These AP 7th Class Science Important Questions 12th Lesson నేల మరియు నీరు will help students prepare well for the exams.
AP Board 7th Class Science 12th Lesson Important Questions and Answers నేల మరియు నీరు
7th Class Science 12th Lesson 2 Marks Important Questions and Answers
ప్రశ్న 1.
పెడాలజి అనగానేమి?
జవాబు:
మృత్తిక గూర్చిన శాస్త్రీయ అధ్యయనాన్ని పెడాలజి అంటారు.
ప్రశ్న 2.
నీటి ప్రవాహాల ఒడ్డున ఉండే రాళ్ళు ఎలా ఉంటాయి?
జవాబు:
నీటి ప్రవాహాల ఒడ్డున ఉండే రాళ్ళు గుండ్రంగా నునుపుతేలి ఉంటాయి.
ప్రశ్న 3.
నీటి ప్రవాహంలో రాళ్ళు దొర్లటం వలన ఏమి జరుగుతుంది?
జవాబు:
నీటి ప్రవాహంలో రాళ్ళు దొర్లటం వలన అరిగి మృత్తిక ఏర్పడుతుంది.
ప్రశ్న 4.
వినాయక విగ్రహాల తయారీకి ఏ మట్టి అనుకూలం?
జవాబు:
బంకమట్టి విరిగిపోకుండా విగ్రహాల తయారీకి బాగా పనికి వస్తుంది.
ప్రశ్న 5.
నేలలోని తేమ శాతం అనగానేమి?
జవాబు:
మట్టిలో చేరగలిగిన నీటి ద్రవ్యరాశికి, పొడిమట్టి ద్రవ్యరాశికి మధ్యనున్న నిష్పత్తిని నేలలోని తేమ శాతం అంటారు.
ప్రశ్న 6.
నీటి ద్రవ్యరాశి అనగానేమి?
జవాబు:
తేమగా ఉన్న మట్టి మరియు ఎండిన తరువాత మట్టి ద్రవ్యరాశుల మధ్య భేదాన్ని నీటి ద్రవ్యరాశిగా నిర్ధారిస్తారు.
ప్రశ్న 7.
పెర్కొలేషన్ అనగానేమి?
జవాబు:
నేల పొరల ద్వారా నీరు క్రిందకు కదలడాన్ని పేర్కొలేషన్ అంటారు.
ప్రశ్న 8.
నీటి సంరక్షణకు ఉపయోగించే 4R సూత్రం ఏమిటి?
జవాబు:
పునఃవృద్ధి (Recharge), పునర్వినియోగం (Re-use), పునరుద్ధరించటం (Revive) మరియు తగ్గించటం (Reduce).
ప్రశ్న 9.
నీటిలోని సూక్ష్మజీవులను చంపటానికి వాడే రసాయనం ఏమిటి?
జవాబు:
క్లోరిన్, దీనికోసం నీటికి బ్లీచింగ్ పౌడర్ కలుపుతారు.
ప్రశ్న 10.
ఆధునిక నీటి శుద్ధి యంత్రాలలో దేని సాయంతో సూక్ష్మజీవులను చంపుతారు?
జవాబు:
అతినీల లోహిత కిరణాలు వాడి, ఆధునిక శుద్ది యంత్రంతో సూక్ష్మజీవులను చంపుతారు.
ప్రశ్న 11.
ఆక్విఫర్ అనగానేమి?
జవాబు:
భూమి రాతి పొరలలో నిల్వచేయబడిన భూగర్భజలాన్ని ఆక్విఫర్ అంటారు.
ప్రశ్న 12.
ప్రపంచ జల దినోత్సవం ఎప్పుడు?
జవాబు:
మార్చి 22
ప్రశ్న 13.
మురుగు నీటి వలన కలుగు వ్యాధులు ఏమిటి?
జవాబు:
కలరా, టైఫాయిడ్, హెపటైటిస్.
ప్రశ్న 14.
నీరు భూగర్భంలోనికి ఎలా చేరుతుంది?
జవాబు:
వర్షము మరియు ఇతర ఉపరితల ప్రవాహాల నుండి వచ్చే నీరు భూమి లోనికి వెళ్లి ఖాళీ ప్రదేశాలు మరియు పగుళ్లు లేని ప్రదేశంలో నీటిని నింపుతుంది. ఈ విధంగా భూగర్భ జలాలు ఏర్పడతాయి. భూమి లోనికి నీరు ఇంకే ప్రక్రియను ఇన్ ఫిల్టరేషన్ అంటారు. భూగర్భ జల ఉపరితలాన్ని భూగర్భ జల మట్టం అంటారు.
ప్రశ్న 15.
ఆధునిక నీటి శుద్ధి యంత్రాలు ఎలా పనిచేస్తాయి?
జవాబు:
మన ఇళ్లలో నీటిని శుద్ధి చేయడానికి ఉపయోగించే యంత్రాలలో ఫిల్టర్ యూనిట్ మరియు అతి నీలలోహిత కిరణాలను పంపి నీటిని శుద్ధి చేసే భాగం ఉంటాయి. ఇందులో సూక్ష్మ జీవులను చంపటం కోసం క్లోరిన్ వాయువుకు బదులుగా అతినీలలోహిత కిరణాలను ఉపయోగిస్తారు.
7th Class Science 12th Lesson 4 Marks Important Questions and Answers
ప్రశ్న 1.
మట్టి సుగంధము అనగానేమి? దానికి గల కారణం ఏమిటి?
జవాబు:
వర్షం పడిన తరువాత వెలువడే ఆహ్లాదకరమైన సుగంధమును మట్టి సుగంధము అంటారు. ఇది వర్షం పడినప్పుడు నేల నుండి గాలిలోనికి వెలువడే జియోస్మిన్ అనే పదార్థము కారణంగా కలుగుతుంది. ఈ పదార్థము అక్టినోమైసిటీస్ అను బాక్టీరియా యొక్క స్పోరుల నుండి విడుదల అవుతుంది.
ప్రశ్న 2.
మృత్తిక ఎలా ఏర్పడుతుంది?
జవాబు:
నీటి ప్రవాహాల కారణంగా రాళ్ళు అరిగిపోయి, ఈ చారలు ఏర్పడ్డాయి. ప్రకృతిలో సహజ కారకాలైన గాలి, నీరు,సూర్యుడు మరియు వాతావరణం యొక్క చర్యల ఫలితంగా క్రమంగా శిలలు పగిలిపోయి సన్నని రేణువులుగా విడిపోయి, మృత్తిక ఏర్పడుతుంది. ఈ ప్రక్రియను శైథిల్యం అంటారు. ఒక అంగుళం మృత్తిక ఏర్పడటానికి సుమారు 500-1000 సంవత్సరాలు పడుతుంది. మాతృశిల నుండి ‘శైథిల్య ప్రక్రియ’ ద్వారా మృత్తిక ఏర్పడడాన్ని ‘పీడోజెనెసిస్’ అని అంటారు.
ప్రశ్న 3.
ఏ పరిశీలనల ఆధారంగా మట్టిలోని పదార్థాలను నిర్ధారణ చేస్తావు?
జవాబు:
పరిశీలన | నిర్థారణ |
సంచిలోని నీటి బిందువులు | మట్టి రేణువుల మధ్య నీరు ఉంటుంది. |
నీటిని పోసినప్పుడు వెడలిన గాలి బుడగలు | మట్టి రేణువుల మధ్య గాలి ఉంటుంది. |
నీటిపై ఎండిన మొక్క భాగాలు తేలుట | మట్టిలో సేంద్రియ పదార్థాలు ఉంటాయి. |
బీకరు అడుగుభాగంలో చేరిన మట్టిరేణువులు | మట్టిలో నిరీంద్రియ పదార్థాలు ఉంటాయి. |
కీటకాలు, మొక్క భాగాలు | మట్టిలోని జీవులు. |
ప్రశ్న 4.
ఎడఫాలజీ అనగానేమి?
జవాబు:
జీవులపైన ముఖ్యంగా మొక్కలపైన మృత్తిక యొక్క ప్రభావాన్ని గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఎడఫాలజీ అంటారు. మృత్తికను ఏర్పరిచే కారకాలను ఎడఫిక్ కారకాలు అంటారు.
ప్రశ్న 5.
క్షితిజాలు అనగానేమి?
జవాబు:
ఒక ప్రదేశంలోని నేలను నిలువుగా తవ్వగా కనిపించే ప్రదేశంలో అడ్డు పొరలుగా ఏర్పడిన అంశాలన్నిటినీ కలిపి సాయిల్ ప్రొఫైల్ లేదా మృత్తికా స్వరూపం అంటారు. మృత్తికలోని ప్రతి పొర ఒక నిర్దిష్టమైన వర్ణం, ఆకృతి, లోతు, రసాయన నిర్మాణంలో తేడాను కలిగి ఉంటుంది, వీటినే క్షితిజాలు అంటారు.
ప్రశ్న 6.
నేలకోత అనగానేమి?
జవాబు:
నేల పై పొరలలో అధిక మొత్తంలో పోషకాల రూపంలో ఉండే సేంద్రియ పదార్థం నేలను సారవంతం చేస్తుంది. తుఫానులు, వరదలు నేల పై పొరను కొట్టుకొని పోయేట్లుగా చేసి, నేలను నిస్సారంగా మారుస్తాయి. నేలపై పొర కొట్టుకొని పోవడాన్ని మృత్తికా క్రమక్షయం లేదా నేల కోత అంటారు.
ప్రశ్న 7.
భూమి మీద నీటి లభ్యత వనరులను పట్టిక రూపంలో చూపండి.
జవాబు:
ప్రశ్న 8.
ఆక్విఫర్లు అనగానేమి?
జవాబు:
సాధారణంగా భూగర్భ జలాలు నీటి మట్టానికి కింద గట్టి రాతి పొరల మధ్య నిల్వ చేయబడతాయి. వాటిని ఆక్విఫర్లు అంటారు. బావులు, బోరు బావులు, చేతి పంపులు ఈ ఆక్విఫర్ నుండే నీటిని పొందుతాయి.
ప్రశ్న 9.
మురుగు నీరు అనగానేమి? దాని వలన కలిగే నష్టాలు ఏమిటి?
జవాబు:
గృహాలలోని వివిధ ప్రదేశాల నుండి, పరిశ్రమల నుండి వెలువడే వ్యర్థ జలాన్ని మురుగునీరు అంటారు. మురుగు నీటిలో కరిగిన మరియు తేలియాడే అనేక సేంద్రియ, నిరింద్రియ పదార్థాలతో పాటు వ్యాధి కారక జీవులు ఉంటాయి. ఒకవేళ ఈ మురుగునీరు త్రాగు నీటిలో కలిసినట్లయితే నీటి విరోచనాలు, కలరా, డైసెంట్రీ, టైఫాయిడ్, హెపటైటిస్ వంటి వ్యాధులు కలుగుతాయి.
ప్రశ్న 10.
మురుగు నీటి శుద్ధీకరణలోని దశలు ఏమిటి?
జవాబు:
మురుగు నీటి శుద్ధీకరణలో మూడు దశలు కలవు. అవి :
- ప్రాథమిక దశ – (భౌతిక ప్రక్రియ)
- ద్వితీయ దశ – (జీవ సంబంధ ప్రక్రియ)
- తృతీయ దశ – (రసాయన ప్రక్రియ)
ప్రశ్న 11.
నీటి వృథాను ఎలా తగ్గిస్తావు?
జవాబు:
కొన్ని మంచి అలవాట్లు ద్వారా నీటి వృథాను తగ్గిస్తాము. అవి
- అవసరం లేని సమయంలో కుళాయిని మూసి ఉంచటం.
- బ్రష్ చేసే సమయంలో కుళాయిని ఆపి ఉంచాలి.
- నేలను కడిగే బదులు తుడవటం.
- చేతులు మొక్కలలో కడుక్కోవటం.
- స్నానము నీటిని మొక్కలకు మళ్ళించటం.
ప్రశ్న 12.
మన పరిసరాలను ఎలా పరిశుభ్రంగా ఉంచుకోవాలి?
జవాబు:
- బహిరంగ ప్రదేశాలలోనికి చెత్తను విసిరి వేయకుండా చెత్తబుట్టలను ఉపయోగించాలి.
- బహిరంగ ప్రదేశాలలో మల, మూత్ర విసర్జన చేయరాదు.
- ఘన వ్యర్థాలను మురుగునీటి కాలువలలో వేయరాదు.
- చెత్తను పారవేయుటకు ముందే పొడి చెత్త, తడి చెత్తలను వేరు చేయాలి.
- మన ఇంటి చుట్టుపక్కల పరిసరాలు శుభ్రం చేయనట్లు తెలిసినట్లయితే వెంటనే పారిశుద్ధ్య శాఖ వారికి తెలియజేయాలి.
ప్రశ్న 13.
నీటి వనరుల లభ్యతను వృత్తాకార చార్టులో చూపండి.
జవాబు:
7th Class Science 12th Lesson 8 Marks Important Questions and Answers
ప్రశ్న 1.
నేలలోని వివిధ అంశాలను ఎలా నిర్ధారిస్తావు?
జవాబు:
ముందుగా ఒక పిడికెడు మట్టిని తీసుకొని దానిని పారదర్శకమైన పాలిథిన్ కవర్‌లో వేసి మూతిని గట్టిగా కట్టండి. ఈ కవర్ను ఒకటి లేదా రెండు గంటలపాటు సూర్యరశ్మి క్రింద ఉంచండి. రెండు గంటల తరువాత పాలిథిన్ కవర్ యొక్క లోపలి తలంలో నీటి బిందువులను గమనిస్తారు.
ఒక గాజు బీకరును తీసుకొని దానిని ఈ పిడికెడు మట్టితో నింపండి. తరువాత దానిలో నెమ్మదిగా, జాగ్రత్తగా నీటిని పోయండి. మట్టిలో నుండి నీటి బుడగలు రావడం పరిశీలించారా ? ఇప్పుడు బీకరును నీటితో నింపి, . మట్టిని, నీటిని బాగా కలపాలి. తరువాత కొద్దిసేపు అలాగే వదిలివేయాలి.
పట్టిక
పరిశీలన | నిర్థారణ |
సంచిలోని నీటి బిందువులు | మట్టి రేణువుల మధ్య నీరు ఉంటుంది. |
నీటిని పోసినప్పుడు వెడలిన గాలి బుడగలు | మట్టి రేణువుల మధ్య గాలి ఉంటుంది. |
నీటిపై ఎండిన మొక్క భాగాలు తేలుట | మట్టిలో సేంద్రియ పదార్థాలు ఉంటాయి. |
బీకరు అడుగుభాగంలో చేరిన మట్టిరేణువులు | మట్టిలో నిరీంద్రియ పదార్థాలు ఉంటాయి. |
కీటకాలు, మొక్క భాగాలు | మట్టిలోని జీవులు. |
ప్రశ్న 2.
నేలలోని క్షితిజాలను వివరించండి.
(లేదా)
నేల స్వరూపాన్ని వర్ణించండి.
జవాబు:
ఒక ప్రదేశంలోని నేలను నిలువుగా తవ్వగా కనిపించే ప్రదేశంలో అడ్డు పొరలుగా ఏర్పడిన అంశాలన్నిటినీ కలిపి సాయిల్ ప్రొఫైల్ లేదా మృత్తికా స్వరూపం అంటారు. మృత్తికలోని ప్రతి పొర ఒక నిర్దిష్టమైన వర్ణం, ఆకృతి, *తు, రసాయన నిర్మాణంలో తేడాను కలిగి ఉంటుంది. వీటినే క్షితిజాలు అంటారు.
క్షితిజం (ఉపరితల చెత్త) – ఇది సన్నని, పై పొర, కుళ్ళుతున్న కర్బన్ పదార్థాలు మరియు మొక్కల నుండి రాలిన పత్రాలతో ఏర్పడి ఉంటుంది.
A క్షితిజం (ఉపరితల మృత్తిక) –
ఈ పొర సాధారణంగా గాఢమైన వర్ణంలో వుండి, ఖనిజ లవణాల మిశ్రమమైన హ్యూమనను కలిగి ఉంటుంది. ఇది మృదువైన వదులుగా వున్న మట్టిని కలిగి ఉండి, విత్తనాలు మొలకెత్తడానికి అనువుగా వుంటుంది. ఈ సారవంతమైన పొరలో ఇతర జీవరాశులు ఆవాసాన్ని ఏర్పర్చుకుని ఉంటాయి.
B క్షితిజం (ఉప మృత్తిక) –
తక్కువ మోతాదులో హ్యూమనను కలిగి ఉంటుంది. ఇక్కడ బంకమన్ను మరియు ఎక్కువ ఖనిజాలను కలిగి ఉండి గట్టిగా బిగుతుగా ఉంటుంది.
C క్షితిజం (రాతిపొర) కొద్దిగా విరిగిపోయిన రాతి ముక్కలు చాలా తక్కువ కార్బన్ పదార్థాలు కలిగి ఉంటుంది.
R క్షితిజం (ఆధారశిల) శైథిల్యం చెందని, ‘రాతిపొర’ ఉంటుంది. ఇది దృఢంగా, గట్టిగా వుండి త్రవ్వడానికి అనుకూలంగా ఉండదు.
ప్రశ్న 3.
భూసార పరీక్షలలో ఏ అంశాలను పరిశీలిస్తారు? వీటి వలన రైతులకు వచ్చే లాభము ఏమిటి?
జవాబు:
భూసార పరీక్షలు నిర్వహించడం ద్వారా పొలంలోని నేలను పంటలకు అనుకూలంగా మార్చవచ్చు. పొలంలోని మట్టిని పరీక్షించాలి అంటే ఒక ప్రత్యేకమైన నిర్దిష్ట విధానంలో మట్టిని సేకరించి పరీక్షించి విశ్లేషించాలి. భూసార పరీక్ష ద్వారా పరీక్షించే అంశాలన్నీ మృత్తిక ఆరోగ్య స్థితిని నిర్ణయిస్తాయి.
సాధారణంగా భూసార పరీక్షల ద్వారా ఈ క్రింది అంశాలను పరీక్షించడం జరుగుతుంది. అవి కార్బన్ వంటి సేంద్రియ పదార్థాలు లోపము, నేలలో అందుబాటులో ఉన్న ఖనిజ లవణాలు – నైట్రోజ్, పాస్పరస్, పొటాషియం, అందుబాటులో ఉన్న సూక్ష్మ పోషకాల స్థాయి, సరిపోని నీటి పారుదల, నేల ఉష్ణోగ్రత, తేమ, నేలలోని కాలుష్యకాలు, నేల యొక్క ఆమ్ల లేదా క్షార స్వభావం (pH) మొదలైనవి.
భూసార పరీక్ష :
- రైతుకు తన నేల ఆరోగ్య స్థితిని తెలియజేసి దానిని పెంపొందించుకోవడం కోసం సహాయపడుతుంది.
- నేల నాణ్యత తగ్గిపోవడాన్ని నివారించుటకు సహాయపడుతుంది.
- ఎరువుల వాడకాన్ని తగ్గించటానికి సహాయపడుతుంది.
భూసార పరీక్షలు నిర్వహించడం ద్వారా నేలలోని మొక్కలకు అవసరమైన పోషకాలను సంరక్షించుకుంటూ ఆరోగ్యంగానూ, సారవంతంగానూ మార్చుకోగలము.
ప్రశ్న 4.
నీటి శుద్ధీకరణలోని దశలు తెలపండి.
జవాబు:
నదులు, రిజర్వాయర్లు, సరస్సులోని నీరు అనేక మలినాలను కలిగి ఉండవచ్చు. సురక్షిత నీటి సరఫరా పథకం ద్వారా భౌతిక, రసాయనిక సంబంధిత పద్ధతుల్లో నీటిని శుద్ధి చేస్తారు. ఆ పద్ధతులు
గడ్డ కట్టించడం :
నీటిలోని మలినాలను బంధించి బరువైన రేణువులుగా మార్చే రసాయనాలను కలుపుతారు.
అవక్షేపీకరణ :
బరువైన రేణువులుగా మారిన కలుషితాలను నీటి అడుగుకు చేరేలా చేస్తారు.
వడపోత :
పై భాగంలోని నీటిని వడపోత యంత్రాల గుండా పంపి, మిగిలిన నీటిలో కరగని మలినాలను వేరు చేస్తారు.
క్రిమి సంహరణం :
నీటికి క్లోరిన్, బ్లీచింగ్ పౌడరను కలపడం ద్వారా నీటిలోని సూక్ష్మజీవులను చంపుతారు.
అంటువ్యాధులు ప్రబలినప్పుడు వైద్యులు కాచిన నీటిని తాగమని సూచిస్తారు. సరైన విధంగా నీటిని కాచడం వ్యాధిజనక జీవులను చంపుతుంది.
ప్రశ్న 5.
మురుగునీటి శుద్ధీకరణ దశలను పటం రూపంలో గీయండి.
జవాబు:
ప్రశ్న 6.
AR సూత్రం ఉపయోగించి నీటి వనరులను ఎలా సంరక్షిస్తావు?
జవాబు:
AR నియమాలను పాటించడం ద్వారా నీటిని సంరక్షించవచ్చు. అవి : పునఃవృద్ధి (recharge), పునర్వినియోగం (re-use), పునరుద్దరించటం (revive) మరియు తగ్గించటం (reduce).
పునఃవృద్ధి :
ఎత్తైన భవనాలపై పడిన వర్షపు నీటిని సేకరించి వర్షపు నీటి సంరక్షణ పద్ధతుల ద్వారా భూగర్భ జలాలను రీచార్జ్ చేయవచ్చు. ఇంకుడు గుంతలు, చెడ్యాంలు, కందకాలు భూగర్భ జలాలను పెంచుకోవటానికి సహాయపడతాయి.
పునర్వినియోగం :
గృహ కార్యకలాపాలు పరిశ్రమల ద్వారా విడుదలైన వ్యర్థ జలాలను శుద్ధి చేసి వ్యవసాయ కార్యక్రమాలకు, గృహ అవసరాలకు, గృహ నిర్మాణాలకు, వాహనాలను కడగడానికి తిరిగి వాడుకోవచ్చు.
పునరుద్ధరించుట :
పాత రోజులలో కరువు ప్రాంతాలలో భూగర్భజలాల పునఃరుద్దరణ పద్ధతుల గురించి బాగా తెలుసు. ప్రస్తుతం దిగుడు బావులను పునఃరుద్ధరించడం ద్వారా నీటి కొరత సమస్యను పరిష్కరించవచ్చు.
తగ్గించటం :
నీటి వాడకం, వృథాలను కొన్ని పద్ధతులను పాటించడం ద్వారా తగ్గించవచ్చు. ఉదాహరణకు వ్యవసాయ రంగంలో బిందుసేద్యం వంటి నవీన నీటిపారుదల ప్రక్రియల వలన నీటి వృథాని అరికట్టవచ్చును.
AP Board 7th Class Science 12th Lesson 1 Mark Bits Questions and Answers నేల మరియు నీరు
I. బహుళైచ్ఛిక ప్రశ్నలు
సరియైన జవాబు సూచించు అక్షరమును బ్రాకెట్ లో రాయండి.
1. పరిసరాల పరిశుభ్రతకు చేయాల్సిన పని
A) ఘన వ్యర్థాలను కాలువలో వేయరాదు.
B) బహిరంగ మలమూత్ర విసర్జన చేయరాదు.
C) చెత్తను వేరుచేసి పారవెయ్యాలి.
D) పైవన్నీ
జవాబు:
D) పైవన్నీ
2. మురుగు నీటిశుదీకరణలో భాగం కాట
A) భౌతిక ప్రక్రియ
B) రసాయనిక ప్రక్రియ
C) జీవ సంబంధ క్రియ
D) సామూహిక క్రియ
జవాబు:
D) సామూహిక క్రియ
3. నీటివనరుల సంరక్షణకు వాడే 4R కు చెందనిది
A) Recharge
B) Reuse
C) Revive
D) Recover
జవాబు:
D) Recover
4. మురుగునీటి వలన వ్యాపించే వ్యాధులు
A) విరోచనాలు
B) హెపటైటిస్
C) కలరా
D) పైవన్నీ
జవాబు:
D) పైవన్నీ
5. నీటికి బ్లీచింగ్ కలపటం వలన
A) మలినాలు పోతాయి
B) సూక్ష్మజీవులు మరణిస్తాయి
C) రేణువులు తొలగించబడతాయి
D) వడపోత జరుగును
జవాబు:
B) సూక్ష్మజీవులు మరణిస్తాయి
6. నీటి కొరతకు కారణం
A) అడవుల నరికివేత
B) జనాభా విస్పోటనం
C) పారిశ్రామీకరణ
D) పైవన్నీ
జవాబు:
D) పైవన్నీ
7. ఆక్విఫర్లు అనగా
A) నీటినిల్వ
B) రాతిపొర
C) బోరుబావి
D) ఇంకుడు గుంట
జవాబు:
A) నీటినిల్వ
8. సముద్ర నీటి శాతం
A) 1%
B) 3%
C) 97%
D) 100%
జవాబు:
C) 97%
9. ప్రపంచ జల దినోత్సవం
A) జులై – 5
B) మార్చి – 22
C) జూన్ – 22
D) ఆగష్టు – 5
జవాబు:
B) మార్చి – 22
10. నేల క్రమక్షయానికి కారణం
A) గాలి
B) వర్షం
C) వరదలు
D) పైవన్నీ
జవాబు:
D) పైవన్నీ
11. ఏ మట్టి పై పొరలలో నీరు నిల్వ ఉంటుంది?
A) ఇసుక నేల
B) లోమ్ నేల
C) బంకమట్టి
D) మిశ్రమ నేల
జవాబు:
B) లోమ్ నేల
12. పెర్కొలేషన్ అనగా
A) నీరు క్రిందకు భూమి పొరలలో ప్రయాణించటం
B) నీరు ఊరటం
C) నీరు ఆవిరి కావటం
D) నీరు ఇంకిపోవటం
జవాబు:
A) నీరు క్రిందకు భూమి పొరలలో ప్రయాణించటం
13. నేల క్షితిజాలలో చివరిది
A) R – క్షితిజం
B) C – క్షితిజం
C) A – క్షితిజం
D) B – క్షితిజం
జవాబు:
A) R – క్షితిజం
14. ఎడఫాలజీ అనగా
A) నేలపై నీటి ప్రభావం
B) జీవులపై నేల ప్రభావం
C) నేలపై లవణ ప్రభావం
D) నేలపై ఎండ ప్రభావం
జవాబు:
B) జీవులపై నేల ప్రభావం
15. అంగుళం మృత్తిక ఏర్పడటానికి పట్టే కాలం
A) 500 – 1000 సం||
B) 600 – 10000 సం||
C) 10-100 సం||
D) ఏదీ కాదు
జవాబు:
A) 500 – 1000 సం||
16. కింది వాక్యాలు చదవండి.
P: నీరు చొచ్చుకొని పోయే సామర్థ్యం ఇసుకనేలలకు ఎక్కువ
Q : నీరు చొచ్చుకొని పోయే సామర్థ్యం బంకమట్టి నేలలకు ఎక్కువ
A) P మాత్రమే సరైనది.
B) Q మాత్రమే సరైనది.
C) P, Qలు రెండూ సరైనవి.
D) P, Qలు రెండూ సరైనవికావు.
జవాబు:
D) P, Qలు రెండూ సరైనవికావు.
17. ఇసుక నేలలో
A) మట్టిలో పెద్ద రేణువులుంటాయి.
B) మట్టిలో ఎక్కువ సన్నటి రేణువులుంటాయి.
C) పెద్ద రేణువులు సన్నటి రేణువులు సమపాళ్ళలో ఉంటాయి.
D) మట్టిలో నీరు ఎక్కువ ఉంటుంది.
జవాబు:
A) మట్టిలో పెద్ద రేణువులుంటాయి.
18. బంకమట్టి నేలలో
A) మట్టిలో పెద్ద రేణువులుంటాయి.
B) పెద్దరేణువులు సన్నటి రేణువులు సమపాళ్ళలో ఉంటాయి.
C) మట్టిలో ఎక్కువ సన్నటి రేణువులుంటాయి.
D) మట్టిలో నీరు ఎక్కువ ఉంటుంది.
జవాబు:
C) మట్టిలో ఎక్కువ సన్నటి రేణువులుంటాయి.
19. లోమ్ నేలలో
A) మట్టిలో పెద్ద రేణువులుంటాయి.
B) పెద్దరేణువులు సన్నటి రేణువులు సమపాళ్ళలో ఉంటాయి.
C) మట్టిలో ఎక్కువ సన్నటి రేణువులుంటాయి.
D) మట్టిలో నీరు ఎక్కువ ఉంటుంది.
జవాబు:
B) పెద్దరేణువులు సన్నటి రేణువులు సమపాళ్ళలో ఉంటాయి.
20. సీత వంటగది నుండి బియ్యం కడిగిన నీళ్ళను, పప్పుకాయ గూరలు కడిగిన నీళ్ళను బకెట్టులో సేకరించి తోటకు మళ్ళించింది. పై పని ఈ విషయానికి దారి తీస్తుంది.
A) నీటి స్తబ్దత
B) నీటి పునర్వినియోగం
C) నీటిని నిల్వ చేయడం
D) నీటిని రికవర్ చేయడం
జవాబు:
D) నీటిని రికవర్ చేయడం
21. మృత్తికను గూర్చిన శాస్త్రీయ అధ్యయనం
A) ఎడఫాలజీ
B) పెడాలజీ
C) పెడోజనెసిస్
D) పైవేవీకావు
జవాబు:
B) పెడాలజీ
22. విత్తనాలు మొలకెత్తటానికి అనువుగా ఉండే పొర
A) O క్షితిజం
B) B క్షితిజం
C) A క్షితిజం
D) C క్షితిజం
జవాబు:
A) O క్షితిజం
23. చాలా తక్కువ కార్బన్ పదార్థాలు కలిగిన పొర
A) A క్షితిజం
B) B క్షితిజం
C) C క్షితిజం
D) R క్షితిజం
జవాబు:
A) A క్షితిజం
24. త్రవ్వడానికి అనుకూలంగా ఉండని పొర
A) A క్షితిజం
B) B క్షితిజం
C) C క్షితిజం
D) R క్షితిజం
జవాబు:
B) B క్షితిజం
25. ప్రక్క పటం సూచించునది
A) ఇసుక
B) ఇసుక లోమ్
C) లోమ్
D) బంకమట్టి
జవాబు:
A) ఇసుక
II. ఖాళీలను పూరించుట కింది ఖాళీలను పూరింపుము.
1. soil అనే పదం …………. అనే లాటిన్ పదం నుండి పుట్టింది.
2. సోలమ్ అనగా లాటిన్ భాషలో …………..
3. మట్టి వాసనకు కారణం ……………. అనే పదార్థం.
4. జియోస్మిన్…………….. అను బ్యా క్టీరియా స్పోరుల నుండి విడుదలగును.
5. సౌందర్య సాధనంగా …………. మట్టిని వాడతారు.
6. బొమ్మలు, విగ్రహాల తయారీకి …………… మట్టిని వాడతారు.
7. మృత్తిక ఏర్పడే ప్రక్రియను ………….. అంటారు.
8. మృత్తిక ఏర్పడే ప్రక్రియలో రాళ్ళు పగిలిపోవడాన్ని …………….. అంటారు.
9. కర్బన పదార్థాలు కలిసిన మట్టిని ……….. అంటారు.
10. జీవులపై నేల ప్రభావ అధ్యయనాన్ని ……………….. అంటారు.
11. ఒక ప్రదేశంలోని అడ్డుపొరలుగా ఏర్పడిన అంశాలన్ని కలిపి ……………… అంటారు.
12. మృత్తికలోని అడ్డుపొరలను …………………… అంటారు.
13. రాతి పొరను …………… క్షితిజం అంటారు.
14. నీరు ఇంకే స్వభావం …………… నేలలకు అధికం.
15. ……………. ని వలయంగా వంచవచ్చు.
16. నేలపొరల ద్వారా నీరు క్రిందకు కదలడాన్ని ……… అంటారు.
17. నల్లరేగడి నేలలు ……… పంటలకు అనుకూలం.
18. నేలపై పొర కొట్టుకొని పోవడాన్ని ……… అంటారు.
19. నేల నిస్సారం కాకుండా చూడడాన్ని …………… అంటారు.
20. ప్రపంచ జల దినోత్సవం ……………..
21. అంతర్జాతీయ జల దశాబ్దం …………………
22. భూమిపై మంచినీటి శాతం ………….
23. భూమిలోనికి నీరు ఇంకే ప్రక్రియను …………. అంటారు.
24. రాతిపొరల మధ్య నిల్వ చేయబడిన నీరు ……………….
25. నీటికి బ్లీచింగ్ పౌడర్ కలిపి ………. సంహరిస్తాము.
26. ………….. వ్యర్ధ జలాన్ని మురుగునీరు అంటారు.
27. మురుగునీటి శుద్ధీకరణలో దశల సంఖ్య …………
28. నీటిలోని మలినాలను బరువైన రేణువులుగా మార్చటానికి రసాయనాలకు కలిపే ప్రక్రియ …………………
జవాబు:
- సోలమ్
- మొక్కలు పెరిగే తలం
- జియోస్మిన్
- అక్టినోమైసిటిస్
- ముల్తానా
- షాదూ
- పీడోజెనెసిస్
- శైథిల్యం
- హ్యూమస్
- ఎడఫాలజీ
- మృత్తికా స్వరూపం
- క్షితిజాలు
- R
- ఇసుక
- బంకమట్టి
- పెర్కొలేషన్
- పత్తి, మిరప
- మృత్తికా క్రమక్షయం
- నేల సంరక్షణ
- మార్చి 22
- 2018-2028
- 1%
- ఇన్ఫిల్టరేషన్
- ఆక్విఫర్
- సూక్ష్మజీవులను
- గృహ పరిశ్రమ
- 3
- గడ్డ కట్టించటం
III. జతపరుచుట
కింది వానిని జతపరుచుము.
1.
Group – A | Group – B |
A) పునఃవృద్ధి (Recharge) | 1) నీటి వనరుల సంరక్షణ |
B) పునర్వినియోగం (Reus | 2) బోరుబావుల నీటిమట్టం పెంచటం |
C) పునరుద్ధరించడం (Revive) | 3) కుళాయి ఆపివేయటం |
D) తగ్గించటం (Reduce) | 4) మురుగు నీటిని శుద్ధి చేయటం |
E) 4R | 5) వర్షపాతం పెంచటం |
6) దిగుడుబావులు పూడ్చివేయటం |
జవాబు:
Group – A | Group – B |
A) పునఃవృద్ధి (Recharge) | 2) బోరుబావుల నీటిమట్టం పెంచటం |
B) పునర్వినియోగం (Reus | 4) మురుగు నీటిని శుద్ధి చేయటం |
C) పునరుద్ధరించడం (Revive) | 5) వర్షపాతం పెంచటం |
D) తగ్గించటం (Reduce) | 3) కుళాయి ఆపివేయటం |
E) 4R | 1) నీటి వనరుల సంరక్షణ |
2.
Group – A | Group – B |
A) సముద్రపు నీరు | 1) మార్చి – 22 |
B) మంచినీరు | 2) 97% |
C) అవక్షేపించిన నీరు | 3) 1% |
D) భూగర్భ ఉపరితలం నీరు | 4) 2% |
E) జల దినోత్సవం | 5) 3% |
జవాబు:
Group – A | Group – B |
A) సముద్రపు నీరు | 2) 97% |
B) మంచినీరు | 5) 3% |
C) అవక్షేపించిన నీరు | 4) 2% |
D) భూగర్భ ఉపరితలం నీరు | 3) 1% |
E) జల దినోత్సవం | 1) మార్చి – 22 |
మీకు తెలుసా?
→ వర్షం పడిన తరువాత వెలువడే ఆహ్లాదకరమైన సుగంధమును మట్టి సుగంధము అంటారు. ఇది వర్షం పడినప్పుడు నేల నుండి గాలిలోనికి వెలువడే జియోస్మిన్ అనే పదార్థము కారణంగా కలుగుతుంది. ఈ పదార్థము అక్టినోమైసిటీస్ అను బాక్టీరియా యొక్క సిద్ధ బీజాల నుండి విడుదల అవుతుంది.
→ జీవులపైన ముఖ్యంగా మొక్కలపైన మృత్తిక యొక్క ప్రభావాన్ని గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఎడఫాలజీ అంటారు. మృత్తికను ఏర్పరిచే కారకాలను ఎడఫిక్ కారకాలు అంటారు.
→ ఇంజనీర్లు బహుళ అంతస్థుల భవనాలను ఎత్తయిన నిర్మాణాలను నిర్మించే ముందు వంతెనలు, డ్యాములు కట్టే సమయంలో నేలను పరీక్షిస్తారు పర్యావరణ పరంగా ప్రదేశాన్ని అంచనావేసి దీర్ఘకాలికమైన కట్టడాల విషయంలో అవసరమైన సూచనలను చేస్తారు.
→ నీటి దశాబం 2018-2028 :
ఐక్యరాజ్య సమితి సర్వ ప్రతినిధి సభ ప్రకారం 2030 నాటికి జనాభా పెరుగుదల వలన నీటి కొరత 40% పెరుగుతుందని, ప్రపంచం అత్యంత వేగంగా నీటి సంక్షోభానికి గురి కాబోతుందని గుర్తించింది. అందువలన నీటి నిర్వహణపై మన దృక్పథాన్ని మార్చడం కోసం 2018-2028 మధ్య కాలాన్ని ‘అంతర్జాతీయ జల దశాబ్దం’గా గుర్తించింది.
→ ఆధునిక నీటి శుద్ధి యంత్రాలు ఎలా పనిచేస్తాయో మీకు తెలుసా?
మన ఇళ్లలో నీటిని శుద్ధి చేయడానికి ఉపయోగించే యంత్రాలలో ఫిల్టర్ యూనిట్ మరియు అతినీలలోహిత కిరణాలను పంపి నీటిని శుద్ధి చేసే భాగం ఉంటాయి. ఇందులో సూక్ష్మజీవులను చంపటం కోసం క్లోరిన్ వాయువుకు బదులుగా అతినీలలోహిత కిరణాలను ఉపయోగిస్తారు.