AP Board 4th Class EVS Solutions 2nd Lesson హరిత ప్రపంచం

Andhra Pradesh AP Board 4th Class EVS Solutions 2nd Lesson హరిత ప్రపంచం Textbook Exercise Questions and Answers.

AP State Syllabus 4th Class EVS Solutions Lesson 2 హరిత ప్రపంచం

I. విషయావగాహన :

ప్రశ్న 1.
మొక్కల వలన కలిగే ఉపయోగాలను గురించి రాయండి.
జవాబు.

  1. మొక్కలు చెట్లు ప్రకృతి మనకు ప్రసాదించిన వరం.
  2. మొక్కలు మనకు స్వచ్ఛమైన గాలిని ప్రసాదిస్తాయి.
  3. మొక్కలు మనకు ఆహారాన్ని ఇస్తాయి.
  4. కొన్ని రకాల మొక్కలు ఔషధాలుగా ఉపయోగపడతాయి.
  5. చెట్లు మనకు నీడను ఇస్తాయి.

ప్రశ్న 2.
భూమి మీద పెరిగే మొక్కలకు, నీటి మొక్కలకు కొన్ని ఉదాహరణలనివ్వండి.
జవాబు.
నేలపై పెరిగే మొక్కలు :
వేప, రావి, మామిడి, చింత, పైన్, ఓక్ మొదలైనవి నేల మీద పెరిగే మొక్కలు.

నీటి మొక్కలు :
నీటిలో పెరిగే మొక్కలను నీటి మొక్కలు అంటారు.
ఉదా : గుర్రపు డెక్క, డ్వ డ్, కలువ, తామర, హైడ్రిల్లా, టేప్ గ్రాస్, మొదలైనవి.

ప్రశ్న 3.
మీ పరిసరాలలోని కొన్ని ఎడారి మొక్కలు గురించి రాయండి.
జవాబు.
బ్రహ్మజెముడు, నాగజెముడు, ఎలోవీరా మొదలైనవి మన పరిసరాలలో ఉండే కొన్ని ఎడారి మొక్కలు. ఎడారి మొక్కలు వాటి దళసరి కాండాలలో వీటిని నిల్వ చేసుకుంటాయి.

AP Board 4th Class EVS Solutions 2nd Lesson హరిత ప్రపంచం

II. ప్రశ్నించడం – పరికల్పనలు చేయడం:

ప్రశ్న 4.
మీ గ్రామంలోని ఎవరైనా తోటమాలిని వివిధ రకాలైన మొక్కలను గురించి తెలుసుకోవడానికి ఏయే ప్రశ్నలు వేస్తావు?
జవాబు.

  1. ఈ తోటలో ఎడారి మొక్కలు ఏవి ?
  2. ఏఏ మొక్కలు పర్వత ప్రాంతాలో పెరుగుతాయి?
  3. ఏఏ మొక్కలు తల్లివేర్లను (బలమైన వేర్లను) కలిగి ఉంటాయి?
  4. గబురు వేర్లను కలిగి ఉండే మొక్కలు ఏవి? –

III. ప్రయోగాలు – క్షేత్ర పరిశీలనలు:

ప్రశ్న 5.
దగ్గరలోని పార్కుకు లేదా నర్సరీకి పిల్లలను తీసుకొని వెళ్ళండి. వారిని వీలయినవన్ని మొక్కలను, పుష్పాలను గుర్తించి, వాటి పేర్లను రాయమని చెప్పండి.
జవాబు.
మొక్కలు/వృక్షాలు :
వేప, తులసి, గులాబి, మామిడి, నాగజెముడు, సపోట, రావి, మందార, నిమ్మ ఆలోవీరా, బంతి, చేమంతి మొదలైనవి.
పుష్పాలు :
గులాబి, మల్లె, లిల్లీ, మందార, తులిప్, బంతి పువ్వు, ఛామంతి మొదలైనవి.

IV. సమాచార నైపుణ్యాలు – ప్రాజెక్టులు:

ప్రశ్న 6.
మొక్కలలోని కాండాన్ని బట్టి వేరు వేరు రకాలైన మొక్కల వివరాలతో ఒక చార్టును తయారుచేసి మీ తరగతి గదిలో ప్రదర్శించండి.
జవాబు.

AP Board 4th Class EVS Solutions 2nd Lesson హరిత ప్రపంచం 1

AP Board 4th Class EVS Solutions 2nd Lesson హరిత ప్రపంచం

V. బొమ్మలు గీయడం – నమునాలు తయారు చేయడం:

ప్రశ్న 7.
రంగు కాగితాలతో పుష్పాలను తయారు చేసి వాటితో మీ తరగతి గదిని అలంకరించండి.
జవాబు.
విద్యార్ధి కృత్యం.

VI. ప్రశంస:

ప్రశ్న 8.
ఒక పుష్పించే మొక్కను మీ ఇంటిలో పెంచండి. దాని పెరుగుదలను నోటుపుస్తకంలో రాసి స్నేహితులతో చర్చించండి.
జవాబు.
విద్యార్ధి కృత్యం.

మనం చేద్దాం : మొక్కలు ఉండే ప్రదేశాన్ని బట్టి, మొక్కల పేర్లను రాయండి.

నీటి మొక్కలు భూమిపై పెరిగే మొక్కలు
డక్ వీక్ మామిడి
గుర్రపు డెక్క చింత
కలువ రావి
తామర మర్రి
హైడ్రిల్లా వేప
టేప్ గ్రాస్ గ్రాసి

 

ఆలోచించండి – చర్చించండి: (TexttBook Page No.16)

ప్రశ్న 1.
మొక్కలలో ఏ భాగం నిన్ను ఎక్కువగా ఆకర్షిస్తుంది?
జవాబు.
మొక్కలలో పుష్పం నన్ను ఎక్కువగా ఆకర్షిస్తుంది.

ప్రశ్న 2.
పుష్పాలను మనం ఎలా ఉపయోగిస్తామో మీకు తెలుసా ?
జవాబు.

  1. పుష్పాలను అలంకరణ కోసం ఉపయోగిస్తాము.
  2. మందార, వేప మరియు తులసి లను ఔషధాల తయారీలో ఉపయోగిస్తాము.
  3. గులాబి, మల్లె, లిల్లి మరియు లావెండర్ పుష్పాలను సెంట్లు, సౌందర్య తైలాల తయారీలో ఉపయోగిస్తాము.
  4. కాలిఫ్లవర్ లాంటి పువ్వులను ఆహారంగా తీసుకుంటాము.

AP Board 4th Class EVS Solutions 2nd Lesson హరిత ప్రపంచం

అదనపు ప్రశ్నలు:

ప్రశ్న 1.
నేల మొక్కలు అని వేటిని’ అంటారు ? ఉదాహరణలు రాయండి.
జవాబు.
నేల పై పెరిగే మొక్కలను నేల మొక్కలు అంటారు.
ఉదా : మర్రి, రావి, మామిడి, చింత, వేప, మొదలైనవి.

ప్రశ్న 2.
నీటి మొక్కలు అని వేటిని అంటారు? ఉదాహరణలు రాయండి.
జవాబు.
నీటిలో పెరిగే మొక్కలను నీటి మొక్కలు అంటారు.
ఉదా : డ్వడ్, గుర్రపు డెక్క, కలువ, తామర, హైడ్రిల్లా, టేప్ గ్రాస్ మొదలైనవి.

ప్రశ్న 3.
మొక్కను ఎన్ని వ్యవస్థలుగా విభజించవచ్చు? అవి ఏవి?
జవాబు.
మొక్కలను రెండు వ్యవస్థలుగా విభజించవచ్చు.

  1. వేరు వ్యవస్థ
  2. ప్రకాండ వ్యవస్థ.

AP Board 4th Class EVS Solutions 2nd Lesson హరిత ప్రపంచం

ప్రశ్న 4.
వేరు వ్యవస్థ, ప్రకాండ వ్యవస్థ అంటే ఏమిటి?
జవాబు.
వేరు వ్యవస్థ : నేల లోపల పెరిగే మొక్క యొక్క భాగాన్ని వేరు వ్యవస్థ అంటారు.
ప్రకాండ వ్యవస్థ : నేలకు పైన పెరిగే మొక్క భాగాన్ని ప్రకాండ వ్యవస్థ అని అంటారు.

ప్రశ్న 5.
వేర్ల వలన మొక్కకు కలిగే ఉపయోగం ఏమిటి?
జవాబు.
వేర్లు మొక్కను నేలలో గట్టిగా పట్టి ఉంచి నేల నుండి పోషకాలను గ్రహిస్తాయి.

ప్రశ్న 6.
వివిధ రకాల వేర్లను ఉదాహరణలు వివరించండి.
జవాబు.
మొక్కలో రెండు రకాల వేర్లు ఉంటాయి.
(1) తల్లి వేరు :
తల్లి వేరు ఒక బలమైన ప్రధాన వేరును కలిగి ఉంటుంది. ఇది నేలలోకి లోతుగా ‘చొచ్చుకుపోతుంది. ప్రధాన వేరుకి అన్ని వైపులా సన్నని వేర్లు పెరుగుతాయి.
ఉదా : వేప, చింత మొదలైనవి.

(2) గుబురు లేదా పీచు వేర్లు :
గుబురు వేర్లు గుబురుగా పెరుగుతాయి. కాండం అడుగు భాగం నుండి అనేక సన్నని చిన్న వేర్లు గుబురుగా పెరుగుతాయి.
ఉదా : వరి, జొన్న, మొక్కజొన్న మొదలైనవి.

AP Board 4th Class EVS Solutions 2nd Lesson హరిత ప్రపంచం

ప్రశ్న 7.
వేర్లు మనకు ఏవిధంగా ఉపయోగపడతాయి?
జవాబు.

  1. క్యారెట్, బీట్ రూట్, ముల్లంగి మొదలైన వేర్లను ఆహారంగా తీసుకుంటాము.
  2. వట్టివేర్లను వేసవిలో చల్లదనం కోసం ఉపయోగించే కూల్ మ్యాట్లో ఉపయోగిస్తారు.
  3. లెమన్ గ్రాస్ వేర్లను సువాసన తైలాలలోను, దోమలను తరిమే పదార్ధాలలోను ఉపయోగిస్తారు.

ప్రశ్న 8.
మందార పుష్పం పటం గీచి భాగాలను గుర్తించండి.
జవాబు.

AP Board 4th Class EVS Solutions 2nd Lesson హరిత ప్రపంచం 2

ప్రశ్న 9.
తల్లి వేరు, గుబురు వేర్లను చూపు పటాలను గీయండి.
జవాబు.

AP Board 4th Class EVS Solutions 2nd Lesson హరిత ప్రపంచం 3

AP Board 4th Class EVS Solutions 2nd Lesson హరిత ప్రపంచం

ప్రశ్న 10.
ఔషధ విలువలు కలిగిన ఫలాలను రాయండి.
జవాబు.
నిమ్మ, వేప, ఉసిరి, వంటి ఫలాలు ఔషధ విలువలను కలిగి ఉంటాయి.

ప్రశ్న 11.
వెంట్రుకలను శుభ్రపరచుకోవడానికి ఉపయోగించే ఫలాలను పేర్కొనండి.
జవాబు.
కుంకుడు కాయ, శీకాయ వంటి ఫలాలను వెంట్రుకలను శుభ్రపరచుకోవడానికి ఉపయోగిస్తారు.

ప్రశ్న 12.
కిరణజన్య సంయోగక్రియ అంటే ఏమిటి?
జవాబు.
మొక్కలు కార్బన్ డై ఆక్సైడ్, నీరు, సూర్యరశ్మిని ఉపయోగించుకుని ఆహారాన్ని తయారు చేసుకొనే ప్రక్రియను కిరణజన్య సంయోగక్రియ అంటారు.

AP Board 4th Class EVS Solutions 2nd Lesson హరిత ప్రపంచం

బహుళైచ్ఛిక ప్రశ్నలు:

సరియైన సమాధానాలను గుర్తించండి:

ప్రశ్న 1.
క్రింది వానిలో పుష్పంలో భాగం కానిది ____________.
A) ఆకర్షణ పత్రం
B) వేర్లు
C) అండకోశం
D) కేసరం
జవాబు.
B) వేర్లు

ప్రశ్న 2.
క్రింది వానిలో వేరుగా ఉన్నదానిని గుర్తించండి. ____________
A) మర్రి
B) మామిడి
C) తామర
D) వేప
జవాబు.
C) తామర

ప్రశ్న 3.
కిరణజన్య సంయోగక్రియకు అవసరమైనది ____________
A) నీరు
B) సూర్యరశ్మి
C) కార్బన్ డై ఆక్సైడ్
D) పైవన్నీ
జవాబు.
D) పైవన్నీ

AP Board 4th Class EVS Solutions 2nd Lesson హరిత ప్రపంచం

ప్రశ్న 4.
నేలకు పైన పెరిగే మొక్క భాగాన్ని ____________ వ్యవస్థ అంటారు.
A) ప్రకాండ
B) వేరు
C) పాద
D) పర్యావరణ
జవాబు.
A) ప్రకాండ

ప్రశ్న 5.
నేల లోపల పెరిగే మొక్క భాగాన్ని ____________ వ్యవస్థ అంటారు.
A) ప్రకాండ
B) వేరు
C) పాద
D) పర్యావరణ
జవాబు.
B) వేరు

ప్రశ్న 6.
____________ మొక్కల వేర్లు మృదువుగా, స్పాంజిలాగ ఉంటాయి.
A) నేల
B) ఎడారి
C) పర్వత
D ) నీటి
జవాబు.
D ) నీటి

AP Board 4th Class EVS Solutions 2nd Lesson హరిత ప్రపంచం

ప్రశ్న 7.
వేసవిలో చల్లదనం కోసం వాడే కూలింగ్ మ్యాట్లో ఉపయోగించే వేర్లు ____________
A) వట్టి వేర్లు
B) లెమన్ గ్రాస్ వేర్లు
C) కుంకుడు కాయవేర్లు
D) వేపవేర్లు
జవాబు.
A) వట్టి వేర్లు

ప్రశ్న 8.
____________ వేర్లు గుబురుగా పెరుగుతాయి.
A) తల్లి
B) పీచు
C) A మరియు B
D) ముల్లంగి
జవాబు.
B) పీచు

ప్రశ్న 9.
క్రింది వానిలో నీటిమొక్క ____________
A) పైన్
B) బ్రహ్మాజెముడు
C) వేప.
D) ఏదీకాదు
జవాబు.
D) ఏదీకాదు

AP Board 4th Class EVS Solutions 2nd Lesson హరిత ప్రపంచం

ప్రశ్న 10.
పుష్పంలో రంగురంగుల భాగాన్ని ____________ అని పిలుస్తారు.
A) కేసరం
B) అండకోశం
C) ఆకర్షణ పత్రం
D) రక్షక పత్రం
జవాబు.
C) ఆకర్షణ పత్రం