Students can go through AP Board 8th Class Social Notes 11Bth Lesson జాతీయోద్యమం : మలి దశ 1919 – 1947 to understand and remember the concept easily.
AP Board 8th Class Social Notes 11Bth Lesson జాతీయోద్యమం : మలి దశ 1919 – 1947
→ గాంధీజీ భారతదేశానికి వచ్చే నాటికే గౌరవప్రదమైన నాయకుడిగా గుర్తింపు పొందాడు.
→ ఈయన కాంగ్రెసులో ఏ వర్గంలో చేరకుండా సొంత రాజకీయ కార్యక్రమాలను రూపొందించుకున్నాడు.
→ 1906లో ముస్లింలీగ్, 1915లో ముస్లిం మహాసభ ఏర్పడింది.
→ ఏప్రిల్ 13, 1919న పంజాబ్ లోని అమృత్ సర్ లో జరిగిన జలియన్ వాలాబాగ్ మారణకాండ బ్రిటిషు ప్రభుత్వ ఆకృత్యాలకు పరాకాష్ఠ.
→ 1921-22 నాటికి సహాయ నిరాకరణ ఉద్యమం ఊపందుకుంది.
→ ఆంధ్రాలో జాతీయతా కార్యక్రమాలకు గుంటూరు జిల్లా కేంద్రంగా మారింది.
→ 1922లో చౌరిచౌరా సంఘటనకు నిరసనగా గాంధీజీ సహాయ నిరాకరణ ఉద్యమాన్ని నిలిపివేశాడు.
→ ఉప్పు సత్యాగ్రహంతో దేశమంతా నూతనోత్తేజం రగిలింది.
→ రెండవ ప్రపంచ యుద్ధం 1939లో మొదలయ్యి 1945లో ముగిసింది.
→ 1942లో క్విట్ ఇండియా ఉద్యమం. బ్రిటిషు వారిని గడగడలాడించింది.
→ సుభాష్ చంద్రబోస్ స్వరాజ్య ఉద్యమకారుడు, విప్లవవాద జాతీయవాది. ఆయన రాస్ బిహారీ బోస్ సహకారంతో భారత జాతీయ సైన్యాన్ని ప్రారంభించాడు.
→ స్వాతంత్ర్యం పొందడం మన బలం. విభజనకు గురవటం మన ఓటమి.
→ జాతీయవాదం : చిన్న సమూహాల కంటే జాతి పెద్దది. ఏ మతము లేని వాళ్ళతో సహా అందరి ప్రయోజనాలను కోరుకునేదే జాతీయవాదం.
→ లౌకిక : జాతీయవాదాన్నే లౌకికవాదం అని అంటారు.
→ ఉగ్రవాది : ఆయుధాలు పట్టి ఎవరైనా ప్రభుత్వ వ్యతిరేక కార్యకలాపాలు నిర్వహించేవారు, శాంతి భద్రతలకు విఘాతం కల్గించేవారు.
→ అతివాదం : స్వాతంత్ర్యం కోసం ఎవరినీ అర్థించవలసిన అవసరం లేదని, అది మన జన్మహక్కు అని బ్రిటిషు విధానాల్ని నిరసించి ఉద్యమాలు చేసినవారు.
→ సత్యాగ్రహం : గాంధీజీ నడిపించిన అహింసాయుత మార్గం. ఇది హింసకు ఎదురు తిరగటం కాక, వారికి ఎదురు నిలబడి గెలవటం.
→ సహాయ నిరాకరణ : ప్రభుత్వం లేదా అధికారవర్గం సవ్యంగా పాలించాలంటే పాలితులు కూడా , సహకరించాలి. అలాంటి సహకారాన్ని ఇవ్వడాన్ని ప్రజలు నిరాకరించటం.
→ శాసనోల్లంఘనం : ప్రభుత్వం చేసిన శాసనాలను ప్రజలు అంగీకరించి అమలు జరిగేలా చూడాలి అలాకాక వాటిని వ్యతిరేకించడం.
→ ఉపఖండం : ఖండానికి ఉన్న అన్ని లక్షణాలను కలిగి ఉన్న వాటిని ‘ఉపఖండం’ అని అంటారు.
ఉదా : భారతదేశం ఉపఖండం.