AP Inter 1st Year Commerce Notes Chapter 1 Concept of Business

Students can go through AP Inter 1st Year Commerce Notes 1st Lesson Concept of Business will help students in revising the entire concepts quickly.

AP Inter 1st Year Commerce Notes 1st Lesson Concept of Business

→ The term business refers to ‘the state of being busy”.

→ Business is one of the human economic activities. Business is an economic activity that involves the regular transfer or exchange of goods and services for earning profit.

→ Business creates utilities by producing and selling goods and services to satisfy human wants.

→ Time, place, and possession of values are created by business enterprises.

AP Inter 1st Year Commerce Notes Chapter 1 Concept of Business

→ Every business enterprise has both economic and social objectives.

→ The obligation of any business enterprise is to protect and serve the public interest as they operate within a society.

→ The Business organisations must be responsible to different Interest groups like owners, employees, suppliers, customers, government, etc.

→ ప్రతి వ్యక్తి తన కోర్కెలను సంతృప్తిపరుచుకొనడానికి నిరంతరము శ్రమిస్తాడు. ఫలితముగా మానవ కార్యకలాపాలు ఏర్పడతాయి. వీటిని ఆర్థిక కార్యకలాపాలు అని, ఆర్థికేతర కార్యకలాపాలు అని విభజించవచ్చు.

→ ఆర్థిక కార్యకలాపాలు వృత్తి, ఉద్యోగము, వ్యాపారము. సమర్థవంతమైన వ్యక్తిగత సేవలను అందించే పనులను వృత్తులు అంటారు. ఒప్పందము ప్రకారము యజమాని చెప్పిన పనులను నిర్వహించడాన్ని ఉద్యోగము అంటారు. లాభాన్ని సంపాదించే ఉద్దేశముతో వస్తుసేవల ఉత్పత్తి వినిమయము, పంపిణీలతో ఉండే వ్యాపకాన్ని వ్యాపారము అంటారు.

→ వ్యాపార లక్షణాలలో ప్రయోజనాల కల్పన, వస్తుసేవలతో సంబంధము, పునరావృతము కాకపోవడం, లాభార్జన, నష్టభయం, అనిశ్చిత పరిస్థితి, కళ అనేవి ఉంటాయి.

→ ప్రతి వ్యాపారానికి ఆర్థిక, సామాజిక, మానవ సంబంధిత, జాతీయ లక్ష్యాలు ఉంటాయి.

→ ఆర్థిక లక్ష్యాలలో లాభాల సంపాదన, ఖాతాదారుల సృష్టి నవకల్పన ఉన్నాయి.

→ సామాజిక లక్ష్యాలలో సరైన వస్తువులను సరైన ధరలకు సప్లయి చేయడము, ఉద్యోగులకు చాలినంత ప్రతిఫలం అందజేయడము, సాంఘిక సంక్షేమము, ప్రభుత్వానికి సహకారము, సహజ వనరుల సక్రమ వినియోగము ఉన్నది. 7 మానవ సంబంధిత లక్ష్యాలలో మానవ వనరుల అభివృద్ధి, ప్రజాస్వామ్య నిర్వహణ, శ్రామిక యజమానుల సహకారము ఉన్నాయి.

AP Inter 1st Year Commerce Notes Chapter 1 Concept of Business

→ జాతీయ లక్ష్యాలలో వనరుల గరిష్ఠ వినియోగము, జాతీయ గౌరవం, చిన్నతరహా పరిశ్రమల వృద్ధి వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి అనేవి ఉంటాయి.

→ వ్యాపారము సమాజములో అంతర్భాగము అయినందున లాభార్జనతో పాటు సామాజిక సంక్షేమాన్ని గురించి కూడా వ్యాపార సంస్థలు ఆలోచించాలి. దీనినే సామాజిక బాధ్యత అంటారు. యజమానులకు, ఉద్యోగులకు, సప్లయిదారులకు, ప్రభుత్వానికి, సమాజానికి సంబంధించి వ్యాపార సంస్థలకు వేర్వేరు బాధ్యతలు ఉంటాయి.