These AP 9th Physical Science Important Questions and Answers 12th Lesson ప్రమాణాలు మరియు గ్రాఫులు will help students prepare well for the exams.
AP Board 9th Class Physical Science 12th Lesson Important Questions and Answers ప్రమాణాలు మరియు గ్రాఫులు
9th Class Physical Science 12th Lesson ప్రమాణాలు మరియు గ్రాఫులు 1 Mark Important Questions and Answers
ప్రశ్న 1.
ప్రమాణం అనగానేమి?
జవాబు:
కొలతలను పోల్చుటకు ఉపయోగించే ఏ ప్రామాణిక కొలతనైనా ప్రమాణం అంటారు.
ప్రశ్న 2.
వివిధ వస్తువులను కొలవడానికి వివిధ ప్రమాణాలను ఎందుకు వినియోగిస్తాము?
జవాబు:
పదార్థాల పరిమాణాలను అనుసరించి వివిధ ప్రమాణాలను వినియోగిస్తాము.
ప్రశ్న 3.
MKS పద్ధతిలో ప్రాధమిక రాశులను రాయుము.
జవాబు:
ద్రవ్యరాశి (m), పొడవు (l) మరియు కాలం (t).
ప్రశ్న 4.
ప్రాథమిక రాశులు అనగానేమి?
జవాబు:
మరే ఇతర పరిమాణాలలోనూ వ్యక్తపరచడానికి వీలులేని భౌతిక రాశులను ప్రాథమిక రాశులు అంటారు.
ప్రశ్న 5.
ప్రాథమిక ప్రమాణం అనగానేమి?
జవాబు:
ప్రాథమిక రాశులను వ్యక్తపరచడానికి వినియోగించే ప్రమాణాలను ప్రాథమిక ప్రమాణాలు అంటారు.
ప్రశ్న 6.
MKS లో ప్రాథమిక ప్రమాణాలను రాయుము.
జవాబు:
మీటరు, కిలోగ్రాము మరియు సెకను.
ప్రశ్న 7.
CGS పద్ధతి అనగానేమి?
జవాబు:
సెంటీమీటరు, గ్రాము మరియు సెకను.
ప్రశ్న 8.
SI పద్ధతి అనగానేమి? అది ఎప్పుడు ప్రవేశపెట్టబడింది?
జవాబు:
SI పద్దతి అనగా అంతర్జాతీయ ప్రమాణాల పద్ధతి. ఇది 1971లో ప్రవేశపెట్టబడింది.
ప్రశ్న 9.
SI పద్ధతికి జోడించిన కొన్ని ప్రాథమిక రాశులను రాయుము.
జవాబు:
విద్యుత్, కాంతి తీవ్రత, పదార్ధ పరిమాణం, ఉష్ణోగ్రత మరియు సమతల కోణం.
ప్రశ్న 10.
MKS, SI పద్దతులలో తేడా ఏమిటి?
జవాబు:
- MKS పద్ధతిలో మూడు ప్రాథమిక రాశులు మాత్రమే ఉన్నవి. అవి పొడవు, ద్రవ్యరాశి, కాలం.
- SI పద్ధతిలో ఎనిమిది ప్రాథమిక రాశులు ఉన్నాయి. అవి పొడవు, ద్రవ్యరాశి, కాలం, విద్యుత్, కాంతి తీవ్రత, పదార్థ పరిమాణం, ఉష్ణోగ్రత మరియు సమతల కోణం.
ప్రశ్న 11.
ఉత్పన్న రాశి అనగానేమి?
జవాబు:
ఏ రాశులైతే ప్రాథమిక రాశులను గుణించడం లేదా భాగించడం లేదా రెండూ చేయడం ద్వారా ఏర్పడతాయో వాటిని ఉత్పన్న రాశులు అంటారు.
ప్రశ్న 12.
ఉత్పన్న ప్రమాణాలు అనగానేమి?
జవాబు:
ప్రాథమిక ప్రమాణాల నుండి ఉత్పన్నమయ్యే ప్రమాణాలను ఉత్పన్న ప్రమాణాలు అంటారు.
ప్రశ్న 13.
వైశాల్యం, ఘనపరిమాణాలకు ఉత్పన్న ప్రమాణాలను రాయుము.
జవాబు:
వైశాల్యం = m² (మీటరు²) ; ఘనపరిమాణం = m³ (మీటరు)
ప్రశ్న 14.
బలం యొక్క ప్రమాణాలను ఏఏ ప్రాథమిక ప్రమాణాల ద్వారా వ్యక్తపరచవచ్చును?
జవాబు:
కావున బలం ప్రమాణాలను కి.గ్రా., మీటరు, సెకను అనే మూడు ప్రాథమిక ప్రమాణాలను ఉపయోగించి వ్యక్తపరచ వచ్చును.
ప్రశ్న 15.
కిలోమీటరును మీటరుగా మార్చుటకు వినియోగించు మార్పిడి గుణకం ఏది?
జవాబు:
1000.
ప్రశ్న 16.
మీటరను కిలోమీటర్ లోకి మార్చుటకు వినియోగించు మార్పిడి గుణకం ఏది?
జవాబు:
10-3
ప్రశ్న 17.
కి.మీ./గం. ను మీ./సె. లలోకి మార్చుటకు మార్పిడి గుణకాన్ని రాయుము.
జవాబు:
\(\frac{8}{18}\)
ప్రశ్న 18.
శాస్త్రవేత్తల పేర్ల మీద గల కొన్ని ప్రమాణాలను రాయుము.
జవాబు:
న్యూటన్ (N), పాస్కల్ (Pa), జౌల్ (J), వాట్ (W) మొదలగునవి.
ప్రశ్న 19.
గ్రాఫు అనగానేమి?
జవాబు:
రెండు రాశుల మధ్య సంబంధాన్ని తెలియజేసే పటమే గ్రాఫు.
ప్రశ్న 20.
స్వతంత్ర రాశులు, ఆధారిత రాశులు అనగానేమి?
జవాబు:
- ప్రయోగంలో ఏ రాశి విలువలు మనచేత నియంత్రించబడతాయో లేదా నిర్ణయించబడతాయో ఆ రాశులను స్వతంత్ర రాశులు అంటారు.
- ప్రయోగంలో ఏ రాశి విలువలు స్వతంత్ర రాశి విలువలకు అనుగుణంగా మార్పు చెందుతాయో ఆ రాశులను ఆధారిత రాశులు అంటారు.
ప్రశ్న 21.
X- అక్షంపై ఎటువంటి రాశిని తీసుకుంటారు?
జవాబు:
స్వతంత్ర రాశిని.
ప్రశ్న 22.
గ్రాఫు పేపర్ పై ‘గళ్ళు’ అనగానేమి?
జవాబు:
గ్రాఫు పేపర్ పై మందపాటి మరియు సన్నని, అడ్డంగా మరియు నిలువుగా గీయబడిన రేఖలు ఉంటాయి. ఈ రేఖలు ఖండించుకోవడం వలన ఏర్పడినవే గళ్ళు లేదా చదరాలు.
ప్రశ్న 23.
‘వ్యాప్తి’ అనగానేమి?
జవాబు:
గరిష్ట మరియు కనిష్ట విలువల మధ్య భేదాన్ని ‘వ్యాప్తి’ అంటారు.
వ్యాప్తి = గరిష్ట విలువ – కనిష్ట విలువ
ప్రశ్న 24.
‘స్కేలింగ్’ అనగానేమి?
జవాబు:
X – అక్షం మరియు Y – అక్షం పై విలువలను గుర్తించడాన్ని ‘స్కేలింగ్’ అంటారు.
ప్రశ్న 25.
‘స్కేలు’ అనగానేమి?
జవాబు:
అక్షాలపై తీసుకున్న విలువల అవధిని స్కేలు అంటారు.
ప్రశ్న 26.
X – అక్షం స్కేలును ఎలా కనుగొంటారు?
జవాబు:
ప్రశ్న 27.
వక్రరేఖా గ్రాఫు అనగానేమి?
జవాబు:
గ్రాఫు వక్ర ఆకారంలో ఉంటే ఆ గ్రాఫును వక్రరేఖా గ్రాఫు అంటారు.
ప్రశ్న 28.
హుక్ సూత్రం రాయుము.
జవాబు:
ఒక స్ప్రింగ్ యొక్క సాగుదల, దానిపై ప్రయోగించిన ద్రవ్యరాశికి అనులోమానుపాతంలో ఉంటుంది.
ప్రశ్న 29.
సరళరేఖా గ్రాఫు వాలు అనగానేమి?
జవాబు:
ప్రశ్న 30.
గ్రాఫు వాలు అనగానేమి?
జవాబు:
గ్రాఫు X – అక్షంతో చేసే కోణం యొక్క tan విలువను గ్రాఫు వాలు అంటారు.
\(\tan \theta=\frac{\Delta \mathrm{y}}{\Delta \mathrm{x}}\)
ప్రశ్న 31.
గ్రాఫు వైశాల్యం అనగానేమి?
జవాబు:
X – అక్షం, Y – అక్షం పై గల భౌతిక రాశుల లబ్ధం వలన ఏర్పడే మరొక భౌతిక రాశిని వివరించేదే గ్రాఫు వైశాల్యం.
ప్రశ్న 32.
స్థానభ్రంశం – కాలం గ్రాఫు వాలు (m) దేనిని వివరిస్తుంది?
జవాబు:
ప్రశ్న 33.
త్వరణం కాలం గ్రాఫు వైశాల్యం దేనిని వివరిస్తుంది?
జవాబు:
ప్రశ్న 34.
ఒక స్వేచ్ఛాపతన వస్తువు యొక్క కాలం-వేగం గ్రాఫు ఎలా ఉంటుందో ఊహించండి.
జవాబు:
సరళరేఖా గ్రాఫు.
ప్రశ్న 35.
బస్సు ప్రయాణం యొక్క దూరం-కాలం గ్రాఫు ఆకారం ఎలా ఉంటుంది?
జవాబు:
వక్రరేఖా గ్రాఫు.
ప్రశ్న 36.
నల్లబల్లపై రిత్విక్ ‘3 kgs పంచదార’ అని రాశాడు. ఒక ప్రశ్నను అడిగి పై వాక్యాన్ని సరిచేయుము.
జవాబు:
ప్రమాణాలు రాయాల్సినపుడు kg లను బహువచనంలో kgs గా రాయవచ్చా?
ప్రశ్న 37.
కార్తీక్ కి ‘3 న్యూటన్లు’ అనే పదాన్ని చూసి ఒక సందేహం కలిగింది. ఆ సందేహం ఏమై ఉంటుంది?
జవాబు:
న్యూటన్లలో ఏ భౌతికరాశిని కొలుస్తారు?
ప్రశ్న 38.
హుక్ సూత్రాన్ని నిరూపించడానికి చేసే ప్రయోగంలో ఏఏ పరికరాలు అవసరమవుతాయి?
జవాబు:
1) స్ప్రింగ్, 2) బరువులు, 3) స్కేలు, 4) స్టాండ్
ప్రశ్న 39.
వైశాల్యం, ఘనపరిమాణం, సాంద్రత, ద్రవ్యరాశి
a) పై వానిలో ప్రాథమిక రాశులేవి?
b) పై వానిలో ఉత్పన్న రాశులేవి?
జవాబు:
a) ద్రవ్యరాశి,
b) వైశాల్యం, ఘనపరిమాణం, సాంద్రత.
ప్రశ్న 40.
‘ధీరజ్ తన ప్రయాణించిన దూరాన్ని ప్రతి 10 ని||లకు లెక్కించి నమోదు చేసుకున్నాడు.
పై దత్తాంశం నుండి స్వతంత్రరాశి, ఆధారిత రాశిని రాయండి.
జవాబు:
కాలం (ని॥) స్వతంత్ర రాశి మరియు దూరం ఆధారిత రాశి.
ప్రశ్న 41.
పై గ్రాలో (6, 4), (0, 0) దత్తాంశ బిందువులను గుర్తించుము.
జవాబు:
ప్రశ్న 42.
ప్రమాణాల ద్వారా శాస్త్రజ్ఞులను ఎలా గుర్తుకు తెచ్చుకుంటావో రాయుము.
జవాబు:
- కొన్ని ప్రమాణాలు శాస్త్రవేత్తల పేర్లతో వ్యక్తపరచబడ్డాయి. ఉదా : న్యూటన్ (N), జాల్ (J), కెల్విన్ (K) మొదలగునవి.
- పై ప్రమాణాలను వినియోగించినపుడు ఆయా శాస్త్రవేత్తలు గుర్తుకు వస్తారు.
ప్రశ్న 43.
గ్రాఫు యొక్క ఉపయోగమేమి?
జవాబు:
- చాలా సమస్యలను గ్రాఫు ద్వారా సాధించవచ్చును.
- రెండు రాశుల మధ్య సంబంధాన్ని గ్రాఫు ద్వారా తెలుసుకోవచ్చును.
ప్రశ్న 44.
5, 7, 3, 8, 18, 4, 2, 6 విలువల వ్యాప్తి ఎంత?
జవాబు:
వ్యాప్తి = గరిష్ట విలువ – కనిష్ట విలువ
= 18 – 2 = 16
ప్రశ్న 45.
వ్యాప్తి 10 మరియు అడ్డంగా 20 గళ్ళు ఉన్నప్పుడు X – అక్షంపై ‘స్కేలు’ ఎలా తీసుకుంటావు?
జవాబు:
ప్రశ్న 46.
స్థానభ్రంశం-కాలం గ్రాఫు ఎలా ఉపయోగపడుతుంది?
జవాబు:
స్థానభ్రంశం-కాలం గ్రాఫు వాలును కనుగొని తద్వారా వేగంను లెక్కించవచ్చును.
ప్రశ్న 47.
వేగం-కాలం గ్రాఫు యొక్క వైశాల్యం ఎలా ఉపయోగపడుతుంది?
జవాబు:
ఒక వస్తువు యొక్క స్థానం (position) ను గుర్తించడానికి వేగం కాలం గ్రాఫు యొక్క వైశాల్యం ఉపయోగపడుతుంది.
ప్రశ్న 48.
‘B’ వద్ద త్వరణం ఎంత?
జవాబు:
ప్రశ్న 49.
‘A’ వద్ద త్వరణం ఎంత?
జవాబు:
ప్రశ్న 50.
గ్రాఫులో A నుండి B కి వస్తువు ప్రయాణించిన దూరం ఎంత? ఎందుకు?
జవాబు:
సున్న. ఎందుకనగా కొలం మారినప్పటికీ దూరంలో మార్పులేదు.
9th Class Physical Science 12th Lesson ప్రమాణాలు మరియు గ్రాఫులు 2 Marks Important Questions and Answers
ప్రశ్న 1.
ప్రమాణం (యూనిట్) అనగానేమి? దీనిని ఎక్కడ ఉంచుతారు?
జవాబు:
- కొలతలను పోల్చుటకు ఉపయోగించే ఏ ప్రామాణిక కొలతనైనా ప్రమాణం అంటారు.
- ఈ ప్రమాణాలను భౌతిక రాశుల పరిమాణాలకు కుడివైపున రాయాలి.
ఉదా : 2 కి.గ్రా., 10 మీ.
ప్రశ్న 2.
ప్రాథమిక రాశులు, ఉత్పన్న రాశుల మధ్య తేడాలు రాయుము.
జవాబు:
ప్రాథమిక రాశులు | ఉత్పన్న రాశులు |
1) ప్రాథమిక రాశులు అనేవి మరే ఇతర పరిమాణాల లోనూ వ్యక్తపరచడానికి వీలులేని భౌతిక రాశులు. | 1) ఏ రాశులైతే ప్రాథమిక రాశులను గుణించడం లేదా భాగించడం లేదా రెండూ చేయడం ద్వారా ఏర్పడతాయో వాటిని ‘ఉత్పన్న రాశులు’ అంటారు. |
2) ఇవి స్వతంత్ర రాశులు. | 2) ఇవి ప్రాథమిక రాశులపై ఆధారపడతాయి. |
3) ఉదా : ద్రవ్యరాశి, పొడవు, కాలం. | 3) ఉదా : వైశాల్యం , ఘనపరిమాణం, సాంద్రత |
ప్రశ్న 3.
సాంద్రత ప్రమాణాలను ఉత్పన్నం చేయుము.
జవాబు:
ప్రశ్న 4.
వివిధ రకాల కొలత పద్దతులను రాయుము.
జవాబు:
1) FPS : అడుగు (F), పౌండు (P), సెకను (S).
2) CGS : సెంటీమీటరు (C), గ్రాము (G), సెకను (S).
3) MKS : మీటరు (M), కిలోగ్రాము (Kg), సెకను (S).
4) SI : మీటరు, కిలోగ్రాము, సెకను, ఆంపియర్, కాండెలా, మోల్, కెల్విన్, రేడియన్.
ప్రశ్న 5.
క్రింది వానికి ప్రమాణాలను ఉత్పాదించుము.
a) త్వరణం b) బలం
జవాబు:
ప్రశ్న 6.
క్రింది వానిలో ఏవి సరైనవి? ఎందుకు?
A) m/s B) m/s/s C) m-s2 D) 10 – kgs E Pascal joule
జవాబు:
A మరియు F లు సరైనవి.
B) రెండు సార్లు | గుర్తు వినియోగించబడినది. తప్పు.
C) ‘-‘ ఉపయోగించబడినది. తప్పు.
D) ‘.’ మరియు kg లను kgs గా బహువచనంలో వినియోగించబడినది. తప్పు.
E) ‘P’ కేపిటల్ అక్షరం వినియోగించబడినది. తప్పు.
ప్రశ్న 7.
క్రింది ప్రమాణాలను సరిచేసి రాయుము.
(i) DB (ii) mhz (iii) 20 – m (iv) kg.m-s-2
జవాబు:
(i) dB
(ii) MHz
(iii) 20 m
(iv) Kg.m.s-2
ప్రశ్న 8.
క్రింది గ్రాఫుల ఆకారాన్ని ఊహించి రాయండి.
(a) a ∝ b (b) a ∝ \(\frac{1}{b}\)
జవాబు:
a) a ∝ b గ్రాఫు సరళరేఖా గ్రాఫుగా ఉండవచ్చును.
b) a ∝ \(\frac{1}{b}\) గ్రాఫు వక్రరేఖా గ్రాఫుగా ఉండవచ్చును.
ప్రశ్న 9.
ప్రక్క గ్రాఫు నుండి
a) OA, OB, OC రేఖల వాలులు దేనిని సూచిస్తాయి?
b) ఏ రేఖ ఎక్కువ వడిని సూచిస్తుంది?
జవాబు:
a) OA, OB, OC రేఖల వాలులు ‘వడి’ లను సూచిస్తాయి.
b) OA రేఖ అధిక వడిని సూచిస్తుంది. కారణం OB, OC రేఖల కన్నా ఎక్కువ ‘వాలు’ ని OA కలిగి ఉంది.
ప్రశ్న 10.
a) పై వానిలో ఏది స్వతంత్ర రాశి?
b) పై వానిలో ఏది ఆధారిత రాశి?
c) గ్రాఫు ఎలా ఉంటుందో ఊహించుము.
d) Y – అక్షంపై వ్యాప్తిని కనుగొనుము.
జవాబు:
a) ద్రవ్యరాశి
b) భారం
c) సరళరేఖా గ్రాఫు
d) Y – అక్షంపై విలువలు = 98, 196, 294, 392, 490.
వ్యాప్తి = గరిష్ట విలువ – కనిష్ట విలువ = 490 – 98 = 392
ప్రశ్న 11.
క్రింది బిందువులను గ్రాఫు పేపర్ పై గుర్తించి కలుపుము.
(8, 10) (20, 15) (40, 22.5) (48, 0)
జవాబు:
ప్రశ్న 12.
సమవేగాన్ని సూచించు చిత్తు గ్రాఫును గీయుము.
జవాబు:
ప్రశ్న 13.
ఒక వస్తువు కొంతదూరం ప్రయాణం చేసిన తర్వాత నిశ్చలంగా ఉంది. దీనిని సూచించు గ్రాఫును గీయుము.
జవాబు:
ప్రశ్న 14.
సమస్యా సాధనలో గ్రాఫుల యొక్క పాత్రను నీవెలా అభినందిస్తావు ?
జవాబు:
- కాలం-స్థానభ్రంశం, కాలం-వేగం, పీడనం-ఘనపరిమాణం మొదలగు గ్రాఫులు వాటిలోని భౌతిక రాశుల మధ్య సంబంధాన్ని తెలియజేస్తాయి. తద్వారా వాటి మధ్య గల సమస్యలను సాధించుటకు ఉపయోగపడతాయి.
- గ్రాఫులలో వస్తువు ప్రయాణ మార్గం, దిశలను సులువుగా తెలుసుకోవచ్చును. సంబంధిత సమస్యలను సాధించవచ్చును.
- గ్రాఫులలోని రేఖల వాలు, వైశాల్యంలను తెలుసుకొనుట ద్వారా వేగం, త్వరణం, స్థానం మొదలగు భౌతిక రాశుల సమస్యలను సాధించవచ్చును.
- గ్రాఫులు గరిష, కనిష్ట విలువలను కనుగొనుటకు ఉపయోగపడతాయి.
ఉదా : పట్టకం కనిష్ట విచలన కోణం. - ప్రయోగ విలువలను గ్రాఫులలో చూపి సమస్యలను సాధించవచ్చును.
- ఈ విధంగా గ్రాఫులు సమస్యా సాధనలో అభినందించదగ్గ పాత్రను పోషిస్తున్నాయి.
ప్రశ్న 15.
ప్రక్క ఇవ్వబడిన గ్రాఫులో ‘B’ బిందువు వద్ద వాలును, వైశాల్యాన్ని కనుక్కోండి.
జవాబు:
ప్రశ్న 16.
3 మీ/సె.ను కి.మీ./గం. లలోకి మార్చుము.
జవాబు:
ప్రశ్న 17.
ఒక 100 గ్రా. బంతిని 0.01 కి.మీ./సె. తొలివేగంతో విసిరిన, ఆ సమయంలో బంతి ద్రవ్యవేగం ఎంత?
జవాబు:
ద్రవ్యవేగం = ద్రవ్యరాశి × వేగం
బంతి ద్రవ్యరాశి = 100 గ్రా. = 0.1 కి.గ్రా.
బంతి తొలివేగం = 0.01 కి.మీ./సె. = 0.01 × 1000 మీ./సె. = 10 మీ./సె.
ద్రవ్యవేగం = m × v = 0.1 కి.గ్రా, × 10 మీ.సె-1 = 1 కి.గ్రా. మీ.-1
ప్రశ్న 18.
గ్రాఫు గీయడం ద్వారా రోజు-4 ఉష్ణోగ్రతను కనుగొనుము.
జవాబు:
గ్రాఫు నుండి రోజు – 4న 43 °C ఉష్ణోగ్రత ఉంది.
ప్రశ్న 19.
పట్టికను పరిశీలించి క్రింది వానికి జవాబులిమ్ము.
జవాబు:
i) 12 cm = ……………….m
ii) 2nm = ……………. om
జవాబు:
i) 12 సెం.మీ. = 12 × 10-2 మీ.
ii) 2 nm = 2 × 10-7 cm
[∵ 1 నానోమీటరు = 10-9 మీ.; 1 సెం.మీ. = 10-2మీ.
నానోమీటరును సెంటిమీటర్లలోకి మార్చడానికి = 10-9/ 10-2 = 10-7 మార్పిడి గుణకంతో గుణించాలి.]
ప్రశ్న 20.
క్రింది వానికి మార్పిడి గుణకాలను కనుగొనుము.
a) పికోమీటరు నుండి మీటరు
b) గిగాబైట్ నుండి కిలోబైట్లకు
జవాబు:
a) 1 పికోమీటరు = 10-12 మీ.; 1 మీ. = 100 మీ.
పికోమీటరు – మీటరు మార్పిడి గుణకం ⇒ 10-12 – (0) = 10-12
b) 1 GB = 109 బైట్లు, 1 KB = 10³ బైట్లు
మార్పిడి గుణకం (GB నుండి KBB) = 109-3 = 106
ప్రశ్న 21.
క్రింది వానికి మార్పిడి గుణకాన్ని కనుక్కోండి.
a) మెగావాట్స్ నుండి కిలోవాట్స్
b) కిలోవాట్స్ నుండి మెగావాట్స్
జవాబు:
a) 1 మెగావాట్ = 106 వాట్స్; 1 కిలోవాట్ = 10³ వాట్స్
1 మెగావాట్ నుండి కిలోవాట్ = 106-3 = 10³ (మార్పిడి గుణకం)
1 మెగావాట్ = 10³ కిలోవాట్
b) 1 కిలోవాట్ నుండి 1 మెగావాట్ = 103-6 = 10-3 (మార్పిడి గుణకం)
1 కిలోవాట్ = 10-3 మెగావాట్
9th Class Physical Science 12th Lesson ప్రమాణాలు మరియు గ్రాఫులు 4 Marks Important Questions and Answers
ప్రశ్న 1.
కొలత ప్రమాణాలు రాయడానికి నాలుగు నిబంధనలు రాయుము.
జవాబు:
- ప్రమాణాన్ని రాసేటప్పుడు సంఖ్యకి మరియు ప్రమాణానికి మధ్య ఖాళీ ఇవ్వాలి.
ఉదా : 24 kg, 2 cm, 5 s. - గుణించడం వలన ఏర్పడే ఉత్పన్న ప్రమాణాలను చుక్క (. )తో గాని, ఖాళీతోగాని సూచించాలి.
ఉదా : N.m లేదా N m - ఒక ప్రమాణాన్ని రాసేటప్పుడు దాని మధ్యలో (. )గాని, ఫుల్ స్టాప్ గాని ఉంచరాదు.
ఉదా : 4 k.g. కి బదులు 4 kg అని రాయాలి. - ఒక వ్యక్తి పేరుమీద ఉన్న ప్రమాణాలు పొట్టి రూపంలో అయితే ఆంగ్ల పెద్ద అక్షరాలతోను పూర్తి పేరు రూపంలో అయితే ఆంగ్ల చిన్న అక్షరాలతోనూ సూచించాలి.
ఉదా : N, J, Pa (లేదా) newton, joule, pascal.
ప్రశ్న 2.
పట్టిక రూపంలో ఇచ్చిన దత్తాంశానికి గ్రాఫును నిర్మించడానికి కావలసిన సోపానాలు రాయుము.
జవాబు:
1) ఒక గ్రాఫు పేపరును తీసుకొని, దానిపై X – అక్షం మరియు Y- అక్షంను గీయుము.
2) పట్టికలో దత్తాంశంనుబట్టి స్వతంత్ర రాశి, ఆధారిత రాశులను గుర్తించుము. స్వతంత్ర రాశిని X – అక్షం మీద, ఆధారిత రాశిని Y – అక్షం మీద తీసుకోవాలి.
3) X – అక్షం మీద తీసుకున్న విలువలకు మరియు Y- అక్షం మీద తీసుకున్న విలువల వ్యాప్తులను కనుగొనాలి.
వ్యాప్తి = గరిష్ట విలువ – కనిష్ట విలువ
4) అక్షాలపై తీసుకోవలసిన స్కేలును లెక్కించాలి.
స్కేలు ప్రకారం అక్షాలపై స్కేలింగ్ చేయాలి.
5) X – అక్షం, Y – అక్షంపై తీసుకున్న భౌతిక రాశుల పేర్లు వాటి ప్రమాణాలతో కలిపి రాయాలి.
6) పట్టికలో ఇచ్చిన దత్తాంశాన్ని (x1 yx1) (xx2 yx2) …….. వలె దత్తాంశ బిందువులుగా రాయాలి.
7) ఈ దత్తాంశ బిందువులను సంబంధిత క్షితిజ సమాంతర (అడ్డం), క్షితిజ లంబం (నిలువు) ఖండిత బిందువుల వద్ద గుర్తించాలి.
8) ఈ బిందువులన్నింటినీ కలిపితే గ్రాఫు తయారవుతుంది.
ప్రశ్న 3.
క్రింది పట్టికను సరియైన జవాబులతో నింపుము.
జవాబు:
a) N/m²
b) Pa (పాస్కల్)
c) s-1
d) బలం
e) m. kg.s-2
f) m². kg. s-2
g) J/s (or) \(\frac{\mathrm{N} \cdot \mathrm{m}}{\mathrm{s}}\)
h) W (వాట్)
ప్రశ్న 4.
క్రింది పట్టికను పూరించుము.
ఉత్పన్న రాశి | ప్రాథమిక, ఉత్పన్న రాశులతో సంబంధం | ప్రమాణం |
వైశాల్యం | ||
ఘనపరిమాణం | ||
సాంద్రత | ||
వడి | ||
వేగం | ||
త్వరణం | ||
పని | ||
ద్రవ్య వేగం |
జవాబు:
ఉత్పన్న రాశి | ప్రాథమిక, ఉత్పన్న రాశులతో సంబంధం | ప్రమాణం |
వైశాల్యం | పొడవు X వెడల్పు | m2 |
ఘనపరిమాణం | పొడవు X వెడల్పు X ఎత్తు | m3 |
సాంద్రత | ద్రవ్యరాశి /ఘనపరిమాణం | kg m-3 |
వడి | దూరం / కాలం | m s-1 |
వేగం | స్థానభ్రంశం / కాలం | m s-1 |
త్వరణం | వేగం / కాలం | m s-2 |
పని | బలం / దూరం | kg m2 s-2 |
ద్రవ్య వేగం | ద్రవ్యరాశి X వేగం | kg m s-1 |
ప్రశ్న 5.
1) ప్రయాణంలో ఎవరు విశ్రాంతి తీసుకున్నారు?
2) 100 నిమిషాల తర్వాత పద్మ, భవానీల స్థానాలు ఏమిటి?
3) ఎవరు సమవడిలో వెళ్ళారు?
4) భవాని వడి ఎంత?
జవాబు:
1) పద్మ విశ్రాంతి తీసుకుంది.
2) 100 నిమిషాల తర్వాత పద్మ 700 మీ. దూరంలోనూ, భవాని 600 మీటర్ల దూరంలోనూ ఉన్నారు.
3) భవాని సమవడిలో ప్రయాణించింది.
4) భవాని వడి = \(\frac{600}{100}\) = 6 మీ. / నిమిషం .
ప్రశ్న 6.
a) ఏ భౌతికరాశి స్వతంత్ర రాశిగా తీసుకోబడింది?
b) X. అక్షంపై స్కేలు ఎంత?
c) Y- అక్షంపై స్కేలు ఎంత?
d) గ్రాఫు ఆకారం ఏమిటి?
జవాబు:
a) దూరం స్వతంత్ర రాశిగా తీసుకోబడింది.
b) 1 cm = 100 m
c) 1 cm = 2 నిమిషాలు
d) గ్రాఫు వక్రరేఖా గ్రాఫు.
ప్రశ్న 7.
ఇచ్చిన దత్తాంశానికి గ్రాఫు గీయుము.
జవాబు:
1) గ్రాఫు పేపరుపై X- అక్షం, Y- అక్షాలను గీయాలి.
2) దత్తాంశం ప్రకారం కాలం స్వతంత్ర రాశి, స్థానభ్రంశం ఆధారిత రాశి. కావున, X – అక్షంపై కాలం, Y – అక్షంపై స్థానభ్రంశాలను తీసుకోవాలి.
3) X – అక్షం, Y – అక్షంపై తీసుకుంటున్న విలువల వ్యాప్తులను లెక్కించాలి.
X – అక్షంపై వ్యాప్తి = 24 – 4 = 20
Y- అక్షంపై వ్యాప్తి = 15 – 2 = 13
4) X – అక్షం, Y – అక్షం పై తీసుకుంటున్న విలువల వ్యాప్తులను లెక్కించాలి.
X – అక్షంపై స్కేలు 1 cm = 2 ని.
Y – అక్షంపై స్కేలు 1 cm = 1 కి.మీ.
తీసుకొని అక్షాలపై గుర్తించాలి.
5) X – అక్షంపై కాలం (ని.), Y – అక్షంపై స్థానభ్రంశం. (కి.మీ.) అని రాయాలి.
6) దత్తాంశ బిందువులను (4, 2) (8, 3) (12, 7) (16, 11) (20, 13) (24, 15) గా తీసుకోవాలి.
7) పై బిందువులను గ్రాఫు పేపరుపై గుర్తించాలి.
8) ఆయా బిందువులను కలుపుతూ రేఖను గీయాలి.
ప్రశ్న 8.
వేగం-కాలం (v – t) గ్రాఫును గీయుము.
జవాబు:
1) గ్రాఫు పేపరుపై X – అక్షం, Y – అక్షాలను గీయాలి.
2) దత్తాంశం ప్రకారం బలం స్వతంత్ర రాశి, వేగం ఆధారిత రాశి, కావున X – అక్షంపై కాలంను, Y – అక్షంపై వేగంను తీసుకోవాలి.
3) X – అక్షం, Y – అక్షంపై తీసుకున్న విలువల వ్యాప్తులను లెక్కించాలి.
X- అక్షంపై వ్యాప్తి = 180 – 20 = 160
Y- అక్షంపై వ్యాప్తి = 20 – 5 = 15
4) X – అక్షం, Y – అక్షంపై స్కేలును అంచనా వేయాలి.
X- అక్షంపై స్కేలు 1 cm = 8s; Y – అక్షంపై స్కేలు 1 cm = 1 m/s
5) X – అక్షంపై కాలం (సె), Y- అక్షంపై వేగం (మీ./సె.) అని రాయాలి.
6) దత్తాంశ బిందువులు (20, 5), (40, 10), (60, 15), (80, 20), (100, 20), (120, 20), (140, 20), (160, 20), (180, 15) గా తీసుకోవాలి.
7) పై బిందువులను గ్రాఫు పేపర్ లో గుర్తించాలి.
8) గుర్తించిన బిందువులను కలుపుతూ రేఖను గీయాలి.
ప్రశ్న 9.
i) v = u + at, ii) s = ut + ½ at² అని గ్రాఫు పద్ధతిలో నిరూపించుము.
జవాబు:
i) 1) కాలాన్ని X – అక్షంపై, వేగాన్ని Y – అక్షంపై తీసుకొని పటంలో చూపినట్లు గ్రాఫును గీయాలి.
2) పై గ్రాఫు నుండి,
t విలువ “O” వద్ద వస్తు వేగం = 4
t విలువ “t” వద్ద వస్తు వేగం = v
3) వేగంలో మార్పు = v – u
4) గ్రాఫు నుండి x1 = 0, x2 = t, y1 = u, y2 = v
ii) 1) పై గ్రాఫు యొక్క వైశాల్యం ట్రెపీజియం ఆకారంలో ఉంది. ఇది ABCD దీర్ఘ చతురస్రం మరియు DCE త్రిభుజం కలిపి యుంది.
ప్రశ్న 10.
క్రింది గ్రాఫును పరిశీలించి 12 సెకన్ల వద్ద వస్తు స్థానభ్రంశాన్ని లెక్కించంది.
జవాబు:
- స్థానభ్రంశం (s) ⇒ గ్రాఫు వైశాల్యం = ABDO దీర్ఘచతురస్ర వైశాల్యం + BDC త్రిభుజ వైశాల్యం.
- ABDO దీర్ఘచతురస్ర వైశాల్యం = 8 × 20 = 160.
- BDC త్రిభుజ వైశాల్యం = ½ × 20 × (12 – 8) = ½ × 20 × 4 = 40.
- స్థానభ్రంశం(S) = 160 + 40 = 20oమీ.
- 12 సెకన్ల వద్ద వస్తువు 200 మీ. స్థానభ్రంశం చెందింది.
ప్రశ్న 11.
గ్రాఫు నుండి 4 వద్ద వేగాన్ని లెక్కించండి.
జవాబు:
- త్వరణం – కాలం (a – t) గ్రాఫు యొక్క వైశాల్యం వేగం (v) ను సూచిస్తుంది.
- AB లను కలుపుము.
- వేగం (v) = ∆ ABO వైశాల్యం = ½ × 60 × 120 = 3600 మీ./సె.
ప్రశ్న 12.
క్రింది గ్రాఫులో ‘B’ వద్ద బలాన్ని లెక్కించుము.
జవాబు:
9th Class Physical Science 12th Lesson ప్రమాణాలు మరియు గ్రాఫులు 1 Mark Bits Questions and Answers
1. భౌతికరాశుల ప్రమాణాల స్థానము
A) పరిమాణాలకు ఎడమవైపు
B) పరిమాణాలకు కుడివైపు
C) పరిమాణాల క్రింద
D) పరిమాణాల పైన
జవాబు:
B) పరిమాణాలకు కుడివైపు
2. ఈ క్రింది వానిలో ప్రాథమిక రాశి కానిదేది?
A) కాంతి తీవ్రత
B) పొడవు
C) పీడనము
D) ద్రవ్యరాశి
జవాబు:
C) పీడనము
3. SI పద్ధతిలో ఉష్ణోగ్రతకు ప్రమాణాలు
A) °C
B) కెల్విన్
C) కెలోరి
D) A లేదా B
జవాబు:
B) కెల్విన్
4. SI పద్ధతి అనగా
A) Standard International Measures
B) State Implement Units
C) International System of Units
D) International Standards of Measurements
జవాబు:
C) International System of Units
5. ‘సెకండ్లు’ అనే ప్రమాణాలు ఈ పద్దతికి చెందినవి.
A) CGS పద్ధతి
B) MKS పద్ధతి
C) SI పద్ధతి
D) పైవన్నియూ
జవాబు:
D) పైవన్నియూ
6. జతపరచండి.
a) విద్యుచ్ఛక్తి ( ) i) మోల్
b) కాంతి తీవ్రత ( ) ii) కాండెలా
c) పదార్థ పరిమాణము ( ) iii) ఆంపియర్
A) a – iii, b – ii, c – i
B) a – i, b – ii, c – iii
C) a – i, b – iii, c – ii
D) a – ii, b-iii, c – i
జవాబు:
A) a – iii, b – ii, c – i
7. ప్రమాణాల నిర్వచనం ప్రకారం పీడనానికి ఉపయోగించే ప్రమాణాలు ఏవి?
a) మీటరు b) కిలోగ్రామ్ c) సెకండు
A) a & c
B) b & c
C) a & b
D) a, b & c
జవాబు:
D) a, b & c
8. 1 పీకో మీటరు =
A) 10-9 మీటర్లు
B) 10-8 మీటర్లు
C) 10-12 మీటర్లు
D) 10-10 మీటర్లు
జవాబు:
C) 10-12 మీటర్లు
9. ఈ క్రింది వానిలో అసత్యమైనది
A) 10-9 m = 1 నానోమీటర్
B) 10-6 m = 1 మైక్రోమీటర్
C) 10-3 m = 1 కిలోమీటర్
D) పైవేవీకావు
జవాబు:
C) 10-3 m = 1 కిలోమీటర్
10. 5 × 10-3 కి.మీ. = 0.005 కి.మీ.
పై వాక్యంలో మార్పిడి గుణకం
A) 5
B) 10-3
C) 0.005
D) 5 x 10-3
జవాబు:
B) 10-3
11. km/hr లను m/sగా మార్చడానికి మార్పిడి గుణకం
జవాబు:
A
12. వేగం = 10 మీ/సె. SI పద్ధతిలో వేగము
A) 0.1 m/s
B) 0.01 m/s
C) 1 ms.
D) 10³ m/s
జవాబు:
A) 0.1 m/s
13. ప్రమాణాలను తెలియజేసే సరైన పద్ధతి ఈ క్రింది వానిలో ఏది?
A) 2 Kg
B) 2kg
C) 2 kg
D) 2 kgs
జవాబు:
C) 2 kg
14. ఈ క్రింది వానిలో సరైనది కానిది ఏది?
A) 4 joules
B) 4 j
C) 4 J
D) ఏదీకాదు
జవాబు:
B) 4 j
15. ఈ క్రింది వానిలో సరైనది ఏది?
A) MW
B) kW
C) Watts
D) K.W
జవాబు:
A) MW
16. 1మీ, 2మీ, 3మీ ….. ఖచ్చితమైన దారపు పొడవుతో ప్రమీల లోలకం యొక్క కంపనాలను లెక్కిస్తుంది.
పై సమాచారంలో స్వతంత్ర రాశి
A) పౌనఃపున్యాల సంఖ్య
B) పొడవు
C) కాలము
D) గోళ ద్రవ్యరాశి
జవాబు:
B) పొడవు
17. 1, 1.1, 0.5, 1.6, 1.01, 1.5 ల వ్యాప్తి
A) 1.1
B) 0.5
C) 1.01
D) 0.1
జవాబు:
A) 1.1
18. X – అక్షంపైనున్న గళ్ళ సంఖ్య 24 మరియు వ్యాప్తి 12 అయిన X – అక్షంపై స్కేలు
A) 2
B) 6
C) 0.5
D) 1
జవాబు:
C) 0.5
19. లంబాక్షము మరియు సమాంతర అక్షములు వరసగా
A) X – అక్షము, Y – అక్షము
B) Y – అక్షము, X – అక్షము
C) X – అక్షము, X – అక్షము
D) Y- అక్షము, Y – అక్షము
జవాబు:
B) Y – అక్షము, X – అక్షము
20. స్వేచ్ఛగా పడే వస్తువు యొక్క వేగము మరియు కాలముల గ్రాఫు
A) వక్రరేఖా గ్రాఫు
B) సరళరేఖా గ్రాపు
C) A లేదా B
D) బార్ గ్రాఫ్
జవాబు:
B) సరళరేఖా గ్రాపు
21. s – t గ్రాఫు వాలు సూచించునది
A) వడి
B) వేగం
C) త్వరణం
D) స్థానం
జవాబు:
B) వేగం
22. v – t గ్రాఫు వాలు సూచించునది
A) వడి
B) వేగం
C) త్వరణం
D) స్థానభ్రంశం
జవాబు:
C) త్వరణం
23. v – t గ్రాఫు వైశాల్యం సూచించునది
A) వడి
B) వేగం
C) త్వరణం
D) స్థానభ్రంశం
జవాబు:
D) స్థానభ్రంశం
24. a – t గ్రాఫు వైశాల్యం సూచించునది
A) వడి
B) వేగం
C) త్వరణం
D) స్థానభ్రంశం
జవాబు:
B) వేగం
25. స్ప్రింగ్ లో సాగుదలకు, స్ప్రింగ్ కు వేలాడదీసిన ద్రవ్యరాశికి గల సంబంధాన్ని తెలిపే గ్రాఫు ఆకారం
A) మూలబిందువు గుండా వెళ్ళే సరళరేఖ
B) X – అక్షానికి సమాంతరంగా ఉండే సరళరేఖ
C) Y- అక్షానికి సమాంతరంగా ఉండే సరళరేఖ
D) వక్రరేఖ
జవాబు:
A) మూలబిందువు గుండా వెళ్ళే సరళరేఖ
26. F ∝ \(\frac{1}{\mathbf{d}^{2}}\). F – d గ్రాఫు ఆకారము
A) సరళరేఖ
B) పరావలయం
C) వక్రరేఖ
D) A లేదా B
జవాబు:
B) పరావలయం
27. a) y, x కు విలోమానుపాతంలో ఉంది.
b) y, x² కు అనులోమానుపాతంలో ఉంది.
c) y, √x కు అనులోమానుపాతంలో ఉంది.
గ్రాఫులను జతపరచండి.
A) a – i, b – ii, c – iii
B) a – ii, b – iii, c – i
C) a – iii, b – i, c – ii
D) a – iii, b – ii, c – i
జవాబు:
A) a – i, b – ii, c – iii
28. బలం మరియు కాలం గ్రాఫు వైశాల్యము
A) పీడనం
B) స్థానభ్రంశం
C) ప్రచోదనం
D) ఏదీకాదు
జవాబు:
C) ప్రచోదనం
29. హుక్ సూత్రము యొక్క గ్రాఫు ఆకారం
A) మూలబిందువు గుండా వెళ్ళే సరళరేఖ
B) X – అక్షానికి సమాంతరంగా ఉండే సరళరేఖ
C) Y- అక్షానికి సమాంతరంగా ఉండే సరళరేఖ
D) వక్రరేఖ
జవాబు:
A) మూలబిందువు గుండా వెళ్ళే సరళరేఖ
30.
మంచు యొక్క విశిష్టోషాన్ని సూచించే భాగం
A) AB
B) BC
C) CD
D) DE
జవాబు:
B) BC
మీకు తెలుసా?
కొలత పద్దతులు వాటి ప్రమాణాలు ఏమిటో క్రింది పట్టికలో చూడండి.
మీటరు :
శూన్యంలో కాంతి 1/299, 792,458 సెకన్లలో ప్రయాణించిన దూరాన్ని మీటరు కొలతగా నిర్ధారించారు.
కొన్ని ప్రమాణాలను శాస్త్రవేత్తల పేర్లతో సూచిస్తాము. న్యూటన్, పాస్కల్, బౌల్, వాట్, కులూంబ్, వోల్టు, ఫారడే, ఓమ్, వైబర్, హెన్రీ మొదలగునవి.
విలోమానుపాత నియమం :
రెండు రాశులు విలోమానుపాతంలో ఉండాలి అంటే అవి క్రింది నిబంధనలను పాటించాలి.
- ఒక రాశి విలువ ‘0’ గా ఉండాలి. ఇప్పుడు రెండో రాశి విలువను నిర్వచించలేము. అంటే అనంతంగా చెప్పవచ్చు.
- ఏ జత విలువల లబ్దం లెక్కించినా విలువ స్థిరంగా ఉండాలి.
- ఒక రాశి పెరుగుతూ ఉంటే రెండవ రాశి తగ్గుతూ ఉండాలి.
అనులోమానుపాత నియమం :
రెండు రాశులు అనులోమానుపాతంలో ఉండాలి అంటే కింది నిబంధనలు పాటించాలి.
- ప్రారంభ విలువలు ‘0’గా ఉండాలి.
- ఏ జత విలువల నిష్పత్తిని లెక్కించినా స్థిరంగా ఉండాలి.
- ఒక రాశి విలువ పెరుగుతూ ఉంటే రెండవ రాశి విలువ కూడా పెరుగుతూ ఉండాలి.
పై నిబంధనలు పాటిస్తేనే ఆ రెండు రాశులు అనులోమ / విలోమ సంబంధాన్ని కలిగి ఉన్నాయి అని చెప్పగలం. అంతే తప్ప ఒక రాశి పెరుగుతూ ఉంటే రెండో రాశి కూడా పెరుగుతూ ఉన్నంత మాత్రాన అవి అనులోమ సంబంధం – కలిగి ఉన్నట్లు కాదు.