AP 8th Class Maths Notes 5th Lesson అనుపాతముతో రాశులను పోల్చుట

Students can go through AP Board 8th Class Maths Notes 5th Lesson అనుపాతముతో రాశులను పోల్చుట to understand and remember the concept easily.

AP Board 8th Class Maths Notes 5th Lesson అనుపాతముతో రాశులను పోల్చుట

→ రెండు నిష్పత్తులను ఒకే నిష్పత్తిగా తెలపడానికి ఆ రెండు నిష్పత్తుల పూర్వపదముల లము మరియు పరపదముల లబ్దముల నిష్పత్తి కనుగొంటాము. దీనినే మనం బహుళ నిష్పత్తి అంటాము.
a: b, c: d లు రెండు నిష్పత్తులైన వాటి బహుళనిష్పత్తి
\(\frac{a}{b} \times \frac{c}{d}=\frac{a c}{b d}\) లేదా ac : bd

→ శాతము అనగా ఒక సంఖ్యను 100 తో పోల్చడం. శాతము అనగా ప్రతీ వందకు లేదా ప్రతీ వందలో అని అర్థము. 100% = \(\frac{100}{100}\) శాతము అనేది హారము 100 గా గల భిన్నము.

→ డిస్కౌంట్ అనేది ప్రకటన వెలపై తగ్గుదల శాతము. వస్తువు ప్రకటన వెలలో తగ్గింపును తగ్గింపు లేదా డిస్కౌంట్ అంటారు. దీనిని మనం వస్తువు ప్రకటన వెల లేదా జాబితా వెలపై లెక్కిస్తాము.

→ లాభము లేదా నష్టము అనేది ఎల్లప్పుడూ కొన్నవెలపై లెక్కిస్తారు.

→ లాభము అనేది కొన్నవెలపై పెరుగుదల శాతము. నష్టము అనేది కొన్నవెలపై తగ్గుదల శాతము.

→ VAT ను వస్తువు అమ్మకం వెలపై లెక్కిస్తారు. దీనిని బిల్లులో కలిపి లెక్కిస్తారు.

→ VAT అనేది ‘ అమ్మకం వెలపై పెరుగుదల శాతము.

AP 8th Class Maths Notes 5th Lesson అనుపాతముతో రాశులను పోల్చుట

→ సాధారణ వడ్డీ అనేది అసలుపై పెరుగుదల శాతము.

→ సాధారణ వడ్డీ (I) = \(\frac{\mathrm{P} \times \mathrm{T} \times \mathrm{R}}{100}\) దీనిలో P = అసలు, T = కాలము (సంవత్సరములలో), R = వడ్డీరేటు P = \(\frac{\mathrm{I} \times 100}{\mathrm{TR}}\)
T = \(\frac{\mathrm{I} \times 100}{\mathrm{PR}}\)
R = \(\frac{\mathrm{I} \times 100}{\mathrm{PT}}\)

→ మొత్తము = అసలు + వడ్డీ
= P + \(\frac{P \times T \times R}{100}\) = P(1 + \(\frac{\mathrm{TR}}{100}\))
A = P + 1

→ చక్రవడ్డీ అనేది మనకు వడ్డీ పై వడ్డీని యిస్తుంది.

→ సంవత్సరముకొకసారి తిరిగి వడ్డీ కట్టు పద్ధతిన ‘n’ సంవత్సరములకు అయ్యే మొత్తము

→ A = P\(\left(1+\frac{\mathrm{R}}{100}\right)^{\mathrm{n}}\)

→ ఎంతకాలము తరువాత వడ్డీని అసలుకు కలుపుతామో దానిని తిరిగి వడ్డీ కట్టెడి కాలవ్యవధి అంటారు. 6 నెలల కొకసారి చక్రవడ్డీని కనుగొనునపుడు సంవత్సరములో తిరిగి వడ్డీ కట్టడి కాలవ్యవధులు రెండు వుంటాయి. అప్పుడు అర్ధ సంవత్సర వడ్డీరేట్లు సంవత్సర వడ్డీ రేటులో సగముంటుంది.

→ Note: 1.615:1 ను “గోల్డెన్ రేషియో” అంటారు. ఈ నిష్పత్తులతో పొడవు, వెడల్పులు కలిగిన దీర్ఘ చతురస్రాకారాలను నిర్మిస్తే అది చూడటానికి చాలా అందంగా ఉంటుందని గ్రీకుల భావన.