Andhra Pradesh BIEAP AP Inter 1st Year Botany Study Material 8th Lesson ఆవృతబీజాల వర్గీకరణ శాస్త్రం Textbook Questions and Answers.
AP Inter 1st Year Botany Study Material 8th Lesson ఆవృతబీజాల వర్గీకరణ శాస్త్రం
అతిస్వల్ప సమాధాన ప్రశ్నలు
ప్రశ్న 1.
ఒమేగా వర్గీకరణ శాస్త్రం అంటే ఏమిటి?
జవాబు:
స్వరూప లక్షణాల మీదనే కాకుండా పిండోత్పత్తి శాస్త్రం, కణశాస్త్రం, పరాగరేణు శాస్త్రం, వృక్ష రసాయనశాస్త్రం, సిరాలజి వంటి అనేక వృక్ష శాఖల నుంచి లభించే విషయాల మీద ఆధారపడి చేయు వర్గీకరణను ఒమేగా వర్గీకరణ శాస్త్రము అంటారు.
ప్రశ్న 2.
మొక్కల సహజ వర్గీకరణ శాస్త్రం అంటే ఏమిటి? దీన్ని అనుసరించిన శాస్త్రవేత్తల పేర్లు తెలపండి.
జవాబు:
వీలైనన్ని ఎక్కువ స్వరూప లక్షణాలను పరిగణలోనికి తీసుకొని చేయు వర్గీకరణను సహజ వర్గీకరణ అంటారు. దీనిని బెంథామ్ మరియు హుకర్లు ప్రతిపాదించారు.
ప్రశ్న 3.
సాంఖ్యక వర్గీకరణశాస్త్ర (Numerical Taxonomy) పరిధిని, ప్రాముఖ్యతను వివరించండి.
జవాబు:
గణితశాస్త్ర పద్ధతులను ఉపయోగించి వర్గీకరణ సముదాయాల మధ్య గల గమనించదగ్గ విభేదాలను, పోలికలను లెక్క కట్టటానికి ఉపయోగించే శాస్త్రంను సాంఖ్యక వర్గీకరణ శాస్త్రం అంటారు. ఈ పద్ధతిలో అన్ని లక్షణాలను సంఖ్య, సంకేతాలను నిర్ణయించి తరువాత సమాచారాన్ని క్రమ పద్ధతిలో విశ్లేషించడం జరుగుతుంది. ప్రతి లక్షణానికి సమానమైన ప్రాధాన్యత ఇస్తూ అదే సమయంలో వందలాది లక్షణాలను పరిగణించవచ్చు.
ప్రశ్న 4.
భూఫలనం అంటే ఏమిటి ? ఈ దృగ్విషయాన్ని ప్రదర్శించే మొక్క పేరు తెలపండి.
జవాబు:
మృత్తికలో ఫలం అభివృద్ధి చెందుటను భూఫలనం అంటారు. ఉదా : వేరుశనగ
ప్రశ్న 5.
ఫాబేసికి చెందిన మొక్కలలో కనిపించే పరాగ సంపర్క యాంత్రిక రకం పేరు తెలపండి. [Mar. ’14]
జవాబు:
ఫిస్టన్ యాంత్రికము
ప్రశ్న 6.
సొలానమ్ మొక్క పుష్ప సంకేతం రాయండి
జవాబు:
ప్రశ్న 7.
సొలానమ్ నైగ్రమ్ అండాశయం, సాంకేతిక వర్ణన ఇవ్వండి.
జవాబు:
ద్విఫలదళ, సంయుక్త, ద్విబిలయుత, ఊర్ధ్వ అండాశయము ఉబ్బిన స్థంభ అండన్యాసంపై అండాలు అమరి ఉంటాయి. ఫలదళాలు 45° ల కోణంలో ఏటవాలుగా అమరి ఉంటాయి.
ప్రశ్న 8.
ఆలియమ్ సెపా పరాగకోశాల సాంకేతిక వర్ణనను ఇవ్వండి.
జవాబు:
ఆలియమ్ సెఫాలో పరాగ కోణాలు, ద్వికక్షికం, పీఠసంయోజితము, అంతర్ముఖం, నిలువు స్పోటనము.
స్వల్ప సమాధాన ప్రశ్నలు
ప్రశ్న 1.
ఒక నమూనా పుష్పించే మొక్క పాక్షిక సాంకేతిక వర్ణనను క్లుప్తంగా రాయండి.
జవాబు:
మొక్క వర్ణనలో ఆకృతి, ఆవాసము, వేరు, కాండము, పత్రము, పుష్పాలు, క్షణాలు, ఫలము వివరిస్తారు. తరువాత పుష్పచిత్రం, పుష్ప సంకేతము ఇస్తారు. పుష్ప సంకేతంలో Br అనగా పుచ్చ సహితము, Ebr అనగా పుచ్చ రహితము, Brl లఘు పుచ్ఛ
పుష్పభాగాల సంఖ్య, సంయుక్తమా లేక అసంయుక్తం, సంసంజనము లేక అసంజనం, కూడా పుష్ప సంకేతంలో సూచిస్తారు.
పుష్ప చిత్రంలో ప్రధాన అక్షం వైపు ఉన్న పుష్ప భాగాన్ని పరాంతభాగం అని, ప్రధాన అక్షాన్ని ఒక చుక్కతో పుష్ప చిత్రంపైన సూచిస్తారు. రక్షకపత్రావళి, ఆకర్షణపత్రావళి, కేసరావళి, అండకోశంలను ఏక కేంద్ర వలయాలుగా గీసి, రక్షక పత్రాలను వెలుపల వలయంలోను, మధ్యలో అండాశయం అడ్డుకోత పటం ద్వారా సూచిస్తారు. పుష్ప పుచ్ఛం, పుష్పం మొక్క పూర్వాంత భాగాన్ని సూచిస్తుంది. దీనిని పుష్ప చిత్రానికి పీఠం వైపు సూచిస్తారు.
ప్రశ్న 2.
ఫాబేసికి చెందిన మొక్కల అనావశ్యక పుష్ప అంగాలను వివరించండి. [Mar. ’14]
జవాబు:
ఫాబేసిలో అనావశ్యక అవయవాలు :
రక్షక పత్రావళి మరియు ఆకర్షణ పత్రావళి
రక్షక పత్రావళి :
రక్షక పత్రాలు 5, సంయుక్తము, చిక్కెన పుష్పరచన బేసిరక్షక పత్రం పూర్వాంతంలో ఉంటుంది.
ఆకర్షణ పత్రావళి :
ఆకర్షణ పత్రాలు – 5, అసంయుక్తం, పాపిలియోనేషియస్ రకము. పరాంతంలో ఉన్న ఆకర్షణపత్రం పెద్దది (ధ్వజము) పార్శ్వంగా ఉండే రెండు ఆకర్షణ పత్రాలు (బాహువులు) పూర్వాంతంలో రెండు ఉన్న ఆకర్షణపత్రాలు (ద్రోణులు) సంయుక్తమై ఆవశ్యక అంగాలను కప్పి ఉంచుతాయి. అవరోహక పుష్పరచన చూపుతాయి.
ప్రశ్న 3.
పుష్పచిత్రాన్ని గురించి వ్రాయండి.
జవాబు:
పుష్ప భాగాల సంఖ్య, వాటి అమరిక, ఒక భాగానికి మరియెక భాగానికి మధ్య సంబంధాలను పుష్ప చిత్రం తెలియచేస్తుంది. ప్రధాన అక్షం వైపు ఉండే పుష్ప భాగాన్ని పరాంతభాగం అని, ప్రధాన అక్షాన్ని ఒక చుక్క లేదా ఒక చిన్న వలయంతో పుష్ప చిత్రంపైన సూచిస్తారు. రక్షక, ఆకర్షణ, పత్రాలు, కేసరావళి, అండకోశాలను ఏక కేంద్రకవలయాలుగా గీసి, రక్షక పత్రాలను వెలుపలి వలయంలో చూపిస్తారు. అండకోశాన్ని పుష్ప చిత్రం మధ్యలో అండాశయం అడ్డుకోత ద్వారా చూపుతారు. పుష్ప పుచ్ఛం పుష్పం యొక్క పూర్వాంత భాగంలో ఉంటుంది. దీనిని పుష్ప చిత్రం పీఠ భాగం వైపున సూచిస్తారు.
ప్రశ్న 4.
లిలియేసికి చెందిన మొక్కల పుష్పభాగాలలోని ఆవశ్యక అంగాలను వివరించండి.
జవాబు:
లిలియేసిలో ఆవశ్యక అంగాలు = కేసరావళి, అండకోశము
ఎ) కేసరావళి :
6 కేసరాలు, రెండు వలయాలలో 3 చోప్పున ఉంటాయి. అసంయుక్తం పరిపత్రో పరిస్థితం, పరాగ కోశాలు ద్వికక్షితం, పీఠ సంయోజితం, అంతర్ముఖం, నిలువు స్పోటనం.
బి) అండకోశం :
త్రిఫలదళ, సంయుక్త, త్రిబిలయుతం, ఊర్థ్వ అండాశయము, అండాలు స్థంభ అండాన్యాసంపై అమరి ఉంటాయి. కీలము -అగ్రము, కీలాగ్రము త్రిశాఖాయుతము, శీర్షాకారం.
ప్రశ్న 5.
బెంథామ్ అండ్ హుకర్ల వర్గీకరణలో ద్విదళ బీజ (డైకాటిలిడనే) తరగతి మీద లఘుటీక వ్రాయండి.
జవాబు:
బెంథామ్ మరియు హుకర్ల వర్గీకరణలో డైకాటిలిడనే అను తరగతిని మూడు ఉపతరగతులుగా విభజించారు. అవి :
ఎ) పాలిపెటాలే బి) గామోపెటాలే సి) మోనోక్లామిడే పాలిపెటాలే అను ఉపతరగతిలో థలామిఫ్లోరే (6) క్రమాలు డిస్కిఫ్లోరే (4) క్రమాలు, కాలిసిస్లోరే (5) క్రమాలు అను మూడు శ్రేణులుగా విభజించారు. గామోపెటాలేను ఇన్ఫెరే (3) క్రమాలు హెటిరోమిరే (3) క్రమాలు బైకార్పెల్లేటె (4) క్రమాలు అను 3 శ్రేణులుగా విభజించారు. మోనోక్లామిడేలో ఎనిమిది శ్రేణులు కలవు.
ప్రశ్న 6.
పుష్ప సమీకరణాన్ని విశదీకరించండి.
జవాబు:
పుష్ప భాగాలను కొన్ని సంకేతాలతో పుష్ప సమీకరణంలో చూపిస్తారు. Br అనగా పుచ్చ సహితము, Ebr అనగా పుచ్చ రహితము (పుచ్ఛాలు లేకుండుట), Brl- లఘు పుచ్ఛ సహితము, Ebrl- లఘుపుచ్ఛరహితము (లఘు పుచ్ఛాలు లోపించుట)
ప్రశ్న 7.
ఫాబేసికి చెందిన మొక్కల ఆర్థిక ప్రాముఖ్యతను తెలపండి.
జవాబు:
- కందులు (కజానస్ కజాన్), మినుములు (ఫెసియోలస్ ముంగో), పెసలు (ఫెసియోలస్ ఆరియస్), శనగలు (సైసర్ అరైటినయ్) మొదలైన అపరాల్లో (pulses) ప్రోటీన్లు అధికంగా ఉంటాయి.
- డాలికాస్, గ్లైసిన్ల ఫలాలను కూరగాయలుగా వాడతారు.
- పైసమ్, అరాబిన్ల విత్తనాలు తింటారు.
- అరాఖిస్ హైపోజియా విత్తనాల నుంచి తీసే వేరుశనగ నూనెను, గ్లైసిన్ మాక్స్ విత్తనాల నుంచి తీసే సోయాబిన్ నూనెను వంటలకు వాడతారు.
- అరిఖిస్ హైపోజియా నుంచి నూనె తీసిన తరువాత వచ్చే తెలగ పిండిని (oil cake) వంటకాల్లోను, పశువులకు ఆహారంగాను వాడతారు.
- పొంగామియా పిన్నేటా విత్తనాల నుంచి వచ్చే నూనెను మందుల తయారీలో ఉపయోగిస్తారు.
- ఆబ్రస్ ప్రికటోరియస్ విత్తనాలను కంసాలీలు తూకానికి వాడతారు.
- చాలా మొక్కలు పశుగ్రాసంగా ఉపయోగపడతాయి (క్రొటలేరియా, ఫేసియోలస్)
- నత్రజని స్థాపన ఆ శక్తి అధికంగా ఉండటం వల్ల చాలా పంటలను, పంటల మార్పిడికి ఉపయోగిస్తారు.
- క్రొటలేరియా నుంచి లభించే నారలను తాళ్ళ తయారీకి ఉపయోగిస్తారు.
- ట్రైగోనెల్లా విత్తనాలు వంటలలోను, మందుగాను ఉపయోగపడతాయి. లేక మెంతిఆకులను ఆకుకూరగా తింటారు.
- ట్రైఫ్రోషియా, సెన్బానియా మొక్కలను హరిత ఎరువు (Green manure) గా వాడతారు.
- ఇండిగోఫెరా నుండి నీలిమందు లభిస్తుంది.
- టిరోకార్పస్ సాంటలైనస్ కలపను సంగీత వాయిద్యాల తయారీకి వాడతారు.
- డాల్బెర్జియా లాటిఫోలియా కలపను ఫర్నిచర్ తయారీకి వాడతారు.
దీర్ఘ సమాధాన ప్రశ్నలు
ప్రశ్న 1.
ఫాబేసికి చెందిన మొక్కల లక్షణాల్ని వివరించండి.
జవాబు:
శాఖీయ లక్షణాలు :
ఎ) ఆకృతి :
ఏక వార్షిక గుల్మాలు. కొన్ని పొదలు, మరికొన్ని వృక్షాలు కొన్ని తిరుగుడు తీగల ద్వారా కాని (డాలికస్) నులి తీగల సహయంతో (పైసమ్) కాని ఎగబాకుతాయి.
బి) ఆవాసము :
మధ్యరకపు మొక్కలు
సి) వేరు వ్యవస్థ :
తల్లి వేరువ్యవస్థ. వేళ్ళపై వేరు బుడిపెలు ఉండి, వాటిలో నత్రజని స్థాపన చేసే రైజోబియమ్ అను బ్యాక్టీరియమ్లు సహజీవనం చేస్తు ఉంటాయి.
కాండం :
వాయుగతం, నిటారుగా, మృదువుగా లేక దృఢంగా ఉంటుంది.
పత్రం :
ప్రకాండ సంబంధం ఏకాంతరం, పుచ్ఛసహిత, పుష్టోదరం, తల్పం వంటి పత్రపీఠం, సరళ లేక పిచ్ఛాకార సంయుక్త పత్రాలు.
పుష్ప లక్షణాలు :
పుష్ప విన్యాసం : సామాన్య అనిశ్చితం (క్రొటలేరియా)
పుష్పం :
పుచ్ఛసహిత, లఘు పుచ్ఛసహిత, వృంతసహిత, సంపూర్ణ పాక్షికం సౌష్టవయుతం, ద్విలింగ, పంచభాగయుత, పర్యండకోశ పుష్పాలు. పుష్పాసనం గిన్నె ఆకారంలో ఉంటుంది.
రక్షక పత్రావళి :
రక్షక పత్రాలు 5, సంయుక్తం, చిక్కెన పుష్పరచన, బేసిరక్షక పత్రం పూర్వాంతంలో ఉంటుంది.
ఆకర్షణ పత్రావళి :
పాపిలియోనెషియస్ ఆకారం ఆకర్షణ పత్రాలు 5, అసంయుక్తం, పరాంతంలో ఉన్న ఆకర్షణ పత్రం పెద్దదీగా ఉంటుంది. దీనినే ‘ధ్వజం’ అంటారు. పార్శ్వంగా ఉన్న రెండు ఆకర్షణ పత్రాలను ‘బహుపత్రాలు’ లేక ‘అలే’ అంటారు. పూర్వాంతంలో బాహువుల కింద ఉన్న రెండు పడవ ఆకార ఆకర్షణ పత్రాలను ‘ద్రోణి పత్రాలు’ అంటారు. ఇవి అవశ్యకాంగాలను కప్పి ఉంచుతాయి. అవరోహక పుష్పరచన చూపుతాయి.
కేసరావళి :
కేసరాలు పది, సాధారణంగా కేసరదండాలు సంయుక్తమై, ద్విబంధకంగా ((9) + 1) గాని (డాలికస్ పైసమ్) ఏకబంధకంగా గాని (క్రోటలేరియా) ఉండవచ్చు. పరాగకోశాలు ద్వికక్షికం, అంతరోన్ముఖం, నిలువు స్ఫోటనంలను చూపిస్తాయి.
అండకోశం :
ఏక ఫలదళయుతం, ఏకబిలయుత అండాశయం అర్థ నిమ్నం (క్రోటలేరియా) అనేక అండాలు ఉపాంత అండన్యాసం మీద రెండు నిలువు వరసల్లో అమరి ఉంటాయి. కీలం పొడవుగా ఉండి శీర్షం వద్ద వంపు తిరిగి ఉంటుంది. కీలాగ్రం సామాన్యం.
పరాగ సంపర్కం :
పరపరాగ సంపర్కం, పైసమ్, లథిరస్లలో ఆత్మపరాగ సంపర్కం. పరపరాగ సంపర్కము ఫిస్టన్ యాంత్రికము ద్వారా జరుగుతుంది. అరాఖిస్లో భూఫలనము అవిదారకము.
ఫలము : ద్వివిదారక ఫలం
విత్తనము : అంకురచ్ఛద సహితము, రెండు బీజ దళాలు, ప్రొటీన్లు కలిగి ఉంటాయి.
ప్రశ్న 2.
సొలనేసీకి చెందిన ముఖ్య లక్షణాల్ని వ్రాయండి.
జవాబు:
ఆకృతి :
ఏక వార్షికాలు లేక బహు వార్షిక గుల్మాలు, పొదలు (సెస్ట్రమ్)
ఆవాసం :
మధ్యరకపు మొక్కలు, సోలానం సూరతెన్స్
వేరు వ్యవస్థ :
తల్లి వేరు వ్యవస్థ
కాండము :
వాయుగతంగా, నిటారుగా పెరుగుతుంది. గుల్మాకారం, కాండంపై కేశాలు లేక ముళ్ళు ఉంటాయి. సొలానమ్ ట్యూబరోసమ్ భూగర్భంగా పెరిగే దుంపకాండం ఉంటుంది. పత్రవృతం కాండంతో ఆశ్లేషితం చూపిస్తుంది. కాండంలో ద్విసహ పార్శ్వ నాళికా పుంజాలు ఉంటాయి.
పత్రం :
పత్రాలు పుచ్ఛరహితం, వృంతసహితం, శాఖీయ భాగాలలో ఏకాంతరంగా ఉంటాయి. సాధారణంగా సరళ పత్రాలు లేదా తమ్మెలుగా చీలి ఉంటాయి. జాలాకార ఈనెల వ్యాపనం.
పుష్ప లక్షణాలు :
పుష్ప విన్యాసం :
సాధారణంగా గ్రీవస్థం లేదా శిఖరస్థం. నిశ్చిత పుష్ప విన్యాసం. సొలానమ్ జాతులలో గ్రీవస్థంగా ఏర్పడే వృశ్చికాకార సైమ్ దతూరలో శిఖరస్థం. ఏకాంతం, పొగాకులో పానికల్.
పుష్పం :
పుష్పాలు పుచ్ఛ సహితం లేదా పుచ్ఛరహితం, లఘు, పుచ్ఛరహితం, వృంతసహితం సంపూర్ణం, ద్విలింగకం పంచభాగయుతం, అండకోశాధస్థితం, సౌష్టవయుతం.
రక్షక పత్రావళి :
రక్షక పత్రాలు 5, సంయుక్తం, కవాటయుత పుష్పరచన. దీర్ఘకాలికం. ఉదా : సొలానమ్, కాప్సికమ్ ఆకర్షణ పత్రావళి : ఆకర్షణ పత్రాలు 5, సంయుక్తం, కవాటయుతం లేదా మెలితిరిగిన పుష్పరచన దతూర.
కేసరావళి :
కేసరాలు 5, మకుటదళోపరిస్థితం, ఆకర్షణ పత్రాలలో ఏకాంతరంగా ఉంటాయి. పరాగకోశాలు పెద్దవి. ద్వికక్షికం, పీఠసంయోజితం అంతర్ముఖం,
అండకోశం :
ద్విఫలదళ సంయుక్తం, అండాశయం ఊర్ధ్వం, సాధారణంగా ద్విబిలయుతం, కాప్సికమ్ ఏకబిలయుతం, ఉబ్బిన అండాన్యాసస్థానంపై అనేక అండాలు స్తంభ అండన్యాసంలో అమరి ఉంటాయి. అగ్రకీలం, కీలాగ్రం శీర్షాకారం. 45° కోణంలో మెలితిరిగి ఉంటాయి. దీనివల్ల అండాశయం ఏటవాలుగా ఉన్నట్లు అనిపిస్తుంది.
పరాగ సంపర్కం :
పుష్పాలు పుంభాగ ప్రథమోత్పత్తి చూపిస్తాయి కొన్ని సొలానమ్ జాతులలో స్త్రీ భాగ ప్రథమోత్పత్తి కనిపిస్తుంది. కీటక పరాగ సంపర్కం ద్వారా పరపరాగ సంపర్కం జరుగుతుంది.
ఫలము :
ఎక్కువ మృదుఫలం (కాప్సికమ్, సొలానమ్, లైకోపర్సికాన్) దతూర, నికోటియానాలలో పటభేదక గుళిక ఉంటుంది.
విత్తనం : విత్తనాలు అంకురచ్ఛదయుతం, బీజదళాలు రెండు.
ప్రశ్న 3.
లిలియేసి కుటుంబం గురించి తెలపండి.
జవాబు:
శాఖీయ లక్షణాలు :
ఆవాసం :
ఈ కుటుంబంలో మధ్యరకం మొక్కలు (ఆలియమ్, లిల్లియమ్) ఎడారి మొక్కలు (ఆస్పరాగస్, ఆలో) ఉంటాయి.
ఆకృతి :
ఎక్కువగా బహువార్షిక గుల్మాలు, డ్రసీనా, యుక్కా, అలో వంటి ప్రజాతులలో పొదలు, వృక్షాలుగా పెరిగే జాతులు ఉంటాయి. కొన్ని బలహీనంగా ఉండి ఎగబ్రాకే మొక్కలు (స్మైలాక్స్) కూడా ఉంటాయి.
వేరు వ్యవస్థ :
అబ్బురపు వేళ్ళు ఉంటాయి. ఆస్పరాగస్లో దుంపవేళ్ళు గుత్తులుగా (Fasiculated) ఉంటాయి.
కాండం :
అనేక జాతులలో కాండం బహు వార్షిక భూగర్భ కాండం. అది లశునంగా గాని (సిల్లా, ఆలియమ్, లిల్లియమ్), కొమ్ముగా గాని (గ్లోరియోసా లేదా కందంగా గాని (కాల్చికమ్) ఉండవచ్చు. గ్లోరియోసా, స్మైలాక్స్ వంటి మొక్కలలో నులి తీగలతో ఎగబ్రాకే బలహీన కాండం ఉంటుంది. ఎడారి మొక్కలైన ఆస్పరాగస్, రస్కస్లలో కాండం క్లాడోఫిల్లుగా రూపాంతరం చెందుతుంది.
పత్రం :
మూల సంబంధంగా గాని (ఆలియమ్, లిలియమ్) ప్రకాండ సంబంధంగాగాని(స్మైలాక్స్, గ్లోరియోసా) ఉంటాయి. పత్ర విన్యాసం సాధారణంగా ఏకాంతరంగా (గ్లోరియోసా పత్ర పుచ్ఛాలు ఉండవచ్చు లేదా ఉండకపోవచ్చు పత్రాలు వృంతయుతం, సరళపత్రాలు, సమాంతర ఈనెల వ్యాపనం, స్మైలాక్స్లో జాలాకార ఈనెల వ్యాపనం ఉంటుంది.
పుష్ప లక్షణాలు :
పుష్ప విన్యాసం :
ముఖ్యంగా అనిశ్చిత పుష్పవిన్యాసం ఉంటుంది. పుష్పవిన్యాసం, అగ్రస్థంగా గాని, గ్రీవస్థంగా గాని ఏర్పడుతుంది సామాన్య అనిశ్చితం (ఆస్పరాగస్) గా గాని గుచ్చంగా గాని (ఆలియమ్, స్మైలాక్స్) ఉంటుంది
పుష్పం :
సాధారణంగా పుష్పాలు, పుచ్చసహితం, లఘు పుచ్చరహితం, వృంతయుతం, సౌష్టవ యుతం, సంపూర్ణం, ద్విలింగకం సమపరిపత్రయుతం, త్రిభాగయుతం, అండకోశాధస్థితం, స్మైలాక్స్, రస్కస్లలో ఏకలింగక పుష్పాలుంటాయి.
పరిపత్రావళి :
పరిపత్రాలు ఆరు, వలయానికి మూడు చొప్పున రెండు వలయాలలో ఉంటాయి. అసంయుక్తంగా గాని (ఆలియమ్) సంయుక్తంగా గాని (ఆస్పరాగస్) ఉంటాయి. ఇవి ఆకర్షణ పత్రాలలాగే ఉంటాయి. వెలుపలి వలయంలోని ” చేరి పరిపత్రంలో పూర్వాంతంలో ఉంటుంది. లోపలి వలయంలోని బేసి పరిపత్రం పరాంతంలో ఉంటుంది. కవాటయుత పుష్పరచన.
కేసరావళి :
కేసరాలు ఆరు, వలయానికి మూడు చొప్పున రెండు వలయాల్లో ఉంటాయి. స్వేచ్ఛగా గాని, పరిపత్రో పరిస్థితం (epiphyllous) గాగాని ఉండవచ్చు. (ఆస్పరాగస్) పరాగకోశాలు ద్వికక్షికం, పీఠ సంయోజితం, అంతర్ముఖం, నిలువు స్పోటనం.
అండకోశం :
త్రిఫలదళ సంయుక్త అండకోశం, అండాశయం ఊర్ధ్వం, త్రిబిలయుతం, అనేక అండాలు స్తంభ అండాన్యాసంపై అమరి ఉంటాయి. అగ్రకీలం సామాన్యం, కురచగా ఉంటుంది. కీలాగ్రం శీర్షాకారం లేదా మూడుగా చీలి ఉంటుంది.
పరాగ సంపర్కం :
కీటక పరాగ సంపర్కం. పుష్పాల్లో పుంభాగ ప్రథమోత్పత్తి వల్ల గాని (ఆలియమ్) స్త్రీ భాగ ప్రథమోత్పత్తి (కాల్చికమ్) హెర్కోగమి వల్లగాని (గ్లోరియోసా) ఆత్మపరాగ సంపర్కం నిరోధించబడుతుంది.
ఫలం :
మృదు ఫలం గాని (ఆస్పరాగస్, స్మైలాక్స్) కక్ష్మా విదారక గుళికగాని (లిలియమ్) పటవిదారక గుళిక దాని (గ్లోరియోసా) ఉండవచ్చు.
విత్తనం :
ఏకబీజ దళయుతం, అంకురచ్ఛద సహితం, పిండం నిటారుగా గాని, ఒక్కొక్కసారి వంపు తిరిగి గాని ఉంటుంది. ఆలియమ్లో బహు పిండత (polyembryony) ఉంటుంది.
ప్రశ్న 4.
మొక్కలను వర్గీకరించడానికి అవసరమైన లక్షణాలను వ్రాయండి. వాటిని క్లుప్తంగా వివరించండి.
జవాబు:
శాఖీయ లక్షణాలు :
పీచువేరు వ్యవస్థ : కాండం పీఠభాగం నుండి వేర్లు గుంపుగా ఏర్పడతాయి.
ఉదా : ఏకదళబీజాలు
కాండము : వాయుగతము / భూగతము, నిటారుగా లేక సాగిలపడి పెరిగేవి, నులితీగలతో ఎగబాకేవి, కొక్కెములతో ఎగబాకే స్ట్రాగ్లర్స్, లయేనులు (దృఢంగా ఉండి ఎగబాకేవి) శాఖాయుతం లేక శాఖారహితము, ఆకుపచ్చ, గోధుమ లేక నలుపు వర్ణము.
పత్రము : ఉబ్బిన లేదా ఆచ్ఛాదన (కాండంను కప్పి ఉంచుతుంది)
పత్రపీఠం : పుచ్ఛసహిత – పుచ్చములు కలపత్రం
పత్రపుచ్చాలు : పుచ్ఛ సహిత – పుచ్చము లేని పత్రం
పత్రవృంతం : వృంతసహిత – వృంతం కల పత్రం
వృంతరహిత – వృంతం లేని పత్రం
పత్ర దళం : ఆకారము – అండాకారం / రేఖాకారము / మూత్రపిండాకారం, హృదయాకారము, బోలుగా, పొడవుగా ఉంటుంది.
ఈనెలవ్యాపనం : జాలాకార మధ్య ఈనె, పార్శ్వ ఈనెలు, చిరు ఈనెలు వల వలె ఉంటాయి – ద్విదళ బీజాలు
సమాంతర : మధ్య ఈనె నుండి వచ్చే పార్శ్వపు ఈనెలు అన్ని సమాంతరంగా ఉంటాయి. ఉదా : ఏకదళబీజాలు
పత్రరకము : సరళము – విభజన చెందని పత్రదళం కలది.
సంయుక్తము – పత్రదళం విభజనచెంది పత్రకాలుగా మారుతుంది.
పత్ర విన్యాసము : ఏకాంతర – ప్రతి కనుపు వద్ద 1 పత్రం ఏర్పడును
అభిముఖ – ప్రతికనుపు వద్ద 2 పత్రాలు ఏర్పడును
చక్రీయ – ప్రతి కనుపు వద్ద 2కన్నా ఎక్కువ పత్రాలు ఏర్పడి వలయాకారంలో ఉంటాయి.
సంపూర్ణ : 4 పుష్ప భాగాలు కల పుష్పము
అసంపూర్ణ : ఏదేని ఒక పుష్ప భాగం లోపించిన పుష్పము.
అచక్రీయ : పుష్ప భాగాలు సర్పిలాకారంలో అమరి ఉంటాయి.
చక్రీయ : పుష్ప భాగాలు వలయాకారంలో అమరి ఉంటాయి.
అర్థచక్రీయ : K, C లు వలయాకారంలో, A మరియు G లు సర్పిలాకారంలో ఉంటాయి.
లైంగికత : ద్విలింగ : రెండు లైంగిక అవయవాలు (A, G) ఉండుట ఏకలింగ, పురుష A మాత్రమే ఉన్న పుష్పము.
ఏకలింగ స్త్రీ – G మాత్రమే వున్న పుష్పము
అండకోశాధస్థితి : ఊర్ధ్వ అండాశయము
పర్యండకోశ : అర్ధ ఊర్ధ్వ అండాశయము
అండకోశాపరిస్థిత – నిమ్న అండాశయము
సంఖ్యాపరంగా : త్రిభాగయుత : ప్రతి వలయంలో 3 భాగాలు
చతుర్భాగయుత : ప్రతి వలయంలో 4 భాగాలు
పంచభాగయుత : ప్రతి వలయంలో 5 భాగాలు
సౌష్టవము : సౌష్టవయుతం, పాక్షిక సౌష్టవయుతము
రక్షక పత్రావళి : 3/ 4/5 అసంయుక్తము/సంయుక్తము, కవాటయుత పుష్పరచన / మెలితిరిగిన పుష్ప రచన
ఆకర్షణ పత్రావళి : సంఖ్య, అసంయుక్తమా / సంయుక్తమా, కవాటయుత/మెలితిరిగిన పుష్పరచన
కేసరావళి : 4/5/10/ అనేకము, ఏకబంధకము (ఒక కట్టగా ఉంటాయి)
ద్విబందకము : 2 సమూహాలుగా ఉంటాయి.
బహుబందకం : 2 కన్నా ఎక్కువ సమూహాలుగా ఉంటాయి.
ద్వి కక్ష్యయుత : 2 లంబికలు కల పరాగకోశము
ఏకకక్ష్యయుత : 1 లంబిక కల పరాగకోశము
పీఠసంయోజిత : కేసరదండం, పరాగకోశ పీఠభాగంలో అతుక్కుని ఉంటుంది.
పృష్ట సంయోజిత : కేసర దండం పరాగకోశము ప్రక్కన అతుక్కుని ఉంటుంది.
నిలువు స్ఫోటనము (నిలువుగా పగులుట) / అడ్డుస్ఫోటనం అడ్డంగా పగులుతాయి / రంధ్ర స్ఫోటనం అగ్రభాగంలో ఉన్న రంధ్రం ద్వారా పరాగరేణువులు విడుదలవుతాయి.
అండకోశము ఏకఫలదళయుత : అండాశయంలో ఒక ఫలదళం ఉంటుంది.
ద్విఫలదళయుత : అండాశయంలో 2 ఫలదళాలు ఉంటాయి.
త్రి ఫలదళయుత : అండాశయంలో 3 ఫలదళాలు ఉంటాయి. చతుర్భుజ ఫలదళయుత : అండాశయంలో 4 ఫలదళాలు ఉంటాయి. పంచ ఫలదళయుత : అండాశయంలో 5 ఫలదళాలు ఉంటాయి.
బహు ఫలదళయుత : అండాశయంలో 5 కన్నా ఎక్కువ ఫలదళాలు ఉంటాయి. సంయుక్తము : అన్ని ఫలదళాలు కలసి ఉంటాయి.
అసంయుక్తము : అన్ని ఫలదళాలు విడిగా ఉంటాయి.
ఊర్ధ్వ అండాశయము : K, C, A లు అండాశయం కిందనుండి ఏర్పడతాయి.
అర్ధఊర్ధ్వ అండాశయము : K, C, A లు అండాశయం మధ్య నుండి ఏర్పడతాయి.
నిమ్న అండాశయము : K, C, A లు అండాశయం పై నుండి ఏర్పడతాయి.
అండాన్యాసము : ఉపాంత : అండాలు అండాశయ అంచులలో ఉంటాయి.
అక్షయ : అండాలు అండాశయ మధ్యలో ఉంటాయి.
పీఠ : అండం అండాశయ పీఠంలో ఉంటాయి.
కీలము : కోనకీలము : అండాశయం పై నుంచి ఏర్పడును
పార్శ్వకీలము : అండాశయం ప్రక్కనుంచి ఏర్పడును
కీలాగ్రం : గుండ్రము / ద్విభాజితము / కేశయుతము
ప్రశ్న 5.
ఒక నమూనా పుష్పించే మొక్కను వర్గీకరణ శాస్త్ర దృష్టితో (Perspective) వివరించండి.
జవాబు:
మొక్కను వర్ణించేటప్పుడు ఆకృతి, ఆవాసము, శాకీయ లక్షణాలు, పుష్ప లక్షణాలు, తర్వాత ఫలంను వర్ణిస్తారు. మొక్క వివిధ భాగాలను వర్ణించిన తర్వాత పుష్పచిత్రం, పుష్ప సమీకరణం ఇవ్వబడుతుంది. పుష్పభాగాలను కొన్ని సంకేతాల ద్వారా పుష్పసమీకరణంలో చూపుతారు.
పుష్ప సంకేతంలో Br అనగా పుచ్చ సహితము, Ebr అనగా పుచ్చ రహితము, Brl లఘు పుచ్ఛ సహితము, Ebrl లఘు పుచ్ఛ రహితము, © – సౌష్టవయుతము, % – పాక్షికసౌష్టవయుతము, రే – పురుష పుష్పము, స్త్రీ – పుష్పము, ధే – ద్విలింగ పుష్పము, K- రక్షక పత్రావళి, C- ఆకర్షణ పత్రావళి, P- పరిపత్రము, A- కేసరావళి, G- అండకోశం, G – ఊర్ధ్వ అండాశయము, G – అర్థ ఊర్థ్వ అండాశయము – G నిమ్న అండాశయము అని సూచన పుష్పభాగాల సంఖ్య, సంయుక్తమా లేక అసంయుక్తమా, సంసంజనము లేక అసంజనమా, కూడా పుష్ప సంకేతంలో సూచిస్తారు.
పుష్ప చిత్రంలో ప్రధాన అక్షం వైపు ఉన్న పుష్ప భాగాన్ని పరాంతభాగం అని, ప్రధాన అక్షాన్ని ఒక చుక్కతో పుష్ప చిత్రంపైన సూచిస్తారు. రక్షక పత్రావళి, ఆకర్షణ పత్రావళి, కేసరావళి, అండకోశాలను ఏక కేంద్ర వలయాలుగా గీసి, రక్షక పత్రాలను వెలుపల వలయంలోను, మధ్యలో అండాశయం అడ్డుకోత పటం ద్వారా సూచిస్తారు. పుష్ప పుచ్ఛం, పుష్పం మొక్క పూర్వాంత భాగాన్ని సూచిస్తుంది. దీనిని పుష్ప చిత్రానికి పీఠం వైపు సూచిస్తారు.
ప్రశ్న 6.
బెంథామ్ మరియు హుకర్ల మొక్కల వర్గీకరణ గురించి వ్రాయండి.
జవాబు:
బెంథామ్ మరియు హుకర్లు పుష్పించే మొక్కలను డైకాటిలిడనే (ద్విదళబీజాలు), జిమ్నో స్పెర్మే (వివృత బీజాలు), మోనోకాటిలిడనే (ఏకదళ బీజాలు) అను 3 తరగతులగా విభజించారు. డైకాటిలిడనేను పొలిపెటాలే, గామోపెటాలే, మోనోక్లామిడే అనే 3 ఉపతరగతులుగాను, పాలీపెటాలేను థలామిఫ్లోరే 6 క్రమాలతో, డిసిప్లోరే 4 క్రమాలతో, కాలిసిస్లోరే 5 క్రమాలతో విభజించారు. గామోపెటాలేను ఇన్ఫెరే 3 క్రమాలతోను హెటిరోమిరే (3 క్రమాలతో) బైకార్పల్లేటె – 4 క్రమాలతోను మూడు శ్రేణులుగాను, మోనోక్లామిడేను 8 శ్రేణులుగాను విభజించారు.
మోనోకాటిలిడనేను ఏడు శ్రేణులుగాను విభజించారు. పుష్పించు మొక్కలన్నీ ఇప్పుడు కుటుంబాలుగా వ్యవహరించబడుతున్న 202 సహజ క్రమాలుగా సముదీకరించబడినాయి. వీటిలో 165 ద్విదళబీజాలుగాను, 3 వివృత బీజాలుగాను, 34 ఏకదళ బీజాలకు చెందుతాయి.
ప్రశ్న 7.
వర్గీకరణ శాస్త్రము అంటే ఏమిటి? మొక్కల వివిధ వర్గీకరణ రకాల గురించి సంక్షిప్తంగా వివరించండి.
జవాబు:
లక్షణాలను వర్ణించుట, గుర్తించుట, నామీకరణం, వర్గీకరణ అనే అంశాలను గురించి చదివే శాస్త్రంను వర్గీకరణ శాస్త్రం అంటారు. వర్గీకరణలు 3 రకాలు.
1) కృత్రిమ వర్గీకరణ వ్యవస్థలు (Artificial systems of classification) :
ఇవి సహజ సంబంధాలతో నిమిత్తం లేకుండా బాహ్య స్వరూపం, పోషణ విధానం వంటి సులువుగా పోల్చగలిగిన కొన్ని లక్షణాల ఆధారంగా చేసిన వర్గీకరణ వ్యవస్థలు.
ఉదా : i) మొక్కలను బాహ్య స్వరూపం ఆధారంగా గుల్మాలు, పొదలు, వృక్షాలుగా తన హిస్టోరియా ప్లాంటారమ్ అనే పుస్తకంలో ధియోఫ్రాస్టస్ చేసిన వర్గీకరణ.
ii) లిన్నేయస్ ప్రతిపాదించిన లైంగిక వర్గీకరణ.
2) సహజ వర్గీకరణ వ్యవస్థలు (Natural systems of classification) :
ఇవి వీలైనన్ని ఎక్కువ బాహ్య లక్షణాలను ఆధారంగా చేసుకొని, మొక్కలలో గల సహజ సంబంధాలకు ప్రాధాన్యతనిస్తూ చేసిన వర్గీకరణ వ్యవస్థలు
ఉదా : డీజస్సు (De Jussieu), డి కండోల్ (de Candolle), బెంథామ్-హూకర్ల (Bentham & Hooker) వర్గీకరణ.
3) వర్గ వికాసవ్యవస్థలు (Plylogenetic system) :
మొక్కలలోని పరిణామ క్రమ ప్రవృత్తులను పరిగణలోనికి తీసుకుని చేసిన వర్గీకరణ. ఈ వ్యవస్థలో ఆదిమ లక్షణాలు, పరిణతి చెందిన లక్షణాలు గుర్తించబడినాయి. ఒక టాక్సాన్ స్థాయిని పరిగణించేటప్పుడు అన్ని లక్షణాలను విపులంగా పరిగణలోనికి తీసుకుంటారు. “ది నేచురలిఖెన్ ఫ్లాంజన్ ఫెమిలియన్” గ్రంథంలో ఎంగ్లర్ & ప్రాంటల్ ప్రతిపాదించిన వ్యవస్థ. ఫామిలీస్ ఆఫ్ ప్లవరింగ్ ప్లాంట్స్ పుస్తకంలో హబిన్సన్ (1954) ప్రతిపాదించిన వ్యవస్థలు ఉదాహరణలు. ఆధునికమైన వర్గవికాస వ్యవస్థగా ఆంజియోస్పెర్మిక్ ఫైలోజెనిటిక్ గ్రూప్ (APG) ను చెప్పవచ్చు.