AP 7th Class Social Important Questions Chapter 11 రహదారి భద్రత

These AP 7th Class Social Important Questions 11th Lesson రహదారి భద్రత will help students prepare well for the exams.

AP Board 7th Class Social 11th Lesson Important Questions and Answers రహదారి భద్రత

ప్రశ్న 1.
రహదారి భద్రతా వారోత్సవాలు ఎప్పుడు, ఎందుకు నిర్వహిస్తారు?
జవాబు:
రహదారి భద్రతా వారోత్సవాలు :
భారతదేశంలోని రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రిత్వ శాఖ ప్రతి సంవత్సరం జనవరి నెలలో రోడ్డు భద్రతా వారోత్సవాలు నిర్వహిస్తుంది. రహదారి భద్రత, డ్రైవింగ్ నియమాలు మరియు హెచ్చరికలపై ప్రజలకు అవగాహన కల్పించడానికి మరియు మరణాలకు కారణమయ్యే రోడ్డు ప్రమాదాలను తగ్గించడానికి రహదారి భద్రతకు సంబంధించిన వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తారు.

ప్రశ్న 2.
రహదారి ప్రమాదం అని దేనిని చెప్పవచ్చు?
జవాబు:
రహదారులపై ప్రమాదాలు అనగా ఏదైనా ఆకస్మిక సంఘటన వలన వాహనం, లేదా ప్రయాణీకులు ప్రమాదవశాత్తు గాయపడటం లేదా మరణించడం మరియు భౌతిక ఆస్తులకు నష్టం కలగడం వంటివి. అధిక శాతం రహదారి ప్రమాదాలు మానవ తప్పిదం వల్లనే జరుగుతాయి. ఏదేమైనా ఇవి పూర్తిగా అరికట్టదగినవి.

ప్రశ్న 3.
ట్రాఫిక్ చిహ్నాలు ఎన్ని? అవి ఏవి?
జవాబు:
ట్రాఫిక్ చిహ్నాలను మూడు రకాలుగా విభజించవచ్చు. అవి :

  1. తప్పనిసరి గుర్తులు,
  2. సమాచార గుర్తులు,
  3. హెచ్చరిక గుర్తులు

AP 7th Class Social Important Questions Chapter 11 రహదారి భద్రత

ప్రశ్న 4.
క్రింద ఇచ్చిన చిహ్నాలను వాటి అర్ధాలతో జతపరచండి.
జవాబు:
AP 7th Class Social Important Questions Chapter 11 రహదారి భద్రత 1

ప్రశ్న 5.
రహదారి మార్కింగ్ (రోడ్డుపైన సూచించే) సంకేతాలు ఏవి? వాని ప్రయోజనమేమి?
జవాబు:
రహదారి మార్కింగ్ సంకేతాలు :
1. ఫుట్ పాత్ :
ఇది పాదచారులు నడవడానికి ఉద్దేశించబడింది. సిమెంట్ బ్లాక్స్ తో లేదా పెయింట్ చేయబడిన లైన్లతో వేరు చేయబడిన రహదారి భాగాలలో ఇది ఒకటి.
AP 7th Class Social Important Questions Chapter 11 రహదారి భద్రత 2

2. రోడ్డు డివైడర్ :
ఇది సిమెంట్ దిమ్మలతో లేదా పెయింట్ తో రోడ్డును రెండు లేదా అంతకంటే ఎక్కువ భాగాలుగా విభజించడానికి ఏర్పాటు చేయబడుతుంది. రోడ్డు డివైడర్ యొక్క ముఖ్య ఉద్దేశ్యం ట్రాఫిక్ గందరగోళం మరియు రోడ్డు ప్రమాదాలను నివారించడం.
AP 7th Class Social Important Questions Chapter 11 రహదారి భద్రత 3

3. జీబ్రా క్రాసింగ్ :
ఇవి రోడ్డుకు సమాంతరంగా చిత్రించిన ప్రత్యామ్నాయ నలుపు మరియు తెలుపు చారలు, సాధారణంగా వీటిని జీబ్రా క్రాసింగ్ అని పిలుస్తారు. ఇది పాదచారులు రోడ్డును ఒక వైపు నుండి మరొక వైపుకు దాటడానికి ఉద్దేశించబడింది.
AP 7th Class Social Important Questions Chapter 11 రహదారి భద్రత 4

ప్రశ్న 6.
ప్రమాదాలను నివారించడానికి డైవరకు ఎలాంటి సలహాలు ఇవ్వవలెను?
జవాబు:
డైవరు సలహాలు :

  1. రహదారికి ఎడమ వైపున ఉండి కుడివైపున వేగంగా వెళ్లే వాహనాలకు దారి వదలాలి.
  2. ఎడమవైపు నుంచి వాహనాలను దాటరాదు.
  3. రక్షిత ప్రయాణానికి ఎల్లప్పుడూ హెల్మెట్ ధరించాలి.
  4. తక్కువ కార్బన్ మోనాక్సైడ్ వదిలే వాహనాలనే ఉపయోగించాలి.
  5. అనవసరంగా హారన్ మోగించరాదు.
  6. భారీ వాహనదారులు తప్పనిసరిగా సీటు బెల్టులు ఉపయోగించాలి.
  7. ట్రాఫిక్ సిగ్నలను అతిక్రమించరాదు.
  8. తమ వాహనాన్ని మంచి స్థితిలో ఉంచుకోవాలి.

ప్రశ్న 7.
రోడ్డు నియమ నిబంధనలు అంటే ఏమిటో మీ తరగతి గదిలో చర్చించండి.
జవాబు:

  1. రోడ్డు నియమ నిబంధనలు అనగా రోడ్డుపై వెళ్ళువారు తప్పనిసరిగా పాటించాల్సిన జాగ్రత్తలు.
  2. అలా పాటించకపోతే ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది.
  3. కారణం జనాభా విపరీతంగా పెరగడం వలన, రోడ్లు ఇరుకుగా ఉండటం వలన, రోడ్డు పైకి వచ్చే వారి సంఖ్య పెరుగుతుంది కాబట్టి ప్రమాదాల సంఖ్య పెరుగుతుంది.
  4. రోడ్డు పైకి వచ్చేవారు ఎవరికి ఇష్టం వచ్చిన రీతిలో వారు త్వరగా వెళ్ళాలి అనే భావంతో ప్రయాణించడం వలన ప్రమాదాల సంఖ్య పెరుగుతుంది.
  5. రోడ్డు ప్రమాదాలను నివారించాలంటే రోడ్డుపైకి వచ్చేవారు కొన్ని నియమ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలి. దానితో ప్రమాదాలను నివారించటానికి అవకాశం ఉంటుంది.

AP 7th Class Social Important Questions Chapter 11 రహదారి భద్రత

ప్రశ్న 8.
ట్రాఫిక్ గుర్తులను ఒకవేళ ఎవరైనా పాటించకుండా వెళితే ఏమవుతుంది?
జవాబు:

  1. ట్రాఫిక్ గుర్తులను పాటించకపోవడం వలన ప్రమాదాలు జరగటానికి అవకాశం ఉంటుంది.
  2. ప్రమాదాలు ఒక్కొక్కసారి తీవ్ర గాయాలకు, అంగ వైకల్యానికి దారితీయవచ్చు.
  3. ఘోర ప్రమాదాలు జరిగి విలువైన ప్రాణాలను కోల్పోవటానికి అవకాశం ఉంటుంది.
  4. ట్రాఫిక్ గుర్తులను పాటించకపోవడం వలన మనకు మాత్రమేగాక ఎదుటివారికి కూడా హాని జరగవచ్చు.
  5. విలువైన వాహనాలు దెబ్బతింటాయి.
  6. అందువల్ల ట్రాఫిక్ గుర్తులను పాటిస్తూ మన ప్రాణాలను కాపాడుకుంటూ, ఎదుటివారి ప్రాణాలకు కూడా రక్షణ కల్పిస్తే మానవ జీవితానికి సార్థకత చేకూరుతుంది.

ప్రశ్న 9.
రోడ్డు భద్రతకుగాను సమాజంలోని వివిధ వర్గాల వారు తీసుకోవాల్సిన చర్యలను సూచించండి (సమాచార నైపుణ్యాలు).
జవాబు:
రోడ్డు భద్రతకుగాను సమాజంలోని వివిధ వర్గాల వారు తీసుకోవాల్సిన చర్యలు :
డ్రైవర్ తీసుకోవాల్సిన చర్యలు :

  1. ఎడమవైపున ఉండి కుడివైపున వేగంగా వెళ్లే వాహనాలకు దారి వదలాలి.
  2. ఎడమవైపు నుంచి వాహనాలను దాటరాదు.
  3. రక్షిత ప్రయాణానికి ఎల్లప్పుడూ హెల్మెట్ ధరించాలి.
  4. తక్కువ కార్బన్ మోనాక్సెడ్ వదిలే వాహనాలనే ఉపయోగించాలి.
  5. అనవసరంగా హారన్ మోగించరాదు.
  6. భారీ వాహనదారులు తప్పనిసరిగా సీటు బెల్టులు ఉపయోగించాలి.
  7. ట్రాఫిక్ సిగ్నలను అతిక్రమించరాదు.
  8. తమ వాహనాన్ని మంచి స్థితిలో ఉంచుకోవాలి.
  9. ఆల్కహాల్ సేవించి వాహనాలను నడపరాదు.
  10. డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలను నడపరాదు.

పాదచారులు పాటించాల్సిన నిబంధనలు :

  1. పాదచారులకు నిర్దేశించిన మార్గంలోనే నడవాలి. ఒకవేళ అలాంటి ప్రత్యేక మార్గం లేకుంటే, రోడ్డు ఇరుకుగా ఉంటే రోడ్డుకు కుడివైపునే ఎదురుగా వస్తున్న వాహనాలను పరిశీలిస్తూ నడవాలి.
  2. రాత్రివేళ బయట రోడ్డుపై నడుస్తున్నప్పుడు తప్పనిసరిగా ప్రతిబింబించే దుస్తులను ధరించాలి.
  3. రాత్రివేళల్లో నడిచేటప్పుడు విధిగా టార్చిలైట్ దగ్గర ఉంచుకోవాలి.
  4. రోడ్డును దాటునపుడు ఎడమవైపు, కుడివైపు చూసి వాహనాలు రాకుండా ఉన్నప్పుడు దాటాలి.
  5. ఒకవేళ వాహనాలు రెండు వైపులా, వస్తూ ఉంటే అవి వెళ్లే వరకు వేచి ఉండాలి.
  6. వాహనాలు రాకుండా ఉన్నప్పుడు వేగంగా నడుచుకుంటూ రోడ్డును దాటాలి. రెండు వైపులా వాహనాలు వస్తున్నాయో లేదో గమనించాలి.
  7. రోడ్డును దాటుటకు జీబ్రా క్రాసింగ్ ను ఉపయోగించాలి.
  8. రోడ్డుపై నడుస్తున్నప్పుడు, రోడ్డును దాటుతున్నప్పుడు మొబైల్ ఫోన్ ను ఉపయోగించరాదు.
  9. ట్రాఫిక్ పోలీస్ సహాయంతో రోడ్డును దాటాలి.

ప్రశ్న 10.
రహదారి భద్రతా విద్యను నిర్వచించండి. దాని లక్ష్యాలు ఏమిటి?
జవాబు:

  1. పిల్లలు మరియు యువతకు రహదారిపై బాధ్యతాయుతంగా ప్రవర్తించేలా అవగాహన కల్పించే విధానాన్ని “రహదారి భద్రతా విద్య” అంటారు.
  2. సమర్థవంతమైన రహదారి భద్రతా విద్య విద్యార్థులకు ట్రాఫిక్ కు సంబంధించిన జ్ఞానాన్ని, నైపుణ్యాలను, వైఖరులను, పెంపొందించుకోవడానికి కావలసిన అవకాశాలను ఏర్పరుస్తుంది.
  3. దీనివల్ల వారికి ట్రాఫిక్ గురించిన అవగాహన, సురక్షితమైన నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం ఏర్పడుతుంది.
  4. మంచి ట్రాఫిక్ వాతావరణం ఏర్పడుతుంది.
  5. ఇవి వేగ పరిమితులు, మద్యపానం మరియు డ్రైవింగ్ నియమాలు, ట్రాఫిక్ సంకేతాలు మరియు రోడ్ మార్కింగ్ సంకేతాలు వంటి నియంత్రణ వ్యవస్థలకు సంబంధించినవి.

ప్రశ్న 11.
సిగ్నల్స్ వ్యవధి వేర్వేరు ప్రదేశాల్లో వేర్వేరుగా ఉండవచ్చు. ఎందుకు?
జవాబు:
సిగ్నల్స్ వ్యవధి వేర్వేరు ప్రదేశాల్లో వేర్వేరుగా ఉండటానికి కారణం ఆయా రహదారి కూడళ్ళలోని వాహన రద్దీ. వాహనాల రద్దీ ఎక్కువగా ఉన్నట్లయితే సిగ్నల్స్ వ్యవధి ఎక్కువగాను, వాహనాల రద్దీ తక్కువగా ఉన్నట్లయితే సిగ్నల్స్ వ్యవధి తక్కువగాను ఉంటుంది.

ప్రశ్న 12.
డ్రైవింగ్ లైసెన్స్ పొందే విధానం మరియు అవసరమైన పత్రాల గురించి మీ తల్లిదండ్రులు లేదా ఉపాధ్యాయులతో చర్చించండి.
జవాబు:
డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలను నడపరాదు. ఇది ఎవ్వరికీ మినహాయింపు కాదు.
డ్రైవింగ్ లైసెన్స్ రకాలు :
1) లెర్నర్ లైసెన్స్ :
ఇది తాత్కాలికమైనది. డ్రైవింగ్ నేర్చుకొనుటకు ఆరు నెలల కాల పరిమితితో దీనిని జారీ చేస్తారు.

2) శాశ్వత లైసెన్స్ :
తాత్కాలిక లైసెన్స్ జారీ చేసిన ఒక నెల తరువాత నుంచి శాశ్వత లైసెన్స్ పొందుటకు అర్హత లభిస్తుంది. డ్రైవింగ్ లైసెన్స్ ఇచ్చేటప్పుడు డ్రైవింగ్ చేసే విధానం అంతా పరిశీలించి ఇస్తారు కాబట్టి రోడ్డుపై వాహనాలు నడిపేవారికి డ్రైవింగ్ వచ్చి ఉండాలి మరియు డ్రైవింగ్ విధి విధానాలు తెలిసి ఉండాలి. కావున రోడ్డుపై వాహనాలు నడుపువారికి డ్రైవింగ్ లైసెన్స్ తప్పనిసరి.

లెర్నర్ లైసెన్స్ పొందుటకు అవసరమైన ధృవపత్రాలు :

  1. నివాస ధృవీకరణ (రేషన్ కార్డు, విద్యుత్ బిల్లు, ఓటరు గుర్తింపు కార్డు, ఆధార్ కార్డు, పాస్పోర్టు).
  2. వయస్సు ధృవీకరణ (పాస్పోర్టు, పాఠశాల ధృవీకరణ, బర్త్ సర్టిఫికేట్, ఆధార్, పాన్ కార్డు) మొ||నవి.
  3. ఫారం 1, 1ఎ, 2, 3లను నింపి అవసరమైన ఫోటోలతో సమర్పించాలి.

శాశ్వత లైసెన్స్ :
ఈ లైసెన్ను లెర్నర్ లైసెన్స్ పొందిన 30 రోజుల తరువాత నుంచి 180 రోజుల లోపుగా దరఖాస్తు చేసుకున్న వారికి నిర్ణీత పరీక్షలు నిర్వహించి శాశ్వత లైసెన్స్ జారీ చేస్తారు.

AP 7th Class Social Important Questions Chapter 11 రహదారి భద్రత

ప్రశ్న 13.
డైవింగ్ చేసేటప్పుడు డైవర్ తనతో ఉంచుకోవలసిన పత్రాలను తెలుసుకోవడానికి ప్రయత్నించండి.
జవాబు:
డ్రైవర్ తనతో ఉంచుకోవలసిన పత్రాలు :
i) డ్రైవింగ్ లైసెన్స్.
ii) వాహన రిజిస్ట్రేషన్ (‘సి’ బుక్).
iii) వాహనం యొక్క ఇన్సూరెన్స్ పత్రం.
iv) వాహనం యొక్క కాలుష్యరహిత ధృవపత్రం.

ప్రశ్న 14.
గ్రామీణ ప్రాంతాలలో రహదారి ప్రమాదాలకు కారణమేమి?
జవాబు:

  1. రహదారులపై గేదెలు, మేకలు, గొర్రెలు వంటి జంతువులను యథేచ్చగా వదిలివేయుట.
  2. దమ్ము చక్రాలతో ట్రాక్టర్లను నడుపుట.
  3. ప్రొక్లెనర్ వంటి భారీ వాహనాల వినియోగం వలన ఏర్పడే గుంటలు.
  4. రహదారులకు ఇరువైపుల, మూలల్లో గడ్డివాములను, చెత్తా చెదారాలను పోగుగా చేయుట.
  5. గ్రామీణ ప్రాంతాలలో ఏర్పాటు చేసే సంతలు మార్కెట్ల వల్ల ఏర్పడే రద్దీ.
  6. రోడ్ల మీద ధాన్యపు కుప్పలు ఎండబెట్టుట.

ప్రశ్న 15.
పట్టణ ప్రాంతాలలో రహదారి ప్రమాదాలకు కారణమేమి?
జవాబు:

  1. అతివేగం మరియు నిర్లక్ష్యంగా వాహనం నడపడం.
  2. మద్యం సేవించి వాహనం నడపడం.
  3. డ్రైవింగ్ చేస్తూ చరవాణిని ఉపయోగించుట.
  4. డ్రైవర్ పరధ్యానంగా ఉండటం.
  5. రహదారి సంకేతాలను అతిక్రమించటం.
  6. సీట్ బెల్టులు మరియు హెల్మెట్లు ధరించడం వంటి భద్రతా చర్యలను పాటించకపోవడం.
  7. సరైన విధంగా డ్రైవింగ్ చేయకపోవడం మరియు తప్పుడు పద్ధతిలో వాహనాలను అధిగమించడం.

ప్రశ్న 16.
రహదారి ప్రమాదాల యొక్క పర్యావసానాలు తెలియజేయండి.
జవాబు:

  1. తాత్కాలిక లేదా శాశ్వత అంగ వైకల్యం సంభవించవచ్చు.
  2. ప్రాణాపాయ స్థితి రావొచ్చు.
  3. ప్రాణాలు కోల్పోయినచో, వారిపై ఆధారపడిన కుటుంబం ఛిన్నాభిన్నమవుతుంది.
  4. అవయవాలు కోల్పోయినచో, వారి జీవనాధారంపై అధిక ప్రభావం పడుతుంది.
  5. కుటుంబ సభ్యులు అనాథలుగా మారతారు లేదా కుటుంబాలు విచ్చిన్నం అవుతాయి.

ప్రశ్న 17.
పాదచారులు, రోడ్డును వినియోగించేటపుడు భద్రతకు ఎలాంటి చర్యలు తీసుకోవాలి?
జవాబు:

  1. రహదారులపై నడిచేటపుడు ఎల్లప్పుడు ఫుట్పాలను వినియోగించడం వలన పాదచారులు రోడ్డు అంచుల నుండి దూరంగా ఉండటం తద్వారా ఏదైనా వాహనం ఢీ కొట్టి వెళ్ళే ప్రమాదాన్ని నివారించవచ్చు.
  2. ఎదురుగా వాహనాలు వచ్చే విధంగా ఉన్న రోడ్డు వైపున పూర్తిగా చివరి అంచున నడవడం వలన పొరపాటున జరగబోయే ప్రమాదాల నుండి తప్పించుకునే అవకాశం ఉంటుంది.
  3. తెరిచివున్న డ్రైనేజీ కాలువలు, గుంతలు, పండ్లు మరియు కూరగాయల తొక్కల వంటి వాటిని గమనించాలి.

ప్రశ్న 18.
రహదారి భద్రతా విద్య యొక్క ప్రాముఖ్యతను రాయండి.
జవాబు:
రహదారి భద్రతా విద్య యొక్క అవసరం మరియు ప్రాముఖ్యత :

  1. అవగాహనా రాహిత్యం మరియు అజాగ్రత్త మున్నగు ఇతర కారణాల వల్ల ప్రజలు ఎక్కువగా ప్రమాదాలకు గురియగుచున్నారు. ప్రధానంగా రోడ్డును ఎక్కువగా ఉపయోగించే సమూహం యుక్త వయస్కులు.
  2. రహదారి భద్రతా చర్యలను స్పష్టంగా బోధించడం అవసరం. ప్రమాదాలను నివారించడానికి మాత్రమే కాకుండా సురక్షితమైన మరియు సౌకర్యవంతమైన రహదారి వినియోగానికి కూడా ఇది అవసరమే.
  3. రహదారి భద్రతా విద్య అవగాహన రోడ్డును ఉపయోగించే ప్రతి ఒక్కరి బాధ్యత.
  4. రహదారి భద్రతా నియమాలు పాటించడం ద్వారా మనం సుఖంగా ఉండటమే కాకుండా తోటి ప్రయాణీకులను కూడా సుఖంగా ఉంచవచ్చును.

AP 7th Class Social Important Questions Chapter 11 రహదారి భద్రత

ప్రశ్న 19.
కెర్ట్ డ్రిల్ రోడ్డు దాటడంలో ఆచరించాల్సిన పద్ధతి ఏది?
జవాబు:
కెర్చ్ డ్రిల్ : చిన్నపిల్లలు రహదారిని దాటుటకు ఆచరించాల్సిన పద్ధతి

  1. కాలిబాట అంచు వద్ద ఆగాలి.
  2. మీ కుడి చేతి వైపు చూడాలి.
  3. మీ ఎడమ చేతి వైపు చూడాలి.
  4. మళ్లీ మీ కుడి చేతి వైపు గమనించాలి.
  5. రహదారులపై వాహనాలు లేనప్పుడు రోడ్డు వెంబడి నేరుగా నడవాలి. పరిగెత్తకూడదు.
  6. ఎదురుగా ఏవైనా వాహనాలు వస్తున్నాయేమో గమనించాలి. డ్రైవర్ మిమ్మల్ని గమనించేట్లుగా రోడ్డు దాటండి. అవకాశం ఉన్నచోట రోడ్డు దాటడానికి సబ్ వేలను మరియు ఓవర్ బ్రిడ్జిలను ఉపయోగించండి.

మీకు తెలుసా?

7th Class Social Textbook Page No. 121

ట్రామా కేర్ :
స్వల్ప లేక తీవ్ర గాయాలపాలైన క్షతగాత్రులకు హాస్పిటల్ కి తీసుకువెళ్ళిన వెంటనే ఇచ్చే తక్షణ చికిత్స.

ప్రథమ చికిత్స :
ప్రమాదానికి గురైన వ్యక్తికి పూర్తి వైద్య సహాయం అందేలోగా ఇచ్చే ప్రాథమిక వైద్యం.

7th Class Social Textbook Page No. 123

బ్రీత్ ఎనలైజర్ :
మద్యం తాగి వాహనాలు నడిపే వ్యక్తులను గుర్తించడానికి ఉపయోగించే పరికరం

స్పీడ్ గన్ కెమేరా :
రహదారి నియమాలను ఉల్లంఘించి అతివేగంగా ప్రయాణించే వాహనాల వేగాన్ని కొలిచే పరికరం.
AP 7th Class Social Important Questions Chapter 11 రహదారి భద్రత 8

7th Class Social Textbook Page No. 125

AP 7th Class Social Important Questions Chapter 11 రహదారి భద్రత 9
రహదారి భద్రతా వారోత్సవాలు :
భారతదేశంలోని రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రిత్వ శాఖ ప్రతి సంవత్సరం జనవరి నెలలో రోడ్డు భద్రతా వారోత్సవాలు నిర్వహిస్తుంది. రహదారి భద్రత, డ్రైవింగ్ నియమాలు మరియు హెచ్చరికలపై ప్రజలకు అవగాహన కల్పించడానికి మరియు మరణాలకు కారణమయ్యే రోడ్డు ప్రమాదాలను తగ్గించడానికి రహదారి భద్రతకు సంబంధించిన వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తారు.

AP 7th Class Social Important Questions Chapter 11 రహదారి భద్రత

7th Class Social Textbook Page No. 135

1. రహదారి భద్రతా క్లబ్ :
రహదారి భద్రతా క్లబ్ లాంఛనంగా జనవరి 2010లో మొదట ఢిల్లీలో ప్రారంభించబడింది. ఈ క్లబ్ ఏర్పాటు వెనుక లక్ష్యం ఏమనగా రహదారి భద్రతా కార్యకలాపాలలో పాఠశాలలను చురుకుగా భాగస్వామ్యం చేయడం మరియు వారిని భద్రతా కార్యకలాపాలలో పాల్గొనేలా చూడటం.

మీ పాఠశాలలో రహదారి భద్రతా క్లబ్ ను ఏర్పాటు చేయండి. ఈ క్లబ్ ద్వారా ఏమేమి కార్యక్రమాలు నిర్వహించాలో చర్చించండి.

2. మోటారు వాహనాలు నడపడానికి కనీస వయోపరిమితి 18 సంవత్సరాలు.
రవాణా వాహనాలు నడపడానికి కనీస వయో పరిమితి 25 సంవత్సరాలు.