AP 8th Class Social Notes Chapter 12 భారత ఎన్నికల వ్యవస్థ

Students can go through AP Board 8th Class Social Notes 12th Lesson భారత ఎన్నికల వ్యవస్థ to understand and remember the concept easily.

AP Board 8th Class Social Notes 12th Lesson భారత ఎన్నికల వ్యవస్థ

→ ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం మన భారతదేశం.

→ దేశంలో ఎన్నికలను ‘భారత ఎన్నికల సంఘం’ నిర్వహిస్తుంది.

→ భారత ఎన్నికల సంఘం 1950, జనవరి 25న ఏర్పడింది. ఇది ఒక స్వయం ప్రతిపత్తి గల రాజ్యాంగ సంస్థ.

→ ఓటర్ల జాబితాను రూపొందించడం, దేశంలో ఎన్నికల నిర్వహణ ఈ సంఘం పని.

→ ఎన్నికల సంఘం రాజ్యాంగంలోని ఆర్టికల్ 324 (6) ప్రకారం రాష్ట్రపతి, గవర్నర్ల అనుమతితో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సిబ్బందిని ఎన్నికల నిర్వహణ కోసం తీసుకుంటుంది.

→ ఎన్నికల సంఘం సభ్యుల పదవీకాలం 6 సం||రాలు లేదా 65 సం|| వయస్సు పూర్తి అయ్యేవరకు.

→ భారత ఎన్నికల సంఘం త్రిసభ్య సంస్థ. ఇది రాజకీయ వ్యవస్థలో ప్రముఖ పాత్ర వహిస్తుంది.

→ T.N. శేషన్ (1990 – 1996) కాలంలో ఈ సంఘం అవినీతిని అంతం చేయడానికి ప్రయత్నించి, ప్రజాభిమానాన్ని చూరగొంది.

→ రాజ్యాంగంలోని 15వ భాగంలోని ఆర్టికల్ 324లో ఎన్నికల సంఘం నిర్మాణం, అధికార విధులు వివరించబడ్డాయి.

AP 8th Class Social Notes Chapter 12 భారత ఎన్నికల వ్యవస్థ

→ ఎన్నికల కమిషన్ పాక్షిక న్యాయస్థానంగా పనిచేస్తుంది.

→ ఓటర్లందరిని కలిపి ఎలక్టోరేట్ అంటారు.

→ ఎన్నికల కమిషన్ నియమావళి ప్రకారం ఎన్నికలు జరిగే సంవత్సరంలో ఆ ఏడాది జనవరి 1 నాటికి 18 సం||లు నిండిన వారు కుల, మత, లింగ, భాషాపరమైన భేదాలు లేకుండా ఓటరుగా నమోదు చేసుకోవచ్చు. దీనినే సార్వజనీన ఓటింగ్ హక్కు అంటారు.

→ 1988 సం||రానికి ముందు ఓటు హక్కు కనీస వయస్సు 21 సం||లు, 61వ రాజ్యాంగ సవరణ ప్రకారం 18 సం||లుకు తగ్గించారు.

→ ఎన్నికలలో పొందిన ఓట్ల శాతాన్ని బట్టి పార్టీలను ప్రాంతీయ, జాతీయ పార్టీలుగా ఎన్నికల సంఘం గుర్తిస్తుంది.

→ ఎన్నికల ప్రవర్తనా నియమావళిని అతిక్రమిస్తే ఎన్నికల అనుచిత ప్రవర్తనగా పరిగణించి క్రమశిక్షణా చర్యలు తీసుకుంటారు.

→ నియోజక వర్గంలో ఎన్నికలు నిర్వహించడానికి, పర్యవేక్షించడానికి ‘రిటర్నింగ్ అధికారి’ ఉంటారు.

→ పోలింగ్ స్టేషన్లలో విధులు నిర్వహించడానికి ‘ప్రిసైడింగ్ ఆఫీసర్’ను నియమిస్తారు.

→ ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి దేశం లేదా రాష్ట్ర స్థాయిలో జరిగే ఎన్నికలను సాధారణ ఎన్నికలు అంటారు.

→ ఒకటి లేదా కొన్ని ఖాళీలకు నిర్వహించే ఎన్నికలను ఉపఎన్నికలు అంటారు.

→ 5 సంవత్సరాల పూర్తికాలం గడవక ముందే శాసనసభకు లేదా పార్లమెంటుకు ఎన్నికలు నిర్వహిస్తే వాటిని ‘మధ్యంతర ఎన్నికలు’ అంటారు.

→ 2013లో ‘నోటా’ను ప్రవేశ పెట్టారు

→ EVM లలో ఓటర్ వెరిఫైడ్ పేపర్ ఆడిట్‌ ట్రయల్ సౌకర్యంను కల్పించటానికి EC నిర్ణయం తీసుకుకున్నది.

→ ప్రాతినిధ్య ప్రజాస్వామ్యం : పాల నిర్ణయాలు తీసుకోవడంలో, ప్రజా సంక్షేమ విధానాల రూపకల్పనలో ప్రజల తరపున ప్రజా ప్రతినిధులు పాల్గొనే వ్యవస్థను ప్రాతినిధ్య ప్రజాస్వామ్యం అంటారు.

→ ఎన్నికల సంఘం : భారతదేశంలో ఎన్నికలు సజావుగా నిర్వహించే స్వతంత్రమైన రాజ్యాంగబద్ధ సంస్థ ఎన్నికల సంఘం.

→ ఎన్నికల ప్రవర్తనా నియమావళి : స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికలు జరిగేందుకు, ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన రోజు నుండి ఎన్నికలు జరిగే రోజు వరకు వివిధ రాజకీయ పక్షాలు, అభ్యర్థులు, ప్రజలు పాటించవలసిన నియమ నిబంధనలను ఎన్నికల ప్రవర్తన నియమావళి అంటారు.

→ రిటర్నింగ్ అధికారి : ఒక నియోజక వర్గంలో ఎన్నికలు నిర్వహించు అధికారి.

→ ప్రిసైడింగ్ అధికారి : పోలింగ్ బూతు నిర్వహించు అధికారి.

AP 8th Class Social Notes Chapter 12 భారత ఎన్నికల వ్యవస్థ

→ సార్వత్రిక వయోజక ఓటుహక్కు : ప్రజలు తమ ప్రతినిధులను ఎన్నుకోడానికి భారత రాజ్యాంగం, ఓటుహక్కు (326 అధికరణ)ను ప్రసాదించింది. దీని ప్రకారం జాతి, కుల, మత, లింగ, విద్య, ఆర్థిక స్థితి, వర్గం, ప్రాంతం వంటి భేదాలు లేకుండా 18 సం||రాలు నిండినా ప్రతి ఒక్కరు ఓటు హక్కు పొందుతారు.

→ EVM : ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్

→ ప్రాంతీయ పార్టీ : రాష్ట్రంలో జరిగే ఎన్నికలలో మొత్తం పోలైన ఓట్లలో మూడు శాతం ఓట్లను లేదా మూడు శాసన సభ స్థానాలను పొందితే ఎన్నికల సంఘం ఒక పార్టీని ప్రాంతీయ పార్టీగా గుర్తిస్తుంది.

→ జాతీయ పార్టీ : సాధారణ ఎన్నికల్లో కనీసం నాలుగు రాష్ట్రాల్లో మొత్తం పోలైన ఓట్లలో ఆరు శాతం ఓట్లు పొందినా, లేదా నాలుగు వేరు వేరు రాష్ట్రాల నుండి కనీసం పదకొండు లోక్సభ సీట్లను సాధించిన పార్టీని ఎన్నికల సంఘం జాతీయ పార్టీగా గుర్తిస్తుంది.

→ NOTA : ఎన్నికలప్పుడు బాలెట్ పేపర్‌లోకానీ EVMలో కాని ఉండే ఒక గురు. దీనికరం. పైన ఉన్నవారిని ఎవరినీ నేను ఎన్నుకోవడం లేదు అని. (None of the Above)

→ నియోజక వర్గం : ఒక చట్టపరమైన సభకు (అసెంబ్లీ లేదా పార్లమెంటు) ఒక నాయకుడిని ఎన్నుకుని పంపడానికి ప్రాంతాలని భాగాలుగా విభజిస్తారు. ఆ భాగాలనే నియోజక వర్గం అంటారు.

AP 8th Class Social Notes Chapter 12 భారత ఎన్నికల వ్యవస్థ 1