచులు ఎదుర్కొనే సవాళ్ళను వివరించండి.
జవాబు:
నేడు అంకితభావంతో పనిచేసేవారు అతికొద్దిమందే ఉన్నారు. వారికి అడ్డత్రోవలో పనిచేయించుకునే వారు ఎప్పుడూ సమస్యలను సృష్టిస్తూ ఉంటారు. ఉదా : గ్రామంలో ఇందిరా ఆవాస్ యోజన, దీపం పథకం, అన్నపూర్ణ పథకం, పనికి ఆహార పథకం, వికలాంగ, వృద్ధాప్య, వితంతు పింఛనులు మొదలైనవి అనేకం ఉన్నాయి. వీటిని అర్హులు కానివారికి ఇప్పించాలని సర్పంచ్ పై పేరు, పలుకుబడి ఉన్నవారు ఒత్తిడి తీసుకువస్తారు. ఈ సవాళ్ళను అన్నింటినీ అధిగమించి గ్రామాన్ని ముందుకు నడిపించడం సర్పంచ్ కు కత్తిమీద నడకలాంటిది.

ప్రశ్న 6.
పురపాలక సంఘం కల్పిస్తున్న ఏయే పౌర సౌకర్యాలను గ్రామ పంచాయితీ కల్పించటం లేదు?
జవాబు:
విద్యుత్తు, రవాణా, ఉన్నత విద్య, చెత్త సేకరణ (వ్యర్థ పదార్థాల నిర్వహణ), భూగర్భ డ్రైనేజీ, టౌన్ ప్లానింగ్, పార్కులు మెరుగైన ఆరోగ్య సేవలు మొదలైన పౌర సౌకర్యాలను పురపాలక సంఘం కల్పిస్తుంది. గ్రామ పంచాయితీలు కల్పించడం లేదు.

ప్రశ్న 7.
గీతిక ఉన్న వీధిలో కొళాయి నుంచి నీరు అరగంట కూడా రాదు. అందువల్ల చాలామంది బకెట్లు నింపుకోవడానికి వరుసలో నిలుచుంటారు. ఆమె సమస్య పరిష్కారం కావటానికి మీరు గీతికకు ఏ విధమైన సలహా ఇస్తారు?
జవాబు:
తన యొక్క వార్డు కౌన్సిలర్ ని కలిసి సమస్యను అతనితో చెప్పవలసినదిగా సలహా ఇస్తాను. అపుడు ఆ సమస్యను కౌన్సిల్ ముందు వుంచుతారు. అధికారులు నిర్ణయం తీసుకుని సమస్య పరిష్కరించడానికి తగు చర్యలు తీసుకుంటారు. ఈ అప్పటివరకు బోరింగు పంపు నుండి నీరు పట్టుకుంటుంది.

AP Board 6th Class Social Solutions Chapter 10 స్థానిక స్వపరిపాలన

ప్రశ్న 8.
స్థానిక కార్పోరేటర్/కౌన్సిలర్‌ను కలిసి పురపాలక సంఘం చేసే పనుల గురించి తెలుసుకోవడానికి గాను కొన్ని ప్రశ్నలను తయారు చేయండి.
జవాబు:
నేను మాకు దగ్గరలో ఉన్న కార్పొరేటర్ ను కలిసి, పురపాలక సంఘం చేసే పనుల గురించి తెలుసుకోవడానికిగాను ఈ క్రింది ప్రశ్నలను తయారుచేశాను.

ప్రశ్నలు :
1. పురపాలక సంఘం, చెత్తను ఉపయోగించి ఏమైనా వ్యాపారం చేస్తుందా?
2. రోడ్డును శుభ్రంచేసే స్త్రీలకు, పురుషులకు ఏమైనా పేర్లు ఉన్నాయా?
3. మంచినీటి శుద్ధీకరణ ఏ విధంగా చేస్తారు?
4. వీధి లైట్లు నిర్వహణ కొరకు ఏదైనా కంట్రోల్ యూనిట్ ఉంటుందా?
5. ప్రజల వద్ద నుండి పన్నుల రూపంలో వసూలు చేసిన డబ్బును పురపాలక సంఘం దేనికి ఖర్చు చేస్తుంది?

ప్రశ్న 9.
దిగువ ఇవ్వబడిన పురపాలక సంఘాలను, మున్సిపల్ కార్పొరేషన్లను ఆంధ్రప్రదేశ్ పటంలో గుర్తించండి.
i) విశాఖపట్నం
ii) విజయవాడ
iii) భీమునిపట్నం
iv) కడప
v) అనంతపురం
vi) తిరుపతి
జవాబు:
AP Board 6th Class Social Solutions Chapter 10 స్థానిక స్వపరిపాలన 1

6th Class Social Studies 10th Lesson స్థానిక స్వపరిపాలన InText Questions and Answers

6th Class Social Textbook Page No.111

ప్రశ్న 1.
మీ ప్రాంతంలో కల్పించే ప్రజా సౌకర్యాలను రాయండి.
జవాబు:
మా ప్రాంతంలో కల్పిస్తున్న ప్రజా సౌకర్యాలు :

  • రక్షిత మంచినీటి సౌకర్యం.
  • ఆ భూగర్భ డ్రైనేజి ఆ మురుగు కాల్వల నిర్మాణం, నిర్వహణ
  • రహదారుల నిర్మాణం, నిర్వహణ
  • వీధి దీపాల ఏర్పాటు (మరమ్మతు) నిర్వహణ
  • ఉద్యానవనాల ఏర్పాటు నిర్వహణ
  • ఉచిత విద్యా సౌకర్యం
  • ఉచిత వైద్య సదుపాయాలు
  • గ్రంథాలయాలు, పఠనాలయాలు
  • కూరగాయల, పండ్ల, చేపల మార్కెట్ల నిర్వహణ

ప్రశ్న 2.
మీరు గ్రామంలో నివసిస్తుంటే మీ గ్రామసభను సందర్శించి నివేదిక రూపొందించండి.
జవాబు:
విద్యార్థి స్వయంగా చేయగలరు. (ఈ క్రింది వానిని ఆధారంగా ఉదాహరణగా తీసుకోగలరు)

మా గ్రామంలోని గ్రామసభను సందర్శించాను. అక్కడ – రేషన్‌కార్డు కోసం కూపన్లు ఇస్తున్నారని తెలిసి కనకమ్మ గ్రామసభకు హాజరైంది. కాని ఆమెకు గ్రామసభ ఎందుకు జరుగుతుందో తెలియదు. ఆ గ్రామసభలో దాదాపు 70 మంది ప్రజలు వస్తే అందులో 20 మంది స్త్రీలు ఉన్నారు. వాళ్ళు కనకమ్మ లాగే కూపన్లు ఇస్తున్నారని వచ్చారు. సమావేశంలో సర్పంచ్ గత సంవత్సరంలో జరిగిన పనుల గురించి వివరిస్తూ, ఈ సంవత్సరం జరిగే పనుల గురించి గ్రామసభ ముందుంచగా గ్రామసభకు వచ్చిన జనం చప్పట్లు కొడుతూ సర్పంచ్ చేసిన పనిని అభినందించారు. తరువాత ఆయన దారిద్ర్యరేఖకు దిగువన (BPL) గల ప్రజల వివరాలు వెల్లడించాడు. ప్రభుత్వం ఇస్తున్న సహాయానికి వీరు లబ్దిదారులవుతారని తెలియజేశాడు.

ఆయన మాట్లాడడం ఆపగానే కనకమ్మ నిలబడి నా పేరు కూడా లబ్దిదారుల జాబితాలో ఉంచాలని, నాకు ఉద్యోగం గాని, భూమి గాని వేరే ఏ ఆధారంగాని లేదని తెలిపింది. సర్పంచ్, ఆమె పేరు తప్పకుండా ఈ జాబితాలో ఉండేటట్లు చూస్తానని చెప్పగ కనకమ్మ సంతోషిస్తూ గ్రామసభ నుంచి వెళ్ళింది. చివరిగా రేషన్‌కార్డు కోసం కూపన్లు వచ్చిన వాళ్ళందరికీ ఇవ్వడంతో గ్రామసభ ముగిసింది.

6th Class Social Textbook Page No.112

ప్రశ్న 3.
గ్రామ పంచాయితీ, గ్రామ సభల మధ్య పోలికలను రాయండి.
జవాబు:
గ్రామ పంచాయితీ, గ్రామ సభల మధ్య పోలికలు :

  • రెండూ కూడాను గ్రామ సంక్షేమం గురించి నిర్ణయాలు తీసుకోవటంలో పాల్గొంటాయి.
  • రెండింటికి ‘సర్పంచ్’ అధ్యక్షుడుగా వ్యవహరిస్తారు.
  • అన్ని వర్గాల వారికి ప్రాధాన్యత ఉంటుంది.
  • రెండూ ప్రజాస్వామ్యబద్ధంగా నిర్ణయాలు తీసుకుంటాయి. (మెజారిటీ సభ్యుల అభిప్రాయం).

6th Class Social Textbook Page No.113

ప్రశ్న 4.
ఓటర్ల జాబితాలో కొత్తగా నమోదు చేయడం, తీసివేయడం ఎందుకు అవసరమో చెప్పగలరా?
జవాబు:
కొత్తగా 18 సం|| నిండిన వారిని, ఆ ప్రాంతానికి కొత్తగా బదిలీ పైగాని, ఇల్లు మారిగాని వచ్చిన వారిని, వివాహమై కొత్తగా వచ్చిన వారిని ఓటర్ల జాబితాలో కొత్తగా నమోదు చేస్తారు.

ఇటీవల మరణించిన వారిని, బదిలీపై లేదా ఇల్లు మారి ఈ ప్రాంతాన్ని వదిలి వెళ్ళిన వారిని, వివాహమై ఈ ప్రాంతాన్ని వదిలి వెళ్ళినవారిని ఓటర్ల జాబితా నుంచి తొలగిస్తారు.

6th Class Social Textbook Page No.115

ప్రశ్న 5.
మీ ఉపాధ్యాయులు/తల్లిదండ్రుల సహాయంతో గ్రామ వాలంటీర్లు అందించే సౌకర్యాలను తెలుసుకోవడానికి ప్రయత్నించండి.
జవాబు:
గ్రామ వాలంటీర్లు అందించే సౌకర్యాలు :

  • ప్రభుత్వ సంక్షేమ పథకాలను గురించి తెలియజెప్పటమే కాకుండా మన ఇంటి దగ్గరకు (అందుబాటులోకి) తీసుకు వస్తారు.
  • వృద్ధాప్య పింఛన్లను ఇంటి వద్దనే అందిస్తున్నారు.
  • రేషన్ సరుకులను ఇంటి వద్దనే అందిస్తున్నారు.
  • ప్రభుత్వ పథకాల దరఖాస్తులను అందివ్వడం, ఆ దరఖాస్తులను అధికారులకు పంపిణీ చేయటం జరుగుతుంది.
  • గ్రామ వాలంటీర్లు ప్రభుత్వానికి ప్రజలకు వారధిలా పనిచేస్తున్నారు.

AP Board 6th Class Social Solutions Chapter 10 స్థానిక స్వపరిపాలన

ప్రశ్న 6.
మీ మండల ప్రాదేశిక నియోజక వర్గ (MPTC) సభ్యులు మరియు జిల్లా ప్రాదేశిక నియోజక వర్గ (ZPTC) సభ్యులు ఎవరు?
జవాబు:
సౌవిద్యార్థులు స్వయంగా రాయగలరు :
ఉదా : మా MPTC – …………….
మా ZPTC – …………………..

ప్రశ్న 7.
మీ జిల్లాలో ఎన్ని మండలాలు కలవు?
జవాబు:
విద్యార్థులు మీ మీ జిల్లాలను అనుసరించి రాయగలరు.
ఉదా : మాది గుంటూరు జిల్లా మా జిల్లాలో 57 మండలాలు కలవు.

6th Class Social Textbook Page No.116

ప్రశ్న 8.
మీ ప్రాంతంలో స్థానిక సంస్థలు కల్పించే ప్రజా సదుపాయాల జాబితాను రాయండి.
జవాబు:
మా ప్రాంతంలో స్థానిక సంస్థలు కల్పించే ప్రజా సదుపాయాలు :

  • రక్షిత మంచినీటి సౌకర్యం.
  • భూగర్భ డ్రైనేజి
  • మురుగు కాల్వల నిర్మాణం, నిర్వహణ
  • రహదారుల నిర్మాణం, నిర్వహణ
  • వీధి దీపాల ఏర్పాటు (మరమ్మత్తు) నిర్వహణ
  • ఉచిత విద్యా సౌకర్యం
  • ఉద్యనవనాలు ఏర్పాటు నిర్వహణ
  • ఉచిత వైద్య సదుపాయాలు
  • గ్రంథాలయాలు, పఠనాలయాలు
  • కూరగాయల, పండ్ల, చేపల మార్కెట్ల నిర్వహణ

6th Class Social Textbook Page No.117

ప్రశ్న 9.
మీ జిల్లాలో నగర పంచాయితీలు, పురపాలక సంఘాలు, మున్సిపల్ కార్పోరేషన్లు ఎన్ని కలవు?
జవాబు:
విద్యార్థులు మీ జిల్లా గురించి తెలుసుకుని రాయగలరు.
ఉదా : మాది గుంటూరు జిల్లా, మా జిల్లాలో
కార్పోరేషన్లు : 01 (గుంటూరు)
పురపాలక సంఘాలు : 12 (1. మంగళగిరి 2. సత్తెనపల్లి 3. తాడేపల్లి 4. తెనాలి 5. పొన్నూరు 6. బాపట్ల 7. రేపల్లె 8. నర్సరావుపేట 9. చిలకలూరి పేట 10. మాచర్ల 11. వినుకొండ 12. పిడుగురాళ్ళ
నగర పంచాయితీలు : 02 (దాచేపల్లి, గురజాల)

6th Class Social Textbook Page No.118

ప్రశ్న 10.
గ్రామ పంచాయితీ దాని పనితీరులో మున్సిపాలిటీకి ఎలా భిన్నంగా ఉంటుంది?
జవాబు:

గ్రామ పంచాయితీలుపురపాలక సంఘాలు
1. పంచాయితీలు గ్రామ స్వపరిపాలన సంస్థలు తక్కువ సంఖ్యలో జనాభా వుంటారు.1. పట్టణ స్థానిక స్వపరిపాలన సంస్థలు. ఇక్కడ ఎక్కువ జనాభా వుంటారు.
2. రోడ్లను నిర్వహించడం, రక్షిత మంచినీటి సౌకర్యం, పారిశుద్ధ్యం, వీధిదీపాలు, చౌక, ధరల షాపులు నిర్వహించడం మొ||న పనులు పంచాయితీ చేస్తుంది. చెత్తను ఎత్తివేయడం లాంటి పనులు చాలా గ్రామాలలో కనబడదు.2. గ్రామ పంచాయితీలు చేసే పనులతో పాటు అదనంగా చెత్తను ఎత్తి వేయడం, మురుగు కాలువల నిర్మాణం నిర్వహణ లాంటి బాధ్యతలను పురపాలక సంఘాలు నిర్వహిస్తాయి.
3. పంచాయితీ విధులను సర్పంచ్ పర్యవేక్షిస్తాడు.3. పురపాలక సంఘ పనులను కమీషనర్ మరియు ఇతర కమిటీలు పర్యవేక్షిస్తారు.
4. ఎక్కువ మంది ఉద్యోగులు అవసరం లేదు.4. పెద్ద మొత్తంలో ఉద్యోగులు అవసరం అవుతారు.
5. కాంట్రాక్ట్ కార్మికులు మనకు కనబడరు.5. పురపాలక సంఘాలలో కాంటాక్ట్ కార్మికులు చాలామంది ఉంటారు.

AP Board 6th Class Social Solutions Chapter 10 స్థానిక స్వపరిపాలన

ప్రశ్న 11.
మీ ఉపాధ్యాయుని సహాయంతో దిగువ పట్టికను పూర్తి చేయండి.
జవాబు:

హోదాఎవరు ఎన్నుకుంటారుప్రత్యక్ష / పరోక్ష ఎన్నిక
వార్డు మెంబర్గ్రామవార్డులోని ఓటర్లుప్రత్యక్ష ఎన్నిక
సర్పంచ్గ్రామంలోని ఓటర్లుప్రత్యక్ష ఎన్నిక
ఉప సర్పంచ్వార్డు మెంబర్స్పరోక్ష ఎన్నిక
MPTCగ్రామంలోని ఓటర్లుప్రత్యక్ష ఎన్నిక
ZPTCమండలంలోని ఓటర్లుప్రత్యక్ష ఎన్నిక
మండల అధ్యక్షులుMPTC సభ్యులుపరోక్ష ఎన్నిక
జిల్లా పరిషత్ చైర్మన్ZPTC సభ్యులుపరోక్ష ఎన్నిక
పురపాలక సంఘం ఛైర్మన్మున్సిపల్ కౌన్సిల్ సభ్యులు(కౌన్సిలర్)పరోక్ష ఎన్నిక
మేయర్కార్పోరేటర్స్ & ఇతర సభ్యులుపరోక్ష ఎన్నిక

AP Board 6th Class Social Solutions Chapter 9 ప్రభుత్వం

SCERT AP 6th Class Social Study Material Pdf 9th Lesson ప్రభుత్వం Textbook Questions and Answers.

AP State Syllabus 6th Class Social Solutions 9th Lesson ప్రభుత్వం

6th Class Social 9th Lesson ప్రభుత్వం Textbook Questions and Answers

Improve your learning (మీ అభ్యసనాన్ని మెరుగుపడుచుకోండి)

ప్రశ్న 1.
పార్లమెంటరీ మరియు అధ్యక్ష ప్రజాస్వామ్యాల మధ్య వ్యత్యాసాలను రాయండి.
జవాబు:
AP Board 6th Class Social Solutions Chapter 9 ప్రభుత్వం 1

ప్రశ్న 2.
ప్రభుత్వం అంటే ఏమిటి? వివిధ రకాల ప్రభుత్వాలు ఏవి?
జవాబు:
ఒక దేశాన్ని లేదా ఒక రాష్ట్రాన్ని నియంత్రిస్తూ, వాటికొరకు నిర్ణయాలను తీసుకునే ప్రజల సమూహాన్ని ప్రభుత్వం’ అంటారు. ప్రభుత్వాలు రెండు రకాలు, అవి

  1. రాచరిక ప్రభుత్వం
  2. ప్రజాస్వామ్య ప్రభుత్వం

ప్రశ్న 3.
నేడు ప్రభుత్వం నిర్వహిస్తున్న ఏవైనా నాలుగు కార్యకలాపాలను రాయండి.
జవాబు:

  • ప్రభుత్వం వివిధ కార్యక్రమాల ద్వారా పేదలకు అండగా ఉంటుంది.
  • అలాగే తపాలా సర్వీసులు నిర్వహించడం, రైల్వే వ్యవస్థ నిర్వహణ వంటి పనులను కూడా ప్రభుత్వం చూస్తుంది.
  • ఇతర దేశాలతో సత్సంబంధాలు ఏర్పరచుకొని, సరిహద్దులను రక్షిస్తుంది. ప్రజలందరికీ ఆహారాన్ని, ఆరోగ్యాన్ని అందిస్తుంది.
  • ఎపుడైనా ప్రకృతి విపత్తులు వచ్చినపుడు ముఖ్యంగా ప్రభుత్వం ప్రజలకవసరమైన సహాయం అందిస్తుంది.
  • ప్రజలకు న్యాయస్థానాల ద్వారా వివాద పరిష్కారం చేస్తుంది.

AP Board 6th Class Social Solutions Chapter 9 ప్రభుత్వం

ప్రశ్న 4.
నిర్ణయం తీసుకోవడంలో పాల్గొనే వారందరి అభిప్రాయాలను పరిగణించడం సాధ్యమేనా? కొన్ని ఉదాహరణలతో చర్చించండి.
జవాబు:
నిర్ణయం తీసుకోవడంలో పాల్గొనే వారందరి అభిప్రాయాలను పరిగణించడం చాలావరకు సాధ్యం కాకపోవచ్చు. కొన్ని ప్రత్యేక సందర్భాలలో మాత్రమే ఏకాభిప్రాయం కుదురుతుంది, అయితే ఇది అన్ని వేళల సాధ్యం కాదు. అందుకనే మెజారిటీ సభ్యుల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోవడం జరుగుతుంది.

ఉదాహరణకు మున్సిపల్ కౌన్సిల్ లోని (20) సభ్యులు పట్టణంలో ఏర్పాటు చేయదలచుకున్న పారిశుధ్య కార్మికుల కాంట్రాక్ట్ విషయంలో సభ్యులు తమ తమ అభిప్రాయాలు వెళ్ళబుచ్చారు. అనేకమైన అభిప్రాయాలు వచ్చాయి. మరి అందరి అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోలేరు, కనుక మెజారిటీ అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుంటారు.

ప్రశ్న 5.
విద్యార్థులు మరియు ఉపాధ్యాయులందరూ కలసి పాఠశాలను నడిపిస్తే ఎలా ఉంటుంది? పాఠశాలను నడపటానికి అందరూ భాగస్వాములు కావాలని మీరు అనుకుంటున్నారా? లేక ప్రతినిధులను ఎన్నుకొని వారితో నడపాలని కోరుకుంటున్నారా? కారణాలు తెలపండి.
జవాబు:

  • విద్యార్థులు, ఉపాధ్యాయులు కలిసి పాఠశాల నడిపిస్తే అది ప్రజాస్వామ్య బద్ధంగా ఉంటుంది.
  • పాఠశాల నడపడానికి ప్రతినిధులను ఎన్నుకొని వారితో నడపాలని కోరుకుంటున్నారు.
  • కారణాలు : అందరూ నిర్ణయాలు తీసుకుంటే ఎక్కువ సమయం వృథా అవుతుంది. అమలు చేసేవారుండరు. అభివృద్ధి సాధ్యం కాదు. కాబట్టి మేధావంతులై, అంకితభావం కలిగి, ఇతరుల మేలు కోరేవారిని ప్రతినిధులుగా ఎన్నుకుంటే పాఠశాల చక్కగా నడుస్తుంది.

ప్రశ్న 6.
మీ పాఠశాలలో నిర్ణయాలు ప్రజాస్వామ్యబద్దంగా జరుగుతున్నాయా? ప్రతి ఒక్కరూ వారి అభిప్రాయాలను తెలియజేస్తున్నారా?
జవాబు:
మా పాఠశాలలో నిర్ణయాలు ప్రజాస్వామ్యబద్దంగా జరుగుతున్నాయి. ప్రతి ఒక్కరం మా అభిప్రాయాలను తెలియజేస్తున్నాము. అయితే ఎక్కువమంది ఏ అభిప్రాయం వెళ్ళబుచ్చారో దానినే అమలు చేస్తున్నారు. అలాగే ప్రభుత్వ విధివిధానాలను అనుసరించి మా అభిప్రాయం పరిగణలోకి తీసుకుంటున్నారు.

ప్రశ్న 7.
సాత్విక్ తండ్రి ఒక దుకాణం ప్రారంభించడానికి కుటుంబ సభ్యుల అభిప్రాయాలను అడిగాడు. ప్రతి ఒక్కరు భిన్నమైన అభిప్రాయాలను తెలిపారు. కానీ చివరకు, అతను దుకాణాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నాడు. అతను ప్రజాస్వామ్యబద్ధంగా వ్యవహరించాడని మీరు అనుకుంటున్నారా?
జవాబు:

  • సాత్విక్ తండ్రి ప్రజాస్వామ్య బద్దంగానే వ్యవహరించాడని నేను అనుకుంటున్నాను.
  • ఎందుకంటే తను కుటుంబ సభ్యులందరి అభిప్రాయాలను అడిగాడు.
  • కుటుంబ సభ్యులందరికి దుకాణం యొక్క లాభనష్టాల గురించి పూర్తిగా తెలియకపోవచ్చు. ఈయనకు సరైన అవగాహన ఉంది కాబట్టి దుకాణం ప్రారంభించి ఉండవచ్చు.

ప్రశ్న 8.
పద్మ తల్లి, తన పిల్లలను ఆదివారం ఎక్కడికి వెళ్తాం అని అడిగింది. ఇద్దరు పిల్లలు సినిమాకు వెళ్తామని, ముగ్గురు పార్కుకు వెళ్లాని అన్నారు. మీరు పద్మ స్థానంలో ఉంటే ఏ నిర్ణయం తీసుకుంటారు? కారణాలు చెప్పండి.
జవాబు:

  • నేను పద్మని అయితే (ఆమె స్థానంలో ఉంటే) నేను పిల్లలను పార్కుకి తీసుకువెళ్ళే దానిని.
  • ఎందుకంటే ఎక్కువమంది (మెజారిటి) పిల్లలు పార్కుకి వెళ్తామని చెప్పారు కాబట్టి.

ప్రశ్న 9.
ప్రజాస్వా మ్యానికి పుట్టినిల్లు……….
ఎ) చైనా
బి) భారతదేశం
సి) గ్రీస్
డి) రోమ్
జవాబు:
సి) గ్రీస్

AP Board 6th Class Social Solutions Chapter 9 ప్రభుత్వం

ప్రశ్న 10.
ప్రత్యక్ష ప్రజాస్వామ్యంలో నిర్ణయాలు తీసుకునే హక్కు ఎవరికి ఉంటుంది?
ఎ) పురుషులు
బి) మహిళలు
సి) ప్రతినిధులు
డి) అర్హత కలిగిన ఓటర్లు
జవాబు:
డి) అర్హత కలిగిన ఓటర్లు

ప్రశ్న 11.
భారతదేశంలో…… సంవత్సరాలు నిండినవారు విశ్వజనీన వయోజన ఓటు హక్కుకు అర్హులు.
ఎ) 18 సం||
బి) 21 సం||
సి) 20 సం||
డి) 19 సం||
జవాబు:
ఎ) 18 సం||

ప్రశ్న 12.
భారతదేశంలో ప్రతి రాష్ట్ర మరియు కేంద్ర పాలిత ప్రాంతానికి రాజధాని నగరం ఉంటుంది. ఇది రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యస్థానం, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యస్థానాలు అయిన కింది రాష్ట్ర రాజధానులను దిగువ ఇచ్చిన భారతదేశ పటంలో గుర్తించండి.
AP Board 6th Class Social Solutions Chapter 9 ప్రభుత్వం 2
జవాబు:

  1. మహారాష్ట్ర – ముంబయి
  2. తమిళనాడు – చెన్నై
  3. ఆంధ్రప్రదేశ్ – అమరావతి
  4. కర్ణాటక – బెంగుళూరు
  5. పశ్చిమ బెంగాల్ – కొల్‌కతా
  6. తెలంగాణ – హైద్రాబాద్
  7. లడఖ్/జమ్మూకాశ్మీర్-లెహ్, శ్రీనగర్
  8. పంజాబ్ – చంఢీఘర్
  9. కేరళ – తిరువనంతపురం
  10. అరుణాచల్ ప్రదేశ్ – ఇటానగర్
  11. మధ్య ప్రదేశ్ – భోపాల్
  12. జార్ఖండ్ – రాంచి
  13. ఛత్తీస్ – రాయపూర్
  14. ఉత్తరాఖండ్ – డెహ్రాడూన్
  15. గుజరాత్ – గాంధీనగర్
  16. ఒడిశా – భువనేశ్వర్

AP Board 6th Class Social Solutions Chapter 9 ప్రభుత్వం 3

6th Class Social Studies 9th Lesson ప్రభుత్వం InText Questions and Answers

6th Class Social Textbook Page No.100

ప్రశ్న 1.
శాసన నిర్మాణశాఖ, కార్యనిర్వహక శాఖకు ఏ విధంగా భిన్నమైనది?
జవాబు:

  • శాసన నిర్మాణ శాఖ శాసనాలను (చట్టాలను) లేదా నిర్ణయాలను చేస్తుంది.
  • కార్యనిర్వాహక శాఖ శాసనాలను (చట్టాలను) లేదా నిర్ణయాలను అమలుపరుస్తుంది.
  • ఈ రెండు శాఖలకు వేటికవే అధికారాలు కల్గి ఉన్నాయి. ఒకదానిలో మరొకటి జోక్యం చేసుకునే అవకాశం లేదు. కాని శాసనశాఖ, కార్యనిర్వాహకశాఖను నియంత్రిస్తుంది.

ప్రశ్న 2.
న్యాయశాఖ యొక్క ప్రధాన విధి ఏమిటి?
జవాబు:
న్యాయశాఖ చట్టాలను వ్యాఖ్యానించడం, రాజ్యాంగ పరిరక్షణ చేయడం ప్రధాన విధిగా చెప్పవచ్చు.

6th Class Social Textbook Page No.101

ప్రశ్న 3.
దిగువ వార్తా పత్రికల శీర్షికలను పరిశీలించి, వాటి ఆధారంగా ప్రభుత్వ వివిధ కార్యకలాపాల జాబితాను రాయండి.
AP Board 6th Class Social Solutions Chapter 9 ప్రభుత్వం 4
జవాబు:
ప్రభుత్వ వివిధ కార్యకలాపాల జాబితా :

  • అందరికి ఉచిత నాణ్యమైన విద్యనందించడం.
  • మార్కెట్ ధరలను నియంత్రించడం (అదుపులో ఉంచడం).
  • అందరికి వైద్య సదుపాయాన్ని కల్పించడం (ఉచితంగా)
  • ప్రకృతి విపత్తులను సమర్ధవంతంగా ఎదుర్కొవడం. ఉదా : వరదలు, భూకంపాలు మొదలైన ప్రకృతి విపత్తులో సహాయమందించడం.
  • వివిధ శాఖాధిపతులను, నియమించటం మొదలైనవి.

6th Class Social Textbook Page No.102

ప్రశ్న 4.
AP Board 6th Class Social Solutions Chapter 9 ప్రభుత్వం 5
మీ ఉపాధ్యాయుని సహాయంతో, పై లోగోలు మరియు ప్రభుత్వ కార్యకలాపాల చిత్రాలను తెలుసుకోవడానికి ప్రయత్నించండి. కింది మైండ్ మ్యాప్ నింపండి.
జవాబు:
AP Board 6th Class Social Solutions Chapter 9 ప్రభుత్వం 6

ప్రశ్న 5.
ప్రభుత్వానికి సంబంధించిన మరికొన్ని పనులను రాయండి.
జవాబు:
ప్రభుత్వానికి సంబంధించిన పనులు :

  • రోడ్ల నిర్మాణం చేపట్టడం
  • రైల్వే, విమాన, నౌకాయానం చేపట్టడం
  • పాఠశాలలు, ఆసుపత్రులు, గ్రంథాలయాలు నిర్మించడం , తంతి, తపాల సౌకర్యాల ఏర్పాటు, నిర్వహణ
  • ఆనకట్టలు నిర్మించడం
  • దేశ రక్షణ (అంతర్గత, బహిర్గత)
  • శాంతి, భద్రతల పరిరక్షణ
  • ప్రజలందరికి న్యాయం అందించటం
  • పన్ను వసూలు చేయటం
  • అనేక రకాల సంక్షేమ పథకాలు చేపట్టడం
  • సమర్థవంతంగా పాలన చేయడం
  • అంతర్జాతీయంగా స్నేహ సంబంధాలు నెలకొల్పడం

AP Board 6th Class Social Solutions Chapter 9 ప్రభుత్వం

ప్రశ్న 6.
మీరు ప్రభుత్వం నుండి ఏ రకమైన సౌకర్యాలను ఆశిస్తున్నారు?
జవాబు:

  • ఉచిత గృహ వసతి
  • 24 గం||లు రక్షిత మంచినీటి సౌకర్యం
  • KG to PG ఉచిత విద్య,
  • పరిశుభ్రతకై పారిశుధ్య సౌకర్యం.
  • మెరుగైన, నాణ్యమైన వైద్య సదుపాయం
  • పర్యావరణ పరిరక్షణకై వన సంరక్షణ.
  • మా గ్రామం/పట్టణంలో నాణ్యమైన, మంచిరోడ్లు
  • అందరికి ఉద్యోగ, ఉపాధి కల్పించడం.

ప్రశ్న 7.
మీ ఉపాధ్యాయుని సహాయంతో ప్రస్తుత ప్రపంచంలో ఏ దేశాలలోనైనా రాచరికాలు అమలులో ఉన్నాయేమో తెలుసుకోవడానికి ప్రయత్నించండి.
జవాబు:
ప్రస్తుత ప్రపంచంలో పూర్తిస్థాయి రాచరికాలు లేకపోయినప్పటికీ, రాజరికం అనేది (రాజు రాణి అధ్యక్షులు ఉండటం) నామమాత్రంగా నైనా కొన్ని దేశాలలో కలదు. అవి :

  • యునైటెడ్ కింగ్ డమ్ (బ్రిటన్)
  • బ్రూనై
  • నెదర్లాండ్
  • రోమెనియా
  • జోర్డాన్
  • బెహ్రయిన్
  • మొరాకో
  • కాంబోడియా
  • UAE
  • మొనాకో
  • కువైట్
  • భూటాన్
  • టోంగా
  • వాటికన్ సిటీ
  • కత్తార్
  • బెల్జియం
  • సౌదీ అరేబియా
  • థాయ్ లాండ్
  • మలేసియా
  • జపాన్
  • ఓమన్ మొదలైనవి.

6th Class Social Textbook Page No.103

ప్రశ్న 8.
మీకు ఏ రకమైన ప్రభుత్వం ఇష్టం? ఎందుకు?
జవాబు:
నాకు ప్రజాస్వామ్య ప్రభుత్వం ఇష్టం. ఎందుకంటే ప్రజాస్వామ్య ప్రభుత్వం ప్రజలచే ఎన్నుకొనబడుతుంది. ప్రజల సంక్షేమం కొరకు కృషి చేస్తుంది.

ప్రశ్న 9.
ప్రజల అభిప్రాయాన్ని ఏ ప్రభుత్వం గౌరవిస్తుంది?
జవాబు:
ప్రజాస్వామ్య ప్రభుత్వం ప్రజల అభిప్రాయాన్ని గౌరవిస్తుంది.

ప్రశ్న 10.
కింది చిత్రాలను గమనించండి. ప్రభుత్వ పేరును సంబంధిత బాక్సులలో రాయండి.
జవాబు:
AP Board 6th Class Social Solutions Chapter 9 ప్రభుత్వం 7

6th Class Social Textbook Page No.104

ప్రశ్న 11.
రాచరికం మరియు ప్రజాస్వామ్యం మధ్య తేడాలు ఏమిటి?
జవాబు:

రాచరికంప్రజాస్వామ్యం
1. వంశపారంపర్యంగా నియమింపబడిన పాలకుడు ఉంటాడు.1. దేశంలోని ప్రజలచే ఎన్నుకోబడిన నాయకుడు ఉంటాడు.
2. రాజుకి అపరిమిత అధికారాలుంటాయి.2. ప్రభుత్వ అధికారానికి పరిమితులుంటాయి.
3. ఎన్నికలు ఉండవు, పారదర్శకత ఉండదు. పాలకులపై నియంత్రణ ఉండదు.3. పాలన, ఎన్నిక విధానం పారదర్శకంగా ఉంటుంది. నాయకులపై నియంత్రణ ఉంటుంది.
4. రాచరికంలో హక్కులు రాజు ఇష్టా ఇష్టాలపై ఆధారపడి ఉంటాయి.4. ప్రజలందరికి ప్రాథమిక హక్కులు ఉంటాయి. ఇవి రాజ్యాంగబద్దంగా అందరికీ ఇవ్వబడతాయి.
5. రాచరికంలో రాజు నియంత్రణలోనే (కనుసనల్లోనే) సమాచార, ప్రసార సాధనాలుంటాయి. ప్రభుత్వ పాలనను విమర్శిస్తే శిక్షార్హులే.5. సమాచార, ప్రసార సాధనాలు (వార్తా పత్రికలు, దూరదర్శన్, సినిమా) ప్రజాస్వామ్యానికి 4వ స్తంభంగా ఉండి, ప్రభుత్వాలను విమర్శిస్తూ, నియంత్రిస్తుంటాయి.
6. ఇది నిరంకుశ పాలన కావచ్చు, సమానత్వం కన్పించదు.6. ఇది ప్రజా పాలన, ప్రజా ప్రభుత్వంలో అందరూ సమానులే.

ప్రశ్న 12.
ప్రత్యక్ష ప్రజాస్వామ్యాన్ని అమలు చేయటం భారతదేశంలో సాధ్యమేనా? కారణాలు తెల్పండి.
జవాబు:

  • ప్రత్యక్ష ప్రజాస్వామ్యాన్ని అమలు చేయటం భారతదేశంలో సాధ్యం కాదు, కారణం
  • భారతదేశంలో అధికంగా దాదాపు (135 కోట్లు) జనాభా ఉండటం వల్ల సాధ్యం కాదు.

AP Board 6th Class Social Solutions Chapter 9 ప్రభుత్వం

ప్రశ్న 13.
ప్రత్యక్ష ప్రజాస్వామ్యం, పరోక్ష ప్రజాస్వామ్యానికి ఎలా భిన్నంగా ఉంటుంది?
జవాబు:
ప్రత్యక్ష ప్రజాస్వామ్యంలో, పౌరులు మాత్రమే చట్టాలు చేయగలరు. అన్ని మార్పులను పౌరులు ఆమోదించాలి. రాజకీయ నాయకులు పార్లమెంటరీ విధానం ప్రకారం పాలన మాత్రమే చేస్తారు. పరోక్ష ప్రజాస్వామ్యంలో ప్రజాప్రతినిధులు చట్టాలు చేస్తారు.

6th Class Social Textbook Page No.105

ప్రశ్న 14.
పై సందర్భంలో మెజారిటీ పాలనను మీరు ఎలా అర్ధం చేసుకున్నారు? మరొక ఉదాహరణ ఇవ్వండి.
జవాబు:
ప్రాతినిధ్య సూత్రంతోపాటు, ప్రజాస్వామ్యంలోని ప్రధాన సూత్రాలలో మెజారిటీ పాలన ఒకటి. ప్రాతినిధ్య ప్రజాస్వామ్యంలో సాధారణ మెజారిటీ (simple majority) ద్వారా కూడా ప్రతినిధులు ఎన్నికవుతారు. ఒక్కోసారి ఒక్క ఓటు ఎక్కువ రావడం వల్ల కూడా ఎన్నిక జరగవచ్చు. అటువంటప్పుడు వేరే అభ్యర్థికి ఓటువేసిన వారు కూడా ఈ నిర్ణయాన్ని ఒప్పుకోవలసిందే. ఆ విధంగా ఎన్నికైన ప్రజాప్రతినిధులు కూడా నిర్ణయాలు తీసుకునేటప్పుడు మెజారిటీ విధానాన్ని అమలు పరుస్తారు.

ఉదాహరణకు : ఒక మున్సిపల్ కౌన్సిల్ లో 45 మంది కౌన్సిలర్స్ ఉంటే 23 మంది ఒక ప్రతిపాదనను సమరిస్తే అది ఆమోదం పొందుతుంది. మిగతా 22 మంది అభిప్రాయాలకు విలువ ఉండదు. అలా ఆధునిక ప్రజాస్వామ్య ప్రభుత్వాలు మెజారిటీ నిర్ణయానికి కట్టుబడి పనిచేస్తున్నాయి.

ప్రశ్న 15.
మీ తల్లిదండ్రుల నుండి, ఎన్నికల వ్యవస్థలో వారు చూసే సమస్యలను తెలుసుకొని, ఒక నివేదికను తయారు చేయండి. మీ తరగతిలో వాటిని చర్చించండి. ఈ సమస్యలకు పరిష్కారాలను కనుగొనండి.
జవాబు:
విద్యార్థులు స్వయంగా చేయగలరు. క్రింది ఆధారాలను ఉపయోగించుకోండి.

ఎన్నికలలో ప్రజలు ధనవంతుల చిన్న చిన్న ప్రలోభాలకు లొంగిపోతున్నారు. కొన్ని సందర్భాలలో కులం, మతం కూడా ఎన్నికల సమయంలో ప్రజలమీద ఎక్కువ ప్రభావం చూపుతుంది. అంతేకాక భారతదేశం లాంటి పెద్ద దేశంలో ఎన్నికల ప్రక్రియ చాలా పెద్దది. రిగ్గింగ్, బూత్ క్యాప్చరింగ్ లాంటి అనేక సమస్యలు దీంట్లో ఉన్నాయి. ఓటు చేసే వారి శాతం చాలా తక్కువగా ఉండటం యింకా పెద్ద సమస్య. ఇవి లేకుండా ఉండాలంటే ప్రజలు వివేకవంతులై ధన, కుల ప్రలోభాలకు లొంగకుండా, ఓటు చేయాలి. సరియైన ప్రతినిధులను ఎన్నుకోవాలి.

6th Class Social Textbook Page No.106

ప్రశ్న 16.
కింద ఇవ్వబడిన ప్రపంచ పటాన్ని గమనించండి. పార్లమెంటరీ వ్యవస్థ మరియు అధ్యక్ష వ్యవస్థను విడిగా అనుసరిస్తున్న దేశాల జాబితా చేయండి. (మీ ఉపాధ్యాయుని సహాయంతో) ఈ పుస్తకం యొక్క వెనుక పేజీలలో ప్రపంచ పటాన్ని చూడండి.
AP Board 6th Class Social Solutions Chapter 9 ప్రభుత్వం 8
జవాబు:
AP Board 6th Class Social Solutions Chapter 9 ప్రభుత్వం 9

6th Class Social Textbook Page No.107

ప్రశ్న 17.
మీ ఉపాధ్యాయుని సహాయంతో కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వంలో ఎవరెవరు ఉంటారో తెలుసుకోవడానికి ప్రయత్నించండి.
జవాబు:
కేంద్ర ప్రభుత్వం :
ప్రధానమంత్రి, పార్లమెంటు సభ్యులు, రాష్ట్రపతి, కేంద్ర మంత్రులు, ఉద్యోగ బృందం

రాష్ట్ర ప్రభుత్వం :
ముఖ్యమంత్రి, శాసనసభ, శాసనమండలి) సభ్యులు, గవర్నర్, రాష్ట్రమంత్రులు, ఉద్యోగ బృందం

AP Board 6th Class Social Solutions Chapter 9 ప్రభుత్వం

ప్రశ్న 18.
వివిధ స్థాయిలలో ప్రభుత్వాలు ఎందుకు ఉన్నాయి?
జవాబు:
నేడు అన్ని దేశాలు (ఉదా: భారతదేశం) అత్యధిక జనాభాను కలిగి ఉన్నాయి. కాబట్టి దేశ వ్యాప్తంగా ప్రజల అవసరాలు మరియు సమస్యలను గుర్తించడం కష్టం. కాబట్టి వివిధ సమస్యలను పరిష్కరించటానికి, ప్రజాస్వామ్య వికేంద్రీకరణకు, పాలన వికేంద్రీకరణకుగాను ప్రభుత్వం వివిధ స్థాయిలలో పనిచేస్తుంది.

AP Board 6th Class Social Solutions Chapter 8 రాజ్యాలు మరియు సామ్రాజ్యాలు

SCERT AP 6th Class Social Study Material Pdf 8th Lesson రాజ్యాలు మరియు సామ్రాజ్యాలు Textbook Questions and Answers.

AP State Syllabus 6th Class Social Solutions 8th Lesson రాజ్యాలు మరియు సామ్రాజ్యాలు

6th Class Social 8th Lesson రాజ్యాలు మరియు సామ్రాజ్యాలు Textbook Questions and Answers

Improve your learning (మీ అభ్యసనాన్ని మెరుగుపడుచుకోండి)

ప్రశ్న 1.
కళింగ యుద్ధం తర్వాత అశోకుడు యుద్ధాలు చేయకూడదని నిర్ణయించుకున్నాడు. ఇలాంటి నిర్ణయాలు ప్రపంచ శాంతిని పెంపొందిస్తాయని అనుకుంటున్నావా? ఎలా?
జవాబు:
అవును. భావిస్తున్నాను. ఎందుకనగా ……..

  • ప్రజలకు మరియు ఇతర రాజులకు యుద్ధ భయం ఉండదు.
  • యుద్దాలు లేనపుడు ఆయుధాల కొరకు ఎక్కువ మొత్తంలో సంపదను వెచ్చించనవసరం లేదు.
  • యుద్ధ భయం లేకపోతే ప్రజలందరు మనశ్శాంతితో, ప్రశాంతంగా, సంతోషంగా జీవిస్తారు.
  • యుద్దాల అవసరం లేనపుడు రాజు తన దృష్టిని ప్రజా సంక్షేమం వైపు మళ్లించవచ్చు.

ప్రశ్న 2.
నేటికాలంలో అశోకధర్మం యొక్క ప్రాముఖ్యతను వివరింపుము. అశోకధర్మం యొక్క గొప్పతనాన్ని వర్ణింపుము.
జవాబు:
నేటి కాలంలో అశోకధర్మం యొక్క ప్రాముఖ్యత ఎంతైనా ఉంది.

అశోకధర్మం యొక్క ప్రధాన సూత్రాలు :

  • జంతువుల పట్ల దయ కలిగి ఉండాలి.
  • తల్లిదండ్రుల పట్ల విధేయత కలిగి ఉండాలి.
  • పేదల పట్ల సానుభూమి కలిగి ఉండాలి.
  • పెద్దలను గౌరవించవలెను.
  • ఇతర మతాలను విస్మరించరాదు.
  • మానవజాతి సంక్షేమానికి కృషి చేయాలి.
  • అశోకుని ధర్మం ప్రజలకు అనుకూలము ఆచరణీయము అయిన నైతిక సూత్రాలను కల్గి ఉంది.
  • ఉన్నతమైన జీవన విధానాన్ని అందించటమే అశోకుని ధమ్మ ఉద్దేశము.
  • ధర్మాపేక్ష, శ్రద్ధ, విధేయత, పాపభీతి, సామర్థ్యము లేకపోతే ఇహపరలోక సుఖాలను పొందలేరని బోధించాడు.
  • నేటి సమాజంలో వివిధ రూపాలలో జరుగుతున్న ‘హింసకు’ అశోకుని (అహింస) ధర్మము చక్కని పరిష్కారం.
  • అలాగే ‘పరమత సహనం’ అనే సూత్రం నేడు ఎంతో అవసరం. అనేక అల్లర్లకు, హింసకు, యుద్ధాలకు మత మౌఢ్యమే కారణం.
  • ఈ విధంగా అశోకుని క్క గొప్ప ధర్మం నేటికాలంలో ప్రాముఖ్యత కలిగి ఉంది.

AP Board 6th Class Social Solutions Chapter 8 రాజ్యాలు మరియు సామ్రాజ్యాలు

ప్రశ్న 3.
అశోకుని యొక్క ప్రజాపనులకు నేటికాలంలో ప్రజాప్రభుత్వాలు చేస్తున్న ప్రజా పనులకు పోలికలు మరియు భేదాలు తెలుపుము?
జవాబు:
అశోకుని యొక్క ప్రజాపనులకు నేటికాలంలో ప్రజాప్రభుత్వాలు చేస్తున్న ప్రజా పనులకు పోలికలు :

  • అశోకుడు, నేటి ప్రభుత్వాలు ప్రజాక్షేమమే తమ ప్రధాన ఆశయంగా భావించి వారి సంక్షేమము కొరకు అనేక చర్యలు చేపడుతున్నారు.
    నీరు, ఆహారం తమ ప్రజలందరికీ అందాలని అశోకుడు సంకల్పించాడు, నేటి ప్రభుత్వాలు కూడా సాగు, త్రాగు నీరు మరియు ఆహారం (రేషన్ షాపుల ద్వారా) ప్రజలందరికీ అందిస్తున్నాయి.
  • అశోకుడు దేశ వ్యాప్తముగా అనేక రహదారులను నిర్మించి, వాటి కిరువైపులా చెట్లు నాటించెను. నేటి ప్రభుత్వాలు కూడా దేశాభివృద్ధికై జాతీయ, రాష్ట్ర మొ||న రహదారులను నిర్మిస్తున్నాయి. అలాగే పర్యావరణ పరిరక్షణకు పెద్ద ఎత్తున చెట్లను (వన సంరక్షణ) నాటుట, సంరక్షించుట మొ||న చర్యలు చేపడుతున్నాయి.
  • అశోకుడు మానవులకే కాక జంతువుల కొరకై ప్రత్యేక వైద్య శాలలను నెలకొల్పను. నేటి ప్రభుత్వాలు కూడా దేశ ప్రజలకు నాణ్యమైన వైద్యాన్ని ఉచితంగా అందించే ఏర్పాట్లు చేసినాయి.

భేదాలు :

  • అశోకుని కాలంకంటే నేటి (ప్రభుత్వాల) కాలంలో శాస్త్ర, సాంకేతిక రంగాలు అభివృద్ధి చెందటం వలన ప్రజలకు ఎన్నో సౌకర్యాలు ప్రభుత్వం ప్రజలకు అందిస్తుంది. ఉదా : డిజిటల్ సేవలు, రవాణా రంగంలోని సేవలు (రైలు విమానం మొ||నవి.)
  • నేటి కాలంలో ప్రజా పనులు చాలా విస్తృతంగా, ఖర్చుతో కూడుకుని ఉన్నాయి.

ప్రశ్న 4.
అశోకుడు తన సైన్యాన్ని యుద్ధం కోసం కాకుండా ప్రజాసేవకు వినియోగించాడు. ప్రస్తుత కాలంలో భారత సైన్యం యుద్ధాలలోనే కాకుండా పాల్గొనే ఇతర సహాయ కార్యక్రమాలేవి?
జవాబు:
భారత సైన్యం చేపడుతున్న సహాయ కార్యక్రమాలు :

  • ప్రకృతి విలయాల సందర్భంలో, తుఫానులు, భూకంపాలు, వరదలు మొ||న ప్రకృతి భీభత్సాలలో సాధారణ పౌరులను ఆదుకోవటానికి సైన్యం ఎంతో సహాయం చేస్తుంది.
  • పర్వతలోయల్లో, కొండల్లో ఎవరైనా అపాయంలో ఉన్నా, ప్రమాదాలు జరిగిన సైన్యం వారికి సహాయం అందిస్తుంది.
  • NCC (National Cadet Corps) లాంటి వానిద్వారా విద్యార్థులలో దేశభక్తిని, సైనిక శిక్షణను అందిస్తుంది.
  • ‘ఆపరేషన్ సద్భావన’ కార్యక్రమం ద్వారా భరత సైన్యం పౌరులకు అనేక రకాలుగా సేవలు అందిస్తుంది.
  • అంతర్గత కలహాలు, బాంబు ప్రేలుళ్ళు, హైజాకింగ్ మొ||న సందర్భాలలో సైన్యం ఎంతో ముఖ్య పాత్ర పోషిస్తుంది.

ప్రశ్న 5.
గుప్తుల కాలంలో కళలు, సాహిత్యం మరియు వాస్తు నిర్మాణ రంగాలలో సాధించిన విజయాలేవి?
జవాబు:
గుప్తుల కాలంలో వివిధ రంగాలలో సాధించిన విజయాలు :
గుప్తుల కాలంలో సారస్వతం, గణితం, వైద్య శాస్త్రం మరియు ఖగోళశాస్త్రాలలో అనేక గొప్ప గ్రంథాలు రాయబడినవి. అనేక కొత్త విషయాలు ఆవిష్కరించబడినవి. అందులో చెప్పబడిన జ్ఞానాన్ని ప్రపంచంలో ప్రస్తుతం ఆధునిక పరిజ్ఞానం పేరుతో విస్తృతంగా ఉపయోగిస్తున్నారు. రెండవ చంద్రగుప్తుని కొలువులో తొమ్మిది మంది గొప్ప పండితులు కలరు. వీరినే ‘నవరత్నాలు’ అంటారు. నవరత్నాలలో కాళిదాసు ప్రసిద్ధ కవి.
AP Board 6th Class Social Solutions Chapter 8 రాజ్యాలు మరియు సామ్రాజ్యాలు 2

NAVARATNAS నవరత్నాలు
కాళిదాసుసంస్కృత కవి, రచయిత
అమరసింహుడునిఘంటుకర్త
శంకుభవన నిర్మాణ ఇంజనీరు
ధన్వంతరిఫిజీషియన్, ఆయుర్వేద వైద్యుడు
క్షేపకుడుజ్యోతిష్య శాస్త్రవేత్త
ఘటకర్షకుడుసంస్కృత కవి, రచయిత, కవి
భేతాళబట్టుమంత్రశాస్త్ర కోవిదుడు
వరరుచీగణిత శాస్త్రవేత్త మరియు భాషా కోవిదుడు
వరాహమిహురుడుఖగోళ శాస్త్రవేత్త

అద్భుతమైన రాతి గుహలకు గుప్తుల కాలం ప్రసిద్ధి. వారి కాలంలో పెయింటింగ్ కు, వాస్తుశిల్ప కళా నైపుణ్యానికి అజంతా, ఎల్లోరా గుహలు గొప్ప ఉదాహరణలు.

AP Board 6th Class Social Solutions Chapter 8 రాజ్యాలు మరియు సామ్రాజ్యాలు

ప్రశ్న 6.
భారతదేశంలో గుప్తుల కాలాన్ని “స్వర్ణయుగమని” ఎందుకు అంటారు?
జవాబు:
భారతదేశ చరిత్రలో గుప్తుల పాలనా కాలము ఒక మహోజ్వలమైన అధ్యాయము. శాస్త్ర విజ్ఞానం, జోతిష్య శాస్త్రం, గణితం మరియు సాహిత్య రంగాలలో గుప్తుల కాలంలో అనేక కొత్త విషయాలు కనుగొనుట జరిగినది. అందువలన గుప్తకాలాన్ని భారతదేశ చరిత్రలో స్వర్ణయుగం అంటారు.

సాహిత్యరంగంలో అభివృద్ధి :
గుప్తుల కాలంలో సారస్వతం, గణితం, వైద్యశాస్త్రం మరియు ఖగోళ శాస్త్రాలలో అనేక గొప్ప గ్రంథాలు రాయబడినవి. రెండవ చంద్రగుప్తుని కొలువులో తొమ్మిది మంది గొప్ప పండితులు కలరు. వీరినే నవరత్నాలు అంటారు. నవరత్నాలలో కాళిదాసు ప్రసిద్ధ కవి.

గణితశాస్త్రంలో ఆవిష్కరణలు :
ఆర్యభట్టు ప్రముఖ ఖగోళశాస్త్రవేత్త, గణితశాస్త్రవేత్త. బీజగణితాన్ని వీరి కాలంలో ఉపయోగించారు. భారతీయ శాస్త్రవేత్తలు ‘సున్న’ భావనను అభివృద్ధి చేశారు. ‘సున్న’ కు గుర్తును కూడా తయారు చేశారు. 1-9 సంఖ్యలకు గుర్తులను గుప్తుల కాలంలోనే కనుగొన్నారు. వీరు కనుగొన్న ‘ఆల్గారిథమ్స్’ను నేడు కంప్యూటర్ ప్రోగ్రామ్స్ లో ఉపయోగిస్తున్నారు. బ్రహ్మగుప్తుడు గుప్తుల కాలంలో ప్రముఖ ఖగోళ శాస్త్రవేత్త మరియు గణిత శాస్త్రవేత్త. ఇతను పౌర సంవత్సరాన్ని దాదాపు కచ్చితంగా లెక్కించగల్గినాడు.

వైద్యశాస్త్ర ప్రగతి :
చరకుడు, సుశ్రుతుడు గుప్తుల కాలంలో గొప్ప వైద్య పరిజ్ఞానం గల నిపుణులు. ప్లాస్టిక్ సర్జరీ, ‘ విరిగిన ఎముకలను సరిచేసి ఆపరేషన్ కూడా ఆనాటి వైద్యులు చేసినారు. వ్యాధి కంటే వ్యాధికి గల మూల కారణాన్ని నిర్మూలించాలని వైద్యులు భావించారు.

ఖగోళశాస్త్రంలో అన్వేషణలు :
ఖగోళశాస్త్రం మరియు శాస్త్ర విజ్ఞానాలలో భారతీయ శాస్త్రవేత్తలు అనేక విషయాలు కనుగొన్నారు. నక్షత్రాలు మరియు గ్రహాల కదలికలను గమనించారు. భూమి గుండ్రంగా ఉంటుందని మరియు సూర్యుని చుట్టూ తిరుగుతుందని తెలుసుకున్నారు. భూమికి సూర్యునికీ మధ్య చంద్రుడు అడ్డు వచ్చినప్పుడు గ్రహణాలు ఏర్పడతాయని వారు భావించేవారు. గురుత్వాకర్షణ శక్తి గురించి కూడా వీరికి తెలుసు.

భారతీయ శాస్త్రవేత్తలు ఎలాంటి ప్రయోగశాలలు మరియు ప్రయోగాలు లేకుండానే పై విషయాలన్నియు కనుగొన్నారు. పై విషయాలన్నింటికి కేవలం ఊహించుట ద్వారానే చెప్పగలిగారు. ఆధునిక శాస్త్రవేత్తల పరిశోధనలు ద్వారా పై విషయాలన్నీ ఖచ్చితమైనవని నిరూపించబడినవి.

కళలు, వాస్తు శిల్పకళ :
అద్భుతమైన రాతి గుహలకు గుప్తుల కాలం ప్రసిద్ధి. వారికాలంలో పెయింటింగ్లు, వాస్తుశిల్ప కళా నైపుణ్యానికి అజంతా, ఎల్లోరా గుహలు గొప్ప ఉదాహరణలు.

లోహ విజ్ఞానం :
గుప్తుల కాలంలో శాస్త్రవేత్తలు, లోహశాస్త్ర పరిజ్ఞానంలో నిపుణులు. ఇనుము మరియు ఉక్కుతో ఆయుధాలు తయారు చేసేవారు. ఆధునిక బంగారు నాణెలను పోలి ఉండే వాటిని కూడా వీరికాలంలో ముద్రించుట జరిగినది.

ప్రశ్న 7.
వైద్య మరియు లోహ విజ్ఞానశాస్త్ర రంగాలలో గుప్తుల కాలంలో సాధించిన విజయాలేవి?
జవాబు:
వైద్యశాస్త్రం :
చరకుడు మరియు సుశ్రుతుడు గుప్తుల కాలంలో గొప్ప వైద్య పరిజ్ఞానం గల నిపుణులు. గాయపడిన ముక్కులకు ప్లాస్టిక్ సర్జరీ చేసిన మొట్టమొదటి భారతీయ శస్త్రచికిత్స నిపుణుడు సుశ్రుతుడు. గుప్తుల కాలంలోని వైద్యులు విరిగిపోయిన ఎముకలను సరిచేసి ఆపరేషన్లు కూడా చేసేవారు. ఔషధంతో కూడిన మొక్కలను వ్యాధులను నయం చేయడంలో ఉపయోగించేవారు. వ్యాధి కంటే వ్యాధికి గల మూల కారణాన్ని నిర్మూలించాలని వైద్యులు భావించేవారు.

లోహ విజ్ఞాన శాస్త్రం :
గుప్తుల కాలంలో శాస్త్రవేత్తలు లోహశాస్త్ర పరిజ్ఞానంలో నిపుణులు. ఇనుము మరియు ఉక్కుతో ఆయుధాలు తయారు చేసేవారు. ఆధునిక బంగారు నాణేలను పోలి ఉండే వాటిని కూడా వీరి కాలంలో ముద్రించుట జరిగినది.

AP Board 6th Class Social Solutions Chapter 8 రాజ్యాలు మరియు సామ్రాజ్యాలు

ప్రశ్న 8.
పల్లవులు వాస్తు శిల్పకళకు చేసిన సేవను వివరింపుము.
జవాబు:
దక్షిణ భారతదేశంలోని వాస్తు శిల్పకళా నైపుణ్యానికి పల్లవ రాజులు ఎంతో సేవ చేశారు. వారి కాలంలో వాస్తు శిల్పకళ రాతిని తొలిచి నిర్మించే ఆలయాల నుంచి రాతితో నిర్మించే ఆలయాల స్థాయికి మారినది. తొలి పల్లవ రాజులలో మొదటి మహేంద్రవర్మ ప్రసిద్ధి చెందిన రాజు, అతడు గొప్ప వాస్తు శిల్పకళాభిమాని అతను ప్రవేశ పెట్టిన నూతన ద్రవిడ వాస్తు శిల్పకళను ‘మహేంద్రుని రీతి’ శిల్పకళ అంటారు. గుహాలయాల యొక్క ప్రభావం శిల్పకళపై ప్రస్ఫుటంగా కనిపిస్తుంది.

మొదటి నరసింహ వర్మ తదుపరి ముఖ్యమైన పల్లవరాజు. ఇతను మహేంద్రవర్మ యొక్క కుమారుడు. ఇతనిని ‘మహామల్లుడు’ అని కూడా పిలుస్తారు. మహాబలిపురం రేవు పట్టణాన్ని ఇతను మంచి వాస్తు శిల్పకళా నైపుణ్యంతో అందంగా నిర్మించాడు. ఇతని కాలంలో అభివృద్ధి చేయబడిన వాస్తుశిల్పకళ ‘మహామల్లుని వాస్తు శిల్పకళారీతి’గా ప్రసిద్ధి చెందినది. మహాబలిపురంలో అయిదు రథాలు నిర్మించారు. ఇవి పంచపాండవ రథాలుగా పేరొందాయి. ఒక్కో రథాన్ని ఒక్కో పెద్ద బండరాయిని తొలిచి నిర్మించారు. కావున వీటిని ‘ఏకశిలా రథాలు’ అంటారు.
AP Board 6th Class Social Solutions Chapter 8 రాజ్యాలు మరియు సామ్రాజ్యాలు 1

రెండవ నరసింహ వర్మ దేవాలయాలు నిర్మించుటపై ప్రత్యేక శ్రద్ధ కనపరిచారు. అతను ‘రాజసింహుడు’ అను పేరుతో కూడా ప్రసిద్ధి చెందాడు. అతని కాలంలో నూతన వాస్తుశిల్ప కళారీతి అభివృద్ధి చెందినది. దేవాలయాలు మెత్తని మట్టి, రాయితో నిర్మించుట జరిగినది. దీనిని ‘రాజసింహుని వాస్తు శిల్పకళారీతి’ అంటారు. కాంచీపురంలోని ప్రసిద్ధ కైలాసనాథ దేవాలయం రాజసింహుని వాస్తు శిల్పకళారీతికి చక్కటి ఉదాహరణ.

ప్రశ్న 9.
భారతదేశపటంలో క్రింది వానిని గుర్తింపుము.
1. పాటలీపుత్రం
2. ఉజ్జయిని
3. నర్మదానది
4. కాంచీపురం
5. మహాబలిపురం
6. ధాన్య కటకం
జవాబు:
AP Board 6th Class Social Solutions Chapter 8 రాజ్యాలు మరియు సామ్రాజ్యాలు 3

ప్రశ్న 10.
నేను ఎవరు? (కనుక్కోండి చూద్దాం)
అ. ‘నేను అశోకుని నాలుగు సింహాల గుర్తులో ఉన్నాను. నేను జాతీయ పతాకం మధ్యలో కూడా ఉన్నాను. నేను ఎవరిని?
జవాబు:
అశోక ధర్మ చక్రము.

ఆ. నేను గుప్తుల వంశానికి చెందిన రాజును. దేశంలో ఉన్న అందరి రాజులను ఓడించాను. నా పేరేమి?
జవాబు:
సముద్రగుప్తుడు.

ఇ. నేను శాతవాహనుల రాజధానిని, కృష్ణానది ఒడ్డున ఉన్నాను. నా ‘పేరేమి?
జవాబు:
ధాన్య కటకం.

ఈ. మహాబలిపురంలోని రాతిని తొలిచి నిర్మించిన గుహాలయాలను పూర్తి చేశాను. నేను మొదటి మహేంద్రవర్మ, కుమారుడిని నా పేరు ఏమిటి?
జవాబు:
మొదటి నరసింహ వర్మ

6th Class Social Studies 8th Lesson రాజ్యాలు మరియు సామ్రాజ్యాలు InText Questions and Answers

6th Class Social Textbook Page No.88

ప్రశ్న 1.
అశోకుడు కళింగ రాజ్యాన్ని ఎందుకు ఆక్రమించాలనుకున్నాడు?
జవాబు:
అశోకుడు మరింత విశాలమైన రాజ్యాన్ని స్థాపించాలని సంకల్పించాడు. అందుకోసం చాలా యుద్ధాలు చేశాడు. అందులో కళింగ యుద్ధము ప్రముఖమైనది. కళింగ రాజ్యం భారతదేశానికి తూర్పు తీరంలో గల స్వతంత్రమైన విశాలమైన రాజ్యం. మౌర్యవంశానికి చెందిన చంద్రగుప్త మౌర్యుడు కళింగ రాజ్యాన్ని జయించడానికి ప్రయత్నించి విఫలమవుతాడు. అందుకని అశోకుడు కళింగ రాజ్యాన్ని ఆక్రమించాలనుకున్నాడు.

AP Board 6th Class Social Solutions Chapter 8 రాజ్యాలు మరియు సామ్రాజ్యాలు

ప్రశ్న 2.
కళింగ యుద్ధంలో విజయం తర్వాత అశోకుడు ఎందుకు సంతోషంగా లేడు?
జవాబు:
అశోకుడు కళింగ రాజ్యంపై యుద్ధం ప్రకటిస్తాడు. ఈ కళింగ యుద్ధం అత్యంత భయంకరమైనది మరియు రక్తసిక్తమైనది. అశోక చక్రవర్తి కళింగ యుద్ధభూమిలోకి స్వయంగా నడచి వెళ్ళాడు. అనేకమంది గాయపడిన మరియు చనిపోయిన సైనికులను స్వయంగా చూస్తాడు. యుద్ధంలో గెలిచినప్పటికీ అశోకచక్రవర్తి ఏ మాత్రం సంతోషంగా లేడు. భవిష్యత్తులో అతని జీవితకాలంలో ఎలాంటి యుద్ధాలు చేయకూడదని గట్టిగా నిర్ణ యించుకుంటాడు. ధర్మాన్ని వ్యాప్తి చేయడమే నిజమైన విజయముగా భావిస్తాడు. తన శేష జీవితంలో అహింసకు ప్రాధాన్యత ఇస్తాడు. అహింసను ప్రబోధించే బౌద్ధమతం పట్ల ఆకర్షితుడవుతాడు.

6th Class Social Textbook Page No.89

ప్రశ్న 3.
ప్రస్తుత భారతదేశపటంలో అప్పటి కళింగ రాజ్య ప్రాంతాన్ని మీ ఉపాధ్యాయుని సహాయంతో గుర్తించుము.
జవాబు:
AP Board 6th Class Social Solutions Chapter 8 రాజ్యాలు మరియు సామ్రాజ్యాలు 4

ప్రశ్న 4.
కళింగ రాజ్యాన్ని ప్రస్తుత భారతదేశంలో ఏ పేరుతో పిలుస్తారు?
జవాబు:
ఒడిషాగా పిలుస్తున్నారు.

6th Class Social Textbook Page No.90

ప్రశ్న 5.
అశోకుని శిలాశాసనాలు నిరక్షరాస్యులు కూడా అర్థం చేసుకోగలుగుతున్నారు. ఇది ఎలా సాధ్యమని నీవు అనుకుంటున్నావు?
జవాబు:
అశోకుని శిలాశాసనాలు నిరక్షరాస్యులు కూడా ఎలా అర్థం చేసుకోగలిగినారంటే :

  • ‘అశోకుడు’ ధర్మమహామాత్రులు’ అనే అధికారులను నియమించాడు. వారు రాజ్యంలోని వివిధ ప్రాంతాలకు వెళ్ళి ప్రజలకు ధర్మప్రచారం చేసేవారు.
  • అశోకుడు తన సందేశాలను శాసనాల రూపంలో రాళ్లపైన, స్తంభాలపైన చెక్కించాడు.
  • చదువు రానివారికి వాటి పైనున్న సందేశాలను చదివి వినిపించాలని అధికారులను ఆదేశించాడు.
  • అశోకుడు తన ధర్మాన్ని సుదూర ప్రదేశాలైన సిరియా, ఈజిప్టు, గ్రీస్, శ్రీలంకలకు వ్యాప్తి చేయటానికి రాయబారులను పంపించాడు.

AP Board 6th Class Social Solutions Chapter 8 రాజ్యాలు మరియు సామ్రాజ్యాలు

ప్రశ్న 6.
ప్రస్తుత రోజులలో ప్రభుత్వం యొక్క సందేశం ప్రజలకు ఎలా చేరుతున్నది?
జవాబు:
ప్రస్తుత రోజులలో ప్రభుత్వం యొక్క సందేశం ప్రజలకు ఎలా చేరుతుందంటే :

  • పత్రికల ద్వారా
  • దూరదర్శన్ (టి.వి.) ద్వారా
  • సోషల్ మీడియా ద్వారా
  • ప్రభుత్వ శాఖల ప్రకటనల ద్వారా
  • ప్రజాప్రతినిధులు, అధికారులు, సామాజిక కార్యకర్తల ద్వారా
  • వివిధ గ్రంథాలు,
  • ప్రముఖుల ఉపన్యాసాల ద్వారా

ప్రశ్న 7.
మౌర్య చక్రవర్తుల కాలక్రమ చార్టును తయారు చేయండి.
జవాబు:
విద్యార్థులు స్వయంగా చేయగలరు, ఉదాహరణకు
AP Board 6th Class Social Solutions Chapter 8 రాజ్యాలు మరియు సామ్రాజ్యాలు 5

ప్రశ్న 8.
అశోక చక్రవర్తి యొక్క వ్యక్తిత్వాన్ని తరగతిగదిలో చర్చించుము.
జవాబు:
మౌర్యులలో ప్రసిద్ధి చెందిన పాలకుడు అశోకుడు. అనేక శాసనాలను వ్రాయించాడు. ఆనాటి పరిస్థితులను నేటికి తెలిసేలా చేశాడు. ప్రపంచ చలత్రలో యుద్ధంలో విజయాన్ని పొంది, యుద్ధాలకు స్వస్తి పలికిన ఒకే ఒక రాజు అశోకుడు. కళింగ యుద్ధం తరువాత ధర్మ ప్రచారం చేశాడు. అంతేకాక రోడ్లను నిర్మించాడు. బావులను త్రవ్వించాడు. సత్రాలను కట్టించాడు. మనుష్యులకే కాక జంతువులకు కూడా వైద్యాలయాలను కట్టించాడు. ఈ కారణాల వలన అశోకుడు విశిష్ట పాలకుడని నేననుకుంటున్నాను.

ప్రశ్న 9.
జాతీయ చిహ్నం యొక్క ప్రాధాన్యతను తరగతి గదిలో చర్చించుము.
జవాబు:
సారనాథ్ లోని అశోకుని శిలా స్తంభంలోని నాలుగు సింహాల గుర్తును భారత ప్రభుత్వం అధికార జాతీయ, చిహ్నంగా స్వీకరించింది.
AP Board 6th Class Social Solutions Chapter 8 రాజ్యాలు మరియు సామ్రాజ్యాలు 6

జాతీయ చిహ్నం అనేది ఒక దేశం యొక్క అధికారిక చిహ్నం. ఇది ఒక దేశం యొక్క సార్వభౌమాధికారాన్ని తెలియజేస్తుంది. 1950 జనవరి 26 నుంచి దీనిని అధికారికంగా జాతీయచిహ్నంగా గుర్తించారు. ఇందులో మూడు సింహాలు పైకి కనపడతాయి. నాల్గవసింహం మాత్రం అదృశ్యంగా దాగి ఉంటుంది. మూడు సింహాలు అధికారం, ధైర్యము మరియు ఆత్మవిశ్వాసం అనే మూడు లక్షణాలకు ప్రతీకలు నాల్గవ సింహం భారతజాతి యొక్క గౌరవానికి ప్రతీక. ఎబాకు మధ్యలో చక్రం ఉంటుంది. అందులో కుడివైపున ఎద్దు మరియు ఎడమవైపున గెంతుతూ ఉన్న గుర్రం ఉంటుంది. ఎద్దు కష్టపడే మనస్తత్వాన్ని తెలియజేస్తుంది. అశ్వము వేగాన్ని మరియు శక్తిని తెలియజేస్తుంది. ఎబాక్కు దిగువవైపున ‘సత్యం జయిస్తుంది’ అని లిఖించబడి ఉంటుంది. ఇది మండూకోపనిషత్ నుంచి గ్రహింపబడింది.

6th Class Social Textbook Page No.91

ప్రశ్న 10.
రవాణా మరియు వాణిజ్యాల మధ్య సంబంధం ఉందని మీరు భావిస్తున్నారా? నీ సమాధానాన్ని సమర్థింపుము.
జవాబు:
రవాణా మరియు వాణిజ్యాల మధ్య సంబంధం ఖచ్చితంగా ఉందని నేను భావిస్తున్నాను.

  • వ్యాపారులకు, చేతి వృత్తుల వారికి రవాణా మార్గాలు చాలా ముఖ్యమైనవి. ఈ రవాణా మార్గాలు పెద్ద పట్టణాలను, ఓడరేవులను మరియు ఇతర దేశాలను కలుపుతాయి.
  • అభివృద్ధి చెందిన రవాణా మార్గాల వల్లనే (విదేశీ) వాణిజ్యం అభివృద్ధి చెందుతుంది.
  • రవాణా సౌకర్యాలు ఎంత ఎక్కువగా అందుబాటులో ఉంటే వ్యవసాయ, వివిధ పరిశ్రమల ఉత్పత్తులను అంత ఎక్కువగా ప్రజలకు చేరువ చేయవచ్చు (వాణిజ్యం ద్వారా) ఉదా : విదేశాలలో తయారైన ఎలక్ట్రానిక్స్ మొబైల్ ఫోన్లు స్థానిక మార్కెట్లో లభ్యమవ్వడం.

6th Class Social Textbook Page No.92

ప్రశ్న 11.
AP Board 6th Class Social Solutions Chapter 8 రాజ్యాలు మరియు సామ్రాజ్యాలు 7
పై భారతదేశ పటంలో గుప్త సామ్రాజ్యంలోని నాలుగు ముఖ్యమైన నగరాల పేర్లను రాయుము.
జవాబు:

  1. పాటలీపుత్ర
  2. ఉజ్జయిని
  3. సాంచి
  4. బరుకచ్చా

6th Class Social Textbook Page No.93

ప్రశ్న 12.
సముద్రగుప్తుడు గొప్ప విజేత అని నీవు భావిస్తున్నావా? సమాధానాన్ని సమర్ధింపుము.
జవాబు:
సముద్రగుప్తుడు గొప్ప విజేత అని నేను భావిస్తున్నాను.

  • మొదటి చంద్ర గుప్తుని తర్వాత సముద్రగుప్తుడు రాజైనాడు.
  • ఇతని కాలంలో సామ్రాజ్యము ఉత్తర భారతదేశం అంతటా విస్తరించినది. సముద్రగుప్తుడు అపజయమే ఎరుగనటువంటి గొప్ప విజేత.
  • ఇతని తర్వాత రెండవ చంద్రగుప్తుడు పరిపాలకుడయ్యాడు. పశ్చిమ భారతదేశంలోని శకరాజులను కూడా ఇతను జయించగలిగినాడు.
  • సముద్రగుప్తుడు ఉత్తర భారతదేశంలోని తొమ్మిది మంది ప్రముఖ రాజులను ఓడించి వారి రాజ్యాలను తమ రాజ్యంలో కలుపుకున్నాడు.
  • దక్షిణాదిన 12 మంది రాజులను ఓడించి తన ఆధీనంలోకి తెచ్చుకున్నాడు.
  • తమిళనాడులోని కంచి వరకు తన జైత్రయాత్రను కొనసాగించాడు.

6th Class Social Textbook Page No.95

ప్రశ్న 13.
శాతవాహనులలో గౌతమీపుత్ర శాతకర్ణి గొప్పవాడని ఎట్లు చెప్పగలవు ? అలా అయితే ఎందువలన?
జవాబు:

  • శాతవాహన రాజులలో ముఖ్యమైన రాజులు గౌతమీపుత్ర శాతకర్ణి, వాశిష్ట పుత్ర పులోమాని మరియు యజ్ఞశ్రీ శాతకర్ణి. శాతవాహనులు 300 సంవత్సరాలు పరిపాలించారు.
  • గౌతమీపుత్ర శాతకర్ణి శాతవాహన రాజులందరిలో గొప్పవాడు.
  • అతను శకులను, యవ్వనులను, పహ్లావులను ఓడించాడు.
  • దక్షిణ భారతదేశంలో మూడు సముద్రాల మధ్య ప్రాంతాన్ని జయించాడు.
  • అందువలన అతనికి త్రిసముద్రాధీశ్వర’ అనే బిరుదు వచ్చింది.

AP Board 6th Class Social Solutions Chapter 8 రాజ్యాలు మరియు సామ్రాజ్యాలు

6th Class Social Textbook Page No.96

ప్రశ్న 14.
ఇక్ష్వాకులు అన్ని తెగల వారిని ఏకం చేయగలిగారు. నీవు దీనిని అంగీకరిస్తావా లేదా విభేదిస్తావా ? అవును అయితే వారు ఏయే పద్ధతులను ఉపయోగించారు?
జవాబు:
ఇక్ష్వాకులు అన్ని తెగల వారిని ఏకం చేయగలిగారు, నేను దీనికి అంగీకరిస్తున్నాను. ఏ పద్దతులు ఉపయోగించారు అంటే,

  • ఇతర తెగల వారితో వివాహ సంబంధాలు ఏర్పాటు చేసుకొనుట ద్వారా
  • యజ్ఞ, యాగాదులు (అశ్వమేథ యాగం మొ||) చేయటం ద్వారా
  • రామాయణంలోని శ్రీరాముని వారసులుగా చెప్పుకొనుట ద్వారా

AP Board 6th Class Social Solutions Chapter 7 సామ్రాజ్యాలు, గణతంత్రాల ఆవిర్భావం

SCERT AP 6th Class Social Study Material Pdf 7th Lesson సామ్రాజ్యాలు, గణతంత్రాల ఆవిర్భావం Textbook Questions and Answers.

AP State Syllabus 6th Class Social Solutions 7th Lesson సామ్రాజ్యాలు, గణతంత్రాల ఆవిర్భావం

6th Class Social 7th Lesson సామ్రాజ్యాలు, గణతంత్రాల ఆవిర్భావం Textbook Questions and Answers

Improve your learning (మీ అభ్యసనాన్ని మెరుగుపడుచుకోండి)

ప్రశ్న 1.
గణ అంటే ఏమిటి? రాజులు పాలించిన రాజ్యాలకు వీటికి తేడాలు ఏమిటి?
జవాబు:
గిరిజన సమూహాలు పాలించిన ప్రాంతాన్ని ‘గణ’ అంటారు. సాధారణంగా గణ పరిపాలనా కొంతమంది సభ్యుల చేతిలో ఉంటుంది. ప్రతి ఒక్కరూ తమను ‘రాజ’ అని పిలుచుకునేవారు. ఉదా : వజ్జి
రాజ్యాలను రాజులు పరిపాలించేవారు. రాజువంశ పారంపర్యంగా వచ్చేవాడు. దీనినే రాజరికం అంటారు. పరిపాలనకు రాజు సర్వాధికారి. రాజుకి స్వంత సైన్యం ఉంటుంది. వీరు రాజు ఆజ్ఞలను పాటిస్తారు.

ప్రశ్న 2.
మహా జనపదాలలో రాజులు కోటలు ఎందుకు నిర్మించారు.?
జవాబు:
మహా జనపదాలలో రాజులు పెద్ద పెద్ద కోటలు నిర్మించారు. ఎందుకంటే :

  • శత్రు రాజ్యాల దాడుల నుండి తమ రాజ్యాన్ని కాపాడుకోటానికి
  • తమ సంపదను, అధికారాన్ని ప్రదర్శించడానికి
  • తమ ఖజానాను, (ధాన్యాగారాలను) రక్షించుకోవడానికి
  • తమ ప్రాంతమంతా సులభంగా, అందుబాటులో ఉండేందుకు.

ప్రశ్న 3.
నాటి మహాజన పదాల కాలంలో గ్రామ నిర్వహణకు, నేటి గ్రామాల నిర్వహణకు మధ్యగల తేడాలను తెలపండి.
జవాబు:
నాడు, నేడు కూడా గ్రామాల నిర్వహణ ఎన్నికైన వారిచే నిర్వహించబడింది, నిర్వహించబడుతోంది. అయితే ఆనాడు గ్రామానికి అధికారి రాజు. నేడు సర్పంచ్. నేడు గ్రామాలకు కావలసిన అవసరాలైన త్రాగునీరు, వీధిలైట్లు, లైబ్రరీ మొదలైన సౌకర్యాలు కలుగచేస్తారు. ఇంటి పన్ను మొదలైనవి వసూళ్ళు చేస్తారు. గ్రామానికి కావలసిన వసతుల కోసం పైస్థాయి వారితో మాట్లాడుతారు. కానీ నాటి గ్రామాల యొక్క నిర్వహణ, వీటితో పాటుగా గ్రామరక్షణ కూడా వారే చేసేవారు. గ్రామాధికారి పొలంలో సంవత్సరానికి ఒక రోజు గ్రామస్తులు ఉచితంగా పనిచేసేవారు. పన్నును ధన, వస్తు, జంతు రూపంలో కట్టేవారు. చివరగా చెప్పాలంటే నేటి నిర్వహణ ప్రజాస్వామికం, నాటి నిర్వహణ రాచరికం.

AP Board 6th Class Social Solutions Chapter 7 సామ్రాజ్యాలు, గణతంత్రాల ఆవిర్భావం

ప్రశ్న 4.
ప్రస్తుతం ప్రభుత్వం వృత్తి పనులవారి మీద ఏవిధంగా పన్నులు వేస్తుంది? మహాజనపదాలలోని పన్నుల విధానం, ఇదీ ఒకటేనా?
జవాబు:
ప్రస్తుతం ప్రభుత్వం స్వంతగా చేతివృత్తులవారి మీద ఎటువంటి పన్నులు వేయడం లేదు. కొన్ని కొన్ని వృత్తులు చేసేటువంటి (ఉదా : ఉపాధ్యాయులు, ప్రభుత్వోద్యోగులు) వారి మీద వృత్తి పన్ను ప్రతినెలా కొద్దిమొత్తం వారి జీతం నుండి మినహాయిస్తుంది. మహాజనపదాలలోని పన్నుల విధానం, ఇదీ వేరు వేరు.

ప్రశ్న 5.
ఏ ఆధారాల సహాయంతో నీవు మహాజనపదాల గురించి తెలుసుకున్నావు?
జవాబు:

  • మహాజనపదాల గ్రామాలు, పట్టణాల గురించి రెండు రకాల ఆధారాల ద్వారా తెలుసుకోవచ్చు.
  • ఒకటి ఇక్కడ జరిగిన పురావస్తు తవ్వకాల ద్వారా, మరొకటి ఆ కాలంలో రాసిన పుస్తకాల ద్వారా గంగా లోయలో వందలాది ప్రాంతాలలో పురాతత్వ శాస్త్రవేత్తలు తవ్వకాలు జరిపి ప్రజల జీవన విధానాన్ని తెలుసుకోవటానికి ప్రయత్నించారు.
  • హస్తినాపుర (నేటి ఢిల్లీ), అత్రంజీ ఖేరా, కోశాంబి (అలహాబాద్ దగ్గర), పాటలీపుత్ర మొదలైనవి ముఖ్యమైన పురాతత్వ అన్వేషణ జరిగిన ప్రాంతాలు.
  • ఈ కాలానికి చెందిన పుస్తకాలు చాలా వరకూ మత సంబంధమైనవి. అవి మత సంబంధమైనవి అయినప్పటికీ ‘ కూడా అవి నాటి పట్టణాలు, గ్రామాలు, పాలకులు మరియు రాజుల గురించి తెలియపరిచాయి.
  • కొన్ని పుస్తకాలు సుదూర ప్రాంతాలయిన గ్రీకు వారిచే కూడా రాయబడ్డాయి.
  • ఉపనిషత్తులు, ధర్మ సూత్రాలు, దిగానికాయ, మధ్యమనికాయ, హెరిడోటస్ చరిత్ర మొదలైనవి ఈ కాలంలో రాయబడిన కొన్ని ముఖ్య గ్రంథాలు.

ప్రశ్న 6.
మహాజన పదాల కాలంలో వ్యవసాయ ఉత్పత్తి పెరుగుదలకు తోడ్పడిన వ్యవసాయ విధానాల గురించి రాయండి.
జవాబు:
మహాజన పదాల కాలంలో వ్యవసాయ ఉత్పత్తి పెరుగుదలకు తోడ్పడిన వ్యవసాయ విధానాలు :

  • ఇనుప నాగలిని వినియోగించటం.
  • వరి నారు పోసే పద్ధతిని ప్రారంభించటం.
  • అభివృద్ధి చెందిన సాగునీటి సౌకర్యాలు మొ||నవి.

AP Board 6th Class Social Solutions Chapter 7 సామ్రాజ్యాలు, గణతంత్రాల ఆవిర్భావం

ప్రశ్న 7.
“మహాజనపదాలు పది తరాలలో అభివృద్ధి చెందాయి.” ఈ వ్యాఖ్యలతో నీవు ఏకీభవిస్తావా? నీ జవాబును సమర్థించుము.
జవాబు:
మహాజనపదాలు పదితరాలలో అభివృద్ధి చెందాయనే వ్యాఖ్యతో నేను ఏకీభవిస్తాను.

హిమాలయాలకు మరియు దక్కన్ పీఠభూమికి మధ్య గంగ, యమున నదులు ప్రవహిస్తున్నాయి. దీనిని గంగా నదీ లోయ అంటారు. ఈ మైదానంలో చాలా ఎక్కువ వర్షపాతం నమోదవుతుంది. ఇది అత్యంత సారవంతమైనది. హిమాలయాల నుండి ఒండ్రు మట్టిని తెచ్చే ఈ నదులు ఏడాది పొడవునా ప్రవహిస్తాయి. ప్రారంభంలో వివిధ తెగల ప్రజలు తమకు అనుకూలమైన ప్రాంతాల్లో వ్యవసాయం చేయుటకు ఈ ప్రాంతంలో స్థిర నివాసం ఏర్పరచుకున్నారు. ఈ తెగలలో ముఖ్యమైనవి శాక్య, లిచ్ఛవీ, మల్ల, వైదేహి మొదలైన తెగలు. ఈ తెగలనే సంస్కృతంలో ‘జన’ అని, వారు స్థిరపడిన ప్రాంతాన్ని ‘జనపదం’ అని పిలుస్తారు.

ఈ నదుల వెంట ప్రజలు 2700 సంవత్సరాలలో పెద్ద సంఖ్యలో స్థిరపడటం ప్రారంభించారు. వారు ఇనుప ఉపకరణాల సహాయంతో అడవులను నరికి వేసి, భూమిని వ్యవసాయానికి అనుకూలంగా మార్చుకుని వరి మరియు ఇతర పంటలు పండించారు. అనేక పెద్ద గ్రామాలు మరియు పట్టణాలూ ఈ ప్రాంతాలలో అభివృద్ధి చెందాయి. బహుశా ఆ ప్రాంతాలలో వేర్వేరు తెగలకు చెందిన చాలామంది వ్యక్తులు స్థిర నివాసం ఏర్పరచుకొని ఉండవచ్చు. గంగా మైదానంలో ఇనుము యొక్క విస్తృతమైన ఉపయోగం పెద్ద ప్రాదేశిక ప్రాంతాలు ఏర్పడటానికి పరిస్థితులను సృష్టించింది. అటువంటి గ్రామాలు మరియు పట్టణాల యొక్క పెద్ద సమూహాలను “మహాజనపదాలు” లేదా ‘పెద్ద జనపదాలు’ పిలిచేవారు. మహాజనపదాలలో చాలా వరకు రాజధాని నగరం కలిగి ఉండి రక్షణ పరంగా పటిష్టంగా ఉండేవి.

ప్రశ్న 8.
జనపదాల కాలం నాటి వృత్తి పనివారి పనితనాన్ని నీవెలా ప్రశంసిస్తావు?
జవాబు:
చాలా గ్రామాలలో నైపుణ్యం గల వృత్తి పనివారు ఉండేవారు. కమ్మర్లు, వ్యవసాయానికి పనికి వచ్చే పనిముట్లు (నాగలి కర్రలు, గొడ్డళ్ళు, బాణాలు మొదలైనవి)ను, వంటకు ఉపయోగపడే కుండలు, ధాన్యం నిలవ ఉంచే పాత్రలను కుమ్మరి , బండ్లు, నాగళ్ళు, ఇతర గృహ సామగ్రిని వడ్రంగులు, దుస్తులను నేతపనివారు తయారు చేసేవారు.
AP Board 6th Class Social Solutions Chapter 7 సామ్రాజ్యాలు, గణతంత్రాల ఆవిర్భావం 1

మహాజనపదం కాలంలో వృత్తి కార్మికులు నాటి కుమ్మరులు మట్టి కుండలను తయారు చేశారు. వీటిలో కొన్ని బూడిద రంగులో, మరికొన్ని ఎరుపు రంగులో ఉన్నాయి. ఒక రకమైన ప్రత్యేకమైన కుండలు ఈ ప్రాంతంలో కనుగొనబడ్డాయి. వీటిని “పెయింటెడ్ గ్రేవేర్” అని పిలుస్తారు. ఆ బూడిద రంగు కుండలపై చిన్న చిన్న గీతలు, రేఖా గణిత నమూనాలు చిత్రించబడి ఉన్నాయి.

ప్రశ్న 9.
మహా జనపదాల కాలంలో పరిపాలకులచే వసూలు చేయబడిన పన్నులేవి?
జవాబు:

  • వ్యవసాయం చేసే గృహపతుల నుంచి రాజులు పన్నులు వసూలు చేసేవారు. వారు తమ పంటను ఆరు భాగాలుగా చేసి ఒక భాగాన్ని రాజుకు ఇచ్చేవారు. దీనిని ‘భాగ’ అని పిలిచేవారు.
  • ప్రతీనెల ఒక రోజు ఉచితంగా పనిచేయడం ద్వారా వృత్తి పనివారు రాజుకు పన్నులు చెల్లించేవారు. పశువులు, గొర్రెల మందలు కాసేవారు జంతువులను లేదా జంతు ఉత్పత్తులను పన్నుగా రాజుకి చెల్లించేవారు.
  • వ్యాపారస్థులు కూడా వాళ్ళు అమ్మిన వస్తువులపై పన్ను చెల్లించేవారు.
  • వేటాడేవారు, సేకరణ చేసేవారు కూడా అటవీ ఉత్పత్తులైన తోళ్ళు కలప వంటివి ఇచ్చేవారు.
  • ఈ రకంగా రాజుకు పన్నుల రూపంలో వివిధ రకాల వస్తువులు లభించేవి.
  • ఈ కాలంలోనే నాణేలను ఉపయోగించడం ప్రారంభమైంది. కొన్ని రకాల పన్నులు నాణేల రూపంలో చెల్లించేవారు.

AP Board 6th Class Social Solutions Chapter 7 సామ్రాజ్యాలు, గణతంత్రాల ఆవిర్భావం

ప్రశ్న 10.
మహా జనపదాల కాలంలో పాలకుల ఎన్నిక, ప్రస్తుత రోజులలో ఎన్నికల విధానం కన్నా ఏ విధంగా భిన్నమైనది?
జవాబు:
మహా జనపదాల కాలంలో పాలకులు (రాజులు) ఒక కుటుంబ వంశపారంపర్యంగా చాలాకాలంపాటు పాలించేవారు. అంటె ఎక్కువ జనపదాలలో రాచరికం అమల్లో ఉంది. కొన్ని గణ రాజ్యాలలో మాత్రమే ఒకే పరిపాలకుడు కాక, ఒక పరిపాలకుల బృందం ఉండేది. కొన్ని సందర్భాలలో వేలమంది కలసి పాలన చేసేవారు.

ప్రస్తుత రోజులలో పాలకుల ఎన్నిక విధానం ప్రజాస్వామ్యయుతంగా, పారదర్శకంగా జరుగుతుంది. అంటే వయోజనులైన (18 సం||లు పైబడినవారు) వారు తమ ఓటుహక్కు ద్వారా పాలకులను ఎన్నుకుంటున్నారు.

ప్రశ్న 11.
ప్రస్తుత కాలంలో పంటలు పండించే విధానాలు మహాజనపదాల కాలంలో విధానాలతో ఏ విధంగా సరిపోతాయి?
జవాబు:

  • ప్రస్తుతం, మహాజనపదాల కాలంలో ఇనప నాగలి వినియోగించడం జరిగింది.
  • ప్రస్తుతం, మహాజనపదాల కాలంలో వరి నారు పోసే పద్దతి. ఒకే విధంగా ఉంది.
  • ప్రస్తుతం, మహాజనపదాల కాలంలో సాగునీటి సౌకర్యాల కల్పన ఒకేలా ఉంది.
  • ప్రస్తుతం, మహాజనపదాల కాలంలో పాలకులు వ్యవసాయాభివృద్ధికి కావాల్సిన సౌకర్యాలు కల్పించడం జరుగుతుంది.

ప్రశ్న 12.
మగధ బలమైన రాజ్యంగా ఆవిర్భవించడానికి తోడ్పడిన సహజ వనరుల పాత్రను ప్రశంసించుము.
జవాబు:
మగధ రాజ్యం గంగానదికి ఇరువైపులా విస్తరించి ఉందని మీరు గమనించి ఉంటారు. నదులు, భూములను సారవంతం చేస్తాయి. గృహపతులు తమ భూములను సులభంగా సాగు చేసుకొనేవారు. నదుల మీద సరకు రవాణా చేసేవారు. సైనికులను తరిలించేవారు. మగధలోని కొంత ప్రాంతంలో అడవులున్నాయి. ఈ అడవుల నుంచి ఏనుగులను పట్టుకొని యుద్ధాలలో పోరాడటానికి వాటికి శిక్షణ ఇచ్చేవారు. అడవుల నుంచి లభించే కలపతో కోటలు, రాజభవనాలు, రథాలను నిర్మించటానికి ఉపయోగించేవారు. మగధ రాజ్యంలోని దక్షిణ ప్రాంతంలో ఇనుప ఖనిజ నిక్షేపాలు ఉండేవి. వాటిని ఉపయోగించి ఆయుధాలు తయారు చేసేవారు. వీటన్నింటి కారణంగా మగధ రాజ్యం బలమైన రాజ్యంగా ఎదిగింది. మొదటి రాజైన బింబిసారుడు, అతని కుమారుడు అజాత శత్రువు మగధను బలమైన రాజ్యంగా తీర్చిదిద్దారు. ఈ రాజు కోట నుండి విధంగా సహజ వనరులు మగధను బలమైన రాజ్యంగా ఆవిర్భవించటానికి బయలుదేరుట తోడ్పడినాయి.

ప్రశ్న 13.
భారతదేశ అవుట్ లైన్ పటములో పదహారు మహాజనపదాలను, వాటి రాజధానులను గుర్తించుము.
జవాబు:
AP Board 6th Class Social Solutions Chapter 7 సామ్రాజ్యాలు, గణతంత్రాల ఆవిర్భావం 3

ప్రశ్న 14.
ఈ పాఠ్యాంశంలో నేర్చుకున్న కొత్త పదాలతో కింది పదబంధ ప్రహేళికను పూరించండి. మీ ఉపాధ్యాయుని సహాయం తీసుకోండి.
AP Board 6th Class Social Solutions Chapter 7 సామ్రాజ్యాలు, గణతంత్రాల ఆవిర్భావం 4
అడ్డం :
1. మహాజనపదాలలో శక్తివంతమైన రాజ్యం.
2. వారణాసికి మరొక పేరు.
3. కౌశాంబి ఈ మహాజన పదానికి రాజధాని.
4. మహాభారతం ఈ మహాజనపదానికి చెందిన రాజుల మధ్య జరిగిన యుద్ధం గురించి తెలుపుతుంది.
5. రైతులు పంట దిగుబడిలో 1/6 వంతుగా చెల్లించే పన్ను.
6. యజ్ఞాలు మరియు కుల వ్యవస్థని ఇవి ఖండిస్తున్నాయి.
7. ‘వజ్ర’లో ఈ రకమైన ప్రభుత్వం ఉన్నది.

నిలువు :
1. తూర్పు దిక్కున చిట్టచివరి మహాజనపదం
2. అవంతి రాజధాని నగరం.
3. నాగళ్ళు తయారు చేయడానికి రైతులు ఉపయోగించిన లోహం.
4. గోదావరీ నదీ తీరంలో కల మహాజనపదం.
5. గహపతులు నియమించుకున్న బానిసలు.
6. కుశివార ఈ రాజ్యానికి రాజధాని.
7. సూరసేనకి రాజధాని
జవాబు:
AP Board 6th Class Social Solutions Chapter 7 సామ్రాజ్యాలు, గణతంత్రాల ఆవిర్భావం 5

6th Class Social Studies 7th Lesson సామ్రాజ్యాలు, గణతంత్రాల ఆవిర్భావం InText Questions and Answers

6th Class Social Textbook Page No.75

ప్రశ్న 1.
1) భారతదేశ పటంలో గంగా, యుమునా నదులు ఏమైదానాల గుండా ప్రవహిస్తున్నాయో గుర్తించండి.
2) భారతదేశ పటంలో నవీన నగరాలైన ఢిల్లీ, అలహాబాద్, వారణాసి, లక్నో, పాట్నాలను గుర్తించండి.
3) ఈ ప్రాంతం మీ గ్రామాలను పోలి ఉందా? కారణాలు తెల్పండి.
జవాబు:
1.
AP Board 6th Class Social Solutions Chapter 7 సామ్రాజ్యాలు, గణతంత్రాల ఆవిర్భావం 6
2.
AP Board 6th Class Social Solutions Chapter 7 సామ్రాజ్యాలు, గణతంత్రాల ఆవిర్భావం 7
3. ఈ ప్రాంతం మా గ్రామాలను పోలి లేదు. కారణం మా గ్రామం పీఠభూమి ప్రాంతంలో ఉంది. పై ప్రాంతం మైదాన ప్రాంతంలో ఉంది.

ప్రశ్న 2.
గంగా సింధు మైదానంలో మొదట్లో స్థిరపడ్డ తెగల పేర్లను మీ ఉపాధ్యాయుల సహాయంతో తెలుసుకోండి.
జవాబు:
గంగా, సింధు మైదానంలో భరత, పురు, కురు, పాంచాల, యదు, తుర్వాస, శాక్య, లిచ్ఛవీ, మల్ల, వైదేహీ మొ॥న తెగలు మొదట్లో స్థిరపడ్డ తెగలు.

AP Board 6th Class Social Solutions Chapter 7 సామ్రాజ్యాలు, గణతంత్రాల ఆవిర్భావం

ప్రశ్న 3.
‘జనపదం’ అంటే అర్థం ఏమిటి? మహాజనపదాలకు, వీటికి గల తేడా ఏమిటి?
జవాబు:
మొదట్లో వివిధ తెగలు గంగా – సింధూ మైదానంలోని అనుకూల ప్రాంతాలలో వ్యవసాయం చేస్తూ స్థిరపడ్డాయి. ఈ తెగలనే సంస్కృతంలో “జన’ అని వారు స్థిరపడిన ప్రాంతాన్ని ‘జనపదం’ అని పిలిచేవారు.

గంగా మైదానంలో ఇనుము యొక్క విస్తృతమైన ఉపయోగం పెద్ద ప్రాదేశిక ప్రాంతాలు ఏర్పడటానికి పరిస్థితులను సృష్టించింది. అటువంటి గ్రామాలు మరియు పట్టణాల యొక్క పెద్ద సమూహాలను ‘మహా జనపదాలు’ లేదా ‘పెద్ద జనపదాలు’ అని పిలిచేవారు.

6th Class Social Textbook Page No.76

ప్రశ్న 4.
గంగ నదీ పరీవాహక ప్రాంతంలో గల మహాజన పదాలు మరియు పట్టణాలను ఒక పట్టిక రూపంలో రాయండి.
జవాబు:
గంగ నదీ పరీవాహక ప్రాంతంలో గల మహాజన పదాలు మరియు పట్టణాలు :
మహాజనపదాలు – పట్టణాలు
1. కురు – ఇంద్రప్రస్తము
2. కోసల – శ్రీవస్తి
3. వజ్జి – వైశాలి
4. వత్స – కౌశోంబి
5. కాశి – వారణాశి
6. మగధ – రాజ గృహ
7. అంగ – చంప
8. మల్ల – కుశీనగరం
9. ఛేది – శోతిమతి
10. సూరసేన – మధుర
11. పాంచాల – అహిచ్ఛత్ర

6th Class Social Textbook Page No.77

ప్రశ్న 5.
క్రింది పటంలో నాటి ముఖ్యమైన జనపదాలు చూపబడ్డాయి. పటాన్ని చూసి కింది ఖాళీలను పూరించండి.
1. యమునానదికి ఇరువైపులా విస్తరించిన జనపదం ……….. (కురు)
2. పాంచాల జనపదం ……………. నదికి ఇరువైపులా విస్తరించి ఉంది. (గోమతి (ఉత్తర గంగా)
3. సూరసేన జనపదానికి పశ్చిమ దిక్కున గల జనపదం ………. (మధుర)
4. అన్ని జనపదాల కంటే ఉత్తరాన గల జనపదం …….. (కాంభోజ)
5. గోదావరి నదీ తీరాన నెలకొన్న జనపదం ……….. (అస్మక)
6. గాంధార జనపదం ………….. నదీ తీరాన నెలకొంది. (జీలం)

ప్రశ్న 6.
ఒక ప్రసిద్ధి చెందిన ఇతిహాసంలో ఈ జనపదాల గురించి ప్రస్తావన ఉంది. దాని గురించి తెలుసుకోండి.
జవాబు:
భారతదేశ ప్రసిద్ది ఇతిహాసమైన ‘మహాభారతంలో’ ఈ జనపదాల ప్రస్తావన ఉంది. ముఖ్యంగా ‘కురు’ (హస్తినాపురం) మహాజనపదం ప్రధాన కేంద్రంగా ఉంది.

6th Class Social Textbook Page No.78

ప్రశ్న 7.
నేడు వరిని ఏ విధంగా సేద్యం చేస్తున్నారు?
జవాబు:
నేడు వరిని క్రింది విధంగా సేద్యం చేస్తున్నారు.

  • మొదటగా భూమిని చదును చేసి, గట్లు కడతారు.
  • తర్వాత నీరు పెట్టి, దమ్ము చేస్తారు. (మెత్తగా చేస్తారు)
  • తర్వాత నాట్లు వేస్తారు (కొన్ని ప్రాంతాలలో వెద పెట్టడం జరుగుతుంది)
  • తర్వాత కలుపు తీయటం, పంటకు అవసరమైన ఎరువులు వేయటం జరుగుతుంది.
  • అవసరమనుకుంటే పురుగు మందులు చల్లటం జరుగుతుంది.
  • తర్వాత వరి కంకులు రావడం జరుగుతుంది. కంకులు ముదిరిన తర్వాత పొలంలోని నీరు తీసేస్తారు.
  • తర్వాత వరికోతలు చేపట్టి, కుప్ప పోస్తారు. తర్వాత నూర్పిడి చేస్తారు.
  • తూర్పార బట్టి వడ్లను వేరు చేస్తారు. (కొన్ని ప్రాంతాలలో వరికోత యంత్రం ద్వారానే ఇవన్నీ చేస్తున్నారు.)

6th Class Social Textbook Page No.79

ప్రశ్న 8.
నాటి గ్రామాలలో గృహపతులకు మరియు వృత్తి పనివారికి మధ్యగల సంబంధం గురించి వివరించండి.
జవాబు:
గృహపతికి అవసరమైన పనిముట్లను వృత్తిపనివారు తయారుచేసి ఇచ్చేవారు. ఈ ఉత్పత్తులకు బదులుగా గృహపతులు వృత్తి పనివారికి ధాన్యం ఇచ్చి ఉండవచ్చు. ఈ ఉత్పత్తులు వ్యవసాయానికి అత్యవసరం. వాటిని సొంతంగా తయారు చేసుకోవటానికి గృహపతులకు నైపుణ్యం, సమయం ఉండవు. వ్యవసాయంలో మిగులు మరియు నైపుణ్యం గల వృత్తి పనివారిచే చేయబడిన వస్తువులు వాణిజ్యానికి మరియు మార్పిడి కేంద్రాల ఆవిర్భావానికి దారితీసాయి.

6th Class Social Textbook Page No.80

ప్రశ్న 9.
నగరాలలోని ప్రజలకు ధాన్యం, పాలు, మాంసం మొదలైనవి అవసరం. నగరంలో వ్యవసాయం లేకుండా అంతమంది ప్రజలు వాటిని ఎలా పొందగలిగేవారు?
జవాబు:
నగరాలకు చుట్టుప్రక్కల గ్రామాలుంటాయి. ధాన్యం అక్కడి నుండి నగరాలలోని రైస్ మిల్లర్లు కొనుగోలు చేసి ఇక్కడ అమ్ముతారు. డైరీ ఫారాల ద్వారా పాలు సేకరించి, పాశ్చురైజేషన్ ప్రక్రియ ద్వారా శుద్ధిచేసి, శీతలీకరించి ప్రజలకు సరఫరా జరుపుతారు. నగరాలలో కూడా పశువుల పెంపకం జరుగుతుంది. కాబట్టి మాంసం కూడా సులభంగానే లభ్యమవుతుంది.

AP Board 6th Class Social Solutions Chapter 7 సామ్రాజ్యాలు, గణతంత్రాల ఆవిర్భావం

ప్రశ్న 10.
మీరు ఎప్పుడైనా టీవిలో కాని, ఆ ప్రాంతాన్ని సందర్శించి కానీ ఒక కోటను చూసారా?
జవాబు:
చూసాను. టీవిలో రాజస్థాన్లోని (జైపూర్) కోటలను, హైదరాబాద్ లోని గోల్కొండ కోటను చూసాను. ప్రత్యక్షంగా కొండవీడు కోటను, వరంగల్ కోటను సందర్శించాను.

ప్రశ్న 11.
కోట చుట్టూ అంత పెద్ద గోడలు ఎందుకు ఉంటాయి ? అవి వేటితో నిర్మింపబడి ఉంటాయి? వీటంతటికి అవసరమైన ధనాన్ని రాజులు ఎలా పొందేవారు?
జవాబు:

  • శత్రు దేశాల దాడుల నుండి రక్షణకై కోటచుట్టూ పెద్ద గోడలు ఉంటాయి. .
  • వీటిని పెద్ద పెద్ద కొండ రాళ్ళతో నిర్మింపబడి ఉంటాయి.
  • వీటంతటికి అవసరమైన ధనాన్ని రాజులు ప్రజల నుండి పన్నుల రూపంలో వసూలు చేసేవారు.

ప్రశ్న 12.
మహాజన పదాలలో రాజులకు సైన్యం ఎందుకు అవసరం?
జవాబు:
మహాజన పదాల రాజులు వారి తెగను, రాజ్యాన్ని కాపాడాల్సి వచ్చేది. ఇతరుల దండయాత్రల నుండి వారిని రక్షించాల్సి వచ్చేది. అంతేగాక పన్నులు చెల్లించడానికి నిరాకరించేవారిని శిక్షించడానికి, ప్రజలు రాజు ఆజ్ఞలను పాటించేలా చూడటానికి కూడా సైనికులు అవసరం.

6th Class Social Textbook Page No.81

ప్రశ్న 13.
వేటాడేవారు, సేకరణ చేసేవారు రాజుకు ఏ రూపంలో పన్నులు చెల్లించేవారు?
జవాబు:
వేటాడేవారు, సేకరణ చేసేవారు అటవీ ఉత్పత్తులైన తోళ్ళు కలప వంటివి ఇచ్చేవారు. అలాగే అటవీ ఉత్పత్తులైన కాయలు, పండ్లు, తేనె మొ|| న వాటిని కూడా బహుమతిగా ఇచ్చేవారు.

ప్రశ్న 14.
ప్రతి ఒక్కరూ తాము కష్టపడి సంపాదించినదానిలో కొంత చెల్లించాల్సి వస్తే అది వాళ్ళ జీవితాలపై ఎటువంటి ప్రభావాన్ని చూపిస్తుంది?
జవాబు:
ప్రతి ఒక్కరూ రాజ్యంలో తమ రక్షణ కొరకు ప్రభుత్వం తమకు కల్పించే సౌకర్యాలకు కొంత సొమ్మును చెల్లించాల్సి వస్తే అది సమంజసంగానే ఉంటుంది. కాని కష్టపడి సంపాదించిన దానిలో కొంత చెల్లించాల్సి వస్తే అది వారి జీవితాలపై దుష్ప్రభావాల్ని చూపిస్తుంది. దీనిని తప్పించుకోవడానికి ప్రజలు ప్రభుత్వాన్ని మోసం చేయడానికి ప్రయత్నిస్తారు.

ప్రశ్న 15.
వాళ్ళు పన్నులు చెల్లించటానికి ఎందుకు అంగీకరించి ఉంటారు? కొత్త ఏర్పాట్ల వల్ల వాళ్ళు ఏరకంగా ప్రయోజనం పొందారు?
జవాబు:
తమ జీవితాల రక్షణ కోసం, నీటిపారుదల సౌకర్యాల కోసం, తెగ వృద్ధి కోసం పన్నులు చెల్లించడానికి అంగీకరించి ఉంటారు. కొత్త ఏర్పాట్ల వల్ల వాళ్ళు తమ దృష్టిని పూర్తిగా తమ వ్యవసాయంపైన, వ్యాపారం పైనా పెట్టి ఉంటారు. తద్వారా వారు మంచి ఆదాయం పొంది ఉంటారు.

ప్రశ్న 16.
‘భాగ’ అంటే ఏమిటి? రైతుల ఉత్పత్తి నుంచి ఇప్పటి ప్రభుత్వం కూడా ఇలా తీసుకుంటుందా?
జవాబు:
రాజులు వ్యవసాయం చేసే గృహపతుల నుండి పన్నులు వసూలు చేసేవారు. వారు తమ పంటను ఆరు భాగాలుగా చేసి ఒక భాగాన్ని రాజుకు ఇచ్చేవారు. దీనినే ‘భాగ’ అనేవారు. రైతుల ఉత్పత్తి నుంచి ఇప్పటి ప్రభుత్వం ఇలా తీసుకోదు.

6th Class Social Textbook Page No.82

ప్రశ్న 17.
వృత్తి ఉత్పత్తులను, వ్యాపారాన్ని వృద్ధి చేయడానికి మహాజవపదాల రాజులు ఎందుకు ఆసక్తి చూపారు?
జవాబు:
రాజ్యంలో పన్నుల రూపంలో ఆదాయం పెంచుకోవడానికి రాజులు మహాజనపదాలలోని వ్యాపారులను దూరదేశాలతో వ్యాపారం చేయవలసినదిగా ప్రోత్సహించారు. అలాగే చేతి వృత్తుల వారు తమ ఉత్పత్తులు పెంచాలని, స్వయం సమృద్ధి కొరకే కాక ఎక్కువ పన్నులు వారి నుండి వసూలు చేయుటకుగాను – (రాజులు) ప్రోత్సహించిరి.

AP Board 6th Class Social Solutions Chapter 7 సామ్రాజ్యాలు, గణతంత్రాల ఆవిర్భావం

ప్రశ్న 18.
రాజులు విధించే పన్నుల వల్ల గ్రామపెద్దలు ఏ విధంగా లాభపడేవారు?
జవాబు:
వ్యాపారస్తుల నుండి తమ తరఫున పన్నులు వసూలు చేయాలని గ్రామపెద్దని రాజులు కోరేవారు. ఈ పన్నులు వసూలు చేసినందుకు గాను రాజు వీరికి కొంత శాతం ముట్టచెప్పేవారు. ఈ విధంగా రాజులు విధించే పన్నుల వల్ల గ్రామ పెద్దలు తమ అధికారం, సంపద పెంచుకుని లాభపడేవారు.

6th Class Social Textbook Page No.83

ప్రశ్న 19.
అక్కడ సహజ సంపదను ఉపయోగించి మగధ రాజులు బలమైన మగధ రాజ్యాన్ని ఎలా నిర్మించారు?
జవాబు:
మగధ గంగానదికి రెండువైపులా విస్తరించి ఉన్నది. నదులు భూములను సారవంతం చేస్తాయి. గృహపతులు తమ భూములను సులభంగా సాగుచేసుకునేవారు. నదుల మీద సరుకు రవాణా చేసేవారు, సైనికులను తరలించేవారు. మగధలోని కొంత ప్రాంతంలో అడవులున్నాయి. ఈ అడవుల నుంచి ఏనుగులను పట్టుకొని వచ్చి యుద్ధాలలో పోరాడటానికి వాటికి శిక్షణ ఇచ్చేవారు. అడవుల నుండి లభించే కలపతో కోటలు, రాజభవనాలను, రథాలను నిర్మించడానికి ఉపయోగించేవారు. మగధ రాజ్యంలోని దక్షిణ ప్రాంతంలో ఇనుప ఖనిజ నిక్షేపాలు ఉండేవి. వాటిని ఉపయోగించి ఆయుధాలు మొదలైనవి తయారుచేసేవారు. వీటి కారణంగా మగధ రాజ్యంను బలమైన రాజ్యంగా మగధ రాజులు నిర్మించారు.

ప్రశ్న 20.
ప్రతి సహజ వనరులను గురించి, వాటిని ఉపయోగించి మగధ రాజులు బలమైన మగధ రాజ్యాలు ఎలా నిర్మించారు?
జవాబు:
మగధ రాజులు ఆ ప్రాంతంలోని సహజ వనరులను చక్కగా వినియోగించుకుని తమ సంపదను అధికారాన్ని పెంచుకున్నారు.

నదులు :
ఇచట ప్రవహించే నదులు ఈ ప్రాంతాన్ని సారవంతం చేసినవి. గృహపతులు తమ పంటలకు సమృద్ధిగా నీరు లభించుటవలన పంటలు బాగా పండించిరి. వస్తువులు మరియు సైన్యాన్ని రవాణా చేయడానికి ఇవి బాగా ఉపయోగపడినవి.

అడవులు :
మగధ చుట్టూ అడవులు గలవు. వీటిలోనుండి ఏనుగులను బంధించి తెచ్చి యుద్ధాలలో ఉపయోగపడే విధంగా శిక్షణ ఇచ్చేవారు. అడవులలో లభించే కలపనుపయోగించి కోటలను, రాజభవనాలను మరియు రథాలను నిర్మించేవారు.

ఇనుప ఖనిజం :
ఇనుప ఖనిజం నిల్వలు ఉండుట వలన వీటితో రాజులు యుద్ధాలకు అవసరమైన ఆయుధాలను మరియు వ్యవసాయ పనిముట్లు అయిన నాగటి కొర్రులు, కొడవళ్ళు మొదలగువాటిని తయారుచేశారు.

ఈ సహజ వనరులు మగధకు శక్తివంతమైన రాజ్యంగా ఎదగడానికి ఉపయోగపడినవి.

AP Board 6th Class Social Solutions Chapter 7 సామ్రాజ్యాలు, గణతంత్రాల ఆవిర్భావం

ప్రశ్న 21.
వజ్జి మహాజనపదంలోని గణతంత్ర ప్రభుత్వాన్ని (పాల్గొనే అవకాశం లేని వారిని) ప్రస్తుత గణతంత్ర రాజ్య అసెంబ్లీతో పోల్చండి.
జవాబు:

  • వట్టి మహాజన పదంలో ప్రస్తుత గణతంత్ర రాజ్యంలో వలే ఒకే పరిపాలకుడు ఒక పరిపాలకుల బృందం ఉండేది. అయితే మహిళలకు,
  • బానిసలకు, సేవకులకు ఈ సమావేశాలలో పాల్గొనే అవకాశం లేదు.
  • కాని ప్రస్తుత గణతంత్ర వ్యవస్థలో ఇటువంటి తారతమ్యాలు లేవు. అసలు బానిస వ్యవస్థీ లేదు.

AP Board 6th Class Social Solutions Chapter 6 తొలి నాగరికతలు

SCERT AP 6th Class Social Study Material Pdf 6th Lesson తొలి నాగరికతలు Textbook Questions and Answers.

AP State Syllabus 6th Class Social Solutions 6th Lesson తొలి నాగరికతలు

6th Class Social 6th Lesson తొలి నాగరికతలు Textbook Questions and Answers

Improve your learning (మీ అభ్యసనాన్ని మెరుగుపడుచుకోండి)

ప్రశ్న 1.
సింధూలోయ నాగరికత మరియు వేదనాగరికతల మధ్య పోలికలేవి?
జవాబు:
సింధూలోయ నాగరికత మరియు వేదనాగరికతల మధ్య పోలికలు :

  • రెండూ భారత దేశ గొప్ప నాగరికతలుగా విలసిల్లినాయి.
  • రెండూ నాగరికతల ప్రజలు పరిశుభ్రతకు ప్రాధాన్యమిచ్చినారు. అలంకార ప్రియత్వం కల్గి ఉన్నారు.
  • వ్యవసాయం ప్రధాన వృత్తిగా కల్గి ఉన్నారు. బార్లీ, బఠానీ, గోధుమ పంటలను ఇద్దరూ పండించారు.
  • లోహ పనిముట్లను వాడినారు. (రాగి, కాంస్యం, ఇనుము మొ||నవి.)
  • రెండూ నాగరికత ప్రజలు వినోదానికి ప్రాధాన్యమిచ్చారు. నాట్యం, సంగీతం, చదరంగం మొ||నవి రెండూ నాగరికత కన్పించే అంశాలు.
  • రెండూ నాగరికత ప్రజలు మత విశ్వాసాలను కల్గి ఉన్నారు. (అయితే దేవతలు వేరూ కావచ్చు.)
  • స్త్రీలకు సమాజంలో గౌరవస్థానం (మలివేదకాలంలో మినహా) ఉండేది.

ప్రశ్న 2.
సింధూ లోయ, నాగరికత తవ్వకాలలో పాల్గొన్నదెవరు?
జవాబు:
1850లో బ్రిటీష్ ఇంజనీర్లు కరాచీ లాహోరు నగరాల మధ్య రైలు మార్గాలు వేయుటకు తవ్వకాలు జరుపుతుండిరి. ఆ తవ్వకాలలో వేలాది రాళ్ళు దొరికినవి రైలు మార్గాలు వేయుటకు ఆ రాళ్ళను ఉపయోగించాలని నిర్ణయించారు. ఆ రాళ్ళు అయిదు వేల సంవత్సరాల క్రితంవన్న సంగతి అప్పుడు తెలియదు. 1920లో పురావస్తు శాస్త్రవేత్తలు అక్కడ గొప్ప నాగరికత ఉండేదని గ్రహించారు. దీనినే సింధూలోయ నాగరికత అని హరప్పా నాగరికత అని అంటారు. 1921-22 సం॥లలో అప్పటి పురావస్తుశాఖ డైరెక్టర్ జనరల్ అయిన సజాన్ మార్నల్ ఆధ్వర్యంలో హరప్పాలో దయారాం సాహి, మొహంజోదారోలో ఆర్.డి. బెనర్జీలు త్రవ్వకాలను జరిపి సింధూ నాగరికత – విశేషాలను వెలుగులోకి తెచ్చారు.

AP Board 6th Class Social Solutions Chapter 6 తొలి నాగరికతలు

ప్రశ్న 3.
సింధూ ప్రజల ఆర్థిక జీవనాన్ని వివరింపుము.
జవాబు:
సింధూ ప్రజల ఆర్థిక జీవనము :

  • వ్యవసాయం ప్రధాన వృత్తి. గోధుమ, బార్లీ, ఆముదాలు, బఠానీలు, కాయధాన్యాలు మొ||న పంటలను పండించేవారు. పత్తి మరియు నూలు వస్త్రాలను నేయడం ఆ కాలంలోని ప్రధాన వృత్తులు. పత్తిని మొట్టమొదట పండించింది వీరే.
  • కాల్చిన ఇటుకలను తయారుచేయుట వీరి వేరొక ముఖ్య వృత్తి, పశువులు, మేకలు, పందులు, కుక్కలు, గుజ్రాలు మరియు గాడిదలను పెంచేవారు.
  • అరేబియా సముద్రంలోని లోథాల్ నౌకాశ్రయం ద్వారా మెసపటోమియా, ఈజిప్టు మరియు ఇరాన్ దేశాలతో సింధూ ప్రజలు బాగా వ్యాపారం చేసేవారు.

ఆర్థిక జీవనం :
AP Board 6th Class Social Solutions Chapter 6 తొలి నాగరికతలు 1

ప్రశ్న 4.
సింధూ ప్రజల ఇండ్ల నిర్మాణము ఎట్టిది?
జవాబు:

  • హరప్పా ప్రజలు ఎండిన మరియు బాగా కాల్చిన ఇటుకలతో ఇళ్ళు కట్టుకొనేవారు.
  • రెండు అంతస్తుల భవనాలను కూడా నిర్మించుకొనేవారు.
  • ప్రతి ఇంటికి ఒక బావి మరియు స్నానాలగది ఉండేది.
  • ఇంటిలోని వ్యర్థాలను పైపుల ద్వారా ప్రధాన మురుగు కాలువలోకి పంపేవారు.

AP Board 6th Class Social Solutions Chapter 6 తొలి నాగరికతలు 2

ప్రశ్న 5.
సింధూ ప్రజల మురుగు నీటిపారుదల వ్యవస్థ ప్రశంసనీయమైనది ఎలా?
జవాబు:

  • సింధూ ప్రజల మురుగు నీటిపారుదల వ్యవస్థ ఎంతో ప్రశంసనీయమైనది.
  • వీరికాలంలో మంచి ప్రణాళికబద్ధమైన భూగర్భ మురుగు నీటి పారుదల వ్యవస్థ కలదు.
  • ఈ వ్యవస్థ పరిశుభ్రతకు మరియు ప్రజారోగ్యానికి సింధూ ప్రజలు ఇచ్చిన ప్రాముఖ్యతను తెలియజేస్తుంది.

ప్రశ్న 6.
“భగవంతుని మీద భక్తి అనేది ఒక నమ్మకం” సింధూ ప్రజల దేవతల గురించి వ్యాఖ్యానించుము.
జవాబు:

  • సింధూ ప్రజలు పశుపతి (శివుడు) మరియు అమ్మతల్లిని పూజించేవారు.
  • వేపచెట్టు మరియు రావి చెట్టును పూజించేవారు.
  • భూమి, నీరు, ఆకాశం, అగ్ని మరియు వాయువులను పూజించేవారు.
  • కాలిభంగన్ మరియు లోథాల్ ప్రాంతాలలో అగ్ని పేటికలు అనగా యజ్ఞవాటికలు ఉండేవి. (ఆప్) స్వస్తిక్ గుర్తును సాధారణంగా ఉపయోగించేవారు.

AP Board 6th Class Social Solutions Chapter 6 తొలి నాగరికతలు 3

ప్రశ్న 7.
వేదాలెన్ని? అవి ఏవి?
జవాబు:
వేద సాహిత్యములో నాలుగు ప్రముఖ వేదాలు కలవు. అవి :

  1. ఋగ్వేదము
  2. యజుర్వేదము
  3. సామవేదము
  4. అధర్వణ వేదము.

ప్రశ్న 8.
“వేదమనగా ఉత్కృష్టమైన (ఉన్నతమైన) జ్ఞానము” వ్యాఖ్యానించుము.
జవాబు:

  • సంస్కృత భాషలో వేదమనగా ఉన్నతమైన జ్ఞానం ఆత్మజ్ఞానమే వేధము.
  • వేదాలను శృతులు అని కూడా అంటారు.
  • పండితులైన వారు కనుగొన్న పరమ సత్యాలే వేదాలు.
  • భారతీయ యోగాకు వేదాలే ఆధారాలు.
  • వేదాలలో లోతైన ఆధ్యాత్మిక మరియు శాస్త్రీయ విజ్ఞాన కలదు.
  • వేదకాలపు సాంప్రదాయాలు ఇప్పటికీ అవిచ్చినముగా కొనసాగుతున్నవి.
  • ఆధునిక కాలంలో స్వామి దయానంద సరస్వతి ‘వేద కాలానికే మరలా వెళ్ళాలి’ అని పిలుపునిచ్చారు.
  • వేదాల మీద భారతీయ మరియు ఇతర దేశాల విశ్వవిద్యాలయాలలో పరిశోధనలు కొనసాగుతున్నాయి.
  • వేద సాహిత్యములో నాలుగు ప్రముఖ వేదాలు కలవు. ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, ఆధర్వణ వేదము

AP Board 6th Class Social Solutions Chapter 6 తొలి నాగరికతలు

ప్రశ్న 9.
తొలివేదకాలము నాటి ప్రజల సాంఘిక జీవనాన్ని వివరింపుము.
జవాబు:
కుటుంబ వ్యవస్థ :
కుటుంబమే సమాజానికి ప్రాథమిక అంగం. తండ్రి కుటుంబానికి పెద్ద. ఉమ్మడి కుటుంబ వ్యవస్థ అమలులో ఉంది. యుద్ధ ఖైదీలను బానిసలుగా చూసేవారు. దాసులను బానిసలుగా చూసేవారు. ఒకే భార్యను కలిగి ఉండుట ఈ కాలంలో సాధారణంగా ఉండేది.

స్త్రీల స్థానం :
సమాజంలో స్త్రీలకు గౌరవం ఉండేది. స్త్రీలు వేదాలు అధ్యయనం చేసేవారు. బాల్య వివాహాలు కాని, సతీసహగమనం కానీ అమలులో లేదు. స్త్రీలు తమ భర్తను స్వయంవరం ద్వారా ఎంపిక చేసుకొనేవారు. వితంతువులు తిరిగి వివాహము చేసుకొనే పద్ధతి కలదు. ఘోష, అపాలా, లోపాముద్ర, ఇంద్రాణి, విష్యవర వంటి విద్యావంతులైన స్త్రీలు గొప్ప వేద పండితులు ఈ స్త్రీలు తమ భర్తలతో పాటు అన్ని ధార్మిక కార్య క్రమాలలో పాల్గొనేవారు.

వేష ధారణ :
వాసా (ధోవతి) ఆదివాసా (శరీరము పై భాగానిని కప్పుకొనేది) ప్రస్తుతం మన వేషధారణను పోలి ‘ఉండేవి. దుస్తులను బంగారు దారంతో కుట్టేవారు. స్త్రీలు చెవి రింగులు, కంఠభారణాలు, గాజులు మరియు కాలి పట్టీలు ధరించేవారు. స్త్రీలు తలకు నూనె రాసుకుని జడలు వేసుకొనేవారు.

వినోదాలు :
రథపు పందేలు, వేట, మల్లయుద్దాలు, నాట్యం మరియు సంగీతం మొదలైనవి కొన్ని వినోదాలు. మూడు రకాలైన సంగీతవాయిద్యాలు ఉపయోగించేవారు.

విద్య :
విద్యకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చే గురుకులాలు ఉండేవి. బోధనా అభ్యసన ప్రక్రియలలో అన్ని విద్యా సంస్థలకు పూర్తి స్వేచ్ఛ ఉండేది. విద్యాలయాలలో యుద్ధ తంత్రం, వేదాంతం, వ్యవసాయం, పశువుల పెంపకం మరియు హస్తకళలను నేర్పేవారు.

వర్ణవ్యవస్థ :
తొలి వేదకాలంలో ఎటువంటి వివక్షత లేదు. కులాంతర వివాహాలపై ఎటువంటి నిషేధం లేదు. ప్రజలు తమ వృత్తులను స్వేచ్ఛగా ఎంపిక చేసుకోవచ్చును.

ప్రశ్న 10.
మలి వేదకాలము నాటి ప్రజల సాంఘిక జీవనము గురించి నీకేమి తెలియును?
జవాబు:
మలి వేదకాలములో తొలి వేదకాలముతో పోల్చితే అనేక సాంఘిక మార్పులు సంభవించాయి. అవి :

  • ఆశ్రమ వ్యవస్థ ప్రారంభమైనది. అవి నాలుగు రకాలు బ్రహ్మచర్యం, గృహస్థాశ్రమం, వానప్రస్థాశ్రమం మరియు సన్యాసం వీరి కాలంలో ప్రారంభమైనవి.
  • స్త్రీల స్థానం దిగజారింది. వర్ణ వ్యవస్థ ప్రారంభమైంది.
  • బాల్య వివాహాలు మరియు సతీసహగమనం వీరి కాలంలో ప్రారంభమయ్యాయి.
  • రాజులు మరియు ఉన్నత వర్గాల ప్రజలలో బహుభార్యత్వము ప్రారంభమైనది.
  • స్త్రీకి ఆస్తి హక్కు లేదు, వరకట్నము ఆచరణలోకి వచ్చెను.
  • వర్ణాంతర వివాహాలు నిషేధించబడినవి.

ప్రశ్న 11.
ఇతిహాసాల యొక్క ప్రాముఖ్యత ఏమిటి?
జవాబు:
రామాయణం, మహాభారతాలు అనేవి రెండు గొప్ప ఇతిహాసాలు, రామాయణాన్ని (ఆది కావ్యం) సంస్కృతంలోకి వాల్మీకి రచించారు. రామాయణంలో శ్రీరాముడిని ఆదర్శపాలకుడిగా, ఆదర్శ సోదరునిగా, ఆదర్శ కుమారునిగా, సీతను ఆదర్శ మహిళగా వర్ణించారు. మహాభారతాన్ని సంస్కృతంలో వేదవ్యాసుడనే ఋషి రచించాడు. అధర్మం పై ధర్మం సాధించిన విజయమే ‘మహాభారతం’గా చెప్పబడింది.

ప్రశ్న 12.
భారతదేశము యొక్క అవుట్ లైన్ మ్యాన్లో ఈ క్రింది వాటిని గుర్తించుము.
ఎ) సింధూనది బి) గంగానది సి) యమునా నది
జవాబు:
AP Board 6th Class Social Solutions Chapter 6 తొలి నాగరికతలు 4

ప్రశ్న 13.
సింధూలోయ నాగరికత పతనానికి కారణాలేవి?
జవాబు:
సింధూలోయ నాగరికత పతనానికి కారణాలు :

  • ఆర్యుల దండయాత్రలు సింధూ నాగరికత పతనానికి కారణమనే సిద్ధాంతం కలదు.
  • అయితే ‘మార్టిమర్ వీలర్’ అనే చరిత్రకారుడు దీనిని అంగీకరించలేదు. సింధూ నది తన ప్రవాహమార్గాన్ని మార్చుకోవడం వలన మరియు వరదల వలన సింధూ నాగరికత పతనమైనట్టు భావిస్తున్నారు.
  • సింధూనది మరియు దాని ఉపనదులలో నీరు లేకుండా ఎండిపోవుట వలన అక్కడి ప్రజలు ఆ ప్రాంతాన్ని వదలి వెళ్ళారని కొంతమంది చరిత్రకారులు భావిస్తారు.
  • సింధూలోయ నాగరికత పతనానికి అనేక కారణాలు ఉన్నాయని ఇప్పుడు అందరూ అంగీకరిస్తున్నారు.

6th Class Social Studies 6th Lesson తొలి నాగరికతలు InText Questions and Answers

6th Class Social Textbook Page No.65

ప్రశ్న 1.
సింధూలోయ నాగరికతా కాలం నాటి పట్టణ ప్రణాళికకు, ప్రస్తుత పట్టణ ప్రణాళికలకు ఏవైనా తేడాలను నీవు గమనించావా? అయితే ఎలాంటి తేడాలను గమనించావా?
జవాబు:
సింధూలోయ నాగరికతా కాలం నాటి పట్టణ ప్రణాళిక ఆధునిక (ప్రస్తుత) పట్టణ ప్రణాళికను పోలి ఉంది. కొద్ది తేడాలు మాత్రమే గమనించాను. అవి:

  • నేడు చాలా చోట్ల భూగర్భ మురుగు నీటిపారుదల వ్యవస్థ లేదు.
  • నేడు చాలా పట్టణాల్లో సరియైన ప్రణాళికా బద్దమైన (భవన) నిర్మాణాలు లేవు. మురికివాడల సంగతి మరీ అధ్వాన్నం.
  • చాలా పట్టణాల్లో విశాలమైన రహదారులు లేవు. ఇరుకు సందులే.

AP Board 6th Class Social Solutions Chapter 6 తొలి నాగరికతలు

ప్రశ్న 2.
సింధూ కాలంనాటి నీటిపారుదల వ్యవస్థ అత్యంత ఆధునికమైనదేనా? ఎలా?
జవాబు:

  • సింధూ కాలం నాటి నీటి పారుదల వ్యవస్థ అత్యంత ఆధునికమైనదే.
  • మంచి ప్రణాళికాబద్ధమైన నీటి పారుదల వ్యవస్థ కలదు. .
  • వీరు పరిశుభ్రతకు మరియు ప్రజారోగ్యానికి చాలా ప్రాముఖ్యతనిచ్చారు.

6th Class Social Textbook Page No.66

ప్రశ్న 3.
సింధూలోయ ప్రజల ఆర్థిక కార్యకలాపాలకు, ప్రస్తుత ఆర్థిక కార్యకలాపాలకు పోలికలు ఏవి?

ఆర్థిక కార్యకలాపంసింధూ ప్రజల కాలంప్రస్తుత కాలం
ఎగుమతులు
దిగుమతులు
పంటలు
మచ్చిక చేసుకొని పెంచుకునే జంతువులు
చేతి వృత్తులు

జవాబు:
సింధూలోయ ప్రజల ఆర్థిక కార్యకలాపాలకు, ప్రస్తుత ఆర్థిక కార్యకలాపాలకు పోలికలు

ఆర్థిక కార్యకలాపంసింధూ ప్రజల కాలంప్రస్తుత కాలం
ఎగుమతులునూలు వస్త్రాలు, ధాన్యం దంతపు దువ్వెనలు, ఆభరణాలువజ్రాలు, తోళ్ళు ఉత్పత్తుల., రత్నాలు, ఔషధాలు యంత్రాలు, లోహాలు.
దిగుమతులుఅలంకార సామాగ్రి, రాగి తగరంపెట్రోలు, రంగురాళ్ళు, ఎలక్ట్రానిక్స్, రసాయనాలు, ప్లాస్టిక్, స్టీల్
పంటలువరి, గోధుమ, బార్లీ, పత్తి, బరానివరి, గోధుమ, బార్లీ, తృణధాన్యాలు అన్ని పత్తి, జనుము, పొగాకు, కాఫీ, టీ మొ||నవి
మచ్చిక చేసుకొని పెంచుకునే జంతువులుమేకలు, గొర్రెలు, గేదెలు ఎద్దు, ఏనుగులు, కుక్కలుమేకలు, గొర్రెలు, గేదెలు, ఎద్దులు, గాడిదలు ఏనుగులు, కుక్కలు, ఒంటెలు మొ||నవి.
చేతి వృత్తులుతాపీ పని, చేనేత పని, నూలు, వడుకుట, రాగిపాత్రలు, కుండల తయారీ.తాపీ పని, చేనేతపని, నూలు వడుకుట రాగి పాత్రలు, కుండల తయారీ మొదలైనవి.

6th Class Social Textbook Page No.67

ప్రశ్న 4.
సింధూ నాగరికత కాలంలోని ప్రజలు ఉపయోగించిన లోహాలను ప్రస్తుతం మనం ఉపయోగించే లోహాలతో పోల్చుము. Page No. 67)
AP Board 6th Class Social Solutions Chapter 6 తొలి నాగరికతలు 5
జవాబు:

సింధూలోయ నాగరికత ప్రజలు ఉపయోగించిన లోహాలుప్రస్తుతం ఉపయోగిస్తున్న లోహాలు
రాగి, తగరము పాత్రలు, బంగారం, వెండితో చేసిన ఆభరణాలు.రాగి, స్టీల్, ఇత్తడి పాత్రలు, వెండి, బంగారం, ప్లాటినం మొ||న ఆభరణాలు వాడుతున్నారు.
కాంస్యంతో చేసిన పనిముట్లు వాడినారు.ఇనుము, అల్యూమినియం, స్టీల్లో చేసిన పనిముట్లు వాడుతున్నారు.

6th Class Social Textbook Page No.69

ప్రశ్న 5.
AP Board 6th Class Social Solutions Chapter 6 తొలి నాగరికతలు 6
i) పై పట్టికలో నాగరికతల మధ్య ఎలాంటి పోలికలను నీవు గమనించావు?
ii) మిగిలిన నాగరికతల కన్నా సింధూ నాగరికత ఏయే విధములుగా పురోగమించినది? Page No. 699
జవాబు:
i)

  • ఈ నాగరికతలన్నీ నదీలోయ ప్రాంతాలలోనే విలసిల్లినాయి.
  • ఈ నాగరికతల్లో ఎక్కువ నాగరికతలు పట్టణ నాగరికతలే.
  • ఈ నాగరికతలన్నీ తమ స్వంత లిపిని కల్గి ఉన్నాయి.
  • ఈ శాస్త్ర, సాంకేతికంగా, ఆయా నాగరికతలు అభివృద్ధి చెందినాయని చెప్పవచ్చు. ఉదా : పిరమిడ్ల నిర్మాణం, భూగర్భ డ్రైనేజీ.
    లోహాలను కూడా విరివిగా ఉపయోగించినట్లు తెలుస్తుంది.

ii)

  • మిగిలిన నాగరికతల కన్నా సింధూ నాగరికత క్రింది విధముగా పురోగమించింది :
  • గ్రిడ్ ఆకారంలో ప్రణాళిక బద్దమైన పట్టణ ప్రణాళిక కల్గి ఉంది.
  • భూగర్భ మురుగునీటి పారుదల (పైపుల ద్వారా) వ్యవస్థ కలదు.
  • ఋతుపవన వ్యవస్థ కలిగి ఉంది.
  • బలమైన కేంద్రీకృత ప్రభుత్వం కల్గి ఉంది.

6th Class Social Textbook Page No.71

ప్రశ్న 6.
భారతదేశంలో ఉన్న మతాల పేర్లను రాయుము.
జవాబు:
భారతదేశంలో ఉన్న మతాల పేర్లు :

  1. హిందూ మతము
  2. క్రైస్తవ మతము
  3. ఇస్లాం మతము
  4. బౌద్ధ మతం
  5. జైన మతం
  6. సిక్కు మతం
  7. పార్శీ మతం (జోరాస్ట్రియన్) మొ||నవి.

6th Class Social Textbook Page No.72

ప్రశ్న 7.
నేడు మన ప్రజా ప్రతినిధులు ఎలా ఎన్నిక కాబడుతున్నారు?
జవాబు:
నేడు మన ప్రజా ప్రతినిధులను, వయోజనులైన (18 సం||లు పైబడిన) వారు తమ ఓటు హక్కును వినియోగించి ప్రజాస్వామ్యయుతంగా ఎన్నుకుంటారు. అంటే ప్రజాస్వామ్యయుతంగా మెజారిటీ సభ్యుల అమోదించే ఎన్నుకోబడుతున్నారు.

AP Board 6th Class Social Solutions Chapter 6 తొలి నాగరికతలు

ప్రశ్న 8.
మీ పాఠశాల గ్రంథాలయంలోని ప్రముఖ గ్రంథాల పేర్లు రాసి, వాటి రచయితల పేర్లు రాయుము.
జవాబు:
విద్యార్థులు తమతమ పాఠశాల గ్రంథాలయాలలోని గ్రంథాల పేర్లు, రచయిత పేర్లు రాయగలరు. ఉదా :

గ్రంథమురచయిత
1. ది ఇన్ సైడర్పి.వి. నరసింహారావు
2. నా దేశయువజనులారాఏ.పి.జె. అబ్దుల్ కలాం
3. ద ఇగ్నైటెడ్ మైండ్స్ ( ఒక విజేత ఆత్మ కథ)ఏ.పి.జె. అబ్దుల్ కలాం
4. కొన్ని కలలుకొన్ని మెలకువలు వాడ్రేవు చినవీర భద్రుడు
5. మహా ప్రస్థానంశ్రీశ్రీ
6. కన్యాశుల్కంగురజాడ అప్పారావు
7. అమృతం కురిసిన రాత్రిదేవరకొండ బాలగంగాధర్ తిలక్
8. మైండ్ పవర్యండమూరి వీరేంద్రనాథ్
9. విజయానికి ఐదు మెట్లుయండమూరి వీరేంద్రనాథ్
10. కృష్ణపక్షందేవులపల్లి కృష్ణశాస్త్రి
11. వేమన శతకంవేమన
12. సుమతీ శతకంబద్దెన
13. వేయిపడగలువిశ్వనాథ సత్యనారాయణ
14. విశ్వంభరసి. నారాయణరెడ్డి
15. టీచర్యస్. ఏ. వార్నర్
16. పిల్లలు ఎలా నేర్చుకుంటారు?జాన్ హోల్డ్
17. మనసు భాష – మైండ్ మేజిక్ (NLP)బి.వి. పట్టాభిరామ్
18. విజయం మీదేబి.వి. పట్టాభిరామ్
19. మీరే విజేతలు ! విజయాలన్నీ మీవేసి.వి. సర్వేశ్వరశర్మ
20. ఆటలతో పాఠాలుమన్నవ గిరిధరరావు మొదలైనవి.