AP 7th Class Science Important Questions Chapter 1 ఆహారంతో ఆరోగ్యం

These AP 7th Class Science Important Questions 1st Lesson ఆహారంతో ఆరోగ్యం will help students prepare well for the exams.

AP Board 7th Class Science 1st Lesson Important Questions and Answers ఆహారంతో ఆరోగ్యం

7th Class Science 1st Lesson 2 Marks Important Questions and Answers

ప్రశ్న 1.
శక్తినిచ్చే పోషకాలు అని వేటిని పిలుస్తారు?
జవాబు:
పిండిపదార్థాలను శక్తినిచ్చే పోషకాలు అంటారు. ఇవి చాలా ఆహార పదార్థాలలో ఉంటాయి.

ప్రశ్న 2.
పిండిపదార్థాలను ఎలా పరీక్షిస్తారు?
జవాబు:
అయోడిన్ పరీక్ష ద్వారా పిండిపదార్థాన్ని నిర్ధారిస్తాము.

ప్రశ్న 3.
చక్కెరలను ఎలా పరీక్షిస్తారు?
జవాబు:
బెనెడిక్ట్ ద్రావణ పరీక్ష ద్వారా చక్కెరలను నిర్ధారిస్తారు.

AP 7th Class Science Important Questions Chapter 1 ఆహారంతో ఆరోగ్యం

ప్రశ్న 4.
ప్రొటీన్స్ లభించే ఆహారపదార్థాలు తెలపండి.
జవాబు:
మాంసం, చేపలు, గుడ్లు, తృణధాన్యాలు, సోయాచిక్కుడు మొదలైన వాటినుండి మనకు మాంసకృత్తులు లభిస్తాయి.

ప్రశ్న 5.
క్రొవ్వులను ఎలా పరీక్షిస్తాము?
జవాబు:
కాగితం పరీక్ష ద్వారా క్రొవ్వులను పరీక్షిస్తాము. నూనెలు కాగితాన్ని పారదర్శక పదార్థంగా మారుస్తాయి.

ప్రశ్న 6.
క్రొవ్వులు లభించే ఆహార పదార్థాలు తెలపండి.
జవాబు:
వెన్న, నెయ్యి, వంటనూనెల నుండి మనకు క్రొవ్వు పదార్థాలు లభిస్తాయి.

ప్రశ్న 7.
అయోడిన్ పొందటానికి నీవు ఏ ఆహారం తీసుకొంటావు?
జవాబు:
సముద్ర ఆహారం, అయోడిన్ ఉప్పు వాడటం వలన అయోడిన్ పొందవచ్చు.

ప్రశ్న 8.
ఇనుము అధికంగా కలిగిన ఆహారపదార్థాలను పేర్కొనుము.
జవాబు:
మాంసం, ఎండిన ఫలాలు, ఆకుపచ్చని కూరగాయలలో ఇనుము అధికంగా లభిస్తుంది.

ప్రశ్న 9.
ప్రొటీన్స్ లోపం వలన కలిగే వ్యాధి ఏమిటి?
జవాబు:
ప్రొటీన్స్ లోపం వలన క్వాషియార్కర్ వ్యాధి కలుగుతుంది.

AP 7th Class Science Important Questions Chapter 1 ఆహారంతో ఆరోగ్యం

ప్రశ్న 10.
మరాస్మస్ వ్యాధి ఎందుకు కలుగుతుంది?
జవాబు:
ప్రొటీన్స్ మరియు పిండిపదార్థం దీర్ఘకాలికంగా లోపించటం వలన మరాస్మస్ వ్యాధి కలుగుతుంది.

ప్రశ్న 11.
అధిక ఆహారం తీసుకొంటే ఏమి జరుగుతుంది?
జవాబు:
అధిక ఆహారం వలన స్థూలకాయత్వం కలుగుతుంది.

ప్రశ్న 12.
NIN ఉద్దేశం ఏమిటి?
జవాబు:
ఆహారం మరియు పోషణకు సంబంధించిన పరిశోధనలు NINలో జరుగుతాయి.

ప్రశ్న 13.
సేంద్రియ వ్యవసాయం అనగానేమి?
జవాబు:
రసాయనాలు లేకుండా సాగుచేసే పద్ధతిని సేంద్రియ వ్యవసాయం అంటారు.

ప్రశ్న 14.
FSSAI సంస్థ ఉద్దేశం ఏమిటి?
జవాబు:
FSSAI సంస్థ కలుషిత ఆహారపదార్థాల నియంత్రణకు కృషిచేస్తుంది.

AP 7th Class Science Important Questions Chapter 1 ఆహారంతో ఆరోగ్యం

ప్రశ్న 15.
ఎటువంటి నీటిని మనం తీసుకోవాలి?
జవాబు:
వేడిచేసి చల్లార్చిన నీటిని త్రాగటానికి ప్రాధాన్యత ఇవ్వాలి.

7th Class Science 1st Lesson 4 Marks Important Questions and Answers

ప్రశ్న 1.
మాంసకృత్తులు గురించి రాయండి.
జవాబు:

  1. కండరాలు మరియు శరీర అవయవాలు ఏర్పడటానికి మాంసకృత్తులు అవసరం.
  2. కాబట్టి మాంసకృత్తులను శరీర నిర్మాణ పోషకాలు అంటారు.
  3. ఇవి శరీరంలోని జీవ రసాయన చర్యలను నియంత్రిస్తాయి.
  4. మాంసకృత్తులు శరీరంలోని గాయాలను బాగుచేసి నయం చేస్తాయి.
  5. వ్యాధుల నుండి కోలుకోవటానికి రోగనిరోధక శక్తిని పెంచుకోవటానికి ప్రొటీన్స్ మనకు అవసరం.

ప్రశ్న 2.
క్రొవ్వులు గురించి రాయండి.
జవాబు:

  1. మన శరీరానికి క్రొవ్వు ఇంధన వనరుగా ఉపయోగపడుతుంది.
  2. కావున వీటిని శక్తిని ఇచ్చే పోషకాలు అంటారు.
  3. పిండిపదార్థాలతో పోలిస్తే క్రొవ్వుల నుండి లభించే శక్తి అధికం.
  4. వెన్న, నెయ్యి, నూనెల నుండి మనకు క్రొవ్వు పదార్థాలు లభిస్తాయి.

ప్రశ్న 3.
రక్షక పోషకాలు అంటే ఏమిటి?
జవాబు:

  1. ఖనిజ లవణాలు మరియు విటమిన్ల రక్షక పోషకాలు అంటారు.
  2. ఇవి మన శరీర వ్యాధినిరోధకతను పెంచుతాయి.
  3. ఇవి ప్రధానంగా కూరగాయలు, ఆకుకూరలు, పండ్లలో లభిస్తాయి.

AP 7th Class Science Important Questions Chapter 1 ఆహారంతో ఆరోగ్యం

ప్రశ్న 4.
విటమిన్ల లోని రకాలు తెలపండి.
జవాబు:
విటమిన్లు ప్రాథమికంగా రెండు రకాలు. అవి

  1. క్రొవ్వులో కరిగే విటమిన్స్ – ఎ, డి, ఇ, కె.
  2. నీటిలో కరిగే విటమిన్స్ – బి, సి.

ప్రశ్న 5.
ఐరన్, ఫోలిక్ ఆమ్లాల భర్తీ పథకం గురించి రాయండి.
జవాబు:
రక్తహీనతను నివారించడానికి ప్రతివారం ఐరన్‌ఫోలిక్ ఆమ్లాల భర్తీ (Weekly Iron Folic acid Supple ment – WIFS) పథకాన్ని 2012లో ప్రారంభించారు. ఈ కార్యక్రమం. కింద 1 నుండి 12 తరగతులు చదువుతున్న పిల్లలకు ఐరన్ మాత్రలు (పింక్/నీలం రంగు మాత్రలు) ఇస్తారు. ఈ మాత్రలను ఖచ్చితంగా భోజనం తర్వాత తీసుకోవాలి. లేకుంటే వికారం వంటి దుష్ప్రభావాలు కలుగవచ్చు. ఫోలిక్ ఆమ్లము ఒక అనుబంధ పదార్థం కావున అది రక్తంలోకి ఆహారంతో కలిసి ప్రవేశించాలి.

ప్రశ్న 6.
NIN గురించి రాయండి.
జవాబు:
నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ (NIN) 1918లో స్థాపించబడింది. ఇప్పుడు హైదరాబాద్ నందు ఉంది. ఈ సంస్థ యొక్క కార్యకలాపాలు విస్తృత – ఆధారితమైనవి, ఆహారం మరియు పోషణకు సంబంధించి సంపూర్ణ పరిశోధన జరుగుతోంది.

ప్రశ్న 7.
పిల్లల ఆరోగ్యంపై జంక్ ఫుడ్స్ ప్రభావం ఏమిటి?
జవాబు:
పిజ్జా, బర్గర్స్, చిప్స్, ఫాస్ట్ ఫుడ్స్, నూడుల్స్, కూల్ డ్రింక్స్ మొదలైనవి జంక్ ఫుడ్స్. అవి ఎక్కువ కొవ్వులు కలిగి ఉంటాయి. పీచుపదార్థాలను కలిగి ఉండవు. వాటిని సులభంగా జీర్ణించుకోలేము. రోజూ జంక్ ఫుడ్ తినడం వల్ల మన జీర్ణవ్యవస్థ దెబ్బతింటుంది. మన శరీరం అవసరమైన ఇతర పోషకాలను కోల్పోతుంది. ఇది ఊబకాయం మరియు ఇతర ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది.

ప్రశ్న 8.
సేంద్రియ ఆహారం గురించి రాయండి.
జవాబు:
మట్టిని సజీవంగా ఉంచడానికి సేంద్రీయ ఎరువులు మరియు సేంద్రీయ పురుగుమందులను ఉపయోగించి వ్యవసాయం చేసే పద్ధతిని సేంద్రీయ వ్యవసాయం అంటారు. సేంద్రీయ వ్యవసాయం కింద పండించిన పండ్లు మరియు కూరగాయలతో తయారు చేసిన ఆహార పదార్థాలను సేంద్రీయ ఆహారాలు అంటారు. ఇవి ఆరోగ్యానికి మంచివి. ఈ రోజుల్లో రైతులు మరియు ప్రజలు సేంద్రీయ వ్యవసాయం మరియు సేంద్రీయ ఆహారపదార్థాలపై ఆసక్తి చూపుతున్నారు.

AP 7th Class Science Important Questions Chapter 1 ఆహారంతో ఆరోగ్యం

ప్రశ్న 9.
మన ఆరోగ్యం ఆధారపడే అంశాలు ఏమిటి?
జవాబు:
మన ఆరోగ్యం కొరకు మనం కొన్ని నియమాలు పాటించాలి. అవి

  1. సమతుల్య ఆహారం తీసుకోవటం
  2. ఆహార పరిశుభ్రత పాటించటం
  3. రోజువారి వ్యాయామం
  4. ఆరోగ్యకరమైన అలవాట్లు పెంచుకోవటం

ప్రశ్న 10.
ప్రొటీన్ను అందించే సాంప్రదాయ వంటకాలు ఏమిటి?
జవాబు:
మన సంప్రదాయ ఆహారపదార్థాలైన పెసరట్టు, మినపట్టు, గారె, వడ, పునుగులు, సున్నుండలు, ఇడ్లీ మొదలైన వాటిలో చాలా ప్రొటీన్స్ ఉన్నాయి.

7th Class Science 1st Lesson 8 Marks Important Questions and Answers

ప్రశ్న 1.
ఆహార పదార్థాలలోని ప్రధాన అంశాలను వాటి ప్రాధాన్యతను వివరించండి.
జవాబు:

ఆహార అంశము ప్రాధాన్యత
1. పిండిపదార్థం శక్తిని ఇచ్చే పోషకాలు.
2. ప్రొటీన్స్ శరీర నిర్మాణ పోషకాలు, కండరాలను ఏర్పరుస్తాయి.
3. క్రొవ్వులు శక్తి పోషకాలు తక్కువ పరిమాణంలో అవసరమౌతాయి.
4. పీచుపదార్థం ఆహార కదలికకు తోడ్పడి మలబద్దకం నివారిస్తుంది.
5. ఖనిజ లవణాలు, విటమిన్స్ వీటిని రక్షక పోషకాలు అంటారు. వ్యాధి నిరోధకత పెంచును.
6. నీరు ఉష్ణోగ్రత క్రమత, వ్యర్థాల విసర్జన ఆహార కదలికలకు తోడ్పడును.

ప్రశ్న 2.
వివిధ విటమిన్ల పేర్లు, వాటి విధులు, వనరులు లోపం వలన కలిగే వ్యాధులను పట్టిక రూపంలో రాయండి.
జవాబు:
AP 7th Class Science Important Questions Chapter 1 ఆహారంతో ఆరోగ్యం 1

ప్రశ్న 3.
మన సాంప్రదాయ వంటలలో దాగి ఉన్న పోషకాల రహస్యాలు తెలపండి.
జవాబు:
మన ఇంటిలో పండుగ సమయాలలో తయారుచేసే సున్నుండలు, బూరెలు, సంపూర్ణ ఆహారం జాబితాలోకే వస్తాయి. సున్నుండలు చేయడానికి ఉపయోగించే పదార్థాలు చూసారా? మినపపిండికి (మాంసకృత్తులు), బెల్లం (పిండిపదార్థం, ఇనుము) కలిపి, నెయ్యి (కొవ్వులు) వేసి ఉండలుగా నొక్కుతారు. బూరెలు చేయడానికి ఉడికించిన సెనగపప్పును (మాంసకృత్తులు) బెల్లంతో కలిపి పూర్ణమును తయారుచేయాలి.

ఈ పూర్ణం బంతులను మినపపిండి, వరిపిండి మరియు నీరు కలిపిన మిశ్రమంలో ముంచి నూనెలో వేయించాలి. ఈ సాంప్రదాయ వంటలు పిల్లలు బాగా ఎదగటానికి దోహదం చేస్తాయి. అందుకే వీటిని తప్పనిసరిగా వండుతారు. అందరికీ పంచుతూ ఉంటారు. స్వీట్ స్టాలో లభిస్తున్న చాలా తినుబండారాలు సంపూర్ణ ఆహారాలే కాదు ఆరోగ్యానికి మంచివి కావు. కనుక ఇంటిలో చేసే గారెలు, జంతికలు, సున్నుండలు, లడ్డూలు బాగా తినండి.

AP 7th Class Science Important Questions Chapter 1 ఆహారంతో ఆరోగ్యం

ప్రశ్న 4.
ఈ క్రింది పట్టికలో తెలిపిన వాక్యాలను నిర్ధారించండి.
జవాబు:

ప్రకటిత అంశము ఆరోగ్యకరం /
అనారోగ్యకరం / చెప్పలేము
1. మొక్కజొన్న, బార్లీ, రాగులు, జొన్నలు, గోధుమలు వంటి ధాన్యాలను తినడం ఆరోగ్యం
2. గోధుమపిండిలో పీచును వేరుచేసి చపాతీలను తయారుచేయడం అనారోగ్యం
3. మజ్జిగ, లస్సీ, షర్బత్, నిమ్మరసాలను త్రాగడం ఆరోగ్యం
4. రోజూ తెల్లని రొట్టె, బన్, నూడుల్స్ ను తినడం ఆరోగ్యం
5. ఆహారం తినడానికి ముందు లేక తిన్న తరువాత వెంటనే టీ, కాఫీలను త్రాగడం అనారోగ్యం
6. బెల్లం మరియు చిక్కీల వినియోగ ఆరోగ్యం
7. మొలకెత్తిన విత్తనాలను తినడం ఆరోగ్యం
8. రోడ్డు ప్రక్కల అమ్మే సమోసా, చాట్ మొదలైనవి రోజూ తినడం అనారోగ్యం
9. ఆహార ప్యాకెట్లను కొనేటప్పుడు తయారీ తేదీ, గడువు ముగిసే తేదీ, గరిష్ట ధర, మొ|| వివరాలు చూడడం ఆరోగ్యం
10. కడగకుండా పండ్లను తినడం అనారోగ్యం

ప్రశ్న 5.
కలుషిత ఆహారపదార్థాలను నియంత్రించటానికి FSSAI సూచించిన సూచనలు ఏమిటి?
జవాబు:
కలుషిత ఆహార పదార్థాలను నియంత్రించడానికి FSSAI అను సంస్థ ఏర్పాటైనది. ఈ కింద సూచించిన 7C లు మంచి ఆరోగ్యం పొందడానికి తోడ్పడతాయి.

  1. Check : తాజా ఆహారాన్ని తనిఖీ చేసి ఎంచుకోండి.
  2. Clean : ఆహారాన్ని నిల్వ చేయడానికి ముందు అన్ని పాత్రలను కడండి మరియు తుడవండి.
  3. Cover : అన్ని ఆహార మరియు త్రాగునీటిని నిల్వ చేసే ప్రదేశంలో మూతలు ఉంచండి.
  4. Cross contamination avoided : వండని మరియు వండిన ఆహారాన్ని వేరుగా ఉంచండి.
  5. Cook : ఆహారాన్ని బాగా ఉడికించి, తాజాగా వండినదైనట్లు చూసుకోండి.
  6. Cool Chill : మాంసం, కోడిమాంసం, గుడ్డు మరియు ఇతర పాడైపోయే వస్తువులను శీతలీకరించండి.
  7. Consume : పరిశుభ్రమైన వాతావరణంలో ఆహారాన్ని వడ్డించండి మరియు శుభ్రమైన పాత్రలను వాడండి.

AP Board 7th Class Science 1th Lesson 1 Mark Bits Questions and Answers ఆహారంతో ఆరోగ్యం

I. బహుళైచ్ఛిక ప్రశ్నలు

కింది వాటికి సరియైన జవాబులు గుర్తించండి.

1. ఆహారపదార్థాలలో పోషకాలు కానిది గుర్తించండి.
A) పిండిపదార్థం
B) మాంసకృత్తులు
C) నీరు
D) కొవ్వులు
జవాబు:
C) నీరు

2. స్థూల పోషకాలు ఏవి?
A) పిండిపదార్థం
B) మాంసకృత్తులు
C) క్రొవ్వులు
D) నీరు
జవాబు:
D) నీరు

AP 7th Class Science Important Questions Chapter 1 ఆహారంతో ఆరోగ్యం

3. సూక్ష్మ పోషకాలు
A) విటమిన్స్
B) ఖనిజలవణాలు
C) రెండూ
D) నీరు
జవాబు:
C) రెండూ

4. బెనెడిక్ట్ ద్రావణం ద్వారా వేటిని నిర్ధారిస్తాము?
A) పిండిపదార్థం
B) చక్కెర
C) గ్లూకోజ్
D) క్రొవ్వు
జవాబు:
B) చక్కెర

5. శక్తిని ఇచ్చే వనరులు
A) పిండిపదార్థం
B) క్రొవ్వులు
C) A మరియు B
D)మాంసకృత్తులు
జవాబు:
C) A మరియు B

6. అయోడిన్ పరీక్ష ద్వారా వేటిని నిర్ధారిస్తాము?
A) విటమిన్-ఎ
B) పిండిపదార్థం
C) విటమిన్-సి
D) విటమిన్-బి
జవాబు:
A) విటమిన్-ఎ

7. శరీర నిర్మాణ పోషకాలు
A) పిండిపదార్థం
B) ప్రొటీన్స్
C) క్రొవ్వులు
D) విటమిన్స్
జవాబు:
B) ప్రొటీన్స్

8. క్రిందివాటిలో భిన్నమైనది
A) అన్నము
B) గుడ్డుసొన
C) గోధుమపిండి
D) జొన్నపిండి
జవాబు:
B) గుడ్డుసొన

AP 7th Class Science Important Questions Chapter 1 ఆహారంతో ఆరోగ్యం

9. ఈ క్రిందివాటిలో భిన్నమైనది
A) సోయాచిక్కుళ్ళు
B) నెయ్యి
C) పాలు
D) మాంసం
జవాబు:
B) నెయ్యి

10. దృఢమైన ఎముకలు మరియు దంతాలకు ఏమి
A) కాల్షియం
B) ఇనుము
C) భాస్వరం
D) అయోడిన్
జవాబు:
A) కాల్షియం

11. శరీరంలో రక్తం ఏర్పడటానికి ఏ లవణం అవసరం?
A) ఇనుము
B) భాస్వరం
C) అయోడిన్
D) సోడియం
జవాబు:
A) ఇనుము

12. అయోడిన్ ద్రావణంతో ఏ విటమినను నిర్ధారించవచ్చు?
A) పిండిపదార్థం
B) నూనె
C) మాంసం
D) పాలు
జవాబు:
C) మాంసం

13. మన శరీర బరువులో మూడింట రెండు వంతులు ఉండే పదార్థం
A) పిండిపదార్థం
B) నీరు
C) మాంసకృత్తులు
D) అయోడిన్
జవాబు:
B) నీరు

14. అన్ని పోషకాలు కలిగిన ఆహారం :
A) సంతులిత ఆహారం
B) బలమైన ఆహారం
C) ఆరోగ్య ఆహారం
D) పైవన్నీ
జవాబు:
A) సంతులిత ఆహారం

15. పోషణపై పరిశోధన చేయు సంస్థ
A) NIN
B) IFSST
C) FSSAL
D) AISC
జవాబు:
A) NIN

16. FSSAI ప్రధాన ఉద్దేశం
A) పోషకాల పరిశీలన
B) కత్తీ నివారణ
C) ఆరోగ్యవృద్ధి
D) అందరికీ ఆహారం
జవాబు:
B) కత్తీ నివారణ

AP 7th Class Science Important Questions Chapter 1 ఆహారంతో ఆరోగ్యం

17. శిశువుల ఆహారంలో ఉండే పోషకాలు
A) పిండిపదార్థం
B) ప్రొటీన్స్
C) లిపిడ్
D) B మరియు C
జవాబు:
D) B మరియు C

II. ఖాళీలను పూరించుట

కింది ఖాళీలను పూరింపుము.

1. ఎక్కువ పరిమాణంలో అవసరమయ్యే పోషకాలను ………….. అంటారు
2. ……………….. లు సూక్ష్మపోషకాలు.
3. ………………… మన శరీరానికి శక్తిని ఇచ్చే వనరులు.
4. పిండిపదార్థం యొక్క సరళ రూపం …………….
5. పిండిపదార్థాన్ని ……………… పరీక్ష ద్వారా నిర్ధారిస్తాము.
6. చక్కెరల నిర్ధారణకు …………. పరీక్షలు చేస్తాము.
7. అయోడిన్ పిండిపదార్థాన్ని ……………… రంగుకు మార్చుతుంది.
8. కండరాలు శరీర అవయవాలు ఏర్పడటానికి ………………. అవసరం.
9. ………….. ను శరీర నిర్మాణ పోషకాలు అంటారు.
10. …………….. శరీరంలోని గాయాలను బాగు చేస్తాయి.
11. కొవ్వులు కార్బొహైడ్రేట్స్ తో పోలిస్తే …………. శక్తిని ఇస్తాయి.
12. కాపర్ సల్ఫేట్ సోడియం హైడ్రాక్సైడ్ మిశ్రమంను ……………. నిర్ధారణకు వాడతారు.
13. కాగితం పరీక్ష ద్వారా ………….. నిర్ధారించవచ్చు.
14. ………….. లోపం వలన రక్తహీనత వస్తుంది.
15. దృష్టి సమస్యలకు కారణం. ……………… లోపము.
16. సముద్ర ఆహారం నుండి …………… లభిస్తుంది.
17. బలమైన ఎముకలు, దంతాలు తయారీకి ………….. కావాలి.
18. నీటిలో కరిగే విటమిన్లు …………..
19. విటమిన్ కె లోపం వలన ………….. గడ్డకట్టదు.
20. విటమిన్ సి రసాయనిక నామం ………………
21. తగినంత పీచుపదార్థం లేకపోవుట వలన …………… కలుగుతుంది.
22. సరైన మోతాదులో అన్ని పోషకాలు కలిగిన ఆహారం
23. NIN………………………. లో ఉంది.
24. NIN ను విస్తరించండి. …………
25. ………….. ఫుడ్స్ జీర్ణవ్యవస్థను దెబ్బతీస్తాయి.
26. రసాయనాలు వాడని వ్యవసాయం ……………. వ్యవసాయం.
27. కలుషిత ఆహార నియంత్రణకు ఏర్పడిన సంస్థ ……………..
28. పోషకాహార లోపం ఎక్కువ కాలంపాటు కొనసాగితే ……………… వస్తాయి.
29. ……………… వలన ఊబకాయం కలుగుతుంది.
30. బెల్లంలో ……………. సంవృద్ధిగా ఉంటుంది.
31. శరీరానికి తగినంత పోషకాలు లభించనపుడు ………………. లోపం ఏర్పడును.
32. మాంసకృత్తుల లోపం వలన ………………. అనే వ్యాధి వస్తుంది.
33. మాంసకృత్తులు, పిండిపదార్థాలు లోపిస్తే …………. అనే వ్యాధి వస్తుంది.
34. ఎక్కువ ఆహారాన్ని తీసుకోవటం …………… దారితీస్తుంది.
జవాబు:

  1. స్థూల పోషకాలు
  2. ఖనిజాలు మరియు విటమిన్లు
  3. పిండిపదార్థాలు
  4. గ్లూకోజ్
  5. అయోడిన్
  6. బెనెడిక్ట్
  7. నీలి నలుపు
  8. మాంసకృత్తులు
  9. ప్రొటీన్స్
  10. మాంసకృత్తులు
  11. ఎక్కువ
  12. ప్రొటీన్స్
  13. నూనెలను
  14. ఐరన్
  15. విటమిన్-ఎ
  16. అయోడిన్
  17. బి మరియు సి
  18. రక్తం
  19. ఆస్కార్బిక్ ఆమ్లం
  20. మలబద్దకం
  21. సంతులిత ఆహారం
  22. హైదరాబాద్
  23. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్
  24. జంక్
  25. సేంద్రీయ
  26. FSSAI
  27. వ్యాధులు
  28. జంక్ ఫుడ్స్
  29. ఐరన్
  30. పోషకాహార లోపం
  31. క్వాషియార్కర్
  32. మెరాస్మస్
  33. ఊబకాయానికి

III. జతపరుచుట

కింది వానిని జతపరుచుము.
1.

Group – A Group – B
A) అయోడిన్ 1) రక్తహీనత
B) కాపర్‌సల్పేట్ 2) పిండిపదార్థం
C) కాగితం పరీక్ష 3) విటమిన్-సి నిర్ధారణ
D) నీలి-నలుపు రంగు 4) ప్రొటీన్స్ పరీక్ష
E) పాలిపోయిన చర్మం 5) క్రొవ్వుల నిర్ధారణ
6) నీరు

జవాబు:

Group – A Group – B
A) అయోడిన్ 3) విటమిన్-సి నిర్ధారణ
B) కాపర్‌సల్పేట్ 4) ప్రొటీన్స్ పరీక్ష
C) కాగితం పరీక్ష 5) క్రొవ్వుల నిర్ధారణ
D) నీలి-నలుపు రంగు 2) పిండిపదార్థం
E) పాలిపోయిన చర్మం 1) రక్తహీనత

2.

Group – A Group – B
A) ఎముకలు మరియు దంతాలు 1) జింక్
B) రక్తం తయారీ 2) కాల్సియం
C) థైరాయిడ్ హార్మోన్ 3) ఉప్పు
D) నీటిని పట్టి ఉంచటం 4) ఇనుము
E) వ్యా ధి నిరోధకత 5) అయోడిన్
6) మాలిబ్డినం

జవాబు:

Group – A Group – B
A) ఎముకలు మరియు దంతాలు 2) కాల్సియం
B) రక్తం తయారీ 4) ఇనుము
C) థైరాయిడ్ హార్మోన్ 5) అయోడిన్
D) నీటిని పట్టి ఉంచటం 3) ఉప్పు
E) వ్యా ధి నిరోధకత 1) జింక్

3.

Group – A Group – B
A) రికెట్స్ 1) విటమిన్ – E
B) స్కర్వీ 2) విటమిన్ – D
C) కళ్ళు 3) విటమిన్ – K
D) రక్తం 4) విటమిన్ – A
E) వంధ్యత్వం 5) విటమిన్ – C

జవాబు:

Group – A Group – B
A) రికెట్స్ 2) విటమిన్ – D
B) స్కర్వీ 5) విటమిన్ – C
C) కళ్ళు 4) విటమిన్ – A
D) రక్తం 3) విటమిన్ – K
E) వంధ్యత్వం 1) విటమిన్ – E

మీకు తెలుసా?

రక్తహీనతను నివారించడానికి ప్రతివారం ఐరన్‌ఫోలిక్ ఆమ్లాల భర్తీ (Weekly Iron Folic acid Supplement – WIFS) పథకాన్ని 2012లో ప్రారంభించారు. ఈ కార్యక్రమం కింద 1 నుండి 12 తరగతులు చదువుతున్న పిల్లలకు ఐరన్ మాత్రలు (పింక్/నీలం రంగు మాత్రలు) ఇస్తారు. ఈ మాత్రలను ఖచ్చితంగా భోజనం తర్వాత తీసుకోవాలి. లేకుంటే వికారం వంటి దుష్ప్రభావాలు కలుగవచ్చు. ఫోలిక్ ఆమ్లము ఒక అనుబంధ పదార్థం కావున అది రక్తంలోకి ఆహారంతో కలిసి ప్రవేశించాలి.

మలబద్దకం :
ఆయుర్వేదంలో వివరించిన విబంధను పోలి ఉండే వ్యాధి మలబద్దకము. ఇది అరుదుగా, కష్టంగా మల విసర్జన జరిగే స్థితిని మనకు కలిగిస్తుంది. ఇది చాలామంది ప్రజలకు ఏదో ఒక సందర్భంలో అనుభవంలోకి వచ్చే జీర్ణనాళ – పేగుకు సంబంధించిన వ్యాధి. తగినంత పీచు పదార్థం, నీరు తీసుకోకపోవడం లేదా కొన్ని మందుల దుష్ప్రభావం వలన మలబద్ధకం కలగవచ్చు.

సాంప్రదాయ ఆహారంతో ఆనందం, ఆరోగ్యం :
మన ఇంటిలో పండుగ సమయాలలో తయారుచేసే సున్నుండలు, బూరెలు, సంపూర్ణ ఆహారం జాబితాలోకే వస్తాయి. సున్నుండలు చేయడానికి అమ్మ ఉపయోగించే పదార్థాలు చూసారా ? మినపపిండికి (మాంసకృత్తులు), బెల్లం (పిండిపదార్థం, ఇనుము) కలిపి, నెయ్యి (కొవ్వులు) వేసి ఉండలుగా నొక్కుతారు. బూరెలు చేయడానికి ఉడికించిన సెనగపప్పును (మాంసకృత్తులు) బెల్లంతో కలిపి పూర్ణమును తయారుచేయాలి. ఈ పూర్ణం బంతులను మినపపిండి, వరిపిండి మరియు నీరు కలిపిన మిశ్రమంలో ముంచి నూనెలో వేయించాలి. ఈ సాంప్రదాయ వంటలు పిల్లలు బాగా ఎదగటానికి దోహదం చేస్తాయి. అందుకే వీటిని తప్పనిసరిగా వండుతారు. అందరికీ పంచుతూ ఉంటారు. స్వీట్ స్టాల్స్ లో లభిస్తున్న చాలా తినుబండారాలు సంపూర్ణ ఆహారాలే కాదు ఆరోగ్యానికి మంచివి కావు. కనుక ఇంటిలో చేసే గారెలు, జంతికలు, సున్నుండలు, లడ్డూలు బాగా తినండి.

పిజ్జా, బర్గర్స్, చిప్స్, ఫాస్టఫుడ్స్, నూడుల్స్, కూల్ డ్రింక్స్ మొదలైనవి జంక్ ఫుడ్స్. అవి ఎక్కువ కొవ్వులు కలిగి ఉంటాయి. పీచుపదార్థాలను కలిగి ఉండవు. వాటిని సులభంగా జీర్ణించుకోలేము. రోజూ జంక్ ఫుడ్ తినడం వల్ల మన జీర్ణవ్యవస్థ దెబ్బతింటుంది. మన శరీరం అవసరమైన ఇతర పోషకాలను కోల్పోతుంది. ఇది ఊబకాయం మరియు ఇతర ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది.

AP 7th Class Science Important Questions Chapter 1 ఆహారంతో ఆరోగ్యం

సేంద్రియ ఆహారం :
మట్టిని సజీవంగా ఉంచడానికి సేంద్రీయ ఎరువులు మరియు సేంద్రీయ పురుగుమందులను ఉపయోగించి వ్యవసాయం చేసే పద్ధతిని సేంద్రీయ వ్యవసాయం అంటారు. సేంద్రీయ వ్యవసాయం కింద పండించిన పండ్లు మరియు కూరగాయలతో తయారు చేసిన ఆహార పదార్థాలను సేంద్రీయ ఆహారాలు అంటారు. ఇవి ఆరోగ్యానికి మంచివి. ఈ రోజుల్లో రైతులు మరియు ప్రజలు సేంద్రీయ వ్యవసాయం మరియు సేంద్రీయ ఆహారపదార్థాలపై ఆసక్తి చూపుతున్నారు.