Andhra Pradesh BIEAP AP Inter 1st Year Botany Study Material 13th Lesson ఆవరణ సంబంధ అనుకూలనాలు, అనుక్రమం, ఆవరణ సంబంధ సేవలు Textbook Questions and Answers.
AP Inter 1st Year Botany Study Material 13th Lesson ఆవరణ సంబంధ అనుకూలనాలు, అనుక్రమం, ఆవరణ సంబంధ సేవలు
అతిస్వల్ప సమాధాన ప్రశ్నలు
ప్రశ్న 1.
ద్వితీయ అనుక్రమంలో ప్రాథమిక అనుక్రమంలో కంటే చరమదశ త్వరగా ఏర్పడుతుంది, ఎందువల్ల?
జవాబు:
ఒక ప్రదేశంలో మొదట ఉన్న జీవ సముదాయాలు నాశనం చేయబడిన తర్వాత మొదలవుతుంది. ఆ ప్రదేశములో కొంత మృత్తిక ఉండుట వల్ల, ప్రాథమిక అనుక్రమం కంటే ద్వితీయ అనుక్రమం వేగవంతంగా ఉంటుంది.
ప్రశ్న 2.
బ్రయోఫైట్లు, లైకెన్లు, ఫెర్న్ మొక్కలలో వేటిని జలాభావ క్రమకంలో ప్రారంభపు మొక్కలుగా పేర్కొంటారు?
జవాబు:
లైకెనులను జలాభావ క్రమకంలో ప్రారంభపు మొక్కలు అంటారు.
ప్రశ్న 3.
జలాభావ క్రమకంకు సంబంధించి ఏవైనా రెండు ఉదాహరణలను పేర్కొనండి.
జవాబు:
క్రిస్టోజ్ లైకెనులు : రైజో కార్బన్, లెకనోరు
ఫోలియోజ్ లైకెనులు : ఫార్మీలియా, డెర్మటోకార్పన్
మాస్లు : ఫ్యునరియా
ప్రశ్న 4.
సముద్ర లవణీయత అధికంగా గల ప్రాంతాలలో ఏ రకం మొక్కలు పెరుగుతాయి. [Mar. ’14]
జవాబు:
హాలోఫైట్లు. ఉదా : రైజోఫొరా
ప్రశ్న 5.
ఎండ మొక్కలు (Heliophytes), నీడ మొక్కల (Sciophytes) ను నిర్వచించండి. మీ ప్రాంతంలోని మొక్కలలో ఒక దానిని ఎండ మొక్కకు కాని నీడ మొక్కకు గాని ఉదాహరణగా పేర్కొనండి.
జవాబు:
ప్రత్యక్షంగా ఎండలో పెరిగే మొక్కలను “హీలియోఫైట్లు” అంటారు. ఉదా : గడ్డి చామంతి, గడ్డి జాతులు.
నీడ ఉన్న ప్రాంతాలలో పెరిగే మొక్కలను “సియోఫైట్లు” అంటారు. ఉదా : ఫెర్న్లు, మాస్లు.
ప్రశ్న 6.
జనాభా, సముదాయాలను నిర్వచించండి?
జవాబు:
- ఒక ప్రాంతంలో నివసించే ఒకే జాతికి చెందిన జీవుల సమూహాన్ని జనాభా అంటారు.
- ఒక ప్రాంతంలో నివసించే వివిధ జాతులకు చెందిన అనేక జనాభాల సమూహాన్ని సముదాయము అంటారు.
ప్రశ్న 7.
సంఘాలను నిర్వచించండి? మొక్కల సంఘాలను నీటి మొక్కలు, సమోద్బీజాలు, ఎడారి మొక్కలుగా వర్గీకరించింది ఎవరు?
జవాబు:
ఒక ప్రాంతంలో నివసించే వివిధ జాతులకు చెందిన అనేక జనాభాలా సమూహాన్ని సముదాయము లేక సంఘము అంటారు. వార్మింగ్ అనువారు వృక్షసంఘాలను 3 రకాలుగా వర్గీకరించారు.
ప్రశ్న 8.
నీటి మొక్కలలో కృశించిన దారువు ఉంటుంది. ఎందుకు?
జవాబు:
నీటి మొక్కలలో అన్నిభాగాలు నీటిని శోషించగల్గిఉంటాయి. కావున దారువు కృశించి ఉంటుంది.
స్వల్ప సమాధాన ప్రశ్నలు
ప్రశ్న 1.
నీటి మొక్కలు అంటే ఏమిటి? వివిధ రకాల నీటి మొక్కలను ఉదాహరణలతో చర్చించండి?
జవాబు:
పూర్తిగా నీటిలోకాని, తడినేలలో కాని పెరిగే మొక్కలను నీటిమొక్కలు అంటారు. నీటిలో పెరిగే విధానాన్ని బట్టి ఐదు రకాలుగా గుర్తించవచ్చును.
1) నీటిపై స్వేచ్ఛగా తేలే మొక్కలు :
ఈ మొక్కలు మృత్తికతో సంబంధం లేకుండా, నీటి ఉపరితలంపై స్వేచ్ఛగా తేలుతూ ఉంటాయి. ఉదా : పిస్టియా, ఐకార్నియా, ఉల్ఫియా, సాల్వీనియా.
2) లగ్నీకరణ చెంది, నీటిపై తేలే పత్రాలుగల మొక్కలు :
ఈ రకం మొక్కలు వేరువ్యవస్థ సహాయంతో మృత్తికలో స్థాపితమై, పొడవైన పత్ర వృంతాలు ఉండటం వల్ల పత్రదళాలు నీటి ఉపరితలంపై తేలుతూ ఉంటాయి.
ఉదా : నిలంబో, నింఫియా, విక్టోరియా రిజియా.
3) పూర్తిగా నీటిలో మునిగి, అవలంబితంగా ఉండే మొక్కలు :
ఈ మొక్కలు నీటితో మాత్రమే సంబంధం కలిగి, పూర్తిగా నీటిలో మునిగి, మృత్తికలో నాటుకొని ఉండకుండా అవలంబితంగా ఉంటాయి. ఉదా : సెరటోఫిల్లమ్, యుట్రిక్యులేరియా, హైడ్రిల్లా.
4) నీటిలో మునిగి ఉండి, లగ్నీకరణ చెందిన మొక్కలు :
ఈ మొక్కలు పూర్తిగా నీటిలో మునిగి ఉండి, వేరు వ్యవస్థ సహాయంతో కొలను అడుగున మృత్తికలో నాటుకొని ఉంటాయి. ఉదా : పాటమోజిటాన్, వాలిస్ నేరియా.
5) ఉభయచర మొక్కలు :
ఇవి పాక్షికంగా నీటిలోనూ, పాక్షికంగా వాయుగతంగాను పెరుగుతాయి. ఉదా : సాజిటేరియా, లిమ్నెఫిలా కొన్ని రకాల మొక్కలు జలాశయాల చుట్టూ పెరుగుతాయి. ఉదా : సైపరస్, టైఫా
ప్రశ్న 2.
నీటి మొక్కల స్వరూపాత్మక సంబంధమైన అనుకూలనాలను వివరించండి.
జవాబు:
- వేర్లు ఉండవు లేదా వేర్లు కృశించి ఉంటాయి. నీటిలో మునిగి ఉన్న పత్రాలు వేర్లులాగా పనిచేస్తాయి.
- వేరుతొడుగులు ఉండవు. బురదలో పెరిగే ఉభయచర మొక్కలలో వేర్లు బాగా అభివృద్ధి చెందుతాయి. వీటిలో వేరు తొడుగులు ఉంటాయి.
- కొన్ని మొక్కలలో వేరుతొడుగుకు బదులు వేరు సంచులు ఉంటాయి.
- వేర్లు ఉంటే పీచువలె, తక్కువ శాఖలను కల్గి ఉంటాయి.
- కాండము పొడవుగా, సున్నితంగా ఉంటుంది.
- పత్రాలు పలుచగా, పొడవుగా, రిబ్బన్ ఆకృతిలో లేక సన్నగా పొడవుగా లేదా చీలి ఉంటాయి. నీటిపై తేలే పత్రాలు పెద్దవిగా బల్లపరుపుగా, ప్రనమైనపుపూతతో ఉంటాయి.
ప్రశ్న 3.
నీటి మొక్కల అంతర్నిర్మాణ సంబంధమైన అనుకూలనాలను తెలపండి. [Mar. ’14]
జవాబు:
- నీటిలో మునిగి ఉండు మొక్కలలో అవభాసిని ఉండదు. వాయుగతభాగాల ఉపరితలంపై పలుచగా ఉంటుంది.
- బాహ్యచర్మకణాలు పలుచని కణకవచాన్ని కలిగి, శోషణ చేస్తాయి. మరియు హరితరేణువులను కలిగి కిరణజన్య సంయోగక్రియ జరుపుతాయి.
- నీటిలో మునిగి ఉండే మొక్కలలో పత్ర రంధ్రాలు ఉండవు. నీటిపై తేలే పత్రాలున్న మొక్కలలో ఊర్ధ్వతలంలో పత్రరంద్రాలు ఉంటాయి.
- వాయుపూరిత మృదుకణజాలము ఎక్కువగా ఉంటుంది. ఇది వాయు మార్పిడికి, మొక్క నీటిపై తేలటానికి ఉపయోగపడుతుంది.
- దృడకణజాలాలు, దారువు తక్కువగా ఉంటాయి.
ప్రశ్న 4.
ఎడారి మొక్కల వర్గీకరణ గురించి క్లుప్తంగా రాయండి.
జవాబు:
బాహ్య స్వరూపం, శరీర ధర్మ లక్షణాలు, జీవితచక్ర విధానాన్ని బట్టి ఎడారి మొక్కలను మూడు విభాగాలుగా వర్గీకరించారు.
1) అల్పకాలిక మొక్కలు :
ఇవి ఏక వార్షిక మొక్కలు. ఇవి శుష్క ప్రాంతాలలో పెరుగుతాయి. ఈ మొక్కలు తక్కువకాలములో జీవిత చరిత్రను ముగించుకుంటాయి. ఉదా : ట్రిబ్యులస్
2) రసభరితమైన మొక్కలు :
ఈ మొక్కలు వర్షాకాలంలో చాలా నీటిని శోషించి, ఆ నీటిని జిగురు పదార్థ రూపంలో మొక్క భాగాలలో నిలవ చేస్తాయి. దీని ఫలితంగా వీటి కాండం, పత్రాలు, వేర్లు కండయుతంగా, రసభరితంగా ఉంటాయి. ఈ విధంగా నిలువ చేసిన నీటిని, నీరు దొరకని సమయంలో చాలా పొదుపుగా వినియోగిస్తాయి.
ఉదా : ఎ) రసభరిత కాండము గల మొక్కలు : ఒపన్షియా
బి) రసభరిత పత్రాలు గల మొక్కలు : అలో
సి) రసభరిత వేళ్ళు గల మొక్కలు : ఆస్పరాగస్
3) రసభరితం కాని మొక్కలు :
ఇవి నిజమైన ఎడారి మొక్కలు. ఇవి దీర్ఘకాలిక జలాభావ పరిస్థితులను తట్టుకోగల బహూవార్షిక మొక్కలు.
ఉదా : కాజురైనా
ప్రశ్న 5.
ఎడారి మొక్కల స్వరూపాత్మక సంబంధమైన అనుకూలనాలను తెలపండి.
జవాబు:
- వేర్లు బాగా విస్తరించి అనేక శాఖలతో విస్తరించి ఉంటాయి.
- మూల కేశాలు, వేరు తొడుగులు అభివృద్ధి చెంది ఉంటాయి.
- కాండాలు పొట్టిగా, దృఢంగా చేవదేరి మందమైన బెరడుతో ఉంటాయి.
- కాండంపై కేశాలు మైనపు పొర ఉంటాయి.
- పత్రాలు క్షీణించి పొలుసాకులుగా, లేక కంటకాలుగా మారి భాష్పోత్సేకాన్ని తగ్గిస్తాయి.
ప్రశ్న 6.
ఎడారి మొక్కల అంతర్నిర్మాణ సంబంధమైన అనుకూలనాలను తెలపండి.
జవాబు:
- బాహ్యచర్మంపై మందమైన అవభాసిని ఉంటుంది.
- బాహ్యచర్మ కణాలలో సిలికా స్ఫటికాలు ఉండవచ్చు.
- బహుళ బాహ్య చర్మము ఉంటుంది.
- పత్రరంద్రాలు పత్ర అధోఃబాహ్యచర్మంలో ఉంటాయి. లేక దిగబడిన పత్రరంద్రాలు ఉంటాయి.
- యాంత్రిక కణజాలాలు బాగా అభివృద్ధి చెంది ఉంటాయి.
- నాళికా కణజాలాలు బాగా అభివృద్ధి చెంది ఉంటాయి.
ప్రశ్న 7.
మొక్కల అనుక్రమంను నిర్వచించండి. ప్రాథమిక అనుక్రమం, ద్వితీయ అనుక్రమం మధ్య తేడాలు ఏమిటి?
జవాబు:
ఒక ప్రదేశంలో క్రమానుగతంగా జాతుల సంఘటనలో ఊహించగల మార్పులు జరగడాన్ని అనుక్రమం అంటారు.
ప్రాథమిక అనుక్రమం | ద్వితీయ అనుక్రమం |
1) ఎలాంటి జీవ జాతులు లేని చోట జరుగు ప్రక్రియ | 1) ఒక ప్రదేశంలో మొదటవున్న జీవరాశులు నాశనం చేయబడిన తర్వాత అనగా పాడుపడిన వ్యవసాయ భూములు, నిప్పువల్ల కాలిన అరణ్యాలలో జరిగే ప్రక్రియ. |
2) జీవక్రియాపరంగా, ఫలవంతం కాని ప్రదేశంలో (రాతిశిలలపై) జరుగుతుంది. | 2) జీవక్రియా పరంగా సారవంతమైన ప్రదేశంలో జరుగుతుంది. |
3) చరమదశ రావటానికి ఎక్కువ సమయం పడుతుంది. | 3) చరమదశ రావటానికి తక్కువ సమయం పడుతుంది. |
ప్రశ్న 8.
ఆవరణ వ్యవస్థ లేదా ఆవరణ సంబంధ సేవలను నిర్వచించండి. ఆవరణ సంబంధ సేవలు, పరాగ సంపర్కాన్ని గురించి క్లుప్తంగా వివరించండి.
జవాబు:
వాతావరణంలో వివిధ ప్రక్రియల వల్ల ఉత్పత్తి అయ్యే వనరులు, నీటిశుద్ధి, కలప, చేపల ఆవాసం, పంట మొక్కలు పరాగ సంపర్కము మొదలైన వాటిని ఆవరణ సంబంధత్సేవులు అంటారు.
పుష్పంలోని అండాశయాల ఫలధీకరణకు అవసరమైన పరాగ రేణుల మార్పిడిని పరాగ సంపర్కం అంటారు. ఇది ఆరోగ్యవంతమైన ఆవరణ వ్యవస్థలోని భాగము. చాలా పుష్పించే మొక్కల ఫలాలు, విత్తనాలు ఉత్పత్తికి, పరాగసంపర్క సహకారులపై ఆధార పడతాయి. ఈ పరాగ సంపర్క సహకారులు ప్రపంచంలో ఆహార ధాన్యాల ఉత్పత్తిలో ప్రధాన పాత్ర పోషిస్తాయి.
వ్యవసాయ ఉత్పత్తులలో తేనెటీగ ప్రధాన పాత్ర పోషిస్తుంది. పరాగ సంపర్క సహకారులు క్రియాశీలత తగ్గించే ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక సంక్షోభం జరుగుతుంది. ప్రపంచ వ్యాప్తంగా తేనెటీగలు, సీతాకోక చిలుకలు, ఈగలు వంటి 1,00,000 పైగా అకసేరుక జాతులు, 1,035 జాతుల పక్షులు క్షీరదాలు, సరీసృపాలు కూడా పరాగ సంపర్కం జరుపుతాయి.
ప్రశ్న 9.
ఆవరణ సంబంధ విధులను కొనసాగించడం కోసం తీసుకోవలసిన చర్యలను గురించి రాయండి.
జవాబు:
- వాతావరణానికి ఎలాంటి నష్టం కలిగించకుండా, వ్యర్ధ పదార్థ వనరులను తగ్గించే, వనరుల సంరక్షణను దృష్టిలో పెట్టుకునే తయారీ పద్ధతుల ద్వారా తయారయ్యే ఉత్పత్తులను ఎంచుకోవాలి.
- కృత్రిమ ఎరువుల, కీటకనాశకాల వినియోగం లేని పద్ధతులలో తయారయిన ఉత్పత్తులను ఎన్నుకోవాలి.
- వినియోగాన్ని, వ్యర్ధపదార్థాల ఉత్పత్తిని తగించాలి.
- పునర్వినియోగానికి సంబంధించిన ఇందన వనరులు ఉపయోగాన్ని బలపరచాలి.
- సైకిల్ లేదా నడక ప్రజారవాణా వ్యవస్థను వాడటం ద్వారా సహజ వనరులను రక్షించడం, కాలుష్యాన్ని తగ్గించడం, ఆరోగ్య సంబంధ లాభాలను ఆస్వాదించుట.
- సామూహిక ఉద్యానవనాల ఏర్పాటు, మొక్కనాటే కార్యక్రమములో పాల్గొనుట.
- కీటక నాశకాల ఉపయోగం తగ్గించి, సహజకీటక నాశకాలను వాడటం.
- ఉద్యాన వనాలలో స్థానిక మొక్కలను పెంచడం, వన్య ప్రాణులకు ఆవాసాన్ని ఏర్పరచడం.
ప్రశ్న 10.
పరాగసంపర్క సహకారకాలను రక్షించడానికి తీసుకోవలసిన జాగత్రలు ఏమిటి?
జవాబు:
- పుష్పించు మొక్కలతో సొంతంగా పూదోటలను ఏర్పరచుకోవడం, ఖాళీ ప్రదేశాలలోను, పెద్ద భవనాల బయట పుష్పించు మొక్కలు నాటడం.
- ఇళ్ళలోను, పరిసరాలలోను వాడే కీటకనాశక పదార్థాల స్థాయిని తగ్గించడం.
- స్థానిక సంస్థలలో, పాఠశాలల్లో తేనెటీగల పెంపకం కోసం ఉపయోగించే ఫలకాలు పెట్టెల వాడకాన్ని ప్రోత్సహించడం.
- కీటకనాశక పదార్థాలను వినియోగించని వ్యవసాయ సంస్థలను బలపరచడం.
- వ్యవసాయ పంటల పరాగ సంపర్క విషయంలో స్థానికంగా ఉండే పరాగ సంపర్క కారకాలను ఉపయోగించుకునే పద్ధతులు అవసరాన్ని వివరించుట.
దీర్ఘ సమాధాన ప్రశ్న
ప్రశ్న 1.
ఆవరణ వ్యవస్థ సంబంధ సేవలు – కర్బన స్థాపన, ఆక్సిజన్ విడుదల గురించి వివరించండి?
జవాబు:
ఆవరణ వ్యవస్థ సంబంధ సేవలు- కర్బన స్థాపన :
ఎక్కువ కార్బన్ వాతావరణంలోనికి విడుదల కాకుండా ఉండటానికి మొక్కలు అవసరం. అడవులకు, వాతావరణానికి మధ్య నిరంతరం CO2-O2 ల రసాయన ప్రవాహం జరుగుతుంది. అడవులు CO2 యొక్క ప్రధాన బ్యాంకులు కొయ్యరూపంలో పెద్ద పరిమాణంలో CO2 దాచబడుతుంది. ఇది వాతావరణంలోని CO2 గాఢతను తగ్గించి, వాతావరణంలో CO2-O2 ల గతిక సమతుల్యంగా ఉంచడంలో ప్రధాన పాత్ర వహిస్తాయి. కిరణజన్య సంయోగ క్రియ ప్రకారము 180gm గ్లూకోజ్ 193 గ్రాముల 02 ఉత్పత్తికి 264 గ్రాముల CO2, 108 గ్రాముల నీరు యొక్క వినియోగించుకుని 677.2 కిలో కాలరీల సౌరశక్తిని గ్రహిస్తుంది. ఈ 180 గ్రాముల గ్లూకోజ్ క్రమంగా 162 గ్రాముల పాలీశాఖరైడ్గా మొక్కలో మారుతుంది. అనగా ప్రతి 1 గ్రామ్ పొడి సేంద్రియ పదార్థం కోసం 1.63 గ్రాముల CO2 స్థాపన అవసరం. అభయారణ్యాలు ఉత్పత్తి చేసే పొడిసేంద్రియ పదార్థాల మొత్తాన్ని వివిధ నిర్ణీత ఎత్తులో ఉన్న అడవుల వార్షిక నికర ఉత్పత్తి ద్వారా మొత్తాన్ని, లెక్కకట్టవచ్చు. దీనినిబట్టి CO2 ఎంత స్థాపన జరుగునో తెల్చుకోవచ్చు.
శీతోష్ణస్థితి, పరిస్థితులను స్థిరంగా ఉంచడానికి, భూమి అధిక ఉష్ణోగ్రతకులోను కాకుండా, ఎక్కువ గ్రీన్ హౌస్ వాయువును వాతావరణం నుంచి తొలగించుటలో ఆవరణ వ్యవస్థలు సహాయపడతాయి. చాలా దేశాలు కార్బన్ పన్ను విధానంను ప్రవేశపెట్టాయి. దీనివల్ల గ్రీన్ హౌస్ వాయువును ముఖ్యంగా CO2 CO లు వాతావరణంలోనికి విడుదలవటాన్ని తగ్గించవచ్చు.
ఆవరణ వ్యవస్థ సేవలు – ఆక్సిజన్ విడుదల :
వాతావరణంలోకి ఆక్సిజన్ను విడుదల చేయడానికి ప్లవకాలు, వృక్షాలు ముఖ్యపాత్ర వహిస్తున్నాయి. ఇది ఆ మొక్క జాతి రకము, దాని వయస్సు ఆ మొక్క పరిసరాలపై ఆధారపడి ఉంటుంది.
ఒక సంవత్సర కాలంలో 10 మంది. వ్యక్తులు పీల్చడానికి కావలసిన ఆక్సిజన్ ను ఒక పత్రాయుతా ప్రౌఢమొక్క ఒక ఋతువులో విడుదల చేస్తుంది. ఒక పూర్తిగా ఎదిగిన మొక్క 48 lbs CO2 ను ఒక సంవత్సరకాలంలో శోషించి, విడుదల చేసే O2 ఇద్దరు మనుషులకు సరిపోతుంది.
ఒక కారు 26,000 మైల్స్ ప్రయాణంలో విడుదల చేసే CO2 ఒక ఎకరం భూమిలోని వృక్షాలు సంవత్సర కాలంలో వినియోగించుకునే CO2 విలువకు సమానము. ఒక ఎకరం భూమిలోని వృక్షాలు 18 మంది సంవత్సరం పాటు శ్వాసించడానికి కావలసిన O2 ను అందిస్తాయి. మొక్కలను, వృక్షప్లవకాలను “ప్రపంచం యొక్క ఊపిరితిత్తులు” అంటారు. కొన్ని సూక్ష్మజీవులు, సయనో బాక్టీరియాలు ఆక్సిజన్ను ప్రత్యక్షంగా విడుదల చేస్తాయి. అడవులలో పడిపోయిన మానులు విచ్ఛిన్నం వల్ల జరిగే ఖనిజల లవణాల వలయాలు, బాక్టీరియాలు, లైకెన్ల ద్వారా మృత్తిక ఏర్పడటం జరుగుతుంది.
Intext Question and Answers
ప్రశ్న 1.
ఈ కింది మొక్కలను నీటి మొక్కలు (హైడ్రోఫైట్లు), ఉప్పునీటి మొక్కలు (హాలోఫైట్లు), సమోద్బీజాలు, ఎడారి మొక్కలుగా వర్గీకరించండి.
a) సాల్వీనియా
b) ఒపన్షియా
c) రైజోఫొరా
d) మాంజిఫెరా
జవాబు:
a) సాల్వీనియా – నీటి మొక్క (హైడ్రోఫైట్)
b) ఒపన్షియా – ఎడారి మొక్క
c) రైజోఫోరా – ఉప్పునీటి మొక్క
d) మాజిఫెరా – సమోద్బీజ మొక్క
ప్రశ్న 2.
ఒక కొలనులో మనం నీటిపై స్వేచ్ఛగా తేలేమొక్కలు, నీటిలో మునిగి ఉండే లగ్నీకరణ చెందిన మొక్కలు, లగ్నీకరణ చెంది నీటి బయట ఉండే మొక్కలు, లగ్నీకరణ చెంది, నీటిపై తేలే పత్రాలు గల మొక్కలు అనే వివిధ రకాల నీటి మొక్కలను చూస్తాం. ఈ కింది మొక్కలను వాటి రకం ఆధారంగా పేర్కొనండి?
మొక్కపేరు – రకం
a) హైడ్రిల్లా – _ _ _ _ _ _ _ _ _ _
b) టైఫా – _ _ _ _ _ _ _ _ _ _
c) నింఫియా – _ _ _ _ _ _ _ _ _ _
d) లెమ్నా – _ _ _ _ _ _ _ _ _ _
e) వాలిస్ నేరియా – _ _ _ _ _ _ _ _ _ _
జవాబు:
a) హైడ్రిల్లా – నీటిలో మునిగి అవలంబితంగా ఉండే మొక్క
b) టైఫా – లగ్నీ కరణం చెంది నీటి బయట ఉండే మొక్క
c) నింఫియా – లగ్నీ కరణం చెంది నీటిపై తేలే పత్రాలు కల మొక్క
d) లెమ్నా – నీటి పై స్వేచ్ఛగా తేలే మొక్క
e) వాలిస్ నేరియా – నీటిలో మునిగి లగ్నీకరణం చెందిన మొక్క
ప్రశ్న 3.
అభ్యాసన ప్రక్రియలో భాగంగా ఈ కింది వాటిని వివరించండి.
a) మీ పరిసర ప్రాంతాలలో ఉన్న ఆవరణ సంబంధ సేవలను గుర్తించి నిర్ణయించండి?
b) ఆ ఆవరణ సంబంధ సేవలను కొనసాగించే పద్ధతులు, విధానాలను గురించి ఆలోచించండి?
c) మీ ప్రాంతంలో పెరిగే మొక్కలు లేదా పంటల రకాలను పరిశీలించండి?
d) మీ ప్రాంతంలోని ఆవరణ సంబంధ సేవలను వివరించండి?
e) మీ ప్రాంతంలోని సహజసిద్ధ అరణ్యాల నుంచి సమకూరే వనరులు లేదా వస్తువులను పేర్కొనండి?
f) మీ ప్రాంతంలోని పుష్పించే అలంకర ప్రాయ మొక్కలు, వ్యవసాయ పంటల పరాగసంపర్కరంలో పాల్గొనే జీవ కారకాలను పరిశీలించండి?
జవాబు:
a) వాతావరణంలో వివిధ క్రియల వల్ల ఉత్పత్తి అయ్యే వనరులు నీటిశుద్ధి, కలప, చేపల ఆహారం, పంటమొక్కల పరాగ సంపర్కం వంటివి ఆవరణ సంబంధ సేవలు.
b) 1) వినియోగాన్ని, వ్యర్ధ పదార్థాల ఉత్పత్తిని తగ్గించుట.
2) జీవ కీటకనాశకాల ఉపయోగం తగ్గించి, సహజ కీటక నాశకాలను వాడుట.
3) సామూహిక ఉద్యానవనాలు ఏర్పాటు.
c) వరి, మొక్కజొన్న, మినుములు, పెసలు, జనుము, కూరగాయలు
d) 1) నీటి పరిశుద్ధత
2) వరదల నివారణ
3) వ్యర్ధ పదార్థాల నిర్మూలన
4) ఆక్సిజన్ ఉత్పాదకత
e) పరిశుద్ధ గాలి, మంచినీరు, ఆహారము, నారలు, కలప, ఔషధాలు
f) కీటకాలు, పక్షులు, జంతువులు (గబ్బిలాలు, నత్తలు, పాములు)