Andhra Pradesh AP Board 5th Class EVS Solutions 3rd Lesson మనం ధరించే దుస్తులు Textbook Exercise Questions and Answers.
AP State Syllabus 5th Class EVS Solutions Lesson 3 మనం ధరించే దుస్తులు
I. విషయావగాహన:
ప్రశ్న 1.
గాలి ఉపయోగాలను క్లుప్తంగా వివరించండి?
జవాబు:
గాలి ఉపయోగాలు:
- జీవరాశి జీవించుటకు గాలి అతిముఖ్యమైన ప్రాధమిక అవసరాలలో గాలి ప్రధానమైనది. గాలి లేక పోతే కొన్ని నిమిషాలు కూడా బ్రతకలేము.
- గాలి మరల ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేయవచ్చు.
- కొన్ని ప్రాంతాలలో గాలి మఠల ద్వారా బావులలో నీటిని తోడి పంట పొలాలకు మళ్ళిస్తారు.
- గాలి బత్తిడి ద్వారా పువ్వుల పరిమళాన్ని ఆస్వాదించగలుగుతాం, గొట్టాల తో పండ్లరసాలను త్రాగగలం, గాలి పటాలు ఎగురవేయగలం, సైకిల్ తొక్కగలం, పిల్లనగ్రోవిని వాయించగలం, ఓవర్ హెడ్ ట్యాంకు నుంచి నీటిని తీసుకోగలం.
ప్రశ్న 2.
మనం వివిధ కాలాలలో ధరించే రకరకాల దుస్తుల పేర్లు రాయండి?
జవాబు:
ప్రజలు వివిధ కాలలలో సౌకర్యం కోసం వాతవరణంపై ఆధారపడి వివిధ రకాల దుస్తులు ధరిస్తాము.
- వేసవి కాలంలో నూలు వస్త్రాలను ధరిస్తాము.
- చలికాలంలో ఉన్ని తో తయారైన వస్త్రాలు వాడతాము. అవిశరీరానికి వెచ్చదనాన్నిస్తాయి.
- వర్షాకాలంలో గొడుగులు, రెయిన్ కోట్లు వాడతాం. అవి జలనిరోధక గుడ్డతో తయారుచేస్తారు.
ప్రశ్న 3.
సహజ, కృత్రిమ దారాల మధ్య తేడాలు రాయండి?
జవాబు:
సహజ, కృత్రిమ దారాల మధ్య తేడాలు:
సహజ దారాలు (దుస్తులు):
- ఇవి సహజంగా పత్తి, జనుము, పట్టు పురుగుల నుంచి తయారు అవుతాయి.
- ఈ దారాల నిర్మాణాలను మార్చ లేము.
- ఇవి సౌకర్యవంతమైనవి.
- రసాయనాలు వాడరు.
- పర్యావరణ హితమైనవి.
- తక్కువ మన్నిక గలవి.
కృత్రిమ దారాలు (దుస్తులు):
- ఇవి కృత్రిమంగా తయారు చేస్తారు.
- ఈ దారాలను కావలసిన విధంగా మలచవచ్చు.
- ఇవి అంత సౌకర్యవంతమైనవి కావు.
- రసాయనాలు వాడి తయారు చేస్తారు.
- పర్యావరణ హితమైనవి కావు.
- మన్నిక ఎక్కువగలవి.
II. ప్రశ్నించడం – పరికల్పనలు చేయడం:
ప్రశ్న 4.
శీతాకాలంలో ప్రజలు స్వెట్టర్లు, రగ్గులు వాడటానికి కారణాలు. వ్రాయండి?
జవాబు:
శీతాకాలంలో ప్రజలు ఉన్నితో తయారు చేసిన స్వెట్టర్లు, రగ్గులను ‘ వాడతాము. ఎందుకంటే అవి ఉష్ణనిరోధకాలుగా పనిచేసి శరీరం లోని వెచ్చదనాన్ని బయటకు పోనీయవు. అవి మనల్ని వెచ్చగా ఉంచుతాయి.
III. ప్రయోగాలు – క్షేత్ర పరిశీలనలు:
ప్రశ్న 5.
డిటర్జెంట్ సబ్బుతో బట్టలు ఉతకండి. మీ అనుభవాలు వ్రాయండి?
జవాబు:
- నూలు వస్త్రాలను డిటర్జంట్ సబ్బుతో ఉతికనప్పుడు ఒకటి రెండు సార్లుకే అవి – తమరంగులను కోల్పోతాయి.
- సిల్క్ దుస్తులను డిటర్జెంట్ సబ్బులతో ఉతికిన తర్వాత నీడలోనే ఆరబెట్టాలి. లేదంటే అవి రంగును కోల్పోతాయి.
IV. సమాచార నైపుణ్యాలు – ప్రాజెక్టుల పని:
ప్రశ్న 6.
వివిధ రకాల గుడ్డ ముక్కలు సేకరించండి. వాటిని సహజ దారాల నుంచి తయారైనవి, ‘ కృత్రిమ దారాల నుంచి తయారైనవిగా వర్గీకరించండి. చార్టుమీద అతికించి – ప్రదర్శించండి?
జవాబు:
-విద్యార్థి కృత్యము.
V. బొమ్మలు గీయడం – నమునాలు తయారు చేయడం:
ప్రశ్న 7.
వివిధ రకాల మోడల్ దుస్తుల చిత్రాలు గీయండి, రంగులు వేయండి?
జవాబు:
విద్యార్థి కృత్యము.
ప్రశ్న 8.
దర్జీ దుకాణంలో మీకు నచ్చినవి ఏంటో చెప్పండి?
జవాబు:
దర్జీ దుకాణంలో వేర్వేరు డ్రైవ్లు, వేర్వేరుమోడల్స్ వేర్వేరు రంగులలో అందంగా కనిపిస్తాయి. అవి నాకు బాగా సచ్చుతాయి. ఇంకా మగ్గం వర్క్ తో చీరలు, పిల్లల డ్రెస్ల పై అందమైన డిజైన్లు, అందమైన రంగుల్లో ఆకర్షణీయంగా ఉంటాయి.
అదనపు ప్రశ్నలు:
I. ప్రశ్న 1.
సహజ దారాలు’ అనగానేమి? ఉదాహరణలివ్వంది ?
జవాబు:
జంతువులు లేదా మొక్కల నుంచి సహజంగా తయారయ్యే దారాలను • సహజదారాలు’ అంటారు.
ఉదా:- నూలు, జనపనార, పట్టు, ఉన్ని మొదలైనవి.
ప్రశ్న 2.
‘ కృత్రిమ దారాలు’ అనగానేమి? ఉదాహరణ లివ్వండి?
జవాబు:
ఫ్యాక్టరీలలో కృత్రిమంగా రసాయనాలను ప్రయోగించి తయారయ్యే దారాలను కృత్రిమ దారాలు అంటారు.
ఉదా:- పాలిస్టర్, టెరిలీన్, రేయాన్ మరియు నైలాన్ మొదలైనవి.
ప్రశ్న 3.
వయస్సును బట్టి ప్రాంతాన్ని బట్టి ప్రజలు వేర్వేరు రకాల దుస్తులు ధరిస్తారు? ఎందుకు?
జవాబు:
వయస్సును బట్టి, ప్రాంతాన్ని బట్టి ప్రజలు వేర్వేరు రకాలదుస్తులు ధరిస్తారు. ప్రజలువాడే దుస్తులు సౌకర్యం,వాతావరణం పై ఆధారపడి వేర్వేరుగా ఉంటాయి. చలి ప్రదేశాలలో నివశించే ప్రజలు ఉన్నితో తయారైన వెచ్చని వస్త్రాలు వాడతారు. వేడిమిగల ప్రదేశాలలో నూలు వస్త్రాలు వాడతారు.. చిన్న పిల్లలు మృదువైన వస్త్రాలను ధరిస్తారు.
ప్రశ్న 4.
దుస్తులు మనకు ఏ విధంగా రక్షణ నిస్తాయి?
జవాబు:
దుస్తులు మనల్ని ఎండ, వాన, చలి నుంచి రక్షిస్తాయి. అవి చెమటను పీల్చుకుని శరీరాన్ని చల్లగా ఉంచుతాయి. దుస్తులు క్రిములు, కీటకాలు, దుమ్ము, కాలుష్యం బారి నుంచి
మనల్ని కాపాడుతాయి. దుస్తులు మనల్ని అందంగా కనబడే లా చేస్తాయి.
ప్రశ్న 5.
దుస్తులను మనం ఎందుకు శుభ్రపరచాలి?
జవాబు:
మనం బట్టలను క్రమం తప్పకుండా ఉతుక్కుని శుభ్ర పరచాలి ఆటలు ఆడేటప్పుడు బట్టలు మురికిగా తయారౌతాయి, చెమటతో తడిసి పోతాయి. బట్టలను సరిగా ఉతక కుండా ధరిస్తే చర్మరోగాలతో భాధ పడే అవకాశం ఉంది. బట్టలను డిటర్జెంట్ సబ్బుతో బాగా ఉతికి ఎండలో ఆరబెట్టాలి.
ప్రశ్న 6.
గాలిధర్మాలు తెల్పండి?
జవాబు:
గాలిధర్మాలు :
- గాలికి బరువు ఉంది.
- గాలి స్థలాన్ని ఆక్రమిస్తుంది.
- గాలి పీడనాన్ని కల్గిస్తుంది.
- గాలి శబ్దాన్ని, వాసనను మోసుకెళ్తుంది.
ప్రశ్న 7.
క్రింది చిత్రాలను గమనించి ఏ వస్తువులలో గాలి స్థలాన్ని ఆక్రమిస్తుందని అనుకుంటున్నారో వాటికి (✓) పెట్టంది?
జవాబు:
విద్యార్ధి కృత్యము.
II. సమాచార నైపుణ్యాలు ప్రాజెక్టులు:
ప్రశ్న 8.
క్రింది ప్రయోగాల నుంచి మీరేంగమనించారు?
జవాబు:
గాలికి బరువు వున్నది.
గాలి శబ్దాన్ని ఉత్పత్తి చేస్తుంది.
గాలి స్థలాన్ని ఆక్రమిస్తుంది
గాలి పీడ నాన్ని కలుగ చేస్తుంది.
ప్రశ్న 9.
కొందరు వారి వృత్తులను బట్టి తగిన యూనిఫాం ధరిస్తారు. క్రింది చిత్రాలు చూడండి. యూనిఫాం ఆధారంగా ఆయావృత్తులను గుర్తించండి?
జవాబు:
విధ్యార్ధికృత్యము.
బహుళైచ్ఛిక ప్రశ్నలు:
సరియైన సమాధానాలను గుర్తించండి:
ప్రశ్న 1.
నూలు దారం …………………….. చెట్ల నుంచి వస్తుంది.
(A) ప్రత్తి
(B) ఫ్లాక్స్
(C) కొబ్బరి
(D) జనము
జవాబు:
(A) ప్రత్తి
ప్రశ్న 2.
క్రింది వానిలో సహజ దారాలు ……………………..
(A) ప్రత్తి
(B) ఉన్ని
(C) సిల్క్
(D) జనపనార
(E) పైవన్నీ
జవాబు:
E) పైవన్నీ
ప్రశ్న 3.
సిల్క్ దేని నుంచి తయారుగును.
(A) పట్టు పురుగు
(B) మల్బరీ ఆకు
(C) A మరియు B
(D) ఏదీ కాదు
జవాబు:
(A) పట్టు పురుగు
ప్రశ్న 4.
పట్టు పురుగుల ఆహారం ……………………..
(A) ప్రత్తి ఆకులు
(B) మల్బరీ ఆకులు
(C) A మరియు B
(D) ఏదీకాదు
జవాబు:
(B) మల్బరీ ఆకులు
ప్రశ్న 5.
రెయిన్ కోట్స్ , గొడుగులు ఏరకమైన దుస్తులు
(A) సహజ
(B) కృత్రిమ
(C) A మరియు B
(D) ఏదీకాదు
జవాబు:
(B) కృత్రిమ
ప్రశ్న 6.
స్వెటర్లు …………………….. తో తయారుచేస్తాయి.
(A) సిల్క్
(B) జనపనార
(C) గొట్టెలు
(D) ఏదీకాదు
జవాబు:
(C) గొట్టెలు
ప్రశ్న 7.
ఉన్ని ……………………… నుంచి వస్తుంది.
(A) పట్టు పురుగులు
(B) జనపనార
(C) గొఱ్ఱలు
(D) ఏదీకాదు
జవాబు:
(C) గొట్టెలు
ప్రశ్న 8.
చలికాలంలో …………………….. దుస్తులు ధరించాలి.
(A) ఉన్ని
(B) నూలు
(C) సిల్క్
(D) ఏదీకాదు
జవాబు:
(A) ఉన్ని
ప్రశ్న 9.
వేసవిలో …………………….. దుస్తులు ధరిస్తారు.
(A) ఉన్ని
(B) నూలు
(C) సిల్క్
(D) ఏదీకాదు
జవాబు:
(B) నూలు
ప్రశ్న 10.
…………………….. మొక్కల నుంచి లెనిన్ దుస్తులు తయారు చేస్తారు.
(A) జనపనార
(B) నూలు
(C) అవిసె మొక్కలు
(D) ఏదీకాదు.
జవాబు:
(C) అవిసె మొక్కలు
ప్రశ్న 11.
గోనెసంచులు, తాళ్ళు వీటితో తయారు చేస్తారు.
(A) నూలు
(B) జనపనార
(C) ఉన్ని
(D) ఏదీకాదు
జవాబు:
(B) జనపనార
ప్రశ్న 12.
మనం గాలిని …………………….. చేయరాదు.
(A) శ్వా స
(B) ఉపయోగించటం
(C) కలుషితం
(D) ఏదీకాదు
జవాబు:
(C) కలుషితం