Students can go through AP Inter 2nd Year Physics Notes 12th Lesson వికిరణం, ద్రవ్యాల ద్వంద్వ స్వభావం will help students in revising the entire concepts quickly.
AP Inter 2nd Year Physics Notes 12th Lesson వికిరణం, ద్రవ్యాల ద్వంద్వ స్వభావం
→ కాథోడ్ కిరణాలు ఎలక్ట్రాన్లను కలిగి ఉండును. ఇవి రుణాత్మక ఆవేశ కణాలు.
→ J.J. థామ్సన్ ఎలక్ట్రాను కనుగొన్నాడు.
→ విశిష్టావేశం : ఆవేశం మరియు ద్రవ్యరాశికి గల నిష్పత్తిని విశిష్టావేశం అంటారు.
విశిష్టావేశం = e/m.S.I. పద్ధతిలో ప్రమాణం కులూంబ్/కి.గ్రా.
→ ఎలక్ట్రాన్ వోల్ట్ : ఒక ఎలక్ట్రాన్ 1 వోల్ట్ పొటెన్షియల్ తేడా గల బిందువుల మధ్య ఎలక్ట్రాన్ త్వరణం చెందినపుడు పొందు గతిజశక్తిని ఎలక్ట్రాన్ వోల్ట్ అంటారు.
1 ev = 1.6 × 10-19 J.
→ విద్యుత్ క్షేత్రం వల్ల ఎలక్ట్రాన్పై బలం F = Ee.
→ అయస్కాంత క్షేత్రంనకు లంబంగా చలించే ఎలక్ట్రాన్పై బలం F
→ ఎలక్ట్రాన్ ఆవేశంను మిల్లికాన్ ఖచ్చితంగా నిర్ధారించారు.
→ ఎలక్ట్రాన్ ఆవేశం e = 1.6 × 10-19 C మరియు ఎలక్ట్రాన్ ద్రవ్యరాశి m = 9.1 × 10-31 kg.
→ ఒక ఏకరీతి విద్యుత్ క్షేత్రంలో గురుత్వాకర్షణ వలన స్వేచ్ఛగా క్రిందికి పడే ఆవేశపూరితమైన తైల బిందువు. చలనంను అధ్యయనం చేసి మిల్లికాన్ ఎలక్ట్రాన్ ఆవేశంను కనుగొన్నాడు.
→ లోహతలంపై తగినంత పౌనఃపున్యం ఉన్న వికిరణం పతనమయినపుడు, ఆ తలం నుంచి ఎలక్ట్రాన్లు ఉద్గారమవుతాయి. ఈ దృగ్విషయంను కాంతి విద్యుత్ ఫలితం అంటారు.
→ ఉద్గార ఎలక్ట్రాన్లను ఫోటో ఎలక్ట్రాన్లు అంటారు.
→ ఎలక్ట్రాన్లను ఉద్గారించు లోహాలను కాంతి లోహాలు అంటారు.
ఉదా : లిథియం, సోడియం, పొటాషియం.
→ నిరోధక పొటెన్షియల్ : ఎలక్ట్రాన్ నిరోధక పొటెన్షియల్ V అయితే, ఎలక్ట్రాన్ శక్తి Ve.
నిరోధక పొటెన్షియల్ పతన కిరణ తీవ్రతపై ఆధారపడదు.
→ క్వాంటం శక్తి E = hv = \(\frac{\mathrm{hc}}{\lambda}\)
→ ఐన్స్టీన్ ఫోటో విద్యుత్ ఫలిత సమీకరణము, hv = \(\frac{1}{2}\)mv2 + Φ0
→ ఫోటో విద్యుత్ ఘటాలు, ఫోటో విద్యుత్ ఫలిత అనువర్తనాలు.
→ కాంతి గుణకారి చాలా బలహీన కాంతి సంకేతాలను వృద్ధిపరచు సాధనం.
→ వేగంగా చలించే ఎలక్ట్రాన్లను లోహాలు ఆకస్మికంగా ఆపితే X-కిరణాల ఉత్పత్తి మరియు హెచ్చు ఉష్ణం వెలువడును.
→ లోహ తలం నుండి ఎలక్ట్రాన్ తప్పించుకుని బయటకు రావటానికి కావల్సిన కనీస శక్తిని, పని ప్రమేయం (Φ0) అంటారు.
→ ప్లాటినమ్ పని ప్రమేయము ఎక్కువ (Φ0 = 5.65 eV). సీజియంకు తక్కువ (Φ0 = 2.14 eV).
→ ఒక లోహ ఉపరితలంపై తగినంత పౌనఃపున్యం ఉన్న కాంతి పతనం అయితే, ఎలక్ట్రాన్లు ఉద్గారమగును. ఈ వెలువడిన ఎలక్ట్రాన్లను ఫోటో ఎలక్ట్రాన్లు అంటారు. ఈ ప్రక్రియను కాంతి విద్యుత్ ఉద్గారం అంటారు.
→ లోహ ఉపరితలం నుంచి ఎలక్ట్రాన్ బయటకు రావడానికి పతన వికిరణానికి ఉండవలసిన కనీస పౌనః పున్యాన్ని ఆరంభ పౌనఃపున్యం (v0) అంటారు.
→ హైసన్ బర్గ్ అనిశ్చితత్వ సూత్రం : “ఒకే సమయంలో ఖచ్చితంగా, ఒక ఎలక్ట్రాన్ స్థానం మరియు ద్రవ్యవేగంను కొలుచుట అసాధ్యం i.e. Δx Δp = h.
→ నిరోధక పొటెన్షియల్ మరియు గరిష్ట గతిజ శక్తుల మధ్య సంబంధం ev0 = \(\frac{1}{2}\)mVmax2 లేక V0 ∞ mVmax2
→ శక్తి, E = hv = \(\frac{\mathrm{hc}}{\lambda}\)
→ ద్రవ్యవేగం, P = \(\frac{\mathrm{hv}}{\mathrm{c}}=\frac{\mathrm{h}}{\lambda}\)
→ ఐన్ స్టీన్ ఫోటో విద్యుత్ సమీకరణము
hv = hv0 + = mvmax2; \(\frac{1}{2}\) = W + \(\frac{1}{2}\)mυmax2
→ తరంగదైర్ఘ్యం λ = \(\frac{\mathrm{h}}{\mathrm{mv}}\)
→ ద్రవ్యరాశి చలనంలో, m = \(\frac{\mathrm{m}_0}{\sqrt{1-\frac{v^2}{\mathrm{c}^2}}}\)
→ λ = \(\frac{12.27}{\sqrt{\mathrm{V}}}\)nm
→ λ = \(\frac{h}{p}=\frac{h}{m v}=\frac{h}{\sqrt{2 m E}}=\frac{h}{\sqrt{2 m e V}}\)