Andhra Pradesh BIEAP AP Inter 2nd Year Chemistry Study Material Lesson 12(a) ఆల్కహాల్స్, ఫినాల్స్ మరియు ఈథర్స్ Textbook Questions and Answers.
AP Inter 2nd Year Chemistry Study Material Lesson 12(a) ఆల్కహాల్స్, ఫినాల్స్ మరియు ఈథర్స్
అతిస్వల్ప సమాధాన ప్రశ్నలు
ప్రశ్న 1.
ప్రొపనోల్ బాష్పీభవన స్థానం హైడ్రోకార్బన్ బ్యుటేన్ కంటే ఎందుకు ఎక్కువగా ఉంటుందో వివరించండి.
జవాబు:
ప్రొపనోల్ బాష్పీభవన స్థానం హైడ్రోకార్బన్ బ్యుటేన్ కంటే ఎక్కువగా ఉంటుంది.
కారణం :
పొపనోల్లో అణువుల మధ్య బలమైన హైడ్రోజన్ బంధం కలిగి ఉంటుంది. కానీ బ్యుటేన్ బలహీనమైన ఫౌండర్వాల్ బలాలు కలిగి ఉంటుంది.
ప్రశ్న 2.
ఆల్కహాల్లు వాటి అణుభారంతో సమాన అణుభారం ఉన్న హైడ్రోకార్బన్ల కంటే నీటిలో ఎక్కువ కరుగుతాయి. దీనిని వివరించండి.
జవాబు:
ఆల్కహాల్లు వాటి అణుభారంతో సమాన అణుభారం ఉన్న హైడ్రోకార్బన్ల కంటే నీటిలో ఎక్కువ కరుగుతాయి.
వివరణ :
- ఆల్కహాల్లు, నీరు రెండు ధృవద్రావణులు. ఆల్కహాల్లు, నీటి అణువులతో హైడ్రోజన్ బంధాలను ఏర్పరుస్తాయి. అందువలన ఆల్కహాల్ నీటిలో కరుగును.
- హైడ్రోకార్బన్లు అధృవసమ్మేళనాలు. ఇవి హైడ్రోజన్ బంధాలను నీటి అణువులతో ఏర్పరచలేవు. కావున ఇవి నీటిలో కరుగవు.
ప్రశ్న 3.
C7H8O అణు సంకేతం గల మోనోహైడ్రిక్ ఫినాల్ల నిర్మాణాలు, IUPAC పేర్లను వ్రాయండి.
జవాబు:
ఇవ్వబడిన మోనోహైడ్రిక్ ఫీనాల్ ఫార్ములా C7H8O. ఈ అణుఫార్ములాతో సాధ్యపడే నిర్మాణాలు మూడు.
ప్రశ్న 4.
క్లోరోబెంజీన్ నుంచి ఫీనాల్ను తయారుచేయడానికి అవసరమైన కారకాలను వ్రాయండి.
జవాబు:
క్లోరో బెంజీన్ నుండి ఫీనాల్ను ఈ క్రింది విధంగా తయారుచేయుదురు. అవసరమగు కారకాలు
i) NaOH, 623 K, 300 at M
ii) HCl
రసాయన చర్య :
ప్రశ్న 5.
సెకండరీ లేదా టెర్షియరీ ఆల్కహాల్లను ఆమ్ల సమక్షంలో నిర్జలీకరణం చేసి ఈథర్లను తయారుచేయడం సరయిన విధానం కాదు. దీనికి కారణం వివరించండి.
జవాబు:
కేవలం 1° – ఆల్కహాల్లను నిర్జలీకరణం చేయుట ద్వారా ఈథర్లను తయారుచేయవచ్చు. కానీ 2° లేదా 3° ఆల్కహాల్ల నుండి తయారుచేయలేము.
కారణం :
2° మరియు 3° ఆల్కహాల్లలో ప్రాదేశిక అవరోధం ఉంటుంది. దీని వలన ఆల్కీన్లను ఏర్పరుస్తాయి. ఈథర్లను ఏర్పరచవు.
ప్రశ్న 6.
మిథాక్సీమీథేన్ HI తో జరిపే చర్యా విధానాన్ని వ్రాయండి.
జవాబు:
Case – I : మిథాక్సీ మీథేన్ చల్లటి విలీన (సజల) HI తో చర్య జరిపి మిథైల్ ఆల్కహాల్, మిథైల్ అయొడైడ్ను ఏర్పరుచును.
చర్యా విధానం :
Case – II : మిథాక్సీ మీథేన్ వేడి గాఢ HI తో చర్య జరిపినపుడు కేవలం మిథైల్ అయొడైడ్ ఏర్పడును.
చర్యా విధానం :
ప్రశ్న 7.
క్రింది చర్యలలో వాడే కారకాలను పేర్కొనండి.
ఎ) ప్రైమరీ ఆల్కహాల్లను కార్బాక్సీ ఆమ్లాలుగా ఆక్సీకరణం.
బి) ప్రైమరీ ఆల్కహాల్లను ఆల్డిహైడ్లుగా ఆక్సీకరణం.
జవాబు:
ఎ) 1° – ఆల్కహాల్లు కార్బాక్సీ ఆమ్లాలుగా ఆక్సీకరణంచేయుటకు ఉపయోగించు కారకాలు ఆమ్లీకృత K2Cr2O7 (లేదా) ఆమ్లీకృత/క్షారీకృత KMnO4 (లేదా) తటస్థ KMnO4.
బి) 1° – ఆల్కహాల్ ను ఆల్డీహైడ్లుగా ఆక్సీకరణం చేయుటకు ఉపయోగించు కారకాలు పిరిడీనియం క్లోరోక్రోమేట్ (PCC)/ CH2Cl2.
ప్రశ్న 8.
క్రింది చర్యలకు సమీకరణాలు వ్రాయండి.
ఎ) ఫీనాల్ను బ్రోమిన్తో చర్యజరిపి 2, 4, 6–ట్రైబోమోఫీనాల్ మార్చడం.
బి) బెంజైల్ ఆల్కహాల్నుంచి బెంజోయిక్ ఆమ్లం.
జవాబు:
ఎ) ఫీనాల్ను బ్రోమిన్తో చర్య జరిపి 2, 4, 6 – ట్రైబ్రోమోఫీనాల్గా మార్చుట.
బి) బెంజైల్’ ఆల్కహాల్ని బెంజోయిక్ ఆమ్లంగా మార్చుట.
ప్రశ్న 9.
ఎసిటోన్ నుంచి – టెర్షియరీ బ్యుటెల్ ఆల్కహాల్ను తయారుచేయడానికి అవసరమైన కారకం/కారకాలను వ్రాయండి.
జవాబు:
ఎసిటోన్ మిథైల్ మెగ్నీషియం బ్రోమైడ్లో చర్య జరిపి తదుపరి జల విశ్లేషణ చేయుట ద్వారా టెర్షియరీ బ్యుటైల్ ఆల్కహాల్ ఏర్పడును.
ప్రశ్న 10.
క్రింది సమ్మేళనాల నిర్మాణాలను వ్రాయండి.
ఎ) ఇథాక్సీఈథేన్
బి) ఇథాక్సీబ్యుటేన్
సి) ఫినాక్సీఈథేన్
జవాబు:
ఎ) ఇథాక్సీఈథేన్ → CH3 – CH2 – O – CH2 – CH3
బి) ఇథాక్సీబ్యుటేన్ → CH3 – CH2 – O – CH2 – CH2 – CH2 – CH3
సి) ఫినాక్సీఈథేన్ → C6H5 – O – CH2 – CH3.
స్వల్ప సమాధాన ప్రశ్నలు
ప్రశ్న 1.
C5H12O అణు సంకేతం ఉన్న ఆల్కహాల్ల సదృశకాల నిర్మాణాలను, వాటి పేర్లను వ్రాయండి. వాటిని ప్రైమరీ, సెకండరీ టెర్షియరీ ఆల్కహాల్లుగా వర్గీకరించండి.
జవాబు:
- ఇవ్వబడిన అణుఫార్ములా C5H12O.
- ఇవ్వబడిన అణుఫార్ములాను ‘8’ సదృశక ఆల్కహాల్లు గలవు.
పై సదృశక ఆల్కహాల్లలో (i), (ii), (iii), (iv) లు 10-ఆల్కహాల్లు, (v), (vi) మరియు (viii) లు 2°-ఆల్కహాల్లు మరియు (vii) 3°-ఆల్కహాల్.
ప్రశ్న 2.
ఆర్థో, పారా నైట్రోఫీనాల్ మిశ్రమాన్ని జలబాష్ప స్వేదనం చేసేటప్పుడు ఏ సదృశకం జలబాష్పశీలత చూపిస్తుంది. కారణం చెప్పండి.
జవాబు:
ఆర్థో, పారా నైట్రోఫీనాల్ల మిశ్రమాన్ని జలబాష్ప స్వేదనం చేసేటపుడు ఆర్థో నైట్రో ఫీనాల్ జలబాష్పశీలత చూపిస్తుంది.
కారణం :
ఆర్థో నైట్రోఫీనాల్లో అణ్వంతర హైడ్రోజన్ బంధం గలదు. కానీ పారా నైట్రోఫీనాల్లో అంతరణుక హైడ్రోజన్ బంధం గలదు. కావున O ఆర్థో నైట్రోఫీనాల్ జల బాష్పశీలత కలిగి ఉండును.
ప్రశ్న 3.
ఫినాల్ను క్యూమిన్ నుంచి తయారుచేసే చర్య సమీకరణాలు వ్రాయండి.
జవాబు:
క్యుమీన్ నుండి ఫీనాల్ను ఈ క్రింది విధంగా తయారుచేయవచ్చు.
- క్యుమీన్ ను క్యుమీన్ హైడ్రోపెరాక్సైడ్గా ఆక్సీకరణం చేయుట.
- క్యుమీన్ హైడ్రో పెరాక్సైడ్ ఆమ్ల జలవిశ్లేషణచేసి ఫీనాల్గా మార్చుట.
ప్రశ్న 4.
ఈథీను ఆర్ద్రీకరణం ద్వారా ఇథనోల్గా మార్చే చర్యా విధానాన్ని వ్రాయండి.
జవాబు:
ఈథీన్ ను ఆర్ద్రీకరణం ద్వారా ఇథనోల్గా మార్చే చర్యా విధానంలో మూడు అంచెలు గలవు.
Step – 1 : మొదట ఈథీన్ ప్రొటోనీకరణం జరిగి కార్బోకాటయాను ఏర్పరచును.
Step – 2 : పైన ఏర్పడిన కార్బోకాటయాన్ నీటితో చర్య జరుపును.
Step – 3 : డీప్రోటోనీకరణం ద్వారా ఇథైల్ ఆల్కహాల్ (ఇథనోల్) ఏర్పడును.
ప్రశ్న 5.
ఫీనాల్ ఆమ్లలక్షణాన్ని వివరించండి. దానిని ఆల్కహాల్తో పోల్చండి. [AP. Mar.’17]
జవాబు:
ఫీనాల్ సోడియం లోహంతో, NaOH జల ద్రావణాలతో జరిపే చర్యలు దాని ఆమ్ల లక్షణాలను సూచిస్తాయి.
- ఫీనాల్ సోడియం లోహంతో చర్యజరిపి సోడియం ఫీనాక్సైడ్ను ఏర్పరచును.
- ఫీనాల్ NaOH జల ద్రావణంతో చర్య జరిపి సోడియం ఫీనాక్సైడ్ను ఏర్పరచును.
- ఫీనాల్లో హైడ్రాక్సీ సమూహం బెంజీన్ వలయంలోని sp² సంకరీకరణ కార్బన్ బంధింపబడి ఉంటుంది. హైడ్రాక్సీ సమూహం బెంజీన్ వలయంలో ఎలక్ట్రాన్ ఆకర్షక సమూహం.
- ఫీనాల్ నుండి ఏర్పడిన ఫీనాక్సైడ్ అయాన్లో ఋణావేశం అస్థానీకరణం చెందుటవలన ఎక్కువ స్థిరత్వం పొందును.
ఫీనాల్ ఆమ్ల లక్షణాలను ఆల్కహాల్లతో పోల్చుట :
- ఫీనాల్తో NaOH జలద్రావణంతో చర్యనుబట్టి ఆల్కహాల్ కంటే ఫీనాల్లు బలమైన ఆమ్లాలు అని తెలుస్తుంది.
- ఏరోమేటిక్ వలయానికి బంధింపబడ్డ హైడ్రాక్సీ సమూహం ఆల్కైల్ సమూహానికి బంధింపబడిన హైడ్రాక్సీ సమూహంకంటే ఆమ్ల స్వభావాన్ని కలిగి ఉండును.
- ఫీనాల్ రెజోనెన్స్ ప్రక్రియ ద్వారా స్థిరమైన ఫీనాక్సైడ్ అయాన్ ఏర్పరుచును. కానీ ఇథాక్సైడ్ అయాన్ ఏర్పరచదు.
ప్రశ్న 6.
ఫీనాల్ ఆక్సీకరణం క్షయకరణం చర్యలలో ఏర్పడే ఉత్పన్నాలను వ్రాయండి.
జవాబు:
a) ఫీనాల్ క్షయకరణం :
ఫీనాల్ జింక్ డస్ట్ సమక్షంలో క్షయకరణ చెంది బెంజీన్ ను ఏర్పరచును.
b) ఫీనాల్ ఆక్సీకరణం :
ఫీనాల్ క్రోమిక్ ఆమ్లంతో ఆక్సీకరణంచెంది ఒక సంయుగ్మ డై కీటోన్ అయిన బెంజో క్వినోన్ను ఏర్పరచును.
ప్రశ్న 7.
ఇథనోల్ సల్ఫ్యూరిక్ ఆమ్లంతో, 443K వద్ద ఈథేన్ న్ను 413K వద్ద ఇథాక్సీ ఈథేనన్ను ఏర్పరుస్తుంది. ఈ చర్యా విధానాన్ని వ్రాయండి.
జవాబు:
Case – I :
ఇథనోల్ గాఢ H2SO4 తో 443K వద్ద చర్య జరిపి ఈథీన్ ను ఏర్పరచును
చర్యా విధానం :
Step – 1 : ప్రోటోనేటెడ్ ఆల్కహాల్ ఏర్పడుట
Step – 2 : కార్బోకాటయాన్ ఏర్పడుట
Step – 3 : ప్రోటాన్ విలోపనం ద్వారా ఈథీన్ ఏర్పడుట
Case – II :
ఇథనోల్ గాఢ H2SO4 తో 413 K వద్ద చర్య జరిపి ఇథాక్సీ ఈథేన్ ను ఏర్పరచును.
చర్యా విధానం :
ప్రశ్న 8.
క్రింది వ్యాఖ్యకు వివరణ ఇవ్వండి : ఆల్కహాలు సమాన అణుభారం ఉన్న హైడ్రోకార్బన్లు, ఈథర్ కంటే అధిక ఉష్ణోగ్రత వద్ద మరుగుతాయి.
జవాబు:
ఆల్కహాల్ లు సమాన అణుభారం ఉన్న హైడ్రోకార్బన్లు, ఈథర్ల కంటే అధిక ఉష్ణోగ్రత వద్ద మరుగుతాయి.
వివరణ :
ఇథనోల్, ప్రోఫెన్ మరియు మిథాక్సీ మీథేన్లు దాదాపు సమాన అణుభారాలు కలిగి ఉంటాయి. పై సమ్మేళనాల అణుభారాలు, నిర్మాణాలు మరియు బాష్పీభవన స్థానాలు క్రింద ఇవ్వబడ్డాయి.
ఆల్కహాల్లలో అంతరణుక హైడ్రోజన్ బంధాలు ఉంటాయి. వీటి వలన అధిక భాష్పీభవన స్థానాలను కలిగి ఉంటాయి. ఈథర్లు, హైడ్రోకార్బన్లు అంతరణుక హైడ్రోజన్ బంధాలను ఏర్పరచవు.
ప్రశ్న 9.
ఎనిసోల్లో ఎలక్ట్రోఫిలిక్ ప్రతిక్షేపణ ఆర్థో, పారా స్థానాలలో జరుగుతుంది కానీ మెటా స్థానంలో కాదు. వివరించండి.
జవాబు:
ఎనిసోల్ అనునది ఎరైల్ ఆల్కైల్ ఈథర్. ఎనిసోల్లోని’ -OCH3 అనునది +R – ప్రభావిత సమూహం. ఇది బెంజీన్ వలయంలో ఎలక్ట్రాన్ సాంద్రతను పెంచి బెంజీన్ వలయాన్ని ఎలక్ట్రోఫిలిక్ ప్రతిక్షేపణ చర్యలకు ఉత్తేజితపరచును.
ఎనిసోలందు ఆర్ధో మరియు పారా స్థానాలలో మెటా స్థానంకంటే ఎలక్ట్రాన్ సాంద్రత ఎక్కువగా ఉండును. కావున ఎనిసోల్ ఎలక్ట్రోఫిలిక్ ప్రతిక్షేపణ చర్యలలో ఎక్కువగా ఆర్థో మరియు పారా ఉత్పన్నాలు ఎక్కువగా ఏర్పడతాయి.
ఉదా :
ప్రశ్న 10.
క్రింది చర్యలలో ఏర్పడే ఉత్పన్నాలను వ్రాయండి.
జవాబు:
దీర్ఘ సమాధాన ప్రశ్నలు
ప్రశ్న 1.
క్రింది సమ్మేళనాల IUPAC పేర్లను వ్రాయండి.
జవాబు:
ప్రశ్న 2.
క్రింద ఇచ్చిన IUPAC పేర్లున్న సమ్మేళనాల నిర్మాణాలు వ్రాయండి.
ఎ) 2-మిథైల్ బ్యుటనోల్
బి) 1-ఫినైల్ ప్రొపన్-2-ఓల్
సి) 3, 5–డైమిథైల్ హెక్సేన్-1, 3, 5–ట్రైఓల్
డి) 2, 3–డైఇథైల్ఫినాల్
ఇ) 1-ఇథాక్సీప్రొపేన్
ఎఫ్) 2–ఇథాక్సీ-3-మిథైల్ పెంటేన్
జి) సైక్లో హెక్సైల్థనోల్
హెచ్) 3–క్లోరోమిథైల్ పెంటన్-1-ఓల్
జవాబు:
ప్రశ్న 3.
బెంజీన్, గాఢ H2SO4, NaOH లను ఉపయోగించి ఫీనాల్ను తయారుచేసే చర్య సమీకరణాలను వ్రాయండి.
జవాబు:
ఫీనాల్ను గాఢ H2SO4. NaOH లను ఉపయోగించి క్రింది విధంగా తయారుచేయవచ్చు.
ప్రశ్న 4.
హైడ్రోబోరేషన్-ఆక్సీకరణం చర్యను ఒక ఉదాహరణతో వివరించండి.
జవాబు:
హైడ్రోబోరేషన్-ఆక్సీకరణ చర్య :
ఆల్మీన్లు, డైబోరేన్ సంకలన చర్య జరిపినపుడు ట్రై ఆల్కైల్ బోరేన్లు ఏర్పడును. వీటిని క్షార H2O2 సమక్షంలో ఆక్సీకరణం చేసినపుడు ఆల్కహాల్లు ఏర్పడును. దీనినే హైడ్రోబోరేషన్-ఆక్సీకరణ చర్య అంటారు.
ఉదా :
ప్రశ్న 5.
క్రింది సమ్మేళనాల IUPAC పేర్లను వ్రాయండి.
జవాబు:
ప్రశ్న 6.
క్రింది సమ్మేళనాలను ఎలా తయారుచేస్తారు?
ఎ) సరైన ఆల్కీన్ నుంచి 1-ఫినైస్ఇథనోల్
బి) సైక్లోహెక్సైల్మిథనోల్ను ఆల్కైల్లైడ్ను ఉపయోగించి S 2 చర్య ద్వారా
సి) సరైన ఆల్కెల్ హాలైడ్ నుంచి పెంటన్-1-ఓల్
జవాబు:
ఎ) 1-ఫినైల్ ఇథనోల్ సంశ్లేషణ :
స్టైరిన్ సజల H2SO4 సమక్షంలో జల విశ్లేషణ జరిపి 1-ఫినైల్ ఇథనోల్ను ఏర్పరచును. ఇది మార్కోనికాఫ్ నియమానికి ఉదాహరణ.
బి) సైక్లో హెక్సైల్ మిథనోల్ సంశ్లేషణ :
సైక్లోహెక్సైల్మిథైల్ బ్రోమైడ్ NaOH జల ద్రావణంతో చర్య జరిపి సైక్లోహెక్సెల్ మిథనోల్ ఏర్పడును (SN² చర్య)
సి) 1-పెంటనోల్ సంశ్లేషణ :
1-బ్రోమో పెంటేన్ KOH జల ద్రావణంతో చర్య జరిపి 1-పెంటనోల్ ఏర్పడును.
ప్రశ్న 7.
క్రింది వాటిని వివరించండి.
ఎ) ఆర్థోనైట్రో ఫీనాల్ ఆర్థోమిథాక్సీఫినాల్ కంటే బలమైన ఆమ్లం.
బి) బెంజీన్ వలయం మీద -OH సమూహం ఉంటే అది వలయాన్ని ఎలక్ట్రోఫిలిక్ ప్రతిక్షేపణ చర్యలకు ఉత్తేజితం చేస్తుంది.
జవాబు:
ఎ) ఆర్థోనైట్రోఫినాల్, ఆర్థోమిథాక్సీ ఫినాల్ కన్నా బలమైన ఆమ్లం
వివరణ :
- -NO2 అనునది ఎలక్ట్రాన్ ఉపసంహారక సమూహం మరియు – OCH3 ఎలక్ట్రాన్ దాన ప్రవృత్తి గల సమూహం.
- ఎలక్ట్రాన్ ఉపసంహారక సమూహంవలన ఫీనాక్సైడ్ అయాన్ ఎక్కువ స్థిరత్వం పొందుతుంది.
- ఎలక్ట్రాన్ దానప్రవృత్తిగల సమూహంవలన ఫీనాక్సైడ్ అయాన్ తక్కువ స్థిరత్వం పొందుతుంది.
బి) బెంజీన్ వలయంపై-OH సమూహం ఉంటే అది వలయాన్ని ఎలక్ట్రోఫిలిక్ ప్రతిక్షేపణ చర్యలకు ఉత్తేజితం చేస్తుంది.
వివరణ :
ఎలక్ట్రోఫిల్ సమక్షంలో OH సమూహం బెంజీన్ వలయంపై +R ప్రభావాన్ని చూపుతుంది. కావున ఎలక్ట్రాన్ సాంద్రత ఆర్థో, పారా స్థానాలలో పెరుగును. ఎలక్ట్రోఫిల్ సమక్షంలో ఆర్థో మరియు పారా స్థానాలలో ప్రతిక్షేపణ జరుగును. కావున బెంజీన్ నందు ఎలక్ట్రోఫిలిక్ ప్రతిక్షేపణ జరుగును.
ప్రశ్న 8.
క్రింది చర్యలకు సరయిన ఉదాహరణతో సమీకరణాలను వ్రాయండి. [AP. Mar.’15]
ఎ) కోలె చర్య [TS (Mar.’16; AP. Mar.’17]
బి) రీమర్-టీమన్ చర్య [AP. Mar.’17]
సి) విలియమ్సన్ సంశ్లేషణతో ఈథర్ తయారీ విధానం [AP & TS. Mar. ’16, ’17]
జవాబు:
ఎ) కోల్బె చర్య :
ఫీనాల్ సోడియం హైడ్రాక్సైడ్తో చర్య జరిపి సోడియం ఫీనాక్సైడ్ను ఏర్పరుచును. ఇది CO్క ఎలక్ట్రోఫిలిక్ ప్రతిక్షేపణ చర్య జరిపి సాలిసిలిక్ ఆమ్లం ఏర్పడును.
బి) రీమర్-టీమన్ చర్య :
ఫీనాల్ NaOH సమక్షంలో క్లోరోఫారంతో చర్య జరిపి ౧-హైడ్రాక్సీ బెంజాల్డీహైడ్ (సాలిసిలాల్డిహైడ్) ను ఏర్పరుచును. దీనినే రీమర్-టీమన్ చర్య అంటారు.
సి) విలియంసన్ ఈథర్ సంశ్లేషణ :
- ఈ పద్ధతిద్వారా సౌష్టవ మరియు అసౌష్టవ ఈథర్లను తయారుచేయవచ్చు.
- ఆల్కైల్లైడ్లు సోడియం ఆల్కాక్సైడ్తో చర్య జరిపి ఈథర్లను ఏర్పరుచుటను విలియంసన్ సంశ్లేషణ అంటారు.
ప్రశ్న 9.
క్రింది మార్పులను ఎలా చేస్తారు?
ఎ) బెంజైల్ క్లోరైడ్ను బెంజైల్ ఆల్కహాల్గా
బి) ఇథైల్ మెగ్నీషియం బ్రోమైడ్ను ప్రొపన్-1-ఓల్గా
సి) 2–బ్యుటనోన్ ను 2-బ్యుటనోల్గా
జవాబు:
ఎ) బెంజైల్లోరైడ్ను బెంజైల్ ఆల్కహాల్గా మార్చుట :
బెంజైల్ క్లోరైడ్ NaOH జలద్రావణంతో చర్య జరిపి బెంజైల్ ఆల్కహాల్ను ఏర్పరచును.
బి) ఇథైల్ మెగ్నీషియం బ్రోమైడ్ను ప్రోపన్ 1-ఓల్గా మార్చుట :
ఇథైల్ మెగ్నీషియం బ్రోమైడ్, ఫార్మాల్డీహైడ్తో చర్య జరిపి తరువాత జలవిశ్లేషణ ద్వారా 1-ప్రోపనోల్ ఏర్పడును.
సి) 2–బ్యుటనోన్ను 2-బ్యుటనోల్గా మార్చుట :
2-బ్యుటనోన్ LiA/H4 సమక్షంలో క్షయకరణం చేయగా 2- బ్యుటనోల్ ఏర్పడును.
ప్రశ్న 10.
క్రింది ఈథర్లను తయారు చేయడానికి అవసరమైన కారకాలను, సమీకరణాలను వ్రాయండి.
ఎ) 1–ప్రొపాక్సీప్రొపేన్
సి) 2-మిథాక్సీ-2-మిథైల్ ప్రొపేన్
బి) ఇథాక్సీబెంజీన్
డి) 1 – మిథాక్సీఈథేన్
జవాబు:
ఎ) 1–ప్రొపాక్సీప్రొపేన్ :
బి) ఇథాక్సీ బెంజీన్ తయారీ :
సి) 2-మిథాక్సీ-2-మిథైల్ ప్రోపేన్ :
డి) 1 -మిథాక్సీ ఈథేన్ :
ప్రశ్న 11.
ప్రొపేన్ 1-ఓల్ నుంచి 1-ప్రొపాక్సీప్రొపేన్ను ఎలా తయారుచేస్తారు? ఈ చర్యా విధానాన్ని వ్రాయండి.
జవాబు:
1 – ప్రొపనోల్ గాఢ H2SO4 తో 413 K వద్ద చర్య జరిపి 1- ప్రొపాక్సీ ప్రోపేన్ ఏర్పడును
చర్యా విధానం :
ప్రశ్న 12.
ఎరైల్ ఆల్కైల్ ఈథర్లలోని ఆల్కాక్సీ సమూహం బెంజీన్ వలయాన్ని ఎలక్ట్రోఫిలిక్ ప్రతిక్షేపణ చర్యలకు ఎలా ఉత్తేజితం చేస్తుందో వివరించండి.
జవాబు:
ఎనిసోల్ అనునది ఎరైల్ ఆల్కెల్ ఈథర్. ఎనిసోల్లోని -OCH3 అనునది +R – ప్రభావిత సమూహం. ఇది బెంజీన్ వలయంలో ఎలక్ట్రాన్ సాంద్రతను పెంచి బెంజీన్ వలయాన్ని ఎలక్ట్రోఫిలిక్ ప్రతిక్షేపణ చర్యలకు ఉత్తేజితపరచును.
ఎనిసోలందు ఆర్థో మరియు పారా స్థానాలలో మెటా స్థానంకంటే ఎలక్ట్రాన్ సాంద్రత ఎక్కువగా ఉండును. కావున ఎనిసోల్ ఎలక్ట్రోఫిలిక్ ప్రతిక్షేపణ చర్యలలో ఎక్కువగా ఆర్థో మరియు పారా ఉత్పన్నాలు ఎక్కువగా ఏర్పడతాయి.
ఉదా :
ప్రశ్న 13.
క్రింది చర్యలకు సమీకరణాలను వ్రాయండి.
ఎ) ఎనిసోల్ పై” ఆల్కెలీకరణం
బి) ఎనిసోల్ పై నైట్రేషన్
సి) ఎనిసోల్పై ఫ్రీడల్ క్రాఫ్ట్ ఎసిటైలేషన్ చర్య
జవాబు:
ఎ) ఎనిసోల్ యొక్క ఆల్కైలీకరణం :
బి) ఎనిసోల్ నైట్రేషన్
సి) ఎనిసోల్ యొక్క ఫ్రీడల్ క్రాఫ్ట్ ఎసిటైలేషన్:
ప్రశ్న 14.
సరైన ఆల్కీన్ నుంచి కింది ఆల్కహాల్లను ఎలా తయారుచేస్తారో వివరించండి.
జవాబు:
ప్రశ్న 15.
ఫీనాల్ బ్రోమిన్ జలద్రావణంతో 2,4,6-ట్రైబ్రోమోఫినాల్ను ఏర్పరిస్తే, CS2 ద్రావణంలో బ్రోమిన్ తక్కువ ఉష్ణోగ్రతవద్ద పారా-బ్రోమోఫీనాల్ను ముఖ్య ఉత్పన్నంగా ఏర్పరుస్తుంది. దీనిని వివరించండి.
జవాబు:
ఎ) ఫీనాల్ CS2 సమక్షంలో బ్రోమినేషన్ చేయగా P-బ్రోమోఫినాల్ ప్రధాన ఉత్పన్నంగా ఏర్పడును.
బి) ఫీనాల్ బ్రోమిన్ జలంతో చర్య జరుపగా 2,4,6-ట్రైబ్రోమో ఫీనాల్
వివరణ :
ఫీనాల్ బ్రోమినేషన్లో లూయి ఆమ్లం లేకుండా కూడా Br, అణువు దృవణత చెందును. దీనికి కారణం బెంజీన్ వలయానికి బంధింపబడిన -OH సమూహానికి అధిక ఉత్తేజిత ప్రభావం కలిగి ఉండటమే.
సాధించిన సమస్యలు Textual Examples
ప్రశ్న 1.
క్రింద ఇచ్చిన సమ్మేళనాల IUPAC పేర్లను వ్రాయండి.
సాధన:
i) 4–క్లోరో-2, 3-డైమిథైల్ పెంటన్-1-ఓల్
ii) 2–ఇథాక్సీప్రొపేన్
iii) – 2, 6–డైమిథైల్ఫినాల్
iv) 1-ఇథాక్సీ-2-నైట్రోసైక్లోహెక్సేన్
ప్రశ్న 2.
క్రింది చర్యలలో ఏర్పడే ఉత్పన్నాల నిర్మాణాలు, IUPAC పేర్లు వ్రాయండి.
ఎ) ఉత్ప్రేరకం సమక్షంలో బ్యుటనాల్ క్షయకరణం.
బి) సల్ఫ్యూరిక్ ఆమ్ల సమక్షంలో ప్రొపీన్ ఆర్ద్రీకరణ (Hydration).
సి) మిథైల్ మెగ్నీషియం బ్రోమైడ్తో ప్రొపనోన్ చర్యలో ఏర్పడిన ఉత్పన్నం జలవిశ్లేషణ.
సాధన:
ప్రశ్న 3.
క్రింద ఇచ్చిన సమ్మేళనాలను వాటి ఆమ్లత్వం పెరిగే క్రమంలో అమర్చండి.
ప్రొషన్-1-ఓల్, 2, 4, 6–ట్రైనైట్రోఫినాల్, 3-నైట్రోఫినాల్, 3, 5-డైనైట్రోఫినాల్, 4 మిథైలి ఫినాల్.
సాధన:
ప్రొపన్-1-ఓల్, 4 మిథైల్ఫీనాల్, ఫినాల్, 3-నైట్రోఫినాల్, 3, 5–డైనైట్రోఫినాల్, 2, 4, 6–ట్రైనైట్రోఫినాల్దీ
నిని -HCl తో ఆమ్లీకరణం చేస్తే ఫినాల్ వస్తుంది.
ప్రశ్న 4.
క్రింది చర్యలలో ఏర్పడే అధిక ఉత్పన్నాల నిర్మాణాలు వ్రాయండి.
ఎ) 3–మిథైల్ఫినాల్ మోనోనైట్రేషన్
బి) 3–మిథైల్ఫినాల్ డైనైట్రేషన్
సి) ఫినైల్ మిథనొయేట్ మోనోనైట్రేషన్
సాధన:
-OH, CH3 సమూహాల ఉమ్మడి ప్రభావం కొత్తగా చేరే (incoming) సమూహం యొక్క స్థానాన్ని నిర్దేశిస్తుంది.
ప్రశ్న 5.
టెర్షియరీ-బ్యుటైల్ ఇథైల్ ఈథర్ను తయారుచేయడానికి క్రింది చర్య సరయినది కాదు.
i) ఈ చర్యలో ఏర్పడే ముఖ్య ఉత్పన్నం ఏది?
ii) టెర్షియరీ-బ్యుటైల్ ఇథైల్ ఈథర్ను తయారుచేయడానికి సరయిన చర్యను వ్రాయండి.
సాధన:
i) ఇచ్చిన చర్యలో ఏర్పడే ముఖ్య ఉత్పన్నం 2-మిథైల్ ప్రొప్-1-ఈన్. దీనికి కారణం సోడియమ్ ఇథాక్సైడ్ బలమైన న్యూక్లియోఫైల్, బలమైన క్షారం కూడా కాబట్టి విలోపనం, ప్రతిక్షేపణ చర్యను అధిగమిస్తుంది.
ప్రశ్న 6.
క్రింద ఇచ్చిన ఈథర్లను HI తో వేడిచేస్తే ఏర్పడే అధిక (major) ఉత్పన్నాలను వ్రాయండి.
సాధన:
పాఠ్యాంశ ప్రశ్నలు INTEXT QUESTIONS
ప్రశ్న 1.
క్రింది వాటిని ప్రైమరీ, సెకండరీ, టెర్షియరీ ఆల్కహాల్లుగా వర్గీకరించండి.
జవాబు:
ప్రైమరీ ఆల్కహాల్లు (i), (ii), (iii)
సెకండరీ ఆల్కహాల్లు (iv) మరియు (v)
టెరియరీ ఆల్కహాల్లు (vi)
ప్రశ్న 2.
పై ఉదాహరణల్లో అల్లెలిక్ ఆల్కహాల్లను గుర్తించండి.
జవాబు:
అల్లైలిక్ ఆల్కహాల్ (ii) మరియు (vi)
ప్రశ్న 3.
క్రింది సమ్మేళనాల పేర్లను IUPAC పద్ధతిలో వ్రాయండి.
జవాబు:
i) 3–క్లోరోమిథైల్-2ఐసోప్రొపైలెపెంటన్-1-ఓల్
ii) 2, 5–డైమిథైల్ హెక్సేన్-1, 3-డైఓల్
iii) 3–బ్రోమో సైక్లో హెక్సనోల్
iv) హెక్స్-1-ఈన్-3-ఓల్
v) 2–బ్రోమో–3–మిథైల్ బ్యుట్-2-ఈన్-1-ఓల్
ప్రశ్న 4.
క్రింది ఆల్కహాల్లను మిథనాల్లో సరయిన గ్రిగా నార్డ్ కారకం ఉపయోగించి ఎలా తయారుచేయవచ్చు?
జవాబు:
ప్రశ్న 5.
క్రింది చర్యలలో ఏర్పడే ఉత్పన్నాల నిర్మాణాలను వ్రాయండి.
జవాబు:
ప్రశ్న 6.
ఆమ్ల ఉత్ప్రేరిత నిర్జలీకరణ చర్యలో క్రింది ఆల్కహాల్ల నుంచి ఏర్పడే ముఖ్య (అధిక) ఉత్పన్నాన్ని వ్రాయండి.
i) 1-మిథైల్సైక్లో హెక్సనోల్
ii) బ్యుటన్-1-ఓల్.
జవాబు:
i) 1-మిథైల్సైక్లోహెక్సీన్
ii) బ్యుట్-1–ఈన్, బ్యుట్-2-ఈన్ల మిశ్రమం. బ్యుట్-1 ఈన్ ప్రధాన ఉత్పన్నంగా ఏర్పడటానికి కారణం పునరమిక . ద్వారా సెకండరీ కార్బోకాటయాన్ ఏర్పడటమే.
ప్రశ్న 7.
ఇథనోల్, 3–మిథైల్ పెంటన్-2-ఓల్ల నుంచి విలియమ్సన్ పద్ధతిలో 2–ఇథాక్సీ-3–మిథైలెంటేనన్ను తయారుచేసే చర్యలు వ్రాయండి.
జవాబు:
ప్రశ్న 8.
క్రింది చర్యలలో ఏర్పడే ఉత్పన్నాలను వ్రాయండి.
జవాబు: