AP Inter 1st Year Chemistry Notes Chapter 2 మూలకాల వర్గీకరణ – ఆవర్తన ధర్మాలు 

Students can go through AP Inter 1st Year Chemistry Notes 2nd Lesson మూలకాల వర్గీకరణ – ఆవర్తన ధర్మాలు will help students in revising the entire concepts quickly.

AP Inter 1st Year Chemistry Notes 2nd Lesson మూలకాల వర్గీకరణ – ఆవర్తన ధర్మాలు

→ “మూలకాలు, వాటి సమ్మేళనాల ధర్మాలు వాటి పరమాణు భారాల ఆవర్తన ప్రమేయాలు” – మెండలీఫ్ ఆవర్తన నియమము.

→ EKaAl – గాలియమ్, EKa Si – జెర్మేనియం,
Eka B – స్కాండియమ్.

→ Ar – k, Co – Ni. Te – I. Th – Pa లను అసంగత జంటలు అంటారు.

→ √υ = a(Z – b) మోస్లే సమీకరణము.
మూలకానికి విలక్షణమయిన ధర్మం పరమాణు సంఖ్య అనీ పరమాణు భారం కాదనీ మోస్లే నిరూపించాడు.

→ “మూలకాల భౌతిక, రసాయన ధర్మాలు వాటి పరమాణు సంఖ్యల ఆవర్తన ప్రమేయాలు” – ఆధునిక ఆవర్తన నియమము.

→ మూలకాల భౌతిక, రసాయనిక ధర్మాలు వాటి పరమాణు సంఖ్యల ఆవర్తన ప్రమేయాలు (లేక) ఎలక్ట్రాన్ విన్యాసం యొక్క ఆవర్తన ప్రమేయాలు.

→ ఆధునిక ఆవర్తన పట్టికలో 7 పీరియడ్లు మరియు 18 గ్రూపులు ఉన్నాయి. దీనిలో s, p, d, f అనే 4 బ్లాకులు ఉంటాయి. ఎలక్ట్రాన్ విన్యాసపరంగా మూలకాలను 4 రకాలుగా విభజన చేశారు. అవి (a) జడవాయువులు, (b) ప్రాతినిధ్య మూలకాలు, (c) పరివర్తన మూలకాలు, (d) అంతర పరివర్తన మూలకాలు.

→ పరమాణు కేంద్రకం మధ్యభాగం నుండి దాని చివరి కర్పరం వరకు గల దూరాన్ని పరమాణు వ్యాసార్థం అంటారు.

→ సమయోజనీయ బంధం ద్వారా బంధించబడిన పరమాణువుల కేంద్రకాల మధ్య గల సమతాస్థితి దూరంలో సగాన్ని సమయోజనీయ వ్యాసార్థం అంటారు.

→ వాండర్ వాల్ ఆకర్షణ బలాలచే బంధితమై ఉన్న రెండు ఒకేవిధమైన పరమాణువుల కేంద్రకాల మధ్య గల సమతాస్థితి దూరంలోని సగభాగాన్ని ‘వాండర్వాల్’ వ్యాసార్థం అంటారు.

AP Inter 1st Year Chemistry Notes Chapter 2 మూలకాల వర్గీకరణ - ఆవర్తన ధర్మాలు 

→ అయాన్ కేంద్రకం మధ్యభాగం నుండి దాని చివరి కర్పరం వరకు గల దూరాన్ని అయానిక వ్యాసార్థం అంటారు.

→ లాంథనైడ్ మూలకాల పరమాణువుల మరియు అయాన్ల పరిమాణంలోని క్రమబద్ధమైన తగ్గుదలను లాంథనైడ్ సంకోచం అంటారు.

→ సంయోగస్థితిలో ఉన్న అణువులోని పరమాణువుల మీది దృశ్య ఆవేశాన్ని ఆక్సిడేషన్ సంఖ్య అంటారు.

→ వాయుస్థితిలోని ఒంటరి తటస్థ పరమాణువు యొక్క బాహ్య కర్పరంలోని ఒక ఎలక్ట్రాను తీసివేయుటకు కావలసిన శక్తిని అయనీకరణ శక్తి (ప్రథమ అయనీకరణ శక్తి) అంటారు.

→ అంతర కర్పరాలలోని ఎలక్ట్రాన్లు బాహ్య కర్పరాలలోని ఎలక్ట్రాన్లను కేంద్రక ఆకర్షణ నుండి రక్షించే ప్రభావాన్ని పరిరక్షక ప్రభావం అంటారు.

→ వాయుస్థితిలో ఉన్న ఒంటరి తటస్థ పరమాణువుకు ఒక ఎలక్ట్రానన్ను చేర్చినపుడు విడుదలయ్యే శక్తిని ఎలక్ట్రాన్ ఎఫినిటి అంటారు.

→ సమయోజనీయ బంధంతో బంధితమై ఉన్న రెండు పరమాణువులలో, ఒక పరమాణువు బంధజంట ఎలక్ట్రాన్ల ను తన వైపుకు ఆకర్షించుకునే స్వభావాన్ని ఋణవిద్యుదాత్మకత అంటారు.

→ కర్ణ సంబంధం : “ఆవర్తన పట్టికలో రెండవ పీరియడ్లోని ఒక మూలకానికి మూడవ పీరియడ్లోని తరవాత గ్రూపు రెండో మూలకానికి సారూప్య ధర్మాలుంటాయి. ఈ సంబంధాన్ని కర్ణ సంబంధం అంటారు.”
ఉదా : (Li, Mg); (Be, Al); (B, Si)

→ ధృవణ సామర్థ్యం : అయానిక ఆవేశం / (అయానిక వ్యాసార్థం)2

AP Inter 1st Year Chemistry Notes Chapter 2 మూలకాల వర్గీకరణ - ఆవర్తన ధర్మాలు 

→ “f- ఎలక్ట్రాన్ల ల దుర్భల పరిరక్షక ప్రభావం వలన ఆక్టినైడ్ మూలకాలలో పరిమాణం తగ్గడాన్ని ఆక్టినైడ్ సంకోచం అంటారు.”

→ డిమి ఇవనోవిచ్ మెండలీవ్ (1834-1907):
డిమి మెండలీవ్ రష్యాలోని సైబేరియాలో ఉన్న టొబాస్క్ లో జన్మించాడు. 1867లో సాధారణ రసాయనశాస్త్ర ప్రొఫెసర్గా నియమితుడై రసాయనశాస్త్ర నియమం మూలకాల ఆవర్తన పట్టిక నిర్మాణానికి దోహదం చేసింది.