Students can go through AP Board 8th Class Biology Notes 6th Lesson జీవ వైవిధ్యం – సంరక్షణ to understand and remember the concept easily.
AP Board 8th Class Biology Notes 6th Lesson జీవ వైవిధ్యం – సంరక్షణ
→ ప్రపంచ జీవవైవిధ్య సదస్సు – 2012, హైదరాబాద్ లో జరిగింది.
→ ప్రస్తుతం ప్రపంచంలో 100 జాతులు ఆపదలో ఉన్నాయి. వాటిలో మన దేశానికి సంబంధించి 4, మన రాష్ట్రానికి సంబంధించి 2 ఉన్నాయి. (1) గూటీ టారంటలా సాలీడు (2) బట్టమేక పిట్ట.
→ ప్రకృతిలో ఉన్న అన్ని జీవులు ముఖ్యమైనవే. అలా అన్నీ ఉండి ప్రకృతి సమతుల్యతను కాపాడేది – దీనికి మొక్కలు, జంతువులలో ఉండే వైవిధ్యం – జీవవైవిధ్యం.
→ అడవులు జీవావరణ నిలువలు.
→ మొక్కలు, జంతువుల్లో కనపడే వైవిధ్యాలను జీవవైవిధ్యం అంటారు.
→ ఒక ప్రత్యేక ప్రదేశం లేదా దేశంలోని మొక్కలు, జంతు జాతులను ‘ఎండమిక్ జాతులు’ అంటారు.→ కొన్ని మొక్కలు మరియు జంతు జాతులు భూమిపై నుండి పూర్తిగా అదృశ్యమవడాన్ని అంతరించటం అంటారు.
→ ఆపదలో ఉండి అంతరించిపోయే ప్రమాదం గల మొక్కలు మరియు జంతుజాతులను ఆపదలో గల జాతులు అంటారు.
→ IUWC ప్రచురించే పుస్తకములో అంతరించిన ఆపదలోనున్న, వృక్ష, జంతు జాతుల సమాచారం ఉంటుంది. ఈ పుస్తకాన్ని ‘రెడ్ డేటా బుక్’ (Red Data Book) అంటారు.
→ పర్యావరణంతో పాటు అడవి, అడవి జీవులను సంరక్షించే ప్రదేశాలను జాతీయ పార్కులు అంటారు.
→ అడవి జీవులు సంరక్షించే స్థలాలను వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు (Sanctuaries) అంటారు.
→ ఆహారం మరియు సంతానోత్పత్తి కోసం ఒక ప్రాంతం నుండి మరో ప్రాంతానికి పక్షులు పయనమవడాన్ని వలస (migration) అంటారు. ఈ పక్షులను ‘వలస పక్షులు’ (migrating birds) అంటారు.
→ కాగితాన్ని చాలా జాగ్రత్తగా వినియోగించుకోవాలి. అధిక కాగితాల వినియోగం, అధిక వన్య విధ్వంసానికి దారితీస్తుంది.
→ జీవావరణ సంపదలు : అత్యంత ఎక్కువ రకాల జీవులు జీవ జాతులు నివసించే ప్రదేశాలను జీవావరణ సంపదలు అంటారు. ఉదా : అడవులు, సరస్సులు.
→ జీవవైవిధ్యం : జీవావరణంలో (ప్రకృతిలో ప్రతి జీవి ముఖ్యమైనదే. ఒక ఆవరణ వ్యవస్థలో చాలా రకాల జీవులు ఉండటాన్ని, ప్రతి జీవి ముఖ్యమైనదని చెప్పటాన్ని ‘జీవవైవిధ్యం’ అంటారు.
→ ఎండమిక్ జాతి : ఒక ప్రత్యేకమైన ప్రదేశానికి, రాష్ట్రానికి, దేశానికి, ఖండానికి పరిమితమైన జాతిని ‘ఎండమిక్ జాతి’ అంటారు. ఉదా : ఆంధ్రప్రదేశ్ – బట్టమేక పిట్ట.
→ అంతరించిపోయే జాతులు : ఆవరణ వ్యవస్థలో తగ్గిపోతున్న జాతులు (ఉదా : అడవి పువ్వులు, గంధం చెట్టు), పాండా.
→ అంతరించిన జాతులు : భూమిపై అసలు కనిపించకుండా పోయిన జాతులు. ఉదా : డైనోసార్లు
→ రెడ్ డేటా బుక్ : అంతరించిన, ఆపదలో ఉన్న వృక్ష, జంతు జాతుల సమాచారం తెలిపే పుస్తకం. దీనిని IUWC ప్రచురిస్తుంది.
→ జాతీయ ఉద్యానవనాలు : మొక్కలు, జంతువులను సంరక్షించటానికి ప్రభుత్వం ఏర్పరచిన సంరక్షణ కేంద్రాలు.
ఉదా : బొటానికల్ గార్డెన్ – బెంగళూరు, పులి సంరక్షణ కేంద్రం – శ్రీశైలం అడవులు.
→ వన్య జీవుల సంరక్షణ : వన్యప్రాణులను సంరక్షించే కేంద్రాలు. ఉదా : జూ పార్క్ – హైదరాబాద్.
→ కేంద్రాలు వలస : తాము నివసించే ప్రదేశంలో వాతావరణం, ప్రకృతిలో అననుకూలత, ఆహారం కోసం, సంతానోత్పత్తి కోసం తాత్కాలికంగా వేరే ప్రదేశానికి తరలి వెళ్ళటం.
→ విదేశీ ఆక్రమణ జాతులు : మన దేశానికి సంబంధం లేని వేరే దేశ జంతువులు, మొక్కలు, పక్షులు మన జీవావరణంలో పెరగటం. ఉదా : మొక్కలు : పార్టీనియం (కలుపు మొక్క గుర్రపు డెక్క), పక్షులు : హైదరాబాద్ పావురాళ్ళు, ఈము పక్షులు.
→ సంరక్షణ వలసల : జీవులు తాము నివసించే ప్రదేశంలోని అననుకూల పరిస్థితుల వల్ల, వాతావరణ మార్పుల వల్ల శాశ్వతంగా సొంత ప్రదేశం విడిచి ఒక కొత్త ప్రదేశాన్ని ఎన్నుకుని వెళ్ళటం. (ఆది మానవులు వాటిని రక్షించటానికి చేసే పద్ధతి.) ఉదా : పాండా
→ గర్భం దాల్చటం : స్త్రీలలో ఉన్న గర్భాశయం దాని కిరువైపులా వున్న ఫాలోపియన్ నాళాలలో అండం శుక్రకణంతో కలసి సంయుక్త చజం ఏర్పడి, అది పిండంగా మారటాన్ని గర్భం దాల్చటం అంటారు. (ఈ పిండం గర్భాశయ గోడలకు అంటుకుని అభివృద్ధి చెందుతుంది.)