AP Inter 1st Year Botany Study Material Chapter 11 కణచక్రం, కణ విభజన

Andhra Pradesh BIEAP AP Inter 1st Year Botany Study Material 11th Lesson జీవ అణువులు Textbook Questions and Answers.

AP Inter 1st Year Botany Study Material 11th Lesson జీవ అణువులు

అతిస్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
కేంద్రక పూర్వ, నిజకేంద్రక కణాలలో, ఏ కణం తక్కువ వ్యవధిలో కణ విభజన చెందును ?
జవాబు:
కేంద్రక పూర్వ కణము.

ప్రశ్న 2.
కేంద్రక పూర్వ, నిజకేంద్రక కణాలలో, ఏ కణ చక్రానికి తక్కువ వ్యవధి ఉండును?
జవాబు:
కేంద్రక పూర్వ కణము.

ప్రశ్న 3.
ఎక్కువ వ్యవధి ఉండునటు వంటి కణ చక్ర దశ ఏది?
జవాబు:
అంతర్దశ.

ప్రశ్న 4.
మొక్కలు, జంతువులలోని ఏ కణజాలం క్షయకరణ విభజన కనబర్చును?
జవాబు:
ధ్వయస్థితిక కణజాలము.

ప్రశ్న 5.
ఈ. కొలై (E. coli) సగటున 20 నిముషములలో కణ విభజన చెంది రెట్టింపైనచో, రెండు కణాల నుంచి 32 ఈ. కొలై కణాలు ఏర్పడుటకు ఎంత సమయం పడుతుంది?
జవాబు:
100 నిమిషాలు.

AP Inter 1st Year Botany Study Material Chapter 11 కణచక్రం, కణ విభజన

ప్రశ్న 6.
సమ విభజన దశలను విశదీకరించడానికి, మానవ దేహంలోని ఏ భాగాలను ఉపయోగించవచ్చును?
జవాబు:
గొంతు పొరలలోని పైపూతకణాలు, బాహ్యచర్మంపై పొర కణాలు.

ప్రశ్న 7.
క్రోమోసోమ్ వలె వర్గీకరించుటకు క్రొమాటిడ్కు ఏ లక్షణాలు ఉండవలెను?
జవాబు:
క్రొమాటిడ్లపై పునఃసంయోజన బుడిపెలు ఏర్పడుట; ఈ బుడిపెలు వద్ద సమ జాతీయ క్రోమోసోమ్ల సొదరేతర క్రొమాటిడ్ మధ్య వినిమయం జరుగుతుంది.

ప్రశ్న 8.
క్షయకరణ విభజనలోని ప్రథమ దశ |లో బైవలెంట్ ని నాలుగు క్రొమాటిడ్లలో ఏవి జన్యుమార్పిడి / పారగతిలో పాల్గొనును.
జవాబు:
సమజాతీయ క్రోమోసోమ్లోని 2 సోదరేతర క్రొమాటిడ్లు మద్య పారగతి జరుగును.

ప్రశ్న 9.
ఒక కణజాలంలో 1024 కణాలు ఉన్నచో ప్రథమ జనక కణం ఎన్నిమార్లు సమవిభజన చెంది ఉంటుంది?
జవాబు:
10 సమ విభజనలు.

ప్రశ్న 10.
ఒక పరాగ కోశంలో 1200 పరాగ రేణువులు ఉన్నచో, వాటిని ఎన్ని సూక్ష్మసిద్ధ బీజ మాతృకలు ఉత్పత్తి చేసి ఉండవచ్చును?
జవాబు:
300

ప్రశ్న 11.
కణ చక్రంలోని ఏ దశలో DNA సంశ్లేషణ జరుగుతుంది?
జవాబు:
‘S’ దశ (సంశ్లేషణ- దశ)

ప్రశ్న 12.
మానవుని కణాలు (నిజ కేంద్రక కణాలు) కణ విభజనకు 24 గంటల సమయం వినియోగించినచో, చక్రంలోని ఏ దశ ఎక్కువ సమయం తీసుకొంటుంది?
జవాబు:
అంతర్దశ

ప్రశ్న 13.
ఖాళీలను పూరించండి : హృదయ కణాలు కణవిభజన చెందవు. కణ చక్రములో ఈ కణాలు విభజన చెందకుండా ………….. దశ నుంచి నిష్క్రమించి, ………….. అనే నిష్క్రియ దశలోకి ప్రవేశిస్తాయి.
జవాబు:
G1 దశ, శాంత దశ

ప్రశ్న 14.
క్షయకరణ విభజనలోని ఏ దశలో క్రోమోసోమ్ సంఖ్య వాస్తవంగా తగ్గుతుంది ?
జవాబు:
చలన దశ ॥

ప్రశ్న 15.
మైటోకాండ్రియా, ప్లాస్టిడ్లలో వాటి సొంత DNA (జన్యు పదార్థం) ఉంటుంది. సమవిభజనలోని కేంద్రక విభజనలో వాటి గతిని తెలపండి.
జవాబు:
మైటోకాండ్రియా, ప్లాస్టిడ్లు పిల్లకణాలలోనికి వితరణ చెంతుతాయి

AP Inter 1st Year Botany Study Material Chapter 11 కణచక్రం, కణ విభజన

ప్రశ్న 16.
కణ చక్రంలో ఈ క్రింద పేర్కొనిన దశలు సంభవించును. ఖాళీలను పూరించండి.
(a) కేంద్రకత్వచం కరిగిపోవు దశ ………………………..
(b) కేంద్రకాంశం కనబడే దశ ………………………..
(c) సెంట్రోమియర్ విభజన చెందే దశ ………………………..
(d) DNA ప్రతికృతి చెందే దశ ………………………..
జవాబు:
(a) ప్రథమ దశ,
(b) అంత్య దశ
(c) చలన దశ,
(d) S దశ

స్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
క్షయకరణ విభజనలోని ఏ దశలో ఈ క్రింద పేర్కొన్నవి ఏర్పడతాయి. క్రింద ఇచ్చిన సూచనల నుంచి ఎన్నుకొనండి.
(a) సినాప్టోనీమల్ సంక్లిష్టం ………………………..
(b) పునఃసంయోజన బొడిపెలు ………………………..
(C) ……………………….. లో రికాంబినేన్ ఎంజైమ్లు కనబడతాయి / క్రియశీలత వహించును.
(d) కయాస్మేటా అంతిమ స్థితికరణ ………………………..
(e) విభజన మధ్యస్థ దశ ………………………..
(f) కణ జతలు ఏర్పడుట ………………………..
సూచనలు : 1. జైగోటీన్, 2. పాకీటీన్, 3. పాకీటీన్, 4. డయాకైనిసిన్, 5. అంత్యదశ | తరువాత / క్షయకరణ విభజన ॥ కుముందు, 6. అంత్యదశ తరువాత / క్షయకరణ విభజన తరువాత.
జవాబు:
(a) సినాప్టోనీమల్ సంక్లిష్టము : జైగోటీన్
(b) పునఃసంయోజన బొడిపెలు : పాకీటీన్
(c) పాకీటీస్ లో రీకాంబినేన్ ఎంజైమ్లు కనబడతాయి / క్రియశీలత వహించును.
(d) కయాస్మేటా అంతిమ స్థితికరణ : డయాకైనెసిస్
(e) విభజన మధ్యస్థ దశ : రెండు క్షయకరణ విభజనల మద్య దశ – (అంత్యదశ తరువాత / క్షయకరణ విభజన II కు ముందు
(f) కణ జతలు ఏర్పడుట : అంత్యదశ | తరువాత / క్షయకరణ విభజన | తరువాత.

ప్రశ్న 2.
సమవిభజనలో రెండు ఒకే పోలికలున్న కణాలు ఏర్పడతాయి. సమవిభజనలో ఈ క్రింద పేర్కొన్న నియమ విరుద్ధమైనవి (irregularity) జరిగినచో పర్యవసానం ఏ విధంగా ఉంటుంది.
(a) కేంద్రకత్వచం కరిగిపోకుండ ఉండటం
(c) సెంట్రోమియర్లు విభజన చెందకుండటం.
(b) DNA ద్విగుణీకృతం చెందకుండటం
(d) కణ ద్రవ్య విభజన జరగకుండటం
జవాబు:
(a) కేంద్రకత్వచం కరిగిపోకుండ ఉండట వలన స్వేచ్ఛా కేంద్రక విభజనలు జరుగుతాయి.
(b) DNA ద్విగుణీకృతం చెందకుండటం రెండు పిల్ల కణాలలో ఒకదానిలో జన్యు పదార్థం ఉండదు.
(c) సెంట్రోమియర్లు విభజన చెందకుండటం – పిల్ల కణాలలోకి క్రోమోసోమ్లు వితరణ చెందవు.
(d) కణ ద్రవ్య విభజన జరగకుండటం – బహుకేంద్రక స్థితి కనిపిస్తుంది.

ప్రశ్న 3.
క్షయకరణ ప్రథమ దశ | ను వివరించండి.
జవాబు:
ప్రథమ దశ | ఎక్కువ కాలం పాటు జరిగే దశ. దీనిని ఐదు ఉపదశలుగా విభజిస్తారు. అవి : లెప్టోటీన్, జైగోటీన్, పాకీటీన్, డిప్లోటీన్, డయాకైనెసిస్.
AP Inter 1st Year Botany Study Material Chapter 11 కణచక్రం, కణ విభజన 1

a) లెప్టోటీన్ :
ఈ ఉపదశలో కేంద్రకం పరిమాణంలో పెద్దదవుతుంది. క్రోమోసోములు సన్నగా, పొడవుగా ఉంటాయి.

b) జైగోటీన్ లేదా వైగోనియా :
ఈ ఉపదశలో సమజాతీయ క్రోమోసోమ్ల మధ్య ఆకర్షణ ఏర్పడి అవి దగ్గరగా చేరి జతులుగా కనిపిస్తాయి. వీటిని బైవలెంట్లు (Bivalents) అంటారు. ఈ ప్రక్రియను సూత్రయుగ్మనం లేక అనుదైర్ఘ్య సంధానము అంటారు. ఇది మూడు విధాలుగా జరుగుతుంది.

i) ప్రోటెర్మినల్ సంధానం :
సూత్రయుగ్మనం క్రోమోసోమ్ల ధృవాలకొనల వద్ద ప్రారంభమై రెండో కొనవరకు కొనసాగుతుంది.

ii) ప్రొసెంట్రిక్ సంధానం :
సూత్రయుగ్మనం సెంట్రోమియర్ వద్ద ప్రారంభమై రెండు వైపులకు కొనసాగుతుంది.

iii) రాండమ్ (Random) లేదా ఇంటర్మీడియట్ సంధానం :
క్రోమోసోమ్లు అనేక చోట్ల సూత్రయుగ్మనం చెందుతాయి. జైగోటిన్ దశలో కేంద్రకాంశం పెరుగుతుంది. కండెపోగులు ఏర్పడటం మొదలవుతుంది.

c) పాకీటీన్ లేదా పాకీనీమా లేదా జన్యు పునఃసంయోజన దశ :
ఈ దశలో ప్రతి క్రోమోసోమ్ రెండు క్రొమాటిడ్లగా చీలుతుంది. ఫలితంగా ప్రతి బైవలెంట్లో 4 క్రోమాటిడ్లు కనిపిస్తాయి. వీటిని ‘పాకీటీన్ చతుష్కాలు’ (Pachytene tetrads) అంటారు. బైవలెంట్ ని ఒకే క్రోమోసోమ్కు చెందిన క్రొమాటిడ్లను ‘సోదర క్రొమాటిడ్లు’ (Sister chromatids) అని, వేరువేరు క్రోమోసోమ్లకు చెందిన క్రొమాటిడ్లను ‘సోదరేతర క్రొమాటిడ్లు’ (Non-sister chromatids) అని అంటారు. సోదరేతర క్రొమాటిడ్ల మధ్య ఒకటి, రెండు లేదా ఎక్కువ ప్రదేశాల్లో అతుక్కుంటాయి. క్రొమాటిడ్లు ఒక దానితో మరొకటి భౌతికంగా అతుక్కొనే ప్రదేశాలను ‘కయాస్మేట’ (Chiasmata) అంటారు. ఈ దశలో క్రోమోసోమ్లు ‘X’ ఆకారంలో కనిపిస్తాయి. ఈ స్థానాల్లో ఎండోన్యూక్లియేజ్ చర్యల వల్ల క్రొమాటిడ్లు ముక్కలుగా విరుగుతాయి. తెగిన ఈ సోదరేతర క్రొమాటిడ్ ముక్కలు పరస్పరం స్థానమార్పిడి చెంది తిరిగి “లైగేజ్” చర్య వల్ల అతుక్కుంటాయి. ఈ విధంగా స్త్రీ, పురుష క్రోమోసోమ్ల మధ్య జన్యు పదార్థం మార్పిడి చెంది జన్యుపునఃసంయోజనాలేర్పడతాయి. ఈ దృగ్విషయాన్ని ‘పారగతి’ (Crossing over) అంటారు. దీనివల్ల కొత్త జాతులు ఆవిర్భవించి జీవపరిణామం సంభవిస్తుంది.

d) డిప్లోటీన్ :
సినాప్టోనీమల్ సంక్లిష్టం కరిగిపోవుట బైవలెంట్లలోని సమజాతీయ క్రోమోసోమ్లు జన్యుమార్పిడి జరిగిన ప్రదేశాల వద్ద తప్ప మిగిలిన భాగం అంతా వికర్షణకులోనై విడిపోవుట జరుగుతుంది. ఈ విధంగా విడిపోగా మిగిలిన ‘X’ ఆకారపు గుర్తులను కయాస్మేటా అంటారు.

e) డయాకైనెసిస్ :
కయాస్మాలు అంతిమ స్థితీకరణ చెందుతాయి. క్రోమోసోమ్లు పూర్తిగా కుదించబడి, అవి భవిష్యత్లో విడిపోవుటకు అవసరమై కండె పరికరం ఏర్పాటు ప్రారంభమవుతుంది. కేంద్రకాంశం అదృశ్యమవుతుంది. కేంద్రక త్వచం పలుచబడి కరిగిపోతుంది.
AP Inter 1st Year Botany Study Material Chapter 11 కణచక్రం, కణ విభజన 2

ప్రశ్న 4.
క్షయకరణ విభజనలోని ముఖ్యాంశాలను తెల్పండి.
జవాబు:
క్షయకరణ విభజనలో ముఖ్యాంశాలు :

  1. క్షయకరణ విభజనలో క్షయకరణ విభజన – I, క్షయకరణ విభజన ॥ ఒకదాని తరువాత మరొకటి జరుగును. కాని DNA ప్రతికృతి ఒకసారి మాత్రమే జరుగుతుంది.
  2. S – దశలో జనక క్రోమోసోమ్లు ప్రతికృతి జరుపుకొని రెండు సమానమైన క్రోమాటిడ్లు రూపొందడంతో క్షయకరణ విభజన | మొదలవుతుంది.
  3. క్షయకరణ విభజనలో సమజాతీయ క్రోమోసోమ్లు జంటగా ఏర్పడి వాటి మధ్య పునఃసంయోజనం జరుగుతుంది.
  4. క్షయకరణ విభజన – II తరువాత నాలుగు ఏకస్థితిక పిల్లకణాలు ఏర్పడతాయి.

AP Inter 1st Year Botany Study Material Chapter 11 కణచక్రం, కణ విభజన

ప్రశ్న 5.
బహుకరణ జీవులలోని కణాలలో క్రోమోసోమ్ల సంఖ్య స్థిరంగా ఉండవలెనన్న ఏరకమైన విభజన అవసరం? ఎందుకు? [Mar. ’14]
జవాబు:
సమ విభజన. దీనిలో జన్యుపరంగా తల్లి కణాన్ని పోలిన పిల్ల కణాలు ఏర్పడతాయి. వీటి జన్యురూపం ఒకే రకంగా ఉంటుంది. సమవిభజన ద్వారా బహుకణజీద్రలు పెరుగుతాయి. కణ పెరుగుదల వల్ల కేంద్రక కణద్రవ్య పరిమాణ నిష్పత్తి మారుతుంది. ఈ నిష్పత్తి పూర్వస్థితికి రావడానికి సమవిభజన అవసరము. చెడిపోయిన కణాల స్థానలో కొత్త కణాలు ఏర్పడుటలో సమవిభజన ముఖ్య పాత్ర వహిస్తుంది. కాండ అగ్రభాగం, పార్శ్వ విభాజ్యకణావళులలో జరిగే సమవిభజన వల్ల మొక్క జీవితాంతం పెరుగుతుంది.

ప్రశ్న 6.
విరామంలో లేకపోయినప్పటికీ అంతర్దశను విరామదశ అంటారు. వ్యాఖ్యానించండి?
జవాబు:
AP Inter 1st Year Botany Study Material Chapter 11 కణచక్రం, కణ విభజన 3
ప్రతి రెండు విభజనలకు మధ్య ఉండే దశ లేక కణచక్రములో కేంద్రక విభజన జరగని దశలనే అంతర్దశ అందురు. దీనినే విరామదశ అని కూడా అందురు. కేంద్రములో అనేక మార్పులు జరుగుతాయి. ఈ దశలో కణవిభజన అభివృద్ధికి అవసరమయ్యే వివిధ పదార్థాల ఉత్పత్తి, DNA ప్రతికృతి ఒక వరుస క్రమంలో క్రమపద్ధతిలో జరుపుకుంటూ ఉంటుంది. అంతర్దశను మూడు దశలుగా లేదా ఉపదశలుగా వర్గీకరించారు. అవి (1) G1 దశ (గాప్-1) (2) S దశ (ఉత్పత్తిదశ) (3) G2 దశ (గాప్ – 2).

1. G1 దశ :
ఇది సమవిభజనకు, DNA ప్రతికృతి మధ్య గల దశ. G, దశ జీవక్రియా పరంగా అధిక క్రియాశీలత దశగా ఉండి, కణం అభివృద్ధిని కొనసాగిస్తూ ఉంటుంది. కాని DNA ప్రతికృతి జరగదు. (1) కణం వైశాల్యం పెరుగుతుంది.
(2) RNA ప్రోటీన్ల సంశ్లేషణ జరుపుకొంటుంది.

2. S దశ :
ఈ దశలో DNA ప్రతికృతి చెందుతుంది. 2C గల DNA 4C గా రెట్టింపు అవుతుంది. కాని క్రోమోజోమ్లు సంఖ్య రెట్టింపు కాదు. ఉదాహరణకు కణచక్రంలోని G, దశలో ద్వయస్థితిక (2n) క్రోమోసోమ్లు ఉన్నట్లయితే S దశ అనంతరం కూడా ఈ ద్వయస్థితిక క్రోమోసోమ్లను కలిగి ఉంటుంది.

3. G2 దశ :
ఈ దశలో కూడా ఆర్.ఎన్.ఎ. ప్రొటీన్ల సంశ్లేషణ కొనసాగుతూ ఉంటుంది. వీటితోపాటు నూతనంగా కణాంగాలు ఏర్పడతాయి. క్రోమోజోముల చలనానికి ఉపయోగపడే కండి పరికరం ఉత్పత్తికి అవసరమయ్యే ATP అనే శక్తి అణువులు సంశ్లేషణ కూడా ఈ దశలోనే జరుగుతుంది. ఈ మార్పులన్నీ అంతర్దశలో జరుగుతాయి. కావున అంతర్దశ నిజంగా విరామ దశ కాదు.

దీర్ఘ సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
అంత్య దశ ప్రథమ దశకు ఉత్కృమం? ఈ వ్యాఖ్యానం గురించి చర్చించండి?
జవాబు:

  1. అంత్య దశలో క్రోమోసోమ్ల సమూహము నిజరూపమును కోల్పోయి దృవాల వద్దకు చేరుతాయి.
  2. క్రోమోసోమ్ల సమూహం చుట్టూ కేంద్రకత్వచం ఏర్పడుతుంది.
  3. కేంద్రకాంశం, గాల్జి సంక్లిష్టం, అంతర్జీవ ద్రవ్యజాలము పునర్నిర్మితమవుతాయి. కాని ప్రథమ దశలో
    1) క్రోమోసోమల్ పదార్థాలు సంగ్రహణం చెంది పొట్టిగా దళసరిగా ఉన్న క్రోమోసోమ్లుగా ఏర్పడతాయి.
    2) క్రోమోసోమ్ల చుట్టూ కేంద్రక త్వచం ఉండదు.
    3) కేంద్రకాంశం, గాల్జి సంక్లిష్టము, అంతర్జీవ ద్రవ్యజాలము అదృశ్యమవుతాయి.
    కావున అంత్య దశ, ప్రథమ దశకు ఉత్కృమం.

ప్రశ్న 2.
క్షయకరణ ప్రథమ దశలోని ఉపదశలను తెలపండి? ప్రతి దశలోను క్రోమోసోమ్లు చెందే మార్పులను వివరించండి?
జవాబు:
ప్రథమ దశ | ఎక్కువ కాలం పాటు జరిగే దశ. దీనిని ఐదు ఉపదశలుగా విభజిస్తారు. అవి : లెప్టోటీన్, జైగోటీన్, పాకీటీన్, డిఫ్లోటీన్, డయాకైనెసిస్.
AP Inter 1st Year Botany Study Material Chapter 11 కణచక్రం, కణ విభజన 1
a) లెప్టోటీన్ :
ఈ ఉపదశలో కేంద్రకం పరిమాణంలో పెద్దదవుతుంది. క్రోమోసోములు సన్నగా, పొడవుగా ఉంటాయి.

b) జైగోటీన్ లేదా వైగోనియా :
ఈ ఉపదశలో సమజాతీయ క్రోమోసోమ్ల మధ్య ఆకర్షణ ఏర్పడి అవి దగ్గరగా చేరి జతులుగా కనిపిస్తాయి. వీటిని బైవలెంట్లు (Bivalents) అంటారు. ఈ ప్రక్రియను సూత్రయుగ్మనం లేక అనుదైర్ఘ్య సంధానము అంటారు. ఇది మూడు విధాలుగా జరుగుతుంది.
i) ప్రోటెర్మినల్ సంధానం :
సూత్రయుగ్మనం క్రోమోసోమ్ల ధృవాలకొనల వద్ద ప్రారంభమై రెండో కొనవరకు కొనసాగుతుంది.

ii) ప్రొసెంట్రిక్ సంధానం :
సూత్రయుగ్మనం సెంట్రోమియర్ వద్ద ప్రారంభమై రెండు వైపులకు కొనసాగుతుంది.

iii) రాండమ్ (Random) లేదా ఇంటర్మీడియట్ సంధానం :
క్రోమోసోమ్లు అనేక చోట్ల సూత్రయుగ్మనం చెందుతాయి. జైగోటిన్ దశలో కేంద్రకాంశం పెరుగుతుంది. కండెపోగులు ఏర్పడటం మొదలవుతుంది.

c) పాకీటీన్ లేదా పాకీనీమా లేదా జన్యు పునఃసంయోజన దశ :
ఈ దశలో ప్రతి క్రోమోసోమ్ రెండు క్రొమాటిడ్లగా చీలుతుంది. ఫలితంగా ప్రతి బైవలెంట్లో 4 క్రోమాటిడ్లు కనిపిస్తాయి. వీటిని ‘పాకీటీన్ చతుష్కాలు’ (Pachytene tetrads) అంటారు. బైవలెంట్లోని ఒకే క్రోమోసోమ్కు చెందిన క్రొమాటిడ్లను ‘సోదర క్రొమాటిడ్లు’ (Sister chromatids) అని, వేరువేరు క్రోమోసోమ్లకు చెందిన క్రొమాటిడ్లను ‘సోదరేతర క్రొమాటిడ్లు’ (Non-sister chromatids) అని అంటారు. సోదరేతర క్రొమాటిడ్ల మధ్య ఒకటి, రెండు లేదా ఎక్కువ ప్రదేశాల్లో అతుక్కుంటాయి. క్రొమాటిడ్లు ఒక దానితో మరొకటి భౌతికంగా అతుక్కొనే ప్రదేశాలను ‘కయాస్మేట’ (Chiasmata) అంటారు. ఈ దశలో క్రోమోసోమ్లు ‘X’ ఆకారంలో కనిపిస్తాయి. ఈ స్థానాల్లో ఎండోన్యూక్లియేజ్ చర్యల వల్ల క్రొమాటిడ్లు ముక్కలుగా విరుగుతాయి. తెగిన ఈ సోదరేతర క్రొమాటిడ్ ముక్కలు పరస్పరం స్థానమార్పిడి చెంది తిరిగి “లైగేజ్” చర్య వల్ల అతుక్కుంటాయి. ఈ విధంగా స్త్రీ, పురుష క్రోమోసోమ్ల మధ్య జన్యు పదార్థం మార్పిడి చెంది జన్యుపునఃసంయోజనాలేర్పడతాయి. ఈ దృగ్విషయాన్ని ‘పారగతి’ (Crossing over) అంటారు. దీనివల్ల కొత్త జాతులు ఆవిర్భవించి జీవపరిణామం సంభవిస్తుంది.

d) డిప్లోటీన్ :
సినాప్టోనీమల్ సంక్లిష్టం కరిగిపోవుట బైవలెంట్ లోని సమజాతీయ క్రోమోసోమ్లు జన్యుమార్పిడి జరిగిన ప్రదేశాల వద్ద తప్ప మిగిలిన భాగం అంతా వికర్షణకులోనై విడిపోవుట జరుగుతుంది. ఈ విధంగా విడిపోగా మిగిలిన ‘X’ ఆకారపు గుర్తులను కయాస్మేటా అంటారు.

e) డయాకైనెసిస్ :
కయాస్మాలు అంతిమ స్థితీకరణ చెందుతాయి. క్రోమోసోమ్లు పూర్తిగా కుదించబడి, అవి భవిష్యత్లో విడిపోవుటకు అవసరమై కండె పరికరం ఏర్పాటు ప్రారంభమవుతుంది. కేంద్రకాంశం అదృశ్యమవుతుంది. కేంద్రక త్వచం పలుచబడి కరిగిపోతుంది.
AP Inter 1st Year Botany Study Material Chapter 11 కణచక్రం, కణ విభజన 2

ప్రశ్న 3.
సమవిభజన, క్షయకరణ విభజనలలో వివిధ దశలలోని తేడాలను వివరించండి?
జవాబు:

సమవిభజన క్షయకరణ విభజన
1. ఏకస్థితిక, ద్వయస్థితిక జీవుల్లో జరుగుతుంది. 1. ద్వయస్థితిక జీవుల్లో మాత్రమే జరుగుతుంది.
2. శాఖీయ కణాల్లో జరుగుతుంది. 2. ప్రత్యుత్పత్తి కణాల్లో జరుగుతుంది.
3. కేంద్రక విభజన ఒకేసారి జరుగుతుంది. 3. కేంద్రక విభజన వెంట వెంటనే రెండుసార్లు జరుగుతుంది.
4. పిల్లకణాలు కూడా అన్ని విధాలా మాతృకణాన్ని పోలి ఉంటాయి. 4. పిల్లకణాలు మాతృకణంతో పోలి ఉండవు.
5. విభజనంతరం మాతృకణాల పోలికలను పోలి రెండు పిల్ల కణాలు ఉత్పత్తి అవుతాయి. 5. విభజనానంతరం నాలుగు పిల్లకణాలేర్పడతాయి.
6. ప్రథమదశ సరళంగా ఉంటుంది. 6. ప్రథమ దశలో అనేక సంక్లిష్టమైన మార్పులు జరుగుతాయి. దీనికి ఉపదశలు కలవు. 5 ఉదశలు ఉంటాయి.
7. క్రోమోసోమ్ల జతలు ఏర్పడవు. 7. సమజాతీయ క్రోమోసోమ్లు జతలుగా ఏర్పడి బైవాలెంట్లను రూపొందించును.
8. కయాస్మాట ఏర్పడవు. పారగతి జరుగదు. 8. కయాస్మాట ఏర్పడి, సోదరేతర క్రొమాటిడ్ల మధ్య పారగతి జరుగుతుంది.
9. చలనదశలో సెంట్రోమియర్ విభజన చెందుతుంది. 9. చలనదశ | లో సెంట్రోమియర్ విభజన చెందదు. చలనదశ II లో సెంట్రోమియర్ విభజన చెందుతుంది.
10. చలనదశలో పిల్లక్రోమోసోమ్లు ధృవాల వైపు కదులుతాయి. 10. చలనదశ | లో బైవాలెంట్ క్రోమోసోములు ధృవాల వైపుకు వియోజనం చెందుతాయి.
11. సమవిభజనలవల్ల ఏర్పడిన పిల్ల కేంద్రకాలలో క్రోమోసోమ్ సంఖ్యలో మార్పు ఉండదు. 11. క్షయకరణ విభజన వల్ల ఏర్పడిన పిల్ల కేంద్రకాలలో క్రోమోసోమ్ సంఖ్య సగానికి తగ్గుతుంది.
12. తక్కువ సమయంలో పూర్తవుతుంది. 12. ఎక్కువ సమయం తీసుకొంటుంది.

AP Inter 1st Year Botany Study Material Chapter 11 కణచక్రం, కణ విభజన

ప్రశ్న 4.
ఈ క్రింది వాటి గురించి క్లుప్తంగా తెలపండి.
(a) సినాప్టోనీమల్ సంక్లిష్టం
(b) మధ్యస్థ దశ ఫలకం
జవాబు:
(a) సినాప్టోనీమల్ సంక్లిష్టం :
సమ జాతీయ క్రోమోసోములు జతలుగా ఏర్పడతాయి. వీటిని బైవాలెంట్లు అంటారు. ఈ ప్రక్రియను అనుదైర్ఘ్య సందానము లేక సూత్రయుగ్మనము అంటారు. ఈ ప్రక్రియ క్రోమోసోమ్ల రెండు కొనలలో ఏర్పడి సెంట్రోమియర్ వైపుకు జరగవచ్చు. దీనిని ప్రోటెర్మినల్ సందానము అని, సెంట్రోమియర్ వద్ద ఏర్పడి, కొనల వైపుకు జరుగుటకు ప్రొసెంట్రిక్ సంధానము అని, లేదా వివిధ ప్రదేశాలలో కలుసుకుని ఉంటే రాండమ్ సంధానము’ అని అంటారు. ఈ సమజాతీయ క్రోమోసోమ్లు మందమైన ప్రోటీన్ కల ఫ్రేమ్చే అతకబడి ఉండుటవల్ల దీనిని సినాప్టోనీయల్ సంక్లిష్టము (SC) అని అంటారు. దీనివల్ల పారగతి జరిగి, జన్యుమార్పిడి, వైవిద్యాలు, జీవ పరిణామం సంభవిస్తుంది.

(b) మధ్యస్థ దశ ఫలకం :
మద్య దశ క్రోమోసోమ్లో రెండు సోదర క్రొమాటిడ్లు సెంట్రోమియర్కు అతుక్కుని ఉంటాయి. సెంట్రోమియర్ ఉపరితల భాగంలో కల సూక్ష్మ చక్రంలాంటి నిర్మాణాలను కైనిటోకోర్లు అంటారు. కండెపోగులు కైనిటోకోర్తో లగ్నీకృతం చెంది క్రోమోసోమ్లను కణ మధ్య భాగానికి చేరుస్తాయి. క్రోమోసోమ్లు కణ మధ్యలో అమరి ఉండి, ప్రతి క్రోమోసోమ్లోని ఒక క్రొమాటిడ్ ఒక ధృవం నుండి ఏర్పడిన కండె పొగుల ద్వారా కైనిటోకోర్తో అతుక్కుని తోటి క్రొమాటిడ్ రెండవ ధృవంలోని కండె పొగుల ద్వారా కైనిటోకోర్కు అతుక్కుంటుంది. ఈ దశలో క్రోమోసోమ్ల అమరిక తలమును మధ్యస్థ ఫలకం అంటారు.

ప్రశ్న 5.
బహుకణయుత జీవులలో సమవిభజన, క్షయకరణ విభజనల ప్రాముఖ్యతను తెలపండి.
జవాబు:
(a) సమవిభజన ప్రాముఖ్యత :

  1. జీవులలో పెరుగుదలకు సమవిభజన కారణము.
  2. సమవిభజనలో జన్యుపరంగా తల్లి కణాన్ని పోలిన పిల్లకణాలు ఏర్పడతాయి. వీటి జన్యురూపం ఒకే రకంగా ఉంటుంది.
  3. ఏకకణ జీవులలో సమవిభజన ప్రత్యుత్పత్తికి తోడ్పడుతుంది.
  4. చెడిపోయిన కణాల స్థానంలో కొత్తకణాలు ఏర్పడుటకు సమవిభజన అవసరం.
  5. తెగిన గాయాలు మాన్పుటకు, శాఖీయ ప్రత్యుత్పత్తికి సమవిభజన అవసరము.

(b) క్షయకరణ విభజన ప్రాముఖ్యత :

  1. జాతి నిర్థిష్ట క్రోమోసోమ్ల సంఖ్య తరతరాలకు మారకుండా ఉంటుంది.
  2. పారగతి జరుగుటవల్ల జన్యు వైవిద్యాలు ఏర్పడి, జీవ పరిణామం సంభవిస్తుంది.
  3. దీనివల్ల సంయోగబీజాలు ఏర్పడి, లైంగిక ప్రత్యుత్పత్తి జరుగుతుంది.

Intext Question and Answers

ప్రశ్న 1.
క్రోమోసోమ్లను రంగు వేయడానికి ఉపయోగించే అభిరంజకం పేరేమిటి ?
జవాబు:
జింసా (Giensa) అభిరంజకము.

ప్రశ్న 2.
నియంత్రణ లేకుండా కణవిభజన జరిగితే సంభవించే వ్యాధి లక్షణాన్ని తెలపండి?
జవాబు:
కాన్సర్

ప్రశ్న 3.
ఒక జీవిలో రెండు జతల క్రోమోసోమ్లు (క్రోమోసోమ్ల సంఖ్య – 4) ఉన్నాయి. క్షయకరణ విభజన II లోని వివిధ దశలలో క్రోమోసోమ్ల అమరికను పటాల సహాయంతో తెలపండి?
జవాబు:
AP Inter 1st Year Botany Study Material Chapter 11 కణచక్రం, కణ విభజన 4

ప్రశ్న 4.
క్షయకరణ విభజనలో జన్యు పునఃసంయోజనం, మెండీలియన్ పునఃసంయోజనం సంభవిస్తుంది. చర్చించండి.
జవాబు:
క్షయకరణ విభజనలో అనువంశిక లక్షణాలు ఒక తరం నుండి మరొక తరానికి సంక్రమించుటలో క్రోమోసోమ్లు ముఖ్యపాత్ర వహిస్తాయి. ప్రథమ దశ I లో సమజాతీయ క్రోమోసోమ్లపై ఉన్న జన్యువుల మద్య పారగతి జరిగి జన్యుపునఃసంయోజనాలు ఏర్పడతాయి. తర్వాతి ఈ జన్యువులు పిల్ల కణాలలోనికి వితరణ చెందుతాయి. ఇది పారగతి వల్లనే కాకుండా, క్రోమోసోమ్ల రాండమ్ వితరణ వల్ల సంభవిస్తుంది. దీనివల్ల పారగతి జరగినప్పటికి జన్యుపునః సంయోజనాలు కనిపిస్తాయి.

AP Inter 1st Year Botany Study Material Chapter 11 కణచక్రం, కణ విభజన

ప్రశ్న 5.
ఏక కణయుత, బహుకణయుత జీవులు సమవిభజన జరుపుకొంటాయి. ఈ రెండు విధానాలలో ఏవైనా తేడాలుంటే వివరించండి?
జవాబు:
ఏకకణ జీవులలో సమవిభజన ద్విదా విచ్ఛిత్తి ద్వారా జరుగుతుంది. బహూకణ జీవులలో సమవిభజన జరుగుతాయి.