AP 8th Class Biology Notes Chapter 1 విజ్ఞానశాస్త్రం అంటే ఏమిటి?

Students can go through AP Board 8th Class Biology Notes 1st Lesson విజ్ఞానశాస్త్రం అంటే ఏమిటి? to understand and remember the concept easily.

AP Board 8th Class Biology Notes 1st Lesson విజ్ఞానశాస్త్రం అంటే ఏమిటి?

→ ఎంపిక చేసుకున్న అంశాన్ని ఒక క్రమపద్ధతి పాటిస్తూ, ప్రయోగాల ద్వారా జ్ఞానాన్ని పొందటాన్ని ‘విజ్ఞానశాస్త్రం’ అంటారు.

→ శిలాజాల గురించి, ఖనిజాల గురించి, తెలుసుకునే వారిని భూగర్భ శాస్త్రవేత్తలు’ అంటారు.

→ ఆకాశంలో నక్షత్రాలు, గ్రహాల గురించి తెలుసుకునే వారిని ఖగోళ శాస్త్రవేత్తలు’ అంటారు.

→ వాతావరణంలోని మార్పులను గమనించి చెప్పే వారిని ‘వాతావరణ శాస్త్రవేత్తలు’ అంటారు.

→ ప్రజల జీవన విధానాన్ని మెరుగుపరచేందుకు శాస్త్రవేత్తల ప్రయోగాలు ఉపయోగపడతాయి.

→ శాస్త్రవేత్తలు కొత్త విషయాలు తెలుసుకోవటానికి కొన్ని పద్ధతులు వాడతారు. వీటిని ‘శాస్త్రీయ పద్ధతులు’ అంటారు. దీనికి ఉపయోగించే నైపుణ్యాలను ‘శాస్త్రీయ ప్రక్రియా నైపుణ్యాలు’ అంటారు.

→ పరీక్షించటానికి, వీలున్న జవాబునే పరికల్పన (Hypothesis) అంటారు. (అది 50% నిజం కావచ్చు, 50% నిజం కాకపోవచ్చు)

AP 8th Class Biology Notes Chapter 1 విజ్ఞానశాస్త్రం అంటే ఏమిటి?

→ విజ్ఞానశాస్త్రం : ప్రకృతిలో దాగివున్న రహస్యాలను తెలుసుకోవడానికి ఉపయోగపడే మార్గం.

→ పెన్షియా : శాస్త్రం

→ శాస్త్రీయ పద్ధతి : ప్రకృతిలోని రహస్యాలు తెలుసుకునేందుకు అవసరమయ్యే ప్రణాళికను ఏర్పరచు విధానం.

→ ప్రక్రియా నైపుణ్యాలు : శాస్త్ర అధ్యయనానికి ఉపయోగపడు పలు విధానాలు (ఆలోచనలు)

→ పరిశోధన – కొత్త విషయాలు కనుగొనుటకు చేసే ప్రయత్నంలో

→ పరికల్పన (తెలివైన ఊహ) : కొత్త విషయాలు, సమస్యలను కనుగొనుటకు అవసరమయ్యే సమాధానాన్ని ఊహించటం. (50% నిజం కావచ్చు : 50% నిజం కాకపోవచ్చు)

→ చరరాశులు : పరిశోధన ఫలితాన్ని తెలుపుటకు అవసరమయ్యే అంశాలు.

→ పోపావ చిత్రం : పరిశోధన ఫలితాలు చూపించే గ్రాఫ్ చిత్రం.

→ వర్గీకరించటం : వస్తువులను, జీవులను, నిర్జీవులను వాటి లక్షణాల ఆధారంగా విభజించి చదవటానికి పనికొస్తుంది.

→ శాస్త్ర పదజాలం : “సైన్స్’ – విజ్ఞానశాస్త్ర అంశాలను నేర్చుకోవటానికి అవసరమయ్యే ప్రత్యేక పదాలు. (వీటి అర్థం సరిగా నేర్చుకుంటే శాస్త్ర అధ్యయనం సులువవుతుంది.)

→ విపులీకరణ : చదివిన అంశాలను పూర్తిగా అర్థం చేసుకోవటం.

→ ఆవరణ వ్యవస్థ : సజీవ, నిర్జీవ అంశాలున్న ఒక నిర్దిష్ట ఎల్లలు గల ప్రదేశం.
ఉదా : బడి ఆవరణ, గ్రామం, పట్టణం, జిల్లా, రాష్ట్రం , చెరువు, అడవి మొదలగునవి.

→ దత్తాంశం : ప్రయోగం చేసేందుకు అవసరమైన సమస్య. వీటిపై శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తారు. చివరకు ఫలితం వస్తుంది. (ఫలితం అది మనకు మంచిదైతే ఉపయోగిస్తారు.)

→ ఆవిష్కరణ : మన సమస్యలపై పరిశోధన చేసి ఫలితాలు తెలుపుట. కొత్త విషయాలు, నిజాలు తెలియ చెప్పటం.

AP 8th Class Biology Notes Chapter 1 విజ్ఞానశాస్త్రం అంటే ఏమిటి 1