AP Inter 2nd Year Botany Study Material Chapter 8 వైరస్లు

Andhra Pradesh BIEAP AP Inter 2nd Year Botany Study Material 8th Lesson వైరస్లు Textbook Questions and Answers.

AP Inter 2nd Year Botany Study Material 8th Lesson వైరస్లు

అతి స్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
T ఫాజ్ ఆకారం ఏమిటి ? దానిలోని జన్యు పదార్థాన్ని తెలపండి.
జవాబు:
తోకకప్ప ఆకారము. దానిలోని జన్యు పదార్థము 2 పోచల DNA.

ప్రశ్న 2.
విరులెంట్ ఫాజ్లు అంటే ఏమిటి ? ఉదాహరణ ఇవ్వండి.
జవాబు:
T- సరిసంఖ్య ఫాజ్లు, ఎ.కోలై అనే బాక్టీరియమ్లపై దాడిచేసి కణాలను విచ్ఛిన్నం చేస్తాయి. వీటిని విరులెంట్ ఫాజ్లు అంటారు. ఉదా : బాక్టీరియోఫాజ్.

ప్రశ్న 3.
లైసోజైమ్ అంటే ఏమిటి ? దాని విధి ఏమిటి ?
జవాబు:
లైసోజైమ్ ఒక వైరల్ ఎన్జైమ్. ఇది బాక్టీరియల్ కణ కవచాన్ని కరిగించి, కొత్తగా ఉత్పత్తి చేసుకున్న ఫాజ్ రేణువుల విడుదల అవటానికి తోడ్పడుతుంది.

AP Inter 2nd Year Botany Study Material Chapter 8 వైరస్లు

ప్రశ్న 4.
వైరస్లకు సంబంధించి ‘విచ్ఛిన్నం’, ‘పగిలే పరిమాణం’ లను నిర్వచించండి. అతిథేయి కణాలపై వాటి ప్రభావం ఏమిటి ?
జవాబు:
విచ్ఛిన్నము : బాక్టీరియల్ కణ కవచం కరిగి, కొత్తగా ఉత్పత్తి అయిన విరియన్లు విడుదల కావడంను విచ్ఛిన్నము అంటారు. పగిలే పరిమాణము : సంక్రమణకు గురి అయిన ఒక అతిథేయి కణం నుంచి నూతనంగా సంశ్లేషణ చెంది విడుదలయ్యే విరియన్ల సంఖ్యను పగిలే పరిమాణము అంటారు. దీనివల్ల అతిథేయి కణాలు నశిస్తాయి.

ప్రశ్న 5.
ప్రొఫాజ్లు అంటే ఏమిటి ?
జవాబు:
కొన్ని బాక్టీరియోఫాజ్ల DNA బాక్టీరియమ్లోనికి ప్రవేశించి, దాని DNA తో కలిసిపోయి ఉంటుంది. వాటిని ప్రొఫాజ్లు అంటారు.

ప్రశ్న 6.
‘టెంపరేట్ ఫాజ్’ లు అంటే ఏమిటి ? ఒక ఉదాహరణ ఇవ్వండి.
జవాబు:
కొన్ని బాక్టీరియో ఫాజ్ల DNA, బాక్టీరియమ్లోకి ప్రవేశించి, దాని DNA తో కలిసిపోయి కొంతకాలం పాటు దానితోపాటు ప్రతికృతి చెందుతుంది. వాటిని టెంపరేట్ ఫాజ్లు అంటారు. ఉదా : కోలైఫాజ్ లామ్డా.

ప్రశ్న 7.
విరులెంట్ ఫాజ్లు, టెంపరేట్ ఫాజ్ల మధ్య భేదాలను తెలపండి. [A.P. Mar. ’15]
జవాబు:
విరులెంట్ ఫాజ్లు

  1. బాక్టీరియమ్ కణాలను విచ్ఛిన్నం చేస్తాయి.
  2. ఇవి లైటిక్ చక్రంను ప్రదర్శిస్తాయి.
  3. T-సరిసంఖ్యగల బాక్టీరియోఫాజ్లు ఉదా : లాంబ్దాషాజ్

టెంపరేట్ ఫాజ్లు

  1. బాక్టీరియమ్ DNAతో కలసిపోయి కొంతకాలం పాటు దానితో పాటు ప్రతికృతి చెందుతుంది.
  2. ఇవి లైసోజెనిక్ చక్రాన్ని ప్రదర్శిస్తాయి.

ప్రశ్న 8.
TMV ఆకారము ఏమిటి ? దానిలోని జన్యుపదార్థము ఏది ? [T.S. Mar. ’16 ’15]
జవాబు:
TMV దండాకారంలో ఉంటుంది. దానిలోని జన్యుపదార్థము RNA.

స్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
ICTV అంటే ఏమిటి ? వైరస్ల ను నామీకరణం చేసే విధానం ఏమిటి ?
జవాబు:
ఇంటర్నేషనల్ కమిటీ ఆన్ టాక్సానమీ ఆఫ్ వైరసెస్ (ICTV] వైరస్ల నామీకరణ, వర్గీకరణకు సంబంధించిన నిబంధనలను నియంత్రిస్తుంది. ICTV పథకంలో మూడు వర్గీకరణ స్థాయిలు ఉన్నాయి – కుటుంబము, ప్రజాతి మరియు జాతి. కుటుంబము పేరు ‘విరిడే’ అను పదంతో అంతమవుతుంది. ప్రజాతి నామము వైరస్ ను, జాతి నామము వాటి స్వభావాన్ని వర్ణిస్తూ సాధారణ ఆంగ్లంలో వ్యక్తపరచబడతాయి. వైరస్ల నామీకరణ అవి కలుగజేసే వ్యాధులను బట్టి ఉంటుంది. ఉదా : పోలియో వైరస్. ICTV పద్ధతి ద్వారా మానవులలో AIDS ను కలుగజేసే వైరసన్ను కుటుంబం : రిట్రోవిరిడే, ప్రజాతి లెంటి వైరస్, జాతి : హ్యూమన్ ఇమ్యూన్ డెఫిసియన్సీ వైరస్ గా వర్గీకరించవచ్చు.

AP Inter 2nd Year Botany Study Material Chapter 8 వైరస్లు

ప్రశ్న 2.
వైరస్ల రసాయన నిర్మాణాన్ని వివరించండి.
జవాబు:
అన్ని వైరస్లు రెండు ప్రాథమిక అంశాలను కలిగి ఉంటాయి. అవి : జీనోమ్ను ఏర్పరిచే కేంద్రంగా ఉన్న ఒక కేంద్రకామ్లము, దానిని ఆవరించి ఉన్న కాప్సిడ్ అనే ప్రోటీన్ తొడుగు. కాప్సిడ్ వైరస్కు ఆకారాన్ని ఇస్తుంది, జీనోమ్కు రక్షణనిస్తుంది. కాప్సిడ్లోని ఉప ప్రమాణాలను కాప్సోమియర్లు అంటారు. వైరస్ జన్యు సమాచారాన్ని రెండు పోగుల DNA లేదా ఒక పోగు DNA రూపంలో కలిగి ఉంటుంది. మొక్కలను ఆశించే వైరస్లలో ఒక పోగు గల RNA, జంతువులను ఆశించే వైరస్లలో 2 పోగులు DNA ఉంటాయి. బాక్టీరియోఫాజ్లలో 2 పోగుల DNA ఉంటుంది. అనేక వైరస్లు, ఒక కేంద్రకామ్లపు అణువును కలిగి ఉంటాయి. కాని కొన్ని వైరస్లు ఒకటి కంటే ఎక్కువ కలిగి ఉంటాయి.
ఉదా : HIV లో రెండు సారూప్యత గల RNA అణువులు ఉంటాయి.

ప్రశ్న 3.
TMV నిర్మాణాన్ని వివరించండి.
జవాబు:
ఇది దండాకార వైరస్. ఇది సుమారుగా 300 nm పొడవు, 18 nm వ్యాసంతో, 39 x10° డాల్టన్ల అణుభారంతో ఉంటుంది. కాప్సిస్లో 2130 ఉప ప్రమాణాలైన కాప్సోమియర్లు ఉంటాయి. ఇవి మధ్యలో 4 nm తో బోలుగా ఉన్న ప్రదేశాన్ని చుట్టి సర్పిల క్రమంలో ఉంటాయి. ప్రతి కాప్సోమియర్ 158 అమైనో ఆమ్లాలతో కూడిన ఒక పాలిపెప్టైడ్ గొలుసు ఉంటుంది. కాప్సిడ్ లోపల, 6500 న్యూక్లియోటైడ్లు కలిగిన ఒకే పోగు గల RNA సర్పిలాకారంలో చుట్టుకొని ఉంటుంది.
AP Inter 2nd Year Botany Study Material Chapter 8 వైరస్లు 1

ప్రశ్న 4.
T- సరిసంఖ్య గల బాక్టీరియోఫాజ్ల నిర్మాణాన్ని వివరించండి. [A.P. Mar. ’17 May ’14]
జవాబు:
పొగాకు మొజాయిక్ వైరస్ – సర్పిలాకార సౌష్ఠవం
బాక్టీరియమ్లపై దాడిచేయు వైరస్లను బాక్టీరియో ఫాజ్లు అంటారు. వీటిని ట్వార్ట్ అనువారు కనుగొన్నారు. ఇవి తోకకప్ప ఆకారంలో, తల మరియు తోక అను భాగాలను కలిగి ఉంటుంది. తలభాగము షడ్భుజాకారంలో సుమారు 65 × 95 ల పరిమాణంలో ఉంటుంది. తల పై భాగము షడ్భుజాకారంలో ఉన్న పిరమిడ్ లా ఉంటుంది. తల భాగమును ఆవరించిన ఉన్న ప్రోటీను తొడుగులో అనేక కాప్సోమియర్లు (ఒక ప్రోటీను నిర్మితమైన) ఉంటాయి. తల కాప్సిడ్ లోపల రెండు పోగుల DNA అనేక ముడతలు పడి ఉంటుంది.

తోక భాగము పొడవుగా, గొట్టంలా ఉండి, చివర వాలుఫలకము (ఆధార ఫలకము) వరకు ఉంటుంది. తోక భాగంను ఆవరించి ఉన్న కాప్సిడ్ 144 కాప్సోమియర్లు 24 వలయాలలో, వలయానికి 6 చొప్పున అమరి ఉంటాయి. తల తోకభాగమును కలుపుతూ కాలర్ ఉంటుంది. దానికి విధి తెలియదు. తోక చివర ఒక ఆధార ఫలకము (షడ్భుజాకారము) దాని ప్రతి మూల నుండి తోకపిన్నులు, తోకపోచలు ఏర్పడి ఉంటాయి. తోకపోచలు వైరస్, అతిథేయి కణానికి అంటిపెట్టు కోవడంలో సహాయపడతాయి.
AP Inter 2nd Year Botany Study Material Chapter 8 వైరస్లు 2

AP Inter 2nd Year Botany Study Material Chapter 8 వైరస్లు

ప్రశ్న 5.
కొన్ని వైరస్లకు సంబంధించి లైటిక్ చక్రాన్ని వివరించండి.
జవాబు:
T- సరిసంఖ్య గల ఫాజ్లు ఎ.కోలై (E.coli) అనే బాక్టీరియమ్లపై దాడిచేసి కణాలను విచ్ఛిన్నం చేస్తాయి. వీటిని విరులెంట్ ఫాజ్లు అని అంటారు. ఇవి లైటిక్ చక్రాన్ని చూపుతాయి. ఇది 5 దశలుగా జరుగుతుంది. అవి : అంటిపెట్టుకొనుట, ప్రవేశం, జీవ సంశ్లేషణ పరిపక్వత, విడుదల.
1) అంటిపెట్టుకొనుట : ఫాజ్లు తోక పోచలతో బాక్టీరియల్ కణ కవచం మీద సంపూరక గ్రహీత స్థానాల వద్ద అంటి పెట్టుకుంటాయి.

2) ప్రవేశము : ఫాజ్ తోక తొడుగు సంకోచించడం వల్ల తోక కేంద్రభాగము బాక్టీరియమ్ల కణ కవచం ద్వారా లోనికి చొచ్చుకుపోతుంది. తోక కొనభాగం ప్లాస్మా త్వచాన్ని చేరేసరికి బాక్టీరియోఫాజ్, తలభాగం నుంచి తోక మధ్యభాగం ద్వారా, ప్లాస్మా త్వచం ద్వారా ప్రయాణిస్తూ బాక్టీరియమ్ల కణం లోకి ప్రవేశిస్తుంది. ఫాజ్ కాప్సిడ్ బాక్టీరియమ్ కణం వెలుపల ఉండిపోతుంది. దీనిని ఘోస్ట్ అంటారు. కావున ఫాజ్ రేణువు ఉపబాహ్య చర్మ సిరంజి వలె పనిచేస్తూ, DNA ను బాక్టీరియమ్ కణంలోకి చొప్పిస్తుంది.

3) జీవ సంశ్లేషణ : ఫాజ్ DNA ఆతిథేయి కణంలోకి కణద్రవ్యంలోకి చేరిన తరువాత ఆతిథేయి కణ యాంత్రికాన్ని ఉపయోగించుకొని అనేక ఫాజ్ DNA నకళ్ళు, కాప్సిడ్ ప్రొటీన్లు ఎన్ఎమ్ల సంశ్లేషణ చెందుతాయి.

4) పరిపక్వత : ఫాజ్ DNA, కాప్సిడ్లు కూర్చి పూర్తి విరియన్లు ఏర్పడతాయి. వైరస్చే సంక్రమణ జరిగే కణంలో ముదిరిన వైరస్ కనిపించే వరకు మధ్య కాలాన్ని గుప్తదశ అంటారు.

5) విడుదల : ఆతిథేయి కణ ప్లాస్మాత్వచం, ఆ కణంలోనే సంశ్లేషణ చెందే లైసోజైమ్ అనే ఒక ఎన్జైమ్చే కరిగించబడి, బాక్టీరియల్ కణకవచం పగిలిపోయి, కొత్తగా ఉత్పత్తి అయిన విరియన్లు విడుదల అవుతాయి.

దీర్ఘ సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
వైరస్ల ఆవిష్కరణ, నిర్మాణాత్మక సంవిధానాన్ని గూర్చి రాయండి.
జవాబు:
ఆవిష్కరణ : మొట్టమొదట, రష్యన్ పెథాలజిస్ట్ డిమిత్రి ఐవనోస్కీ పొగాకు మొజాయిక్ వ్యాధి గురించి అధ్యయనం జరుపుతూ, వ్యాధిగ్రస్త, పొగాకు ఆకుల రసాన్ని బాక్టీరియమ్ల వడపోత పరికరం ద్వారా గాలనం జరిపి, ఆ రసాన్ని ఆరోగ్యవంతమైన పత్రాలపై రుద్దిన, వాటిలో మొజాయిక్ వ్యాధి చిహ్నాలు అభివృద్ధి చెందడాన్ని గుర్తించాడు. ఆ ద్రవంలో ఏ సూక్ష్మజీవి చూడనప్పటికి, ఐవనోస్కీ ఒక గాలనీయ కారకం వ్యాధికి కారణమై ఉంటుందని అన్నారు.

మార్టినస్ బైజరింక్, ఐవనోస్కీ ప్రయోగాలను పునఃప్రయోగించి, వ్యాధిని కలిగించే కారకాన్ని సజీవ సంక్రామిక ద్రవం’ అని అంటారు.

డబ్ల్యు. ఎమ్. స్టాన్లీ (1935) ద్రవాన్ని శుద్ధిచేసి పొగాకులో మొజాయిక్ తెగులును కలిగించే వైరస్ ను స్ఫటికీకరించవచ్చని ప్రకటించి, దానికి TMV అని పేరు పెట్టారు.

ఫ్రెంకెల్ కమ్రాట్ (1956) TMV లో జన్యు పదార్థం RNA అని నిర్ధారణ చేసాడు.

నిర్మాణము : వైరస్ల పరిమాణం 300 nm నుండి పార్వో వైరస్లలో వలె 20 nm వరకు ఉంటుంది.

అన్ని వైరస్లు రెండు ప్రాథమిక అంశాలను కలిగి ఉంటాయి. అవి : జీనోము ఏర్పరిచే కేంద్రంగా ఉన్న ఒక కేంద్రకామ్లము, దానిని ఆవరించి ఉన్న కాప్సిడ్ అనే ప్రోటీను తొడుగు. కాప్సిడ్ వైరస్కు ఆకారాన్ని ఇస్తుంది, జీనోమ్కు రక్షణనిస్తుంది. కాప్సిడ్లోని ఉప ప్రమాణాలను కాప్సోమియర్లు అంటారు. వైరస్ జన్యు సమాచారాన్ని రెండు పోగుల DNA లేదా ఒక పోగు DNA రూపంలో కలిగి ఉంటుంది. మొక్కలను ఆశించే వైరస్లలో ఒక పోగు గల RNA, జంతువులను ఆశించే వైరస్లలో 2 పోగుల DNA ఉంటాయి. బాక్టీరియోఫాజ్లలో 2 పోగుల DNA ఉంటుంది. అనేక వైరస్లు, ఒక కేంద్రకామ్లపు అణువును కలిగి ఉంటాయి. కాని కొన్ని వైరస్లు ఒకటి కంటే ఎక్కువ కలిగి ఉంటాయి. ఉదా : HIV లో రెండు సారూప్యత గల RNA అణువులు ఉంటాయి.

ఆకారము :
a) సర్పిల వైరస్లు : ఇవి పొడవుగా దండాల వలె ఉంటాయి. ఉదా : రేబిస్ వైరస్, TMV.

b) బహుభుజాకృతి : ఇవి బహుతలాల్లో ఉంటాయి.
ఉదా : హెర్పిస్ సింప్లెక్స్, పోలియో వైరస్.

c) ఆచ్ఛాదిత వైరస్లు : కాప్సిడ్ ఒక ఆచ్ఛాదనతో ఆవరింపబడి ఉంటుంది. ఉదా : ఇన్ఫ్లుయెంజా వైరస్. d) సంక్లిష్ట వైరస్లు : బాక్టీరియమ్లను ఆశించే వైరస్లు సంక్లిష్ట నిర్మాణంలో ఉంటాయి.
ఉదా : బాక్టీరియోఫాజ్లు తల భాగంలో బహుభుజి సౌష్టవంను, తోకభాగంలో సర్పిలాకార సౌష్టవంను చూపుతాయి.

ప్రశ్న 2.
వైరస్ల వృద్ధి విధానాన్ని వర్ణించండి.
జవాబు:
ఫాజ్లు రెండు ప్రత్యామ్నాయ యాంత్రికాల ద్వారా వృద్ధి చెందుతాయి. అవి : లైటిక్ చక్రం, లైసోజెనిక్ చక్రం.

లైటిక్ చక్రము : T- సరిసంఖ్య గల ఫాజ్లు ఎ.కోలై (E.coli) అనే బాక్టీరియమ్లపై దాడిచేసి కణాలను విచ్ఛిన్నం చేస్తాయి. వీటిని విరులెంట్ ఫాజ్లు అని అంటారు. ఇవి లైటిక్ చక్రాన్ని చూపుతాయి. ఇది 5 దశలుగా జరుగుతుంది. అవి : అంటి పెట్టుకొనుట, ప్రవేశం, జీవ సంశ్లేషణ పరిపక్వత, విడుదల.

1) అంటిపెట్టుకొనుట : ఫాజ్లు తోక పోచలతో బాక్టీరియమ్లు కణ కవచం మీద సంపూరక గ్రహీత స్థానాల వద్ద అంటి పెట్టుకుంటాయి.

AP Inter 2nd Year Botany Study Material Chapter 8 వైరస్లు

2) ప్రవేశము : ఫాజ్ తోక తొడుగు సంకోచించడం వల్ల తోక కేంద్రభాగము బాక్టీరియమ్ల కణకవచం ద్వారా లోనికి చొచ్చుకుపోతుంది. తోక కొనభాగం ప్లాస్మాత్వచాన్ని చేరేసరికి బాక్టీరియోఫాజ్, తలభాగం నుంచి తోక మధ్యభాగం ద్వారా, ప్లాస్మా త్వచం ద్వారా ప్రయాణిస్తూ బాక్టీరియమ్ల కణం లోనికి ప్రవేశిస్తుంది. ఫాజ్ కాప్సిడ్ బాక్టీరియమ్ కణం వెలుపల ఉండిపోతుంది. దీనిని ఘోస్ట్ అంటారు. కావున ఫాజ్ రేణువు ఉపబాహ్య చర్మ సిరంజి వలె పనిచేస్తూ, DNA ను బాక్టీరియల్ కణంలోకి చొప్పిస్తుంది.

3) జీవ సంశ్లేషణ : ఫాజ్ DNA ఆతిథేయి కణంలోకి కణద్రవ్యంలోకి చేరిన తరువాత ఆతిథేయి కణ యాంత్రికాన్ని ఉపయోగించుకొని అనేక ఫాజ్ DNA నకళ్ళు, కాప్సిడ్ ప్రొటీన్లు ఎన్జైమ్ల సంశ్లేషణ చెందుతాయి.

4) పరిపక్వత : ఫాజ్ DNA, కాప్సిడ్లు కూర్చి పూర్తి విరియన్లు ఏర్పడతాయి. వైరస్చే సంక్రమణ జరిగే కణంలో ముదిరిన వైరస్ కనిపించే వరకు మధ్య కాలాన్ని గుప్తదశ అంటారు.

5) విడుదల : ఆతిథేయి కణ ప్లాస్మాత్వచం, ఆ కణంలోనే సంశ్లేషణ చెందే లైసోజైమ్ అనే ఒక ఎన్ఎమ్చే కరిగించబడి, బాక్టీరియల్ కణ కవచం పగిలిపోయి, కొత్తగా ఉత్పత్తి అయిన విరియన్లు విడుదల అవుతాయి.

లైసోజెనిక్ చక్రము : కొన్ని లామ్గాఫాజ్లు (1) వృద్ధి చెందేటప్పుడు ఆతిథేయికణం విచ్ఛిన్నం చెందడం గానీ, నాశనం గాని జరుగదు. దీనికి బదులు ఫాజ్ DNA, ఎ.కోలై కణంలోకి ప్రవేశించాక వలయాకార బాక్టీరియల్ DNA తో సమాకలితమై, దానిలో ఒక భాగమై గుప్తంగా ఉండిపోతుంది. దానిని ప్రోఫాజ్ అంటారు. బాక్టీరియమ్ జన్యు పదార్థము ప్రతికృతి జరిగిన ప్రతిసారి ప్రోఫాజ్ కూడ ప్రతికృతి చెందుతుంది. తర్వాత సంతతి కణాలలో ప్రోఫాజ్ గుప్తంగా ఉండిపోతుంది. కొన్ని యాదృచ్ఛిక సంఘటనలలో లేదా ఆతిథేయి కణం అతినీలలోహిత కాంతికి గాని, లేదా కొన్ని రసాయనాల ప్రభావానికి గురి అయినప్పుడు ఫాజ్ DNA బాక్టీరియల్ జన్యు పదార్థం నుండి తెగిపోయి లైటిక్ చక్రం ఆరంభానికి దారితీస్తుంది. ఈ సమయంలో ప్రోఫాజ్లలోనికి అదనపు DNA చేరి, అవి మరల వేరొక బాక్టీరియమ్లపై దాడిచేసినప్పుడు, అదనపు DNA ముక్కలు ఆ బాక్టీరియల్ కణాలలో కనిపిస్తాయి.
AP Inter 2nd Year Botany Study Material Chapter 8 వైరస్లు 3

AP Inter 2nd Year Botany Study Material Chapter 8 వైరస్లు

అభ్యాసాలు

ప్రశ్న 1.
వైరస్ల వృద్ధిని గురించి చర్చించేటప్పుడు, వైరాలజిస్టులు ఈ విధానాన్ని ప్రత్యుత్పత్తి అనడం కంటే ప్రతికృతి అని పిలవడానికి మొగ్గు చూపుతారు. ఎందుకు ?
జవాబు:
వైరస్లు అవి దాడిచేసే ఆతిథేయికణాల జీవక్రియా యంత్రాంగాన్ని ఉపయోగించుకుని మాత్రమే వృద్ధి చెందుతాయి. కావున వైరస్ వృద్ధిని ప్రతికృతి అని అంటారు.

ప్రశ్న 2.
ప్రజారోగ్య నిర్వహణలో, బాక్టీరియమ్ల వ్యాధులను ఎదుర్కొనడానికి చికిత్సా విధానాన్ని అనుసరిస్తారు. వైరల్ వ్యాధులకు ఆచరించబడే సాధారణ ప్రజారోగ్య చికిత్స విధాన స్వభావం ఏమిటో ఊహించగలరా ? మీ జవాబును బలపరచడానికి ఎలాంటి ఉదాహరణ చూపుతారు ?
జవాబు:
“Prevention is better than cure” – AIDS – HIV.