AP 8th Class Maths Notes 3rd Lesson చతుర్భుజాల నిర్మాణాలు

Students can go through AP Board 8th Class Maths Notes 3rd Lesson చతుర్భుజాల నిర్మాణాలు to understand and remember the concept easily.

AP Board 8th Class Maths Notes 3rd Lesson చతుర్భుజాల నిర్మాణాలు

→ఒక చతుర్భుజం నాలుగు భుజాలు, నాలుగు కోణాలు, నాలుగు శీర్షాలు, రెండు కర్ణాలు కలిగి ఉంటుంది.

→ చతుర్భుజంలో 4 కోణాల మొత్తం 360°.

చతుర్భుజ రకం స్వతంత్ర కొలతల సంఖ్య
1. చతుర్భుజం 5
2. సమలంబ చతుర్భుజం 4
3. సమాంతర చతుర్భుజం 3
4. దీర్ఘచతురస్రం 3
5. రాంబస్ 2
6. చతురస్రం 1

→ చతుర్భుజాలు – రకాలు :
AP 8th Class Maths Notes 3rd Lesson చతుర్భుజాల నిర్మాణాలు 1

→ ఏకైక చతుర్భుజం నిర్మించాలంటే అయిదు స్వతంత్ర కొలతలు అవసరం.

→ చతుర్భుజాలు ఏకైకంగా నిర్మించడానికి మనం వాడే కొలతలు
a) నాలుగు భుజాల పొడవులు, ఒక కోణం కొలత ఇచ్చినపుడు
b) నాలుగు భుజాల పొడవులు, ఒక కర్ణం కొలత ఇచ్చినపుడు
c) మూడు భుజాల పొడవులు మరియు రెండు కర్ణాల కొలతలు ఇచ్చినపుడు
d) రెండు ఆసన్న భుజాలు మరియు మూడు కోణాల కొలతలు ఇచ్చినపుడు
e) మూడు భుజాల పొడవులు మరియు రెండు ఉమ్మడి కోణాలు ఇచ్చినపుడు

→ ప్రత్యేక చతుర్భుజాలైన రాంబస్ మరియు చతురస్రాలను వాటి రెండు కర్ణాల కొలతలు ఇచ్చినపుడు నిర్మించవచ్చు.