Students can go through AP Board 9th Class Social Notes 19th Lesson విస్తరిస్తున్న ప్రజాస్వామ్యం to understand and remember the concept easily.
AP Board 9th Class Social Notes 19th Lesson విస్తరిస్తున్న ప్రజాస్వామ్యం
ఉత్తర ఆఫ్రికాలో లిబియా ఒక పేద దేశం. 1951లో స్వాతంత్ర్యం పొందింది. స్వాతంత్ర్యం అనంతరం అధికారాన్ని రాజు ఇద్రిస్ వశమైంది. విస్తారమైన ముడిచమురు నిధులకు లిబియా ప్రసిద్ది. లిబియా ప్రజలు వ్యవసాయం, ఎడారులలో పశువుల పాలనపై ఆధారపడినారు. సైనిక నియంత్రణలో 1969లో మువమ్మర్ గఢాఫి నియంత్రృత్వపాలన పిదప 2012 లిబియా పటం నవంబర్ 14న కొత్త ప్రభుత్వం ప్రమాణస్వీకారం చేసింది.
ప్రపంచ వాణిజ్యకేంద్రంగా, టేకు, కలప, బియ్యం వంటి ఆహారధాన్యాలు, తగరం వంటి ఖనిజాలు, కెంపులు, నీలాలు వంటి విలువైన రాళ్ళకు బర్మా ప్రసిద్ధి. మనకు స్వాతంత్ర్యం వచ్చిన అయిదు నెలలకు బర్మాకు స్వాతంత్ర్యం వచ్చింది. బర్మన్ జాతి నాయకుడైన ఆంగ్ సాన్ (ఆంగ్ సాన్ సూకి తండ్రి) దేశానికి స్వాతంత్ర్యం సంపాదించాడు. తదుపరి సైన్యాధిపతి జనరల్ నేవిన్ దేశ అధికార ఆక్రమణ. ప్రజాస్వామ్య పునరుద్ధరణ. 1988 నుండి ఆంగ్ సాన్ సూకి ప్రజా ఉద్యమం. ఇంకా ప్రజాస్వామ్య ప్రభుత్వ సాధన కొరకు ఉద్యమాలు మయన్మార్ (బర్మా) కొనసాగుతూ ఉన్నాయి.
→ సంచార పశు పోషకులు : వివిధ ప్రాంతాలు తిరుగుతూ పశువుల్ని జీవనాధారంగా చేసుకొని జీవించేవాళ్ళు.
→ పట్టణీకరణ : గ్రామీణ ప్రాంత ప్రజలు వివిధ వృత్తుల రీత్యా పట్టణాలకు వచ్చి స్థిరపడడాన్ని పట్టణీకరణ అంటారు.
→ రాజకీయ అవినీతి : బంధుప్రీతి, కులరాజకీయాలు, వంశపారంపర్య రాజకీయాలు చేస్తూ, నీతి నియమాలు లేని పాలన.
→ గృహ నిర్బంధం : ఇంటినే జైలుగా చేసి బయట ప్రపంచాన్ని చూపించకపోవడం.
→ నియంతృత్వం : ప్రజల అభిష్టానికి వ్యతిరేకంగా పాలకుల స్వప్రయోజనాలే ధ్యేయంగా గల పాలన.
→ రాచరికం : వంశపారంపర్యం గల రాజుల ఆధ్వర్యంలో జరిగే పరిపాలన.
→ భూస్వామ్యం : అధిక భూములు కలిగి నిరంకుశత్వంతో సమాజానికి ప్రాతినిధ్యం వహించే దోపిడీ స్వభావం గలవారు.
→ కలహాలు : తగవులు.
→ చరమగీతం : అంతం చేయడం.
→ ఆంక్షలు : కట్టుబాట్లు.
→ ఊడిగం : బానిస పనులు, వెట్టిచాకిరి పనులు.