AP Inter 1st Year Commerce Study Material Chapter 12 వ్యాపారంలో ప్రస్తుత ధోరణులు

Andhra Pradesh BIEAP AP Inter 1st Year Commerce Study Material 12th Lesson వ్యాపారంలో ప్రస్తుత ధోరణులు Textbook Questions and Answers.

AP Inter 1st Year Commerce Study Material 12th Lesson వ్యాపారంలో ప్రస్తుత ధోరణులు

వ్యాసరూప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
e – వ్యాపారాన్ని నిర్వచించి, దాని పరిధిని వివరించండి.
జవాబు:
e – వ్యాపారము అనే పదాన్ని మొదటిసారిగా 1997లో IBM ఉపయోగించినది. దీని ప్రకారము e- వ్యాపారము అంటే “ఇంటర్నెట్ పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తూ ముఖ్యమైన వ్యాపార దశలను బదలాయింపు చేయడము”.

అన్ని వ్యాపార కార్యకలాపాలను, వ్యాపార పరిధిని బలపరచడానికి Information and Communication Technology (ICT) సహకారాన్ని ఇంటర్ నెట్ల ద్వారా తీసుకోవటమును e- వ్యాపారముగా నిర్వచించవచ్చును. e – వ్యాపారము ICT వినియోగదారులతో సంబంధాలు పెంపొందించుకోవడానికి కార్యకలాపాలను చేస్తుంది. e వ్యాపార పద్ధతులు వ్యాపార సంస్థల అంతర్గత, బహిర్గత వ్యవస్థల మధ్య సత్సంబంధాలను అత్యంత సమర్థవంతంగా, సరళముగా e – వ్యాపార పరిధి : e వ్యాపారాన్ని క్రింది విధముగా విభజించవచ్చు.

  • వ్యాపార సంస్థలో మాత్రమే.
  • ఒక వ్యాపార సంస్థ మరొక వ్యాపార సంస్థ మధ్య వ్యవహారాలు
  • వ్యాపార సంస్థ – వినియోగదారుని మధ్య వ్యవహారాలు
  • వినియోగదారుడు – వినియోగదారుని మధ్య వ్యవహారాలు
  • వినియోగదారుడు – వ్యాపార సంస్థ మధ్య వ్యవహారాలు

e – వాణిజ్యము పరిధి ఆన్లైన్ వ్యవహారములకు మాత్రమే పరిమితము అవుతుంది. ఆన్లైన్ ద్వారా ” వ్యవహారములు వస్తువు లేదా సర్వీసుకు సంబంధించినవై ఉంటాయి. దాదాపుగా ప్రతి వస్తువు జిమ్ పరికరాల నుంచి కంప్యూటర్ ల్యాప్టాప్ వరకు, వస్త్రాలను మొదలుకొని ఆభరణాల వరకు e – వాణిజ్య రంగంలో ఆన్లైన్ ద్వారానే కొనుగోలు చేయడం జరుగుతుంది. కేవలం వస్తువులను మాత్రమే కాకుండా సేవలను కూడా ఆన్లైన్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. ఉదా : న్యాయవాదులు, డాక్టర్లు తమ సేవలను ఆన్లైన్ ద్వారా అందిస్తున్నారు. రైలు, బస్సు, విమాన టిక్కెట్ల కొనుగోలు, పన్ను చెల్లింపులు ఆన్లైన్ ద్వారా చేయవచ్చు.

AP Inter 1st Year Commerce Study Material Chapter 12 వ్యాపారంలో ప్రస్తుత ధోరణులు

e – వ్యాపార పరిధి దిగువ అంశాలకు వర్తింపచేయడం జరుగుతుంది.
1) e – వాణిజ్యము : ఇంటర్నెట్ ద్వారా వ్యాపారాన్ని నిర్వహించడాన్ని e – వాణిజ్యము అంటారు. ఎలక్ట్రానిక్ వాణిజ్యాన్ని e – వాణిజ్యము అని వ్యవహరిస్తారు. ఆన్లైన్ ద్వారా వస్తువుల కొనుగోలు, అమ్మకం చేసే ప్రక్రియ దీనికి మంచి ఉదాహరణ. అంతేకాకుండా e – వాణిజ్యములో అనేక కార్యకలాపాలు కలిసి ఉంటాయి. ఏదైనా కార్యకలాపాన్ని ఎలక్ట్రానిక్ పరికరము ద్వారా నిర్వహించడాన్ని e – వాణిజ్యము అనవచ్చు.

2) e – వేలం : ఇంటర్ నెట్ సహాయముతో ప్రజలు వేలములో పాల్గొనవచ్చు. e-వేలములో పాల్గొనదలచినవారు సంబంధిత వెబ్సైట్ను సందర్శించి వేలం కోసం ప్రదర్శించిన వస్తువులను క్లిక్ చేస్తూ కొనుగోలు చేయవచ్చు. అదే విధముగా వెబ్ పేజీలలో తమ వస్తువులను ఉంచి వేలం ద్వారా వస్తువులను అమ్మకము చేయవచ్చు..

3) e – బ్యాంకింగ్ : ఎలక్ట్రానిక్ బ్యాంకింగ్ మంచి విజయవంతమైన ఆన్లైన్ వ్యాపారము. బ్యాంకింగ్ వెబ్ సైట్ను ఉపయోగిస్తూ బ్యాంకు ఖాతాదారులు తమ అకౌంట్స్ నిర్వహించుకోవడానికి, చెల్లింపుల ఆజ్ఞ ఇవ్వడానికి e – బ్యాంకింగ్ సహాయము చేస్తుంది. ఆన్లైన్ బ్యాంకింగ్ ద్వారా ఖాతాదారులు బ్యాంకును సందర్శించనవసరము లేకుండా అవసరమైన నగదును ATM ద్వారా పొందవచ్చు. ఖాతా నిల్వలు తెలుసుకోవచ్చు. బిల్లులను చెల్లించవచ్చును. నగదును బదిలీ చేయవచ్చును.

4) e – మార్కెటింగ్ : ఎలక్ట్రానిక్ మార్కెటింగ్లో ఎలాంటి భౌగోళిక అడ్డంకులు లేకుండా వస్తువుల కొనుగోలుకు, అమ్మకాలకు ప్రపంచవ్యాప్తముగా మార్కెటింగ్ ఏర్పాటు చేస్తుంది. ఎలాంటి సమయ భావన లేకుండా ఖాతాదారుల డిమాండ్ను కంపెనీలు స్పందించేందుకు ‘ఇంటర్నెట్ సహాయం చేస్తుంది. దీనికి వినియోగదారులు ఉండే ప్రాంతముతో
సంబంధము లేదు.

5) e – వర్తకము : e – వర్తకాన్ని ఆన్లైన్ వర్తకమని, e – బ్రోకింగ్ అని కూడా వ్యవహరిస్తారు. ఇది స్టాక్ ఎక్స్ఛేంజ్లలో సెక్యూరిటీలను అమ్మడానికి, కొనడానికి ఉపయోగపడుతుంది.

ప్రశ్న 2.
e – వ్యాపారం యొక్క ప్రయోజనాలను వివరించండి.
జవాబు:
e – వ్యాపారము వలన వినియోగదారులకు, వ్యాపార సంస్థలకు, సమాజానికి అనేక ప్రయోజనాలు కలుగుతాయి. వినియోగదారులకు కలిగే ప్రయోజనాలు :

  1. e – వ్యాపారము వలన వినియోగదారులు ఏ ప్రాంతం నుంచి అయినా, ఏ సమయంలోనైనా వ్యాపార వ్యవహారాలు నిర్వహించవచ్చు.
  2. e – వ్యాపారము వినియోగదారులకు వస్తు సేవలకు సంబంధించి, అనేక ప్రత్యామ్నాయాలు, అవకాశాలను కల్పిస్తాయి.
  3. e – వ్యాపారము ద్వారా వినియోగదారుడు అనేక ప్రాంతాలలోని మార్కెట్లలో వస్తు, సేవలను పోల్చి చూసుకోవడానికి వీలవుతుంది.
  4. e – వ్యాపారము వస్తు సేవలు త్వరగా డెలివరీ కావడానికి దోహదము చేస్తుంది.
  5. వినియోగదారుడు వస్తు సేవలకు సంబంధించి సరైన సమాచారాన్ని పూర్తి స్థాయిలో, క్షణాలలో పొందవచ్చును.
  6. వినియోగదారుడు సరైన వేలములో పాల్గొనేందుకు e -వ్యాపారము సహాయపడుతుంది.
  7. e- వ్యాపారము వినియోగదారుల మధ్య సహకారాన్ని ఏర్పరచి, ఒకరికొకరు వ్యాపార ఉపాయాలు, అనుభవాలు పంచుకునేట్లు చేస్తుంది.
  8. e – వ్యాపారము వ్యాపారం మధ్య పోటీతత్వాన్ని ఏర్పరచి, వినియోగదారులకు సరైన డిస్కౌంట్లు లభించేందుకు సహకరిస్తుంది.

AP Inter 1st Year Commerce Study Material Chapter 12 వ్యాపారంలో ప్రస్తుత ధోరణులు

వ్యాపార సంస్థకు ప్రయోజనాలు :

  1. e – వ్యాపారము వలన సంస్థలు తమ ప్రస్తుత మార్కెట్ను జాతీయ, అంతర్జాతీయ స్థాయిలకు విస్తరింపచేసుకోవచ్చు. ఇది సంస్థ యొక్క అమ్మకాలను పెంచుతుంది.
  2. e – వ్యాపారము వలన వస్తువులను లేదా సేవలను సృష్టించడము, ప్రాసెస్ చేయడం, పంపిణీ చేయడం, స్టోరింగ్ చేయడం, ‘సమాచారాన్ని సేకరించడానికి, ఇన్వెంటరీ, ఓవర్హెడ్ ఖర్చులు తగ్గుతాయి.
  3. పెట్టుబడికి, వస్తు సేవల అమ్మకము వలన వచ్చే ఆదాయానికి మధ్య ఉన్న సమయం తగ్గుతుంది.
  4. బిజినెస్ ప్రాసెస్, రీ-ఇంజనీరింగ్లకు సహకరిస్తుంది.
  5. టెలీ కమ్యూనికేషన్ ఖర్చు తక్కువగా ఉండటం వలన ఇంటర్నెట్ విలువ ఆధారిత నెట్వర్క్ కంటే వ్యయము తక్కువగా ఉంటుంది.

సమాజానికి ప్రయోజనాలు :

  1. ఇంటినుంచే పనిచేసుకోవడానికి అవకాశము ఉండటం వలన షాపింగ్ కోసము ప్రయాణాలు తగ్గుతాయి. రోడ్లపై ట్రాఫిక్ సమస్యలు తగ్గుతాయి. దీనివలన వాయు కాలుష్యం తగ్గుతుంది. అంతేకాకుండా సమయము కూడా ఆదా అవుతుంది.
  2. వ్యాపారస్తులు తమ వస్తువులను ఇంటర్ నెట్ ద్వారా తక్కువ ధరలకు అమ్మడం వలన పేదవారికి ప్రయోజనం లభిస్తుంది.
  3. ప్రపంచ దేశాలలో, గ్రామీణ ప్రాంతాలలో ఉండే ప్రజలకు, మార్కెట్ లో లభించని’ వస్తు సేవలను e- వ్యాపారము ద్వారా పొందవచ్చు.
  4. వస్తు సేవలు తక్కువ వ్యయానికి లభించడమే కాకుండా, వాటి మన్నిక, నాణ్యత కూడా పెరుగుతుంది.

ప్రశ్న 3.
21వ శతాబ్దంలో వ్యాపార సంస్థలకు ఉన్న అవకాశాలను తెలపండి.
జవాబు:
21వ శతాబ్దంలో వ్యాపార సంస్థలకు గల అవకాశాలు :
1) సరళీకరణ, ప్రైవేటీకరణ, ప్రపంచీకరణ : LPG రూపములో ప్రవేశపెట్టబడిన ఆర్థిక సంస్కరణలు, భారతదేశములోని వ్యాపార సంస్థలకు అనుకూలమైన వాతావరణాన్ని సృష్టించినది. ఈ పరిస్థితులు భారతదేశ ఆర్థిక వ్యవస్థను ప్రపంచ ఆర్థిక వ్యవస్థతో అనుసంధానించడానికి, పూర్తి స్థాయిలో సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవడానికి, అంతర్జాతీయ వర్తకములో పెరుగుదలకు, ఉత్పత్తి, ఉద్యోగ అవకాశాల పెరుగుదలకు, ఆంక్షలు లేని మూలధన ప్రవాహానికి దారితీసింది.

2) భారీ తరహా, విస్తరణ అవకాశాలు : 21వ శతాబ్దపు వ్యాపార సంస్థలు భారీతరహా, ఎక్కువ’ విస్తరణకు అవకాశాలు గల సంస్థల లక్షణాలు కలిగి ఉన్నవి. భారీ తరహా సంస్థ, ఉత్పత్తిలో పెరుగుదల వలన కంపెనీ ఖర్చులు తగ్గి, లాభాలు పెరుగుతాయి.

3) తలసరి ఆదాయంలో పెరుగుదల : తలసరి ఆదాయము పెరుగుదలలో మనదేశము ప్రపంచవ్యాప్తముగా నాలుగవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఆవిర్భవించినది. తలసరి ఆదాయము దేశములోని ప్రజల జీవన ప్రమాణస్థాయిని తెలుపుతుంది. పెరుగుతున్న తలసరి ఆదాయము వలన దేశములో వ్యాపార అవకాశాలు పెరగడానికి అవకాశము ఉన్నది.

4) మార్కెట్ ఆర్థిక వ్యవస్థలు : భారతదేశము 125 కోట్ల జనాభాతో ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఏర్పడి ప్రపంచవ్యాప్తముగా పారిశ్రామిక, వర్తక సేవారంగాలను ఆకర్షిస్తున్నది. అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థలో వస్తున్న మార్పులు భారతదేశ మార్కెట్ ఆదాపూర్వక మార్కెట్గా రూపొందినది. దాని ఫలితముగా దేశములోని వ్యాపార సంస్థలకు అనేక వ్యాపార అవకాశాలు లభిస్తున్నవి.

AP Inter 1st Year Commerce Study Material Chapter 12 వ్యాపారంలో ప్రస్తుత ధోరణులు

5) e – వాణిజ్యము – ప్రపంచ మార్కెట్ కు గేట్వే : ప్రపంచవ్యాప్తంగా వ్యాపార సంస్థలు e- వాణిజ్యం ప్రయోజనాలను గుర్తిస్తున్నాయి. నగదు ప్రవాహములో పెరుగుదల, ఖాతాదారులు నిలుపుదల, సేవా సంతృప్తి e – వాణిజ్యం ద్వారా లభించిన ప్రయోజనాలు.

6) సాంకేతిక పురోభివృద్ధి: 21వ శతాబ్దములో వ్యాపార సంస్థలు అత్యంత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తున్నవి. దీనివలన వ్యాపార సంస్థలు సమాజానికి అవసరమైన వస్తు సేవలను తక్కువ వ్యయానికి అందిస్తున్నవి.

7) విత్త సేవల విస్తరణ : 21వ శతాబ్దములో విత్త సేవారంగము చాలా వేగముగా పెరుగుతున్నది. బ్యాంకింగ్, భీమా, రుణ, ఈక్విటీ, ఫైనాన్సింగ్, సూక్ష్మ విత్త రంగాలు ప్రజలలో పొదుపు అలవాట్ల పెరుగుదల, భవిష్యత్ అవసరాలకు సరళమైన ఋణాలు పొందడానికి అవకాశాలు కల్పిస్తున్నవి. ఈ ఆర్థిక రంగములో కంపెనీలకు వ్యాపార విస్తరణ | అవకాశాలకు దారితీసాయి.

8) వ్యాపార ప్రక్రియ ఆటోమేషన్ : వ్యాపార ప్రక్రియ ఆటోమేషన్ అనేది వ్యయాల నియంత్రణకు ఉపయోగించే వ్యూహము. ఇది వ్యాపార ప్రక్రియలను స్వయం చలితం చేయడమే కాక అధిక సామర్థ్యాన్ని పొందడం, వ్యాపార అవసరాలకు మార్పులను ఆపాదించుకోవడం, మానవ తప్పిదాలను తగ్గించడం ద్వారా పని ప్రవాహాన్ని మెరుగుపరచడం చేస్తుంది. ‘

9) పెరుగుతున్న కలయికలు, సముపార్జనలు, విదేశీ కొలాబరేషన్లు : కలయికలు, సముపార్జనలు, నవకల్పనల అభివృద్ధి, లాభదాయకత, మార్కెట్ వాటా, కంపెనీ వాటా విలువలలో పెరుగుదలకు ఆధునిక వ్యాపార సంస్థలకు అనుకూలించే వ్యూహము. ఇదే తరహాను అనుసరించే ప్రతిఫలాలలో పెరుగుదలకు, అధిక సమర్థతకు, వ్యయాల నియంత్రణకు దోహదం చేస్తుంది.

10) అంతర్జాతీయ వ్యవస్థాపన : 21వ శతాబ్దములో అనేక సంస్థలు, వ్యాపార ప్రపంచీకరణను, తయారీ, సేవల, మూలధన వనరుల, ప్రతిభ సంపాదనకి రక్షణ వ్యూహంగా పరిగణిస్తున్నది. వినియోగదారుల అవసరాలకు సరిపడేందుకు కొత్త ఉత్పత్తులు, సేవలు సృష్టించడానికి ఒకటి కంటే ఎక్కువ దేశాలలో వ్యాపార అవకాశాలు కనుగొంటున్నాయి.

ప్రశ్న 4.
21వ శతాబ్దంలో వ్యాపార సంస్థలు ఎదుర్కొనే సవాళ్ళను తెలపండి.
జవాబు:
21వ శతాబ్దంలో వ్యాపార సంస్థలు ఈ క్రింది సవాళ్ళను ఎదుర్కోవాలి.
1) సాంకేతిక పరిజ్ఞానము సవాళ్ళు: సాంకేతిక పరిజ్ఞానములో వేగముగా వస్తున్న మార్పులు చిన్న వ్యాపార సంస్థలకు ఖర్చు, సమయము ఒక ముప్పుగా ఏర్పడినది. ఈ సంస్థలు సాంకేతిక పరిజ్ఞానములో వచ్చిన మార్పులకు అనుగుణముగా ప్లాంటు, యంత్రాలు, పరికరాలు, ఉత్పత్తి విధానాలను ఆధునీకరించుకుంటున్నాయి. లేకపోతే సంస్థలు తమ ఉనికిని కోల్పోయి, మార్కెట్ నుంచి తొలగిపోతాయి.

2) పెరుగుతున్న వినియోగదారుల అవగాహన : ఉత్పత్తులు, సేవల పట్ల వినియోగదారుల అవగాహన పెరుగుతున్నది. వినియోగదారులను ఆకర్షించేందుకు, మార్కెట్ వాటా కోల్పోకుండా నివారించేందుకు వినియోగదారుల డిమాండ్లకు స్పందించవలసిన అవసరమున్నది.

3) ప్రపంచీకరణ సవాళ్ళు : ప్రపంచీకరణ వ్యాపార వాతావరణములో మిశ్రమ సంస్కృతులు, భాషలు మొదలైన వ్యూహాత్మక సవాళ్ళకు దారితీసింది. ఫలితముగా ప్రపంచ పోటీ, వస్తు సేవల ధరలు పెరిగినవి.

4) సహజ వనరుల క్షీణత : చాలా రకములైన ఉత్పత్తి సంస్థలు సహజ వనరులు ముఖ్యంగా ముడి పదార్థాలపై ఆధారపడి ఉంటాయి. ఖనిజాలు, అడవులు, ఇంధనాలు, సారవంతమైన నేలలు మొదలైన సహజ వనరులు క్షీణించి పోవడం వలన రాబోయే కాలములో వ్యాపార సంస్థలపై దీని ప్రభావము ఉంటుంది.

AP Inter 1st Year Commerce Study Material Chapter 12 వ్యాపారంలో ప్రస్తుత ధోరణులు

5) ఆర్థిక మాంద్యము : ప్రపంచవ్యాప్తముగా అంతర్జాతీయ, ఆర్థిక, రాజకీయ వ్యవస్థ మార్పు చెందుతోంది. అమెరికా, ఐరోపాలో ప్రారంభమైన ఆర్థిక మాంద్యము ఇతర దేశాలలో పనితీరుపై ప్రభావాన్ని చూపుతోంది.

6) షర్యావరణ సవాళ్ళు : వ్యాపార సంస్థలు ఎదుర్కొంటున్న ముఖ్యమైన సవాళ్ళలో పర్యావరణ క్షీణత అతి పెద్ద సవాలు. ఆర్థిక, సాంఘిక, సామాజిక, రాజకీయ, సాంకేతిక పరిజ్ఞానానికి చెందిన పరిసరాలు వేగముగా మారుతున్నాయి.

7) సమాచార సవాళ్ళు : నిర్వహణ పరికరాలు, సాంకేతిక పరిజ్ఞానం బదిలీ చేసే ప్రక్రియలో భాగంగా ఇంటర్నెట్ ఉపయోగము, వైర్లెస్ సమాచారము, సాంకేతిక పరిజ్ఞానముతో కూడిన e – వాణిజ్యం వ్యాపార సంస్థలకు పెద్ద సవాళ్ళు. అత్యధిక ద్రవ్యోల్బణ రేటు, అధిక వడ్డీరేట్లు, తక్కువ ఆర్ధిక పెరుగుదల, నిత్యావసర వస్తువుల పెరుగుదల వ్యాపార సంస్థలను ప్రభావితం చేస్తున్నవి.

8) అవినీతి, అధికారుల అడ్డంకులు: ఈ రోజులలో అవినీతి అనేది వ్యాపార సంస్థలకు పెద్ద అడ్డంకి. దేశములో అవినీతి బాగా పాతుకొనిపోయి, రోజువారీ జీవితములో అనేక అంశాలను ప్రభావితం చేస్తున్నది.

9) పారదర్శకత, పరిపాలన : కార్పొరేటు పరిపాలన వ్యక్తుల, సంస్థల ఆసక్తులను కాపాడటానికి ఉపయోగ పడుతుంది. కార్పొరేటు సంస్థలు తీసుకునే నిర్ణయాలు, అవి పొందుపరుచుకున్న ఆసక్తులు ప్రభావాన్ని చూపుతాయి. కంపెనీల పరిపాలన, పారదర్శకత, ప్రభుత్వ నిఘా ఉంటుంది..

10) కార్పొరేటు సామాజిక బాధ్యత : CSR ఆచరణ, అమలులో అనేక సవాళ్ళను ఎదుర్కొంటోంది. CSR మన దేశములో ప్రారంభ దశలో ఉన్నది. CSR పై అవగాహన లేకపోవడం, శిక్షణ పొందిన ఉద్యోగుల తక్కువ సంఖ్య, విధాన అంశాలు, కవరేజి మొదలైన అంశాలు CSR కు అడ్డంకులు.

11) విదేశీ ద్రవ్యం మార్పిడి సమస్య: వ్యాపార సంస్థల నిర్వహణ సమస్యల విదేశీ మారకపు రేట్లలో అస్థిరత. ఇది మార్పిడిరేట్లు, ఎగుమతులు, దిగుమతులు, రాజకీయ అంశాల కారణముగా ఏర్పడినది.

12) మానవ వనరుల సవాళ్ళు : సరైన సిబ్బందిని నియమించడం, శిక్షణ ఇవ్వడం, వారిని నిలిపి ఉంచడం, HR విభాగపు నిధులు. మారుతున్న సాంకేతిక పరిజ్ఞానము కారణముగా IT నైపుణ్యము, సమస్య పరిష్కార నైపుణ్యం, రీజనింగ్ నైపుణ్యం గల అర్హులైన సిబ్బందిని నియమించడానికి సంస్థలు సమస్యలను ఎదుర్కొంటున్నవి.

13) భద్రత సమస్యలు : e – కామర్స్, వర్చువల్ ఆఫీసు వ్యాప్తిలో ముప్పులు ఎదురవుతాయి. ఈ ముప్పులు సమాచార భద్రత, ఇంటర్నెట్ భద్రత, భౌతిక భద్రత, కంపెనీ wireless access నెట్వర్క్, చట్టాలలో గోప్యత మొదలైన రూపాలలో జరుగుతుంది.

స్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
e – వ్యాపారం యొక్క పరిధిని వివరించండి.
జవాబు:
e – వ్యాపార పరిధి : e – వ్యాపారాన్ని క్రింది విధముగా విభజించవచ్చును.

  • ఒక వ్యాపార సంస్థలో మాత్రమే.
  • ఒక వ్యాపార సంస్థ మరొక వ్యాపార సంస్థ మధ్య వ్యవహారాలు.
  • ఒక వ్యాపార సంస్థ – వినియోగదారుని మధ్య వ్యవహారాలు
  • వినియోగదారుడు వినియోగదారుని మధ్య వ్యవహారాలు
  • వినియోగదారుడు – వ్యాపార సంస్థ మధ్య వ్యవహారాలు.

e – వ్యాపార పరిధి దిగువ అంశాలకు వర్తింపచేయడం జరుగుతుంది.
1) e – వాణిజ్యము : ఇంటర్నెట్ ద్వారా వ్యాపారాన్ని నిర్వహించడాన్ని e – వాణిజ్యము అంటారు. e వాణిజ్యానికి మంచి ఉదాహరణ ఆన్లైన్ ద్వారా వస్తువుల కొనుగోలు, అమ్మకము చేసే ప్రక్రియ.

AP Inter 1st Year Commerce Study Material Chapter 12 వ్యాపారంలో ప్రస్తుత ధోరణులు

2) e – వేలం : e – వేలములో సంబంధిత వెబ్సైటును సందర్శించి వేలంలో ప్రదర్శించిన వస్తువులను క్లిక్ చేస్తూ కొనుగోలు చేయవచ్చు. అదే విధముగా వెబ్ పేజీలో తమ వస్తువులను ఉంచి వేలం ద్వారా అమ్మకాలు చేయవచ్చు.

3) e – బ్యాంకింగ్ : ఎలక్ట్రానిక్ బ్యాంకింగ్ వెబ్సైట్ను ఉపయోగించి బ్యాంకు ఖాతాదారులు తమ అకౌంట్స్ నిర్వహించుకోవచ్చు. చెల్లింపులను చేయవచ్చు. అవసరమైన నగదును ATM ద్వారా పొందవచ్చు. ఖాతా నిల్వను – తెలుసుకోవచ్చు. నగదును బదిలీ చేయవచ్చు.

4) e – మార్కెటింగ్ : ఎలక్ట్రానిక్ మార్కెటింగ్ ఎలాంటి భౌగోళిక అడ్డంకులు లేకుండా వస్తువుల కొనుగోలుకు, అమ్మకాలకు ప్రపంచవ్యాప్తముగా మార్కెటింగ్ను ఏర్పాటు చేస్తుంది. ఖాతాదారుల డిమాండ్కు కంపెనీలు స్పందించేందుకు ఇంటర్నెట్ సహాయం చేస్తుంది.

5) e – వర్తకము : e – వర్తకాన్ని ఆన్లైన్ వర్తకము లేదా e – బ్రోకింగ్ అంటారు. ఇది స్టాక్ ఎక్స్ఛేంజ్లలో సెక్యూరిటీలను కొనడానికి, అమ్మడానికి ఉపయోగపడుతుంది.

ప్రశ్న 2.
e – వ్యాపారం వల్ల సంస్థలకు కలిగే ప్రయోజనాలు ఏవి ?
జవాబు:
e – వ్యాపారం వల్ల వ్యాపార సంస్థలకు కలిగే ప్రయోజనాలు :

  1. e – వ్యాపారము వలన సంస్థలు తమ ప్రస్తుత మార్కెట్ను జాతీయ, అంతర్జాతీయ స్థాయిలకు విస్తరింపచేసుకోవచ్చు. ఇది సంస్థ యొక్క అమ్మకాలను పెంచుతుంది.
  2. e– వ్యాపారము వలన వస్తువులను లేదా సేవలను సృష్టించడము, ప్రాసెసింగ్ చేయడం, పంపిణీ చేయడం, స్టోరింగ్ చేయడం, సమాచారాన్ని సేకరించడానికి అయ్యే వ్యయం తగ్గుతుంది.
  3. ఇన్వెంటరీ నిల్వ చేయడానికి, ఓవర్హెడ్ ఖర్చులు తగ్గుతాయి.
  4. పెట్టుబడికి, వస్తు సేవల అమ్మకం వలన వచ్చే ఆదాయానికి మధ్య ఉన్న సమయం తగ్గుతుంది.
  5. బిజినెస్ ప్రాసెస్, రీ- ఇంజనీరింగ్లకు సహకరిస్తుంది.
  6. టెలీ కమ్యూనికేషన్ ఖర్చు తక్కువగా ఉండటం వలన ఇంటర్నెట్ విలువ ఆధారిత నెట్వర్క్ వ్యయము కంటే తక్కువగా ఉంటుంది.

ప్రశ్న 3.
e – వ్యాపారం వల్ల వినియోగదారులకు కలిగే ప్రయోజనాలు ఏవి ?
జవాబు:
e – వ్యాపారం వల్ల వినియోగదారులకు కలిగే ప్రయోజనాలు :

  1. e – వ్యాపారము వలన వినియోగదారులు ఏ ప్రాంతం నుంచి అయినా, ఏ సమయంలోనైనా వ్యాపార వ్యవహారాలు నిర్వహించవచ్చు.
  2. e – వ్యాపారము వినియోగదారులకు వస్తు సేవలకు సంబంధించి, అనేక ప్రత్యామ్నాయాలు, అవకాశాలు కల్పిస్తాయి.
  3. e – వ్యాపారము ద్వారా వినియోగదారుడు అనేక ప్రాంతాలలోని మార్కెట్లలో వస్తు సేవలను పోల్చి చూసుకోవడానికి వీలవుతుంది.
  4. e- వ్యాపారము వస్తు సేవలు త్వరగా డెలివరీ కావడానికి దోహదము చేస్తుంది.
  5. వినియోగదారుడు వస్తు సేవలకు సంబంధించి సరైన సమాచారాన్ని పూర్తి స్థాయిలో క్షణాలలో పొందవచ్చును.
  6. వినియోగదారుడు సరైన వేలములో పాల్గొనేందుకు e – వ్యాపారము సహాయపడుతుంది.
  7. e– వ్యాపారము వినియోగదారుల మధ్య సహకారాన్ని ఏర్పరచి, ఒకరికొకరు వ్యాపార ఉపాయాలు, అనుభవాలు పంచుకునేటట్లు చేస్తుంది.
  8. e- వ్యాపారము వ్యాపారం మధ్య పోటీ తత్వాన్ని ఏర్పరచి, వినియోగదారులకు సరైన డిస్కౌంట్లు లభించేందుకు సహకరిస్తుంది.

AP Inter 1st Year Commerce Study Material Chapter 12 వ్యాపారంలో ప్రస్తుత ధోరణులు

ప్రశ్న 4.
e – వ్యాపార వ్యవహారాలలో కలిగే నష్ట భయాలను తెలపండి.
జవాబు:
e – వ్యాపార వ్యవహారాలలో కలిగే నష్ట భయాలు :

  1. ఇంటర్నెట్ వాడకములో సమాచారము అనధికారికముగా మార్చివేయబడడం. అనే నష్టభయమున్నది.
  2. రహస్యముగా ఉంచవలసిన వ్యక్తిగత సమాచారము మరియు క్రెడిట్ కార్డు వివరాలు, పాస్వర్డ్ లాంటి బ్యాంకింగ్ సమాచారానికి సంబంధించిన నష్టభయాలు.
  3. e – వాణిజ్యం ద్వారా జరిగే వ్యవహారాలకు భౌతిక ఆధారాలు లేని కారణముగా చట్టబద్ధతకు సంబంధించిన నష్టభయాలు ఎక్కువ.
  4. ఎలక్ట్రానిక్ సమాచారం అందించడములో వైఫల్యం, మొత్తము వ్యాపారము ముగింపుకు దారితీసే నష్టభయాలు.
  5. నిర్వాహక వర్గం, e – వాణిజ్య వ్యవహారాలు తన అదుపులో ఉంచుకొని, సరి చూసుకొని మరియు తగిన సమాచార పద్ధతులు ఎంచుకోవడంలోని నష్ట భయాలు.
  6. వైరస్లు, హ్యాగింగ్ంటి సాంకేతికపరమైన నష్ట భయాలు.

ప్రశ్న 5.
e – వ్యాపార వ్యవహారాల వల్ల సమాజానికి కలిగే ప్రయోజనాలను తెలపండి.
జవాబు:
e – వ్యాపారము వల్ల సమాజానికి కలిగే ప్రయోజనాలు :

  1. ఇంటినుంచే పనిచేసుకోవడానికి అవకాశము ఉండటం వలన షాపింగ్ కోసము ప్రయాణాలు తగ్గుతాయి. రోడ్లపై ట్రాఫిక్ సమస్యలు తగ్గుతాయి. దీనివలన వాయు కాలుష్యం తగ్గుతుంది. అంతేకాకుండా సమయము కూడా ఆదా అవుతుంది.
  2. వ్యాపారస్తులు తమ వస్తువులను ఇంటర్ నెట్ ద్వారా తక్కువ ధరలకు అమ్మడం వలన పేదవారికి ప్రయోజనం లభిస్తుంది.
  3. ప్రపంచ దేశాలలో, గ్రామీణ ప్రాంతాలలో ఉండే ప్రజలకు, మార్కెట్ లో లభించని వస్తు సేవలను e – వ్యాపారము ద్వారా పొందవచ్చు.
  4. వస్తు సేవలు తక్కువ వ్యయానికి లభించడమే కాకుండా, వాటి మన్నిక, నాణ్యత కూడా పెరుగుతుంది.

అతి స్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
e – వ్యాపారం
జవాబు:
వ్యాపారము e- వ్యాపారం అనే పదాన్ని మొదటిసారిగా 1997లో IBM ఉపయోగించినది. దీని ప్రకారము e- అంటే ‘ఇంటర్నెట్ పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తూ ముఖ్యమైన వ్యాపార దశలను బదలాయింపు చేయడం’. అన్ని వ్యాపార కార్యకలాపాలను, వ్యాపార పరిధిని బలపరచడానికి Information and Communication Technology సహకారాన్ని ఇంటర్నెట్ల ద్వారా తీసుకోవడం – వ్యాపారముగా నిర్వచించవచ్చు.

 

ప్రశ్న 2.
e – బ్యాంకింగ్ [T.S. Mar 15]
జవాబు:
ఎలక్ట్రానిక్ బ్యాంకింగ్ మంచి విజయవంతమైన ఆన్లైన్ వ్యాపారము. బ్యాంకింగ్ వెబ్సైట్ను ఉపయోగిస్తూ బ్యాంకు ఖాతాదారులు తమ అకౌంట్స్ నిర్వహించుకోవడానికి, చెల్లింపులు, ఆజ్ఞ ఇవ్వడానికి e-బ్యాంకింగ్ సహాయము చేస్తుంది. ఆన్లైన్ బ్యాంకింగ్ ద్వారా ఖాతాదారులు బ్యాంకును సందర్శించనవసరము లేకుండా అవసరమైన నగదును | ATM ద్వారా పొందవచ్చును. ఖాతా నిల్వలు తెలుసుకోవచ్చు. బిల్లులను చెల్లించవచ్చు. నగదును బదిలీ చేయవచ్చు.

ప్రశ్న 3.
e – మార్కెటింగ్ [A.P. Mar. ’15]
జవాబు:
ఎలక్ట్రానిక్ మార్కెటింగ్లో ఎలాంటి భౌగోళిక అడ్డంకులు లేకుండా వస్తువుల కొనుగోలుకు, అమ్మకాలకు ప్రపంచ వ్యాప్తముగా మార్కెటింగ్ ఏర్పాటు చేస్తుంది. ఎలాంటి సమయ భావన లేకుండా ఖాతాదారుల డిమాండ్కు కంపెనీ స్పందించేందుకు ఇంటర్నెట్ సహాయము చేస్తుంది. దీనికి వినియోగదారుడు ఉండే ప్రాంతముతో సంబంధం లేదు.

AP Inter 1st Year Commerce Study Material Chapter 12 వ్యాపారంలో ప్రస్తుత ధోరణులు

ప్రశ్న 4.
e – వాణిజ్యం
జవాబు:
ఇంటర్నెట్ ద్వారా వ్యాపారాన్ని నిర్వహించడాన్ని e-వాణిజ్యము అంటారు. ఎలక్ట్రానిక్ వాణిజ్యమును e – వాణిజ్యం · అని వ్యవహరిస్తారు. ఆన్లైన్ ద్వారా వస్తువుల కొనుగోలు, అమ్మకం చేసే ప్రక్రియ దీనికి మంచి ఉదాహరణ. అంతేకాకుండా e-వాణిజ్యములో అనేక కార్యకలాపాలు కలిసి ఉంటాయి. ఏదైనా కార్యకలాపాన్ని ఎలక్ట్రానిక్ పరికరము ద్వారా నిర్వహించడాన్ని e- వాణిజ్యం అనవచ్చు.

ప్రశ్న 5.
e – వర్తకం
జవాబు:
e-వర్తకాన్ని ఆన్లైన్ వర్తకమని, e- బ్రోకింగ్ అని కూడా వ్యవహరిస్తారు. ఇది స్టాక్ ఎక్స్ఛేంజ్లలో సెక్యూరిటీలను అమ్మడానికి, కొనడానికి సహాయపడుతుంది.