AP 8th Class Social Notes Chapter 11A జాతీయోద్యమం : తొలి దశ 1885 – 1919

Students can go through AP Board 8th Class Social Notes 11Ath Lesson జాతీయోద్యమం : తొలి దశ 1885 – 1919 to understand and remember the concept easily.

AP Board 8th Class Social Notes 11Ath Lesson జాతీయోద్యమం : తొలి దశ 1885 – 1919

→ భారతదేశంలో జాతీయోద్యమం ఒక చారిత్రక ఘటన.

→ 1857 తిరుగుబాటు బ్రిటిషు పాలనని వ్యతిరేకించింది కానీ దేశానికి ఒక కొత్త దార్శనికతను ఇవ్వలేకపోయింది.

→ ఆంగ్ల విద్యావ్యాప్తితో ఒక కొత్త చైతన్యం రూపుదిద్దుకొనసాగింది.

→ 1866 నుండి 1885 మధ్య భారతీయుల సమస్యలపై వివిధ సంఘాలు ఏర్పాటు అయ్యాయి.

→ 1885 నుండి 1905 వరకు భా.జా. కాం. మితవాద దశగా పేర్కొన్నారు. ఈ దశలోని నాయకులు విన్నపాలు, అర్జీలు, ఆందోళనలు అన్న విధానాలను అవలంబించారు.

→ 1903లో కర్జన్ బెంగాలను తూర్పు, పశ్చిమ బెంగాల్ గా విభజించాలని చేసిన ప్రతిపాదన, జాతీయ భావాలను పెద్ద ఎత్తున రగిల్చింది.

→ స్వదేశీ ఉద్యమం వల్ల భారతీయ పరిశ్రమలకు మంచి ఊపు వచ్చింది. వస్త్ర పరిశ్రమ ఊపందుకుంది.

→ ‘స్వరాజ్యం నా జన్మహక్కు దానిని సాధించి తీరతాను’ అనే ప్రఖ్యాత నినాదాన్ని తిలక్ ఇచ్చాడు.

→ 1907లో కాంగ్రెస్ రెండుగా చీలింది.

→ తిలక్ అనిబిసెంట్ తో కలిసి ‘హోంరూల్’ ఉద్యమం ప్రారంభించాడు.

AP 8th Class Social Notes Chapter 11A జాతీయోద్యమం : తొలి దశ 1885 – 1919

→ 1916లో కాంగ్రెస్ రెండు వర్గాలు ఐక్యమయ్యాయి.

→ కృష్ణాపత్రిక స్వాతంత్ర్యోద్యమం అన్ని దశలలో పనిచేసింది.

→ 1914-1918 మధ్య మొదటి ప్రపంచ యుద్ధం జరిగింది.

→ మొదటి ప్రపంచ యుద్ధం చివరలో గాంధీజీ దక్షిణాఫ్రికా నుంచి తిరిగి వచ్చి భారత స్వాతంత్ర్యోద్యమంలో భాగమయ్యాడు.

→ సార్వభౌమాధికారం : ప్రజలందరూ కలిసి ఒక జాతిగా ఉండి, వారి మీద వారికే అధికారాన్ని కలిగి ఉండటం, ఇతరుల ప్రమేయం లేకుండటం.

→ జాతి వివక్షత : బ్రిటిష్ వారు భారతీయుల పట్ల కలిగియున్నది. నల్లవారు, తెల్లవారు అనే వివక్షత. ఇది ఐరోపా ఖండంలోని వారికందరికీ ఉన్నది.

→ తీర్మానం : ఒక వ్యక్తి గాని, ఒక సమూహం గాని చేసుకున్న లేదా తీసుకున్న నిర్ణయం.

→ మితవాదులు : కేవలం విన్నపాలు, అర్జీలు, ఆందోళనల ద్వారా కొంచెం మెరుగైన జీవితాన్ని ఆశించినవారు.

→ వినతిపత్రాలు/అర్జీలు : ఏదైనా ఒక న్యాయబద్ధమైన కోరికను తీర్చమని కోరే పత్రం.

→ స్వదేశీ : విదేశీవి కానివన్నీ స్వదేశీ వే.

→ బహిష్కరణ : కొన్ని వస్తువులను గాని, కొంతమంది మనుషులను గాని, దూరంగా ఉంచి, ఉపయోగించకుండుట వారిని కలవకుండుట.

→ పికెటింగ్ : ఏదేనా ఒక దుకాణాన్ని ఇతరులు ప్రవేశించకుండా అడ్డుకొనుట, వ్యక్తిని కదలకుండా ఉంచుట (ముఖ్యంగా సమ్మె కాలంలో).

→ స్వరాజ్యం : సంపూర్ణ స్వేచ్ఛా స్వాతంత్ర్యం.

→ నిరసన : నచ్చని విషయాన్ని తెలపటం.

→ అతివాదం : తిలక్ వంటి నాయకులు కొన్ని అతివాద పద్ధతుల ద్వారా స్వాతంత్ర్యాన్ని తేచ్చే పద్ధతి.

AP 8th Class Social Notes Chapter 11A జాతీయోద్యమం తొలి దశ 1885 – 1919 1