Students can go through AP Inter 1st Year Physics Notes 11th Lesson ప్రవాహుల యాంత్రిక ధర్మాలు will help students in revising the entire concepts quickly.
AP Inter 1st Year Physics Notes 11th Lesson ప్రవాహుల యాంత్రిక ధర్మాలు
→ ప్రవాహిలోని వేరువేరు పొరల మధ్య సాపేక్ష వేగాన్ని నిరోధించే ధర్మాన్ని స్నిగ్ధత అంటారు.
→ ప్రవాహంలో ఏదైనా బిందువు వద్ద వేగం కాలంతో మార్పు చెందకుండా ఉంటే దానిని ధారారేఖా ప్రవాహం అంటారు.
→ ధారారేఖా ప్రవాహంలో కణవేగం ఒక ప్రత్యేక వేగం, సందిగ్ధవేగం Ve కంటే తక్కువగా ఉంటుంది.
→ ధారారేఖలు సమాంతరంగా ఉంటే స్తరీయ ప్రవాహం అంటారు.
→ ఒక వస్తువును ద్రవంలో ముంచిన దానిపై పనిచేసే పీడనంలో తేడా ఉండటంవల్ల వస్తువుపై పైదిశలో అభిబలం ఏర్పడుతుంది. దీనినే ఉత్ల్పవన బలం అంటారు. ఉత్ల్పవన బలం మునిగిన వస్తువు చేసే స్థానభ్రష్ట ద్రవం బరువుకు సమానం. వస్తువు యొక్క కొంత ఘనపరిమాణం మాత్రమే ద్రవంలో మునిగితే వస్తువు సాంద్రతకు, ద్రవ సాంద్రతకు గల నిష్పత్తికి సమానం.
→ చలనంలో ఉండే ద్రవాలను అధ్యయనం చేసే శాస్త్రాన్ని ప్రవాహి గతిశాస్త్రం అంటారు. ద్రవాల ప్రవాహం రెండు రకాలు
- ధారారేఖ ప్రవాహం,
- సంక్షుబ్ధ ప్రవాహం.
→ ప్రవాహి ప్రవాహం
- స్థిర (నిలకడ) లేదా అస్థిర (నిలకడలేని),
- భ్రమణం లేదా అభ్రమణం,
- సంపీడ్యమాన లేదా అసంపీడ్యమాన,
- స్నిగ్ధత లేదా అస్నిగ్ధత ప్రవాహంలా ఉండవచ్చు.
→ ధారారేఖకు ఒక బిందువు వద్ద గీసిన స్పర్శరేఖ ఆ బిందువు వద్ద ప్రవాహి వేగ దిశను సూచిస్తుంది. దీనినే ధారారేఖా ప్రవాహం అంటారు. ప్రవాహి వేగం ఎక్కువవున్న చోట ధారా ప్రవాహరేఖల సాంద్రత ఎక్కువ. ప్రవాహ రేఖల సమూహాన్ని ప్రవాహ నాళిక అంటారు.
→ ద్రవంలో ఏ బిందువు వద్ద అయినా వేగం కాలంతో పాటు మారుతుంటే దానిని సంక్షుబ్ధ ప్రవాహం అంటారు.
→ ఏ వేగం వద్ద ధారారేఖా ప్రవాహం సంక్షుబ్ధ ప్రవాహంగా మారుతుందో ఆ వేగాన్ని సందిగ్ధ వేగం అంటారు.
→ ఒక గొట్టంలో ప్రవహించే ధారారేఖా ప్రవాహంలో ఒక బిందువు వద్ద ప్రవాహ వేగం, మధ్యచ్ఛేద వైశాల్యం లబ్దం స్థిరం. Av = స్థిరం. దీనినే సాంతత్వ సమీకరణం అంటారు.
→ ప్రవాహి ప్రవాహాన్ని బెర్నూలి సిద్ధాంతం ద్వారా అర్థంచేసుకోవచ్చు. దీని ప్రకారం స్థిరవేగంతో ప్రవహిస్తున్న స్నిగ్ధతలేని, అసంపీడ్య ప్రవాహి పీడన గతిజ, స్థితిజ శక్తుల మొత్తం ఆ గమన పథంలో అన్ని బిందువుల వద్ద సమానం.
P + ρgh + \(\frac{1}{2}\)ρv2 = స్థిరరాశి.
→ ద్రవాల పొరల మధ్య ఉన్న ఘర్షణ బలాన్ని స్నిగ్ధతా బలం అంటారు. ఈ బలం ప్రవాహి వేగాన్ని కుదిస్తుంది. ప్రవాహి రెండు పొరల మధ్య సాపేక్ష వేగాన్ని తగ్గించే ధర్మాన్నే స్నిగ్ధత అంటారు.
→ స్నిగ్ధతా బలం F కింది వాటికి అనులోమానుపాతంలో ఉంటుంది.
- పొర వైశాల్యం,
- వేగ ప్రవణత
F ∝ -A\(\left(\frac{\Delta v}{\Delta x}\right)\)
F = -ηA\(\left(\frac{\Delta v}{\Delta x}\right)\)
η స్నిగ్ధతా గుణకం, ప్రవాహి దిశకు లంబంగా పొరల మధ్య ఏకాంక వేగ ప్రవణత ఉన్నప్పుడు ఏకాంక వైశాల్యం గల పొరల మీద పనిచేసే స్నిగ్ధతా బల పరిమాణమే ఆ ద్రవం యొక్క స్నిగ్ధతా గుణకం అంటారు.
→ స్టోక్ ఫార్ములా : ప్రవాహిలో క్రిందికి పడుతున్న నునుపైన గోళాకారపు వస్తువుపై పనిచేసే నిరోధక బలంను క్రింది విధంగా రాయవచ్చు.
F = 6πηrv
η స్నిగ్ధతా గుణకం, ” గోళాకారపు వస్తువు వ్యాసార్థం, v ప్రవాహిలో వస్తువు వేగం.
→ ఏకాంక వైశాల్యంపై చర్య జరిపే అభిలంబ బలాన్ని సగటు పీడనం (Pav = F/A) అంటారు.
→ ఒక పదార్థ సాంద్రత, 4°C వద్ద నీటి సాంద్రతకు గల నిష్పత్తిని, ఆ పదార్థ సాపేక్ష సాంద్రత అంటారు.
→ పాస్కల్నయమం : విరామ స్థితిలో ఉన్న ఒక ప్రవాహిలో ఒకే ఎత్తులో ఉన్న అన్ని బిందువుల వద్ద, పీడనం ఒకే విలువను కలిగి ఉంటుంది.
→ ఆర్కిమెడిస్ సూత్రం : ఏదైనా ఒక ప్రవాహిలో ఒక వస్తువు పూర్తిగానో, పాక్షికంగానో మునిగి ఉన్నప్పుడు ఆ వస్తువు భారంలో కలిగే నష్టం అది తొలగించిన ప్రవాహి భారానికి సమానం.
→ అసంపీడ్య ప్రవాహి యొక్క ప్రవాహ వడిని కొలిచే సాధనమే వెంటురి-మీటర్.
→ ఉష్ణోగ్రత పెరిగే కొద్దీ ద్రవాల స్నిగ్ధత తగ్గుతూ ఉంటుంది. అదే వాయువుల విషయంలో స్నిగ్ధత పెరుగుతుంది.
→ రెనాల్డు సంఖ్య Re < 1000, ధారా రేఖా ప్రవాహం
Re < 2000, సంక్షుబ్ధ ప్రవాహం
1000 < Re < 2000, నిలకడ రహిత ప్రవాహం
→ ద్రవ ఉమ్మడి తలం యొక్క ఏకాంక వైశాల్యానికి గల తలశక్తి, తలతన్యత (S) కు సమానం.
→ నీరు, గాజుల మధ్య ఉండే స్పర్శకోణం, లఘుకోణం (θ < 90°), కాబట్టి కేశనాళికలోకి ఎగబాకిన నీరు పుటాకారంగా ఉంటుంది.
→ ఒక ద్రవం, దాని చుట్టూ ఉండే తలానికి మధ్యగల ఉమ్మడి తలంపై ఏకాంకపొడవుకు పనిచేసే బలాన్ని తలతన్యత అంటారు.
→ ఆర్కిమెడిస్ (287 – 212 B.C.)
ఆర్కిమెడిస్ ఒక గ్రీకు తత్వవేత్త, గణితవేత్త, శాస్త్రవేత్త మరియు ఒక ఇంజనీరు. అతడు వడిసెల (cata- pult) ను ఆవిష్కరించాడు. మోయ లేని అధిక బరువులను తరలించ డానికి కష్ఠీలు, తులాదండాలతో ఒక వ్యవస్థను రూపొందించాడు.