Students can go through AP Board 8th Class Biology Notes 2nd Lesson కణం – జీవుల మౌళిక ప్రమాణం to understand and remember the concept easily.
AP Board 8th Class Biology Notes 2nd Lesson కణం – జీవుల మౌళిక ప్రమాణం
→ సజీవులన్నీ కణజాలంతో నిర్మితమైనవి.
→ 1665లో రాబర్ట్ హుక్ కణాలను పరిశీలించాడు.
→ బతికి ఉన్న కణాలను మొదట చూసిన శాస్త్రవేత్త ఆంథోనివార్ల్యూవెన్‌హాక్.
→ కణంలో కణత్వచం, కణ కవచం, కేంద్రకం మరింకా ఎన్నో కణాంగాలు ఉన్నాయి.
→ రాబర్ట్ బ్రౌన్ మొదటగా కేంద్రకాన్ని కనుగొన్నాడు.
→ వృక్ష కణాలలో స్పష్టంగా కణకవచం, కణత్వచాలను గుర్తించవచ్చు.
→ కణత్వచం కణానికి ఆకారాన్ని ఇస్తుంది.
→ కణకవచం కణానికి బలాన్ని, గట్టిదనాన్ని ఇస్తుంది.
→ అన్ని జీవులలో అన్ని కణాలు ఒకే ఆకారంలో ఉండవు. “వేరు వేరు పనులు చేసే కణాలు వేరు వేరు ఆకారాలు కలిగి ఉంటాయి.”
→ ఒకే కణం వున్న జీవులను ‘ఏకకణ జీవులు’ అంటారు.
→ ఒకటి కన్నా ఎక్కువ కణాలు జీవిలో ఉంటే వాటిని ‘బహుకణ జీవులు’ అంటారు.
→ బహుకణ జీవులలో వివిధ రకాల కణాలు వివిధ రకాల జీవక్రియలను నిర్వర్తిస్తాయి.
→ కణం కనుక్కున్న తర్వాత, దానిలో కేంద్రకం ఉందని తెలుసుకోవడానికి దాదాపు 180 సం॥రాలు పట్టింది. (క్రీ.శ. 1650-1831)
→ మొక్కలలో అతిచిన్నవి. ‘మాస్ మొక్కలు”. (ఇవి పాత ఇంటి బయట గోడల పై కనిపిస్తాయి (నాచు))
→ అతి పెద్ద మొక్కలు కోనిఫెర్ వృక్షాలు.
→ అతి చిన్న జీవి ‘బాక్టీరియా’, ‘వైరస్’లు అయితే అతి పెద్ద జంతువు ‘నీలి తిమింగలం’ (ఇప్పటి వరకు తెలిసిన సముద్ర, భూ జాతులను పరిగణనలోకి తీసుకున్నప్పుడు)
→ మానవుడు ఇంకా 80% బంతు, వృక్ష జాతులను గుర్తించి అధ్యయనం చేయవలసి ఉంది.
→ మానవునిలో అతి పొడవైన కణం ‘నాడీకణం’ (ఇది 90 సెం.మీ. నుండి 100 సెం.మీ. పొడవు ఉంటుంది. )
→ ప్రపంచంలో అతి పెద్ద కణం “ఆస్ట్రిచ్ గుడ్లు”, ఇది 17 సెం.మీ. పొడవు, 18 సెం.మీ. వెడల్పుతో 306 చ.సెం.మీ. ఘనపరిమాణం కలిగి ఉంటుంది.
→ మైక్రాన్ అంటే మీటర్ లో మిలియన్ వ వంతు.
→ కణం : సజీవులలో నిర్మాణపరంగా, క్రియాత్మక చర్యలు జరిగే ఒక ఖాళీ ప్రదేశం,
→ కణత్వచం : కణం చుట్టూ ఉండే అతి పలుచని పొర. (ఉదా : జంతు కణాలు, వృక్ష కణాలు). ఇది కణానికి ఆకారాన్ని ఇస్తుంది.
→ కణకవచం : కణత్వచంపై ఉండే మరొక పలుచని పొర. (ఇది వృక్ష కణాలలో ఉంటుంది) ఇది కణానికి , గట్టిదనాన్ని ఇస్తుంది.
→ కేంద్రకం : కణం మధ్యలో గుండ్రంగా ఉండే భాగం. ఇది కణంలో జరిగే చర్యలను, నియంత్రిస్తుంది. వంశ పారంపర్య లక్షణాలు ఒక తరం నుండి తరువాత తరాలకు అందచేస్తుంది.
→ ఏకకణ జీవులు : ఒకే ఒక్క కణంతో నిర్మితమైన జీవులు. ఉదా : అమీబా, యుగ్లీనా, పేరమీషియం, బాక్టీరియా మొదలగునవి.
→ బహుకణ జీవులు : ఒకటి కంటే ఎక్కువ కణాలతో నిర్మితమైన జీవులు, ఉదా : హైడ్రా, వాల్ వాక్స్ మొదలగునవి. (చేపలు, క్షీరదాలు, పక్షులు)
→ కణాంగం : కణం లోపల ఉన్న అతి చిన్న నిర్మాణాలు. ఉదా : కేంద్రకం, మైట్రోకాండ్రియా,
→ మిధ్యాపాడం : శరీరాన్ని ముందుకు, వెనుకకు పొడుచుకుని వచ్చేలా చేయటం వల్ల ఏర్పడే నిర్మాణం. (అది జీవవదార్థ వీడనంలో తేడా వల్ల సాధ్యపడుతుంది) ఇవి చలనానికి, ఆహార సేకరణకు, రక్షణకు , ఉపయోగపడతాయి ఉదా : అమీబా, ఇవి కొంతసేపటికి అదృశ్యం అవుతాయి. అందువల్ల అమీబాకు నిర్దిష్ట ఆకారం ఉండదు.
→ రంజనం : సూక్ష్మదర్శినితో కణంలోని చిన్న భాగాలను స్పష్టంగా చూడడానికి, వాటికి వివిధ రంగులు అద్దటానికి చేసే పనినే ‘రంజనం’ చేయటం అంటారు.
→ వర్ణనం చేయటం : చిన్న వాటిని 10 రెట్లు, 100 రెట్లు, 1000 రెట్లు … పెద్దవి చేసి చూపించటం, “దోమ నోటి భాగాలను 10,000 రెట్లు పెద్దది చేసి చూపే ఎలక్ట్రాన్లు సూక్ష్మదర్శినిలో ఉన్నాయి. అట్లా చూస్తే దోమ నోటి భాగాలు చిన్న మొక్కలాగ కనిపిస్తాయి.”
→ కేంద్రీకృతం : మనం చూడవలసిన చిన్న భాగం స్పష్టంగా కనపడటానికి సూక్ష్మదర్శినిలోని అక్షికటకాన్ని క్రిందికి, పైకి కదిపి స్పష్టమైన ప్రతిబింబం కోసం ప్రయత్నించటం.
→ జీవపదార్థం : కణంలో వుండే జిగురు వంటి పదార్థం. దీనిలో అనేక పదార్థాలు కలసిపోయి ఉంటాయి. అంటే అది విజాతీయ పదార్థం. (అంటే దీనిలో ఆహార పదార్థాలు, విసర్జన పదార్థాలు, O2, CO2, రైబోజోమ్ (RNA) రేణువులు, హార్మోన్లు, విటమిన్లు మొనవి ఉంటాయి.)