AP Inter 2nd Year Chemistry Study Material Chapter 6(d) 18వ గ్రూపు మూలకాలు

Andhra Pradesh BIEAP AP Inter 2nd Year Chemistry Study Material Lesson 6(d) 18వ గ్రూపు మూలకాలు Textbook Questions and Answers.

AP Inter 2nd Year Chemistry Study Material Lesson 6(d) 18వ గ్రూపు మూలకాలు

అతిస్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
Xe, PtF6ల మధ్య చర్య జరపడానికి బార్టిలెట్ను ప్రేరేపించినది ఏమిటి?
జవాబు:

  1. బార్టెట్ మొదట ఎర్రటి సమ్మేళనమైన O+2 + PtF6 ను తయారు చేయబడినది.
  2. ఆ తరువాత అతడు అణు ఆక్సిజన్ ప్రథమ అయనీకరణ ఎంథాల్పీ గ్జినాన్కు దాదాపు సమానం అని గుర్తించాడు. అందువలన అతడు అటువంటి సమ్మేళనాన్ని తయారు చేయటానికి ప్రయత్నం చేశాడు.
  3. PtF6 ను Xe తో కలిపి Xe+ PtF6 అనే ఒక ఎర్రని సమ్మేళనాన్ని తయారుచేసి విజయం సాధించాడు.

ప్రశ్న 2.
కింది వాటిలో దేనికి అస్థిత్వం లేదు?
ఎ) XeOF4 బి) NeF2 సి) XeF2 డి) XeF6
జవాబు:
ఇవ్వబడిన సమ్మేళనాలలో NeF2 కు అస్థిత్వం లేదు. ఎందువలన అనగా Ne తక్కువ పరిమాణం కలిగి అధిక అయనీకరణ శక్తి కలిగి ఉంటుంది. కావున ఇది రసాయన సమ్మేళనాలను ఏర్పరచదు.

ప్రశ్న 3.
ఉత్కృష్ట వాయువులకు తులనాత్మకంగా అధిక పరమాణు పరిమాణం ఎందుకు ఉంటుంది?
జవాబు:
ఉత్కృష్ట వాయువులకు తులనాత్మకంగా అధిక పరమాణు పరిమాణం ఉంటుంది. దీనికి కారణం ఈ వాయువులు వాండర్ వాల్ వ్యాసార్థం కలిగి ఉంటాయి. ఈ వ్యాసార్ధం అయానిక మరియు సంయోజనీయ వ్యాసార్థాల కంటే ఎక్కువ.

ప్రశ్న 4.
నియాన్ ఉపయోగాలు వ్రాయండి.
జవాబు:
Ne ఉపయోగాలు :

  1. Ne – ను ఉత్సర్గనాళికలో ప్రకటనల కోసం వాడే ప్రతిదీప్తి బల్బులలో ఉపయోగిస్తారు.
  2. ఉద్యానవనాలలో, హరితగృహాలలో నియాన్ బల్లు ఉపయోగిస్తారు.

ప్రశ్న 5.
ఆర్గాన్ రెండు ఉపయోగాలు వ్రాయండి.
జవాబు:
Ar ఉపయోగాలు :

  1. ఆర్గానన్ను ప్రధానంగా అధిక ఉష్ణోగ్రతా లోహ సంగ్రహణ ప్రక్రియలలో జడ రసాయనిక వాతావరణాన్ని కల్పించటానికి ఉపయోగిస్తారు.
  2. ఆర్గాన న్ను విద్యుత్ బలను నింపడానికి ఉపయోగిస్తారు.

ప్రశ్న 6.
ఈతగాళ్ళు వాడే ఆధునిక పరికరాల్లో He, O2 ల మిశ్రమాన్ని ఉపయోగిస్తారు. ఎందుకు? [AP. Mar.’16]
జవాబు:
ఈతగాళ్ళు వాడే ఆధునిక పరికరాల్లో He, O2 ల మిశ్రమం ఉపయోగిస్తారు. ఎందువలన అనగా ‘He’ రక్తంలో తక్కువ ద్రావణీయత, కలిగి ఉంటుంది.

AP Inter 2nd Year Chemistry Study Material Chapter 6(d) 18వ గ్రూపు మూలకాలు

ప్రశ్న 7.
హైడ్రోజన్ కంటే హీలియమ్ బరువైనది. అయినప్పటికీ వాతావరణ పరిశీలనకు వాడే బెలూన్లలో హీలియమ్ను (H2 కు బదులుగా) వాడతారు. ఎందుకు?
జవాబు:
హీలియం తేలికైన మండే స్వభావం లేని వాయువు అందువలన వాతావరణ పరిశీలనకు వాడే బెలూన్లలో హీలియంను
వాడతారు.

ప్రశ్న 8.
XeO3ని ఎలా తయారుచేస్తారు?
జవాబు:
XeF6ని జల విశ్లేషణ చేయగా XeO3 ఏర్పడును.
XeF6 + 3H2O – XeO3 + 6HF

ప్రశ్న 9.
(ఎ) XeOF4, (బి) XeO2F2 ల తయారీని తెలపండి.
జవాబు:
XeF6 ని పాక్షిక జల విశ్లేషణ చేయగా XeOF4 మరియు XeO2F2 ఏర్పడతాయి.
(ఎ) XeF6 + H2O → XeOF4 + 2HF
(బి) XeF6 + 2H2O → XeO2F2 + 4HF

ప్రశ్న 10.
XeO3 నిర్మాణం వివరించండి.
జవాబు:
XeO3 నిర్మాణం :
1) XeO3 లో మధ్యస్థ పరమాణువు ‘Xe’.
2) ‘Xe’ మూడవ ఉద్రిక్త స్థాయిలో sp³ సంకరీకరణం చెందును.
AP Inter 2nd Year Chemistry Study Material Chapter 6(d) 18వ గ్రూపు మూలకాలు 1
3) ‘Xe’ మూడు ఆక్సిజన్ పరమాణువులతో మూడు σ – బంధాలు, మూడు π- బంధాలు ఏర్పరచును.
4) XeO3 అణువు ఆకృతి పిరమిడల్, బంధకోణం 103°.

ప్రశ్న 11.
ఉత్కృష్ట వాయువులు రసాయనికంగా జడమైనవి. వివరించండి. [TS. Mar.’16]
జవాబు:
ఉత్కృష్ట వాయువులు రసాయనికంగా జడత్వం కలిగి ఉంటాయి.

వివరణ :

  • జడవాయువులకు స్థిరమైన అష్టక విన్యాసం ఉంటుంది. (He తప్పు )
  • జల వాయువులు అధిక అయనీకరణ శక్తి. అధిక ధనాత్మక ఎలక్ట్రాన్ గ్రాహ్య ఎంథాల్పీ కలిగి ఉంటాయి.

AP Inter 2nd Year Chemistry Study Material Chapter 6(d) 18వ గ్రూపు మూలకాలు

ప్రశ్న 12.
బార్టెట్ తయారుచేసిన మొట్టమొదటి ఉత్కృష్ట వాయు సమ్మేళనం పేరు, ఫార్ములాను వ్రాయండి.
జవాబు:
బార్టెట్ తయారుచేసిన ఉత్కృష్ట వాయు సమ్మేళనం గ్జినాన్ హెక్సా ఫ్లోరో ప్లాటినేట్. దీని ఫార్ములా XePtF6.

ప్రశ్న 13.
VSEPR సిద్ధాంతం ఆధారంగా XeF4 ఆకృతిని వివరించండి.
జవాబు:
AP Inter 2nd Year Chemistry Study Material Chapter 6(d) 18వ గ్రూపు మూలకాలు 2
XeF4 నిర్మాణం :

  1. XeF4 లో మధ్యస్థ పరమాణువు ‘Xe’.
  2. Xe – పరమాణువు రెండవ ఉద్రిక్త స్థాయిలో sp³d² సంకరీకరణం చెందును.
  3. అణువు యొక్క ఆకృతి సమతల చతురస్రం, బంధకోణం 90′ మరియు బంధ దైర్ఘ్యం 1.95Å.
    AP Inter 2nd Year Chemistry Study Material Chapter 6(d) 18వ గ్రూపు మూలకాలు 3
  4. sp³d² – 2pz (F) అతిపాతం వలన Xe – నాలుగు σ – బంధాలను ఏర్పరచును.

ప్రశ్న 14.
ఉత్కృష్ట వాయువుల బాహ్య ఎలక్ట్రాన్ విన్యాసం వ్రాయండి.
జవాబు:
ఉత్కృష్ట వాయువుల బాహ్య ఎలక్ట్రాన్ విన్యాసం ns²np6 (హీలియం తప్ప (1s²))

ప్రశ్న 15.
ఉత్కృష్ట వాయువులు ఫ్లోరిన్, ఆక్సిజన్లతో మాత్రమే సమ్మేళనాలను ‘ఎందుకు ఏర్పరుస్తాయి?
జవాబు:
ఉత్కృష్ట వాయువులు ఫ్లోరిన్ మరియు ఆక్సిజన్తోనే సమ్మేళనాలు ఏర్పరుస్తాయి.
కారణం :
ఆక్సిజన్ మరియు ఫ్లోరిన్లు రెండు అధిక ఋణ విద్యుదాత్మకత మూలకాలు.

ప్రశ్న 16.
XeOF4 ను ఎలా తయారుచేస్తారు? దాని అణు ఆకృతిని వివరించండి. [TS. Mar.’17]
జవాబు:
AP Inter 2nd Year Chemistry Study Material Chapter 6(d) 18వ గ్రూపు మూలకాలు 4
XeF6ని పాక్షికంగా జల విశ్లేషణ చేయగా XeOF4 ఏర్పడును.
XeF6 + H2O → XeOF4 + 2HF
XeOF4 రంగులేని బాషశీలత గల ద్రవం.
దీని ఆకృతి చతురస్ర పిరమిడ్.

ప్రశ్న 17.
హీలియమ్ ప్రధాన ఉత్పత్తి స్థానం ఏది?
జవాబు:
హీలియం యొక్క ప్రధాన ఉత్పత్తి స్థానం సహజవాయువు.

AP Inter 2nd Year Chemistry Study Material Chapter 6(d) 18వ గ్రూపు మూలకాలు

ప్రశ్న 18.
రేడియోధార్మికత గల ఉత్కృష్ట వాయువు ఏది? అది ఎలా ఏర్పడుతుంది?
జవాబు:
రేడియోధార్మికత గల ఉత్కృష్ట వాయువు రేడాన్ (Rn) Ra226 క్షమ ప్రక్రియ ద్వారా రేడాన్ లభిస్తుంది.
86Ra22686Rn222 + 2Ra4

ప్రశ్న 19.
క్రింది వాటికి పేర్లు ఇవ్వండి.
a) వాతావరణంలో చాలా విస్తృతంగా లభించే ఉత్కృష్ట వాయువు
b) రేడియోధార్మిక ఉత్కృష్ట వాయువు
c) కనిష్ట బాష్పీభవన స్థానం గల ఉత్కృష్ట వాయువు
d) అత్యధిక సమ్మేళనాలు ఏర్పరచే ఉత్కృష్ట వాయువు
e) వాతావరణంలో లేని ఉత్కృష్ట వాయువు
జవాబు:
a) వాతావరణంలో చాలా విస్తృతంగా లభించే ఉత్కృష్ట వాయువు ఆర్గాన్ (Ar)
b) రేడియోధార్మిక ఉత్కృష్ట వాయువు రేడాన్ (Rn)
c) కనిష్ట బాష్పీభవన స్థానం గల ఉత్కృష్ట వాయువు హీలియం (He) (4.2K)
d) అత్యధిక సమ్మేళనాలను ఏర్పరచే ఉత్కృష్ట వాయువు గ్జినాన్ (Xe)
e) వాతావరణంలో లేని ఉత్కృష్ట వాయువు రేడాన్ (Rn)

స్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
XeF2, XeF4, XeF6 అనే గ్జినాన్ ఫ్లోరైడ్లు ఎలా వస్తాయి?
జవాబు:
గ్జినాన్ ద్విగుణ ఫ్లోరైడ్లను ఈ క్రింది విధంగా ఏర్పరచును.
వీటిని Xe ను ఫ్లోరిన్తో నేరుగా సంయోగం చెందించుట ద్వారా ఏర్పరచును.
AP Inter 2nd Year Chemistry Study Material Chapter 6(d) 18వ గ్రూపు మూలకాలు 5

ప్రశ్న 2.
XeO3, XeOF4 లను ఎలా తయారుచేస్తారు?
జవాబు:
i) XeF6 ను జల విశ్లేషణ చేయగా XeO, ఏర్పడును.
XeF6 + 3H2O → XeO3 + 6HF

ii) XeF6ని పాక్షిక జలవిశ్లేషణ చేయగా XeOF4 ఏర్పడును.
XeF6 + H2O → XeOF4 + 2HF

AP Inter 2nd Year Chemistry Study Material Chapter 6(d) 18వ గ్రూపు మూలకాలు

ప్రశ్న 3.
క్రింది వాటితో సమ ఎలక్ట్రాన్లు (isoelectronic) గల ఉత్కృష్ట వాయు జాతుల ఫార్ములాలు రాసి నిర్మాణాలను వివరించండి.
ఎ) ICl4 బి) IBr2 సి) BrO3
జవాబు:
ఎ) ICl4 తో సమ ఎలక్ట్రాన్లు గల ఉత్కృష్ట వాయుజాతి XeF4
XeF4 ఆకృతి సమతల చతురస్రం.

బి) IBr2 తో సమ ఎలక్ట్రాన్లు గల ఉత్కృష్ట వాయుజాతి XeF2.
XeF2 ఆకృతి రేఖీయం.

సి) BrO3 తో సమ ఎలక్ట్రాన్లు గల ఉత్కృష్ట వాయుజాతి XeO4.
XeO4 కు టెట్రాహెడ్రల్ ఆకృతి కలదు.

ప్రశ్న 4.
నీటితో క్రింది వాటి చర్యను వ్రాయండి.
ఎ) XeF2 బి) XeF4 సి) XeF6
జవాబు:
ఎ) XeF2 జల విశ్లేషణ జరిపి Xe, HF మరియు O2 లను ఏర్పరచును.
2XeF2 + 2H2O → 2Xe + 4HF + O2

బి) XeF4 జలవిశ్లేషణ చేయగా XeO3 ఏర్పడును.
6XeF4 + 12H2O → 4Xe + 2XeO3 + 24HF + 3O2

సి) XeF6ని జలవిశ్లేషణ చేయగా XeO3 ఏర్పడును.
XeF6 + 3H2O → XeO3 + 6HF

XeF6ని పాక్షిక జలవిశ్లేషణ చేయగా XeOF4, XeO2F2 ఏర్పడును.
XeF6 + H2O → XeOF4 + 2HF
XeF6 + 2H2O → XeO2F2 + 4HF

ప్రశ్న 5.
ఎ) XeF2, బి) XeF4 ల నిర్మాణాలను వివరించండి.
జవాబు:
ఎ) XeF2 నిర్మాణం :
1) XeF2 లో మధ్యస్థ పరమాణువు ‘Xe’.
2) ‘Xe’ మొదటి ఉత్తేజిత స్థాయిలో sp³d సంకరీకరణం చెందును.
AP Inter 2nd Year Chemistry Study Material Chapter 6(d) 18వ గ్రూపు మూలకాలు 6

బి) XeF4 నిర్మాణం :

  1. XeF4 లో మధ్యస్థ పరమాణువు ‘Xe’.
  2. Xe – పరమాణువు రెండవ ఉద్రిక్త స్థాయిలో sp³d² సంకరీకరణం చెందును.
    AP Inter 2nd Year Chemistry Study Material Chapter 6(d) 18వ గ్రూపు మూలకాలు 7
  3. అణువు యొక్క ఆకృతి సమతల చతురస్రం, బంధకోణం 90° మరియు బంధ దైర్ఘ్యం 1.95Å.
    AP Inter 2nd Year Chemistry Study Material Chapter 6(d) 18వ గ్రూపు మూలకాలు 8
  4. sp³d² – 2pz(F) అతిపాతం వలన Xe – నాలుగు σ – బంధాలను ఏర్పరచును.

ప్రశ్న 6.
ఎ) XeF6, బి) XeOF4 ల నిర్మాణాలను వివరించండి.
జవాబు:
ఎ) XeF6 నిర్మాణం :

  1. XeF6 లో మధ్యస్థ పరమాణువు ‘Xe’.
  2. Xe – మూడవ ఉద్రిక్త స్థాయిలో sp³d³ సంకరీకరణం చెందును.
    AP Inter 2nd Year Chemistry Study Material Chapter 6(d) 18వ గ్రూపు మూలకాలు 9
  3. అణువు యొక్క ఆకృతి విరూపణం చెందిన అష్టముఖీయ ఆకృతి.
    AP Inter 2nd Year Chemistry Study Material Chapter 6(d) 18వ గ్రూపు మూలకాలు 10

బి) XeOF4 నిర్మాణం :
AP Inter 2nd Year Chemistry Study Material Chapter 6(d) 18వ గ్రూపు మూలకాలు 11

  1. XeOF4 అణువులో ‘Xe’ పరమాణువు sp³d² సంకరీకరణం చెందును.
  2. అణువు యొక్క ఆకృతి చతురస్ర పిరమిడ్.
  3. దీనిలో Xe-O కి మధ్య ఒక ద్విబంధం ఉంటుంది.
    ఇది ‘pπ – dπ అతిపాతం వలన ఏర్పడినది.
    XeF6 + H2O → XeOF4 + 2HF

ప్రశ్న 7.
క్రింది వాటిని పూర్తి చేయండి.
ఎ) XeF2 + H2O →
బి) XeF2 + PF5
సి) XeF4 + SbF5
డి) XeF6 + AsF5
ఇ) XeF4 + O2F2
ఎఫ్) NaF + XeF6
(సూచన : NaF + XeF6 → Na+ [XeF7])
జవాబు:
ఎ) 2XeF2 + 2H2O → 2Xe + 4HF + O2
బి) XeF2 + PF5 → [XeF]+ A[F6]
సి) XeF4 + SbF5 → [XeF3]+ [SbF6]
డి) 2XeF6 + ASF5 → [Xe2F11]+ [ASF6]
ఇ) XeF4 + O2F2 → XeF6 + O2
ఎఫ్) NaF + XeF6 → Na+ [XeF7]

AP Inter 2nd Year Chemistry Study Material Chapter 6(d) 18వ గ్రూపు మూలకాలు

ప్రశ్న 8.
XeF2, XeF4 లను ఎలా తయారుచేస్తారు? వాటి నిర్మాణాలను ఇవ్వండి. [AP. Mar.’17]
జవాబు:
XeF2, XeF4లను Xe ని మరియు ఫ్లోరిన్ను నేరుగా సంయోగం చెందించుట
AP Inter 2nd Year Chemistry Study Material Chapter 6(d) 18వ గ్రూపు మూలకాలు 12

XeF2 నిర్మాణం :

  1. XeF2లో మధ్యస్థ పరమాణువు ‘Xe’.
  2. ‘Xe’ మొదటి ఉత్తేజిత స్థాయిలో sp³d సంకరీకరణం చెందును.
    AP Inter 2nd Year Chemistry Study Material Chapter 6(d) 18వ గ్రూపు మూలకాలు 13
  3. అణువు ఆకృతి రేఖీయం.
  4. Xe – రెండు ఫ్లోరిన్లతో రెండు σ – బంధాలు (sp³ – 2pz అతిపాతం) ఏర్పరచును.
    AP Inter 2nd Year Chemistry Study Material Chapter 6(d) 18వ గ్రూపు మూలకాలు 14

XeF4 నిర్మాణం :

  1. XeF4 లో మధ్యస్థ పరమాణువు ‘Xe’.
  2. Xe – పరమాణువు రెండవ ఉద్రిక్త స్థాయిలో sp³d² సంకరీకరణం చెందును.
    AP Inter 2nd Year Chemistry Study Material Chapter 6(d) 18వ గ్రూపు మూలకాలు 15
  3. అణువు యొక్క ఆకృతి సమతల చతురస్రం, బంధకోణం 90° మరియు బంధ దైర్ఘ్యం 1.95Å.
    AP Inter 2nd Year Chemistry Study Material Chapter 6(d) 18వ గ్రూపు మూలకాలు 16
  4. sp³d² – 2pz (F) అతిపాతం వలన Xe – నాలుగు – బంధాలను ఏర్పరచును.

దీర్ఘ సమాధాన ప్రశ్న

ప్రశ్న 1.
XeF2, XeF4, XeF6 లను ఎలా తయారుచేస్తారు? నీటితో వాటి చర్య వివరించండి. వాటి నిర్మాణాలను చర్చించండి. [AP. Mar.’15]
జవాబు:
గ్జినాన్ ద్విగుణ ఫ్లోరైడ్లను ఈ క్రింది విధంగా ఏర్పరచును.
వీటిని Xe ను ఫ్లోరిన్తో నేరుగా సంయోగం చెందించుట ద్వారా ఏర్పరచును.
AP Inter 2nd Year Chemistry Study Material Chapter 6(d) 18వ గ్రూపు మూలకాలు 17

ఎ) XeF2 జల విశ్లేషణ జరిపి Xe, HF మరియు O2 లను ఏర్పరచును.
2XeF2 + 2H2O → 2Xe + 4HF + O2

బి) XeF4 జలవిశ్లేషణ చేయగా XeO3 ఏర్పడును.
6XeF4 + 12H2O → 4Xe + 2XeO3 + 24 HF + 3O2

సి) XeF6ని జలవిశ్లేషణ చేయగా XeO3 ఏర్పడును.
XeF6 + 3H2O → XeO3 + 6HF
XeF6ని పాక్షిక జలవిశ్లేషణ చేయగా XeOF4, XeO2F2 ఏర్పడును.
XeF6 + H2O → XeOF + 2HF
XeF6 + 2H2O → XeO2F2 + 4HF

XeF2 నిర్మాణం :

  1. XeF2 లో మధ్యస్థ పరమాణువు ‘Xe’.
  2. ‘Xe’ మొదటి ఉత్తేజిత స్థాయిలో sp³d సంకరీకరణం చెందును.
    AP Inter 2nd Year Chemistry Study Material Chapter 6(d) 18వ గ్రూపు మూలకాలు 18
  3. అణువు ఆకృతి రేఖీయం.
  4. Xe – రెండు ఫ్లోరిన్లతో రెండు σ – బంధాలు (sp³ – 2pz అతిపాతం) ఏర్పరచును.
    AP Inter 2nd Year Chemistry Study Material Chapter 6(d) 18వ గ్రూపు మూలకాలు 19

b) XeF4 నిర్మాణం :

  1. XeF4 లో మధ్యస్థ పరమాణువు ‘Xe’.
  2. Xe – పరమాణువు రెండవ ఉద్రిక్త స్థాయిలో sp³d² సంకరీకరణం చెందును.
    AP Inter 2nd Year Chemistry Study Material Chapter 6(d) 18వ గ్రూపు మూలకాలు 20
  3. అణువు యొక్క ఆకృతి సమతల చతురస్రం, బంధకోణం 90° మరియు బంధ దైర్ఘ్యం 1.95Å.
    AP Inter 2nd Year Chemistry Study Material Chapter 6(d) 18వ గ్రూపు మూలకాలు 21
  4. sp³d² – 2pz(F). అతిపాతం వలన Xe – నాలుగు σ – బంధాలను ఏర్పరచును.

XeF6 నిర్మాణం :

  1. XeF6 లో మధ్యస్థ పరమాణువు ‘Xe’,
  2. Xe – మూడవ ఉద్రిక్త స్థాయిలో sp³d³ సంకరీకరణం చెందును.
    AP Inter 2nd Year Chemistry Study Material Chapter 6(d) 18వ గ్రూపు మూలకాలు 22
  3. అణువు యొక్క ఆకృతి విరూపణం చెందిన అష్టముఖీయ ఆకృతి.
    AP Inter 2nd Year Chemistry Study Material Chapter 6(d) 18వ గ్రూపు మూలకాలు 23

సాధించిన సమస్యలు Textual Examples

ప్రశ్న 1.
గ్రూపు 18 మూలకాలను ఉత్కృష్ట వాయువులని ఎందుకు అంటారు?
సాధన:
18వ గ్రూపు మూలకాల వేలెన్స్ కర్పరంలోని ఆర్బిటాళ్లు పూర్తిగా ఎలక్ట్రాన్లతో నిండి ఉంటాయి. అందువల్ల అవి కొన్ని మూలకాలతోనే నిర్దిష్ట పరిస్థితుల్లో మాత్రమే చర్య జరుపుతాయి. అందువల్ల వాటిని ఉత్కృష్ట వాయువులని అంటారు.

AP Inter 2nd Year Chemistry Study Material Chapter 6(d) 18వ గ్రూపు మూలకాలు

ప్రశ్న 2.
ఉత్కృష్ట వాయువులకు చాలా తక్కువ బాష్పీభవన స్థానాలున్నాయి. ఎందుకు?
సాధన:
ఉత్కృష్ట వాయువులు ఏక్ష పరమాణుకత గల వాయువులు కాబట్టి బలహీన విక్షేపణ బలాలు మినహా ఏ ఇతర అంతర పరమాణుక బలాలు ఉండవు. కాబట్టి అవి అత్యల్ప ఉష్ణోగ్రతల వద్ద మాత్రమే ద్రవీకరణం చెందుతాయి. అందుకే అత్యల్ప బాష్పీభవన స్థానాలుంటాయి.

ప్రశ్న 3.
XeF6 ను జలవిశ్లేషణ చేస్తే ఆక్సీకరణ – క్షయకరణ (రిడాక్స్) చర్య జరుగుతుందా?
సాధన:
జరగదు. జలవిశ్లేషణంలో క్రియాజన్యాలు XeOF4, XeO2F2. వీటిలో ప్రతీ మూలకానికి సంబంధించిన ఆక్సీకరణ సంఖ్యలు క్రియాజనకాలలో ఎలా ఉన్నాయో అదే విధంగా ఉన్నాయి. అంటే మారలేదు. అందువల్ల రిడాక్స్ చర్య కాదు.

పాఠ్యాంశ ప్రశ్నలు Intext Questions

ప్రశ్న 1.
ఈతగాళ్ళు వాడే పరికరంలో హీలియమ్ ను ఎందుకు ఉపయోగిస్తారు?
జవాబు:
ఈతగాళ్ళు వాడే ఆధునిక పరికరాల్లో He, O2 ల మిశ్రమం ఉపయోగిస్తారు. ఎందువలన అనగా ‘He’ రక్తంలో తక్కువ ద్రావణీయత కలిగి ఉంటుంది.

ప్రశ్న 2.
క్రింది సమీకరణాన్ని తుల్యం చేయండి.
XeF6 + HO → XeO2F2 + HF
జవాబు:
XeF2 + 2H2O → XeO2F2 + 4 HF

AP Inter 2nd Year Chemistry Study Material Chapter 6(d) 18వ గ్రూపు మూలకాలు

ప్రశ్న 3.
రేడాన్కు సంబంధించిన రసాయనశాస్త్రాన్ని చదవడం ఎందుకు కష్టం?
జవాబు:
అత్యల్ప అర్థాయువుతో ఉన్న రేడాన్ రేడియోధార్మిక మూలకం కాబట్టి దాని రసాయన శాస్త్రాన్ని అధ్యయనం చేయడం కష్టం.