AP 9th Class Social Important Questions Chapter 11 ప్రభుత్వ బడ్జెట్ – పన్నులు

These AP 9th Class Social Important Questions 11th Lesson ప్రభుత్వ బడ్జెట్ – పన్నులు will help students prepare well for the exams.

AP Board 9th Class Social 11th Lesson Important Questions and Answers ప్రభుత్వ బడ్జెట్ – పన్నులు

9th Class Social 11th Lesson 1 Mark Important Questions and Answers in Telugu Medium

ప్రశ్న 1.
MNREGA అంటే ఏమిటి?
జవాబు:
MNREGA – మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం.

ప్రశ్న 2.
సబ్సిడీ అంటే ఏమిటి?
జవాబు:
ఎరువులు, ఆహార ధాన్యాలు, డీజిల్ వంటి ప్రధాన వస్తువులు ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండేలా ధరలను తగ్గిస్తుంది. ఇందుకోసం ఆయా వస్తువులకయ్యే వ్యయంలో కొంత డబ్బును ప్రభుత్వం చెల్లిస్తుంది. దానిని సబ్సిడీ (రాయితీ) అంటారు.

ప్రశ్న 3.
ప్రభుత్వం వసూలు చేసే పన్నులు ఏవి?
జవాబు:
విలువ ఆధారిత పన్ను, సేవా పన్ను, ఎక్సెజ్ సుంకం, ఆదాయపు పన్ను, సంపద పన్ను, దిగుమతి సుంకం మొ||నవి. పన్నులను ప్రభుత్వం వసూలు చేస్తుంది.

AP 9th Class Social Important Questions Chapter 11 ప్రభుత్వ బడ్జెట్ – పన్నులు

ప్రశ్న 4.
పన్నులు ఎన్ని రకాలు? అవి ఏవి?
జవాబు:
పన్నులను ప్రధానంగా రెండు రకాలుగా విభజించవచ్చు.

  1. ప్రత్యక్ష పన్నులు
  2. పరోక్ష పన్నులు

ప్రశ్న 5.
సేవా పన్ను అంటే ఏమిటి? ఉదాహరణలు ఇవ్వండి.
జవాబు:
సేవలపై విధించే పన్నును సేవాపన్ను అంటారు.
సేవా పన్నుకు ఉదాహరణలు : స్పీడ్ పోస్ట్, టెలిఫోన్, మొబైల్, హోటళ్లు, ఏ.సి., ప్రథమ శ్రేణి – రైల్వే ప్రయాణం

ప్రశ్న 6.
ప్రత్యక్ష పన్నులు అనగానేమి? వాటిలో ముఖ్యమైనవి ఏవి?
జవాబు:
వ్యక్తుల ఆదాయాలపై లేక కంపెనీలు, వ్యాపారాల్లో ఆర్జించే లాభాలపై నేరుగా విధించబడే పన్నులు ప్రత్యక్ష పన్నులు.

ప్రశ్న 7.
నల్లధనం అంటే ఏమిటి?
జవాబు:
ఆదాయాన్ని పైకి కనపడకుండా దాచి పెట్టిన (పన్ను కట్టకుండా) ధనాన్ని ‘నల్లధనం’ అంటారు.

AP 9th Class Social Important Questions Chapter 11 ప్రభుత్వ బడ్జెట్ – పన్నులు

ప్రశ్న 8.
ప్రత్యక్ష మరియు పరోక్ష పన్నులకు ఉదాహరణలిమ్ము.
జవాబు:
ప్రత్యక్ష పన్నులకు
ఉదా : 1. ఆదాయం పన్ను
2. కార్పొరేట్ పన్ను

పరోక్ష పన్నులకు
ఉదా : 1. అమ్మకం పన్ను
2. దిగుమతి “పన్ను
3. సేవా పన్ను మొ||వి.

9th Class Social 11th Lesson 2 Marks Important Questions and Answers in Telugu Medium

ప్రశ్న 1.
రాఘవ నెలకు రూ|| 20,000 సంపాదిస్తాడు. కింది పట్టికలో అతని నెల వారి కుటుంబ ఖర్చు వివరాలు ఇవ్వడం జరిగింది. పట్టికను పరిశీలించి ప్రశ్నకు జవాబు రాయండి.

అంశంఖర్చు (రూ||లలో) నెలకు
అద్దె5,500
ఆహారం5000
ఇద్దరు పిల్లల ఖర్చు2500
రవాణా4500 (75 రూ|| లీ. మరియు రోజుకు 2 లీ. చొప్పున)
ఆరోగ్యం1000
ఇతరం1500

ప్రభుత్వం పెట్రోలు ధర లీటరుకు రూ|| 3 పెంచాలని నిర్ణయించింది. ఈ పెరుగుదల రాఘవ కుటుంబ బడ్జెట్ పై మరియు కుటుంబ సభ్యులపై ఎటువంటి ప్రభావం చూపిస్తుంది?
జవాబు:

  1. పెట్రోల్ ధర పెరుగుదల ప్రతీ కుటుంబ బడ్జెట్ నీ ప్రభావితం చేస్తుంది.
  2. రాఘవ కుటుంబ బడ్జెట్ లోని రవాణా వ్యయం పెట్రోల్ ధర పెరగడం వలన 4680/- రూ చేరుకుంది.
  3. పెట్రోల్ ధర పెరగడం వలన నిత్యావసర వస్తువులు, కూరగాయల ధరలు కూడా పెరుగుతాయి.
  4. దానితో ఇతర అవసరాలపై చేసే వ్యయాన్ని బాగా తగ్గించుకోవాల్సి వస్తుంది. అది రాఘవ కుటుంబంపై తీవ్ర దుష్ప్రభావాన్ని చూపుతుంది.

9th Class Social 11th Lesson 4 Marks Important Questions and Answers in Telugu Medium

ప్రశ్న 1.
చిత్రము నందలి ఉదాహరణను వివరించుము. “వినియోగదారుడు – పరోక్ష పన్నుల” మధ్య గల పరస్పర సంబంధమును వివరించండి.
AP 9th Class Social Important Questions Chapter 11 ప్రభుత్వ బడ్జెట్ – పన్నులు 1
జవాబు:
వస్తువుల ధరలకు అన్ని రకాల పన్నులు కలుస్తూ ఉంటాయి. కాని, కొన్ని ప్రత్యేక వస్తువులపై పన్నులు విధించడం వల్ల పెద్ద మొత్తం వస్తువుల ధరలు పెరుగుతాయి.
ఉదా :
సైకిళ్ళ తయారీకి ఉక్కు పైపులు కావాలి. ఉక్కు తయారీకి ఉక్కు ఫ్యాక్టరీకి ఇనుము మరియు బొగ్గు కావాలి. ఒకవేళ ఇనుముపై ఎక్సైజ్ సుంకం పెరిగితే దాని ప్రభావం సైకిళ్ళ ధరపై ఉంటుంది. ఇనుముతో తయారయ్యే వస్తువులన్నింటి ధరలు పెరుగుతాయి. అంతేకాక ఉక్కును తయారు చేయడానికి ఇనుమునే ఉపయోగిస్తారు. కావున ఉక్కుతో తయారయ్యే వస్తువుల ధరలన్నీ కూడా పెరుగుతాయి. ఈ విధంగా ఇనుముపై పెంచిన పన్ను – పరోక్షంగా వినియోగదారుడిపై ప్రభావం చూపుతుంది.

AP 9th Class Social Important Questions Chapter 10 ధరలు – జీవనవ్యయం

These AP 9th Class Social Important Questions 10th Lesson ధరలు – జీవనవ్యయం will help students prepare well for the exams.

AP Board 9th Class Social 10th Lesson Important Questions and Answers ధరలు – జీవనవ్యయం

9th Class Social 10th Lesson 1 Mark Important Questions and Answers in Telugu Medium

ప్రశ్న 1.
బడ్జెట్ అనగానేమి?
జవాబు:
వచ్చే ఆదాయాన్ని, చేయబోయే వ్యయాన్ని వివరించే నివేదికను ‘బడ్జెట్’ అంటారు.

ప్రశ్న 2.
జీవన వ్యయం అనగానేమి?
జవాబు:
తమ నిత్యావసరాల కొరకు ప్రజలు చేసే ఖర్చును జీవన వ్యయం అంటారు.

ప్రశ్న 3.
ద్రవ్యోల్బణం అనగానేమి?
జవాబు:
నిరంతర ధరల పెరుగుదలను ద్రవ్యోల్బణం అంటారు.

ప్రశ్న 4.
అధార సంవత్సరం అనగానేమి?
జవాబు:
ఎంపిక చేసిన మొదటి సంవత్సరంలో అన్ని వస్తు సేవల సరాసరి ధరలను ఆధార సంవత్సరం అంటారు. దానిని 100 సంఖ్యతో సూచిస్తారు.

AP 9th Class Social Important Questions Chapter 10 ధరలు – జీవనవ్యయం

ప్రశ్న 5.
ఆహార ద్రవ్యోల్బణం అనగానేమి?
జవాబు:
ఆహార పదార్థాల ధరలలో పెరుగుదలను ఆహార ద్రవ్యోల్బణం అంటారు.

ప్రశ్న 6.
PDS పని ఏమిటి?
జవాబు:
PDS (Public Distribution System) ద్వారా ప్రభుత్వం నిత్యావసర వస్తువులైన గోధుమ, వరి, పంచదార, వంటనూనెలు, కిరోసిన్లను పంపిణీ బాధ్యతను చేపట్టింది.

9th Class Social 10th Lesson 2 Marks Important Questions and Answers in Telugu Medium

ప్రశ్న 1.
“పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలే మిగతా అన్ని ధరలు పెంచే విధంగా చేసింది. ఉదా : పండ్లు, కూరగాయలు, పప్పులు, ఇతర ఆహార వస్తువులు కొరకు ఎక్కువ ఖర్చు అవుతుంది.”
పై అంశంపై వ్యాఖ్యానించండి.
జవాబు:
పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదల వలన మన నిత్యావసర వస్తువుల ధరలు కూడా పెరుగుతున్నాయి అనేది పైన వివరించబడింది. దానితో నేను ఏకీభవిస్తున్నాను.

పెట్రోల్ మరియు డీజిల్ లను మనం ఇతర దేశాల నుండి ఎక్కువగా దిగుమతి చేసుకుంటాం. సాధారణంగా వీటి ధరలు పెరగడంతో రవాణా ఖర్చు పెరుగుతుంది. ఎందుకనగా మనం మన నిత్యావసరాలను వివిధ ప్రాంతాల నుండి తెచ్చుకోవడం జరుగుతుంది. దాని వలన మన వస్తువుల ధరలు కూడా పెరుగుతూ ఉంటాయి.

నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిన ప్రతిసారీ భారతదేశంలో పేదరిక స్థాయి పెరుగుతుంది. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా మన జీతాలు, ఆదాయలు పెరగక కొన్ని సందర్భాలలో ప్రజలు నిత్యావసరాలు కూడా కొనలేని స్థితిలో ఉంటున్నారు.

కావున ప్రభుత్వం నిత్యావసరాల ధరలు ఎక్కువగా పెరగకుండా ఉండేలా చర్యలు తీసుకోవాలి. లేకపోతే వాటికి కూడా సబ్సిడీని అందించాలి.

AP 9th Class Social Important Questions Chapter 10 ధరలు – జీవనవ్యయం

ప్రశ్న 2.
500, 1000 రూపాయల నోట్లను ఇటీవల రద్దుపరిచారు. ఈ చర్య భారత ఆర్థిక వ్యవస్థకు ఎంత వరకూ ఉపయోగ పడుతుందని నీవు భావిస్తున్నావు?
జవాబు:

  1. నల్లధనాన్ని వెలికితీసి దానిని సద్వినియోగపరచాలి అనేది నోట్ల రద్దు యొక్క ముఖ్య ఉద్దేశ్యం.
  2. భారతదేశంలో జరుగుతున్న అవినీతి, అక్రమమైన, చట్ట విరుద్ధమైన కార్యకలాపాలను అరికట్టడం కోసం నోట్ల రద్దు చేయడం జరిగింది.
  3. ప్రజలు సక్రమంగా పన్నులు చెల్లించాలి అనేది ముఖ్య ఉద్దేశం.

పైన అనుకున్న కార్యక్రమాలు కొంతవరకు మాత్రమే జరిగాయి.

నోట్ల రద్దు వలన చాలా మంది సామాన్య ప్రజలు ఇప్పటికీ ఇబ్బందులు పడుతున్నారు. ఒక 20% మాత్రమే ఈ నోట్ల రద్దు భారత ఆర్థిక వ్యవస్థకు ఉపయోగపడింది. 80% ఈ చర్య విఫలమై ప్రజలు ముఖ్యంగా మధ్య తరగతి, సామాన్య ప్రజలు ఇబ్బందులకు గురికావడం జరిగింది.

AP 9th Class Social Important Questions Chapter 9 ద్రవ్య వ్యవస్థ – ఋణం

These AP 9th Class Social Important Questions 9th Lesson ద్రవ్య వ్యవస్థ – ఋణం will help students prepare well for the exams.

AP Board 9th Class Social 9th Lesson Important Questions and Answers ద్రవ్య వ్యవస్థ – ఋణం

9th Class Social 9th Lesson 1 Mark Important Questions and Answers in Telugu Medium

ప్రశ్న 1.
డబ్బు యొక్క ఆధునిక రూపాలు ఏవి?
జవాబు:
బ్యాంకు జమలు, కరెన్సీ నోట్లు, నాణాలు డబ్బు యొక్క ఆధునిక రూపాలు.

ప్రశ్న 2.
డిమాండ్ డిపాజిట్లు అని వేటిని అంటారు?
జవాబు:
డిమాండు చేసినపుడు బ్యాంకు ఖాతాల నుండి డబ్బును వాపసు తీసుకొనే సౌలభ్యం ఉండటం వలన ఈ డిపాజిట్ ను (డబ్బు జమ) ‘డిమాండ్ డిపాజిట్లు’ అంటారు.

ప్రశ్న 3.
రుణ విషయంలో జరిగే ఒప్పందం ఏది?
జవాబు:
రుణదాత నుండి రుణాన్ని డబ్బుగాగానీ, వస్తువులు లేదా సేవల రూపంలో కానీ రుణగ్రహీత పొందుతూ, తీసుకున్న రుణాన్ని భవిష్యత్ లో తిరిగి చెల్లిస్తానని హామీని ఇవ్వడం వారిద్దరి మధ్య రుణ విషయంలో జరిగే ఒప్పందం.

AP 9th Class Social Important Questions Chapter 9 ద్రవ్య వ్యవస్థ – ఋణం

ప్రశ్న 4.
అప్పుల్లో చిక్కుకోవడం అంటే ఏమిటి?
జవాబు:
ఒక్కోసారి పంట పండక పోవడంతో అప్పును తిరిగి చెల్లించడం కోసం తమకున్న భూమిలో సగం భూమిని అమ్మివేయాల్సి వస్తుంది. అలాంటి పరిస్థితిని “అప్పుల్లో చిక్కుకోవడం” అంటారు.

ప్రశ్న 5.
నియత రుణాలు అంటే ఏమిటి?
జవాబు:
బ్యాంకుల ద్వారా, సహకార సంస్థల ద్వారా పొందే రుణాలను నియత రుణాలు అంటారు.

ప్రశ్న 6.
అనియత రుణాలు అంటే ఏమిటి?
జవాబు:
వడ్డీ వ్యాపారస్తులు, వర్తకులు, యజమానులు, బంధువులు, స్నేహితులు మొదలగు వారిచ్చే రుణాలను అనియత రుణాలు అంటారు.

ప్రశ్న 7.
‘నోఫిల్స్ ఎకౌంట్స్’ అనగానేమి?
జవాబు:
బ్యాంకులలో ఖాతాలను నిర్వహించుకొనేందుకు కనీస బ్యాలెన్స్ (నిల్వలు) ఉంచవలసిన నిబంధనను తొలగించి మనం ఇష్టానుసారం బ్యాలెన్స్ ఉంచుకొనేందుకు అనుమతినిస్తున్నారు. ఈ ఖాతాలను “నోఫిల్స్ ఎకౌంట్స్” అంటారు.

ప్రశ్న 8.
NABARD ను విస్తరించండి.
జవాబు:
NABARD : నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చరల్ అండ్ రూరల్ డెవలప్ మెంట్.

ప్రశ్న 9.
స్వయం సహాయక బృందాలు మహిళలకు ఎలా తోడ్పడతాయి?
జవాబు:
మహిళలు స్వయం కృషితో ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి మాత్రమే కాకుండా సామాజిక సమస్యల (గృహహింస, ఆరోగ్యం, పోషణపరిష్కార దిశగా కూడా ఈ బృందాలు తోడ్పడతాయి.

AP 9th Class Social Important Questions Chapter 9 ద్రవ్య వ్యవస్థ – ఋణం

ప్రశ్న 10.
S.L.B.C. ని విస్తరించండి.
జవాబు:
స్టేట్ లెవల్ బ్యాంకర్స్ కమిటీ (S.L.B.C.)

9th Class Social 9th Lesson 2 Marks Important Questions and Answers in Telugu Medium

ప్రశ్న 1.
పేద మహిళల ఆర్థిక అవసరాలు తీర్చడంలో, స్వయం సహాయక బృందాలు పోషిస్తున్న పాత్రను మీరు ఏ విధంగా ప్రశంసిస్తారు?
జవాబు:
పేద మహిళల ఆర్థిక అవసరాలు తీర్చడంలో స్వయం సహాయక బృందాలు పోషిస్తున్న పాత్ర అభినందనీయం. ఎందుకనగా, మహిళల కుటుంబ అవసరాలను తీర్చడం నిమిత్తం వారికి పశువులను కొనివ్వడం, కుట్టుమిషన్లను లోనులో ఇవ్వడం వంటివి చేస్తున్నాయి. వారిచే నూతన చిరు వ్యాపారాలను ప్రారంభించడానికి వారికి ఋణాలను ఇస్తారు. అంతేకాక మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి మాత్రమేకాక వివిధ సామాజిక సమస్యలైన ఆరోగ్యం, పోషణ, గృహహింస మొదలయిన వాటిని చర్చించి సరియైన చర్యలు తీసుకునే విధంగా కూడా స్వయం సహాయక బృందాలు పనిచేస్తున్నాయి.

ప్రశ్న 2.
ఆర్థిక అక్షరాస్యత ప్రతి ఒక్కరికీ ఆర్థిక అవసరాలపై జ్ఞానాన్ని కల్గించి, ఆర్థికపర నిర్ణయాలు తీసుకోవడంలో తోడ్పడుతుంది. ఆర్థిక అక్షరాస్యతపై ఆసక్తి, ఆర్థిక పరమైన ప్రణాళికలకు, ఉన్నతమైన ఆర్థిక లక్ష్యాలకు, రుణాలు, పొరపాట్ల నుండి రక్షణకు దోహదం చేస్తుంది. పొదుపు చేసే అలవాటును పెంపొందించడం, డబ్బును సమర్థంగా వినియోగించడం దీని ఉద్దేశ్యం. ఆర్థిక సేవల పట్ల అవగాహనను కల్పిస్తుంది.
“ఆర్థిక అక్షరాస్యత వినియోగదారులకు రక్షణ, ఆర్థిక స్థిరత్వానికి అత్యంత అవసరం” – వ్యాఖ్యానించండి.
జవాబు:
ఆర్థిక అక్షరాస్యత ప్రతి ఒక్కరికీ ఆర్థిక అవసరాలపై జ్ఞానాన్ని కల్గించి, ఆర్థిక పర నిర్ణయాలు తీసుకోవడంలో తోడ్పడుతుంది.

ఆర్థిక అక్షరాస్యతపై ఆసక్తి ఉంటే అది ఆర్థికపరమైన ప్రణాళికలకు, ఉన్నతమైన ఆర్థిక లక్ష్యాలకు, రుణాలు, పొరపాట్ల నుండి రక్షణకు దోహదం చేస్తుంది.

  1. ఆర్థిక అక్షరాస్యత వలన నియత ఆర్థిక సంస్థల సేవలు, ప్రయోజనాలు, వాటి ఉత్పత్తులను అర్థం చేసుకోవడానికి ఉపయోగపడుతుంది.
  2. అక్షరాస్యత తక్కువగా ఉన్న ప్రాంతాల ప్రజలకు, నియత సంస్థల రుణాలు పొందనివారికి. ఆర్థిక అక్షరాస్యత సహాయపడుతుంది.
  3. ఆర్థిక మార్కెట్ల పోకడలు అర్థంకాని ఈ రోజుల్లో సామాన్య మానవుడు కూడా తన స్వంత నిర్ణయాలు తీసుకోవడానికి ఆర్థిక అక్షరాస్యత సహాయం చేస్తుంది.
  4. ప్రజలు తమ ఆర్థిక లక్ష్యాలను చేరుకోవడానికి కావలసిన మార్గదర్శకాలను అందిస్తుంది.

AP 9th Class Social Important Questions Chapter 9 ద్రవ్య వ్యవస్థ – ఋణం

ప్రశ్న 3.
ప్రజల నుండి సేకరించిన డిపాజిట్లతో బ్యాంకులు ఏమి చేస్తాయి?
జవాబు:
ప్రజలు డిపాజిట్ల ద్వారా జమ చేసిన నగదులో కొద్ది భాగాన్ని మాత్రమే బ్యాంకులు తమ దగ్గర ఉంచుకుంటాయి. అంటే 15% మాత్రమే తమ దగ్గర ఉంచుకుంటాయి. అవి కూడా ఖాతాదారులు అడిగితే చెల్లించడం కోసం.

జమ అయిన నగదులో అధిక భాగాన్ని రుణాలు ఇవ్వడానికి బ్యాంకులు వినియోగిస్తాయి.

9th Class Social 9th Lesson 4 Marks Important Questions and Answers in Telugu Medium

ప్రశ్న 1.
బ్యాంకులు తమ వినియోగదారులకు అందిస్తున్న వివిధ రకాల సేవలు ఏమిటి?
జవాబు:

  1. బ్యాంకులు వినియోగదారులకు పొదుపు చేసిన సొమ్ముని డిపాజిట్ చేసుకునే సౌకర్యం కల్పిస్తాయి.
  2. వ్యవసాయ రుణాలు, విద్యా రుణాల వంటి అనేక రకాల రుణాలను కల్పిస్తాయి.
  3. పొదుపు సొమ్మును దాచుకునేందుకు వీలుగా సేవింగ్స్ అకౌంట్లను నడుపుతాయి.
  4. వారి విలువైన వస్తువులను దాచుకునేందుకు వీలుగా సేఫ్టీ లాకర్ సౌకర్యం కలిగిస్తాయి.
  5. తక్కువ వడ్డీకి గృహ రుణాలను అందిస్తాయి.
  6. దూర ప్రాంతాలలో ఉండే సంస్థలకు చెల్లింపులు చేసేందుకు వీలుగా డిడిలూ, చెట్లను జారీ చేస్తాయి.
  7. బ్యాంకుకి రాకుండానే ఎక్కడ కావాలంటే అక్కడ వాడుకునే విధంగా డెబిట్, క్రెడిట్ కార్డులనూ, ఏటిఎం కార్డులనూ జారీ చేస్తాయి.
  8. ప్రస్తుత కాలంలో బ్యాంకులు ఆన్ లైన్ ద్వారా అన్ని రకాల బిల్లుల చెల్లింపు, షాపింగ్ వంటి అనేక సౌకర్యాలు కలిగిస్తున్నాయి.

AP 9th Class Social Important Questions Chapter 8 భారతదేశంలో సేవా కార్యకలాపాలు

These AP 9th Class Social Important Questions 8th Lesson భారతదేశంలో సేవా కార్యకలాపాలు will help students prepare well for the exams.

AP Board 9th Class Social 8th Lesson Important Questions and Answers భారతదేశంలో సేవా కార్యకలాపాలు

9th Class Social 8th Lesson 1 Mark Important Questions and Answers in Telugu Medium

ప్రశ్న 1.
సేవారంగానికి చెందిన కార్యకలాపాలేవి?
జవాబు:
సేవా కార్యకలాపం’ అనగా సేవలు చేయడం. రవాణా, కమ్యూనికేషన్, విద్య, వైద్య, ద్రవ్యం, బీమా, బ్యాంకింగ్, ప్రభుత్వ పాలన, కంప్యూటర్స్ సేవలు, వర్తకవాణిజ్యాలు, రక్షణ మొ||3వన్నీ సేవారంగానికి చెందిన కార్యకలాపాలే.

ప్రశ్న 2.
సేవా రంగాల అవసరమేమిటి?
జవాబు:
సేవా కార్యకలాపాలు వ్యవసాయ, పారిశ్రామిక కార్యకలాపాలకు అవసరమైనటువంటివి. ఆయా రంగాలలో ఉత్పత్తి జరగాలంటే సేవా కార్యకలాపాలనేవి అవసరము.

ప్రశ్న 3.
సేవారంగం నియాతుకం ఎలా ఉంటుంది?
జవాబు:
సేవారంగంలో ఉన్న ఉత్పత్తిదారులు అధిక మొత్తంలో యంత్రాలను, ఉపకరణాలను, చాలా తక్కువ సంఖ్యలో అత్యంత నిపుణులైన వ్యక్తులను నియమించుకుంటారు.

AP 9th Class Social Important Questions Chapter 8 భారతదేశంలో సేవా కార్యకలాపాలు

ప్రశ్న 4.
ఇటీవల కాలంలో నగరాలలో ఉద్యోగావకాశాలు కల్పించేవి ఏవి?
జవాబు:
ఇటీవల కాలంలో పొరుగు సేవలు, సమాచార సాంకేతిక రంగం, వార్తా ప్రసారాల సంస్థలు, వినోద పరిశ్రమ, పట్టణాలు, నగరాలలో ఉద్యోగవకాశాలు కల్పిస్తున్నాయి.

ప్రశ్న 5.
చాలా పరిశ్రమలు తమ కార్యకలాపాలలో అధిక భాగాన్ని సేవారంగం వైపు ఎందుకు మళ్ళించాయి?
జవాబు:
సాంకేతిక పరిజ్ఞానంలో మార్పులు, పారిశ్రామిక రంగంలో ఉన్న గట్టి పోటీ వల్ల చాలా పరిశ్రమలు తమ కార్యకలాపాలలో అధిక భాగాన్ని సేవా రంగం వైపు మళ్ళించాయి.

ప్రశ్న 6.
ఇతరాలను పొరుగు సేవలనుండి పొందే సంస్థలు ఏవి?
జవాబు:
అనేక వస్తు తయారీ సంస్థలు పరిశోధనా, అభివృద్ధి, ఖాతాల నిర్వహణ, న్యాయపరమైన, సేవలు, వినియోగదారుల సేవలు, ప్రజా సంబంధాలకు సంబంధించిన సేవలు, భద్రతా సిబ్బంది, ఇతరాలను ‘పొరుగు సేవ’ల నుండి పొందుతున్నాయి.

ప్రశ్న 7.
పారామెడి లని ఎవరిని అంటారు?
జవాబు:
అనుబంధ వైద్య వృత్తి నిపుణులను ‘పారామెడిక్’లంటున్నారు.

ప్రశ్న 8.
ఆర్థికాభివృద్ధి అంటే ఏమిటి?
జవాబు:
ఆర్థిక పేరుగుదలతోపాటు సంస్థాగత మార్పులలో కూడా పెరుగుదల సాధించితే దానిని ఆర్థికాభివృద్ధి అంటారు.

ప్రశ్న 9.
చిల్లర వర్తకం అంటే ఏమిటి?
జవాబు:
వినియోగదారులకు నేరుగా వస్తువులను విక్రయించే వర్తకాన్ని ‘చిల్లర వర్తకం’ అంటారు.

AP 9th Class Social Important Questions Chapter 8 భారతదేశంలో సేవా కార్యకలాపాలు

ప్రశ్న 10.
బహుళజాతి కంపెనీలు అనగానేమి?
జవాబు:
వివిధ దేశాలలో పెట్టుబడులు పెట్టే విదేశీ కంపెనీలను బహుళజాతి కంపెనీలు (MNC) అంటారు.

ప్రశ్న 11.
‘పొరుగు సేవలు’ అంటే ఏవి?
జవాబు:
ఒక సంస్థకు అవసరమైన సేవలను తక్కువ ఖర్చుతో బయటి నుండి పొందటాన్ని పొరుగు సేవలు (out sourcing) అంటారు.

9th Class Social 8th Lesson 4 Marks Important Questions and Answers in Telugu Medium

ప్రశ్న 1.
1991 నుండి 2010 వరకు ప్రభుత్వ వ్యవస్థలో వివిధ సేవా కార్యక్రమాలలో పని చేసేవారి సంఖ్య (లక్షలలో) ఈ క్రింది పట్టిక చూపుతుంది. ఈ పట్టికను జాగ్రత్తగా పరిశీలించి ప్రశ్నలకు సమాధానాలు రాయండి.

సేవారంగ కార్యకలాపాలుప్రభుత్వ ఉద్యోగాలు
19912010
టోకు వర్తకం, చిల్లర వర్తకం1.51.7
రవాణా గిడ్డంగులు, సమాచార రంగం30.325.3
విత్త, బీమాసంస్థలు, స్థిరాస్తి వ్యాపారం మొ||11.914.1
సామాజిక, సాంఘిక వ్యక్తిగత సేవలు92.390.5

అ) ఏ సేవారంగ కార్యకలాపం అతి తక్కువ ఉపాధిని కల్పించినది?
ఆ) సామాజిక, సాంఘిక మరియు వ్యక్తిగత సేవలకు సంబంధించిన ఏవేని రెండు ఉద్యోగాలను రాయండి.
ఇ) 2010 నాటికి ఏ రకమైన సేవారంగ కార్యకలాపంలో అత్యధిక తగ్గుదల కనిపిస్తున్నది?
ఈ) 2010 సం||లో ఏ ప్రభుత్వ సేవారంగ కార్యకలాపాల ద్వారా ఎక్కువ ఉద్యోగాలు కల్పించబడ్డాయి?
జవాబు:
అ) టోకు వర్తకం, చిల్లర వర్తకం
ఆ) బ్యూటీ పార్లర్ నడిపేవారు, టైలరింగ్ పనివారు, బట్టలు ఉతికేవారు, ఫోటో స్టూడియో నడిపేవారు, క్షురకులు, ఇతర పనులు చేసేవారు.
ఇ) రవాణా, గిడ్డంగులు, సమాచార రంగం.
ఈ) సామాజిక, సాంఘిక, వ్యక్తిగత సేవలు.

AP 9th Class Social Important Questions Chapter 7 భారతదేశంలో పరిశ్రమలు

These AP 9th Class Social Important Questions 7th Lesson భారతదేశంలో పరిశ్రమలు will help students prepare well for the exams.

AP Board 9th Class Social 7th Lesson Important Questions and Answers భారతదేశంలో పరిశ్రమలు

9th Class Social 7th Lesson 1 Mark Important Questions and Answers in Telugu Medium

ప్రశ్న 1.
మౌలిక వనరులు అనగానేమి?
జవాబు:
పరిశ్రమలకు అవసరమయ్యే వివిధ ముడి సరుకుల తయారీకి ఖనిజాలు, ‘ముడిలోహాలు మౌలిక వనరులువుతాయి.

ప్రశ్న 2.
మౌలిక పరిశ్రమలు అనగానేమి?
జవాబు:
ఈ అవసరమైన సరుకులను, యంత్రాలు, విద్యుత్తు, ఖనిజాలు, ముడిలోహాలు, రవాణా సౌకర్యాలను తయారు చేసే పరిశ్రమలను మౌలిక పరిశ్రమలు అంటారు.

ప్రశ్న 3.
బృహత్ పారిశ్రామిక వ్యవస్థలు అని వేటిని అంటారు?
జవాబు:
పట్టణ కేంద్రాలు కల్పించే అనేక సేవలను ఉపయోగించుకోవటానికి అనేక పరిశ్రమలు అక్కడ కేంద్రీకృతమయ్యే ధోరణి కనపడుతుంది. వీటిని బృహత్ పారిశ్రామిక వ్యవస్థలంటారు.

ప్రశ్న 4.
వ్యవసాయాధారిత పరిశ్రమలేవి?
జవాబు:
వ్యవసాయ ఉత్పత్తులపై ఆధారపడిన పరిశ్రమలను వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు అంటారు.
ఉదా : వస్త్ర పరిశ్రమ, పంచదార పరిశ్రమ.
AP 9th Class Social Important Questions Chapter 7 భారతదేశంలో పరిశ్రమలు

ప్రశ్న 5.
ఖనిజ ఆధారిత పరిశ్రమలు అని వేటిని అంటారు?
జవాబు:
ఖనిజాలు, లోహాలను ముడి సరుకులుగా ఉపయోగించే పరిశ్రమలను ఖనిజ ఆధారిత పరిశ్రమలు అంటారు.

ప్రశ్న 6.
NALCO ను విస్తరించండి.
జవాబు:
NALCO (నాల్కో) – నేషనల్ అల్యూమినియం కార్పొరేషన్.

ప్రశ్న 7.
BALCO ను విస్తరించండి.
జవాబు:
BALCO (బాల్కో) – భారత్ అల్యూమినియం కార్పొరేషన్.

ప్రశ్న 8.
కింది పటాన్ని పరిశీలించి ప్రశ్నకు జవాబు రాయండి.
AP 9th Class Social Important Questions Chapter 7 భారతదేశంలో పరిశ్రమలు 1
కర్ణాటక రాష్ట్రం నందు ఎక్కడెక్క ఇనుము-ఉక్కు కర్మాగారాలు వున్నాయి?
జవాబు:
భద్రావతి, విజయనగర్

9th Class Social 7th Lesson 4 Marks Important Questions and Answers in Telugu Medium

ప్రశ్న 1.
దిగువ – పై చార్టుని చదివి ఈ క్రింది ప్రశ్నలకు సమాధానాలు రాయండి.
AP 9th Class Social Important Questions Chapter 7 భారతదేశంలో పరిశ్రమలు 2
i) “పై – చిత్రాలు” దేనిని తెలుపుతున్నాయి?
ii) అత్యధిక శాతంలో ఉపాధి కల్పిస్తున్న రంగం ఏది?
iii) ఏ రంగంలో ఉపాధి రెండింతలు పెరిగింది?
iv) 2009 – 2010 నాటికి ఉపాధి కల్పనలో రెండవ స్థానంలో ఉన్న రంగమేది?
జవాబు:
i) పై చిత్రాలు 1972-73 మరియు 2009-10 సంవత్సరాలలో వివిధ రంగాలలో ప్రజలు పొందుతున్న ఉపాధిని తెలియచేస్తున్నాయి.
ii) వ్యవసాయరంగం అత్యధికంగా ఉపాధిని కల్పిస్తుంది.
iii) పరిశ్రమల రంగంలో ఉపాధి రెండింతలు పెరిగింది.
iv) 2009-10 నాటికి ఉపాధికల్పనలో రెండవ స్థానంలో ఉన్న రంగం సేవల రంగం.

AP 9th Class Social Important Questions Chapter 7 భారతదేశంలో పరిశ్రమలు

ప్రశ్న 2.
“మానవులు వ్యవసాయం, పశుపాలన మొదలు పెట్టినపుడు పర్యావరణాన్ని మరింతగా ప్రభావితం చేయసాగారు. ఇత్తడి, ఇనుము వంటి లోహాల వినియోగం, నగరాల నిర్మాణంతో పర్యావరణంతో మానవ సంబంధాలు మారిపోయాయి. అనతికాలంలోనే ప్రజలు నీళ్ళు నిల్వచేయడానికి చెరువులు, పొలాలకు నీళ్లు మళ్లించడానికి కాలువలు, ఆనకట్టలు నిర్మించారు.”
ప్రశ్న : “అభివృద్ధి పర్యావరణ కాలుష్యానికి దారి తీస్తున్నదా?” వ్యాఖ్యానించండి.
జవాబు:
అభివృద్ధి పర్యావరణ కాలుష్యానికి దారి తీస్తుంది. దానికి గల కారణాలు :

  1. అభివృద్ధి ప్రక్రియలో మనం చాలా రకాల వనరులను ఉపయోగిస్తాం. ఉదా : పరిశ్రమలలో మనం చాలా రసాయనాలను వాడి మనం అభివృద్ధి చెందుతున్నాం. కాని అదే తరుణంలో ఆ పరిశ్రమలు విడుదల చేసే వ్యర్థాల వలన కాలుష్యం పెరిగిపోతుంది.
  2. అభివృద్ధి చెందుతున్నామనే భావనలో అవసరం ఉన్నా లేకపోయినా వివిధ రకాల వాహనాలను, ఎలక్ట్రిక్ పరికరాలను ఉపయోగిస్తూ పర్యావరణ కాలుష్యానికి మనం కారణం అవుతున్నాము.
  3. అభివృద్ధి అనే పదాన్ని వాడుతూ ప్రతి చిన్నదానికి వాడే ఎలక్ట్రానిక్ పరికరాల వలన మనకు తెలియకుండానే పర్యావరణ కాలుష్యం పెరిగిపోతుంది. ఉదా : రిఫ్రిజిరేటర్లు, ఎ.సి.లు మొ||వి.
  4. మనం ఉపయోగించి వదిలివేసే ప్లాస్టిక్ వ్యర్థాల వలన పర్యావరణం చాలా కలుషితమవుతుంది.
  5. సాధ్యమైనంత వరకు మనం పర్యావరణ కాలుష్యానికి దారితీసే పనులు చేయకుండా ఉంటే మనకు మంచిది.

ప్రశ్న 3.
క్రింద ఇచ్చిన ‘పై’ చార్టులను పరిశీలించి, ప్రశ్నలకు జవాబులు వ్రాయండి.
AP 9th Class Social Important Questions Chapter 7 భారతదేశంలో పరిశ్రమలు 2
ఎ) పైన చూపబడిన ‘పై’ చార్టులు ఏ విషయం గురించి తెలియచేస్తున్నాయి?
బి) పరిశ్రమలలో ఉపాధి 1972-73 సం||తో పోలిస్తే 2009-10 సంవత్సరమునకు ఎంత శాతం పెరిగింది?
సి) 2009-10 నాటికి ఎక్కువ ఉపాధిని కల్పించిన రంగం?
డి) సేవారంగంలోని ఏవైనా రెండు ఉపాధులను రాయండి.
జవాబు:
ఎ) ‘పై’ చార్టులు పరిశ్రమలలో 1972-73 సం|| మరియు 2009-10 సం||లలో గల ఉపాధిని తెలియచేస్తున్నాయి.
బి) పరిశ్రమలలో ఉపాధి 1972-73లో పోల్చితే 2009-10 సం||రానికి రెండింతలు పెరిగింది. అనగా 11% నుండి 22% కి పెరిగింది.
సి) వ్యవసాయరంగం 2009-10 సం||రం నాటికి ఎక్కువ ఉపాధిని కల్పించింది.
డి) సేవారంగంలో ఉపాధిని కల్పించే అంశాలు :

  1. బ్యాంకులు
  2. రవాణా సదుపాయాలు
  3. టెలివిజన్, న్యూస్ పేపర్ మొ||వి.

ప్రశ్న 4.
“దేశాభివృద్ధికి పరిశ్రమలు అవసరమే. పారిశ్రామిక కార్యకలాపాలు పర్యావరణ సమస్యలకు దారితీస్తున్న విషయం కూడా వాస్తవమే” దీనిపై మీ అభిప్రాయాలను వివరించండి.
జవాబు:
దేశాభివృద్ధికి పరిశ్రమలు అవసరమే కాని వాటి కార్యకలాపాలు పర్యావరణ సమస్యలకు కూడా దారి తీస్తున్నాయి.

పై విషయంపై నా అభిప్రాయం ఏమిటంటే మొదటగా పరిశ్రమలు దేశానికి పట్టుకొమ్మలు. వాటి అభివృద్ధి లేనిదే మన అభివృద్ధి కూడా లేదు. అలాగని మన మనుగడకే ప్రమాదం తెచ్చేంతగా వాటిని అభివృద్ధి చేయవలసిన అవసరం లేదు. పరిశ్రమల నిర్మాణంలో ముఖ్యంగా ఈ క్రింది విషయాలను పాటించాలి.

  1. విడుదల చేసే వ్యర్థ పదార్థాలను పునరుత్పత్తికి వినియోగించాలి.
  2. ప్రతి పరిశ్రమ కాలుష్య నివారణ చర్యలు తీసుకోవాలి.
  3. పరిశ్రమలకు లైసెన్సులను పొందేటప్పుడు ప్రతి పరిశ్రమ కాలుష్య నివారణ నిబంధనలు పాటించున్నదో లేదో గమనించాలి.
  4. ఏదైనా పరిశ్రమ వలన మన పర్యావరణం దెబ్బతింటుంది అని మనకు అవగాహన కలిగితే సత్వరమే ఆ పరిశ్రమ మూసివేత చర్యలను చేపట్టాలి.

AP 9th Class Social Important Questions Chapter 6 భారతదేశంలో వ్యవసాయం

These AP 9th Class Social Important Questions 6th Lesson భారతదేశంలో వ్యవసాయం will help students prepare well for the exams.

AP Board 9th Class Social 6th Lesson Important Questions and Answers భారతదేశంలో వ్యవసాయం

9th Class Social 6th Lesson 1 Mark Important Questions and Answers in Telugu Medium

ప్రశ్న 1.
జీవనాధార వ్యవసాయమునందు ఎన్ని పద్ధతులు కలవు? అవి ఏవి?
జవాబు:
జీవనాధార వ్యవసాయం నందు రెండు రకాల వ్యవసాయ పద్ధతులు కలవు. అవి

  1. సాధారణ జీవనాధార వ్యవసాయం,
  2. సాంద్ర జీవనాధార వ్యవసాయం.

ప్రశ్న 2.
సాధారణ జీవనాధార వ్యవసాయం ఎలాంటి వ్యవసాయ పద్ధతి?
జవాబు:
సాధారణ జీవనాధార వ్యవసాయం అంటే చిన్న కమతాలలో, పురాతన పనిముట్లు అయిన పార, గుల్లకర్ర సహాయంతో కుటుంబానికి మాత్రమే పరిమితమైన వ్యవసాయ పద్ధతి.

ప్రశ్న 3.
సాంద్ర జీవనాధార వ్యవసాయం ఎలాంటి వ్యవసాయ విధానం?
జవాబు:
సాంద్ర జీవనాధార వ్యవసాయం అంటే అధికంగా వ్యవసాయ శ్రామికులను, అత్యధిక జీవ రసాయనిక ఎరువులను, నీటిపారుదలను ఉపయోగించుకొని అధిక దిగుబడి సాధించే వ్యవసాయ విధానం.

AP 9th Class Social Important Questions Chapter 6 భారతదేశంలో వ్యవసాయం

ప్రశ్న 4.
వాణిజ్య వ్యవసాయం యొక్క ప్రధాన లక్షణం ఏమిటి?
జవాబు:
అధిక దిగుబడి కొరకు ఆధునిక ఉత్పాదకాలను విరివిగా ఉపయోగించడం దీని ప్రధాన లక్షణం.

ప్రశ్న 5.
వ్యవసాయ పంటలు వేటిపైన ఆధారపడి ఉంటాయి?
జవాబు:
వ్యవసాయ పంటలు ఋతువుల మీద, సహజ వనరులైన మృత్తికలు, నీరు, సూర్యరశ్మిపై ఆధారపడి ఉంటాయి.

ప్రశ్న 6.
భారతదేశంలో ఎన్ని రకాల పంట కాలాలు ఉన్నాయి? అవి ఏవి?
జవాబు:
భారతదేశంలో మూడు రకాల పంట కాలాలు కలవు. అవి రబీ, ఖరీఫ్, జయాద్.

ప్రశ్న 7.
రబీ పంటకాలం ఏది?
జవాబు:
రబీ పంటను శీతాకాలంలో అక్టోబర్ నుండి డిసెంబర్ మధ్యకాలంలో విత్తుతారు. ఏప్రిల్ నుండి జూన్ మధ్యకాలంలో పంటను కోస్తారు.

ప్రశ్న 8.
రబీ పంటలు కొన్నింటిని రాయండి.
జవాబు:
గోధుమ, బార్లీ, బఠాణి, శనగలు, ఆవాలు ముఖ్యమైనవి.

ప్రశ్న 9.
ఖరీఫ్ పంటకాలం ఏది?
జవాబు:
నైరుతి రుతుపవనాల రాకతో ప్రారంభమై సెప్టెంబర్ నుండి అక్టోబర్ మధ్యకాలంలో పంట కోతలు ప్రారంభమగును.

ప్రశ్న 10.
ఖరీలో పండించే కొన్ని పంటల పేర్లు రాయండి.
జవాబు:
వరి, మొక్కజొన్న, జొన్న, సజ్జ, కందులు, పెసలు, మినుములు, ప్రత్తి, జనుము, వేరుశనగ, సోయాబీన్ ముఖ్యమైన ఖరీఫ్ పంటలు.

ప్రశ్న 11.
‘జయాద్’ అనగానేమి?
జవాబు:
ఖరీఫ్, రబీ పంట కాలాల మధ్య స్వల్ప వ్యవధి గల పంట ఋతువును ‘జయాద్’ అంటారు. పుచ్చకాయలు, కర్బూజ, దోసకాయ, కూరగాయలు, పశువుల మేత మొ||వాటిని జయాద్ కాలంలో పండిస్తారు.

ప్రశ్న 12.
HYVను విస్తరించండి.
జవాబు:
HYV – అధిక దిగుబడి విత్తనాలు – High Yielding Varieties.

AP 9th Class Social Important Questions Chapter 6 భారతదేశంలో వ్యవసాయం

ప్రశ్న 13.
జనుము ఉపయోగమేమి?
జవాబు:
జనుము ‘బంగారు పీచు’గా ప్రసిద్ధి. దీనిని గోనెసంచులు, చాపలు, తాళ్ళు, దారం, తివాచీలు మొ||నవి చేయడానికి ఉపయోగిస్తారు.

ప్రశ్న 14.
భారతదేశంలోని ఏవైనా రెండు పంటకాలాలు రాయండి.
జవాబు:
సాధారణంగా భారతదేశంలో 3 రకాల పంటకాలాలు కలవు. వానిలో ఖరీఫ్, రబీ అనేవి రెండు ముఖ్యమైన పంటకాలాలు. మూడవది జయాద్.

ప్రశ్న 15.
కింది పటంలో గుర్తించబడిన ప్రాంతాలలో పండే ప్రధాన పంట ఏది?
జవాబు:
వరిని ఈ ప్రాంతాలలో ప్రధాన పంటగా పండిస్తారు.

ప్రశ్న 16.
NABARD ను విస్తరించండి.
జవాబు:
NATIONAL BANK FOR AGRICULTURAL AND RURAL DEVELOPMENT.

AP 9th Class Social Important Questions Chapter 6 భారతదేశంలో వ్యవసాయం

ప్రశ్న 17.
MSP ను విస్తరింపుము.
జవాబు:
Minimum Support Price.

9th Class Social 6th Lesson 2 Marks Important Questions and Answers in Telugu Medium

ప్రశ్న 1.
“హరిత విప్లవం వలన చాలా ప్రాంతాలలో భూముల సారం తగ్గి, రైతుల ఖర్చు పెరిగింది” – ఈ వ్యాఖ్యతో ఏకీభవిస్తారా? వివరించండి.
(లేదా)
“హరిత విప్లవం వల్ల అనేక ప్రాంతాలలో భూముల సారం తగ్గి రైతుల వ్యవసాయ పెట్టుబడి ఖర్చు కూడా పెరిగింది.” – పై వాక్యంతో మీరు ఏకీభవిస్తున్నారా? సరైన వివరణలతో మీ వాదనను సమర్థించుకొనండి.
జవాబు:
అవును, నేను పై వ్యాఖ్యతో ఏకీభవిస్తాను.

  1. రసాయన ఎరువులలో నీటిలో వెంటనే కరిగే ఖనిజాలు ఉండడం వలన మొక్కలకు పోషకాలు త్వరగా అందుతాయి. అయితే ఇవి ఎక్కువ కాలం నేలలో నిలవ ఉండవు.
  2. వీటివలన చెరువులు, నదులలోని నీరు, భూగర్భజలాలు కలుషితమవుతాయి.
  3. మట్టిలో ఉండే బ్యాక్టీరియా, ఇతర సూక్ష్మజీవులు చనిపోతాయి.
  4. దానితో కొంతకాలం తరువాత నేల మునుపటికంటే నిస్సారంగా తయారవుతుంది.
  5. నేలలో సూక్ష్మజీవుల ద్వారా అందే పోషకాలు అందకపోవడం వలన రైతు మరిన్ని ఎరువులు వాడవలసి ఉంటుంది.
  6. ఈ విధంగా హరిత విప్లవం వలన రైతుకి ఖర్చు పెరిగి భూములకి సారం తగ్గింది.

ప్రశ్న 2.
భారతదేశంలో పంటకాలాలు పేర్లు రాసి, అవి ఏయే నెలల మధ్య ఉంటాయో రాయండి.
జవాబు:
భారతదేశంలో మూడు పంటకాలాలు కలవు. అవి ఖరీఫ్, రబీ, జయాద్.

నైఋతీ రుతుపవనాల రాకతో అనగా జూన్ నెలలో దాదాపు దేశమంతటా ఖరీఫ్ కాలం ప్రారంభమై సెప్టెంబర్ నుండి అక్టోబరు మధ్యకాలంలో పంటకోతలు ప్రారంభమగును.

రబీ పంటను శీతాకాలంలో అక్టోబరు నుండి డిసెంబర్ మధ్య కాలంలో విత్తుతారు. ఏప్రిల్ నుండి జూన్ మధ్య కాలంలో పంటకోతలు ప్రారంభమగును. – ఖరీఫ్, రబీ పంట కాలాల మధ్య స్వల్ప వ్యవధి గల పంట రుతువును జయాద్ అంటారు. ఇది ఏప్రిల్, మే నెలలో ఉంటుంది.

ప్రశ్న 3.
వ్యవసాయ దారులు, వ్యవసాయ కూలీలకు సంబంధించిన బార్ గ్రాఫ్ ను పరిశీలించండి. దీని ఆధారంగా మీ పరిశీలనను రాయండి.
AP 9th Class Social Important Questions Chapter 6 భారతదేశంలో వ్యవసాయం
జవాబు:
పై బార్ గ్రాఫ్ 1951 నుండి 2001 వరకు భారతదేశంలో వ్యవసాయ కూలీలు ఎందరు మరియు వ్యవసాయదారులు ఎంతశాతం అనేది తెలియచేస్తుంది.

వ్యవసాయకూలీలు %వ్యవసాయదారులు %
195128%72%
196124%76%
197138%62%
198137%63%
199140%60%
200146%54%

పై బార్ గ్రాఫ్ పరిశీలిస్తే వ్యవసాయదారుల సంఖ్య తగ్గిపోతూ వ్యవసాయ కూలీల సంఖ్య గణనీయంగా పెరుగుతూ వచ్చింది.

ప్రశ్న 4.
కింది పట్టికలో ఇవ్వబడిన సమాచారాన్ని బార్ గ్రాఫ్ లో చూపి నీ యొక్క పరిశీలనను రాయుము.

సంవత్సరంఆహారధాన్యాల ఉత్పత్తి (మి. టన్నులలో)
1980 – 81130
1990 – 91176
2000 – 01197
2010 – 11242

జవాబు:
AP 9th Class Social Important Questions Chapter 6 భారతదేశంలో వ్యవసాయం 1
పై బార్ గ్రాఫ్ ని పరిశీలించినట్లయితే 1980-81 సం|| నుండి 2010 – 11 సం||రాల మధ్య ఆహార ధాన్యాల ఉత్పత్తి గణనీయంగా పెరుగుతూ వచ్చింది. దీనిని గమనించినట్లయితే పెరుగుతున్న జనాభాకు మనం ఆహారధాన్యాల సరఫరాను సక్రమంగా అందించగలం.

ప్రశ్న 5.
నేడు భారతదేశపు దిగుమతులలో ఆహార వస్తువులు కేవలం మూడు శాతం మాత్రమే. ఈ ఘనత సాధనలో హరిత విప్లవం యొక్క ప్రాధాన్యతను వివరింపుము.
జవాబు:
గడచిన ఏడు దశాబ్దాలలో ఆహార ధాన్యాల ఉత్పత్తి 51 మిలియన్ టన్నుల నుండి 242 మిలియన్ టన్నులకు పెరిగింది. అంటే సుమారుగా 5 రెట్లు.

రైతులు అధిక మొత్తంలో ఆహారధాన్యాల, ఆహారేతర పంటలను ఒకే పొలంలో సాగుచేయడానికి హరిత విప్లవం దోహదపడింది. అయితే వ్యవసాయ సాగుభూమి విస్తీర్ణంలో పెద్దగా పెరుగుదల లేదు. 1960లో ఒక రైతు ఎకరాభూమిలో 287 కిలోల ఆహారధాన్యాలను పండించగా ప్రస్తుతం అదే రైతు ఒక ఎకరా సాగు భూమిలో 800 కిలోల ఆహార ధాన్యాలను పండిస్తున్నాడు. ఈ పెరుగుదల హరిత విప్లవం వలన జరిగింది. దానివలన మనం ఆహారధాన్యాల దిగుమతిని తగ్గించుకున్నాం. ఎందుకనగా హరిత విప్లవం వలన మనకు అవసరమైన ఆహారధాన్యాల ఉత్పత్తి జరుగుచున్నది.

హరిత విప్లవం ప్రాధాన్యత :

  1. హైబ్రిడ్ విత్తనాల వాడకం
  2. ఎరువుల వాడకం
  3. క్రిమిసంహారక మందుల వినియోగం
  4. సరియైన నీటి పారుదల సౌకర్యాల కల్పన.

9th Class Social 6th Lesson 4 Marks Important Questions and Answers in Telugu Medium

ప్రశ్న 1.
గ్రాఫ్ ను పరిశీలించి, కింది ప్రశ్నలకు సమాధానాలు రాయండి.
AP 9th Class Social Important Questions Chapter 6 భారతదేశంలో వ్యవసాయం 2
అ) వ్యవసాయదారునికి, వ్యవసాయ కూలీకి మధ్యగల భేదం ఏమిటి?
ఆ) 1971 సం||లో వ్యవసాయదారుల శాతం ఎంత?
ఇ) భూమిలేని వ్యవసాయ కూలీల కోసం ప్రత్యామ్నాయ ఉపాధి అవకాశాలను సూచించండి.
ఈ) ఏ సంవత్సరంలో అత్యధిక వ్యవసాయదారుల శాతం నమోదయింది?
జవాబు:
అ) స్వంత పొలం కలిగినవారిని వ్యవసాయదారులు గానూ, ఇతరుల పొలాలలో పనిచేసేవారిని వ్యవసాయకూలీలు గానూ పిలుస్తారు.
ఆ) 62%
ఇ) పాడి పశువుల పెంపకం, కూరగాయల అమ్మకం, ఇటుక బట్టీలలో పనిచేయడం.
ఈ)1961.

ప్రశ్న 2.
ప్రస్తుతం భారతదేశ వ్యవసాయరంగం ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి మీరు చేసే సూచనలేవి?
జవాబు:

  1. మంచి విత్తనాలను మాత్రమే వినియోగించాలి. ప్రభుత్వంచే గుర్తించబడిన విత్తనాలను మాత్రమే వాడాలి.
  2. సేంద్రియ ఎరువులను ఎక్కువగా వినియోగించాలి.
  3. ఆ ప్రాంతంలో దొరికే నీటి మీద ఆధారపడి పంటలు పండించాలి.
  4. ప్రభుత్వం కూడా ప్రజలకు ఎక్కువ సబ్సిడీలను ఇవ్వాలి.
  5. వాతావరణ విశేషాలను ఎప్పటికప్పుడు ప్రభుత్వం రైతులకు తెలియచేయాలి.
  6. ప్రభుత్వం రైతులకు ధాన్యాలను నిల్వ ఉంచడానికి అవసరమైన గిడ్డంగుల సదుపాయాలను ఉచితంగా అందించాలి.
  7. ఆహార పంటల పెంపకానికి అనువుగాని ప్రదేశాలలో ప్రభుత్వం రైతులకు శిక్షణ ఇచ్చి వాణిజ్య పంటలను లేదా పశువుల పెంపకానికి అవకాశం కల్పిస్తూ ప్రభుత్వం అవసరమైతే సబ్సిడీలను ఇవ్వాలి.

ప్రశ్న 3.
కింది పట్టికను పరిశీలించి కింది ప్రశ్నలకు జవాబులు రాయండి.
AP 9th Class Social Important Questions Chapter 6 భారతదేశంలో వ్యవసాయం 3
ఎ) పై పట్టికను అనుసరించి ఎవరు పెద్ద రైతులుగా పరిగణించబడతారు?
బి) ఏ రకమైన రైతుల సంఖ్య ఎక్కువగా ఉంది?
సి) భారతదేశంలో రైతులచే సాగుచేయబడుతున్న మొత్తం భూమి ఎంత?
డి) ఉపాంతర రైతులచే సాగుచేయబడుతున్న సగటు భూమి విస్తీర్ణం ఎంత?
జవాబు:
ఎ) 25 ఎకరాల కంటే ఎక్కువ భూమిని కలిగియుండి మరియు సాగుచేసే రైతులు పెద్ద రైతులుగా పరిగణించబడతారు.
బి) ఉపాంత రైతుల సంఖ్య ఎక్కువగా ఉంది.
సి) 3932 లక్షల ఎకరాల విస్తీర్ణం గల భూమి రైతులచే సాగు చేయబడుతుంది.
డి) ఉపాంత రైతులచే సాగుచేయబడుతున్న సగటు భూమి విస్తీర్ణం 0.95 ఎకరాలు.

ప్రశ్న 4.
“వర్షాధార ప్రాంతంలో పడిన వర్షపాతాన్ని సంరక్షించుకోవటం మొదటి బాధ్యత. పడిన వర్షపు నీరు వేగంగా ప్రవహించ నీయకుండా చూడగలగాలి. దీనివలన నీరు భూమిలోకి ఇంకటానికి అవకాశం లభించి భూగర్భజలం వృద్ధి చెందుతుంది.”
ప్రశ్న : వర్షాధార ప్రాంతాలలోని భూగర్భజల వృద్ధి కార్యక్రమాల గురించి వ్యాఖ్యానించండి.
జవాబు:
వర్షాధార ప్రాంతాలలో భూగర్భజల వృద్ధి కార్యక్రమాలు :

  1. మొదటగా ఖాళీ ప్రదేశాలలో మొక్కలు నాటి వర్షం పడినప్పుడు నీటిని భూమిలోపలికి ఇంకేలా చేయాలి.
  2. కెమికల్ (రసాయన) వ్యర్థ పదార్థాలను భూమి లోపలికి పంపించకూడదు.
  3. రసాయన వ్యర్థ పదార్థాల విడుదలలో, సరియైన విధానాలను పాటిస్తే భూగర్భజలం కాలుష్యానికి గురికాకుండా ఉంటుంది.
  4. మనం ప్రతిరోజూ ఉపయోగించే నీరు వృథా చేయకుండా జాగ్రత్త వహించాలి.
  5. భూగర్భ జల వినియోగం ప్రాముఖ్యత గురించి మనం తెలుసుకోవడమే కాకుండా మిగతా వారికి కూడా తెలియచేయాలి.
  6. ఇంకుడు గుంతల కార్యక్రమం మరియు వాటర్ షెడ్ నిర్మాణాల ద్వారా భూగర్భజలాన్ని వృద్ధి చేయాలి.
  7. భూగర్భ జలం తక్కువగా ఉన్న ప్రాంతాలలో నీరు ఎక్కువగా వినియోగించే పంటలను పండించకూడదు.

ప్రశ్న 5.
ఒకదేశ ఆహారభద్రత ఆ దేశపు వ్యవసాయ రంగంపై ఆధారపడి ఉంటుంది. భారతీయ వ్యవసాయ రంగమును గూర్చి వివరింపుము.
జవాబు:
దేశ ఆహారభద్రతకు వ్యవసాయరంగం భరోసానిస్తుంది.

  1. భారతదేశ వ్యవసాయ రంగం ఆహారభద్రతకు భరోసా ఇవ్వడమే కాకుండా పరిశ్రమలకు కావలసిన ముడి పదార్థములను అందిస్తుంది.
  2. లక్షల మంది ప్రజలకు భారతీయ వ్యవసాయం ఉపాధిని కల్పిస్తుంది.
  3. మన దేశం యొక్క శ్రామికులలో సగం మందికి పైగా వ్యవసాయం, దాని అనుబంధ కార్యకలాపాలలో పనిచేస్తున్నారు.
  4. వ్యవసాయరంగంలో దాదాపుగా 70% మహిళా శ్రామికులు ఉపాధిని పొందుతున్నారు.
  5. భారతీయ వ్యవసాయం హరిత విప్లవం వలన అభివృద్ధి చెంది ఆహారభద్రతను పెంపొందించగలుగుతోంది.
  6. దీని వలన మనం ఇతర దేశాల నుండి దిగుమతి చేసుకునే ఆహార ఉత్పత్తుల సంఖ్య తగ్గినది.

ప్రశ్న 1.
భారతీయ రైతులు ప్రధానంగా చిన్న కమతాలు కలిగి ఉన్నారు.
చిన్న కమతాలను కలిగి ఉండటం భారతీయ వ్యవసాయ రంగం యొక్క ప్రధాన లక్షణం. అనేక మంది రైతులు చిన్న చిన్న కమతాలలోనే సాగుచేస్తున్నారు. కింది పట్టికను గమనించండి.
పట్టిక – 1 భారతదేశంలోని రైతుల సంఖ్య, వారు కలిగి ఉన్న భూమి (2010 – 2011)
AP 9th Class Social Important Questions Chapter 6 భారతదేశంలో వ్యవసాయం 4
ఈ కింది వివరణ చదివి దాని కింద ఇవ్వబడిన ప్రశ్నలకు వివరణ ఇవ్వండి.
అత్యధికమైన రైతులు చిన్న కమతాలను నిర్వహిస్తున్నారు. భారతీయ రైతులకు సంకేతం లాంటి ఉపాంత రైతులకు 2.5 ఎకరాల సాగు భూమి కలదు. మొత్తం రైతులలో 924 లక్షల మంది ఉపాంత రైతులు, అంటే మొత్తం రైతులలో 67 శాతం మంది ఉపాంత రైతులే. ఉపాంత రైతులు, చిన్న రైతులను కలిపితే వీరి సంఖ్య మొత్తం రైతులలో 85 శాతం అవుతారు. పెద్ద, మధ్యతరహా రైతులు కలిసి తక్కువ శాతం ఉన్నప్పటికిని వారి ఆధీనంలో వాస్తవంగా ఉన్న కమతాల విస్తీర్ణం ఎక్కువ. 1760 లక్షల మంది రైతులు ఈ సమూహానికి చెంది ఉన్నారు. గ్రామీణ ప్రాంతంలో వీరు అత్యంత ప్రభావవంతంగా ఉన్నారు. ఈ సమూహంలోని రైతులు 32 శాతం వ్యవసాయ భూమిని సాగుచేస్తున్నారు. ఉదాహరణకు ప్రతి పెద్ద రైతుకు సగటున 42.9 ఎకరాల భూమిని సాగుచేస్తున్నారు. దీనితో పోల్చి చూస్తే ప్రతి ఉపాంత రైతుకు సగటున 0.94 ఎకరాలు మాత్రమే అందుబాటులో కలదు. భూమి పంపిణీలో అసమానతలు, రైతులు ఎదుర్కొంటున్న అవకాశాలలో అసమానతలు, పేదరికం, అభివృద్ధి అవకాశాలు మొదలైన అంశాలను వివరిస్తాయి.

1. మీ అభిప్రాయంలో వ్యవసాయదారుడు గౌరవనీయమైన ఆదాయాన్ని సంపాదించడానికి అతడికి “కనీస సాగుభూమి” ఎంత ఉండాలి. పై పట్టికలో ఎంతమంది రైతులు మీరు అంచనా వేసిన కనీస భూమిని కలిగి ఉన్నారు?
జవాబు:
నా అభిప్రాయంలో వ్యవసాయదారుడు గౌరవనీయమైన ఆదాయాన్ని సంపాదించటానికి అతడికి కనీస సాగుభూమి 2.6 నుండి 5 ఎకరాల వరకు ఉండాలి.

పై పట్టిక ప్రకారం ఇలాంటి రైతులు మనదేశంలో దాదాపు 454 లక్షలమంది ఉన్నారు.

2. కొద్దిమంది రైతులు ప్రభావవంతంగా ఉన్నారు ఎందుకు?
జవాబు:
924 లక్షలమంది గల ఉపాంత రైతుకు సగటున 2.5 ఎకరాలు మాత్రమే భూమి ఉంది. అందువలన మధ్యతరహా, పెద్ద రైతులు ప్రభావవంతంగా ఉన్నారు.

AP 9th Class Social Important Questions Chapter 5 జీవావరణం

These AP 9th Class Social Important Questions 5th Lesson జీవావరణం will help students prepare well for the exams.

AP Board 9th Class Social 5th Lesson Important Questions and Answers జీవావరణం

9th Class Social 5th Lesson 1 Mark Important Questions and Answers in Telugu Medium

ప్రశ్న 1.
ఆహారపు గొలుసు అనగానేమి?
జవాబు:
ఒక రకమైన జీవరూపం మరొకదానికి ఆహారం అవుతుంది. దీనినే ‘ఆహారపు గొలుసు’ అంటారు.

ప్రశ్న 2.
మొక్కలు తయారు చేసిన ఆహారాన్ని తినే జంతువులు ఏవి?
జవాబు:
మొక్కలు తయారుచేసిన ఆహారాన్ని ‘శాకాహారులు’ అని పిలిచే జింక, ఆవు, మేక, ఏనుగు వంటి గడ్డి తినే జంతువులు తింటాయి.

ప్రశ్న 3.
మాంసాహార జంతువులు అనగానేమి?
జవాబు:
శాకాహార జంతువులను తినే వాటిని మాంసాహార జంతువులంటారు. కుక్క, పిల్లి, డేగ, పులి, సింహం మొ||నవి ఉదాహరణలు.

AP 9th Class Social Important Questions Chapter 5 జీవావరణం

ప్రశ్న 4.
సహజ వృక్షజాలాన్ని ఎన్ని వర్గాలుగా విభజిస్తారు? అవి ఏవి?
జవాబు:
సహజ వృక్ష జాలాన్ని ప్రధానంగా మూడు వర్గాలుగా విభజిస్తారు.

  1. తగినంత వర్షపాతం, ఎండ ప్రాంతాల్లో అడవులు
  2. ఒక మాదిరి వర్షాలు పడే ప్రాంతాలలో గడ్డిభూములు
  3. శుష్క ప్రాంతాలలో పొదలు.

ప్రశ్న 5.
టండ్రా వృక్షజాలం అనగానేమి?
జవాబు:
బాగా చలిగా ఉండే ప్రాంతాలలో పెరిగే నాచు, లిచెన్, చిన్న పొదలతో కూడిన మొక్కలను టండ్రా వృక్షజాలం అంటారు.

ప్రశ్న 6.
మధ్యధరా వృక్షజాలానికి ఆ పేరు ఎలా వచ్చింది?
జవాబు:
ఇవి మధ్యధరా సముద్రం చుట్టూ యూరప్, ఆఫ్రికా, ఆసియాలలో కనబడతాయి. కాబట్టి వీటికి మధ్యధరా వృక్షజాలం అని పేరు వచ్చింది.

ప్రశ్న 7.
టైగా అంటే ఏమిటి?
జవాబు:
ఉత్తరార్ధ గోళంలో 50 నుంచి 70° అక్షాంశాల మధ్య అద్భుతమైన శృంగాకారపు అడవులు కనపడతాయి. వీటిని ‘టైగా’ అని కూడా అంటారు.

ప్రశ్న 8.
స్టెప్పీలు అనగానేమి?
జవాబు:
ఈ సమశీతోష్ణ మండల గడ్డి భూములను ‘స్టెప్పీలు’ అంటారు. ఇక్కడి గడ్డి కురచగా ఉంటుంది.

ప్రశ్న 9.
ఏ రకమైన వృక్షజాలాన్ని టండ్రా వృక్షజాలం’ అంటారు?
జవాబు:
ధృవ ప్రాంతంలో వృక్షజాలం తక్కువ. నాచు, లిచెన్, చిన్న చిన్న పొదలు’ వంటివి ఇక్కడ ఉంటాయి. ఈ రకమైన వృక్షజాలాన్ని ‘టండ్రా వృక్షజాలం’ అంటారు.

ప్రశ్న 10.
శిలాజ ఇంధనాలు వేటిని అంటారు?
జవాబు:
లక్షల సం||రాల క్రితం అడవులు భూమిలోపలికి తిరగబడటం వల్ల బొగ్గు, చమురులు ఏర్పడ్డాయి. అందుకే వీటిని ‘శిలాజ ఇంధనాలు’ అంటారు.

ప్రశ్న 11.
శిలాజ ఇంధనాలను ఉపయోగిస్తే విడుదలగు రసాయనాలు ఏవి?
జవాబు:
శిలాజ ఇంధనాలు ఉపయోగించటం వల్ల బొగ్గుపులుసు వాయువుతో పాటు నైట్రోజన్ ఆక్సెడ్, సల్ఫర్ డై ఆక్సైడ్, ఆవిరైపోయే కర్బన మూలకాలు, భారలోహాలు వంటి ఇతర రసాయనాలు విడుదలవుతాయి.

ప్రశ్న 12.
ఆమ్లవర్షం అని దేనిని అంటారు?
జవాబు:
వాతావరణంలోని ఆమ్ల రేణువులు వర్ష బిందువులతో కలిసినప్పుడు వాన నీటిలో ఆమ్లశాతం పెరుగుతుంది. దీనినే ఆమ్ల వర్షం అంటారు.

ప్రశ్న 13.
‘ప్రపంచం వేడెక్కటం’ అనగానేమి?
జవాబు:
వివిధ రకాల కాలుష్యాల వలన – పర్యావరణం విషపూరితం అవుతుంది. ప్రపంచవ్యాప్తంగా శీతోష్ణస్థితులు మారుతాయి. దీనినే ‘ప్రపంచం వేడెక్కటం’ (Global warming) అంటారు.

AP 9th Class Social Important Questions Chapter 5 జీవావరణం

ప్రశ్న 14.
“భూగోళం వేడెక్కడానికి” గల ఏవేని రెండు కారణాలను రాయండి.
జవాబు:

  1. అడవుల నిర్మూలన, శిలాజ ఇంధన వినియోగం.
  2. పరిశ్రమల నుండి విడుదల చేసే వివిధ రకాల కాలుష్యకారకమైన వాయువులు.

ప్రశ్న 15.
పర్యావరణ కాలుష్య నివారణపై ప్రజలకు అవగాహన కల్గించడానికి చేపట్టదగిన ఏవైనా రెండు కార్యక్రమాలను రాయండి.
జవాబు:

  1. గ్రామాలలో మరియు పట్టణాలలో డాక్యుమెంటరీ చిత్ర ప్రదర్శన ద్వారా కాలుష్యం ఎలా పెరుగుతుంది మరియు ఎలా అరికట్టాలి అనేది తెలియచేయాలి.
  2. జానపద పాటలు, మరియు నాటకాల ద్వారా పర్యావరణం మనకు ఎంత అవసరమో మరియు దానిని ఎలా పరిరక్షించాలో తెలియచేయాలి.

ప్రశ్న 16.
అటవీ సంరక్షణ మీద నినాదాలు రాయండి.
జవాబు:
అటవీ సంరక్షణ మీద నినాదాలు :

  1. వృక్షో రక్షతి రక్షితః
  2. మొక్కలను కాపాడండి – అవి మన ప్రాణాలను కాపాడుతాయి.

9th Class Social 5th Lesson 4 Marks Important Questions and Answers in Telugu Medium

ప్రశ్న 1.
గాలి, నీరు, నేలలో విషపూరితమైన పదార్థాలు కలవటం వలన జీవావరణ సంక్షోభానికి దారితీస్తుంది. దీని నివారణకు విద్యార్థిగా మీరు సూచించే పరిష్కార మార్గాలు తెలపండి.
జవాబు:
గాలి కాలుష్యం – నివారణ చర్యలు :

  1. గాలిలో ఉన్న మరియు పెరుగుతున్న కాలుష్యాన్ని తగ్గించాలంటే మనం తక్కువ దూరాలకు నడిచి కాని, సైకిల్ ద్వారా కాని, మరియు ప్రభుత్వ రవాణా సదుపాయాల ద్వారా కాని చేరుకోవాలి.
  2. ఎక్కువగా మొక్కలను పెంచాలి.
  3. రైతులు పొలంలో మిగిలిన వ్యర్థ పదార్థాలను తగులు పెట్టకుండా వాటిని వేరే విధంగా ఉపయోగించాలి.
  4. పరిశ్రమలలో కూడా కాలుష్య నియంత్రణ చేసే యంత్రాలను వాడేవారికి మాత్రమే అనుమతి ఇవ్వాలి.

నీటి కాలుష్యం – నివారణ చర్యలు :

  1. పరిశ్రమలలోని వ్యర్థాలను చెరువులు, నదులు, సముద్రాలలోనికి వదలకుండా గట్టి చర్యలు తీసుకోవాలి.
  2. రైతులు సేంద్రియ ఎరువులను ఎక్కువగా వినియోగించాలి.

నేల కాలుష్యం – నివారణ చర్యలు :

  1. రైతులు రసాయన ఎరువులను వాడటం వలన నేల కలుషితం అయి సారాన్ని కోల్పోతుంది.
  2. కావున వారు రసాయన ఎరువుల వాడకాన్ని చాలావరకు తగ్గించాలి.

ప్రశ్న 2.
AP 9th Class Social Important Questions Chapter 5 జీవావరణం 1
పట్టికను పరిశీలించి క్రింది ప్రశ్నలకు జవాబులు రాయండి.
ఎ. భారతదేశంలో అధికభాగం ఏ రకమైన అడవులు విస్తరించి ఉన్నాయి?
బి. హిమాలయాలలోని అడవుల రకం ఏవి?
సి. ఉష్ణమండల సతత హరిత అడవులలో పెరిగే చెట్లు ఏవి?
డి. టేకు, వేప లాంటి చెట్లు ఏ రకమైన అడవులలో పెరుగుతాయి?
జవాబు:
ఎ. భారతదేశంలో అధికభాగం ఉష్ణమండల ఆకురాల్చే అడవులు ఉన్నాయి.
బి. భారతదేశంలోని హిమాలయాలలో శృంగాకారపు అడవులు ఉన్నాయి.
సి. ఉష్ణమండల సతత హరిత అడవులలో పెరిగే చెట్లు, రోజ్ వుడ్, ఎబోని, మహాగని, గట్టి కలపనిచ్చే చెట్లు.
డి. టేకు, వేప లాంటి చెట్లు ఉష్ణమండల ఆకురాల్చే అడవులలో పెరుగుతాయి.

AP 9th Class Social Important Questions Chapter 4 వాతావరణం

These AP 9th Class Social Important Questions 4th Lesson వాతావరణం will help students prepare well for the exams.

AP Board 9th Class Social 4th Lesson Important Questions and Answers వాతావరణం

9th Class Social 4th Lesson 1 Mark Important Questions and Answers in Telugu Medium

ప్రశ్న 1.
నాసా వాతావరణాన్ని గురించి ఏమి వివరించింది?
జవాబు:
నాసా (NASA) ‘నేషనల్ ఏరోనాటిక్స్ ఎండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్’ (అమెరికా) – భూమి బాస్కెట్ బాల్ అంత ఉంటే, వాతావరణం దానిచుట్టూ సన్నటి ప్లాస్టిక్ పొర మాదిరి ఉంటుందని వివరించింది.

ప్రశ్న 2.
వాతావరణంలో ఉండే వాయువులు ఏవి?
జవాబు:
వాతావరణంలో ప్రాణవాయువు (21%), నత్రజని (78%), ఆర్గాన్, నియాన్, బొగ్గుపులుసు వాయువులు (0.03%), మీథేన్, అమ్మోనియా, ఓజోన్ వంటి అనేక వాయువులున్నాయి.

ప్రశ్న 3.
వాతావరణంలో ఉండే ప్రధాన పొరలేవి?
జవాబు:
వాతావరణంలో ఉండే వివిధ పదార్థాల ఆధారంగా రెండు ప్రధాన పొరలుగా విభజించారు.

  1. సమరూప ఆవరణం (Homosphere)
  2. బహురూప ఆవరణం (Heterosphere)

ప్రశ్న 4.
సమరూప ఆవరణంలో ఎన్ని పొరలుంటాయి? అవి ఏవి?
జవాబు:
సమరూప ఆవరణం ’90’ కిలోమీటర్లు ఎత్తు వరకు ఉంటుంది. దీనిలో మూడు పొరలుంటాయి. ట్రోపో ఆవరణం, స్ట్రాటో ఆవరణం, మిసో ఆవరణంలు. ఈ పొరలు వాయువుల నిష్పత్తి అంతటా ఒకేరకంగా ఉంటుంది.

AP 9th Class Social Important Questions Chapter 4 వాతావరణం

ప్రశ్న 5.
బహురూప ఆవరణలోని పొరలని వివరించండి.
జవాబు:
బహురూప ఆవరణం 90 కి.మీ. కంటే పైన ఉన్న వాతావరణ పొర. దీనిలో థర్మోఆవరణం, ఎక్సో ‘ఆవరణం అని రెండు పొరలున్నాయి. దీంట్లో వాయువుల నిష్పత్తి వేరువేరుగా ఉంటుంది.

ప్రశ్న 6.
వాయుపీడనం అనగానేమి?
జవాబు:
గాలిలో వాయు పరమాణువులు ఏ వస్తువు పైన అయినా చూపే ఒత్తిడి ప్రభావాన్ని “వాయు పీడనం” అంటారు.

ప్రశ్న 7.
సమీరం అంటే ఏమిటి?
జవాబు:
గాలి నిదానంగా వీచి, హాయిగా ఉన్నపుడు దానిని ‘సమీరం’ (తెమ్మెర) అంటారు. దీనిని ‘అంతర అయన రేఖ అభిసరణ’ ప్రాంతం అంటారు.

ప్రశ్న 8.
అంతర అయన రేఖ అభిసరణ ప్రాంతం అంటే ఏది?
జవాబు:
అధిక వేడిమి వల్ల భూమధ్యరేఖ ఉపరితల ప్రాంతంలో పీడనం తగ్గి అల్ప పీడనం ఏర్పడుతుంది. దీనినే భూమధ్యరేఖ తక్కువ (అల్ప) పీడన మేఖల లేదా అంతర అయన రేఖ అభిసరణ ప్రాంతం అంటారు.

ప్రశ్న 9.
‘కొరియాలిస్ ప్రభావం’ అంటే ఏమిటి?
జవాబు:
భూమి తన అక్షం మీద తన చుట్టూ తాను తిరుగుతున్న దాని ప్రభావంను ‘కొరియాలిస్ ప్రభావం’ అంటారు.

ప్రశ్న 10.
పవనాలను ఎన్ని రకాలుగా విభజిస్తారు? అవిఏవి?
జవాబు:
పవనాలను మూడు రకాలుగా విభజిస్తారు.
ప్రపంచ పవనాలు – భూగోళం అంతటా సంవత్సరం పొడవునా వీస్తాయి.
ఋతు పవనాలు – ఒక ప్రాంతానికి, ఒక కాలానికి పరిమితమై ఉంటాయి.
స్థానిక పవనాలు – స్థానికంగా వీస్తాయి.

ప్రశ్న 11.
ప్రపంచ పవనాలు అనగానేమి?
జవాబు:
ప్రపంచ పీడన మేఖలలో నిరంతరాయంగా, క్రమబద్ధంగా వీచే గాలులను ప్రపంచ పవనాలంటారు. ఇవి మూడు రకాలు. వ్యాపార పవనాలు, పశ్చిమ పవనాలు, ధృవ పవనాలు.

ప్రశ్న 12.
ఋతుపవనాలు ఎలా ఏర్పడతాయి?
జవాబు:
భూమి, నీరు (సముద్రం)చల్లబడటం, వేడెక్కడంలో తేడాల వల్ల ఋతుపవనాలు ఏర్పడతాయి.

AP 9th Class Social Important Questions Chapter 4 వాతావరణం

ప్రశ్న 13.
చినూక్ అంటే ఏమిటి?
జవాబు:
ఉత్తర అమెరికాలోని అమెరికా – కెనడా ప్రాంతంలోని రాకీ పర్వతాల కిందగా వీచే పవనాలను ‘చినూక్’ అంటారు. ‘చినూక్’ అన్న పదానికి ‘మంచు తినేది’ అన్న అర్థం ఉందని ప్రజలు అనుకుంటారు.

ప్రశ్న 14.
ఫోన్ అంటే ఏమిటి?
జవాబు:
యూరప్ లో వీచే ఉష్ణపవనాలను ఫోన్ అంటారు. ఇవి ఆర్ట్స్ పర్వతాల ఉత్తర వాలుల మీదుగా వీస్తాయి. ద్రాక్షపళ్లు త్వరగా పండటానికి ఇవి సహాయం చేస్తాయి.

ప్రశ్న 15.
‘లూ’ అంటే ఏమిటి?
జవాబు:
ఉత్తర భారతదేశంలో మే – జూన్ నెలల మధ్య పడమర నుంచి తూర్పుకు వీచే వేడి, పొడి పవనాలను ‘లూ’ అంటారు.

ప్రశ్న 16.
‘మిస్ట్రాలు’ అంటే ఏమిటి?
జవాబు:
ఆల్ప్ పర్వతాల నుండి ఫ్రాన్స్ మీదుగా మధ్యధరా సముద్రంవైపుకు వీచే శీతల పవనాలు ‘మిస్ట్రాలు’. ఇది రోమ్ లోయగుండా వీస్తాయి.

ప్రశ్న 17.
‘పాంపెరో’ అంటే ఏమిటి?
జవాబు:
దక్షిణ అమెరికాలోని పంపాల (గడ్డిమైదానాల) ప్రాంతంలో వేగంగా వీచే శీతల ధృవ పవనాలను ‘పాంపెరో’ అంటారు.

ప్రశ్న 18.
స్థానిక వాతావరణం అంటే ఏమిటి?
జవాబు:
తక్కువ కాలానికి (10 రోజులకు మించని) వాతావరణ పరిస్థితులను (వర్షపాతం, ఉష్ణోగ్రత) వివరించటాన్ని స్థానిక వాతావరణం అంటారు.

ప్రశ్న 19.
వాతావరణంలోని అంశాలు ఏవి?
జవాబు:
ఉష్ణోగ్రత, పీడనం, పవనాలు, గాలిలో తేమ, వర్షపాతం మొ||వి వాతావరణంలోని అంశాలు.

ప్రశ్న 20.
శీతోష్ణస్థితులు అంటే ఏమిటి?
జవాబు:
ఒక ప్రాంతంలో వాతావరణ పరిస్థితుల దీర్ఘకాల సగటు వివరాలను ఆ ప్రాంత శీతోష్ణస్థితులు (క్లైమేట్) అంటారు.

AP 9th Class Social Important Questions Chapter 4 వాతావరణం

ప్రశ్న 21.
సాపేక్ష ఆర్థత అనగానేమి?
జవాబు:
ఒక నిర్దిష్ట ఉష్ణోగ్రత, పీడనం వద్ద గాలిలో ఉండగల అత్యధిక నీటి ఆవిరికి, ఆ సమయంలో గాలిలో ఉన్న నీటి ఆవిరి మోతాదుకు గల నిష్పత్తిని సాపేక్ష ఆర్ధత అంటారు.

ప్రశ్న 22.
హిమపాతం అనగానేమి?
జవాబు:
నీళ్లు గడ్డకట్టే ఉష్ణోగ్రతల కంటే తక్కువ ఉష్ణోగ్రతలలో నీటి ఆవిరి ఘనీభవించి మంచు స్పటికాలుగా మారి కిందకు మంచు తునకలుగా పడుతుంది. దీనిని హిమపాతం అంటారు.

ప్రశ్న 23.
స్లీట్ అనగానేమి?
జవాబు:
భూమి ఉపరితలం వద్ద చల్లటి పొరగుండా వానకురుస్తున్నపుడు వర్షబిందువులు మంచుగా గడ్డకట్టి కిందకు పడతాయి. దీనిని ‘స్లీట్’ (హిమశీకరాలు) అంటారు.

ప్రశ్న 24.
వర్షపాతమును ఎన్ని రకాలుగా విభజించారు? అవి ఏవి?
జవాబు:
వర్షపాతం సంభవించే దాన్ని బట్టి దానిని మూడు ప్రధాన రకాలుగా విభజించారు. అవి సంవహన వర్షపాతం, పర్వతీయ వర్షపాతం, చక్రీయ వర్షపాతం.

ప్రశ్న 25.
ఒక విద్యార్థిగా భూగోళం వేడెక్కడాన్ని తగ్గించడానికి నీవు చేయదగిన రెండు కృత్యాలను సూచింపుము.
జవాబు:

  1. సౌరశక్తిని వినియోగించడం (సోలార్ శక్తి)
  2. మొక్కలను పెంచడం (ఖాళీ ప్రదేశాలలో మొక్కలను ఎక్కువగా పెంచాలి).

9th Class Social 4th Lesson 4 Marks Important Questions and Answers in Telugu Medium

ప్రశ్న 1.
‘వాతావరణ మార్పు’ సమకాలీన ప్రపంచంపై ఎటువంటి ప్రభావాలను చూపుతోందో తెల్పండి.
జవాబు:
వాతావరణ మార్పు సమకాలీన ప్రపంచం మీద ఇలా ప్రభావాన్ని చూపుతుంది.

  1. మన జీవన విధానం మారుతుంది.
  2. వాతావరణంలో ఆర్థత పెరుగుతుంది.
  3. కాలానుగుణంగా వచ్చే ఋతువులలో మార్పు వస్తుంది.
  4. గ్లోబల్ వార్మింగ్ సమస్య ఇంకా పెరుగుతుంది.
  5. తీరప్రాంతాలలో ఉండే ప్రజలు తరచుగా తుఫానులను ఎదుర్కొంటారు.
  6. ‘ఎల్ నినో’ మరియు ‘లానినో’ సమస్యలు ఎక్కువగా ఏర్పడతాయి.
  7. మానవులు ఆరోగ్య సమస్యలచే ఎక్కువగా ఇబ్బందులకు గురి అవుతారు.
  8. కొన్ని రకాలైన పక్షులు, జంతువులు అంతరించిపోతాయి.

ప్రశ్న 2.
ఈ కింది పట్టికను పరిశీలించి క్రింద ప్రశ్నలకు సమాధానాలు రాయండి.

పొరపేరువిస్తీర్ణంలక్షణములు
ట్రోపో ఆవరణం13 కి.మీ. వరకుభూమధ్య రేఖ మొత్తం వాతావరణ మార్పులన్నీ ఈ పొరలోనే జరుగుతాయి. పైకి వెళ్తున్న కొద్దీ ఉష్ణోగ్రత తగ్గుతూ ఉంటుంది.
స్ట్రాటో ఆవరణం50 కి.మీ. వరకుఈ పొరలో మబ్బులు, తుఫానులు వంటివి ఉండవు. కనుక జెట్ విమానాలు ఎగరడానికి అనువుగా ఉంటుంది. ఓజోన్ పొర ఉండడం ఒక ముఖ్యమైన అంశం. ఎత్తుకు పోయే కొలదీ ఉష్ణోగ్రతలు పెరుగుతాయి.
మీసో ఆవరణం80 కి.మీ. ఎత్తు వరకువిశ్వంలోనుంచి ఉల్కలు ఈ పొరలోకి ప్రవేశించగానే కాలిపోతాయి. ఎత్తుకు పోయే కొలదీ ఉష్ణోగ్రతలు తగ్గుతాయి.
థర్మో ఆవరణం400 కి.మీ. ఎత్తు వరకుఎత్తుకు వెళ్తున్న కొద్దీ ఉష్ణోగ్రతలు వేగంగా పడిపోతాయి. ఇక్కడ ఉండే అయాన్లు విద్యుదావేశం కలిగి ఉంటాయి. భూమి నుంచి ప్రసారితమయ్యే రేడియో తరంగాలు అయాన్ల వలన భూమి పరావర్తనం చెందుతాయి.
ఎక్సో ఆవరణం400 కి.మీ. – ఆ పైనఇది వాతావరణంలో పై పొర, అత్యంత ఎత్తులో ఉండే ఈ సొగ గురించి మనకి తెలిసింది తక్కువ.

ఎ) జెట్ విమానాలు ఎగరడానికి స్ట్రాటో ఆవరణం ఎందుకు అనుకూలం?
బి) అత్యంత ఎత్తులో గల పొర ఏది?
సి) అయాన్లు ఏ పొరలో ఉంటాయి?
డి) ఏ పొరలో అవపాతం, తుఫాను సంభవిస్తాయి?
జవాబు:
ఎ) స్ట్రాటో ఆవరణంలో మబ్బులు, తుఫానులు వంటివి ఉండవు కావున జెట్ విమానాలు ఎగరడానికి అనుకూలంగా ఉంటుంది.
బి) ఎక్సో ఆవరణం 400 కి.మీ. పైన ఎత్తులో గలదు. కావున ఇది అత్యంత ఎత్తులో ఉండే పొర.
సి) అయాన్లు థర్మో ఆవరణంలో ఉంటాయి.
డి) ట్రోపో ఆవరణంలో అవపాతం, తుఫాను సంభవిస్తాయి.

ప్రశ్న 3.
వర్షపాతం సంభవించే విధానాన్ని బట్టి వర్షపాతాన్ని ఎన్ని రకాలుగా వర్గీకరించవచ్చు? అవి ఏవి? ఏదైనా ఒకదాని గురించి వివరించండి.
జవాబు:
వర్షపాతం సంభవించే విధానాన్ని బట్టి దానిని మూడు ప్రధాన రకాలుగా విభజించవచ్చు.

  1. సంవహన వర్షపాతం
  2. పర్వతీయ వర్షపాతం
  3. చక్రీయ వర్షపాతం

సంవహన వర్షపాతం :
వేడెక్కిన ఉపరితలం మీద తేమ కలిగిన గాలి కూడా వేడెక్కి పైకి లేచి చల్లబడినప్పుడు పడే వర్షాన్ని సంవహన వర్షపాతం అంటారు. ఈ రకమైన వర్షపాతం తక్కువ ఎత్తులలోనూ, ఖండాల లోపలి ప్రాంతాల్లో వేసవిలో ఎక్కువగా కురుస్తుంది. సాధారణంగా ఇటువంటి వానలు రోజులో బాగా వేడెక్కిన తరువాత హఠాత్తుగా కురిసే పెద్ద జల్లుగా ఉంటాయి. ఆ సమయంలో ఒక్కొక్కసారి ఉరుములు, మెరుపులు ఉంటాయి.

ప్రశ్న 4.
ఇవ్వబడిన చిత్రమును పరిశీలించి ప్రపంచ పవనాలు మరియు పీడన మేఖలల గూర్చి నాలుగు వాక్యములు వ్రాయుము.
AP 9th Class Social Important Questions Chapter 4 వాతావరణం 1
జవాబు:
ఇచ్చిన చిత్రం ప్రకారం గాలి అధిక పీడన ప్రాంతం వైపు నుండి అల్పపీడన ప్రాంతం వైపు వీయడం జరుగుతుంది.

సహజంగా భూమధ్యరేఖా ప్రాంతంలో అల్ప పీడనం ఉంటుంది. ఈ భూమధ్య ఈ రేఖా ప్రాంతంలో వేడి ఎక్కువగా ఉండి గాలులు వేడెక్కి వేడెక్కిన గాలి పైకి లేస్తుంది. దీని వలన భూమధ్యరేఖా ఉపరితల ప్రాంతంలో పీడనం తగ్గుతుంది. దీనిని అల్ప పీడనం అంటారు. అదే సమయంలో ఉప అయన రేఖా ప్రాంతంలో అధిక పీడనం ఉంటుంది. దీని వలన గాలులు అధిక పీడన ప్రాంతం నుండి అల్ప పీడన ప్రాంతం వైపు వీస్తాయి.

సాధారణంగా పవనాలు సమశీతోష్ణ మండలం నుండి ఉష్ణమండలానికి, ఉత్తరార్ధగోళంలో కొద్దిగా కుడివైపుకు, దక్షిణార్ధ గోళంలో కొద్దిగా ఎడమవైపుకు వీస్తాయి.

AP 9th Class Social Important Questions Chapter 4 వాతావరణం

ప్రశ్న 1.
శీతల స్థానిక పవనాలను గురించి రాయుము.
జవాబు:
1. మిస్ట్రాల్ :
శీతల స్థానిక పవనాల్లో ఆల్ఫ్ పర్వతాల నుండి ఫ్రాన్స్ మీదుగా మధ్యధరా సముద్రం వైపునకు వీచే మిస్ట్రాల్ – గాలులు పేరుగాంచినవి. ఇవి రోమ్ లోయగుండా వీస్తాయి. ఈ గాలులు చాలా చల్లగానూ, పొడిగానూ ఉంటాయి.

2. ప్యూనా :
ఇవి ఆండీస్ ప్రాంతంలోని స్థానిక శీతల పవనాలు.

3. పాంపెరో :
ఇవి దక్షిణ అమెరికాలోని పంపాల (గడ్డి మైదానాల) ప్రాంతంలో వేగంగా వీచే శీతల ధృవ పవనాలు.

ప్రశ్న 2.
ఉష్ణస్థానిక పవనాలను గురించి రాయుము.
జవాబు:
ఉష్ణ స్థానిక పవనాలు :
1. చినూక్ :
ఉత్తర అమెరికాలోని అమెరికా – కెనడా ప్రాంతంలోని రాకీ పర్వతాల కిందగా వీచే పవనాలను ‘చినూక్’ అంటారు. చినూక్ అన్న పదానికి ‘మంచును తినేది’ అన్న అర్థం ఉందని ప్రజలు అనుకుంటారు. వాస్తవానికి ఈ పవనాల పేరు ఆ ప్రాంతంలో నివసించిన అమెరికా మూలవాసీలలో ఒక జాతి పేరు చినూక్. ఈ పవనాల వల్ల పచ్చిక మైదానాలలో – శీతాకాలంలో చాలా వరకు మంచు పట్టకుండా ఉంటుంది. యూరపులో వీచే ఇటువంటి పవనాలను ‘ఫోన్’ అంటారు. ఇవి ఆల్ప్ పర్వతాల ఉత్తర వాలుల మీదుగా వీస్తాయి. ఈ పవనాల వల్ల మంచు కరిగి వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. ద్రాక్ష పళ్లు త్వరగా పండటానికి ఈ పవనాలు సహాయం చేస్తాయి.

2. పడగాలులు (లూ) :
ఉత్తర భారతదేశంలో మే – జూన్ నెలల మధ్య పడమర నుంచి తూర్పునకు వీచే వేడి, పొడి పవనాలను ‘లూ’ అంటారు. అధిక ఉష్ణోగ్రతల వల్ల ప్రజలకు వడదెబ్బ’ తగలవచ్చు.

స్థానిక ఉష్ణ పవనాలకు అరేబియా ఎడారిలో సైమూన్, జపాన్లో యోమా, న్యూజిలాండ్ లో నార్వెస్టర్ మరికొన్ని ఉదాహరణలు:

AP 9th Class Social Important Questions Chapter 3 జలావరణం

These AP 9th Class Social Important Questions 3rd Lesson జలావరణం will help students prepare well for the exams.

AP Board 9th Class Social 3rd Lesson Important Questions and Answers జలావరణం

9th Class Social 3rd Lesson 1 Mark Important Questions and Answers in Telugu Medium

ప్రశ్న 1.
నీటిచక్రం అంటే ఏమిటి?
జవాబు:
నీరు వివిధ రూపాలలో అంటే ద్రవ, ఘన, వాయు రూపాలలో ప్రసరణ కావటాన్ని ‘నీటి చక్రం’ అంటారు.

ప్రశ్న 2.
నీటిచక్రంలో ఎన్ని దశలున్నాయి? అవి ఏవి?
జవాబు:
నీటిచక్రంలో ఆరు దశలు ఉన్నాయి. బాష్పీభవనం, రవాణా, ద్రవీభవనం, అవపాతం, ఉపరితల ప్రవాహం, భూగర్భజలం.

ప్రశ్న 3.
బాష్పీచలనం అంటే ఏమిటి?
జవాబు:
నేలమీద నున్న నీరు ఆవిరి అయి వాతావరణంలోకి ప్రవేశించటాన్ని ‘బాష్పీభవనం’ అంటారు.

ప్రశ్న 4.
ద్రవీభవనం అంటే ఏమిటి?
జవాబు:
‘నీటిఆవిరి ‘ నీరుగా (చిన్న నీటి బిందువులు, మబ్బులుగా) మారటాన్ని ద్రవీభవనం అంటారు.

AP 9th Class Social Important Questions Chapter 3 జలావరణం

ప్రశ్న 5.
అవపాతం అంటే ఏమిటి?
జవాబు:
వాతావరణంలోని నీరు భూమి ఉపరితలానికి చేరటాన్ని అవపాతం అంటారు.

ప్రశ్న 6.
భూస్వరూపాలు అంటే ఏవి?
జవాబు:
భూమి మీది ఖండాలను, మహాసముద్రాలను మొదటి శ్రేణి భూస్వరూపాలు అంటారు.

ప్రశ్న 7.
భూమిమీద గల నీటి భాగం ఎన్ని భాగాలుగా విభజింపబడింది? అవి ఏవి?
జవాబు:
భూమి మీద గల నీటి భాగాన్ని చూశాస్త్రజ్ఞులు పసిఫిక్, అట్లాంటిక్, హిందూ, దక్షిణ (అంటార్కిటిక్), ఆర్కిటిక్ అనే అయిదు మహాసముద్రాలుగా విభజించారు.

ప్రశ్న 8.
సముద్రం అంటే ఏమటి?
జవాబు:
చుట్టూ లేదా కనీసం ఒక వైపున భూమి ఉండే ఉప్పునీటి భాగాన్ని సముద్రం అంటారు.

ప్రశ్న 9.
‘పాంథాల్సా’ అంటే ఏమిటి?
జవాబు:
మహాసముద్రాలన్నీ కలిసి కోట్లాది సంవత్సరాల క్రితం ఒకే ఒక్క మహాసముద్రంగా ఉండేవి, దీన్ని ‘పాంథాల్సా’ అంటారు.

ప్రశ్న 10.
సమలోతుగీత అంటే ఏమిటి?
జవాబు:
ఉపరితలం నుంచి ఒకే లోతులో ఉన్న సముద్రపు నేలను సూచించే బిందువులను కలిపే గీతను సమలోతు గీత (ఐసోబాక్స్) అంటారు.

ప్రశ్న 11.
సమలవణీయత రేఖ అంటే ఏమిటి?
జవాబు:
సముద్రంలో ఒకే లవణీయత ఉన్న ప్రాంతాలను కలిపే రేఖను సమలవణీయత రేఖ (Isohaline) అంటారు.

ప్రశ్న 12.
సముద్ర ప్రవాహాలు అని వేటిని అంటారు?
జవాబు:
ఒక కచ్చితమైన దిశలో చాలా దూరం ప్రవహించే మహాసముద్రపు నీటిని సముద్రపు ప్రవాహాలు అంటారు.

ప్రశ్న 13.
ఉష్ణోగ్రతల ఆధారంగా సముద్ర ప్రవాహాలను ఎన్ని రకాలుగా వర్గీకరించారు? అవి ఏవి?
జవాబు:
ఉష్ణోగ్రతల ఆధారంగా సముద్రప్రవాహాలను రెండు రకాలుగా వర్గీకరించారు. అవి ఉష్ణప్రవాహాలు, శీతల ప్రవాహాలు.

ప్రశ్న 14.
వేగాన్ని బట్టి సముద్ర ప్రవాహాల వర్గీకరణను వివరించండి.
జవాబు:
వేగాన్ని బట్టి మహాసముద్రాల ప్రవాహాలను డ్రిప్ట్ అనీ, స్ట్రీం అనీ వర్గీకరిస్తారు. నిదానంగా ప్రవహించే దానిని డ్రిప్ట్ అనీ, వేగంగా ప్రవహంచే దానిని స్ట్రీం అనీ పిలుస్తారు.

AP 9th Class Social Important Questions Chapter 3 జలావరణం

ప్రశ్న 15.
సముద్ర ప్రవాహాలను ప్రభావితం చేసేవి ఏవి?
జవాబు:
లవణీయత, నీటి సాంద్రతల వ్యత్యాసాలు, మంచు కరగడం వంటివి కూడా సముద్ర ప్రవాహాలను ప్రభావితం చేస్తాయి.

ప్రశ్న 16.
వనరులుగా మహాసముద్రాలను ఏవిధంగా అభినందిస్తారు?
జవాబు:
అతి ప్రధానమైన నాగరికతలన్నీ సముద్ర తీరాలలో వెలిశాయి. సముద్రాలే ముత్యాలు, రత్నాలు వంటి అమూల్యమైన వస్తువులకు ఆధారం. అతి ప్రధానమైన విద్యుత్ ఉత్పత్తికి సముద్రాలే కారకాలు. పెట్రోలియం వంటి అతివిలువైన ఖనిజ వనరులకు సముద్రాలే కీలకాధారం. మహాసముద్రాలు పునరావృతమయ్యే వనరులు.

ప్రశ్న 17.
నేడు మనం మహాసముద్రాలను ఏ విధంగా కలుషితం చేస్తున్నాయో తెలపండి.
జవాబు:
మనం ప్లాస్టిక్, ఇతర వ్యర్థ పదార్థాలను సముద్రాలలో పారవేస్తూ వాటిని కలుషితం చేస్తున్నాం,

9th Class Social 3rd Lesson 4 Marks Important Questions and Answers in Telugu Medium

మహాసముద్రంవివరాలు
1. పసిఫిక్ మహాసముద్రంఅమెరికా నుంచి ఆసియా, ఓషియానా (ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, పపువా, న్యూగినియా) లను వేరుచేస్తుంది.
2. అట్లాంటిక్ మహాసముద్రంఅమెరికా నుంచి యూరప్, ఆఫ్రికాలను వేరుచేస్తుంది.
3. హిందూ మహాసముద్రందక్షిణ ఆసియా తీరాలను తాకుతుంది. ఆఫ్రికా, ఆస్ట్రేలియాలను విడదీస్తోంది.
4. అంటార్కిటిక్ మహాసముద్రం
(దక్షిణ మహాసముద్రం)
అంటార్కిటికా ఖండాన్ని చుట్టి ఉంటుంది. పసిఫిక్, అట్లాంటిక్, హిందూ మహాసముద్రాల కొనసాగింపుగా ఒక్కొక్కసారి పేర్కొంటుంటారు.
5. ఆర్కిటిక్ మహాసముద్రంఒక్కోసారి అట్లాంటిక్ మహాసముద్రంలో భాగంగా పరిగణిస్తారు. ఆర్కిటిక్ ప్రాంతంలో అధిక భాగం విస్తరించి ఉంటుంది. ఉత్తర అమెరికా, యూరేసియా తీరాలను తాకుతుంది.

పట్టికను చదివి ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు రాయండి.
i) దక్షిణ మహాసముద్రంగా పిలువబడే మహాసముద్రం ఏది?
ii) అమెరికా నుండి యూరప్, ఆఫ్రికాలను వేరు చేస్తున్న మహాసముద్రం ఏది?
iii) హిందూ మహాసముద్రంచే వేరు చేయబడుతున్న ఖండాలు ఏవి?
iv) ఓషియానాలో ఉండే భూభాగాలు ఏవి?
జవాబు:
i) అంటార్కిటిక్ మహాసముద్రం దక్షిణ మహాసముద్రంగా పిలువబడుతుంది.
ii) అట్లాంటిక్ మహాసముద్రం అమెరికా నుండి యూరప్, ఆఫ్రికాలను వేరు చేస్తుంది.
iii) ఆఫ్రికా, ఆస్ట్రేలియాలను విడదీస్తుంది.
iv) ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, పపువా, న్యూగినియాలు ఓషియానాలో ఉన్న భాగాలు.

9th Class Social 3rd Lesson Extra Questions and Answers in Telugu Medium

ప్రశ్న 1.
జలచక్రం అనగా నేమి?
జవాబు:
నీరు వివిధ రూపాలలో అంటే ద్రవ, ఘన, వాయు రూపాలలో ప్రసరణ కావటాన్ని నీటిచక్రం అంటారు. మహాసముద్రాల నుంచి భూమి మీదకు, భూమి నుంచి మహాసముద్రాలలోకి నీళ్ళు తిరుగుతూ ఉండటాన్ని “జలచక్రం” అంటారు.

AP 9th Class Social Important Questions Chapter 3 జలావరణం

ప్రశ్న 2.
భూమి మీద గల నీటి వనరుల వివరాలను తెల్పండి.
జవాబు:

జలభాగంమొతం నీటిలో శాతం
1) మహాసముద్రాలు97.25%
2) ధృవ మంచుప్రాంతాలు ( హిమానీనదాలు)2.05%
3) భూగర్భజలం0.68%
4) సరస్సులు0.01%
5) నేలలో తేమ0.005%
6) వాతావరణం0.001%
7) నదులు0.0001%
8) జీవావరణం0.00004%

ప్రశ్న 3.
మహాసముద్రాల యొక్క వివరాలను తెల్పండి.
జవాబు:
మహాసముద్రాల యొక్క వివరాలు :

మహాసముద్రంవివరాలు
1. పసిఫిక్ మహాసముద్రంఅమెరికా నుంచి ఆసియా, ఓషియానా (ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, పపువా, న్యూగినియా) లను వేరుచేస్తుంది.
2. అట్లాంటిక్ మహాసముద్రంఅమెరికా నుంచి యూరప్, ఆఫ్రికాలను వేరుచేస్తుంది.
3. హిందూ మహాసముద్రందక్షిణ ఆసియా తీరాలను తాకుతుంది. ఆఫ్రికా, ఆస్ట్రేలియాలను విడదీస్తోంది.
4. అంటార్కిటిక్ మహాసముద్రం
(దక్షిణ మహాసముద్రం)
అంటార్కిటికా ఖండాన్ని చుట్టి ఉంటుంది. పసిఫిక్, అట్లాంటిక్, హిందూ మహాసముద్రాల కొనసాగింపుగా ఒక్కొక్కసారి పేర్కొంటుంటారు.
5. ఆర్కిటిక్ మహాసముద్రంఒక్కోసారి అట్లాంటిక్ మహాసముద్రంలో భాగంగా పరిగణిస్తారు. ఆర్కిటిక్ ప్రాంతంలో అధిక భాగం విస్తరించి ఉంటుంది. ఉత్తర అమెరికా, యూరేసియా తీరాలను తాకుతుంది.

ప్రశ్న 4.
మహాసముద్రాల ఉపరితల నీటిలో లవణీయతను ప్రభావితం చేసే అంశాలు ఏవి?
(లేదా)
మహాసముద్రాల లవణీయతను ప్రభావితం చేసే ఏవేని రెండు కారకాలను రాయండి.
(లేదా)
జలభాగాలలో లవణీయతని ప్రభావితం చేసే రెండు అంశాలేవి?
జవాబు:
మహాసముద్రాల ఉపరితల నీటిలో లవణీయతను ప్రభావితం చేసే అంశాలు :

  1. నీరు ఆవిరి కావటం, అవపాతం.
  2. తీరప్రాంతంలో నదులనుంచి ప్రవహించే మంచినీళ్లు, ధృవప్రాంతాలలో మంచు గడ్డకట్టటం, కరగటం.
  3. నీటిని ఇతర ప్రాంతాలకు బదిలీ చేసే గాలులు.
  4. సముద్రపు ప్రవాహాలు / తరంగాలు.

ప్రశ్న 5.
అత్యధిక, అత్యల్ప లవణీయత గల జల భాగాలు ఏవి?
జవాబు:

అత్యధిక లవణీయత ఉన్న జలభాగాలుతక్కువ లవణీయత ఉన్న జలభాగాలు
1) వాన్ సరస్సు – టర్కీ – 330%1) బాల్టిక్ సముద్రం – 3 నుంచి 15%
2) మృత సరస్సు – ఇజ్రాయెల్ 238%2) హడ్సన్ అఖాతం – 3 నుంచి 15%
3) మహాలవణ సరస్సు – అమెరికా 220%

ప్రశ్న 6.
మహాసముద్ర ప్రవాహాలకు కారణాలు ఏవి?
జవాబు:
మహాసముద్ర ప్రవాహాలకు కారణాలు :
1) అపకేంద్ర బలం :
భూమి తనచుట్టూ తాను తిరుగుతున్న క్రమంలో ధ్రువాలతో పోలిస్తే భూమధ్యరేఖ వద్ద అపకేంద్ర శక్తి ఎక్కువగా ఉంటుంది. ఈ శక్తిలో తేడా కారణంగా భూమధ్యరేఖా ప్రాంతం నుంచి మహాసముద్రాల నీళ్లు – ధ్రువాల వైపు ప్రవహిస్తాయి.

2) పవనాలు :
పవనాలు, పవనాల కడలిక వల్ల ఏర్పడే ఒత్తిడి వల్ల ప్రవాహాల దిశలో మార్పు ఉంటుంది. పవనాల ఒరిపిడితో రాసుకుపోవటం వల్ల పవనాల దిశలో నీళ్లు ప్రవహిస్తాయి. ఉదాహరణకు గంటకు 50 మైళ్ల వేగంతో వీచే పవనాల వల్ల గంటకు 0.75 మైళ్ల వేగంతో వెళ్లే ప్రవాహాలు ఏర్పడతాయి.

3) అవపాతం :
భూమధ్యరేఖా ప్రాంతం వద్ద అత్యధిక అవపాతం ఉంటుంది. కాబట్టి ఇక్కడి సముద్ర నీటిమట్టం ఎక్కువగా ఉంటుంది. ఫలితంగా భూమధ్యరేఖ నుంచి ఉత్తర, దక్షిణ దిశలుగా సముద్రపు నీరు ప్రవహిస్తుంది.

4) సౌరశక్తి :
సౌరశక్తి వల్ల వేడెక్కిన నీళ్లు వ్యాకోచం చెందుతాయి. ఈ కారణం వల్ల భూమధ్యరేఖ వద్ద మధ్య అక్షాంశాలతో , పోలిస్తే మహాసముద్రాల మట్టం 8 సెంటీమీటర్లు ఎక్కువ ఉంటుంది. దీనివల్ల కొద్దిపాటి వాలు ఏర్పడి, ఆ వాలు దిశగా మహాసముద్రపు నీళ్లు ప్రవహిస్తాయి. లవణీయత, నీటి సాంద్రతల వ్యత్యాసాలు, మంచు కరగడం వంటివి కూడా సముద్ర ప్రవాహాలను ప్రభావితం చేస్తాయి.

ప్రశ్న 7.
వనరులుగా మహాసముద్రాలు ఏ విధంగా ఉపయోగపడుతున్నాయి?
AP 9th Class Social Important Questions Chapter 3 జలావరణం 1
జవాబు:
వనరులుగా మహాసముద్రాలు :

  1. మహాసముద్రాలు మత్స్యసంపదకు నిలయాలు.
  2. ఆదిమకాలం నుంచి మానవులు ఆహారం కోసం మహాసముద్రాల మీద ఆధారపడ్డారు.
  3. చేపల వేటకు ఉత్తర సముద్రంలోని డాగర్ బ్యాంక్, న్యూ ఫౌండ్ ల్యాండ్ లోని గ్రాండ్ బ్యాంక్ ప్రసిద్ధిగాంచాయి.
  4. క్లోరిన్, ఫ్లోరిన్, బ్రోమిన్, అయోడిన్ వంటివి మహాసముద్రాలలో దొరుకుతాయి.
  5. అలలు, కెరటాలు వంటివి పునరుద్ధరింపబడే ఇంధన వనరులు.
  6. వర్షపాతానికి మహాసముద్రాలే మూలం.
  7. మహాసముద్రాలు అంతర్జాతీయ రహదారులుగా పనిచేస్తాయి.
  8. నాగరికతకు మూలాలు : గ్రీకు, రోమ్ వంటి నాగరికతలు మహాసముద్రాలు, నదుల తీరాలలోనే వెల్లివిరిశాయి.

AP 9th Class Social Important Questions Chapter 3 జలావరణం

ప్రశ్న 8.
మహాసముద్రాల ఉపరితలం గురించి వ్రాయుము.
జవాబు:
మహాసముద్రాల ఉపరితలం :
మహాసముద్రాల ఉపరితలం చాలావరకు భూమి ఉపరితలాన్ని పోలి ఉంటుంది. నీటిలోపల కొండలు, పీఠభూములు, కాన్యాన్లు, టెర్రాస్ వంటివి ఉంటాయి. మహాసముద్రాల నేలను నాలుగు భాగాలుగా విభజించవచ్చు.

1) ఖండతీరపు అంచు :
భూమికి, సముద్రానికి మధ్య సరిహద్దు ప్రాంతం ఇది. ఖండపు అంచు 200 మీటర్ల లోతు వరకు ఉండి సముద్ర విస్తీర్ణంలో 7.6% వరకు ఉంటుంది. అతి పెద్ద ఖండతీరపు అంచు ఆర్కిటిక్ సముద్రంలోని సైబీరియా అంచులో ఉంది. ఇది 1500 కిలోమీటర్ల వెడల్పు ఉంటుంది.

ఖండపు అంచు చాలా ముఖ్యమైనది, ఎందుకంటే :

  • ఈ ప్రాంతంలో మత్స్య సంపద చాలా ఎక్కువ.
  • ఈ ప్రాంతంలోనే ముడిచమురు, సహజవాయువులు దొరుకుతాయి.
  • ఇక్కడ ఓడరేవులను నిర్మించవచ్చు.

AP 9th Class Social Important Questions Chapter 3 జలావరణం 2

2) ఖండతీరపు వాలు :
200 మీటర్ల నుంచి 3000 మీటర్ల వరకు ఖండతీరపు వాలు ఉంటుంది. దీంట్లో అనేక స్వరూపాలు ఉంటాయి. మహాసముద్రపు విస్తీర్ణంలో ఇది 15 శాతం వరకు ఉంటుంది. ఖండతీరపు వాలు సరిహద్దు ఖండాలను సూచిస్తుంది. ఈ ప్రాంతంలోనే సముద్ర అగాధ దరలు ఉంటాయి. హిమానీనదాలు, నదుల నీటికోత ప్రక్రియలతో ఇవి ఏర్పడతాయి.

3) మహాసముద్ర మైదానాలు :
మహాసముద్రపు నేలలో లోపలికల్లా ఉన్న మైదానాలు చాలా తక్కువ వాలుతో ఉంటాయి. ప్రపంచంలోకెల్లా అత్యంత చదునుగా, నునుపుగా ఉండే ప్రాంతమిదే. ఇవి 3000 నుంచి 6000 మీటర్ల లోతు వరకు ఉంటాయి. సముద్రపు ఉపరితలంలో వీటి విస్తీర్ణం 76.2% వరకు ఉంటుంది.

4) మహాసముద్ర అగాధాలు :
ఈ అగాధాలు సన్నగా, లోతుగా 6000 మీటర్ల వరకు ఉంటాయి. మనం ఊహించినదానికి భిన్నంగా అత్యంత లోతైన అగాధాలు సముద్రపు మధ్య భాగంలో కాకుండా ఖండాలకు దగ్గరగా ఉంటాయి.

ప్రశ్న 9.
సముద్రాల లవణీయతను గురించి వ్రాయుము.
జవాబు:

  1. సముద్రపు నీటిలో కరిగిన ఉప్పు ఎంత ఉందో తెలియచేయటానికి లవణీయత అన్నదానిని ఉపయోగిస్తారు.
  2. 1000 గ్రాముల సముద్రపు నీటిలో ఎంత ఉప్పు (గ్రాములలో) కరిగి ఉందో ఇది సూచిస్తుంది.
  3. దీనిని సాధారణంగా వెయ్యిలో ఎంత మోతాదు (Parts per Thousand – PPT) గా వ్యక్తపరుస్తారు.
  4. సాధారణంగా మహాసముద్రాల నీటి లవణీయత 35% లేదా 1000 గ్రాముల నీటిలో 35 గ్రాముల ఉప్పు ఉంటుంది.
  5. సముద్రపు నీటిలో పెద్ద మొత్తంలో కరిగిన ఖనిజాలు ఉంటాయి, వీటిల్లో ఉప్పు ఒక్కటే 77.8% ఉంటుంది.

ప్రశ్న 10.
నీటి చక్రంలోని వివిధ దశలను వివరించండి.
(లేదా)
“నీటి చక్రం” దశలను గురించి వివరించండి. .
జవాబు:
నీటి చక్రంలో ఆరు దశలు ఉన్నాయి.

  1. బాష్పీభవనం
  2. రవాణా
  3. ద్రవీభవనం
  4. అవపాతం
  5. ఉపరితల ప్రవాహం
  6. భూగర్భజలం

1) బాష్పీభవనం :
నేలమీద నున్న నీరు ఆవిరి కావటం ద్వారా వాతావరణంలోకి ప్రవేశిస్తుంది. ఈ క్రమంలో నీరు ద్రవ రూపం నుండి వాయురూపంలోకి మారుతుంది. దీనిని బాష్పీభవనం అంటారు.

2) రవాణా :
వాతావరణంలో నీటి ఆవిరి మేఘాల రూపంలో మహాసముద్రాల మీద నుంచి భూమి మీదకు చేరుతుంది. ఉపరితల వాయువులు, భూభాగ, జలభాగాలను ఆనుకుని వీచే చల్లని గాలుల వంటివాటి వల్ల మేఘాలు ఒకచోటు నుంచి మరొక చోటుకి కదులుతాయి.

3) ద్రవీభవనం :
రవాణా చేయబడిన నీటి ఆవిరి ద్రవీభవనం చెందిన చిన్న నీటి బిందువులుగా, మబ్బులుగా మారుతుంది.

4) అవపాతం :
వాతావరణంలోని నీరు భూమి ఉపరితలాన్ని చేరటాన్ని అవపాతం అంటారు.

5) ఉపరితలంపై నీటి ప్రవాహం :
భూమి మీదకు చేరిన చాలా భాగం నీరు కొండలు, వాలుల మీదుగా ఉపరితల నీరుగా ప్రవహిస్తుంది. దానిలో కొంత భూమిలోనికి ఇంకి భూగర్భ జలాలు పునరుద్ధరింపబడతాయి.

6) భూగర్భ జలం :
లోపలికి ఇంకిన నీరు భూగర్భ జలమవుతుంది. లక్ష్యాత్మక నియోజనము

AP 9th Class Social Important Questions Chapter 2 భూమి – ఆవరణములు

These AP 9th Class Social Important Questions 2nd Lesson భూమి – ఆవరణములు will help students prepare well for the exams.

AP Board 9th Class Social 2nd Lesson Important Questions and Answers భూమి – ఆవరణములు

9th Class Social 2nd Lesson 1 Mark Important Questions and Answers in Telugu Medium

ప్రశ్న 1.
శాస్త్రజ్ఞులు ప్రస్తావించిన భూమి మీద ఉన్న నాలుగు ఆవరణములు ఏవి?
జవాబు:
భూ శాస్త్రజ్ఞులు భూమి మీద నాలుగు ఆవరణాల గురించి ప్రస్తావిస్తుంటారు. అవి –

  1. శిలావరణం
  2. జలావరణం
  3. వాతావరణం
  4. జీవావరణం

ప్రశ్న 2.
జలావరణం అంటే ఏమిటి?
జవాబు:
నీరు ఉండే మండలాన్ని జలావరణం అంటారు. ఇంగ్లీషులో దీనిని ‘హైడ్రోస్ఫియర్’ అంటారు. ఇది నీరు అనే అర్థం ఉన్న ‘హ్యడర్’ అనే గ్రీకు పదం నుంచి వచ్చింది.

ప్రశ్న 3.
వాతావరణం అంటే ఏమిటి?
జవాబు:
భూమి చుట్టూ ఉండే సన్నటి గాలి పొరను వాతావరణం అంటారు. ఇంగ్లీషులో దీనిని ‘అట్మాస్ఫియర్’ అంటారు. ‘అట్మాస్’ అన్న గ్రీకు పదానికి ‘ఆవిరి’ అని అర్థం.

AP 9th Class Social Important Questions Chapter 2 భూమి – ఆవరణములు

ప్రశ్న 4.
జీవావరణం అని దేనినంటారు?
జవాబు:
గాలిలో ఎంతో ఎత్తున, సముద్రాలలో ఎంతో లోతున ప్రాణులు, బాక్టీరియాతో సహా ఉండే ఆవరణాన్ని ‘జీవావరణం’ అంటారు. ఇంగ్లీషులో దీనిని ‘బయోస్ఫియర్’ అంటారు. జీవం అన్న అర్థం ఉన్న ‘బయోస్’ అనే గ్రీకు పదం నుంచి ఇది వచ్చింది.

ప్రశ్న 5.
అగ్నిపర్వతం అంటే ఏమిటి?
జవాబు:
భూగర్భం నుండి బయటికి ప్రవహించిన శిలాద్రవం ముఖ ద్వారం చుట్టూ ఘనీభవించి ఒక శంఖాకార పర్వత నిర్మాణం ఏర్పడుతుంది, దీనినే అగ్నిపర్వతం (Volcano) అంటారు.

ప్రశ్న 6.
అగ్నిశిలలు అనగానేమి?
జవాబు:
కరిగిన శిలాద్రవం చల్లబడి కఠిన శిలలుగా ఏర్పడుతుంది, వీటిని అగ్ని శిలలు అంటారు.

ప్రశ్న 7.
మూడవ శ్రేణి భూస్వరూపాలు ఏవి?
జవాబు:
నీరు, గాలి వల్ల రూపొందే భూస్వరూపాలను భూ శాస్త్రవేత్తలు “మూడవ శ్రేణి భూస్వరూపాలు” అంటారు.
ఉదా : చెక్కబడిన కొండలు, లోయలు, డెల్టా, ఇసుక పర్వతాలు మొదలైనవి.

ప్రశ్న 8.
శిలాశైథిల్యం అనగానేమి?
జవాబు:
వాతావరణ శక్తుల వల్ల రాళ్ళు ఛిద్రమయ్యే ప్రక్రియను శిలాశైథిల్యం అంటారు.

ప్రశ్న 9.
క్రమక్షయం అంటే ఏమిటి?
జవాబు:
గాలి, నీటి శక్తుల కారణంగా భూమి ఉపరితలం పై పొరలు కొట్టుకుపోవటాన్ని క్రమక్షయం అని అంటారు.

ప్రశ్న 10.
గార్జెస్ అంటే ఏమిటి?
జవాబు:
రాళ్ళు (శిలలు) చాలా గట్టిగా ఉన్న ప్రాంతాలలో నదీ ప్రవాహ మార్గాన్ని సన్నటి లోతైన లోయగా కోస్తుంది. దీని అంచులు నిటారుగా ఉంటాయి, వీటిని ‘గార్జెస్’ అంటారు. గోదావరి నది మీద పాపి కొండల వద్ద బైసన్ గార్జ్, కాశ్మీరులోని ఇండగార్జ్ లు ‘గార్జెస్’కు ఉదాహరణలు.

ప్రశ్న 11.
అగాధదరులు ఎలా ఏర్పడతాయి?
జవాబు:
నది అంచులు తీవ్రవాలుతో చాలా లోతుకు కోతకు గురైనప్పుడు అగాధదరులు ఏర్పడతాయి.

ప్రశ్న 12.
ఒండ్రు అంటే ఏమిటి?
జవాబు:
నదికి వరదలు వచ్చినపుడు అది నేలను కోతకు గురి చేస్తుంది, వరద తగ్గు ముఖం పట్టినపుడు కోసిన మట్టిని వేరే చోట మేట వేస్తుంది. దీనిని ఒండ్రు అంటారు.

ప్రశ్న 13.
ఆక్స్-బౌ సరస్సు అని దేనిని అంటారు?
జవాబు:
వరద మైదానంలో నది పాము మాదిరి మెల్లగా వంపు తిరిగి ఉంటుంది, ఈ మెలికలలో పక్కలకు మేట వేస్తుండటంతో అవి చేరువ అవుతూ కాలక్రమంలో మెలిక తిరిగిన భాగం నది నుంచి తెగిపోయి ఒక సరస్సులాగా ఏర్పడుతుంది, దీనినే ‘ఆక్స్-బౌ సరస్సు అంటారు.

AP 9th Class Social Important Questions Chapter 2 భూమి – ఆవరణములు

ప్రశ్న 14.
మెరైన్లు అనగానేమి?
జవాబు:
హిమానీనదం మోసుకుపోలేని పదార్థాలను వివిధ ప్రాంతాలలో మేటవేస్తుంది, ఇలా మేటవేసిన వాటిని ‘మోరైన్లు’ అంటారు.

ప్రశ్న 15.
మేటవేయటం కారణంగా ఏర్పడేవి ఏవి?
జవాబు:
‘సముద్రపు తోరణాలు’, ‘పేర్పుడు స్తంభాలు’, సముద్ర బృగువు (శిఖరం), అగ్రం మొదలైన సముద్ర తీర భూ స్వరూపాలు, సముద్రపు అలల కారణంగా తీర ప్రాంతాలు కోతకు గురికావటం, మేటవేయటం కారణంగా ఏర్పడతాయి.

ప్రశ్న 16.
లోయస్ మైదానాలు అంటే ఏవి?
జవాబు:
మెత్తగా ఉండే దుమ్ము ఎడారులను దాటి కొట్టుకెళ్లి పక్క భూముల మీద పడుతుంది, ఇటువంటి నేలను ‘లోయిస్’ మైదానాలంటారు.

ప్రశ్న 17.
నీటి ప్రభావంచే ఏర్పడే ఏవేని రెండు భూస్వరూపాలను రాయండి.
జవాబు:
నీటి ప్రభావంచే ఏర్పడే రెండు భూస్వరూపాలు :

  1. లోయలు
  2. డెల్టాలు మొ||వి.

9th Class Social 2nd Lesson 2 Marks Important Questions and Answers in Telugu Medium

ప్రశ్న 1.
“మానవ కార్యకలాపాలైన గనుల తవ్వకం, ఇటుకలు, సిమెంటుతో నగరాల నిర్మాణం, వ్యవసాయం, ఆనకట్టలు నిర్మించడం వంటివి శిలావరణాన్ని ప్రభావితం చేస్తాయి” ~ వ్యాఖ్యానించండి.
జవాబు:
గనుల తవ్వకం :
గనుల తవ్వకం వలన భూమి పొరలలో లోపలికి తవ్వడం వలన భూమిలోపలి భాగం బాగా దెబ్బతిని భూకంపాలు అవీ సంభవిస్తాయి.

ఇటుకలు – సిమెంటులతో నగరాల నిర్మాణం :
ఇటుకల తయారీలో పంట పండే భూములలోని మట్టి వాడటం వలన భూసారం దెబ్బతింటుంది. అలాగే సిమెంటులోని దుమ్ము, ధూళి వలన వాతావరణం కాలుష్యానికి గురి అవుతుంది.

వ్యవసాయం :
వ్యవసాయంలో వాడే రసాయనిక ఎరువులు, క్రిమి సంహారకాల వలన వాతావరణం కాలుష్యానికి గురి అవుతుంది.

డ్యామ్ నిర్మాణం :
డ్యామ్ ల నిర్మాణం వలన అక్కడ ఉన్న సహజ వృక్ష సంపద దెబ్బ తింటుంది. మరియు ఎక్కువ భాగం ఆయకట్టు ప్రాంతంగా మారి ఎక్కువ మంది నీటి కొరత సమస్యతో బాధపడతారు.

ప్రశ్న 2.
ఈ క్రింద ఇచ్చిన వాటిని పట్టికలో తగిన విధంగా అమర్చండి.
పుట్టగొడుగురాయి, సముద్రతోరణాలు, దుముకు మడుగు, ‘U’ ఆకారపులోయ.

కారణంఏర్పడే భూస్వరూపం
1. నీటి ప్రభావం
2. హిమానీనదాల ప్రభావం
3. గాలి ప్రభావం
4. అలల ప్రభావం

జవాబు:

కారణంఏర్పడే భూస్వరూపం
1. నీటి ప్రభావందుముకు మడుగు
2. హిమానీనదాల ప్రభావం‘U’ ఆకారపు లోయ
3. గాలి ప్రభావంపుట్టగొడుగురాయి
4. అలల ప్రభావంసముద్రతోరణాలు

9th Class Social 2nd Lesson 4 Marks Important Questions and Answers in Telugu Medium

ప్రశ్న 1.
నీరు మరియు గాలి భూమి ఉపరితలాన్ని ఎలా మార్చివేస్తున్నాయో వివరించండి.
జవాబు:
నీరు, గాలి భూమి ఉపరితలాన్ని ఈ క్రింద చూపినట్లు నాలుగు ప్రక్రియల ద్వారా మార్చివేస్తాయి.

శిలాశైథిల్యం :
నీళ్ళు, గాలిలోని తేమ కూడా ఈ ప్రక్రియకు దోహదం చేస్తాయి. రాళ్ళలోని రసాయనాలతో నీళ్ళు ప్రతిచర్య చెంది వాటిని మరింత బలహీనపరుస్తాయి. రాళ్ళు బలహీనమై, పగిలిపోయే ఈ ప్రక్రియను శిలాశైథిల్యం అంటారు.

క్రమక్షయం :
ప్రవహిస్తున్న నీటికి, గాలికి ఎంతో శక్తి ఉంటుంది. అది రాళ్ళను నిదానంగా కరిగించి వేస్తుంది. మట్టి పై పొరలను తొలగించి వేస్తుంది. వాన, నది, భూగర్భజలం, సముద్ర అలలు వంటి రూపాలలో నీళ్ళు, ఈదురుగాలులు, తుఫాను గాలులు వంటి అనేక రూపాలలో గాలి భూమి యొక్క పై పొర కొట్టుకుపోవడానికి దోహదం చేస్తాయి. దీన్ని క్రమక్షయం అంటారు.

రవాణా :
కోతకు గురైన రాళ్ళు, కంకర, మట్టి, ఒండ్రు వంటి వాటిని గాలి, నీళ్ళు మోసుకుపోవడాన్ని రవాణా అంటారు.

నిక్షేపణ :
రాళ్ళ నుంచి పై పొరల నుంచి విడిపోయిన రేణువులు గాలి, నీటితో పాటు కొట్టుకుపోతుంటాయి. అయితే వీటి వేగం తగ్గినప్పుడు ఇక రేణువులను మోసుకు వెళ్ళలేక వాటిని మేటవేస్తాయి. ఇలా మేట వేసిన మట్టివల్ల మైదానాలు, నదీ ప్రాంతాలు ఏర్పడతాయి. ఈ మేటలు సముద్రపు నేలలో పొరలు పొరలుగా నిక్షిప్తమై కాలక్రమంలో అవక్షేప శిలలుగా మారతాయి.

AP 9th Class Social Important Questions Chapter 1 భూమి – మనం

These AP 9th Class Social Important Questions 1st Lesson భూమి – మనం will help students prepare well for the exams.

AP Board 9th Class Social 1st Lesson Important Questions and Answers భూమి – మనం

9th Class Social 1st Lesson 1 Mark Important Questions and Answers in Telugu Medium

ప్రశ్న 1.
కక్ష్య అనగానేమి?
జవాబు:
సూర్యుడి చుట్టూ భూమి తిరిగే దారినే ‘కక్ష్య’ అంటారు. ఈ పరిభ్రమణం ఒకే తలంలో ఉంటుంది. దీనిని కక్ష్య తలం అంటారు.

ప్రశ్న 2.
‘సంవత్సరం’ అనగానేమి?
జవాబు:
ఈ వేగంతో సూర్యుని చుట్టూ ఒక పరిభ్రమణం పూర్తిచేయటానికి 365¼ రోజులు పడుతుంది. దీనిని మనం ‘సంవత్సరం’ అంటాం.

ప్రశ్న 3.
సంస్కృతంలో భూమికి గల పేర్లు ఏవి?
జవాబు:
సంస్కృతంలో భూమి, పృథ్వి, ధరణి, అవని, పుడమి వంటి పేర్లు భూమికి ఉన్నాయి. భారతీయ భాషలలో భూమికి ఉన్న పేర్లు ఈ సంస్కృత మూలాల్లోంచి వచ్చినవే.

ప్రశ్న 4.
భూమిని ఎన్ని పొరలుగా విభజింపవచ్చును?
జవాబు:
భూమిని ప్రధానంగా భూపటలం, భూప్రావారం, భూ కేంద్ర మండలం అని మూడు పొరలుగా విభజించవచ్చును.

ప్రశ్న 5.
భూపటలం అని దేనినంటారు?
జవాబు:
మనం భూమి బయటిపొర మీద నివసిస్తున్నాం, దీనిని భూపటలం అంటాం. భూపటలం 30 – 100 కిలోమీటర్ల మందం ఉంది.

ప్రశ్న 6.
భూప్రావారం గురించి రాయండి.
జవాబు:
భూప్రావారం భూమి లోపల 100 కి.మీ. నుంచి 2,900 కి.మీ. వరకు ఉంటుంది. దీనిలో సిలికేట్లు అనే రసాయనాలు ఉంటాయి.

ప్రశ్న 7.
భూకేంద్రమండలం ఎక్కడ వరకు ఉంటుంది? దీనిలో ఏమి ఉన్నాయి?
జవాబు:
భూ కేంద్ర మండలం 2,900 కి.మీ. నుండి 6,376 కి.మీ. వరకు ఉంటుంది. దీంట్లో ప్రధానంగా ఇనుము, వంటి భార ఘన పదార్థాలు ఉంటాయి.

ప్రశ్న 8.
ఖండచలన సిద్ధాంతాన్ని ఎవరు, ఎందుకు ప్రతిపాదించారు?
జవాబు:
ఖండాలు, మహాసముద్రాల ప్రస్తుత స్థితిని కొంతమేరైనా వివరించటానికి 20వ శతాబ్ద ఆరంభంలో జర్మనీకి చెందిన ఉల్కాపాత భూ శాస్త్రవేత్త ఆల్ఫ్రెడ్ వెజినర్ ఖండచలన సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు.

AP 9th Class Social Important Questions Chapter 1 భూమి – మనం

ప్రశ్న 9.
వెజినర్ పాంజియాను గురించి ఏమి చెప్పాడు?
జవాబు:
పాంజియా అనే ఈ మహాఖండం లారెన్షియా (ప్రస్తుత ఉత్తర అమెరికా, గ్రీన్‌లాండ్, భారత ఉపఖండానికి ఉత్తరంగా ఉన్న యూరేసియా మొత్తం) గోండ్వానా భూమి (ప్రస్తుత దక్షిణ అమెరికా, ఆఫ్రికా, మడగాస్కర్, భారతదేశం, అరేబియా, మలేసియా, తూర్పుఇండీస్, ఆస్ట్రేలియా, అంటార్కిటికా) అనే రెండు భాగాలుగా విడిపోయిందని వెజిగ్ ప్రతిపాదించాడు.

ప్రశ్న 10.
గ్రిడ్ అనగానేమి?
జవాబు:
గ్లోబు మీద అక్షాంశాలు, రేఖాంశాలు గీసి ఉంటాయి. ఈ నిలువు, అడ్డ గీతలతో గళ్లు ఏర్పడతాయి. దీనిని ‘గ్రిడ్’ అంటారు.

ప్రశ్న 11.
భూమధ్యరేఖ అని దేనినంటారు?
జవాబు:
భూమికి మధ్యలో అడ్డంగా వెళ్లే వృత్తాన్ని భూమధ్యరేఖ అంటారు. ఇది ఉత్తర, దక్షిణ ధృవాల నుంచి సమ దూరాలలో ఉంటుంది. ఇది భూమిని రెండు సమ భాగాలుగా చేస్తుంది కాబట్టి దీనిని భూమధ్యరేఖ అంటారు. దీనిని 0° అక్షాంశంగా గుర్తిస్తారు.

ప్రశ్న 12.
అక్షాంశాలను ఎలా సూచిస్తారు?
జవాబు:
రేఖాశాస్త్రంలో కోణాలను సూచించినట్లే అక్షాంశాలను కూడా డిగ్రీలు (ి)నిమిషాలు (‘) సెకండ్ల (‘) లో సూచిస్తారు. 13. లాటిట్యూడ్ అంటే ఏమిటి ? జ. ఇంగ్లీషులో ‘లాటిట్యుడ్’ అనే పదం ‘వెడల్పు’ అనే అర్థం సూచించే లాటిన్ పదం అయిన ‘లాటిట్యుడో’ నుంచి వచ్చింది.

ప్రశ్న 14.
ఉత్తరార్ధ గోళం, దక్షిణార్ధ గోళం అని వేటిని అంటారు?
జవాబు:
భూమధ్యరేఖకు, ఉత్తర ధృవానికి మధ్య ఉన్న భూమి సగభాగాన్ని ఉత్తరార్ధగోళం అంటారు. భూమధ్యరేఖకు దక్షిణ ధృవానికి మధ్య ఉన్న సగభాగాన్ని దక్షిణార్ధగోళం అంటారు.

ప్రశ్న 15.
వివిధ అక్షాంశాల పేర్లు రాయండి.
జవాబు:
23½° ఉత్తర అక్షాంశంను కర్కటరేఖ అని, 23½° దక్షిణ అక్షాంశాన్ని మకరరేఖ అని, 66½° ఉత్తర అక్షాంశంను ఆర్కిటిక్ వలయం అని, 66½° దక్షిణ అక్షాంశాన్ని అంటార్కిటిక్ వలయం అని అంటారు.

ప్రశ్న 16.
లాంగిట్యూడ్ అంటే ఏమిటి?
జవాబు:
రేఖాంశాన్ని ఇంగ్లీషులో లాంగిట్యూడ్ అంటారు. దీని మూలం ‘పొడవు’ అనే అర్థం ఉన్న ‘లాంగిట్యుడో’ అన్న లాటిన్ పదం. రేఖాంశం పటం పొడవును లేదా ఎత్తును సూచిస్తుంది.

ప్రశ్న 17.
ప్రామాణిక రేఖాంశం లేదా గ్రీనిచ్ మెరిడియన్ అంటే ఏమిటి?
జవాబు:
ఇంగ్లాండ్ లోని ‘గ్రీన్ విజ్’లోని నక్షత్రశాల గుండాపోయే రేఖాంశాన్ని 0° మెరిడియన్ లేదా ప్రామాణిక రేఖాంశం లేదా గ్రీనిచ్ మెరిడియన్ అంటారు.

ప్రశ్న 18.
మెరిడియన్ అంటే ఏమిటి?
జవాబు:
మెరిడియన్ అంటే మధ్యాహ్నం అని అర్థం. ఇది మెరిడియాసిస్ అనే లాటిన్ పదం నుండి వచ్చింది. రేఖాంశాలను మధ్యాహ్నరేఖలని కూడా అంటారు.

ప్రశ్న 19.
ప్రామాణిక సమయం అనగానేమి?
జవాబు:
కొన్ని దేశాలు తమ దేశం గుండా వెళ్లే ఒక రేఖాంశాన్ని ఎంచుకుని ఆ రేఖాంశం వద్ద సమయాన్ని దేశమంతటికీ వర్తింపచేస్తారు, దీనిని ఆ దేశ ప్రామాణిక సమయం అంటారు.

AP 9th Class Social Important Questions Chapter 1 భూమి – మనం

ప్రశ్న 20.
IST అనగానేమి?
జవాబు:
IST అనగా భారతదేశ ప్రామాణిక సమయం (Indian Standard Time).

ప్రశ్న 21.
యాంటీ మెరీడియన్ అనగానేమి?
జవాబు:
0° రేఖాంశమునకు వ్యతిరేక దిశలో 180° లలో ఉన్న రేఖాంశమును యాంటీ మెరీడియన్ అని పిలుస్తారు. అవి 180° తూర్పు రేఖాంశము మరియు 180° లలో ఉన్న పశ్చిమ రేఖాంశములు.

9th Class Social 1st Lesson 2 Marks Important Questions and Answers in Telugu Medium

ప్రశ్న 1.
ఒక ప్రదేశం యొక్క అక్షాంశాలు, మరియు రేఖాంశాలు తెలుసుకోవడం ఎందుకు ముఖ్యం? అది ఏవిధంగా ఉపయోగపడుతుంది?
జవాబు:

  1. ఒక ప్రాంతం గూర్చి పూర్తి సమాచారం తెలుసుకోవాలంటే ఆ ప్రాంతం యొక్క అక్షాంశ రేఖాంశాల గూర్చి తెలుసుకోవాలి.
  2. అక్షాంశాల సహాయంతో ఆ ప్రాంతం యొక్క ఉనికిని తెలుసుకోవచ్చును.
  3. మరియు ఆ ప్రాంతం యొక్క శీతోష్ణస్థితిని కూడా తెలుసుకోవచ్చు.
  4. రేఖాంశాల సహాయంతో ఆ ప్రాంతంలో సమయాన్ని తెలుసుకోవచ్చును.

AP 9th Class Social Important Questions Chapter 1 భూమి – మనం

ప్రశ్న 2.
జినర్ మహాఖండమైన పాంజియా రెండు ఖండాలుగా విడిపోయిందని ప్రతిపాదించాడు –
అవి 1) లారెన్షియా
2) గోండ్వానా భూమి మీద ఉన్న ప్రస్తుతం ఉన్న రూపం, స్థానంలోకి రావడానికి కొన్ని మిలియన్ల సంవత్సరాలు పట్టింది.

1) లారెన్షియా :
ఉత్తర అమెరికా, గ్రీన్‌లాండ్, భారత ఉపఖండానికి ఉత్తరంగా ఉన్న యురేషియా మొత్తం.

2) గోండ్వానా :
దక్షిణ అమెరికా, ఆఫ్రికా, మడగాస్కర్, భారతదేశం, అరేబియా, మలేషియా, తూర్పు ఇండీస్, ఆస్ట్రేలియా, అంటార్కిటికా

పైన ఉన్న సమాచారాన్ని అధ్యయనం చేసి, క్రింది ప్రశ్నలకు జవాబులు రాయండి.
ఎ) గోండ్వానా నుండి ఏర్పడి, ప్రస్తుతం ఆసియా ఖండంలో భాగంగా ఉన్న ఏవైనా రెండు భూభాగాలను పేర్కొనుము.
బి) ప్రస్తుతం ఉన్న యూరప్ ఏ భాగం నుండి ఏర్పడింది?
జవాబు:
ఎ) భారతదేశం, అరేబియా, మలేషియా మొ||వి.
బి) ప్రస్తుతం ఉన్న యూరప్ లారెన్షియా భాగం నుండి ఏర్పడింది.

ప్రశ్న 3.
గ్లోబు చిత్రమును గీచి, దానిమీద ప్రత్యేక పేర్లు కలిగిన అన్ని అక్షాంశములను గుర్తించుము.
జవాబు:
AP 9th Class Social Important Questions Chapter 1 భూమి – మనం 1

9th Class Social 1st Lesson 4 Marks Important Questions and Answers in Telugu Medium

ప్రశ్న 1.
భూమి అంతర్నిర్మాణం గూర్చి వివరించండి (లేదా) భూమి అంతర్గత నిర్మాణమును వర్ణించుము.
జవాబు:
భూమి అంతః మరియు బాహ్య భాగాన్ని కలిపి 3 పొరలుగా విభజించడం జరిగింది.
అవి :

  1. భూ పటలం
  2. భూ ప్రావారం
  3. భూ కేంద్ర మండలం.

1) భూ పటలం :
భూమి యొక్క బాహ్య పొర అయిన భూపటలం మీద మనం నివసిస్తున్నాం. ఈ భూపటలం యొక మందం 30-100 కిలోమీటర్లు. ఈ భూ పటలం వివిధ రకాల శిలలతో నిర్మితమైనది.

2) భూ ప్రావారం :
భూ ప్రావారం భూమి లోపల 100 కి.మీ. నుండి 2,900 కి.మీ. వరకు ఉంటుంది. దీనిలో – సిలికేట్లు అనే రసాయనాలు ఉంటాయి.

3) భూ కేంద్ర మండలం :
భూ కేంద్ర మండలం రెండు భాగాలుగా విభజింపబడింది. 1) బాహ్య కేంద్రం, 2) అంతః కేంద్రం.

బాహ్య కేంద్రం :
2,900 నుండి 5, 100 కి.మీ. వరకు ఉంటుంది. దీనిలో నికెల్ మరియు ఐరన్ ఉన్నాయి.

అంతః కేంద్రం :
5,100 నుండి 6,376 కి. మీ. వరకు ఉంటుంది. ఇక్కడ ఇనుము మరియు బంగారం ఎక్కువగా ఉంటుంది.

AP 10th Class Social Important Questions Chapter 2 అభివృద్ధి భావనలు

These AP 10th Class Social Studies Important Questions 2nd Lesson అభివృద్ధి భావనలు will help students prepare well for the exams.

AP Board 10th Class Social 2nd Lesson Important Questions and Answers అభివృద్ధి భావనలు

10th Class Social 2nd Lesson ½ Mark Important Questions and Answers in Telugu Medium

1. ఆదాయ రీత్యా ప్రస్తుతము భారతదేశ స్థితి ఏమిటి?
జవాబు:
మధ్యస్థ ఆదాయం గల దేశం.

2. రాష్ట్రాల బడ్జెట్ లో చదువుపై ఎక్కువ ఖర్చు చేస్తున్న రాష్ట్రం ఏది?
జవాబు:
హిమాచల్ ప్రదేశ్.

3. 2013 మానవాభివృద్ధి సూచిక ప్రకారం భారతదేశం ఏ స్థానంలో ఉంది?
జవాబు:
136

4. భారతదేశంలోని ఏ రాష్ట్రంలో పాఠశాల విద్యా విప్లవం ప్రారంభమయినది?
జవాబు:
హిమాచల్ ప్రదేశ్.

5. స్త్రీలను పురుషులతో సమానంగా చూడక పోవటాన్ని ఏమంటారు?
జవాబు:
తలసరి ఆదాయం

AP 10th Class Social Important Questions Chapter 2 అభివృద్ధి భావనలు

6. దేశాలను వర్గీకరించటానికి ప్రపంచ బ్యాంక్ చేత ఉపయోగించబడిన సూచిక ఏది?
జవాబు:
తలసరి ఆదాయం

7. మానవాభివృద్ధి చరిత్ర పరిణామక్రమ కాల సూచి ప్రకారం వేట, సేకరణ ఎప్పటి నుండి ప్రారంభమయింది?
జవాబు:
2,00,000 సం||లు.

8. ‘కుడంకుళం’ ఏ రాష్ట్రంలో కలదు?
జవాబు:
తమిళనాడు (తిరునల్వేలి జిల్లా)

9. ‘ఐవరీకోస్ట్’ దేశం ఏ ఖండంలో ఉంది?
జవాబు:
ఆఫ్రికా.

10. దేశం మొత్తం ఆదాయాన్ని దేశ జనాభాతో భాగిస్తే …….. వస్తుంది.
జవాబు:
లింగ వివక్షత.

11. తలసరి ఆదాయం =?
జవాబు:
AP 10th Class Social Important Questions Chapter 2 అభివృద్ధి భావనలు 4

12. 2012 సం||రానికి 1035 అమెరికన్ డాలర్ల కంటే తక్కువ ఆదాయం ఉన్న దేశాలను ఏమని అంటారు?
జవాబు:
తక్కువ ఆదాయ దేశాలు.

13. 2012 సం||రానికి 12,600 అమెరికన్ డాలర్ల కంటె ఎక్కువ ఆదాయం ఉన్న దేశాలను ఏమని పిలుస్తారు?
జవాబు:
అధిక ఆదాయ దేశాలు.

14. పోలికకు ‘సగటు’ ఉపయోగకరంగా ఉన్న ఇది ఏమి వెల్లడి చేయదు?
జవాబు:
ప్రజల మధ్య అంతరాలను.

15. అక్షరాస్యత శాతంను గణించేటపుడు ఎన్ని సం||రాలకు మించి వయస్సు ఉన్న వాళ్ళను లెక్కలోకి తీసుకుంటారు?
జవాబు:
7 సం||లు.

AP 10th Class Social Important Questions Chapter 2 అభివృద్ధి భావనలు

16. నికర హాజరు శాతం లెక్కించడానికి ఎన్ని సం||రాల వయస్సు పిల్లల్లో బడికి హాజరవుతున్న పిల్లల శాతంను తీసుకుంటారు?
జవాబు:
6 – 17 సం||లు.

17. సజీవంగా పుట్టిన ప్రతి వెయ్యి మంది పిల్లల్లో సం||రం పూర్తి అయ్యేసరికి ఎంత మంది చనిపోతున్నారో తెలియజేసే సంఖ్యను ఏమంటారు?
జవాబు:
శిశు మరణాల రేటు.

18. మానవాభివృద్ధి సూచికలో మొత్తం ఎన్ని దేశాలలో ఆయా దేశాల స్థానాన్ని ఇస్తుంది?
జవాబు:
177.

19. 2005 సం||లో భారతదేశంలో రాష్ట్ర ప్రభుత్వాలు విద్య పై సగటున ప్రతి విద్యార్థిపై ఎన్ని రూపాయలు ఖర్చు పెట్టాయి?
జవాబు:
₹1049

20. లింగ వివక్షత తక్కువగా ఉన్న రాష్ట్రం ఏది?
జవాబు:
హిమాచల్ ప్రదేశ్.

21. UNDPని విస్తరింపుము.
జవాబు:
ఐక్యరాజ్య సమితి అభివృద్ధి కార్యక్రమము.

22. HDI ని విస్తరింపుము.
జవాబు:
మానవాభివృద్ధి సూచిక.

23. మానవాభివృద్ధి చరిత్ర పరిణామక్రమ కాలసూచి ప్రకారం పారిశ్రామికీకరణ మొదలై ఎన్ని సం||రాల ని తెలుస్తుంది?
జవాబు:
400 సం||లు కు పూర్వం

24. మానవాభివృద్ధి చరిత్ర పరిణామ క్రమ కాలసూచి ప్రకారం వ్యవసాయం మొదలై ఎన్ని సం||రాలని తెలుస్తుంది?
జవాబు:
12000 సం||లు.

25. అబిద్ జాన్ పట్టణం ఏ దేశంలో కలదు?
జవాబు:
ఐవరి కోస్ట్.

26. దేశ వాసులందరి ఆదాయము మొత్తం కలిపి ఏమి అంటాము?
జవాబు:
జాతీయాదాయము.

27. ఒక దేశంలోని ప్రజలు మరో దేశ ప్రజల కంటే మెరుగ్గా ఉన్నారా లేదా అనే విషయం తెలుసుకోవడానికి దేనిని పోలుస్తాం?
జవాబు:
సగటు ఆదాయం

28. పశ్చిమాసియా దేశాలు, మరికొన్ని చిన్నదేశాలు మినహా ‘ధనిక దేశాలను’ సాధారణంగా ఏ దేశాలని అంటారు?
జవాబు:
అభివృద్ధి చెందిన

AP 10th Class Social Important Questions Chapter 2 అభివృద్ధి భావనలు

29. దశాబ్దం క్రితం భారతదేశం. ఏ ఆదాయ దేశాల జాబితాలో ఉండేది?
జవాబు:
తక్కువ ఆదాయం

30. ఆయు:ప్రమాణం, తలసరి ఆదాయం మనకంటే ఎక్కువ ఉన్న మన పొరుగు దేశమేది?
జవాబు:
శ్రీలంక

31. పాఠశాల విద్యలో ఎన్ని సం||లు గడపటం అన్నది హిమాచల్ ప్రదేశ్ పిల్లలకు నియమంగా మారిపోయింది?
జవాబు:
10 సం||లు

32. 2012 సం||రానికి 1036 – 12599 అమెరికన్ డాలర్ల మధ్య తలసరి ఆదాయం ఉన్న దేశాలన్నీ ఏ దేశాల జాబితాలోకి వస్తాయి?
జవాబు:
మధ్య ఆదాయ దేశాలు.

33. దూర ప్రదేశంలో ఉద్యోగం వస్తే జీతమే కాకుండా పరిగణనలోకి తీసుకునే ఏదైనా ఒక అంశం రాయండి.
జవాబు:
కుటుంబానికి ఉండే సదుపాయాలు, పని పరిస్థితులు, క్రమం తప్పకుండా పని దొరకడం.

34. మహిళలు అనేక రకాల ఉద్యోగాలు చేపట్టటానికి, వ్యాపారాలు నిర్వహించటానికి వారికి కల్పించాల్సిన ముఖ్యమైన సదుపాయం ఏది?
జవాబు:
భద్రత

35. 2012 సం||రంలో పంజాబు రాష్ట్ర తలసరి ఆదాయం ఎంత?
జవాబు:
₹78,000

36. 2012 సం||రంలో హిమాచల్ ప్రదేశ్ తలసరి ఆదాయం ఎంత?
జవాబు:
₹74,000

37. 2011 జనాభా లెక్కల ప్రకారం పంజాబు రాష్ట్ర అక్షరాస్యత శాతం ఎంత?
జవాబు:
77%

38. 2011 జనాభా లెక్కల ప్రకారం హిమాచల్ ప్రదేశ్ అక్షరాస్యత శాతం ఎంత?
జవాబు:
84%

39. 2006 సం||రంలో బీహార్ రాష్ట్రంలోని శిశుమరణాలు 1000కి ఎంత ఉన్నాయి?
జవాబు:
62.

40. 2006 సం||రంలో పంజాబు రాష్ట్రంలోని శిశుమరణాలు 1000 కి ఎంత ఉన్నాయి?
జవాబు:
42.

41. శిశు మరణాల రేటును తగ్గించటానికి చేపట్టాల్సిన ఏదైనా ఒక చర్యను తెల్పండి.
జ. మౌలిక ఆరోగ్య సదుపాయాలు, విద్య సౌకర్యాలు కల్పించాలి.

42. 2018 సం||రం లెక్కల ప్రకారం భారతదేశ తలసరి ఆదాయం ఎంత?
జవాబు:
3285

43. 2018 సం||రం లెక్కల ప్రకారం శ్రీలంక తలసరి పంజాబ్ ఆదాయం ఎంత?
జవాబు:
$ 5170

44. హిమాచల్ ప్రదేశ్ లో ఆడ పిల్లలు కూడా అత్యధిక బీహార్ సంఖ్యలో చదువుకోడానికి ఒక కారణం తెల్పండి.
జవాబు:
వివక్షత లేకపోవటం, తల్లిదండ్రుల ఆలోచనా విధానంలో మార్పు రావటం.

45. ఆడ పిల్లల చదువు వల్ల వచ్చే ప్రయోజనంను ఒకటి రాయండి.
జవాబు:
ఆత్మవిశ్వాసం కనబరుస్తారు, ఆడవాళ్ళ మాటకు ప్రాధాన్యత ఉంటుంది, స్వతంత్రంగా ఆలోచిస్తారు.

46. 2006 సం||రంలో హిమాచల్ ప్రదేశ్లో 6 సం||లు దాటిన ఆడపిల్లల్లో బడికి వెళ్ళిన వారి శాతం ఎంత?
జవాబు:
60%

47. 2006 సం॥రంలో హిమాచల్ ప్రదేశ్ లో 6 సం||లు దాటిన మగపిల్లల్లో బడికి వెళ్ళిన వారి శాతం ఎంత?
జవాబు:
75%

48. “2006 సం||రంలో భారతదేశంలో 6 సం||లు దాటిన ఆడపిల్లల్లో బడికి వెళ్ళిన వారి శాతం ఎంత?
జవాబు:
40%

AP 10th Class Social Important Questions Chapter 2 అభివృద్ధి భావనలు

49. క్రింది వానిలో సరికాని వ్యాఖ్యను గుర్తించి, రాయండి.
→ వర్షధార రైతులు సరియైన వర్షాలు కోరుతారు.
→ గ్రామీణ కార్మికులు మెరుగైన కూలీని కోరుతారు.
→ ధనిక రైతులు గ్రామాల్లోనే స్థిరపడాలని కోరుతారు.
→ ధనిక కుటుంబ అమ్మాయి స్వేచ్ఛను కోరుతుంది.
జవాబు:
ధనిక రైతులు గ్రామాల్లోనే స్థిరపడాలని కోరుతారు.

50. క్రింది వానిలో మానవాభివృద్ధి సూచిక (HDI) పరిగణనలోకి తీసుకోని అంశాలను గుర్తించి, రాయండి.
విద్య, వైద్యం, తలసరి ఆదాయం, జాతీయాదాయం
జవాబు:
జాతీయాదాయం

51. 2018లో భారతదేశంలో ఆయు:ప్రమాణం ఎన్నిసం||రాలు?
జవాబు:
65.8 సం||రాలు

52. క్రింది వాక్యాలను పరిగణించండి.
i) వేరు వేరు వ్యక్తులకు వేరు వేరు అభివృద్ధి లక్ష్యాలు ఉండవచ్చు.
ii) ఒకరికి అభివృద్ధి అయినది మరొకరికి కూడా అభివృద్ధి అవుతుంది.
పై వాక్యా లలో సరైనది ఏది?
A) (i) మాత్రమే
B) (ii) మాత్రమే
C) (i) మరియు (ii)
D) రెండూ కావు
జవాబు:
4-0 మాత్రమే

53. ఇవ్వబడిన పట్టికను పరిశీలించి క్రింది ప్రశ్నకు సమాధానము వ్రాయుము.
పట్టిక 3: కొన్ని రాష్ట్రాల తలసరి ఆదాయం

రాష్ట్రం2012 సం||లో తలసరి ఆదాయం (రూ.లో)
పంజాబ్78,000
హిమాచల్ ప్రదేశ్74,000
బీహార్25,000

ప్ర : ఏ రాష్ట్రం అభివృద్ధి చెందినదిగా భావించవచ్చు?
జవాబు:
పంజాబు

54. ఇవ్వబడిన పట్టికను పరిశీలించి క్రింది ప్రశ్నకు సమాధానము వ్రాయుము.
AP 10th Class Social Important Questions Chapter 2 అభివృద్ధి భావనలు 5
ప్ర : ‘క’ దేశం సగటు ఆదాయం ఎంత?
జవాబు:
10,000/-
ప్ర: ‘గ’ దేశం సగటు ఆదాయం ఎంత?
జవాబు:
10,000/-

55. ఇవ్వబడిన పట్టికను పరిశీలించి క్రింది ప్రశ్నకు సమాధానము వ్రాయుము.
AP 10th Class Social Important Questions Chapter 2 అభివృద్ధి భావనలు 6
ప్ర. ఆడపిల్లల్లో 5సం|| కంటే ఎక్కువ కాలం బడికి వెళ్ళిన వారి శాతం 1993 నుండి 2006 నాటికి ఎంత శాతం పెరిగింది?
జవాబు:
21%.

10th Class Social 2nd Lesson 1 Mark Important Questions and Answers in Telugu Medium

ప్రశ్న 1.
క్రింది పట్టికను పరిశీలించి a, b, c, d ప్రశ్నలకు జవాబులు రాయండి.
AP 10th Class Social Important Questions Chapter 2 అభివృద్ధి భావనలు 1
a) సగటు విద్యాకాలం ఎక్కువగా ఉన్న రెండు దేశాలు ఏవి?
b) భారత్ కంటే మెరుగైన ర్యాంకింగ్ ఉన్న రెండు ఆసియా దేశాలు ఏవి?
c) ప్రపంచ సగటు జీవితకాలం కంటే వెనుకబడిన దేశాలు ఏవి?
d) భారత్, బంగ్లాదేశ్, పాకిస్థాన్లలో సగటు విద్యాకాలం తక్కువగా ఉండడానికి కారణాలేవి?
జవాబు:
a) సగటు విద్యాకాలం ఎక్కువగా ఉన్న రెండు దేశాలు : నార్వే, అమెరికా.

b) భారత్ కంటే మెరుగైన ర్యాంకింగ్ ఉన్న రెండు ఆసియా దేశాలు : శ్రీలంక, చైనా

c) ప్రపంచ సగటు జీవిత కాలం కంటే వెనుకబడిన దేశాలు : భారత్, బంగ్లాదేశ్, పాకిస్థాన్.

d) 1. ఈ దేశాలలో పేదరికం ఎక్కువగా ఉండడం.
2. గ్రామీణ జనాభా ఎక్కువగా ఉండడం.
3. అక్షరాస్యత ప్రాధాన్యత తెలియకపోవడం వలన సగటు విద్యాకాలం తక్కువగా ఉంది.

ప్రశ్న 2.
తమిళనాడులోని కుడంకుళం అణు విద్యుత్ కేంద్ర స్థాపనకు వ్యతిరేకంగా నిరసన ఉద్యమాలు చెలరేగడానికి గల కారణమేమి?
(లేదా)
తమిళనాడులోని కుడంకుళం అణు విద్యుత్ కేంద్రం స్థాపనను ప్రజలు ఎందుకు వ్యతిరేకించారు?
జవాబు:
తీర ప్రాంత పరిరక్షణ, రేడియోధార్మిక, వినాశకర ప్రమాదం నుండి రక్షణ కొరకు కుడంకుళం అణు విద్యుత్ కేంద్ర స్థాపనకు వ్యతిరేకంగా నిరసన ఉద్యమాలు చెలరేగాయి.
(లేదా )
రక్షణ, భద్రత మరియు జీవనోపాధుల పరిరక్షణ కోసం ప్రజలు అణు విద్యుత్ కేంద్ర స్థాపనను వ్యతిరేకించారు.

AP 10th Class Social Important Questions Chapter 2 అభివృద్ధి భావనలు

ప్రశ్న 3.
“అభివృద్ధికి సంబంధించి ఇద్దరు వ్యక్తులకు లేదా బృందాలకు పరస్పర విరుద్ధమైన కోరికలు ఉండవచ్చు.” ఉదాహరణ ఇవ్వండి.
జవాబు:
అభివృద్ధికి సంబంధించి విరుద్ధమైన కోరికలు – ఉదాహరణ : ఎక్కువ కరెంటు కోసం భారీ డామ్ లు కట్టాలని పారిశ్రామికవేత్తలు కోరవచ్చు. కానీ తమ భూములు మునిగిపోతాయని గిరిజన తెగలు దీనిని వ్యతిరేకించవచ్చు.

ప్రశ్న 4.
కుడంకుళం అణు విద్యుత్ కేంద్రం ఎక్కడ ఉంది?
జవాబు:
తమిళనాడు రాష్ట్రం, తిరునల్వేలి జిల్లాలో ఉంది.

ప్రశ్న 5.
తలసరి ఆదాయం అనగానేమి?
జవాబు:
దేశం మొత్తం ఆదాయాన్ని (జాతీయాదాయం) ఆ దేశ జనాభాతో భాగించగా వచ్చేదే ఆ దేశ తలసరి ఆదాయం. దీనినే “సగటు ఆదాయం ” అని కూడా అంటారు.

ప్రశ్న 6.
ప్రపంచ బ్యాంకు అభివృద్ధి నివేదిక ప్రకారం ఎన్ని అమెరికన్ డాలర్ల కంటే ఎక్కువ తలసరి ఆదాయం ఉన్న దేశాలను అధిక ఆదాయ లేదా ధనిక దేశాలు అంటారు?
జవాబు:
2012 సంవత్సరానికి 12,600 అమెరికన్ డాలర్లు లేదా అంతకంటే ఎక్కువ.

ప్రశ్న 7.
ప్రపంచ బ్యాంకు అభివృద్ధి నివేదిక ప్రకారం 1,035 అమెరికన్ డాలర్ల కంటే తక్కువ తలసరి ఆదాయం ఉన్న దేశాలను ఇలా పిలుస్తారు.
జవాబు:
తక్కువ ఆదాయ దేశాలు లేదా పేద దేశాలు.

ప్రశ్న 8.
“సగటు” యొక్క ప్రధాన లోపం ఏమిటి?
జవాబు:
సగటు పోలికకు ఉపయోగకరంగా ఉన్నా అది ప్రజల మధ్య అంతరాలను వెల్లడి చేయదు.

ప్రశ్న 9.
2012 సం||లో పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, బీహార్ రాష్ట్రాల యొక్క తలసరి ఆదాయాలు ఎంత?
జవాబు:
పంజాబ్ – ₹78,000
హిమాచల్ ప్రదేశ్ – ₹74,000
బీహార్ – ₹ 25,000

ప్రశ్న 10.
అక్షరాస్యత శాతం అనగానేమి?
జవాబు:
ఏడు సంవత్సరాలు, అంతకుమించిన వయస్సు వాళ్లల్లో అక్షరాస్యతను తెలియజేయునది అక్షరాస్యత శాతం.

AP 10th Class Social Important Questions Chapter 2 అభివృద్ధి భావనలు

ప్రశ్న 11.
నికర హాజరు శాతం ఏమి తెలియజేయును?
జవాబు:
6-17 సంవత్సరాల వయస్సు పిల్లల్లో బడికి హాజరవుతున్న పిల్లల శాతంను “నికర హాజరు శాతం” అంటారు.

ప్రశ్న 12.
శిశుమరణాల రేటు అనగానేమి?
జవాబు:
సజీవంగా పుట్టిన ప్రతి వెయ్యిమంది పిల్లల్లో సంవత్సరం పూర్తి అయ్యేసరికి ఎంతమంది చనిపోతున్నారో తెలియజేయు సంఖ్య.

ప్రశ్న 10.
ఆయు:ప్రమాణ రేటు దేనిని తెలియజేయును?
జవాబు:
వ్యక్తి జీవించే సగటు కాలమును తెలియజేయును.

ప్రశ్న 13.
UNDP అనగానేమి?
జవాబు:
ఐక్యరాజ్యసమితి అభివృద్ధి కార్యక్రమము (United Nations Development Programme)

ప్రశ్న 14.
మానవాభివృద్ధి సూచికలేవి?
జవాబు:
విద్యాసాయి, ఆరోగ్య స్థితి, తలసరి ఆదాయాలు మానవాభివృద్ధి సూచికలు.

ప్రశ్న 15.
మానవ అభివృద్ధి సూచిక (2013) లో మొత్తం ఎన్ని దేశాలకు స్థానాన్ని ఇచ్చారు?
జవాబు:
మానవ అభివృద్ధి సూచికలో మొత్తం 177 దేశాలకు స్థానం ఇచ్చారు.

ప్రశ్న 16
ఏ రాష్ట్రంలో పాఠశాల విద్య విప్లవంగా పరిగణించబడుతుంది?
జవాబు:
హిమాచల్ ప్రదేశ్ లో పాఠశాల విద్య విప్లవంగా పరిగణించబడుతుంది.

ప్రశ్న 17.
2005 సం||లో భారతదేశంలో రాష్ట్ర ప్రభుత్వాలు సగటున ప్రతి విద్యార్థిపై ఎంత ఖర్చు పెట్టారు? హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం ఎంత ఖర్చు చేసింది?
జవాబు:
1,049 రూ.లు, 2,005 రూ.లు వరుసగా

ప్రశ్న 18.
హిమాచల్ ప్రదేశ్ పిల్లలకు ఏది నియమంగా మారిపోయింది?
జవాబు:
పాఠశాల విద్యలో పది సం||రాలు గడపటం అనేది నియమంగా మారిపోయింది.

ప్రశ్న 19.
హిమాచల్ ప్రదేశ్ లో లింగ వివక్షత తక్కువగా ఉండుటకు ఒక కారణం చెప్పండి.
జవాబు:
హిమాచల్ ప్రదేశ్ లో మహిళలు ఇంటి బయట ఉద్యోగాలు చేయడం, చురుకుగా పనిచేస్తున్న మహిళా మండలులు.

AP 10th Class Social Important Questions Chapter 2 అభివృద్ధి భావనలు

ప్రశ్న 20.
ఆదాయాన్ని పొందడమే కాకుండా ప్రజలు ఏ ఇతర అంశాలను కోరుకుంటున్నారు?
జవాబు:
సమానత, స్వేచ్ఛ, భద్రత, ఇతరుల నుంచి గౌరవం పొందడం వంటి అంశాలు కోరుకుంటున్నారు.

10th Class Social 2nd Lesson 2 Marks Important Questions and Answers in Telugu Medium

ప్రశ్న 1.
భూమి లేని గ్రామీణ కార్మికులు ఏ ఏ అభివృద్ధి లక్ష్యాలను, ఆకాంక్షలను నిర్దేశించుకుంటారు?
జవాబు:
భూమి లేని గ్రామీణ కార్మికుల అభివృద్ధి లక్ష్యాలు :

  1. ఎక్కువ రోజుల పని, మెరుగైన కూలి.
  2. స్థానిక పాఠశాలలో తమ పిల్లలకు నాణ్యమైన విద్యను ఆశించడం.
  3. సామాజిక వివక్షత లేకపోవడం, వాళ్ళు కూడా గ్రామంలో నాయకులు కాగలగడం.
  4. తమ ఆవాస ప్రాంతంలో సరైన మౌలిక సదుపాయాలు ఆశించడం.

ప్రశ్న 2.
వివిధ వర్గాల ప్రజల అభివృద్ధి లక్ష్యాలు భిన్నంగా ఉంటాయనడానికి ఉదాహరణలివ్వండి.
జవాబు:
వివిధ వర్గాల ప్రజల అభివృద్ధి లక్ష్యాలు భిన్నంగా ఉంటాయనడానికి ఉదాహరణలు :

వివిధ వర్గాల ప్రజలుఅభివృద్ధి లక్ష్యాలు
భూమి లేని గ్రామీణ కార్మికులుఎక్కువ పనిరోజులు, ఎక్కువ జీతం, పిల్లలకు నాణ్యమైన విద్య, సామాజిక వివక్షత లేకపోవడం.
ధనిక రైతులుపంటలకు అధిక మద్దతు ధరలు, పిల్లలు విదేశాల్లో స్థిరపడడం.
వర్షాధార రైతులుచాలినంత వర్షపాతం.
పట్టణ నిరుద్యోగిత యువతఎక్కువ జీతం వచ్చే ఉద్యోగం.
గనుల తవ్వక ప్రాంతంలోని ఆదివాసీలువారి జీవనాధారం, వనరులను పరిరక్షించుకోవడం.
తీరప్రాంతంలోని చేపలు పట్టే వ్యక్తిచేపలు పట్టడానికి కావలసిన అనుకూల వాతావరణం.

ప్రశ్న 3.
అభివృద్ధిని కొలవడానికి గల వివిధ సూచికలు ఏవి? వాటిలో నీవు దేనితో ఏకీభవిస్తావు?
జవాబు:
అభివృద్ధిని కొలవడానికి గల వివిధ సూచికలు:

  • తలసరి ఆదాయం
  • సగటు ఆయుః ప్రమాణం
  • సగటున బడిలో గడిపిన సంవత్సరాలు
  • పాఠశాల విద్యలో ఉండే సంవత్సరాలు
  • విద్యా స్థాయి (అక్షరాస్యత రేటు)
  • ఆరోగ్య స్థితి
  • ఉద్యోగితా స్థాయి
  • పంపిణీ న్యాయం
  • జీవన ప్రమాణ స్థాయి మొదలైనవి.

పై వాటిలో అన్నిటితో నేను ఏకీభవిస్తున్నాను. సంపూర్ణ అభివృద్ధికి ఇవన్నీ కొలమానాలని నా అభిప్రాయం.

AP 10th Class Social Important Questions Chapter 2 అభివృద్ధి భావనలు

ప్రశ్న 4.
‘హిమాచల్ ప్రదేశ్ లో పాఠశాల విప్లవం’ గురించి మీరేమి గ్రహించారు?
జవాబు:

  1. హిమాచల్ ప్రదేశ్ ప్రజలు, ప్రభుత్వం విద్యపై చాలా ఆసక్తి చూపారు.
  2. అనేక పాఠశాలలను ప్రారంభించారు.
  3. విద్య చాలా వరకు ఉచితంగా లభించేటట్లు చూశారు.
  4. ప్రభుత్వ బడ్జెట్లో విద్యకు ఎక్కువ వాటా కేటాయించారు.
  5. పాఠశాలల్లో అన్ని కనీస సదుపాయాలు ఉండేలా చూశారు.
  6. అధికశాతం పిల్లలకు పాఠశాల అనుభవం సంతోషదాయకంగా ఉంది.

ప్రశ్న 5.
మానవాభివృద్ధిని కొలవడానికి ఏయే అంశాలను పరిగణనలోకి తీసుకుంటున్నారు?
జవాబు:
మానవాభివృద్ధిని కొలవడానికి పరిగణనలోకి తీసుకునే అంశాలు :

  • తలసరి ఆదాయం
  • ఆయుః ప్రమాణం
  • అక్షరాస్యత
  • శిశుమరణాలు – జనన రేటు
  • జీవన ప్రమాణం
  • ప్రజారోగ్యం

ప్రశ్న 6.
ఆదాయమే కాకుండా ప్రజలు ఇంకా ఏమి కోరుకుంటారు?
జవాబు:
ఆదాయమే కాకుండా ప్రజలు ఇంకా కోరుకునేవి
1) సమానత
2) స్వేచ్ఛ
3) భద్రత
4) ఇతరుల నుండి గౌరవం పొందడం

ప్రశ్న 7.
ప్రపంచ బ్యాంకు తన ప్రపంచ అభివృద్ధి నివేదిక ప్రకారం తలసరి ఆదాయం ప్రామాణికంగా ఎలా వర్గీకరించారు? భారతదేశం ఏ జాబితాలో ఉంది?
జవాబు:

  1. దేశాలను వర్గీకరించటానికి ప్రపంచ బ్యాంకు తన ప్రపంచ అభివృద్ధి నివేదికలో ఈ ప్రామాణికాన్ని ఉపయోగించింది.
  2. 2012 సంవత్సరానికి 12,600 అమెరికన్ డాలర్లు లేదా అంతకంటే ఎక్కువ తలసరి ఆదాయం ఉన్న దేశాలను “అధిక ఆదాయ దేశాలు” లేక ధనిక దేశాలు అంటారు.
  3. అదే విధంగా 2012లో 1,035 అమెరికన్ డాలర్ల కంటే తక్కువ తలసరి ఆదాయం ఉండే దేశాలను “తక్కువ ఆదాయ దేశాలు” అంటారు.
  4. అయితే ఒక దశాబ్దం క్రితం భారతదేశం తక్కువ ఆదాయ దేశాల జాబితాలో ఉండేది. చాలా ఇతర దేశాలకంటే భారతదేశ తలసరి ఆదాయం వేగంగా పెరగటంతో దాని స్థానం మెరుగుపడింది.

AP 10th Class Social Important Questions Chapter 2 అభివృద్ధి భావనలు

ప్రశ్న 8.
వ్యక్తులకు ఆదాయమే కాకుండా ఎటువంటి లక్ష్యాలు ఉన్నాయి?
జవాబు:

  1. వ్యక్తులను, ఆకాంక్షలను, లక్ష్యాలను చూసినప్పుడు మెరుగైన ఆదాయమే కాకుండా భద్రత, ఇతరులతో గౌరవింపబడటం, సమానంగా చూడబడటం, స్వేచ్చ వంటి లక్ష్యాలు కూడా ఉన్నాయని తెలిసింది.
  2. అదేవిధంగా, ఒక దేశం లేదా ఒక ప్రాంతం గురించి ఆలోచించినప్పుడు సగటు ఆదాయమే కాకుండా ఇతర ముఖ్యమైన ప్రామాణికాలు కూడా ఉన్నాయని తెలుస్తుంది.

ప్రశ్న 9.
పట్టిక : కొన్ని రాష్ట్రాలకు సంబంధించి కొన్ని తులనాత్మక గణాంకాలు
AP 10th Class Social Important Questions Chapter 2 అభివృద్ధి భావనలు 7
పట్టికలో పేర్కొన్న అంశాలకు వివరణలు :
శిశుమరణాలు : సజీవంగా పుట్టిన ప్రతి వెయ్యిమంది పిల్లల్లో సంవత్సరం పూర్తి అయ్యేసరికి ఎంతమంది చనిపోతున్నారో తెలియచేసే సంఖ్య.
అక్షరాస్యత శాతం : ఏడు సంవత్సరాలు, అంతకుమించిన వయస్సు వాళ్లల్లో అక్షరాస్యతను తెలియచేస్తుంది.
నికర హాజరు శాతం : 6-17 సంవత్సరాల వయస్సు పిల్లల్లో బడికి హాజరవుతున్న పిల్లల శాతం.
పై సమాచారము ఆధారంగా క్రింద ఇవ్వబడిన ప్రశ్నలకు ఒక్క మాటలో సమాధానములిమ్ము.
1) శిశుమరణాల రేటు అధికంగా ఉన్న రాష్ట్రమేది?
జవాబు:
బీహార్

2) అక్షరాస్యత ఎక్కువగా కలిగి ఉన్న రాష్ట్రమేది?
జవాబు:
హిమాచల్ ప్రదేశ్

3) హిమాచల్ ప్రదేశ్ కు బీహారు నికర హాజరు శాతంలో తేడా ఎంత?
జవాబు:
90-56 = 34.

4) నికర హాజరు శాతం అనగా?
జవాబు:
6-17 సం||రాల వయస్సు పిల్లల్లో బడికి హాజరవుతున్న పిల్లల శాతం.

5) నికర హాజరు శాతం తక్కువగా ఉన్న రాష్ట్రం?
జవాబు:
బీహార్

6) పట్టికలో పేర్కొన్న అంశాల ప్రకారం మానవాభివృద్ధిలో ముందున్న రాష్ట్రమేది?
జవాబు:
హిమాచల్ ప్రదేశ్

ప్రశ్న 10.
పట్టిక : 2013 లో భారతదేశం, దాని పొరుగు దేశాలకు సంబంధించిన కొన్ని వివరాలు
AP 10th Class Social Important Questions Chapter 2 అభివృద్ధి భావనలు 2
పట్టికకు సంబంధించిన వివరాలు :

  1. మానవ అభివృద్ధి సూచికలో మొత్తం 177 దేశాలలో ఆయా దేశాల స్థానాన్ని ఇస్తుంది.
  2. వ్యక్తి జీవించే సగటు కాలం : జన్మించిన నాటి నుండి ఒక వ్యక్తి యొక్క సగటు జీవితకాలాన్ని సూచిస్తుంది.
  3. సగటున బడిలో గడిపిన కాలం : 25 సంవత్సరాల వయసు దాటిన వాళ్ళు సగటున బడిలో గడిపిన సంవత్సరాలు.
  4. పాఠశాల విద్యలో ఉండే సంవత్సరాలు : ప్రస్తుతం బడిలో పిల్లలు చేరుతున్నదాన్ని బట్టి బడి ఈడు పిల్లలు బడిలో ఎన్ని సంవత్సరాలు ఉంటారన్న అంచనా.
  5. తలసరి ఆదాయం : పోల్చటానికి వీలుగా అన్ని దేశాల తలసరి ఆదాయాన్ని అమెరికన్ డాలర్లలో లెక్కిస్తారు. ప్రతి దేశంలోనూ ప్రతి డాలరు అంతే మొత్తంలో సరుకులు, సేవలు కొనగలిగేలా దీనిని లెక్కిస్తారు.

పై సమాచారమును పరిశీలించి క్రింద ఇవ్వబడిన ప్రశ్నలకు సరియైన సమాధానములిమ్ము.
1) ప్రపంచ మానవ అభివృద్ధి సూచికలో మెరుగైన స్థానం కల్గి ఉన్న పొరుగుదేశం ఏది?
జవాబు:
శ్రీలంక

2) ఆయుః ప్రమాణ రేటు అంటే?
జవాబు:
వ్యక్తి జీవించే సగటు కాలం.

3) 2013 భారతదేశ తలసరి ఆదాయం ఎంత?
జవాబు:
3285 డాలర్లు

4) ఏ దేశంలో బడిలో గడిపిన సంవత్సరాల సగటు ఎక్కువగా ఉంది?
జవాబు:
శ్రీలంక

5) భారతకు, శ్రీలంకకు ఆయుః ప్రమాణంలో ఎన్ని సంవత్సరాల తేడా ఉంది?
జవాబు:
75.1 – 65.8 = 9.3 సం||లు,

ప్రశ్న 11.
పట్టిక : హిమాచల్ ప్రదేశ్ లో ప్రగతి
AP 10th Class Social Important Questions Chapter 2 అభివృద్ధి భావనలు 6
పై సమాచారము ఆధారంగా క్రింది ప్రశ్నలకు సరియైన సమాధానములిమ్ను.
1) (6 సంవత్సరాలు మించిన) ఆడపిల్లల్లో 5 సం||ల కంటే ఎక్కువ కాలం బడికి వెళ్లిన వారి శాతం భారతదేశంలో, హిమాచల్ ప్రదేశ్ లో 1993 నుండి 2006 వరకు ఎంతమేర పెరిగింది?
జవాబు:
12% (భారతదేశం), 21% (హిమాచల్ ప్రదేశ్)

2) (6 సంవత్సరాలు మించిన) మగపిల్లల్లో 5 సం||లు కంటే ఎక్కువకాలం బడికి వెళ్ళినవారి శాతం 2006లో భారత సగటు కంటే హిమాచల్ ప్రదేశ్ ఎంత ఎక్కువగా ఉంది?
జవాబు:
75 – 57 = 18

ప్రశ్న 12.
క్రింది పటమును పరిశీలించి ఇవ్వబడిన ప్రశ్నలకు సరియైన సమాధానమివ్వండి.
AP 10th Class Social Important Questions Chapter 2 అభివృద్ధి భావనలు 8
మానవాభివృద్ధిని సూచించు ప్రపంచ పటం
1) పటం దేనిని సూచిస్తుంది?
జవాబు:
పటం వివిధ ఖండాలలో మానవాభివృద్ధి తీరుతెన్నులను సూచిస్తుంది.

2) భారతదేశం ఏ మానవాభివృద్ధి వర్గానికి చెందింది?
జవాబు:
మధ్యస్థ వర్గానికి

3) అత్యధిక (HDI) కల్గి ఉన్న ప్రాంతాలు (దేశాలు) ఏవి?
జవాబు:
ఉత్తర అమెరికా, ఆస్ట్రేలియా, ఐరోపా, దక్షిణ అమెరికాలోని దక్షిణ ప్రాంతాలు.

4) అల్పాభివృద్ధి సూచిక కల్గిన రెండు దేశాలకు ఉదాహరణనిమ్ము.
జవాబు:
జింబాబ్వే, కెన్యా

5) అల్పాభివృద్ధి ఎక్కువగా ఏ ఖండంలో కన్పిస్తుంది?
జవాబు:
ఆఫ్రికా

10th Class Social 2nd Lesson 4 Marks Important Questions and Answers in Telugu Medium

ప్రశ్న 1.
ఈ క్రింద ఇవ్వబడిన పట్టికను చదివి దిగువన ఉన్న ప్రశ్నలకు సమాధానము వ్రాయండి.
పట్టిక : కొన్ని రాష్ట్రాలకు సంబంధించిన కొన్ని తులనాత్మక గణాంకాలు.
a) అక్షరాస్యత శాతం అంటే ఏమిటి?
b) నికర హాజరు శాతం ఏ రాష్ట్రంలో ఎక్కువగా ఉంది?
c) హిమాచల్ ప్రదేశ్ లో అక్షరాస్యత అధికంగా ఉండటానికి గల కారణమేమి?
d) శిశుమరణాలు తక్కువగా ఉన్న రాష్ట్రం ఏది?
జవాబు:
a) ప్రతి వందమంది జనాభాకు గల అక్షరాస్యుల సంఖ్యను అక్షరాస్యతా శాతం అంటారు.
b) హిమాచల్ ప్రదేశ్
c) 1) హిమాచల్ ప్రభుత్వము, అక్కడి ప్రజలు విద్యపై ఎంతో ఆసక్తి చూపారు.
2) పాఠశాలలు తెరిచి చాలా వరకు విద్య ఉచితంగా ఉండేలా లేదా తల్లిదండ్రులకు నామమాత్రపు ఖర్చు అయ్యేలా ప్రభుత్వం చూసింది.
3) పాఠశాలలో తగినంతమంది ఉపాధ్యాయులతోపాటు తరగతి గదులు, మరుగుదొడ్లు, త్రాగునీరు వంటి కనీస సదుపాయాలు ఉండేలా చూసింది.
4) భారతదేశ రాష్ట్రాలలో ప్రభుత్వ బడ్జెట్ లో ప్రతి విద్యార్థి చదువుపై ఎక్కువ మొత్తం ఖర్చు పెడుతున్న రాష్ట్రాలలో హిమాచల్ ప్రదేశ్ ఒకటి.

d) హిమాచల్ ప్రదేశ్

ప్రశ్న 2.
క్రింది పేరాను చదివి, వ్యాఖ్యానించండి.
దేశంలో అనేక ప్రాంతాలలో మగపిల్లల చదువుతో పోలిస్తే ఆడపిల్లల చదువుకు తక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. ఆడపిల్లలు కొన్ని తరగతులు చదువుతారు కాని పాఠశాల విద్య పూర్తి చేయరు.
జవాబు:
విద్యకు లింగ వారీగా ఇచ్చే ప్రధాన్యతని తెలియచేస్తోంది. ఇది చాలావరకు గ్రామాల్లో జరుగుతోంది. అనేక రకాల సామాజిక కారణాల వలన ఆడపిల్లల చదువులకు ఆటంకం కల్పిస్తున్నారు. పట్టణాలలో కూడా ఈ పరిస్థితి ఆర్థికంగా వెనుకబడిన వారిలోనే ఉన్నది. లేదా వలస కార్మికుల కుటుంబాలలో ఉన్నది. కాని నేడు కొంత మార్పు కనిపిస్తోంది. ఆడపిల్లల చదువుకు ప్రాధాన్యత ఇస్తున్నారు. విద్యార్జనీ విద్యార్థుల సంఖ్య దీనిని నిరూపిస్తోంది.

ప్రశ్న 3.
క్రింది సమాచారాన్ని కమ్మీ (బార్ గ్రాఫ్) రేఖాచిత్రంలో చూపండి. మీ పరిశీలనను రాయండి.

రాష్ట్రంఅక్షరాస్యత రేటు
1. పంజాబ్77
2. హిమాచల్ ప్రదేశ్84
3. బీహార్64

జవాబు:
AP 10th Class Social Important Questions Chapter 2 అభివృద్ధి భావనలు 3

పరిశీలన : అధిక అక్షరాస్యతను కలిగి ఉన్నది కాబట్టి హిమాచల్ ప్రదేశ్ అభివృద్ధి చెందిన రాష్ట్రంగా పరిగణించవచ్చు.

ప్రశ్న 4.
పట్టికను పరిశీలించి దిగువ ప్రశ్నలకు జవాబులు వ్రాయుము.
AP 10th Class Social Important Questions Chapter 2 అభివృద్ధి భావనలు 2
1) మానవాభివృద్ధి సూచికలో భారతదేశం కంటే అన్ని విషయాలలో మెరుగైన స్థానంలో ఉన్న దేశం ఏది?
2) మానవాభివృద్ధి సూచిక తయారీలో పరిగణనలోకి తీసుకొనబడే అంశాలు ఏవి?
3) అతి తక్కువ తలసరి ఆదాయం గల దేశాన్ని పేర్కొనండి.
4) మానవాభివృద్ధి నివేదికలో భారతదేశ స్థానం మెరుగుపడడానికి రెండు సూచనలు వ్రాయండి.
5) సగటున బడిలో గడిపిన కాలం – నిర్వచింపుము.
6) ఆయుః ప్రమాణంలో మెరుగ్గా కల దేశమేది?
7) అన్ని ప్రమాణాలలో మెరుగైన స్థానంలో కల దేశమేది?
8) మానవాభివృద్ధి సూచిక తయారీలో పరిగణనలోకి తీసుకునే అంశాలేవి?
జవాబు:

  1. శ్రీలంక
  2. తలసరి ఆదాయం , ఆయుః ప్రమాణం, సగటున బడిలో గడిపిన సం||రాలు. పాఠశాల విద్యలో ఉండే సం||రాలు.
  3. నేపాల్
  4. a) వైద్య సదుపాయాలు మెరుగుపరచాలి.
    b) నాణ్యతతో కూడిన విద్య అందించాలి.
  5. 25 సంవత్సరాలు వయసు దాటిన వాళ్ళు సగటున బడిలో గడిపిన సంవత్సరాలు.
  6. శ్రీలంక
  7. శ్రీలంక
  8. తలసరి ఆదాయం, ఆయుఃప్రమాణం, సగటున బడిలో గడిపిన సంవత్సరాలు, పాఠశాల విద్యలో ఉండే సంవత్సరాలు.

ప్రశ్న 5.
క్రింది పేరాగ్రాఫ్ చదవండి :
“దేశంలో అనేక ప్రాంతాలలో మగపిల్లలతో పోలిస్తే ఆడపిల్లలకు తక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు.”
ప్రశ్న : ‘భారతదేశంలో లింగ వివక్షతపై వ్యాఖ్యానించండి.”
జవాబు:

  1. మనది పురుషాధిక్యత సమాజము.
  2. స్త్రీలలో అక్షరాస్యత శాతం తక్కువగా ఉన్నది.
  3. ఇంటి బయట పనిచేసే స్త్రీల సంఖ్య తక్కువగా ఉంది.
  4. సాంప్రదాయపరంగా సామాజిక జీవితంలో మహిళల పాత్ర తక్కువ.
  5. ఈ కారణాల వల్ల లింగ వివక్షత ఇంకా కొనసాగుతూ ఉంది.
  6. ఇది సమాజాభివృద్ధికి ఆటంకము.
  7. అబ్బాయిలను, అమ్మాయిలను సమానంగా చూడాలి.

AP 10th Class Social Important Questions Chapter 2 అభివృద్ధి భావనలు

ప్రశ్న 6.
మానవ అభివృద్ధి నివేదిక గురించి నీకు తెలిసింది వివరించుము.
జవాబు:

  1. ఆదాయస్తాయి. ముఖ్యమైనప్పటికి అభివృద్ధిని సూచించటానికి అదొక్కటే సరిపోదని గుర్తించిన తరువాత ఇతర ప్రామాణికాల గురించి ఆలోచించటం మొదలు పెడతాం.
  2. ఇటువంటి ప్రామాణికాల జాబితా చాలా పెద్దగా ఉంటే అప్పుడది అంతగా ఉపయోగపడదు. చాలా ముఖ్యమైన అంశాల చిన్న జాబితా కావాలి.
  3. కేరళ, పంజాబులను పోల్చటానికి ఉపయోగించిన ఆరోగ్యం , విద్యా సూచికలు ఎంతో ముఖ్యమైనవి.
  4. గత దశాబ్ద కాలం నుంచి అభివృద్ధికి కొలమానంగా ఆదాయంతో పాటు ఆరోగ్యం, విద్యా సూచికలను కూడా – విస్తృతంగా ఉపయోగిస్తున్నారు.
  5. ఉదాహరణకు ఐక్యరాజ్యసమితి అభివృద్ధి కార్యక్రమం (యుఎన్ డిపి) ప్రచురించిన మానవ అభివృద్ధి నివేదిక దేశాలను ఆ ప్రజల విద్యాస్థాయి, ఆరోగ్య స్థితి, తలసరి ఆదాయాలను బట్టి పోలుస్తుంది.

ప్రశ్న 7.
హిమాచల్ ప్రదేశ్ లో ‘లింగ వివక్షత’ ఏ రంగంలో తక్కువగా ఉంది? ఎందువలన?
జవాబు:

  1. లింగ వివక్షత తక్కువగా ఉండటం ఆశ్చర్యం కలిగించవచ్చు.
  2. విద్యలోనే కాకుండా దీనిని ఇతర రంగాలలోనూ చూస్తాం.
  3. ఇతర రాష్ట్రాలలో పరిస్థితికి విరుద్ధంగా హిమాచల్ ప్రదేశ్ లో పుట్టిన కొన్ని నెలల్లో చనిపోయే పిల్లల్లో మగపిల్లల కంటే ఆడపిల్లల సంఖ్య తక్కువ.
  4. దీనికి ఒక కారణం హిమాచల్ ప్రదేశ్ మహిళలు ఇంటి బయట ఉద్యోగాలు చేస్తున్నారు.
  5. బయట ఉద్యోగాలు చేసే మహిళలు స్వతంత్రంగా ఉంటారు, ఆత్మవిశ్వాసం కనబరుస్తారు.
  6. ఇంటిలో తీసుకునే నిర్ణయాలలో అంటే పిల్లల చదువు, ఆరోగ్యం, పిల్లల సంఖ్య, గృహ నిర్వహణ వంటి వాటిల్లో ఆడవాళ్ల మాటకు ప్రాధాన్యత ఉంటుంది.
  7. వాళ్ళు ఉద్యోగాల్లో ఉండటం వల్ల పెళ్లి అయిన తరువాత తమ కూతుళ్లు ఉద్యోగాలు చెయ్యాలని తల్లులు కోరుకుంటారు.
  8. కాబట్టి చదువుకు ప్రాధాన్యతను ఇవ్వటం సహజ విషయంగానూ, సామాజిక నియమంగానూ మారిపోయింది.
  9. సామాజిక జీవితంలోనూ, గ్రామ రాజకీయాలలోనూ హిమాచల్ ప్రదేశ్ మహిళల పాత్ర ఇతర రాష్ట్రాలలో కంటే ఎక్కువే.
  10. పలు గ్రామాలలో చురుకుగా పనిచేస్తున్న మహిళా మండలులు కనపడతాయి.