AP Inter 1st Year Chemistry Study Material Chapter 12 పర్యావరణ రసాయన శాస్త్రం

Andhra Pradesh BIEAP AP Inter 1st Year Chemistry Study Material 12th Lesson పర్యావరణ రసాయన శాస్త్రం Textbook Questions and Answers.

AP Inter 1st Year Chemistry Study Material 12th Lesson పర్యావరణ రసాయన శాస్త్రం

అతిస్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
వాతావరణం, జీవావరణం పదాలను వర్ణించండి.
జవాబు:
వాతావరణం :
భూమి చుట్టూ ఉన్న వాయువుల యొక్క పొరను వాతావరణం అందురు.

  • ఇది ఉష్ణ సమతుల్యతను కాపాడును.
  • వాతావరణంలో అధిక మొత్తంలో N2 మరియు 0లు ఉన్నాయి.

జీవావరణం :
జీవరాశులు అన్నీ అంటే, మొక్కలు, జంతువులు, మానవులను ఉమ్మడిగా జీవావరణం అంటాం.

జీవావరణం మిగతా పర్యావరణం విభాగాలతో సంబంధం కలిగియుండును.

ప్రశ్న 2.
శిలావరణం, జలావరణం పదాలను వివరించండి.
జవాబు:
శిలావరణం :
ఖనిజాలు, మట్టితో నిండి ఉన్న ఘనస్థితి భూమి బాహ్యపొరను శిలావరణం అంటాం.

ఈ ఆవరణను సాధారణంగా మట్టి (లేదా) భూమి అంటాం.

జలావరణం :
మహాసముద్రాలు, సముద్రాలు, నదులు, జలాశయాలు, నీటి కాలువలు, మంచు శిఖరాలు, భూగర్భ జలాలు మొదలగువాటిని కలిపి జలావరణం అంటాం.

ఈ ఆవరణను సాధారణంగా నీరు అంటాం.

ప్రశ్న 3.
భూకాలుష్యం నిర్వచించండి.
జవాబు:
పారిశ్రామిక వ్యర్ధాలు, వ్యవసాయపరమైన కలుషితకారిణిలు, రసాయన మరియు రేడియోధార్మిక కలుషితాల వలన భూకాలుష్యం జరుగును.

ప్రశ్న 4.
రసాయన ఆక్సిజన్ అవసరం (COD) అంటే ఏమిటి? [Mar. ’14]
జవాబు:
నీటిలో ఉన్న సేంద్రియ పదార్థాలను ఆక్సీకరణం చెందించడానికి కావలసిన ఆక్సిజన్ పరిమాణాన్ని “రసాయన ఆక్సిజన్ అవసరం (COD) అంటారు.

ప్రశ్న 5.
జీవరసాయన ఆక్సిజన్ అవసరం (BOD) అంటే ఏమిటి? [Mar. ’14]
జవాబు:
20°C వద్ద 5 రోజులలో నీటిలోని సూక్ష్మజీవులు వినియోగించుకునే ఆక్సిజన్ పరిమాణాన్ని “జీవరసాయన ఆక్సిజన్ అవసరం” (BOD) అంటారు.

AP Inter 1st Year Chemistry Study Material Chapter 12 పర్యావరణ రసాయన శాస్త్రం

ప్రశ్న 6.
ట్రోపోవరణం, స్ట్రాటోవరణం అంటే ఏమిటి?
జవాబు:
ట్రోపోవరణం :
వాతావరణంలో వాయువులను ఎక్కువగా కలిగి ఉండే పెద్ద భాగాన్ని ట్రోపోవరణం అంటారు.

భూమి నుండి 11 కి.మీ.ల వరకు ఇది వ్యాపించబడినది.

స్ట్రాటోవరణం :
భూమి నుండి 11 కి.మీ.
50 కి.మీ. మధ్యలో వ్యాపించబడిన ఆవరణంను స్ట్రాటోవరణం అంటారు.

  • ఇది ముఖ్యంగా ఓజోన్ ను కలిగి యుండును.
  • ఇది సూర్యుని నుండి వెలువడే హానికర అతినీలలోహిత కిరణాలను శోషించుకొని భూమిని చేరకుండా కాపాడుతుంది.

ప్రశ్న 7.
ట్రోపోవరణంలో ఉండే ప్రధాన కణస్థితి కాలుష్యాలను పేర్కొనండి.
జవాబు:
ట్రోపోవరణంలోని కణస్థితి కాలుష్యాలు దుమ్ము, పలచని పొగమంచు, ధూమాలు, పొగ, స్మాగ్ మొదలైనవి,

ప్రశ్న 8.
కాలుష్య గాలిలో ఉండే నాలుగు వాయుస్థితి కాలుష్యాలను పేర్కొనండి.
జవాబు:
సల్ఫర్, నైట్రోజన్, కార్బన్ల ఆక్సెడ్లు, H2S, హైడ్రోకార్బన్లు, ఓజోన్ మొదలగునవి కాలుష్య గాలిలో ఉండే వాయుస్థితి కాలుష్యాలు.

ప్రశ్న 9.
గ్రీన్ హౌస్ ఫలితం ……… వాయువుల ద్వారా కలుగుతుంది. [Mar. ’14]
జవాబు:
గ్రీన్ హౌస్ ఫలితం CO2, CH4, 03, CFC లు, నీటి ఆవిరి మొదలగు వాటి వలన కలుగుతుంది.

ప్రశ్న 10.
ఏ ఆక్సైడ్లు ఆమ్ల వర్షానికి కారణంగా ఉన్నాయి. దీని pH విలువ ఎంత? [Mar. ’13]
జవాబు:

  • నైట్రోజన్, సల్ఫర్ మరియు కార్బన్ల ఆక్సైడ్లు వర్షపు నీటిలో కలిసినపుడు ఆమ్ల వర్షం ఏర్పడును.
  • ఆమ్ల వర్షం pH విలువ 5.6 కన్నా తక్కువగా ఉండును.

AP Inter 1st Year Chemistry Study Material Chapter 12 పర్యావరణ రసాయన శాస్త్రం

ప్రశ్న 11.
ఆమ్ల వర్షం కలిగించే రెండు చెడు ప్రభావాలను తెలపండి. [T.S. Mar. ’15]
జవాబు:

  • భవనాల, కట్టడాల జీవిత కాలం దెబ్బతింటుంది. అతి సుందరమైన భవనాల సౌందర్యం తగ్గిపోతుంది.
  • నేలలోని ‘pH’ మారి భూసారం తగ్గిపోతుంది. పంటలు బాగా పండవు.
  • మత్స్య సంపద నశించిపోతుంది.
  • శ్వాసకోశ సంబంధ వ్యాధులను కలుగచేస్తాయి.
  • అమ్మోనియా లవణాలు వాతావరణ ధూళిగా ఏరోసాల్ కణాలుగా ఉంటాయి.

ప్రశ్న 12.
పొగ, పలుచని పొగ అంటే ఏమిటి?
జవాబు:
పొగ :
కర్బన పదార్థాలను దహనం చెందించినపుడు ఏర్పడే ఘనపదార్థ కణాలు లేదా ఘన మరియు ద్రవ పదార్థ మిశ్రమ కణాలను పొగ అంటారు..
ఉదా : నూనె పొగ, సిగరెట్ పొగ మొ||నవి.

పలుచని పొగ :
గాలిలోని భాష్పాలు సంఘననం చెందుట వలన లేదా పిచికారీ ద్రవాల కణాల ద్వారా ఏర్పడు కణాలను పలుచని పొగ అంటారు.
ఉదా : H2SO4 – పలుచని పొగ, కలుపు మొక్కల నాశకాలు, క్రిమి సంహారణులు.

ప్రశ్న 13.
సాంప్రదాయక స్మాగ్ అంటే ఏమిటి ? దాని రసాయన స్వభావం ఏమిటి? (ఆక్సీకరణ/క్షయీకరణ)
జవాబు:

  • పొగ, మంచు మరియు 50 ల మిశ్రమాన్ని సాంప్రదాయక స్మాగ్ అంటారు. ఇది చల్లటి తేమ వాతావరణంలో ఉంటుంది.
  • ఇది క్షయకరణ స్వభావం కలిగి ఉంటుంది. అందువలన దీనినే క్షయకరణ స్మాగ్ అంటారు.

ప్రశ్న 14.
కాంతి రసాయన స్మాగ్లోని సాధారణ అనుఘటకాలను తెలపండి.
జవాబు:
కాంతి రసాయన స్మాగ్లోని సాధారణ అనుఘటకాలు O3, NO, ఎక్రోలిన్, HCHO మరియు పెరాక్సీ ఎసిటైల్ నైట్రేట్ (PAN).

ప్రశ్న 15.
PAN అంటే ఏమిటి? దీని ప్రభావం ఏమిటి?
జవాబు:

  • పెరాక్సీ ఎసిటైల్ నైట్రేట్ను PAN అంటారు.
  • PAN శక్తివంతమైన కంటి ప్రకోపాలు కలిగించును.

ప్రశ్న 16.
స్ట్రాటోవరణంలో ఓజోను ఎలా ఏర్పడుతుంది?
జవాబు:
UV కిరణాలు డైఆక్సిజన్ అణువులతో చర్యనొంది స్వేచ్ఛా ఆక్సిజన్ పరమాణువులుగా మారును. ఈ స్వేచ్ఛా ఆక్సిజన్ పరమాణువుల నుండి ఓజోన్ అణువులు ఏర్పడును.
AP Inter 1st Year Chemistry Study Material Chapter 12 పర్యావరణ రసాయన శాస్త్రం 1

ప్రశ్న 17.
CF2Cl2 ద్వారా ఓజోను తరుగుదల ప్రాప్తించే చర్యలో ఇమిడి ఉండే అంతర్గత రసాయన సమీకరణాలు తెలపండి.
జవాబు:
వాతావరణంలోని సాధారణ వాయువులతో CF2Cl2 సంయోగం చెంది స్ట్రాటోవరణంను చేరును.

స్ట్రాటోవరణంలో CF2Cl2, UV-కిరణాలతో చర్య జరిపి క్లోరిన్ – స్వేచ్ఛా ప్రాతిపదికలను ఏర్పరుచును.
AP Inter 1st Year Chemistry Study Material Chapter 12 పర్యావరణ రసాయన శాస్త్రం 2

ప్రశ్న 18.
ఓజోను రంధ్రం అంటే ఏమిటి? దీనిని తొలిసారిగా ఎక్కడ గమనించారు?
జవాబు:
ఓజోన్ పొరలో క్షీణతను సాధారణంగా ఓజోన్ రంధ్రం అంటారు.

  • ఇది అంటార్కిటికాలోని దక్షిణ ధృవం వద్ద మొదట కనుగొనబడినది.
  • ఇది అంటార్కిటికాలోని వాతావరణ శాస్త్రవేత్తల ద్వారా కనుగొనబడినది.

AP Inter 1st Year Chemistry Study Material Chapter 12 పర్యావరణ రసాయన శాస్త్రం

ప్రశ్న 19.
చల్లని శుద్ద నీటిలో కరిగి ఉండే ఆక్సిజన్ పరిమాణం తెలపండి.
జవాబు:
చల్లటి శుద్ధ నీటిలో కరిగి ఉండే ఆక్సిజన్ పరిమాణం సుమారుగా 10 ppm.

ప్రశ్న 20.
శుద్ధ నీరు, కలుషిత నీరు, వీటి BOD విలువలను తెలపండి.
జవాబు:

  • శుద్ధ నీటికి BOD విలువ 3 ppm.
  • BOD విలువ నీటికి 4 ppm కన్నా ఎక్కువ ఉంటే ఆ నీటిని కలుషిత నీరుగా చెబుతారు.
  • అధిక కలుషితమైన నీటికి BOD విలువ 17 ppm కన్నా ఎక్కువ ఉంటుంది.

ప్రశ్న 21.
నీటిని కాలుష్యానికి గురిచేసే మూడు పారిశ్రామిక రసాయన పదార్థాలను తెలపండి.
జవాబు:
డిటర్జంట్లు, పెయింట్లు, కలుపు నివారుణులు, అద్దకాలు మరియు మందులు మొ||నవి.

ప్రశ్న 22.
నీటి కాలుష్యానికి కారణమైన వ్యవసాయరంగ రసాయన పదార్థాలను తెలపండి.
జవాబు:
వ్యవసాయరంగ రసాయనాలైన రసాయన ఎరువులు, క్రిమిసంహారిణులు, కలుపు మొక్క నివారణులు మొదలగునవి నీటి కాలుష్యానికి కారణాలు.

స్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
భూవాతావరణంలోని భిన్న భాగాలను తెలపండి.
జవాబు:
వాతావరణాన్ని నాలుగు భాగాలుగా విభజించవచ్చు.
1) ట్రోపోవరణం :
ఇది వాతావరణంలో ప్రధానమైన విభాగం. దీనిలోనే గాలి ఉంది.

2) స్ట్రాటోవరణం :
ఈ విభాగంలో ప్రధానంగా ఓజోన్ పొర ఉంటుంది. సూర్యుని నుండి వచ్చే UV కాంతిని ఇది శోషించుకుంటుంది. ఫలితంగా ప్రమాదకరమైన UV కాంతి భూమిపై పడకుండా చూస్తుంది.

3) మిసోవరణం :
ఎత్తు పెరిగినకొద్దీ ఉష్ణోగ్రత తగ్గుతుంది. ఈ ఆవరణం ద్వారా ధ్వని తరంగాలు ప్రయాణం చేయలేవు.

4) థెర్మోవరణం :
ఈ ప్రాంతంలో ఎత్తుకు పోయేకొద్ది ఉష్ణోగ్రత పెరుగుతూపోయి 1473K గరిష్ఠ విలువను చేరుకుంటుంది. సౌర కిరణాలను శోషించుకుని ఆక్సిజన్ వంటి వాతావరణ వాయువులు అయనీకరణం చెందుతాయి.

ప్రశ్న 2.
సింక్, COD, BOD, TLV పదాలను వివరించండి.
జవాబు:
సింక్ (శోషక నెలవు) : కాలుష్యకారిణిని చాలాకాలం నిల్వ చేసుకుని దానితో చర్య జరిపి, తాను కూడా నాశనం అయ్యే యానకాన్ని “సింక్” అంటారు.
ఉదా : పాలరాయిగోడ ‘గాలియందలి H2SO4 కు శోషక నెలవు.
సముద్రంలో ఉండే జంతుజాలాలు, CO2 కు సింక్గా ఉంటాయి.

COD :
నీటిలో ఉన్న సేంద్రియ పదార్థాలను ఆక్సీకరణం చెందించడానికి కావలసిన ఆక్సిజన్ పరిమాణాన్ని “రసాయన ఆక్సిజన్ అవసరం (COD) అంటారు.

BOD :
20°C వద్ద 5 రోజులలో నీటిలోని సూక్ష్మజీవులు వినియోగించుకునే ఆక్సిజన్ పరిమాణాన్ని “జీవరసాయన ఆక్సిజన్ అవసరం” (BOD) అంటారు

TLV :
ఒక రోజులో ఒక వ్యక్తి 7-8 గంటల కాలం గాలిలోని విష పదార్థాలకు (లేదా) కాలుష్యాలకు గురి అయినప్పుడు వ్యక్తి ఆరోగ్యాన్ని భంగపరచడానికి అవసరమయ్యే పదార్థాల కనీస స్థాయిని ఆరంభ అవధి విలువ (TLV) అంటారు.

ప్రశ్న 3.
గాలిలో చోటు చేసుకొని ఉన్న వాయుస్థితి కాలుష్యాలను తెలిపి, అవి ఎలా ఏర్పడతాయి అనే దానిని తెలపండి.
జవాబు:
కొన్ని పదార్థాలు (లేదా) సమ్మేళనాలు గాలితో కలిసిపోయి మానవులు, జంతువులు, మొక్కలు మరియు భూవాతావరణంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతాయి. ఆ సమ్మేళనాలను గాలి (లేదా) వాయు కాలుష్యాలు అంటారు.

వాయు కాలుష్యాలకు ఉదాహరణలు :
కార్బన్ మోనాక్సైడ్ (CO) :
అడవులు మండుట, సహజ వాయువు వెలువడుట, మార్ష్ గ్యాస్ ఉత్పన్నమగుట, అగ్నిపర్వత పేలుళ్ళు, రవాణా సాధనాలు, పారిశ్రామిక రంగం అభివృద్ధి మొదలగు వాటి వలన వాతావరణంలోకి ‘CO’ చేరుతుంది.

దుష్ఫలితాలు :
1) లోనికి పీల్చుకొనబడిన ‘CO’ ఊపిరితిత్తుల ద్వారా రక్తప్రవాహంలోనికి ప్రవేశించును. అది ఎర్ర రక్తకణాల నందలి హిమోగ్లోబిన్ చర్య జరిపి కార్బాక్సి హిమోగ్లోబిన్ అను ఒక స్థిరమైన సంక్లిష్టాన్ని ఏర్పరచును. దీనివలన శరీర భాగాలందలి వివిధ రకాల కణాలకు తగినంత ఆక్సిజన్ సరఫరా అవదు. రక్తంనందలి కార్బాక్సీ హిమోగ్లోబిన్ పరిమాణం 5% కన్నా పెరిగితే గుండె మరియు శ్వాస ప్రక్రియలు తీవ్రంగా ప్రభావితం చెందుతాయి.

నైట్రోజన్ ఆక్సైడ్లు :
వాతావరణం నందలి గాలిలో మెరుపులు మెరిసినపుడు, బాక్టీరియా చర్యల వలన వాతావరణంలోకి నైట్రోజన్ ఆక్సైడ్లు చేరతాయి.

దుష్ఫలితాలు :

  • వాతావరణంలో NO2 గాఢత అధికంగా ఉండటం వలన ఆకులపై మచ్చలేర్పడతాయి. కిరణజన్య సంయోగక్రియ వేగం తగ్గిపోతుంది. క్లోరోసిస్ అను వ్యాధి కలుగును.
  • ‘NO2‘ మానవుల ఆరోగ్యంపై ప్రభావాన్ని కలుగజేయును. మ్యూకస్ పొరపై ప్రభావం చూపుట వలన శ్వాస సంబంధమైన ఇబ్బందులు కలుగజేయును.

సల్ఫర్ ఆక్సైడ్లు :
అగ్ని పర్వతాల పేలుళ్ళ వలన, H2SO4 ను తయారుచేయు కర్మాగారాల వలన, ఎరువుల కర్మాగారాల వలన, ప్రగలనం ద్వారా లోహ సంగ్రహణం వంటి కార్యకలాపాలలో వాతావరణంలోకి సల్ఫర్ ఆక్సైడ్లు విడుదలగును.

  • వీటి వలన శ్వాసకోస వ్యాధులు ఏర్పడతాయి. ఆస్త్మా వంటివి.
  • కంటి ప్రకోపనలు కలిగిస్తాయి.

హైడ్రోకార్బన్లు :
ఇవి ఆటోమొబైల్ ఇంధనాలు అసంపూర్ణంగా దహనం చెందుట వలన ఏర్పడతాయి.

  • వీటి వలన క్యాన్సర్ వ్యాధి వస్తుంది.
  • ఇవి మొక్కలకు హాని కలిగిస్తాయి.

AP Inter 1st Year Chemistry Study Material Chapter 12 పర్యావరణ రసాయన శాస్త్రం

ప్రశ్న 4.
గ్రీన్ హౌస్ ఫలితం అంటే ఏమిటి? ఇది ఎలా కలుగుతుంది?
జవాబు:
వాతావరణంలోని CO2, నీటి ఆవిరులు పరారుణ కాంతిని శోషించుకొని మరల తిరిగి భూమిపైకి ఉద్గారం చేసే దృగ్విషయాన్ని భూమి వేడెక్కడం (లేక) హరితగృహ ప్రభావం (లేక) భౌగోళిక తాపనం అని అంటారు.

వాతావరణం నందలి గాలిలో గల CO2, నీటి ఆవిరి సూర్యరశ్మి నందలి తక్కువ తరంగదైర్ఘ్యం గల కాంతిని శోషించుకొని భూమిని వేడిగావుంచుతాయి. భూగోళం వేడెక్కుటకు కారణమైన వాయువులను హరిత మందిర వాయువులంటారు.
ఉదా : CH4, CO2, O3 మొదలగునవి.

హరిత గృహ ప్రభావం వలన ఈ క్రింది దుష్ప్రభావాలు జరుగుతాయి

  • ధృవ ప్రాంతాలలోని మంచు కరిగి, సముద్రమట్టం పెరిగి చాలా దేశాలు మునిగిపోతాయి.
  • గ్లేసియర్లు, ధృవాల వద్ద గల మంచుటోపీలు పాక్షికంగా కరుగుట వలన వరదలు సంభవించవచ్చు.
  • అకాలవర్షాలు, తుఫానులు, పెనుతుఫానులు ఏర్పడటం జరుగుతాయి.
  • పంటనీరు బాగా ఇగిరిపోవడం వల్ల సాగునీరు పంటలకు సరిగా అందదు.

ప్రశ్న 5.
ఆమ్ల వర్షం ఏర్పడే విధానాన్ని తెలుపుతూ దానిలోని అంతర్గత రసాయన సమీకరణాలను వివరించండి.
జవాబు:
నైట్రోజన్ మరియు సల్ఫర్ ఆక్సైడ్లు వాతావరణంలో అనేక రసాయన చర్యలకు లోనయి HNO3, H3SO4 లను ఏర్పరుస్తాయి. ఈ ఆమ్లాలు నీటిలో కరిగి ఆమ్ల వర్షాలుగా భూమిని చేరతాయి.

రసాయన సమీకరణాలు :
NO2 + NO3 → N2O5
N2O5 + H2O → 2HNO3
CO2 + H2O → H2CO3
SO2 + H2O → H2SO4
ఆమ్ల వర్ష pH విలువ 5.6 కన్నా తక్కువ.

ప్రశ్న 6.
ఆమ్ల వర్షం ద్వారా కలిగే చెడు ప్రభావాలను వివరించండి.
జవాబు:
ఆమ్ల వర్షాలవల్ల దుష్ఫలితాలు :

  1. భవనాల, కట్టడాల జీవిత కాలం దెబ్బతింటుంది. అతి సుందరమైన భవనాల సౌందర్యం తగ్గిపోతుంది.
  2. నేలలోని ‘pH’ మారి భూసారం తగ్గిపోతుంది. పంటలు బాగా పండవు.
  3. మత్స్య సంపద నశించిపోతుంది.
  4. శ్వాసకోశ సంబంధ వ్యాధులను కలుగచేస్తాయి.
  5. అమ్మోనియా లవణాలు వాతావరణ ధూళిగా ఏరోసాల్ కణాలుగా ఉంటాయి.

ప్రశ్న 7.
కాంతి రసాయన స్మాగ్ ఎలా ఏర్పడుతుంది ? ఇది కలగజేసే చెడు ప్రభావాలు ఏమిటి ?
జవాబు:

  • వాహనాలనుండి విడుదలయిన అసంతృప్త హైడ్రోకార్బన్లు, నైట్రోజన్ ఆక్సైడ్లు సూర్యకాంతి సమక్షంలో చర్య జరిపి కాంతి రసాయన స్మాగ్ను ఏర్పరచును.
  • ఇది పొడి, వేడి వాతావరణంలో ఏర్పడును.
  • దీనిలో అధిక గాఢతగల ఆక్సీకారిణులు కలవు.

ఏర్పడుట :

  • ఇంధన దహనం వలన ట్రోపోవరణం లోనికి కలుషిత కారిణులు విడుదలగును.”
  • ఈ కలుషితాలలో హైడ్రోకార్బన్లు, నైట్రోజన్ ఆక్సైడ్లు ముఖ్యమైనవి.
  • ఈ కలుషితాలు సూర్యకాంతితో చర్య జరిపి క్రింది చర్యలు జరుగును.
    2 NO(వా) + O2(వా) → 2NO2(వా)
    NO2(వా) → NO(వా) + O(వా)
    O(వా) + O2(వా) → O3(వా)
    NO(వా) + O3(వా) → NO2(వా) + O2(వా)
  • O3 విషపూరితమైనది మరియు NO2, O3 లు బలమైన ఆక్సీకారిణులు.
  • ఇవి హైడ్రోకార్బన్లతో చర్య జరిపి HCHO, PAN వంటివి ఏర్పరుస్తాయి.
  • కాంతి రసాయన స్మాగ్లోని అనుఘటకాలు NO, O3, ఎక్రోలీన్, HCHO, PAN.

ప్రశ్న 8.
వాతావరణంలో ఓజోన్ పొర తరుగుదల ఎలా ఏర్పడుతుంది? ఈ ఓజోన్ పొర తరుగుదల ద్వారా ప్రాప్తించే హానికరమైన ప్రభావాలను పేర్కొనండి. [A.P. Mar. ’15]
జవాబు:
వాతావరణంలోని సాధారణ వాయువులతో CF2Cl2 సంయోగం చెంది స్ట్రాటోవరణంను చేరును.

స్ట్రాటోవరణంలో CF2Cl2 UV-కిరణాలతో చర్య జరిపి క్లోరిన్ – స్వేచ్ఛా ప్రాతిపదికలను ఏర్పరుచును.
AP Inter 1st Year Chemistry Study Material Chapter 12 పర్యావరణ రసాయన శాస్త్రం 3

ఓజోన్ పొర రంధ్రాల వల్ల ఫలితాలు :
ఓజోన్ వియోగం (రంధ్రాలు) చెందడం వల్ల ఎక్కువ U.V కిరణాలు ట్రాపోస్ఫియర్ను చేరి క్రింది ఫలితాలు తెస్తాయి.

1) చర్మం ముడతలు పడటం 2) శుక్లాలు 3) చర్మంపై పుళ్ళు 4) చర్మ క్యాన్సర్ 5) చేపల ఉత్పత్తికి ప్రమాదం 6) ఫైటో ప్లాంక్టన్లను చంపడం 7) మొక్కల ప్రోటీన్లపై పనిచేసి ఉత్పరివర్తన పరిణామాలకు నష్టం 8) మొక్కల స్టోమాటాల ద్వారా ఆవిరి చెందించడం 9) భూమిలో తేమశాతం తగ్గించడం 10) పెయింట్లు, వస్త్రాలకు నష్టం చేసి అవి వెలిసిపోయేటట్లు చేయడం 11) కిరణజన్య సంయోగక్రియపై ప్రభావం.

AP Inter 1st Year Chemistry Study Material Chapter 12 పర్యావరణ రసాయన శాస్త్రం

ప్రశ్న 9.
నీటి కాలుష్యానికి కారణమైన పారిశ్రామిక వ్యర్థాలను పేర్కొనండి. త్రాగేనీటి అంతర్జాతీయ ప్రమాణాలను పేర్కొనండి.
జవాబు:
పారిశ్రామిక వ్యర్థాలు రెండు రకాలు.
1. పద్ధతి వ్యర్థాలు :
ఇవి కర్బన, అకర్బన రెండు రసాయన చర్యా పద్ధతుల్లో వస్తాయి. అకర్బన పద్ధతి వ్యర్థాలు రసాయన పరిశ్రమలు, ఎలక్ట్రోప్లేటింగ్ పరిశ్రమలు, లోహ నిష్కర్షణ, పెట్రోలియమ్ పరిశ్రమలు మొదలైన వాటి నుంచి అవి విడుదల చేసిన వ్యర్థాల్లో వస్తాయి. ఇవి విషతుల్యమైనవే కానీ, జీవ ప్రక్రియలకు అడ్డురావు. అదే కర్బన రసాయన వ్యర్థ పదార్ధాలయితే ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలు, పాల ఉత్పత్తుల పరిశ్రమలు, సారాబట్టీలు, స్వేదన యంత్రాలు, కాగితపు పరిశ్రమ, బట్టల మిల్లులు, కర్బన రసాయనాల తయారీ పరిశ్రమలు మొదలైనవాటి నుంచి వస్తాయి. కర్బన ప్రక్రియ వ్యర్థాల్ని తొలగించడం చాలా కష్టం.

2. రసాయన వ్యర్థాలు :
ఆమ్లాలు, క్షారాలు, డిటర్జెంట్లు, పేలుడు పదార్థాలు, రంజనాలు, క్రిమి సంహారకాలు, ఫంగస్ సంహారకాలు, ఎరువులు, సిలికోన్లు, ప్లాస్టిక్ లు, రెజిన్లు ఇతర పద్ధతుల కోసం వాడే అనేక ఇతర రసాయనాలతో అనేక రసాయన వ్యర్థాలు వుంటాయి. సెడిమెంటేషన్, ఫ్లక్యులేషన్, కడగడం, వడపోత, ఇగర్చడం, స్వేదనం, విద్యుద్విశ్లేషణం, అధిశోషణం, స్ఫటికీకరణం, స్క్రీనింగ్, దహనం, సెంట్రిఫ్యూజింగ్ మొదలైన విధానాల్లో రసాయన వ్యర్ధాలు వస్తాయి. ఇవి సాధారణంగా ఆమ్ల స్వభావం, క్షార స్వభావం లేదా విష స్వభావం ఉన్న పదార్థాలు, అధిక BOD గలవి. రంగులు కలిగి తేలికగా మండిపోతాయి.

సిలికోన్లు, పొగరాని పొడులు, క్రిమి సంహారకాలు, TNT తయారీ మొదలైన పరిశ్రమల్లో వచ్చే వ్యర్థాలు సాధారణంగా ఆమ్ల లక్షణంతో ఉంటాయి.

ప్రశ్న 10.
పర్యావరణ కాలుష్యాన్ని నివారించడానికి అవలంభించే హరిత రసాయనశాస్త్రంలోని ప్రణాళికలను సవివరంగా తెలపండి.
జవాబు:
హరిత రసాయన శాస్త్రము :
రసాయన శాస్త్రం, ఇతర శాస్త్ర విభాగాలను ఉపయోగించి వాటి అవగాహన, సూత్రాలతో సాధ్యమైనంతవరకు పర్యావరణంలో కాలుష్యం రాకుండా చూడటం గురించి చెప్పేదే హరిత రసాయన శాస్త్రం.

హరిత రసాయనశాస్త్రంలో ముఖ్యమైనది గ్రీన్ హౌస్ వాయువులైన CH4, CO2 వంటివి ఏర్పడకుండా చూసి గ్రీన్ హౌస్ ప్రభావం లేకుండా ఉంచడం నేలను అతిగా ఉపయోగిస్తూ దాని కోసం వాడుతున్న రసాయన ఎరువులు, క్రిమి సంహారక మందులు నేలను, నీటిని చివరకు గాలిని కూడా కలుషితం చేస్తున్నాయి. అయితే భూమి సాగు, వ్యవసాయం ఎట్టి పరిస్థితుల్లోనూ ఆపడానికి వీలుకానివి. అలాంటప్పుడు దీని వల్ల సంభవించే పర్యావరణ కాలుష్యాన్ని నివారించడానికి పద్ధతులను పెంపొందించాలి. సాధారణ రసాయన చర్యల్లో ఉప ఉత్పత్తులేర్పడతాయి. చాలా చర్యలలో ఈ ఉప ఉత్పత్తులే కాలుష్య కారకాలు అవుతాయి. హరిత రసాయన శాస్త్రం ముఖ్యంగా వ్యర్థ ఉప – ఉత్పత్తులు ఉత్పన్నం కాకుండా చూసేందుకు పనిచేస్తుంది.

మామూలుగా వాడుతున్న ఇంధనాలు, శక్తి వ్యవస్థలకు బదులుగా సంప్రదాయేతర ఇంధనాలు, శక్తి వ్యవస్థలను ఉపయోగించేందుకు హరిత రసాయన శాస్త్రం సాయం చేస్తుంది. దీనితో కాలుష్యాన్ని నివారించవచ్చు.

ఒక చర్యలో సాధ్యమైనంతవరకు 100% ఉత్పన్నాలు ఏర్పరిచే క్రియాజనకాలను తీసుకోవాలి. దీని కోసం కొన్ని కనీస పరిస్థితులను చర్యలో ఉపయోగించాలి. ఉదాహరణకు కర్బన ద్రావణుల కంటే చర్యను నీటిలో జరిపే వీలు కల్పిస్తే నీటిని ఎక్కువ విశిష్టోష్ణం, తక్కువగా బాష్పీభవనం చెందడం, మంటలంటుకోకపోవటం, క్యాన్సర్ కలిగించే గుణాలు లేకపోవడం వల్ల కాలుష్య ప్రభావముండదు. హరిత రసాయన శాస్త్రం తక్కువ ఖర్చుతో కూడినది. తక్కువ రసాయనాలు వాడటం, తక్కువ శక్తినుపయోగించడం, అతి తక్కువ కారకాలను ఉత్పత్తి చేయడం దీని ముఖ్య ఉద్దేశ్యం.
ఉదా : 1. రసాయనాల సంశ్లేషణం :
ప్రస్తుతం ఎసిటాల్డిహైడ్ న్ను (CH3 CHO) వ్యాపార సరళిలో ఒకే దశలో జల ద్రావణంలో అయానిక ఉత్ప్రేరకం వాడి ఇథిలీన్ ను ఆక్సీకరణం చేసి తయారుచేస్తున్నారు. ఇందులో ఉత్పాదన దిగుబడి 90% పైనే ఉంటుంది.
AP Inter 1st Year Chemistry Study Material Chapter 12 పర్యావరణ రసాయన శాస్త్రం 4

2. మొదట్లో ఘాటైన వాసన గల క్లోరిన్ వాయువును కాగితం పరిశ్రమలో కాగితానికి విరంజనకారిగా వాడేవారు. ప్రస్తుతం ఉత్ప్రేరకం సమక్షంలో హైడ్రోజన్ పెరాక్సైడ్ను విరంజనకారిగా వాడుతున్నారు. ఉత్ప్రేరకం హైడ్రోజన్ పెరాక్సైడ్ విరంజన ధర్మాన్ని పెంపొందిస్తుంది.

దీర్ఘ సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
పర్యావరణ కాలుష్యం అంటే ఏమిటి? ఈ కాలుష్యం ఎన్ని రకాలు?
జవాబు:
మోటారు వాహనాలు విడుదల చేసే పొగలో అనేక హైడ్రోకార్బన్ల మిశ్రమం ఉంటుంది. ఈ హైడ్రోకార్బన్లు అన్ని కీడును కలిగించే కాంతి రసాయన ఆక్సీకరణ జన్యు పదార్థాలుగా మారతాయి. ఈ జన్యు పదార్థాలు మొక్కల చిగుళ్ళకు హానిని కలుగచేస్తాయి. మొక్కలలోని సెల్యులోస్ న్ను కూడా పతనం అయ్యేట్లుగా చేస్తాయి. మరొక జన్యు పదార్ధమైన పెరాక్సీ బెంజయిల్ నైట్రేటు – కంట్లో దురద, నీరు కారడం జరుగుతుంది. ఇది పొగమంచును కలుగచేస్తుంది. దీని వలన కళ్ళు కనిపించడం తగ్గుతుంది.

పరిశ్రమల నుండి వెలువడే పొగలోని కార్బన్ కణాలు, లోహాల పరిశ్రమల నుండి లోహాలను నిష్కర్షణను చేసినపుడు లోహాలు కణరూపంలోను గాలిలో చేరుకుంటాయి. ఈ గాలిని పీల్చడం వలన శ్వాస సంబంధమైన వ్యాధులు ఏర్పడే అవకాశం ఉంటుంది. అదే విధంగా క్రిమి సంహారక మందులు తయారుచేసే కర్మాగారాల నుండి వెలువడే వ్యర్ధ వాయువుల ద్వారా, ఇవి వాతావరణంలోకి ప్రవేశించి మానవుల ఆరోగ్యానికి హాని కలుగచేస్తాయి.

ఈ విధంగా పెద్ద పెద్ద పరిశ్రమలు వాటి నుండి వెలువడే వ్యర్ధ పదార్థాలే కాకుండా, పరిశ్రమలలో జరిగే ప్రమాదాల వలన కూడా వాతావరణ కాలుష్యం ఏర్పడుతుంది.

వాతావరణంలో విడుదల చేయబడిన SO2, NO2, O3 వంటి కాలుష్యాలు పొగమంచు రూపంలో వెలువడి చాలా నష్టాన్ని కలుగచేస్తాయి. ఈ పొగమంచు వలన భారీ ఎత్తు మరణాలు కూడా సంభవిస్తాయి. ఈ పొగమంచు ప్రభావం తగ్గాలంటే వాహనాలలో దహనక్రియ సంపూర్ణంగా జరిగేటట్లు చూడాలి. నైట్రోజన్ ఆక్సైడ్ ఉత్పత్తిని తగ్గించాలి.

వాతావరణ కాలుష్యం ఈ క్రింది సంక్షోభాలను కలుగచేస్తుంది.

  1. ఆమ్ల వర్షాలు – నైట్రోజన్, సల్ఫర్ ఆక్సైడ్ వలన
  2. ఓజోను పొరలో చిల్లులు – స్ట్రాటోస్ఫియర్లో జరిగే కాంతి రసాయన చర్యల వల్ల.
  3. హరితగృహ ప్రభావం – భూమి వేడెక్కడం.

ఇంతేకాకుండా శిలాజ అవశేష ఇంధనాలు మండడం వల్ల వాతావరణంలో ఉన్న CO2 యొక్క పరిమాణంలో చాలా మార్పు వస్తుంది. దీనివలన కూడా వాతావరణం కాలుష్యం అవుతుంది.

కాలుష్యంలోని రకాలు :

  1. వాయు కాలుష్యం
  2. జల కాలుష్యం
  3. భూ కాలుష్యం
  4. తైల కాలుష్యం
  5. ధ్వని కాలుష్యం

ప్రశ్న 2.
కింది వాటిని వివరంగా తెలపండి.
(a) భూగోళం వేడెక్కడం (b) ఓజోన్ తరుగుదల (c) ఆమ్ల వర్షం (d) యూట్రోఫికేషన్
జవాబు:
a) వాతావరణంలోని CO2, నీటి ఆవిరులు పరారుణ కాంతిని శోషించుకొని మరల తిరిగి భూమిపైకి ఉద్గారం చేసే దృగ్విషయాన్ని భూమి వేడెక్కడం (లేక) హరితగృహ ప్రభావం (లేక) భౌగోళిక తాపనం అని అంటారు.

వాతావరణం నందలి గాలిలో గల CO2, నీటి ఆవిరి సూర్యరశ్మి నందలి తక్కువ తరంగదైర్ఘ్యం గల కాంతిని శోషించుకొని భూమిని వేడిగా వుంచుతాయి. భూగోళం వేడెక్కుటకు కారణమైన వాయువులను హరిత మందిర వాయువులంటారు.
ఉదా : CH4, CO2, O3 మొదలగునవి.

హరిత గృహ ప్రభావం వలన ఈ క్రింది దుష్ప్రభావాలు జరుగుతాయి

  1. ధృవ ప్రాంతాలలోని మంచు కరిగి, సముద్రమట్టం పెరిగి చాలా దేశాలు మునిగిపోతాయి.
  2. గ్లేసియర్లు, ధృవాల వద్ద గల మంచుటోపీలు పాక్షికంగా కరుగుట వలన వరదలు సంభవించవచ్చు.
  3. అకాలవర్షాలు, తుఫానులు, పెనుతుఫానులు ఏర్పడటం జరుగుతాయి.
  4. పంటనీరు బాగా ఇగిరిపోవడం వల్ల సాగునీరు పంటలకు సరిగా అందదు.

b) ఓజోన్ పొర రంధ్రాల వల్ల ఫలితాలు :
ఓజోన్ వియోగం (రంధ్రాలు) చెందడం వల్ల ఎక్కువ U.V కిరణాలు ట్రాపోస్ఫియర్ను చేరి క్రింది ఫలితాలు తెస్తాయి.

1) చర్మం ముడతలు పడటం 2) శుక్లాలు 3) చర్మంపై పుళ్ళు 4) చర్మ క్యాన్సర్ 5) చేపల ఉత్పత్తికి ప్రమాదం 6) ఫైటో ప్లాంక్టన్లను చంపడం 7) మొక్కల ప్రోటీన్లపై పనిచేసి ఉత్పరివర్తన పరిణామాలకు నష్టం 8) మొక్కల స్టోమాటాల ద్వారా నీటిని ఆవిరి చెందించడం 9) భూమిలో తేమశాతం తగ్గించడం 10) పెయింట్లు, వస్త్రాలకు నష్టం చేసి అవి వెలిసిపోయేటట్లు చేయడం 11) కిరణజన్య సంయోగక్రియపై ప్రభావం.

c) నైట్రోజన్ మరియు సల్ఫర్ ఆక్సైడ్లు వాతావరణంలో అనేక రసాయన చర్యలకు లోనయి HNO3, H2SO4 లను ఏర్పరుస్తాయి. ఈ ఆమ్లాలు నీటిలో కరిగి ఆమ్ల వర్షాలుగా భూమిని చేరతాయి.
NO2 + NO3 → N2O3
N2O5 + H2O → 2HNO3
CO2 + H2O → H2CO3
SO2 + H2O → H2SO4

దుష్ఫలితాలు :

  1. భవనాల, కట్టడాల జీవిత కాలం దెబ్బతింటుంది. అతి సుందరమైన భవనాల సౌందర్యం తగ్గిపోతుంది.
  2. నేలలోని ‘pH’ మారి భూసారం తగ్గిపోతుంది. పంటలు బాగా పండవు.
  3. మత్స్య సంపద నశించిపోతుంది.
  4. శ్వాసకోశ సంబంధ వ్యాధులను కలుగచేస్తాయి.
  5. అమ్మోనియా లవణాలు వాతావరణ ధూళిగా ఏరోసాల్ కణాలుగా ఉంటాయి.

d) నీటిలోనికి వదలబడిన వ్యర్థ ఫాస్ఫేట్లు సరస్సులలో పోషకములను పెంచుతాయి. సరస్సులోని పోషకాలు హెచ్చుటను ‘యుట్రోఫికరణం’ అందురు. ఇందువలన కర్బన అవశేషాలు పెరుగును.

AP Inter 1st Year Chemistry Study Material Chapter 12 పర్యావరణ రసాయన శాస్త్రం

ప్రశ్న 3.
హరిత రసాయనశాస్త్రం పర్యావరణ కాలుష్యాన్ని నివారిస్తుంది. వివరించండి.
జవాబు:
హరిత రసాయన శాస్త్రము :
రసాయన శాస్త్రం, ఇతర శాస్త్ర విభాగాలను ఉపయోగించి వాటి అవగాహన, సూత్రాలతో సాధ్యమైనంతవరకు పర్యావరణంలో కాలుష్యం రాకుండా చూడటం గురించి చెప్పేదే హరిత రసాయన శాస్త్రం.

హరిత రసాయనశాస్త్రంలో ముఖ్యమైనది గ్రీన్ హౌస్ వాయువులైన CH4, CO2 వంటివి ఏర్పడకుండా చూసి గ్రీన్ హౌస్ ప్రభావం లేకుండా ఉంచడం నేలను అతిగా ఉపయోగిస్తూ దాని కోసం వాడుతున్న రసాయన ఎరువులు, క్రిమి సంహారక మందులు నేలను, నీటిని చివరకు గాలిని కూడా కలుషితం చేస్తున్నాయి. అయితే భూమి సాగు, వ్యవసాయం ఎట్టి పరిస్థితుల్లోనూ ఆపడానికి వీలుకానివి. అలాంటప్పుడు దీని వల్ల సంభవించే పర్యావరణ కాలుష్యాన్ని నివారించడానికి పద్ధతులను పెంపొందించాలి. సాధారణ రసాయన చర్యల్లో ఉప ఉత్పత్తులేర్పడతాయి. చాలా చర్యలలో ఈ ఉప ఉత్పత్తులే కాలుష్య కారకాలు అవుతాయి. హరిత రసాయన శాస్త్రం ముఖ్యంగా వ్యర్థ ఉప – ఉత్పత్తులు ఉత్పన్నం కాకుండా చూసేందుకు పనిచేస్తుంది.

మామూలుగా వాడుతున్న ఇంధనాలు, శక్తి వ్యవస్థలకు బదులుగా సంప్రదాయేతర ఇంధనాలు, శక్తి వ్యవస్థలను ఉపయోగించేందుకు హరిత రసాయన శాస్త్రం సాయం చేస్తుంది. దీనితో కాలుష్యాన్ని నివారించవచ్చు.

ఒక చర్యలో సాధ్యమైనంతవరకు 100% ఉత్పన్నాలు ఏర్పరిచే క్రియాజనకాలను తీసుకోవాలి. దీని కోసం కొన్ని కనీస పరిస్థితులను చర్యలో ఉపయోగించాలి. ఉదాహరణకు కర్బన ద్రావణుల కంటే చర్యను నీటిలో జరిపే వీలు కల్పిస్తే నీటిని ఎక్కువ విశిష్టోష్టం, తక్కువగా బాష్పీభవనం చెందడం, మంటలంటుకోకపోవటం, క్యాన్సర్ కలిగించే గుణాలు లేకపోవడం వల్ల కాలుష్య ప్రభావముండదు. హరిత రసాయన శాస్త్రం తక్కువ ఖర్చుతో కూడినది. తక్కువ రసాయనాలు వాడటం, తక్కువ శక్తినుపయోగించడం, అతి తక్కువ కారకాలను ఉత్పత్తి చేయడం దీని ముఖ్య ఉద్దేశ్యం.
ఉదా : 1. రసాయనాల సంశ్లేషణం :
ప్రస్తుతం ఎసిటాల్డిహైడ్ న్ను (CH3 CHO) వ్యాపార సరళిలో ఒకే దశలో జల ద్రావణంలో అయానిక ఉత్ప్రేరకం వాడి ఇథిలీన్ ను ఆక్సీకరణం చేసి తయారుచేస్తున్నారు. ఇందులో ఉత్పాదన దిగుబడి 90% పైనే ఉంటుంది.
AP Inter 1st Year Chemistry Study Material Chapter 12 పర్యావరణ రసాయన శాస్త్రం 5

2. మొదట్లో ఘాటైన వాసన గల క్లోరిన్ వాయువును కాగితం పరిశ్రమలో కాగితానికి విరంజనకారిగా వాడేవారు. ప్రస్తుతం ఉత్ప్రేరకం సమక్షంలో హైడ్రోజన్ పెరాక్సైడ్ను విరంజనకారిగా వాడుతున్నారు. ఉత్ప్రేరకం హైడ్రోజన్ పెరాక్సైడ్ విరంజన ధర్మాన్ని పెంపొందిస్తుంది.

AP Inter 1st Year Chemistry Study Material Chapter 11 P బ్లాక్ మూలకాలు – 14వ గ్రూప్

Andhra Pradesh BIEAP AP Inter 1st Year Chemistry Study Material 11th Lesson P బ్లాక్ మూలకాలు – 14వ గ్రూప్ Textbook Questions and Answers.

AP Inter 1st Year Chemistry Study Material 11th Lesson P బ్లాక్ మూలకాలు – 14వ గ్రూప్

అతిస్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
గ్రూపు 14 మూలకాల ఆక్సీకరణ స్థితులలో మార్పును చర్చించండి.
జవాబు:

  • 14వ గ్రూపు మూలకాలు సాధారణంగా + 4 మరియు +2 ఆక్సీకరణ స్థితులు ప్రదర్శిస్తాయి.
  • గ్రూపులో క్రింది మూలకాలు +2 ఆక్సీకరణస్థితిని ప్రదర్శిస్తాయి.
  • +2 ఆక్సీకరణ స్థితి ప్రదర్శించే స్వభావం Ge < Sn < pb.
  • ‘pb’, ‘+2’ ఆక్సీకరణ స్థితి ప్రదర్శిస్తుంది. కారణం జడ ఎలక్ట్రాన్ జంట స్వభావం.

ప్రశ్న 2.
ఈ కింది సమ్మేళనాలు నీటితో ఎలా ప్రవర్తిస్తాయి?
a) BCl3 b) CCl4
జవాబు:
a) BC, నీటితో చర్యజరిపి బోరిక్ ఆమ్లంను ఏర్పరచును.
AP Inter 1st Year Chemistry Study Material Chapter 11 P బ్లాక్ మూలకాలు – 14వ గ్రూప్ 1

b) CCl4 అధృవ సమ్మేళనం మరియు ‘C’ నందు ఖాళీ d- ఆర్బిటాళ్లు లేవు. కావున CCl4 జలవిశేషణ జరుపదు. CCl4 లూయి ఆమ్లం కాదు.

ప్రశ్న 3.
BCl3, SiCl4 ఎలక్ట్రాన్ కొరత ఉన్న సమ్మేళనాలా? వివరించండి.
జవాబు:

  • BCl3 మరియు SiCl4 లు ఎలక్ట్రాన్ కొరత సమ్మేళనాలు.
  • ఇవి రెండు కూడా లూయి ఆమ్లాలుగా పనిచేస్తాయి.
  • ఇవి ఎలక్ట్రాన్ జంటలను స్వీకరిస్తాయి.
  • ఈ క్రింది చర్యలు ఈ సమ్మేళనాలు ఎలక్ట్రాన్ కొరత సమ్మేళనాలుగా ధృవపరుస్తాయి.
    AP Inter 1st Year Chemistry Study Material Chapter 11 P బ్లాక్ మూలకాలు – 14వ గ్రూప్ 2

ప్రశ్న 4.
ఈ కింది వాటిలో కార్బన్ సంకరకరణాన్ని సూచించండి. a) CO3-2 b) వజ్రం c) గ్రాఫైట్ d) ఫుల్లరీన్
జవాబు:
a) CO3-2 లో ‘C’ పరమాణువు సంకరీకరణం sp².
b) వజ్రంలో ‘C’ పరమాణువు సంకరీకరణం sp³.
c) గ్రాఫైట్ ‘C’ పరమాణువు సంకరీకరణం sp².
d) ఫుల్లరీన్ లో ‘C’ పరమాణువు సంకరీకరణం sp².

ప్రశ్న 5.
CO ఎందుకు విషపూరితమైంది?
జవాబు:
CO అత్యంత విషపూరితమైనది ఎందువలన అనగా రక్తంలోని హెమోగ్లోబిన్ స్థిరమైన సంక్లిష్ట సమ్మేళనం ఏర్పరచును.
AP Inter 1st Year Chemistry Study Material Chapter 11 P బ్లాక్ మూలకాలు – 14వ గ్రూప్ 3
ఇది ఆక్సీ హెమోగ్లోబిన్ కంటే స్థిరమైనది.

AP Inter 1st Year Chemistry Study Material Chapter 11 P బ్లాక్ మూలకాలు – 14వ గ్రూప్

ప్రశ్న 6.
రూపాంతరత (allotropy) అంటే ఏమిటి? స్ఫటిక రూపంలోని కార్బన్ భిన్న రూపాంతరాలను తెలపండి. [Mar. ’13]
జవాబు:
ఒకే మూలకం వివిధ భౌతిక రూపాలలో ఉండి ఒకేరకమైన రసాయన ధర్మాలు కలిగి ఉండుటను రూపాంతరత అంటారు.

కార్బన్ యొక్క స్ఫటిక రూపాంతరాలు వజ్రం, గ్రాఫైట్.

ప్రశ్న 7.
కింది ఆక్సైడులను తటస్థ, ఆమ్ల, క్షార, ద్విస్వభావం గల వాటిగా వర్గీకరించండి.
a) CO b) B2O3 c) SiO2 d) CO2 e) Al2O3 f) PbO2 g) Tl2O3
జవాబు:
a) CO – తటస్థ ఆక్సైడ్
b) B2O3 – ఆమ్ల ఆక్సైడ్
c) SiO2 – ఆమ్ల ఆక్సైడ్
d) Al2O3 – ద్విస్వభావ ఆక్సైడ్
e) CO2 – ఆమ్ల ఆక్సైడ్
f) PbO2 – ద్విస్వభావ ఆక్సైడ్
g) Tl2O3 – క్షార ఆక్సైడ్

ప్రశ్న 8.
మనిషి (కృత్రిమంగా) తయారుచేసిన ఏవైనా రెండు సిలికేట్ల పేర్లు రాయండి. [Mar. ’14]
జవాబు:
గాజు మరియు సిమెంట్లు మనిషిచే తయారుచేయబడిన సిలికేట్లు.

ప్రశ్న 9.
గ్రూపు 14 మూలకాల బాహ్య ఎలక్ట్రాన్ విన్యాసాన్ని రాయండి.
జవాబు:
AP Inter 1st Year Chemistry Study Material Chapter 11 P బ్లాక్ మూలకాలు – 14వ గ్రూప్ 4

ప్రశ్న 10.
గ్రాఫైట్ కందెనలాగా ఎట్లా పనిచేస్తుంది?
జవాబు:
గ్రాఫైట్కు పొరల నిర్మాణం ఉంటుంది. పీడనం కలుగచేసినపుడు ఈ పొరలు ఒక దానిపై ఒకటి జారుతాయి. అందువలన గ్రాఫైట్కు జారుడు స్వభావం ఉంటుంది. ఈ స్వభావం వలన గ్రాఫైట్ను కందెనగా వాడతారు.

ప్రశ్న 11.
గ్రాఫైట్ మంచి వాహకం వివరించండి.
జవాబు:
గ్రాఫైట్లో ప్రతి కార్బన్ sp² సంకరకరణాన్ని చెందుతుంది. ఒక్కొక్క కార్బన్ పరమాణువు మూడు కోవలెంట్ బంధాలను మూడు వేర్వేరు కార్బన్లతో, సంకర ఆర్బిటాల్లను ఉపయోగించుకొని నిర్మిస్తుంది. నాలుగో ఆర్బిటాల్ సంకర కణం చెందని ఒంటరి ఎలక్ట్రాన్ ఉన్న శుద్ధ P – ఆర్బిటాల్ ఈ ఎలక్ట్రాన్ π – బంధ నిర్మాణంలో పాల్గొంటుంది. ఆ విధంగా గ్రాఫైట్లో π- ఎలక్ట్రాన్లు సమీకరణం చెంది ఉంటాయి. ఈ π – ఎలక్ట్రాన్లుండటం వల్ల గ్రాఫైట్ మంచి విద్యుద్వాహకం.

ప్రశ్న 12.
సిలికా నిర్మాణాన్ని వివరించండి.
జవాబు:
AP Inter 1st Year Chemistry Study Material Chapter 11 P బ్లాక్ మూలకాలు – 14వ గ్రూప్ 5

  • సిలికా త్రిజామితీయ నిర్మాణం కలిగి ఉంటుంది బృహదణువు.
  • Si, O పరమాణువులు ఒకదాని తరువాత ఒకటి 8 పరమాణువులున్న వలయాలుగా ఏర్పడతాయి.
  • Si చుట్టూ ఆక్టిన్ పరమాణువులు చతుర్ముఖీయంగా ఏర్పడతాయి.
  • SiO2 లో Si పరమాణువు sp³ సంకరీకరణం చెందును.

ప్రశ్న 13.
“సంశ్లేషణ వాయువు” (synthesis gas) అంటే ఏమిటి?
జవాబు:

  • వాటర్ గ్యాస్ ను సంశ్లేషణ వాయువు అంటారు.
  • CO మరియు H2 మిశ్రమాన్ని వాటర్ గ్యాస్ అంటారు.
  • నీటి ఆవిరిని వేడి కోక్ ద్వారా పంపి వాటర్ గ్యాస్ను తయారు చేస్తారు.
  • ఇది మిథనోల్ మరియు అనేక హైడ్రో కార్బన్లను సంశ్లేషణ చేయుటకు ఉపయోగపడును. అందువలన దీనిని సంశ్లేషణ వాయువు అంటారు.

AP Inter 1st Year Chemistry Study Material Chapter 11 P బ్లాక్ మూలకాలు – 14వ గ్రూప్

ప్రశ్న 14.
“ప్రొడ్యూసర్ వాయువు” (producer gas) అంటే ఏమిటి?
జవాబు:

  • CO మరియు N2 ల మిశ్రమాన్ని ప్రొడ్యూసర్ వాయువు అంటారు.
  • దీనిని వేడి కోక్పై నీటి ఆవిరిని పంపి తయారుచేస్తారు.

ప్రశ్న 15.
వజ్రానికి అధిక ద్రవీభవన ఉష్ణోగ్రత ఉంటుంది – వివరించండి.
జవాబు:

  • వజ్రంనందు కార్బన్ sp³ సంకరీకరణం చెందును మరియు ప్రతి కార్బన్ పరమాణువు చుట్టూ నాలుగు కార్బన్ పరమాణువులు చతుర్ముఖీయంగా అమరి ఉంటాయి.
  • C – C బంధశక్తి చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది త్రిజామితీయ నిర్మాణం కలిగి ఉంటుంది.
  • ఈ కారణాల వలన వజ్రంనకు అధిక ద్రవీభవన ఉష్ణోగ్రత కలిగి ఉండును. వజ్రం ద్రవీభవన స్థానం 4200

ప్రశ్న 16.
కిరణజన్య సంయోగక్రియలో CO2 పాత్ర ఏమిటి? [Mar. ’14]
జవాబు:
పచ్చటి మొక్కలు వాతావరణంలోని CO2 ను కార్బోహైడ్రేట్లుగా మార్చుటను కిరణజన్య సంయోగక్రియ అంటారు.

కిరణజన్య సంయోగక్రియలో CO2, గ్లూకోజ్ వంటి కార్బోహైడ్రేట్లుగా మారును.
AP Inter 1st Year Chemistry Study Material Chapter 11 P బ్లాక్ మూలకాలు – 14వ గ్రూప్ 6

ప్రశ్న 17.
హరితగృహ ప్రభావాన్ని ఏ విధంగా CO2 పెంచుతుంది?
జవాబు:

  • పచ్చని మొక్కలు CO2 వాయువును శోషించుకొని O2 వాయువును విడుదల చేయును,
  • అడవులను నరికివేయుట వలన, సున్నపురాయి వియోగం వలన మరియు ఇంధనాలు మండించుట వలన CO2 గాఢత పెరుగును.
  • CO2 గాఢత పెరుగుట వలన O2 – CO2 సమతుల్యత వాతావరణంలో దెబ్బతింటుంది. దీనివలన హరిత గృహప్రభావం పెరుగును.

ప్రశ్న 18.
సిలికోన్లు అంటే ఏమిటి?
జవాబు:

  • R2 SiO – యూనిట్లు కలిగి ఉన్న కర్బన సిలికాన్ పాలీమర్లను సిలికోన్లు అంటారు.
  • ఇవి Si – O – Si బంధం కలిగిన సంశ్లేషణ పదార్థాలు.
  • ఇవి క్లోరోసిలేన్లను జలవిశ్లేషణ చేయుటవలన ఏర్పడును.

ప్రశ్న 19.
సిలికోన్ల ఉపయోగాలు రాయండి.
జవాబు:
సిలికోన్ల ఉపయోగాలు :

  • వీటిని సీల్ వేసే పదార్థాలుగా ఉపయోగపడతాయి.
  • వీటిని గ్రీజులుగా, విద్యుత్బంధకాలుగా ఉపయోగపడతాయి.
  • వీటిని బట్టలపై జలనిరోధకంగా ఉపయోగిస్తారు.
  • వీటిని శస్త్రచికిత్సల సంబంధమైన, సౌందర్య సాధన ద్రవ్యాల తయారీలో వాడతారు.

ప్రశ్న 20.
తగరం (టిన్) మీద నీటి ప్రభావం ఏమిటి?
జవాబు:
తగరం లోహం నీటి ఆవిరితో చర్య జరిపి టిన్ డైఆక్సైడ్ మరియు డైహైడ్రోజన్ వాయువును ఏర్పరచును.

ఈ చర్యలో నీటి ఆవిరి వియోగం చెందును.
AP Inter 1st Year Chemistry Study Material Chapter 11 P బ్లాక్ మూలకాలు – 14వ గ్రూప్ 7

ప్రశ్న 21.
SiCl4 గురించి రాయండి.
జవాబు:

  • SiCl4 ను టెట్రాక్లోరోసిలికో మీథేన్ అంటారు.
  • ‘Si’ లో 3d – ఆర్బిటాల్ ఉండుట వలన SiCl4 లూయీ ఆమ్లంగా పనిచేయును.
  • SiCI4 జలవిశ్లేషణం చేసినపుడు నీటి అణువులు Si – పరమాణువులతో సమన్వయ సంయోజనీయ బంధాలను ఏర్పరుచును.

ఉపయోగాలు :

  • SiCl4 మరియు NH3 ల మిశ్రమంను స్మోక్రాన్ల తయారీలో ఉపయోగిస్తారు.
  • ట్రాన్సిస్టర్ల తయారీలో ఉపయోగిస్తారు.
  • SiCl4 నుండి తయారుచేయబడిన SiO2 పెయింట్లు, రెసిన్ల తయారీలో ఉపయోగిస్తారు.

ప్రశ్న 22.
CO2 వాయువు కానీ SiO2 ఘనపదార్థం – వివరించండి.
జవాబు:

  • SiO2 బృహదణువు. SiO2 లో ‘Si’ పరమాణువు sp³ సంకరీకరణం చెందును.
  • ఇది త్రిజామితీయ నిర్మాణం కలిగి ఉండును. దీనిలో ‘Si’ పరమాణువు చుట్టూ నాలుగు ఆక్సిజన్ పరమాణువులు చతుర్ముఖీయంగా అమరి ఉండును.
  • కావున ఇది ఘనపదార్థం.
  • CO2 రేఖీయ ఆకృతి కలిగియుండును.
  • CO2 లో ‘C’, sp² సంకరీకరణం చెందును. CO2 అణువులో బలహీన వాండర్ వాల్బలాలు ఉంటాయి. కావున CO2 వాయువుగా ఉండును.

ప్రశ్న 23.
ZSM – 5 ఉపయోగం రాయండి.
జవాబు:

  • ZSM – 5 అనేది ఒక జియోలైట్.
  • దీనిని ఆల్కహాల్ను నేరుగా గాసోలీన్ గా మార్చుటకు ఉపయోగిస్తారు.

ప్రశ్న 24.
పొడిమంచు (dry ice) ఉపయోగం ఏమిటి? [A.P. Mar. ’15]
జవాబు:

  • ఘనరూప CO2 ను పొడిమంచు (dry ice) అంటారు.
  • దీనిని శీతలీకారిణిగా ఉపయోగిస్తారు.

AP Inter 1st Year Chemistry Study Material Chapter 11 P బ్లాక్ మూలకాలు – 14వ గ్రూప్

ప్రశ్న 25.
జలవాయువు (water gas) ఎలా తయారుచేస్తారు?
జవాబు:
వేడికోకు బాగా వేడిచేసిన నీటి ఆవిరితో పంపి జలవాయువును తయారుచేస్తారు.
AP Inter 1st Year Chemistry Study Material Chapter 11 P బ్లాక్ మూలకాలు – 14వ గ్రూప్ 8

ప్రశ్న 26.
ప్రొడ్యూసర్ వాయువు (producer gas) ఎలా తయారుచేస్తారు?
జవాబు:
తెల్లటి వేడికోక్పై గాలిని పంపి ప్రొడ్యూసర్ వాయువును తయారుచేస్తారు.
AP Inter 1st Year Chemistry Study Material Chapter 11 P బ్లాక్ మూలకాలు – 14వ గ్రూప్ 9

ప్రశ్న 27.
గ్రాఫైట్ C-C బంధదూరం, వజ్రంలో C-C బంధదూరం కంటే తక్కువ – వివరించండి.
జవాబు:

  • గ్రాఫైటందు ‘C’ పరమాణువు sp² సంకరీకరణం చెందును. బంధదైర్ఘ్యం 1.42 Å ఉండును.
  • గ్రాఫైట్ ద్విజామితీయ నిర్మాణం కలిగియుండును. షట్కోణాకార పొరల వంటి జాలక నిర్మాణం కలిగియుండును.
  • వజ్రం నందు ‘C’ పరమాణువు sp³ – సంకరీకరణం చెందును. బంధదైర్ఘ్యం 1.54 Å ఉండును.
  • వజ్రం త్రిజామితీయ నిర్మాణం కలిగియుండే టెట్రాహెడ్రల్ బృహదణువు.

ప్రశ్న 28.
వజ్రాన్ని అమూల్యమైన రాయిగా వాడతారు. – వివరించండి.
జవాబు:
వజ్రాన్ని అమూల్యమైన రాయిగా వాడతారు.

  • వజ్రాలు స్వచ్ఛమైన రంగులేని శుద్ధకార్బన్ రూపాలు.
  • సహజ సిద్ధంగా లభ్యమయ్యే దృఢమైన పదార్థాలు.
  • వజ్రం యొక్క భారాన్ని కారట్లలో తెలుపుతారు.
    1 కారట్ = 200 మి.గ్రా.

ప్రశ్న 29.
కార్బన్ సంయోజకత నాలుగు కంటే ఎక్కువ ఎప్పుడు చూపించదు కానీ ఆ కుటుంబంలో మిగతా మూలకాలు సంయోజకత ఆరు వరకు చూపిస్తాయి – వివరించండి.
జవాబు:

  • ‘C’ నందు d – ఆర్బిటాళ్లు లేకపోవుట వలన నాలుగు కంటే ఎక్కువ సంయోజకత చూపదు.
  • కార్బన్ కుటుంబంలోని మిగతా మూలకాలలో d – ఆర్బిటాళ్లు గలవు. అందువలన అవి ఆరు సంయోజకత చూపుతాయి.

ప్రశ్న 30.
ప్రొడ్యూసర్ వాయువు, జలవాయువు కంటే తక్కువ సామర్థ్యం గల ఇంధనం – వివరంచండి.
జవాబు:

  • ప్రొడ్యూసర్ వాయువు కెలోరిఫిక్ విలువ 5439.2 KI/m³
  • జలవాయువు కెలోరిఫిక్ విలువ 13000 KJ/m³
  • జలవాయువుకు అధిక కెలోరిఫిక్ విలువ కలిగి ఉండుటవలన ప్రొడ్యూసర్ వాయువు కంటే ఎక్కువ సామర్థ్యం కలిగి ఉంటుంది.

ప్రశ్న 31.
SiF6-2 తెలుసు, కాని SiCl6-2 తెలియదు – వివరించండి.
జవాబు:

  • Si4+ అయాన్ సైజు పరిమితి వల్ల దాని చుట్టూ ఆరు పెద్ద క్లోరైడ్ అయానులకు సరిపడినంత చోటు లేకపోవడం.
  • క్లోరైడ్ అయాన్ ఒంటరి జంట, Si4+ల మధ్య అన్యోన్య చర్య అంత బలమైంది కాదు.

స్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
నిర్మాణాల ఆధారంగా వజ్రం, గ్రాఫైట్ల ధర్మాలలో తేడాలను వివరించండి.
జవాబు:

వజ్రంగ్రాఫైట్
→ ‘C’ సంకరీకరణం – sp³.→ ‘C’ సంకరీకరణం – sp².
→ ప్రతి ‘C’ చుట్టూ నాలుగు కార్బన్లతో అమరి ఉండును (టెట్రాహెడ్రల్)→ ప్రతి కార్బన్ చుట్టూ మూడు కార్బన్లు షట్కోణ వలయాలుగా ఏర్పడతాయి.
→ ఇది త్రిజామితీయ నిర్మాణం కలిగియుండును.→ ఇది ద్విజామితీయ నిర్మాణం కలిగియుండును.
→ C C బంద దైర్ఘ్యం 1.54 Å.→ C – C బంద దైర్ఘ్యం 1.42 Å.
→ బంధకోణం 109°.28′.→ బంధకోణం 120°.
→ సాంద్రత – 3.5 గ్రా/cc.→ సాంద్రత – 2.2 గ్రా/CC.
→ ‘C’ పరమాణువులు బలమైన సంయోజనీయబంధాలు ఏర్పరుస్తాయి.→ రెండు ఆసన్న పొరల మధ్య దూరం 3.35 Å. మరియు బలహీన వాండర్వాల్ బలాలు కలిగియుంటాయి.

ప్రశ్న 2.
కింది వాటిని వివరించండి. (a)PbCl2, Cl2 తో చర్య జరిగి PbCl4 ఇస్తుంది. (b) PbCl4 ఉష్ణ అస్థిర పదార్థం. (c) లెడ్ PbI4 ను ఏర్పరచదు.
జవాబు:
a) PbCl2 + Cl2 → PbCl4
కానీ PbCl4 అస్థిరమైనది. లెడ్ +2 స్థిరమైన ఆక్సీకరణ స్థితిని ప్రదర్శిస్తుంది. కానీ +4 ఆక్సీకరణస్థితి అస్థిరమైనది.

b) PbCl4 ఉష్ణ అస్థిరమైన పదార్థం :
PbCl4 లో లెడ్ +4 ఆక్సీకరణ స్థితి ప్రదర్శిస్తుంది. కానీ జడ ఎలక్ట్రాన్ జంట స్వభావం వలన లెడ్ స్థిరమైన + 2 ఆక్సీకరణస్థితి ప్రదర్శిస్తుంది.

c) లెడ్ PbI4 ను ఏర్పరచదు:

  • 6s ఎలక్ట్రాన్ జంటను వేరు చేయుటకు అవసరమైన శక్తిని ఏర్పడిన Pb – I బంధం ద్వారా ఏర్పడదు.
  • లెడ్ +2 స్థిరమైన ఆక్సీకరణ స్థితి మరియు +4 అస్థిరమైనది. దీనికి కారణం జడ ఎలక్ట్రాన్ జంట ప్రభావం.

AP Inter 1st Year Chemistry Study Material Chapter 11 P బ్లాక్ మూలకాలు – 14వ గ్రూప్

ప్రశ్న 3.
కింది వాటిని వివరించండి.
(a) సిలికాన్ను మిథైల్ క్లోరైడ్ కాపర్ సమక్షంలో అత్యధిక ఉష్ణోగ్రత వద్ద వేడి చేయబడింది. (b) SiO2 ను HF తో చర్య జరపడం (c) గ్రాఫైట్ కందెనగా పనిచేస్తుంది.
(d) వజ్రం అపఘర్షకంగా ఉంటుంది. [T.S. Mar. ’15]
జవాబు:
a) కాపర్ ఉత్ప్రేరక సమక్షంలో మిథైల్ క్లోరైడ్ సిలికాన్తో అధిక ఉష్ణోగ్రతల వద్ద చర్య జరిపి మిథైల్ సమూహం ప్రతిక్షేపింపబడిన క్లోరోసిలేన్లను ఏర్పరచును. వాటి ఫార్ములాలు MeSiCl3, Me2SiCl2, Me3SiCl మరియు Me4Si.

డై మిథైల్ డై క్లోరోసిలేన్లను జలవిశ్లేషణ సంఘనన పొలిమెరీకరణం చేయగా సరళశృంఖల పాలిమర్లు (సిలికోన్లు) ఏర్పడును.
AP Inter 1st Year Chemistry Study Material Chapter 11 P బ్లాక్ మూలకాలు – 14వ గ్రూప్ 10

b) SiO2 ను HF తో చర్య జరుపగా SiF4 ఏర్పడుతుంది. దీనిని జలవిశ్లేషణ చేయగా H4SiO4 మరియు H2SiF6 లు ఏర్పడును.
SiO2 + 4HF → SiF4 + 2H2O
SiF4 + 4H2O → H4SiO4 + 2H2SiF6

c) గ్రాఫైట్కు పొరల నిర్మాణం ఉంటుంది. పీడనం కలుగచేసినపుడు ఈ పొరలు ఒక దానిపై ఒకటి జారుతాయి. అందువలన గ్రాఫైట్కు జారుడు స్వభావం ఉంటుంది. ఈ స్వభావం వలన గ్రాఫైట్ను కందెనగా వాడతారు.

d) వజ్రంలోని సంయోజనీయ బంధాలు చాలా దృఢమైనవి వీటిని విఘటనం చెందింపలేము. కావున వజ్రం అపఘర్షకంగా ఉంటుంది. ఇది భారీ పనిముట్లు, అద్దకాలు వంటివాటిని తయారుచేయుటకు వాడతారు.

ప్రశ్న 4.
మీరేమి అర్థం చేసుకొన్నారు: (a) రూపాంతరత (b) జడజంట ప్రభావం (c) శృంఖలత్వం (catination).
జవాబు:
(a) రూపాంతరత :
ఒకే మూలకం వివిధ భౌతిక రూపాలలో ఉండి ఒకేరకమైన రసాయన ధర్మాలు కలిగి ఉండుటను రూపాంతరం అంటారు.
కార్బన్ యొక్క స్పటిక రూపాంతరాలు వజ్రం, గ్రాఫైట్.

(b) జడ ఎలక్ట్రాన్ జంట ప్రభావం :
ns ఎలక్ట్రాన్ జంట బంధంలో పాల్గొనుటకు విముఖత చూపుటను జడ ఎలక్ట్రాన్ జంట ప్రభావం అంటారు.
ఉదా : లెడ్ +2 స్థిరమైన ఆక్సీకరణ స్థితిని ప్రదర్శించును. దీనికి కారణం జడ ఎలక్ట్రాన్ జంట ప్రభావం.

(c) శృంఖలత్వం :
ఒకే మూలక పరమాణువులు వాటిలో అవి సంయోగం చెంది పొడవాటి శృంఖలాలు (లేదా) వలయాలను ఏర్పరచుటను శృంఖలత్వం (catination) అంటారు.

కార్బన్కు అత్యధిక శృంఖలత్వం కలిగియుండును దీనికి కారణం అధిక బంధశక్తి (348 KJ/mole).

ప్రశ్న 5.
సిలికోన్ల తయారీలో RSiCl3 ప్రారంభ పదార్థంగా వాడితే తయారైన క్రియజన్యాల నిర్మాణాలను రాయండి.
జవాబు:
RSiCl3 ని సిలికోన్ల తయారీలో ప్రారంభ పదార్థంగా వాడితే సంక్లిష్ట సిలికోన్లు ఏర్పడతాయి (అడ్డుగా బంధింపబడిన సిలికోన్లు)
ఉదా : మిథైల్ ట్రైక్లోరోసిలేన్ (CH3SiCl3) జలవిశ్లేషణ జరిపి మోనోమిథైల్ సిలేన్ ట్రయోల్ ఏర్పడును. దీనిని పొలిమెరీకరణం చేయగా సంక్లిష్ట సిలికోన్లు ఏర్పడతాయి.
AP Inter 1st Year Chemistry Study Material Chapter 11 P బ్లాక్ మూలకాలు – 14వ గ్రూప్ 11

ప్రశ్న 6.
జియోలైట్ ల మీద సంక్షిప్తంగా రాయండి.
జవాబు:
జియోలైట్లు :
ఇది లోహపు అయాన్లు లేని త్రిమితీయ నిర్మాణాలు. వీటిలో కొన్ని Si+4 లను Al+4 తో ప్రతిక్షేపిస్తే, తరువాత అతిరిక్తంగా లోహం అయానన్ను కలిపితే అనంతమైన త్రిమితీయ జాలకం ఏర్పడుతుంది. [Si2O8]2n- లో ఒకటి లేదా రెండు సిలికాన్ పరమాణువులు స్థానభ్రంశం చెందితే జియొలైట్లు వస్తాయి. జియొలైట్లు అయాన్ వినిమయకారులుగాను, అణుజల్లెడలగానూ పనిచేస్తాయి. జియొలైట్ల నిర్మాణాలు ఏర్పడేటప్పుడు వివిధ సైజుల్లో రంధ్రాలు ఏర్పడతాయి. నీటి అణువులు, అనేక రకాలైన అణువులు, NH3, CO2 ఇథనాల్ వంటివి, ఈ రంధ్రాలలో పట్టుబడిపోతాయి. ఆ విధంగా జియొలైట్లు అణువుల జల్లెడ మాదిరిగా పనిచేస్తాయి. కఠిన జలం నుంచి Ca+4 అయాన్లను బంధించి Na+ అయాన్లతో ప్రతిక్షేపిస్తాయి.

ఉపయోగాలు :

  • పెట్రోరసాయన పరిశ్రమలలో జియొలైట్లు ఉత్ప్రేరకాలుగా పనిచేస్తాయి.
  • జియొలైట్ ZSM – 5 ను, ఆల్కహాల్ను నేరుగా గాసోలిన్ గా మార్చుటకు ఉపయోగిస్తారు.

ప్రశ్న 7.
సిలికేట్ల మీద సంక్షిప్తంగా రాయండి.
జవాబు:
సిలికేట్లు : చాలా నిర్మాణసామానులు సిలికేట్లు.

ఉదా : గ్రానైట్లు, పలకలు, ఇటుకలు, సిమెంట్ మొదలైనవి పింగాణీలు, గాజు కూడా సిలికేట్లే. Si – O బంధాలు సిలికేట్లలో చాలా బలమైనవి. సాధారణ ద్రావణులలో దేనిలోనూ అవి కరగవు. ఇతర పదార్థాలతో త్వరగా కలవవు. సిలికేట్లను ఆరు రకాలుగా విభజించవచ్చు. అవి.
1) ఆర్థోసిలికేట్లు లేదా నీసో సిలికేట్లు :
వీటిలో (SiO2-4) అయాన్లుంటాయి. వాటి సాధారణ ఫార్ములా M211 (SiO4).
ఉదా : విల్లెమైట్ Zn2 (SiO4).

2) పైరో సిలికేట్లు లేదా సోరో సిలికేట్లు లేదా డైసిలికేట్లు :
వీటిలో Si2O7-6 యూనిట్లుంటాయి. పైరో సిలికేట్లు చాలా అరుదు.
ఉదా : థోర్ట్వటెట్ Ln2 [Si2O7].

3) శృంఖల సిలికేట్లు :
వీటిలో (SiO3)2n- యూనిట్లుంటాయి. ఉదా : స్పాడ్యుమీన్ LiAl (SiO3)2 ఆంఫిబోల్ ఒక రకమైన శృంఖల సిలికేట్లు, వాటిలో సాధారణంగా రెండు శృంఖలాలు ఏర్పడతాయి.

4) వలయ సిలికేట్లు :
ఈ సిలికేట్లలో వలయ నిర్మాణాలుంటాయి. వాటి సాధారణ ఫార్ములా (SiO3)2n- మూడు, నాలుగు, ఆరు, ఎనిమిది టెట్రాహెడ్రల్ యూనిట్లు ఉండే వలయాలు సిలికేట్లకు తెలుసు. కాని మూడు, ఆరు టెట్రాహెడ్రల్ యూనిట్లున్న వలయాలు అతి సామాన్యం. ఉదా : బెరైల్ Be3Al2 [Si6O18]

5) పలక సిలికేట్లు :
ప్రతి యూనిట్ లోని మూడు మూలలను పంచుకొంటే వచ్చేది అనంతమైన ద్విమితీయ పలక. వీటి అనుఘటక ఫార్ములా (Si2O5)2n- ఉంటుంది. ఈ సమ్మేళనాలు పొరల నిర్మాణాల్లో కనిపిస్తాయి. వాటిని శుభ్రం చేయవచ్చు.
ఉదా : కయొలిన్ Al2 (OH)4 Si2O8.

6) అల్లిక సిలికేట్లు లేదా త్రిమితీయ సిలికేట్లు :
SiO4 టెట్రా హెడ్రల్లో నాలుగు మూలలను పంచుకొనేటప్పుడు త్రిమితీయ జాలకం SiO2 ఫార్ములాతో ఏర్పడుతుంది.

AP Inter 1st Year Chemistry Study Material Chapter 11 P బ్లాక్ మూలకాలు – 14వ గ్రూప్

ప్రశ్న 8.
సిలికోన్లు అంటే ఏమిటి? అవి ఏ విధంగా పొందుతారు?
జవాబు:

  • R2 SiO – యూనిట్లు కలిగి ఉన్న కర్బన సిలికాన్ పాలీమర్లను సిలికోన్లు అంటారు.
  • ఇవి Si – O – Si బంధం కలిగిన సంశ్లేషణ పదార్థాలు.
  • ఇవి క్లోరోసిలేన్లను జలవిశ్లేషణ చేయుటవలన ఏర్పడును.
    a) కాపర్ ఉత్ప్రేరక సమక్షంలో మిథైల్ క్లోరైడ్ సిలికాన్తో అధిక ఉష్ణోగ్రతల వద్ద చర్య జరిపి మిథైల్ సమూహం ప్రతిక్షేపింపబడిన క్లోరోసిలేన్లను ఏర్పరచును. వాటి ఫార్ములాలు MeSiCl3, Me2SiCl2, Me3SiCl మరియు Me4Si.
  • డై మిథైల్ డై క్లోరోసిలేన్లను జలవిశ్లేషణ సంఘనన పొలిమెరీకరణం చేయగా సరళశృంఖల పాలిమర్లు (సిలికోన్లు) ఏర్పడును.

AP Inter 1st Year Chemistry Study Material Chapter 11 P బ్లాక్ మూలకాలు – 14వ గ్రూప్ 12

ప్రశ్న 9.
పుల్లరీన్ ల మీద సంక్షిప్తంగా రాయండి.
జవాబు:
AP Inter 1st Year Chemistry Study Material Chapter 11 P బ్లాక్ మూలకాలు – 14వ గ్రూప్ 13
ఫుల్లరీన్లు :

  • ఫుల్లరీన్లు కార్బన్ యొక్క స్ఫటిక రూపాంతరాలు.
  • వీటిని జడవాయువుల సమక్షంలో గ్రాఫైట్ ద్వారా విద్యుత్ ప్రవహింపచేసి పొందవచ్చు.
  • ఇవి ఊగే బంధాలులేని (dangling bonds) మెత్తని నిర్మాణం కలిగి ఉంటాయి. కావున ఇవి మాత్రమే కార్బన్ యొక్క శుద్ధమైన రూపాలు.
  • C60 అణువు సాకర్ బంతిని పోలిన నిర్మాణం కలిగియుండును.
  • C60 అణువులో ఇరవై 6 – కార్బన్ వలయాలు మరియు 12, 5 – కార్బన్ వలయాలు కలవు.
  • C60లో 6 – కార్బన్ వలయాలు 5 లేదా 6 – కార్బన్ వలయాలతో సంయోగం చెందగలవు. కానీ 5 – కార్బన్ వలయాలు కేవలం 6 – కార్బన్ వలయాలతోనే సంయోగం చెందగలవు.
  • ఫుల్లరీన్ లో ‘c’ సంకరీరణం sp².
  • ఫుల్లరీన్ లు ఆరోమేటిక్ స్వభావాన్ని కలిగి ఉంటాయి.
  • C – C బంధ దైర్ఘ్యం C-C మరియు C = C కి మధ్యలో ఉండును.
  • గోళాకార ఫుల్లరీన్లను బక్సీబాల్స్ అంటారు.
  • C – C బంధ దైర్ఘ్యాల 1.43Å మరియు 1.38Å వరుసగా ఉంటాయి.
  • దీనికి 60 శీర్షాలున్నాయి.

ప్రశ్న 10.
SiO2 నీళ్ళలో ఎందుకు కరగదు?
జవాబు:

  • SiO2 సాధారణ స్థితిలో చర్యశీలతలేని సమ్మేళనం.
  • Si – O బంధ ఎంథాల్పీ ఎక్కువగా ఉండుటవలన దీనికి చర్యాశీలత ఉండదు.
  • SiO2 అనునది త్రిజామితీయ బృహదణువు.
  • కావున SiO2 నీటిలో కరుగదు.

ప్రశ్న 11.
వజ్రం కఠినంగా ఎందుకు ఉంటుంది?
జవాబు:
డైమండ్లో ప్రతి కార్బన్ పరమాణువు చుట్టూ నాలుగు కార్బన్ పరమాణువులు చతుర్ముఖీయంగా ఏక బంధాలతో బంధింపబడి ఉండటం వలన అది బృహదణు నిర్మాణం కలిగి ఉంటుంది. అంతేకాకుండా డైమండ్ త్రిజ్యామితీయంగా ఉంటుంది. దీనిలోని C− C బంధాలను విడగొట్టడం చాలా కష్టం. అందువలన డైమండ్ కఠినత్వం కలిగి ఉంటుంది.

ప్రశ్న 12.
కింది వాటిని వేడిచేసినప్పుడు ఏమి జరుగుతుంది?
(a) CaCO3 (b) CaCO3, SiO2 (c) CaCO3 అధికంగా కోక్.
జవాబు:
CaCO3 ని వేడిచేస్తే క్విక్ లైమ్ ఏర్పడుతుంది.
AP Inter 1st Year Chemistry Study Material Chapter 11 P బ్లాక్ మూలకాలు – 14వ గ్రూప్ 14

ప్రశ్న 13.
Na2CO3 ద్రావణాన్ని CO2 వాయువులో సంతృప్తం చేస్తే అవలంబనం అవుతుంది. ఎందుకు?
జవాబు:
Na2CO3 జల ద్రావణంలోకి CO2 ను పంపి సంతృప్త పరిస్తే సోడియం బైకార్బోనేట్ (NaHCO3) ఏర్పడుతుంది.
Na2CO3 + H2O + CO2 → 2NaHCO3

సోడియం కార్బోనేట్ కన్నా సోడియం బైకార్బనేట్ నీటిలో తక్కువ కరుగుతుంది. కాబట్టి అవలంబనం (suspension) ఏర్పడుతుంది.

ప్రశ్న 14.
ఈ కింది చర్యలలో ఏమి జరుగుతుంది? (a) తడిసున్నం ద్వారా CO2 ను పంపడం. (b) CaC2 ను N2తో వేడిచేయడం
జవాబు:
a) CO2 ను సున్నపు నీటిలోకి [Ca(OH)2] పంపితే అది పాలవలె విరిగిపోతుంది మరియు అద్రావణి కాల్షియం కార్బోనేట్ ఏర్పడుతుంది.
Ca(OH)2 + CO2 → CaCO3 + H2O
ఎక్కువ మోతాదులో CO2 ని పంపితే ఏర్పడిన
CaCO3 కాల్షి బైకార్బోనేట్గా మారుతుంది.
CaCO3 + H2O2 + CO2 → Ca(HCO3)2

b) N2 సమక్షంలో CaC2 ని వేడి చేస్తే కాల్షియం సైనమైడ్ ఏర్పడుతుంది.
AP Inter 1st Year Chemistry Study Material Chapter 11 P బ్లాక్ మూలకాలు – 14వ గ్రూప్ 15

ప్రశ్న 15.
గ్రూపు 14లో కార్బన్ అసంగత స్వభావాన్ని గురించి రాయండి.
జవాబు:
మొదటి మూలకం అసంగత ప్రవర్తన :
IV గ్రూపులో మొట్ట మొదటి మూలకం, అంటే కార్బన్, ఆ గ్రూపులో మిగతా మూలకాలతో క్రింది అంశాలలో పోలికలను చూపించదు. దీనికి కారణము దానికి గల చిన్న పరమాణు పరిమాణము మరియు ఉపాంత్వ కక్ష్య (Penultimate shell) ఎలక్ట్రాన్ విన్యాసము.
i) కార్బన్ ప్రకృతిలో చాలా విస్తృతంగా ఉంటుంది. కార్బన్ స్వేచ్ఛాస్థితుల్లో లభ్యమవుతుంది. మిగతా మూలకాలు ప్రకృతిలో స్వేచ్ఛాస్థితిలో దాదాపుగా దొరకవు.

ii) కార్బన్ ఎలక్ట్రాన్ విన్యాసం 1s² 2s² 2p6, దీని పరమాణువులో d – ఆర్బిటాల్లు అందుబాటులో ఉండవు. అందుకే అష్టకం విస్తృతం మిగతా మూలకాలలో d – ఎలక్ట్రాన్లుంటాయి. కాబట్టి వీలవుతుంది. మూలకపు సమన్వయ సంఖ్య 4 నుంచి 6కు పెరుగుతుంది.
ఉదా : SiF4 + 2F → (SiF6)-2

ii) కార్బన్ అలోహం, చిన్నది కాబట్టి అధిక కోవలెంట్ స్వభావం ఉన్న సమ్మేళనాలను ఏర్పరుస్తుంది. అత్యధిక సంయోజకత C కి 4, ఇతర మూలకాలకు 6 ఉండటానికి వీలవుతుంది.

iv) కార్బన్ మిగిలిన గ్రూపు IV A మూలకాల నుంచి గొలుసులు ఏర్పరిచే సామర్థ్యంలో విశిష్ఠ లక్షణం చూపుతుంది. ఇది ఎందుకంటే C – C బంధ శక్తి (348 జౌమోల్-1) మిగతా గ్రూపు మూలకాల్లో బంధశక్తితో సారూప్యంగా చూస్తే చాలా ఎక్కువ. శృంఖలం పొడవు C లో అనంతంగా ఉండవచ్చు. కాని ఇతర మూలకాల్లో అత్యంత పొడవైన శృంఖలంలో ఎనిమిది పరమాణువులు ఉంటాయి.

v) కార్బన్ ఒక్కటే తన పరమాణువుల మధ్య బహు బంధాలను ఏర్పరచగలదు. (C = C; C =C) అట్లాగే ఇతర మూలకాలతో కూడా బహు బంధాలను ఏర్పరచగలదు. (C = 0; C = S)

vi) కార్బన్ హైడ్రైడ్లను హైడ్రోకార్బన్లని అంటారు. అవి చాలా ఎక్కువ ఉష్ణ స్థిరత్వం కలవి. క్రింది MH4 అణువుల విఘటనోష్ణోగ్రతలను ఇవ్వడమయినది.
AP Inter 1st Year Chemistry Study Material Chapter 11 P బ్లాక్ మూలకాలు – 14వ గ్రూప్ 16
ఆల్కేన్ల స్థిరత్వానికి, ఇతర మూలకాల హైడ్రైడ్లకు స్థిరత్వాలలో తేడా ముఖ్యంగా ఆ మూలకాల ఋణ విద్యుదాత్మకత విలువల మధ్య తేడా ఉండటమే కారణం..

vii) కార్బన్ – హాలోజన్ సమ్మేళనాలు జలవిశ్లేషణ చెందవు. కానీ మిగతా మూలకాల టెట్రా హాలైడ్లు తేలిగ్గా జలవిశ్లేషణ చెందుతాయి.

దీర్ఘ సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
సిలికోన్లు అంటే ఏమిటి? వాటిని ఏ విధంగా తయారు చేస్తారు? ఉదాహరణ ఇవ్వండి. [A.P. Mar, ’15]
జవాబు:

  • R2 SiO – యూనిట్లు కలిగి ఉన్న కర్బన సిలికాన్ పాలీమర్లను సిలికోన్లు అంటారు.
  • ఇవి Si – O – Si బంధం కలిగిన సంశ్లేషణ పదార్థాలు.
  • ఇవి క్లోరోసిలేన్లను జలవిశ్లేషణ చేయుటవలన ఏర్పడును.
    a) కాపర్ ఉత్ప్రేరక సమక్షంలో మిథైల్ క్లోరైడ్ సిలికాన్తో అధిక ఉష్ణోగ్రతల వద్ద చర్య జరిపి మిథైల్ సమూహం ప్రతిక్షేపింపబడిన క్లోరోసిలేన్లను ఏర్పరచును. వాటి ఫార్ములాలు MesiCl3, Me2SiCl2, Me3SiC మరియు Me4Si.
  • డై మిథైల్ డై క్లోరోసిలేన్లను జలవిశ్లేషణ సంఘనన పొలిమెరీకరణం చేయగా సరళశృంఖల పాలిమర్లు (సిలికోన్లు) ఏర్పడును.

AP Inter 1st Year Chemistry Study Material Chapter 11 P బ్లాక్ మూలకాలు – 14వ గ్రూప్ 17

సిలికోన్ల ఉపయోగాలు :

  • వీటిని సీల్ వేసే పదార్థాలుగా ఉపయోగపడతాయి.
  • వీటిని గ్రీజులుగా, విద్యుత్బంధకాలుగా ఉపయోగపడతాయి.
  • వీటిని బట్టలపై జలనిరోధకంగా ఉపయోగిస్తారు.
  • వీటిని శస్త్రచికిత్సల సంబంధమైన, సౌందర్య సాధన ద్రవ్యాల తయారీలో వాడతారు.

AP Inter 1st Year Chemistry Study Material Chapter 11 P బ్లాక్ మూలకాలు – 14వ గ్రూప్

ప్రశ్న 2.
సిలికా నిర్మాణాన్ని వివరించండి. అది a) NaOH, b) HF తో ఏ విధంగా చర్య జరుపుతుంది?
జవాబు:
AP Inter 1st Year Chemistry Study Material Chapter 11 P బ్లాక్ మూలకాలు – 14వ గ్రూప్ 5

  • సిలికా త్రిజామితీయ నిర్మాణం కలిగి ఉంటుంది బృహదణువు.
  • Si, O పరమాణువులు ఒకదాని తరువాత ఒకటి 8 పరమాణువులున్న వలయాలుగా ఏర్పడతాయి.
  • Si చుట్టూ ఆక్సిజన్ పరమాణువులు చతుర్ముఖీయంగా ఏర్పడతాయి.
  • SiO2 లో Si పరమాణువు sp³ సంకరీకరణం చెందును.

a) సిలికా NaOH తో చర్య జరిపి సోడియం సిలికేట్ను ఏర్పరచును.
SiO2 + 2 NaOH→ Na2SiO3 + H2O

b) SiO2 ను HF తో చర్య జరుపగా SiF4 ఏర్పడుతుంది. దీనిని జలవిశ్లేషణ చేయగా H4SiO4 మరియు H2SiF6 లు ఏర్పడును.
SiO2 + 4HF → SiF4 + 2H2O
SiF4 + 4H2O → H4SiO4 + 2H2SiF6

ప్రశ్న 3.
కార్బన్ రూపాంతరాల (allotropy) పై వివరణ రాయండి.
జవాబు:
ఒక మూలకం వివిధ రూపాలలో వేరు వేరు భౌతిక ధర్మాలను కలిగి ఉండటాన్ని రూపాంతరత అంటారు. వజ్రము, గ్రాఫైట్ మరియు ఫుల్లరీన్లు కార్బన్ యొక్క స్పటిక రూపాంతరాలు.
AP Inter 1st Year Chemistry Study Material Chapter 11 P బ్లాక్ మూలకాలు – 14వ గ్రూప్ 18

వజ్రం (డైమండ్) నిర్మాణం :
డైమండ్లో కార్బన్ sp³ సంకరీకరణం పొందుతుంది. దానివలన ప్రతి కార్బన్ పరమాణువు మీద నాలుగు sp³ సంకర ఆర్బిటాళ్ళు ఏర్పడతాయి. ప్రతి కార్బన్ పరమాణువులోని నాలుగు sp³ సంకర ఆర్బిటాళ్ళు నాలుగు ఇతర కార్బన్ పరమాణువులతో బంధాలను ఏర్పరచుకుంటుంది. ప్రతి కార్బన్ పరమాణువు చతుర్ముఖీయ సౌష్ఠవాన్ని కలిగి ఉంటుంది. ఈ విధంగా కార్బన్ పరమాణువులు ఒకదానితో ఒకటి బంధింపబడి ఉండటం వల్ల పెద్ద అణువు ఏర్పడుతుంది. దీనిలో C – C బంధ దూరం 1.54 A° బంధకోణం 109° 28′ గా ఉంటాయి.

ఉపయోగాలు :

  • ఆభరణాలలో విలువైన రాళ్ళుగా ఉపయోగిస్తారు.
  • పాలరాయిని కోయడానికి ఉపయోగిస్తారు.
  • టంగ్స్టన్ వంటి లోహాల నుండి అతి సన్నని తీగను తీయుటకు వాడతారు.

గ్రాఫైట్ నిర్మాణము :
AP Inter 1st Year Chemistry Study Material Chapter 11 P బ్లాక్ మూలకాలు – 14వ గ్రూప్ 19
గ్రాఫైట్లో కార్బన్ పరమాణువు sp² సంకరీకరణం పొందుతుంది. దాని వలన ప్రతి కార్బన్ పరమాణువు మీద మూడు sp² సంకర ఆర్బిటాళ్ళు ఏర్పడతాయి. ప్రతి కార్బన్ పరమాణువు మూడు ఇతర కార్బన్ పరమాణువులతో షడ్భుజాకార వలయాలుగా బంధించబడి ఉంటాయి. ఇటువంటి అనేక వలయాలు కలిసి ఒకే తలంలో ఉంటాయి. ఒంటరి ఎలక్ట్రాన్ గల p – ఆర్బిటాల్ ఈ తలానికి లంబంగా ప్రతి కార్బన్ పరమాణువు వద్ద ఉంటుంది. ఈ p – ఆర్బిటాళ్ళు ఒకదానితో ఒకటి కలిసిపోయి తలానికి పైన, క్రింద విస్తరించి ఉంటాయి. ఈ వలయాకార తలాలు ఒకదానిపై ఒకటి బలహీనమైన వాండర్వాల్ బలాలచే బంధించబడి ఉంటాయి. గ్రాఫైట్కు గల ఈ నిర్మాణాన్ని పొరల స్ఫటిక నిర్మాణం అంటారు.

ఉపయోగాలు :

  • దీన్ని కందెనగా వాడతారు.
  • విద్యుత్ కొలిమిలో ఎలక్ట్రోడ్లుగా ఉపయోగిస్తారు.
  • పెన్సిళ్ళ తయారీలో లెడ్ వాడతారు.

ఫుల్లరీన్లు :
AP Inter 1st Year Chemistry Study Material Chapter 11 P బ్లాక్ మూలకాలు – 14వ గ్రూప్ 13

  • ఫుల్లరీన్ లు కార్బన్ యొక్క స్ఫటిక రూపాంతరాలు.
  • వీటిని జడవాయువుల సమక్షంలో గ్రాఫైట్ ద్వారా విద్యుత్ ప్రవహింపచేసి పొందవచ్చు.
  • ఇవి ఊగే బంధాలులేని (dangling bonds) మెత్తని నిర్మాణం కలిగి ఉంటాయి. కావున ఇవి మాత్రమే కార్బన్ యొక్క శుద్ధమైన రూపాలు.
  • C60 అణువు సాకర్ బంతిని పోలిన నిర్మాణం కలిగియుండును.
  • C60. అణువులో ఇరవై 6 – కార్బన్ వలయాలు మరియు 12, 5 – కార్బన్ వలయాలు కలవు.
  • C60లో 6 – కార్బన్ వలయాలు 5 లేదా 6 – కార్బన్ వలయాలతో సంయోగం చెందగలవు. కానీ 5 – కార్బన్ వలయాలు కేవలం 6 – కార్బన్ వలయాలతోనే సంయోగం చెందగలవు.
  • ఫుల్లరీన్ లో ‘C’ సంకరీరణం sp².
  • ఫుల్లరీన్ లు ఆరోమేటిక్ స్వభావాన్ని కలిగి ఉంటాయి.
  • C – C బంధ దైర్ఘ్యం C – C మరియు C = C కి మధ్యలో ఉండును.
  • గోళాకార ఫుల్లరీన్లను బక్సీబాల్స్ అంటారు.
  • C – C బంధ దైర్ఘ్యాల 1.43Å మరియు 1.38Å వరుసగా ఉంటాయి.
  • దీనికి 60 శీర్షాలున్నాయి.

ప్రశ్న 4.
కింది వాటిపై వివరణ రాయండి. (a) సిలికేట్లు (b) జియోలైట్లు (c) ఫుల్లరీన్లు.
జవాబు:
సిలికేట్లు :
చాలా నిర్మాణసామానులు సిలికేట్లు.

ఉదా : గ్రానైట్లు, పలకలు, ఇటుకలు, సిమెంట్ మొదలైనవి పింగాణీలు, గాజు కూడా సిలికేట్లే. Si సిలికేట్లలో చాలా బలమైనవి. సాధారణ ద్రావణులలో దేనిలోనూ అవి కరగవు. ఇతర పదార్థాలతో త్వరగా కలవవు. సిలికేట్లను ఆరు రకాలుగా విభజించవచ్చు. అవి.

1) ఆర్థోసిలికేట్లు లేదా నీసో సిలికేట్లు :
వీటిలో (SiO4-4) అయాన్లుంటాయి. వాటి సాధారణ ఫార్ములా M211(SiO2).
ఉదా : విల్లెమైట్ Zn2(SiO4).

2) పైరో సిలికేట్లు లేదా సోరో సిలికేట్లు లేదా డైసిలికేట్లు :
వీటిలో SiO7-6 యూనిట్లుంటాయి. పైరో సిలికేట్లు చాలా అరుదు. ఉదా : థోర్వైటెట్ Ln2 (Si2O7).

3) శృంఖల సిలికేట్లు :
వీటిలో (SiO3)2n- యూనిట్లుంటాయి. ఉదా : స్పాడ్యుమీన్ LiAl (SiO3)2, ఆరిఫిబోల్ ఒక రకమైన శృంఖల సిలికేట్లు, వాటిలో సాధారణంగా రెండు శృంఖలాలు ఏర్పడతాయి.

4) వలయ సిలికేట్లు :
ఈ సిలికేట్ లో వలయ నిర్మాణాలుంటాయి. వాటి సాధారణ ఫార్ములా (SiO3)2n- మూడు, నాలుగు, ఆరు, ఎనిమిది టెట్రాహెడ్రల్ యూనిట్లు ఉండే వలయాలు సిలికేట్లకు తెలుసు. కాని మూడు, ఆరు టెట్రాహెడ్రల్ యూనిట్లున్న వలయాలు అతి సామాన్యం. ఉదా : బెరైల్ Be3Al2 (Si6O18)

5) పలక సిలికేట్లు :
ప్రతి (యూనిట్ లోని మూడు మూలలను పంచుకొంటే వచ్చేది అనంతమైన ద్విమితీయ పలక. వీటి అనుఘటక ఫార్ములా (Si2O5)2n- ఉంటుంది. ఈ సమ్మేళనాలు పొరల నిర్మాణాల్లో కనిపిస్తాయి. వాటిని శుభ్రం చేయవచ్చు. ఉదా : కయొలిన్ Al2 (OH)4 Si2O5.

6) అల్లిక సిలికేట్లు లేదా త్రిమితీయ సిలికేట్లు :
SiO4 టెట్రా హెడ్రల్లో నాలుగు మూలలను పంచుకొనేటప్పుడు త్రిమితీయ జాలకం SiO2 ఫార్ములాతో ఏర్పడుతుంది.

జియోలైట్లు :
ఇది లోహపు అయాన్లు లేని త్రిమితీయ నిర్మాణాలు. వీటిలో కొన్ని Si+4 లను Al+3 తో ప్రతిక్షేపిస్తే, తరువాత అతిరిక్తంగా లోహం అయాన్ ను కలిపితే అనంతమైన త్రిమితీయ జాలకం ఏర్పడుతుంది. [Si2O8]2n- లో ఒకటి లేదా రెండు సిలికాన్ పరమాణువులు స్థానభ్రంశం చెందితే జియొలైట్లు వస్తాయి. జియొలైట్లు అయాన్ వినిమయకారులుగాను, అణుజల్లెడలగానూ పనిచేస్తాయి. జియొలైట్ల నిర్మాణాలు ఏర్పడేటప్పుడు వివిధ సైజుల్లో రంధ్రాలు ఏర్పడతాయి. నీటి అణువులు, అనేక రకాలైన అణువులు, NH3 CO2 ఇథనాల్ వంటివి, ఈ రంధ్రాలలో పట్టుబడిపోతాయి. ఆ విధంగా జియొలైట్లు అణువుల జల్లెడ మాదిరిగా పనిచేస్తాయి. కఠిన జలం నుంచి Ca+2 అయాన్లను బంధించి Na² అయాన్లతో ప్రతిక్షేపిస్తాయి.

ఉపయోగాలు :

  • పెట్రోరసాయన పరిశ్రమలలో జియొలైట్లు ఉత్ప్రేరకాలుగా పనిచేస్తాయి.
  • జియొలైట్ ZSM – 5 ను, ఆల్కహాల్ను నేరుగా గాసోలిన్ గా మార్చుటకు ఉపయోగిస్తారు.

పుల్లరీన్ లు :
AP Inter 1st Year Chemistry Study Material Chapter 11 P బ్లాక్ మూలకాలు – 14వ గ్రూప్ 20

  • ఫుల్లరీన్లు కార్బన్ యొక్క స్ఫటిక రూపాంతరాలు.
  • వీటిని జడవాయువుల సమక్షంలో గ్రాఫైట్ ద్వారా విద్యుత్ ప్రవహింపచేసి పొందవచ్చు.
  • ఇవి ఊగే బంధాలు లేని (dangling bonds) మెత్తని నిర్మాణం కలిగి ఉంటాయి. కావున ఇవి మాత్రమే కార్బన్ యొక్క శుద్ధమైన రూపాలు.
  • C60 అణువు సాకర్ బంతిని పోలిన నిర్మాణం కలిగియుండును.
  • C60 అణువులో ఇరవై 6 – కార్బన్ వలయాలు మరియు 12, 5 కార్బన్ వలయాలు కలవు.
  • C60లో 6 – కార్బన్ వలయాలు 5 లేదా 6 – కార్బన్ వలయాలతో సంయోగం చెందగలవు. కానీ 5 – కార్బన్ వలయాలు కేవలం 6 – కార్బన్ వలయాలతోనే సంయోగం చెందగలవు.
  • ఫుల్లరీన్ లో ‘C’ సంకరీరణం sp².
  • ఫుల్లరీన్ లు ఆరోమేటిక్ స్వభావాన్ని కలిగి ఉంటాయి.
  • C – C బంధ దైర్ఘ్యం C-C మరియు C Cకి మధ్యలో ఉండును.
  • గోళాకార ఫుల్లరీన్లను బక్సీబాల్స్ అంటారు.
  • C – C బంధ దైర్ఘ్యాల 1.43A° మరియు 1.38A° వరుసగా
  • దీనికి 60 శీర్షాలున్నాయి.

సాధించిన సమస్యలు (Solved Problems)

ప్రశ్న 1.
కింది ప్రశ్నలకు సమాధానాలను గ్రూపు 14 మూలకాల నుంచి ఎంచుకొనండి.
సాధన:
అధిక ఆమ్ల డై ఆక్సైడ్ ఏర్పరచేది.
సాధారణంగా +2 ఆక్సీకరణ స్థితిలో కనపడేది.
అర్ధవాహక ఉపకరణాలలో ఉపయోగపడేది.
కార్బన్, లెడ్ సిలికాన్, జెర్మేనియం.

ప్రశ్న 2.
[SiF6]2- లభ్యమగును కాని [SiCl6]2- లభ్యము కాదు. సాధ్యమైన కారణాలు తెలపండి.
సాధన:
i) Si4+ అయాన్ సైజు పరిమితి వల్ల దాని చుట్టూ ఆరు పెద్ద క్లోరైడ్ అయానులకు సరిపడినంత చోటు లేకపోవడం.
ii) క్లోరైడ్ అయాన్ ఒంటరి జంట, Si4+ల మధ్య అన్యోన్య చర్య అంత బలమైంది కాదు.

ప్రశ్న 3.
డైమండ్కి సమయోజనీయ స్వభావం ఉంటుంది. అయినప్పటికీ అధిక ద్రవీభవన ఉష్ణోగ్రత ఉంటుంది. ఎందుకు?
సాధన:
దృఢమైన C – C బంధాల అల్లికతో ఉన్న త్రిమితీయ నిర్మాణం డైమండ్కు ఉంటుంది. దృఢమైన C – C బంధాలను విచ్ఛిన్నం చేయడానికి చాలా శక్తి కావాలి. అందువల్ల దీని ద్రవీభవన ఉష్ణోగ్రత చాలా అధికం.

AP Inter 1st Year Chemistry Study Material Chapter 11 P బ్లాక్ మూలకాలు – 14వ గ్రూప్

ప్రశ్న 4.
సిలికోన్లు ఏవి?
సాధన:
సాధారణ సిలికోన్లలో శృంఖలాలు ఉంటాయి. ఇందులో ఆల్కైల్ లేదా ఫినైల్ సమూహాలు ప్రతి సిలికాన్ యొక్క మిగిలిన బంధపు స్థానాలను ఆక్రమిస్తాయి. వాటికి జల విరోధ స్వభావం ఉన్నది.

AP Inter 1st Year History Study Material Chapter 12 భారత జాతీయోద్యమం

Andhra Pradesh BIEAP AP Inter 1st Year History Study Material 12th Lesson వలస పాలనలో భారతదేశం Textbook Questions and Answers.

AP Inter 1st Year History Study Material 12th Lesson వలస పాలనలో భారతదేశం

వ్యాసరూప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
భారతదేశంలో జరిగిన సామాజిక సంస్కరణోద్యమాలను వివరించండి.
జవాబు:
క్రీ.శ. 19వ శతాబ్దంలో బ్రిటిష్ పాలనతో వచ్చిన వ్యవస్థాగత మార్పు విద్యావంతులైన ఒక కొత్త సామాజిక వర్గ ఆవిర్భావానికి దారితీసింది. పాశ్చాత్య విద్య, సంస్కృతితో ప్రభావితులైన విద్యాధికులు సామాజిక ఉద్యమాలకు పూనుకున్నారు.

సామాజిక సంస్కరణోద్యమాలు: 19వ శతాబ్ద ప్రారంభం నాటికి సమాజంలో నెలకొన్న సామాజిక కట్టుబాట్లు స్త్రీలను, దళితులను హీనస్థితికి గురిచేశాయి. బాలికల భ్రూణ హత్య, సతి, నిర్బంధ వైధవ్యం, బాల్యవివాహాలు ఆనాటి సమాజంలో నెలకొన్న కొన్ని దురాచారాలు. అయితే భారతీయ విద్యావంతులు ఆంగ్ల విద్య ద్వారా పాశ్చాత్యుల్లోని ఉదార, ఆశావాద దృక్పథాన్ని చూసి వాటిపట్ల ఆకర్షితులయ్యారు. భారతీయ సమాజంలోని వివక్షాపూరిత దృక్పథం, వెనకబాటుతనం వారి సంస్కరణాభిలాషను దృఢతరం చేసింది.

19వ శతాబ్దంలో ప్రారంభమైన సంస్కరణల్లో రెండు ప్రధాన ధోరణులున్నాయి. అవి మత, సామాజిక సంస్కరణలు, రాజారాంమోహన్ రాయ్ మతానికి హేతువాద దృక్పథాన్ని జోడించాడు. ఇతని కృషివల్ల 1829 డిసెంబర్ 4న సతీ దురాచారం నిషేధించబడింది. అప్పటి గవర్నర్ జనరల్ విలియం బెంటింక్ ‘సతి’ని చట్టరీత్యా నేరంగాను, శిక్షార్హంగాను ప్రకటించాడు. బ్రహ్మసమాజం, ప్రార్థనా సమాజం, రామకృష్ణ మిషన్, ఆర్య సమాజం, థియోసాఫికల్ సంఘం లాంటి మత సంస్కరణాభిలాష గల సంస్థలు తమ కార్యక్రమాలను నడిపించాయి. బ్రహ్మసమాజం బ్రాహ్మణ వ్యవస్థకు వ్యతిరేకంగా ఏకేశ్వరోపాసనను ప్రోత్సహించింది. దయానంద సరస్వతి నాయకత్వంలో ఆర్యసమాజం విగ్రహారాధనకు వ్యతిరేకంగా ఉద్యమించి ‘వేదాలకు తరలండని’ ప్రబోధించారు. కరుడుగట్టిన సమాజ పునర్వ్యవస్థీకరణకు భారత తాత్విక సంస్థలు, థియోసాఫికల్ సొసైటీవంటివి పూనుకొన్నాయి. హేతుబద్ద పూజా విధానాన్ని రామకృష్ణ మిషన్ వారు ప్రవచించారు. జొరాస్ట్రియన్ల సంస్థ, రహనుమాయి మజ్దాయాన్ సభ, జొరాస్ట్రియన్ల ప్రాచీన పద్ధతుల పరిరక్షణను ప్రబోధించింది.

ఈ సంస్కర్తలు చేపట్టిన కార్యక్రమాలైన వితంతు పునర్వివాహం, కులాంతర వివాహాలు, స్త్రీ విద్య ఉదార పాశ్చాత్య లౌకిక ధోరణుల్ని సూచిస్తాయి. పర్దా నిషేధం, బాల్యవివాహం రద్దు, బహు భార్యత్వం, దళితుల పట్ల వివక్షను రూపమాపటం కోసం సంస్కర్తలు పూనుకొన్నారు. వివాహ వయోపరిమితి పెంపు, స్త్రీల ఆస్తి హక్కుల్ని వారు కాంక్షించారు. ఈ దురాచారాలను రూపుమాపడం కోసం చట్టాల ఏర్పాటుతోపాటు దేవాలయ ప్రవేశం, భోజన విషయాల్లో వివక్షకు వ్యతిరేకంగా పోరాడారు. ముఖ్యంగా అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం డిప్రెస్డ్ క్లాస్ మిషన్, డెక్కన్ ఎడ్యుకేషనల్ సొసైటీ, సర్వెంట్స్ ఆఫ్ ఇండియా సొసైటీ, అలీఘర్ సంస్థ, అమృత్సర్లోని దివానల్సా, బొంబాయి సోషల్ సర్వీసీగ్, ఇండియన్ నేషనల్ సోషల్ సర్వీస్ లీగ్లు, సత్యశోధక్ సమాజ్, హరిజన సేవక్ సంఘ్ లాంటి సంస్థలు కృషి చేశాయి.

AP Inter 1st Year History Study Material Chapter 12 భారత జాతీయోద్యమం

మహారాష్ట్రలో జ్యోతిరావు పూలే, సావిత్రి బాయి పూలేలు స్త్రీల విద్యావాప్తి, ముఖ్యంగా దళిత బాలికల విద్యా వ్యాప్తికై కృషి చేశారు. వితంతు స్త్రీల సంతానానికి అనాథాశ్రమం కట్టించారు. క్రీ.శ. 1873లో సత్యశోధక్ సమాజాన్ని 1882లో దీనబంధు సార్వజనిక్ సభను స్థాపించి వీటి ద్వారా సంస్కరణలు చేపట్టారు. పండిత రమాబాయి సంప్రదాయ కుటుంబంలో జన్మించింది. సంస్కృతంలో ప్రావీణ్యం గడించి సమాజంలోని మూఢాచారాలను ఏవగించుకొంది. సంస్కృత ప్రావీణ్యానికి ‘పండిత’ అనే గౌరవ బిరుదు రమాబాయి పొందారు. అనేక ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించి సామాజిక అన్యాయాల నుంచి హిందూ స్త్రీలను రక్షించడం కోసం కృషి చేశారు. పూణేలో మహిళా ఆర్యసమాజాన్ని, బొంబాయిలో శారదా సదన న్ను స్థాపించారు.

బెంగాల్లో హెన్రీలూయిస్ వివియన్ డొరేజియో హేతువాద దృక్పథంతో యంగ్ బెంగాల్ ఉద్యమాన్ని నడిపాడు. విద్యాసంస్కరణలకోసం ఈశ్వరచంద్ర విద్యాసాగర్ పూనుకొన్నారు. ఈయన కృషి వల్లే 1856లో హిందూ స్త్రీల పునర్వివాహానికి ఉన్న నిర్బంధాలన్నీ తొలగి చట్టం చేయడమైంది. ప్రముఖ సంస్కర్త సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ ముస్లింల విద్యావ్యాప్తికి కృషి చేశారు. 1825లో మహమ్మదీయ ఆంగ్లో ఓరియంటల్ కాలేజీని స్థాపించాడు. ఈ సంస్థే తరువాత అలీఘర్ ముస్లిం విశ్వవిద్యాలయంగా మారింది. ఆ తర్వాత కాలంలో వివేకానందుడుగా ప్రఖ్యాతి చెందిన నరేంద్రనాథ్ దత్తా రామకృష్ణ మిషన్ స్థాపించాడు. దీని ద్వారా యువతలో దేశభక్తిని రగిల్చి ప్రజోద్ధరణకు పనిచేసేలా వారిని ఉత్తేజపరిచాడు.

ప్రశ్న 2.
భారత జాతీయోద్యమంలో ‘వందేమాతరం’ ప్రాముఖ్యత తెల్పండి.
జవాబు:
భారతీయులలో పెరుగుతున్న జాతీయభావం బెంగాల్ విభజనతో బహిర్గతమై వందేమాతరం ఉద్యమంగా రూపుదాల్చింది. ఈ ఉద్యమం భవిష్యత్లో జరగబోయే ఉద్యమాలకు మార్గదర్శకమైంది.

కారణాలు: ఈ క్రింది కారణాలు వందేమాతర ఉద్యమానికి దోహదపడ్డాయి.
1) మితవాదుల వైఫల్యం: కాంగ్రెస్ స్థాపన జరిగినప్పటి నుంచి నాయకులు తమ కోర్కెల సాధన కోసం రాజ్యాంగ పద్ధతులను అవలంబించారు. వారు ఉద్యమించిన 20 సంవత్సరాల కాలంలో ప్రత్యేకంగా సాధించేందేమీ లేదు. దీనితో మితవాదుల యెడల ప్రజలలో అసంతృప్తి బయలుదేరింది.

2) అతివాద జాతీయభావం: అప్పటికే జాతీయోద్యమంలో తిలక్, లాలాలజపతిరాయ్, బిపిన్ చంద్రపాల్ వంటి అతివాద జాతీయ నాయకులున్నారు. పోరాటం ద్వారానే తమ కోర్కెలు తీరుతాయని వారు భావించి తమకు స్వరాజ్యం కావాలని ప్రకటించారు.

3) ఆంగ్లేయుల విభజించు పాలించు విధానం: ప్రజల్లో పెరుగుతున్న జాతీయ భావాన్ని దెబ్బతీయటానికి బ్రిటీషు ప్రభుత్వం “విభజించి, పాలించు” అనే సాధనాన్ని వినియోగించింది. భారతీయులలోని ఐక్యతను దెబ్బతీసి, వారిని బలహీనపరచి, తద్వారా తాను లబ్ది పొందాలని భావించింది. ఈ లక్ష్య సాధనకు బెంగాల్ను విభజించింది.

4) బెంగాల్ విభజన: బెంగాల్ రాష్ట్రం జాతీయోద్యమానికి ఆయువుపట్టు. దానిని విభజించటం ద్వారా జాతీయోద్యమాన్ని దెబ్బతీయాలని, హిందూ, ముస్లింల మధ్య విభేదాలు సృష్టించాలని కర్జన్ ప్రభువు తలపోశాడు. ఈ కారణంగా బెంగాల్ నుంచి 3 కోట్లకు పైగా జనాభా ఉన్న తూర్పు బెంగాల్, అస్సాంలను విడదీసి ఒక ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పరచాడు. బెంగాల్ రాష్ట్రం అతివిశాలమైందని, పాలనా సౌలభ్యం కోసం దాన్ని రెండు భాగాలుగా విభజించవచ్చని ప్రకటించాడు. ప్రజల్లో పెరుగుతున్న జాతీయ భావాన్ని మొగ్గలోనే తుంచేయడానికి, కాంగ్రెసు, ప్రజలను విడదీయటానికి ఆంగ్లేయులు ఈ పన్నాగం పన్నారని భారతీయులు భావించారు. బెంగాల్ విభజనకు వ్యతిరేకంగా భారతీయులు ప్రారంభించిన ఉద్యమాన్ని వందేమాతరం ఉద్యమం అంటారు. దీనిని స్వదేశీ ఉద్యమం అని కూడా అంటారు.

వందేమాతరం ఉద్యమం: వందేమాతరం ఉద్యమం కాంగ్రెస్ నేతృత్వంలో జరిగిన మొట్టమొదటి ప్రజాఉద్యమం. బంకించంద్రుని ‘ఆనందమఠ్’ నవలలోని ‘వందేమాతరం’ గేయం ఉద్యమకారులకు స్ఫూర్తినిచ్చింది. అందువల్ల దీనిని వందేమాతర ఉద్యమం అన్నారు. ఉద్యమం బెంగాల్కు మాత్రమే పరిమితం కాక, దేశవ్యాప్తమైంది. మొదట్లో ఈ ఉద్యమం సురేంద్రనాథ్ బెనర్జీ వంటి మితవాదుల నేతృత్వంలో జరిగినా క్రమంగా అతివాద, తీవ్రవాద నాయకత్వానికి మరలింది.

బహిష్కరణోద్యమం: ఉద్యమంలో భాగంగా విదేశీ వస్తు బహిష్కరణ, బ్రిటీషు యాజమాన్యంలో ఉన్న విద్యాలయాలను బహిష్కరించటం దేశవ్యాప్తంగా జరిగాయి. విదేశీ వస్త్రాలను ఉద్యమకారులు కుప్పలు కుప్పలుగా పోసి తగులబెట్టారు. ఉద్యమంలో హిందువులు, మహమ్మదీయులు ఐక్యతతో పాల్గొన్నారు.

స్వదేశీ ఉద్యమం: ఈ కాలంలో ఉద్యమకారులు స్వదేశీ ఉద్యమాన్ని కూడా నడిపారు. స్వదేశీ వస్తువులకు ఆదరణ లభించింది. స్వదేశీ భావన అన్ని రంగాలకు వ్యాపించింది. విద్య, సంస్కృతి, వ్యాపారం, పరిశ్రమలు తదితర రంగాలలో స్వదేశీ భావం ప్రజ్వరిల్లింది.

నిర్మాణాత్మక కార్యక్రమం: స్వదేశీ, బహిష్కరణోద్యమాలతో పాటు ప్రజలు నిర్మాణాత్మక కార్యక్రమాలు కూడా చేపట్టారు. స్వదేశీ పరిశ్రమలను, స్వదేశీ విద్యాలయాలను స్థాపించారు.

ప్రభుత్వ దమన నీతి: ఈ ఉద్యమాన్ని అణచటానికి ప్రభుత్వం దమననీతిని సాగించింది. విద్యార్థులను లాఠీలతో కొట్టించింది. అనేకమంది నాయకులను ఎటువంటి విచారణ లేకుండా జైలులో పెట్టించింది. వందేమాతరం నినాదాలు చేయటం, జెండాలను ధరించటం, ఊరేగింపులను జరపటాన్ని నిషేధించింది. పత్రికా స్వాతంత్ర్యాన్ని కాలరాసింది. కర్జన్ తరువాత వచ్చిన వైస్రాయ్ లార్డ్ మింటో దేశద్రోహ చట్టాన్ని, విస్ఫోటక పదార్థాల చట్టాన్ని, భారతీయ పత్రికా చట్టాన్ని మొదలైన వానిని చేసి ప్రజల హక్కులను అణగద్రొక్కాడు. తిలక్కు 6 సంవత్సరాల కఠిన కారాగారశిక్ష విధించబడింది. అరవింద ఘోష్ అలీపూర్ బాంబు కేసులో ఇరికించబడ్డాడు. సురేంద్రనాథ్ బెనర్జీ, గాడిచర్ల హరి సర్వోత్తమరావులు నిర్బంధించబడ్డారు. పైగా బ్రిటిష్ ప్రభుత్వం మహమ్మదీయులను హిందువులకు వ్యతిరేకంగా రెచ్చగొట్టింది.

విప్లవోద్యమం: ప్రభుత్వం అనుసరించిన దమననీతికి వ్యతిరేకంగా బ్రిటిష్ అధికారులను హత్యచేయడానికి కొందరు యువకులు రహస్య సంఘాలుగా ఏర్పడ్డారు. భూపేంద్రనాథ్ దత్, వి.డి. సావర్కర్, ఖుదీరామ్ బోస్ మొదలైనవారు వీరిలో ప్రముఖులు. ప్రభుత్వం ఖుదీరామ్ బోస్కు కింగ్స్ ఫోర్డ్ప హత్యాప్రయత్నం చేసినందుకు మరణశిక్ష విధించింది. ఈ ఉద్యమం బ్రిటిష్ అధికారులను భయభ్రాంతులను చేసింది. భారతీయులను తృప్తిపరచటానికి, మితవాదులను, అతివాదులను విడదీయడానికి, హిందూ, మహమ్మదీయుల మధ్య స్పర్ధలు సృష్టించటానికి బ్రిటిష్ ప్రభుత్వం 1909 భారతీయ కౌన్సిల్స్ చట్టాన్ని చేసింది. అయినా ఈ ఉద్యమం కొనసాగింది.

బెంగాల్ విభజన రద్దు: లార్డ్ మింటో స్థానంలో వైస్రాయ్ గా వచ్చిన లార్డ్ హార్డింజ్ ఉద్యమ తీవ్రతను అర్థం చేసుకొన్నాడు. బెంగాల్ విభజన రద్దుచేయాలని, అస్సాంను ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పరచాలని బీహార్, ఛోటా నాగపూర్, ఒరిస్సాలను ఒక ప్రత్యేక రాష్ట్రంగా చేయాలని, రాజధానిని కలకత్తా నుంచి ఢిల్లీకి మార్చాలని ప్రతిపాదించాడు. ఈ ప్రతిపాదనలను బ్రిటిష్ ప్రభుత్వం ఆమోదించగానే 1911లో బెంగాల్ విభజన రద్దయింది.

ఫలితాలు: బెంగాల్ విభజన కొన్ని ముఖ్య ఫలితాలనిచ్చింది.

  1. కేవలం నిరసనలు, ప్రదర్శనలు, తీర్మానాలు ఏవిధంగాను పనికిరావని, తీవ్రమైన చర్యలు అవసరమని కాంగ్రెస్ భావించింది. తీర్మానాలకు మద్దతుగా ప్రజాశక్తి తోడైతేగాని సమస్యలు పరిష్కారం కావని ప్రజలు భావించారు.
  2. బెంగాల్ విభజనకు వ్యతిరేకంగా వందేమాతరం ఉద్యమం రూపుదిద్దుకుంది.
  3. భారత జాతీయ కాంగ్రెస్ “స్వరాజ్యం” కావాలని కోరింది.
  4. విదేశీ వస్తువుల బహిష్కరణ, స్వదేశీ వస్తువుల ప్రోత్సాహం మంచి ఊపునందుకున్నాయి. దీనితో భారతీయ పరిశ్రమలు బాగా లబ్దిపొందాయి.
  5. ఈ ఉద్యమం సాంస్కృతిక కార్యకలాపాలను కూడా ప్రభావితం చేసింది. జాతీయ కవిత ఈ కాలంలో పెల్లుబుకింది. రవీంద్రనాథ్ ఠాగూర్, బంకించంద్ర ఛటర్జీ మొదలైన వారి రచనలను ప్రభావితం చేశాయి. జాతీయవిద్యకు ప్రోత్సాహం లభించింది.
  6. జాతీయోద్యమం తీవ్రతరమైంది. అతివాదులు శాంతియుత ప్రతిఘటనోద్యమాన్ని కూడా చేపట్టారు. ప్రజలు ప్రభుత్వంతో సహకరించడానికి నిరాకరించడం ఇందులోని ప్రధానాంశం.
  7. ఉగ్రవాదం చోటుచేసుకుంది. ఉగ్రవాదులు ఐరిష్ ఉగ్రవాదులు, రష్యన్ నిహిలిస్టుల విధానాలను అనుసరించి బ్రిటీషు ఉద్యోగులను చంపటానికి పూనుకొన్నారు.
  8. బెంగాల్ విభజనను వ్యతిరేకిస్తూ కొనసాగిన తీవ్ర ఉద్యమం భారత జాతీయ కాంగ్రెస్ లో తీవ్ర భేదాభిప్రాయాలకు దారితీసింది. అతివాదులు, మితవాదులు అను రెండు వర్గాలుగా కాంగ్రెస్ చీలిపోయింది.

AP Inter 1st Year History Study Material Chapter 12 భారత జాతీయోద్యమం

ప్రశ్న 3.
సహాయ నిరాకరణ ఉద్యమాన్ని వివరించండి.
జవాబు:
గాంధీ నాయకత్వంలో జాతీయ కాంగ్రెస్ నిర్వహించిన ఉద్యమాల్లో మొదటిది సహాయ నిరాకరణోద్యమం. ఖిలాపత్ ఉద్యమ సందర్భంగా వ్యక్తమైన హిందూ, ముస్లిం సంఘీభావం గాంధీని సహాయ నిరాకరణోద్యమానికి పురికొల్పింది. 1920 సెప్టెంబరులో కలకత్తాలో లాలాలజపతిరాయ్ అధ్యక్షతన జరిగిన ప్రత్యేక సమావేశంలో గాంధీ సహాయ నిరాకరణ ఉద్యమ తీర్మానాన్ని ప్రవేశపెట్టాడు. తీర్మానం ఆమోదించడమైంది. 1920 డిసెంబర్ విజయరాఘవాచారి అధ్యక్షతన నాగపూర్లో జరిగిన కాంగ్రెస్ వార్షిక సమావేశంలో దాన్ని ధృవీకరించడమైంది. రెండు సమావేశాల్లోనూ బెంగాల్ నాయకుడు చిత్తరంజన్ దాస్ నుంచి కొంత వ్యతిరేకత వచ్చింది. దాస్ సూచనలను కూడా తీర్మానంలో చేర్చడం ద్వారా గాంధీ ఆయనను సమ్మతింపచేశాడు.

ఉద్యమ కార్యక్రమం: ఈ ఉద్యమానికి మూడు అంశాల కార్యక్రమం కలదు. అవి: బహిష్కరణ, నిర్మాణాత్మక కార్యక్రమాలు, శాసనోల్లంఘనం.
బహిష్కరణ:

  1. ప్రభుత్వం ఇచ్చిన బిరుదులు, పదవులను త్యజించడం.
  2. ప్రభుత్వం ఏర్పాటు చేసే సన్మానాలు, తదితర కార్యక్రమాలను బహిష్కరించడం.
  3. విద్యార్థులు ప్రభుత్వ విద్యాలయాలను బహిష్కరించడం.
  4. ప్రభుత్వోద్యోగాలకు రాజీనామా చేయడం.
  5. ప్రభుత్వ న్యాయస్థానాలను బహిష్కరించడం. 6) విదేశీ వస్త్రాలను, వస్తువులను బహిష్కరించడం.
  6. శాసనసభలకు జరిగే ఎన్నికలను బహిష్కరించడం.
  7. 1921లో ఇంగ్లాండ్ దేశపు యువరాజు పర్యటన బహిష్కరించడం మొదలైనవి బహిష్కరణోద్యమంలో ముఖ్యమైనవి.

నిర్మాణాత్మక కార్యక్రమాలు:

  1. తిలక్ స్మారక నిధికి విరాళాలు వసూలు చేయడం.
  2. రాట్నాలపై నూలు వడికి, ఖద్దరు వస్త్రాలు తయారుచేయడం.
  3. అస్పృశ్యతను నిర్మూలించడం.
  4. మద్యపాన నిషేధానికి అనుకూలంగా ఉద్యమం నడపడం.
  5. జాతీయ విద్యాలయాలు నెలకొల్పడం.
  6. హిందూ, ముస్లిం సమైక్యతను సాధించడం అనేవి నిర్మాణాత్మక కార్యక్రమాలు.

శాసనోల్లంఘనం: పన్నులు చెల్లించటం, నిరాకరించటం ద్వారా కాంగ్రెస్ శాసనోల్లంఘనాన్ని చేపట్టాలని నిర్ణయించింది.
ఉద్యమ గమనం 1920లో ప్రారంభించిన ఈ ఉద్యమంలో ప్రజలు తమ విభేదాలను మరిచి చురుకుగా పాల్గొన్నారు. బ్రిటిష్ విద్యాసంస్థలను బహిష్కరించి జాతీయ విద్యాసంస్థలను నెలకొల్పారు. నెహ్రూ, చిత్తరంజన్ దాస్, ప్రకాశం పంతులు మొదలైన నాయకులు న్యాయస్థానాలను బహిష్కరించి న్యాయవాద వృత్తిని త్యజించారు. సుభాష్ చంద్రబోస్ మొదలైనవారు తమ ప్రభుత్వ పదవులకు రాజీనామా చేశారు. ప్రజలు విదేశీ వస్తువులను బహిష్కరించి ఖద్దరు వాడకాన్ని ప్రోత్సహించారు. హిందువుల ఐక్యతను పెంపొందించటానికి అస్పృశ్యతా నివారణను చేపట్టారు.

ఈ ఉద్యమం ఆంధ్రాలో అద్భుత విజయాన్ని సాధించింది. చీరాల-పేరాల సత్యాగ్రహం, పెదనందిపాడు పన్నుల నిరాకరణోద్యమం, పల్నాడు పుల్లరి సత్యాగ్రహాలు జరిగాయి. పంజాబ్లో అకాలీలు మహంతులకు వ్యతిరేకంగా ఉద్యమాన్ని నిర్వహించారు. భారతదేశ సందర్శనానికి వచ్చిన వేల్స్ యువరాజు బహిష్కరించబడ్డాడు. ఈ ఉద్యమాన్ని అణచడానికి ప్రభుత్వం దమనకాండను సాగించింది. అయినప్పటికి ఉద్యమాన్ని ఉధృతం చేయాలని కాంగ్రెస్ నిర్ణయించింది. ఇంతలోనే ఉత్తరప్రదేశ్లోని చౌరీచౌరా అనేచోట హింస చెలరేగి అది అనేకమంది పోలీసులు సజీవదహనానికి దారితీసింది. హింసను సహించలేని గాంధీజీ ప్రజలు ఇంకా అహింసా పద్ధతులకు అలవాటుపడలేదని భావించి ఉద్యమాన్ని నిలుపు చేశాడు.

ఫలితాలు: సహాయ నిరాకరణోద్యమం అనేక గొప్ప ఫలితాలనిచ్చింది.

  1. భారత ప్రజలలోను, కాంగ్రెస్ నాయకులలోను నిరాశ ఏర్పడింది. దీని ఫలితంగా కాంగ్రెస్లోలో చీలిక వచ్చింది.
  2. ఉద్యమ కాలంలో హిందూ-మహమ్మదీయుల ఐక్యత సాధించబడింది.
  3. ఈ ఉద్యమ ప్రభావం వల్ల జాతీయభావం దేశం నలుమూలలా విస్తరించింది.
  4. ప్రజలలో ప్రభుత్వమంటే భయంపోయి వారిలో ఆత్మవిశ్వాసం పెరిగింది.
  5. కాంగ్రెస్లో వామపక్ష ధోరణులు ప్రారంభమైనాయి.
  6. ప్రభుత్వం దమననీతిని ఎదుర్కొనేందుకు భారతీయ యువత విప్లవోద్యమానికి దిగింది.
  7. ఈ ఉద్యమ విరమణ అనంతరం కాంగ్రెస్-లీగ్ మిత్రత్వం రద్దయింది. ఫలితంగా హిందువులు, ముస్లింల మధ్య మత కల్లోలాలు చెలరేగాయి.

ప్రశ్న 4.
భారత స్వాతంత్ర్య పోరాటంలో గాంధీజీ పాత్రను విశ్లేషించండి.
జవాబు:
భారత జాతీయోద్యమ చరిత్రలో గాంధీజీ నిర్వహించిన పాత్ర అద్వితీయమైనది. తన నాయకత్వ పటిమతో ఆయన భారత జాతీయ శక్తులను ఏకం చేసి, వాటిని ఒక త్రాటిపై నడిపించిన ఘనుడు. 1919 నుంచి 1947 వరకు గల కాలంలో స్వాతంత్ర్యోద్యమానికి తానే స్ఫూర్తిగా మారిన మహామనిషి, అందువలననే 1919 నుండి 1947 వరకు గల కాలాన్ని “గాంధీ యుగం” అని పిలుస్తారు.

తొలి జీవితం: గాంధీజీ పూర్తిపేరు మోహన్దాస్ కరంచంద్ గాంధీ. ఆయన 1869 అక్టోబరు 2వ తారీఖున సౌరాష్ట్రలోని పోర్బందరులో జన్మించాడు. తన 19వ ఏట ఉన్నత విద్యకై లండన్ వెళ్ళి న్యాయవాద పట్టా పుచ్చుకొని మాతృదేశానికి వచ్చి రాజకోట, బొంబాయిలో న్యాయవాద వృత్తిని చేపట్టాడు. తరువాత రాజకీయాలలో ప్రవేశించాడు.
గాంధీజీ సిద్ధాంతాలు: స్వాతంత్య్ర సముపార్జనకై గాంధీజీ చేపట్టిన రెండు ఆయుధాలలో ఒకటి సత్యాగ్రహం, రెండు అహింస. ‘సత్యాగ్రహం అనగా సత్యమునకు కట్టుబడి ఉండటం అని అర్థం. సత్యాగ్రహము ఐదు విధాలు. అవి:

1) సహాయ నిరాకరణ: శాంతియుత సహాయ నిరాకరణ ద్వారా ఎటువంటి శక్తివంతమైన ప్రభుత్వాన్నైనా పడగొట్టవచ్చు. శాంతియుత ప్రతిఘటన ద్వారా హర్తాళ్ పాటించి, ప్రభుత్వం దమననీతిపై పోరాటం సాగించాలి. మన కోరికలు స్వచ్ఛమైనవిగాను, సమంజసమైనవిగాను ఉండాలి.

2) నిరాహారదీక్ష: ఇతర పద్ధతులు విఫలమైనప్పుడే దీనిని చేపట్టాలి.

3) హిజరత్: హింసాపూరిత వాతావరణంలో ఇమడలేని వ్యక్తులు తమంతట తాముగా ఇతరులకు దూరంగా ఉండాలి.

4) బహిష్కరణ: అన్నిరకాల చెడుకు వ్యతిరేకంగా చేపట్టే నిరాకరణ. ఒక వ్యక్తిని ఆ పనిని చేయకుండా నిరోధించటానికి చేపట్టే శాంతియుత పికెటింగ్. దీనిలో హింసకు తావులేదు.

5) శాసనోల్లంఘనం: ఈ చర్యను చేపట్టే ముందు చర్చలు, ప్రదర్శనలు జరిపి విఫలమైనప్పుడు మాత్రమే శాంతియుత ప్రతిఘటన చేపట్టాలి. ప్రతి చట్టాన్ని ఉల్లంఘించాలి.

అహింస: అహింసా పరమోధర్మః అన్నారు మనవారు. దానినే గాంధీజీ తన ఆయుధంగా స్వీకరించాడు. బౌద్ధ, జైనమతాలు, అశోక చక్రవర్తి ఈ విషయంలో గాంధీజీకి మార్గదర్శకులు. గాంధీజీకి ‘హింస’ అంటే పడదు. మాటల ” ద్వారాగాని, చేత ద్వారాగాని, ఆలోచనల ద్వారా గాని ఎవ్వరికీ హాని కలిగించకూడదన్నది ఆయన సిద్ధాంతం. దీనిలో మూడు రకాల వారున్నారు. మొదటిది అహింసను ఒక సిద్ధాంతంగా నమ్మి ఆచరించే ధైర్యవంతులు, రెండవది అహింసను ఒక విధానంగా చేపట్టేవారు, మూడవది భయస్తులు చేపట్టే అహింసా విధానం. దీనిని గాంధీజీ నిరసించాడు. అవమానాలపాలై, పిరికితనంతో విదేశీ పాలకులకు లొంగి ఉండటం కంటే భారతదేశం తన గౌరవాన్ని తిరిగి పొందటానికి అవసరమైతే ఆయుధాలు చేపట్టవచ్చునని కూడా ఆయన ఉద్బోధించాడు.

AP Inter 1st Year History Study Material Chapter 12 భారత జాతీయోద్యమం

దక్షిణాఫ్రికా వెళ్లటం: గాంధీజీ 1893లో ఒక కేసు విచారణ నిమిత్తం దక్షిణాఫ్రికా వెళ్లాడు. అచ్చట భారతీయుల దయనీయ పరిస్థితులు చూసి బాధాతప్తుడై వారి హక్కుల పరిరక్షణకై సత్యాగ్రహం, సహాయ నిరాకరణోద్యమ సాధనాలు ప్రవేశపెట్టి విజయాన్ని సాధించాడు.

భారత రాజకీయాలలో పాల్గొనుట: గాంధీజీ దక్షిణాఫ్రికా నుండి 1915లో భారతదేశానికి తిరిగివచ్చి సబర్మతీ ఆశ్రమాన్ని స్థాపించాడు. బీహార్లోని చంపారన్ రైతులకు నాయకత్వం వహించి ఆంగ్లో-ఇండియన్ తోట యజమానుల బారినుండి వారిని రక్షించి ప్రఖ్యాతిగాంచాడు. అహ్మదాబాద్ మిల్లు యజమానులబారి నుండి కార్మికులను సంరక్షించి వారి ఉద్యమాన్ని విజయవంతం చేశాడు. గుజరాత్లో కరువు సంభవించినపుడు రైతులను ఋణబాధల నుండి, పన్ను చెల్లింపులనుండి విముక్తి గావించుటకు ‘కైరా’ సత్యాగ్రహాన్ని నిర్వహించి విజయాన్ని సాధించాడు. రౌలట్ శాసనము, జలియన్ వాలాబాగ్ మారణహోమం, గాంధీజీలో నూతన మార్పులు తెచ్చాయి. తిలక్ మరణానంతరం గాంధీజీ జాతీయోద్యమానికి నాయకత్వం వహించి జాతీయోద్యమాన్ని దిగ్విజయంగా నడిపాడు.

జాతీయోద్యమంలో గాంధీజీ నిర్వహించిన పాత్ర: గాంధీజీ జాతీయోద్యమ చరిత్రలో నిర్వహించిన పాత్ర చిరస్మరణీయం. జాతీయోద్యమ చరిత్రలో 1919 నుండి 1947 వరకు గల కాలాన్ని “గాంధీయుగం’ అంటారు.

ఎ) సహాయ నిరాకరణోద్యమం: గాంధీజీ 1920లో జాతీయ కాంగ్రెస్ నాగపూర్ సమావేశంలో శాంతియుత మార్గాల ద్వారా స్వాతంత్య్ర సముపార్జన కాంగ్రెస్ ధ్యేయమని ప్రకటించాడు. దీనిని సాధించటానికి 1920లో సహాయ నిరాకరణోద్యమాన్ని ప్రారంభించాడు. ఈ ఉద్యమం దేశవ్యాప్తమై గాంధీజీ పేరు ప్రఖ్యాతులు పొందాడు. కానీ ఈ ఉద్యమం ‘చౌరీచౌరా’ సంఘటన ద్వారా విప్లవ ధోరణిలో ప్రయాణించుటచేత ప్రజలు శాంతియుత వైఖరికి సుముఖముగా లేరని ఉద్యమాన్ని నిలుపుదల చేసి పలు విమర్శలకు గురైనాడు. గాంధీజీ కారాగార శిక్షను అనుభవించాడు.

బి) శాసనోల్లంఘన ఉద్యమం: సంపూర్ణ స్వరాజ్య సాధనకు గాంధీజీ 1930లో “శాసనోల్లంఘనోద్యమము” ను ప్రారంభించాడు. నాటి ప్రభుత్వం ఉప్పుపై పన్నును విధించగా అది న్యాయసమ్మతం కాదని ఆ చట్టాన్ని ఉల్లంఘించి దండి గ్రామంలో ఉప్పు సత్యాగ్రహం జరిపి ఉప్పును తయారుచేశాడు. ఇదే జాతీయోద్యమ చరిత్రలో “దండి ఉప్పు సత్యాగ్రహం”గా పేరొందింది.

సి) రౌండేబుల్ సమావేశాలు: గాంధీజీ లండన్ లో జరిగిన మొదటి రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరు కాలేదు. తదుపరి వైస్రాయ్ ఇర్విన్తో ఒడంబడిక చేసుకొని రెండవ రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరయ్యాడు. జిన్నా వైఖరి వల్ల ఈ సమావేశం విఫలమైంది. మూడవ సమావేశానికి కాంగ్రెస్ హాజరు కాలేదు.

డి) పూనా ఒడంబడిక: బ్రిటిష్ ప్రధాని ‘మెక్ డోనాల్డ్’ భారతదేశంలో హరిజనులకు, క్రైస్తవులకు నియోజకవర్గ సౌకర్యాలను కల్పిస్తూ “కమ్యూనల్ అవార్డ్”ను ప్రకటించాడు. ఇది జాతీయ సమైక్యతకు హానియని గాంధీజీ బ్రిటిష్ పాలకుల వైఖరికి నిరసనగా ఆమరణ నిరాహారదీక్ష ప్రారంభించాడు. చివరకు నిమ్నజాతుల నాయకుడైన డా. అంబేద్కర్ కృషి వల్ల “పూనా ఒప్పందం” జరిగి గాంధీజీ ఆమరణ నిరాహారదీక్ష విరమించాడు.

ఇ) క్విట్ ఇండియా ఉద్యమం: 1942లో క్రిప్స్ రాయబారాన్ని తోసిపుచ్చి 1942 ఆగస్టు 8వ తారీఖున ఆంగ్లేయులు భారతదేశం నుండి వెళ్ళిపోవాలని “క్విట్ ఇండియా ఉద్యమాన్ని ప్రారంభించాడు.

యఫ్) స్వాతంత్ర్య సముపార్జన: గాంధీజీ నడిపిన శాంతియుత ఉద్యమాలను అణచటంలో బ్రిటిష్ పాలకులు వైఫల్యం చెంది 1947 ఆగస్టు 15న భారతదేశానికి స్వాతంత్ర్యాన్ని ఇచ్చారు. ఈ విధంగా విదేశీయ పాలనలో దాస్యమును అనుభవించిన భారతదేశం గాంధీజీ నేతృత్వంలో స్వాతంత్ర్యము పొందింది.

ప్రశ్న 5.
క్రిప్స్ మిషన్ ప్రతిపాదనలను, దాని వైఫల్యానికి కారణాలు వివరించండి.
జవాబు:
1941 డిసెంబర్లో జపాన్ రెండవ ప్రపంచ యుద్ధంలో పాల్గొన్నది. బ్రిటిష్ సామ్రాజ్య భాగాలైన సింగపూర్, బర్మాలను జపాన్ ఆక్రమించినది. జపాన్ సేన పురోగతిని ప్రతిఘటించడానికి భారతీయుల సహకారం అవసరమని బ్రిటిష్ ప్రభుత్వం భావించినది. అందుకుగాను సర్ఫర్డ్ క్రిప్స్న 1942లో భారతదేశం పంపినది. ఆయన భారతీయ నాయకులతో సంప్రదింపులు జరిపారు. ఆయన చేసిన ప్రతిపాదనలను రెండు భాగాలుగా విభజించవచ్చు. అవి: 1. దీర్ఘకాలిక ప్రతిపాదనలు లేదా యుద్ధానంతరం చేయతలపెట్టిన మార్పులు 2. తక్షణం చేయదగిన మార్పులు లేదా యుద్ధకాలానికి సంబంధించిన ప్రతిపాదనలు.
1. దీర్ఘకాలిక ప్రతిపాదనలు లేదా యుద్ధానంతరం చేయతలపెట్టిన మార్పులు:

  • యుద్ధానంతరము భారతదేశానికి డొమినియన్ ప్రతిపత్తి ఇవ్వబడుతుందని బ్రిటిష్ ప్రభుత్వం ప్రతిపాదించింది. భారతదేశానికి కామన్వెల్త్ నుండి వైదొలగే హక్కు కూడా ఉంటుంది.
  • యుద్ధం ముగిసిన తరువాత భారతదేశానికి ఒక నూతన రాజ్యాంగాన్ని రచించడానికిగాను రాజ్యాంగ పరిషత్ నెలకొల్పబడగలదు.
  • రాజ్యాంగ పరిషత్లో నైష్పత్తిక ప్రాతినిధ్య ప్రాతిపదికపై రాష్ట్ర శాసనసభల సభ్యులచే ఎన్నుకోబడిన సభ్యులు, స్వదేశీ సంస్థానాల జనాభా నిష్పత్తిని బట్టి సంస్థానాధిపతులు నియమించు సభ్యులుండగలరు.

i) కొత్త రాజ్యాంగాన్ని ఆమోదించడానికి సిద్ధపడని రాష్ట్రాలు లేదా రాష్ట్రం వేరే యూనియన్ ఏర్పడడానికి హక్కులుండవలెను. స్వదేశీ సంస్థానాలకు కూడా అట్లే నూతన రాజ్యాంగానికి కట్టుబడి ఉండడానికి, లేకపోవటానికి స్వేచ్ఛ ఉండగలదు.

ii) బ్రిటిష్ ప్రభుత్వం పూర్తి అధికారాన్ని బదిలీ చేయటం వలన ఉత్పన్నమయ్యే విషయాలను చర్చించటానికి రాజ్యాంగ పరిషత్, బ్రిటిష్ ప్రభుత్వం మధ్య ఒక ఒడంబడిక కుదరవలెను.

2. తక్షణం చేయతగిన మార్పులు లేదా యుద్ధకాలానికి సంబంధించిన ప్రతిపాదనలు: తాత్కాలికంగా “రక్షణ” విషయాలపై బ్రిటిష్ ప్రభుత్వ నియంత్రణ ఉండగలదు. కాని భారతదేశ నైతిక, సైనిక, భౌతిక వనరులను సమీకరించే బాధ్యత భారత ప్రభుత్వానిదనీ, అందుకు భారత నాయకులు సలహా, సహకారములు అందించగలదని భావించబడినది.

క్రిప్స్ ప్రతిపాదనల మంచి, చెడ్డలు: క్రిప్స్ ప్రతిపాదనలు (1942) భారతదేశంలోని భిన్న రాజకీయ పక్షాలను సంతృప్తిపరచడానికి ఉద్దేశించినట్టివి. ఈ ప్రతిపాదనలు కాంగ్రెస్ డొమినియన్ ప్రతిపత్తి, రాజ్యాంగ పరిషత్, బ్రిటిష్ కామన్వెల్త్ నుండి విడిపోయే హక్కు మొదలైన ఆశలు చూపెట్టినవి. లీగ్ కోరికయైన పాకిస్తాన్ గుర్తింపు ఈ ప్రతిపాదనలో నిబిడీకృతమై ఉన్న స్వదేశ సంస్థానాధీపతులకు నూతన రాజ్యాంగమును ఆమోదించటానికి లేదా తిరస్కరించడానికి స్వేచ్ఛగలదని ఈ ప్రతిపాదనలో హామీగలదు. అల్పసంఖ్యాకుల భయాలు కూడా అనేక పరిరక్షణల ద్వారా నివృత్తి చేయబడినాయి. ఈ ప్రతిపాదన ఆగస్ట్ ప్రతిపాదనకన్నా మెరుగైనదని చెప్పవచ్చు.

AP Inter 1st Year History Study Material Chapter 12 భారత జాతీయోద్యమం

పూర్తి డొమినియన్ ప్రతిపత్తితో నూతన భారత యూనియన్ ఏర్పాటు చేయబడగలదనటం, కామన్వెల్త్ నుంచి విడిపోయే హక్కుండటం ప్రోత్సాహక విషయాలే కాని కాంగ్రెస్కు పూర్తి స్వాతంత్ర్య ప్రకటన మినహా మిగిలిన విషయాలేవీ సమ్మతం కావు. డొమినియన్ ప్రతిపత్తి ఎంతకాలములోపు ఇవ్వబడగలదో నిర్ధారణ చేయలేదు.

కాంగ్రెస్ కోరికను మన్నించడం కోసం యుద్ధం తరువాత రాజ్యాంగ పరిషత్ ఏర్పాటు చేయగలదని ప్రతిపాదన కలదు. రాజ్యాంగ పరిషత్ నిర్మాణ సంబంధమైన పథకం సవ్యమైనది కాదు. ఉదా: స్వదేశ సంస్థానాల ప్రజలకు రాజ్యాంగ పరిషత్ ప్రతినిధుల ఎంపిక విషయాలలో ప్రమేయం ఉండదు. బ్రిటిష్ రాష్ట్రాల ప్రతినిధులు ఆయా రాష్ట్రాలు జనాభా ప్రాతిపదికపై నిర్ణయించబడగలదు. పైగా స్వదేశ సంస్థానాధిపతుల ప్రతినిధులు రాజ్యాంగ పరిషత్లో ఉండటం అనేది భారత ప్రగతికి అవరోధమే.

నూతన రాజ్యాంగం ప్రకారం భారత యూనియన్ నుంచి బ్రిటిష్ రాష్ట్రాలకు, స్వదేశ సంస్థానాలకు విడిపోవటానికి హక్కు ఉండగలదనటం ఈ ప్రతిపాదనలో అతి ప్రమాదకరమైన భాగం. అంటే లీగ్ కోరికయైన పాకిస్తాన్ ఏర్పాటుకు బ్రిటిష్వారు సమ్మతించినట్లు అయినది. ఇది భారత యూనియన్ ఐక్యతకు గొడ్డలిపెట్టుకాగలదు.

వైస్రాయి కార్యనిర్వహణ మండలి సభ్యుల సంఖ్య మరికొందరు భారతీయ ప్రతినిధులతో విస్తృతపరచబడగలదని ఈ ప్రతిపాదనలో కలదు. కార్యనిర్వహణ మండలిగాని, దాని సభ్యులుగాని ఎలాంటి వాస్తవాధికారాన్ని చెలాయించలేరు. అధికారాలన్నీ వైస్రాయి చేతిలోనే కేంద్రీకరించబడగలవు. వివిధ రాజకీయ పక్షాల ప్రాతినిధ్యంతో జాతీయ ప్రభుత్వం ఏర్పాటు కావలెనని, దాని రాజ్యాంగబద్ధ అధిపతిగా మాత్రమే వైస్రాయి ఉండవలెననేది భారతీయల కోరిక. ఇట్టి – పరిస్థితులలో క్రిప్స్ ప్రతిపాదనలు భారతీయులకు ఆమోదయోగ్యం కాలేదు.

ప్రతిపాదనల తిరస్కృతి: విభిన్న కారణాలతో దాదాపు భారత రాజకీయ పార్టీలన్నీ ప్రతిపాదనలను తిరస్కరించినాయి. ఈ ప్రతిపాదనలలో భారతదేశ విభజనకు బ్రిటిష్వారు విషబీజాలు నాటారని కాంగ్రెస్ అభిప్రాయపడింది. రక్షణ సమస్య సంబంధంగా క్రిప్స్ కాంగ్రెస్ ఒక అంగీకారానికి రాలేకపోయింది. సంప్రదింపులు విఫలమైనాయి. అత్యవసర పరిస్థితిలో జాతీయ ప్రభుత్వం ఏర్పడవలెనని కాంగ్రెస్ చెప్పినది. రక్షణ విషయాలు కూడా జాతీయ ప్రభుత్వానికి అప్పగించవలెనని కాంగ్రెస్ కోరింది. కాని క్రిప్స్ ఈ కోర్కెలను తిరస్కరించినాడు. భారతీయులకు రక్షణ శాఖను బదిలీ చేయుటకు ఆయన ఇష్టపడలేదు. ‘ఇట్టి ఆపత్సమయములో కూడా బ్రిటిష్వారి మౌలిక వైఖరిలో మార్పులేదని భారతీయులు భావించారు. తత్ఫలితంగా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ క్రిప్స్ ప్రతిపాదనను ఆమోదించలేకపోయింది.

ప్రతిపాదనలలో ఇమిడియున్న పాకిస్తాన్ గుర్తింపును ముస్లింలీగ్ హర్షించినప్పటికీ దాని ఏర్పాటు గూర్చి స్పష్టీకరణ లేకపోయేసరికి విమర్శించింది. మిగిలిన రాజకీయ పక్షాలు కూడా క్రిప్స్ ప్రతిపాదనపట్ల తమ అసంతృప్తిని వెల్లడించినాయి. క్రిప్స్ ప్రతిపాదనల వైఫల్యమునకు కారణములు:

1) క్రిప్స్ రాయబారం విఫలమగుటకు ప్రధాన కారణం ప్రతిపాదనల అసమగ్రతయే. భారతీయుల దృష్టిలో ఈ ప్రతిపాదనలోని తాత్కాలిక, దీర్ఘకాలిక అంశాలు అసంతృప్తికరమైనవి. దీర్ఘకాలిక అంశమైన డొమినియన్ ప్రతిపత్తి, భారతీయుల ఆసక్తిని ఆకర్షించలేకపోయింది. తాత్కాలిక ప్రతిపాదనలు కూడా అస్పష్టము, అసంతృప్తికరములే. ప్రతిపాదనల ముసాయిదా ప్రకటన కూడా ప్రస్తుతము కన్నా భవిష్యత్తుపై నొక్కి చెప్పినది. అవి మొత్తంగా ఆమోదింపబడటమో, |తిరస్కరించటమో చేయవలెను. సవరణలకు అవకాశం లేదు. ఇన్ని లోపాలు గల ప్రతిపాదనలు సఫలమగుట |అనుమానాస్పదమే. కాంగ్రెస్, లీగ్, సిక్కులు, హిందూ మహాసభవారు ఈ ప్రతిపాదనలను తిరస్కరించారు.

2) క్రిప్స్ రాయబారం వైఫల్యానికి బ్రిటిష్ అధికారుల స్వార్థం కూడా దోహదపడింది. బ్రిటిష్ మంత్రివర్గం, భారత ప్రభుత్వం భారతీయులకు అధికారాన్ని అప్పగించుటకు ఇష్టపడలేదు. బ్రిటిష్ ప్రధాని చర్చిల్ క్రిప్స్క పూర్తి సహకారాన్ని ఇవ్వలేదు.

3) భారతదేశంలో అప్పుడు అనుకూల వాతారవణం కూడా లేదు. బ్రిటిష్ వారి వైఖరిపట్ల భారతీయులకు విశ్వాసం లేదు.

4) రక్షణశాఖ సమస్య విషయమై క్రిప్స్, కాంగ్రెస్ల మధ్య సంప్రదింపులు విఫలమైనాయి. యుద్ధం కొనసాగినంత కాలం రక్షణశాఖ బ్రిటిష్ వారి ఆధీనంలో ఉండాలని క్రిప్స్ అభిప్రాయం. ఇందుకు జాతీయ కాంగ్రెస్ అంగీకరించలేదు. ఈ ప్రతిపాదనలను గాంధీజీ మొదటి నుండి వ్యతిరేకించెను. కనుకనే ఆయన ఈ ప్రతిపాదనలను “దివాలా తీయు బ్యాంకు మీద రాబోయే తేదీ వేసి ఇచ్చిన చెక్కు” అని అభివర్ణించెను. (“A post dated cheque on a withering Bank” -Gandhiji).

ప్రశ్న 6.
శాసనోల్లంఘన ఉద్యమానికి దారితీసిన కారణాలను, సంఘటనలను పేర్కొనండి.
జవాబు:
గాంధీజీ నాయకత్వంలో భారత జాతీయ కాంగ్రెస్ 1930, మార్చి 12న చారిత్రాత్మకమైన శాసనోల్లంఘన ఉద్యమాన్ని ప్రారంభించింది. కాంగ్రెస్ శాసనసభ్యులందరూ తమ శాసనసభ సభ్యత్వాలకు రాజీనామాలు సమర్పించాలని ఆదేశించింది. ఆ సమయంలో కాంగ్రెస్ నాయకుల ఆవేశాలను చల్లార్చేందుకు గాంధీజీ ప్రయత్నించాడు. ఈ సందర్భంలో గాంధీజీ చివరి ప్రయత్నం చేస్తూ రాజ ప్రతినిధి ఇర్విన్ను సమస్య పరిష్కారం దిశగా ప్రయత్నించాలని హెచ్చరించాడు. రాజ ప్రతినిధి ఇర్విన్ ఆ హెచ్చరికను పెడచెవిన పెట్టడంతో గాంధీజీ శాసనోల్లంఘన ఉద్యమాన్ని ప్రారంభించేందుకు నిర్ణయించాడు.

శాసనోల్లంఘన ఉద్యమం మూడు దశలుగా జరిగింది. అవి:
1) మొదటి దశ (1930 మార్చి 12 – 1932 జనవరి 3 వరకు) 2) రెండో దశ (1932 జనవరి 4 – 1933 జులై 11 వరకు) 3) మూడో దశ (1933 జులై 12 – 1934 మే వరకు)
మొదటి దశ: దీనినే ఉప్పు సత్యాగ్రహ దశగా వర్ణించవచ్చు. ఈ ఉద్యమంను గాంధీజీ 1930, మార్చి 12వ తేదీన సబర్మతీ ఆశ్రమం నుంచి 78 మంది అనుచరులతో ప్రారంభించాడు. అతడు 200 మైళ్ళ దూరంలో అరేబియా సముద్రతీరం వద్ద గల దండి గ్రామాన్ని కాలిబాటన చేరుకొని ఉప్పును తయారుచేసేందుకు ప్రభుత్వ చట్టాలను ఉల్లంఘించాడు. దీంతో దేశవ్యాప్తంగా వివిధ వర్గాల ప్రజలు సామూహిక ఉద్యమంలో భాగస్వాములయ్యారు. ఉప్పు సత్యాగ్రహంలో భాగంగా గాంధీజీ ప్రజలకు విజ్ఞప్తి చేసిన కార్యక్రమాలు:

  1. మద్యపాన దుకాణాలు, విదేశీ వస్త్ర విక్రయశాలల ఎదుట పికెటింగ్.
  2. రాట్నాల ద్వారా ఖద్దరు వడకటం.
  3. హిందూ – ముస్లింల మధ్య సంబంధాల పటిష్టత.
  4. అస్పృశ్యతా నివారణ.

ఉప్పు సత్యాగ్రహ పర్యవసానం:

  • బ్రిటిష్ ప్రభుత్వం గాంధీజీని నిర్బంధంలోనికి తీసుకొని ఎర్రవాడ కారాగారంలో ఉంచింది. దీంతో కోపోద్రిక్తులైన ప్రజలు దేశమంతటా హర్తాళ్ పాటించారు.
  • అనేకమంది ప్రభుత్వ ఉద్యోగాలకు రాజీనామా చేశారు.
  • 1930-32 మధ్యకాలంలో లండన్లో బ్రిటిష్ ప్రభుత్వం మూడు రౌండ్ టేబుల్ సమావేశాలను ఏర్పరచింది.
  • రెండో రౌండ్ టేబుల్ సమావేశంలో గాంధీజీ పాల్గొని అల్పసంఖ్యాకుల ప్రాతినిధ్యం కంటే రాజ్యాంగ నిర్మాణమే ప్రధాన అంశమని వాదించాడు.
    కాని ఆయన వాదనలు ఆమోదయోగ్యం కాకపోవడంతో చర్చలు విఫలమయ్యాయి.

రెండో దశ:
1) ఈ దశలో గాంధీజీని, ఇతర నాయకులను 1932, జనవరి 14న నిర్బంధంలో ఉంచడం జరిగింది. కాని ప్రజలు పికెటింగ్ను చేపట్టడం జరిగింది.

2) బ్రిటిష్ ప్రభుత్వం విధించిన నిషేధాజ్ఞలు ధిక్కరించి సమావేశాలు నిర్వహించడం, కరపత్రాల ముద్రణ వంటి చర్యలు అమలుచేయడం జరిగింది.

3) బ్రిటిష్ ప్రభుత్వం అన్ని రకాల ఊరేగింపులను నిషేధించింది.

4) ముస్లిం నాయకులు మినహా, జాతీయ నాయకులందరూ బ్రిటిష్ ప్రధాని రామ్సే మెక్ డొనాల్డ్ 1932, ఆగస్టు 10న ప్రకటించిన “కమ్యూనల్ అవార్డు”ను వ్యతిరేకించారు.

AP Inter 1st Year History Study Material Chapter 12 భారత జాతీయోద్యమం

5) కమ్యూనల్ అవార్డును వ్యతిరేకిస్తూ ఎర్రవాడ కారాగారంలో గాంధీజీ 1932, సెప్టెంబర్ 20న ఆమరణ నిరాహార దీక్షకు ఉపక్రమించారు.

6) బ్రిటిష్ ప్రభుత్వం, గాంధీజీ సంప్రదింపుల ఫలితంగా బ్రిటిష్ ప్రభుత్వం గాంధీజీ డిమాండ్లలో కొన్నింటికి
ఆమోదం తెలిపింది.

7) బ్రిటిష్ ప్రభుత్వం తమకు విధేయులైన నాయకులతో లండన్లో 1932, నవంబర్ 17 – డిసెంబర్ 24 మధ్య మూడో రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించింది. ఈ సమావేశంలో మహిళలకు ఓటుహక్కు వంటి అంశాలపై నిర్ణయాలు తీసుకోవడం జరిగింది.

మూడో దశ:

  1. 1933 జులైలో గాంధీజీ, మరికొంతమంది నాయకులు వ్యక్తిగత శాసనోల్లంఘన ఉద్యమానికి ఉపక్రమించారు. వారిని బ్రిటిష్ ప్రభుత్వం నిర్బంధంలోకి తీసుకుంది.
  2. కారాగారంలో గాంధీజీ ఆరోగ్య పరిస్థితి క్షీణించడంతో ఆయనను బ్రిటిష్ ప్రభుత్వం విడుదల చేసింది.
  3. 1934 మే నెలలో పాట్నాలో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ సమావేశం శాసనోల్లంఘన ఉద్యమాన్ని ఉపసంహరించుకొంటున్నట్లు ప్రకటించింది.

ప్రశ్న 7.
భారత జాతీయోద్యమంలో సుభాష్ చంద్రబోస్ పాత్రను అంచనా వేయండి.
జవాబు:
భారత జాతీయోద్యమ చరిత్రలో ప్రముఖ స్థానాన్ని పొందిన దేశభక్తుడు సుభాష్ చంద్రబోస్. సుభాష్ చంద్రబోస్ ఐ.సి.ఎస్ పరీక్ష పాసై సివిల్ సర్వెంట్గా తన జీవితాన్ని ప్రారంభించాడు. అయితే సహాయ నిరాకరణోద్యమ ప్రభావానికిలోనై తన సివిల్ సర్వీసు ఉద్యోగానికి రాజీనామా చేసి జాతీయోద్యమంలో పాల్గొన్నాడు.

కాంగ్రెస్లో పాత్ర: సుభాష్ చంద్రబోస్ కాంగ్రెస్ రాజకీయాల్లో పాల్గొన్నాడు. 1938లో హరిపూర్లో జరిగిన జాతీయ కాంగ్రెస్ సమావేశానికి అధ్యక్షుడయ్యాడు. 1939లో త్రిపుర కాంగ్రెస్ సమావేశంలో గాంధీజీ అభ్యర్థియైన భోగరాజు పట్టాభి సీతారామయ్యను ఓడించి పార్టీ అధ్యక్షుడిగా గెలుపొందాడు. అయితే కాంగ్రెస్ అనుసరిస్తున్న శాంతియుత విధానాల యెడల బోస్కు విశ్వాసం లేదు. అందువల్ల గాంధీజీతో బోస్కు తీవ్రమైన భేదాభిప్రాయాలు కలిగాయి. అందువల్ల కాంగ్రెస్ నుంచి వైదొలగి ‘ఫార్వర్డ్ బ్లాక్’ అనే కొత్త పార్టీని స్థాపించాడు.

ఆజాద్ హింద్ ఫౌజ్ స్థాపన: బ్రిటిష్ వారిని భారతదేశం నుంచి వెళ్లగొట్టాలంటే రెండవ ప్రపంచ యుద్ధం సరైన అవకాశమని బోస్ భావించాడు. అయితే యుద్ధకాలంలో బోస్ ను ప్రభుత్వం నిర్బంధించింది. బోస్ 1941లో నిర్భంధం నుంచి తప్పించుకొని మొదట రష్యాకు, తరువాత జర్మనీకి, జపాన్కు వెళ్ళాడు. యుద్ధసమయంలో ఆ దేశాల సహాయంతో ఇంగ్లీషువారితో పోరాడి, దేశానికి స్వాతంత్య్రం సాధించవచ్చని బోస్ తలచాడు. యుద్ధంలో జపాన్కు చిక్కిన భారతీయ యుద్ధఖైదీలందరినీ కూడగట్టుకొని 1943లో సింగపూర్లో ‘ఆజాద్ హింద్ ఫౌజ్’ లేక ‘ఇండియన్ నేషనల్ ఆర్మీ’ని స్థాపించాడు. ఐ.ఎన్.ఏ. స్థాపనలో బోస్కు రాస్ బిహారీ బోస్, మోహన్సింగ్లు సహకరించారు. ఐ.ఎన్.ఏలో చేరిన సేనలు బోస్ న్ను “నేతాజీ” అని గౌరవంగా పిలిచేవారు. “జైహింద్” అనే నినాదాన్ని చేపట్టి బోస్ తన అనుచరులందరితో తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి “ఛలో ఢిల్లీ” అంటూ భారతదేశంలో ఇంఫాల్ సమీపంలోని మోయిరాంగ్ వరకు వచ్చాడు. ఆయనకు తోడుగా వీరవనిత కెప్టెన్ లక్ష్మి మహిళలతో ఏర్పడిన ఝాన్సీరాణి దళనేత అయింది. ఆయన నాయకత్వంలోని ఐ.ఎన్.ఏ. సైన్యాలు దేశ స్వాతంత్ర్యానికి ప్రాణాలొడ్డి పోరాడాయి. కానీ దురదృష్టవశాత్తు 1945 సెప్టెంబర్ లో జపాన్ ఓడిపోవటంతో బోస్ ప్రయత్నాలు విఫలమైనాయి. తన ప్రయత్నాలు కార్యరూపం ధరించకుండానే బోస్ 1945లో ఒక విమాన ప్రమాదంలో మరణించాడు.

ఆజాద్ హింద్ ఫౌజ్ సభ్యుల విచారణ: యుద్ధానంతరం ప్రభుత్వం ‘ఆజాద్ హింద్ ఫౌజ్’ సేనలను ఇండియాపై దాడిచేయడానికి ప్రయత్నించినందున దేశద్రోహులుగా ప్రకటించి ఎర్రకోటలో విచారణ జరిపించింది. సైనిక నాయకులైన మేజర్ జనరల్ షానవాజ్ ఖాన్ (ముస్లిం), కల్నల్ జి.ఎస్. ధిల్లాన్ (సిక్కు, మేజర్ ప్రేమ్ సెహగల్ (హిందూ) లపై విచారణ జరిపించింది. వారి తరఫున జవహర్లాల్ నెహ్రూ, తేజబహదూర్ సప్రూ, భూలాబాయ్ దేశాయ్లు వాదించారు. అయినప్పటికీ ప్రత్యేక న్యాయస్థానం వారికి శిక్షలు విధించింది. కానీ ఆ శిక్షలకు దేశవ్యాప్తంగా నిరసన వ్యక్తమవటంతో ప్రజాభిప్రాయాన్ని మన్నించి, ప్రభుత్వం వారిని విడుదల చేసింది. దీనితో ప్రజలకు, సైనికులకు ప్రభుత్వం పట్ల భయభక్తులు పోయాయి. హిందూ, సిక్కు, ముస్లింల సేనలను విచారించటం వలన కాంగ్రెస్, లీగ్లు సమైక్యంగా పోరాడాయి.

ఘనత: సుభాష్ చంద్రబోస్ విజయాన్ని సాధించలేకపోయినా, ఆయన ధైర్యసాహసాలు దేశంలో చాలామందికి స్ఫూర్తినిచ్చాయి. ఆయన అచంచల దేశభక్తి, క్రమశిక్షణ, కార్యదీక్ష తరతరాల భారతీయులకు ఆదర్శప్రాయం.

లఘు సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
భారతీయులపై పాశ్చాత్య విద్య ప్రభావం గురించి రాయండి.
జవాబు:
పాశ్చాత్య విద్యావ్యాప్తి ద్వారా భారతీయుల్లో తార్కిక, లౌకిక, ప్రజాస్వామ్య భావాలు పునురుద్ధరింపబడ్డాయి. ఆంగ్ల | బోధన ప్రజల్లో ఏకత్వ భావన కలిగించి, రాజకీయ వికాసానికి తోడ్పడింది. ఆంగ్లవిద్య భారతదేశపు పూర్వ సంస్కృతి, సాహిత్యం, మతం, తాత్వికత, కళ అధ్యయనానికి, పునరుద్ధరణకు తోడ్పడింది. తవ్వకాల ద్వారా బయల్పడిన ప్రాచీన సంస్కృతీ వైభవాన్ని చూసి భారతీయులు గర్వించారు. ఆంగ్లవిద్య ద్వారా జరిగిన మరో ప్రయోజనం నూతనంగా బ్రిటిష్ ప్రభుత్వరంగాల్లో వచ్చిన ఉద్యోగావకాశాలు. దీంతో పాటు భారతీయ మేధావులు కూడా ఆంగ్లవిద్యను ప్రోత్సహించారు.

ఈస్ట్ ఇండియా కంపెనీ, క్రైస్తవ మిషనరీల ప్రోత్సాహం వల్ల పాశ్చాత్య విద్యనభ్యసించిన విద్యాధికుల సంఖ్య పెరిగింది. మొదటి నుంచి క్రైస్తవ మిషనరీలు విద్యను ప్రోత్సహించాయి. 1717 లో డానిష్ మిషనరీలు మద్రాసులో రెండు ఛారిటీ స్కూళ్ళను తెరిచారు. మద్రాసులోనే కాక అనేక ఇతర ప్రాంతాల్లో కూడా ఇటువంటి స్కూళ్ళను ప్రారంభించారు. కేరీ, మార్మోన్ లాంటి మిషనరీలు 1793వ సంవత్సరంలో వారి కార్యక్రమాలను విస్తృతం చేశారు. బొంబాయిలో విల్సన్ కాలేజి, మద్రాస్ లో మద్రాస్ క్రిస్టియన్ కాలేజీలు ప్రారంభమయ్యాయి. 1853 ఆగ్రాలో సెయింట్ జాన్ కాలేజీ మొదలైంది. మచిలీపట్నం, నాగపూర్లలో మిషనరీ కాలేజీలు స్థాపించబడ్డాయి.

ఆంగ్లవిద్య ప్రాంతీయ భాషలను ప్రోత్సహించడమేకాక, అనేక గ్రంథాలను ప్రాంతీయ భాషల్లో రాయడానికి తోడ్పడింది. దీనివల్ల చదువురాని వారికి కూడా సమాజంలోని దురాచారాల పట్ల అవగాహన కలిగింది. బ్రిటిష్ పాలన దురాగతాలను తెలుసుకొన్న వీరు సంస్కరణావశ్యకతను గుర్తించారు. పాశ్చాత్య మేధావులైన మాకు ముల్లర్, విలియం జోన్స్ వేదాలను, ఉపనిషత్తులను, ఇతర గ్రంథాలను అనువదించారు. వారి పరిశోధనలు భారతదేశ గత చరిత్ర వైభవాన్ని వర్ణించాయి.

AP Inter 1st Year History Study Material Chapter 12 భారత జాతీయోద్యమం

ప్రశ్న 2.
హోం రూల్ ఉద్యమ పాత్రను విశ్లేషించండి.
జవాబు:
బ్రిటీషు సామ్రాజ్యంలో అంతర్భాగంగా ఉంటూనే భారతదేశానికి స్వపరిపాలనను సాధించాలన్న లక్ష్యంతో ప్రారంభమైన ఉద్యమాన్ని హోంరూల్ ఉద్యమం అంటారు. మొదటి ప్రపంచయుద్ధ కాలంలో 1916లో హోం రూల్ ఉద్యమం ఒక ప్రజా ఉద్యమంగా ప్రారంభమైంది. ఆ ఉద్యమానికి నాయకులు బాలగంగాధర్ తిలక్, అనిబిసెంట్లు.
బాలగంగాధర్ తిలక్: హోం రూల్ ఉద్యమాన్ని ప్రారంభించటానికి తిలక్ 1916 ఏప్రియల్లో బొంబాయిలో ఒక హోం రూల్ లీగ్ను స్థాపించాడు. మహారాష్ట్ర, కర్ణాటక, మధ్యభారత్ ప్రాంతాలలో తిలక్ తన ప్రచారాన్ని సాగించాడు. తన “మరాఠా”, “కేసరి” పత్రికల ద్వారా హోం రూల్ భావాన్ని ప్రచారం చేశాడు. తిలక్ హోం రూల్ ఉద్యమ ప్రచారం ప్రజలను చైతన్యవంతుల్ని చేసి, వారిలో స్వీయపాలనాభావాన్ని పటిష్టపరిచింది.

అనిబిసెంట్: హోం రూల్ ఉద్యమం కోసం అనిబిసెంట్ 1916 సెప్టెంబర్ నెలలో మద్రాసులో ఒక హోం రూల్ లీగ్ను స్థాపించింది. మద్రాసు పరిసర ప్రాంతాల్లో పర్యటించి ఉద్యమాన్ని అక్కడ ప్రచారం చేసింది. తన “న్యూ ఇండియా”, “కామన్వీల్” అనే పత్రికల ద్వారా అనిబిసెంట్ తన ప్రచారాన్ని సాగించింది.

హోం రూల్ ఉద్యమ వ్యాప్తి: తిలక్, అనిబిసెంట్ల కృషి వలన హోం రూల్ ఉద్యమం దేశవ్యాప్తమైంది. ఈ ఉద్యమం గురించి ప్రజలకు వివరించడానికి అనేక భాషల్లో అనేక కరపత్రాలను కూడా ప్రచురించారు. హోం రూల్ను సమర్థిస్తూ అనేక నగరాల్లో, గ్రామాల్లో కూడా సభలు ఏర్పాటు చేసి తీర్మానాలు చేశారు. ఈ కార్యక్రమాలలో ఎక్కువగా యువకులు, విద్యార్థులు పాల్గొన్నారు. హోం రూల్ ఉద్యమ కాలంలో అనిబిసెంట్ జాతీయవిద్యకు చాలా ప్రాముఖ్యం ఇచ్చింది. విద్యార్థుల్లో జాతీయ భావాలు పెంపొందించడం జాతీయ విద్య లక్ష్యం. ఈ లక్ష్యంతోనే ఆమె మదనపల్లిలో ఒక కళాశాల నెలకొల్పింది. వారణాసిలో హిందూ విద్యాలయాన్ని నెలకొల్పడానికి కూడా ఆమె కృషి చేసింది.

ప్రభుత్వ చర్యలు: 1917 నాటికి అనిబిసెంట్ చేస్తున్న ఉద్యమ ప్రచారానికి బ్రిటిష్ ప్రభుత్వం ఆందోళన చెంది, ఆమెను నిర్బంధించింది. ఆమె నిర్బంధాన్ని నిరసిస్తూ అనేక ప్రాంతాలలో సభలు, ప్రదర్శనలు జరిగాయి. తిలక్ దేశ ఉత్తర ప్రాంతాల్లో పర్యటించడాన్ని కూడా ప్రభుత్వం నిషేధించింది. దీనిని కూడా ప్రజలు వ్యతిరేకించారు. ప్రజా ఆందోళనకు తలవగ్గి, అనిబిసెంట్ను మద్రాస్ ప్రభుత్వం 1917 సెప్టెంబరు నెలలో విడుదల చేసింది. ఆమె దేశానికి చేసిన సేవలకు గుర్తింపుగా కాంగ్రెస్ ప్రతినిధులు ఆమెను 1917లో కాంగ్రెస్ అధ్యక్షురాలిగా ఎన్నుకున్నారు. భారత |జాతీయ కాంగ్రెస్ అధ్యక్ష పదవిని అలంకరించిన తొలి మహిళ అనిబిసెంట్.

ఉద్యమవ్యాప్తికి కారణాలు’: బ్రిటిష్ ప్రభుత్వం ఉద్యమ నాయకులను నిర్బంధించి ఉద్యమ వ్యాప్తిని అరికట్టడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ ఉద్యమం దేశవ్యాప్తమైంది. హోం రూల్ ఉద్యమ వ్యాప్తికి కొన్ని కారణాలున్నాయి.
1) 1907 సూరత్ సమావేశంలో చీలిపోయిన కాంగ్రెస్ 1916లో సమైక్యమై సంయుక్తంగా ఉద్యమించింది.

2) బెంగాల్ విభజన రద్దు కావటంతో వందేమాతరం ఉద్యమాన్ని నిర్వహించిన ఉద్యమకారులంతా తమ దృష్టిని హోం రూల్ ఉద్యమంవైపుకు మళ్లించి ఉద్యమానికి బలాన్ని చేకూర్చారు.

3) మొదటి ప్రపంచయుద్ధంలో బ్రిటన్ ముస్లిం రాజ్యాల యెడల అవలంబించిన వైఖరి భారతదేశంలో ముస్లింలకు కోపాన్ని కలిగించింది. అందువల్ల వారు కాంగ్రెస్ తో 1916లో లక్నో ఒడంబడికను కుదుర్చుకొని స్వీయపాలనోద్యమంలో పాల్గొన్నారు.

ఉద్యమ ముగింపు: హోం రూల్ ఉద్యమ ఫలితంగా ప్రజలలో నెలకొన్న రాజకీయ చైతన్యాన్ని, బ్రిటీషుపాలన యెడల వారిలో నెలకొన్న అసంతృప్తిని తొలగించటానికి 1917 ఆగస్టు 20వ తేదీన భారతరాజ్య వ్యవహారాల మంత్రి మాంటేగ్ ఒక ప్రకటన చేశాడు. ఈ ప్రకటన ప్రకారం క్రమక్రమంగా భారతీయులకు బాధ్యతాయుతమైన ప్రభుత్వం ఏర్పరచబడుతుంది. ఈ ప్రకటన తరువాత బ్రిటీషు ప్రభుత్వం అనిబిసెంట్ను విడుదల చేయగా ఆమె హోం రూల్ ఉద్యమాన్ని నిలిపివేసింది. తిలక్ ఉద్యమాన్ని మరికొన్నాళ్లు కొనసాగించాడు.

ప్రశ్న 3.
జలియన్ వాలాబాగ్ మారణకాండ ప్రాముఖ్యతను వివరించండి.
జవాబు:
1919లో ఆంగ్ల ప్రభుత్వం భారతదేశంలో మాంటేగు – ఛేమ్స్ఫర్డ్ సంస్కరణలు ప్రవేశపెట్టింది. ఈ సంస్కరణలు భారతీయులకు ఎట్టి ప్రత్యేక హక్కులు ఇవ్వకపోగా ముస్లింలతో పాటు సిక్కులకు కూడా ప్రత్యేక స్థానాలు కేటాయించాయి. అందుకు భారతీయులలో అసంతృప్తి ప్రబలింది. ఇదే సమయంలో 1915 1918 కాలంలో చోటు చేసుకున్న ఉగ్రవాద కార్యకలాపాలను సమీక్షించడానికి ఆంగ్ల ప్రభుత్వముచే నియమించబడిన రౌలట్ కమిటీ కొన్ని చర్యలను సూచించింది. ఈ చర్యలన్నీ చట్టరూపం దాల్చాయి. దీనినే రౌలట్ చట్టం అంటారు. ఈ చట్టం వలన ప్రభుత్వానికి అసాధారణ అధికారాలు సంక్రమించాయి. ఈ చట్టప్రకారం రాజకీయ ఆందోళనకారులను వారంట్ లేకుండా నిర్బంధించవచ్చు. నిర్బంధించిన వారిని విచారించవలసిన పనిలేదు. ప్రభుత్వానికి వ్యతిరేకమయిన ఏ చిన్న కాగితాన్ని కలిగివున్నా అది నేరంగా పరిగణింపబడుతుంది. ఇంగ్లాండ్లో పౌరుల హక్కులకు పునాది అయిన హెబియస్ కార్పస్ హక్కు భారతీయులకు లేకుండా పోయింది. ఈ బిల్లులను కాంగ్రెస్ వ్యతిరేకించింది. గాంధీజీ ఆ బిల్లును ఆమోదించవద్దని గవర్నర్ జనరల్ను కోరాడు. కానీ అది ఆమోదించబడింది. కనుక వాటి ఉపసంహరణకు గాంధీజీ ఉద్యమించాడు. 1919 ఏప్రియల్ 6న హర్తాళ్ పాటించవలసిందిగా ఆయన ప్రజలకు పిలుపునిచ్చాడు. ఆ పిలుపునందుకొని దేశమంతటా హర్తాళ్ జరిగింది. హిందూ, ముస్లిం భేదం లేకుండా అందరూ ఈ ఉద్యమంలో పాల్గొన్నారు. ఢిల్లీ, అహ్మదాబాద్, పంజాబ్లలో హింసాకాండ జరిగింది. ముఖ్యంగా పంజాబ్లో ప్రజల నాయకులైన సత్యపాల్, సైఫుద్దీన్ కిచ్లూలను ప్రభుత్వం నిర్బంధించింది.

ఈ నిర్భంధానికి వ్యతిరేకంగా అమృత్సర్ ప్రజలు జలియన్ వాలాబాగ్ వద్ద సమావేశమైనారు. సమావేశం సాగుతుండగానే అమృత్సర్ మిలిటరీ కమాండర్ జనరల్ డయ్యర్ అక్కడకు వచ్చి ప్రజలపై ఎటువంటి హెచ్చరికలు లేకుండా కాల్పులు జరిపించాడు. ఈ కాల్పుల్లో 379 మంది మరణించగా, 1200 మంది గాయపడ్డారు. ఈ సంఘటనే చరిత్రలో జలియన్ వాలాబాగ్ దురంతంగా ప్రసిద్ధి చెందింది. జలియన్ వాలాబాగ్ సంఘటన భారత స్వాతంత్ర్య సమరంలో ఒక మైలురాయి. ఈ సంఘటన వలన భారత స్వాతంత్ర్యోద్యమం ఒక మహా సంగ్రామంగా మారింది.

సంక్షిప్త సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
మితవాదులు ఎవరు ?
జవాబు:
జాతీయ కాంగ్రెస్లో తొలి ఇరవై సంవత్సరాల వరకు (1885-1905) ఉన్నత వర్గాలకు చెందిన మితవాదులు ప్రాబల్యం వహించారు. వీరిలో ముఖ్యులు సురేంద్రనాథ్ బెనర్జీ, మదన్మోహన్ మాలవ్యా, గోపాలకృష్ణ గోఖలే, దాదాబాయి నౌరోజీ ముఖ్యులు. బ్రిటిష్ పాలకులు భారతదేశం పట్ల న్యాయబద్ధంగా వ్యవహరిస్తారని వారు విశ్వసించారు. ప్రజల కోరికలను మహోజర్లు, సభలు, తీర్మానాల ద్వారా ప్రభుత్వానికి నివేదించడం ద్వారా జాతీయ ప్రగతి సాధించవచ్చునని భావించారు. రాజ్యాంగబద్ధ పోరాటాన్ని వారు చేయడం వల్ల వారిని మితవాదులన్నారు.

ప్రశ్న 2.
ఖేదా సత్యాగ్రహం గురించి రాయండి.
జవాబు:
అహ్మదాబాద్ మిల్లు కార్మికుల సమ్మెలో గాంధీజీ పాలుపంచుకొన్నాడు. మిల్లు కార్మికుల వేతనాలను 35 శాతం పెంచాలని డిమాండ్ చేస్తూ ఆమరణ నిరాహారదీక్ష ప్రారంభించారు. చివరకు మిల్లు యజమానులు దిగివచ్చి గాంధీజీ డిమాండ్లకు అంగీకరించారు. అక్కడి నుంచి గాంధీ గుజరాత్లోని ఖేడా ప్రాంతానికి వెళ్ళారు. అక్కడి రైతాంగం దుర్భర పరిస్థితుల్లో ఉంది. పంటల దిగుబడి 25 శాతానికి పడిపోయింది. దాంతో భూమిశిస్తును రద్దు చేయాలంటూ రైతులు ఉద్యమం ప్రారంభించారు. ఆ ఉద్యమానికి గాంధీజీ మద్దతు ప్రకటించారు. రైతుల డిమాండ్కు ప్రభుత్వం తలొగ్గలేదు. వల్లభాయ్ పటేల్, తదితర ఇతర నేతలు గాంధీజీకి జత కలిశారు. చివరకు రైతుల డిమాండు ప్రభుత్వం అంగీకరించింది. సత్యాగ్రహంలో భారతదేశం అద్భుతాలు చేసింది.

AP Inter 1st Year History Study Material Chapter 12 భారత జాతీయోద్యమం

ప్రశ్న 3.
రౌలట్ సత్యాగ్రహన్ని వివరించండి.
జవాబు:
మొదటి ప్రపంచ యుద్ధానంతరం భారత ప్రజల ఏకాభిప్రాయాన్ని పెడచెవిన పెట్టిన బ్రిటిష్ ప్రభుత్వం రౌలట్ చట్టాన్ని 1919 మార్చిలో ఆమోదించింది. గాంధీజీ రాజకీయ జీవితంలో ఈ అణచివేత చట్టం కీలకమైన మార్పును తీసుకువచ్చింది. సత్యాగ్రహం ఆయుధంతో ఆ చట్టాన్ని వ్యతిరేకించాలని గాంధీజీ’ నిర్ణయించాడు. 1919 ఏప్రిల్లో రౌలట్ చట్టానికి వ్యతిరేకంగా గాంధీ దేశవ్యాప్త ఉద్యమానికి ఇచ్చిన పిలుపుకు ప్రజలు గొప్పగా స్పందించారు.

ప్రశ్న 4.
సైమన్ కమీషన్ గురించి రాయండి.
జవాబు:
భారతదేశంలో రాజ్యాంగ సంస్కరణల గురించి సిఫారసు చేయాల్సిందిగా బ్రిటిష్ ప్రభుత్వం సైమన్ కమీషన్ను నియమించింది. 1927 నవంబర్లో జాన్సైమన్ అధ్యక్షుడిగా ఒక స్థాయీ సంఘాన్ని నియమించింది. అధ్యక్షుడైన సైమన్ పేరు మీద ఆ సంఘానికి సైమన్ కమీషన్ అనే పేరు వచ్చింది. భారతదేశంలో రాజ్యాంగ సంస్కరణలపై సిఫారసులు చేసేందుకు నియమించిన కమీషన్లో అందరూ ఆంగ్లేయులే ఉండటం, భారతీయులెవరికీ ఇందులో స్థానం కల్పించకపోవడం భారతీయులకు ఆగ్రహం తెప్పించింది. దాంతో ఆ కమీషన్కు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు జరిగాయి. ఈ సైమన్ కమీషన్ను ప్రజలు బహిష్కరించారు. ‘సైమన్ గో బ్యాక్’ నినాదం దేశమంతటా మార్మోగింది. అయినప్పటికీ సైమన్ కమీషన్ దేశంలోని కొన్ని ముఖ్యమైన ప్రాంతాల్లో పర్యటించి నివేదిక రూపొందించింది.

AP Inter 1st Year Chemistry Study Material Chapter 2 మూలకాల వర్గీకరణ – ఆవర్తన ధర్మాలు

Andhra Pradesh BIEAP AP Inter 1st Year Chemistry Study Material 2nd Lesson మూలకాల వర్గీకరణ – ఆవర్తన ధర్మాలు Textbook Questions and Answers.

AP Inter 1st Year Chemistry Study Material 2nd Lesson మూలకాల వర్గీకరణ – ఆవర్తన ధర్మాలు

అతిస్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
మెండలీవ్ ఆవర్తన నియమ పద్ధతికి, ఆధునిక ఆవర్తన నియమ పద్ధతికి గల తేడా ఏమిటి?
జవాబు:

  • మెండలీవ్ ప్రకారం మూలకాల భౌతిక రసాయన ధర్మాలు పరమాణు భారాలకు ఆవర్తన ప్రమేయాలు.
  • నూతన ఆవర్తన నియమం ప్రకారం మూలకాల భౌతిక రసాయన ధర్మాలు పరమాణు సంఖ్యలకు ఆవర్తన ప్రమేయాలు.

ప్రశ్న 2.
Z = 1144 గల మూలకాన్ని ఏ పీరియడ్, ఏ గ్రూప్లో
జవాబు:
Z = 114 గల మూలకం 7వ పీరియడ్ IVA గ్రూపులో ఉంచబడును ఉంచుతారు?

ప్రశ్న 3.
ఆవర్తన పట్టికలో మూడో పీరియడ్, పదిహేడో గ్రూప్లో ఉన్న మూలకం పరమాణు సంఖ్యను తెలపండి.
జవాబు:
3వ పీరియడ్ మరియు 17వ గ్రూపులో ఉండు మూలకం క్లోరిన్ ‘Cl’ (Z = 17)

ప్రశ్న 4.
(a) లారెన్స్ బరీ ప్రయోగశాల (b) సీబర్గ్ గ్రూప్ వీరిచే నామకరణం చేయబడిన మూలకాలు ఏవై ఉంటాయి?
జవాబు:
a) లారెన్స్ బర్క్లీ ప్రయోగశాల – లాంథనైడ్
b) సీబర్గ్ గ్రూప్ – ఆక్టినైడ్

ప్రశ్న 5.
ఒకే గ్రూప్ లోని మూలకాలు సారూప్య భౌతిక, రసాయన ధర్మాలను ఎట్లా కలిగి ఉంటాయి ?
జవాబు:
ఒకే గ్రూపులోని మూలకాలు ఒకే సంఖ్యలో వేలన్సీ ఎలక్ట్రాన్లను కలిగి ఉంటాయి. మరియు ఒకే రకమైన బాహ్య కక్ష్య ఎలక్ట్రాన్ విన్యాసం కలిగి ఉంటాయి. కావున ఒకేరకమైన భౌతిక, రసాయన ధర్మాలు కలిగి ఉంటాయి.

ప్రశ్న 6.
ప్రాతినిధ్య మూలకాలంటే ఏమిటి ? వాటి వేలన్సీ కక్ష్య విన్యాసాన్ని తెలపండి.
జవాబు:
పరివర్తన మూలకాలు మరియు ‘0’ గ్రూపు మూలకాలు కాకుండా మిగిలిన మూలకాలను ‘ప్రాతినిధ్య మూలకాలు’ అంటారు. వీటి వేలన్సీ కక్ష్యలు ఎలక్ట్రాన్లతో అసంపూర్ణంగా నిండి ఉంటాయి. సాధారణ వేలన్సీ కక్ష్య ఎలక్ట్రాన్ విన్యాసం : ns1-4 np0-5.

AP Inter 1st Year Chemistry Study Material Chapter 2 మూలకాల వర్గీకరణ – ఆవర్తన ధర్మాలు

ప్రశ్న 7.
ఆవర్తన పట్టికలో f – బ్లాక్ మూలకాల స్థానాన్ని సమర్థించండి.
జవాబు:
పరమాణు సంఖ్య ఆధారంగా లాంథనైడ్ మూలకాలను వర్గీకరణ పట్టిక ప్రధాన భాగంలో తీసుకుంటే అది మూలకాల వర్గీకరణ ఆవశ్యకతను నాశనం చేస్తుంది మరియు మూలకాల సౌష్ఠవ అమరిక కూడా దెబ్బతింటుంది. అందువల్ల ప్రధాన భాగం నుండి విడదీసి వర్గీకరణ పట్టిక క్రింది భాగంలో అమర్చుట జరిగింది.

ప్రశ్న 8.
‘X’ అనే మూలకం పరమాణు సంఖ్య 34. ఆవర్తన పట్టికలో దాని స్థానాన్ని తెలపండి.
జవాబు:
వేలన్సీ స్థాయి ఎలక్ట్రాన్ విన్యాసము, 34X = [Ar] 3d10 4s² 4p4
∴ ఈ మూలకం (X) నాల్గవ పీరియడ్కు మరియు VIA గ్రూపుకు చెంది ఉంటుంది. (p – బ్లాక్ మూలకము).

ప్రశ్న 9.
పరివర్తన మూలకాల అభిలాక్షణిక ధర్మాలకు కారణమయ్యే అంశాలు ఏవి?
జవాబు:
చిన్న పరమాణు పరిమాణం, అధిక కేంద్రక ఆవేశం; d – ఆర్బిటాల్లలో ఒంటరి ఎలక్ట్రాన్లు ఉండటం మొ॥ పరివర్తన మూలకాల విలక్షణ ధర్మాలకు కారణమైన అంశాలు.

ప్రశ్న 10.
d – బ్లాక్, f – బ్లాక్ మూలకాల బాహ్య కక్ష్యల ఎలక్ట్రాన్ విన్యాసాన్ని ఇవ్వండి.
జవాబు:

  • d – బ్లాకు మూలకాల బాహ్య కక్ష్య విన్యాసం – ns1-2 (n – 1)d1-10
  • f – బ్లాకు మూలకాల బాహ్య కక్ష్య విన్యాసం – ns² (n – 1)d0 (or) 1 (n – 2) f1-14

ప్రశ్న 11.
డోబరైనర్ త్రిక నియమాన్ని, న్యూలాండ్ అష్టక నియమాన్ని నిర్వచించి ఒక్కొక్క ఉదాహరణను ఇవ్వండి.
జవాబు:
1. డోబరైనర్ ప్రకారం ప్రతి త్రికంలో మధ్య ఉన్న మూలక పరమాణు భారం మిగిలిన రెండు మూలకాల పరమాణు భారాల మధ్య ఉంటుంది.
AP Inter 1st Year Chemistry Study Material Chapter 2 మూలకాల వర్గీకరణ – ఆవర్తన ధర్మాలు 1

2. న్యూలాండ్ ప్రకారం మూలకాలను పరమాణు భారాలు పెరిగే క్రమంలో అమర్చినపుడు ప్రతి ఎనిమిదవ మూలకం మొదటి మూలక ధర్మాలతో పోలి ఉంటుంది. ఈ సంబంధం సంగీత స్వరాలలో ఎనిమిదవ స్వరం మొదటి స్వరంతో పోలిక ఉంటుంది.
AP Inter 1st Year Chemistry Study Material Chapter 2 మూలకాల వర్గీకరణ – ఆవర్తన ధర్మాలు 2

ప్రశ్న 12.
మెండలీవ్ ఆవర్తన పట్టికలోని అసంగత మూలకాల జంటలు ఏవి?
జవాబు:
అసంగత జంటలు : ఆధునిక మెండలీవ్ ఆవర్తన పట్టికలో నాలుగు జతల మూలకాల్లో పరమాణు భారాల వరసలు అపక్రమంలో ఉన్నాయి. అవి :
AP Inter 1st Year Chemistry Study Material Chapter 2 మూలకాల వర్గీకరణ – ఆవర్తన ధర్మాలు 3

పరమాణు భారం మూలకానికి మౌళిక లక్షణం కాదు కాబట్టి ఈ విధమైన అసంగత జంటలేర్పడ్డాయి.

ప్రశ్న 13.
పీరియడ్లో, గ్రూప్లో పరమాణు వ్యాసార్థం ఎలా మార్పు చెందుతుంది ? మార్పును ఎట్లా విశదీకరిస్తారు?
జవాబు:
ఆవర్తన క్రమం :
i) గ్రూపులో :
గ్రూపులో పైనుండి కిందికి కక్ష్యల సంఖ్య పెరుగుతాయి కాబట్టి పరమాణు వ్యాసార్థం కూడా అదే క్రమంలో పెరుగుతుంది.

ii) పీరియడ్లో :
పీరియడ్లో ఎడమ నుంచి కుడికి కక్ష్యలు పెరగవు కాని కేంద్రకావేశం పెరుగుతుంది. కాబట్టి పరమాణు వ్యాసార్థం క్రమంగా తగ్గుతుంది.

ప్రశ్న 14.
N-3, O-2, F, Na+, Mg+2, Al+3 లను పరిశీలించండి. (a) వీటిలో గల సారూప్యత ఏమిటి? (b) వీటిని అయానిక వ్యాసార్థ పెరుగుదల క్రమంలో అమర్చండి.
జవాబు:
ఇవ్వబడిన అయాన్లు N-3, O-2, F, Na+, Mg+2 మరియు Al+3
a) అన్ని అయాన్లు ఒకే ఎలక్ట్రాన్ల సంఖ్య కలిగి ఉన్నవి. కావున వీటిని సమ ఎలక్ట్రాన్ జాతులు అంటారు.

b) అయానిక వ్యాసార్ధ పెరుగుదల Al+3 < Mg+2< Na+ < F< O-2 < N-3
వివరణ :
సమ ఎలక్ట్రాన్ జాతులలో కేంద్రక ఆవేశం పెరిగేకొలది అయానిక వ్యాసార్థం తగ్గును.

AP Inter 1st Year Chemistry Study Material Chapter 2 మూలకాల వర్గీకరణ – ఆవర్తన ధర్మాలు

ప్రశ్న 15.
అయొనైజేషన్ ఎంథాల్పీని నిర్వచించినప్పుడు, భూస్థితిలోని ఒంటరి పరమాణువు అను పదానికి గల ప్రాముఖ్యం ఏమిటి? (సూచన: పోల్చడానికి అవసరమైంది.)
జవాబు:
వాయుస్థితిలోని ఒంటరి తటస్థ పరమాణువు యొక్క బాహ్య కర్పరంలోని ఒక ఎలక్ట్రాను తీసివేయుటకు కావలసిన శక్తిని అయనీకరణ శక్తి (ప్రథమ అయనీకరణ శక్తి) అంటారు.

ప్రశ్న 16.
భూస్థితిలో హైడ్రోజన్ పరమాణువులోని ఎలక్ట్రాన్ శక్తి – 2.18 × 10-18J. హైడ్రోజన్ పరమాణువు అయొనైజేషన్ ఎంథాల్పీని J mol-1 లలో లెక్కకట్టండి.
జవాబు:
భూస్థితిలో హైడ్రోజన్ పరమాణువులోని ఎలక్ట్రాన్ శక్తి = – 2.18 × 10-18 J.
ఒక మోల్ పరమాణువులకు – 2.18 × 10-18 × 6.023 × 1023
=- 13.13 × 105 J/Mole
∴ హైడ్రోజన్ పరమాణువు అయొనైజేషన్ ఎంథాల్పీ = 13.13 × 105 J/Mole.

ప్రశ్న 17.
‘O’ అయొనైజేషన్ ఎంథాల్పీ ‘N’ కంటే తక్కువ – విశదీకరించండి.
జవాబు:
AP Inter 1st Year Chemistry Study Material Chapter 2 మూలకాల వర్గీకరణ – ఆవర్తన ధర్మాలు 4
1. నైట్రోజన్ నందు కేంద్రకావేశం ఎక్కువ.

2. నైట్రోజన్ యొక్క సగం నిండిన ఎలక్ట్రాన్ విన్యాసం వలన దానికి స్థిరత్వం ఎక్కువ. అందువలన అయనీకరణ శక్తి ఎక్కువ.

ప్రశ్న 18.
కింది ప్రతి జంటలో, దేనికి అధిక రుణాత్మక ఎలక్ట్రాన్ గ్రాహ్య ఎంథాల్పీ ఉంది? (a) O, F, (b) F, Cl.
జవాబు:
AP Inter 1st Year Chemistry Study Material Chapter 2 మూలకాల వర్గీకరణ – ఆవర్తన ధర్మాలు 5

ప్రశ్న 19.
లోహాలకు, అలోహాలకు ఉన్న ముఖ్యమైన తేడాలు ఏవి?
జవాబు:

లోహాలుఅలోహాలు
→ ఇవి సాధారణంగా ఘనరూపంలో ఉంటాయి (Hg తప్ప)→ ఇవి ఘన (లేదా) ద్రవ (లేదా) వాయు రూపంలో ఉంటాయి.
→ అధిక ద్రవీభవన మరియు బాష్పీభవన స్థానాలు కలిగి ఉంటాయి.→ తక్కువ ద్రవీభవన మరియు బాష్పీభవన స్థానాలు కలిగి ఉంటాయి.
→ మంచి ఉష్ణ మరియు విద్యుద్వాహకాలు→ ఇవి మంచి ఉష్ణ మరియు విద్యుద్వాహకాలు కాదు.

ప్రశ్న 20.
ఆవర్తన పట్టిక సహాయంతో కింది మూలకాలను గుర్తించండి.
(a) బాహ్య ఉపస్థాయిలో 5 ఎలక్ట్రాన్లు ఉన్నాయి.
(b) రెండు ఎలక్ట్రాన్లను పోగొట్టుకోగలది
(c) రెండు ఎలక్ట్రాన్లను గ్రహించగలది.
జవాబు:
a) బాహ్య కర్పరంలో ‘5’ ఎలక్ట్రాన్లు కలిగి ఉండేవి 15 వ గ్రూపు మూలకాలు
ఉదా : N, P, As……… (ns² np³)

b) రెండు ఎలక్ట్రాన్లను కోల్పోయేవి IIA – గ్రూపు మూలకాలు.
ఉదా : Mg, Ca, (ns²)

c) రెండు ఎలక్ట్రాన్లను గ్రహించేవి VIA – గ్రూపు మూలకాలు.
ఉదా : O, S (ns² np4)

ప్రశ్న 21.
s, p, d, f – బ్లాక్ మూలకాల బాహ్య ఎలక్ట్రాన్ విన్యాసాన్ని ఇవ్వండి.
జవాబు:
AP Inter 1st Year Chemistry Study Material Chapter 2 మూలకాల వర్గీకరణ – ఆవర్తన ధర్మాలు 6

ప్రశ్న 22.
B, AT, Hg, K ల లోహ స్వభావం పెరిగే క్రమాన్ని రాయండి.
జవాబు:
ఇవ్వబడిన మూలకాలు B, Al, Mg మరియు K
లోహ స్వభావం పెరిగే క్రమం
B < Al < Mg < K

ప్రశ్న 23.
B, C, N, F, Si ల సరైన అలోహ స్వభావ పెరుగుదల క్రమాన్ని రాయండి.
జవాబు:
ఇవ్వబడిన మూలకాలు B, C, N, F మరియు Si
అలోహ స్వభావం పెరిగే క్రమం
Si < B < C < N < F

AP Inter 1st Year Chemistry Study Material Chapter 2 మూలకాల వర్గీకరణ – ఆవర్తన ధర్మాలు

ప్రశ్న 24.
N, O, F, CL ల సరైన రసాయన చర్యాశీలత పెరుగుదల క్రమాన్ని వాటి ఆక్సీకరణ ధర్మం పరంగా రాయండి.
జవాబు:
ఆక్సీకరణ ధర్మం పరంగా రసాయన చర్య శీలత పెరుగుదల క్రమం
F > O > CI > N.

ప్రశ్న 25.
రుణ విద్యుదాత్మకత అంటే ఏమిటి ? మూలకాల స్వభావాన్ని తెలుసుకోవడానికి ఇది ఎలా ఉపయోగమవుతుంది?
జవాబు:
సమయోజనీయ బంధంతో బంధితమై ఉన్న రెండు పరమాణువులలో, ఒక పరమాణువు బంధజంట ఎలక్ట్రాన్లను తనవైపుకు ఆకర్షించుకునే స్వభావాన్ని ఋణవిద్యుదాత్మకత అంటారు.

ఋణ విద్యుదాత్మకత – ఉపయోగము :
ఋణ విద్యుదాత్మక విలువల నుంచి రసాయనబంధ స్వభావాన్ని అర్థం చేసుకోవచ్చు. బంధితమయిన రెండు పరమాణువుల EN విలువల మధ్య తేడా 1.70 లేదా అంతకన్నా ఎక్కువ అయితే వాటి మధ్య బంధానికి 50% లేదా అంతకంటే ఎక్కువ అయానిక స్వభావం ఉంటుంది. అట్లాగే రెండు పరమాణువుల మధ్య EN విలువల తేడా 1.70 కంటే తక్కువ అయినప్పుడు ఏర్పడిన బంధానికి 50% కంటే ఎక్కువ కోవలెంట్ స్వభావం ఉంటుంది.

ప్రశ్న 26.
పరిరక్షక ప్రభావం అంటే ఏమిటి ? అది ఏ విధంగా అయొనైజేషన్ ఎంథాల్పీ (IE) తో సంబంధం కలిగి ఉంది?
జవాబు:
పరిరక్షక ప్రభావము :
“పరమాణు అంతర కర్పరాలలోని ఎలక్ట్రాన్లు బాహ్య కర్పరాలలోని ఎలక్ట్రాన్లను కేంద్రక ఆకర్షణ బారి నుండి రక్షించుట”. పరిరక్షక ప్రభావము పెరిగే కొలది అయనీకరణ శక్తి తగ్గుతుంది.
AP Inter 1st Year Chemistry Study Material Chapter 2 మూలకాల వర్గీకరణ – ఆవర్తన ధర్మాలు 7

ప్రశ్న 27.
మూలకాల రుణ విద్యుదాత్మకత లోహ, అలోహ లక్షణాలకు సంబంధం ఏమిటి?
జవాబు:

  • సాధారణంగా ఋణవిద్యుదాత్మక విలువలు అలోహ స్వభావాన్ని సూచిస్తాయి.
  • అల్ప ఋణ విద్యుదాత్మక విలువలు అల్ప అలోహ స్వభావాన్ని అధిక లోహ స్వభావాన్ని సూచిస్తాయి. ఋణ AP Inter 1st Year Chemistry Study Material Chapter 2 మూలకాల వర్గీకరణ – ఆవర్తన ధర్మాలు 8

ప్రశ్న 28.
ఆక్సిజన్, హైడ్రోజన్ పరంగా ఆర్సినిక్కు సాధ్యమయ్యే వేలన్సీ ఎంత?
జవాబు:
ఆర్సినిక్ రెండు ఆక్సైడ్ నిస్తుంది. అవి As2O3 మరియు As2O5 లు. As2O3 లో ఆర్సినిక్ వేలన్సీ ‘3’, As2O5లో ఆర్సినిక్ వేలన్సీ ‘5’.

ప్రశ్న 29.
ద్విస్వభావిక ఆక్సైడ్ అంటే ఏమిటి? 13వ గ్రూప్ మూలకం ఏర్పరచే ద్విస్వభావిక ఆక్సైడ్ ఫార్ములాని ఇవ్వండి.
జవాబు:
ఆమ్ల, క్షార ఆక్సైడ్ స్వభావం గల ఆక్సైడ్ను ద్విస్వభావ ఆక్సైడ్ అంటారు.
ఉదా : Al2O3 Sb2O3 మొ॥
→ 13వ గ్రూపు మూలకం ఏర్పరచే ద్విస్వభావ ఆక్సైడ్. ఉదా : Al2O3.

AP Inter 1st Year Chemistry Study Material Chapter 2 మూలకాల వర్గీకరణ – ఆవర్తన ధర్మాలు

ప్రశ్న 30.
అధిక రుణ విద్యుదాత్మకత కల మూలకం ఏది? దానికి అత్యధిక ఎలక్ట్రాన్ గ్రాహ్య ఎంథాల్పీ ఉందా? ఎందుకు ఉంది? ఎందుకు లేదు?
జవాబు:
అత్యధిక ఋణవిద్యుదాత్మకత కలిగిన మూలకము ‘ఫ్లోరిన్ (F). కాని ఫ్లోరిన్క అత్యధిక EA విలువ లేదు. క్లోరిన్ (CI) కు ఫ్లోరిన్ కన్నా అధిక EA విలువ ఉంటుంది.

కారణం :
ఫ్లోరిన్ పరమాణువు క్లోరిన్ పరమాణువు కంటే చిన్నది కావడం వల్ల వస్తుంది. ఫ్లోరిన్లో బలమైన అంతర్ ఎలక్ట్రాన్ వికర్షణలు కూడా ఉంటాయి. కాబట్టి ఫ్లోరిన్ పరమాణువుకు ఎలక్ట్రాన్ను చేర్చినప్పుడు విడుదలైన శక్తిలో కొంత భాగం అంతర్ ఎలక్ట్రాన్ వికర్షణలను అధిగమించడానికి వినియోగమవుతుంది. కాబట్టి నికరంగా విడుదలైన శక్తి క్లోరిన్లో కంటే ఫ్లోరిన్లో తక్కువగా ఉంటుంది.

ప్రశ్న 31.
కర్ణ సంబంధం అంటే ఏమిటి ? ఈ సంబంధం ఉన్న ఒక మూలకాల జంటను ఇవ్వండి.
జవాబు:
కర్ణ సంబంధం :
“ఆవర్తన పట్టికలో రెండవ పీరియడ్లోని ఒక మూలకానికి మూడవ పీరియడ్లోని తరువాత గ్రూపు రెండో మూలకానికి సారూప్య ధర్మాలుంటాయి. ఈ సంబంధాన్ని కర్ణ సంబంధం అంటారు.”
ఉదా : (Li, Mg); (Be, Al); (B, Si)

ప్రశ్న 32.
మూడో పీరియడ్లో ఆక్సైడ్ స్వభావం ఎలా మారుతుంది?
జవాబు:
మూడవ పీరియడ్ :
మూలకాల ఆక్సైడ్ ధర్మాలు :
ఈ పీరియడ్లో ఎడమ నుండి కుడి వైపుకు పోయే కొలది ఆక్సైడ్ క్షార ధర్మం క్రమంగా తగ్గి ఆమ్ల ధర్మం క్రమంగా పెరుగుతుంది.
ఉదా : Na2O క్షార ఆక్సైడ్ కాగా క్లోరిన్ ఆక్సైడ్లు ఆమ్లంగా ఉంటాయి.

ప్రశ్న 33.
ఐరన్ పరమాణువు, వాటి అయాన్ల వ్యాసార్థాలు పాటించే క్రమం Fe > Fe2+ > Fe3+ – విశదీకరించండి.
జవాబు:
లోహ పరమాణువుపై ఆవేశం పెరిగేకొలదీ, కేంద్రక ప్రభావిత ఆవేశం పెరుగుట వల్ల అయాన్ పరిమాణం తగ్గును. కావున
Fe > Fe+2 > Fe+3

ప్రశ్న 34.
ఒక మూలకం రెండో అయొనైజేషన్ ఎంథాల్పీ (IE2) కంటె మొదటి అయొనైజేషన్ ఎంథాల్పీ (IE1) తక్కువ. ఎందుకు?
జవాబు:
ఒక ఎలక్ట్రాన్ను తొలగించిన తరువాత మిగిలి ఉన్న ఎలక్ట్రాన్లపై కేంద్రక ప్రభావిత ఆవేశం పెరుగును. అందువల్ల కేంద్రక ఆకర్షణ మిగిలిన ఎలక్ట్రాన్లపై పెరుగును. అందువల్ల IE2 > IE1

ప్రశ్న 35.
లాంథనైడ్ సంకోచం అంటే ఏమిటి? దాని ఫలితాలలో ఒక దానిని చెప్పండి.
జవాబు:
లాంథనైడ్ మూలకాల పరమాణువుల మరియు అయాన్ల పరిమాణంలోని క్రమబద్ధమైన తగ్గుదలను లాంథనైడ్ సంకోచం అంటారు.

ఫలితాలు :
లాంథనైడ్ సంకోచం వల్ల లాంథనైడ్ మూలకాలను వేరుపరచుట కష్టమైంది.

ప్రశ్న 36.
అధిక సంఖ్యలో జతగూడని 2p ఎలక్ట్రాన్ల లు ఉన్న మూలకం పరమాణు సంఖ్య ఎంత? అది ఏ గ్రూప్కు చెందింది?
జవాబు:
అధిక సంఖ్యలో జతగూడని 2p ఎలక్ట్రాన్లు కలిగిన మూలకం నైట్రోజన్ పరమాణు సంఖ్య ‘7’.
AP Inter 1st Year Chemistry Study Material Chapter 2 మూలకాల వర్గీకరణ – ఆవర్తన ధర్మాలు 9
→ ‘N’ VA గ్రూపుకు చెందును.

ప్రశ్న 37.
సోడియంకు బలమైన లోహ స్వభావం ఉంటుంది. క్లోరిన క్కు బలమైన అలోహ స్వభావం ఉంటుంది. విశదీకరించండి.
లేదా
సోడియం బలమైన లోహం కాగా, క్లోరిన్ బలమైన అలోహం – ఎందుకు?
జవాబు:
‘Na’ ఒక క్షార లోహము, ఇది IA – గ్రూపు మూలకం, దీనికి ఎలక్ట్రాన్ కోల్పోయే సామర్థ్యం కలదు. ధన విద్యుదాత్మకత కలిగియుండును. కావున దీనికి బలమైన లోహ స్వభావం కలదు.

‘C’ ఒక హాలోజన్, ఇది VIIA – గ్రూపు మూలకం. దీనికి ఎలక్ట్రాన్ సంగ్రహించే సామర్థ్యం కలదు. ఋణ విద్యుదాత్మకత కలిగియుండును. కావున దీనికి బలమైన అలోహ స్వభావం కలదు.

AP Inter 1st Year Chemistry Study Material Chapter 2 మూలకాల వర్గీకరణ – ఆవర్తన ధర్మాలు

ప్రశ్న 38.
శూన్య గ్రూప్ మూలకాలను ఉత్కృష్ట లేదా తటస్థ వాయువులని ఎందుకు అంటారు?
జవాబు:

  • శూన్య గ్రూపు మూలకాల్ని బాహ్య ఎలక్ట్రాన్ విన్యాసం ns’ np’ (‘He’ తప్ప).
  • ఇవి స్థిరమైన అష్టక విన్యాసం కలిగి ఉండి రసాయనికంగా జఢత్వాన్ని కలిగి ఉంటాయి. కావున వీటిని జడవాయువులు (లేదా) తటస్థ వాయువులు అంటారు.
  • ఈ మూలకాలు ఎలక్ట్రాన్లను కోల్పోవడం గానీ, సంగ్రహించడం గాని జరగదు అందువలన వీటిని ఉత్కృష్ట వాయువులు అంటారు.

ప్రశ్న 39.
ప్రతి జంటలో, తక్కువ అయనీకరణ శక్తి ఉన్న దానిని గుర్తించి, కారణాన్ని తెలపండి.
(a) I, I (b) Br, K. (c) Li, Li+ (d) Ba, Sr (e) O, S (f) Be, B (g) N, O
జవాబు:
a) I కంటే I కు తక్కువ అయనీకరణ శక్తి అవసరం. IΘ పరిమాణం I కంటే ఎక్కువ.
b) Br కంటే Kకు తక్కువ అయనీకరణ శక్తి అవసరం. K ధన విద్యుదాత్మక మూలకం, Br ఋణ విద్యుదాత్మక మూలకం.
c) Li+ కంటే Li కు తక్కువ అయనీకరణ శక్తి అవసరం. Liకు Li+ కంటే పరమాణు పరిమాణం ఎక్కువ.
d) ‘O’ కంటే S కు తక్కువ అయనీకరణ శక్తి అవసరం. ‘S’ కు ‘O’ కంటే పరమాణు పరిమాణం ఎక్కువ.
e) ‘Be’ కంటే ‘B’ కు తక్కువ అయనీకరణ శక్తి అవసరం. ‘Be’ నందు పూర్తిస్థాయిలో నిండిన ఆర్బిటాళ్లు కలవు.
f) ‘N’ కంటే ‘O’ కు తక్కువ అయనీకరణ శక్తి అవసరం. ‘N’ నందు సగం నిండిన ఆర్బిటాళ్లు కలవు.

ప్రశ్న 40.
ఆక్సిజన్ IE1 < నైట్రోజన్ IE1 కాని ఆక్సిజన్ IE2 > నైట్రోజన్ IE2 – విశదీకరించండి.
జవాబు:

  • ‘N’ లో సగం నిండిన ఆర్బిటాళ్లు కలవు (1s² 2s² 2p³) కావున ఆక్సిజన్ IE1 < నైట్రోజన్ IE1.
  • O+ అయాన్లో సగం నిండిన ఆర్బిటాళ్లు కలిగి ఉండును కావున ఆక్సిజన్ IE2 > నైట్రోజన్ IE2.

ప్రశ్న 41.
Na+, Ne లకు ఒకే ఎలక్ట్రాన్ విన్యాసం ఉన్నప్పటికీ, Na+ కు Ne కంటే ఎక్కువ అయనీకరణ శక్మపు విలువను కలిగి ఉంది విశదీకరించండి.
జవాబు:
Na+, Ne లకు ఒకే ఎలక్ట్రాన్ విన్యాసం ఉన్నప్పటికీ Na+ కు Ne కంటే ఎక్కువ అయనీకరణ శక్మం విలువను కలిగి ఉంది.

వివరణ :

  • Na+ అయాన్, Ne లకు ఎలక్ట్రాన్ విన్యాసం 1s² 2s² 2p6
  • Na+ అయాన్లో ‘Ne’ లో కంటే కేంద్రక ఆవేశం ఎక్కువగా ఉండును.

ప్రశ్న 42.
కింది ప్రతి జంటలో దేనికి ఎక్కువ రుణాత్మక ఎలక్ట్రాన్ గ్రాహ్య ఎంథాల్పీ ఉంది? విశదీకరించండి.
(a) N, O
(b) F, CL
జవాబు:
a) ఆక్సిజన్కు నైట్రోజన్ కంటే అధిక రుణాత్మక ఎలక్ట్రాన్ గ్రాహ్య ఎంథాల్పీ కలిగి ఉంటుంది. దీనికి కారణం నైట్రోజన్లో స్థిరమైన సగం నిండిన ఎలక్ట్రాన్ విన్యాసం కలిగి ఉండును.

b) క్లోరిన్కు ఫ్లోరిన్ కంటే అధిక రుణాత్మక ఎలక్ట్రాన్ గ్రాహ్య ఎంథాల్పీని కలిగి ఉంటుంది. దీనికి కారణం ‘F’ యొక్క తక్కువ పరమాణు పరిమాణం మరియు అధిక ఎలక్ట్రాన్ వికర్షణలు.

ప్రశ్న 43.
క్లోరిన్ ఎలక్ట్రాన్ అఫినిటి ఫ్లోరిన్ కంటే ఎక్కువ – విశదీకరించండి.
జవాబు:
అత్యధిక ఋణవిద్యుదాత్మకత కలిగిన మూలకము ‘ఫ్లోరిన్ (F). కాని ఫ్లోరిన్కు అత్యధిక EA విలువ లేదు. క్లోరిన్ (CI) కు ఫ్లోరిన్ కన్నా అధిక EA విలువ ఉంటుంది.

కారణం :
ఫ్లోరిన్ పరమాణువు క్లోరిన్ పరమాణువు కంటే చిన్నది కావడం వల్ల వస్తుంది. ఫ్లోరిన్లో బలమైన అంతర్ ఎలక్ట్రాన్ వికర్షణలు కూడా ఉంటాయి. కాబట్టి ఫ్లోరిన్ పరమాణువుకు ఎలక్ట్రానన్ను చేర్చినప్పుడు విడుదలైన శక్తిలో కొంత భాగం అంతర్ ఎలక్ట్రాన్ వికర్షణలను అధిగమించడానికి వినియోగమవుతుంది. కాబట్టి నికరంగా విడుదలైన శక్తి క్లోరిన్లో కంటే ఫ్లోరిన్లో తక్కువగా ఉంటుంది.

ప్రశ్న 44.
కింది ప్రతి జంటలో దేనికి ఎక్కువ ఎలక్ట్రాన్ అఫినిటీ ఉంది?
(a) F, Cl
(b) O, O
(c) Na+, F
(d) F, F
జవాబు:
a) ‘F’ కు Cl కంటే ఎక్కువ ఎలక్ట్రాన్ ఎఫినిటీ కలదు దీనికి కారణం Cl జడవాయు విన్యాసం కలిగి ఉండటమే.
b) ‘O’ కు O కంటే ఎక్కువ ఎలక్ట్రాన్ ఎఫినిటీ కలదు. దీనికి కారణం O త్వరగా ఎలక్ట్రాన్ను స్వీకరించలేదు.
c) ‘F’ కు Na+ కంటే ఎక్కువ ఎలక్ట్రాన్ ఎఫినిటీ కలదు. దీనికి కారణం Na+ జడ వాయు విన్యాసం కలిగి ఉండటమే.
d) Fకు F కంటే ఎక్కువ ఎలక్ట్రాన్ ఎఫినిటీ కలదు. దీనికి కారణం F జడ వాయు విన్యాసం కలిగి ఉండటమే.

AP Inter 1st Year Chemistry Study Material Chapter 2 మూలకాల వర్గీకరణ – ఆవర్తన ధర్మాలు

ప్రశ్న 45.
కింది వాటిని అయానిక వ్యాసార్థ పెరుగుదల క్రమంలో అమర్చండి.
(a) Cl, P-3, S-2, F
(b) Al+3, Mg+2, Na+, O-2, F
(c) Na+, Mg+2, K+
జవాబు:
a) అయానిక వ్యాసార్థ పెరుగుదల క్రమం F < Cl < S-2 < P-3
b) అయానిక వ్యాసార్థ పెరుగుదల క్రమం Al+3 < Mg+2 < Na+ < F < O-2
C) అయానిక వ్యాసార్థ పెరుగుదల క్రమం Mg+2 < Na+ < K+

ప్రశ్న 46.
Mg+2, O-2 రెండు ఒకే ఎలక్ట్రాన్ విన్యాసాన్ని కలిగి ఉన్నప్పటికీ, పరిమాణంలో Mg+2, O-2 కంటే తక్కువ.
జవాబు:

  • Mg+2 మరియు O-2 అయాన్లు సమ ఎలక్ట్రాన్ జాతులు.
  • సమ ఎలక్ట్రాన్ జాతులనందు కేంద్రక ఆవేశం పెరిగే కొలది అయాన్ పరిమాణం తగ్గును. కావున Mg+2 పరిమాణం O-2 కంటే తక్కువ.

ప్రశ్న 47.
B, Al, C, Si మూలకాలలో
(a) దేనికి అత్యధిక ప్రథమ అయొనైజేషన్ ఎంథాల్పీ ఉంది?
(b)దేనికి ఎక్కువ రుణాత్మక ఎలక్ట్రాన్ గ్రాహ్య ఎంథాల్పీ ఉంది?
(c) దేనికి అత్యధిక పరమాణు వ్యాసార్థం ఉంది?
(d) దేనికి ఎక్కువ లోహ స్వభావం ఉంది?
జవాబు:
a) అధిక I.E కలిగిన మూలకం కార్బన్
b) ఎక్కువ ఋణాత్మక గ్రాహ్య ఎంథాల్పీ కలిగిన మూలకం కార్బన్ (- 122 KJ/mole)
c) ఎక్కువ పరమాణు వ్యాసార్థం కలిగినది Al (1.43 Å)
d) అధిక లోహ స్వభావం కలిగినది ‘Al’.

ప్రశ్న 48.
N, P, O, S మూలకాలను గమనించండి. వాటిని
(a) ప్రథమ అయొనైజేషన్ ఎంథాల్పీ పెరుగుదల క్రమంలో
(b) రుణాత్మక ఎలక్ట్రాన్ గ్రాహ్య ఎంథాల్పీ పెరుగుదల క్రమంలో
(c) అలోహ స్వభావం పెరిగే క్రమంలో రాయండి.
జవాబు:
a) మొదటి అయనీకరణ శక్తి పెరుగుదల క్రమం S < P < O < N.
b) రుణాత్మక ఎలక్ట్రాన్ గ్రాహ్య ఎంథాల్పీ పెరుగుదల క్రమం N < P < 0 < S
c) అలోహ స్వభావం పెరుగుదల క్రమం P < N < S < 0.

ప్రశ్న 49.
ఇచ్చిన క్రమంలో అమర్చండి :
(a) ఎలక్ట్రాన్ గ్రాహ్య (EA) పెరుగుదల: 0, Sse
(b) IE1 పెరుగుదల : Na, K, Rb
(c) వ్యాసార్థం పెరుగుదల : I, I+, I
(d) రుణవిద్యుదాత్మకత పెరుగుదల : F, Cl, Br, I
(e) EA పెరుగుదల : F, Cl, Br, I
(f) వ్యాసార్థం పెరుగుదల : Fe, Fe+2, Fe+3
జవాబు:
a) ఎలక్ట్రాన్ ఎఫినిటీ పెరుగుదల క్రమం O < Se < S.
b) IE1 పెరుగుదల క్రమం Rb < K < Na.
c) వ్యాసార్ధం పెరుగుదల క్రమం I+ < I < I
d) రుణవిద్యుదాత్మక పెరుగుదల క్రమం I < Br < C < F
e) ఎలక్ట్రాన్ ఎఫినిటీ పెరుగుదల క్రమం I < Br < F< Cl
f) వ్యాసార్థం పెరుగుదల క్రమం Fe+3 < Fe+2 < Fe.

ప్రశ్న 50.
(a) అత్యధిక అయొనైజేషన్ ఎంథాల్పీ ఉన్న మూలకం ఏది?
(b)అత్యధిక అయొనైజేషన్ ఎంథాల్పీ విలువ గల గ్రూపు ఏది?
(c) అత్యధిక ఎలక్ట్రాన్ అఫినిటీని చూపే మూలకం ఏది?
(d)మెండలీవ్ కాలానికి తెలియని మూలకాల పేర్లు తెలపండి.
(e)ఏవైనా రెండు ప్రాతినిథ్య మూలకాల పేర్లు తెలపండి.
జవాబు:
a) అధిక IE1 కలిగిన మూలకం ‘హీలియం’.
b) అధిక IE కలిగిన గ్రూపు శూన్య గ్రూపు (లేదా) జడవాయువులు.
c) అధిక ఎలక్ట్రాన్ ఎఫినిటీ కలిగిన మూలకం క్లోరిన్.
d) మెండలీవ్ కాలానికి తెలియని మూలకాలు జెర్మేనియం (ఎకాసిలికాన్), స్కాండియం (ఎకా అల్యూమినియం), గాలియం (ఎకాబోరాన్).
e) అల్యూమినియం, సిలికాన్, ఫాస్ఫరస్లు ప్రాతినిధ్య మూలకాలకు ఉదా :

AP Inter 1st Year Chemistry Study Material Chapter 2 మూలకాల వర్గీకరణ – ఆవర్తన ధర్మాలు

ప్రశ్న 51.
(a) ఏవైనా రెండు వారధి మూలకాల పేర్లు తెలపండి.
(b) కర్ణ సంబంధం చూపే ఏదైనా రెండు జంటలను తెలపండి.
(c) రెండు పరివర్తన మూలకాల పేర్లు తెలపండి.
(d) రెండు విరళ మృత్తిక మూలకాల పేర్లు తెలపండి.
(e) రెండు ట్రాన్స్లేయురానిక్ మూలకాల పేర్లు తెలపండి.
జవాబు:
a) రెండవ పీరియడ్ మూలకాలను వారధి మూలకాలు అంటారు. ఉదా : బెరీలియం, బోరాన్,
b) Li మరియు Mg కర్ణ సంబంధాన్ని కలిగి ఉంటాయి.
Be మరియు AZ కర్ణ సంబంధాన్ని కలిగి ఉంటాయి.
c) స్కాండియం, క్రోమియం, కోబాల్ట్ మొ||నవి పరివర్తన మూలకాలు.
d) లాంథనైడ్లను విరళ మృత్తికలు అంటారు. ఉదా : సీరియం, ప్రసోడైమియం
e) నెప్ట్యూనియం, కాలిఫోర్నియం, ఫెర్మియంలు ట్రాన్స్ యురోనిక్ మూలకాలకు ఉదాహరణలు.

స్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
ఆవర్తన పట్టికలోని 6వ పీరియడ్లో 32 మూలకాలు ఉన్నాయని, క్వాంటమ్ సంఖ్యల ఆధారంతో సమరించండి.
జవాబు:
6వ పీరియడ నందు 6s, 4f, 5, 6p ఉపకర్పరాలు కలవు
→ 6s నందు రెండు ఎలక్ట్రాన్లు [2 మూలకాలు]
→ 4f నందు 14 ఎలక్ట్రాన్లు [14 మూలకాలు]
→ 5d నందు 10 ఎలక్ట్రాన్లు [10 మూలకాలు]
→ 6p నందు 6 ఎలక్ట్రాన్లు [6 మూలకాలు]
కావున 6వ పీరియడ్ నందు మొత్తం మూలకాల సంఖ్య = 2 + 14 + 10 + 6 32.

ప్రశ్న 2.
పరమాణు భారం కంటె పరమాణు సంఖ్య మూలకాల ప్రాథమిక ధర్మమని, పరమాణు సంఖ్యలపై మోస్లే జరిపిన కృషి ఎలా తెలుపుతుంది?
జవాబు:
మోస్లే సమీకరణము
√υ = a (Z – b) υ = పౌనఃపున్యం ; Z = పరమాణు సంఖ్య a, b = స్థిరాంకాలు.
AP Inter 1st Year Chemistry Study Material Chapter 2 మూలకాల వర్గీకరణ – ఆవర్తన ధర్మాలు 10

√υ, Z ల మధ్య గీసిన రేఖాపటం సరళరేఖగా ఉంటుంది. దీన్ని రేఖాపటంగా చూపవచ్చు. అయితే ఇదే రకమైన సంబంధాన్ని √υ, పరమాణు ద్రవ్యరాశుల మధ్య చూడలేము. పరమాణు సంఖ్య, మోస్లే ప్రకారం, ఆవర్తన పట్టికలో ఆ మూలకపు వరుస సంఖ్య. మూలకాల పరమాణు సంఖ్యలు పెరిగినట్లయితే వాటి స్వాభావిక X – వికిరణాల తరంగదైర్ఘ్యాలు తగ్గుతాయి. దీనివల్ల పరమాణు సంఖ్యతో పాటు క్రమ దశలో పెరిగే మౌళిక అంశం పరమాణువులో ఉందని మోస్లే ఒక నిర్ణయానికి వచ్చాడు. ఇదే ధనావేశిత కేంద్రకంపై ఉండే విద్యుదావేశం. X – కిరణ వర్ణపటాలను, పరమాణు సంఖ్యను సమన్వయపరచుకుంటే మూలకానికి విలక్షణమయిన ధర్మం పరమాణు సంఖ్య అనీ పరమాణు భారంకాదనీ తెలుస్తుంది. మూలక ధర్మాలు దాని పరమాణు సంఖ్యతో మారతాయి. అంటే మూలకం ధర్మాలు దాని ఎలక్ట్రాన్ల సంఖ్య మీద, ముఖ్యంగా కేంద్రకానికి వెలుపల వాటి అమరికపై ఆధారపడి ఉంటాయి. దీన్నిబట్టి మూలకాల వర్గీకరణలో పరమాణు ద్రవ్యరాశి అంత ప్రముఖమయింది కాదు అని తెలుస్తుంది.

ప్రశ్న 3.
ఆధునిక ఆవర్తన నియమాన్ని తెలపండి. విస్తృత ఆవర్తన పట్టికలో ఎన్ని గ్రూప్లు, పీరియడ్లు ఉన్నాయి?
జవాబు:
ఆధునిక ఆవర్తన నియమం ఎలక్ట్రాన్ విన్యాసంపై ఆధారపడి ఉంటుంది. “మూలకాల భౌతిక, రసాయన ధర్మాలు వాటి పరమాణు సంఖ్యల ఆవర్తన ప్రమేయాలు” – ఆధునిక ఆవర్తన నియమము.

విస్తృత ఆవర్తన పట్టికలో 18 గ్రూపులు, 7 పీరియడ్లు ఉంటాయి.

ప్రశ్న 4.
f- బ్లాక్ మూలకాలను అసలు పట్టిక కింద ఎందుకు ఉంచారు?
జవాబు:
అంతర పరివర్తన మూలకాలు (f-బ్లాకు మూలకాలు) ఆరు మరియు ఏడవ పీరియడ్కు III B గ్రూపు మూలకాలు అయినప్పటికీ లాంథనైడ్లు మరియు ఆక్టినైడ్లనే రెండు శ్రేణులుగా విభజించి ఆవర్తన పట్టిక అడుగు భాగాన రెండు వరుసలుగా స్థానాన్ని కల్పించారు. అవి 4f – శ్రేణి లాంథనైడ్లు [Ce (Z = 58) నుంచి Lu (Z : 71)] మరియు 5f – శ్రేణి ఆక్టినైడ్లు (Th (Z = 90) నుంచి Lr (Z = 108)].

ఈ మూలకాల్లో భేదాత్మక ఎలక్ట్రాన్, (n – 2)f ఉప శక్తిస్థాయిలోకి చేరుతుంది. ఈ మూలకాల భౌతిక, రసాయన ధర్మాలు చాలా సన్నిహితంగా ఉంటాయి. అందువలన వీటిని ఒక సమూహంగా రెండు శ్రేణులలో ఆవర్తన పట్టీ అడుగుభాగాన స్థానం కల్పించారు.

పరమాణు సంఖ్య ఆధారంగా వీటికి వర్గీకరణ పట్టిక ప్రధాన భాగంలో తీసుకుంటే మూలకాల సౌష్ఠవ అమరికను మరియు వర్గీకరణ ఆవశ్యకతను నాశనం చేస్తుంది. అందువల్ల ప్రధాన భాగం నుండి విడదీసి వర్గీకరణ పట్టిక క్రింది భాగాన అమర్చుట జరిగింది.

ప్రశ్న 5.
విస్తృత ఆవర్తన పట్టికలోని ప్రతి పీరియడ్లో ఉన్న మూలకాల సంఖ్యను తెలపండి.
జవాబు:
AP Inter 1st Year Chemistry Study Material Chapter 2 మూలకాల వర్గీకరణ – ఆవర్తన ధర్మాలు 11

ప్రశ్న 6.
కింద వాటి సాధారణ బాహ్య కక్ష్య ఎలక్ట్రాన్ విన్యాసాలను తెలపండి.
(a) ఉత్కృష్ట వాయువులు
(b) ప్రాతినిధ్య మూలకాలు
(c) పరివర్తన మూలకాలు
(d) అంతర పరివర్తన మూలకాలు
జవాబు:

వర్గీకరింపబడిన మూలకాలుసాధారణ బాహ్య కక్ష్య ఎలక్ట్రాన్ విన్యాసము
a) ఉత్కృష్ట వాయువులుns² np6
b) ప్రాతినిధ్య మూలకాలుns1-2 np0-5
c) పరివర్తన మూలకాలు(n – 1) d1-10 ns1-2
d) అంతర పరివర్తన మూలకాలు(n – 2) f1 – 14 (n – 1) do-1 ns²

AP Inter 1st Year Chemistry Study Material Chapter 2 మూలకాల వర్గీకరణ – ఆవర్తన ధర్మాలు

ప్రశ్న 7.
పరివర్తన మూలకాలు ఏవైనా నాలుగు అభిలాక్షణిక ధర్మాలను తెలపండి.
జవాబు:
పరివర్తన మూలకాల అభిలాక్షణిక ధర్మాలు :

  1. ఒకటి కంటే ఎక్కువ ఆక్సిడేషన్ స్థితులను ప్రదర్శిస్తాయి. (చర సంయోజకత)
  2. d – d – పరివర్తనాల వల్ల ఈ మూలకాలు మరియు వాటి అయాన్లు రంగులు కలిగినవిగా ఉంటాయి.
  3. ఒంటరి d – ఎలక్ట్రాన్లను కలిగి ఉండటం వల్ల ఈ మూలకాలు మరియు వాటి అయాన్లు పారాయస్కాంత స్వభావాన్ని చూపిస్తాయి.
  4. ఈ మూలకాలు ఒకదానితో మరొకటి కలిపి మిశ్రమ లోహాలనేర్పరుస్తాయి.
  5. ఈ మూలకాలు మరియు వాటి సమ్మేళనాలు వివిధ రసాయన ప్రక్రియల్లో మంచి ఉత్ప్రేరకాలుగా పనిచేస్తాయి.

ప్రశ్న 8.
విరళ మృత్తికా లోహాలు, ట్రాన్స్ యురానిక్ మూలకాలు అంటే ఏమిటి?
జవాబు:
ఎ) లాంథనైడ్ మూలకాలను విరళ మృత్తికలు అంటారు. ఈ మూలకాలలో భేదాత్మక ఎలక్ట్రాన్ 4f – ఆర్బిటాల్లోకి ప్రవేశిస్తుంది.

బి) యురేనియం తరువాత మూలకాలను యురేనియమ్ ఉత్తర మూలకాలు (లేదా) ట్రాన్స్ యురానిక్ మూలకాలు అంటారు. ఇవన్నీ రేడియోధార్మిక మరియు కృత్రిమ మూలకాలు.

ప్రశ్న 9.
సమ ఎలక్ట్రానిక్ శ్రేణులంటే ఏమిటి? కింద ఉన్న ప్రతి పరమాణువు, అయాన్లకు సంబంధించిన సమ ఎలక్ట్రానిక్ శ్రేణులను తెలపండి.
(a) F (b) Ar (c) He (d) Rb+
జవాబు:
సమానమైన సంఖ్యలో ఎలక్ట్రాన్లను కలిగి ఉండే శ్రేణులను సమ ఎలక్ట్రాన్ శ్రేణులు అంటారు.
a) F శ్రేణి – N-3, O-2, F, Ne, Na+, Mg+2, Al+3
b) Ar శ్రేణి – P-3, S-2, Cl, Ar, K+, Ca+2
c) He శ్రేణి – H, He, Li+2, Be+2
d) Rb+ శ్రేణి – As-3, Se-2, Br, Kr, Rb+, Sr+2

ప్రశ్న 10.
వ్యాసార్థంలో మాతృక పరమాణువుల కంటే ఎందుకు కాటయాన్ చిన్నగా ఉంటుందో, ఆనయాన్ పెద్దగా ఉంటుందో విశదీకరించండి.
జవాబు:
కాటయాన్ అనగా ధనావేశిత అయాన్. ఇది పరమాణువు (లేదా) మూలకం ఎలక్ట్రాన్ కోల్పోయినపుడు ఏర్పడును.
M → M+ + e

కాటయాన్ నందు కేంద్రక ఆవేశం ఎక్కువగా ఉంటుంది కావున పరిమాణం తగ్గును, వ్యాసార్థం కూడా కాటయాన్లో తగ్గును.

ఆనయాన్ అనగా ఋణావేశిత అయాన్. ఇది పరమాణువు (లేదా) మూలకం ఎలక్ట్రాన్ గ్రహించినపుడు ఏర్పడును.
M+e → M

ఆనయాన్ నందు తక్కువ కేంద్రక ఆవేశం ఉంటుంది. కావున పరిమాణం పెరుగును, వ్యాసార్థం కూడా పెరుగును.

ప్రశ్న 11.
రెండో పీరియడ్ మూలకాలను, వాటి ప్రథమ అయొనైజేషన్ ఎంథాల్పీలు పెరిగే క్రమంలో అమర్చండి. B కంటే Be కు అధిక IE1 ఎందుకు ఉందో తెలపండి.
జవాబు:
AP Inter 1st Year Chemistry Study Material Chapter 2 మూలకాల వర్గీకరణ – ఆవర్తన ధర్మాలు 12
పూర్తిగా నిండిన మరియు వేలన్సీ ఎలక్ట్రాన్లు జతకూడి ఉండటం వల్ల ‘Be’ అయనీకరణ శక్తి ఎక్కువ.
అసంపూర్ణంగా నింపబడిన మరియు ఒంటరి (2p¹) వేలన్సీ ఎలక్ట్రాన్ ఉండటం వల్ల ‘B’ అయనీకరణ శక్తి తక్కువ.

ప్రశ్న 12.
Mg కంటే Na IE1 తక్కువ, కానీ Mg కంటే Na IE2 ఎక్కువ – విశదీకరించండి.
జవాబు:
→ Na యొక్క IE1 Mg కన్నా తక్కువ

వివరణ :
→ Na – ఎలక్ట్రాన్ విన్యాసం [Ne] 3s¹

→ Mg – ఎలక్ట్రాన్ విన్యాసం [Ne] 3s²
Mg పూర్తిగా నిండిన విన్యాసం కలిగి ఉండును. ఇది ఎక్కువ స్థిరమైనది.

→ Na యొక్క IE2 Mg కన్నా ఎక్కువ.
→ Na+ లో స్థిరమైన జడవాయు విన్యాసం కలదు. కావున Na యొక్క IE2 ఎక్కువగా ఉండును.
→ Mg+ అనగా Na ఎలక్ట్రాన్ విన్యాసం కావున Mg+ నుండి ఎలక్ట్రాన్ త్వరితగతిన కోల్పోయి Mg+2 (స్థిరమైనది) ఏర్పడును.

AP Inter 1st Year Chemistry Study Material Chapter 2 మూలకాల వర్గీకరణ – ఆవర్తన ధర్మాలు

ప్రశ్న 13.
ప్రాతినిధ్య గ్రూప్ మూలకాల IE గ్రూప్ లో కిందకు తగ్గడానికి గల కారణాలు ఏమిటి?
జవాబు:
IE పై ప్రభావితం చేయు అంశాలు
i) పరమాణు వ్యాసార్థం
ii) కేంద్రక ఆవేశం
iii) పరిరక్షక ప్రభావం
iv) సగం నిండిన (లేదా) పూర్తి స్థాయిలో నిండిన ఎలక్ట్రాన్ విన్యాసాలు
v) చొచ్చుకుపోయే స్వభావం.

ప్రాతినిధ్య గ్రూపు మూలకాలలో IE విలువలు పై నుండి కిందకు గ్రూపులో తగ్గును. దీనికి కారణం గ్రూపులలో పై నుండి కిందకు పరమాణు వ్యాసార్థం (పరమాణు పరిమాణం) పెరుగును.

ప్రశ్న 14.
13వ గ్రూప్ మూలకాల ప్రథమ అయొనైజేషన్ ఎంథాల్పి విలువలు (kJ mol-1) లలో
AP Inter 1st Year Chemistry Study Material Chapter 2 మూలకాల వర్గీకరణ – ఆవర్తన ధర్మాలు 13
సాధారణ క్రమం నుంచి ఈ విచలనాన్ని ఏ విధంగా విశదీకరిస్తారు?
జవాబు:
13 వ గ్రూపులో IE, విలువలు (KJ / mole)
AP Inter 1st Year Chemistry Study Material Chapter 2 మూలకాల వర్గీకరణ – ఆవర్తన ధర్మాలు 14

సాధారణంగా గ్రూపులలో కిందికి పోయే కొలది IE విలువలు తగ్గును కాని పై విలువలలో సరైన తగ్గుదల గమనింపబడలేదు.

వివరణ :

  • B నుండి Al కు పరిమాణం పెరుగును కావున IE విలువ తగ్గినది.
  • Al, Ga, In మరియు Tl లలో సరైన క్రమంలో తగ్గుదల గమనింపబడలేదు. దీనికి కారణం d, f – ఎలక్ట్రాన్లపై అల్ప పరిరక్షక ప్రభావం ఉండటమే.

ప్రశ్న 15.
ఆక్సిజన్ రెండవ ఎలక్ట్రాన్ గ్రాహ్య ఎంథాల్పీ, మొదటి ఎలక్ట్రాన్ గ్రాహ్య ఎంథాల్పీ కంటె ధనాత్మకమా? ఎక్కువ రుణాత్మకమా? లేదా తక్కువ రుణాత్మకమా? సమర్థించండి.
జవాబు:
రెండవ ఎలక్ట్రాన్ గ్రాహ్య ఎంథాల్పీ అనగా ఏకమాత్ర ఋణావేశిత అయాన్కు ఎలక్ట్రాన్ కలిపినపుడు విడుదలయ్యే శక్తి.
O(ar) + e → O(ar) + 141 KJ/mole
O(ar) + e → O-2r(ar) – 780 KJ/mole

ఆక్సిజన్ యొక్క రెండవ ఎలక్ట్రాన్ గ్రాహ్య ఎంథాల్పీ ధనాత్మకమైనది ఎందువలన అనగా O అయాన్ ఎలక్ట్రాన్ను త్వరగా స్వీకరించలేదు. వికర్షణ బలాలు అధికంగా ఉంటాయి.

ప్రశ్న 16.
ఎలక్ట్రాన్ గ్రాహ్య ఎంథాల్పీ, ధన విద్యుదాత్మకతల మధ్య ప్రాథమికమైన తేడా ఏమిటి?
జవాబు:

  • ఎలక్ట్రాన్ గ్రాహ్య ఎంథాల్పీ అనగా వాయుస్థితిలో ఉన్న ఒంటరి తటస్థ పరమాణువుకు ఒక ఎలక్ట్రాన్ కలుపుట వలన విడుదలయ్యే శక్తి.
  • ఒక మూలకం ఎలక్ట్రాన్లను కోల్పోయే సామర్ధ్యాన్ని ధన విద్యుదాత్మకత అంటారు.
  • ఎలక్ట్రాన్ గ్రాహ్య ఎంథాల్పీ ఋణవిద్యుదాత్మకతకు కొలమానం.
  • ఎలక్ట్రాన్ గ్రాహ్య ఎంథాల్పీ మరియు ఋణవిద్యుదాత్మక విలువోమానుపాతంలో ఉండును.

ప్రశ్న 17.
ఒకే మూలకపు రెండు ఐసోటోప్ల IE1 లు ఒకేలా ఉంటాయో లేదో ఊహించగలరా? సమర్థించండి.
జవాబు:

  • ఐసోటోప్లు అనగా ఒకే మూలకం ద్రవ్యరాశి సంఖ్య వేరుగా కలిగి ఉండేవి.
  • అధిక ద్రవ్యరాశి సంఖ్య కలిగిన ఐసోటోప్ తక్కువ IE విలువ కలిగి ఉండును.
  • దీనికి కారణం తక్కువ కేంద్రక ఆకర్షణ కలిగి ఉండటమే.
  • కానీ ఐసోటోప్ల IE విలువలు దాదాపుగా సమానంగా ఉంటాయి.

AP Inter 1st Year Chemistry Study Material Chapter 2 మూలకాల వర్గీకరణ – ఆవర్తన ధర్మాలు

ప్రశ్న 18.
గ్రూప్ 1 మూలకాల చర్యాశీలత పెరిగే క్రమం Li < Na < K < Rb < Cs, అయితే గ్రూప్ 17 మూలకాలకు ఈ క్రమం F > Cl > Br > I – విశదీకరించండి.
జవాబు:
a) గ్రూప్ – 1 మూలకాల చర్యాశీలత పెరిగే క్రమం Li < Na < K < Rb < Cs

వివరణ :

  • గ్రూప్ – 1 మూలకాలు క్షారలోహాలు. ఇది ఎలక్ట్రాన్ను త్వరగా కోల్పోతాయి. అధిక ధన విద్యుదాత్మకత కలిగి ఉంటాయి.
  • ఇవి అయానిక బంధాలను ఏర్పరుస్తాయి. మంచి క్షయ కారిణులు.
  • ఈ గ్రూపులో ధన విద్యుదాత్మకత పై నుండి కిందకు పెరుగును కావున పై చర్యాశీలత క్రమం.

b) గ్రూపు – 17 మూలకాలలో చర్యాశీలత క్రమం F > Cl > Br > I

వివరణ :

  • ఇవి హాలోజన్లు. వీటికి అధిక ఋణ విద్యుదాత్మకత ఉంటుంది. వీటికి పరమాణు పరిమాణం తక్కువగా ఉంటుంది.
  • గ్రూపులో పైనుండి కిందకు ఋణవిద్యుదాత్మకత తగ్గును.

ప్రశ్న 19.
కింద ఇచ్చిన బాహ్య ఎలక్ట్రాన్ విన్యాసం గల మూలకం స్థానాన్ని తెలపండి.
(a) ns²np4 (n = 3)
(b) (n – 1)d² ns² (n = 4)
జవాబు:
a) ns²np4 (n = 3)
3s²3p4 – మూలకం సల్ఫర్
సల్ఫర్ VIA గ్రూపు, 3వ పీరియడ్కు చెందినది.

b) (n – 1)d² ns² (n = 4)
3d² 4s² – మూలకం టైటానియం
టైటానియం IVB గ్రూపు, 4వ పీరియడ్కు చెందినది.

ప్రశ్న 20.
కింద ఉన్న జంట మూలకాల కలయికతో ఏర్పడగల స్థిర యుగ్మ సమ్మేళనాల ఫార్ములాలను నిర్దేశించండి.
(a) Li, O
(d) Si, O
(b) Mg, N
(e) P, Cl
(c) Al, I
(f) పరమాణు సంఖ్య 30 గల మూలకం, Cl
జవాబు:
a) ‘Li’ మరియు ‘O’ తో ఏర్పడు స్థిరమైన యుగ్మ సమ్మేళనం Li2O
b) ‘Mg’ మరియు ‘N’ తో ఏర్పడు స్థిరమైన యుగ్మ సమ్మేళను Mg3N2
c) ‘A’ మరియు ‘I’ తో ఏర్పడు స్థిరమైన యుగ్మ సమ్మేళనం AlI3
d) ‘Si’ మరియు ‘O’ తో ఏర్పడు స్థిరమైన యుగ్మ సమ్మేళనం SiO2
‘P’ మరియు ‘C’ తో ఏర్పడు స్థిరమైన యుగ్మ సమ్మేళనం PCl3, మరియు PCl5
f) పరమాణు సంఖ్య (Zn) 30 మరియు ‘Cl’ లతో ఏర్పడు స్థిరమైన యుగ్మ సమ్మేళనం ZnCl2

ప్రశ్న 21.
గ్రూప్లో, పీరియడ్లో లోహ స్వభావంలో మార్పుపై వివరణ ఇవ్వండి.
జవాబు:
లోహాలు ఎలక్ట్రాన్లను కోల్పోవడం ద్వారా ధనవిద్యుదాత్మకతను చూపుతాయి. అలోహాలు ఎలక్ట్రాన్లను స్వీకరించడం ద్వారా ఋణవిద్యుదాత్మకతను చూపుతాయి.

ఆవర్తన క్రమము :
a) గ్రూపులో :
గ్రూపులో పై నుండి క్రిందికి మూలకాల పరమాణు పరిమాణం క్రమేపీ పెరుగుట వలన ఎలక్ట్రాను కోల్పోయే స్వభావం పెరిగి తద్వారా అదే క్రమంలో లోహ స్వభావం పెరుగుతుంది.

b) పీరియడ్లో :
పీరియడ్లో ఎడమ నుండి కుడికి మూలకాల పరమాణు పరిమాణం క్రమేపీ తగ్గడం వలన ఎలక్ట్రాను కోల్పోయే స్వభావం తగ్గి తద్వారా, అదే క్రమంలో మూలకాల లోహ స్వభావం తగ్గుతుంది.

ప్రశ్న 22.
గ్రూప్ – 7లో కోవలెంట్ వ్యాసార్థం ఏ విధంగా పెరుగుతుంది?
జవాబు:
సంయోజనీయ వ్యాసార్థం (కోవలెంట్ వ్యాసార్థం) గ్రూప్లో పై నుండి కిందకు పెరుగును.
AP Inter 1st Year Chemistry Study Material Chapter 2 మూలకాల వర్గీకరణ – ఆవర్తన ధర్మాలు 15

ప్రశ్న 23.
3వ పీరియడ్లో ఏ మూలకానికి అత్యధిక IE1 ఉన్నది? ఈ పీరియడ్లో IE1 లో మార్పును విశదీకరించండి.
జవాబు:
III వ పీరియడ్ మూలకాల్లో అత్యధిక IE ఉన్న మూలకము “ఆర్గాన్ (Ar)”.

కారణం :
ప్రతి పీరియడ్లోను చిట్టచివరి మూలకమైన జడవాయు మూలకానికి ఆ పీరియడ్లో అత్యధిక I.E విలువ ఉంటుంది. దీనికి కారణము ఆ మూలకాలలో పూర్తిగా నిండిన ఆర్బిటాళ్ళు ఉండటమే. అష్టక విన్యాసము (ns’ np) ఉంటుంది.

III వ పీరియడ్ – IE మార్పు :
III వ పీరియడ్ మూలకాలు (Na, Mg, Al, Si, P, S, CI మరియు Ar) లో ఎడమ నుంచి కుడికి పరమాణు పరిమాణంలో క్రమేపి తగ్గుదల ఉండటం వలన అదే క్రమంలో IE విలువలు పెరుగుతాయి. ‘A’ మరియు ‘S’ లకు ఊహించిన దానికంటే తక్కువ IE ఉండటానికి కారణము వాటికి ఎలక్ట్రాన్ను కోల్పోయే స్వభావం అధికంగా ఉండటమే. Ar కు అత్యధిక IE విలువ ఉంటుంది.

AP Inter 1st Year Chemistry Study Material Chapter 2 మూలకాల వర్గీకరణ – ఆవర్తన ధర్మాలు

ప్రశ్న 24.
మూలకం సంయోజకత (valency) అంటే ఏమిటి? మూడో పీరియడ్లో హైడ్రోజన్ పరంగా ఇది ఎట్లా మారుతుంది?
జవాబు:
సంయోజకత :
“ఒక మూలకము యొక్క సంయోగ సామర్థ్యమును ‘సంయోజకత’ అంటారు.” (లేదా)
‘ఏదైనా మూలక పరమాణువుతో సంయోగం చెందే హైడ్రోజన్ పరమాణువుల సంఖ్యను (లేదా) క్లోరిన్ పరమాణువుల సంఖ్యను (లేదా) ఆక్సిజన్ పరమాణువుల సంఖ్యకు రెట్టింపు సంఖ్యను ఆ మూలకపు సంయోజకత అంటారు.

సంయోజకత = హైడ్రోజన్ పరమాణువుల సంఖ్య
= క్లోరిన్ పరమాణువుల సంఖ్య
= 2 X ఆక్సిజన్ పరమాణువుల సంఖ్య

ఆవర్తన క్రమము :
i) పీరియడ్లో : పీరియడ్లో సంయోజకత పెరుగును. ‘H’ పరంగా 1 నుంచి 4 వరకు పెరిగి తర్వాత ‘1’కి తగ్గును.
AP Inter 1st Year Chemistry Study Material Chapter 2 మూలకాల వర్గీకరణ – ఆవర్తన ధర్మాలు 16

ii) గ్రూపులో :
గ్రూపులో సంయోజకత గ్రూపు సంఖ్యకు సమానమవుతుంది. (IV వ గ్రూపు వరకు) (లేదా) (8 – గ్రూపు సంఖ్యకు) సమానమవుతుంది. (V గ్రూపు తరువాత).

ప్రాముఖ్యత :
సమ్మేళనాల, ‘ఫార్ములాలు’ రాయడానికి మూలకాల సంయోజకత ఉపయోగపడుతుంది.

ప్రశ్న 25.
కర్ణసంబంధం అంటే ఏమిటి? కర్ణ సంబంధం గల ఒక మూలకాల జంటను తెలపండి. అవి ఈ సంబంధాన్ని ఎందుకు చూపిస్తాయి?
జవాబు:
కర్ణ సంబంధం :
“ఆవర్తన పట్టికలో రెండవ పీరియడ్లోని ఒక మూలకానికి మూడవ పీరియడ్లోని తరువాత గ్రూపు రెండో మూలకానికి సారూప్య ధర్మాలుంటాయి. ఈ సంబంధాన్ని కర్ణ సంబంధం అంటారు.”
ఉదా : (Li, Mg); (Be, Al); (B, Si)

రెండవ మరియు మూడవ పీరియడ్లకు చెందిన I, II, III, IV గ్రూపు మూలకాలు కర్ణ సంబంధాన్ని చూపిస్తాయి. ధృవణ సామర్థ్యం ఒకటి గల మూలకాలు కర్ణ సంబంధాన్ని చూపుతాయి.

కర్ణ సంబంధం ఉన్న ఆయా మూలక పరమాణువుల (లేదా అయాన్ల) పరిమాణాలు సమానంగా ఉండటం లేదా వాటి ఋణవిద్యుదాత్మకత విలువలు సమానంగా ఉంటాయి. కర్ణ సంబంధం గల సారూప్య మూలకాలకు ఒకేలాంటి ధృవణ సామర్థ్యం (అయానిక ఆవేశం) ఉంటుంది.
AP Inter 1st Year Chemistry Study Material Chapter 2 మూలకాల వర్గీకరణ – ఆవర్తన ధర్మాలు 17

ఉదా : Be మరియు Al ల ధృవణ సామర్థ్యం విలువలు వరుసగా 6.40 మరియు 6.00 కావున ఈ రెండు మూలకాల మధ్య కర్ణ సంబంధం ఉంటుంది.

ప్రశ్న 26.
లాంథనైడ్ సంకోచం అంటే ఏమిటి ? వాటి ఫలితాలు ఏమిటి?
జవాబు:
లాంథనైడ్ సంకోచం – నిర్వచనం :
“f – ఆర్బిటాళ్ళ బలహీన పరిరక్షక ప్రభావం వల్ల లాంథనైడ్లు 14 మూలకాలలో (మరియు వాటి అయాన్లలో) ఎడమ నుండి కుడికి పరమాణు (అయానిక) పరిమాణం క్రమంగా తగ్గుతుంది. దీనినే లాంథనైడ్ సంకోచరం అంటారు.”

లాంథనైడ్ సంకోచం – ఫలితాలు :

  1. Ce నుంచి Lu వరకు లాంథనైడ్ సంకోచం ప్రభావం వల్ల మూలకాల గట్టిదనం, ద్రవీభవన స్థానాలు, బాష్పీభవన స్థానాలు మొదలైనవి పెరుగుతాయి.
  2. లాంథనైడ్ శ్రేణి సంకోచం ప్రభావం వల్ల మూడవ పరివర్తన శ్రేణిలో ఉన్న మూలకాల సైజులు వాటికి ఉంటాయనుకున్న వాటి కంటే తక్కువగా ఉంటాయి.
  3. ఈ సంకోచం వల్ల Sc → Y → La లలో సాధారణంగా ఉండే సైజులో పెరుగుదల లాంథనైడ్ల తరువాత ఉండదు. అపుడు (Zr, Hf), (Nb, Ta), (Mo, W) మూలకాల జంటల సైజులు దాదాపు ఒకటే ఉంటాయి.
  4. లాంథనైడ్ సంకోచం వల్ల 4d, 5d పరివర్తన మూలకాలలో పరమాణు పరిమాణం దాదాపు సమానంగా ఉంటాయి. అందువల్ల 4d, 5d శ్రేణి మూలకాల ధర్మాలు సమానంగా ఉంటాయి.
  5. ఈ సంకోచం వల్ల స్ఫటిక నిర్మాణం, మూలకాల ఇతర ధర్మాలు అత్యంత సన్నిహిత సారూప్యత కలిగి ఉంటాయి. దీని ఫలితంగా వాటి మిశ్రమం నుంచి వాటిని వేరుచేయడం కష్టమైన పని.

ప్రశ్న 27.
లిథియం ప్రథమ IE 5.41 eV, CI ఎలక్ట్రాన్ అఫినిటి – 3.61eV Li(g) + Cl(g) → Li(g)+ + Cl(g) : ఈ చర్య ∆H ను kJ mol-1 లో లెక్కించండి.
జవాబు:
ఇవ్వబడిన చర్య
Li(g) + Cl(g) → Li+(g) + Cl(g)

Li+(g) ఏర్పడుట
Li(g) → Li+(g) + e ∆H1 = 5.41ev

Cl(g) ఏర్పడుట
Cl(g) + e → Cl(g) ∆H2 = – 3.61ev
మొత్తం చర్య
Li(g) + Cl(g) → Li+(g) + Cl(g)
∆H = ∆H1 + ∆H2 = 5.41 – 3.61 = 1.8 ev
= 173.7 KJ/mole

AP Inter 1st Year Chemistry Study Material Chapter 2 మూలకాల వర్గీకరణ – ఆవర్తన ధర్మాలు

ప్రశ్న 28.
Cl + e → Cl ప్రక్రియలో ఒక అవగాడ్రో సంఖ్యలోని పరమాణువులకు విడుదలయ్యే శక్తితో Cl → Cl+ + e ప్రక్రియలో ఎన్ని Cl పరమాణువులను అయనీకరణం చెందించవచ్చు. IE = 13.0 ev, EA=3.60 eV. అవగాడ్రో సంఖ్య = 6 × 1023
జవాబు:
Cl(g) + e → Cl(g) ∆H = -3.6ev
1 – పరమాణువు → ఎలక్ట్రాన్ ఎఫినిటీ 3.6ev
6.023 × 1023 పరమాణువులు – 6.023 × 1023 × 3.6 = 21.6828 × 1023 ev
13 ev లు ఒక Cl పరమాణువును అయనీకరణం చేయును.
21.6828 × 1023 ev —–?
AP Inter 1st Year Chemistry Study Material Chapter 2 మూలకాల వర్గీకరణ – ఆవర్తన ధర్మాలు 18

ప్రశ్న 29.
Cl ఎలక్ట్రాన్ అఫినిటీ 3.7 eV. వాయుస్థితిలో 29. క్లోరిన్ పరమాణువులు పూర్తిగా Cl అయాన్లుగా మారినప్పుడు kCal లలో ఎంత శక్తి విడుదల అగును? (1 e V = 23.06 kCal/mol-1)
జవాబు:
AP Inter 1st Year Chemistry Study Material Chapter 2 మూలకాల వర్గీకరణ – ఆవర్తన ధర్మాలు 19

దీర్ఘ సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
మెండలీవ్ మూలకాల వర్గీకరణ గురించి రాయండి.
జవాబు:
మెండలీవ్ ఆవర్తన నియమము :
“మూలకాలు, వాటి సమ్మేళనాల ధర్మాలు వాటి పరమాణు భారాల ఆవర్తన ప్రమేయాలు”.

మెండలీవ్ మూలకాల వర్గీకరణ :
ఇంతకు ముందు భాగాల్లో ఆవర్తన నియమాన్ని నిర్వచించాం. ఈ నియమాన్ని ప్రతిపాదించేటప్పుడు చాలా అంశాలను మెండలీవ్ కనుగొన్నాడు. అందులో కొన్నింటిని కింది భాగాల్లో తెలపటం జరిగింది. ఒకే రకమైన ధర్మాలున్న మూలకాలకు

a) దాదాపు సమాన పరమాణు భారాలు ఉంటాయి.
ఉదా : Fe (56), Co (59), Ni (59); Os (191), Ir (193), Pt (195) లేదా

b) పరమాణు భారాల విలువల్లో స్థిరమైన పెరుగుదల ఉంటుంది.
ఉదా : K(39), Rb(85), Cs(133); Ca(40), Sr(88), Ba(137)
(పరమాణు భారాలను సమీప పూర్ణాంకాలుగా సవరించడమైనది.)

మూలకాలను గ్రూపులుగా అమర్చడంవల్ల రసాయన ధర్మాల్లోనూ, వేలన్సీలోనూ ఏదైనా శ్రేణిలో వచ్చే మార్పులు తెలుస్తాయి.
ఉదా : 1. ఒక శ్రేణిలో లోహ స్వభావం క్రమంగా తగ్గుతుంది.
(ఉదా : Li నుంచి F వరకు; Cu మంచి Br వరకు)
ఉదా : 2. హైడ్రోజన్ సంయోజకత 1 నుంచి 4 వరకు పెరిగి తరువాత మళ్ళీ 1 వరకు తగ్గుతుంది.

అల్ప పరమాణు భారాలు గల మూలకాలన్నీ ప్రకృతిలో విరివిగా దొరుకుతాయి. వాటి స్వభావాలు స్పష్టంగా తెలుస్తాయి. వీటిని విలక్షణ మూలకాలంటారు. అలాంటి మూలకాలన్నీ ఆవర్తన పట్టిక పొట్టి పీరియడ్లలో ఉంటాయి.

ఈ శ్రేణులలో హైడ్రోజన్కు ఏ ఇతర మూలకానికీ లేని ప్రత్యేక స్థానాన్ని ఇచ్చారు.

మెండలీవ్ పట్టిక VIII వ గ్రూపులో మూడు ట్రయడ్లు ఉంటాయి. అవి : (Fe, Co, Ni); (Ru, Rh, Pb); (Os, Ir, Pt)లు; ఈ ట్రయడ్లను పరివర్తన మూలకాలంటారు. ఈ పరివర్తన మూలకాలలోనే Sc (21) నుంచి Zn (30) వరకు; లాంథనైడ్లు, ఆక్టినైడ్లు కూడా కలిపి ఉంటాయి.

ఆసన్న మూలకాలు, వాటి సమ్మేళనాలను అధ్యయనం చేసి, మెండలీవ్ కొన్ని మూలకాల ధర్మాలను, చెప్పగలిగాడు. ఈ ఊహాగానాలే తరువాత చాలా కచ్చితంగా ఉన్నాయని తెలిసింది.
ఉదా : ఎకా అల్యూమినియం (Eka Al) (ఇప్పుడు దీన్ని గాలియమ్ అంటారు). ఎకా సిలికాన్ (Eka Si) (ఇప్పుడు దీన్ని జెర్మేనియమ్ అంటారు). ఎకా బోరాన్ (Eka B) (ఇప్పుడు దీన్ని స్కాండియమ్ అంటారు).

ఆధునిక మెండలీవ్ ఆవర్తన పట్టికలో పరమాణు భారాల వరుసలు నాల్గు జతల మూలకాల్లో అపక్రమంలో ఉన్నాయి. అవి అయొడిన్, ఆర్గాన్, పొటాషియం, కోబాల్టు, నికెల్ మరియు థోరియం – ప్రొటాక్టేనియంలు. ఈ జంటలలో మొదటిదాని కన్నా రెండవ మూలకం పరమాణు భారం అధికము. వీటిని “అసంగత జంట” అంటారు. కాని రసాయన ధర్మాలు మరియు పరమాణు సంఖ్యలను బట్టి చూస్తే, ఈ అమరిక సరియైనదేనని తెలుస్తుంది.

మెండలీవ్ ఆవర్తన పట్టిక అవధులు :

  1. కొన్ని మూలకాల స్థానాలు వాటి రసాయన ధర్మాలకు అనుగుణంగా లేవు. ఉదా : నాణె లోహాలైన Cu, Ag, Au లను క్షార లోహాలైన K, Rb, Cs తో కలిపి I- గ్రూపులో ఉంచారు. నాణె లోహాలకు, క్షార లోహాలకు ధర్మాలలో చాలా భేదమున్నది.
  2. విరళమృత్తిక (లాంథనైడు)లను ఈ పట్టికలో ఒకే స్థానంలో ఉంచినారు.
  3. హైడ్రోజన్ స్థానం సంతృప్తికరంగా లేదు. ఇది అటు క్షార లోహాలను (IA) ఇటు హాలోజన్ అలోహాలను (VIA) పోలిన ధర్మాలు చూపుతుంది.

ప్రశ్న 2.
తెలియని మూలకం ధర్మాలను, దాని పక్కనున్న మూలకాల ధర్మాల అధ్యయనం వల్ల, నిర్దేశించవచ్చు – ఒక ఉదాహరణతో సమర్థించండి.
జవాబు:
ఆసన్న మూలకాలు, వాటి సమ్మేళనాలను అధ్యయనం చేసి, మెండలీవ్ కొన్ని మూలకాల ధర్మాలను, చెప్పగలిగాడు. ఈ ఊహాగానాలే తరువాత చాలా కచ్చితంగా ఉన్నాయని తెలిసింది.
ఉదా : ఎకా అల్యూమినియం (Eka Al) (ఇప్పుడు దీన్ని గాలియమ్ అంటారు). ఎకా సిలికాన్ (Eka Si) (ఇప్పుడు దీన్ని జెర్మేనియమ్ అంటారు). ఎకా బోరాన్ (Eka B) (ఇప్పుడు దీన్ని స్కాండియమ్ అంటారు).

మెండలీఫ్ ఊహించిన మూలకాల లక్షణాలనూ, ప్రాయోగికంగా మూలకాల ఆవిష్కరణ తరువాత తెలుసుకున్న ధర్మాలనూ పోల్చడం చూస్తారు.

మెండలీవ్ ఊహించిన ధర్మాలు, ప్రాయోగిక ధర్మాలను పోల్చడం :

ధర్మంమెండలీవ్ ఊహించిన ధర్మాలుప్రాయోగికంగా కనుగొన్న ధర్మాలు
1. మూలకం పేరుఎకా అల్యూమినియమ్ [EKa Al]గాలియమ్ (Ga)
2. పరమాణు భారం6870
3. సాంద్రత (గ్రా. సెం.మీ-3)5.905.94
4. ద్రవీభవన స్థానం (Å లలో)తక్కువగా ఉండాలి302.93
5. ఆక్సైడ్ ఫార్ములా(EKa Al)2 O3Ga2O3
6. క్లోరైడ్ ఫార్ములా(Eka Al) Cl3GaCl3

AP Inter 1st Year Chemistry Study Material Chapter 2 మూలకాల వర్గీకరణ – ఆవర్తన ధర్మాలు

ప్రశ్న 3.
విస్తృత ఆవర్తన పట్టిక నిర్మాణాన్ని తెలపండి.
జవాబు:
ఆవర్తన పట్టిక – నిర్మాణము :
ఈ పట్టికలోని అడ్డు వరుసలను పీరియడ్లు అని, నిలువు గడులను గ్రూపులని అంటారు. దీనిలో 7 పీరియడ్లు 18 గ్రూపులు ఉన్నాయి.

మొదటి పీరియడ్లో రెండు మూలకాలు మాత్రమే ఉన్నాయి. అవి H, He దీనిని అతి పొట్టి పీరియడ్ అంటారు. రెండవ, మూడవ పీరియడ్లలో ఒక్కొక్క దానిలో 8 మూలకాలు ఉన్నాయి. వీటిని పొట్టి పీరియడ్లు అంటారు. రెండవ పీరియడ్ లిథియంతో ప్రారంభమై నియాన్తో అంతం అవుతుంది. మూడవ పీరియడ్ సోడియంతో ప్రారంభమై ఆర్గాన్తో అంతం అవుతుంది.

నాలుగు, ఐదు పీరియడ్లలో ఒక్కొక్క దానిలో 18 మూలకాలు ఉన్నాయి. వీటిని పొడుగు పీరియడ్లు అంటారు. నాల్గవ పీరియడ్ పొటాషియంతో ప్రారంభమై క్రిప్టాన్తో అంతం అవుతుంది. అయిదవ పీరియడ్ రుబీడియంతో ప్రారంభమై గ్జినాన్తో అంతం అవుతుంది.

ఆరవ పీరియడ్లో 32 మూలకాలు ఉన్నాయి. దీనిని అతి పొడవైన పీరియడ్ అంటారు. ఈ పీరియడ్ సీసియంతో ప్రారంభమై రేడాన్ అంతం అవుతుంది.

ఏడవ పీరియడ్ను అసంపూర్ణ పీరియడ్ అంటారు. దీనిలో 20 మూలకాలు మాత్రమే ఉన్నాయి. వీటిలో చాలా భాగం కృత్రిమ మూలకాలు.

ఆధునిక ఆవర్తన పట్టికలో 18 గ్రూపులు ఉన్నాయి. వాటికి ఈ క్రింది విధంగా సంకేతాలు ఇవ్వబడినాయి.
IA, IIA, IIIB, IVB, VB, VIB, VIIB, VIII, IB, IIB, IIIA, IVA, VA, VIA, VIIA, O (లేక) 1 నుండి 18

ఈ పట్టికలోని కుడివైపు చివరన ఉన్న ‘0’ గ్రూపు మూలకాలను జడవాయువులు అంటారు.

ప్రతి పీరియడ్లోను మొదటి మూలకంలో భేదపరిచే ఎలక్ట్రాను ‘s’ ఆర్బిటాల్లోకి ప్రవేశిస్తుంది. ఆఖరి మూలకంలో ‘p’ ఆర్బిటాల్ పూర్తిగా నింపబడి s² p6 విన్యాసం (అష్టక విన్యాసం) కలిగి ఉంటుంది.

ఆఫ్ బౌ సూత్రం ప్రకారం ఎలక్ట్రాన్లు ఏ వరుస క్రమంలో వివిధ ఉపస్థాయిలలోకి ప్రవేశిస్తాయో అదే వరుసలో మూలకాలు ఆధునిక ఆవర్తన పట్టికలో అమర్చబడ్డాయి.

మొదటి శక్తి స్థాయిలో (1s) లో రెండు ఎలక్ట్రాన్లు మాత్రమే ఉండగలవు. అందువలననే మొదటి పీరియడ్లో రెండు మూలకాలు ఉన్నాయి. వాటి విన్యాసాలు వరుసగా 1s¹ మరియు 1s².

రెండవ పీరియడ్లోని మూలకాల ఎలక్ట్రాన్ విన్యాసం 2s¹ నుండి 2s²2p6 వరకు క్రమంగా మారుతుంది. వీటిలో 2s, 2p ఉపస్థాయిలు నిండుతాయి. వీటిలో ఉండదగిన గరిష్ఠ ఎలక్ట్రాన్ల సంఖ్య 8 అందువలన 2వ పీరియడ్లో 8 మూలకాలు ఉన్నాయి.

మూడవ పీరియడ్లోని మూలకాలలో ఎలక్ట్రాన్లు 3s, 3p స్థాయిలలో క్రమంగా ప్రవేశిస్తాయి. ఈ రెండు స్థాయిల ఎలక్ట్రాన్ల సామర్థ్యం కూడా 8. అందువలన ఈ పీరియడ్లో కూడా 8 మూలకాలు ఉన్నాయి.

నాల్గవ పీరియడ్లో మొదటి రెండింటిలో 45 స్థాయిలోనూ, తరువాత 10 మూలకాలలో 3d స్థాయిలోనూ, ఆ తరువాత 6 మూలకాలలో 4p స్థాయిలోనూ ఎలక్ట్రాన్లు ప్రవేశిస్తాయి. ఈ 4s, 3d, 4p స్థాయిల మొత్తం సామర్థ్యం (2 + 10 + 6) = 18 ఎలక్ట్రాన్లు. అందువలననే ఈ పీరియడ్లో 18 మూలకాలు ఉంటాయి.

అయిదవ పీరియడ్లో కూడా 18 మూలకాలు ఉంటాయి. వీటిలోని మూలకాలలో ఎలక్ట్రాన్లు 5s, 4d, 5p స్థాయిలలో ప్రవేశిస్తాయి. ఆరవ పీరియడ్లో 32 మూలకాలు ఉంటాయి. ఈ మూలకాలలో వరుసగా 6s, 4f, 5d, 6p స్థాయిలలో ఎలక్ట్రాన్లు ప్రవేశిస్తాయి. వీటిలో ఉండగల గరిష్ఠ ఎలక్ట్రాన్ల సంఖ్య 2 + 14 + 10 + 6 = 32. అందువలన ఈ పీరియడ్లో 32 మూలకాలు ఉంటాయి. ఏడవ పీరియడ్లో 20 మూలకాలు మాత్రమే ఉన్నాయి. వీటిలో ప్రస్తుతం నిండిన ఉపస్థాయిలు 7s, 5f (పూర్తిగా) 6d (అసంపూర్తిగా) 5f స్థాయి ఆక్టీనియం తర్వాత నిండుతుంది. ఆక్టినైడ్ మూలకాలు ఈ పీరియడ్కు చెందినవే.
AP Inter 1st Year Chemistry Study Material Chapter 2 మూలకాల వర్గీకరణ – ఆవర్తన ధర్మాలు 20

ప్రశ్న 4.
కక్ష్యలోని ఉపశక్తి స్థాయిలలో పూర్తిగా నిండిన ఎలక్ట్రాన్ల సంఖ్యకూ, పీరియడ్లో ఉండే మూలకాల అత్యధిక సంఖ్యకూ గల సంబంధాన్ని విశదీకరించండి.
జవాబు:
ఈ కింది పద్ధతిలో మూలకాలకు పీరియడ్లలో స్థానం కల్పించారు.
మొదటి పీరియడ్ :
ఒకటి లేదా రెండు ఎలక్ట్రాన్లు మాత్రమే ఉండే K – కర్పరం ఈ పీరియడ్ ఏర్పాటులో విస్తరిస్తుంది. ఈ పీరియడ్లో రెండు మూలకాలుంటాయి. అవి హైడ్రోజన్ (151) మరియు హీలియం (153).

రెండవ పీరియడ్ :
లిథియమ్ పరమాణువులో K కక్ష్య రెండు ఎలక్ట్రాన్లతో సంపూర్తి అవుతుంది. ఇంకొక కొత్త కక్ష్య, L కక్ష్య, ఒక ఎలక్ట్రాన్తో మొదలవుతుంది. ఈ పీరియడ్లో ఇతర మూలకాలలో (అంటే Be నుంచి F తరువాత Ne వరకు) Lకక్ష్యలోకి క్రమేపి ఎలక్ట్రాన్లు నిండుతాయి. ఈ నింపడం. Ne వరకు జరుగుతుంది. Ne లో K కక్ష్య, L – కక్ష్యలు రెండూ పూర్తిగా నిండుతాయి. ఇక్కడే రెండో ప్రధాన శక్తిస్థాయి ఎనిమిది. ఎలక్ట్రాన్లతో పూర్తిగా నిండుతుంది. కాబట్టే 2వ పీరియడ్లో ఎనిమిది మూలకాలుంటాయి.

మూడవ పీరియడ్ :
సోడియమ్తో (Z = 11) M – కక్ష్య ప్రారంభమవుతుంది. ఈ కక్ష్య ఆర్గాన్ (Z = 18) వచ్చే వరకు క్రమంగా పెరుగుతుంది. ఈ మూలకాలన్నిటినీ 3వ పీరియడ్లో ఉంచడమైనది. అందుకే 3వ పీరియడ్లో కూడా ఎనిమిది మూలకాలే ఉంటాయి. అప్పుడు భేదపరిచే ఎలక్ట్రాన్ M కక్ష్యలోకి (అంటే 3వ కక్ష్యలోకి) పోదు. బదులుగా N – కక్ష్యలోకి (అంటే 4వ కక్ష్యలోకి) పోతుంది. ఈ పీరియడ్ పొటాషియమ్ (Z = 19) తో ప్రారంభమవుతుంది. దీని ఎలక్ట్రాన్ విన్యాసం 2, 8, 8, 1. దీని తరువాత మూలకం కాల్షియమ్ N కక్ష్యలో రెండు ఎలక్ట్రాన్లుంటాయి. దీని ముందు కక్ష్యలు (K, L, M కక్ష్యలు) పూర్తి అయి ఉంటాయి. తరువాత మూలకం స్కాండియమ్ (Z = 21, Sc) తో మొదలుకొని ఉపబాహ్య కక్ష్య M కక్ష్యలో 18 ఎలక్ట్రాన్లు నిండే వరకు పెరుగుతుంది.

4, 5, 6, 7 పీరియడ్లు :
జింక్ మూలకంతో M – కక్ష్య పూర్తి అవుతుంది. తరువాత వచ్చి చేరే ఎలక్ట్రాన్లు బాహ్య కక్ష్యలోకి పోతాయి. Ga, Ge, As, Se, Br, Kr క్రమంగా వస్తాయి. 4వ పీరియడ్లో కొన్ని మూలకాలు పరివర్తన మూలకాలు లేదా పరివర్తన లోహాలు. పరివర్తన మూలకాలు, జడవాయువులు కాకుండా మిగిలిన మూలకాలను సాధారణ మూలకాలు లేదా ప్రాతినిధ్య మూలకాలు అంటారు. 4వ పీరియడ్లో 4s, 3d, 4p స్థాయిలు వరుసగా ఎలక్ట్రాన్లతో నిండుతాయి. అందుకే నాలుగో పీరియడ్లో 18 ఎలక్ట్రాన్లుంటాయి. 4వ పీరియడ్లో క్రమాన్ని 5వ పీరియడ్ దాదాపు అదే రీతిలో అనుసరిస్తుంది. ఈ పీరియడ్లో నాలుగో పీరియడ్లో కంటే తరచుగా ఎలక్ట్రాన్ బాహ్య కక్ష్య నుంచి ఉపబాహ్య కక్ష్యలోకి మారుతుంది. దీనికి కారణం 4d, 5p స్థాయిలు శక్త్యాత్మకంగా అతిసన్నిహితంగా ఉండటం. కాడ్మియమ్ (Z = 48; (d) తో ఈ పీరియడ్ పూర్తి అవుతుంది. ఈ పీరియడ్లో 5s, 4d, 5p స్థాయిలు వరుసగా భేదపరిచే ఎలక్ట్రాన్లతో నిండుతాయి. అందువల్ల ఈ పీరియడ్లో కూడా 18 మూలకాలుంటాయి.

AP Inter 1st Year Chemistry Study Material Chapter 2 మూలకాల వర్గీకరణ – ఆవర్తన ధర్మాలు

ప్రశ్న 5.
s, p, d, f బ్లాక్ మూలకాలపై వ్యాసాన్ని రాయండి.
జవాబు:
మూలకాలను వివిధ బ్లాకులుగా విభజించుట :
భేదాత్మక ఎలక్ట్రాన్ ప్రవేశించే ఆర్బిటాళ్ళ ఆధారంగా మూలకాలను 4 బ్లాకులుగా విభజించారు. అవి :
1) s – బ్లాకు, 2) p – బ్లాకు, 3) d – బ్లాకు, 4) f – బ్లాకు

1) s – బ్లాకు :

  1. భేదాత్మక ఎలక్ట్రాన్ బాహ్యస్థాయిలోని 5 ఉపస్థాయిలో ప్రవేశించు మూలకాలను 5 – బ్లాకు మూలకాలు అంటారు.
  2. దీనిలో 2 గ్రూపులు కలవు. (ఎ) క్షార లోహాలు IA (బి) క్షార మృత్తిక లోహాలు – 1IA.
  3. IA గ్రూపు మూలకాల సాధారణ ఎలక్ట్రాన్ విన్యాసం – ns’, ilA గ్రూపు మూలకాల సాధారణ ఎలక్ట్రాన్ విన్యాసం – ns .
  4. s – బ్లాకు మూలకాల సాధారణ విన్యాసం ns’ -2.
  5. హైడ్రోజన్ తప్ప మిగిలిన 5 – బ్లాకు మూలకాలన్నీ లోహాలు.

2) p – బ్లాకు :
అధ్యాయం 2 మూలకాల వర్గీకరణ – ఆవర్తన ధర్మాలు

  1. భేదాత్మక ఎలక్ట్రాన్ బాహ్యస్థాయిలోని p ఉపస్థాయిలో ప్రవేశించు మూలకాలను p-బ్లాకు మూలకాలు అంటారు.
  2. దీనిలో ఆరు గ్రూపులు కలవు. అవి IIIA నుండి VIIA, సున్నా గ్రూపు.
  3. ఈ బ్లాకు మూలకాల సాధారణ ఎలక్ట్రాన్ విన్యాసం – ns’ np’ నుండి ns’ np.
  4. ఈ బ్లాకులో అలోహాలు, లోహాలు, అర్ధలోహాలు కలవు.

AP Inter 1st Year Chemistry Study Material Chapter 2 మూలకాల వర్గీకరణ – ఆవర్తన ధర్మాలు 21

3) d – బ్లాకు :

  1. భేదాత్మక ఎలక్ట్రాన్ (n – 1)d ఉపకక్ష్యలో ప్రవేశించు మూలకాలను d – బ్లాకు మూలకాలు అంటారు.
  2. వీటి సాధారణ ఎలక్ట్రాన్ విన్యాసం (n – 1)d1 నుండి 10, ns1 లేదా 2 n = 4, 5, 6 లేదా 7
  3. d – ఉపస్థాయి 10 ఎలక్ట్రాన్లకు స్థానం కల్పించగలదు. అందువల్ల దీనిలో 10 గ్రూపులు కలవు. అవి IB నుండి VIIB, మరియు VIII (దీనిలో 3 నిలువు వరుసలు కలవు.)
  4. d – బ్లాకులో ఒక్కొక్క శ్రేణిలో 10 మూలకాల చొప్పున 4 శ్రేణులు కలవు. అవి :
    a) 3d – శ్రేణి 21Sc నుండి 30Zn
    b) 4d – శ్రేణి 39Y నుండి 48Cd
    c) 5d – శ్రేణి 57La, 72Hf నుండి 80Hg
    d) 6d – శ్రేణి 89Ac నుండి (మిగిలినవి కనుక్కోవాలి)
  5. అన్ని d – బ్లాకు మూలకాలు లోహాలే.

4) f – బ్లాకు :

  1. భేదాత్మక ఎలక్ట్రాన్ (n – 2) కర్పరంలో ప్రవేశించే మూలకాలను f – బ్లాకు మూలకాలు అంటారు.
  2. f – బ్లాకు మూలకాలను 2 శ్రేణులుగా విభజించారు. ప్రతి శ్రేణిలో 14 మూలకాలను అమర్చారు. అవి
    a) 4f – శ్రేణి లాంథనైడ్లు 58Ce నుండి 71Lu
    b) 5f – శ్రేణి – ఆక్టినైడ్లు 90Th నుండి 103Lr
  3. అన్ని f – బ్లాకు మూలకాలు లోహాలు. ఇవి IIIB గ్రూపుకు చెందినవి.

ప్రశ్న 6.
మూలకాల వర్గీకరణలో మూలకాల ఎలక్ట్రాన్ విన్యాసానికి, వాటి ధర్మాలకు గల సంబంధాన్ని తెలపండి.
జవాబు:
రసాయన ధర్మాల ఆధారంగా మూలకాల వర్గీకరణ :
మూలకాల రసాయన ధర్మాల ఆధారంగా వాటిని 4 రకాలుగా వర్గీకరించారు. అవి

  1. జడవాయు మూలకాలు,
  2. ప్రాతినిధ్య మూలకాలు,
  3. పరివర్తన మూలకాలు,
  4. అంతర పరివర్తన మూలకాలు.

1) జడవాయు మూలకాలు :

  1. మూలకాల వర్గీకరణ పట్టికలో సున్నా గ్రూపు (18వ గ్రూపు IUPAC) మూలకాలను జడవాయువులు అంటారు. He, Ne, Ar, Kr, Xe, Rn.
  2. He ఎలక్ట్రాన్ విన్యాసం 1s² మిగిలిన జడవాయువుల విన్యాసం ns² np6.
  3. స్థిర ఎలక్ట్రాన్ విన్యాసం కలిగి ఉండుటచే, అవి రసాయనికంగా జడత్వాన్ని ప్రదర్శించును.
  4. ఇవి అన్నీ ఏక పరమాణుక అణువులు. Rn తప్ప మిగిలినవి అన్నీ గాలిలో స్వల్ప పరిమాణంలో లభిస్తాయి.

2) ప్రాతినిధ్య మూలకాలు :

  1. సున్నా గ్రూపు తప్ప మిగిలిన s, p బ్లాకు మూలకాలను ప్రాతినిధ్య మూలకాలు అంటారు.
  2. వీటిలో బాహ్య స్థాయి అసంపూర్ణంగా ఉంటాయి.
  3. వీటి సాధారణ ఎలక్ట్రాన్ విన్యాసం ns1 – 2 np1 – 5.
  4. వీటిలో లోహాలు, అలోహాలు, అర్ధలోహాలు కలవు.
  5. ఈ మూలకాలు ఎలక్ట్రాన్లను పంచుకోవడం ద్వారా కానీ, కోల్పోవడం ద్వారా గానీ స్థిర విన్యాసం పొందుతాయి. అందువల్ల ప్రాతినిధ్య మూలకాల చర్యాశీలత అధికం.

3) పరివర్తన మూలకాలు :

  1. ఇవి d – బ్లాకు మూలకాలు.
  2. వీటి సాధారణ విన్యాసం (n – 1) d1 – 10 ns1 – 2
  3. పరివర్తన మూలకాలలో n, n – 1 వ కర్పరాలు అసంపూర్ణంగా నింపబడి ఉంటాయి.
  4. IIB గ్రూపు తప్ప IIIB నుండి VIIB మరియు VIII గ్రూపులు ఈ రకానికి చెందినవి.
  5. స్వల్ప పరమాణు పరిమాణం, అధిక ఆవేశం, d – ఆర్బిటాళ్ళలో ఒంటరి ఎలక్ట్రాన్లు కలిగి ఉండుటవల్ల, ఈ మూలకాలు కొన్ని అభిలాక్షణిక ధర్మాలను ప్రదర్శిస్తాయి. అవి :
    ఎ) గట్టిగా ఉండే, భారాత్మక లోహాలు.
    బి) అధిక ద్రవీభవన స్థానం, బాష్పీభవన స్థానం, సాంద్రత కలిగి ఉండుట.
    సి) ఉత్తమ ఉష్ణ, విద్యుత్ వాహకాలు.
    డి) చర సంయోజకతను ప్రదర్శిస్తాయి. ఉదా : Fe ఆక్సీకరణ స్థితులు +2, +3.
    ఇ) రంగును ప్రదర్శించుట.
    ఎఫ్) పారా అయస్కాంత స్వభావాన్ని కలిగి ఉంటాయి.
    జి) మిశ్రమ లోహాలను ఏర్పరుస్తాయి.

4) అంతర పరివర్తన మూలకాలు :

  1. ఇవి f – బ్లాకు మూలకాలు.
  2. ఈ మూలకాలలో n, n – 1, n – 2 కర్పరాలు అసంపూర్ణంగా నింపబడి ఉంటాయి.
  3. ఈ మూలకాల సాధారణ ఎలక్ట్రాన్ విన్యాసం (n – 2) f1 నుంచి 14 (n – 1) do, 1 ns².
  4. ఈ మూలకాలను లాంథనైడ్లు, ఆక్టినైడ్లుగా వర్గీకరించారు.
  5. చివరి రెండు కర్పరాలలో ఒకే ఎలక్ట్రాన్ విన్యాసం కలిగి ఉండుట వల్ల ఈ మూలకాల సాధారణ ఆక్సీకరణ స్థితి +3.
  6. యురేనియం (Z = 92) తర్వాత మూలకాలు మానవులు కనిపెట్టినవి.
  7. లాంథనైడ్లను విరళ మృత్తికలు అంటారు.

ప్రశ్న 7.
ఆవర్తన ధర్మమనగానేమి? కింది ధర్మాలు గ్రూప్లో పీరియడ్లో ఏ విధంగా మారతాయి? విశదీకరించండి. [A.P. & T.S. Mar. ’15 Mar. ’14]
(a) పరమాణు వ్యాసార్థం (b) ఎలక్ట్రాన్ గ్రాహ్య ఎంథాల్పీ
జవాబు:
ఆవర్తన ధర్మం :
“ఆవర్తన పట్టికలో మూలకాల ధర్మాలు క్రమంగా ఎలక్ట్రానిక్ విన్యాసంతోపాటు మారతాయి. ఈ మార్పుల సరళి క్రమ వ్యవధుల్లో పునరావృతమవుతుంది. ఇట్లే ఒక ధర్మం పునరావృతమవడాన్ని ‘ఆవర్తనం’ అంటారు. పునరావృతమయ్యే ధర్మాలను ఆవర్తన ధర్మాలు అంటారు”.

ఆవర్తన ధర్మాలు :
a) పరమాణు వ్యాసార్థం :
“లోహ స్ఫటికంలో రెండు ఆసన్న లోహ పరమాణు కేంద్రకాంతర్గత మధ్య బిందువుల మధ్య దూరంలో సగాన్ని పరమాణు వ్యాసార్థం అంటారు”. దీనినే స్ఫటిక వ్యాసార్థం అంటారు.

ఆవర్తన క్రమం :
i) గ్రూపులో :
గ్రూపులో పై నుండి కిందికి కక్ష్యల సంఖ్య పెరుగుతాయి కాబట్టి పరమాణు వ్యాసార్థం కూడా అదే క్రమంలో పెరుగుతుంది.

ii) పీరియడ్లో :
పీరియడ్లో ఎడమ నుంచి కుడికి కక్ష్యలు పెరగవు కాని కేంద్రకావేశం పెరుగుతుంది. కాబట్టి పరమాణు వ్యాసార్థం క్రమంగా తగ్గుతుంది.

b) ఎలక్ట్రాన్ గ్రాహ్య ఎంథాల్పీ (ఎలక్ట్రాన్ ఎఫినిటి) :
“వాయుస్థితిలోని మూలకం తటస్థ పరమాణువుకు ఎలక్ట్రాన్ను చేర్చి దాన్ని అయాన్ మార్చినప్పుడు విడుదలైన శక్తిని ఆ మూలకం ఎలక్ట్రాన్ ఎఫినిటి అంటారు”.

ఆవర్తన క్రమము :
i) గ్రూపులో :
గ్రూపులో పై నుండి కిందికి పోయే కొద్దీ పరిమాణం పెరగడంవల్ల ఎలక్ట్రాన్ ఎఫినిటి విలువలు తగ్గుతాయి.

ii) పీరియడ్లో :
పీరియడ్లో ఎడమ నుంచి కుడికి పోయే కొద్దీ పరిమాణం తగ్గుతుంది. దీని ఫలితంగా ఎలక్ట్రాన్లపై ఆపేక్ష పెరుగుతుంది. అంటే ఎలక్ట్రాన్ ఎఫినిటి విలువలు పెరుగుతాయి.

ప్రశ్న 88.
ఆవర్తన ధర్మం అంటే ఏమిటి? కింది ధర్మాలు గ్రూప్లో, పీరియడ్లో ఎట్లా మారతాయి? విశదీకరించండి. [A.P. & T.S. Mar. ’15 Mar. ’14]
(a) IE (b) EN
జవాబు:
ఆవర్తన ధర్మం :
“ఆవర్తన పట్టికలో మూలకాల ధర్మాలు క్రమంగా ఎలక్ట్రానిక్ విన్యాసంతోపాటు మారతాయి. ఈ మార్పుల సరళి క్రమ వ్యవధుల్లో పునరావృతమవుతుంది. ఇట్లే ఒక ధర్మం పునరావృతమవడాన్ని ‘ఆవర్తనం’ అంటారు. పునరావృతమయ్యే ధర్మాలను ఆవర్తన ధర్మాలు అంటారు”.

a) IE :
అయనీకరణ శక్తి గ్రూపులలో పై నుండి కిందకు తగ్గును. దీనికి కారణం పరమాణు పరిమాణం గ్రూపులలో పై నుండి కిందకు పెరుగును.

అయనీకరణ శక్తి పీరియడ్లలో ఎడమ నుండి కుడికి పెరుగును. దీనికి కారణం పరమాణు పరిమాణం పీరిడ్లలో ఎడమ నుండి కుడికి తగ్గడమే.

b) EN (ఋణ విద్యుదాత్మకత) :
“విజాతీయ పరమాణువులున్న ఒక ద్విపరమాణుక అణువులో (లేదా) ధృవ సంయోజనీయ బంధంలో సమిష్టిగా పంచుకున్న ఎలక్ట్రాన్ జంటను మూలక పరమాణువు తనవైపుకు ఆకర్షించుకునే ప్రవృత్తిని ఆ మూలకం ఋణ విద్యుదాత్మకత అంటారు”.

ఆవర్తన క్రమము :
i) గ్రూపులో : గ్రూపులో పై నుంచి కిందికి పోయే కొద్దీ పరమాణు పరిమాణం పెరగడం వల్ల ఋణవిద్యుదాత్మకత తగ్గుతుంది.
ii) పీరియడ్లో : పీరియడ్లో ఎడమ నుంచి కుడివైపుకు పరమాణు పరిమాణం తగ్గడం వల్ల ఋణ విద్యుదాత్మకత పెరుగుతుంది.

AP Inter 1st Year Chemistry Study Material Chapter 2 మూలకాల వర్గీకరణ – ఆవర్తన ధర్మాలు

ప్రశ్న 9.
(a) పరమాణు వ్యాసార్థం (b) లోహ వ్యాసార్థం (c) సంయోజక వ్యాసార్థం ల గురించి రాయండి.
జవాబు:
(a) స్ఫటిక వ్యాసార్థం :
“లోహ స్ఫటికంలో రెండు ఆసన్న లోహ పరమాణు కేంద్రకాంతర్గత మధ్య బిందువుల మధ్య దూరంలో సగాన్ని స్ఫటిక వ్యాసార్థం అంటారు”. దీనినే పరమాణు వ్యాసార్థం అని కూడా అంటారు.

యూనిట్లు : À, nm, m, cm మొ॥ ఈ వ్యాసార్థం లోహ పరమాణువులకు వర్తిస్తుంది.
ఉదా : సోడియం స్ఫటిక వ్యాసార్థం = 1.86 Å.

b) వాండర్ వాల్స్ వ్యాసార్థం :
“అతిసన్నిహితంగా భిన్న అణువుల్లోని రెండు పరమాణువుల కేంద్రకాల మధ్య దూరంలో సగాన్ని “వాండర్ వాల్స్ వ్యాసార్థం” అంటారు.

ఈ వ్యాసార్థం ఘనస్థితిలో ఉన్న అణుపదార్థాలకు వర్తిస్తుంది. ఉదా : క్లోరిన్ వాండర్ వాల్స్ వ్యాసార్థం = 1.86 .

c) సంయోజనీయ వ్యాసార్థం :
“సజాతీయ పరమాణువులున్న అణువులో కోవలెంట్ బంధంతో కలపబడి ఉన్న రెండు పరమాణు కేంద్రకాల మధ్య దూరంలో సగాన్ని కోవలెంట్ వ్యాసార్థం అంటారు”.
ఈ వ్యాసార్థం అలోహాలకు వర్తిస్తుంది. ఉదా : క్లోరిన్ కోవలెంట్ వ్యాసార్థం = 0.99 .

ప్రశ్న 10.
IE1, IE2 లను నిర్వచించండి. ఏదైనా పరమాణువుకు IE2 > IE1 గా ఎందుకు ఉంటుంది? ఒక మూలకపు IE ని ప్రభావితం చేసే అంశాలను చర్చించండి. [Mar. ’14]
జవాబు:
ప్రథమ అయనీకరణ శక్తి I1:
“స్వేచ్ఛా స్థితిలో ఉండే వాయు పరమాణువు H నుంచి అత్యంత బలహీనంగా బంధితమైన ఎలక్ట్రాన్లు విడదీసి వాయుస్థితిలో అయాన్ను ఏర్పరచడానికి అవసరమైన కనీస శక్తిని ప్రథమ అయనీకరణ శక్తి (I,) అంటారు.”
M(g) + I1 → M+(g) + e

ద్వితీయ అయనీకరణ శక్తి (I2):
“ఏక ధనావేశిత అయాన్ నుంచి రెండో ఎలక్ట్రానన్ను తీసివేయడానికి కావలసిన కనీస శక్తిని ద్వితీయ అయనీకరణ శక్తి (I)
M+(g) + I2 → M2+(g) + e

అయనీకరణ శక్తిని ఎలక్ట్రాన్ – వోల్ట్ / పరమాణువు (లేదా) కిలో కాలరీ / మోల్ (లేదా) కిల్తో జౌల్/మోల్లలో కొలుస్తారు.

ప్రథమ అయనీకరణ శక్తి కంటే ద్వితీయ అయనీకరణ శక్తి ఎక్కువ i.e., I2 > I1 – కారణము :
పరమాణువు నుంచి ఒక ఎలక్ట్రాన్ ను తీసివేస్తే ఏర్పడే ఏక ధనావేశిత అయాన్లో తటస్థ పరమాణువులో కంటే అధిక ప్రభావక కేంద్రక ఆవేశం ఉంటుంది. దీనివల్ల ఎలక్ట్రాన్ల మధ్య వికర్షణలు తగ్గుతాయి. అదే సమయంలో బాహ్య కక్ష్యలలోని ఎలక్ట్రాన్లపై కేంద్రక ఆకర్షణ ఎక్కువవుతుంది. దీని ఫలితంగా ఏక ధనావేశిత అయాన న్నుంచి ఒక ఎలక్ట్రాన్ ను తీసివేయడానికి ఎక్కువ శక్తి అవసరమవుతుంది. కాబట్టి I2 > I1.

అయనీకరణ శక్తి – ప్రభావితం చేసే అంశాలు :
1) పరమాణు వ్యాసార్థం :
పరమాణు వ్యాసార్థం పెరిగినకొద్దీ, వేలన్సీ ఎలక్ట్రాన్లు కేంద్రకం నుంచి దూరం అవుతాయి. కాబట్టి బలహీన కేంద్రక ఆకర్షణలకు లోనవుతాయి. అందువల్ల పరమాణువులోని ఎలక్ట్రాన్లను వేరుచేయడానికి తక్కువ శక్తి సరిపోతుంది. అంటే AP Inter 1st Year Chemistry Study Material Chapter 2 మూలకాల వర్గీకరణ – ఆవర్తన ధర్మాలు 22

2) యవనికా ప్రభావం (లేదా) పరిరక్షక ప్రభావం :
“సంపూర్ణమైన ఆర్బిటాల్లలోని అంతర ఎలక్ట్రాన్లు బాహ్య ఎలక్ట్రాన్లకు కేంద్రకం మధ్య ఆకర్షణలపై కనబరిచే ప్రభావాన్ని పరిరక్షక (లేదా) యవనికా ప్రభావం అంటారు”.

అంతర కక్ష్యలలోని ఎలక్ట్రాన్ల సంఖ్య పెరిగితే వాటి యవనికా ప్రభావం కూడా పెరుగుతుంది. కావున బాహ్య ఎలక్ట్రాన్లపై కేంద్రక ఆకర్షణ తగ్గుతుంది. అయనీకరణ శక్తి తగ్గుతుంది.
AP Inter 1st Year Chemistry Study Material Chapter 2 మూలకాల వర్గీకరణ – ఆవర్తన ధర్మాలు 23

ఆర్బిటాల్లలోని ఎలక్ట్రాన్ల యవనికా దక్షత అవరోహణ క్రమము.
s>p>d> f

3) వేలన్సీ ఎలక్ట్రాన్ల ఆర్బిటాల్లు లోపలికి చొచ్చుకొనిపోయే విస్తృతి :
“ఒక నిర్దిష్ట ప్రధాన క్వాంటం సంఖ్యకు, తమ ఆకృతిపై ఆధారపడి ఆర్బిటాళ్ళు కేంద్రం వైపు ఆకర్షింపబడటాన్ని ఆర్బిటాల్లు చొచ్చుకుపోవడం అంటారు”.

  • వివిధ ఆర్బిటాల్లు చొచ్చుకొనిపోయే విస్తృతుల క్రమము s > p > d > f
  • అనగా సౌష్ఠవాకృతిగల s – ఆర్బిటాల్ కేంద్రకం వైపుకు అధికంగా చొచ్చుకొనిపోతుంది. కాబట్టి 5 – ఆర్బిటాలు చెందిన ఎలక్ట్రాన్ విడివడటానికి అధిక ప్రమాణంలో శక్తి అవసరమవుతుంది.
  • ఒకే కక్ష్యలోని వివిధ ఆర్బిటాళ్ళలో గల ఎలక్ట్రాన్లకు అయనీకరణ శక్తి విలువల క్రమం 5 > p > d > f.

4) కేంద్రకం ఆవేశం :
కేంద్రకం ఆవేశం పెరిగే కొలదీ బాహ్య కర్పరంలోని ఎలక్ట్రాన్లపై కేంద్రక ఆకర్షణ పెరుగును. అందువల్ల అయనీకరణ శక్తి పెరుగును.
అయనీకరణ శక్తి ∝ కేంద్రక ఆవేశం.

ప్రశ్న 11.
గ్రూప్ 1, మూడో పీరియడ్లో కింది ధర్మాలు ఏ విధంగా మారతాయి ? ఉదాహరణతో విశదీకరించండి.
(a) పరమాణు వ్యాసార్థం (b) IE (c) EA (d) ఆక్సైడ్ స్వభావం
జవాబు:
పరమాణు వ్యాసార్థం :
i) గ్రూపు – 1 : పరమాణు వ్యాసార్థం Li నుండి Cs వరకు పెరుగును.
AP Inter 1st Year Chemistry Study Material Chapter 2 మూలకాల వర్గీకరణ – ఆవర్తన ధర్మాలు 24

ii) 3వ పీరియడ్ : మూడవ పీరియడ్లో Na నుండి Cl వరకు పరమాణు వ్యాసార్థం తగ్గును.
AP Inter 1st Year Chemistry Study Material Chapter 2 మూలకాల వర్గీకరణ – ఆవర్తన ధర్మాలు 25

b) IE :
i) మొదటి గ్రూపు :
అయొనైజేషన్ పొటెన్షియల్ : ఒకటవ గ్రూపులో పై నుండి క్రిందకు పోయే కొలది I.P. విలువలు క్రమంగా తగ్గుతాయి. ఉదా : Li నుండి Cs కు పోయే కొలది I.P. విలువలు 5.39 eV పరమాణువు నుండి 3.89 eV పరమాణువుకు తగ్గుతుంది.

ii) మూడవ పీరియడ్ :
అయొనైజేషన్ పొటెన్షియల్ : ఈ పీరియడ్లో ఎడమ నుండి కుడికి పోయేకొలది I.P. విలువలు క్రమంగా పెరుగుతాయి. ఉదా : Na నుండి Ar వరకు I.P. విలువలు 5.14 eV/పరమాణువు నుండి 15.76 eV పరమాణువుకు పెరుగుతుంది.

c) EA :
i) మొదటి గ్రూపు :
Li నుండి CS వరకు ఎలక్ట్రాన్ ఎఫినిటీ విలువలు తగ్గును దీనికి కారణం పరమాణు పరిమాణం పెరగడమే.

ii) మూడవ పీరియడ్ :
3వ పీరియడ్లో Si నుండి ‘P’ కు తగ్గును మరియు P నుండి C కు పెరుగును.
Mg, Ar కు ధనాత్మక విలువలు కలిగియుండును.

d) i) మొదటి గ్రూపు :
a) మూలకాల ఆక్సైడ్ ధర్మాలు :
ఒకటవ గ్రూపులో పై నుండి క్రిందకు పోయే కొలది లోహ ధర్మం క్రమంగా పెరుగుతుంది. అందువలన మూలకాల ఆక్సైడ్ క్షారధర్మం కూడా పెరుగుతుంది.
ఉదా : Li2O యొక్క క్షారత్వం కన్నా Cs2O క్షారత్వం ఎక్కువ.

ii) మూడవ పీరియడ్ :
a) మూలకాల ఆక్సైడ్ ధర్మాలు : ఈ పీరియడ్లో ఎడమ నుండి కుడి వైపుకు పోయే కొలది ఆక్సైడ్ క్షార ధర్మం క్రమంగా తగ్గి ఆమ్ల ధర్మం క్రమంగా పెరుగుతుంది.
ఉదా : Na2O క్షార ఆక్సైడ్ కాగా క్లోరిన్ ఆక్సైడ్లు ఆమ్లంగా ఉంటాయి.

AP Inter 1st Year Chemistry Study Material Chapter 2 మూలకాల వర్గీకరణ – ఆవర్తన ధర్మాలు

ప్రశ్న 12.
ఎలక్ట్రాన్ గ్రాహ్య ఎంథాల్పీని నిర్వచించండి. గ్రూప్లో, పీరియడ్లో అది ఎట్లా మారుతుంది ? గ్రూప్లో తరువాత మూలకం కంటే O, F ల ఎలక్ట్రాన్ గ్రాహ్య ఎంథాల్పీ ఎందుకు తక్కువ రుణాత్మకంగా ఉంది?
జవాబు:
ఎలక్ట్రాన్ గ్రాహ్య ఎంథాల్పీ (ఎలక్ట్రాన్ ఎఫినిటి) :
“వాయు స్థితిలోని మూలకం తటస్థ పరమాణువుకు ఎలక్ట్రాన్ను చేర్చి దాన్ని అయాన్ మార్చినప్పుడు విడుదలైన శక్తిని ఆ మూలకం ఎలక్ట్రాన్ ఎఫినిటి అంటారు”.

ఆవర్తన క్రమము :
i) గ్రూపులో :
గ్రూపులో పై నుంచి కిందికి పోయే కొద్దీ పరిమాణం పెరగడం వల్ల ఎలక్ట్రాన్ ఎఫినిటి విలువలు తగ్గుతాయి.

ii) పీరియడ్లో :
పీరియడ్లో ఎడమ నుంచి కుడికి పోయే కొద్దీ పరిమాణం తగ్గుతుంది. దీని ఫలితంగా ఎలక్ట్రాన్లపై ఆపేక్ష పెరుగుతుంది. అంటే ఎలక్ట్రాన్ ఎఫినిటి విలువలు పెరుగుతాయి.

  • అధిక ఎలక్ట్రాన్ గ్రాహ్య ఎంథాల్పి కలిగిన మూలకం క్లోరిన్ (- 349 kJ/mole)
  • జడవాయువులకు ఎలక్ట్రాన్ ఎఫినిటీ విలువ సున్నా
  • గ్రూపులో తరువాత మూలకం కంటే O, F ల ఎలక్ట్రాన్ గ్రాహ్య ఎంథాల్పీ తక్కువ ఋణాత్మకంగా ఉంటుంది. దీనికి కారణం ఈ మూలకాలు O, F తక్కువ పరమాణు పరిమాణం కలిగి అధిక ఎలక్ట్రాన్ వికర్షణలు కలిగి ఉంటాయి.

O → – 141 KJ / mole, S → – 200 kJ/Mole
F → – 328 KJ / mole, CI – 349 kJ/Mole

ప్రశ్న 13.
(a) రుణ విద్యుదాత్మకత అంటే ఏమిటి?
(b) గ్రూప్లో, పీరియడ్లో అది ఎట్లా మారుతుంది?
జవాబు:
(a) ఋణ విద్యుదాత్మకత – నిర్వచనము :
“విజాతీయ పరమాణువులున్న ఒక ద్విపరమాణుక అణువులో లేదా ధృవ సంయోజనీయ బంధంలో సమిష్టిగా పంచుకున్న ఎలక్ట్రాన్ జంట (లు)ను మూలక పరమాణువు తనవైపుకు ఆకర్షించుకునే ప్రవృత్తిని ఆ మూలకం ఋణవిద్యుదాత్మకత” అంటారు.

ఋణ విద్యుదాత్మకత – పౌలింగ్ స్కేలు :
పౌలింగ్ స్కేలు అణువు యొక్క బంధశక్తుల ఆధారంగా రూపొందించబడినది. A – B అను అణువులో A మరియు B ల ఋణవిద్యుదాత్మకతలు వరుసగా XA మరియు XB అయిన పౌలింగ్ స్కేలు ప్రకారము.
XA – XB = 0.208√∆

ఇచ్చట ∆ = EA – B – \(\frac{1}{2}\) (EA – A + EB – B)
EA – B అనగా A – B అణువు యొక్క బంధశక్తి
EA – A అనగా A – A అణువు యొక్క బంధశక్తి
EB – B అనగా B – B అణువు యొక్క బంధశక్తి

(b) ఆవర్తన క్రమము :
i) గ్రూపులో :
గ్రూపులో పై నుంచి కిందికి పోయే కొద్దీ పరమాణు పరిమాణం పెరగడం వల్ల ఋణ విద్యుదాత్మకత తగ్గుతుంది.

ii) పీరియడ్లో :
పీరియడ్లో ఎడమ నుంచి కుడివైపుకు పరమాణు పరిమాణం తగ్గడం వల్ల ఋణ విద్యుదాత్మకత
పెరుగుతుంది.

  • అధిక ఋణ విద్యుదాత్మక మూలకం ఫ్లోరిన్, పౌలింగ్ స్కేలు ద్వారా దాని విలువ 4.0.
  • రెండు మూలకాలు ఋణవిద్యుదాత్మక విలువల భేదం బట్టి బంధ స్వభావం తెలుసుకొనవచ్చు.
  • ఋణవిద్యుదాత్మక విలువల భేదం > 1.7 అయితే అయానిక బంధం
  • ఋణవిద్యుదాత్మక విలువల భేదం < 1.7 అయితే సంయోజనీయ బంధం
  • ఋణవిద్యుదాత్మక విలువల భేదం = 1.7 అయితే 50% అయానిక, 50% సంయోజనీయ బంధం

AP Inter 1st Year Chemistry Study Material Chapter 2 మూలకాల వర్గీకరణ – ఆవర్తన ధర్మాలు

ప్రశ్న 14.
కింది వాటిని విశదీకరించండి. (a) సంయోజకత (b) కర్ణ సంబంధం (c) గ్రూప్ 1 లో ఆక్సైడ్ స్వభావంలో మార్పు
జవాబు:
(a) సంయోజకత :
“ఒక మూలకము యొక్క సంయోగ సామర్థ్యమును ‘సంయోజకత’ అంటారు.” (లేదా)
‘ఏదైనా మూలక పరమాణువుతో సంయోగం చెందే హైడ్రోజన్ పరమాణువుల సంఖ్యను (లేదా) క్లోరిన్ పరమాణువుల సంఖ్యను (లేదా) ఆక్సిజన్ పరమాణువుల సంఖ్యకు రెట్టింపు సంఖ్యను ఆ మూలకపు సంయోజకత అంటారు.
సంయోజకత = హైడ్రోజన్ పరమాణువుల సంఖ్య
= క్లోరిన్ పరమాణువుల సంఖ్య
= 2 × ఆక్సిజన్ పరమాణువుల సంఖ్య

ఆవర్తన క్రమము :
i) పీరియడ్లో :
పీరియడ్లో సంయోజకత పెరుగును. ‘H’ పరంగా 1 నుంచి 4 వరకు పెరిగి తర్వాత ‘1’ కి తగ్గును.
AP Inter 1st Year Chemistry Study Material Chapter 2 మూలకాల వర్గీకరణ – ఆవర్తన ధర్మాలు 26

ii) గ్రూపులో :
గ్రూపులో సంయోజకత గ్రూపు సంఖ్యకు సమానమవుతుంది. (IV వ గ్రూపు వరకు) (లేదా) (8 – గ్రూపు సంఖ్యకు) సమానమవుతుంది. (V గ్రూపు తరువాత).

(b) కర్ణ సంబంధం :
“ఆధునిక ఆవర్తన పట్టికలో రెండవ పీరియడ్కు చెందిన మూలకం యొక్క ధర్మాలు, మూడవ పీరియడ్లోని తర్వాత గ్రూపుకి చెందిన మూలక ధర్మాలను పోలి ఉంటాయి. ఈ సంబంధాన్ని కర్ణ సంబంధం అంటారు”.
ఉదా : (Li, Mg); (Be, Al); (B, Si)
AP Inter 1st Year Chemistry Study Material Chapter 2 మూలకాల వర్గీకరణ – ఆవర్తన ధర్మాలు 27

c) మొదటి గ్రూపు :
మూలకాల ఆక్సైడ్ ధర్మాలు :
ఒకటవ గ్రూపులో పై నుండి కిందకు పోయే కొలది లోహ ధర్మం క్రమంగా పెరుగుతుంది. అందువలన మూలకాల ఆక్సైడ్ క్షారధర్మం కూడా పెరుగుతుంది.
ఉదా : Li2O యొక్క క్షారత్వం కన్నా Cs2O క్షారత్వం ఎక్కువ.

సాధించిన సమస్యలు (Solved Problems)

ప్రశ్న 1.
120 పరమాణు సంఖ్య ఉన్న మూలకం IUPAC పేరు, సంకేతం ఏది?
సాధన:
1, 2, 0ల వర్గాలు వరుసగా ఉన్, బై, నిల్లు కాబట్టి సంకేతం, పేరు వరుసగా ఉన్, ఉబ్బినిలియమ్.

AP Inter 1st Year Chemistry Study Material Chapter 2 మూలకాల వర్గీకరణ – ఆవర్తన ధర్మాలు

ప్రశ్న 2.
ఆవర్తన పట్టికలో ఐదో పీరియడ్లో 18 మూలకాలు ఉండటాన్ని ఏ విధంగా సమర్ధిస్తారు?
సాధన:
ఐదో పీరియడ్ ప్రాథమిక క్వాంటమ్ సంఖ్య n = 5 ఐన, l = 0, 1, 2, 3. లభ్యమయ్యే 4d, 5s, 5p ఆర్బిటాళ్ళ శక్తి క్రమం 5s < 4d < 5p. మొత్తం లభ్యమయ్యే ఆర్బిటాళ్ళ సంఖ్య 9 సమకూర్చగలిగే మొత్తం ఎలక్ట్రాన్ల సంఖ్య 18, కాబట్టి ఐదో పీరియడ్లో 18 మూలకాలుంటాయి.

ప్రశ్న 3.
Z = 117, 120 ఉన్న మూలకాలను ఇంకా కనుక్కోలేదు. ఏ గ్రూప్ / కుటుంబంలో వీటిని ఉంచుతారు? వాటి ఎలక్ట్రాన్ విన్యాసాలను తెలపండి.
సాధన:
Z = 117 గల మూలకం హాలోజన్ కుటుంబం (గ్రూప్ 17) కి చెందుతుందని తెలుస్తుంది, దాని ఎలక్ట్రాన్ విన్యాసం [Rn] 5f146d107s²7p5 అయి ఉండవచ్చు. Z = 120 గల మూలకాన్ని గ్రూప్ 2 (క్షారమృత్తికా లోహాలు)లో ఉంచవచ్చు, దాని ఎలక్ట్రాన్ విన్యాసం[Uuo]8s’ అయి ఉండవచ్చు.

ప్రశ్న 4.
కింద ఉన్న మూలకాలను పరమాణు సంఖ్య, ఆవర్తన పట్టికలోని స్థానం ప్రకారం, వాటి లోహ స్వభావం పెరిగే క్రమంలో అమర్చండి Si, Be, Mg, Na, P.
సాధన:
లోహ స్వభావం గ్రూప్ లో పై నుంచి కిందకు పెరుగుతుంది, పీరియడ్లో ఎడమ నుంచి కుడికి తగ్గుతుంది. కాబట్టి లోహ స్వభావం పెరిగే క్రమం : P < Si < Be < Mg < Na.

ప్రశ్న 5.
క్రింది వాటిలో వేటికి అత్యధిక పరిమాణం, అత్యల్ప పరిమాణం ఉంటాయి? Mg. Mg2+, Al, Al3+.
సాధన:
పరమాణు వ్యాసార్థం పీరియడ్లో తగ్గుతుంది. మూల పరమాణువుల కంటే కాటయాన్లు చిన్నవిగా ఉంటాయి. సమ ఎలక్ట్రానిక్ కణాలలో అత్యధిక ధన కేంద్రక ఆవేశం ఉన్న దానికి అత్యల్ప వ్యాసార్థం ఉంటుంది. కాబట్టి Mg కు అత్యధిక పరిమాణం, Al3+ కు అత్యల్ప పరిమాణం ఉంటాయి.

ప్రశ్న 6.
మూడవ పీరియడ్ మూలకాలైన Na, Mg, Si ల ప్రథమ అయొనైజేషన్ ఎంథాల్పీలు ∆iH వరసగా 496, 737, 786 kJ mol-1. Al ప్రథమ ∆iH విలువ 575, 760 kJ mol-1 లలో దేనికి దగ్గరగా ఉంటుందో ఊహించండి? సమాధానాన్ని సమర్థించండి.
సాధన:
575 kJ mol-1 కు దగ్గరగా ఉంటుంది. 3p – ఎలక్ట్రాన్లపై 35- ఎలక్ట్రాన్లకు ఉన్న ప్రభావిత యవనికా ప్రభావం వల్ల AI, Mg కంటె తక్కువ అయొనైజేషన్ ఎంథాల్పీ ఉంటుంది.

AP Inter 1st Year Chemistry Study Material Chapter 2 మూలకాల వర్గీకరణ – ఆవర్తన ధర్మాలు

ప్రశ్న 7.
కింది వాటిలో రుణాత్మక ఎలక్ట్రాన్ గ్రాహ్య ఎంథాల్పీ దేనికి ఎక్కువ, దేనికి తక్కువ? P, S, CI, F. సమాధానాన్ని విశదీకరించండి.
సాధన:
పీరియడ్లో సాధారణంగా ఎడమ నుంచి కుడికి, ఎలక్ట్రాన్ గ్రాహ్య ఎంథాల్పీ అధిక రుణాత్మకమవుతుంది. గ్రూప్ కిందకు, ఎలక్ట్రాన్ గ్రాహ్య ఎంథాల్పీ తక్కువ రుణాత్మకమవుతుంది. పెద్దదైన 3p – ఆర్బిటాల్లో ఎలక్ట్రాన్ చేరిక కంటే 2p- ఆర్బిటాల్లో ఎలక్ట్రాన్ చేరిక అధిక ఎలక్ట్రాన్ వికర్షణలకు దారితీస్తుంది. కాబట్టి, అధిక రుణాత్మక ఎలక్ట్రాన్ గ్రాహ్య ఎంథాల్పీ ఉన్న మూలకం క్లోరిన్, తక్కువ రుణాత్మక ఎలక్ట్రాన్ గ్రాహ్య ఎంథాల్పీ ఉన్న మూలకం ఫాస్ఫరస్.

ప్రశ్న 8.
కింద ఉన్న జంట మూలకాల నుంచి ఏర్పడు పదార్థాల ఫార్ములాలను, ఆవర్తన పట్టికను ఉపయోగించి కనుక్కోండి; (a) సిలికాన్, బ్రోమిన్, (b) అల్యూమినియం, సల్ఫర్.
సాధన:
a) 4 సంయోజకతగా ఉన్న సిలికాన్ 14వ గ్రూప్ మూలకం; 1 సంయోజకత కలిగిన బ్రోమిన్ హాలోజన్ గ్రూప్కు చెందింది. కాబట్టి, ఏర్పడే పదార్థం ఫార్ములా, SiBr4.

b) 3 సంయోజకతగా ఉన్న అల్యూమినియం 13వ గ్రూప్కు చెందింది. సంయోజకత 2 గల సల్ఫర్ 16వ గ్రూప్ మూలకం. కాబట్టి, ఏర్పడు పదార్థం ఫార్ములా Al2S3.

ప్రశ్న 9.
[AlCl(H2O)5]2+ లో Al ఆక్సీకరణ స్థితి, సంయోజనీయత ఒకే విధంగా ఉంటుందా?
సాధన:
ఉండదు: Al ఆక్సీకరణ స్థితి +3 సమయోజనీయత 6.

AP Inter 1st Year Chemistry Study Material Chapter 2 మూలకాల వర్గీకరణ – ఆవర్తన ధర్మాలు

ప్రశ్న 10.
Na2O క్షార ఆక్సైడ్ అనీ, Cl2O7 ఆమ్ల ఆక్సైడ్ అనీ, నీటితో రసాయన చర్య ద్వారా చూపండి.
సాధన:
Na2O నీటితో బలమైన క్షారాన్ని Cl2O7 బలమైన ఆమ్లాన్ని ఏర్పరుస్తాయి.
Na2O + H2O → 2NaOH
Cl2O7 + H2O → 2HClO4
వాటి క్షార, ఆమ్ల ప్రవృత్తిని లిట్మస్ కాగితంతో గుణాత్మకంగా పరీక్షించవచ్చు.

AP Inter 1st Year Chemistry Study Material Chapter 8 హైడ్రోజన్ – దాని సమ్మేళనాలు

Andhra Pradesh BIEAP AP Inter 1st Year Chemistry Study Material 8th Lesson హైడ్రోజన్ – దాని సమ్మేళనాలు Textbook Questions and Answers.

AP Inter 1st Year Chemistry Study Material 8th Lesson హైడ్రోజన్ – దాని సమ్మేళనాలు

అతిస్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
హైడ్రోజన్ ఐసోటోపులు మూడు వాటి చర్యావేగాల్లో భేదపడతాయి. కారణాలు తెలపండి.
జవాబు:
హైడ్రోజన్ మూడు రకాల సమస్థానీయాలను కలిగి ఉంది. అవి వరుసగా 1) ప్రోటియం 2) డ్యుటీరియం 3) ట్రిటియం. ఈ మూడు సమస్థానీయాలలో వరుసగా 0, 1, 2 న్యూట్రాన్లు ఉంటాయి. వీటిలో ట్రిటియం రేడియోధార్మికత కలిగి ఉంటుంది.

భేదాలు :

  1. ప్రోటియంలో న్యూట్రాన్లు ఉండవు. డ్యుటీరియంలో 1 న్యూట్రాన్ ఉంటుంది. ట్రిటియంలో రెండు న్యూట్రాన్లు ఉంటాయి.
  2. ఈ సమస్థానీయాలు వాటి ద్రవ్యరాశిలో భేదిస్తాయి.
  3. డ్యుటీరియం కన్నా హైడ్రోజన్ చర్యాశీలత ఎక్కువ.

ప్రశ్న 2.
అధిక ద్రవీభవన స్థానాలున్న లోహాలను వెల్డింగ్ చేయటానికి డైహైడ్రోజనన్ను ఎందుకు వాడతారు?
జవాబు:
హైడ్రోజన్ యొక్క ముఖ్యమయిన అనుకరణం ఆక్సీ-హైడ్రోజన్ టార్చ్, ఆక్సీ-హైడ్రోజన్ బ్లో టార్చ్ శుద్ద ఆక్సిజన్తో హైడ్రోజను మండించినప్పుడు అధిక జ్వాల ఉష్ణోగ్రత (2800°C) వస్తుంది. దీన్ని వెల్డింగ్ చేయడానికి, ప్లాటినం లోహం, క్వార్ట్లలను ద్రవీకరించడానికి వాడతారు. హైడ్రోజన్ వెల్డింగ్ టార్ను కూడా వెల్డింగ్ పనులకే వాడతారు కాని హైడ్రోజన్ పరమాణువుల పునఃసంకలనోష్టాన్ని అధిక ఉష్ణోగ్రతలను పొందటానికి (>3000°C) ఉపయోగిస్తారు.

ప్రశ్న 3.
అత్యంత శుద్ధమైన డైహైడ్రోజన్ ను తయారుచేయడానికి ఒక పద్ధతిని వివరించండి.
జవాబు:
అత్యంత శుద్ధమైన డై హైడ్రోజను వేడి Ba(OH)2 ద్రావణాన్ని నికెల్ విద్యుద్ఘాటాల మధ్య విద్యుద్విశ్లేషణ చేసి పొందవచ్చు. ఇచ్చట 99.95% శుద్ధమైన H2 ఏర్పడును.

ప్రశ్న 4.
“సిన్ గ్యాస్” పదాన్ని వివరించండి.
జవాబు:
CO మరియు H2 ల మిశ్రమం మిథనోల్ మరియు అనేక హైడ్రోకార్బన్ల సంశ్లేషణకు ఉపయోగపడును. ఈ మిశ్రమాన్ని సిస్ గ్యాస్ అంటారు.

తయారీ :
AP Inter 1st Year Chemistry Study Material Chapter 8 హైడ్రోజన్ – దాని సమ్మేళనాలు 1

ప్రశ్న 5.
“కోల్ గాసిఫికేషన్” అంటే ఏమిటి? దానిని సరైన, తుల్య సమీకరణంతో వివరించండి.
జవాబు:
కోలన్ను ఉపయోగించి 1270K ఉష్ణోగ్రత వద్ద సిన్ గ్యాస్ ను తయారుచేయుటను కోల్ గ్యాసిఫికేషన్ అంటారు.
AP Inter 1st Year Chemistry Study Material Chapter 8 హైడ్రోజన్ – దాని సమ్మేళనాలు 2

ప్రశ్న 6.
హైడ్రైడ్ అంటే నిర్వచనం చెప్పండి. ఎన్ని రకాల హైడ్రైడ్లున్నాయి? వాటి పేర్లను చెప్పండి.
జవాబు:
జడవాయువులు తప్ప ఇతర మూలకాలతో హైడ్రోజన్ ఏర్పరచే ద్విగుణ సమ్మేళనాలను హైడ్రైడ్లు అంటారు.

హైడ్రైడ్లు మూడు రకాలు :

  1. అయానిక హైడ్రైడ్లు
  2. సంయోజనీయ హైడ్రైడ్లు
  3. లోహ హైడ్రైడ్లు.

AP Inter 1st Year Chemistry Study Material Chapter 7 రసాయనిక సమతాస్థితి, అమ్లాలు – క్షారాలు

ప్రశ్న 7.
ద్రవీకృత ప్రావస్థలో నీటికి అసాధారణ లక్షణం ఉంటుంది. అది నీటి అధిక బాష్పీభవనోష్టానికి దారితీస్తుంది. ఆ ధర్మం ఏమిటి?
జవాబు:
నీటిలో అంతర అణుక హైడ్రోజన్ బంధాలు కలవు. ఈ అసాధారణ ధర్మం వలన నీటికి అధిక ఘనీభవన స్థానం, బాష్పీభవన స్థానం మరియు అధిక బాష్పీభవనోష్టానికి దారితీస్తుంది.

ప్రశ్న 8.
శ్రీ కిరణజన్య సంయోగక్రియ జరుగుతున్నప్పుడు నీరు 0్మగా ఆక్సీకరణం చెందుతుంది. అయితే ఏ మూలకం క్షయకరణం చెందుతుంది?
జవాబు:
కిరణజన్య సంయోగక్రియ జరిగినపుడు కార్బన్ క్షయకరణం చెందును.
AP Inter 1st Year Chemistry Study Material Chapter 8 హైడ్రోజన్ – దాని సమ్మేళనాలు 3

ప్రశ్న 9.
“స్వయం ప్రోటోలసిస్” అంటే మీకేమి తెలుస్తుంది? నీటి స్వయం ప్రోటోలసిసికి సమీకరణాన్ని రాయండి.
జవాబు:
నీటి యొక్క ఆటోప్రోటాలిసిస్ ఈ క్రింది విధంగా జరుగుతుంది.
AP Inter 1st Year Chemistry Study Material Chapter 8 హైడ్రోజన్ – దాని సమ్మేళనాలు 4

సార్థకత :
దీనిని బట్టి నీటి ద్విస్వభావ లక్షణం తెలుస్తుంది. అంటే క్షారాలను తనలో కరిగించుకునేటప్పుడు నీరు బ్రౌన్ స్టెడ్ ఆమ్లంగాను, ఆమ్లాన్ని కరిగించుకునేటప్పుడు బ్రౌన్టెడ్ క్షారంగాను పనిచేస్తుంది.

ప్రశ్న 10.
బ్రానెడ్ సిద్ధాంతపరంగా నీరు ద్విస్వభావం గల పదార్థం. దానిని మీరు ఎట్లా వివరిస్తారు ?
జవాబు:
ద్విస్వభావ లక్షణం :
క్షారాలను తనలో కరిగించుకునేటప్పుడు నీరు బ్రౌన్టెడ్ ఆమ్లంగానూ, ఆమ్లాన్ని కరిగించుకునేటప్పుడు బ్రౌన్ స్టెడ్ క్షారంగాను పనిచేస్తుంది. దీనిని బట్టి నీటి ద్విస్వభావ లక్షణం తెలుస్తుంది. ఇది స్వయం అయనీకరణం జరగడం వల్ల అవుతుంది.
AP Inter 1st Year Chemistry Study Material Chapter 8 హైడ్రోజన్ – దాని సమ్మేళనాలు 5

స్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
NH3 H2O, HF ల బాష్పీభవన స్థానాలు, ఆయా గ్రూపుల్లో వాటి తరువాత మూలకాల హైడ్రైడ్ల బాష్పీభవన స్థానాలకంటే ఎక్కువగా ఉంటాయి. మీ కారణాలు చెప్పండి.
జవాబు:
NH3, H2O, HF ల బాష్పీభవన స్థానాలు, ఆమ్ల గ్రూపుల్లో వాటి తరువాత మూలకాల హైడ్రైడ్ల బాష్పీభవన స్థానాల కంటే ఎక్కువగా ఉంటాయి.

వివరణ :

  • NH3, H2O మరియు HF లు ఎలక్ట్రాన్లు అధికంగా గల హైడ్రైడ్లు వీటిలో N, O, Fలపై 1, 2, 3 ఒంటరి ఎలక్ట్రాన్ జంటలు గలవు.
  • అధిక ఋణవిద్యుదాత్మకత మూలకాలపై ఒంటరి ఎలక్ట్రాన్ జంటలుండుట వలన హైడ్రోజన్ బంధాలు ఏర్పడతాయి.
  • ఈ హైడ్రోజన్ బంధాలు ఏర్పడుట వలన ఈ హైడ్రైడ్లకు అధిక బాష్పీభవన స్థానాలుంటాయి.

ప్రశ్న 2.
ఆవర్తన పట్టికలో హైడ్రోజన్ స్థానాన్ని దాని ఎలక్ట్రాన్ విన్యాసరపరంగా చర్చించండి.
జవాబు:
హైడ్రోజన్ ఒక ఎలక్ట్రాన్ను పోగొట్టుకుని ఏకమాత్రధనావేశిత అయానన్ను ఇస్తుంది. క్షారలోహాలు కూడా ఎలక్ట్రాన్ను పోగొట్టుకుని ఏకమాత్ర ధనావేశిత అయాన న్ను ఇస్తాయి. కాబట్టి హైడ్రోజనన్ను IA గ్రూప్ మూలకాలతో కలపవచ్చు.

హైడ్రోజన్ ఒక ఎలక్ట్రానన్ను కలుపుకుని ఏకమాత్ర ఋణావేశిత అయానన్ను ఇస్తుంది. అందువలన దానిని ఏకమాత్ర ఋణావేశిత అయాన్ను ఇచ్చే హాలోజన్ (VIIA) గ్రూప్తో కూడా కలపవచ్చు.

హైడ్రోజన్ ఎలక్ట్రాన్లో 1s ఆర్బిటాల్లో ప్రవేశించటం వలన దానిని IA గ్రూప్ మూలకాలతోనే కలపటం జరిగింది. . అయినప్పటికి దాని స్థానం సరిగా లేదు.

ప్రశ్న 3.
హైడ్రోజన్ ఎలక్ట్రాన్ విన్యాసం దాని రసాయన ధర్మాలకు ఎట్లా అనువుగా ఉంటుంది?
జవాబు:

  • ‘H’ యొక్క ఎలక్ట్రాన్ విన్యాసం 1s¹.
  • డైహైడ్రోజన్ న్ను UV కిరణాలతో చర్య జరుపుట ద్వారా ఏర్పడిన పరమాణుక హైడ్రోజన్ దాదాపుగా అన్ని మూలకాలతో చర్య జరుపును.
  • ఈ పరమాణు హైడ్రోజన్ అన్ని చర్యలను పూర్తి చేయును.
    a) ఒక ఎలక్ట్రాన్ కోల్పోయి H+ ను
    b) ఒక ఎలక్ట్రాన్ గ్రహించి H ను
    c) ఎలక్ట్రాన్ల పంచుకొని సంయోజనీయ బంధాలను ఏర్పరచును.
    ఉదా : 1) H2(వా) + F2(వా) → 2HF(వా)
    2) 2Li(ఘ)+ H2(వా) → 2LiH

AP Inter 1st Year Chemistry Study Material Chapter 7 రసాయనిక సమతాస్థితి, అమ్లాలు – క్షారాలు

ప్రశ్న 4.
a) క్లోరిన్, b) సోడియం లోహంలతో డైహైడ్రోజన్ చర్య జరిపితే ఏమవుతుంది? వివరించండి.
జవాబు:
a) డైహైడ్రోజన్లో క్లోరిన్ చర్య :
డై హైడ్రోజన్ క్లోరిన్తో చర్య జరిపి హైడ్రోజన్ క్లోరైడ్ను ఏర్పరచును. ఈ చర్య సూర్యకాంతి సమక్షంలో జరుగును.
AP Inter 1st Year Chemistry Study Material Chapter 8 హైడ్రోజన్ – దాని సమ్మేళనాలు 6

b) సోడియం లోహంతో చర్య :
డై హైడ్రోజన్ అధిక చర్యశీలత గల సోడియంతో చర్య జరిపి సోడియం హైడ్రైడ్ను ఏర్పరచును.
AP Inter 1st Year Chemistry Study Material Chapter 8 హైడ్రోజన్ – దాని సమ్మేళనాలు 7

ప్రశ్న 5.
భారజలం పై ఒక వ్యాఖ్యను రాయండి.
జవాబు:
డ్యుటీరియం ఆక్సైడ్ను భారజలం అంటారు.
తయారీ :
భారజలాన్ని సాధారణ జలంను విద్యుద్విశ్లేషణ చేసి పొందవచ్చు.

  • మోలార్ ద్రవ్యరాశి, ద్రవీభవన స్థానం, బాష్పీభవన స్థానం లాంటి భౌతిక ధర్మాలు భారజలంకు నీటికంటే ఎక్కువగా ఉంటాయి.
  • కానీ డై ఎలక్ట్రిక్ స్థిరాంకం, ద్రావణీయత భారజలంకు నీటి కంటే తక్కువ.

రసాయన ధర్మాలు :
1. వినిమయ చర్యలు :
భారజలం వివిధ సమ్మేళనాలలోని ‘H’ పరమాణువులను పూర్తిగా గాని లేక పాక్షికంగా గాని భార హైడ్రోజన్తో ప్రతిక్షేపిస్తుంది. ఇట్టి చర్యలనే వినిమయ చర్యలు అంటారు.
ఉదా : HCl + D2O → DCl + HDO

2. డ్యుటిరాలిసిస్ :
సాధారణ జలం వలె భారజలం కూడా కొన్ని లవణాలను జలవిశ్లేషణ చెందిస్తుంది. దీనిని డ్యుటిరాలిసిస్
అంటారు.
ఉదా : AlCl3 + 3D2O → Al(OD)3 + 3DCl

3. డ్యుటిరేట్లను ఇచ్చుట :
సాధారణ జలం వలె, భారజలం కూడా కొన్ని లవణాలలో స్ఫటిక జలంగా ఉంటుంది. వీటినే డ్యుటిరో హైడ్రేటులు అంటారు.
ఉదా : CuSO4. 5D2O, MgSO4.D2O

ఉపయోగాలు :

  1. న్యూక్లియర్ రియాక్టర్లలో మితకారిగా ఉపయోగిస్తారు.
  2. మొక్కలు, జంతువులలో జరిగే చర్యల అధ్యయనానికి ట్రేసర్ విధానంలో ట్రేసర్గా ఉపయోగిస్తారు.
  3. క్రిమిసంహారిణిగాను, సూక్ష్మసంహారిణిగాను ఉపయోగిస్తారు.

ప్రశ్న 6.
హైడ్రోజన్ ఐసోటోపుల పేర్లను తెలపండి. ఈ ఐసోటోపుల ద్రవ్యరాశుల నిష్పత్తి ఏమిటి ?
జవాబు:
హైడ్రోజన్ ఐసోటోపులు :
ప్రోటియం (1H¹ లేక P), డ్యుటీరియం (1H² లేక D) మరియు ట్రిటియం (1H³ లేక T).

  • ట్రిటియం రేడియోధార్మిక ఐసోటోప్.
  • ఈ ఐసోటోప్ల ద్రవ్యరాశుల నిష్పత్తి : 1 : 2 : 3 (P : D : T)
  • ప్రోటియంలో న్యూట్రాన్లు లేవు. డ్యుటీరియంలో ఒకటి, ట్రిటియంలో రెండు న్యూట్రాన్లు కలవు.

ప్రశ్న 7.
“వాటర్ గ్యాస్ షిప్” చర్య అంటే ఏమిటి? ఈ చర్యతో హైడ్రోజన్ తయారీని ఎట్లా పెంచగలరు?
జవాబు:
CO మరియు H2 ల మిశ్రమాన్ని జలవాయువు (వాటర్ గ్యాస్) అంటారు. దీనినే సిస్ గ్యాస్ అంటారు.

“వాటర్ గ్యాస్ షిఫ్ట్ చర్య” :
సిగ్గ్యాస్ మిశ్రమంలోని CO, ఐరన్ క్రోమేట్ ఉత్ప్రేరక సమక్షంలో చర్య జరుపుటను వాటర్ గ్యాస్ షిఫ్ట్ చర్య అంటారు.

ఈ చర్య ద్వారా డైహైడ్రోజన్ ఉత్పత్తి పెంచవచ్చు.
AP Inter 1st Year Chemistry Study Material Chapter 8 హైడ్రోజన్ – దాని సమ్మేళనాలు 10

ప్రశ్న 8.
కింది చర్యలను పూర్తిచేసి, తుల్యం చేయండి.
AP Inter 1st Year Chemistry Study Material Chapter 8 హైడ్రోజన్ – దాని సమ్మేళనాలు 8
జవాబు:
AP Inter 1st Year Chemistry Study Material Chapter 8 హైడ్రోజన్ – దాని సమ్మేళనాలు 9

ప్రశ్న 9.
13వ గ్రూపు మూలకాలు ఏర్పరచే హైడ్రేడ్ల స్వభావం ఏమిటి ?
జవాబు:

  • 13వ గ్రూపు మూలకాలు p-బ్లాకుకు చెందుతాయి.
  • ఇవి సంయోజనీయ (లేదా) అణు హైడ్రైడ్లను ఏర్పరుస్తాయి.
  • ఈ అణు హైడ్రైడ్లు మూడు రకాలుగా కలవు.
    1) ఎలక్ట్రాన్ న్యూనత హైడ్రైడ్లు
    2) ఎలక్ట్రాన్ ఖచ్చిత హైడ్రైడ్లు
    3) ఎలక్ట్రాన్ అధిక హైడ్రైడ్లు
  • 13వ గ్రూపు మూలకాలు ఎలక్ట్రాన్ న్యూనత హైడ్రేడ్లను ఏర్పరుస్తాయి. వీటిలో లూయీ నిర్మాణం వ్రాయుటకు అవసరమగు ఎలక్ట్రాన్లు ఉండవు.
  • ఇవి లూయీ ఆమ్లాలుగా పనిచేస్తాయి. ఇవి ఎలక్ట్రాన్ జంటను స్వీకరించి సమన్వయ సంయోజనీయ బంధాలు ఏర్పరుస్తాయి.

AP Inter 1st Year Chemistry Study Material Chapter 7 రసాయనిక సమతాస్థితి, అమ్లాలు – క్షారాలు

ప్రశ్న 10.
సంశ్లేషిత రెజిన్ పద్ధతి, అయాన్ వినిమయ రెజిన్ పద్ధతుల్లో జలకాఠిన్యతను తొలగించడానికి ఉపయోగించే సూత్రాన్ని, పద్ధతిని వివరించండి.
జవాబు:
సంశ్లేషిత అయాన్ – వినిమయ రెజిన్ పద్ధతి :

  • ప్రస్తుత రోజులలో ఈ పద్ధతిని కఠిన జలాన్ని సాధుజలంగా మార్చుటకు ఎక్కువగా ఉపయోగిస్తున్నారు.
  • ఈ పద్ధతిలో సంశ్లేషక రెజిన్లు వాడుతారు. ఇది పర్మిట్ పద్ధతి కంటే ఉపయోగకరమైనది.

సూత్రం :
కఠిన జలాన్ని కాటయాన్, ఆనయాన్ గొట్టాల ద్వారా పంపుతూ అయాన్రహిత నీటిని ఏర్పరుచుట.

అయాన్రహిత నీరు అనగా ఎటువంటి ఖనిజ లవణాలు లేని నీరు.

విధానం : ఈ పద్ధతి రెండు దశలలో జరుగును.
Step – I : కాటయాన్ మార్పిడి పద్ధతి.
Step – II : ఆనయాన్ మార్పిడి పద్ధతి.

Step – I : కాటయాన్ మార్పిడి పద్ధతి:

  • ఈ పద్ధతిలో – SO3Hసమూహం కలిగిన పెద్ద కర్బన అణువులు సంశ్లేషక రెజిన్లు (R – SO3H)
    R = ఆల్కైల్ సమూహం.
  • మొట్టమొదట సంశ్లేషక రెజిన్ NaCI తో చర్య జరిపి RNaగా మారును.
  • ఈ RNa, కఠినజలంలోకి Ca+2 మరియు Mg+2 అయాన్లను మార్పిడి చేసి సాధుజలంగా మారును.
    2 Na(ఘ) + M+2(జ) → R2M(ఘ) + 2 Na+(జ)
  • NaCl జల ద్రావణం ఉపయోగించి రెజిన్ ను పునరుత్పత్తి చేయవచ్చు.
  • ఈ దశలో H+ అయాన్లు ఏర్పడును.
    2 RH(ఘ) + M+2(జ) → MR2M(ఘ) + 2 H+(జ)

Step – II : ఆనయాన్ మార్పిడి పద్ధతి:
ఈ పద్ధతిలో RNH3OH ను సంశ్లేషక రెజిన్ గా వాడతారు.
రెజిన్కు సంబంధించిన Cl, SO-24, HCO3 లు OH అయాన్లను మార్పిడి చేయును.
AP Inter 1st Year Chemistry Study Material Chapter 8 హైడ్రోజన్ – దాని సమ్మేళనాలు 11
పైన ఏర్పడిన H+ మరియు OH అయాన్లు చర్య జరిపి అయాన్ రహిత జలం ఏర్పడును.
AP Inter 1st Year Chemistry Study Material Chapter 8 హైడ్రోజన్ – దాని సమ్మేళనాలు 12

ప్రశ్న 11.
ఇంధనంగా హైడ్రోజన్ ఉపయోగాన్ని గురించి కొన్ని వాక్యాలు రాయండి. [Mar. ’13]
జవాబు:

  1. కోల్గ్యాస్, వాటర్ గ్యాస్ల రూపంలో హైడ్రోజను పారిశ్రామిక ఇంధనంగా వాడతారు.
  2. ఆక్సీహైడ్రోజన్ బ్లోటార్చ్ సహాయంతో ప్లాటినం, క్వార్ట్జ్ మొదలగువానిని కరిగించటం, వెల్డింగ్ చేయటం చేస్తారు.
  3. కార్బొరేటెడ్ వాటర్ గ్యాస్, సెమీవాటర్ గ్యాస్లను కూడా ఇంధనంగా ఉపయోగిస్తారు.
  4. హైడ్రోజన్ను విద్యుత్ శక్తిని ఉత్పత్తి చేయుటకు ఇంధన ఘటాలతో ఉపయోగిస్తారు.
  5. చతుర్చక్ర వాహనాలలో 5% హైడ్రోజన్ ఉన్న CNG ని ఉపయోగిస్తారు.

ప్రశ్న 12.
1% H2O2 ద్రావణాన్ని మీకు ఇచ్చాం. దాని నుంచి శుద్ద H2O2ని తయారుచేయడానికి మీరు ఏమి చర్యలను తీసుకుంటారు?
జవాబు:
ఇవ్వబడిన 1% H2O2 నుండి శుద్ధ H2O2 ను క్రింది విధంగా పొందవచ్చు.
Step – I :
తగ్గించిన పీడనం వద్ద ఇవ్వబడిన 1% H2O2 ద్రావణాన్ని జాగ్రత్తగా నీరు ఉన్న పాత్రలో వేడిచేయవలెను. ఇచ్చట 30% H2O2 ఏర్పడును.,

Step – II :
పై దశలోని ద్రావణాన్ని స్వేదన కుప్పెలో తక్కువ పీడనం వద్ద అనగా 15మి.మీ. పీడనం వద్ద వేడిచేయవలెను. ఇచ్చట 85% H2O2 ఏ ద్రావణం ఏర్పడును.

Step – III :
పై దశలోని నమూనాను ఘనీభవనం చేసి H2O2 స్ఫటికాలను పొందవచ్చు. ( శుద్ధత ≅ 100%).

AP Inter 1st Year Chemistry Study Material Chapter 7 రసాయనిక సమతాస్థితి, అమ్లాలు – క్షారాలు

ప్రశ్న 13.
ఆధునిక కాలంలో H2O2 కి ఏవైనా మూడు ఉపయోగాలను చెప్పండి.
జవాబు:

  1. గాయాలను శుభ్రపరచడానికి ఉపయోగిస్తారు.
  2. సిల్కు, దంతాలు, ఉన్ని మొదలైన వానిని విరంజనం చేయడానికి ఉపయోగిస్తారు.
  3. ప్రయోగశాలలో ఆక్సీకరణిగా ఉపయోగిస్తారు.
  4. ఎక్కువ గాఢత గల H2O2 ద్రావణాన్ని రాకెట్లలో ఇంధనంగా వాడతారు.
  5. H2O2 ను హరిత రసాయనశాస్త్రంలో కాలుష్యాన్ని తగ్గించుటకు ఉపయోగిస్తారు.
  6. అధిక నాణ్యత గల డిటర్జెంట్ల తయారీలో వాడుతారు.
  7. ఆహార ఉత్పత్తులు, ఔషధ పరిశ్రమలలో ఉపయోగిస్తారు.

దీర్ఘ సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
వ్యాపార సరళిలో డైహైడ్రోజన్ని తయారుచేయడంపై ఒక వ్యాసం రాయండి. తుల్య సమీకరణాలను ఇవ్వండి.
జవాబు:
వ్యాపార సరళిలో డై హైడ్రోజన్ తయారీ
i) హైడ్రోకార్బన్ల నుండి :
హైడ్రో కార్బన్ల ఉత్ప్రేరక సమక్షంలో నీటి ఆవిరితో చర్య జరిపి హైడ్రోజన్ ను ఏర్పరచును.
AP Inter 1st Year Chemistry Study Material Chapter 8 హైడ్రోజన్ – దాని సమ్మేళనాలు 13

ii) నీటిని విద్యుత్ విశ్లేషణ చేయుట :
ఆమ్లీకృత(లేదా) క్షారీకృత నీటిని విద్యుద్విశ్లేషణ చేసి హైడ్రోజన్ వాయువును ఏర్పరచును .
AP Inter 1st Year Chemistry Study Material Chapter 8 హైడ్రోజన్ – దాని సమ్మేళనాలు 14

iii) నెల్సన్ పద్ధతి :
బ్రైన్ ద్రావణాన్ని విద్యుద్విశ్లేషణ చేయుట ద్వారా H2 ను పొందవచ్చు.
2NaCl → 2Na+ + 2Cl
2Cl → Cl2 + 2e(ఆనోడ్)
2H2O + 2e → H2 + 2OH(కాథోడ్)
2Na+ + 20H → 2 NaoH

iv) అత్యంత శుద్ధ డై హైడ్రోజన్ న్ను వేడి Ba(OH)2 జలద్రావణాన్ని విద్యుద్విశ్లేషణ చేయగా ఏర్పడును.

v) సిన్ గ్యాస్ నుండి : సిన్ గ్యాస్ నుండి డై హైడ్రోజను ఉత్పత్తి చేయవచ్చు.
AP Inter 1st Year Chemistry Study Material Chapter 8 హైడ్రోజన్ – దాని సమ్మేళనాలు 15

ప్రశ్న 2.
i) N2
ii) లోహ అయాన్లు, లోహ ఆక్సైడ్లు
iii) కర్బన సమ్మేళనాలు.
వీటితో చర్యలను బట్టి డైహైడ్రోజన్ రసాయనశాస్త్రాన్ని వివరించండి.
జవాబు:
i) నైట్రోజన్, హైడ్రోజన్ వాయువులను 450°C, 500°C వద్ద 250 అట్మా పీడనంలో చర్య జరిపిస్తే అమ్మోనియా ఏర్పడుతుంది.
AP Inter 1st Year Chemistry Study Material Chapter 8 హైడ్రోజన్ – దాని సమ్మేళనాలు 16

ii) a) లోహ అయాన్లతో చర్య :
లోహ అయాన్లను జలద్రావణంలో లోహాలుగా హైడ్రోజన్ క్షయకరణం చెందించును.
H2 + Pd+2 → Pd + 2H+

b) లోహ ఆక్సైడ్లతో చర్య : లోహ ఆక్సైడ్లను లోహాలుగా క్షయకరణం చెందించును.
WO3 + 3H2 → W + 3H2O

iii) కర్బన సమ్మేళనాలతో చర్య :
ఆల్కీన్లు హైడ్రోఫార్మాయిలేషన్ జరిపి ఆల్డిహైడ్లను ఏర్పరచును. ఈ ఆల్డీహైడ్లు క్షయకరణ జరిపి ఆల్కహాల్లుగా మార్చును.
AP Inter 1st Year Chemistry Study Material Chapter 8 హైడ్రోజన్ – దాని సమ్మేళనాలు 17

పారిశ్రామిక రసాయనాల తయారీ :
డై హైడ్రోజన్ పారిశ్రామిక రసాయనాలైన CH3OH, NH3, HCl ల తయారీలో ఉపయోగపడును.
AP Inter 1st Year Chemistry Study Material Chapter 8 హైడ్రోజన్ – దాని సమ్మేళనాలు 18

ప్రశ్న 3.
కింది వాటిని సరైన ఉదాహరణలతో వివరించండి. [Mar. ’14]
i) ఎలక్ట్రాన్ కొరత గల హైడ్రైడ్లు
ii) ఎలక్ట్రాన్లు కచ్చితంగా ఉన్న హైడ్రైడ్లు
iii) ఎలక్ట్రాన్లు అధికంగాగల హైడ్రైడ్లు
జవాబు:
i) ఎలక్ట్రాన్ కొరత హైడ్రైడ్లు :
ఏ అణు హైడ్రైడ్లలో అయితే లూయీ నిర్మాణాన్ని వ్రాయుటకు అవసరమైన వేలన్సీ ఎలక్ట్రాన్లు ఉండవో అటువంటి అణు హైడ్రైడ్లను ఎలక్ట్రాన్ కొరత హైడ్రైడ్లు అంటారు.
ఉదా : (AlH3)n, B2H6 మొదలగునవి.

ii) ఎలక్ట్రాన్ ఖచ్చిత హైడ్రైడ్లు :
ఏ అణు హైడ్రేడ్లలో అయితే లూయి నిర్మాణాన్ని వ్రాయుటకు సరిగా అవసరమగు వేలన్సీ ఎలక్ట్రాన్లు ఉంటాయో ఆ అణు హైడ్రైడ్లను ఎలక్ట్రాన్ ఖచ్చిత హైడ్రైడ్లు అంటారు.
ఉదా : CH4 C2H6 మొదలగునవి.

iii) ఎలక్ట్రాన్ అధిక హైడ్రేడ్లు :
ఏ అణు హైడ్రైడ్లలో అయితే లూయీ నిర్మాణాన్ని వ్రాయుటకు అవసరమగు వేలన్సీ ఎలక్ట్రాన్ల కంటే అధికంగా ఉంటాయో ఆ అణుహైడ్రైడ్లను ఎలక్ట్రాన్ అధిక హైడ్రైడ్లు అంటారు.
AP Inter 1st Year Chemistry Study Material Chapter 8 హైడ్రోజన్ – దాని సమ్మేళనాలు 19

ప్రశ్న 4.
i) అయానిక హైడ్రైడ్లు ii) అల్పాంతరాళ హైడ్రైడ్ల గూర్చి క్లుప్తంగా రాయండి.
జవాబు:
i) అయానిక హైడ్రేడ్లు :

  • వీటినే లవణాల వంటి హైడ్రైడ్లు అంటారు. (సాలైన్ హైడ్రైడ్లు)
  • s – బ్లాకు మూలకాలు ఈ హైడ్రేడ్లను ఏర్పరుస్తాయి.
  • ఇవి స్టాయిక్యామెట్రిక్ సమ్మేళనాలు. ఉదా : LiH, NaH మొదలగునవి.
  • తయారీ : లోహాన్ని నేరుగా H2 తో సంయోగం ద్వారా పొందవచ్చు.
    AP Inter 1st Year Chemistry Study Material Chapter 8 హైడ్రోజన్ – దాని సమ్మేళనాలు 20

భౌతిక ధర్మాలు :

  • ఇవి స్ఫటికా సమ్మేళనాలు అధిక ద్రవీభవనస్థానం కలిగి ఉంటాయి.
  • ఇవి ఘన స్థితిలో విద్యుద్వాహకత ప్రదర్శించవు. గలనస్థితిలో ప్రదర్శిస్తాయి.

రసాయన ధర్మాలు :

  • ఈ హైడ్రైడ్లను విద్యుద్విశ్లేషణ చేయగా డైహైడ్రోజన్ వాయువును ఏర్పరచును.
    2H → H2 + 2e (ఆనోడ్)
  • లిథియం హైడ్రైడ్ నుండి 4A/HA ను తయారు చేయవచ్చు
    8LiH + Al2C6 → 2LiAlH6 + 6LiCl
  • ఈ హైడ్రైడ్లు నీటితో చర్య జరిపి H2 వాయువును ఏర్పరచును.
    LiH + H2O → LiOH + H2

ii) అల్పాంతరాళ హైడ్రైడ్లు :
d – బ్లాకు లేదా f – బ్లాకు మూలకాలు హైడ్రోజన్తో సంయోగం చెంది అల్పాంతరాళ హైడ్రేడ్లను ఏర్పరచును.
ఉదా : CrH, CrH2, ZnH2

  • వీటినే లోహ హైడ్రైడ్లు అంటారు. ఈ హైడ్రైడ్లలో లోహజాలకంలోని అల్పాంతరాళాలలో హైడ్రోజన్ ఆక్రమణ జరుగును.
  • లోహము కంటే లోహ హైడ్రైడ్క విద్యుద్వాహకత తక్కువ.
  • 7, 8 మరియు 9 గ్రూపు మూలకాలు ఈ హైడ్రైడ్లను ఏర్పరచవు. 6వ గ్రూపులో క్రోమియం మాత్రమే ఏర్పరచును.

AP Inter 1st Year Chemistry Study Material Chapter 7 రసాయనిక సమతాస్థితి, అమ్లాలు – క్షారాలు

ప్రశ్న 5.
నీటి రసాయన ధర్మాలను ఏ నాలుగింటినైనా విశదీకరించండి.
జవాబు:
i) జలవిశ్లేషణ :
ఏదేని సమ్మేళనంలో నీరు రసాయన చర్య జరుపుటను జలవిశ్లేషణ అంటారు.

అధిక డై ఎలక్ట్రిక్ స్థిరాంకం వలన హైడ్రేటింగ్ సామర్థ్యం నీటికి ఎక్కువ.
AP Inter 1st Year Chemistry Study Material Chapter 8 హైడ్రోజన్ – దాని సమ్మేళనాలు 21

ii) హైడ్రోజన్ ఏర్పడుట :
ధనవిద్యుదాత్మక మూలకాలతో నీరు చర్య జరిపి డైహైడ్రోజన్ ను ఏర్పరచును.
2Na + 2H2O. → 2NaOH + H2

iii) కిరణజన్య సంయోగ క్రియ :
కిరణజన్య సంయోగక్రియలో నీరు ఆక్సిజన్ గా మారును.
6CO2 + 6H2O → C6H12O6 + 6O2

iv) హైడ్రేట్లను ఏర్పరచుట :
లవణాలు స్పటికీకరణంలో నీటి అణువుల ద్వారా హైడ్రేట్ లవణాలను ఏర్పరచవచ్చు.
ఉదా : BaCl2.2H2O, CuSO4. 5H2O

ప్రశ్న 6.
కఠినజలం, మృదుజలం అంటే వివరించండి. [T.S. Mar. ’15]
i) అయాన్-వినిమయ పద్ధతి
ii) కాల్గన్ పద్ధతులను నీటి కఠినత్వాన్ని తొలగించడానికి వాడకంపై వ్యాఖ్యను రాయండి. [A.P. Mar. ’15]
జవాబు:
కఠినజలం :
సబ్బుతో త్వరగా నురగను ఏర్పరచని నీటిని కఠినజలం అంటారు. కఠినజలంలో కఠినత్వం ఉంటుంది.

  • నీటిలో Ca, Mg లవణాల వలన కఠినత్వం వస్తుంది.
  • Ca, Mg బై కార్బొనేట్ల వల్ల అశాశ్వత కాఠిన్యత వస్తుంది.
  • Ca, Mg క్లోరైడ్లు, సల్ఫేట్ల వల్ల కఠినత్వం వస్తుంది.

మృదుజలం :
సబ్బుతో త్వరగా నురగను ఏర్పరచే నీటిని మృదుజలం అంటారు.
i) అయాన్ వినిమయ పద్ధతి:
ఈ పద్ధతిని జియొలైట్/ పెరుటిట్ ప్రక్రియ అనికూడా అంటారు. ఆర్ధ సోడియమ్ అల్యూమినియమ్ సిలికేట్ అంటే జియొలైట్/పెరుటిట్, సోడియమ్ అల్యూమినియమ్ సిలికేట్ (NaAlSiO4) ని క్లుప్తంగా చెప్పడం కోసం NaZ అని రాస్తారు. దీనిని కఠిన జలానికి కలిపినప్పుడు వినిమయ చర్యలు జరుగుతాయి.
AP Inter 1st Year Chemistry Study Material Chapter 8 హైడ్రోజన్ – దాని సమ్మేళనాలు 22

జియొలైట్లో ఉన్న సోడియమ్ అంతా ఖర్చు అయిపోయినప్పుడు అది వ్యయమైపోయింది అని అంటారు. దాన్ని సజల సోడియమ్ క్లోరైడ్ ద్రావణంతో అభిచర్యని జరిపి పునరుత్పత్తి చేస్తారు.
MZ2(ఘ) +2NaCl(జల) → 2NaZ(ఘ) +MCl2(జల)

ii) కాల్గన్ పద్ధతి :
సోడియమ్ హెక్సా మెటాఫాస్ఫేట్ (Na6P6O18) ని వ్యాపార సరళిలో “కాల్గన్” అంటారు. దీనిని కఠినజలానికి కలిపినప్పుడు కింది చర్యలు జరుగుతాయి.
AP Inter 1st Year Chemistry Study Material Chapter 8 హైడ్రోజన్ – దాని సమ్మేళనాలు 23
సంక్లిష్ట ఆనయాన్ Mg2+, Ca2+ అయాన్లను ద్రావణంలో ఉంచుతుంది.

ప్రశ్న 7.
హైడ్రోజన్ పెరాక్సైడ్ ఆక్సీకరణిగాను, క్షయకరణిగాను పనిచేయగలదు అనడానికి రసాయన చర్యలను రాసి సమర్థించండి.
జవాబు:
ఆక్సీకరణ ధర్మాలు :
1) నల్లని లెడ్ సల్ఫైడు తెల్లని లెడ్ సల్ఫేటుగా ఆక్సీకరణం చెందిస్తుంది.
PbS + 4H2O2 → PbSO4 + 4H2O

2) ఫెర్రస్ లవణాలను ఆమ్ల ద్రావణంలో ఫెర్రిక్ లవణాలుగా ఆక్సీకరణం చెందిస్తుంది.
2FeSO4 + H2SO4 + H2O2 → Fe2(SO4)3 + 2H2O

3) అయొడైడ్ లవణాల నుండి అయొడిన్ ను విడుదల చేస్తుంది.
2KI + H2SO4 + H2O2 → K2SO4 + 2H2O + I2

క్షయకరణ ధర్మాలు :
1) క్లోరిన్, బ్రోమిన్లను హైడ్రోజన్ క్లోరైడ్, హైడ్రోజన్ బ్రోమైడ్లుగా క్షయకరణం చెందిస్తుంది.
Cl2 + H2O2 → 2HCl + O2; Br2 + H2O2 → 2HBr + O2

2) సిల్వర్ ఆక్సైడ్ను సిల్వర్గా క్షయకరణం చెందిస్తుంది.
Ag2O + H2O2 → 2Ag + H2O + O2

3) ఓజోన్ ను, ఆక్సిజన్గా క్షయకరణం చెందిస్తుంది.
O3 + H2O2 → 2O2 + H2O

ప్రశ్న 8.
కింది రసాయన చర్యలను పూర్తి చేసి తుల్యం చేయండి.
i) PbS(ఘ) + H2O2 (జల)
ii) Mv O4 (జల) + H2O2(జల) →
iii) CaO(ఘ) + H2O(వా) →
iv) Ca,N,(ఘ) + H2O(ద్ర) →
పై చర్యలను (a) జలవిశ్లేషణ, (b) ఆక్సీకరణ-క్షయకరణ (c) హైడ్రేషన్ చర్యలుగా వర్గీకరించండి.
జవాబు:
AP Inter 1st Year Chemistry Study Material Chapter 8 హైడ్రోజన్ – దాని సమ్మేళనాలు 24
AP Inter 1st Year Chemistry Study Material Chapter 8 హైడ్రోజన్ – దాని సమ్మేళనాలు 25

AP Inter 1st Year Chemistry Study Material Chapter 7 రసాయనిక సమతాస్థితి, అమ్లాలు – క్షారాలు

ప్రశ్న 9.
హైడ్రోజన్ పెరాక్సైడ్ని తయారుచేయడానికి వివిధ పద్ధతులను వాటికి అనువైన రసాయన సమీకరణాలతో చర్చించండి. వీటిలో ఏ పద్దతి H2O2 ని తయారుచేయడానికి ఉపయోగపడుతుంది ?
జవాబు:
H2O2 తయారీ పద్ధతులు
i) ఆమ్లీకృత BaO2 నుండి అధిక నీటిని తొలగించి H2O2 ను తయారు చేయవచ్చు.
BaO2. 8H2O + H2SO → BaSO4 + H2O2 + 8H2O

ii) స్వయం ఆక్సీకరణ పద్ధతి:
2-ఇథైల్ ఆంత్రా క్వినోల్ను స్వయం ఆక్సీకరణం చేయగా H2O2 ఏర్పడును.
AP Inter 1st Year Chemistry Study Material Chapter 8 హైడ్రోజన్ – దాని సమ్మేళనాలు 26

iii) పెరాక్సోడైసల్ఫ్యూరిక్ ఆమ్లం నుండి : 50% H2SO4 ను విద్యుద్విశ్లేషణ చేయగా పెరాక్సోడైసల్ఫ్యూరిక్ ఆమ్లం ఏర్పడును. దీనిని జలవిశ్లేషణ చేయగా H2O2 ఏర్పడును.
2HSO4 → H2S2O8 → 2HSO4 + 2H+ + H2O2

D2O2 తయారీ :
K2S2O8 ను భారజలంతో చర్య జరుపగా D2O2 ఏర్పడును.
K2S2O8 + 2D2O → 2KDSO4 + D2O2

ప్రశ్న 10.
H2O2 గాఢతని ఎన్ని రకాలుగా మీరు చెప్పగలరు? 15 ఘనపరిమాణ H2O2 గాఢతని gL-1 లలో లెక్కగట్టండి. ఈ గాఢతను నార్మాలిటీ, మొలారిటీలలో తెలియజేయండి.
జవాబు:
H2O2 గాఢతను రెండు విధాలుగా చెప్పవచ్చును. 1) మొలారిటీ 2) నార్మాలిటీ

సమస్యసాధన :
→ 15ఘనపరిమాణ H2O2 ద్రావణం అనగా 1లీ. H2O2 15 లీ. O2STP వద్ద ఏర్పరుచును.
AP Inter 1st Year Chemistry Study Material Chapter 8 హైడ్రోజన్ – దాని సమ్మేళనాలు 27
AP Inter 1st Year Chemistry Study Material Chapter 8 హైడ్రోజన్ – దాని సమ్మేళనాలు 28

సాధించిన సమస్యలు (Solved Problems)

ప్రశ్న 1.
(i) క్లోరిన్, (ii) సోడియమ్, (iii) కాపర్ (ii) ఆక్సైడ్లతో హైడ్రోజన్ చర్యలపై వ్యాఖ్యానించండి.
సాధన:
(i) హైడ్రోజన్తో క్లోరిన్ చర్యలో హైడ్రోజన్ క్లోరైడ్ ఏర్పడుతుంది. H, Cl ల మధ్య ఒక ఎలక్ట్రాన్ జంటను పంచుకోవడంతో సమయోజనీయ అణువు ఏర్పడటానికి దారితీస్తుంది.

(ii) సోడియమ్ హైడ్రోజన్ను సోడియమ్ హైడ్రైడ్గా క్షయీకరిస్తుంది. Na నుంచి H కు ఒక ఎలక్ట్రాన్ బదిలీ అవుతుంది. Na+H అయానిక సమ్మేళనం ఏర్పడుతుంది.

(iii) హైడ్రోజన్ కాపర్ (II) ఆక్సైడ్ను కాపర్గా క్షయీకరిస్తుంది. కాపర్ సున్నా ఆక్సిడేషన్ స్థితిలో ఉంటుంది. హైడ్రోజన్ H2O గా ఆక్సీకరణం చెందుతుంది. H2O ఒక సమయోజనీయ అణువు.

ప్రశ్న 2.
H2O బాష్పీభవనస్థానం H2S కంటే ఎక్కువ. కారణాలు చెప్పండి.
సాధన:
అణుభారం ప్రకారం H2O బాష్పీభవనస్థానం H2S కంటే తక్కువ ఉండాలి అనుకొంటాం. కానీ రుణ విద్యుదాత్మకత ఎక్కువ కాబట్టి దాని హైడ్రైడ్ H2O లో హైడ్రోజన్ బంధ పరిమాణం చాలా చెప్పుకోదగినంత ఉంటుంది. కాబట్టి H2O బాష్పీభవనస్థానం H2S బాష్పీభవన స్థానం కంటే ఎక్కువ ఉంటుంది.

ప్రశ్న 3.
CuSO4, 5H2O లో హైడ్రోజన్ బంధిత జలాణువులు ఎన్ని ఉంటాయి?
సాధన:
కోఆర్డినేషన్ క్షేత్రం బయట ఉన్న ఒక్క జలాణువు మాత్రమే హైడ్రోజన్ బంధితజలం. మిగిలిన నాలుగు జలాణువులు సమన్వయ సమయోజనీయ జలాణువులు.

AP Inter 1st Year Chemistry Study Material Chapter 7 రసాయనిక సమతాస్థితి, అమ్లాలు – క్షారాలు

ప్రశ్న 4.
10 ఘనపరిమాణ హైడ్రోజన్ పెరాక్సైడ్ ద్రావణం గాఢతను లెక్క కట్టండి.
సాధన:
10 ఘనపరిమాణ H2O2 ద్రావణం అంటే IL H2O2 ద్రావణం STP వద్ద 10l ల ఆక్సిజన్ని ఇస్తుందని అర్థం.
2H2O2(ద్ర) → O2(వా) + H2O(ద్ర)
2 × 34g 22.4 L. STP వద్ద = 68 g
పై సమీకరణాన్ని బట్టి 22.4 l ల O2 ని 68g. H2O2 STP వద్ద ఏర్పరుస్తుంది.
10 ≈ ల O2 వద్ద STP రావాలంటే \(\frac{68 \times 10}{22.4}\) g. ల H2O2 కావాలి.
= 30.36 g ≈ 30 g. H2O2
కాబట్టి 10 volume H2O2 ద్రావణం గాఢత = 30.36 gl-1 = 3% H2O2 ద్రావణం.

AP Inter 1st Year History Study Material Chapter 11 వలస పాలనలో భారతదేశం

Andhra Pradesh BIEAP AP Inter 1st Year History Study Material 11th Lesson వలస పాలనలో భారతదేశం Textbook Questions and Answers.

AP Inter 1st Year History Study Material 11th Lesson వలస పాలనలో భారతదేశం

వ్యాసరూప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
బ్రిటిష్, ఫ్రెంచ్ వారి మధ్య జరిగిన విభేదాలు లేదా కర్ణాటక యుద్ధాలు వివరించండి.
జవాబు:
ఆధునిక యుగంలో యూరోపియన్లు వ్యాపారార్థం భారతదేశానికి వచ్చారు. కాలక్రమంలో దక్కన్లో వ్యాపార ఆధిపత్యానికై ఇంగ్లీషు, ఫ్రెంచ్వారి మధ్య పోరాటం జరిగింది. ఈ పోరాటం మూడు యుద్ధాలుగా జరిగింది. వీటినే కర్ణాటక యుద్ధాలు అంటారు. ఈ యుద్ధాల వల్ల భారతదేశంలో ఫ్రెంచ్వారి శక్తి పూర్తిగా దిగజారిపోయింది. అప్పటి నుండి ఆంగ్లేయుల విజృంభణకు అడ్డం లేకుండా పోయింది.

మొదటి కర్ణాటక యుద్ధం (1744-1748): 1742వ సంవత్సరంలో డూప్లే ఫ్రెంచ్ గవర్నర్గా నియమించబడ్డాడు. ఇతనికి విపరీతమైన రాజ్యకాంక్ష. ఈ పరిస్థితులలో ఐరోపాలో ఆస్ట్రియా వారసత్వ యుద్ధం ప్రారంభమైంది. ఈ యుద్ధం ప్రష్యా-ఆస్ట్రియాల మధ్య వారసత్వ యుద్ధంగా మారింది. ఫ్రాన్స్ ప్రష్యా వైపు, బ్రిటన్ ఆస్ట్రియా ప్రక్కన చేరాయి. దీని ప్రభావం భారతదేశంపై కూడా పడింది. భారతదేశంలో ఆంగ్లేయులు, ఫ్రెంచ్ ముఖ్య స్థావరమైన పుదుచ్చేరిని ఆక్రమించటానికి సిద్ధంగా ఉన్నారు. ఇట్టి పరిస్థితులలో డూప్లే కర్ణాటక నవాబైన అన్వరుద్దీన్ సహాయం కోరాడు. దీనిపై ఆంగ్లేయులు యుద్ధ ప్రయత్నాలు విరమించారు. ఇటువంటి పరిస్థితుల్లో ఫ్రెంచ్ సైన్యం లాబోర్డినాయి నాయకత్వంలో భారతదేశానికి వచ్చింది. ఆ ధైర్యముతో డూప్లే 1746వ సంవత్సరంలో ఫ్రెంచ్ సైన్యాలను ఆంగ్లేయుల పైకి పంపాడు. మద్రాసులోని ఆంగ్లేయుల సెయింట్ జార్జికోటను ఫ్రెంచ్వారు స్వాధీనపరచుకున్నారు. ఈలోగా ఆంగ్లేయులు అన్వరుద్దీన్ చేరారు. నవాబు ఫ్రెంచ్ వారిని హెచ్చరించి చివరకు వారితో యుద్ధాలు చేయాల్సివచ్చింది. 1746లో అన్వరుద్దీన్ సైన్యాలు ఫ్రెంచ్ వారి సైన్యాలు, శాంథోమ్ అనే ప్రదేశంలో యుద్ధానికి తలపడ్డాయి. శాంథోమ్ యుద్ధంలో ఫ్రెంచ్వారికి విజయం లభించింది. దీనితో కర్ణాటక రాజ్య బలహీనత బయల్పడింది. లాబోర్డినాయి తిరిగి వెనుకకు వెళ్ళటంతో సెయింట్ డేవిడ్ కోటను పట్టుకోదలచిన డూప్లే ఆశయాలు విఫలమైనాయి. ఈలోగా ఆస్ట్రియా వారసత్వ యుద్ధం ఐలాషఫల్ సంధితో ముగిసింది. దీనితో భారతదేశంలో కూడా యుద్ధం ముగిసింది. సంధి షరతుల ప్రకారం మద్రాసును ఫ్రెంచ్వారు ఆంగ్లేయులకు తిరిగి ఇచ్చివేశారు.

AP Inter 1st Year History Study Material Chapter 11 వలస పాలనలో భారతదేశం

రెండవ కర్ణాటక యుద్ధం (1749-1754): 1748లో హైదరాబాద్ నిజాం ఉల్ ముల్క్ మరణించటంతో హైదరాబాదు సింహాసనము కోసం అతని రెండవ కుమారుడైన నాజర్ంగ్కు, మనుమడైన ముజఫరంగు మధ్య అంతర్యుద్ధం మొదలైంది. కర్ణాటక సింహాసనం కోసం మహారాష్ట్రుల నుండి విడుదలైన చందాసాహెబ్కు, అన్వరుద్దీన్ కు మధ్య యుద్ధం ప్రారంభమైంది. చందాసాహెబ్ మరియు ముజఫర్ఆంగ్లు ఫ్రెంచ్ గవర్నరైన డూప్లే సహాయంతో సింహాసనమును అధిష్టించటానికి ప్రయత్నించారు. స్వదేశ రాజులలో గల బలహీనతలను ఆసరాగా తీసుకొని వారి తగాదాలలో జోక్యం చేసుకొని విజయం సాధించాలని డూప్లే ఆశయము. చందాసాహెబు సహాయము చేస్తే కర్ణాటకలోను, ముజఫరంగ్కు తోడ్పడితే హైదరాబాద్లోను తన పలుకుబడి పెరగగలదని డూప్లే భావించాడు. ముజఫరంగ్ మరియు చందాసాహెబ్లు 1749 ఆగస్టు 3న ‘అంబూర్’ యుద్ధంలో అన్వరుద్దీన్ ను వధించారు. అన్వరుద్దీన్ మరణానంతరం అతని కుమారుడైన మహమ్మదాలీ తిరుచినాపల్లికి పారిపోయి ఆంగ్లేయుల సహాయాన్ని కోరాడు. ఫ్రెంచ్వారి సహాయానికిగాను చందాసాహెబ్ మచిలీపట్నం, రెండు గ్రామాలను కృతజ్ఞతగా వారికి ఇచ్చాడు. ఆంగ్లేయుల సహాయంతో నాజర్ జంగ్, ముజఫరంగ్ను ఓడించాడు. కానీ ఫ్రెంచ్వారి చేతిలో హత్యకు గురయ్యాడు. ఫ్రెంచ్వారు ముజఫరంగ్ను హైదరాబాదు నవాబుగా చేశారు. అక్కడ బుస్సీ అనే ఫ్రెంచి సైన్యాధిపతి రక్షణగా ఉన్నాడు. కొంతకాలానికి ముజఫరంగ్ శత్రువుల చేతుల్లో మరణించగా ఫ్రెంచ్వారు అతని కుమారుడైన సలాబతంగ్ను నవాబుగా చేసి దక్కన్లో ఫ్రెంచి అధికారాన్ని సుస్థిరపరచారు.

కర్ణాటకలో ఫ్రెంచివారు మరియు చందాసాహెబ్ తిరుచినాపల్లిని జయించి మహమ్మదాలీని మరియు ఆంగ్లేయులను ఓడించటానికి ప్రయత్నించారు. ఆంగ్లేయులు మహమ్మదాలీని రక్షించటానికి క్లైవ్ సహాయంతో ఒక పథకాన్ని తయారుచేశారు. చందాసాహెబ్ మరియు ఫ్రెంచ్వారు 1751వ సంవత్సరంలో తిరుచినాపల్లిని ముట్టడించునప్పుడు క్లెవ్ మద్రాసు నుంచి కొంత సైన్యంతో ఆర్కాటును ముట్టడించాడు. తన రాజధానిని రక్షించుకొనుటకై చందాసాహెబ్ కొంత సైన్యంతో తిరుచినాపల్లి నుండి ఆర్కాటుకు వెనక్కి మరలాడు. దీనితో తిరుచినాపల్లి వద్దగల చందాసాహెబ్, ఫ్రెంచి సైన్యం ఆంగ్లేయుల చేతిలో ఓడింపబడ్డారు. కర్ణాటకలో రాబర్ట్ క్లైవ్ చందాసాహెబ్ను ఓడించి 1752వ సంవత్సరంలో వధించాడు. మహమ్మదాలీని కర్ణాటక నవాబుగా చేసి కర్ణాటకపై ఆంగ్లేయుల ఆధిపత్యాన్ని సంపాదించారు. దీనితో కర్ణాటకలో ఫ్రెంచ్వారు తమ ఆధిపత్యాన్ని కోల్పోయారు. ఇట్టి పరిస్థితులలో ఫ్రెంచ్వారు డూప్లేను తొలగించి గాడెహ్యూను గవర్నరుగా నియమించారు. ఇతడు ఆంగ్లేయులతో పాండిచ్చేరి సంధి కుదుర్చుకున్నాడు. రెండవ కర్ణాటక యుద్ధానంతరం దక్కన్లో ఫ్రెంచ్వారి ప్రాబల్యం, కర్ణాటకలో ఆంగ్లేయుల ప్రాబల్యం పెరిగింది.

మూడవ కర్ణాటక యుద్ధం (1756-1761): గాడెహ్యూ చేసుకున్న సంధి అమల్లోకి రాకమునుపే ప్రపంచాధిపత్యం కోసం ఐరోపాలో సప్తవర్ష సంగ్రామం ప్రారంభమైంది. దాని ప్రభావం వలన భారతదేశంలో ఫ్రెంచ్ ప్రభుత్వం, ఫ్రెంచ్ గవర్నర్గా కౌంట్ డీలాలీని నియమించింది. ఇతడు యుద్ధంలో ఆరితేరిన యోధుడైనా అహంభావం కలవాడు. ఇతడు సేనాధిపతులతో కలిసిమెలసి పనిచేయటం, వారి సలహాలను స్వీకరించటం ఇతనికి ఇష్టంలేదు. భారతదేశం చేరగానే కడలూర్లోని ఇంగ్లీషువారి సైనిక పెరేడ్ కోటను ఆక్రమించాడు. మద్రాసును ముట్టడించటానికి ప్రయత్నాలు చేశాడు, కానీ విఫలుడయ్యాడు. ఇట్టి పరిస్థితులలో సర్ ఐర్ కూట్ ఆంగ్ల సైన్యానికి నాయకత్వం వహించాడు.

ఆంగ్లేయులను ఎదుర్కోలేక కౌంట్ డీలాలీ హైదరాబాదు సంస్థానంలోని బుస్సీని రావలసిందిగా కోరాడు. తాను హైదరాబాదును వదిలిన వెంటనే అక్కడ ఫ్రెంచ్వారి ప్రాబల్యం అంతరించగలదని బుస్సీ తలచాడు. కానీ డీలాలీ బుస్సీ సలహాను లెక్కచేయక బుస్సీని హైదరాబాదు నుండి రమ్మని ఆజ్ఞాపించాడు. దీనితో ఆంగ్లేయులు నైజాం నవాబుతో సంధి చేసుకొని అతని సంస్థానంలో చేరారు. విజయనగర సంస్థానాధీశుడైన ఆనంద గజపతి బెంగాల్లో ఉన్న క్లైవ్ను దండెత్తి రావలసిందిగా ఆహ్వానించాడు. క్లైవ్, సర్ ఐర్ కూట్ను పంపించగా అతడు ‘1760లో వాండివాష్ లేక వందవాసి’ యుద్ధంలో ఫ్రెంచ్ సైన్యాన్ని ఓడించి, పుదుచ్చేరిని ఆక్రమించి, కౌంట్ డీలాలీని బంధించి ఇంగ్లండుకు పంపాడు. 1763లో పారిస్ సంధితో సప్తవర్ష సంగ్రామం ముగిసింది. దీనితో మూడవ కర్ణాటక యుద్ధం అంతమైంది.

ప్రశ్న 2.
రాబర్ట్ క్లైవ్ బెంగాల్న ఆక్రమించిన విధానం రాయండి.
జవాబు:
భారతదేశంలో ఆంగ్ల సామ్రాజ్యానికి పునాదులు వేసిన వారు రాబర్ట్ క్లైవ్. ఇతడు బ్రిటిష్ తూర్పు ఇండియా వర్తక సంఘంలో సామాన్య గుమాస్తాగా చేరి, తన స్వయం కృషితో, ధైర్య సాహసాలు ప్రదర్శించి, కర్ణాటక యుద్ధాలలో విజయం సాధించి భారతదేశంలో ఆంగ్లేయుల ప్రాబల్యానికి కారకుడయ్యాడు. ఆర్కాట్ ముట్టడి సమయంలో చందా సాహెబ్ను చంపి ఆంగ్లేయులకు విజయాన్ని సాధించాడు. ఈ విజయం వలన క్లైవ్ను “ఆర్కాటు వీరుడు” అని పిలిచారు. ఈ విజయం వలన క్లైవ్ను మద్రాసు కౌన్సిల్లో సభ్యుడిగా నియమించారు.

ప్లాసీ యుద్ధం (1757, జూన్ 25): బ్లాక్ హోల్ ట్రాజడీ లేక కలకత్తా చీకటిగది ఉదంతాన్ని విన్న మద్రాస్ కౌన్సిల్, ఫోర్ట్ విలియంను తిరిగి స్వాధీనం చేసుకొనే బాధ్యతను రాబర్ట్ క్లెన్క అడ్మిరల్ వాట్సనక్కు అప్పగించింది. వీరి నాయకత్వంలోని ఇంగ్లీషు సైన్యం 1757లో కలకత్తాను తిరిగి స్వాధీనం చేసుకుంది. ఈ పరిస్థితులలో బెంగాల్ నవాబు సిరాజుదౌలా, ఇంగ్లీషువారికి మధ్య ఒక ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం ప్రకారం ఇంగ్లీషువారు తమ స్థావరాలన్నింటిని తిరిగి రాబట్టుకున్నారు. వారికి నష్టపరిహారం చెల్లించడానికి సిరాజ్ అంగీకరించాడు. కలకత్తాలో సైనిక స్థావరాలు ఏర్పాటు చేసుకోవటానికి, వాటిని పటిష్టం చేసుకోవటానికి, నాణాలను ముద్రించుకోవటానికి ఇంగ్లీషువారికి అనుమతినిచ్చాడు. అయినా సిరాజ్ను ఫ్రెంచ్వారి పట్ల అనుకూలంగా ఉన్నాడని క్లైవ్ భావించి అతడిని సింహాసనం నుంచి తొలగించాలని నిశ్చయించుకున్నాడు. క్లైవ్కు సిరాజ్ సైన్యాధిపతి మీరాఫర్, అమీన్ చంద్ అనే వ్యాపారి సహకరించారు. ఈ నేపథ్యంలో ఆంగ్లేయులకు, సిరాజ్ సైన్యాలకు ప్లాసీ వద్ద యుద్ధం జరిగింది. మీరాఫర్ ద్రోహం వల్ల సిరాజ్ ఓడిపోయి యుద్ధభూమిలో మరణించాడు. బీహార్, బెంగాల్, ఒరిస్సాలకు మీరాఫర్ నవాబు అయ్యాడు. 24 పరగణాల జమిందారీ ఇంగ్లీషు కంపెనీవారికి లభించింది. క్లైవ్కు 2,34,000 పౌన్లు బహుమానంగా లభించాయి.

ఆధునిక భారతదేశ చరిత్రలో ప్లాసీ యుద్ధానికి ప్రత్యేక స్థానం ఉంది. బెంగాల్లో ఇంగ్లీషు కంపెనీవారు మొగల్ సుబేదార్ను ఓడించగలిగారు. స్థానిక ప్రభువుల బలహీనతలు, వారి అసమర్థత బహిర్గతమయ్యాయి. ప్లాసీ యుద్ధంతో ఇండియాలో బ్రిటిష్ సామ్రాజ్యానికి పునాదులు పడ్డాయి.

ప్లాసీ యుద్ధానంతరం ఆంగ్ల ప్రభుత్వం క్లైవు బెంగాల్ గవర్నర్ గా నియమించింది. గవర్నర్ తన పదవీ కాలం (1758-1760) లో క్లైవ్ డచ్ వారిని ఓడించి వారి నుంచి నష్టపరిహారం కూడా రాబట్టుకున్నాడు. ఈ విజయంతో ఇంగ్లీషువారిని ఎదిరించగల శక్తి భారతదేశంలో లేకుండా పోయింది. 1760లో క్లైవ్ స్వదేశానికి తిరిగివెళ్లాడు.

బక్సార్ యుద్ధం (1764, అక్టోబరు 17): ఇండియా నుంచి రాబర్ట్ క్లైవ్ నిష్క్రమించిన తరువాత బెంగాల్ గందరగోళంలో పడింది. ఈస్ట్ ఇండియా కంపెనీ ఉద్యోగులు సొంత వ్యాపారాలలో మునిగి, కంపెనీ వ్యాపారాన్ని నిర్లక్ష్యం చేశారు. వాన్ సిటార్ట్ ఇంగ్లీషు గవర్నర్ అయ్యాడు. అతడు మీర్జాఫర్ను తొలగించి, మీర్ ఖాసింను నవాబ్ నియమించాడు. మీరసిం ఇంగ్లీష్ వారికి బరద్వాన్, మిడ్నాపూర్, చిటగాంగ్ జిల్లాలను దత్తత చేశాడు. మీరసిం సమర్థుడే. బెంగాల్ ఆర్థిక వనరులను మెరుగుపరచటానికి అతడు చర్యలు తీసుకున్నాడు. ఇంగ్లీషు కంపెనీ ఉద్యోగుల సొంత వ్యాపారాలను అరికట్టడానికి కూడా అతడు ప్రయత్నించాడు. అందువల్ల, ఇంగ్లీష్ ్వరిలో ద్వేషం రగిలింది. దానితో మీరసిం అయోధ్యకు పారిపోయి అక్కడ అయోధ్య నవాబు, మొగల్ చక్రవర్తి షా ఆలంల సహాయం అర్థించాడు. మీర్ ఖాసిం, అయోధ్య నవాబు, షా ఆలంలను 1764 అక్టోబరులో మేజర్ మన్రో బక్సార్ యుద్ధంలో ఓడించాడు.

AP Inter 1st Year History Study Material Chapter 11 వలస పాలనలో భారతదేశం

బక్సార్ యుద్ధం, ప్లాసీ యుద్ధం కన్నా చరిత్రలో ఎక్కువ ప్రాముఖ్యం సంతరించుకుంది. ఈ యుద్ధంలో ఇంగ్లీషువారు ఒక బెంగాల్ నవాబుపైనే కాకుండా మొగల్ చక్రవర్తిపైన కూడా విజయం సాధించారు. షా ఆలం లొంగిపోయి ఇంగ్లీషు వారి రక్షణ కిందకు వచ్చాడు. ఇంగ్లీషువారు మరో విజయాన్ని కారాలో సంపాదించుకున్నారు. ఈ విజయం వల్ల అయోధ్య నవాబు కూడా ఇంగ్లీష్వారి నియంత్రణ కిందకు వచ్చాడు.

క్లైవ్ బెంగాల్ గవర్నరుగా పునరాగమనం: బక్సార్ యుద్ధానంతరం బెంగాల్లో దుష్టపాలన నెలకొన్నది. అందువలన కంపెనీ డైరెక్టర్లు క్లైవ్ను బెంగాల్ గవర్నర్ తిరిగి నియమించారు. 1765 మేలో క్లైవ్ ఇండియా చేరుకుని అయోధ్య నవాబుతోను, మొగల్ చక్రవర్తితోను అలహాబాద్ సంధులను కుదుర్చుకున్నాడు.

అలహాబాద్ సంధులు (1765): అలహాబాద్ సంధుల ప్రకారం

  1. ఇంగ్లీషు వారికి బెంగాల్, బీహార్, ఒరిస్సాలలో భూమిశిస్తు వసూలు చేసుకొనే హక్కు లభించింది. దీన్ని దివానీ అంటారు. పరిపాలన బాధ్యత నవాబుకు అప్పగించడం జరిగింది. దీన్ని నిజామత్ అంటారు.
  2. ఉత్తర సర్కారులపై ఇంగ్లీషువారి అధికారాన్ని మొగల్ చక్రవర్తి గుర్తించాడు.
  3. ఆర్కాట్ నవాబు స్వతంత్రపాలకుడయ్యాడు.
  4. అయోధ్య నుంచి కారా, అలహాబాద్లను విడగొట్టి మొగల్ చక్రవర్తికి ఇచ్చారు.
  5. ఈస్టిండియా కంపెనీవారు మొగల్ చక్రవర్తికి 20 లక్షల రూపాయలు చెల్లించడానికి అంగీకరించారు.

ఘనత: భారతదేశంలో బ్రిటిష్ సామ్రాజ్యాన్ని స్థాపించిన ఘనుడు రాబర్ట్ క్లైవ్ చిన్న గుమస్తాగా జీవితం ప్రారంభించి స్వయంకృషి వల్ల గవర్నర్ పదవికి ఎదిగాడు. ఈస్టిండియా కంపెనీ సామ్రాజ్య వ్యవస్థాపకుడిగా ఆధునిక భారతదేశ చరిత్రపుటలలో క్లెవ్ ప్రముఖ స్థానాన్ని పొందాడు.

ప్రశ్న 3.
ఆంగ్లో, మైసూర్ యుద్ధాలను క్లుప్తంగా వివరించండి.
జవాబు:
రాబర్ట్ క్లైవ్ పాలనా కాలం ముగిసే నాటికి మైసూర్ రాజ్యం ఒక ముఖ్యమైన స్వతంత్ర రాజ్యంగా ఉంది. ఈస్ట్ ఇండియా కంపెనీ అధికారులు మైసూర్ని జయించాలని నిశ్చయించారు. వీరి కోరిక ఫలితంగా ఇంగ్లీష్వారు నాలుగు యుద్ధాల్ని చేయాల్సి వచ్చింది. వీటినే మైసూర్ యుద్ధాలని అంటారు. హైదర్ అలీ, అతడి కుమారుడు టిప్పు సుల్తాన్ వీరోచితంగా ఇంగ్లీష్ గవర్నర్లను ఎదుర్కొన్నారు. మొదటి మైసూర్ యుద్ధంలో (1767-69) హైదర్ అలీ, అతని మిత్రపక్షమైన ఫ్రెంచ్ సైన్యాలు టిక్రోమలై వద్ద ఘోరమైన ఓటమిని చవిచూశాయి. కాని తిరిగి తన సైన్యాన్ని కూడకట్టుకొని హైదర్ అలీ ఇంగ్లీష్ వారిని ఎదుర్కొన్నాడు. మద్రాసు సంధితో యుద్ధం ముగిసింది. యుద్ధ సమయంలో ఆక్రమించిన ప్రాంతాలు తిరిగి ఎవరిది వారికి ఇవ్వబడ్డాయి.

మద్రాసు సంధి షరతుల్ని ఇంగ్లీష్ వారు ఉల్లంఘించడం వల్ల రెండవ మైసూర్ యుద్ధం (1780-84) జరిగింది. ఈ తరుణంలో కల్నల్ బేయిలి ఆధ్వర్యంలోని బ్రిటిష్ సైన్యం 80 వేల మంది సైనికులతో జూలై 1780 లో హైదర్ అలీపై మెరుపుదాడి చేసింది. కాని యుద్ధం ముగియకముందే హైదర్ అలీ క్యాన్సర్ జబ్బుతో మరణించాడు. టిప్పు సుల్తాన్ ఇంగ్లీషు వారితో మంగళూరు సంధి చేసుకొని యుద్ధాన్ని విరమించాడు.

1784 తరువాత కూడా మైసూర్, బ్రిటిష్ వారి మధ్య శత్రుత్వం కొనసాగింది. మంగళూరు సంధి వల్ల కేవలం తాత్కాలికమైన శాంతి మాత్రమే ఏర్పడింది. గవర్నర్ జనరల్ అయిన కారన్ వాలీస్ టిప్పు సుల్తాన్ను అధికారం నుంచి తొలగించడానికి పావులు కదిపాడు. దీంతో ఇరువురి మధ్య యుద్ధం అనివార్యమయ్యింది. వీరోచితమైన టిప్పు సుల్తాన్ పోరాట పటిమ, ఆయన సైన్యం ఇంగ్లీషు సైన్యాన్ని ఓడించడంలో విఫలమయ్యింది. శ్రీరంగపట్టణం సంధి ద్వారా ఈ యుద్ధం ముగిసింది. ఈ సంధి షరతుల ప్రకారం కృష్ణా, పెన్నా నదుల మధ్య ఉన్న భూభాగాన్ని బ్రిటిష్ వారి స్వాధీనం చేయడానికి టిప్పు సుల్తాన్ అంగీకరించాడు. మూడవ మైసూర్ యుద్ధంలో ఓడిపోవడం టిప్పు సుల్తాన్ క్షీణిస్తున్న అధికారానికి గుర్తుగా భావించవచ్చు. చివరగా జరిగిన నాలుగవ మైసూరు యుద్ధంలో (1799) లార్డ్ వెల్లస్లీ టిప్పు సుల్తాన్ను ఓడించి హతమార్చాడు. టిప్పు సుల్తాన్ మరణంతో మైసూరు రాజ్యం ఇంగ్లీషువారి వశమైంది.

AP Inter 1st Year History Study Material Chapter 11 వలస పాలనలో భారతదేశం

ప్రశ్న 4.
కారన్ వాలీస్ సంస్కరణల ముఖ్యాంశాలు వివరించండి.
జవాబు:
సివిల్ పరిపాలనా సంస్కరణలు: ఈస్ట్ ఇండియా కంపెనీ అధికారులు చాలా లంచగొండులయ్యారని, వారిలో సామర్థ్యం పూర్తిగా లోపించిందని కారన్ వాలీస్ గ్రహించాడు. వారికి కంపెనీ వ్యవహారాలకన్నా సొంత వ్యాపారమే ముఖ్యమైంది. వారు తరచు బహుమానాలను తీసుకునేవారు. అందువలన కంపెనీ ఉద్యోగులు లంచాలనుగాని, బహుమతులనుగాని తీసుకోరాదని కారన్ వాలీస్ హెచ్చరించాడు. ప్రైవేటు వ్యాపారం చేసుకొంటున్న కంపెనీ ఉద్యోగులు దండనలకు పాత్రులవుతారని ప్రకటించాడు. ఉద్యోగుల జీతాలు పెంచమని కంపెనీ డైరెక్టర్లకు సలహా ఇచ్చాడు. ఆ సలహా మేరకు కంపెనీ ఉద్యోగుల జీతాలు పెరిగాయి. కలెక్టరుకు నెలకు 1500 రూపాయల జీతం ముట్టింది. భారతీయుల శక్తి సామర్థ్యాల మీద, గుణగణాల మీద కారన్ వాలీస్ కు చాలా చులకన భావం ఉంది. భారతదేశానికి చెందిన ప్రతి ఉద్యోగి అమిత లంచగొండి అని అతడి అభిప్రాయం. అందువలన పరిపాలనా వ్యవస్థలోను, సైనిక వ్యవస్థలోను భారతీయులకు చోటు లేకుండా పోయింది. అందువలననే పరిపాలనలో ఐరోపీకరణ ప్రవేశపెట్టాడు. ఇది కారన్ వాలీస్ జాతి వివక్షతకు దర్పణం పట్టింది. అయినప్పటికీ పౌర, మిలటరీ ఉద్యోగాలలో లంచగొండితనం రూపుమాపి, కారన్ వాలీస్ నీతివంతమైన పరిపాలన అందించాడు.

న్యాయ సంస్కరణలు: కారన్ వాలీస్ 1787, 1790, 1793లో అనేక న్యాయసంస్కరణలు ప్రవేశపెట్టాడు. న్యాయశాఖలో ఖర్చును పూర్తిగా తగ్గించాడు. న్యాయశాఖను కార్యనిర్వాహక శాఖ నుంచి వేరుచేశాడు. జిల్లా కలెక్టర్లకు న్యాయాధికారాలు తొలగించి వారికి భూమిశిస్తు వసూళ్లను మాత్రమే అప్పగించాడు. జిల్లా కోర్టులకు జిల్లా జడ్జిలను నియమించాడు. సివిల్, క్రిమినల్ కేసులను విచారించడానికిగాను కారన్ వాలీస్ పై స్థాయి నుంచి క్రింది స్థాయి వరకు న్యాయస్థానాలను ఏర్పాటు చేశాడు. 50 రూపాయల లోపు ఆస్తి తగాదాలను మున్సిఫ్ కోర్టులు విచారించాయి. మున్సిఫ్ కోర్టులకు భారతీయులను న్యాయాధికారులుగా నియమించాడు. నాడు మొత్తం 23 జిల్లాలుండేవి. ప్రతి జిల్లాకు ఒక జిల్లా కోర్టును ఏర్పాటు చేశాడు. బెంగాల్, బీహార్, ఒరిస్సాలను నాలుగు డివిజనులుగా విభజించాడు. ప్రతి డివిజన్కు ఒక సర్క్యూట్ కోర్ట్ను ఏర్పరచాడు. క్రిమినల్ కేసులలో సదర్ నిజామత్ అదాలత్ అప్పీళ్లను స్వీకరించి విచారించింది. అదేవిధంగా సదర్ దివానీ అదాలత్ సివిల్ వ్యవహారాల విచారణను స్వీకరించింది. గవర్నర్ జనరల్-ఇన్-కౌన్సిల్ క్రిమినల్ కేసులలో తుది తీర్పును ఇచ్చేది. న్యాయశాఖకు సంబంధించిన అన్ని నియమాలను క్రోడీకరించారు. దీనికి ‘కారన్ వాలీస్ కోడ్’ అని పేరు వచ్చింది. సమన్యాయపాలన, స్వతంత్ర న్యాయశాఖలు ఈ కోడ్లో చోటుచేసుకున్నాయి. అంగవిచ్ఛేదంలాంటి క్రూరమైన శిక్షలు రద్దయ్యాయి.

పోలీస్ సంస్కరణలు: పోలీస్ సంస్కరణలలో భాగంగా కారన్ వాలీస్ పోలీస్ అధికారాలను జమిందారుల నుంచి తీసివేశాడు. ప్రతి జిల్లాను ఠాణాలుగా విభజించారు. ప్రతి ఠాణాకు దరోగా అనే పోలీస్ అధికారిని నియమించాడు. ప్రతి జిల్లాకు సూపరింటిండెంట్ ఆఫ్ పోలీస్ అనే ఉద్యోగిని నియమించాడు. ఈ విధంగా ఆధునిక పోలీస్ వ్యవస్థకు కారన్ వాలీస్ పునాది వేశాడు.

జైలు సంస్కరణలు: కారన్ వాలీస్ జైలు సంస్కరణలను ప్రవేశపెట్టాడు. మేజిస్ట్రేట్లు తరచుగా జైళ్లను తనిఖీ చేయాలని, ఖైదీలకు తగిన సౌకర్యాలు ఏర్పాటు చేయాలని ఆదేశాలిచ్చాడు. ఖైదీల ఆరోగ్య విషయంలో కూడా ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుంది. సివిల్, క్రిమినల్ నేరస్థులకు వేరువేరు వార్డ్లను కేటాయించారు. మహిళా ఖైదీలకు ప్రత్యేక బ్లాక్ లను ఏర్పాటు చేశాడు.

శాశ్వత భూమిశిస్తు నిర్ణయ విధానం: కారన్ వాలీస్ సంస్కరణలన్నింటిలో అతి ప్రధానమైనది శాశ్వత భూమిశిస్తు నిర్ణయ పద్ధతి. ఈ పద్ధతిలో భూమిశిస్తును వసూలు చేయటానికి ప్రతి 10 సంవత్సరాలకొకసారి వేలంపాటలు వేస్తారు. ఈ వేలం పాటలో ఎక్కువ మొత్తాన్ని చెల్లిస్తామని ఒప్పుకున్న జమిందారులకు శిస్తువసూలు అధికారాన్ని అప్పగిస్తారు. ఈ మొత్తాన్ని జమిందారులు ప్రతి సంవత్సరం కాక 10 సంవత్సరాల కాలానికి నిర్ణయిస్తారు. ఈ పద్ధతిననుసరించి జమిందారులకు భూములపై యాజమాన్యపు హక్కు ఏర్పడింది. పన్నులు చెల్లించనివారి భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకొని, వాటిని వేలం వేసి, తన బకాయిలను రాబట్టుకుంది. జమిందారుల నుంచి 89 శాతాన్ని శిస్తుగా వసూలుచేసి, మిగిలిన 11 శాతాన్ని వారికే వదిలివేసింది. ఇది అధికమైన భూమిశిస్తే, కాని ఈ నిర్ణయం శాశ్వతమైంది కాబట్టి భూమి నుంచి ఫలసాయం పెరిగినా అది కంపెనీకి చెందదు.

లాభాలు: శాశ్వత భూమిశిస్తు నిర్ణయ పద్ధతి వలన ప్రభుత్వానికి కొన్ని లాభాలు చేకూరాయి.
అవి:

  1. ప్రభుత్వానికి ఎంత ఆదాయం వస్తుందో ముందుగా ఖచ్చితంగా తెలిసింది.
  2. ప్రతి సంవత్సరం భూమిశిస్తు నిర్ణయం, దాని వసూలు బాధ్యతలు ప్రభుత్వాధికారులకు తప్పిపోయాయి.
  3. భూమిశిస్తు రేటు రెండింతలయింది.
  4. జమిందారులు కష్టించి తమ ఉత్పత్తులను పెంచుకొని ఆదాయాన్ని పెంచుకోగలిగారు.
  5. పెరిగిన ఆదాయాల వల్ల భూస్వాములు పరిశ్రమలలో పెట్టుబడి పెట్టగలిగారు.
  6. దీనివల్ల పారిశ్రామికీకరణ జరిగి ప్రజల జీవన ప్రమాణం పెరిగింది.
  7. జమిందారులతో మిత్రత్వం లభించి కంపెనీ పాలనకు భద్రత ఏర్పడింది.

నష్టాలు: శాశ్వత భూమిశిస్తు నిర్ణయ పద్ధతి వలన కొన్ని నష్టాలు కూడా వున్నాయి. అవి:

  1. కొందరు జమిందారులు పెరిగిన శిస్తులు చెల్లించలేకపోవటంతో వారి భూములు వేలానికి వచ్చాయి. కంపెనీ ప్రభుత్వం కూడా కొంతవరకు నష్టపోయింది.
  2. ఈ నిర్ణయం వల్ల సమాజం జమిందారులు, కౌలుదారులు అనే రెండు వర్గాలుగా విడిపోయింది.
  3. జమిందారుల ఆదాయం పెరిగినందువల్ల వారు నగరాలకు వలసవెళ్లి విలాసవంతమైన జీవితాలు గడపసాగారు.
  4. రైతుల స్థితి దిగజారింది. వారు జమిందారుల దయాదాక్షిణ్యాలమీద ఆధారపడవలసి వచ్చింది. రైతులకు యాజమాన్యపు హక్కు లేకపోవటంతో వారి జీవితం మరింత దుర్భరమైంది.

ముగింపు: కారన్ వాలీస్ పరిపాలనావేత్తగా పేరుపొందాడు. బ్రిటిష్ ఇండియా పరిపాలనలో అనేక సంస్కరణలు ప్రవేశపెట్టి అక్కడ చెరిగిపోని ముద్ర వేసుకున్నాడు. అతడి పరిపాలనకు కారన్వాలీస్ విధానమని పేరొచ్చింది. న్యాయ, పోలీస్ శాఖలలో ఇంగ్లీషువారి విధానాలను ప్రవేశపెట్టాడు. అతడి న్యాయసంస్కరణలలో ఇంగ్లీషు న్యాయ విధానం ప్రతిబింబించింది.

AP Inter 1st Year History Study Material Chapter 11 వలస పాలనలో భారతదేశం

ప్రశ్న 5.
1857 తిరుగుబాటుకు గల ముఖ్య కారణాలు తెలపండి.
జవాబు:
ఆధునిక భారతదేశ చరిత్రలో 1857 తిరుగుబాటు ఒక ముఖ్య చారిత్రక ఘట్టం. ఈ తిరుగుబాటుకు దారితీసిన పరిస్థితులను రాజకీయ, ఆర్థిక, సాంఘిక, మత, సైనిక కారణాలను ఐదు రకాలుగా విభజించవచ్చు.

1) రాజకీయ కారణాలు: భారతదేశంలో తన సామ్రాజ్యాన్ని విస్తరింపచేయటానికి ఆంగ్లేయులు అనేక పద్ధతులను అవలంబించారు. యుద్ధాలు చేయటం ద్వారా, సైన్యసహకారపద్ధతి ద్వారా, పరిపాలన సరిగాలేదనే నెపంతో సామ్రాజ్య విస్తరణ చేశారు. డల్హౌసీ మరో అడుగు ముందుకు వేసి రాజ్యసంక్రమణ సిద్ధాంతం ద్వారా అయోధ్య, సతారా, నాగ్పూర్, ఝాన్సీ మొదలైన సంస్థానాలను బ్రిటిష్ సామ్రాజ్యంలో విలీనం చేశాడు. పీష్వా దత్తకుమారుడైన నానాసాహెబ్కు భరణాన్ని నిరాకరించాడు. కర్ణాటక, తంజావూర్, తిరువాన్కూర్ రాజుల బిరుదులను రద్దుచేశాడు. మొగల్ చక్రవర్తి నివాసాన్ని ఎర్రకోట నుంచి కుతుబ్మనార్కు దగ్గరగా మార్చాలని, బహదూర్షి తరువాత మొగల్ చక్రవర్తి బిరుదును రద్దుచేయాలని ప్రతిపాదించాడు. అందువలన స్వదేశీరాజులు తమ భవిష్యత్తు గురించి ఆందోళన పడసాగారు. పైగా ఆంగ్లేయులు పాటించిన జాతి వివక్ష విధానం, వారు ప్రజల పట్ల చూపిన నిరాదరణ ప్రజల్లో అసంతృప్తి కలిగించింది. ఈ విధంగా అసంతృప్తికి లోనైనవారంతా 1857 తిరుగుబాటులో పాల్గొన్నారు.

2) ఆర్థిక కారణాలు: రాజ్యసంక్రమణ సిద్ధాంతం వల్ల అనేక రాజ్యాలు బ్రిటిష్ సామ్రాజ్యంలో విలీనమై ఆయా రాజ్యాలలో పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులు, గాయకులు, కవులు, విద్వాంసులు మొదలైన వారు నిరుద్యోగులై సిపాయిలుగా మారారు. వారు తమ కనీస జీవితావసరాలను కూడా గడుపుకోలేక తిరుగుబాటుకు సంసిద్ధులైనారు. కంపెనీ ప్రభుత్వం భారతదేశంలో వ్యవసాయాన్ని, పరిశ్రమలను ప్రోత్సహించలేదు. దేశంలో కుటీరపరిశ్రమలు క్షీణించాయి. కంపెనీ పాలనలో ప్రజలకు చేయటానికి పనిలేక, తినడానికి తిండిలేక అలమటించారు. ఆర్థిక పరిస్థితి క్షీణించి తిరుగుబాటు తప్ప వేరే మార్గం లేకపోయింది.

3) సాంఘిక కారణాలు: ఈస్టిండియా కంపెనీ లార్డ్ బెంటింక్ కాలం నుంచి లార్డ్ డల్హౌసీ కాలం వరకు అనేక సాంఘిక సంస్కరణలు ప్రవేశపెట్టింది. సతీసహగమన నిషేధ చట్టం, మతం మార్చుకొన్నప్పటికీ ఆస్తిలో హక్కు కలిగించే చట్టం, బాల్య వివాహాల నిషేధచట్టం, వితంతు పునర్వివాహ చట్టం వంటి సంస్కరణలు, తమ సనాతన ధర్మానికి విరుద్ధమని హిందువులు అభిప్రాయపడ్డారు. డల్హౌసీ కాలం నాటి ఆధునికీకరణ రైల్వే, తంతి తపాల ఏర్పాట్లు ప్రజల్లో సంచలనాన్ని సృష్టించాయి. ఈ మార్పులవల్ల తమ ఆచారబద్ధమైన ప్రాచీన సమాజం కూలిపోయిందని సనాతనులు ఆందోళనపడ్డారు. పాశ్చాత్యతరహా పరిపాలనా సంస్థలు, నూతన న్యాయస్థానాలు, ఇంగ్లీష్ విద్య, రైల్వే, టెలిగ్రాఫ్లు తమ సనాతన ధర్మాన్ని నాశనం చేయడానికి ప్రవేశపెట్టారని వారు భావించారు. ప్రభుత్వం ఈ విధంగా చట్టాల ద్వారా తమ మతధర్మాలను నాశనం చేస్తున్నదనే అపోహ ప్రజలలో వ్యాపించింది.

4) మత కారణాలు: క్రైస్తవులైన ఆంగ్లేయులు తమ పరిపాలన స్థాపించిన తరువాత, హిందువులనందరిని, క్రైస్తవులుగా మార్చివేస్తారనే భయం, అనుమానం ప్రజల్లో ఏర్పడింది. కంపెనీ ప్రభుత్వ కాలంలో, క్రైస్తవ మిషనరీలు తమ మత ప్రచారాన్ని ఉధృతం చేశారు. వారు హిందూ, ముస్లిం మత సంప్రదాయాలను అవహేళన చేస్తూ తమ మత ప్రచారాన్ని కొనసాగించేవారు. 1813 ఛార్టర్ చట్టంలో మిషనరీలకు సౌకర్యాలు కల్పించడం, ఇంగ్లీష్ విద్యావ్యాప్తికి ప్రత్యేక నిధిని కల్పించడం, మతం మార్చుకొన్నప్పటికీ ఆస్తిలో హక్కు కల్పించడం వంటి చర్యలు మత మార్పిడిని ప్రోత్సహించటం కోసమేనని ప్రజలు అనుమానపడ్డారు. క్రైస్తవ మిషనరీలు, పాఠశాలలు, వైద్యశాలలు స్థాపించి అక్కడ కూడా మత సిద్ధాంతాలను బోధించారు. సతీసహగమనాన్ని రద్దుచేయడం, బాల్య వివాహాలను నిషేధించడం, వితంతు వివాహాలను అనుమతించడం, హిందూమత ఆచారాలలో ప్రభుత్వం జోక్యం కలిగించుకొని, మత మార్పిడులను ప్రోత్సహించి, భారతదేశాన్ని క్రైస్తవరాజ్యంగా మార్చడానికి బ్రిటిష్వారు ఈ మార్పులు చేస్తున్నారనే భావం ప్రజల్లో ఏర్పడింది. ఇందుకు కొందరు కంపెనీ అధికారులు అవలంబించిన మత పక్షపాత ధోరణి కూడా దోహదం చేసింది.

5) సైనిక కారణాలు: కంపెనీలో రెండు రకాలైన సైనికులున్నారు. భారతీయులు బ్రతుకుతెరువు కోసం కంపెనీలో సైనికోద్యోగులుగా చేరారు. వారిని సిపాయిలు అంటారు. ఆంగ్లేయులను సైనికులంటారు. వీరిరువురి మధ్య హోదాలలోను, జీతభత్యాలలోను ఎంతో వ్యత్యాసముంది. 1856లో బ్రిటిష్ ప్రభుత్వం జనరల్ సర్వీసెస్ “ఎన్లిల్టిమెంట్” చట్టాన్ని ప్రవేశపెట్టింది. ఈ చట్టం ప్రకారం సిపాయిలు ఏ ప్రాంతానికైనా వెళ్లి యుద్ధం చేయాల్సి వుంది. హిందూ ధర్మశాస్త్ర ప్రకారం సముద్ర ప్రయాణం నిషేధం. ఇదిగాక కులం, మతాన్ని సూచించే చిహ్నాలను తీసివేయాలనే ఉత్తర్వులు వీరిని మరింత కలవరపెట్టాయి. కొన్ని సంవత్సరాలుగా తీవ్రమైన అసంతృప్తికి లోనైన సిపాయిలు 1849, 1850, 1852లలో తమ నిరసనలను తిరుగుబాట్ల రూపంలో ప్రదర్శించారు. 1857 నాటికి ఈ అసంతృప్తి తీవ్రమైన స్థాయికి చేరుకుంది. మొదటి ఆఫ్ఘన్ యుద్ధంలో, సిక్కు యుద్ధాలలో ఆంగ్లేయులకు సంభవించిన ఓటమివల్ల వారు అజేయులు అనే భావం పోయింది. కలిసి పోరాడితే ఆంగ్లేయులను ఓడించటం కష్టమేమీకాదని వారు విశ్వసించారు. అంతేగాక సిపాయిలకు, ఆంగ్ల సైనికులకు మధ్య సంఖ్యాబలంలో చాలా తేడా వుంది. ఆంగ్లేయులకంటే, సిపాయిల సంఖ్య చాలా ఎక్కువగా వుంది. అందువల్ల 1857లో సిపాయిలు తిరుగుబాటు మార్గాన్ని ఎంచుకున్నారు.

6) తక్షణ కారణం: కంపెనీ ప్రభుత్వం 1856లో కొత్త “ఎన్ఫీల్డ్” తుపాకులను ప్రవేశపెట్టింది. వాటిలో ఉపయోగించే తూటాలను సైనికులు నోటితో చివరి భాగం కొరికి తుపాకీలో అమర్చి పేల్చవలసివుండేవి. కానీ ఆ తూటాలకు ఆవు కొవ్వు, పంది కొవ్వు పూతపూసినట్లు ఒక వదంతి వ్యాపించింది. ఆవు హిందువులకు పవిత్రమైనది. పందిని ముస్లింలు అపవిత్రంగా భావిస్తారు. ఆంగ్లేయులు తమ మతాలను బుద్ధిపూర్వకంగా కించపరచడానికే ఈ విధంగా చేశారని సిపాయిలు విశ్వసించారు. అప్పటికే ప్రబలంగా వున్న అసంతృప్తికి ఈ వదంతి ఆజ్యం పోసినట్లయింది.

సంక్షిప్త సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
ఆల్బుకర్క్
జవాబు:
భారతదేశంలో పోర్చుగీసు ప్రాబల్యానికి గట్టి పునాదులు నిర్మించినవాడు ఆల్ఫాస్సో డి. ఆల్బూకర్క్, ఇతడు అత్యంత సమర్థుడు. గవర్నర్గా కొన్ని ప్రాంతాలలో పోర్చుగీసు వాణిజ్య గుత్తాధిపత్య స్థాపన ద్వారా మరియు పోర్చుగీసువారు స్థానికుల్ని వివాహం చేసుకోవడం ద్వారా, స్థానిక ప్రాంతాలను వలసలుగా మార్చుకోవాలనే విధానం ద్వారా, ముఖ్య ఓడరేవుల్లో కోటలు నిర్మించుకోవడం ద్వారా పోర్చుగీసువారు ఒక శక్తిగా రూపొందటానికి బాటలు వేసెను.

  1. క్రీ.శ. 1510లో శ్రీకృష్ణదేవరాయల సహకారంతో బీజాపూర్ సుల్తాన్ను ఓడించి, గోవా రేవు పట్టణాన్ని స్వాధీనం చేసుకొనెను. తదుపరి ఈ గోవా పోర్చుగీసువారి ప్రధాన వర్తక స్థావరమైంది.
  2. క్రీ.శ. 1511లో దూర ప్రాచ్యంలో మలక్కా సైతం ఆల్బూకర్క్ ఆధీనంలోకి వచ్చింది.
  3. వాణిజ్య విస్తరణలో ఆల్బూకర్క్ అరబ్బులను దారుణ హింసలకు గురిచేసెను.
  4. ఆల్బూకర్క్ తరువాత 1517 లో డయ్యూ, డామన్లు పోర్చుగీస్ హస్తగతమయ్యెను.
  5. అటులనే క్రమముగా పశ్చిమతీరంలో బేసిన్, సాల్సెట్టి, బేల్, బొంబాయిలలోనూ, తూర్పుతీరంలో శాన్ థోమ్, హుగ్లీలలోనూ స్థావరాలు స్థాపితమయ్యాయి.

AP Inter 1st Year History Study Material Chapter 11 వలస పాలనలో భారతదేశం

ప్రశ్న 2.
రాబర్ట్ క్లైవ్
జవాబు:
భారతదేశంలో బ్రిటిష్ సామ్రాజ్యాన్ని స్థాపించిన ఘనుడు రాబర్ట్ క్లైవ్. క్లైవ్ చిన్న గుమాస్తాగా జీవితం ప్రారంభించి స్వయంకృషి వల్ల గవర్నర్ పదవికి ఎదిగాడు. ఈస్టిండియా కంపెనీ సామ్రాజ్య వ్యవస్థాపకుడుగా ఆధునిక భారతదేశ చరిత్రపుటల్లో రాబర్ట్ క్లైవ్ ప్రముఖ స్థానాన్ని పొందాడు.

ప్రశ్న 3.
సిరాజ్-ఉద్-దౌలా
జవాబు:
బెంగాల్ నవాబు సిరాజ్ ఉద్దేలా 1756లో ఫోర్టు విలియంను ముట్టడించి 146 మంది ఆంగ్లేయులను ఒక చిన్న గదిలో బంధించాడని, మరునాటి ఉదయానికి విపరీతమైన వేడి, ఉక్కవలన 23 మంది తప్ప మిగిలిన వారంతా మరణించారని ఒక కథనం ఉంది. దీనినే బ్లాక్ హోల్ ట్రాజడీ లేక కలకత్తా చీకటి గది విషాదాంతం అంటారు.

ప్రశ్న 4.
బక్సర్ తిరుగుబాటు
జవాబు:
1764 అక్టోబర్ 17న మీర్ ఖాసిం, అయోధ్య నవాబు, మొగల్ చక్రవర్తి షా ఆలంల కూటమికి, ఆంగ్లేయులకు బక్సార్ వద్ద జరిగిన యుద్ధాన్ని బక్సార్ యుద్ధం అంటారు. ఈ యుద్ధంలో ముగ్గురు పాలకుల కూటమి ఓడిపోయింది. ఈ యుద్ధం భారతదేశంలో ఆంగ్ల సామ్రాజ్య విస్తరణకు తోడ్పడింది.

ప్రశ్న 5.
ద్వంద ప్రభుత్వ విధానం
జవాబు:
1765 నాటి అలహాబాద్ సంధుల ప్రకారం ఇంగ్లీషువారికి, బెంగాల్, బీహార్, ఒరిస్సాలలో భూమిశిస్తు వసూలు చేసుకునే హక్కు లభించింది. దీన్ని దివాని అంటారు. పరిపాలన బాధ్యత నవాబు అప్పగించడం జరిగింది. దీన్ని నిజామత్ అంటారు. ఈ విధంగా పరిపాలనాధికారాలు విభజించబడినందువల్ల దీనికి ద్వంద ప్రభుత్వం అనే పేరు వచ్చింది.

ప్రశ్న 6.
వారన్ హేస్టింగ్
జవాబు:
భారతదేశంలో క్లెవ్ స్థాపించిన ఆంగ్లాధికారాన్ని సుస్థిరపరచి దాని విస్తరణకు కూడా పునాదులను నిర్మించినవాడు వారన్ హేస్టింగ్ (1772-1785).

వారన్ హేస్టింగ్ ఎదుర్కొన్న సమస్యలు: వారన్ హేస్టింగ్ మొదట బెంగాల్ గవర్నర్ గా వచ్చాడు. కానీ 1773 నాటి రెగ్యులేటింగ్ చట్టం ప్రకారం గవర్నర్ జనరల్ అయ్యాడు. వారన్ హేస్టింగ్ బెంగాల్ గవర్నర్ అయ్యేనాటికి అతడికి ఎన్నో సమస్యలు ఎదురైనాయి. రాబర్ట్ క్లైవ్ ప్రవేశపెట్టిన ద్వంద ప్రభుత్వం గందరగోళానికి దారితీసింది. కంపెనీ ఆర్థిక వనరులలో అతి ముఖ్యమైన భూమిశిస్తు జమిందారుల చేతుల్లోకి పోయింది. కంపెనీ ఉద్యోగులు విపరీతంగా ధనార్జన చేశారు. కానీ, కంపెనీ ఖజానా మాత్రం వట్టిపోయింది. న్యాయపాలనలో కూడా విపరీతమైన గందరగోళం చోటుచేసుకుంది.

స్వదేశీ విధానం – సంస్కరణలు: పరిపాలనలో చోటుచేసుకున్న అస్తవ్యస్త పరిస్థితులను తొలగించటానికి వారన్ హేస్టింగ్ అనేక సంస్కరణలను చేపట్టాడు. అవి:
ద్వంద ప్రభుత్వం రద్దు: క్లైవ్ ప్రవేశపెట్టిన ద్వంద ప్రభుత్వం అన్ని విధాలా విఫలమైంది. అందువలన దానిని రద్దుచేసి, బెంగాల్ రాష్ట్ర పరిపాలనా బాధ్యతలన్నింటిని కంపెనీ నేతృత్వంలోకి తెచ్చాడు.

ప్రశ్న 7.
సైన్య సహకార విధానం
జవాబు:
సైన్య సహకార పద్ధతిని చాలా స్వదేశీ రాజ్యాలలో అమలుచేసినవాడు వెల్లస్లీ. దీనిననుసరించి స్వదేశీ రాజ్యం తమ విదేశాంగ సంబంధాలన్నింటిని ఇంగ్లీషు కంపెనీకి అప్పగించాలి. ఆ సంస్థానాన్ని విదేశీ శత్రువుల నుంచి ఇంగ్లీషువారు కాపాడతారు. అయితే స్వదేశీ సంస్థానాల ఆంతరంగిక విషయాలలో ఇంగ్లీషు కంపెనీ జోక్యం చేసుకోదు. ఈ పద్ధతి వలన ఇండియాలో ఇంగ్లీషువారి శక్తి గణనీయంగా పెరిగింది.

AP Inter 1st Year History Study Material Chapter 11 వలస పాలనలో భారతదేశం

ప్రశ్న 8.
విలియం బెంటింక్
జవాబు:
భారతీయుల మన్ననలను పొందిన గవర్నర్ జనరల్ విలియం బెంటింక్ ఒకడు. తన పాలనా కాలంలో విలియం బెంటింక్ ఆర్థిక విధానంలో, విద్యా రంగంలో కొత్త సంస్కరణలను ప్రవేశపెట్టాడు. నాడు సమాజంలో వున్న సాంఘిక దురాచారాలను రూపుమాపటానికి అనేక సాంఘిక సంస్కరణలను కూడా చేపట్టాడు. ఈ సాంఘిక సంస్కరణలలో బెంటింక్ పేరును చిరస్మరణీయం చేసిన సాంఘిక సంస్కరణలు హిందువులలో ప్రబలంగా వున్న సతీసహగమన దురాచారాన్ని మాన్పించడంలో బెంటింక్ చాలావరకు కృతకృత్యుడయ్యాడు. 1829లో రాజారామ్ మోహన్రాయ్ సహకారంతో ఒక శాసనము జారీ చేశాడు.

ప్రశ్న 9.
డల్హౌసీ
జవాబు:
డల్హౌసీ తన 8 సంవత్సరాల పాలనా కాలంలో (1848-1856) బ్రిటీషు సామ్రాజ్య విస్తరణయే తన ప్రధాన లక్ష్యంగా ఎంచుకొన్నాడు. వారన్ హేస్టింగ్ ప్రారంభించిన కంపెనీ సామ్రాజ్యాన్ని తన విజయాల ద్వారా విస్తరింపచేశాడు. కంపెనీ రాజ్య విస్తరణ కోసం డల్హౌసీ నాలుగు మార్గాలను అనుసరించాడు. అవి:

  1. యుద్ధాలు
  2. రాజ్య సంక్రమణ సిద్ధాంతం
  3. బిరుదులు, భరణాల రద్దు
  4. దుష్పరిపాలన నెపం.

ప్రశ్న 10.
రాజ్య సంక్రమణ సిద్ధాంతం
జవాబు:
రాజ్య సంక్రమణ సిద్ధాంతం అనగా నిస్సంతులుగా మరణించిన స్వదేశీరాజుల సంస్థానాలు ఆంగ్లేయులకు సంక్రమిస్తాయి. ఈ విధానాన్ని అమలుచేసినవాడు డల్హౌసీ, ఈ సిద్దాంతాన్ననుసరించి బ్రిటీషు రాజ్యంలో విలీనమైన మొదటి స్వదేశీ సంస్థానం సతారా. ఈ సిద్ధాంతం 1857 నాటి సిపాయిల తిరుగుబాటుకు ఒక కారణమైంది.

ప్రశ్న 11.
రాణి లక్ష్మీబాయి
జవాబు:
1857 తిరుగుబాటులో పాల్గొన్న ప్రముఖులలో ఝాన్సీలక్ష్మీబాయి ఒకరు. ఈమె మహారాష్ట్రకు చెందిన తాంతియాతోపేతో కలిసి బ్రిటీషు వారిని గడగడలాడించింది. తన దత్తకుమారుని తన వారసునిగా గుర్తించటానికి ఆంగ్లేయులు నిరాకరించటంతో ఈమె తిరుగుబాటులో పాల్గొంది. 1858లో సర్ హ్యూరోస్ సేనాని ఝాన్సీని ఆక్రమించినపుడు లక్ష్మీబాయి కోట నుండి తన దత్త కుమారునితో బయటపడి తాంతియాతోపేతో కలిసి గ్వాలియర్ కోటను ఆక్రమించి, బ్రిటిష్ వారితో యుద్ధాన్ని కొనసాగించింది. 1857 జూన్ 17న యుద్ధంలో వీరమరణం పొందింది.

ప్రశ్న 12.
రైత్వారి విధానం
జవాబు:
ఈ విధానంలో శిస్తును రైతులు నేరుగా ప్రభుత్వమునకు అనగా ప్రభుత్వ ఖజానాకు గాని, ప్రభుత్వోద్యోగులకు చెల్లించెదరు. ఇట్లు శిస్తు వసూలునందు ప్రభుత్వమునకు, రైతులకు మధ్య ఎట్టి మధ్యవర్తులు అనగా దళారులు లేకుండుట వలన ఈ విధానమును రైత్వారీ విధానముగా ప్రసిద్ధికెక్కెను. ఇంకనూ రైతులకు పట్టాలిచ్చి వారి వద్ద నుండి కబూలియత్లు (శిస్తు చెల్లింపు ఒడంబడికలు) తీసుకొనెడి సంప్రదాయము కూడా కలదు.

AP Inter 1st Year History Study Material Chapter 11 వలస పాలనలో భారతదేశం

ప్రశ్న 13.
రెండవ బహదూర్షా
జవాబు:
భారతదేశాన్ని పాలించిన మొగల్ చక్రవర్తులలో రెండో బహదూర్ చివరివాడు. 1857 మే లో మీరట్లో తిరుగుబాటు చేసిన సిపాయిలు ఢిల్లీ చేరి, రెండో బహదూర్షాను భారతదేశ చక్రవర్తిగా ప్రకటించారు. 1857 సెప్టెంబరులో ఢిల్లీని వశపరచుకొన్న బ్రిటిష్వారు బహదూరాను బందీగాచేసి, విచారణ జరిపి, ఖైదీగా రంగూన్ పంపించారు. అతని కుమారులను, మనుమల్ని పరాభవించి, చంపేశారు. 1862లో బహదూర్గా రంగూన్ జైలులో మరణించాడు. దీనితో మొగల్ వంశం అంతరించింది.

ప్రశ్న 14.
టిప్పు సుల్తాన్
జవాబు:
మైసూరు పాలించిన హైదర్ అలీ కుమారుడు టిప్పు సుల్తాన్. ఇతడు తన తండ్రితోపాటు మొదటి రెండు మైసూర్ యుద్ధాలలో పాల్గొన్నాడు. రెండో మైసూర్ యుద్ధ కాలంలో హైదర్ అలీ మరణించిన వెంటనే టిప్పు సుల్తాన్ తండ్రి వారసత్వాన్ని స్వీకరించాడు. మూడో మైసూర్ యుద్ధంలో ఆంగ్లేయుల చేతిలో ఓడిపోయి శ్రీరంగపట్టణం సంధిని కుదుర్చుకొని తన రాజ్యంలో చాలా భాగం కోల్పోయాడు. 1799లో జరిగిన నాలుగో మైసూర్ యుద్ధంలో ఓడిపోయి మరణించాడు.

AP Inter 1st Year Physics Study Material Chapter 12 పదార్ధ ఉష్ణ ధర్మాలు

Andhra Pradesh BIEAP AP Inter 1st Year Physics Study Material 12th Lesson పదార్ధ ఉష్ణ ధర్మాలు Textbook Questions and Answers.

AP Inter 1st Year Physics Study Material 12th Lesson పదార్ధ ఉష్ణ ధర్మాలు

అతిస్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
ఉష్ణం, ఉష్ణోగ్రతల మధ్య భేదాలను పేర్కొనండి.
జవాబు:

ఉష్ణంఉష్ణోగ్రత
1. ఉష్ణోగ్రతా భేదంవల్ల రెండు వ్యవస్థల మధ్య ఉన్నదా వినిమయం జరిగే శక్తిని ఉష్ణం అంటారు.1. ఒక వస్తువు వేడిగా ఉన్నదా (లేదా) చల్లగా గుణాత్మకంగా తెలియచేసే భౌతికరాశిని ఉష్ణోగ్రత అంటారు.
2. దీనిని కెలోరీలు లేదా జౌల్స్లో కొలుస్తారు.2. దీనిని సెంటీగ్రేడ్లలోగాని, ఫారెన్ హీట్లలో కొలుస్తారు.
3. దీనిని కెలోరిమీటర్తో నిర్ధారిస్తారు.3. దీనిని థర్మామీటర్తో కొలుస్తారు.

ప్రశ్న 2.
సెల్సియస్, ఫారన్హీట్ ఉష్ణోగ్రతా మానాలలో అధో, ఊర్థ్వ స్థిర విలువలను తెలపండి.
జవాబు:
సెల్సియస్ మానంలో, అధో బిందువు – మంచు స్థానం లేక 0°C మరియు ఊర్ధ్వ స్థిర బిందువు ఆవిరి స్థానం (100°C). ఫారెన్ హీట్ మానంలో, అధో బిందువు – మంచు స్థానం (32°F) మరియు ఊర్ధ్వ స్థిర బిందువు ఆవిరి స్థానం (212°F).

ప్రశ్న 3.
ఉష్ణోగ్రతలను సెల్సియస్ లేదా ఫారన్హీట్ మానాలలో కొలిస్తే, వ్యాకోచ గుణకాల విలువలు మారతాయా?
జవాబు:
అవును. \(\frac{\alpha}{{ }^{\circ} \mathrm{C}}=\frac{9}{5}\) α/°F . కావున వ్యాకోచ గుణకాలు, ఉష్ణోగ్రతమానంపై ఆధారపడును.

ప్రశ్న 4.
వేడిచేస్తే పదార్థాలు సంకోచిస్తాయా? ఒక ఉదాహరణ ఇవ్వండి.
జవాబు:
పదార్థం వేడిచేసిన సంకోచించును. ఉదా : రబ్బరు టైపు లోహము, పోత ఇనుము.

ప్రశ్న 5.
రైల్వే ట్రాక్పై రెండు వరస రైలు పట్టాల మధ్య ఖాళీ ప్రదేశం ఎందుకు వదులుతారు?
జవాబు:
వేసవిలో ఉష్ణోగ్రతలు పెరిగినపుడు, రైలు పట్టాలు వ్యాకోచించును. కావున పట్టాలు వ్యాకోచించుటకు వీలుగా పట్టాల మధ్య ఖాళీ వదులుతారు.

AP Inter 1st Year Physics Study Material Chapter 12 పదార్ధ ఉష్ణ ధర్మాలు

ప్రశ్న 6.
ద్రవాలకు దైర్ఘ్య, విస్తీర్ణ వ్యాకోచ గుణకాలు ఎందుకు లేవ?
జవాబు:
ద్రవానికి నిర్ధిష్ట ఆకారం ఉండదు. అది తీసుకున్న పాత్ర యొక్క ఆకారాన్ని పొందుతుంది. మరియు వాయువులను వేడి చేసినపుడు వాటి ఘన పరిమాణంలో మాత్రమే వ్యాకోచం ఉండుట వలన ధైర్ఘ్య, విస్తీర్ణ వ్యాకోచాలు ఉండవు.

ప్రశ్న 7.
ద్రవీభవన గుప్తోష్ణం అంటే ఏమిటి?
జవాబు:
స్థిర ఉష్ణోగ్రత వద్ద ప్రమాణ ద్రవ్యరాశిగల పదార్థంను ఘనస్థితి నుండి ద్రవస్థితికి మార్చుటకు కావల్సిన ఉష్ణరాశిని ద్రవీభవన గుప్తోష్ణం (Lf) అంటారు.

ప్రశ్న 8.
బాష్పీభవన గుప్తోష్టం అంటే ఏమిటి? [Mar. ’13]
జవాబు:
స్థిర ఉష్ణోగ్రత వద్ద ప్రమాణ ద్రవ్యరాశిగల పదార్థంను ద్రవస్థితి నుండి బాష్పస్థితికి మార్చుటకు కావలసిన ఉష్ణరాశిని బాష్పీభవన గుప్తోష్ణం (Lv) అంటారు.

ప్రశ్న 9.
విశిష్టవాయు స్థిరాంకం అంటే ఏమిటి? దీని విలువ అన్ని వాయువులకు సమానమా?
జవాబు:
ప్రమాణ ద్రవ్యరాశికి వాయు స్థిరాంకాన్ని విశిష్ట వాయు స్థిరాంకం అంటారు. i. e., γ = \(\frac{R}{M}\) వాయువు నుండి వాయువుకు ‘M’ విలువ మారును. కావున ఇది అన్ని వాయువులకు సమానంగా ఉండదు.

ప్రశ్న 10.
విశిష్టవాయు స్థిరాంకం ప్రమాణాలు, మితులను తెలపండి. [Mar. ’14]
జవాబు:
ప్రమాణాలు : J Kg-1 K-1, మితి ఫార్ములా : L²T-1K-1. Mar. 14

ప్రశ్న 11.
వంట పాత్రలకు నల్లటి రంగు ఎందుకు పూస్తారు? వంట పాత్రల అడుగు భాగాన్ని రాగితో ఎందుకు తయారు చేస్తారు?
జవాబు:

  1. నల్లని పూత మంచి శోషణ గుణకం. కావున పాత్రలకు నల్లని పూత (రంగు) పూస్తారు.
  2. రాగి ఉత్తమ ఉష్ణ వాహకము. కావున వంటపాత్రల అడుగున రాగిని ఉపయోగిస్తే ఏకరీతి ఉష్ణం అందించబడును.

ప్రశ్న 12.
వీన్ స్థానభ్రంశ నియమాన్ని తెలపండి.
జవాబు:
కృష్ణ వస్తువు ఉద్గారించు గరిష్టశక్తికి సంబంధించిన వికిరణ తరంగదైర్ఘ్యము, ఆ వస్తు పరమ ఉష్ణోగ్రతకు విలోమానుపాతంలో ఉండును. i.e., λm ∝ \(\frac{1}{T}\)

AP Inter 1st Year Physics Study Material Chapter 12 పదార్ధ ఉష్ణ ధర్మాలు

ప్రశ్న 13.
వెంటిలేటర్లను గదిలోని ఇంటిపై కప్పుకు కొద్దిగా కిందకి అమరుస్తారు. ఎందుకు? [Mar. ’14]
జవాబు:
గదులలో వేడెక్కిన గాలి బయటకు పంపి, చల్లని గాలిని సంవహన ప్రక్రియలో లోపలికి ప్రవేశపెట్టుటకు గదులలో పైకప్పుకు కొద్దిగా క్రింద వెంటిలేటర్స్ అమరుస్తారు.

ప్రశ్న 14.
0 K వద్ద మానవ దేహం ఉష్ణాన్ని వికిరణం చేస్తుందా? 0°C వద్ద కూడా అది వికిరణం చేస్తుందా?
జవాబు:

  1. 0k వద్ద ఒక వస్తువు నుండి ఉష్ణ వికిరణం సాధ్యపడదు.
  2. 0°C వద్ద వస్తువు ద్వారా ఉష్ణ వికిరణం సాధ్యపడును.

ప్రశ్న 15.
ఉష్ణ బదిలీకి సంబంధించి వివిధ విధానాలను తెలపండి. వీటిలో ఏ విధానాలకు యానకం అవసరం?
జవాబు:
మూడు ఉష్ణ ప్రసారణ రీతులు కలవు.

  1. వహనం
  2. సంవహనం
  3. వికిరణం

ఈ మూడు రీతులలో వహనం మరియు సంవహనంనకు, యానకము అవసరము.

ప్రశ్న 16.
ఉష్ణ వాహకత్వ గుణకం, ఉష్ణోగ్రత ప్రవణతలను నిర్వచించండి.
జవాబు:
ఉష్ణ వహకత్వ గుణకం :
ఏకాంక అడ్డుకోత వైశాల్యానికి లంబంగా, ఏకాంక ఉష్ణోగ్రత ప్రవణత ద్వారా ఒక సెకనులో ప్రసారమయ్యే ఉష్ణరాశిని ఉష్ణవాహకత్వ గుణకం అంటారు.

ఉష్ణోగ్రత ప్రవణత :
వహన పథంలో ఏకాంక దూరానికి ఉష్ణోగ్రతలో మార్పునే ఉష్ణోగ్రత ప్రవణత అంటారు.

i.e., ఉష్ణోగ్రత ప్రవణత = \(\frac{\theta_2-\theta_1}{\mathrm{~d}}\).

ప్రశ్న 17.
ఒక వాహకం ఉష్ణ నిరోధం అంటే ఏమిటి? ఇది ఏయే అంశాలపై ఆధారపడి ఉంటుంది?
జవాబు:
ఒక వాహకం రెండు చివరల మధ్య ఉష్ణోగ్రత తేడాకు, దానిలోని ఉష్ణప్రవాహంనకు గల నిష్పత్తిని వాహకం ఉష్ణ నిరోధం అంటారు.
ie., RH = \(\frac{\Delta T}{H}\) = l/KA.

ఇది 1) వాహక పొడవు 2) వాహక పదార్థం 3) పదార్థ వైశాల్యంపై ఆధారపడును.

AP Inter 1st Year Physics Study Material Chapter 12 పదార్ధ ఉష్ణ ధర్మాలు

ప్రశ్న 18.
సంవహన గుణకం (coefficient of convection) ప్రమాణాలు, మితులను తెలపండి.
జవాబు:
ప్రమాణాలు : Wm-2 K-1
మితిఫార్ములా : M¹ T-3K-1

ప్రశ్న 19.
ఉద్గార సామర్థ్యం, ఉద్గారతలను నిర్వచించండి.
జవాబు:
ఉద్గార సామర్థ్యం :
నిర్దిష్ట ఉష్ణోగ్రత, తరంగదైర్ఘ్యం వద్ద సెకనుకు ఏకాంక వైశాల్యం ఉద్గారించే శక్తి వికిరణంను, ఆ వస్తువు ఉద్గార సామర్థ్యం అంటారు.

ఉద్గారత :
ఒక వస్తువు ఉద్గార సామర్ధ్యానికి, అదే ఉష్ణోగ్రత వద్ద పరిపూర్ణ కృష్ణ వస్తువు ఉద్గార సామర్థ్యానికి గల నిష్పత్తిని, ఉద్గారత అంటారు.i.e., ε = \(\frac{e}{E}\).

ప్రశ్న 20.
హరితగృహ ప్రభావం అంటే ఏమిటి ? గ్లోబల్ వార్మింగ్ గురించి వివరించండి. [Mar. ’13]
జవాబు:
హరితగృహ ప్రభావము :
సూర్యుని కాంతిని, భూమి శోషణం చేసుకుని భూమి వేడెక్కి పరారుణ కిరణాలను గాలిలోనికి ఉద్గారం చేయును. గాలిలోని CO2, CH4, N2O, O3, క్లోరోఫ్లోరో కార్బన్ హరితగృహ వాయువులు) లు పరారుణ వికిరణంలోని ఉష్ణాన్ని శోషణం చేసుకుని భూమిని వేడిగా ఉంచును. దీనినే హరితగృహ ప్రభావము అంటారు.

గ్లోబల్ వార్మింగ్ :
CO2 పరిమాణం పెరిగిన, వాతావరణంలో ఉష్ణం పెరిగి, ప్రపంచం మొత్తం ఉష్ణోగ్రత పెరుగును. దీనినే గ్లోబల్ వార్మింగ్ అంటారు.

ప్రభావాలు :
a) ధృవ మంచు పర్వతాలు కరిగి, నదులు మరియు సముద్రాలలో కలిసి వరదలకు కారణమగును.
b) కొన్ని ప్రాంతాలలో, నీటి వనరులు అడుగంటి తీవ్ర దుర్భిషాలకు కారణభూతమగును.

ప్రశ్న 21.
ఒక వస్తువు శోషణ సామర్థ్యాన్ని నిర్వచించండి. పరిపూర్ణ కృష్ణ వస్తువు శోషణ సామర్థ్యం ఎంత?
జవాబు:
ఒక నిర్ణీత కాల వ్యవధిలో శోషణం చేసుకున్న వికిరణ శక్తి అభివాహంనకు, అదే కాలంలో పతనమైన మొత్తం వికిరణ శక్తికి గల నిష్పత్తిని శోషణ సామర్థ్యం అంటారు.

పరిపూర్ణ కృష్ణ వస్తువు యొక్క శోషణ సామర్థ్యం 1కి సమానం.

ప్రశ్న 22.
న్యూటన్ శీతలీకరణ నియమాన్ని తెలపండి.
జవాబు:
వస్తువుకు, పరిసరములకు మధ్య స్వల్ప ఉష్ణోగ్రతా భేదము ఉన్నప్పుడు, ఆ వస్తువు కోల్పోయే ఉష్ణరేటు, వస్తువు మరియు దాని పరిసరమునకు మధ్యగల ఉష్ణోగ్రతా భేదానికి అనులోమానుపాతంలో ఉండును. దీనినే న్యూటన్ శీతలీకరణ సూత్రం అంటారు.

AP Inter 1st Year Physics Study Material Chapter 12 పదార్ధ ఉష్ణ ధర్మాలు 1
ఇక్కడ K = అనుపాత స్థిరాంకము, T = వస్తు ఉష్ణోగ్రత, To = పరిసరముల ఉష్ణోగ్రత.

ప్రశ్న 23.
న్యూటన్ శీతలీకరణ నియమం అనువర్తించడానికి కావలసిన పరిస్థితులను తెలపండి.
జవాబు:

  1. ఉష్ణ నష్టం వహనంద్వారా విస్మరించదగినంత తక్కువగా ఉండి, ఉష్ణ నష్టం సంవనం ద్వారా మాత్రమే ఉండాలి.
  2. వస్తువుపై ఉష్ణోగ్రత ఏకరీతిగా వితరణం చెంది ఉండాలి.
  3. ఉష్ణోగ్రతా భేదం దాదాపు 30 k ఉండాలి.
  4. బలాత్కృత సంవహనంలో ఉష్ణ నష్టం జరుగుతూ ఉండాలి.

AP Inter 1st Year Physics Study Material Chapter 12 పదార్ధ ఉష్ణ ధర్మాలు

ప్రశ్న 24.
వేసవి కాలంలో భవనాల పై కప్పుకు తరచుగా తెలుపు రంగును పూతగా పూస్తారు. ఎందుకు ?
జవాబు:
తెలుపురంగు అధమ ఉష్ణవాహకం, ఎక్కువ వికిరణాలను పరావర్తనం చెందించును. భవనాల కప్పు బయట భాగం తెల్లరంగు పూస్తే, అధిక వేడి నుండి కాపాడి, ఇంటి లోపల చల్లదనాన్ని ఏర్పరుచును.

స్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
సెల్సియస్, ఫారన్హీట్ ఉష్ణోగ్రతా మానాలను వివరించండి. సెల్సియస్, ఫారన్హీట్ ఉష్ణోగ్రతా మానాల మధ్య సంబంధాన్ని రాబట్టండి.
జవాబు:
AP Inter 1st Year Physics Study Material Chapter 12 పదార్ధ ఉష్ణ ధర్మాలు 2
సెంటీగ్రేడ్ (సెల్సియస్ ఉష్ణోగ్రత మానం :
సెంటీగ్రేడ్ (సెల్సియస్ ఉష్ణోగ్రతామానంలో అధోస్థిర స్థానం మంచు బిందువు అవుతుంది. దీనిని 0°C విలువ సూచించును. అలాగే ఊర్ధ్వ స్థిర స్థానంను నీటి బాష్పీభవన స్థానము 100°C విలువ సూచించును. ఈ రెండు స్థానాల మధ్య అంతరాన్ని (అంటే 100°C – 0 100°C) 100 సమభాగాలుగా విభజించి, ఒక్కొక్క సమభాగాన్ని 1°C గా వ్యవహరిస్తారు.

ఫారెన్హీట్ ఉష్ణోగ్రతామానం :
ఫారెన్హీట్ ఉష్ణోగ్రతా మానంలో అధోస్థిర స్థానం మంచు బిందువు. 32°F గా తీసుకుంటారు. ఇదేవిధంగా ఊర్ధ్వ స్థిర స్థానం నీటి బాష్పీభవన స్థానంను 212°F గా తీసుకుంటారు. ఈ రెండు స్థానాల మధ్య అంతరాన్ని (అంటే 212 – 32 ఒక్కొక్క సమభాగాన్ని 1°F గా వ్యవహరిస్తారు.

AP Inter 1st Year Physics Study Material Chapter 12 పదార్ధ ఉష్ణ ధర్మాలు 3
సెల్సియస్ మరియు ఫారెన్హీట్ ఉష్ణోగ్రతామానాల మధ్య సంబంధం :
100 సెల్సియస్ డిగ్రీల = 180 ఫారెన్హీట్ డిగ్రీల తేడా సెల్సియస్, ఫారెన్హీట్ ఉష్ణోగ్రత మానాలలో ఒక వస్తువు ఉష్ణోగ్రతను కొలిచినపుడు రీడింగ్లు వరుసగా tC మరియు tF లయితే
AP Inter 1st Year Physics Study Material Chapter 12 పదార్ధ ఉష్ణ ధర్మాలు 4

ప్రశ్న 2.
రాగి, స్టీల్తో చేసిన రెండు సర్వసమాన లోహ పట్టీలను ఒకదానితో ఒకటి కలిపి సంయోగ పట్టీగా తయారుచేశారు. ఆ సంయోగ పట్టీని వేడిచేస్తే ఏమవుతుంది?
జవాబు:
రెండు సర్వసమానమైన రాగి మరియు ఉక్కు పట్టీలను ఒకదానిపై మరొకటి ఉంచి అతికితే ఏర్పడే సంయోగ పట్టీని ద్విలోహపు పట్టీ (ద్విలోహ పలక) అంటారు.
AP Inter 1st Year Physics Study Material Chapter 12 పదార్ధ ఉష్ణ ధర్మాలు 5

ద్విలోహపు పట్టీ సాధారణ ఉష్ణోగ్రత (గది ఉష్ణోగ్రత) వద్ద పటంలో చూపినట్లు వంపు లేకుండా సమాంతరంగా ఉంటుంది. ద్విలోహపు పట్టీని వేడిచేస్తే రాగి, ఉక్కు కన్నా ఎక్కువ వ్యాకోచం చెందుతుంది. కావున రాగి కుంభాకారం వైపు ఉండేటట్లు వంగుతుంది. గది ఉష్ణోగ్రత కన్నా తక్కువ ఉష్ణోగ్రతకు చల్లబరిచినట్లుయితే, పుటాకారంగా ఉండే వైపు రాగి వంగుతుంది.

ప్రశ్న 3.
లోలక గడియారాలు సాధారణంగా శీతాకాలంలో అధిక కాలాన్ని చూపుతాయి. వేసవిలో తక్కువ కాలాన్ని చూపుతాయి. ఎందుకు?
జవాబు:
AP Inter 1st Year Physics Study Material Chapter 12 పదార్ధ ఉష్ణ ధర్మాలు 6
వేసవి కాలంలో వ్యాకోచం వలన పొడవు పెరిగి, ఆవర్తన కాలం పెరుగును. అందువలన తక్కువ కాలం చూపును. శీతాకాలంలో లోలకము పొడవు తగ్గి, ఆవర్తనకాలం తగ్గును. అందువలన లోలక గడియారం ఎక్కువ కాలాన్ని చూపుతుంది.

AP Inter 1st Year Physics Study Material Chapter 12 పదార్ధ ఉష్ణ ధర్మాలు

ప్రశ్న 4.
నీటి అసంగత వ్యాకోచం ఏవిధంగా జలచర సంబంధమైన జంతువులకు లాభం చేకూరుస్తుంది? [Mar. ’14]
జవాబు:
జల చరాలకు నీటి అసంగత వ్యాకోచం లాభసాటిగా ఉంటుంది. అతి శీతల ప్రదేశాలలో, వాతావరణ ఉష్ణోగ్రత తగ్గినపుడు, సరస్సుల ఉపరితలంపై నీరు వాతావరణ ఉష్ణోగ్రతకు చల్లబడును. నీరు సాంద్రత పెరిగి పటం (1)లో చూపిన విధంగా కిందికి దిగుతుంది. ఇట్లా నీటి ఉష్ణోగ్రత 4°C ని చేరేవరకు జరుగుతుంది. 4°C కన్నా నీరు చల్లబడితే, సాంద్రత తగ్గుతుంది. కాబట్టి అది కిందకు దిగక ఉపరితలం పైన లేదా దగ్గరగా ఉంటుంది. కావున నీటి ఉష్ణోగ్రత క్రమక్రమంగా తగ్గుతూ 0°C ని చేరినపుడు మంచుగడ్డ పటములో చూపినట్లు ఏర్పడుతుంది. ఈ మంచుగడ్డ నీటిపై తేలుతూ ఉంటుంది.
AP Inter 1st Year Physics Study Material Chapter 12 పదార్ధ ఉష్ణ ధర్మాలు 7

మంచు, నీరు అధమ వాహకాలు కావటంవలన అడుగు నీరు చల్లబడటానికి చాలాకాలం పడుతుంది. కింది పొరల ఉష్ణోగ్రతలు 1°C, 2°C, 3°C గా ఉంటాయి. కాబట్టి సరస్సు ఉపరితలంలోని నీరు గడ్డ కట్టినప్పటికి, అడుగు నీరు గడ్డకట్టకుండా ఉండుటచే శీతల ప్రదేశాలలో జల చరాలు అడుగునగల నీటిలో జీవించగలుగుతాయి.

ప్రశ్న 5.
వహనం, సంవహనం, వికిరణాలను ఉదాహరణలతో వివరించండి.
జవాబు:
ఉష్ణప్రసారము మూడు విధములుగా జరుగును అవి : 1) వహనం 2) సంవహనం 3) వికిరణము
1) వహనం :
వస్తువుయొక్క వేడి భాగం నుండి చల్లని భాగంవైపు యానకం యొక్క కణాల బదలీ జరగకుండా జరిగే ఉష్ణ ప్రసారాన్ని ఉష్ణవహనం అంటారు.
ఉదా : ఒక పొడవాటి లోహపు కడ్డీ ఒక చివర వేడిచేస్తే, ఉష్ణం రెండవ చివరకు ప్రసారం జరుగును.

2) సంవహనం :
కణాల చలనంవల్ల ఉష్ణం ఒక ప్రదేశం నుండి మరియొక ప్రదేశంనకు ప్రసారమయ్యే పద్ధతిని సంవహనం అంటారు.
ఉదా : బీకరులోని నీటిని వేడిచేస్తే, అడుగున నీటి కణాలు మొదట ఉష్ణాన్ని గ్రహించును. వాటి సాంద్రత తగ్గి పైకి, పైన ఉన్న కణాలు అడుగునకు చేరును. అడుగున కణాలు ఉష్ణాన్ని గ్రహించి, పైకి చేరును. ఈ ప్రక్రియను సంవహనం అంటారు.

3) వికిరణం :
యానకము లేకుండా ఉష్ణం ఒక ప్రదేశం నుండి మరియొక ప్రదేశంనకు ఉష్ణం ప్రసారమయ్యే పద్ధతిని, వికిరణం అంటారు.
ఉదా : సూర్యుని నుండి ఉష్ణ వికిరణాలు భూమికి వికరణ పద్ధతిలో చేరును.

దీర్ఘ సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
బాయిల్, ఛార్లెస్ నియమాలను తెలపండి. వీటి నుంచి ఆదర్శవాయు సమీకరణం ఉత్పాదించండి. పై రెండు నియమాల్లో ఏ నియమం ఉష్ణాన్ని కొలవడానికి అనువైనది ? ఎందుకు ?
జవాబు:
బాయిల్ నియమము :
స్థిర ఉష్ణోగ్రత వద్ద నియమిత ద్రవ్యరాశిగల వాయు ఘనపరిమాణం, దాని పీడనానికి విలోమానుపాతంలో ఉండును.

i.e., V α \(\frac{1}{P}\) (స్థిర ఉష్ణోగ్రతవద్ద)

ఛార్లెస్ నియమము :
a) స్థిరపీడనం వద్ద నియమిత ద్రవ్యరాశిగల వాయు ఘనపరిమాణం, దాని పరమ ఉష్ణోగ్రతకు అనులోమానుపాతంలో ఉండును.
i. e., V α T (స్థిర పీడనంవద్ద)

b) స్థిర ఘనపరిమాణం వద్ద నియమిత ద్రవ్యరాశి గల వాయువు పీడనం, దాని పరమ ఉష్ణోగ్రతకు అనులోమానుపాతంలో ఉండును.
i.e., P α T (స్థిర ఘనపరిమాణం వద్ద)

ఆదర్శవాయువు సమీకరణము :
P1 పీడనం, T1 పరమ ఉష్ణోగ్రత వద్ద ఒక వాయువు V1 ఘనపరిమాణం కల్గి ఉందని భావిద్దాం. P2 పీడనం వద్ద, వాయు ఉష్ణోగ్రతను T2 మార్చితే, వాయు ఘనపరిమాణం V2 అనుకుందాము. ఈ మార్పును 2 స్టెప్లలో తీసుకుందాము.

i) ఉష్ణోగ్రత T1 ను స్థిరంగా ఉంచి, వాయు పీడనంను P1 నుండి P2 కు మార్చితే, ఘనపరిమాణం V1 నుండి V కి మారిందని భావిద్దాం.
బాయిల్స్ నియమము నుండి,
P1V1 = P2V ⇒ V = \(\frac{P_1V_1}{P_2}\) …………. (1)

ii) ఇప్పుడు పీడనం P2 ను స్థిరంగా ఉంచి, ఉష్ణోగ్రతను T1 నుండి T2 మార్చితే, వాయు ఘనపరిమాణం V నుండి V2 కి మారిందని బావిద్దాం.
చార్లెస్ నియమము ప్రకారము,
AP Inter 1st Year Physics Study Material Chapter 12 పదార్ధ ఉష్ణ ధర్మాలు 8

ఈ స్థిరాంకం వాయు ద్రవ్యరాశి మరియు స్వభావంపై ఆధారపడును. వాయు ద్రవ్యరాశి 1 గ్రామ్ అయితే STP వద్ద స్థిరాంకంను వాయు స్థిరాంకం అంటారు. ఇది వాయువు నుండి వాయువుకు మారుతుంది. ఒక గ్రామ్ మోల్ వాయువును పరిగణిస్తే, ఈ స్థిరాంకము ఆదర్శ వాయు స్థిరాంకం, R అంటారు. అప్పుడు వాయు సమీకరణంను PV = RT గా వ్రాయవచ్చును.

బాయిల్ మరియు చార్లెస్ నియమమాలలో, థర్మామీటర్ల నిర్మాణంలో చార్లెస్ నియమము ఉత్తమము. కారణం ఉష్ణోగ్రత పెరిగితే వాయు పీడనం మరియు ఘనపరిమాణం పెరుగును. స్థిర పీడనం వద్ద, వాయు ఘనపరిమాణం పరమ ఉష్ణోగ్రతకు అనులోమానుపాతంలో ఉండును, మరియు స్థిర ఘనపరిమాణం వద్ద, వాయుపీడనం పరమ ఉష్ణోగ్రతకు అనులోమానుపాతంలో ఉండును.

AP Inter 1st Year Physics Study Material Chapter 12 పదార్ధ ఉష్ణ ధర్మాలు

ప్రశ్న 2.
ఉష్ణవాహకత్వం, ఉష్ణవాహకత్వ గుణకాన్ని వివరించండి. 0.10 m పొడవు, 1.0 × 10-6 m-2 మధ్యచ్ఛేద వైశాల్యం ఉన్న ఒక రాగి కడ్డీ ఉష్ణవాహకత్వం 401 W/(mK) కడ్డీ ఒక కొన 104°C వద్ద, మరొక కొన 24°C వద్ద కలవు. కడ్డీ వెంబడి ఉష్ణ ప్రవాహ రేటు ఎంత?
జవాబు:
ఉష్ణ వాహకత్వం :
ఘనపదార్థాలలో ఉష్ణవహనం చెందే సామర్థ్యాన్ని ఉష్ణ వాహకత్వం అంటారు.

ఉష్ణవాహకత్వ గుణకం (K) :
ప్రమాణ ఘనం, ఏకాంక అడ్డుకోత వైశాల్యానికి లంబంగా, ఏకాంక ఉష్ణోగ్రత ప్రవణత ద్వారా ఒక సెకనులో ప్రసారమయ్యే ఉష్ణరాశిని ఉష్ణవాహకత్వ గుణకం అంటారు.

ఉష్ణవాహకత్వ గుణకం వివరణ :
నిలకడ స్థితిలో θ1°C మరియు θ2°C ఉష్ణోగ్రతలు d దూరంలో ఉన్న అభిముఖ తలాల మధ్య ఉష్ణ ప్రసారం జరిగే రేటు (\(\frac{Q}{t}\))

AP Inter 1st Year Physics Study Material Chapter 12 పదార్ధ ఉష్ణ ధర్మాలు 9
i) దాని అభిముఖ తలం అడ్డుకోత వైశాల్యము A కు అనులోమానుపాతంలో
ii) అభిముఖ తలాల మధ్య ఉష్ణోగ్రతా భేదం (θ2 – θ1) కు అనులోమానుపాతంలో
iii) అభిముఖ తలాల మధ్య దూరానికి (d) విలోమానుపాతంలో ఉండును.
AP Inter 1st Year Physics Study Material Chapter 12 పదార్ధ ఉష్ణ ధర్మాలు 10

ప్రశ్న 3.
న్యూటన్ శీతలీకరణ నియమాన్ని తెలిపి, వివరించండి. న్యూటన్ శీతలీకరణ నియమం అనువర్తించడానికి కావలసిన పరిస్థితులను తెలపండి. ఒక వస్తువు 60°C నుంచి 50°C కు చల్లబడటానికి 5 నిమిషాల కాలం పట్టింది. తరువాత 40°C కు చల్లబడటానికి మరొక 8 నిమిషాలు పట్టింది. పరిసరాల ఉష్ణోగ్రతను కనుక్కోండి. [May ’13]
జవాబు:
నిర్వచనము :
వస్తువుకు, పరిసరములకు మధ్య స్వల్ప ఉష్ణోగ్రతా భేదం ఉన్నప్పుడు, ఆ వస్తువు ఉష్ణాన్ని కోల్పోయే రేటు వస్తువుకూ, దాని పరిసరములకు మధ్యగల ఉష్ణోగ్రతా భేదానికి అనులోమానుపాతంలో ఉండును.
i.e, చల్లబడేరేటు, \(\frac{dQ}{dt}\) α (T – To)

న్యూటన్స్ శీతలీకరణ నియమ సమీకరణము :
T ఉష్ణోగ్రత వద్ద ఉన్న వేడి వస్తువును భావిద్దాం. పరిసరాల ఉష్ణోగ్రత To. న్యూటన్స్ శీతలీకరణ నియమము ప్రకారము,

వస్తువు ఉష్ణంను కోల్పోయే రేటు o వస్తువుకు పరిసరాలకు మధ్య ఉష్ణోగ్రత భేదము
\(\frac{-dQ}{dt}\) α (T2 – T1)
\(\frac{-dQ}{dt}\) = K(T2 – T1) – (1) ఇక్కడ K అనుపాత స్థిరాంకము

T ఉష్ణోగ్రత వద్ద ఉన్న వస్తువు ద్రవ్యరాశి m మరియు విశిష్టోష్టం C. dt కాలంలో వస్తువు ఉష్ణోగ్రతలో తగ్గుదల dT అయిన, కోల్పోయిన ఉష్ణం పరిమాణం
dQ = mc dT
∴ ఉష్ణం కోల్పోయే రేటును క్రింది సమీకరణం యిస్తుంది.
AP Inter 1st Year Physics Study Material Chapter 12 పదార్ధ ఉష్ణ ధర్మాలు 11

ఇక్కడ C అనుపాత స్థిరాంకము మరియు C’ = eC (1), (2), (3) మరియు (4) లు, న్యూటన్స్ శీతలీకరణ నియమ వేర్వేరు సమీకరణాలు

AP Inter 1st Year Physics Study Material Chapter 12 పదార్ధ ఉష్ణ ధర్మాలు 12
గ్రాఫ్ వివరణ :
(1) (4) సమీకరణం నుండి ∆T = (T – To) వేర్వేరు ఉష్ణోగ్రత. భేదం విలువలను y-అక్షం మీద, t విలువలను X-అక్షం మీద తీసుకొని గ్రాఫ్ గీస్తే, పటంలో చూపినట్లు వక్రం వస్తుంది. ఈ గ్రాఫ్నుండి స్పష్టంగా శీతలీకరణ రేటు మొదట ఎక్కువగాను, ఆ తరువాత వస్తువు ఉష్ణోగ్రత తగ్గే కొద్దీ శీతలీకరణ రేటు కూడ తగ్గుతుంది.

(2) (3) వ సమీకరణం y = mx + c రూపంలో ఉంది.
loge (T – To) ను y–అక్షం మీద కాలం t ను × అక్షం మీద తీసుకుని గ్రాఫ్ గీసిన సరళరేఖ వస్తుంది. ఇది రుణాత్మక వాలు K కు సమానం మరియు y-అక్షాన్ని వద్ద ఖండిస్తుంది.

ఈ రెండు సందర్భాలలో, న్యూటన్స్ శీతలీకరణ నియమము రుజువు చేయబడింది.
AP Inter 1st Year Physics Study Material Chapter 12 పదార్ధ ఉష్ణ ధర్మాలు 13

న్యూటన్ శీతలీకరణం సూత్రానికి అనుకూల పరిస్థితులు :

  1. ఉష్ణ నష్టం వహనంద్వారా విస్మరించదగినంత తక్కువగా ఉండి, ఉష్ణ నష్టం సంవహనం ద్వారా మాత్రమే ఉండాలి.
  2. వస్తువుపై ఉష్ణోగ్రత ఏకరీతిగా వితరణం చెంది ఉండాలి.
  3. ఉష్ణోగ్రతా భేదం దాదాపు 30 K ఉండాలి.
  4. బలాత్కృత సంవహనంలో ఉష్ణ నష్టం జరుగుతూ ఉండాలి.

AP Inter 1st Year Physics Study Material Chapter 12 పదార్ధ ఉష్ణ ధర్మాలు 14

లెక్కలు (Problems)

ప్రశ్న 1.
ఏ ఉష్ణోగ్రత వద్ద కెల్విన్ మానంలోని రీడింగ్, ఫారన్ హీట్ మానంలోని రీడింగ్లు సమానం అవుతాయి?
సాధన:
కెల్విన్ మరియు ఫారెన్హీట్ స్కేలుల మధ్య సంబంధం
AP Inter 1st Year Physics Study Material Chapter 12 పదార్ధ ఉష్ణ ధర్మాలు 15

ప్రశ్న 2.
ఒక అల్యూమినియం కడ్డీ పొడవును 1% పెంచాలంటే దాని ఉష్ణోగ్రతలో కలిగే పెరుగుదల కనుక్కోండి.
(అల్యూమినియం విలువ = 25 × 10-6/°C).
సాధన:
AP Inter 1st Year Physics Study Material Chapter 12 పదార్ధ ఉష్ణ ధర్మాలు 16

ప్రశ్న 3.
0°C ఉష్ణోగ్రత, 76 cm ల పాదరస మట్టం పీడనం వద్ద ఒక లీటరు పరిమాణం ఉన్న వాయువు ద్రవ్యరాశి 1.562 g. ఉష్ణోగ్రతను 250°C కు పీడనాన్ని 78 cm ల పాదరస మట్టానికి పెంచితే, ఒక లీటరు పరిమాణం ఉన్న ఆ వాయువు ద్రవ్యరాశి ఎంత?
సాధన:
ఇచ్చట P1 = 76 cm of Hg; T1 = 273 K;
P1 = 1.562 g/litre, P2 = 78 cm of Hg;
T2 = 273 + 50 523 K; P2 = ?
AP Inter 1st Year Physics Study Material Chapter 12 పదార్ధ ఉష్ణ ధర్మాలు 17

ప్రశ్న 4.
37°C ఉష్ణోగ్రత, 75 cm ల పాదరసమట్టం పీడనం వద్ద నిర్దిష్ట ద్రవ్యరాశి ఉన్న వాయువు ఘనపరిమాణం 620 C.C. N.T.P. వద్ద ఘన పరిమాణం కనుక్కోండి.
సాధన:
ఇచ్చట P1 = 75 cm of Hg, V1 = 620 C.C.,
T1 = 37 + 273 = 310 K
N.T.P. వద్ద P2 = 76 cm of Hg, T2 = 273 K,
V2 = ?
AP Inter 1st Year Physics Study Material Chapter 12 పదార్ధ ఉష్ణ ధర్మాలు 18

ప్రశ్న 5.
20°C ఉష్ణోగ్రత, 100 g ద్రవ్యరాశి ఉన్న నీటి ఉష్ణోగ్రతను 5°C పెంచడానికి 100°C ఉష్ణోగ్రత వద్ద ఉన్న ఎంత ఆవిరిని ఆ నీటిలోకి పంపించాలి ? (నీటి ఆవిరి గుప్తోష్ణం 540 cal/g నీటి విశిష్టోష్టం 1 cal/g°C).
సాధన:
మిశ్రమ పద్ధతిలో,
ఆవిరి కోల్పోయిన ఉష్ణం = నీరు గ్రహించిన ఉష్ణం
mSLS + mSS(100 – t) = mwS (t – 20)
ఇచ్చట mS ఆవిరి ద్రవ్యరాశి, LS ఆవిరి గుప్తోష్టం, S ఆవిరి విశిష్టోష్ణం మరియు mw నీటి ద్రవ్యరాశి
ఇచ్చట LS = 540 cal/g, S = 1 cal/g°C;
mw = 100 g; t = 20 + 5 = 25°C
mS × 540 + mS × 1 × (100 – 25)
= 100 × 1 × (25 – 20)
615 mS = 500
mS = \(\frac{500}{615}\)
= 0.813 g

AP Inter 1st Year Physics Study Material Chapter 12 పదార్ధ ఉష్ణ ధర్మాలు

ప్రశ్న 6.
2 kg ల గాలిని స్థిర ఘనపరిమాణం వద్ద వేడిచేశారు. గాలి ఉష్ణోగ్రత 293 K నుంచి 313K కు పెరిగింది. స్థిర ఘనపరిమాణం వద్ద గాలి విశిష్టోష్ణం 0.718 kJ/kgK. అది శోషించు కొనే ఉష్ణపరిమాణాన్ని kJలలో, kcal లలో కనుక్కోండి. (J = 4.2 kJ/kcal)
సాధన:
ఇవ్వబడినవి M = 2 kg, dT = 313 – 293 = 20 K
CV = 0.718 × 10³ J/Kg – K; J = 4.2 KJ/Kcal
AP Inter 1st Year Physics Study Material Chapter 12 పదార్ధ ఉష్ణ ధర్మాలు 19

ప్రశ్న 7.
ఇత్తడి లోలకం కలిగిన ఒక గడియారం 20°C వద్ద సరియైన కాలాన్ని చూపుతుంది. ఉష్ణోగ్రత 30°Cకు పెరిగినప్పుడు ఆ గడియారం రోజుకు 8.212 సెకనుల కాలం తక్కువ చూపుతుంది. ఇత్తడి దైర్ఘ్య వ్యాకోచ గుణకం కనుక్కోండి.
సాధన:
ఇవ్వబడినవి t1 = 20°C, t2 = 30°C
రోజులో కోల్పోయిన కాలం = 8.212 sec
రోజులో కోల్పోయిన కాలం = \(\frac{1}{2}\) α (t2 – t1) × 86,400
8.212 = \(\frac{1}{2}\) α (30 – 20) × 86,400
AP Inter 1st Year Physics Study Material Chapter 12 పదార్ధ ఉష్ణ ధర్మాలు 20

ప్రశ్న 8.
30°C వద్ద 14 kg ద్రవ్యరాశి ఉన్న నైట్రోజన్ ఘన పరిమాణం 0.4 m³ అయితే పీడనాన్ని కనుక్కోండి.
సాధన:
వాయు ద్రవ్యరాశి (m) = 14 kg
= 14 × 10³ gm
N2అణుభారం = 28
V = 0.4 m³; T = 30 + 273 = 303 K
AP Inter 1st Year Physics Study Material Chapter 12 పదార్ధ ఉష్ణ ధర్మాలు 21

ప్రశ్న 9.
ఒక వస్తువు 7 నిమిషాలలో 60°C నుంచి 40°C కు చల్లబడుతుంది. పరిసరాల ఉష్ణోగ్రత 10°C అయితే, తదుపరి 7 నిమిషాల తరవాత అది ఎంత ఉష్ణోగ్రతకు చేరుకుంటుంది? [May ’13]
సాధన:
AP Inter 1st Year Physics Study Material Chapter 12 పదార్ధ ఉష్ణ ధర్మాలు 22
AP Inter 1st Year Physics Study Material Chapter 12 పదార్ధ ఉష్ణ ధర్మాలు 23

ప్రశ్న 10.
ఒక కృష్ణవస్తువు గరిష్ఠ వికిరణ తీవ్రత 2.65 µm వద్ద కనుక్కోవడమైంది. వికిరణాన్ని ఉద్గారం చేసే వస్తువు ఉష్ణోగ్రత ఎంత? (వీన్ స్థిరాంకం = 2.9 × 10-3 mk).
సాధన:
AP Inter 1st Year Physics Study Material Chapter 12 పదార్ధ ఉష్ణ ధర్మాలు 24

అదనపు లెక్కలు (Additional Problems)

ప్రశ్న 1.
నియాన్, కార్బన్-డై-ఆక్సైడ్ త్రిక బిందువులు వరసగా 24.57 K, 216.55 K ఈ ఉష్ణోగ్రతలను సెల్సియస్, ఫారన్హీట్ మానాలలో తెలియ చేయండి.
సాధన:
కెల్విన్ మరియు సెల్సియస్ స్కేలుల మధ్య సంబంధం TC = TK – 273.15
TC, TK లు సెల్సియస్ మరియు కెల్విన్ స్కేలులపై ఉష్ణోగ్రతలు నియాన్కు TC = 24.57 – 273.15 = – 248.58°C
CO2కు TC = 216.55 – 273.15 = – 56.60°C
కెల్విన్ మరియు ఫారెన్హీట్ స్కేలుకు
AP Inter 1st Year Physics Study Material Chapter 12 పదార్ధ ఉష్ణ ధర్మాలు 25

ప్రశ్న 2.
A, B అనే రెండు పరమ ఉష్ణోగ్రతా మానాలు (absolute scales) నీటి త్రిక బిందువును 200A, 350 B గా నిర్వచించాయి. TA. TB మధ్య ఉన్న సంబంధం ఏమిటి?
సాధన:
స్కేలు Aపై నీటి త్రికబిందువు = 200 A
స్కేలు Bపై నీటి త్రికబిందువు = 350 B
లెక్క ప్రకారం 200 A = 350, B = 273.16 K
AP Inter 1st Year Physics Study Material Chapter 12 పదార్ధ ఉష్ణ ధర్మాలు 26

ప్రశ్న 3.
ఒక ధర్మామీటర్ విద్యుత్ నిరోధం ఓమ్లలో ఉష్ణోగ్రతతో ఉజ్జాయింపు నియమం ప్రకారం కింది విధంగా మారుతుంది.
R = Ro[1 + α(T – To)]
నీటి త్రిక బిందువు 273.16 K వద్ద నిరోధం 101.62 Ω, సీసం ప్రమాణ ద్రవీభవన స్థానం 600.5 K వద్ద నిరోధం 165.52 ఏ ఉష్ణోగ్రత వద్ద నిరోధం 123.4 Ω అవుతుంది?
సాధన:
ఇక్కడ Ro = 101. 62Ω, To = 273.16 K
సందర్భం (i) : R1 = 165.52Ω, T1 = 600.5 K
సందర్భం (ii) : R2 = 123.4 Ω; T2
సంబంధమును ఉపయోగించి
R = R0(1 + α(T – T0))
AP Inter 1st Year Physics Study Material Chapter 12 పదార్ధ ఉష్ణ ధర్మాలు 27

ప్రశ్న 4.
కింది వాటికి సమాధానాలు ఇవ్వండి.
a) ఆధునిక ఉష్ణమితి (modern thermometry) లో నీటి త్రిక బిందువు ప్రమాణ స్థిర బిందువు. ఎందుకు ? మంచు ద్రవీభవన స్థానాన్ని, నీటి బాష్పీభవన స్థానాన్ని ప్రమాణ స్థిర బిందువులుగా తీసుకొంటే కలిగే తప్పు ఏమిటి ? (సెల్సియస్ మానంలో అదే విధంగా తీసుకోవడమైంది)

b) సెల్సియస్ మానంలో పై ప్రశ్నలో తెలిపిన విధంగా రెండు స్థిర బిందువులు కలవు. వాటికి వరసగా 0°C, 100°C సంఖ్యలను కేటాయించడమైంది. పరమమానంలో రెండు స్థిర బిందువుల్లో ఒకటి నీటి త్రిక బిందువుగా తీసుకొని కెల్విన్ మానంలో 273.16 K సంఖ్యను కేటాయించడమైంది. ఈ (కెల్విన్) మానంలో మరొక స్థిర బిందువు ఏమిటి?

c) పరమ ఉష్ణోగ్రత (కెల్విన్ మానం) T, సెల్సియస్ మానంపై ఉష్ణోగ్రత t కి మధ్య సంబంధం tc = T – 273.15 ఈ సంబంధంలో 273.16 కాకుండా, 273.15 ను తీసుకోవడానికి కారణం ఏమిటి?

d) పరమ ఉష్ణోగ్రతా మానంలో యూనిట్ అంతరం ఫారన్హీట్ మానంలో యూనిట్ అంతరానికి సమానం అయితే పరమ ఉష్ణోగ్రత మానంపై నీటి త్రిక బిందువు ఉష్ణోగ్రత ఎంత?
సాధన:
a) నీటి త్రిక బిందువు 273.16 వద్ద ఒకే విలువ కలిగి ఉండును. ఇక్కడ ఒకే పీడన విలువ మరియు ఒకే ఘనపరిమాణ విలువలను కల్గి ఉండును. పీడన, ఘనపరిమాణంల మార్పుతో మంచు ద్రవీభవన మరియు బాష్పీభవన బిందువులు ఒకే విలువ కలిగి ఉండవు.

b) కెల్విన్ పరమ స్కేలుపై మరియొక స్థిర బిందువు పరమ శూన్యం.

c) సాధారణ పీడనం వద్ద సెల్సియస్ స్కేలుపై మంచు ద్రవీభవన స్థానం 0°C. దీని అనురూప పరమ ఉష్ణోగ్రత విలువ 273.15 K. నీటి త్రిక బిందువుకు అనురూప ఉష్ణోగ్రత 273.16 K. ఇచ్చిన సంబంధం నుండి, సెల్సియస్ స్కేలుపై అనురూప నీటి త్రికబిందువు విలువ
= 273.16 – 273.15 0.01°C.

d) ఫారన్ హీట్ మరియు పరమ స్కేలుల మధ్య సంబంధం
AP Inter 1st Year Physics Study Material Chapter 12 పదార్ధ ఉష్ణ ధర్మాలు 28

ప్రశ్న 5.
A, B అనే ఆదర్శవాయు ధర్మామీటర్లలో వరసగా ఆక్సిజన్, హైడ్రోజన్ వాయువులను ఉపయోగించారు. కింది పరిశీలనలు చేయడమైంది.

ఉష్ణోగ్రతపీడనం ధర్మామీటరు – Aపీడనం ధర్మామీటరు – B
నీటి త్రిక బిందువు గంధకం సాధారణ1.250 × 105 Pa0.200 × 105 Pa
ద్రవీభవన స్థానం1.797 × 105 Pa0.287 × 105 Pa

a) A, B ధర్మామీటర్లు సూచించే సల్ఫర్ సాధారణ ద్రవీభవన స్థానం పరమ ఉష్ణోగ్రత ఎంత?
b) A, B ధర్మామీటర్ల జవాబులో స్వల్పంగా తేడా ఉండటానికి గల కారణాన్ని మీరు ఏమని ఊహిస్తున్నారు? (ధర్మామీటర్లలో ఎలాంటి దోషం లేదు) రెండింటి రీడింగ్ల మధ్య ఉన్న తేడాను తగ్గించడానికి పై ప్రయోగంలో ఇంకా ఏ పద్ధతి అవసరం?
సాధన:
a) T సల్ఫర్ ద్రవీభవన స్థానం, నీరుకు Ttr = 273.16 K
A ధర్మామీటర్కు, T = P/Ptr × 273.16
AP Inter 1st Year Physics Study Material Chapter 12 పదార్ధ ఉష్ణ ధర్మాలు 30

b) ఆక్సిజన్ మరియు హైడ్రోజన్ వాయువులు పరిపూర్ణ వాయువులు కావు. కావున సమాధానాలలో స్వల్ప తేడాలున్నాయి. ఈ తేడాను తగ్గించుటకు తక్కువ పీడనం మరియు తక్కువ రీడింగ్స్ తీసుకుంటే వాయువులు ఆదర్శ వాయు ప్రదర్శనకు దగ్గరగా ఉండును.

AP Inter 1st Year Physics Study Material Chapter 12 పదార్ధ ఉష్ణ ధర్మాలు

ప్రశ్న 6.
1 m పొడవు ఉన్న ఉక్కు కొలబద్ద 27.0°C ఉష్ణోగ్రత వద్ద సరియైన కొలతను ఇచ్చే విధంగా క్రమాంకనం చేశారు. బాగా వేడిగా ఉన్న రోజు, అంటే 45.0°C ఉష్ణోగ్రత ఉన్నప్పుడు ఈ కొలబద్ద ఒక ఉక్కు కడ్డీ పొడవును 63.0 cm గా కొలిచింది. ఆ రోజున ఉక్కు కడ్డీ అసలు పొడవు ఎంత? 27.0°C ఉష్ణోగ్రత ఉన్న రోజున అదే ఉక్కు కడ్డీ పొడవు ఎంత? ఉక్కుదైర్ఘ్య వ్యాకోచ గుణకం = 1.20 × 10-5 K-1.
సాధన:
L = 100 cm మరియు T = 27°C;
స్టీల్దేప్ పొడవు 45°C వద్ద,
L¹ = L + ∆L = L + αL∆T
= 100 + (1.20 × 10-5) × 100 × (45° – 27)
= 100.0216 cm
ఈ స్కేలుపై 45°C వద్ద 1 cm పొడవుకు
= 100.0216/100 cm

45°C వద్ద ఈ టేపుతో 63 cm కొలిచిన పొడవు
= \(\frac{100.0216}{100}\) × 63 = 63.0136 cm

27°C ఉష్ణోగ్రత వద్ద అదే రోజు అదే స్టీల్ కడ్డీ పొడవు = 63 × 1 = 63 cm.

ప్రశ్న 7.
ఒక పెద్ద ఉక్కు చక్రాన్ని అదే పదార్థంతో చేసిన కమ్మీపై 27°C ఉష్ణోగ్రత వద్ద బిగించాలి. ఆ కమ్మీ వెలుపల వ్యాసం 8.70 cm, చక్రం మధ్య ఉన్న రంధ్రం వ్యాసం 8.69 cm కమ్మీని పొడి మంచు ఉపయోగించి చల్లబరచారు. కమ్మీ ఏ ఉష్ణోగ్రత వద్ద చక్రాన్ని కమ్మీపై బిగించవచ్చు. మనకు కావలసిన ఉష్ణోగ్రత అవధిలో ఉక్కు దైర్ఘ్యవ్యాకోచ గుణకం స్థిరంగా ఉంటుంది అని అనుకోండి. αఉక్కు = 1.20 × 10-5K-1.
సాధన.
ఇచ్చట T1 = 27°C = 27 + 273 = 300 K
T1K ఉష్ణోగ్రత వద్ద పొడవు = LT1 = 8.70 cm
T2K ఉష్ణోగ్రత వద్ద పొడవు = LT2 = 8.69 cm
పొడవులో మార్పు = LT2 – LT1 = LT1 α(T2 – T1)
లేక 8.69 – 8.70 = 8.70 ×. (1.20 × 10-5) × (T2 – 300)
AP Inter 1st Year Physics Study Material Chapter 12 పదార్ధ ఉష్ణ ధర్మాలు 31

ప్రశ్న 8.
ఒక రాగి పలకలో రంధ్రం చేశారు. 27.0°C వద్ద ఆ రంధ్రం వ్యాసం 4.24 cm ఆ పలకను 227°C కు వేడిచేసినప్పుడు ఆ రంధ్రం వ్యాసంలో కలిగే మార్పు ఎంత? రాగి దైర్ఘ్య వ్యాకోచ గుణకం = 1.70 × 10-5K-1.
సాధన:
27°C వద్ద రంధ్రం వైశాల్యం S1 = 227°C
ఇచ్చట D1 227°C వద్ద రంధ్రం వ్యాసం
AP Inter 1st Year Physics Study Material Chapter 12 పదార్ధ ఉష్ణ ధర్మాలు 32

ప్రశ్న 9.
1.8 m పొడవు, 2.0 mm వ్యాసం ఉన్న ఒక ఇత్తడి తీగను 27°C వద్ద రెండు ద్రుఢమైన ఆధారాల మధ్య తీగలో స్వల్ప తన్యత ఉండేటట్లు బిగించారు. ఒకవేళ తీగను -39°C ఉష్ణోగ్రతకు చల్లబరిస్తే, తీగలో ఏర్పడే తన్యత ఎంత ? తీగ వ్యాసం 2.0 mm ఇత్తడి దైర్ఘ్య వ్యాకోచ గుణకం = 2.0 × 10-5K-1 ఇత్తడి యంగ్ గుణకం = 0.91 × 1011 Pa.
సాధన:
ఇచ్చట L = 1.8 m, T1 = 27°C, T2 = -39°C,
r = 1 mm = 10-3m, F = ?
AP Inter 1st Year Physics Study Material Chapter 12 పదార్ధ ఉష్ణ ధర్మాలు 33
ఇచ్చట ఋణగుర్తు తీగ సంకోచం వల్ల బలం లోపలికి పనిచేస్తుందని తెల్పును.

AP Inter 1st Year Physics Study Material Chapter 12 పదార్ధ ఉష్ణ ధర్మాలు

ప్రశ్న 10.
50 cm పొడవు, 3.0 mm వ్యాసం ఉన్న ఉన్న ఒక ఇత్తడి కడ్డీని అంతే పొడవు, వ్యాసం ఉన్న మరొక ఉక్కు కడ్డీతో జతపరచారు. వాటి తొలి పొడవులు 40°C వద్ద ఉంటే, 250°C ఉష్ణోగ్రత వద్ద ఆ సంయోగ కడ్డీ పొడవులో కలిగే మార్పు ఎంత? ఆ రెండు కడ్డీలు కలిసే సంధి వద్ద ఉష్ణ ప్రతిబలం ఏర్పడుతుందా? కడ్డీ చివరి కొనలు స్వేచ్ఛగా వ్యాకోచించగలవు. (ఇత్తడి, ఉక్కు కడ్డీల దైర్ఘ్య వ్యాకోచ గుణకాలు వరసగా 2.0 × 10-5K-1, 1.2 × 10-5K-1.)
సాధన:
∆L1 = L1α1 ∆T = 50 × (2.10 × 10-5) (250 – 40) = 0.2205 cm
∆L2 = L2α2 ∆T
= 50 × (1.2 × 10-5) (250 – 40) = 0.216 cm
∴ సంయోగ కడ్డీ పొడవులో మార్పు = ∆L1 + ∆L2
= 0.220 + 0.126 = 0.346 cm

ప్రశ్న 11.
గ్లిసరిన్ ఘనపరిమాణ వ్యాకోచ గుణకం 49 × 10-5K-1. ఉష్ణోగ్రతను 30°C కు పెంచితే దాని సాంద్రతలో కలిగే అంశిక మార్పు ఎంత?
సాధన:
ఇచ్చట r = 49 × 10-5 C-1, ∆T = 30°C
AP Inter 1st Year Physics Study Material Chapter 12 పదార్ధ ఉష్ణ ధర్మాలు 34

ప్రశ్న 12.
8.0 kg ద్రవ్యరాశి ఉన్న ఒక చిన్న అల్యూమినియం దిమ్మెలో రంధ్రం వేయడానికి 10 kW (రంధ్రాలు చేసే) యంత్రాన్ని ఉపయోగించారు. 50% యంత్రం సామర్థ్యం యంత్రం వేడెక్కడానికి లేదా పరిసరాలలోకి ఉష్ణ నష్టం జరగడానికి ఉపయోగపడింది అనుకొంటే 2.5 నిమిషాలలో దిమ్మె ఉష్ణోగ్రతలో కలిగే పెరుగుదల ఎంత? అల్యూమినియం విశిష్ట = 0.91 Jg-1K-1.
సాధన:
ఇచ్చట p = 10 kw = 105w,
ద్రవ్యరాశి m = 8.0 kg = 8 × 10³ g
ఉష్ణోగ్రతలోని పెరుగుదల, ∆T = ?
కాలం, t = 2.5 min = 2.5 × 60 sec
విశిష్టోష్ణం, C = 0.91 Jg-1°C-1
మొత్తం శక్తి = p × t = 104 × 150
= 15 × 105 J
50% శక్తిలో నష్టం ఉన్నది.
AP Inter 1st Year Physics Study Material Chapter 12 పదార్ధ ఉష్ణ ధర్మాలు 35

ప్రశ్న 13.
2.5 kg ద్రవ్యరాశి ఉన్న ఒక రాగి దిమ్మెను కొలిమిలో 500°C ఉష్ణోగ్రతకు వేడిచేసి ఒక పెద్ద మంచు దిమ్మెపై ఉంచారు. అప్పుడు గరిష్ఠంగా కరిగే మంచు పరిమాణం ఎంత? (రాగి విశిష్టోష్ణం = 0.39 Jg-1K-1; నీటి ద్రవీభవన గుప్తోష్టం = 335 Jg-1.
సాధన:
రాగి దిమ్మె ద్రవ్యరాశి, m = 2.5 kg
= 2500 kg
ఉష్ణోగ్రతలో తగ్గుదల, ∆T = 500 – 0 = 500°C
on 2% áo, C = 0.39 Jg-1°C-1
మంచు గుప్తోష్ణం, L = 335 Jg-1
ద్రవీభవన మంచు ద్రవ్యరాశి m¹
మంచు గ్రహించు ఉష్ణము = రాగి కోల్పోయిన ఉష్ణం
AP Inter 1st Year Physics Study Material Chapter 12 పదార్ధ ఉష్ణ ధర్మాలు 36

ప్రశ్న 14.
ఒక పదార్థం విశిష్టోష్ణం కనుక్కొనే ప్రయోగంలో 150°C వద్ద ఉన్న 0.20 kg ల ఒక లోహపు దిమ్మెను 27°C వద్ద 150 cm 3 నీరు ఉన్న కెలోరిమీటరు (జల తుల్యాంకం 0.025 kg) లోకి జారవిడిచారు. తుది ఉష్ణోగ్రత 40°C. లోహపు దిమ్మె విశిష్టోష్ణం గణన చేయండి. పరిసరాలలోకి నష్టపోయిన ఉష్ణం విస్మరించ దగినంత కాకపోతే మీ సమాధానం ఆ పదార్థం విశిష్టోష్ణం అసలు విలువ కంటే ఎక్కువగా ఉంటుందా లేదా తక్కువగా ఉంటుందా ?
సాధన:
లోహ ద్రవ్యరాశి, m = 0.20 kg = 200 g
లోహం ఉష్ణోగ్రతలో తగ్గుదల ∆T = 150 – 40
= 110°C

లోహం విశిష్టోష్ణం C అయితే, లోహం కోల్పోయిన ఉష్ణం
ΔΟ = mc∆T = 200 × L × 110
నీటి ఘనపరిమాణం = 150 C.C
∴ నీటి ద్రవ్యరాశి m¹ = 150 g
కెలోరి మీటరు నీటి తుల్యాంకనం,
w = 0.025 kg = 25 kg
కెలోరిమీటర్ మరియు నీటి ఉష్ణోగ్రతలో పెరుగుదల
∆T¹ = 40 – 27 = 13°C
నీరు మరియు కెలోరిమీటరు గ్రహించిన ఉష్ణం,
∆Q¹ = (m¹ + w)T¹
= (150 + 25) × 13 = 175 × 13
∆Q = ∆Q¹
∴ (i) మరియు (ii) నుండి
AP Inter 1st Year Physics Study Material Chapter 12 పదార్ధ ఉష్ణ ధర్మాలు 37
(లేక)
పరిసరాలకు కోల్పోయిన కొంత ఉష్ణం, యదార్థ విలువ C కన్నా తక్కువ.

AP Inter 1st Year Physics Study Material Chapter 12 పదార్ధ ఉష్ణ ధర్మాలు

ప్రశ్న 15.
గది ఉష్ణోగ్రత వద్ద కొన్ని సాధారణ వాయువుల మోలార్ విశిష్టోష్టాలపై చేసిన పరిశీలనలు కింద ఇవ్వడమైంది.

వాయువుమోలార్ విశిష్టోష్ణం (Cv) (cal mol-1 K-1)
హైడ్రోజన్4.87
నైట్రోజన్4.97
ఆక్సిజన్5.02
నైట్రిక్ ఆక్సైడ్4.99
కార్బన్ మోనాక్సైడ్5.01
క్లోరిన్6.17

ఈ విధంగా కొలిచిన వాయువుల మోలార్ విశిష్టోష్ణ విలువలు ఏక పరమాణు వాయువుల విలువల కంటే విశేషంగా భిన్నమైనవి. ఉదాహరణకు, ఏక పరమాణుక వాయువు మోలార్ విశిష్టోష్ణం 2.92 cal/mol K. ఈ వ్యత్యాసం ఎందుకో వివరించండి. క్లోరిన్ విలువ కొంత వరకు అధికంగా (మిగతా వాటి కంటే) ఉండటాన్ని బట్టి ఏమి చెప్పవచ్చు?
సాధన:
పై పట్టికలో తెల్పిన వాయువులు ద్విపరమాణు వాయువులు. ఏకపరమాణు వాయువులు కాదు. ద్విపరమాణు వాయువులకు, మోలార్ ఉష్ణం = \(\frac{5}{2}\)R = \(\frac{5}{2}\) × 1.98 = 4.95 . పై పట్టికలో క్లోరిన్ తప్ప మిగిలినవి పరిశీలనలలో సరిపోతున్నాయి. ఏకపరమాణు వాయువు ఒక స్థానాంతరణ చలనంను కలిగి ఉండును. ద్విపరమాణుక అణువుకు కంపన మరియు భ్రమణ చలనం సాధ్యం. 1 మోల్ ద్విపరమాణుక వాయు ఉష్ణోగ్రతను 1°C పెంచుటకు కంపన ఉష్ణం, స్థానాంతరణ శక్తినే కాక భ్రమణ మరియు కంపన శక్తులను పెంచును. ద్విపరమాణుక మోలార్ విశిష్టోష్ణం, ఏకపరమాణుక వాయు మోలార్ విశిష్టోష్ణం కన్నా ఎక్కువ.

క్లోరిన్ మోలార్ విశిష్టోష్ణం హైడ్రోజన్, నైట్రోజన్, ఆక్సిజన్ మొదలైన వాటి కన్నా ఎక్కువగా ఉండుట వల్ల గది d ఉష్ణోగ్రత వద్ద స్థానాంతరణ మరియు భ్రమణ చలనంలతో పాటు కంపన చలనం కూడా కల్గి ఉండును. మిగతా ద్విపరమాణుక వాయువులు భ్రమణ చలనం కలిగి ఉండును. క్లోరిన్ హెచ్చు మోలార్ విశిష్టోష్ణం ఉండుటకు ఇదియే కారణం.

ప్రశ్న 16.
కార్బన్ డై ఆక్సైడ్ P-T ప్రావస్థా పటం ఆధారంగా కింది ప్రశ్నలకు సమాధానాలను ఇవ్వండి.
a) ఏ ఉష్ణోగ్రతా పీడనాల వద్ద సమతాస్థితిలో CO2 ఘన, ద్రవ, బాష్ప స్థితులు కలిసి ఉంటాయి?
b) CO2 ఘనీభవన, బాష్పీభవన స్థానాలపై పీడన తగ్గుదల ప్రభావమేమిటి ?
c) CO2 సందిగ్ధ ఉష్ణోగ్రత, పీడన విలువలు ఏమిటి ? వాటి ప్రాముఖ్యత ఏమిటి?
d) కింది వివిధ సందర్భాలలో CO2 ఘనమా, ద్రవమా లేదా వాయువా తెలపండి. (a) 1 atm, -70°C వద్ద (b) −60°C వద్ద (c) 56 atm, 15°C వద్ద?
సాధన:
a) కార్బన్ డయాక్సైడ్ త్రికబిందువు ఉష్ణోగ్రత = -56.6°C మరియు పీడనం 5.11 atm.

b) పీడనం తగ్గుదలతో, కార్బన్ డయాక్సైడ్ ద్రవీభవన = లేక బాష్పీభవన బిందువు తగ్గును.

c) కార్బన్ డయాక్సైడ్ క్రిటికల్ ఉష్ణోగ్రత 31.1°C మరియు క్రిటికల్ పీడనం 73.0 atm. కార్బన్ డయాక్సైడ్ ఉష్ణోగ్రత 31.1°C కన్నా ఎక్కువైతే, ద్రవ స్థితిలోకి రాదు. కావున హెచ్చు పీడనం ప్రయోగించాలి.

d) కార్బన్ డయాక్సైడ్ (a) 1 atm లోపు – 70°C వద్ద బాష్పస్థితి (b) 10 atm లోపు – 6°C వద్ద ఘనస్థితి (c) 56 atm లోపు −15°C వద్ద ద్రవస్థితి

ప్రశ్న 17.
CO2, P – T ప్రావస్థా పటం ఆధారంగా కింది ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వండి.
a) 1 atm పీడనం, – 60°C ఉష్ణోగ్రత వద్ద CO2ను సమోష్ణోగ్రతా ప్రక్రియలో సంపీడనం చెందిస్తే దానిలో మార్పు ద్రవ ప్రావస్థ ద్వారా జరుగుతుందా?
b) 4 atm పీడనం వద్ద ఉన్న CO2 ను స్థిర పీడనం వద్ద గది ఉష్ణోగ్రత నుంచి చల్లబరిస్తే ఏమవుతుంది?
c) 10 atm పీడనం – 65°C ఉష్ణోగ్రత వద్ద నిర్దిష్ట ద్రవ్యరాశి ఉన్న ఘన CO2 ను స్థిర పీడనం వద్ద గది ఉష్ణోగ్రతకు వేడిచేస్తే, దానిలో కలిగే మార్పులను గుణాత్మకంగా వివరించండి.
d) CO2ను 70°C ఉష్ణోగ్రతకు వేడిచేసి సమోష్ణోగ్రతా ప్రక్రియలో సంపీడనం చెందించారు. దాని ధర్మాలలో ఎలాంటి మార్పులు కలుగుతాయో మీరు ఊహించ
గలరా?
సాధన:
a) వక్రంపై ఉష్ణోగ్రత – 60°C, – 56.6°C కు ఎడమవైపు ఉండును. i. e. అది బాష్ప మరియు ఘన ప్రావస్థ ప్రాంతంలో ఉండును. అందువల్ల కార్బన్ డయాక్సైడ్ ద్రవస్థితికి రాకుండా ఘనస్థితికి వచ్చును.

b) 4 atm పీడనం 5.11 atm కన్నా తక్కువ. కావున కార్బన్ డయాక్సైడ్ ద్రవస్థితికి రాక నేరుగా ఘనస్థితికి వచ్చును.

c) ఘన కార్బన్ డయాక్సైడ్ 10 atm పీడనం మరియు -65°C ఉష్ణోగ్రత వద్ద వేడిచేస్తే, అది మొదట ద్రవస్థితికి మారును. ఆ తరువాత ఉష్ణోగ్రత పెరుగుదలతో బాష్ప ప్రావస్థకు చేరును. P = 10 atm వద్ద T – అక్షంనకు గీసిన సమాంతర రేఖ ద్రవీభవన మరియు బాష్ప వక్రాల ఖండన బిందువులు 10 atm వద్ద కార్బన్ డయాక్సైడ్ ద్రవీభవన మరియు బాష్పీభవన స్థానాలను ఇచ్చును.

d) 70°C, CO2 సందిగ్ధ ఉష్ణోగ్రత కన్నా ఎక్కువ. CO2 సమ ఉష్ణోగ్రత వద్ద వేడిచేసిన ద్రవ దశలోనికి మార్చలేము. CO2 వాయు స్థితిలోనే ఉండును. పీడనంను పెంచిన ఆధర్మ వాయువు ప్రవర్తనకు దూరంగా ఉండును.

AP Inter 1st Year Physics Study Material Chapter 12 పదార్ధ ఉష్ణ ధర్మాలు

ప్రశ్న 18.
ఒక బాలుడు 101°F ఉష్ణోగ్రత జ్వరంతో ఉన్నాడు. అతడు జ్వరాన్ని తగ్గించే ఆంటీ పైరిన్ మాత్ర తీసుకొన్నప్పుడు ఆ మాత్ర కారణంగా అతని దేహం నుంచి వెలువడే చెమట ఆవిరయ్యే రేటు పెరుగుతుంది. 20 నిమిషాలలో బాలుడి జ్వరాన్ని 98°F కు తగ్గిస్తే, ఆ మాత్ర వల్ల కలిగే అదనపు ఆవిరయ్యే రేటు ఎంత ? ఆవిరిగా మారే క్రియ వల్లనే ఉష్ణ నష్టం జరుగుతుంది అనుకోండి. బాలుడి ద్రవ్యరాశి 30 kg మానవ దేహం విశిష్టోష్ణం ఉజ్జాయింపుగా నీటి విశిష్టోష్టానికి సమానం. ఆ ఉష్ణోగ్రత వద్ద నీటి ఆవిరి గుప్తోష్ణం సుమారుగా 580 cal g-1.
సాధన:
ఉష్ణోగ్రతలో తగ్గుదల = ∆T = 101 – 98 = 3°F
= 3 × \(\frac{5}{9}\)°C = \(\frac{5}{3}\)°C

పిల్లవాని ద్రవ్యరాశి, M = 30 kg
మానవ శరీర విశిష్టోష్టం = నీటి విశిష్టోష్ణం,
C = 1000 cal.kg-1C-1
పిల్లవాడు కోల్పోయిన ఉష్ణం, ∆Q = mC∆T
= 30 × 1000 × \(\frac{5}{3}\) = 5000 calories
20 ని m¹ నీటి ద్రవ్యరాశి ఆవిరైతే, అప్పుడు m’ L = ∆Q
లేక
AP Inter 1st Year Physics Study Material Chapter 12 పదార్ధ ఉష్ణ ధర్మాలు 38

ప్రశ్న 19.
ప్రత్యేకంగా వేసవి కాలంలో తక్కువ పరిమాణంలో వండిన ఆహారాన్ని నిల్వ చేయడానికి చౌకయిన, సమర్ధవంతమైన పద్ధతి థర్మోకోల్ మంచు పెట్టె. 30 cm పొడవు గల ఘన మంచు పెట్టె మందం 5.0 cm ఆ పెట్టెలో 4.0 kgల మంచును ఉంచారు. 6 గంటల తరవాత మిగిలి ఉండే మంచు పరిమాణాన్ని అంచనా వేయండి. వెలుపలి ఉష్ణోగ్రత 45°C, థర్మోకోల్ ఉష్ణ వాహకత్వ గుణకం 0.01 Js-1m-1K-1[నీటి ద్రవీభవన ఉష్ణం = 335 × 10³ J kg-1] .
సాధన:
ప్రతి భుజం పొడవు,
l = 30 cm = 0.3 m
ప్రతి సైడు మందము, Ax
= 5 cm = 0.05 m
పెట్టెలోనికి వెళ్ళే మొత్తం తల వైశాల్యం ద్వారా పోవు
A = 6 l² = 6 × 0.3 × 0.3 = 0 Jum²
ఉష్ణోగ్రతా భేదం, ∆T = 45 – 0 = 45°C,
K = 0.01 JS-1m-13°C-1
కాలం, ∆T = 6 hrs = 6 × 60 × 60 S
ద్రవీభవన గుప్తోష్టం, L = 335 × 10³ J/kg
ఈ కాలంలో ద్రవీభవించిన మంచు ద్రవ్యరాశి m తీసుకుందాం.
AP Inter 1st Year Physics Study Material Chapter 12 పదార్ధ ఉష్ణ ధర్మాలు 39

ప్రశ్న 20.
ఒక ఇత్తడి బాయిలర్ అడుగు భాగం వైశాల్యం 0.15 m², మందం 1.0 cm దీనిని ఒక గ్యాస్ స్టవ్ పై పెట్టినప్పుడు 6.0 kg/min రేటున నీటిని మరిగిస్తుంది. బాయిలర్ స్పర్శలో ఉన్న మంటలోని కొంత భాగం ఉష్ణోగ్రతను అంచనా వేయండి. ఇత్తడి-ఉష్ణవాహకత్వం = 109 Js¹ m-1K-1; నీటి బాష్పీభవన ఉష్ణం = 2256 × 10³ Jkg -1.
సాధన:
ఇచ్చట A = 0.15 m² ∆x = 1.0 m 10-2m
AP Inter 1st Year Physics Study Material Chapter 12 పదార్ధ ఉష్ణ ధర్మాలు 40

ప్రశ్న 21.
ఎందుకో వివరించండి :
a) అధిక పరావర్తకత (large reflectivity) ఉన్న వస్తువు అధమ ఉద్గారకం (emitter).
b) అతి శీతలంగా ఉన్న రోజు చెక్క పళ్ళెం కంటే ఇత్తడి పాత్ర చాలా చల్లగా ఉంటుంది.
c) పరిపూర్ణ కృష్ణవస్తువు వికిరణానికి క్రమాంకనం చేసిన దృశా పైరామీటరు (అధిక ఉష్ణోగ్రత కొలవడానికి) బాహ్య ప్రదేశంలో ఉన్న బాగా ఎర్రగా వేడెక్కిన ఇనుప కడ్డీ ఉష్ణోగ్రతను చాలా తక్కువ విలువగా చూపుతుంది. కాని, అదే కడ్డీని కొలిమిలో అమర్చినప్పుడు ఆ ఉష్ణోగ్రత వద్ద సరైన విలువను చూపుతుంది.
d) భూమిపై భూ వాతావరణం లేకుంటే జీవకోటి ఉండటానికి వీలులేనంత చల్లగా ఉండేది.
e) వేడి నీటిని ప్రవహింపచేయడంపై ఆధారపడ్డ తాపన వ్యవస్థ (heating system) కంటే ఆవిరిని ప్రవహింప చేయడంపై ఆధారపడ్డ తాపన వ్యవస్థ చాలా సమర్ధవంతంగా భవంతిని వేడి చేయగలదు.
సాధన:
a) ఎక్కువగా పరావర్తనం చెందించు వస్తువు, ఉష్ణం శోషణకారి కాదు. కావున అధమ శోషణకారి, అధమ ఉద్గారి.

b) చలికాలంలో ఇత్తడి టంబ్లర్ (గ్లాస్)ను తాకితే, శరీరం నుండి ఇత్తడి గ్లాస్గోనికి ఉష్ణ ప్రసారం జరుగును. కావున చెక్క ట్రే కన్నా ఇత్తడి టంబ్లర్ (గ్లాస్) చల్లగా ఉండును.

c) పొయ్యిలో ఎర్రగా కాల్చిన ఇనుపముక్క దాని ఉష్ణోగ్రతను తెల్పు సమీకరణం E = (T – T). దృశ్య పైరోమీటర్ తలం కాంతి తీవ్రత, ఉష్ణోగ్రతపై ఆధారపడి పనిచేయును. ఓపెన్ గా ఎర్రక ఉష్ణోగ్రతను పైరోమీటర్ స్వల్ప విలువను ఇచ్చును.

d) భూ వాతావరణ లోయర్ పొరలు పరారుణ వికిరణాలను భూమి వైపు పరావర్తనం చేయును. సూర్యుని నుండి వచ్చు ఉష్ణ వికిరణాలను భూమి పగలు గ్రహించుట వల్ల వాతావరణం పట్టి ఉంచును. భూమి వాతావరణం లేకపోతే, దాని తలం చల్లగా ఉండి జీవించుటకు వీలగును.

e) 100°C వద్ద ఉన్న నీరు కన్నా 100°C వద్ద ఆవిరి హెచ్చు ఉష్ణాన్ని కలిగి ఉండును. 100°C వద్ద ఉన్న 1 gm నీరు కన్నా 100°C వద్ద ఉన్న 1 gm ఆవిరి 540 cal ఎక్కువ ఉష్ణంను కలిగి ఉండును. అందువల్ల ఆవిరి సర్కులేషన్పై ఆధారపడిన హీటింగ్ వ్యవస్థలు వేడినీటి సర్కులేషన్ పై ఆధారపడిన వానికన్నా ఎక్కువ దక్షత కలిగి ఉండును.

AP Inter 1st Year Physics Study Material Chapter 12 పదార్ధ ఉష్ణ ధర్మాలు

ప్రశ్న 22.
ఒక వస్తువు 5 నిమిషాలలో 80°C నుంచి 50°C కు చల్లబడుతుంది. 60°C నుంచి 30°C కు చల్లబడటానికి పట్టేకాలం కనుక్కోండి. పరిసరాల ఉష్ణోగ్రత 20°C.
సాధన:
వస్తువు ఉష్ణోగ్రత T మరియు పరిసరాల ఉష్ణోగ్రత To అయితే, న్యూటన్ శీతలీకరణ నియమం ప్రకారం
AP Inter 1st Year Physics Study Material Chapter 12 పదార్ధ ఉష్ణ ధర్మాలు 41
AP Inter 1st Year Physics Study Material Chapter 12 పదార్ధ ఉష్ణ ధర్మాలు 42

సాధించిన సమస్యలు (Solved Problems)

ప్రశ్న 1.
దీర్ఘచతురస్రాకార ఘన పదార్థ రేకు విస్తీర్ణ వ్యాకోచ గుణకం, (∆A/A)/∆T దాని దైర్ఘ్య వ్యాకోచ గుణకం α1 కి రెట్టింపు అని చూపండి.
సాధన:
AP Inter 1st Year Physics Study Material Chapter 12 పదార్ధ ఉష్ణ ధర్మాలు 43
a పొడవు, b వెడల్పు ఉన్న దీర్ఘచతురస్రాకార ఘనపదార్థ రేకును తీసుకోండి. రేకు ఉష్ణోగ్రతను ∆T కి పెంచితే, a లో పెరుగుదల ∆a = α1a∆T, b లో పెరుగుదల ∆b = α1 b ∆T. అదే విధంగా వైశాల్యంలో పెరుగుదల ∆A అనుకొంటే పటం నుంచి
∆A = ∆A1 + ∆A2+ ∆A3
ΔΑ = a ∆b + b ∆a + (∆a) (∆b)
= a α1 b ∆T + b α1a ∆T + (α1)² ab(∆T)²
= α1ab ∆T(2 + α1∆T)
= α1A ∆T(2 + α1∆T)

α1 = 10-5 K-1 కాబట్టి అంశిక (fractional) ఉష్ణోగ్రతకు α1∆T ల 2 తో పోల్చినప్పుడు చాలా స్వల్పం కాబట్టి దానిని ఉపేక్షించ వచ్చు.
\(\left(\frac{\Delta \mathrm{A}}{\mathrm{A}}\right) \frac{1}{\Delta \mathrm{T}}\) ≈ 2α1

AP Inter 1st Year Physics Study Material Chapter 12 పదార్ధ ఉష్ణ ధర్మాలు

ప్రశ్న 2.
ఒక కమ్మరి ఎద్దులబండి కొయ్య చక్రం అంచుకు ఇనుప చట్రాన్ని బిగిస్తాడు. 27°C ఉష్ణోగ్రత వద్ద కొయ్య చక్రం, ఇనుప చట్రం వ్యాసాలు వరుసగా 5.243 m, 5.231 m ఎంత ఉష్ణోగ్రతకు ఇనుప చట్రాన్ని వేడిచేస్తే అది చక్రం అంచుకు బిగుసుకు పోతుంది?
సాధన:
ఇచ్చిన విలువలు,
T1 = 27°C
LT1 = 5.231 m
LT2 = 5.243 m
కాని,
LT2 = LT1 [1 + α1(T2 – T1)]
5.243 m = 5.231 m[1 + 1.20 × 10-5 K-1 (T2 – 27°C)]
లేదా T2 = 218°C

ప్రశ్న 3.
0.047 kg ద్రవ్యరాశి ఉన్న ఒక అల్యూమినియం గోళాన్ని మరుగుతున్న నీరు ఉన్న పాత్రలో, దాని ఉష్ణోగ్రత 100°C చేరే వరకు ఉంచారు. తరవాత వెంటనే 20°C ఉష్ణోగ్రత వద్ద 0.25 kg ల నీరు ఉన్న 0.14 kg ల కెలోరిమీటర్ లోకి మార్చారు. ఫలితంగా నీటి ఉష్ణోగ్రత పెరిగి 23°C వద్ద నిలకడ స్థితిని చేరింది. అల్యూమినియం విశిష్టోష్ణ సామర్థ్యాన్ని కనుక్కోండి.
సాధన:
పై ఉదాహరణలో, నిలకడ స్థితిలో ఉన్నప్పుడు, అల్యూమినియం గోళం కోల్పోయిన ఉష్ణం, నీరు, కెలోరిమీటర్ గ్రహించిన ఉష్ణానికి సమానం అని భావించి సాధనచేస్తాం.

అల్యూమినియం గోళం ద్రవ్యరాశి (m) = 0.047 kg
అల్యూమినియం గోళం తొలి ఉష్ణోగ్రత = 100°C
తుది ఉష్ణోగ్రత = 23°C
ఉష్ణోగ్రతలో మార్పు (∆T) = (100°C – 23°C)
= 77°C

అల్యూమినియం విశిష్టోష్ణ సామర్థ్యం SAl అనుకోండి.
అల్యూమినియం గోళం కోల్పోయిన ఉష్ణరాశి
= m1SAl ∆T = 0.047 kg × sAl × 77°C s ………. (i)
నీటి ద్రవ్యరాశి (m2) = 0.25 kg
కెలోరిమీటర్ ద్రవ్యరాశి (m3) = 0.14 kg
కెలోరిమీటర్, నీటి తొలి ఉష్ణోగ్రత = 20°C
మిశ్రమం తుది ఉష్ణోగ్రత = 23°C
ఉష్ణోగ్రతలో మార్పు (∆T2) = 23°C – 20°C = 3°C

నీటి విశిష్టోష్ణ సామర్థ్యం 4186.0 నుంచి నీటి విశిష్టోష్ణ సామర్థ్యం (sw)
= 4.18 × 10³ J kg-1K-1
రాగి కెలోరిమీటర్ విశిష్టోష్ణ సామర్థ్యం
= 0.386 × 10³ J kg-1K-1

కెలోరిమీటర్, నీరు గ్రహించిన ఉష్ణరాశి
= m2sw ∆T2 + m3Scucu ∆T2
= (m2sw + m3scu) (∆T2 )
= (0.25 kg × 4.18 × 10³ J kg-1 K-1 + 0.14 kg
× 0.386 × 10³ J kg-1 K-1) (23°C – 20°C) ……….. (ii)

నిలకడ స్థితిలో అల్యూమినియం గోళం కోల్పోయిన ఉష్ణం = నీరు గ్రహించిన ఉష్ణం + కెలోరిమీటర్ గ్రహించిన ఉష్ణం.
కాబట్టి (i), (ii) సమీకరణాల నుంచి
0.047 kg × sAl × 77°C
= (0.25 kg × 4.18 × 10³ J kg-1 K-1 + 0.14kg × 0.386 × 10³ J kg-1 K-1)(3°C)
sAl = 0.911 kJ kg-1 K-1

ప్రశ్న 4.
0°C వద్ద ఉన్న 0.15 kg ల మంచును, 50°C వద్ద ఉన్న 0.30 kg ల నీటితో ఒక పాత్రలో కలిపినప్పుడు ఫలిత ఉష్ణోగ్రత 6.7°C కు చేరుతుంది. మంచు ద్రవీభవన గుప్తోష్ణం కనుక్కోండి.
(Sనీరు= 4186 J kg-1 K-1)
సాధన:
నీరు కోల్పోయిన ఉష్ణం = mswf – θi)w
= (0.30 kg) (4186 J kg‍-1 K-1) (50.0°C – 6.7°C)
= 54376.14 J

మంచును ద్రవీభవించడానికి కావలసిన ఉష్ణం
= m2Lf = (0.15 kg) Lf

మంచు నీటి ఉష్ణోగ్రతను తుది ఉష్ణోగ్రతకు పెంచడానికి అవసరమయ్యే ఉష్ణం = mIswf – θi)I
= (0.15 kg) (4186 J kg-1 K-1) (6.7°C – 0°C)
= 4206.93 J

కోల్పోయిన ఉష్ణం = పొందిన ఉష్ణం
54376.14 J = (0.15 Kg) Lf + 4206.93 J
Lf = 3.34 × 105 J kg-1

ప్రశ్న 5.
కెలోరిమీటర్ లో -12°C వద్ద ఉన్న 3 kg మంచును, వాతావరణ పీడనం, 100°C ఉష్ణోగ్రత వద్ద బాష్పంగా మార్చడానికి అవసరం అయ్యే ఉష్ణాన్ని కనుక్కోండి. మంచు విశిష్టోష్ణ సామర్థ్యం = 2100 J kg-1 K-1, నీటి విశిష్టోష్ణ సామర్థ్యం = 4186 J kg-1 K-1, మంచు ద్రవీభవన గుప్తోష్ణం = 3.35 × 105 J kg-1 బాష్పీభవన గుప్తోష్టం = 2.256 × 106 J kg-1.
సాధన:
మంచు ద్రవ్యరాశి, m = 3 kg
మంచు విశిష్టోష్ణ సామర్థ్యం, Sice = 2100 J kg K-1
నీటి విశిష్టోష్ణ సామర్థ్యం, Swater = 4186 J kg-1 K-1
మంచు ద్రవీభవన గుప్తోష్ణం, Lf ice = 3.35 × 105 J kg-1
బాష్పీభవన గుప్తోష్ణం, Lsteam = 2.256 × 105 J kg-1

Q = – 12°C వద్ద ఉన్న 3 kg ల మంచును 100°C వద్ద బాష్పంగా మార్చడానికి అవసరం అయ్యే ఉష్ణం.
Q1 = 12°C వద్ద ఉన్న మంచును 0°C మంచుగా మార్చడానికి అవసరం అయ్యే ఉష్ణం.

msice ∆T1 = (3 kg) (2100 J kg-1 K-1)
[0 – (−12)]°C = 75600 J

Q2 = 0°C వద్ద ఉన్న మంచును 0°C వద్ద నీటిగా మార్చడానికి అవసరం అయ్యే ఉష్ణం
mLf ice = (3 kg) (3.35 × 105 J kg-1) = 1005000 J

Q3 = 0°C వద్ద ఉన్న నీటిని 100°C వద్ద నీటిగా మార్చడానికి అవసరం అయ్యే ఉష్ణం
msw ∆T2 = (3 kg) (4186 J kg-1K-1) (100°C)
=1255800 J

Q4 = 100°C వద్ద ఉన్న నీటిని, 100°C వద్ద బాష్పంగా మార్చడానికి అవసరం అయ్యే ఉష్ణం
mLsteam = (3 kg) (2.256 × 106 J kg-1)
= 6768000 J

అందువల్ల,
Q = Q1 + Q2 + Q3 + Q4
= 75600 J + 1005000 J + 1255800 J + 6768000 J
= 9.1 × 106 J

ప్రశ్న 6.
పటంలో చూపినట్లు వ్యవస్థ నిలకడ స్థితిలో ఉన్నప్పుడు ఉక్కు-రాగి సంధి ఉష్ణోగ్రత ఎంత? ఉక్కు కడ్డీ పొడవు = 15.0 cm, రాగి కడ్డీ పొడవు = 10.0 cm, కొలిమి ఉష్ణోగ్రత = 300°C, మరొక కొన ఉష్ణోగ్రత = 0°C. ఉక్కు కడ్డీ మధ్యచ్ఛేద వైశాల్యం రాగి కడ్డీకి రెట్టింపు. (ఉక్కు ఉష్ణవాహకత్వం = 50.2 Jst m-1 K-1; రాగి ఉష్ణవాహకత్వం = 385 J s-1m-1K-1).
AP Inter 1st Year Physics Study Material Chapter 12 పదార్ధ ఉష్ణ ధర్మాలు 44
సాధన:
కడ్డీ చుట్టూ ఉన్న ఉష్ణబంధక పదార్థం కడ్డీ పక్కతలాల గుండా నష్టపోయే ఉష్ణాన్ని తగ్గిస్తుంది. కాబట్టి, ఉష్ణం కడ్డీ పొడవు వెంబడి మాత్రమే ప్రయాణిస్తుంది. కడ్డీలోని ఏ బిందువు వద్దనైనా మధ్యచ్ఛేద వైశాల్యం (A) తీసుకోండి. నిలకడ స్థితిలో ఒక విభాగం వద్ద లోపలికి ప్రవేశించే ఉష్ణం, దాని నుంచి బయటికి ప్రవహించే ఉష్ణానికి తప్పకుండ సమానంగా ఉంటుంది. లేకపోతే, ఆ విభాగం కొంత ఉష్ణాన్ని కోల్పోవడం లేదా పొందడం జరుగుతుంది. అప్పుడు విభాగం ఉష్ణోగ్రత నిలకడ స్థితిలో ఉండకపోవచ్చు. ఈ విధంగా నిలకడ స్థితిలో కడ్డీ ఒక మధ్యచ్ఛేద వైశాల్యం ద్వారా ప్రవహించే ఉష్ణప్రవాహ రేటు ఉక్కు-రాగి సంయోగ కడ్డీ పొడవు వెంబడి ఉన్న ప్రతీ బిందువు వద్ద సమానం. నిలకడ స్థితిలో ఉక్కు-రాగి సంధి వద్ద ఉష్ణోగ్రత T అయితే,
AP Inter 1st Year Physics Study Material Chapter 12 పదార్ధ ఉష్ణ ధర్మాలు 45

ఇక్కడ 1, 2 లు వరసగా ఉక్కు రాగి కడ్డీలను సూచిస్తాయి.
A1 = 2, A2, L1 = 15.0 cm, L2 = 10.0 cm,
K1 = 50.2 J s-1m-1K-1,
AP Inter 1st Year Physics Study Material Chapter 12 పదార్ధ ఉష్ణ ధర్మాలు 46

ప్రశ్న 7.
ఒక ఇనుప కడ్డీ (L1 = 0.1 m, A1 = 0.02 m², K1 = 79 Wm-1K-1) ఒక ఇత్తడి కడ్డీ (L2 = 0.1 m, A2 = 0.02 m², K2 = 109 W m-1 K-1) ని పటంలో చూపించినట్లు ఇనుపకడ్డీ చివరికొనను ఇత్తడి కడ్డీ మొదటి కొనకు అతికించారు. ఇనుప కడ్డీ, ఇత్తడి కడ్డీ స్వేచ్ఛా కొనలను వరసగా 373 K, 273 K ల మధ్య ఉంచారు. ఈ కింది సందర్భాలలో సమీకరణాలను రాబట్టి, కింది రాశులను గణన చేయండి. (i) రెండు కడ్డీల సంధి వద్ద ఉష్ణోగ్రత, (ii) సంయోగ కడ్డీ తుల్య ఉష్ణవాహకత్వం, (iii) సంయోగ కడ్డీ ద్వారా ప్రవహించే ఉష్ణ ప్రవాహం.
AP Inter 1st Year Physics Study Material Chapter 12 పదార్ధ ఉష్ణ ధర్మాలు 47
సాధన:
లెక్కలో ఇచ్చిన విలువలు
L1 = L2 = L = 0.1 m, A1 = A2 = A = 0.02 m²
K1 = 79 W m-1K-1, K2 = 109 W m-1 k-1
T1 = 373 K and T2 = 273 K.

నిలకడ స్థితిలో ఇనుప కడ్డీ ద్వారా ప్రవహించే ఉష్ణ ప్రవాహం (H1) ఇత్తడి కడ్డీ ద్వారా ప్రవహించే ఉష్ణ ప్రవాహానికి (H2) సమానం.
AP Inter 1st Year Physics Study Material Chapter 12 పదార్ధ ఉష్ణ ధర్మాలు 48

A1 = A2 = A, L1 = L2 = L, లకు పై సమీకరణం కింది విధంగా మారుతుంది.
K1(T1 – T0) = K2(T0 – T2)
రెండు కడ్డీల సంధి ఉష్ణోగ్రత T0 అయితే,
AP Inter 1st Year Physics Study Material Chapter 12 పదార్ధ ఉష్ణ ధర్మాలు 49

పై సమీకరణాలను ఉపయోగించి, 2L పొడవు (L1 + L2 = 2L) ఉన్న సంయోగ కడ్డీ ద్వారా ప్రవహించే ఉష్ణ ప్రవాహం H’ తుల్య ఉష్ణ వాహకత్వం K’ లను కింది విధంగా గణిస్తాం.
AP Inter 1st Year Physics Study Material Chapter 12 పదార్ధ ఉష్ణ ధర్మాలు 50
AP Inter 1st Year Physics Study Material Chapter 12 పదార్ధ ఉష్ణ ధర్మాలు 51

AP Inter 1st Year Physics Study Material Chapter 12 పదార్ధ ఉష్ణ ధర్మాలు

ప్రశ్న 8.
ఒక పళ్ళెంలో నిండుగా ఉన్న వేడి ఆహారం 2 నిమిషాలలో 94°C నుంచి 86°C వరకు చల్లబడింది. గది ఉష్ణోగ్రత 20°C అయితే, ఆ ఆహారం 71°C నుంచి 69°C వరకు చల్లబడటానికి ఎంత కాలం తీసుకొంటుంది?
సాధన:
94°C, 86°C ల సరాసరి ఉష్ణోగ్రత 90°C. ఇది గది ఉష్ణోగ్రత కంటే 70°C ఎక్కువ. ఇటువంటి పరిస్థితుల్లో ఆహారం 8°C చల్లబడటానికి 2 నిమిషాలు పట్టింది.
AP Inter 1st Year Physics Study Material Chapter 12 పదార్ధ ఉష్ణ ధర్మాలు 52

69°C, 71°C ల సరాసరి ఉష్ణోగ్రత 70°C. ఇది గది ఉష్ణోగ్రత కంటే 50°C ఎక్కువ. ఈ సందర్భంలో K విలువ మొదటి సందర్భంలో వలె సమానంగా ఉంటుంది.
AP Inter 1st Year Physics Study Material Chapter 12 పదార్ధ ఉష్ణ ధర్మాలు 53

AP Inter 1st Year History Study Material Chapter 10 క్రీ.శ. 10వ శతాబ్దం నుంచి 19వ శతాబ్దం వరకు దక్కన్, దక్షిణ భారతదేశ చరిత్ర

Andhra Pradesh BIEAP AP Inter 1st Year History Study Material 10th Lesson క్రీ.శ. 10వ శతాబ్దం నుంచి 19వ శతాబ్దం వరకు దక్కన్, దక్షిణ భారతదేశ చరిత్ర Textbook Questions and Answers.

AP Inter 1st Year History Study Material 10th Lesson క్రీ.శ. 10వ శతాబ్దం నుంచి 19వ శతాబ్దం వరకు దక్కన్, దక్షిణ భారతదేశ చరిత్ర

వ్యాసరూప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
దక్కన్ చరిత్ర అధ్యయనానికి ఉపకరిస్తున్న వివిధ ఆధారాలపై వ్యాసం రాయండి.
జవాబు:
దక్కన్, దక్షిణ భారతదేశ చరిత్ర అధ్యయనానికి పురావస్తు, సాహిత్య (వాఙ్మయ) ఆధారాల నుంచి ఎంతో |విలువైన చారిత్రక సమాచారం లభిస్తుంది. పురావస్తు ఆధారాల్లో శాసనాలు ముఖ్యమైనవి. భారతదేశంలో శాసనాలను తొలిసారిగా వేయించిన ఘనత మౌర్య చక్రవర్తి అశోకుడికే దక్కుతుంది. మౌర్యులకు సమకాలీనులైన శాతవాహనులు వారి పరిపాలనా కాలంలో అనేక శాసనాలు వేయించారు. నాసిక్, కార్లే, అమరావతి, నాగార్జున కొండ, కొండాపూర్ మొదలైన చోట్ల వారి శాసనాలు ఉన్నాయి. క్రీ.శ. 1వ శాతాబ్దం నాటి దక్కన్ ప్రజల జీవనాన్ని ఇవి తెలియచేస్తున్నాయి. కాకతీయులు, రెడ్డి రాజులు, విజయనగర చక్రవర్తులు వేయించిన శాసనాలు ఆ కాలం నాటి పరిస్థితులకు అద్దం పడుతున్నాయి.
AP Inter 1st Year History Study Material Chapter 10 క్రీ.శ. 10వ శతాబ్దం నుంచి 19వ శతాబ్దం వరకు 1

ఈ యుగానికి చెందిన రాజకీయ, సామాజిక, ఆర్థిక, మతపరమైన మొదలైన విషయాలను అధ్యయనం చేయడానికి, నేక సాహిత్య రచనలు ఉపకరిస్తున్నాయి. వీటిలో తెలుగు, కన్నడ, సంస్కృతం భాషలోని రచనలతో పాటు విదేశీ రచనలు కూడా ఉన్నాయి.
AP Inter 1st Year History Study Material Chapter 10 క్రీ.శ. 10వ శతాబ్దం నుంచి 19వ శతాబ్దం వరకు 2
AP Inter 1st Year History Study Material Chapter 10 క్రీ.శ. 10వ శతాబ్దం నుంచి 19వ శతాబ్దం వరకు 3

AP Inter 1st Year History Study Material Chapter 10 క్రీ.శ. 10వ శతాబ్దం నుంచి 19వ శతాబ్దం వరకు దక్కన్, దక్షిణ భారతదేశ చరిత్ర

ప్రశ్న 2.
గణపతిదేవుని ఘనతను అంచనా వేయండి.
జవాబు:
కాకతీయ వంశ పాలకుల్లో గణపతిదేవుడు అత్యంత శక్తిసామర్థ్యాలు గల పరాక్రమవంతుడు. మహాదేవుడి తరువాత సింహాసనం అధిష్టించాడు. రాజనీతిజ్ఞుడు, సైన్యాలను నడపడంలో దిట్ట. ఇతడి తల్లిదండ్రులు బయ్యాంబ, మహాదేవుడు. మైలాంబ, కుందమాంబ గణపతిదేవుడి సోదరీమణులు. గణపతిదేవుడి పరిపాలనా కాలానికి సంబంధించిన శాసనం కరీంనగర్ లోని మంథని వద్ద లభించింది. దీని ప్రకారం గణపతిదేవుడి పరిపాలన డిసెంబర్ 26, 1199 కంటే ముందే ప్రారంభమైంది. సుమారు అరవై మూడు సంవత్సరాలపాటు గణపతిదేవుడు కాకతీయ రాజ్యాన్ని పరిపాలించి, అనేక చారిత్రాత్మక విజయాలు సాధించాడు. గణపతిదేవుడి సైనిక విజయాల్లో అతని సేనాధిపతి రేచెర్ల రుద్రుడు కీలకపాత్ర పోషించాడు. మల్యాల సేనాధిపతులు కూడా గణపతిదేవునికి అండగా నిలిచారు. గణపతిదేవుని సైన్యాలు యాదవసేనలను ఓడించాయి. తీరాంధ్ర ప్రాంతంపై గణపతిదేవుని సైన్యాలు దండెత్తాయి. వెలనాడు పాలకుడైన పృథ్వీశ్వరుణ్ణి కాకతీయ సేనలు ఓడించాయి. ఈ విషయం గణపతిదేవుని బావమరిది నతవాడి రుద్రుడు వేయించిన క్రీ.శ. 1201 నాటి బెజవాడ శాసనంలో ఉంది. పరాజయం పాలైన వెలనాటి రాజు పృథ్వీశ్వరుడు తాత్కాలికంగా తన రాజధానిని చందవోలు నుంచి పిఠాపురానికి మార్చి, కృష్ణా ప్రాంతంపై తన అధికారాన్ని తిరిగి కొనసాగించాడు. గణపతిదేవుని సైన్యాలు ధరణికోటకు చెందిన కోటనాయకులతో యుద్ధానికి సిద్ధంకాగా కోట నాయకులు కాకతీయ చక్రవర్తి సార్వభౌమత్వాన్ని అంగీకరించారు. ఆ తరువాత మల్యాల చెందుని నేతృత్వంలో కాకతీయ చక్రవర్తి సైన్యాలు కృష్ణానదీ ముఖద్వారం వద్ద అధికారం చెలాయిస్తున్న అయ్యవంశ రాజుల కేంద్రమైన ‘దివి’పై దండెత్తాయి. కాకతీయ సైన్యాలను విరోచితంగా ఎదుర్కొన్న దివిసీమ పాలకులు ఓటమిని అంగీకరించారు. అయ్యవంశం రాజు పిన్నచోడుడు కాకతీయ సార్వభౌమాధికారాన్ని అంగీకరించాడు. రాజనీతిజ్ఞుడైన గణపతిదేవుడు దివిసీమను అయ్యవంశ రాజులనే పాలించమని కోరాడు. పినచోడుని కుమారుడైన ‘జాయపను’ గణపతిదేవుడు తన కొలువులో చేర్చుకున్నాడు. అతడిని ‘గజసాహనిగా’ నియమించాడు. గణపతిదేవుడు పినచోడుని కుమార్తెలైన నారాంబ, పేరాంబలను వివాహమాడి ఇరు రాజ్యాల మధ్య సంబంధాన్ని బలోపేతం చేశాడు.

గణపతిదేవుడి సేనలు క్రీ.శ. 1206కు ముందు మరోసారి వెలనాటి రాజైన పృథీశ్వరునిపై దండెత్తి అతణ్ణి యుద్ధంలో ఓడించి చంపాయి. యావత్ కళింగ ప్రాంతం కాకతీయుల వశమయ్యింది. కొన్ని కాకతీయ శాసనాల్లో గణపతిదేవుడికి ‘పృథీశ్వర శిరఃఖండుక క్రీడావినోద’ అనే బిరుదు ఉంది. దీన్ని బట్టి పృథ్వీశ్వరుడు కాకతీయ సేనల చేతిలో హతుడైయ్యాడని గ్రహించవచ్చు. క్రీ.శ. 1213 నాటి చేబ్రోలు శాసనం గణపతిదేవుడు జాయప సేనానిని వెలనాడు రాజ్య గవర్నర్ నియమించాడని పేర్కొంటుంది.

గణపతిదేవుడు నెల్లూర్ రాజ్యాన్ని ఏలిన మనుమసిద్ధి కుమారుడైన తిక్కభూపాలుడు, రాజ్య సింహాసనం కోసం చేసిన అంతర్యుద్ధంలో గణపతిదేవుని సహాయం కోరాడు. గణపతిదేవుడు తిక్కభూపాలుని శత్రువులు నల్లసిద్ధి, తమ్మసిద్దిలను ఓడించి నెల్లూరు సింహాసనంపై తిక్క భూపాలుణ్ని నిల్పాడు. పశ్చిమగోదావరి జిల్లాలో కొలను ప్రాంతాన్ని ఏలుతున్న ‘కొలను’ నాయకులను కూడా క్రీ.శ. 1231కి ముందే కాకతీయ సైన్యాలు ఓడించాయి. ‘ఇందులూరి సోముడు’ కొలను రాష్ట్ర గవర్నర్ గా నియమించాడు. గణపతి దేవుడి కాలంలో యాదవరాజులతో స్నేహపూర్వక సంబంధాలు కొనసాగాయి.

గణపతిదేవుడు తన సుదీర్ఘ పరిపాలనా కాలంలో (క్రీ.శ. 1199-1263) ఎప్పుడూ ఓటమిని చవిచూడలేదు. క్రీ.శ. 1263వ సంవత్సరంలో పాండ్య సేనలతో జరిగిన ‘ముత్తుకూరు’ యుద్ధంలో జటావర్మన్-సుందర పాండ్యుని సేనల చేతిలో అతడు పరాజయం పాలయ్యాడు. ఈ ఓటమి అనంతరం క్రియాశీల రాజకీయాల నుంచి తప్పుకున్నాడు. తనకు మగసంతానం లేనందువల్ల కుమార్తె రుద్రమదేవిని తన వారసురాలిగా ప్రకటించాడు. క్రీ.శ. 1268 లో గణపతిదేవుడు మరణించాడు. రుద్రమదేవి తండ్రి కాలంలోనే రాజ్య నిర్వహణలో, సైన్యాలను నడపడంలో శిక్షణ పొందింది.

ప్రశ్న 3.
శ్రీకృష్ణదేవరాయల విజయాలను చర్చించండి.
జవాబు:
విజయనగర సామ్రాజ్యాన్ని పాలించిన చక్రవర్తులందరిలో (క్రీ.శ. 1509 1529) అగ్రగణ్యుడు శ్రీకృష్ణదేవరాయలు. ఇతని కాలంలో విజయనగర సామ్రాజ్యం దక్షిణ భారతదేశమంతటికి విస్తరించింది. దక్షిణ భారతదేశంలో సారస్వతం, కళలు వికసించాయి.

తొలి జీవితం: శ్రీకృష్ణదేవరాయలు తుళువ వంశస్థుడు. ఇతని తల్లిదండ్రులు నరసానాయకుడు, నాగమాంబ. బాల్యం నుండి అప్పాజీ అనబడే తిమ్మరుసు నేతృత్వంలో సకలవిద్యలు నేర్చుకొని పాలకునికి కావలసిన లక్షణములన్నింటిని తనలో జీర్ణించుకున్నాడు. తన అన్నయైన వీరనరసింహుని మరణానంతరం శ్రీకృష్ణదేవరాయలు క్రీ.శ. 1509లో విజయనగర సింహాసనాన్ని అధిష్టించాడు. సాళువ తిమ్మరుసు ఇతని ప్రధానమంత్రి.

ఆకృతి, వ్యక్తిత్వం: క్రీ.శ. 1520లో శ్రీకృష్ణదేవరాయలను దర్శించిన పోర్చుగీసు వర్తకుడు డామింగో పేస్ రాయల ఆకృతిని వర్ణించాడు. “శ్రీకృష్ణదేవరాయలు పొడగరికాదు, పొట్టికాదు. మధ్యరకం, చక్కని మూర్తి, బొద్దుగా, ముఖంపై స్పోటకం, మచ్చలతో ఉంటాడు. ఉల్లాసవంతుడు, విదేశీయుల పట్ల దయతో, మర్యాదతో వ్యవహరిస్తాడు. హిందూస్థాన్లో అతనంటే హడల్” అని వర్ణించాడు. శ్రీకృష్ణదేవరాయలు రాజనీతిలో, యుద్ధాల్లో సమర్థుడు. సంస్కృతాంధ్ర భాషల్లో సాహితీ సృష్ట, సంస్కృతీ ప్రియుడు.

చక్రవర్తిగా రాయలు ఎదుర్కొన్న పరిస్థితులు: శ్రీకృష్ణదేవరాయలు సింహాసనమును అధిష్టించే నాటికి విజయనగర సామ్రాజ్యము అనేక సమస్యలతో ఉన్నది. ఎక్కడ చూసినా తిరుగుబాట్లు చెలరేగుతున్నాయి. ఒక ప్రక్క గజపతులు, మరొక ప్రక్క బహమనీ సుల్తానులు విజయనగర సామ్రాజ్యాన్ని కబళించటానికి విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితులలో శ్రీకృష్ణదేవరాయలు గొప్ప రాజనీతిని ప్రదర్శించి పోర్చుగీసు వారితో సంధి చేసుకొన్నాడు.

పోర్చుగీసు వారితో సంధి: రాయలు క్రీ.శ. 1510లో పోర్చుగీసు వారితో ఒక ఒప్పందాన్ని చేసుకొన్నాడు. ఈ ఒప్పందం ప్రకారం రాయల సైన్యానికి మేలుజాతి గుర్రాలను సరఫరా చేయటానికి పోర్చుగీసువారు అంగీకరిస్తే, పోర్చుగీసువారు గోవాను ఆక్రమించుకోవటానికి శ్రీకృష్ణదేవరాయలు అడ్డుచెప్పలేదు. పైగా భట్కల్ ప్రాంతంలో పోర్చుగీసువారు కోటలు కట్టుకోవడానికి కూడా రాయలు అనుమతించాడు.

AP Inter 1st Year History Study Material Chapter 10 క్రీ.శ. 10వ శతాబ్దం నుంచి 19వ శతాబ్దం వరకు దక్కన్, దక్షిణ భారతదేశ చరిత్ర

దిగ్విజయాలు: పోర్చుగీసువారితో ఒప్పందం కుదుర్చుకొని, తన సైన్యాన్ని బలపరచుకొన్న తరువాత శ్రీకృష్ణదేవరాయలు తన దిగ్విజయ యాత్రను ప్రారంభించాడు.
1. బీజాపూర్ సుల్తాన్ యూసఫ్ అదిల్షా, బీదర్ సుల్తాన్ మామూన్షాలు విజయనగరంపై జిహాద్ను ప్రకటించి కృష్ణదేవరాయలతో ఘర్షణకు దిగారు. రాయలు వారిని ఓడించి రాయచూర్, ముద్గల్ దుర్గాలను ఆక్రమించాడు. యూసఫ్ అదిల్షా మరణానంతరం అతని కుమారుడు ఇస్మాయిల్ అదిల్షా పిన్న వయస్కుడవటం చేత కమాలాఖాన్ అనే సర్దారు సర్వాధికారాలు పొంది బీజాపూర్ పాలకుడయ్యాడు. అలాగే బీదర్ అహమ్మద్ బరీద్ అనే సేనాని బీదర్ సుల్తానైన మహమ్మదాను బంధించి తానే సుల్తాన్ నని ప్రకటించుకున్నాడు. రాయలు వారిద్దరిని ఓడించి, పాలకులను వారివారి సింహాసనాలపై కూర్చుండబెట్టి ‘యవన రాజ్యస్థాపనాచార్య’ అనే బిరుదు పొందాడు.

2. తరువాత దక్షిణ దిగ్విజయ యాత్రను జరిపి పెనుగొండ, ఉమ్మత్తూర్, శివసముద్రాలను జయించి, ఆ ప్రాంతాలన్నింటిని కలిపి శ్రీరంగపట్నం అనే రాష్ట్రంగా ఏర్పరచాడు.

3. తూర్పు దిగ్విజయ యాత్రను ప్రారంభించి, ఉదయగిరి, కొండవీడు, కొండపల్లి, రాజమహేంద్రవరంలను జయించి, కటకం వరకు నడిచి గజపతులను ఓడించాడు. అంతట ప్రతాపరుద్ర గజపతి తన కుమార్తెను రాయలకిచ్చి వివాహం చేశాడు. సింహాచలం, పొట్నూరుల దగ్గర విజయస్థంభాలను నాటి, కృష్ణానదికి ఉత్తరంగా ఉన్న భూములను గజపతికి ఇచ్చి రాజధానికి తిరిగివచ్చాడు.

4. రాయలు తూర్పు దిగ్విజయ యాత్రలో ఉండగా బీజాపూర్ సుల్తాన్ ఇస్మాయిల్ అదిల్షాన్ ఠాయ రును తిరిగి ఆక్రమించగా క్రీ.శ 1520 లో రాయలు అతనిని ఓడించాడు. ఈ యుద్ధంలో పోర్చగీసు నాస్ “క్రిష్టవో ఫిగరేదో రామలకు చాలా సహాయం చేశాడు. క్రీ.శ.1523లో రాయలు మళ్ళీ దండలే చుపూర్. గుల్బర్గాలను ఆక్రమించి సాగర్ వరకు గల ప్రాంతాలను కొల్లగొట్టాడు. రాయలు క్రీ.శ. 1529లో ను రశించాడు. రాయలు మరణంచే వాటికి అతని సామ్రాజ్యం తూర్పున కటకం నుండి పడమరన సారేశెట్టి వరకు ఉత్తరాన గుల్బర్గా నుండి దక్షిణాన సింహళం వరకు వ్యాపించింది.

పరిపాలనా విధానం ; శ్రీకృష్ణదేవరాయలు ఆదర్శవంతమైన పాలనను ప్రజలకందించాడు. ఇతని కాలంలో విజయనగర వైభవం ఇనుమడించిందని “పేస్” పేర్కొన్నాడు. పోర్చుగీసు ఇంజనీర్ల సహాయంతో కాలువ చెరువులు త్రవ్వించి, పంటపొలాలకు నీటి పారుదల సౌకర్యాలను కల్పించాడు.

పరమత సహనం: శ్రీకృష్ణదేవరాయలు వైష్ణవ భక్తుడైనను అన్ని మతాల వారిని సమానంగా ఆదరించాడు. వ్యాసతీర్థ, వల్లభాచార్య అప్పయ్యదీక్షిత, వేదాంతదేశిక అనే వేరువేరు మతములకు చెందిన పండితులను అదరించి సన్మానించాడు.

సారస్వత పోషణ: శ్రీకృష్ణదేవరాయల ఆస్థానమునకు భువనవిజయమని పేరు. భువనవిజయులలో, ‘అష్టదిగ్గజములనే’ ఎనిమిది మంది కవులుండేవారు. వారు అల్లసాని పెద్దన, నంది తిమ్మన, ధూర్జటి, అయ్యలరాజు రామభద్రుడు, మాదయగారి మల్లన, పింగళి సూరన, తెనాలి రామకృష్ణుడు, భట్టుమూర్తి అని ప్రతీతి. ఈ అస్థానంలో జరుగుతుండేవి. సాహితీ గోష్టులు జరుగుతుండేవి భువనవిజయములో వసంతోత్సవం లాంటి వేడుకలు గొప్పగా సందర్భంలో సంగీత, సాహిత్యాలకు ఆదరణ లభించేది. శ్రీకృష్ణదేవరాయలకు ‘సాహితీ సమరాంగణ సార్వభౌముడనే బిరుదు ఉంది. ఇతడు స్వయంగా కవి. ఆముక్తమాల్యద, జాంబవతీ పరిణయం, మదాలస చరిత్ర అనే గ్రంథాల్ని రచించాడు. తెలుగు భాషకు ఎనలేని సేవ చేసి ఆంధ్రభోజుడు అని కీర్తించబడ్డాడు. “దేశ భాషలందు తెలుగు లెస్స”. అని రాయలే స్వయంగా పేర్కొన్నాడు.

కళాభివృద్ధి: శ్రీకృష్ణదేవరాయల కాలంలో కళలు కూడా అభివృద్ధి చెందాయి. శ్రీకృష్ణదేవరాయలు విజయనగరంలో కృష్ణాలయాన్ని, హజార రామాలయాన్ని నిర్మించాడు. తిరుపతి, కంచి, కాళహస్తి, సింహాచలం వంటి అలడులకు గోపురాలను, మండపాలను నిర్మించాడు. ఇతని కాలంలో విజయనగరం రోమ్ మహానగరమంత సుందరంగా ఉన్నట్లు ఇతని కాలంలో విజయనగరాన్ని సందర్శించిన “పేస్” అనే పోర్చుగీసు వర్తకుడు పేర్కొన్నాడు.

ఘనత: దక్షిణ భారతదేశాన్ని పాలించిన కడపటి హిందూ పాలకులలో శ్రీకృష్ణదేవరాయలు సుప్రసిద్ధుడు ఇతడు విజయనగర చరిత్రలోనే కాక భారతదేశ చరిత్రలోనే మహోన్నతమైన స్థానాన్ని అధిరోహించిన చక్రవర్తులలో ఒకడిగా విశిష్టమైన స్థావాన్ని సంపాదించుకున్నాడు.

ప్రశ్న 4.
విజయనగర కాలం నాటి సమాజం, ఆర్థిక వ్యవస్థ ముఖ్య లక్షణాలను వివరించండి.
జవాబు:
దక్షిణ భారతదేశ చరిత్రలో విజయనగర రాజుల పరిపాలనా కాలాన్ని స్వర్ణయుగమని చెప్పవచ్చు. విజయనగర రాజులు రెండు శతాబ్దాలకు పైగా దక్షిణ భారతదేశంలో హిందూ సంస్కృతికి రక్షణ కల్పించారు. వీరితో పోరాడవలసి వచ్చినందునే బహమనీ సుల్తానులు ఉత్తర దేశం వైపు దృష్టి మళ్లించి విస్తరించలేకపోయారు.

పాలనా విధానం: వీరు మౌర్యులవలె కేంద్రీకృత రాజరికాన్నే అమలు చేశారు. విజయనగర పాలకులు సర్వజనామోదం పొందిన పాలనా విధానాన్ని పాటించారు. రాజులు ధర్మబద్ధులమని ప్రకటించుకున్నారు. అందువలన దేశంలో న్యాయం ప్రతిష్టించబడి ప్రజలు సుఖించారు. కట్టుదిట్టమైన పాలనా వ్యవస్థ ఉండటం వలన దేశంలో శాంత సౌభాగ్యాలు నెలకొన్నాయి. కే. కొలనలో చక్రవర్తే ముఖ్యుడు. అతని మాటే శాననం. కేంద్రంలో రాజుకు మంత్రిమండలి సభ్యులు సహకరించేవారు. సాళువ తిమ్మరుసు, విద్యారణ్య స్వామి మొదలగువారు ఉన్నత పదవులు చేపట్టినారు. నాడు మంత్రివర్గం సంఖ్య 6 లేదా 8 మంది.

AP Inter 1st Year History Study Material Chapter 10 క్రీ.శ. 10వ శతాబ్దం నుంచి 19వ శతాబ్దం వరకు దక్కన్, దక్షిణ భారతదేశ చరిత్ర

సాంఘిక పరిస్థితులు: విజయనగరం పాలనాకాలంలో సంఘంలో వర్ణవ్యవస్థ బలపడి వర్ణభేదాలు కొనసాగాయి. బ్రాహ్మణుల హక్కులను శూద్రులు ధిక్కరించటం మొదలుపెట్టారు. సంఘంలో బహుభార్యత్వం, బాల్య వివాహాలు, సతీసహగమనం, వరకట్నం, కన్యాశుల్కం అమలులో ఉన్నాయి. స్త్రీలకు సంఘంలో గౌరవప్రదమైన స్థానమున్నప్పటికి వితంతువులకు గౌరవం లేదు. మద్యపానం, ధూమపానం సమాజంలో ప్రవేశించాయి. తురుష్క, పాశ్చాత్య సంప్రదాయాల ప్రభావం వేషధారణలో కన్పించసాగింది. ప్రభుత్వం వేశ్యావృత్తిని గుర్తించింది. ప్రభుత్వానికి వేశ్యావృత్తిపై వచ్చే ఆదాయం చాలా ఎక్కువని అబ్దుల్ రజాక్ వ్రాశాడు.

ఆర్థిక పరిస్థితులు: అబ్దుల్ రజాక్, నికోలోకోంటి, డామింగోపేస్, న్యూనిజ్ వంటి విదేశీ యాత్రికుల రచనలు విజయనగర వైభవానికి అద్దంపడుతున్నాయి. వీరి రచనల ప్రకారం విజయనగర రాజ్యం ఐశ్వర్యవంతంగా ఉన్నందువల్లనే తరచూ బహమనీ రాజ్యం దండయాత్రలకు గురైంది. విజయనగరం చుట్టుకొలత 60 మైళ్ళని, దాని చుట్టూ ఏడు ప్రాకారాలుండేవని నికోలోకోంటి పేర్కొన్నాడు.

విజయనగరాధీశులు కాలువలను త్రవ్వించి, వ్యవసాయాన్ని ప్రోత్సహించారు. దారులోహ పరిశ్రమలను స్థాపించి పరిశ్రమలను కూడా ప్రోత్సహించారు. రాయలసీమలోని రామళ్లకోట, వజ్రకరూర్లో వజ్రాలను త్రవ్వేవారు. వజ్రాలు, బంగారం, వెండి, ముత్యాలు వంటి విలువైన వస్తువులను నడిబజారులో రాసులుగా పోసి, ఈ నగరంలో విక్రయించేవారని నికోలోకోంటి పేర్కొన్నాడు. విజయనగరాధీశులు రాజధాని నగరం నుంచి పెనుగొండ, తిరుపతి, శ్రీరంగపట్టణం, కాంచీపురం, రామేశ్వరం, కొండవీడు మొదలగు ముఖ్య నగరాలకు బాటలు వేయించి, వాణిజ్యాన్ని ప్రోత్సహించారు. గుర్రాలు, ఎడ్లు, పల్లకీలు, బండ్లు నాటి ప్రయాణ సాధనాలు. దేశంలో అనేక చోట్ల సంతలు జరిగేవి. విదేశీ వాణిజ్యం అరబ్బులు, పోర్చుగీస్వేరి హస్తగతమైంది. ఎగుమతుల్లో ముఖ్యమైనవి నూలుబట్టలు, రత్నకంబళీలు, దంతపుసామాన్లు, సుగంధ ద్రవ్యాలు మొదలైనవి.

ప్రశ్న 5.
కుతుబ్షాహీలు సాధించిన విజయాలను వివరించండి.
జవాబు:
గోల్కొండ రాజధానిగా స్వతంత్ర కుతుబ్షాహీ వంశాధికారాన్ని క్రీ. శ. 1512లో సుల్తాన్-కులీ-కుతుబ్-ఉల్- ముల్క్ స్థాపించాడు. బహమనీ సుల్తాన్ మూడో మహమ్మద్ షా కాలంలో ఆ రాజ్య విచ్ఛిన్నం జరిగింది. అహమద్ నగర్, బీజాపూర్, బీదర్, బీరార్, గోల్కొండ అనే ఐదు స్వతంత్ర రాజ్యాలు బహమనీ రాజ్య శిథిలాలపై వెలిశాయి. గోల్కొండ కుతుబ్షాహీలు వారి అధికారులు స్థానిక తెలుగు ప్రజల మద్దతుతో, సుమారు 175 ఏళ్ళపాటు నేడు తెలుగు మాట్లాడే అత్యధిక ప్రాంతాలనూ, కన్నడ, మరాఠి మాట్లాడే కొన్ని ప్రాంతాలను పరిపాలించారు. సుప్రసిద్ధ చరిత్రకారులైన హరూన్-ఖాన్-షేర్వానీ, నేలటూరి వేంకటరమణయ్య మొదలైన వారు కుతుబ్షాహీలు అత్యంత ప్రజాసేవాతత్పరత కలిగిన పాలకులనీ, వారు ముస్లింలు అయినప్పటికీ హిందూ ప్రజలను, వారి ఆచారాలను, సంస్కృతిని గౌరవించారనీ, వీరిలో కొందరు తెలుగు భాషలో మంచి పాండిత్యం సంపాదించారనీ, వారు తెలుగు ప్రజల సర్వతోముఖాభివృద్ధికి కృషిచేశారనీ ప్రశంసించారు. కుతుబ్షాహీ సుల్తానుల్లో సుల్తాన్-కులీ-కుతుబ్షా (క్రీ.శ. 1512 – 1543), ఇబ్రహీం కుతుబ్షా (క్రీ.శ. 1550-1580), మహమ్మద్-కులీ-కుతుబ్షా (క్రీ.శ. 1580-1612) సుప్రసిద్ధులు.

ఆధారాలు: కుతుబ్షాహీ సుల్తానుల పరిపాలనా కాలానికి సంబంధించిన వివిధ అంశాల గురించి సమకాలీన ముస్లిం చరిత్రకారుల రచనలు, విదేశీ బాటసారుల రచనలు, కుతుబ్షాహీ సుల్తానులు జారీ చేసిన ఫర్మానాలు, సమకాలీన తెలుగు సాహిత్యం ఎంతో అమూల్యమైన సమాచారాన్ని తెలియచేస్తున్నాయి. ముస్లిం చరిత్రకారుల రచనల్లో
ఫెరిస్టా రాసిన గుల్షన్-ఇ-ఇబ్రహీమి, ఖదీరాఖాన్ రాసిన తారీఖ్-ఇ-కుతుబ్షాహీ, సయ్యద్ అలీ-టబాటబీ రచన, బుర్హన్-ఇ-మాసిర్, అజ్ఞాత చరిత్రకారుడు రాసిన తారీఖ్-ఇ-సుల్తాన్ మహమ్మద్ షాహీ పేర్కొనదగినవి. ఈ రచనల్లో సుల్తానుల కాలం నాటి రాజకీయ చరిత్ర, పరిపాలన వ్యవస్థ, సామాజిక, ఆర్థిక, సంస్కృత రచనల్లో, అద్దంకి గంగాధరుడు రాసిన ‘తపతీ సంవరణోపాఖ్యానం’, పొనగంటి తెలగనార్యుని రచన యయాతి చరిత్ర, మట్ల అనంతభూపాలుని రచన కుకుత్స విజయం, సారంగతమ్మయ్య రచన ‘వైజయంతీ విలాసం’, భద్రాద్రి శతకం, సింహాద్రి శతకం, భతృహరీ శతకం, కదిరీఫతీ రాసిన ‘హంసవింసతి’, అయ్యలరాజు నారాయణామాత్రుడు రాసిన సుకసప్తతి, వేమన పద్యాలు ఆనాటి ప్రజాజీవనాన్ని వర్ణిస్తున్నాయి. కుతుబ్షాహీల రాజధాని గోల్కొండ, కొత్త నగరం హైద్రాబాద్, దక్కన్లోని ఇతర నగరాలను, ప్రాంతాలను సందర్శించిన విదేశీ బాటసారులైన ఫ్రాన్స్ దేశస్థులైన టావెర్నియర్, బెర్నియర్, థీవ్నాట్, విలియం మాథోల్డ్ రష్యాకు చెందిన నిఖిటిన్ మొదలైన వారు ఈ యుగానికి చెందిన వివిధ విషయాలను తమ డైరీలలో, రచనల్లో పేర్కొన్నారు. ఇవి కుతుబ్షాహీల యుగచరిత్ర రచనకు ఎంతో అమూల్య సమాచారాన్ని అందచేస్తున్నాయి.

సుల్తాన్-కులీ-కుతుబ్-ఉల్-ముల్క్: స్వతంత్ర కుతుబ్షాహీ రాజ్య స్థాపకుడు సుల్తాన్-కులీ-కుతుబ్-ఉల్- ముల్క్. ఇతడు బహమనీల కొలువులో కొంతకాలం పనిచేశాడు. తెలంగాణా తరఢారుగా పనిచేశాడు. మూడో మహమ్మద్ షా పరిపాలన చివరి దశలో చెలరేగిన తిరుగుబాట్లతో ప్రేరేపితుడై క్రీ.శ. 1512లో స్వతంత్ర్యాన్ని ప్రకటించుకున్నాడు. ఇతడు సమకాలీన విజయనగర, గజపతి రాజులతో అనేక యుద్ధాలు చేశాడు. ఇతడు గోల్కొండ దుర్గాన్ని బలోపేతం చేయించాడు. అనేక మసీదులు, రాజప్రసాదాలు, భవనాలు నిర్మించాడు. గోల్కొండకు సమీపంలో ‘మహమ్మద్ నగర్’ అనే కొత్త పట్టణాన్ని కట్టించాడు. అతణ్ణి అధికారులు, ప్రజలు అభిమానించారు. 99వ యేట కుమారుడి (జంషీద్) చేతిలో హత్యచేయబడ్డాడు. ఇతని కాలంలోనే గోల్కొండ రాజ్యం దక్కన్లోనే కాక సమకాలీన ప్రపంచంలో విశేష ఖ్యాతి గడించింది.

జంషీద్-కులీ-కుతుబ్షా (క్రీ.శ. 1543-1550): ఇతడు సుల్తాన్-కులీ మూడో కుమారుడు. స్వార్థపరుడు. కుట్రలకు పెద్ద వ్యూహకర్త. సొంత తండ్రినే అధికార దాహంతో హత్యచేసి సింహాసనం అధిష్టించి ఏడేళ్ళు పరిపాలన చేశాడు. ప్రజలు, అధికారులు ఇతని చర్యను ఏవగించుకున్నారు. మంచి పాండిత్యం కలవాడు. కవిత్వం రాసేవాడు. క్రీ.శ. 1550లో వ్యాధిగ్రస్తుడై మరణించాడు.

సుఖాన్-కులీ-కుతుబ్షా: జంషీద్ మరణానంతరం ఏడేళ్ళ పిన్నవయస్కుడైన అతని కుమారుణ్ణి అతని తల్లి, మంత్రులు గోల్కొండ సింహాసనంపై కూర్చోబెట్టి అధికారం చెలాయించారు. ఇతని పరిపాలన కేవలం ఏడు నెలలపాటు కొనసాగింది. రాజ్యంలో అంతరంగిక కలహాలు, సర్దారుల స్వార్థ రాజకీయాలు హద్దుమీరాయి. ఇలాంటి పరిస్థితుల్లో విజయనగర రాజ్యంలో అళియరామరాయల వద్ద శరణాగతునిగా ఉన్న ఇబ్రహీం-కులీ-కుతుబ్షా, రామరాయల మద్దతుతో గోల్కొండ రాజ్య సింహాసనాన్ని క్రీ.శ. 1550లో అధిష్టించాడు. ఈ విధంగా సుబాన్ కులీ పాలన అంతమైంది.

ఇబ్రహీం-కులీ-కుతుబ్షా (క్రీ.శ. 1550-1580): ఇతడు గోల్కొండ రాజ్య స్థాపకుడైన సుల్తాన్ కులీ చిన్న కుమారుడు. తన సోదరుడైన జంషీద్ పన్నిన కుట్ర నుంచి ప్రాణాలతో తప్పించుకొని క్రీ.శ.1543లో విజయగనర రాజ్యం పారిపోయి అళియ రామరాయల శరణు పొందాడు. అక్కడే ఏడేళ్ళపాటు గడిపాడు. రామరాయలు ఇతణ్ణి సొంత కొడుకులా ఆదరించాడు. తెలుగు భాషలో మంచి పాండిత్యం సంపాదించాడు. క్రీ.శ. 1550లో గోల్కొండ సుల్తానుగా సింహాసనం అధిష్టించిన ఇబ్రహీం-కులీ-కుతుబ్షా ప్రజా బలంతో 30 సంవత్సరాలపాటు సమర్థవంతంగా పరిపాలన చేశాడు. ఇతడు రాజ్య విస్తరణ కోసం సోదర షియా సుల్తానులతో, విజయనగర రాజులతో అనేక యుద్ధాలు చేశాడు. అళియ రామరాయల విభజించి పాలించు దౌత్యనీతికి ఇతడు నష్టపోయాడు. గత సహాయాన్ని విస్మరించి విజయనగర చక్రవర్తికి వ్యతిరేకంగా వైవాహిక సంబంధాల ద్వారా బీజాపూర్, అహమద్ నగర్ సుల్తానులను, బీరార్, బీదర్ సుల్తానులను ఐక్యం చేశాడు. చారిత్రాత్మక రాక్షసి తంగడి యుద్ధం (జనవరి 23, 1565)లో విజయగనరం సేనాధిపతియైన ఆళియ రామరాయలను మోసంతో దెబ్బతీశాడు. రాత్రిపూట సంప్రదింపుల సాకుతో వారి శిబిరంపై దాడిచేయించాడు. 80 ఏళ్ళ వయస్సులో రామరాయలు విరోచితంగా పోరాడి ఓడాడు. హుస్సేన్-నిజాం షా రామరాయల తలను ఖండించి యుద్దభూమిలో పగ తీర్చుకొన్నాడు. దీంతో విజయనగర సేనలు చిన్నాభిన్నమయ్యాయి. ఇతని పాలనలో గోల్కొండ రాజ్యం కీర్తి నలుదిశలా వ్యాపించింది. ఆర్థికంగా, సైనికంగా గోల్కొండ రాజ్యం బలోపేతమైంది. ఇతడు వ్యవసాయాభివృద్ధికై అనేక చెరువులు, కాలువలు నిర్మించాడు. వీటిలో పేర్కొనదగ్గవి హుస్సేన్ సాగర్ చెరువు, ఇబ్రహీంపట్నం చెరువు. రైతాంగం సుఖసంతోషాలతో ఉండేది. స్వదేశీ, విదేశీ వ్యాపారం అభివృద్ధి చెందింది. గోల్కొండ వస్త్రాలు, వజ్రాలు యూరోపియన్ రాజ్యాల్లో మంచి పేరు పొందాయి. సాహిత్యం, కళలు ఇతని పోషణలో వికసించాయి. ఇతడు క్రీ.శ. 1580లో మరణించాడు.

AP Inter 1st Year History Study Material Chapter 10 క్రీ.శ. 10వ శతాబ్దం నుంచి 19వ శతాబ్దం వరకు దక్కన్, దక్షిణ భారతదేశ చరిత్ర

మహమ్మద్ కులీ-కుతుబ్షా (క్రీ.శ. 1580-1612): ఇబ్రహీం-కులీ-కుతుబ్షా మరణానంతరం అతని సోదరుడైన (సుల్తాన్-కులీ-మూడో కుమారుడు) మహమ్మద్-కులీ-కుతుబ్షా పదిహేను ఏళ్ళ పిన్నవయస్సులో గోల్కొండ రాజ్య సింహాసనం అధిష్టించాడు. ఇతడు దక్కన్ ముస్లిం పాలకుల్లో అత్యంత ప్రతిభావంతుడిగా కీర్తిగడించాడు. గొప్ప పరిపాలనాదక్షుడు. సైన్యాలను నడపడంలో దిట్ట. సాహిత్యప్రియుడు, గొప్ప కట్టడాల నిర్మాత. హైద్రాబాద్ నగరం ఇతని నిర్మాణమే. చార్మినార్, జామామసీద్, చందన్ మహల్ కూడా ఇతడే నిర్మించాడు. ఇతడు ఇబ్రహీం మాదిరిగానే తెలుగు భాషను ఆదరించాడు. అరబిక్, పర్షియన్, ఉర్దు భాషలతో సమానంగా తెలుగుభాష పురోగతి చెందింది. స్థానిక ప్రజల సంప్రదాయాలను, ఆచారాలను, పద్ధతులను గౌరవించాడు. ప్రజా సంక్షేమాన్ని కోరి పరిపాలించాడు. క్రీ.శ. 1612లో 32 ఏళ్ళ సుదీర్ఘ పాలన తరువాత మరణించాడు. ఇతడి ఏకైక కుమార్తె హయత్-బక్ష్-బేగం. ఈమె భర్త సుల్తాన్ మహ్మద్ కుతుబ్షా గోల్కొండ చరిత్రలో మహమ్మద్ కులీ-కుతుబ్షా పరిపాలనా కాలం ఒక చారిత్రక ఘట్టం.

సుల్తాన్ మహమ్మద్-కులీ-కుతుబ్షా (క్రీ.శ.1612-1626): మహ్మమద్ కులీ-కుతుబ్షా మరణానంతరం అతని మేనల్లుడు, అల్లుడైన సుల్తాన్ మహమ్మద్ కులీ కుతుబ్షా గోల్కొండ సుల్తానుగా బాధ్యతలు చేపట్టాడు. ఇతడు గొప్ప పండితుడు. ఇతనికి మత సంప్రదాయాల పట్ల అభిమానం ఎక్కువ. అధిక సమయం పండితులతో చర్చల్లో గడిపేవాడు. క్రీ.శ. 1617లో హైద్రాబాద్ నగరంలో మక్కామసీదు నిర్మాణానికి ఇతడే పునాది వేశాడు. దీని నిర్మాణం డైబ్బైఏడేళ్ళ పాటు కొనసాగింది. క్రీ.శ 1687 లో గోల్కొండ రాజ్యాన్ని ఆక్రమించిన మొగల్ చక్రవర్తి ఔరంగజేబ్ మక్కామసీద్ నిర్మాణాన్ని 1694లో పూర్తిచేశాడు. ఇతడే సుల్తాన్ నగరాన్ని నిర్మించాడు.

అబ్దుల్లా-కుతుబ్షా (క్రీ.శ.1626 – 1672): ఇతడు సుల్తాన్ మహమ్మద్ కుమారుడు. పన్నెండు ఏళ్ళ పిన్న వయస్సులో గోల్కొండ సింహాసనాన్ని అధిష్టించాడు. ఇతని తల్లి హయత్-బక్ష్-బేగం రాజ్య వ్యవహారాలు నిర్వహించింది. ఇతడు విలాసవంతమైన జీవితాన్ని గడిపాడు. ఇతని కాలంలో మొగల్ దాడులు గోల్కొండ రాజ్యంపై తీవ్రతరమయ్యాయి. పరాజయం పొందిన గోల్కొండ సుల్తాన్ మొగల్ చక్రవర్తికి కప్పం చెల్లించి అధికారం కొనసాగించాడు. ఇతడు క్రీ.శ.1672లో మరణించాడు.

అబుల్హాసన్ తానాషా (క్రీ.శ.1672–1687): కుతుబ్షాహీ సుల్తానుల్లో అబుల్హసన్ తానాషా చివరివాడు. ఇతడు అబ్దుల్లా కుతుబ్షా అల్లుడు. ఇతడి పదిహేను ఏళ్ళ పరిపాలనా కాలంలో కుతుబ్షాహీ రాజ్యంపై మొగల్ చక్రవర్తి సేనలు నిరంతర దాడులు చేశాయి. దీనివల్ల కుతుబ్షాహీ రాజ్య ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైంది. ఇతడి పాలనలో ప్రజలు సుఖశాంతులతో జీవించారు. ఇతడు పరమత సహనం ప్రదర్శించాడు. ఔరంగజేబ్ సామ్రాజ్య కాంక్షకు అబుల్హాసన్ రాజ్యం బలైంది. సుమారు ఎనిమిది నెలలపాటు ధైర్యసాహసాలతో మొగల్ సేనలను కుతుబ్షాహీ సేనలు ఎదుర్కొన్నాయి. పరాజితుడైన సుల్తాన్ను మొగల్ సేనలు బందీగా బీదర్, దౌలతాబాద్లలో పన్నెండు ఏళ్ళపాటు ఉంచారు. క్రీ.శ. 1690లో చివరి కుతుబ్షాహీ సుల్తాన్ బందీగా దౌలాతాబాద్లోనే మరణించాడు.

ప్రశ్న 6.
కుతుబ్షాహీల కాలం నాటి సామాజిక, ఆర్థిక పరిస్థితులను వర్ణించండి.
జవాబు:
గోల్కొండ సుల్తానుల కాలమునాటి ఆంధ్రదేశ పరిస్థితులను తెలుసుకొనుటకు ఆధారములేమనగా:

  1. అద్దంకి గంగాధర కవి రచించిన “తపతీ సంవరణోపాఖ్యానము”
  2. పొన్నగంటి తెలగనార్యుని “యయాతి చరిత్ర”
  3. మట్ల అనంత భూపాలుని “కకుత్స విజయము”
  4. మల్లారెడ్డి విరిచితమగు “పద్మపురాణము”, “షట్చక్రవర్తి చరిత్రము”
  5. వేమన పద్యములు
  6. “భద్రాద్రి శతకము”, సింహాద్రిశతకము” మున్నగు శతకములు
  7. టావెర్నియర్, థీవ్ నాట్ మున్నగు విదేశీ యాత్రికుల రచనలు
  8. ఫెరిష్టా, ఖాఫీఖాన్ మున్నగు ముస్లిం చరిత్రకారుల రచనలు.

గోల్కొండ సుల్తాన్లు వ్యవసాయమును విస్తృతపరచి, పరిశ్రమలను నెలకొల్పి, వాణిజ్యమును ప్రోత్సహించి 3 ఆర్థికాభ్యుదయమును సాధించిరి. వారి పరమత సహన విధానము, ప్రజాహిత కార్యములు, ఆంధ్ర సారస్వత పోషణ ఆంధ్రుల అభిమానమును వారు చూరగొన్నారు.

A. సాంఘిక పరిస్థితులు: నాటి సమాజములో హిందువులు, ముస్లిములు అను రెండు ప్రధాన వర్గములుండెను. హిందువులలో ప్రభుత్వోద్యోగులు, వర్తకులు, కర్షకులను మూడు తెగలు, ముస్లిములలో ప్రభుత్వోద్యోగులు, వర్తకులను రెండు తెగలు కలవు.

(ఎ) హిందువులు: పూర్వకాలమునందువలె ఈ యుగమున కూడా చాతుర్వర్ణ వ్యవస్థ కలదు. కాని మహమ్మదీయుల ప్రాబల్యమధికమగుట వలన వర్ణవ్యవస్థలోని క్లిష్టత మాత్రమే సడలసాగెను. నాటి సమాజమున ప్రధానమగు కులములు నాలుగే అయినను వృత్తి కారణముగా అనేక కులములు ఏర్పడినవి. కాపు, రెడ్డి, వెలమ, యాదవ, బలిజ, కమ్మరి, వడ్రంగి, కాసె, కంచెర, అగసాలె, సాలె, సాతాని, చాకలి, మంగలి, కలిక, గాండ్ల, బెస్త, బోయ, మేదర మున్నగు కులములు నాటి సమాజమున కలవు. కాపులలో పంట, మోటాటి, పాకనాటి మున్నగు బేధముండెను. వీరు వ్యవసాయములో నేర్పరులు. వీరితోపాటు స్త్రీలు కూడా పొలము పనులలో పాల్గొనెడివారు. అగసాలె వారు బొమ్మలకు రంగులు వేసెడివారు.

బ్రాహ్మణులు పంచాంగము చెప్పుట వలన, భిక్షాటన ద్వారా, గ్రహశాంతి జపములు చేయుట వలన, గ్రహసంక్రమణ సమయములందు దానములను గ్రహించుట వలన ధనార్జన చేసి జీవించెడివారు. కొందరు బ్రాహ్మణులు ప్రభుత్వోద్యోగములలో నియుక్తులగుచుండిరి. వారు నియోగులనబడిరి. వారు గ్రామకరణములుగా కూడా ఉండెడివారు. నాటి బ్రాహ్మణులు వ్యవసాయము చేయుటయందును నేర్పరులే. కొందరు బ్రాహ్మణులు గాదెల నిండుగ ధాన్యమును, ఆవుల మందలను, గొట్టెల మందలను కలిగియుండిరి.

(బి) మహమ్మదీయులు: ఈ కాలమునకు మహ్మదీయుల పాలన ఆంధ్రదేశమున స్థిరపడెను. సుల్తానులు పరమత సహనమును ప్రదర్శించినప్పటికీ స్థానిక అధికారులు ఆంధ్రదేశమున వీరవిహారము సల్పుచుండిరి. స్త్రీలను చెరపట్టి, గోవులను వధించుచుండిరి. వీరి ప్రభావము వలన వేదశాస్త్ర, పురాణ పఠనములు నశించెను. సయ్యదులు, మౌల్వీలు, ఫకీర్లు మున్నగువారి ప్రభావము పెరుగుటతో బ్రాహ్మణులకు, విద్యాంసులకు, హరిభక్తులకు సంఘమున స్థానము దిగజారినది. మహమ్మదీయుల భాష కూడ ప్రచారములోనికి వచ్చెను. ఉర్దూ పదములు విరివిగా తెలుగులో ప్రవేశించెను.

(సి) ఆహారము: వరి, జొన్న, మొక్కజొన్న, గోధుమ నాటి ప్రధాన ఆహార ధాన్యములు. నేయి, కూర ప్రజల భోజనములో ప్రధాన భాగములు. పొంగలి, పులిహోర, దద్దోజనము, పప్పు, ఆవడులు, వడగులు, పచ్చళ్ళు, దోసెలు, గారెలు, బూరెలు, చక్కిలములు మున్నగు అనేక రకములగు ఆహార పదార్ధములు వారికి తెలియును. కొఱ్ఱలు, రాగి, సజ్జ, జొన్న, మొక్కజొన్న సామాన్య ప్రజల ఆహార ధాన్యములు. వరి ధాన్యములో అనేక రకములు కలవు. ముస్లిములు ప్రధానంగా మాంసాహారులు.
తాంబూలమును సేవించుట నాటి ప్రజలకు (ధనికులకు) అమిత ప్రీతి. తాంబూలములో కర్పూరము, కొత్త సున్నము, లేత తమలపాకులు ప్రధాన భాగములు.

AP Inter 1st Year History Study Material Chapter 10 క్రీ.శ. 10వ శతాబ్దం నుంచి 19వ శతాబ్దం వరకు దక్కన్, దక్షిణ భారతదేశ చరిత్ర

(డి) దుస్తులు: వివిధ తరగతులవారు వివిధ రకముల దుస్తులను ధరించిరి. గోల్కొండ సుల్తానులు ఆదిలో పూర్వపు సాంప్రదాయము ప్రకారము తురుష్కుల శైలిలో దుస్తులు ధరించినను క్రమక్రమముగా స్థానిక పద్ధతులకు అలవాటుపడిరి. మహమ్మద్ కులీకుతుబ్షా తురష్కటోపి, ఉన్ని కోటులకు మారుగా, దక్కను ప్రాంతీయులు వాడు తలపాగాను, వదులుగానుండు చొక్కాను ధరించెను. లుంగీ, జుబ్బా (లాల్చి), పేటాలు ముస్లిం పురుషుల దుస్తులు. క్రమంగా వీటికి బదులుగా షేర్వానీ, ట్రౌజరు, తుర్కీట్రోపీ వాడుకలోనికి వచ్చెను. ముస్లిం స్త్రీలు చీరలు, జాకెట్లు లేదా పావడ పైట వేసుకొనెడివారు. పూర్వము గొంతు నుండి మోకాళ్ళ వరకు ఉండెడి “చౌలీలు” ధరించిరి. చేతులు గూడా పూర్తిగా కప్పబడి ఉండేవి. తరువాత ఈ చౌలీల స్థానములో పొట్టి రవికులు వచ్చినవి. “పర్ధా” ఘోషా అను ఆచారమును ముస్లిం స్త్రీలందరూ పాటించెడివారు.

హిందువులలో ధనవంతులు పగడం, పచ్చలు ధరించెడివారు. నల్ల అంచుగల పంచె, తలపాగ మున్నగునవి. వారి దుస్తులలోని భాగములు. చొక్కాలు చాలా తక్కువ, కాని అవి వాడుకలోనికి వచ్చి ఉండెను. సామాన్య జనులు ముతక దుప్పటి కప్పుకొనుచుండిరి. నాటి స్త్రీలు “సరిగ” రవికెలు ధరించేవారు. అంచులయందు అల్లిక పనిగలిగిన రవికెలను “సరిగ రవికె” అంటారు. స్త్రీలు నుదుట తిలకమును దిద్దుకొని కొప్పువేసుకొని పూలు తురిమిడివారు.

(ఇ) ఆభరణములు: మణి హారములు, పాపిట బొట్లు, జడబిళ్ళలు, కడియములు పగడాల పేరులు, గజ్జెలు, తాయెత్తులు, కుప్పెలు, సూర్య, చంద్రవంకలు, గండ్లపేరు, కంకణములు, కమ్మలు, ఉంగరములు నాటి స్త్రీల ఆభరణములు. నాటి స్త్రీలు బంగారు గాజులు కూడా ధరించినట్లు తెలియుచున్నది. ముస్లిం స్త్రీలు కాళ్ళకు కడియములు, చెవులకు బంగారు పోగులు, గొలుసులు, ముక్కుపుడకలు, విలువైన రాళ్ళు కూర్చిన బంగారు హారములు ధరించెడివారు. పురుషులకు చెవిపోగులుండట సర్వసాధారణము. చాలామంది దండ కడియమును కూడా ధరించిరి. మహమ్మద్ కులీకుతుబ్షా కూడా దండ కడియమును ధరించెడివారు. గొడుగులు, టోపీలు వాడుకలో ఉండెను.

(యఫ్) గృహములు, గృహోపకరణములు: గోల్కొండ సుల్తానులు, ప్రభువర్గముల వారు విశాల భవనములలో నివసించుచూ విలాస జీవితమును గడిపారు. మధ్యతరగతివారు కూడా సౌఖ్యప్రదమైన జీవితమును గడిపినట్లు తెలియుచున్నది. హైదరాబాద్ నగరంలో ఎనిమిది లక్షల జనులు నివసించినారు. ఆ కాలము నాటి ప్రజలు గృహ నిర్మాణ విషయమున మిక్కిలి శ్రద్ధ వహించిరి. పడకగది, వంటగది, దేవతార్చనగది, అటకలు, విశాలమగు చావడతో బావి, గాదెలతో పశువుల దొడ్డి మున్నగువానితో నాటి గృహములు కూడి ఉండెడివి. ధనవంతులు గాజుగిన్నెలలో దీపాలు వెలిగించుచుండిరి. సుల్తానులు, కులీనులు వెండి, బంగారు పాత్రలను వాడిరి. తివాచీలు, గాజు సామాగ్రిని కూడా ఎక్కువగా వాడుకలో ఉండెను. హైదరాబాదులోని విశాల భవనములను, వెండి, బంగారు పాత్రలను, తివాచీలను, గాజు సామాగ్రిని చూచి మొగలులు ఆశ్చర్యచకితులైనారు.

భోగపరాయణుల శయ్యా మందిరములు చక్కగా అలంకరింపబడేవి. పట్టే మంచములు, దోమతెరలు, ముత్యాల జాలీలు, తూగుటుయ్యాల, తాంబూలపు భరిణ, రుద్రవీణ, వట్టివేళ్ళ విసనకర్రలు, దీపపు స్థంభములు మున్నగువానిచే శయ్యామందిరములు అలంకరింపబడెను. విలాసప్రియులు పన్నీరు, గంధము మున్నగు సుగంధ ద్రవ్యములను వాడేవారు.

(జి) వినోదములు: పండుగలు, జాతరలు, రథోత్సవములు మున్నగునవి ఆనాటి ప్రజలకు సంతోషదాయకములు. ధనవంతులైన గ్రామ ముఖ్యులు ఉచితముగా వినోదములను ఏర్పాటు చేయుచుండిరి. గ్రామాధికారి ఏర్పాటు చేసిన దొమ్మరాటయే ఆ కాలపు సర్కస్. దొమ్మరివాళ్ల విద్యలు, వీధినాటకములు, తోలుబొమ్మలాటలు, విప్రవినోదములు, కోడిపందెములు మున్నగునవి ప్రజలకు వినోదము కలిగించెడివి. పులిజూదము, గుడిగుడిగుంచము, బొంగరములాట మున్నగునవి వారి వినోదక్రీడలు.

(హెచ్) విద్యా విధానము: ఆనాటి విద్యా విధానము ఓనమాలను దిద్దించుటతో ప్రారంభమగును. గుణింతములను, పద్యములను నేర్పెడివారు. విద్యనభ్యసించుటలో శ్రద్ధ చూపని విద్యార్థులకు గురువులు తొడ మెలిపెట్టుట, కోదండములు వేయించుట మున్నగు శిక్షలు విధించెడివారు. సాధారణముగా దేవాలయములు, మసీదులు, విద్యాకేంద్రములుగా ఉండేవి.

(ఐ) ఋణ పత్రములు: ఋణములు తీసుకొనుట, ఋణ పత్రములు వ్రాసి ఇచ్చుట మొదలగునవి ఆనాడు వాడుకలో ఉండెను. ఋణపత్రములను మ్రానిపట్టపై ఒకవిధమగు పసరుతో వ్రాసెడివారు.

(జె) శకునములు, విశ్వాసములు: నాటి ప్రజలకు శకునములపై విశ్వాసము కలదు. నంబి బ్రాహ్మణుడు, పాము, చెవులపిల్లి దుశ్శకునములనియు, గ్రద్ద మంచి శకునమనియు వారి విశ్వాసము. ఏదైనా కీడు కలిగినపుడు భూతములకు శాంతి చేసినచో, దోష నివారణమగునని వారి విశ్వాసము. ఎరుకసాని సోదియందునూ వారికి నమ్మకము
కలదు.

AP Inter 1st Year History Study Material Chapter 10 క్రీ.శ. 10వ శతాబ్దం నుంచి 19వ శతాబ్దం వరకు దక్కన్, దక్షిణ భారతదేశ చరిత్ర

(కె) చలివేంద్రములు: వేసవి కాలములో చలివేంద్రములు ఏర్పాటు చేయబడుచుండెను. నాటి చలివేంద్రములలో మంచినీటితో పాటు మజ్జిగ, గంజి కూడా బాటసారులకు దాహము తీర్చుకొనుటకు ఇచ్చేవారు.

B. ఆర్థిక పరిస్థితులు: గోల్కొండ సుల్తానులు వ్యవసాయము, వర్తక వ్యాపారములను వృద్ధిచేసిరి.
(ఎ) వ్యవసాయము, పంటలు: గోల్కొండ సారవంతమైన తీర భూములతోను, అటవీ సంపదతోను కూడియున్న రాజ్యము. ఔరంగజేబు పేర్కొనినట్లు గోల్కొండ రాజ్యములో “సాగులో లేని భూమి లేదు”. గోధుమ, వరి, జొన్న, రాగి, సజ్జ, పప్పు ధాన్యములు అపారముగా పండుచుండెను. వ్యాపార పంటలైన ప్రత్తి, పొగాకు (దీనిని పోర్చుగీసువారు ప్రవేశపెట్టిరి) ఆదాయముల ద్వారా విదేశీ మారక ద్రవ్యము లభించేది. మామిడి, అరటి, నిమ్మ, దానిమ్మ, నారింజ, అనాస, జామ మున్నగు పండ్లు విరివిగా పండింపబడెను.

(బి) పరిశ్రమలు: గోల్కొండ రాజ్యము వ్యవసాయమునకే కాక పరిశ్రమలకు కూడా ప్రసిద్దికెక్కెను. ఒక మొగలు చిత్రకారుడన్నట్లు హైదరాబాద్ లో ఉన్న కళాకారులు, వ్యాపారులు, శ్రామికుల వివరములు తెలుపవలెనన్న అవి ఒక గ్రంథమగును.
1) నేతపని అభివృద్ధి దశయందుండెను. వివిధ రకములు బట్టలు (సన్ననివి, ముతకవి) తయారుచేయబడుచుండెను. ఓరుగల్లు సన్నని నూలు బట్టలు తయారీకి; మచిలీపట్టణము కలంకారీ అద్దకపు పరిశ్రమకు వాసికెక్కెను. కలంకారీ అద్దక వస్త్రములకు విదేశములలో కూడా మంచి గిరాకీ ఉండెను.

2) నిర్మల్, ఇండోర్ (నిజామాబాద్) సమీపమున ఉన్న ఇందల్వాయీలవద్ద ఖడ్గములు, బాకులు, బల్లెములు తయారుచేయబడినట్లు థీవ్ నాట్ రచనలను బట్టి తెలియుచున్నది. అవి భారతదేశంలోని అన్ని ప్రాంతాలకు సరఫరా చేయబడుచుండెను.

3) కొండపల్లి, నరసాపురము దారు పరిశ్రమకు ప్రసిద్ధికెక్కెను. నరసాపురము వద్ద నౌకలు నిర్మింపబడుచుండెను. భారతీయులేగాక పోర్చుగీసువారు కూడా ఇచట నౌకలను తయారుచేయించుకొనెడివారు. ‘గ్లోబ్’ అను పేరుగల ఇంగ్లీషు ఈస్టిండియా కంపెనీ నౌక కూడా ఇచటనే తయారుచేయబడినట్లు ఆ కంపెనీ ఉద్యోగియైన ష్కోరర్ (Schorer) తెలిపియున్నాడు.

4) ఖమ్మం మెట్టు సమీపంలో ఉన్న నల్గొండ వద్ద నీలిమందు తయారుచేయబడి ఎగుమతి అగుచుండెను.

5) మచిలీపట్టణంలో తుపాకీ మందు తూటాలు తయారుచేయబడుచుండెను. ఇచట లభించు తెరచాప దూలములు నాణ్యమైనవి. గోల్కొండ రాజ్యములో మొత్తం 23 గనులు కలవు. వానిలో సీసము, ఇనుము గనులు కూడా కలవు. గోల్కొండ ఉక్కు విదేశాలలో సైతం వాసికెక్కెను. ప్రపంచ ఖ్యాతినార్జించిన డమాన్కస్ కత్తులు గోల్కొండ ఉక్కుతో చేయబడినవే.

6) గోల్కొండ వజ్రపు గనులకు ప్రసిద్ధి. నాడు వజ్రములు సంచుల ద్వారా లెక్కింపబడుటను బట్టి అవి ఎంత సమృద్ధిగా లభించెడివో విశిదమగును. ఆంధ్రప్రాంతములోని కొండపల్లి, నరసాపురముల వద్ద, కర్ణాటక ప్రాంతములోని కంధికోట కొల్లూరుల వద్ద వజ్రముల త్రవ్వకము ముమ్మరముగా సాగుచుండెను. కర్ణాటక ప్రాంతములలోని వజ్రపు గనులలో ఇరవైవేలకు పైగా శ్రామికులు పనిచేయుచుండెడివారు.

(సి) వర్తక, వ్యాపారములు: విదేశీయుల రాకతో దేశీయ, విదేశీయ వాణిజ్యములు పతాకస్థాయికి చేరుకున్నవి. మచిలీపట్టణము విదేశీ వాణిజ్యమునకు కేంద్రముగా ఉండెను. ఈ విషయములో నేటి బొంబాయికి గల స్థానము నేటి మచిలీపట్టణమునకు కలదు. అరకాన్, పెగూ, టెనన్సరియమ్, మలయా ద్వీపకల్పము, సింహళము, మాల్దీవులు, తుర్కి స్థానము, అరేబియా, పర్షియా, ఐరోపాఖండ దేశములలో విదేశీ వాణిజ్యము జరుగుచుండెను. ముడి పదార్థములు, ఆహారపదార్థములు, నూలు బట్టలు మున్నగునవి ఎగుమతి అగుచుండెను. మిరియాలు, చందనపు చెక్క, శిల్కు, చక్కెర, కస్తూరి, లక్క, గాజుసామానులు దిగుమతి అగుచుండెను. 34% ఎగుమతి, దిగుమతి సుంకములు వసూలు చేయబడుచుండెను. దేశీయ వ్యాపారములో గోల్కొండ నగరము గొప్ప వ్యాపార కేంద్రముగా విలసిల్లెను. రత్నములకు, వజ్రములకు, కస్తూరి మొదలగు సుగంధ ద్రవ్యములకు గోల్కొండ వ్యాపార కేంద్రముగా ఉండెను.

సంక్షిప్త సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
రుద్రమదేవి విజయాలు
జవాబు:
ఆంధ్రదేశాన్ని పాలించిన మొట్టమొదటి స్త్రీ పాలకురాలు రుద్రమదేవి లేక రుద్రాంబ క్రీ.శ. (1262 – 1296) గణపతిదేవునికి కొడుకులు లేనందున తన వారసురాలిగా తన కుమార్తె రుద్రమదేవిని నియమించాడు. ఈమె కాలంలో ఈమె స్త్రీ అన్న చులకన భావంతో యాదవులు, చోళులు, పాండ్యులు, కాకతీయ రాజ్యంపై దండెత్తగా, రుద్రమదేవి వారి దాడులను తిప్పికొట్టింది. పురుష వేషం ధరించి రాజధర్మాన్ని సమకాలీన రాజుల కంటే గణనీయంగా నిర్వహించింది. ఉదార పరిపాలన ద్వారా ప్రజల అభిమానాన్ని చూరగొంది. ఈమెకు కుమారులు లేనందున తన కూతురు కొడుకైన రెండవ ప్రతాపరుద్రుడిని దత్తత తీసుకొని అతనికి రాజ్యాన్ని అప్పగించింది. రుద్రమదేవి కాలంలో వెనీస్ యాత్రికుడు మార్కోపోలో ఆంధ్రదేశాన్ని సందర్శించి ఈమె పాలనను కొనియాడాడు. రుద్రమదేవి ఆంధ్రదేశాన్ని సమర్ధవంతంగా పాలించిందని, ఆమె పరిపాలనా వ్యవస్థ ఆదర్శవంతంగా సాగిందని మార్కోపోలో పేర్కొన్నాడు.

AP Inter 1st Year History Study Material Chapter 10 క్రీ.శ. 10వ శతాబ్దం నుంచి 19వ శతాబ్దం వరకు దక్కన్, దక్షిణ భారతదేశ చరిత్ర

ప్రశ్న 2.
రుద్రమాంబ (రుద్రమదేవి)
జవాబు:
ఆంధ్రదేశాన్ని పాలించిన మొదటి మహిళా పాలకురాలు రుద్రమదేవి. ఈమె గణపతిదేవుని కుమార్తె. ఈమె భర్త చాళుక్య వీరభద్రుడు. ఈమెను సమర్థించి, పరిపాలనలో సహకరించి, విశ్వాస పాత్రుడుగా పనిచేసిన వారిలో రేచెర్ల ప్రసాదిత్యుడు ముఖ్యుడు. ఇతనికే కాకతీయ ‘రాజ్యస్థాపనాచార్య’ అనే బిరుదు ఉన్నది.

గణపతిదేవునికి కొడుకులు లేనందున తన వారసురాలిగా తన కుమార్తె అయిన రుద్రమదేవిని నియమించాడు. రుద్రమదేవి స్త్రీ అని, ఆమె సార్వభౌమాధికారాన్ని అంగీకరించడానికి నిరాకరించి, ధిక్కరించిన వారిని ఈమె అణచివేసింది. కాయస్థ నాయకుడు జన్మిగ దేవుడు, అతని తమ్ముడైన త్రిపురారి అంతరంగిక తిరుగుబాట్లను అణచివేయడంలో ఈమెకు అండగా నిలిచినారు. రుద్రమదేవి సైన్యాలు కడప, వేంగీ, తీరాంధ్రంపై తన ఆధిపత్యాన్ని నెలకొల్పింది. రుద్రమదేవి ‘రాయగజకేసరి’ అనే బిరుదును ధరించింది. యాదవ రాజులు ఈమె శక్తి సామర్థ్యాలను తక్కువగా అంచనా వేసి తెలుగుదేశంపై దండెత్తారు. రుద్రమదేవి సైన్యాలు చారిత్రాత్మక విజయాన్ని సాధించాయి.

ఈమె ప్రజాహితపాలన చేసింది. అనేక చెరువులు, కాలువలు నిర్మింపచేసింది. కాయస్థ అంబదేవుడు ఈమెకు నమ్మిన సేనాని. కాని రుద్రమదేవి పేరు ప్రతిష్టలు చూసి అసూయచెంది తిరుగుబాటు లేవదీశాడు. జన్మిగ దేవుడు, త్రిపురాంతకుడు ఈమెకు నమ్మిన అధికారులు. వీరి సోదరుడైన అంబదేవుడు కడప జిల్లా నందలూరు ప్రాంతానికి గవర్నర్గా పరిపాలించాడు. ఇతడు అధికార కాంక్షతో రుద్రమదేవికి వ్యతిరేకంగా ఒక కూటమిని తయారుచేసి గొప్ప తిరుగుబాటును లేవదీశాడు. ఇతని తిరుగుబాటును అణచడానికి వెళ్ళిన రుద్రమదేవి యుద్ధభూమిలో వీరస్వర్గం పొందినట్లు తెలియుచున్నది. రుద్రమదేవికి మగసంతానం లేనందువల్ల తన కుమార్తె కుమారుడైన రెండవ ప్రతాపరుద్రున్ని తన వారసునిగా ప్రకటించింది. ఈమె కాలంలో వెనీస్ యాత్రికుడు మార్కోపోలో ఆంధ్రదేశాన్ని సందర్శించి ఈమె పాలనను కొనియాడాడు.

ప్రశ్న 3.
రాక్షసి – తంగడి యుద్ధం
జవాబు:
రాక్షసి – తంగడి యుద్ధం క్రీ.శ. 1565లో విజయనగరానికి 10 మైళ్ళ దూరంలో ఉన్న రాక్షసి తంగడి అను గ్రామాల మధ్య విజయనగర సైన్యాలకు, బహమనీ సైన్యాలకు మధ్య జరిగింది. ఈ యుద్ధంలో విజయనగర సైన్యాలు ఓడి, సర్వనాశనమయ్యాయి. బహమనీ సైన్యాలు రామరాయలను అతిక్రూరంగా హతమార్చాయి. ఈ యుద్ధానంతరం ముస్లిం సైన్యాలు రక్షణ లేని విజయనగరంలో ప్రవేశించి, దోచుకొని, రాజప్రాసాదాలను, ఆలయాలను ధ్వంసం చేశాయి. ఈ యుద్ధంతో విజయనగర సామ్రాజ్యం పతనమైంది.

ప్రశ్న 4.
విజయనగర రాజుల కాలం నాటి వాస్తు – శిల్పాలు
జవాబు:
శ్రీకృష్ణదేవరాయలు స్వయంగా గొప్ప పండితుడు, సాహిత్యప్రియుడు, కళాపోషకుడు. ఎందరో కవులు, పండితులు అతని స్థానములో గౌరవాన్ని పొందారు. ఇతని రచన ఆముక్తమాల్యద పండితుల ప్రశంసలు అందుకొంది. సంస్కృత భాషలో ఉషాపరిణయం అనే గ్రంథాన్ని శ్రీకృష్ణదేవరాయలు రాశాడు. ఇతణ్ణి కవులు, పండితులు ‘ఆంధ్రభోజ’ అని కీర్తించారు. ఇతని ఆస్థానంలో ‘అష్టదిగ్గజాలనే’ ఎనిమిది మంది గొప్ప కవులు ఉండేవారని ప్రతీతి. వీరిలో అల్లసాని పెద్దన్న, నంది తిమ్మన్న, పింగళి సూరన, తెనాలి రామకృష్ణుడు ముఖ్యులు. పెద్దన మనుచరిత్ర మహోన్నత ప్రబంధ కావ్యం. శ్రీకృష్ణదేవరాయలు వాస్తు-శిల్పకళలను పోషించాడు. ఎన్నో గొప్ప నిర్మాణాలు చేపట్టాడు. అనేక పాత దేవాలయాలకు మరమత్తులు చేయించాడు. శ్రీకృష్ణదేవరాయలు హంపీలోని విఠలాస్వామి గుడికి, హజరామస్వామి ఆలయానికి మరమత్తులు చేయించాడు. శ్రీకూర్మం, అహోబిలం, తిరుపతి, శ్రీకాళహస్తి, శ్రీశైలం, సింహాచలం, అమరావతి మొదలైన చోట్ల అనేక ఆలయాలకు మరమత్తులు చేయించాడు. ఉదాహరంగా దానాలు చేశాడు, కానుకలు సమర్పించాడు. ఇతని కాలంలోనే హంపీలో భారీ గణేశ, హనుమాన్, ఉగ్రనరసింహ స్వామి రాతి విగ్రహాలను చెక్కించాడు. ఈ విధంగా శ్రీకృష్ణదేవరాయల పరిపాలనా కాలం విజయనగర చరిత్రలో మైలురాయిగా మిగిలింది.

ప్రశ్న 5.
మూడో మహ్మద్ షా
జవాబు:
పదిహేను సంవత్సరముల ప్రాయమున సింహాసనమునకు వచ్చిన మహమ్మద్ కులీ రాజ్యాంగ తంత్రములను దూరదృష్టితోను, నేర్పుతోను నడిపిన దక్షుడు. ఇతని కాలము నాటికి ఆంధ్రదేశమంతయు గోల్కొండ రాజ్యములో చేరియుండెను.

రాజ్యవాప్తి: మహమ్మద్కులీ కాలమున నంద్యాల, గండికోట, కడప, కర్నూలు ప్రాంతములలో అధికభాగము గోల్కొండ రాజ్యములో చేర్చబడెను. ఈశాన్య దిక్కున గంజాం జిల్లా వరకు ఇతని రాజ్యము విస్తరించేను.

విదేశీ సంబంధాలు: ఇతని కాలములో మొగలు చక్రవర్తి అక్బరు నుండి రాయబార సంఘమొకటి గోల్కొండకు రాగా అతడు అక్బరుకు కానుకలిచ్చి పంపెను. పారశీక రాయబారిగా కూడా ఇతని ఆస్థానమును సందర్శించెను.

వర్తక వ్యాపారములు: మహమ్మద్ కులీ వర్తక వ్యాపారములను, పరపతి సంస్థలను పోత్సహించెను. పర్షియా నుండి అనేక వ్యాపార కుటుంబములను రప్పించి హైదరాబాద్లోను, మచిలీపట్టణమునందును, వారికి నివాస సౌకర్యములను కల్పించెను. సుల్తాన్ అనుమతి పొందిన ఆంగ్లేయులు 1611లో మచిలీపట్టణములో వర్తక స్థావరమును నెలకొల్పుకొనిరి.

వాస్తు నిర్మాణము: మహమ్మద్ కులీ గొప్ప వాస్తు నిర్మాత. ఇతడు తన ప్రియురాలగు ఒక హిందూ నర్తకిపేర (బాగ్మతి) భాగ్యనగర్ను నిర్మించెను. తదుపరి ఆ నగరము సుల్తాను కుమారుని పేర (హైదర్) హైదరాబాద్ అని వ్యవహరింపబడెను. హైదరాబాదులో చార్మినార్ (1593), జామామసీదు (1593), చందన మహలు, చికిత్సాలయములు, విశ్రాంతి భవనములు మున్నగువానిని ఇతడు కట్టించెను. మూసీనదికి ఆనకట్ట కట్టించి హైద్రాబాదుకు మంచినీటి వసతి కల్పించెను. ఇతడు తన రాజధాని చుట్టును పండ్ల తోటలు నాటించెను. మహ్మమద్ కులీ పండితుడు, కవి, దానశీలి.

AP Inter 1st Year History Study Material Chapter 10 క్రీ.శ. 10వ శతాబ్దం నుంచి 19వ శతాబ్దం వరకు దక్కన్, దక్షిణ భారతదేశ చరిత్ర

ప్రశ్న 6.
ఫ్రాంకోయిస్ బెర్నియర్
జవాబు:
ఇతడు ఫ్రాన్స్ వాస్తవ్యుడు, వృత్తిరీత్యా వైద్యుడు, గొప్ప చరిత్రకారుడు, రాజనీతిజ్ఞుడు. క్రీ.శ. 1656-1668 మధ్యకాలంలో గోల్కొండ రాజ్యంలో పర్యటించాడు. మొగల్ చక్రవర్తి షాజహాన్ కుమారుడైన దారాషీకోకు ఆస్థాన వైద్యునిగా పనిచేశాడు. ఇతడు భారతదేశంలో పర్యటించిన కాలంలో మొగల్ సామ్రాజ్యంలో, దక్కన్లో ముమ్మరంగా పర్యటించి, తాను చూసిన, విన్న విషయాలను డైరీలో రాశాడు. 1670-71 సంవత్సరంలో ఇతని వివరణలు ‘ట్రావెల్స్ – ఇన్-మొగల్-ఎంపైర్’ అనే గ్రంథంగా ఫ్రాన్స్లో ముద్రించారు. బెర్నియర్ రచనలో ఆనాటి సామాజిక వ్యవస్థ, ఆచారాలు, వ్యవహారాలు, ఆర్థిక స్థితి, వృత్తులు, ఖార్ఖానాలు, చేతి వృత్తులు మొదలైన అంశాలు వర్ణించడమైంది. దక్కన్లో వ్యవసాయమే అధిక ప్రజల ముఖ్య వృత్తిగా పేర్కొన్నాడు. సమాజంలో శ్రీమంతులు, సర్దారులు, పేద ప్రజలు ఉన్నారని రాశాడు.

ప్రశ్న 7.
ఇబ్రహీం కుతుబ్షా
జవాబు:
జంషీద్ మరణానంతరము అతని కుమారుడు సుభాను గోల్కొండ సుల్తాన్ అయ్యెను. కాని విజయనగరములో తలదాచుకొన్న జంషీద్ సోదరుడగు ఇబ్రహీం గోల్కొండపై దాడి వెడలి సుభాను ఆరుమాసముల పాలన అంతమొందించి సింహాసనమధిష్టించెను. గోల్కొండ రాజ్య నిజమైన నిర్మాత ఇబ్రహీం కుతుబ్షా. కుతుబ్షా వంశీయులలో ప్రప్రథమంగా “షా” బిరుదును ధరించినది కూడా ఇతడే.. ఇతడు కడు సమర్థుడు. ఇబ్రహీం ముప్పై సంవత్సరములు రాజ్యమేలి పరిపాలనా వ్యవస్థను పటిష్టమొనర్చెను. దారిదోపిడీ దొంగలను అదుపులో ఉంచి వర్తకాన్ని, పరిశ్రమలను అభివద్ధి పరచెను. పరమత సహనాన్ని పాటించి హిందువుల అభిమానమునకు పాత్రుడయ్యెను. ఆంధ్రభాషా పోషకుడై ఆంధ్రులకు ప్రేమాస్పదుడయ్యెను.

ఇబ్రహీం ఆశయాలు: గోల్కొండ సుల్తానుగా ఇబ్రహీం ఆశయాలేమనగా (ఎ) దారిదోపిడీ దొంగలను పట్టుకొని ‘శిక్షించుట, (బి) పరిపాలనను వ్యవస్థాపితము చేయుట, (సి) రాజ్య విస్తరణ విధానమును విడనాడుట.

యుద్ధములు: ఇబ్రహీం ఆదిలో తనకు ఆశ్రయమిచ్చిన రామరాయలతో స్నేహసంబంధాలను కలిగివుండెను. తదుపరి ఇతని విధానంలో మార్పు వచ్చెను. గోల్కొండను విడిచి వెళ్ళిన జగదేకరావునకు రామరాయలు ఆశ్రయ మొసంగుట ఇబ్రహీంకు ఆగ్రహము కలిగించెను. అదికాక విజయనగర రాజ్య ప్రాబల్యమును దానివలన కలుగు ప్రమాదమును, అతడు గుర్తించెను. విజయగనర ప్రాబల్యమును, బీజాపూర్ రాజ్య విస్తరణను గాంచి ఆందోళన చెందిన ఇబ్రహీం, అహమ్మద్ నగర్ సుల్తాన్తో సంధి చేసుకొనెను. అందుకు ఆగ్రహించి రామరాయలు గోల్కొండపై దాడి జరిపి పానగల్లు, ఘనపురం దుర్గాలను ఆక్రమించెను. అంతట ఇబ్రహీం రామరాయలుపై పగ సాధించుటకు విజయనగరమును నాశనము చేయుటకు దక్కను సుల్తానులను సమైఖ్యపరచి 1565లో రాక్షసితంగడి యుద్ధంలో పాల్గొనెను.

ప్రశ్న 8.
కుతుబ్షాహీల పతనం
జవాబు:
గోల్కొండ సుల్తాన్ అబ్దుల్హాసన్ తానీషా బ్రాహ్మణ సోదరులైన అక్కన్న, మాదన్నలను సేనాని, ప్రధానమంత్రులుగా నియమించెను. సనాతన ముస్లిం భావాలు, హిందువుల యెడల ద్వేషము గల ఔరంగజేబుకు ఈ నియామకాలు రుచించలేదు.

1) ఔరంగజేబు ఉత్తర హిందూదేశ పరిస్థితులను చక్కబెట్టుకొని, తిరుగుబాటు చేసిన తన కుమారుడు అక్బరును తరుముకొనుచు దక్కన్ వచ్చెను. బీజాపూర్ జయించిన పిమ్మట ఔరంగజేబు గోల్కొండపై దాడికి వెడలెను.

2) 1665-66లో జయసింగ్ నాయకత్వమున, 1679లో దిలీరాఖాన్ నాయకత్వమున, 1685లో యువరాజు ఆజమ్ నాయకత్వమున మొగలులు బీజాపూర్పై దండయాత్రలు జరిపినపుడు, గోల్కొండ సుల్తాన్లు మొగలులకు వ్యతిరేకంగా, బీజాపూర్ సుల్తాన్లకు సాయపడిరి.

3) గోల్కొండ సుల్తాన్ మొగలుల విరోధియగు శివాజీతో స్నేహము చేసి అతనికి సహాయము చేయుట, కర్నాటక దండయాత్రలో శివాజీకి తోడ్పడుట ఔరంగజేబుకు ఆగ్రహము కలిగించెను.

4) 1656లో కుదిరిన ఒప్పందము ప్రకారము చెల్లించవలసిన యుద్ధవ్యయము, కప్పము గోల్కొండ సుల్తాన్ మొగలులకు చెల్లింపలేదు. అదియునుగాక, కర్ణాటకలో మీర్ జుమ్లా జాగీరు భూముల నుండి మొగలులకు రావలసిన ఆదాయమును సుల్తాన్ వసూలుచేసి అనుభవించెను.

5) గోల్కొండ రాజ్య ఐశ్వర్యము ఔరంగజేబును ఆకర్షించెను.

6) తానీషా పరమత సహనము ఔరంగజేబుకు గిట్టలేదు.

7) ఔరంగజేబు సున్నీశాఖకు చెందినవాడు. గోల్కొండ సుల్తాన్ షియాశాఖకు చెందినవాడగుటచే అతని పాలనను అంతమొందించుటకు ఔరంగజేబు సిద్ధపడెను.

8) సామ్రాజ్య కాంక్షపరుడైన ఔరంగజేబు గోల్కొండ రాజ్యమును వశపర్చుకొనుటకు నిశ్చయించెను.

9) వీనికితోడు బీజాపూర్ సుల్తానుపై ఔరంగజేబు జరిపించిన దాడిని అబ్దుల్ హసన్ “తుచ్ఛమైన పిరికిపంద చర్యగా” (a mean minded coward’s act) అభివర్ణించుట ఔరంగజేబు గోల్కొండపై తక్షణ దాడికి ప్రోత్సహించెను.

గోల్కొండ పతనము – అక్టోబర్ 3, 1687: ఈ కారణముల వలన ఔరంగజేబు మొదట తన కుమారుడైన షా ఆలంను (1685, జూలై) గోల్కొండపై దండెత్తుటకు పంపెను. కాని మాల్కేడ్ వద్ద గోల్కొండ సైన్యము మొగలులను అడ్డెను. షాఆలం ఎట్టి విజయములు సాధించలేదు. అంతట అక్టోబరు, 1685లో గోల్కొండ సర్వసేనానియగు మీర్ మహమ్మద్ ఇబ్రహీంకు లంచమిచ్చి అతని సాయముతో షా ఆలం హైదరాబాద్ను ఆక్రమించెను. సుల్తానైన తానీషా హైదరాబాదు వదలి గోల్కొండకు పారిపోయెను. తానీషా, షా ఆలంతో సంధి చేసుకొనెను. ఆ సంధి ప్రకారము:

  • అక్కన్న, మాదన్నలను కొలువు నుండి బహిష్కరించుటకు,
  • మాల్కేడ్, సేరంలను మొగలులకిచ్చుటకు,
  • యుద్ధ నష్టపరిహారము క్రింద ఒక కోటి 20 లక్షల రూపాయలు ఇచ్చుటకు,
  • సాలుకు రెండు లక్షల హనులు (Huns) కప్పము క్రింద చెల్లించుటకు తానీషా అంగీకరించెను.

కాని తానీషా అక్కన్న, మాదన్నలను బహిష్కరించుటలో జాప్యము చేయసాగెను. అంతట గోల్కొండ రాణుల ప్రోత్సాహముతో అక్కన్న, మాదన్నలు గోల్కొండ వీథులలో హతులైరి. తానీషా మొగలుల మిత్రుడయ్యెను. షా ఆలం గోల్కొండ కోటలో ఉండెను.

AP Inter 1st Year History Study Material Chapter 10 క్రీ.శ. 10వ శతాబ్దం నుంచి 19వ శతాబ్దం వరకు దక్కన్, దక్షిణ భారతదేశ చరిత్ర

ఔరంగజేబు దాడి: బీజాపూర్ ఆక్రమణ ముగియగానే, ఔరంగజేబు గోల్కొండను సైతము మొగలుల సామ్రాజ్యమున విలీనము చేయదలచి ఫిబ్రవరి 7, 1687లో గోల్కొండపై స్వయముగా దాడిచేసెను. గోల్కొండ కోటలో తానీషా, షా ఆలంల మధ్య రహస్య సమాలోచనలు గ్రహించి ఔరంగజేబు తన కుమారుడైన షా ఆలంను నిర్భందించెను. తదుపరి గోల్కొండను ముట్టడి చేయడం ప్రారంభించెను. ఈ ముట్టడి 8 నెలలు కొనసాగెను. మొగలు సైన్యమునకు నష్టం కలిగెను. కాని గోల్కొండ దుర్గము ఔరంగజేబు వశము కాలేదు. చివరకు ఔరంగజేబు మాయోపాయముచే అనగా అబ్దుల్లా ఫణియను నౌకరుకు లంచమిచ్చి అక్టోబరు 3, 1687 తెల్లవారుజామున 3 గంటలకు గోల్కొండ తూర్పు ద్వారమును తీయించి కోటలో ప్రవేశించెను. అయినను గోల్కొండ సైనికులు తుదిక్షణము వరకు వీరోచితముగా పోరాడిరి. ఈ పోరాటములో 70 గాయములతో ఏకాకిగా మొగలులతో పోరుసల్పిన అబ్దుల్ రజాక్ లౌరీ అను గోల్కొండ సేనాని ప్రభుభక్తి, వీరోచిత శక్తి గోల్కొండ చరిత్రలో చిరస్మరణీయము. పాతఃకాల విందారగించిన తానీషా బంధీగా దౌలతాబాద్కు పంపబడెను. దీనితో గోల్కొండ మొగలుల వశము అయినది. కుతుబ్షాహీల పాలన అంతరించింది.

ప్రశ్న 9.
నిజాం-ఉల్-ముల్క్
జవాబు:
నిజాం రాజ్యమునకు మూలపురుషుడు నిజాం ఉల్ ముల్క్, ఇతడు 1724 48ల మధ్య నిజాం రాజ్యాన్ని పాలించాడు. అతడి అసలుపేరు మీర్ ఖమ్రుద్దీన్ ఖాన్. అతనికి చిన్ ఖిలిచ్ ఖాన్ అను మరొక పేరు కలదు. నిజాం ఉల్ ముల్క్ అనేది అతని బిరుదు మాత్రమే. ఇతడు ఆంధ్ర, నైజాం రాజ్యముల చరిత్రలోనేగాక భారతచరిత్రలో కూడా ప్రముఖవ్యక్తి. ఇతడు ‘అసఫ్ జాహి’ బిరుదుతో పాలించినందువల్ల అతని వంశమునకు ‘అసఫ్ జాహి’ పేరు వచ్చింది. ఇతడు మొదట మొగల్ సామ్రాజ్యమునకు దక్కన్ సుబేదారుగా పనిచేసెను. సయ్యద్ సోదరుల పతనంలో ప్రధాన పాత్ర వహించి మొగల్ సామ్రాజ్యమునకు ప్రధానిగా నియమింపబడ్డాడు. 1724లో స్వతంత్రుడై నిజాం రాజ్యమును స్థాపించారు. దానికి హైదరాబాద్ రాజధాని. 1858 వరకు మొగల్ సుబేదారులుగా నిజాంరాజులు పాలించినప్పటికీ వారు సర్వస్వతంత్రులు. నిజాం ఉల్ ముల్క్ స్థాపించిన రాజ్యము 1948లో సైనికచర్య జరిగి ఇండియన్ యూనియన్ హైదరాబాద్ కలిసే వరకు కొనసాగింది.

నిజాం-ఉల్-ముల్క్ పాలనలో జరిగిన ముఖ్య సంఘటనలు:
a) మునిషిన్ గాంప్ సంధి(1728): ఇతడు మహారాష్ట్రుల అధికార విస్తరణను అడ్డుకొనే యత్నములో భాగముగా వారిలో వారికి అంతఃకలహములు సృష్టించి స్వకార్యమును నెరవేర్చుకొనుటకు ప్రయత్నించెను. చివరకు పీష్వా బాజీరావు చేతిలో పాల్కేడ్ యుద్ధంలో ఓడిపోయి సంధికి అంగీకరించెను. ఆ సంధి (1728) ప్రకారము నిజాంచేత, సర్దేశ ముఖి కప్పములు చెల్లించుటకు అంగీకరించి, హామీగా కొన్ని దుర్గములను పీష్వా ఆధీనము చేసేను.

b) వార్నా సంధి: పీష్వాపై త్రియంబక్ రావును ఉసిగొల్పి త్రియంబక్ యుద్ధంలో విఫలమై వారా సంధిని చేసుకొనెను. 1731లో చేసుకున్న వార్నా సంధి ప్రకారం దక్షిణమున నిజాం – ఉల్ -ముల్క్ ఉత్తర హిందూ స్థానమున మహారాష్ట్రులు తమ ప్రాబల్యమును నెలకొల్పుకొనుటకు అంగీకారము కుదిరెను.

c) భోపాల్ యుద్దము (1738): మొగల్ చక్రవర్తికి, నిజాంకు ఉమ్మడి శతృవులైన మహారాష్ట్రులపై కత్తిగట్టిరి. అపుడు 1738 జనవరి నెలలో మహారాష్ట్రులకు నిజాం ఉల్ ముల్క్క భోపాల్ వద్ద జరిగిన యుద్ధంలో నిజాం పూర్తిగా ఓడిపోయెను. అపుడు చేసుకున్న సంధి ప్రకారము మాళ్వా రాష్ట్రమును, చంబల్, నర్మదా నదులు మధ్య దేశమును, యుద్ధ నష్టపరిహారముగా 50 లక్షల రూపాయలను మహారాష్ట్రులకు ఇప్పించుటకు నిజాం అంగీకరించెను.

d) నాదిర్షా దండయాత్ర: క్రీ.శ. 1738లో మొగల్ సామ్రాజ్యముపై నాదిర్షా దండయాత్ర జరిపెను. నాదిర్షా తనను ఎదిరించిన మహ్మద్, నిజాం ఉల్-ముల్క్ ఓడించి ఢిల్లీ చేరుకొనెను. ఆ సందర్భమున నాదిర్షా ఆగ్రహమునకు గురైన ఢిల్లీ పౌరులను నిజాం ఉల్ ముల్క్ కాపాడెను.

e) 1740 లో తన కుమారుడు నాజర్ జంగ్ చేసిన తిరుగుబాటును చాకచక్యంగా అణిచివేసి అతనిని క్షమించెను.

f) సర్కార్, కర్నూల్, ఆర్కాట్ పాలెగాండ్లను తన ఆధీనంలోకి తెచ్చుకొనెను.

మహారాష్ట్రుల దాడుల నుండి తన రాజ్యమును కాపాడుకొనుటకై తూర్పుతీరంలో వ్యాపార కేంద్రాలు నెలకొల్పుతున్న ఫ్రెంచివారితోను, ఆంగ్లేయులతోను వైరుధ్యము వహింపక స్నేహ హస్తమందించాడు. అతని మరణం నాటికి నిజాం రాజ్యం ఉత్తరమున తపతీ నది నుండి దక్షిణమున తిరుచునాపల్లి వరకు, పశ్చిమాన ఔరంగాబాద్ నుండి తూర్పున బంగాళాఖాతం వరకు విస్తరించింది.

ఘనత: ఇతడు గొప్ప రాజనీతిజ్ఞుడు. పరిపాలనాదక్షుడు. అసఫీ కళాపోషకుడు. అతని రాజధాని ఔరంగాబాద్ పదిలక్షల జనాభాతో వర్థిల్లుచుండెను. అది కవి పండితులకు నిలయమై ఉండెను. నిజాం ఉల్ ముల్క్ నిరాడంబరముగా జీవించెడివాడు. దర్బారుకు హాజరగు సమయంలో తప్ప ఎటువంటి ఆభరణములు ధరించేవాడుకాదు. అతడు గొప్ప వితరణ శీలి. గొప్పదాన ధర్మములు చేసేవాడు. మత గురువులను గౌరవంగా ఆదరించేవాడు. డా॥ యూసఫ్ హుస్సేన్ ఇలా వ్రాశాడు. “భారతదేశంలో 18వ శతాబ్ది ప్రథమార్థ భాగమున తన రాజకీయ లక్ష్యములను సఫలీకృతం చేసుకున్న రాజనీతిజ్ఞుడు ఇతడొక్కడే. ఇతడు జన్మతః రాజకీయ లక్షణాలు కలవాడు. గొప్ప యోధుడు. పరిపాలనా దక్షుడు”.

ప్రశ్న 10.
నిజాం-అలీ-ఖాన్ విజయాలు
జవాబు:
నిజాం-ఉల్-ముల్క్ వారసుల్లో నిజాం-ఆలీ ఖాన్ (క్రీ.శ. 1762-1803),నిజాం-సికందర్ (క్రీ.శ. 1803- 1829), నాసిరుద్దాలా (క్రీ.శ. 1829-1857), ఆఫ్ఘలుద్దాలా (క్రీ.శ. 1857-1869), ఆరవ నిజాం మీర్ మహబూబ్ ఆలీఖాన్ (క్రీ.శ. 1869-1911), 7వ నిజాం మీర్ ఉస్మాన్ ఆలీఖాన్ (క్రీ.శ. 1911-సెప్టెంబర్ 1948) ప్రముఖులు. వీరి సుదీర్ఘ పాలనలో తెలంగాణా ప్రాంతం దేశ, విదేశాల దృష్టిని ఆకర్షించింది. హైద్రాబాద్ నగరం ప్రపంచ ఖ్యాతి గడించింది. ఉత్తర, మధ్య, పశ్చిమ భారతదేశంలోని అత్యధిక భూభాగాలపై ఈస్ట్ ఇండియా కంపెనీ అధికారం నెలకొల్పడమైంది. దక్కన్లో జరిగిన ఆంగ్లో-కర్ణాటక, ఆంగ్లో-మరాఠా యుద్దాల్లో హైద్రాబాద్ నిజాంలు కీలకపాత్ర పోషించారు. ఫ్రెంచి వారితో వీరి స్నేహం కొన్ని అద్భుత విజయాలు చేకూర్చింది. కాని క్రీ.శ. 1768లో నిజాం-ఆలీ- ఖాన్ లార్డ్ వెల్లస్లీ రూపొందించిన సైన్యసహకార ఒప్పందం అంగీకరించాడు. దీంతో నిజాం తన స్వతంత్ర అధికారాలను కొంతమేరకు కోల్పోయాడు. మరాఠాల దాడుల నుంచి, ఇతర శత్రువుల దాడుల నుంచి తన రాజ్యాన్ని, అధికారాన్ని కాపాడుకోవడానికి నిజాం ఈ ఒప్పందంలో చేరాడు. దీని ప్రకారం హైద్రాబాద్ నగరంలో బ్రిటిష్ సేనలు నిల్పారు. వాటికి అయ్యే ఖర్చులన్నీ చెల్లించడానికి నిజాం అంగీకరించాడు. నిజాం-ఆలీఖాన్ నగదు చెల్లించలేని పక్షంలో సారవంత భూములను ఈస్ట్ ఇండియా కంపెనీ వారికి ధారదత్తం చేయడానికి సిద్ధమయ్యాడు. ఇతని వారసులైన సికందర్ , నాసిరుద్దాలా, అఫ్టలుద్దాలా ఈ సంధి షరతులు అమలుచేశారు. దీంతో కోశాగారంపై అదనపు భారం పడింది. నిజాం· బ్రిటీష్ స్నేహం క్రీ.శ. 1948 వరకు కొనసాగింది. ఆసఫ్జాహీల ప్రధానమంత్రిగా క్రీ.శ. 1853 -1883 మధ్య కాలంలో బాధ్యతలు నిర్వహించిన మొదటి సాలార్జంగ్ ప్రజా సంక్షేమానికై అనేక మహోన్నత సంస్కరణలు ప్రవేశపెట్టాడు. అతడి భూమిశిస్తు, విద్యా, న్యాయ సంస్కరణలు ప్రజలకు మేలుచేశాయి.

AP Inter 1st Year History Study Material Chapter 10 క్రీ.శ. 10వ శతాబ్దం నుంచి 19వ శతాబ్దం వరకు దక్కన్, దక్షిణ భారతదేశ చరిత్ర

ప్రశ్న 11.
ఉస్మాన్ అలీ-ఖాన్ విజయాలు
జవాబు:
నిజాం ప్రభువులలో ఆఖరివాడు ఉస్మాన్ అలీఖాన్. ఇతని పాలనాకాలంలో రెండు ప్రపంచ యుద్ధములు, భారత స్వాతంత్ర్యము, హైద్రాబాద్ పై పోలీసు చర్య, సంస్థానం ఇండియన్ యూనియన్ లో విలీనం వంటి అనేక సంఘటనలు జరిగెను. ఇతని కాలమున నిజాం రాజ్యము సర్వతోముఖాభివృద్ధి చెందెను. ఇతడు అనేక పరిపాలన చర్యలు తీసుకొనెను.

  1. ప్రభుత్వ కార్యాలయములలో అనేకమంది సిబ్బందిని నియమించి ప్రభుత్వ కార్యక్రమములు త్వరితగతిన జరుగునట్లు చేసెను.
  2. రాష్ట్రాదాయము క్రమబద్దము చేసి అనేక ప్రణాళికలను తయారుచేసెను. ఉస్మాన్సాగర్ నిర్మాణం జరిపినది ఇతడే.
  3. వ్యవసాయాభివృద్ధికి హిమాయత్ సాగర్, నిజాంసాగర్లను నిర్మించెను.
  4. అనేక దేశీయ పరిశ్రమలు స్థాపించబడెను. వాటిలో అజాంజాహి మిక్స్, చార్మినార్ సిగరెట్ ఫ్యాక్టరీ మొదలగునవి.
  5. ఇతడు అనేక ప్రజాసంబంధ నిర్మాణములు, విద్యాలయములు, వైద్యాలయములు నెలకొల్పెను.
  6. సాలార్జంగ్ ప్రారంభించిన పారిశ్రామిక వస్తు ప్రదర్శన క్రమబద్ధంచేసి కొనసాగించెను.
  7. స్థానిక కేంద్రాలలో అనేక కార్యాలయములు నిర్మాణం జరిపెను.
  8. పురాతత్వ శాఖను రూపొందించెను.
  9. నిజాం స్టేట్ రైల్వేను స్థాపించెను.
  10. మొదటి ప్రపంచ కాలమందు బ్రిటిష్ వారికి అన్నిరకాల సహకారమందించి “మహాఘనత వహించిన” అను బిరుదు ధరించెను.

అస్తమయం: 1948 సెప్టెంబర్ రజాకార్ల అలజడులు నైజాం ప్రాంతంలో ఎక్కువైనాయి. ఫలితంగా భారత ప్రభుత్వం పోలీసు చర్య కలిపి సంస్థానమును ఆక్రమించెను. చివరకు 1950 జనవరి 26న హైదరాబాదు సంస్థానము ఇండియన్ యూనియన్లో కలిసిపోయెను.

లఘు సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
కాకతీయుల శాసనాలు
జవాబు:

  1. మొదటిసారిగా క్రీ.శ. 956వ సం|| నాటి తూర్పు చాళుక్య రాజు దానార్ణవుని ‘మాగల్లు శాసనం’ కాకత్య గుండ్యన పేరు ప్రస్తావించింది. ఇతడే కాకతీయవంశ మూలపురుషుడు.
  2. హనుమకొండలోని వేయిస్తంభాల గుడి శాసనము రుద్రదేవుడు స్వతంత్ర్యాన్ని ప్రకటించుకొన్న విషయాన్ని అతని విజయాలను తెలివేస్తుంది.
  3. కాకతీయ ప్రభువులు, వారి బంధువులు, సేనాపతులు వేయించినారు.
  4. బయ్యారం శాసనము దీనిని గణపతిదేవుని సోదరి మైలాంబ వేయించింది.
  5. పాలంపేట శాసనం, ద్రాక్షారామం శాసనము, చందుపట్ల శాసనము మొదలగునవి.

ప్రశ్న 2.
మార్కోపోలో
జవాబు:
మార్కోపోలో వెనిస్ యాత్రికుడు. కాకతీయ రుద్రమదేవి కాలంలో ఇతడు ఆంధ్రదేశాన్ని సందర్శించాడు. రుద్రమదేవి ఆంధ్రదేశాన్ని సమర్థవంతంగా పాలించిందని, ఆమె పరిపాలనా వ్యవస్థ ఆదర్శవంతంగా సాగిందని మార్కోపోలో పేర్కొన్నాడు. కాకతీయ రాజ్యములో పారిశ్రామికాభివృద్ధి జరుగుతున్నదని, గోల్కొండ ప్రాంతంలో ప్రజల పరిశ్రమ అభివృద్ధిలో ఉన్నదని, ప్రజలు అప్లైశ్వర్యాలతో తులతూగుచుండేవారని కూడా పేర్కొన్నాడు.

ప్రశ్న 3.
నాయంకర వ్యవస్థ
జవాబు:
కాకతీయులు తమ రాజ్యంలోని భూములను సైనికాధికారులకు పంచిపెట్టారు. వారిని నాయంకరులు అంటారు. వారికిచ్చిన భూమిని నాయకస్థలం లేదా నాయకస్థలవృత్తి అనేవారు. నాయంకర భూములను తీసుకున్న సైనికాధికారులు కొంత సైన్యాన్ని పోషించి రాజుకు అవసర సందర్భాలలో సరఫరా చేయాలి. ఈ పద్ధతి ముస్లిమ్ల జాగీర్దార్ పద్ధతిని పోలి ఉంటుంది. ప్రతాపరుద్రుని కాలంలో 77 మంది నాయంకర్లు ఉండేవారని తెలుస్తున్నది.

AP Inter 1st Year History Study Material Chapter 10 క్రీ.శ. 10వ శతాబ్దం నుంచి 19వ శతాబ్దం వరకు దక్కన్, దక్షిణ భారతదేశ చరిత్ర

ప్రశ్న 4.
పాలంపేట
జవాబు:
రేచర్ల రుద్రుడు పాలంపేటలో ఒక గొప్ప దేవాలయమును నిర్మించెను. ఈ దేవాలయం రూపశిల్పి ‘రామప్ప’. అందుచే దీనికి ‘రామప్ప దేవాలయం’ అని పేరు వచ్చింది. ఈ దేవాలయాలు కాకతీయ శిల్పకళకు పరాకాష్టకు చేరుకున్నాయి. రామప్ప దేవాలయంలో నంది విశిష్టమైనది. రామప్ప గోపుర నిర్మాణంలో ఉపయోగించిన ఇటుకలు నీటిలో వేస్తే ఆకులవలె తేలడం ఒక అద్భుతం.

 

ప్రశ్న 5.
విజయనగర కాలంలో రాష్ట్రపాలన
జవాబు:
పరిపాలన సౌలభ్యం కోసం సువిశాల విజయనగర సామ్రాజ్యాన్ని రాష్ట్రాలుగా విభజించారు. రాష్ట్రాన్ని రాజ్యమని వ్యవహరించారు. తంజావూర్, మధుర, ఇక్కేరి, చంద్రగిరి, శ్రీశైలం, కొండవీడు మొదలైనవి ముఖ్య రాజ్యాలు. ఈ రాజ్యాధిపతులు ఇంచుమించు స్వతంత్రంగానే వ్యవహరించారు.

రాష్ట్రంలో సీమలు, స్థలాలు, సమితులు, గ్రామాలు పాలన విభాగాలు. సీమకు పారుపత్యగారు, స్థలం మీద గౌడ, కరణం అధికార్లు. గ్రామంలో రెడ్డి, కరణం, తలారి మొదలైన వారుండేవారు.

ప్రశ్న 6.
బహమనీ రాజ్యస్థాపన
జవాబు:
మహమ్మద్ బీన్ తుగ్లక్ మీద జరిగిన అనేకమైన తిరుగుబాట్లలో ఒకదాని పరిణామమే, బహమనీ రాజ్యస్థాపన. ఈ తిరుగుబాటును దక్కన్ ప్రాంతాల్లో శిస్తు వసూలు చేసే ఉద్యోగులు జరిపారు. వీరినే ‘సాదాఅమీర్లు’ అనేవారు. వీరు గుజరాత్, దౌలతాబాద్ ప్రాంతాల్లో జిల్లా ఉద్యోగులుగా ఉండే విదేశీ ప్రభు కుటుంబాలవారు. తుగ్లక్ కాలంలో పన్నులు సరిగా వసూలుకానందున, అమీర్లను అదుపులో ఉంచడం కోసం, షిక్టార్లకు ఆజ్ఞలను జారీచేశాడు. అమీర్లలో భయాందోళనలు పుట్టి, వారంతా ఏకమై సుల్తాన్పై తిరగబడ్డారు. వారికి సమర్థుడైన ‘హసన్ గంగూ’ అనే జాఫరాఖాన్ నాయకుడిగా దొరికాడు. గుల్బర్గాను రాజధానిగా చేసుకొని, క్రీ.శ. 1347లో హసన్ గంగూ బహమన్షాను అమీర్లందరూ సుల్తాన్ గా ఎన్నుకోగా, బహమనీ రాజ్యస్థాపన జరిగింది. ‘బహమన్’ చేత ఏర్పాటు చేయబడ్డ సామ్రాజ్యం కాబట్టి, బహమనీ సామ్రాజ్యమని దీనికి పేరు వచ్చిందని చరిత్రకారులు అభిప్రాయం. ఈ వంశంలో మొత్తం 18 మంది సుల్తాన్లు పరిపాలించారు.

ప్రశ్న 7.
మహ్మద్ గవాన్
జవాబు:
గవాన్ పారశీక ప్రభు కుటుంబంలో క్రీ.శ. 1404లో జన్మించాడు. మాతృదేశాన్ని విడిచి, వర్తకం చేసుకుంటూ, 1447లో బీదర్ చేరాడు. రెండో అల్లావుద్దీన్ కొలువులో ఉద్యోగంలో చేరాడు. తెలంగాణా తరల్దార్ తిరుగుబాటు చేయగా, అతనిని బాలకొండ యుద్ధంలో ఓడించి, సుల్తాన్ అభిమానాన్ని పొందాడు. గవాన్ రాజనీతి, యుద్ధనైపుణ్యం ప్రశంసలందుకొన్నాయి. అతని శక్తి సామర్థ్యాలను, సేవలను గుర్తించి మహమ్మదా అతణ్ణి ప్రధానమంత్రిగా నియమించాడు.

అధికారంలోకి వచ్చిన వెంటనే, గవాన్ విజయయాత్రలను జరిపి బహమనీ రాజ్యవిస్తరణకు పూనుకున్నాడు. మాళవ, గోవా, తెలంగాణ, రాజమహేంద్రవరం, కొండవీడు ప్రాంతాలను ఆక్రమించాడు. ఈ సందర్భంలోనే క్రీ.శ.1481లో గవాన్ తీరం వెంబడి కాంచీపురం వరకు దాడి చేశాడు. మార్గమధ్యంలో ఆలయాలను కొల్లగొట్టి అపార ధనరాసులతో తిరిగొచ్చాడు. ఈ విజయాలతో బహమనీ రాజ్యం తపతీ నది నుంచి తుంగభద్రనది వరకు, ఉభయ సముద్రాల మధ్య విస్తరించింది. రాజ్యవిస్తరణ కార్యక్రమంలో ఉన్నప్పుడే గవాన్ ప్రభుత్వాన్ని పటిష్టం చేసే సంకల్పంతో అనేక సంస్కరణలను ప్రవేశపెట్టాడు.

AP Inter 1st Year History Study Material Chapter 10 క్రీ.శ. 10వ శతాబ్దం నుంచి 19వ శతాబ్దం వరకు దక్కన్, దక్షిణ భారతదేశ చరిత్ర

ప్రశ్న 8.
మీర్ మహబూబ్ అలీ కాలంలో విద్యాభివృద్ధి
జవాబు:
ఇతడు వైద్యాలయములు, విద్యాలయములు స్థాపించెను. సిటీ కళాశాల ఉస్మానియా వైద్యాలయము, యునాని వైద్యాలయములు స్థాపించెను. మ్యూజియము, జూబ్లీహాలు నిర్మింపబడెను. విద్యావ్యాప్తికి ఇతడు అనేక ప్రాంతాలలో పాఠశాలలు నిర్మించెను.

AP Inter 1st Year Physics Study Material Chapter 11 ప్రవాహుల యాంత్రిక ధర్మాలు

Andhra Pradesh BIEAP AP Inter 1st Year Physics Study Material 11th Lesson ప్రవాహుల యాంత్రిక ధర్మాలు Textbook Questions and Answers.

AP Inter 1st Year Physics Study Material 11th Lesson ప్రవాహుల యాంత్రిక ధర్మాలు

అతిస్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
సగటు పీడనాన్ని నిర్వచించండి. దీని ప్రమాణం, మితీయ ఫార్ములాను తెలపండి. ఇది సదిశరాశా? అదిశరాశా?
జవాబు:
సగటు పీడనం (Pav) :
ప్రమాణ వైశాల్యంపై పనిచేసే అభిలంబ బలాన్ని సగటు పీడనం అంటారు.
Pav = \(\frac{F}{A}\)
ప్రమాణాలు → N/m² (లేదా) పాస్కల్
మితిసూత్రం → [ML-1T-2]
పీడనం అదిశరాశి.

ప్రశ్న 2.
స్నిగ్ధతను నిర్వచించండి. స్నిగ్ధతా గుణకం ప్రమాణాలు, మితులు ఏమిటి?
జవాబు:
స్నిగ్ధత :
ప్రవాహి రెండు పొరల మధ్య సాపేక్ష వేగాన్ని తగ్గించే ధర్మాన్ని స్నిగ్ధత అంటారు.
C.G.S ప్రమాణాలు పాయిజ్ (Poise)
S.I ప్రమాణాలు → Nm-2s
మితిసూత్రం →[M¹L-1T-1]

ప్రశ్న 3.
ఒక ఆటోమొబైల్ యొక్క కార్బ్యురేటర్ పనిచేయడం వెనక ఉన్న సూత్రం ఏది? [May ’13]
జవాబు:
ఆటోమొబైల్లో ఉండే కార్బ్యురేటర్కు ఒక వెంటురి ఛానెల్ (నాజిల్) ఉంటుంది. దాని ద్వారా ఒక అధిక వడితో గాలి ప్రవహిస్తుంది. గాలి పీడనం ఇరుకైన మెడవద్ద తగ్గడం వల్ల పెట్రోలు పేటికలోకి పీల్చబడుతుంది. ఇలా దహనానికి అవసరమయ్యే గాలి, ఇంధనాల మిశ్రమం సమకూరుతుంది.

ప్రశ్న 4.
మాగ్నస్ ప్రభావం అంటే ఏమిటి?
జవాబు:
స్పిన్ గమనంలో ఉన్న బంతిపైన మరియు క్రింద తలాలపై గాలివేగాలలో తేడా వలన పీడనాలలో కూడా తేడా ఏర్పడి బంతిపై నికర ఊర్థ్వబలం పనిచేస్తుంది. స్పిన్ గమనం వల్ల కలిగే ఈ గతిక ఉత్థాపనాన్నే మాగ్నస్ ప్రభావం అంటారు.

ప్రశ్న 5.
ద్రవ బిందువులు, బుడగలు గోళాకారంలో ఎందుకు ఉంటాయి? [Mar. ’14; May ’13]
జవాబు:
తలతన్యత వల్ల ద్రవతలాలు కనిష్ఠ ఉపరితల వైశాల్యాలను పొందుతాయి. గోళం యొక్క ఉపరితల వైశాల్యం తక్కువ కాబట్టి, వర్షపు చినుకులు గోళాకారంగా ఉంటాయి.

AP Inter 1st Year Physics Study Material Chapter 11 ప్రవాహుల యాంత్రిక ధర్మాలు

ప్రశ్న 6.
ద్రవ బిందువులోని అదనపు పీడనానికి సమీకరణాన్ని తెలపండి.
జవాబు:
ద్రవబిందువు లోపల అధిక పీడనం, Pi – Po = \(\frac{2s}{r}\)
ఇక్కడ s = తలతన్యత
r = ద్రవబిందువు వ్యాసార్థం

ప్రశ్న 7.
ద్రవంలోపల ఉండే గాలి బుడగలోని అదనపు పీడనానికి సమీకరణాన్ని తెలపండి.
జవాబు:
ద్రవంలోపల ద్రవపు బిందువులో అధికపీడనం, Pi – Po = \(\frac{2s}{r}\)
ఇక్కడ s = తలతన్యత
r = గాలిబుడగ వ్యాసార్థం
గాలిబుడగ ద్రవంలోపల ఉంది కాబట్టి, దానిలో ఒక ద్రవతలం మాత్రమే ఉంటుంది.

ప్రశ్న 8.
గాలిలో ఉన్న సబ్బుబుడగలోని అదనపు పీడనానికి సమీకరణాన్ని తెలపండి.
జవాబు:
గాలిలో సబ్బు బుడగకు రెండు తలాలు ఉంటాయి. కాబట్టి సబ్బు బుడగ
లోపల అధికపీడనం, Pi – Po = \(\frac{4s}{r}\)
ఇక్కడ s = తలతన్యత
r = సబ్బు బుడగ వ్యాసార్థం

ప్రశ్న 9.
జలసంసక్తకాలు (water wetting agents), జలఅసక్తకాలు (water proofing agents) అంటే ఏమిటి? అవి ఏమిచేస్తాయి?
జవాబు:
నీరు, ఫైబర్ల మధ్య ఉండే స్పర్శకోణాన్ని పెంచేందుకై ద్రవాలకు జలజితద్రవ్యాలను (water proofing agents) కలుపుతారు.

సబ్బులు, డిటర్జెంట్లు, రంగులద్దే ద్రవ్యాలు ఇవన్నీకూడా జల సంసక్తకాలు (wetting agents) . వీటిని ద్రవానికి కలిపినప్పుడు స్పర్శకోణం తక్కువై అవి ద్రవంలోకి తేలిగ్గా చొచ్చుకొనిపోయి ప్రభావవంతం అవుతాయి.

ప్రశ్న 10.
స్పర్శకోణం అంటే ఏమిటి?
జవాబు:
ఘనతలం, ద్రవము కలిసే బిందువు వద్ద ద్రవ అంతర్భాగంలో ద్రవతలానికి గీసిన స్పర్శరేఖకు, ద్రవంలో ఘనతలానికి మధ్యగల కోణమును స్పర్శకోణము (9) అంటారు.

ప్రశ్న 11.
బెర్నౌలీ సిద్ధాంతాన్ని పాటించే వాటికి రెండు ఉదాహరణలను ఇవ్వండి. ఆయా ఉదాహరణలను సమర్ధించండి.
జవాబు:
1) బలమైన గాలులు వీచినప్పుడు, ఇంటి పై కప్పులు ఎగిరిపోతాయి. గాలివేగం ఇంటి కప్పుపై భాగంలో ఇంటి లోపలి కన్నా ఎక్కువ. అందువల్ల ఇంటి కప్పు పైన పీడనం తక్కువ. ఇంటిలోపల పీడనం ఎక్కువ. ఈ పీడనాలలో తేడా వల్ల గతిక’ ఉత్థాపన కలుగుతుంది.

2) ఫ్యాన్ తిరుగుచున్నప్పుడు, బల్లపై కాగితాలు ఎగిరిపోతాయి. కాగితంపై భాగంలో గాలివేగం పెరుగుతుంది. అందువల్ల పీడనం తగ్గుతుంది. ఈ పీడనాలలో తేడావల్ల కాగితంపైకి ఎగురుతుంది.

AP Inter 1st Year Physics Study Material Chapter 11 ప్రవాహుల యాంత్రిక ధర్మాలు

ప్రశ్న 12.
ఒక గొట్టం ద్వారా నీరు ప్రవహిస్తున్నప్పుడు ఆ నీటి ప్రవాహంలో ఏ పొర అత్యధిక వేగంతో ప్రవహిస్తుంది? ఏ పొర అత్యల్ప వేగంతో ప్రవహిస్తుంది?
జవాబు:
AP Inter 1st Year Physics Study Material Chapter 11 ప్రవాహుల యాంత్రిక ధర్మాలు 1
గొట్టం గుండా నీరు ప్రవహిస్తున్నప్పుడు, అక్షానికి దగ్గరగా ఉన్న పొరలో వేగం అధికంగాను, గొట్టం గోడల వద్ద వేగం నెమ్మదిగాను ఉంటుంది.

ప్రశ్న 13.
ఒక వస్తువు యొక్క ఉపరితల వైశాల్యం ఎక్కువైనప్పుడు దాని చరమవేగం (Terminal velocity) కూడా అధికంగా ఉంటుంది. మీ సమాధానాన్ని సమర్ధించే కారణాలను తెలపండి.
జవాబు:
ఉపరితల వైశాల్యం (A) = 4πr²
మరియు చరమవేగం (υt) α r²
ఉపరితల వైశాల్యం పెరిగితే, r² కూడా పెరుగుతుంది. అందువల్ల చరమవేగం కూడా పెరుగుతుంది.
∴ ఉపరితల వైశాల్యం పెరిగితే, చరమవేగం కూడా అధికం.

స్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
వాతావరణ పీడనం అంటే ఏమిటి ? భారమితి (బారో మీటర్) సహాయంతో దీన్ని ఎలా నిర్ధారిస్తారు?
జవాబు:
వాతావరణ పీడనం :
ఏదైనా ఒక బిందువు వద్ద వాతావరణ పీడనం, ఆ బిందువు నుండి విస్తరిస్తూ వాతావరణపు పై అంచుదాకా కొనసాగే ఏకాంక మధ్యచ్ఛేద వైశాల్యం గల వాయుస్తంభం యొక్క బరువుకు సమానం.
వాతావరణ పీడనం (1 atm): 1.013 × 105 pa
AP Inter 1st Year Physics Study Material Chapter 11 ప్రవాహుల యాంత్రిక ధర్మాలు 2

భారమితి ద్వారా వాతావరణ పీడనాన్ని కనుగొనుట :
ఒక కొనవైపు మూసి ఉన్నటువంటి ఒక గాజు గొట్టంలో పాదరసాన్ని నింపి, దానిని ఒక పాదరసం తొట్టిలో పటంలో చూపిన విధంగా బోర్లిస్తారు. ఈ పరికరాన్నే పాదరస భారమితి అంటారు. గొట్టంలో నిలిచిన పాదరస స్తంభం ఎగువన ఉన్న ప్రదేశంలో ఉండేదల్లా పాదరస బాష్పం మాత్రమే. దీని పీడనం ఎంత అల్పంగా ఉంటుందంటే, దాన్ని మనం ఉపేక్షించవచ్చు.
స్తంభం లోపల ఒక బిందువు A వద్ద ఉన్న పీడనం, అదే మట్టం వద్ద ఉన్న బిందువు B వద్ద ఉండే పీడనంతో సమానం అయి తీరుతుంది.

∴ B బిందువు వద్ద పీడనం వాతావరణ పీడనం = Pa

Pa = ρgh = A బిందువు వద్ద పీడనం
ρ అనునది పాదరస సాంద్రత, h అనునది గొట్టంలోని పాదరస స్తంభం ఎత్తు.

బారోమీటరులో పాదరస స్తంభం ఎత్తు సముద్ర మట్టం వద్ద 76cm ఉంటుందని ఈ ప్రయోగం ద్వారా కనుక్కొన్నారు. ఈ ఎత్తు ఒక అట్మాస్ఫియర్ (1 atm) కు తుల్యమైంది.

ప్రశ్న 2.
గేజ్ పీడనం అంటే ఏమిటి ? మానోమీటర్ సహాయంతో పీడన వ్యత్యాసాన్ని ఎలా కనుక్కొంటారు?
జవాబు:
గేజ్ పీడనం :
నిజ పీడనానికి మరియు వాతావరణ పీడనానికి గల తేడాను గేజ్ పీడనం అంటారు.
AP Inter 1st Year Physics Study Material Chapter 11 ప్రవాహుల యాంత్రిక ధర్మాలు 3

పీడనంలో తేడాలను కొలుచుట :

  1. మానోమీటరులోని U- గొట్టంలో తక్కువ పీడన తేడాలు కొలవడానికి అల్ప సాంద్రతగల ద్రవాన్ని (నూనె) మరియు అధిక పీడన తేడాలు కొలవడానికి అధిక సాంద్రత గల ద్రవాన్ని నింపాలి.
  2. గొట్టం ఒక కొనకు గాలిపీడనం కొలవవలసిన పాత్ర D ను కలపాలి. మరియు రెండు కొన తెరచి ఉంచాలి.
  3. D పాత్రలో భూమి వాతావరణ పీడనం కన్నా గాలి పీడనం అధికంగా ఉంటే భుజం I వైపు ద్రవమట్టం 4 బిందువు కన్నా క్రిందకు ఉంటుంది. భుజం II లో C బిందువు కన్నా పైకి ఉంటుంది.
  4. పాత్రలో పీడనం, A బిందువు వద్ద పీడనానికి సమానం.
  5. U- గొట్టంలోని రెండు భుజాలలో ద్రవమట్టాలలో తేడాలను గుర్తించాలి. (h అనుకొనుము). ρ అనునది ద్రవం యొక్క సాంద్రత. Pa అనునది వాతావరణ పీడనం.
  6. A బిందువు వద్ద పీడనం (PA) =B బిందువు వద్ద పీడనం = C బిందువు వద్ద పీడనం + ద్రవ స్థంభం యొక్క పీడనం
    PA = PC + hρg (లేదా) PA – PC = hρg
    ఇక్కడ PC = Pa PA = P
    ∴ P – P = hρg
    P – Pa = Pg = పీడన కొలత = hρg

ప్రశ్న 3.
పాస్కల్ నియమాన్ని తెలిపి ఒక ప్రయోగం సహాయంతో దాన్ని నిరూపించండి.
జవాబు:
పాస్కల్ నియమం :
ఈ నియమం ప్రకారం, గురుత్వాకర్షణ ప్రభావంను విస్మరిస్తే, సమతాస్థితిలో నిశ్చలంగా ఉన్నప్పుడు ద్రవం యొక్క ప్రతిబిందువుపై పీడనం ఒకేవిధంగా ఉంటుంది.
AP Inter 1st Year Physics Study Material Chapter 11 ప్రవాహుల యాంత్రిక ధర్మాలు 4

నిరూపణ :

  1. ఏకరీతి అడ్డుకోత వైశాల్యం A కల ఒక వృత్తాకార స్థూపాన్ని ఊహించండి మరియు C, D బిందువులు ఆ స్థూపంపై ఉన్నాయనుకొనుము.
  2. స్థూపం వెలుపలి వైపు ద్రవం కలిగించే బలాల వల్ల స్థూపంలోపల ద్రవం సమతాస్థితిలో ఉంటుంది.
  3. ఈ బలాలు స్థూపం యొక్క తలంపై లంబంగా పనిచేస్తాయి.
  4. అందువలన Cమరియు D బిందువుల వద్ద స్థూపం యొక్క చదునుతలాలపై పనిచేసే బలం, స్థూపం యొక్క వక్రతలంపై పనిచేసే బలానికి లంబంగా ఉంటుంది.
  5. ద్రవం సమతాస్థితిలో వున్నప్పుడు, స్థూపం యొక్క వక్రతలంపై పనిచేసే బలాల మొత్తం శూన్యం.
  6. P1 మరియు P2 లు C మరియు D బిందువుల వద్ద పీడనాలు. F1 మరియు F2 లు ద్రవం వలన స్థూపం యొక్క చదును తలాలపై పనిచేసే బలాలు అయిన
    F1 = P1 A మరియు F2 = P2A ద్రవం సమతాస్థితిలో ఉంది కాబట్టి
    F1 = F2
    P1 A = P2A (లేదా) P1 = P2

దీనర్థం C మరియు D బిందువుల వద్ద పీడనాలు ఒకే విధంగా ఉన్నాయి. ఇది పాస్కల్ నియమాన్ని ఋజువు చేస్తుంది.

AP Inter 1st Year Physics Study Material Chapter 11 ప్రవాహుల యాంత్రిక ధర్మాలు

ప్రశ్న 4.
హైడ్రాలిక్ లిఫ్ట్, హైడ్రాలిక్ బ్రేక్లను వివరించండి.
జవాబు:
హైడ్రాలిక్ లిఫ్ట్ మరియు హైడ్రాలిక్ బ్రేకులు పాస్కల్ నియమంపై ఆధారపడి పనిచేస్తాయి.
AP Inter 1st Year Physics Study Material Chapter 11 ప్రవాహుల యాంత్రిక ధర్మాలు 5

హైడ్రాలిక్ లిఫ్ట్ :
ఇక్కడ వేరు వేరు వైశాల్యాలు గల మరియు D అను రెండు స్థూపాలు ఉంటాయి. వాటిని E గొట్టం ద్వారా కలుపుతారు. ప్రతి స్థూపం ఘర్షణ లేని గాలిబంధిత ముషలకాన్ని కలిగి ఉంటుంది. a మరియు A అనునవి C మరియు D వద్ద ముషలకం అడ్డుకోత వైశాల్యాలు అనుకొనుము (a <<A). ఈ స్థూపాలలో అసంపీడ్య ద్రవాన్ని నింపాలి. f అనునది C వద్ద కలిగించే బలం. ద్రవంపై కలిగే పీడనం P = \(\frac{f}{a}\) …………. (1)
పాస్కల్ నియమం ప్రకారం, ఈ పీడనం D స్థూపంలోని ముషలకానికి ప్రసరిస్తుంది. D వద్ద ఊర్థ్వబలం
F = PA = \(\frac{f}{a}\)A = f\(\frac{A}{a}\) ………….. (2)
A >> a కాబట్టి, F > > f

కాబట్టి పెద్ద స్థూపంపై ఉంచిన పెద్ద బరువులను తేలికగా లేపవచ్చు.
AP Inter 1st Year Physics Study Material Chapter 11 ప్రవాహుల యాంత్రిక ధర్మాలు 6

హైడ్రాలిక్ బ్రేకులు :
బ్రేక్ ఫెడల్పై మనం స్వల్ప బలాన్ని ప్రయోగిస్తే, మాస్టర్ స్థూపంలోని ముషలకం కదులుతుంది. P వద్ద ద్రవంపై పీడనం పెరుగుతుంది. పాస్కల్ నియమం ప్రకారం P1 మరియు P2 స్థూపాలకు పీడనం సమానంగా ప్రసరిస్తుంది. ఈ కారణం చేత P1 మరియు P2 బయటకు జరిగి, బ్రేక్ షూలు వ్యాకోచం చెంది చక్రం యొక్క లోపలి రిమ్మును గట్టిగా ఒడిసిపట్టుకుంటాయి. ఈవిధంగా హైడ్రాలిక్ బ్రేకులు పనిచేస్తాయి.

ప్రశ్న 5.
ద్రవస్థితిక విరోధభాసం (hydrostatic paradox) అంటే ఏమిటి?
జవాబు:
AP Inter 1st Year Physics Study Material Chapter 11 ప్రవాహుల యాంత్రిక ధర్మాలు 7
మూడు పాత్రలు A, B, C లు భిన్న ఆకారాలు కలిగి ఉన్నాయి. వాటి అడుగుభాగాన్ని ఒక క్షితిజ సమాంతర గొట్టం సంధానం చేస్తోంది. వాటిని నీటితో నింపినప్పుడు ఆ మూడు పాత్రలలోను నీటిమట్టం వాటిలో నిలిచి ఉన్న నీటి మొత్తాలు భిన్నమైనప్పటికీ, ఒకటిగానే ఉంది. ఇలా ఎందుకు జరుగుతుందంటే, పాత్ర యొక్క ఒక్కొక్క భాగం అడుగులో నీరు కలిగించే పీడనం సమానంగా ఉంటుంది. దీనినే ద్రవస్థైతిక విరోధ భాసం అంటారు.

ప్రశ్న 6.
లోతుతో పీడనం ఎలా మారుతుందో వివరించండి.
జవాబు:
పాత్రలో ప్రవాహి నిశ్చలస్థితిలో ఉందనుకొనుము. పటంలో బిందువు 1, బిందువు 2 కన్నా h ఎత్తులో ఉంది. 1 మరియు 2 బిందువుల వద్ద పీడనాలు P1 మరియు P2. ప్రవాహి నిశ్చలంగా ఉంది కాబట్టి, క్షితిజ సమాంతర బలాలు శూన్యం. ఫలిత క్షితిజ లంబ బలాలు, భారానికి సమానం. పైతలం వద్ద పీడనం క్రిందకు పనిచేస్తుంది (P1A), అడుగున పీడనం (P2A) పైకి పనిచేస్తుంది.
(P2 – P1) A = mg …………… (1)
ప్రవాహి యొక్క ద్రవ్యరాశి (m) = ρv = ρhA
(P2 – P1) = ρgh …………. (2)

పీడనాలలో తేడా క్షితిజ లంబ ఎత్తు h పై ఆధారపడుతుంది.

ఇప్పుడు బిందువు 1ని ప్రవాహి (నీరు) ఊర్థ్వతలంపైకి మారిస్తే, అది తెరచి ఉంది కనుక P1 కి బదులుగా వాతావరణ పీడనం (Pa) ని మరియు P2 కి బదులుగా P ని మారిస్తే,
సమీకరణం (2) నుండి, P – Pa = ρgh
P = Pa + ρgh

ద్రవం అడుగున పీడనం P, తెరచిన చోట ద్రవం యొక్క వాతావరణ పీడనం కన్నా ρgh పీడనం అధికంగా ఉంటుంది.

ప్రశ్న 7.
టోరిసెల్లి నియమం అంటే ఏమిటి? ఒక ప్రయోగంతో బహిస్రావం (efflux) వడిని ఎలా నిర్ధారిస్తారో వివరించండి.
జవాబు:
టోరిసెల్లి నియమం :
బహిస్రావం (efflux) అనే పదానికి అర్థం ప్రవాహి బయటకు వెళ్ళడం. ఒక తెరచిన తొట్టి (టాంక్) నుంచి ఉండే బహిస్రావ వడి స్వేచ్ఛగా కిందకు పడుతున్నపుడు వర్తించే ఫార్ములాకు సరిసమానమైన రూపాన్ని కలిగి ఉంటుంది. దీనినే టోరిసెల్లి నియమం అంటారు.

ρ సాంద్రత గల ఆదర్శద్రవం టాంక్లో నింపబడినది అనుకొనుము. ఆ టాంక్కు సన్నని రంధ్రం కలదు.
AP Inter 1st Year Physics Study Material Chapter 11 ప్రవాహుల యాంత్రిక ధర్మాలు 8
Oబిందువు నుండి ద్రవం యొక్క ఎత్తు h అనుకొనుము.
P = వాతావరణ పీడనం
V = రంధ్రం వద్ద ప్రవాహ వేగం
A మరియు O వద్ద బెర్నూలీ సిద్ధాంతంను అన్వర్తించగా
(P + ρgh + O)Aవద్ద = (P + 0 + \(\frac{1}{2}\)ρν²)Oవద్ద
P + ρgh = P + \(\frac{1}{2}\)ρν² ⇒ ρgh = \(\frac{1}{2}\)ρν²
V = √2gh

ప్రశ్న 8.
వెంటూరి – మీటర్ అంటే ఏమిటి ? దీన్ని ఎలా ఉపయోగిస్తారో వివరించండి.
జవాబు:
AP Inter 1st Year Physics Study Material Chapter 11 ప్రవాహుల యాంత్రిక ధర్మాలు 9
వెంటురి-మీటర్ :
అసంపీడ్య ప్రవాహి యొక్క ప్రవాహ వడిని కొలిచే సాధనమే వెంటురి-మీటర్.

  1. ఒక విశాలమైన వ్యాసంతో, మధ్యలో ఒక చిన్న నొక్కును కలిగి ఉన్న ఒక గొట్టాన్ని ఈ వెంటురి- మీటర్ కలిగి ఉంటుంది.
  2. U- ఆకారంలో ఉన్న ఒక మానోమీటర్ దీనికి అనుసంధానించి ఉంటుంది. మానోమీటర్ యొక్క ఒక భుజం వెంటురి మీటర్ గొట్టం యొక్క వెడల్పాటి మెడ వైశాల్యం కలిగిన కొనకు, మరోభుజం వెంటురి మీటరు మధ్య భాగంలో ఉన్న నొక్కుకు కలపబడి ఉంటాయి.
  3. మానోమీటర్లో p సాంద్రతగల ఒక ద్రవం ఉంటుంది.
  4. పీడన వ్యత్యాసం, ఇరుకైన కొనవద్ద కలిపిన U-గొట్టంలోని ప్రవాహి మట్టం మిగతా భుజంలోని ప్రవాహి మట్టం కంటే పెరిగేటట్లు చేస్తుంది.
  5. వడపోతచేసే పంపులు, సుగంధ ద్రవ్యాలను వెదజల్లడానికి ఉపయోగించే స్ప్రేయర్లు, ఆటోమొబైల్స్లో ఉండే కార్బ్యురేటర్లు అన్నీ ఈ సూత్రంపైనే ఆధారపడి పనిచేస్తాయి.

AP Inter 1st Year Physics Study Material Chapter 11 ప్రవాహుల యాంత్రిక ధర్మాలు

ప్రశ్న 9.
రెనాల్డ్స్ సంఖ్య అంటే ఏమిటి? దాని ప్రాముఖ్యత ఏమిటి?
జవాబు:
రెనాల్డ్స్ సంఖ్య :
గొట్టంలో ప్రవహించే ద్రవాల స్వభావాలను తెలిపే సంఖ్యను రెనాల్డ్స్ సంఖ్య అంటారు.
రెనాల్డ్స్ సంఖ్య (Re) = \(\frac{\rho v \mathrm{~d}}{\eta}\)
ఇక్కడ p అనునది ప్రవాహి సాంద్రత
V అనునది ప్రవాహి వేగం, d అనునది గొట్టం యొక్క వ్యాసం
i) Re < 1000 అయితే ప్రవాహం ధారా రేఖాప్రవాహం (లేదా) స్తరీయంగా ఉంటుంది.
ii) Re > 2000 అయితే సంక్షుబ్ధ ప్రవాహం.
iii) 1000 < Re < 2000 అయితే ప్రవాహం ధారారేఖ, సంక్షుభ్ర దశలమధ్య మారుతూ ఉంటుంది.

రెనాల్డ్స్ సంఖ్య యొక్క భౌతిక ప్రాముఖ్యత :
ప్రమాణ వైశాల్యంలో జఢత్వ బలానికి, స్నిగ్ధతా బలానికి గల నిష్పత్తి రెనాల్డ్స్ సంఖ్యను సూచిస్తుంది.
AP Inter 1st Year Physics Study Material Chapter 11 ప్రవాహుల యాంత్రిక ధర్మాలు 10

ప్రశ్న 10.
గతిక ఉత్థాపనాన్ని ఉదాహరణలతోసహా వివరించండి.
జవాబు:
గతిక ఉత్థాపన :
వస్తువు ప్రవాహి గుండా ప్రయాణించినప్పుడు, దానిపై పనిచేసే ఊర్థ్వబలాన్ని గతిక ఉత్థాపన అంటారు.
AP Inter 1st Year Physics Study Material Chapter 11 ప్రవాహుల యాంత్రిక ధర్మాలు 11

ఉదా :
పటం (a)లో బంతి స్పిన్ రహితంగా ఒక ప్రవాహికి సాపేక్షంగా చలిస్తున్న బంతిపైభాగంలోను, కిందిభాగంలోను ధారారేఖలు సమానంగా విస్తరించి ఉంటాయి. బంతిపై భాగంలోను, కిందిభాగంలోను వేగం ఒకేవిధంగా ఉండి, పీడనాలలో తేడా శూన్యం అవుతుంది. అందువల్ల బంతి మీద ఊర్థ్వంగాకాని, అధోముఖంగా కాని ఏవిధమైన బలం పనిచేయదు.

పటం (b)లో బంతి స్పిన్ గమనంలో ఉన్నప్పుడు ధారారేఖలు బంతి పైభాగంలో అధికంగాను, కిందిభాగంలో తక్కువగాను వ్యాపిస్తాయి. బంతి పైభాగంలో వేగం (v + v) అధికంగాను, కిందిభాగంలో వేగం (v – v.) తక్కువగాను ఉంటుంది. దీనివలన కింద, పైతలాలపై పీడనాలలో తేడా ఏర్పడుతుంది. బంతిపై భాగంలో పీడనం తక్కువగాను, కిందిభాగంలో పీడనం ఎక్కువగాను ఉంటుంది. కాబట్టి బంతిపై నికర ఊర్ధ్వాభిముఖ బలం పనిచేస్తుంది.

ఉదా 2 :
విమానం రెక్కపై కూడా గతిక ఉత్థాపన పనిచేస్తుంది.

ప్రశ్న 11.
తలతన్యత, తలశక్తులను వివరించండి. [Mar. ’13]
జవాబు:
తలతన్యత(S) :
ద్రవతలంపై ఒక సరళరేఖను ఊహించినపుడు, ద్రవతలంపై ఏకాంక పొడవుపై, ఆ పొడవుకు లంబంగా పనిచేసే బలాన్ని తలతన్యత అంటారు.
T = \(\frac{F}{l}\)
S.I ప్రమాణం → N/m
మితిసూత్రం → [MT-2]

ఉపరితలశక్తి (E) :
అణుబలాలవల్ల ప్రమాణవైశాల్యంలో గల అధిక స్థితిజ శక్తిని ఉపరితలశక్తి అంటారు.
AP Inter 1st Year Physics Study Material Chapter 11 ప్రవాహుల యాంత్రిక ధర్మాలు 12

ఒక క్షితిజ సమాంతర ద్రవపు పొరను పరిగణించండి. ఈ పొర సమాంతర సూచికల మీదుగా జారగలిగే స్వేచ్ఛ ఉన్న దండం వద్ద అంతమవుతుంది. ఒకవేళ మనం దండాన్ని d అనే స్వల్పదూరం జరిపామనుకొందాం. అప్పుడు పొర తల వైశాల్యం పెరుగుతుంది. కాబట్టి, ఈ వ్యవస్థ ఇంతకు ముందు కంటే ఎక్కువ శక్తిని కలిగి ఉంటుంది. అంటే ఒక అంతర్గత బలానికి వ్యతిరేకంగా కొంతపని జరిగిందని అర్థం. ఈ అంతర్గతబలం F అనుకొందాం.
జరిగిన పని (W) = F.d

ఆ పొర యొక్క ఏకాంక వైశాల్యానికి తలశక్తి S అయితే అదనంగా కలిగిన వైశాల్యం 2dl. ద్రవానికి రెండు తలాలు ఉంటాయి.

అదనపు శక్తి S (2dl) = Fd
S = \(\frac{F}{2l}\)

ద్రవ ఉమ్మడి తలం యొక్క ఏకాంక వైశాల్యానికి గల తలశక్తి ఈ తలతన్యతకు సమానం. అంతేగాక, కదలడానికి వీలున్న దండం ఏకాంక పొడవుపై ప్రవాహి ప్రయోగించే బలానికి కూడా తలతన్యత సమానమవుతుంది.

ప్రశ్న 12.
ప్రయోగాత్మకంగా తలతన్యతను కనుక్కొనే విధానాన్ని వివరించండి.
జవాబు:
AP Inter 1st Year Physics Study Material Chapter 11 ప్రవాహుల యాంత్రిక ధర్మాలు 13
ఒక చదునైన నిట్టనిలువు గాజుపలక, దానికింద ఏదో ఒక ద్రవమున్న పాత్ర ఉన్నప్పుడు, అది త్రాసుయొక్క ఒక భుజంగా రూపొందుతుంది. ఈ గాజుపలక క్షితిజ సమాంతర అంచుపాత్రలోని నీటికి కొద్దిగా పైన ఉన్నప్పుడు, దాన్ని త్రాసు మరో చివరన ఉంచిన బరువులు సంతులనం చేస్తాయి. ఇప్పుడు గాజుపలక అంచుకు కొద్దిగా మాత్రమే ద్రవం తగిలేవరకు పాత్రను కొంచెం పైకి ఎత్తుతారు. అప్పుడు ఆ ద్రవం, దాని తలతన్యతమూలంగా గాజుపలకను కొంచెం కిందకు లాగుతుంది. గాజుపలక, నీటిని తప్పించుకొని కొంచెం పైకి వచ్చేవరకు రెండో చివర బరువులను వేస్తూపోతారు. అదనంగా వేసిన బరువును W అనుకొందాం. ద్రవం – గాలి ఉమ్మడితలం యొక్క ‘తలతన్యత
Sla = \(\frac{w}{2l}\frac{mg}{2l}\)

ఇక్కడ m అదనపు ద్రవ్యరాశి, l గాజుపలక అంచుపొడవు.

దీర్ఘ సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
బెర్నౌలీ సూత్రాన్ని తెలపండి. ఒక గొట్టంలో ప్రవహిస్తున్న శక్తి నిత్యత్వ నియమాన్ని అనువర్తించి బెర్నౌలీ సమీకరణాన్ని రాబట్టండి. బెర్నౌలీ సిద్ధాంతానికి ఒక అనువర్తనాన్ని ఇవ్వండి.
జవాబు:
బెర్నౌలీ సూత్రం :
గొట్టంలో స్థిరవేగంతో ప్రవహిస్తున్న స్నిగ్ధత లేని అసంపీడ్య ప్రవాహంలో ఏకాంక ఘనపరిమాణం గల ప్రవాహి పీడనశక్తి, గతిజశక్తి, స్థితిజశక్తి ఏ బిందువు వద్దనైనా స్థిరం. దీనినే బెర్నౌలీ సూత్రం అంటారు.

P + \(\frac{1}{2}\) ρv² + ρgh స్థిరం
AP Inter 1st Year Physics Study Material Chapter 11 ప్రవాహుల యాంత్రిక ధర్మాలు 14

i) ఒక గొట్టం గుండా స్నిగ్ధతారహితం, అసంపీడ్య ప్రవాహి ధారారేఖా ప్రవాహంలో ఉంది అనుకొనుము.

ii) BC మరియు DE అను రెండు ప్రాంతాలలో ప్రవాహాన్ని తీసుకుందాం. తొలిగా ప్రవాహి B మరియు D బిందువుల వద్ద ఉందనుకొనుము.

iii) ∆t కాలంలో, B బిందువు వద్ద ప్రవాహి వేగం V1 మరియు D బిందువు వద్ద వేగం V2 అనుకొనుము.

iv) ∆t కాలంలో B నుండి C కి ప్రవాహి ప్రయాణించిన దూరం V1 ∆t. అదేకాలంలో D నుండి Eకి ప్రవాహి ప్రయాణించిన దూరం V2∆t.

v) A1 మరియు A2 అడ్డుకోత వైశాల్యాల వద్ద పీడనాలు P1 మరియు P2 అనుకొనుము.

vi) ఎడమ చివర BC వద్ద ప్రవాహి మీద జరిగిన పని = బలం × స్థానభ్రంశం
= పీడనం × వైశాల్యం × స్థానభ్రంశం
= P1 A1 × V1 ∆t (∵ ∆V = A1V1∆t)
= P1 ∆V ………….. (1)

vii) కుడివైపు చివర DE వద్ద ప్రవాహి చేసిన పని
= P2 A2 × V2dt = P2 ∆V ………….. (2)

viii) ప్రవాహి పై జరిగిన పని ధనాత్మకం మరియు ప్రవాహి చేసిన పని ఋణాత్మకంగా తీసుకుంటే
మొత్తం పని (W) = (P1 – P2) ∆V ……………. (3)
ఈ పనిలో కొంత భాగం ప్రవాహి గతిజశక్తిలో మార్పుకు మిగిలిన భాగం స్థితిజశక్తిలో మార్పుకు ఉపయోగపడుతుంది.

ix) at కాలంలో గొట్టంలో ప్రవహించిన ప్రవాహి ద్రవ్యరాశి (Am)
= ρA1V1∆t
ఇక్కడ p అనునది ప్రవాహి యొక్క సాంద్రత
∆m = ρ∆V …………… (4)

x) గురుత్వ స్థితిజశక్తి ρg∆V (h2 – h1) …………… (5)
గతిజశక్తిలో మార్పు (∆K) = \(\frac{1}{2}\)ρ∆V (V²2 – V²1) …………..(6)

xi) శక్తి నిత్యత్వనియమం ప్రకారం
AP Inter 1st Year Physics Study Material Chapter 11 ప్రవాహుల యాంత్రిక ధర్మాలు 15
∴ ప్రమాణ ఘనపరిమాణంలో పీడనశక్తి, గతిజశక్తి మరియు స్థితిజశక్తుల మొత్తం స్థిరం.

బెర్నౌలీ సిద్ధాంతం అనువర్తనాలు:

  1. ఈ సిద్ధాంతం విమానం రెక్కపై గతిక ఉత్థాపనను వివరిస్తుంది.
  2. ఇది స్పిన్ గమనంలో ఉన్న క్రికెట్ బంతిపై గతిక ఉత్థాపనను వివరిస్తుంది.

AP Inter 1st Year Physics Study Material Chapter 11 ప్రవాహుల యాంత్రిక ధర్మాలు

ప్రశ్న 2.
స్నిగ్ధతా గుణకాన్ని నిర్వచించండి. స్టోక్స్ నియమాన్ని వివరించి, ఏ పరిస్థితులలో ఒక వర్షపు బిందువు చరమవేగం υtని పొందుతుందో వివరించండి. υtకి సమీకరణాన్ని ఇవ్వండి.
జవాబు:
స్నిగ్ధతా గుణకం (n) :
ప్రవాహి దిశకు లంబంగా ఉన్న పొరల మధ్య ఏకాంక వేగ ప్రవణత ఉన్నపుడు, ఏకాంక వైశాల్యంగల పొరల మీద పనిచేసే స్నిగ్ధతా బలాన్ని స్నిగ్ధతా గుణకం అంటారు.

AP Inter 1st Year Physics Study Material Chapter 11 ప్రవాహుల యాంత్రిక ధర్మాలు 16
S.I. ప్రమాణాలు → Nm-2 s (లేదా) PaS
C.G.S ప్రమాణాలు → పాయిజ్ (Poise)
మితిసూత్రం = [ML-1T-1]

స్టోక్స్ నియమం :
ఈ నియమం ప్రకారం గోళాకార వస్తువుపై పనిచేయు స్నిగ్ధతా బలం
i) ప్రవాహి స్నిగ్ధతా గుణకానికి (η)
ii) గోళాకార వస్తువు వ్యాసార్థం (r) కు
iii) వస్తువు యొక్క వేగం (v) కి అనులోమానుపాతంలో ఉంటుంది.
∴ F a ηrv
F = k ηrv

ఇక్కడ K అనునది అనుపాత స్థిరాంకం. ప్రయోగపూర్వకంగా దీని విలువను 67 గా కనుగొన్నారు.
∴ F = 6πηrv

మేఘాల నుండి గురుత్వాకర్షణ బలాల వల్ల క్రిందకు పడే వర్షపు చినుకులు దాదాపు స్థిరవేగంతో భూమిని చేరతాయి. ఈ వేగాన్ని అంత్యవేగం అంటారు. అంత్య వేగాన్ని పొందిన తర్వాత, వర్షపు బిందువుపై ఫలితబలం శూన్యం. స్టోక్స్ నియమం ప్రకారం, F α ηrv
F = 6πηv (∵ K = 6π = అనుపాత స్థిరాంకం)
ρ మరియు r లు గోళాకార బిందువు సాంద్రత మరియు వ్యాసార్థాలు.
ప్రవాహి సాంద్రత σ అనుకొనుము.
గోళాకార బిందువు పై బలాలు
i) బిందువు భారం W = mg
W = Vρg = \(\frac{4}{3}\)πr³ρg ……………. (1)

ii) ఉత్తవన బలం (B) = V a g = \(\frac{4}{3}\)πr³ σg …………. (2)

iii) స్నిగ్ధతాబలం (f) = 6ηrν ………… (3)
గోళాకార ద్రవబిందువు అంత్యవేగాన్ని (vi) పొందితే, దానిపై ఫలితబలం శూన్యం.
∴ అంత్యవేగం వద్ద ఫలిత అధోబలం = ఫలిత ఊర్థ్వబలం
W = B + f, W – B = f
AP Inter 1st Year Physics Study Material Chapter 11 ప్రవాహుల యాంత్రిక ధర్మాలు 17

లెక్కలు (Problems)

ప్రశ్న 1.
0.6 cm వ్యాసంగల ఒక సబ్బు బుడగను ఊదేందుకు తలతన్యతా బలానికి వ్యతిరేకంగా చేయాల్సిన పనిని లెక్కించండి. (సబ్బు ద్రావణం తలతన్యత = 2.5 x 102 Nm−1).
సాధన:
D = 0.6 cm = 0.6 × 10-2
r = \(\frac{D}{2}=\frac{0.6 \times 10^{-2}}{2}\) = 0.3 × 10-2 m
S = 2.5 × 10-2 N/m
W = 8πr²s
= 8 × 3.14 × (0.3 × 10-2)² × 2.5 × 10
W = 5.652 × 10-6J

ప్రశ్న 2.
0.06 cm వ్యాసం గల గాజుగొట్టంలో మిథైల్ ఆల్కహాల్ ఎంత ఎత్తుకు ఎగబాకుతుంది? (మిథైల్ ఆల్కహాల్ తలతన్యత = 0.023 Nm-1, సాంద్రత gmcm-3. స్పర్శకోణాన్ని శూన్యంగా పరిగణించండి)
సాధన:
AP Inter 1st Year Physics Study Material Chapter 11 ప్రవాహుల యాంత్రిక ధర్మాలు 18

ప్రశ్న 3.
నీటిలో ముంచిన కేశనాళం వ్యాసార్ధం ఎంత ఉండే దానిలో నీరు 6 cm ఎత్తుకు ఎగబాకుతుంది? (నీటి తలతన్యత = 7.2 × 10-2 Nm-1)
సాధన:
h = 6 × 10-2 m, S = 7.2 × 10-2 N/m
నీటి యొక్క సాంద్రత (ρ) = 10³ kg/m³
AP Inter 1st Year Physics Study Material Chapter 11 ప్రవాహుల యాంత్రిక ధర్మాలు 19
r = 0.24 × 10-3
r = 0.24 m.m

ప్రశ్న 4.
0.4 mm వ్యాసంగల ఒక కేశనాళికను బీకరులో ఉన్న పాదరసంలో ముంచినప్పుడు, నాళంలోని ద్రవచంద్ర రేఖాకృతి (meniscus) లో కలిగే నిమ్నతను లెక్కించండి. (పాదరసం సాంద్రత 13.6 × 10³Kg m-3, పాదరసం తలతన్యత = 0.49 Nm -1, స్పర్శకోణం = 135°)
సాధన:
AP Inter 1st Year Physics Study Material Chapter 11 ప్రవాహుల యాంత్రిక ధర్మాలు 20
ఇక్కడ ఋణగుర్తు పాదరస మట్టం క్రిందకు పడిపోవుటను సూచిస్తుంది.

ప్రశ్న 5.
ఒక సబ్బు బుడగ వ్యాసం 10mm. దాని తలతన్యత 0.04 Nm-1. ఆ బుడగలోని అదనపు పీడనాన్ని కనుక్కోండి. [Mar. ’14]
సాధన:
D = 10 m.m
AP Inter 1st Year Physics Study Material Chapter 11 ప్రవాహుల యాంత్రిక ధర్మాలు 21

ప్రశ్న 6.
R వ్యాసార్ధం గల బుడగను రూపొందించేందుకు చేసిన పని W అయితే బుడగ వ్యాసార్ధం రెట్టింపు అయ్యేందుకు (2R అయ్యేందుకు) ఎంత శక్తి అవసరం?
సాధన:
R1 = R, R² = 2R
తొలి పని (W) = 8πR²s
తుది పని (W) = 8π[4R2² – R1² ]S
= 8π [4R² – R²]S
= 3 × 8π R²S
W’ = 3W

AP Inter 1st Year Physics Study Material Chapter 11 ప్రవాహుల యాంత్రిక ధర్మాలు

ప్రశ్న 7.
R1, R2 వ్యాసార్థాలు గల రెండు సబ్బు బుడగలు శూన్యంలో సమోష్ణోగ్రతా ప్రక్రియ పరిస్థితులో కలిసిపోయి ఒక బుడగను ఏర్పరచాయి. ఆ కొత్త బుడగ వ్యాసార్ధం ఎంత? సబ్బు ద్రావణం తలతన్యతను T గా తీసుకోండి.
సాధన:
R1, R2 మరియు R అనునవి మొదటి, రెండవ మరియు ఫలిత బుడగల వ్యాసార్థాలు అనుకొనుము. సబ్బు బుడగలు శూన్యంలో కలిస్తే, ఉపరితల శక్తి మారదు.
AP Inter 1st Year Physics Study Material Chapter 11 ప్రవాహుల యాంత్రిక ధర్మాలు 22

అదనపు లెక్కలు (Additional Problems)

ప్రశ్న 1.
ఎందుకో వివరించండి
a) మనిషి శరీరంలో పాదాల వద్ద రక్తపీడనం మెదడు వద్ద కంటే ఎక్కువ.
b) భూమి నుంచి 100km కంటే ఎక్కువగా వాతా వరణం ఉన్నప్పటికీ 6 km ఎత్తువద్ద వాతావరణ పీడనం, సముద్రమట్టం వద్ద ఉండే వాతావరణ పీడనంలో సగం ఉంటుంది.
c) బలాన్ని, వైశాల్యంతో భాగిస్తే వచ్చేదే పీడనం అయినప్పటికీ ఈ ద్రవస్థితిక పీడనం ఒక అదిశరాశి.
సాధన:
a) మానవ శరీరంలో రక్తం స్తంభం ఎత్తు, మెదడు కన్నా అడుగు ఎత్తులో ఎక్కువగా ఉండాలి. అందుకు కారణం, అడుగు ఎత్తులో ఉండుటవల్ల రక్తం అధిక పీడనాన్ని కలిగిస్తుంది.

b) భూమి ఉపరితలం వద్ద గాలి సాంద్రత అధికంగా ఉంటుంది. ఎత్తుకు పోయేసరికి అది తగ్గుతుంది. సముద్ర మట్టానికి 6 km ఎత్తుకు పోయేసరికి అది దాదాపు సగానికి తగ్గుతుంది. 6 km ఎత్తు దాటిన తర్వాత, గాలి సాంద్రత ఎత్తుతో పాటు నెమ్మదిగా తగ్గుతుంది. ఈ కారణం చేత సముద్రమట్టం నుండి 6 km ఎత్తుకు పోయేసరికి, వాతావరణ పీడనం దాదాపు సగానికి తగ్గుతుంది.

c) ద్రవంపై బలాన్ని కలిగిస్తే, ఆ పీడనం అన్ని దిశలలో సమానంగా ప్రసరిస్తుంది. అందుకని ద్రవం వల్ల కలిగే పీడనానికి దిశ ఉండదు. కాబట్టి ద్రవపీడనం అదిశరాశి.

ప్రశ్న 2.
ఎందుకో వివరించండి.
a) గాజుతోపాదరసం స్పర్శకోణం గురుకోణం కాని నీటితో లఘుకోణం.
b) శుభ్రమైన గాజుపలక తలంపై వేసిన నీరు దానిపై వ్యాపించడానికి ప్రయత్నిస్తుంది. కాని పాదరసం అయితే బిందువులుగా ఏర్పడటానికి ప్రయత్నిస్తుంది. (దీన్నే ఇంకోరకంగా చెప్పాలంటే, నీరు గాజును తడుపుతుంది. కాని పాదరసం గాజును తడపలేదు.)
c) ఒక ద్రవం తలతన్యత ఆ తలవైశాల్యంపై ఆధారపడి ఉండదు.
d) డిటర్జంట్ కలిపిన నీరు తక్కువ స్పర్శకోణాలను కలిగి ఉంటుంది.
e) బాహ్య బలాలకు లోనుకానటువంటి ద్రవబిందువు ఎప్పుడూ గోళాకారాన్నే కలిగి ఉంటుంది.
సాధన:
a) ఒక ఘనపదార్థంపై కొద్దిగా ద్రవాన్ని పోస్తే, ద్రవం -గాలి, ఘనపదార్థం-గాలి మరియు ఘనపదార్థం- ద్రవం అనే మూడు అంతఃతలాలు ఏర్పడతాయి. ఈ మూడు తలాల తలతన్యతలు SLA, SSA మరియు SSL. θ అనునది ద్రవం మరియు ఘనపదార్థం మధ్య స్పర్శ కోణం. ఈ మూడు తలాలు కలిసేచోట అణువులు సమతాస్థితిలో ఉంటాయి. దాని అర్థం ఫలిత బలం శూన్యం. 0 వద్ద సమతాస్థితిలో ఉన్న అణువుకు
AP Inter 1st Year Physics Study Material Chapter 11 ప్రవాహుల యాంత్రిక ధర్మాలు 23

పాదరసం-గాజులో, SSA < SSL, ఇక్కడ cos θ ఋణాత్మకం. (లేదా) θ > 90° అనగా గురుకోణం. నీరు-గాజు తలానికి SSA > SSL ఇక్కడ cos θ ధనాత్మకం (లేదా) θ < 90° అనగా లఘుకోణం.

b) పాదరసం-గాజులో స్పర్శకోణం గురుకోణం. ఈ గురుకోణాన్ని పొందడానికి పాదరసం బిందువుగా ఏర్పడుతుంది. నీరు-గాజుకు స్పర్శకోణం లఘు కోణం. ఈ లఘుకోణాన్ని పొందడానికి నీరు విస్తరిస్తుంది.

c) ద్రవతలానికి గీసిన స్పర్శరేఖపై లంబంగా ప్రమాణ పొడవుపై పనిచేసే బలాన్ని ద్రవం యొక్క తలతన్యత అంటారు. బలం ద్రవతలం యొక్క వైశాల్యంపై ఆధారపడదు. కాబట్టి తలతన్యత కూడా ద్రవతల వైశాల్యంపై ఆధారపడదు.

d) వస్త్రాలలో సన్నని రంధ్రాలు కేశనాళికలవలే ఏర్పడతాయి. కేశనాళికలో ఎగబ్రాకే ద్రవం cos eకు అనులోమాను పాతంలో ఉంటుంది. 8 స్వల్పం అయితే cos 8 అధికం. కాబట్టి కేశనాళికీయత పెరిగి వస్త్రం లోకి సబ్బు త్వరగా చొచ్చుకుపోతుంది.

e) బాహ్యబలాలు పని చేయనప్పుడు, తలతన్యత వల్ల ద్రవతలాలు కనిష్ట వైశాల్యాన్ని పొందుటకు ప్రయత్నిస్తాయి. గోళం యొక్క వైశాల్యం కనిష్టం కాబట్టి ద్రవబిందువులు గోళాకారంగా ఉంటాయి.

ప్రశ్న 3.
ప్రతి వాక్యానికి అనుబంధంగా ఇచ్చిన పదాలతో ఖాళీలను పూరించండి.
a) ద్రవాల తలతన్యత ఉష్ణోగ్రతతోపాటు సాధారణంగా.. (పెరుగుతుంది/తగ్గుతుంది)
b) వాయువులు స్నిగ్ధత ఉష్ణోగ్రతతోపాటు …. అదే ద్రవాల స్నిగ్ధత ఉష్ణోగ్రతతోపాటు….. (పెరుగుతుంది/ తగ్గుతుంది)
c) స్థితిస్థాపక ద్రుఢతా గుణకమున్న ఘనపదార్థాల విషయంలో విరూపణ బలం…., కు అనులోమాను పాతంలో ఉంటే ప్రవాహులకు …కు అనులోమాను పాతంలో ఉంటుంది (విరూపణ వికృతి/ విరూపణ వికృతిరేటు)
d) నిలకడ ప్రవాహి ప్రవాహంలో నొక్కు (ఇరుకైన) ప్రాంతంలో ప్రవాహి వడి పెరుగుతుందనేది… అనుసరించి (ద్రవ్యరాశి నిత్యత్వం / బెర్నౌలీ సూత్రం)
e) వాయుసొరంగం (wind tunnel) లో దూసుకు పోతున్న నమూనా విమానానికి సంక్షోభం ఉత్పన్నమయ్యే వేగం, వాస్తవ పరిస్థితులలో ఎగిరే నిజమైన విమానానికి సంక్షోభం ఉత్పన్నమయ్యే వేగం కంటే… (ఎక్కువ/తక్కువ).
సాధన:
a) తగ్గుతుంది

b) పెరుగుతుంది; తగ్గుతుంది.

c) విరూపణ వికృతి; విరూపణ వికృతిలో మార్పురేటు

d) ద్రవ్యరాశి నిత్యత్వం; బెర్నూలీ సిద్ధాంతం

e) అధికం

AP Inter 1st Year Physics Study Material Chapter 11 ప్రవాహుల యాంత్రిక ధర్మాలు

ప్రశ్న 4.
ఎందుకో వివరించండి
a) ఒక కాగితాన్ని క్షితిజ సమాంతరంగా ఉంచేందుకు నీవు గాలిని దాని కింద నుంచి కాక దానిపైన ఊదాలి.
b) ఒక కుళాయిని కట్టివేసేందుకు దాని మూతిని వేళ్లతో మూయడానికి ప్రయత్నిస్తే మన వేళ్ల మధ్య ఉన్న ఖాళీల నుంచి నీరు వేగంగా బయటకు చిమ్ముకొస్తుంది.
c) ఒక డాక్టరు ఇంజక్షన్ ఇస్తున్నప్పుడు అతడు తన బొటనవేలితో సిరంజిపై ప్రయోగించిన పీడనం కంటే ఆ సిరంజి సూది పరిమాణమే (size) మందు ప్రవాహరేటును అధికంగా ప్రభావితం చేస్తుంది.
d) పాత్రకు ముందువైపున్న ఒక చిన్న రంధ్రం ద్వారా ప్రవాహి వెలుపలికి ప్రవహించేటప్పుడు పాత్రపై ఒక అభిబలం వెనకకు పనిచేస్తుంది. e) ఆత్మభ్రమణం చెందే క్రికెట్ బంతి గాలిలో
పరావలయ పథాన్ని అనుసరించదు.
సాధన:
a) కాగితం మీద గాలిని ఊదితే, గాలివేగం పెరుగుతుంది మరియు దానిపై పీడనం తగ్గుతుంది. (బెర్నూలీ సిద్ధాంతం ప్రకారం), కాగితం అడుగున వాతావరణ పీడనం పని చేసి కాగితం క్షితిజ సమాంతరంగా నిలిచి ఉంటుంది.

b) నీటి జెట్ వైశాల్యం తగ్గితే, సాంతత్య సమీకరణం av = స్థిరం ప్రకారం నీటివేగం పెరుగుతుంది.

c) పాత్రలో చిన్న రంధ్రం గుండా ప్రవాహి బయటకు పోతే, అది ఎక్కువ వేగాన్ని పొందుతుంది మరియు ఎక్కువ ద్రవ్యవేగం ఉంటుంది. వ్యవస్థపై బాహ్యబలం పనిచేయకపోతే, ద్రవ్యవేగ నిత్యత్వ నియమం ప్రకారం పాత్ర తిరోవేగంను పొందుతుంది. దీని ఫలితంగా పాత్ర వలన ప్రచోదనం కలుగును.

d) ఇక్కడ సూది పరిమాణం, ప్రవాహ వేగాన్ని నియంత్రిస్తుంది. మరియు పీడనాన్ని బొటనవేలు పీడనం నియంత్రిస్తుంది. బెర్నూలీ సిద్ధాంతం ప్రకారం P + ρgh + \(\frac{1}{2}\)ρV² = స్థిరం. ఇక్కడ P కి ఘాతం ఒకటి మరియు Vకి ఘాతం రెండు. కాబట్టి వేగం ఎక్కువగా ప్రభావితం అవుతుంది. కాబట్టి అధిక ప్రవాహాన్ని నియంత్రించడానికి సూది ఉత్తమం. e) స్పిన్ గమనంలో ఉన్న బంతి వక్రమార్గంలో ఉంటుంది.

ప్రశ్న 5.
ఎత్తైన మడిమలుండే (heels) చెప్పులను ధరించిన 50 kg ల ద్రవ్యరాశి గల ఒక అమ్మాయి ఒంటి కాలిపై తనను తాను నిలబెట్టుకుంది. చెప్పు మడిమ 1.0cm. వ్యాసంతో వృత్తాకారంగా ఉంది. క్షితిజ సమాంతర నేలపై చెప్పు కలగచేసే పీడనం ఎంత?
సాధన:
AP Inter 1st Year Physics Study Material Chapter 11 ప్రవాహుల యాంత్రిక ధర్మాలు 24

ప్రశ్న 6.
టోరిచెల్లీ బారోమీటర్లో పాదరసాన్ని ఉపయోగించాడు. పాస్కల్ 984 kg m-3 సాంద్రత గల ఫ్రెంచి సారాయి (wine) తో టోరిచెల్లీ బారోమీటర్ను పోలి ఉండేటట్లు మరొక బారోమీటర్ను తయారుచేశాడు. సాధారణ వాతావరణ పీడనాన్ని సూచించే ద్రాక్ష సారాయి స్తంభం ఎత్తు ఎంత?
సాధన:
AP Inter 1st Year Physics Study Material Chapter 11 ప్రవాహుల యాంత్రిక ధర్మాలు 25

ప్రశ్న 7.
సముద్రతీర ప్రాంతంలో 109 Pa పీడనాన్ని తట్టుకోగల ఒక నిలువైన నిర్మాణాన్ని రూపొందించారు. సముద్రంలోని ఒక చమురు బావి శిఖర భాగంలో ఉంచడానికి ఈ నిర్మాణం అనువైనదేనా? సముద్రం లోతు దాదాపు 3 km అనుకోండి. సముద్ర ప్రవాహాలను ఉపేక్షించండి.
సాధన:
ఇక్కడ గరిష్ట ప్రతిబలం = 109Pa,
h = 3km = 3 × 10³ m;
p(నీటికి) = 10³kg/m³ మరియు g = 9.8 m/s²

చముర్తు బావిపైన ఉంచేందుకు ఇది తగిన నిర్మాణం, సముద్రపు నీరు కలిగించే పీడనం, గరిష్ట ప్రతిబలం కన్నా తక్కువ.

సముద్రపు నీరు వలన పీడనం P = hρg
3 x 10³ × 10³ x 9.8
= 2.94 × 107 Pa
గరిష్ట ప్రతిబలం 107 Pa కన్నా సముద్రపు నీరు పీడనం 2.94 × 107 Pa తక్కువ. కాబట్టి ఈ నిర్మాణమును చమురు బావి పైభాగంలో ఉంచవచ్చు.

ప్రశ్న 8.
గరిష్ఠంగా 3000 kg ద్రవ్యరాశి గల కార్లను ఎత్తగల హైడ్రాలిక్ లిఫ్ట్ను తయారుచేశారు. బరువులను ఎత్తే ముషలకం మధ్యచ్ఛేద వైశాల్యం 425 cm’ అయితే చిన్న ముషలకం భరించగల గరిష్ఠ పీడనం ఎంత?
సాధన:
పెద్ద ముషలకంపై పనిచేసే గరిష్ట బలం
F = 3000 kgf = 3000 × 9.8 N
∴ ముషలకం వైశాల్యం A = 425 cm²
= 425 × 10-4
∴ పెద్దముషలకంపై గరిష్ట పీడనం,
P = \(\frac{F}{A}=\frac{3000 \times 9.8}{425 \times 10^{-4}}\) = 6.92 × 105 Pa
ద్రవం, పీడనాన్ని సమానంగా ప్రసారం చేస్తుంది. కాబట్టి చిన్నముషలకం భరించే గరిష్ట పీడనం 6.92 × 105 Pa.

ప్రశ్న 9.
U- ఆకార గొట్టంలో పాదరసంతో వేరుచేసిన నీరు, మిథిలేటెడ్ స్పిరిట్ ద్రవస్తంభాలు ఇరువైపులా ఉన్నాయి. నీటిమట్టం 10.0 cm స్పిరిట్ మట్టం ఎత్తు 12.5cm ఉండే విధంగా రెండు భుజాల్లో పాదరస మట్టం ఉంది. స్పిరిట్ విశిష్ట గురుత్వం ఎంత?
సాధన:
U–గొట్టంలో ఒక భుజంలో నీటిస్తంభం ఎత్తు,
h1 10.0 cm; ρ1(సాంద్రత) = 1g cm-3
U-గొట్టంలో మరొకభుజంలో సారా స్తంభం ఎత్తు,
h2 = 12.5 cm; ρ1 = ?

U-గొట్టంలో పాదరస మట్టం రెండు భుజాలలో సమానంగా ఉంటుంది. కాబట్టి ప్రతిదానిపై కలిగే పీడనం సమానం.
AP Inter 1st Year Physics Study Material Chapter 11 ప్రవాహుల యాంత్రిక ధర్మాలు 26

ప్రశ్న 10.
ఇంతకు ముందు లెక్కలోని గొట్టంలోని సంబంధిత భుజాల్లో 15.0 cm మట్టం పెరిగే విధంగా నీరు, స్పిరిట్లను అదనంగా కలిపితే, రెండు భుజాల్లోని పాదరస మట్టాలలోని వ్యత్యాసం ఎంత? (పాదరసం విశిష్ఠ గురుత్వం = 13.6)
సాధన:
U- గొట్టంలో ప్రతి భుజంలో సారాను కలిగి ఉన్నప్పుడు, 15.0 cm ఎత్తున నీటిని పోస్తే, సారా కలిగిన భుజం వైపు పాదరస మట్టం పెరుగుతుంది. U-గొట్టం రెండు భుజాలలో పాదరస మట్టాలలో తేడా, ρ అనునది పాదరస సాంద్రత h cm పాదరస స్తంభం కలిగించే పీడనం నీరు మరియు సారా కలిగించే పీడనాలలో తేడా.
∴ hρg = h1ρ1g – h2ρ2g ………… (i)
ఇక్కడ h = ?; ρ =13.6 g cm-3
ρ1 = 1 g cm-3
ρ2 = 0.8 g cm-3
h1 = 15 + 10 = 25 cm
h2 = 15 + 12.5 = 27.5 cm

ఈ విలువలను (i)లో ప్రతిక్షేపించగా
h × 13.6 × g
= 25 × 1 × g – 27.5 × 0.8 x g = 3g
(లేదా) h 3/13.6 0.22cm

AP Inter 1st Year Physics Study Material Chapter 11 ప్రవాహుల యాంత్రిక ధర్మాలు

ప్రశ్న 11.
నదిలో నీటి ప్రవాహం ఉధృతంగా ఉన్న ప్రాంతంలో (rapid) ఆ నీటి ప్రవాహాన్ని వర్ణించేందుకు బెర్నౌలీ సమీకరణాన్ని ఉపయోగించవచ్చా? వివరించండి.
సాధన:
లేదు. బెర్నూలీ సిద్దాంతం కేవలం ధారారేఖా ప్రవాహంలో మాత్రమే ఉపయోగిస్తారు.

ప్రశ్న 12.
బెర్నౌలీ సమీకరణాన్ని అనువర్తించేటప్పుడు పరమ పీడనానికి బదులు గేజ్ పీడనాన్ని ఉపయోగిస్తే ఏదైనా ప్రభావం ఉంటుందా? వివరించండి.
సాధన:
లేదు. బెర్నూలీ సమీకరణంకు అన్వర్తించుటకు పరమ పీడనానికి బదులు పరిమాణం చూచు పరికరాన్ని రెండు బిందువుల మధ్య వాతావరణ పీడనాన్ని కొలుచుటకు ఉపయోగిస్తారు. బెర్నూలీ సమీకరణంను అన్వర్తించడాన్ని సాధన. విమానం రెక్క పైభాగం మరియు క్రింది భాగాలలో ప్రత్యేకంగా గుర్తుంచుకోవాలి.

ప్రశ్న 13.
1.5 m పొడవు, 1.0 cm. వ్యాసార్థంగల ఒక క్షితిజ సమాంతర గొట్టం ద్వారా గ్లిజరిన్ నిలకడగా ప్రవహిస్తున్నది. గొట్టం ఒక చివర ఒక సెకన్ కాలంలో సేకరించిన గ్లిజరిన్ పరిమాణం 4.0 × 10-3 kg s-1 అయితే గొట్టం రెండు చివరల మధ్య ఉండే పీడన వ్యత్యాసం ఎంత ? (గ్లిజరిన్ సాంద్రత = 1.3 × 10³kg m-3, గ్లిజరిన్ స్నిగ్ధత : 0.83 Pa s). (గొట్టంలోని ప్రవాహం స్తరీయం అనే మీ ఊహ సరైందా ? లేదా ? అని పరీక్షించడంలో మీరు ఆసక్తికనబరచవచ్చు).
సాధన:
ఇక్కడ, l = 1.5 m, r = 1.0 cm = 10-2 m,
ρ = 1.3 × 10³ kg/m³; η = 0.83 Nsm-2.

సెకనుకు ప్రవహించే గ్లిజరిన్ ద్రవ్యరాశి,
M = 4 × 10-3 kg/s
AP Inter 1st Year Physics Study Material Chapter 11 ప్రవాహుల యాంత్రిక ధర్మాలు 27
గొట్టం రెండు చివరలలో పీడనాలలో తేడా P అయితే, పాయిజీ సూత్రం ప్రకారం
AP Inter 1st Year Physics Study Material Chapter 11 ప్రవాహుల యాంత్రిక ధర్మాలు 28

ప్రశ్న 14.
ఒక వాయు సొరంగంలో నమూనా విమానాన్ని పరీక్షించే ప్రయోగంలో విమాన రెక్కల పైతలం, కింది తలంపై ప్రవాహ వడులు వరుసగా 70 m s-1, 63 m s-1. విమానరెక్క వైశాల్యం 2.5 m² అయితే దానిపై పనిచేసే ఉత్థాపక బలాన్ని లెక్కగట్టండి. గాలి సాంద్రతను 1.3 kg m-3 గా తీసుకోండి.
సాధన:
విమాన రెక్క పైభాగంలో మరియు క్రింది భాగలలో వేగాలు V1, V2 అనుకొనుము.

P1 మరియు P2లు రెక్క పైభాగంలో మరియు క్రింది భాగంలో పీడనాలు.
V1 = 70ms-1; V2 = 63ms-1,
ρ = 1.3kg m-3.
బెర్నూలీ సిద్ధాంతం నుండి,
AP Inter 1st Year Physics Study Material Chapter 11 ప్రవాహుల యాంత్రిక ధర్మాలు 29

ఈ పీడనాలలో తేడా, విమానంను పైకి లేపుతుంది.
కాబట్టి విమానంపై ఊర్థ్వ బలం = పీడనంలో తేడా × విమానం రెక్క వైశాల్యం
= 605.15 × 2.5
= 1512.875 N
= 1.51 × 10³N.

ప్రశ్న 15.
పటాలు 11.23 (a), (b) లు స్నిగ్ధతారహిత ద్రవం నిలకడ ప్రవాహాన్ని సూచిస్తున్నాయి. అప్పుడు ఈ రెండు పటాల్లో ఏది సరైంది కాదు? ఎందువల్ల?
AP Inter 1st Year Physics Study Material Chapter 11 ప్రవాహుల యాంత్రిక ధర్మాలు 30
సాధన:
పటం (a) సరియైనదికాదు. సాంతత్య సమీకరణం ప్రకారం av = స్థిరం. ఇక్కడ అడ్డుకోత వైశాల్యం ‘a’ తగ్గితే, ప్రవహించే ద్రవవేగం పెరుగుతుంది. కాబట్టి గొట్టంలో నొక్కబడిన భాగం వద్ద ద్రవవేగం గొట్టం మిగిలిన భాగం కన్నా ఎక్కువ. బెర్నూలీ సిద్ధాంతం ప్రకారం P + \(\frac{1}{2}\)ρv² = స్థిరం.
ఇక్కడ V ఎక్కువైతే, P తగ్గును (లేదా) P పెరిగితే V తగ్గుతుంది.

ప్రశ్న 16.
ఒక స్ప్రే పంప్ స్తూపాకార గొట్టం మధ్యచ్ఛేద వైశాల్యం 8.0 cm² దాని ఒక చివర 1.0 mm వ్యాసంగల సూక్ష్మరంధ్రాలు 40 ఉన్నాయి. గొట్టంలో ద్రవం ప్రవాహ వడి 1.5 m min-1 అయితే రంధ్రాలనుంచి విరజిమ్మే ద్రవం వడి ఎంత?
సాధన:
గొట్టం అడ్డుకోత వైశాల్యం a1 = 8.0cm²
8 × 10-4
రంధ్రాల సంఖ్య = 40;
ప్రతి రంధ్రం వ్యాసం D = 1m.m = 10-3m
రంధ్రం వ్యాసార్థం, r = \(\frac{D}{2}=\frac{1}{2}\) × 10-3
= 5 × 10-3m
ప్రతిరంధ్రం అడ్డుకోత వైశాల్యం = πr²
= π(5 × 10-4)²m²

40 రంధ్రాల అడ్డుకోత వైశాల్యం,
a2 = 40 × π (5 × 10-4)²m²

గొట్టంలో ద్రవవేగం, V1 = 1.5m/min = \(\frac{1.5}{60}\)ms-1
రంధ్రాల నుండి బయటకు వచ్చేద్రవవేగం V2 అయితే
AP Inter 1st Year Physics Study Material Chapter 11 ప్రవాహుల యాంత్రిక ధర్మాలు 31

ప్రశ్న 17.
ఒక U-ఆకార తీగను సబ్బు ద్రావణంలో ముంచి తీస్తే తీగకు, తీగపై జారే మరొక తీగకు మధ్య. ఒక సబ్బు పొర ఏర్పడుతుంది. U-ఆకారం తీగకు దానిపై జారుతున్న తేలికైన తీగకు మధ్య ఏర్పడిన పలుచని సబ్బుపొర 1.5 × 10-2 N (జారుడు తీగ( slider) స్వల్ప భారం కూడా ఇందులో కలిసి ఉంది). భారాన్ని మోయ గలుగుతుంది. జారుడు తీగ పొడవు 30 cm. పొర తలతన్యత ఎంత?
సాధన:
సబ్బు నీటిపొర రెండు తలాలను కలిగి ఉంటుంది, కాబట్టి పొర యొక్క మొత్తం పొడవు
= 2l = 2 × 30 = 60 cm = 0.6 m

తలతన్యత వల్ల స్లైడర్పై మొత్తం బలం,
F = S × 2l = S × 0.6 N
సమతా స్థితి వద్ద, తలతన్యత వల్ల స్లైడర్పై పనిచేసే బలం, భారం mgకి సమానం.
= (1.5 × 10-2N)
F = 1.5 × 10-2 = S × 0.6
S = \(\frac{1.5 \times 10^{-2}}{0.6}\) = 2.5 × 10-2Nm-1

AP Inter 1st Year Physics Study Material Chapter 11 ప్రవాహుల యాంత్రిక ధర్మాలు

ప్రశ్న 18.
పటం 11.24 (a) లో చూపించిన ద్రవపొర 4.5 × 10-2 N స్వల్ప భారాన్ని మోయగలదు. పటం 11.24 (b), (c) లలో చూపించిన పొరలు అదే ద్రవంతో ఏర్పడి అంతే ఉష్ణోగ్రత వద్ద ఉన్నట్లయితే ఆ పొరలు భరించగలిగే భారం ఎంతో తెలపండి. భౌతికశాస్త్ర నియమాలను అనుసరించి మీ జవాబును వివరించండి.
AP Inter 1st Year Physics Study Material Chapter 11 ప్రవాహుల యాంత్రిక ధర్మాలు 32
సాధన:
a) ఇక్కడ పొర యొక్క పొడవు = 40cm = 0.4 m
మొత్తం బలం = 4.5 × 10-2N
పొరకు రెండు స్వేచ్ఛా తలాలు ఉన్నాయి.
తలతన్యత S = \(\frac{4.5 \times 10^{-2}}{2 \times 0.4}\)
= 5.625 × 10-2Nm-1

(a), (b) మరియు (c) సందర్భాలలో ఒకే ద్రవం ఉంది మరియు ఉష్ణోగ్రత కూడా ఒకే విధంగా ఉంది. (b) మరియు (c)లలో తలతన్యత 5.625 × 10-2 ఒకే విధంగా ఉంది. పొర యొక్క పొడవు (a) లో ఒకేవిధంగా ఉంది.

ప్రతి సందర్భంలోను మొత్తం భారం 4.5 × 10-2 N.

ప్రశ్న 19.
గది ఉష్ణోగ్రత వద్ద ఉన్న 3.00 mm వ్యాసార్ధం గల పాదరస బిందువు లోపల ఉండే పీడనం ఎంత ? ఆ ఉష్ణోగ్రత (20°C) వద్ద పాదరసం తలతన్యత 4.65 × 10-1 Nm-1. వాతావరణ పీడనం 1.01 × 105Pa. పాదరస బిందువు లోపల ఉండే అదనపు పీడనం విలువను కూడా తెలపండి.
సాధన:
ఇక్కడ r = 3.0 mm 3 × 10-3 m;
S = 4.65 × 10-1Nm-1:
P = 1.01 × 105 Pa
పాదరసం లోపల అధిక పీడనం
AP Inter 1st Year Physics Study Material Chapter 11 ప్రవాహుల యాంత్రిక ధర్మాలు 33

ప్రశ్న 20.
గది ఉష్ణోగ్రత (20°C) వద్ద సబ్బు ద్రావణం తలతన్యత 2.50 × 10-2 Nm-1 అని ఇచ్చినప్పుడు, 5.00 mm వ్యాసార్థం గల సబ్బు ద్రావణపు బుడగ లోపల ఉండే అదనపు పీడనాన్ని లెక్కించండి. అంతే పరిమాణం లేదా అవే కొలతలు ఉన్న ఒక గాలి బుడగ ఒక పాత్రలో ఉన్న సబ్బు ద్రావణంలో 40.0 cm లోతున ఉంటే, ఆ బుడగ అంతర్భాగంలోని అదనపు పీడనం ఎంత ? సబ్బు ద్రావణం సాపేక్ష సాంద్రత =1.20. ఒక వాతావరణ పీడనం = 1.01 × 15 Pa.
సాధన:
S = 2.5 x 10-2 Nm-1,
r = 5.00 mm
= 5 × 10-3 m

సబ్బు ద్రావణం సాంద్రత ρ = 1.2 × 10³ kg m-3
సబ్బు బుడగ లోపల అధిక పీడనం,
AP Inter 1st Year Physics Study Material Chapter 11 ప్రవాహుల యాంత్రిక ధర్మాలు 34

సబ్బుద్రావణంలో h లోతున ఉన్న గాలి బుడగ లోపల మొత్తం పీడనం = P’ + వాతావరణ పీడనం + hρg
= 10 + 1.01 × 105 + 0.4 × 1.2 × 10³ × 9.8
= 1.06 × 10³ Pa

ప్రశ్న 21.
ఒక టాంక్ అడుగుభాగం చతురస్రాకారంలో ఉంది. ఆ అడుగు భాగం లేదా ఆధారం వైశాల్యం 1.0 m² ఈ టాంక్ మధ్యలో ఒక నిట్టనిలువు గోడను నిర్మించి దాన్ని రెండు సమాన భాగాలుగా విభజించారు. ఈ గోడ అడుగున మడతబందు సహాయంతో తిరిగే 20 cm² వైశాల్యంగల చిన్న ద్వారం ఉంది. రెండు అర్ధభాగాల్లో ఒకదానిలో నీరు మరొక దానిలో ఆమ్లం (సాపేక్ష సాంద్రత 1.7) లతో 4.0 m. ఎత్తువరకు నింపారు. ఆ ద్వారాన్ని మూసి ఉంచేందుకు అవసరమయ్యే బలాన్ని లెక్కించండి.
సాధన:
నీటిని కలిగిన గదిలో
h1 = 4m, ρ1 = 10³ kg m-3

అడుగున ఉన్న తలుపుపై నీరు కలిగించే పీడనం
P1 = h1ρ1g
= 4 × 10³ × 9.8
= 3.92 × 104 Pa

రసాయనాన్ని కలిగిన గదిలో
h2 = 4m, ρ2 = 1.7 × 10³ kg/m³
అడుగున ఉన్న తలుపుపై రసాయనం కలిగించే పీడనం
P2 = h2ρ2g
= 4 × 1.7 × 10³ × 9.8
= 6.664 × 104 Pa
∴ పీడనంలో తేడా = P2 – P1
= 6.664 × 104 – 3.92 × 104
= 2.774 × 104 Pa
తలుపు వైశాల్యం, A = 20cm² = 20 × 10-4
తలుపుపై బలం = పీడనంలో తేడా × వైశాల్యం
= (P2 – P1) × A
= 2.774 × 104 × 20 × 104
= 54.88N ≈ 55N

తలుపును మూసివేయుటకు 55 N బలాన్ని క్షితిజ సమాంతరంగా నీటిని గల గది నుండి రసాయనం కలిగిన గదివైపు ప్రయోగించాలి.

ప్రశ్న 22.
ఒక పాత్రలో బంధితమై ఉన్న వాయువు పీడనాన్ని ఒక మానోమీటర్ పటం 11.25 (a) లో చూపించిన విధంగా రీడింగ్ చూపిస్తుంది. పాత్రలోని కొంత వాయువును ఒక పంపు ద్వారా తొలగిస్తే ఉండే మానోమీటర్ రీడింగ్ను పటం 11.25 (b) సూచిస్తుంది. మనోమీటర్ లో ఉపయోగించిన ద్రవం పాదరసం అయి, వాతావరణ పీడనం 76 cm ల పాదరస స్తంభం ఎత్తుకు సమానమైతే,
a) పటం (a) పటం (b) సూచించిన రెండు సందర్భాల లోను పాత్రలోని వాయు పరమ పీడనాన్ని, గేజ్ పీడనాన్ని పాదరస cm ప్రమాణాలలో తెలపండి.
b) రెండో సందర్భంలో, అంటే పటం (b) లోని మానోమీటర్ కుడి భుజంలో 13.6 cm ఎత్తు పెరిగే విధంగా నీటిని (నీరు, పాదరసం కలవవు) నింపితే, మానోమీటర్ మట్టాలు ఏవిధంగా మారతాయి? (వాయువు ఘనపరిమాణంలో వచ్చే స్వల్ప మార్పులను ఉపేక్షించండి.
AP Inter 1st Year Physics Study Material Chapter 11 ప్రవాహుల యాంత్రిక ధర్మాలు 35
సాధన:
a) ఇక్కడ వాతావరణ పీడనం p = 76 సెం.మీ. పాదరస పీడనం
i) పటం (a) నుండి, పీడన శీర్షం
h = + 20 cm
∴ పరమ పీడనం = p + h
= 76 + 20
= 96 సెం.మీ. పాదరస పీడనం
పీడన పరిమాణం h = 20 సెంమీ. పాదరస పీడనం
పటం (b) నుండి, పీడన శీర్షం, h = -18 cm
పరమ పీడనం = p+h
= 76 + (-18)
= 58 సెం.మీ. పాదరస పీడనం

పీడన పరిమాణం = h = -18 సెంమీ. పాదరస పీడనం

ii) 13.6 సెం.మీ. నీటిని కుడిభుజంలో పోస్తే దానికి తుల్యమైనది \(\frac{13.6}{13.6}\)
h¹ = 1 సెం.మీ. పాదరస పీడనం
A వద్ద పీడనం, PA = P + h¹ = 76 + 1 = 77 cm

రెండు భుజాలలో పాదరస మట్టాలలో తేడా h1 అయిన B వద్ద పీడనం
PB = 58 + h1
∴ PA = PB
∴ 77 + 58 + h1 (లేదా)
h1 = 77 – 58 = 19 సెం.మీ. పాదరస పీడనం

AP Inter 1st Year Physics Study Material Chapter 11 ప్రవాహుల యాంత్రిక ధర్మాలు

ప్రశ్న 23.
విభిన్న ఆకారాల్లో ఉండే రెండు పాత్రల ఆధార వైశాల్యాలు సమానం. రెండు పాత్రల్లోను ఒక నిర్ణీత సమాన ఎత్తువరకు నీటిని నింపాలంటే మొదటి పాత్ర తీసుకొనే నీటి ఘనపరిమాణం రెండో పాత్ర తీసుకొనే నీటి ఘనపరిమాణానికి రెట్టింపు. అయితే నీరు పాత్ర ఆధారంపై ప్రయోగించే బలం రెండు సందర్భాల్లోను సమానంగానే ఉంటుందా? ఒకవేళ అలా సమానమైతే, సమాన మట్టాల వరకు నీటితో నింపిన ఆ పాత్రలు బరువు తూచే పరికరంపై రెండు వేరువేరు రీడింగులను ఎందుకు చూపిస్తాయి?
సాధన:
AP Inter 1st Year Physics Study Material Chapter 11 ప్రవాహుల యాంత్రిక ధర్మాలు 36
పీడనం నీటి స్తంభం ఎత్తుపై ఆధారపడుతుంది. మరియు వేరువేరు ఆకారాలు గల రెండు పాత్రలలో నీటి స్తంభం ఎత్తు ఒకేవిధంగా ఉంటుంది. ప్రతిపాత్ర అడుగున నీటి వలన పీడనం ఒకే విధంగా ఉంటుంది. ప్రతి పాత్ర అడుగున వైశాల్యం ఒకేవిధంగా ఉంటే, నీటి పీడనం వలన పాత్రల అడుగున వైశాల్యంపై సమాన బలాలు పని చేస్తాయి. నీరు గోడలపై కలిగించే బలం కూడా సమానం. పాత్ర గోడలు అడుగున లంబంగా లేకపోతే, నీరు గోడలపై కలిగించే బలం యొక్క ఫలిత క్షితిజ లంబ అంశం, రెండవ పాత్రలో కన్నా మొదటి పాత్రలో అధికం. ఈ విధంగా రెండు పాత్రలలో ఒకే ఎత్తున నీటిని నింపితే బరువు తూచే యంత్రంపై వేరువేరు రీడింగ్లను చూపుతాయి.

ప్రశ్న 24.
రక్తమార్పిడి చేస్తున్నప్పుడు సూదిని సిరలోకి (రక్తనాళంలోకి) గుచ్చారు. అక్కడ గేజ్ పీడనం 2000 Pa. అప్పుడు ఈ సిరలోకి రక్తం ఎక్కాలంటే రక్తం ఉండే సీసాను ఎంత ఎత్తులో అమర్చాలి?
సాధన:
AP Inter 1st Year Physics Study Material Chapter 11 ప్రవాహుల యాంత్రిక ధర్మాలు 37
రక్తం కలిగిన పాత్ర 0.1925 m (0.2 m) ఎత్తులో ఉంటే, రక్తం నరాలలోకి ఎక్కుతుంది.

ప్రశ్న 25.
బెర్నౌలీ సమీకరణాన్ని ఉత్పాదించేటప్పుడు గొట్టంలోని ప్రవాహిపై జరిగిన పనిని ప్రవాహి స్థితిజ, గతిజ శక్తులలోని వ్యత్యాసానికి సమానం చేశాం.
a) 2 × 10-3 m వ్యాసం గల ధమనిలో రక్త ప్రవాహం స్తరీయంగా కొనసాగేందుకు రక్తానికి ఉండాల్సిన గరిష్ఠ సగటు వేగం ఎంత?
b) ప్రవాహి వేగం పెరిగే కొద్దీ దుర్వ్యయ బలాల ప్రాముఖ్యత పెరుగుతుందా? గుణాత్మకంగా చర్చించండి.
సాధన:
a) చెదరగొట్టబడిన బలాలు పని చేస్తున్నప్పుడు, పీడనాలలో తేడావల్ల ప్రవహించే ద్రవం, కొంత బలం, ఈ బలాలకు వ్యతిరేకంగా పనిచేస్తాయి. అందువల్ల కోల్పోయే పీడనం అధికం.

b) చెదరగొట్టే బలాలు, సంక్షోభ ప్రవాహంలో ద్రవవేగాన్ని పెంచడానికి చాలా ప్రాముఖ్యత వహిస్తాయి.

ప్రశ్న 26.
a) 2 × 10-3 m వ్యాసంగల ధమనిలోని రక్త ప్రవాహం స్తరీయంగా కొనసాగేందుకు రక్తం కలిగి ఉండాల్సిన గరిష్ఠ సగటు వేగం ఎంత?
సాధన:
ఇక్కడ r = 2 × 10-3m ;
D = 2r= 2 × 2 × 10-3 = 4 × 10-3m
η = 2.084 × 10-3 Pa – s;
p = 1.06 × 10³ kgm-3
స్తరీయ ప్రవాహంలో, NR = 2000

a) ఇప్పుడు Vc =
AP Inter 1st Year Physics Study Material Chapter 11 ప్రవాహుల యాంత్రిక ధర్మాలు 38

b) సంబంధిత రక్త ప్రవాహరేటు ఎంత? (రక్తం స్నిగ్ధతను 2.084 × 10-3 Pa s గా తీసుకోండి).
సాధన:
సెకనుకు ప్రవహించే ఘనపరిమాణం = πr²Vc
= \(\frac{22}{7}\) × (2 × 10-3)² × 0.98
= 1.23 × 10-5 m³s-1

ప్రశ్న 27.
ఒకొక్కటి 25m². వైశాల్యంగల రెండు రెక్కలను కలిగి ఉండే విమానం ఒక నిర్ణీత ఎత్తువద్ద స్థిరవడితో ప్రయాణిస్తున్నది. రెక్క అడుగు తలంపై గాలివేగం 180 km/h, రెక్కపై తలంపై ఉన్న గాలివేగం 234 km/h అయితే విమానం ద్రవ్యరాశిని నిర్ధారించండి. (గాలి సాంద్రతను 1 kg m-3 గా తీసుకోండి).
సాధన:
ఇక్కడ V1 = 180 km/h = 50m/s,
V2 = 234 km/s = 65 m/s;
A = 2 × 25 = 50m²; p = 1 kg/m³
AP Inter 1st Year Physics Study Material Chapter 11 ప్రవాహుల యాంత్రిక ధర్మాలు 39

ప్రశ్న 28.
మిల్లికాన్ తైల బిందు ప్రయోగంలో 2.0 × 10-5 m వ్యాసార్ధం, 1.2 × 10³ kg m-3 సాంద్రత గల తటస్థ బిందువు (అనావేశిత బిందువు) (uncharged particle) చరమవేగం ఎంత? ప్రయోగ ఉష్ణోగ్రత వద్ద గాలి స్నిగ్ధతను 1.8 × 10-5 Pa s గా తీసుకోండి. ఆ చరమవేగం వద్ద బిందువుపై పనిచేసే స్నిగ్ధతాబలం ఎంత? గాలివల్ల బిందువుపై పనిచేసే ఉత్సవన బలాన్ని ఉపేక్షించండి.
సాధన:
ఇక్కడ r = 2.0 × 10-5 m;
ρ = 1.2 × 10³kgm-3; η = 1.8 × 10-5 Ns m-2
Po = 0, V = ?, F = ?
AP Inter 1st Year Physics Study Material Chapter 11 ప్రవాహుల యాంత్రిక ధర్మాలు 40

5.8 × 10-2ms-1 5.8 cms-1
బిందువుపై స్నిగ్ధతా బలం, F = 6πηrv
= 6 × \(\frac{22}{7}\) × 1.8 × 10-5 × 2.0 × 10-5 × 5.8 × 10-2
= 3.93 × 10-10N.

ప్రశ్న 29.
సోడాలైమ్ గాజుతో పాదరస స్పర్శకోణం 140°. ఈ రకమైన గాజుతో చేసిన 1.00 mm వ్యాసార్ధం గల సన్నని గొట్టాన్ని పాదరసం ఉండే తొట్టెలో నిలువుగా ముంచారు. పాత్రలోని పాదరస ద్రవమట్టానికి సాపేక్షంగా నాళంలోని పాదరస మట్టం ఎంత కిందికి దిగుతుంది? ప్రయోగ ఉష్ణోగ్రత వద్ద పాదరసం తలతన్యత 0.465 Nm-1. పాదరస సాంద్రత = 1.36 × 10³ kg m-3.
సాధన:
ఇక్కడ θ = 140°, r = 1 × 10-3 m;
S = 0.465 Nm-1, ρ = 13.6 × 10³ kg, h = ?]
cos = 140° = – cos40° = -0.7660
AP Inter 1st Year Physics Study Material Chapter 11 ప్రవాహుల యాంత్రిక ధర్మాలు 41
ఇక్కడ ఋణగుర్తు గొట్టంలో పాదరస మట్టం పడిపోవుటను సూచిస్తుంది.

ప్రశ్న 30.
3.0 mm, 6.0 mm వ్యాసాలున్న రెండు సన్నని నాళాలను కలిపి రెండు చివరలలో తెరచి ఉంచిన U- ఆకార గొట్టాన్ని తయారుచేశారు. U-గొట్టంలోని నీటిని కలిగి ఉంటే, గొట్టంలోని రెండు భుజాల్లోని నీటి మట్టాల్లోని వ్యత్యాసం ఎంత? ప్రయోగ ఉష్ణోగ్రత వద్ద నీటి తలతన్యత 7.3 × 10-2 N m-1. స్పర్శకోణాన్ని శూన్యంగా, నీటి సాంద్రతను 1.0 × 10³ kg m-3గా తీసుకోండి ( g = 9.8 m-2).
సాధన:
S = 7.3 × 10-2 Nm-1,
ρ = 1.0 × 10³ kg m-3; θ = 0°
సన్నని గొట్టంలో, 2r1/sub> = 3.00 m.m = 3 × 10-3 m
(లేదా) r1 = 1.5 × 10-3 m

వెడల్పు గొట్టంలో, 2r2 = 6.00 m.m (లేదా) = 3 × 10-3 m
= 6 × 10-3 m

సన్నని గొట్టం మరియు వెడల్పు గొట్టంలో నీటి ఎత్తులు h1, h2 అనుకొనుము.
AP Inter 1st Year Physics Study Material Chapter 11 ప్రవాహుల యాంత్రిక ధర్మాలు 42

ప్రశ్న 31.
a) ఎత్తు తో గాలి సాంద్రత తగ్గడాన్ని ρ = ρoe-y/yo సమీకరణం సూచిస్తుంది.
ఇక్కడ ρo సముద్ర మట్టం వద్ద గాలి సాంద్రత = 1.25 kg m-3y0 = స్థిరాంకం. వాతావరణ సాంద్రతలో వచ్చే మార్పులను తెలిపే ఈ సమీకరణాన్నే వాతవరణాల నియమం (law of atmospheres) అంటారు. వాతావరణ ఉష్ణోగ్రత స్థిరంగా (సమోష్ణోగ్రతా పరిస్థితులు) ఉందని భావించి ఈ నియమాన్ని రాబట్టండి. g విలువ కూడా స్థిరమని భావించండి.
సాధన:
సాంద్రతలో తగ్గుదల రేటు, ρ ఎత్తు y కు అనులోమాను పాతంలో ఉంటుంది.
\(\frac{-\mathrm{d} \rho}{\mathrm{dy}}\) α ρ (లేదా) \(\frac{\mathrm{d} \rho}{\mathrm{dy}}\) = – Kρ

ఇక్కడ K అనుపాత స్థిరాంకం. ఇక్కడ ఋణగుర్తు ρ తగ్గితే, y పెరుగుతుందని తెలియజేస్తుంది.

AP Inter 1st Year Physics Study Material Chapter 11 ప్రవాహుల యాంత్రిక ధర్మాలు 43

b) 1425 m³ ఘనపరిమాణం గల ఒక హీలియం బెలూన్ను ఉపయోగించి 400 kg భారాన్ని (pay load) పైకి ఎత్తుతున్నారు. బెలూన్ పైకి వెళుతున్న కొద్దీ దాని వ్యాసార్ధం స్థిరంగానే ఉంటుందని భావించి అది చేరే ఎత్తును లెక్కించండి.
(yo = 8000 m and PHe = 0.18 kgm-3 అని తీసుకోండి).
సాధన:
బెలూన్ ఎత్తుకు పోయేసరికి దాని సాంద్రత, ఆ ఎత్తులో గాలికి సమానం.
AP Inter 1st Year Physics Study Material Chapter 11 ప్రవాహుల యాంత్రిక ధర్మాలు 44
AP Inter 1st Year Physics Study Material Chapter 11 ప్రవాహుల యాంత్రిక ధర్మాలు 45

సాధించిన సమస్యలు (Solved Problems)

ప్రశ్న 1.
ఒక్కొక్కటి 10 cm² మధ్యచ్ఛేద వైశాల్యం కలిగిన రెండు తొడ ఎముకలు (femurs), 40 kg ద్రవ్యరాశి గల మానవ శరీర పైభాగాన్ని మోస్తున్నాయి అనుకొందాం. ఈ తుంటి ఎముకలు తట్టుకో గలిగే సగటు పీడనాన్ని అంచనావేయండి.
సాధన:
తుంటి ఎముకల మొత్తం మధ్యచ్ఛేద వైశాల్యం A = 2 × 10cm² 20 × 10-4m². (g 10 ms-2) గా తీసుకొంటే వాటిపై చర్య జరిపే బలం F = 40 kg wt = 400 N. ఈ బలం నిలువుగా కిందివైపుకు పనిచేస్తుంది. కాబట్టి ఈ బలం తుంటి ఎముకలపై అభిలంబంగా ఉంటుంది. కాబట్టి సగటు పీడనం
Pav = \(\frac{F}{A}\) = 2 × 105 N m-2

AP Inter 1st Year Physics Study Material Chapter 11 ప్రవాహుల యాంత్రిక ధర్మాలు

ప్రశ్న 2.
ఒక సరస్సు ఉపరితలం నుంచి 10m లోతున ఉన్న ఈతగాడిపై ఎంత పీడనం ఉంటుంది?
సాధన:
ఇక్కడ
h = 10 m, ρ = 1000 kg m-3 కాగా
g = 10 m S-2 గా తీసుకోండి.
సమీకరణం (11.7b) నుంచి
P = Pa +ρgh
= 1.01 × 105 Pa + 1000 kgm-3 × 10m S-2 × 10 m
= 2.01 × 105 Pa
≈ 2 atm

ఉపరితల మట్టం వద్ద ఉండే పీడనం నుంచి, ఈ పీడనం 100% పెరుగుదల సూచిస్తోంది. 1 km లోతులో పీడనం పెరుగుదల 100 atm! ఇలాంటి విపరీతమైన వీడనాల్ని తట్టుకొనేటట్టుగా జలాంతర్గాములను రూపొందిస్తారు.

ప్రశ్న 3.
సముద్రమట్టం వద్ద వాతావరణ సాంద్రత 1.29 kg/m³. ఇది ఉన్నతి (ఎత్తు)తో మారడం లేదని అనుకోండి. అయితే ఎంత ఎత్తు వరకు వాతావరణం వ్యాపించి ఉంటుంది?
సాధన:
సమీకరణం (11.7a) నుంచి
ρgh = 1.29 kg m-3 × 9.8 ms² × hm
= 1.01 × 105 pa
∴ h = 7989 m ≈ 8 km

నిజానికి గాలి సాంద్రత ఎత్తుకు వెళ్ళేకొలది తగ్గుతుంది. అదే విధంగా g కూడా. వాతావరణ పొర తగ్గుతూ ఉండే పీడనం కలిగి 100 km వరకు విస్తరించి ఉంటుంది. సముద్రమట్టం వద్ద వాతావరణ పీడనం ఎప్పుడూ 760 mm of Hg గానే ఉండదని మనం గుర్తించాలి. పాదరస మట్టం, 10 mm of Hg లేదా అంతకంటే ఎక్కువగా పడిపోయినట్లయితే అది రాబోయే తుఫానును సూచిస్తుంది.

ప్రశ్న 4.
ఒక మహాసముద్రంలో 1000 m లోతున (a) పరమపీడనం ఎంత ఉంటుంది? b) గేజ్ పీడనం ఎంత ఉంటుంది? c) అదే లోతున ఉన్నప్పుడు, 20 cm × 20 cm వైశాల్యం ఉన్న జలాంతర్గామి కిటికీపై చర్య జరిపే బలం ఎంత ? ఈ జలాంతర్గామి లోపలి వీడనాన్ని సముద్రమట్టం వద్ద ఉండే వాతావరణ పీడనానికి సమానంగా ఉండేట్లు చూస్తారు. (సముద్ర జలం సాంద్రత 1.03 × 10³ kg m-3, g = 10ms-2.)
సాధన:
ఇక్కడ h = 1000, ρ = 1.03 × 10³ kg m-3

a) సమీకరణం(11.6)ను బట్టి పరమ పీడనం
P = Pa + ρgh
= 1.01 × 105 Pa
+ 1.03 × 10³ kg m-3 ×10m s-2 × 1000 m
= 104.01 × 105 Pa
≈ 104 atm

b) గేజ్ పీడనం P – Pa = ρgh = Pg
Pg = 1.03 × 10³ kg m-3 × 10 m s² × 1000 m
= 103 × 105 Pa
≈ 103 atm

c) జలాంతర్గామి బయట ఉండే పీడనం, P = Pa + ρgh దాని లోపలి పీడనం Pa. అందువల్ల, జలాంతర్గామి కిటికీ మీద చర్య జరిపే నికర పీడనం గేజ్ పీడనమే; గేజ్ పీడనం Pg = ρgh. కీటికీ వైశాల్యం A = 0.04 m², కాబట్టి దానిపై పనిచేసే బలం F అయితే,
F = Pg A = 103 × 105 Pa × 0.04m²
= 4.12 × 105 N.

ప్రశ్న 5.
A1, A2 అనే వేరువేరు మధ్యచ్ఛేద వైశాల్యాలు; L1, L2 అనే వేరువేరు పొడవులు కలిగి నీటితో నింపిన రెండు. (సూదులు లేని) సిరంజిలను బాగా బిగుతుగా ఉండి, నీటితో నింపిన రబ్బరు గొట్టానికి కలిపారు. వాటి చిన్న ముషలకం, పెద్ద ముషలకాల వ్యాసాలు వరసగా 1.0 cm, 3.0 cm లు.
a) చిన్న ముషలకానికి 10 N బలాన్ని అనువర్తింపచేసినప్పుడు, పెద్ద ముషలకంపై కలిగే బలం ఎంత?
b) చిన్న ముషలకాన్ని 6.0 cm దూరం లోపలికి నెట్టితే పెద్ద ముషలకం ఎంత దూరం బయటివైపుకు కదులుతుంది?
సాధన:
a) ప్రవాహి అంతటా పీడనం ఏమాత్రం క్షీణించకుండా ప్రసరితమవుతుంది కాబట్టి,
AP Inter 1st Year Physics Study Material Chapter 11 ప్రవాహుల యాంత్రిక ధర్మాలు 46

b) నీటిని ఒక సంపూర్ణ అసంపీడ్య ప్రవాహిగా భావిస్తాం. చిన్న ముషలకాన్ని లోపలకు నెట్టడం వల్ల కదిలిన నీటి మనపరిమాణం పెద్ద ముషలకం వల్ల బయటివైపుకు కదిలిన నీటి ఘనపరిమాణానికి సమానం.
AP Inter 1st Year Physics Study Material Chapter 11 ప్రవాహుల యాంత్రిక ధర్మాలు 47

రెండు ముషలకాలపైన పనిచేసే వాతావరణ పీడనం ఒకటే కాబట్టి దానిని మనం పట్టించుకోలేదని గమనించండి.

ప్రశ్న 6.
ఒక కారు లిఫ్ట్ సంపీడిత గాలి (compressed air) 5.0 cm వ్యాసార్ధం గల చిన్న ముషలకంపై F1 బలాన్ని కలిగిస్తుంది. ఈ పీడనం 15 cm వ్యాసార్ధం గల రెండవ ముషలకానికి ప్రసరిత మవుతుంది (పటం. 11.6). పైకి లేవనెత్తాల్సిన కారు యొక్క ద్రవ్యరాశి 1350 kg లు అయితే, F1 ను లెక్కగట్టండి. ఈ కష్టతర కార్యాన్ని సుసాధ్యం చేయడానికి అవసరమయ్యే పీడనం ఎంత ? (g = 9.8 ms-2).
AP Inter 1st Year Physics Study Material Chapter 11 ప్రవాహుల యాంత్రిక ధర్మాలు 5
సాధన:
ప్రవాహి అంతటా ఏమాత్రం క్షీణించకుండా పీడనం ప్రసరితమవుతంది కాబట్టి.
AP Inter 1st Year Physics Study Material Chapter 11 ప్రవాహుల యాంత్రిక ధర్మాలు 48
ఈ బటాన్ని ఉత్పత్తి చేసే గాలి పీడనం.
AP Inter 1st Year Physics Study Material Chapter 11 ప్రవాహుల యాంత్రిక ధర్మాలు 49

ఇది వాతావరణ పీడనానికి దాదాపు రెట్టింపు. ఆటోమొబైల్లోని హైడ్రాలిక్ బ్రేక్లు కూడా ఇదే (పాస్కల్) సూత్రంపై ఆధారపడి పనిచేస్తాయి.

మన పాదంతో పెడల్పైన మనం ఒక స్వల్ప బలాన్ని ప్రయోగిస్తే, మాస్టర్ స్థూపంలోని (master cylinder) మాస్టర్ ముషలకం కదులుతుంది. ఇందువల్ల కలిగే పీడనం బ్రేక్ నూనె ద్వారా ప్రసరితమై దీనికంటే ఎక్కువ వైశాల్యం గల ముషలకంపైన చర్య జరుపుతుంది. ఇందువల్ల ఒక అత్యధిక బలం ఆ ముషలకంపై చర్య జరిపి, అది కిందకు నెట్టబడుతుంది. తద్వారా బ్రేక్ లైనింగ్కు వ్యతిరేకంగా బ్రేకులు వ్యాకోచం చెంది, అంటే అవి ముందుకు జరిగి, బ్రేక్ లైనింగ్ను గట్టిగా ఒడిసిపట్టుకొంటాయి. ఈవిధంగా పెడల్పైన చర్యజరిపే స్వల్ప బలం, చక్రంపై అధిక మందక బలాన్ని (large retarding force) ఉత్పన్నం చేస్తుంది. ఈ వ్యవస్థలోని ఒక ముఖ్యమైన లాభమేమిటంటే, పెడల్ను నొక్కడం వల్ల ఏర్పడే పీడనం, కారు నాలుగు చక్రాలకు అనుసంధానితమై ఉన్న అన్ని స్థూపాలకు సమానంగా ప్రసరితం అయి, అన్ని చక్రాలపైన కలిగే బ్రేకింగ్ యత్నం (effort) సమానంగా ఉంటుంది.

AP Inter 1st Year Physics Study Material Chapter 11 ప్రవాహుల యాంత్రిక ధర్మాలు

ప్రశ్న 7.
రక్తపు వేగం : మత్తుమందిచ్చిన ఒక కుక్క యొక్క బృహద్ధమని (large artery) లోని రక్త ప్రవాహాన్ని ఒక వెంటురి మీటర్ ద్వారా వెళ్ళేటట్లుగా దారి మళ్లించారు. ఈ మీటర్ యొక్క వెడల్పాటి భాగం యొక్క మధ్యచ్ఛేద వైశాల్యం ధమని మధ్యచ్ఛేద వైశాల్యంA కి సమానం A = 8 mm². ఇక దాని ఇరుకైన భాగం యొక్క మధ్యచ్ఛేద వైశాల్యం a = 4mm². ధమనిలో పీడన పతనం (pressure drop) 24 Pa ఉంది. ధమనిలో రక్తం ఎంత వడితో ప్రవహిస్తుంది?
సాధన:
పట్టిక 11.1 నుంచి రక్తం సాంద్రతను 1.06 × 10³ kg m-3 గా తీసుకొందాం. మధ్యచ్ఛేద వైశాల్యాల నిష్పత్తి,
AP Inter 1st Year Physics Study Material Chapter 11 ప్రవాహుల యాంత్రిక ధర్మాలు 50

ప్రశ్న 8.
ప్రయాణికులతో పూర్తిగా నిండిన ఒక బోయింగ్ విమానం ద్రవ్యరాశి 3.3 × 105 kg. దాని రెక్కల మొత్తం వైశాల్యం 500 m². అది 960 km/h. వడితో ఒకే స్థాయిలో ఎగురుతున్నది. a) రెక్కల కింది, పై ఉపరితలాల మధ్య ఉన్న పీడన వ్యత్యాసాన్ని అంచనా వేయండి. (b) రెక్క కింది ఉపరితలానికి సాపేక్షంగా, రెక్కపై భాగపు ఉపరితలం మీద ఉండే గాలి వడిలో అంశిక పెరుగుదలను అంచనా వేయండి. [గాలి సాంద్రత p = 1.2 kgm-3].
సాధన:
a) పీడన వ్యత్యాసం మూలంగా జనించిన అధోబలం బోయింగ్ విమానం బరువును సంతులనం చేస్తుంది.
∆P × A = 3.3 × 105 kg × 9.8 = mg.
ΔΡ = (3.3 × 105 kg × 9.8 m s-2) / 500 m²
= 6.5 × 10³ N m-2

b) రెక్క పైభాగానికీ, కింది భాగానికీ మధ్య ఉండే ఎత్తులోని స్వల్ప భేదాన్ని మనం వదిలివేయవచ్చు. అప్పుడు వాటి మధ్య పీడన వ్యత్యాసం
AP Inter 1st Year Physics Study Material Chapter 11 ప్రవాహుల యాంత్రిక ధర్మాలు 51
AP Inter 1st Year Physics Study Material Chapter 11 ప్రవాహుల యాంత్రిక ధర్మాలు 52

రెక్క పైభాగంలో ఉండే గాలి వడి, కింది భాగంలో ఉండే గాలి వడి కంటే కేవలం 8% మాత్రమే ఎక్కువగా ఉండాల్సి ఉంటుంది.

ప్రశ్న 9.
పటంలో చూపించిన విధంగా 0.10 m² వైశాల్యం గల ఒక లోహదిమ్మెను ఒక ఆదర్శ కప్పీ (ద్రవ్యరాశిరహిత, ఘర్షణ రహిత కప్పీ) ద్వారా పోయే ఒక తాడు సహాయంతో 0.010 kg ద్రవ్యరాశితో అనుసంధానించారు. 0.30 mm పొర మందం (film thickness) గల ఒక ద్రవాన్ని బల్లకూ, దిమ్మెకూ మధ్య ఉంచారు. స్వేచ్ఛగా వదిలిపెడితే, దిమ్మె 0.085ms-1 స్థిరమైన వడితో కుడివైపుకు కదులుతుంది. ఆ ద్రవం స్నిగ్ధతా గుణకాన్ని కనుక్కోండి.
AP Inter 1st Year Physics Study Material Chapter 11 ప్రవాహుల యాంత్రిక ధర్మాలు 53
సాధన:
తాడులోని తన్యత మూలంగా లోహ దిమ్మె కుడివైపుకు కదులుతుంది. తన్యత T అనేది వేలాడదీసిన ద్రవ్యరాశి m యొక్క భారానికి పరిమాణంలో సమానంగా ఉంటుంది. కాబట్టి విరూపణ బలం,
F = T = mg = 0.010 kg × 9.8 ms-2
= 9.8 × 10-2 N
ఆ ప్రవాహిపై విరూపణ ప్రతిబలం
AP Inter 1st Year Physics Study Material Chapter 11 ప్రవాహుల యాంత్రిక ధర్మాలు 54

ప్రశ్న 10.
ఒక టాంక్లో 20°C వద్ద ఉన్న నూనె ద్వారా కిందకు పడుతున్న 2.0 mm వ్యాసార్ధం గల ఒక రాగి బంతి చరమవేగం 6.5 cm s-1.20°C వద్ద నూనెకు ఉండే స్నిగ్ధతా గుణకాన్ని గణించండి. నూనె సాంద్రత 1.5 × 10³ kg m-3, రాగి సాంద్రత 8.9 × 10³ kg m-3.
సాధన:
దత్తాంశం ప్రకారం vt = 6.5 × 10-2 ms-1
a = 2 × 10-3m,
g = 9.8 ms-2
ρ = 8.9 × 10³ kg m-3,
σ = 1.5 × 10³ kg m-3.
సమీకరణం (11.20) ప్రకారం,
AP Inter 1st Year Physics Study Material Chapter 11 ప్రవాహుల యాంత్రిక ధర్మాలు 55

ప్రశ్న 11.
a) 1.25 cm వ్యాసం గల ఒక కుళాయి నుంచి వస్తున్న నీటి ప్రవాహరేటు 0.48 L/min. నీటిస్నిగ్ధతా గుణకం 10-3 Pa s.
b) కాసేపటి తరవాత ప్రవాహ రేటును 3L/min.కు పెంచడం జరిగింది. ఈ రెండు ప్రవాహ రేట్లకు సంబంధించిన ప్రవాహాన్ని అభిలక్షణీకరించండి.
సాధన:
a) ప్రవాహ వడి అనుకొందాం. కుళాయి వ్యాసం
d 1.25 cm. ఒక సెకనుకు ప్రవహించే నీటి ఘనపరిమాణం
Q = v × πd²/4
v = 4Q / d² π

ఇప్పుడు రెనాల్డ్స్ సంఖ్యను అంచనా వేయవచ్చు.
Re = 4ρQ / 7dm
= 4 × 10³ kg m-3 × Q/
(3.14 × 1.25 × 10-2 m × 10-3 PaS)
= 1.019 × 108 m-3 SQ

తొలుతగా (a)
Q = 0.48 L/min 8 cm³ / s
= 8 × 10-6 m³s-1,

కాబట్టి, మనకు Re = 815 అని వస్తుంది

ఈ విలువ 1000 కంటే తక్కువగా ఉంది కాబట్టి ఈ ప్రవాహం నిలకడ ప్రవాహం.

కొంతసేపటి తరవాత (b)
Q = 3L/min = 50 cm³
s = 5 × 10-5 m³ s-1

అయినప్పుడు
Re = 5095 అని వస్తుంది.

ఇక్కడ, అంటే సందర్భం (b) కి, ప్రవాహం సంక్షుభితమై ఉంటుంది. మీరు మీ ‘వాష్ బేసిన్’లో ఒక ప్రయోగం చేసి చూడటం ద్వారా స్తరీయ ప్రవాహం నుంచి సంక్షుబ్ధ ప్రవాహంగా సంక్రమణం చెందడాన్ని గమనించ వచ్చు.

AP Inter 1st Year Physics Study Material Chapter 11 ప్రవాహుల యాంత్రిక ధర్మాలు

ప్రశ్న 12.
2.00 mm వ్యాసమున్న కేశనాళిక కింది కొనను ఒక బీకరులోని నీటి ఉపరితలానికి 8.00 cm దిగువ వరకు ముంచారు. నీటిలో మునిగి ఉన్న కొన వద్ద ఒక అర్థగోళాకార బుడగ ఏర్పడేటట్లుగా ఊదడానికి నాళికలో అవసరమయ్యే పీడనం ఎంత? ప్రయోగాన్ని నిర్వహిస్తున్న ఉష్ణోగ్రత వద్ద నీటి తలతన్యత 7.30 × 10-2 Nm¹, 1 అట్మాస్ఫియరిక్ పీడనం = 1.01 × 105 Pa, నీటి సాంద్రత = 1000kg/m³,
g = 9.8 × ms-2.
ఇందులో అదనపు పీడనాన్ని కూడా లెక్కించండి.
సాధన:
ఒక ద్రవంలో ఏర్పడే వాయు బుడగలో అదనపు పీడనం 2S/r. ఇక్కడ ఓ అనేది ద్రవ-వాయు ఉమ్మడి తలం యొక్క తలతన్యత. ఈ సందర్భంలో కేవలం ఒక ద్రవ ఉపరితలం మాత్రమే ఉందని మీరు గమనించాలి. (ఒక వాయువులో ఏర్పడే ద్రవపు బుడగ విషయంలో రెండు ద్రవ ఉపరి తలాలు ఉంటాయి. కాబట్టి ఈ సందర్భంలో అదనపు పీడనం 45 / r.) నీటిలో ఏర్పడే బుడగ వ్యాసార్ధం r. నీటిలోపల బుడగ బయట ఉండే పీడనం, Po అనుకొంటే, ఈ Po అనేది వాతావరణ పీడనం, 8.00 cm ల నీటిస్తంభం (ఈ రెండింటి) వల్ల కలిగే పీడనాల మొత్తానికి సమానమవుతుంది. అంటే,
Po = (1.01 × 105 Pa + 0.08 m × 1000 kg m-3 × 9.80 m s-2)
= 1.01784 × 105 Pa

అందువల్ల, బుడగ లోపలి పీడనం P1 = P0 + 2S / r ( r = 1 mm కాబట్టి)
= 1.01784 × 105 Pa +
(2 × 7.3 × 10-2 Pa m/ 10-3 m)
= (1.01784 + 0.00146) × 105 Pa
= 1.02 × 105 Pa

ఇక్కడ బుడగ అర్థగోళాకృతిలో ఉన్నందువల్ల దాని వ్యాసార్ధాన్ని కేశనాళిక వ్యాసార్ధానికి సమానంగా తీసుకోవడమైంది.

AP Inter 1st Year Physics Study Material Chapter 13 ఉష్ణోగతిక శాస్త్రం

Andhra Pradesh BIEAP AP Inter 1st Year Physics Study Material 13th Lesson ఉష్ణోగతిక శాస్త్రం Textbook Questions and Answers.

AP Inter 1st Year Physics Study Material 13th Lesson ఉష్ణోగతిక శాస్త్రం

అతిస్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
ఉష్ణ సమతాస్థితిని నిర్వచించండి. ఇది ఉష్ణగతిక శాస్త్ర శూన్యాంక నియమానికి ఎలా దారితీసిందో తెలపండి.
జవాబు:
రెండు వ్యవస్థల ఉష్ణోగ్రతలు సమానమయితే, అవి రెండు ఉష్ణసమతాస్థితిలో ఉన్నాయి అంటారు.

ఉష్ణగతిక శూన్యంక నియమము :
రెండువ్యవస్థలు (A, B)విడివిడిగా మూడవ వ్యవస్థ (C)తో ఉష్ణ సమతాస్థితిలో ఉంటే, ఆ రెండు వ్యవస్థలు ఒకదానికొకటి ఉష్ణ సమతాస్థితిలో ఉంటాయి.

ప్రశ్న 2.
కెలోరిని నిర్వచించండి. కెలోరి, ఉష్ణయాంత్రిక తుల్యాంకాల మధ్య గల సంబంధం ఏమిటి ?
జవాబు:
కెలోరి : ఒకగ్రాము నీటి ఉష్ణోగ్రతను 14.5°C నుండి 15.5°C వరకు పెంచుటకు కావల్సిన ఉష్ణరాశిని కెలోరి అంటారు. ఉష్ణ యాంత్రిక తుల్యాంకము (J) మరియు కెలోరిల మధ్య సంబంధం 1 = 4.186 జౌల్/ కెలోరి.

ప్రశ్న 3.
a) శూన్యాంక నియమం, b) మొదటి నియమాల వల్ల ఏ ఉష్ణగతిక చరరాశులు నిర్వచించడమైంది?
జవాబు:
a) ఉష్ణోగ్రత
b) ఆంతరిక శక్తి

ప్రశ్న 4.

పదార్థ విశిష్టోష్ణ సామర్థ్యాన్ని నిర్వచించండి.
జవాబు:
విశిష్టోష్ణ సామర్థ్యం :
ప్రమాణ ద్రవ్యరాశి గల పదార్థము యొక్క ఉష్ణోగ్రతను 1°C లేదా 1° k పెంచుటకు కావల్సిన ఉష్ణరాశిని, ఆ పదార్థము విశిష్టోష్ణ సామర్థ్యం అంటారు.
S = \(\frac{1}{m} \frac{\Delta Q}{\Delta T}\)
ఇది 1) పదార్థ స్వభావం 2) ఉష్ణోగ్రతపై ఆధారపడును.

ప్రశ్న 5.
మోలార్ విశిష్టోష్ణ సామార్థ్యాన్ని నిర్వచించండి.
జవాబు:
ఒక గ్రామ్- మోల్ పదార్థ ఉష్ణోగ్రతను 1 °C లేక 1°K పెంచటానికి కావల్సిన ఉష్ణరాశిని మోలార్ విశిష్టోష్ణం అంటారు.

AP Inter 1st Year Physics Study Material Chapter 13 ఉష్ణోగతిక శాస్త్రం

ప్రశ్న 6.
ఒక ఘన పదార్థంలో ఒక డోలకం మొత్తం శక్తి ఎంత?
జవాబు:
ఒక మోల్ ఘనపదార్థమునకు, డోలకం మొత్తం శక్తి, U = 3KB T × NA = 3RT.

ప్రశ్న 7.
నీటి విశిష్టోష్ణం ఉష్ణోగ్రతతో పాటు మారడాన్ని తెలియచేసే గ్రాఫ్ను సూచించండి. ఇది దేనిని తెలియచేస్తుంది?
జవాబు:
ప్రాముఖ్యత :
నీటి విశిష్టోష్ణం, 0°C నుండి 100°C వ్యాప్తిలో స్వల్పంగా మారును.

ప్రశ్న 8.
స్థితి చరరాశులను, స్థితి సమీకరణాన్ని నిర్వచించండి.
జవాబు:
స్థితి చరరాశులు(State variables) :
పీడనం P, ఉష్ణోగ్రత T, సాంద్రత p (ఇంటెన్సివ్ కారకాలు) మరియు అంతరికశక్తి U, ఘనపరిమాణం, V మొత్తం ద్రవ్యరాశి M (ఎక్స్టెన్సివ్ కారకాలు) లు వ్యవస్థ స్థితిని వివరించును. వీటిని స్థితి చర రాశులు అంటారు.

స్థితి సమీకరణం : స్థితి, చరరాశుల మధ్య సంబంధంను తెల్పే సమీకరణంను స్థితి సమీకరణం అంటారు.

ప్రశ్న 9.
100% దక్షతతో పనిచేసే ఉష్ణయంత్రాన్ని తయారు చేయడం సాధ్యం కాదు. ఎందుకు ?
జవాబు:
ఉష్ణయంత్రం’ దక్షత η = 1 – \(\frac{Q_2}{Q_1}\)

Q2 = 0, η  = 1, i.e., యంత్రం, ఉష్ణాన్ని పనిగా మార్చి 100% దక్షత కలిగి ఉండును. ఇటువంటి యంత్రము ఉష్ణగతిక ప్రథమ నియమాన్ని వ్యతిరేఖించదు. కాని అనుభవ పూర్వకంగా η = 1 గల ఆదర్శ యంత్రం సాధ్యపడదు.

ప్రశ్న 10.
వేసవి కాలంలో సైకిల్ ట్యూబ్ నుంచి గాలిని తొలగిస్తున్నప్పుడు ఆ గాలి చల్లగా అనిపించడానికి కారణం ఏమిటి?
జవాబు:
సైకిలో ట్యూబ్లో గాలి బయటకు వచ్చినపుడు స్థిరోష్ణక వ్యాకోచం వల్ల గాలి చల్లగా ఉండును.

ప్రశ్న 11.
ఒక మోటారు వాహనాన్ని ఏటవాలు రోడ్డుపై దిగువకు స్థిరవడితో ప్రయాణం చేసేటట్లు బ్రేకులను ఉపయోగిస్తే బ్రేక్ డ్రమ్ములు ఎందుకు వేడెక్కుతాయి?
జవాబు:
బ్రేక్ డ్రమ్, చక్రంపై చేయుపని ఘర్షణవల్ల ఉష్ణంగా మారును.

AP Inter 1st Year Physics Study Material Chapter 13 ఉష్ణోగతిక శాస్త్రం

ప్రశ్న 12.
విద్యుత్ శీతలీకరణ యంత్రాన్ని (రిఫ్రిజిరేటర్) తెరచి ఉంచి గదిని చల్లబరచడం సాధ్యమవుతుందా?
జవాబు:
విద్యుత్ శీతలీకరణ యంత్రం : తలుపును తెరిచిన గది చల్లబడక, గది స్వల్పంగా వేడెక్కును.

ప్రశ్న 13.
వ్యవస్థ ఘనపరిమాణాన్ని 50%కి తగ్గించినప్పుడు, స్థిరోష్టక లేదా సమఉష్ణోగ్రతా ప్రక్రియలలో దేనిలో పీడనం అధికంగా పెరుగుతుంది?
జవాబు:
సమ ఉష్ణోగ్రత ప్రక్రియ P1V2 = P2V2ను పాటించును.
AP Inter 1st Year Physics Study Material Chapter 13 ఉష్ణోగతిక శాస్త్రం 1
∴ సమ ఉష్ణోగ్రత ప్రక్రియ కన్నా స్థిరోష్ణక ప్రక్రియలో పీడనము ఎక్కువ.

ప్రశ్న 14.
ఒక థర్మాస్ ఫ్లాస్లో ఉన్న ద్రవాన్ని బాగా కుదిపితే, దాని ఉష్ణోగ్రత ఏమవుతుంది?
జవాబు:
థర్మాస్ ప్లాస్క్ లో ఉన్న ద్రవాన్ని బాగా కుదిపితే, ద్రవముపై జరిగిన పని దాని అంతర్గత శక్తిగా మారుతుంది. అందువల్ల ద్రవం యొక్క ఉష్ణోగ్రత పెరుగుతుంది.

ప్రశ్న 15.
వాయువుతో నిండి ఉన్న గొట్టంలోకి ఒక ధ్వని తరంగాన్ని పంపితే దాని అంతరిక శక్తి మారుతుందా?
జవాబు:
ధ్వని తరంగాన్ని, వాయు గొట్టం లోనికి పంపితే అంతరిక శక్తి పెరుగును.

ప్రశ్న 16.
i) సమ ఉష్ణోగ్రతా ప్రక్రియ
ii) స్థిరోష్ణక ప్రక్రియలలో అంతరిక శక్తిలోని మార్పు ఎంత?
జవాబు:
i) సమ ఉష్ణోగ్రత ప్రక్రియలో అంతరిక శక్తిలో మార్పు, dU = 0 [∵ U స్థిరాంకం]

ii) a) స్థిరోష్ణక సంకోచంలో అంతరిక శక్తిలోమార్పు పెరుగును.
b) స్థిరోష్ణక వ్యాకోచంలో అంతరిక శక్తిలో మార్పు తగ్గును.

ప్రశ్న 17.
రసాయనిక లేదా అణుకేంద్రాలలో వాడే శీతలీకరణి అధిక విశిష్టోష్టతను కలిగి ఉంటుంది. ఎందుకు?
జవాబు:
రసాయనిక మరియు అణు కేంద్రాలలో ఎక్కువ ఉష్ణం విడుదల యగును. ఈ ఉష్ణంను శోషించుటకు, శీతలీకరణి స్వల్ప ఉష్ణోగ్రత పెరుగుదలకు, ఎక్కువ ఉష్ణధారణ ధర్మాని కల్గి ఉండాలి.

AP Inter 1st Year Physics Study Material Chapter 13 ఉష్ణోగతిక శాస్త్రం

ప్రశ్న 18.
i) సమ ఘనపరిమాణ ప్రక్రియ,
ii) సమ పీడన ప్రక్రియలను గురించి వివరించండి.
జవాబు:
i) స్థిర ఘనపరిమాణ ప్రక్రియ :
స్థిర ఘనపరిమాణం వద్ద జరిగే ప్రక్రియను స్థిర ఘన పరిమాణ ప్రక్రియ అంటారు. ఈప్రక్రియలో వాయువుపై లేక వాయువు చేత పని జరగదు. వాయువు అంతరిక శక్తి మరియు ఉష్ణోగ్రత మారును.

ii) సమపీడన ప్రక్రియ :
స్థిర పీడనం వద్ద జరిగే ప్రక్రియను సమపీడన ప్రక్రియ అంటారు. ఈ ప్రక్రియలో అంతరికశక్తి, ఉష్ణోగ్రతలు మారును. ఈ ప్రక్రియలో గ్రహించిన ఉష్ణరాశి, పాక్షికంగా అంతరిక శక్తిలో పెరుగుదల మరియు పాక్షికంగా జరిగిన పనికి సమానం.

స్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
ఉష్ణగతికశాస్త్ర మొదటి నియమాన్ని నిర్వచించి, వివరించండి.
జవాబు:
నిర్వచనం :
“ఒక వ్యవస్థకి ఇచ్చిన ఉష్ణరాశి, ఆవ్యవస్థ అంతరిక శక్తి పెరుగుదలకు మరియు అది చేసిన బాహ్య పనుల మొత్తంనకు సమానము”.

వివరణ :
ఒకవ్యవస్థకు ∆Q ఉష్ణరాశిన యిస్తే, అందులో కొంత భాగం అంతరిక శక్తి ∆U పెరుగుటకు, మిగిలినది బాహ్యపని ∆W చేయుటకు ఉపయోగపడును. ఈ నియమ గణిత సమీకరణం చేయుటకు ఉపయోగపడును. ఈ నియమ గణిత సమీకరణం చేయుటకు ఉపయోగపడును. ఈ నియమ గణిత సమీకరణం ∆Q = ∆U + ∆W ఇది శక్తి నిత్యత్వ నియమ ప్రత్యేక సందర్భము.

ప్రశ్న 2.
వాయువుల రెండు ప్రధాన విశిష్టోష్టాలను నిర్వచించండి. ఆ రెండింటిలో ఏది ఎక్కువ? ఎందుకు?
జవాబు:
ఒక వాయువుకు రెండు ప్రధాన విశిష్టోష్టాలు కలవు. అవి 1) స్థిర పీడనం వద్ద మోలార్ విశిష్టోష్ణం 2) స్థిర ఘన పరిమాణం వద్ద మోలార్ విశిష్టోష్ణం

1. స్థిర పీడనం వద్ద మోలార్ విశిష్టోష్టం (Cp) :
స్థిరపీడనం వద్ద ఒక గ్రామ్- మోల్ వాయువు యొక్క ఉష్ణోగ్రతను 1°C పెంచుటకు కావల్సిన ఉష్ణరాశిని స్థిరపీడనం వద్ద మోలార్ విశిష్టోష్ణం అంటారు.
i.e., Cp = \(\frac{1}{\mu} \frac{\Delta Q}{\Delta T}\) ఇక్కడ μ మోలుల సంఖ్య.

2. స్థిరఘనపరిమాణం వద్ద మోలార్ విశిష్టోష్ణం (Cv) :
స్థిర ఘనపరిమాణం వద్ద ఒక గ్రామ్ – మోల్ వాయువు యొక్క ఉష్ణోగ్రతను 1°C పెంచుటకు కావల్సిన ఉష్ణరాశిని స్థిర ఘనపరిమాణం వద్ద మోలార్ విశిష్టోష్ణం అంటారు.
i.e., Cv = \(\frac{1}{\mu} \frac{\Delta Q}{\Delta T}\)

Cp > Cv వివరణ :
స్థిర ఘనపరిమాణం వద్ద ఒక వాయువుకు ఇచ్చిన ఉష్ణరాశి C, అంతా దాని అంతర్గత శక్తి పెరుగుదల లేదా మార్పునకు ఉపయోగపడుతుంది.

కాని స్థిర పీడనం వద్ద ఇచ్చిన ఉష్ణరాశి (Cp), దాని అంతర్గత శక్తి పెరుగుదలకు మరియు వాయువు చేసే పనికి ఉపయోగపడును. అందువలన ఒక వాయువు యొక్క ఉష్ణోగ్రతను 1°C పెంచడానికి స్థిర ఘనపరిమాణం వద్ద కన్నా, స్థిరపీడనం వద్ద ఇవ్వవలసిన ఉష్ణరాశి ఎక్కువగా ఉండును. అందువలన Cp విలువ Cv (Cp > Cv) కన్నా ఎక్కువ.

AP Inter 1st Year Physics Study Material Chapter 13 ఉష్ణోగతిక శాస్త్రం

ప్రశ్న 3.
ఉష్ణగతికశాస్త్ర మొదటి నియమం ఆధారంగా, వాయువు రెండు విశిష్టోష్ణ సామర్థ్యాల మధ్య ఉన్న సంబంధాన్ని ఉత్పాదించండి.
జవాబు:
ఒక మోల్ వాయువుకు, ఉష్ణగతిక శాస్త్ర ప్రథమ నియము గణిత సమీకరణము,
∆Q = ∆U + P∆V
స్థిర ఘనపరిమాణం వద్ద ∆Q ఉష్ణరాశిని గ్రహిస్తే, ∆V = 0
AP Inter 1st Year Physics Study Material Chapter 13 ఉష్ణోగతిక శాస్త్రం 2

ఆదర్శవాయువు U, T పై ఆధారపడును. కావున మొదటి భాగంలోని అథో సూచిక P వదలి వేయబడింది.
ఒక మోల్ ఆదర్శ వాయువుకు, PV = RT
⇒ P \(\left[\frac{\Delta V}{\Delta T}\right]_p\) = R ………………. (3)
(1) మరియు (3) లను (2)లో ప్రతిక్షేపించగా
Cp = Cv + R
∴ Cp – Cv = R.

ప్రశ్న 4.
సమ ఉష్ణోగ్రతా ప్రక్రియలో ఒక వాయువు చేసిన పనికి సమాసాన్ని సాధించండి.
జవాబు:
సమ ఉష్ణోగ్రతా ప్రక్రియతో ఆదర్శ వాయువు చేసిన పనికి సమాసము :
స్థిర ఉష్ణోగ్రత T వద్ద, నిర్ధిష్ట ఆదర్శవాయువు, ఘనపరిమాణం V1 నుండి V2 వ్యాకోచం చెందిదని తీసుకుందాము. అప్పుడు పీడనం P1 నుండి P2 కి మారిందని తీసుకుందాము.

P స్థిరపీడనం వద్ద ఘనపరిమాణం V1 నుండి V2 కి వ్యాకోచంలో జరిగిన పని dw = pdv
ఘనపరిమాణం V1 నుండి V2 కి వ్యాకోచంలో జరిగిన
AP Inter 1st Year Physics Study Material Chapter 13 ఉష్ణోగతిక శాస్త్రం 3

ప్రశ్న 5.
స్థిరోష్ణక ప్రక్రియలో ఒక వాయువు చేసిన పనికి సమాసాన్ని సాధించి, వివరించండి.
జవాబు:
స్థిరోష్ణక ప్రక్రియలో ఆదర్శవాయువు చేసిన పనికి సమాసము :
స్థిరోష్టక ప్రక్రియలో ఆదర్శవాయువు (P1, V1, T1) స్థితి నుండి (P2, V2, T2) స్థితికి మారిందని భావిద్దాం. స్థిరపీడనం P వద్ద, స్వల్ప ఘనపరిమాణంలోని మార్పు dV కు జరిగిన పని dw = pdV

ఘనపరిమాణం V1 నుండి V2 కి జరిగిన మొత్తం పని
AP Inter 1st Year Physics Study Material Chapter 13 ఉష్ణోగతిక శాస్త్రం 4
సమీకరణం (3)ను (1) లో వ్రాయగా
AP Inter 1st Year Physics Study Material Chapter 13 ఉష్ణోగతిక శాస్త్రం 5

ఇదియే స్థిరోష్ణక మార్పులో జరిగిన పనికి సమాసము.

ప్రశ్న 6.
సమ ఉష్ణోగ్రత, స్థిరోష్ణక ప్రక్రియలను పోల్చండి.
జవాబు:

సమ ఉష్ణోగ్రత ప్రక్రియస్థిరోష్ణక ప్రక్రియ
1. స్థిర ఉష్ణోగ్రత వద్ద ఒక వాయువు యొక్క పీడనం మరియు ఘనపరిమాణం మారే ప్రక్రియను సమ ఉష్ణోగ్రత ప్రక్రియ అంటారు.1. స్థిర ఉష్ణం వద్ద వియుక్త వ్యవస్థలోని పీడనం మరియు ఘనపరిమాణంలు మారే ప్రక్రియను స్థిరోష్ణక ప్రక్రియ అంటారు.
2. వాయువు ఉష్ణోగ్రత స్థిరం2. వాయువు ఉష్ణోగ్రత మారును.
3. ఉష్ణం మారు చుండును.3. ఉష్ణమార్పు సున్నా.
4. అంతరిక శక్తి స్థిరం. అంతరిక శక్తిలో మార్పు సున్నా4. అంతరిక శక్తి మారును.
5. ఈ ప్రక్రియ నెమ్మదిగా జరుగును.5. ఈ ప్రక్రియ త్వరితంగా జరుగును.
6. బాయిల్ నియమము PV = = స్థిరాంకమును పాటించును.6. PVr = స్థిరాంకంను పాటించును.
7. జరిగిన పని W = RT loge \(\frac{V_2}{V_1}\)7. జరిగిన పని W = \(\frac{R}{(\gamma-1)}\)

ప్రశ్న 7.
కింది ప్రక్రియలను ఉదాహరణతో వివరించండి.
i) చక్రీయ ప్రక్రియ
ii) చక్రీయం కానటువంటి ప్రక్రియ
జవాబు:
i) చక్రీయ ప్రక్రియ (Cyclic Process):
“వేర్వేరు దశలు (పీడనం, ఘనపరిమాణం మరియు ఉష్ణోగ్రతలలో కలిగే మార్పులు) పొందిన తరువాత ‘ఒక వ్యవస్థ తిరిగి మరల తొలి స్థితిని పొందే ప్రక్రియను చక్రీయ ప్రక్రియ (Cyclic Process) అంటారు. చక్రీయ ప్రక్రియ,P-V గ్రాఫ్ ఒక సంవృత వక్రంను ఇచ్చును. P-V గ్రాఫ్ వైశాల్యం పదార్థం చేసిన పనికి సమానము.
ఒక చక్రీయ ప్రక్రియలో అంతరిక శక్తిలోమార్పు ఉండదు.
i.e., ∆U = 0
ఉష్ణ గతిక ప్రథమ శాస్త్ర నియమము ప్రకారము
∆Q = ∆U + ∆W
∴ చక్రీయ ప్రక్రియకు ∆Q = ∆W

చక్రీయ ప్రక్రియలో, వ్యవస్థ శోషణం చేసిన మొత్తం ఉష్ణం, వ్యవస్థ చేసిన పనికి సమానం.
ఉదా : ఉష్ణ యంత్రం అనే సాధనం, వ్యవస్థను చక్రీయ ప్రక్రియకు గురిచేసిన, ఫలితంగా ఉష్ణంగా మారును.

ii) చక్రీయం కానటువంటి ప్రక్రియ (Non-cyclic process) :
వేర్వేరు దశలలో మార్పులు (పీడనం, ఘనపరిమాణం మరియు ఉష్ణోగ్రతలలో) పొందుతూ, వ్యవస్థ తొలిస్థితిని చేరని ప్రక్రియను చక్రీయం కాని ప్రక్రియ అంటారు. ఉత్కమణీయ ప్రక్రియ చక్రీయం కాని ప్రక్రియ వక్రము మరియు ఘనపరిమాణంల మధ్య వైశాల్యము చక్రీయంకాని ప్రక్రియలోజరిగిన పనిని ఇస్తుంది.
ఉదా : 1) ద్రవాలు లేక వాయువుల విసరణం
2) పరిపూర్ణ వాయువు స్వేచ్ఛా వ్యాకోచం

AP Inter 1st Year Physics Study Material Chapter 13 ఉష్ణోగతిక శాస్త్రం

ప్రశ్న 8.
అర్థస్థితిక ప్రక్రియ మీద లఘుటీక రాయండి.
జవాబు:
ప్రతిదశలో, ప్రక్రియ పూర్తి అయ్యేవరకు, వ్యవస్థ పరిసరాలతో ఉష్ణ మరియు యాంత్రిక (ఉష్ణగతిక) సమతాస్థితిలో ఉండే విధంగా అత్యంత నెమ్మదిగా జరిగే ప్రక్రియను అర్ధస్టైతిక ప్రక్రియ అంటారు.

ఈ ప్రక్రియలో ప్రతి దశలోను, (వాయువు) పరిసరాలతో ఉష్ట్రీయ మరియు యాంత్రిక సమతాస్థితిలో ఉంటుంది. ప్రతిదశలోను వ్యవస్థ పీడనం (పాత్రలోని వాయువు) మరియు బాహ్యపీడనం మధ్యగల తేడా చాలా తక్కువగా ఉంటుంది. అదేవిధంగా ప్రతి స్థాయిలో వ్యవస్థ ఉష్ణోగ్రత మరియు పరిసర ఉష్ణోగ్రతల మధ్యగల తేడా చాలా తక్కువగా ఉంటుంది.
ఉదా : సమ ఉష్ణోగ్రత ప్రక్రియ, స్థిరోష్టక ప్రక్రియ.

ప్రశ్న 9.
ఉష్ణయంత్రం పనిచేసే విధానాన్ని వివరించండి.
జవాబు:
ఉష్ణయంత్రం :
ఉష్ణశక్తిని యాంత్రిక శక్తిగా మార్చే పరికరమే ఉష్ణయంత్రం. ఒక వ్యవస్థ చక్రీయ ప్రక్రియకు గురిచేస్తే, ఉష్ణం పనిగా మారుతుంది.

ఉష్ణయంత్రం మూడు ముఖ్యమైన భాగాలు కల్గిఉండును. అవి :
AP Inter 1st Year Physics Study Material Chapter 13 ఉష్ణోగతిక శాస్త్రం 6

i) ఉష్ణాశయం :
ఇది అధిక ఉష్ణోగ్రత T1 వద్ద ఉండును. దీని నుండి పనిచేసే పదార్థం Q1 ఉష్ణంను శోషించును గ్రహించును.

ii) పనిచేసే పదార్ధం :
ఇదే వ్యవస్థ అవుతుంది. ఆవిరి యంత్రంలో పనిచేసే పదార్థాం నీటి ఆవిరి. డీజిల్ యంత్రంలో పనిచేసే పదార్థం ఇంధన బాష్పం, గాలి మిశ్రమం.

iii) శీతలాశయం :
ఇది తక్కువ ఉష్ణోగ్రత T2 వద్ద ఉండును. పనిచేసే పదార్థం, Q2 ఉష్ణంను శీతలాశయంనకు విడుదల చేయును.

వ్యవస్థ చేసిన పని, పదార్థం గ్రహించిన మరియు విడుదల చేసిన ఉష్ణరాశుల భేదంనకు సమానం.
i.e., W = Q1 – Q2.

ఉష్ణ యంత్రం దక్షత :
చక్రీయ ప్రక్రియలో వ్యవస్థ చేసిన పనికి, శోషించిన ఉష్ణంనకు గల నిష్పత్తిని, ఉష్ణయంత్రం దక్షత అంటారు.
AP Inter 1st Year Physics Study Material Chapter 13 ఉష్ణోగతిక శాస్త్రం 7

దీర్ఘ సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
ఏకగత, ద్విగత ప్రక్రియలను వివరించండి. కార్నో యంత్రం పనిచేసే విధానాన్ని వివరించి, దాని దక్షతకు సమాసాన్ని రాబట్టండి. [Mar. ’14]
జవాబు:
ఉత్రమణీయ ప్రక్రియ (Reversible process) :
విశ్వంలో ఇతరత్రా ఎక్కడ ఏ విధమైన మార్పులు లేకుండా వ్యవస్థ మరియు పరిసరాలు తొలిదశకు చేరుకునేటట్లుగా, ఒక ప్రక్రియను అది సూటి ప్రక్రియలో ఏఏ దశల గుండా ప్రయాణం చేసిందో అదే దశల గుండా వెనుకకు తీసుకురాగల్గితే, ఆ ప్రక్రియను ఉత్రమణీయ ప్రక్రియ అంటారు.

ఇది కేవలం ఒక ఆదర్శ ప్రాయమైన అభిప్రాయం మాత్రమే.
ఉదా : i) నెమ్మది సముష్ణోగ్రత మరియు నెమ్మది స్థిరోష్ణక ప్రక్రియ.
ii) పెల్టియర్ మరియు సీబెక్ ప్రభావము
iii) మంచు ద్రవీభవన మరియు నీటి భాష్పీభవనము.

అనుత్రుమణీయ ప్రక్రియ (Irreversible process) :
వ్యతిరేఖ దశలో వెనుకకు మరలించి తీసుకురాలేని ప్రక్రియను అనుత్రమణీయ ప్రక్రియ అంటారు.

ప్రకృతిలో జరిగే అన్ని సహజ ప్రక్రియలు అనుత్రమణీయ ప్రక్రియలు.
ఉదా :
i) ఘర్షణకు వ్యతిరేఖంగా జరిగినపని
ii) ఒక వాహకం గుండా విద్యుత్ను ప్రవహింప చేసినపుడు దానిలో ఉష్ణం జనించడం.
iii) వాయువుల విసరణం

కార్నో యంత్రం :
రెండు ఉష్ణోగ్రతల మధ్య నడిచే అనుత్రమణీయ ఉష్ణయంత్రంను కార్నో యంత్రం అంటారు. ఇది పనిచేసే సంవృత చక్రంను, కార్నో చక్రం అంటారు. ఈ చక్రీయ ప్రక్రియలో (ఆదర్శవాయువు) పనిచేసే పదార్థము రెండు సమ ఉష్ణోగ్రత ప్రక్రియలు P మరియు రెండు స్థిరోష్ణక ప్రక్రియలకు గురియగును. నాల్గు ప్రక్రియలు P-V (సూచి పటంలో చూపబడినవి).
AP Inter 1st Year Physics Study Material Chapter 13 ఉష్ణోగతిక శాస్త్రం 8

ఒకటవ అంచె స్టెప్ 1 → 2 :
సమ ఉష్ణోగ్రత వ్యాకోచంలో వాయువు (P1, V1, T1) స్థితి నుండి (P2, V2, T1)కి మారింది. ఇది వక్రం (a)లో చూపబడింది. T1 ఉష్ణోగ్రత వద్ద నున్న రిజర్వాయర్ నుండి వాయువు శోషణం చేసుకున్న ఉష్ణం (Q1) వాయువు చేసే పనికి సమానము.
i.e., W1→2 = Q1 = µRT1 loge\(\frac{V_2}{V_1}\) → (1)

రెండవ అంచె స్టెప్ 2 → 3 :
స్థిరోష్ణక వ్యాకోచంలో వాయువు (P2, V2, T1) స్థితికి నుండి (P3, V3, T2) కి మారింది. ఇది వక్రం (b) లో చూపబడింది. వాయువు చేసే పని W2→3 = \(\frac{\mu R\left(T_1-T_2\right)}{(\gamma-1)}\)

మూడవ అంచె స్టెప్ 3 → 4 :
సమ ఉష్ణోగ్రత సంకోచంలో వాయువు (P3, V3, T2) నుండి (P4, V4, T2)స్థితికి మారింది. ఇది వక్రం (C)లో చూపబడింది.
T2 ఉష్ణోగ్రత వద్ద నున్న రిజర్వాయర్కు వాయువు ఇచ్చిన ఉష్ణం, వాయువుపై జరిగిన పనికి సమానము.

నాల్గవ అంచే స్టెప్ 4 → 1 :
స్థిరోష్ణక సంకోచంలో వాయువు (P4, V4, T2) స్థితి నుండి (P1, V1, T1) కి మారింది. ఇది
AP Inter 1st Year Physics Study Material Chapter 13 ఉష్ణోగతిక శాస్త్రం 9

AP Inter 1st Year Physics Study Material Chapter 13 ఉష్ణోగతిక శాస్త్రం

ప్రశ్న 2.
ఉష్ణగతిక శాస్త్ర రెండవ నియమాన్ని నిర్వచించండి. ఉష్ణ యంత్రం శీతలీకరణ యంత్రం కంటే ఏ విధంగా భిన్నమయిందో తెలపండి. [Mar., May ’13]
జవాబు:
ఉష్ణగతిక రెండవ నియమము ఉష్ణప్రవాహ దిశను తెల్పును. రెండవ నియమము రెండు ప్రవచనాలను కల్గి ఉన్నది.

1) కెల్విన్ – ప్లాంక్ ప్రవచనము :
ఒక ఉష్ణాశయం నుంచి శోషణం చేసుకున్న మొత్తం ఫలిత ఉష్ణం, పూర్తిగా పనిగా మార్చడం ఏప్రక్రియకు సాధ్యం కాదు.

“ఒక వస్తువును తన పరిసరాలలో చల్లని దానికంటే చల్లగా అయ్యేటట్లు చేయగలిగి నిరంతరం పనిని సృజించడం అసాధ్యం”.

2) క్లాసియస్ నిర్వచనం :
“ఒక చల్లని వస్తువు నుండి వేడి వస్తువుకు ఉష్ణం బదిలీ చేయటానికి ఏ ప్రక్రియకు సాధ్యంకాదు”
(లేక)
“ఉష్ణం తనంతట తాను తక్కువ ఉష్ణోగ్రత గల వస్తువు నుండి హెచ్చు ఉష్ణోగ్రత గల వస్తువుకు ప్రవహించదు”.

ఉష్ణ యంత్రం :
ఉష్ణశక్తిని యాంత్రిక శక్తిగా మార్చే సాధనాన్ని ఉష్ణయంత్రం అంటారు.
ఉష్ణయంత్రం మూడు ముఖ్యమైన భాగాలను కల్గియుండును.
AP Inter 1st Year Physics Study Material Chapter 13 ఉష్ణోగతిక శాస్త్రం 10

1) ఉష్ణాశయం లేక వేడి రిజర్వాయర్ :
ఇది అధిక ఉష్ణోగ్రత T, వద్ద ఉండును. ఈ వస్తువు నుండి ఉష్ణంను గ్రహించ వచ్చును.

2) పనిచేసే పదార్థము :
ఆవిరి యంత్రంలో పనిచేసే పదార్థము ఆవిరి. డీజిల్ యంత్రంలో పనిచేసే పదార్థము ఇంధన ఆవిరి మరియు గాలి మిశ్రమము.

3) సింక్ లేక చల్లని రిజర్వాయర్ :
ఇది అల్ప ఉష్ణోగ్రత T,వద్ద ఉండును పని చేసే పదార్థం విసర్జించిన ఉష్ణంను, సింక్ శోషణం చేస్తుంది.

జరిగిన పని :
జనకం నుండి శోషణం చేసిన ఉష్ణము మరియు సింకు విసర్జించిన ఉష్ణంనకు గల తేడా యంత్రం చేసిన పనికి సమానము.
i.e., W = Q1 – Q2.

దక్షత :
యంత్రం చేసిన పని(W)కి మరియు యంత్రం శోషణం చేసిన ఉష్ణం (Q1)కు గల నిష్పత్తిని, యంత్రం దక్షత అంటారు.
AP Inter 1st Year Physics Study Material Chapter 13 ఉష్ణోగతిక శాస్త్రం 11

శీతలీకరణ యంత్రము (రిఫ్రిజరేటర్) :
ఉష్ణయంత్రంనకు వ్యతిరేఖ దిశలో పనిచేయు ఉష్ణపంప న్ను యంత్రం (రిఫ్రిజరేటర్) అంటారు.
AP Inter 1st Year Physics Study Material Chapter 13 ఉష్ణోగతిక శాస్త్రం 12

ఉష్ణయంత్రం యొక్క విలోమ ప్రక్రియే శీతలీకరణ యంత్రం. శీతలీకరణ యంత్రంలో పనిచేసే పదార్థం తక్కువ ఉష్ణోగ్రత T2 వద్ద చల్లని రిజర్వాయర్ (సింక్) నుంచి Q2 ఉష్ణాన్ని గ్రహించి, పనిచేసే పదార్థంపై కొంత బాహ్యపని (W) జరిగి, చివరకు Q1 ఉష్ణంను T1 అధిక ఉష్ణోగ్రత వద్ద ఉన్న ఉష్ణాశయం కు అందజేయబడుతుంది.

శీతలీకరణ యంత్రం యొక్క క్రియాశీలక గుణకంను
AP Inter 1st Year Physics Study Material Chapter 13 ఉష్ణోగతిక శాస్త్రం 13

ఉష్ణయంత్రం దక్షత (1) 1 కన్నా ఎక్కువ ఉండదు. శీతలీకరణ యంత్రంనకు క్రియశీలక గుణకం (α) 1 కన్నా ఎక్కువ
∴ శీతలీకరణ యంత్రం, ఉష్ణయంత్రము విలోమము.

లెక్కలు (Problems)

ప్రశ్న 1.
N.T.P. వద్ద 1 లీటరు ఘనపరిమాణం ఉన్న ఒక ఏకపరమాణుక ఆదర్శ వాయువును సంపీడనం చేశారు. (i) సంపీడనం స్థిరోష్ణకమై, ఘనపరిమాణం సగం అయితే వాయువు మీద జరిగిన పనిని, (ii) సంపీడనం సమఉష్ణోగ్రతమైతే జరిగిన పనిని లెక్కించండి. (γ = 5/3)
సాధన:
AP Inter 1st Year Physics Study Material Chapter 13 ఉష్ణోగతిక శాస్త్రం 14
AP Inter 1st Year Physics Study Material Chapter 13 ఉష్ణోగతిక శాస్త్రం 15

ప్రశ్న 2.
5 మోల్ల హైడ్రోజన్ ను స్థిరపీడనం 105 N/m² వద్ద ఉష్ణోగ్రతలో పెరుగుదల 20 K ఉండేటట్లు వేడిచేస్తే అది 8.3 × 10-3m³ ల వ్యాకోచం చెందింది. Cv = 20 J/mole K అయితే Cpని కనుక్కోండి.
సాధన:
మేయర్స్ సంబంధం Cp – Cv = R
µ∆T చే గుణించగా
µCp∆T – µCv∆T = µ R∆T
µ ∆T(Cp – Cv) = P∆T [∴ µ R∆T = P∆V]
5 × 20 (Cp − 20) = 105 × 8.3 × (10 – 3)
[∴ µ = 5, ∆T = 20 K, P. = 1 × 105 N/m² Cv = 20 J/mole K మరియు ∆V = 8.3 × 10³ M³]
Cp – 20 = 8.3
∴ Cp = 28.3 J/mole-K

AP Inter 1st Year Physics Study Material Chapter 13 ఉష్ణోగతిక శాస్త్రం

ప్రశ్న 3.
20°C వద్ద ఉన్న 100 g ద్రవ్యరాశి ఉన్న నీటి ఉష్ణోగ్రతను 5°C వరకూ పెంచాలంటే 100°C ఉష్ణోగ్రత వద్ద ఉన్న ఎంత నీటి ఆవిరిని ఆ నీటిలోకి పంపాలి? (బాష్పీభవన గుప్తోష్ణం 540 cal/g, నీటి విశిష్టోష్ణం 1 cal/g°C)
సాధన:
మిశ్రమ సూత్రం ప్రకారము,
ఆవిరి కోల్పోయిన ఉష్ణరాశి = నీరు గ్రహించిన ఉష్ణరాశి
msLs + msS (100 – t) = mwS(t – 20)
ఇచ్చట ms ఆవిరి ద్రవ్యరాశి, Ls ఆవిరి గుప్తోష్ణం, S ఆవిరి విశిష్టోష్ణం మరియు mw నీటి ద్రవ్యరాశి.
ఇచ్చట Ls = 540 cal/g; S = 1 cal/g°C; mw
= 100 g; t = 20 + 5 = 25°C
Ms × 540 + Ms × 1(100 – 25) = 100 × 1(25 – 20)
615 ms = 500
ms = \(\frac{500}{615}\) = 0.813 g

అదనపు లెక్కలు (Additional Problems)

ప్రశ్న 1.
ఒక గీజరు నిముషానికి 3.0 లీటర్ల ప్రవాహ రేటు కలిగిన నీటిని 27 °C నుంచి 77 °C వరకు వేడిచేస్తుంది. గీజరులో 4.0 × 104 J/g దహనోష్ణం గల సహజ వాయువు ఇంధనంగా పనిచేస్తే, ఇంధనం ఖర్చయ్యే రేటును కనుక్కోండి.
సాధన:
వేడిచేసిన, నీటిఘనపరిమాణం = 3.0 lit/min.
వేడిచేసిన, నీటి ద్రవ్యరాశి, m = 3000 g/min
ఉష్ణోగ్రతలో పెరుగుదల, ∆T = 77 – 27 = 50°C
నీటి విశిష్టోష్ణం, C = 42 Jg-1C-1
ఉపయోగించిన ఉష్ణపరిమాణం,
∆Q = mc∆T = 3000 × 4.2 × 50
63 × 104 J/min
ఉష్ణ దహనం = 4 × 104 J/g
ఇంధన దహన రేటు = \(\frac{63 \times 10^4}{4 \times 10^4}\)
= 15.75 g/min

ప్రశ్న 2.
స్థిరపీడనం వద్ద, గది ఉష్ణోగ్రత వద్ద ఉన్న 2.0 × 10-2 kgల నైట్రోజన్ ఉష్ణోగ్రతను 45°Cకు పెంచడానికి అందచేయాల్సిన ఉష్ణం ఎంత? (N2 అణు ద్రవ్యరాశి = 28; R = 8.3 J mol-1 K-1.)
సాధన:
వాయు ద్రవ్యరాశి, m = 2 × 10-2 kg = 20 g
ఉష్ణోగ్రతలో పెరుగుదల, ∆T = 45°C
కావల్సిన ఉష్ణం ∆Q = ?
అణుద్రవ్యరాశి, M = 28
AP Inter 1st Year Physics Study Material Chapter 13 ఉష్ణోగతిక శాస్త్రం 16

ప్రశ్న 3.
కింద ఇచ్చిన వాటిని వివరించండి.
a) T1, T2 ఉష్ణోగ్రతల వద్ద ఉన్న రెండు వస్తువులను ఒకదానితో ఒకటి తాకుతున్నట్లు ఉంచినప్పుడు వాటి సగటు ఉష్ణోగ్రత (T1 + T2)/2కు చేరాల్సిన అవసరం లేదు.
b) ఒక రసాయనిక లేదా న్యూక్లియర్ ప్లాంట్లో ఉపయోగించే శీతలీకరణి (ప్లాంట్ ని వివిధ భాగాలు అత్యధిక ఉష్ణోగ్రతలు పొందకుండా చల్లబరిచే ద్రవం తప్పకుండా అధిక విశిష్టోష్ణ సామర్థ్యాన్ని కలిగి ఉండాలి.
c) మోటారు వాహనం చలనంలో ఉన్నప్పుడు, దాని టైరులోని గాలి పీడనం పెరుగుతుంది.
d) ఒకే అక్షాంశంపై ఉన్న సముద్ర తీర పట్టణ వాతావరణం ఎడారి ప్రాంత పట్టణ వాతావరణం కంటే అధిక సమశీతోష్ణత కలిగి ఉంటుంది.
సాధన:
a) హెచ్చు ఉష్ణోగ్రత ఉన్న వస్తువు తక్కువ ఉష్ణోగ్రత ఉన్న వస్తువుతో ఉష్ణ స్పర్శలో ఉన్నప్పుడు, రెండు వస్తువుల ఉష్ణోగ్రతలు సమానమయ్యేంత వరకు ఉష్ణం ప్రవహించును. రెండు వస్తువుల ఉష్ణసామర్థ్యాలు సమానం అయిన తుది ఉష్ణోగ్రత, సరాసరి ఉష్ణోగ్రత (\(\frac{T_1+T_2}{2}\)) కు సమానము అగును.

b) పదార్థం గ్రహించిన ఉష్ణం, పదార్థ విశిష్టోష్ణంనకు అనులోమానుపాతంలో ఉండుటయే.

c) చలనంలో, చక్రం లోపల గాలి ఉష్ణోగ్రత పెరుగును. చార్లెస్ నియమము ప్రకారం, P α T. కావున చక్రం లోపల గాలిపీడనం పెరుగును.

d) ఎడారిటౌన్ కన్నా హార్బర్ టౌన్ సాపేక్ష తేమ ఎక్కువగా ఉండును. కావున హార్బర్ టౌన్ వేడిగా లేక చల్లగా ఉండదు.

ప్రశ్న 4.
కదలగలిగే ముషలకం ఉన్న ఒక స్థూపాకార పాత్రలో, సాధారణ ఉష్ణోగ్రతా పీడనాల వద్ద 3 మోల్ల హైడ్రోజన్ వాయువు ఉంది. పాత్ర గోడలు, ముషలకాలు ఉష్ణబంధక పదార్థంతో చేయడమైంది. ముషలకం పైన కొంత ఇసుక ఉన్నది. వాయువును, దాని తొలి ఘనపరిమాణంలో సగానికి తగ్గేటట్లుగా సంపీడనం చెందిస్తే వాయు పీడనం ఎన్ని రెట్లు పెరుగుతుంది?
సాధన:
ఉష్ణ వినిమయము జరగటానికి వీలులేని ప్రక్రియ స్థిరోష్ణక ప్రక్రియ.
AP Inter 1st Year Physics Study Material Chapter 13 ఉష్ణోగతిక శాస్త్రం 17

ప్రశ్న 5.
ఒక వాయువును స్థిరోష్ణక ప్రక్రియ ద్వారా సమతాస్థితి A నుంచి మరొక సమతాస్థితి B కి మార్చడానికి, దానిపై 22.3 Jల పని జరపడ మైంది. వాయువు 9.35 cal నికర ఉష్ణాన్ని గ్రహించేటట్లుగా ఒక ప్రక్రియ ద్వారా వాయు స్థితిని A నుంచి Bకి చేర్చితే ఈ ప్రక్రియలో వాయువుపై జరిగిన నికర పని ఎంత? (1 cal = 4.19 J తీసుకోండి.)
సాధన:
మార్పు స్థిరోష్ణకమయితే, ∆Q = 0, ∆w = -22.3 J
వ్యవస్థ ఆంతరిక శక్తిలో మార్పు ∆u అయితే,
అప్పుడు ∆Q = ∆u + ∆w
O = ∆u – 22.3 (లేదా) ∆u = 22.3 J
2వ సందర్భంలో, ∆Q = 9.35 cal
= 9.35 × 4.2 J
= 39.3 J

∆w = ?
∆u + ∆w = ∆Q
∆w + ∆Q – ∆u
= 39.3 – 22.3 = 17.0 J

ప్రశ్న 6.
సమాన ఘనపరిమాణాలున్న A, B రెండు స్థూపాకార పాత్రలను ఒక స్టాప్ రాక్ (ప్రవాహ నియంత్రణ మర)తో కలపడమైంది. పాత్ర Aలో సాధారణ ఉష్ణోగ్రతా పీడనాల వద్ద ఒక వాయువు ఉన్నది. B పూర్తిగా శూన్యం చేయడమైంది. ఈ మొత్తం వ్యవస్థ అంతా ఉష్ణ బంధకం చేయడమైంది. స్టాపిక్ను ఒక్కసారిగా తెరిచారు. కింది ప్రశ్నలకు సమాధానాలు తెలపండి.
a) A, B లలో వాయువు తుది పీడనం ఎంత?
b) వాయువు అంతరిక శక్తిలో మార్పు ఎంత?
c) వాయువు ఉష్ణోగ్రతలో మార్పు ఎంత?
d) వ్యవస్థ యొక్క మధ్యస్థ స్థితులు (తుది సమతాస్థితిని చేరడానికి పూర్వం) P-V-T గ్రాఫ్ తలంపై ఉంటాయా?
సాధన:
a) స్టాప్కాక్ ఆకస్మికంగా తెరిచిన, 1 ఎట్మాస్ఫియర్ పీడనం వద్ద లభ్యమగు వాయు ఘనపరిమాణం రెండు రెట్లు అగును. కావున పీడనం 0.5 ఎట్మాస్ఫియర్.

b) వాయువుపై పని జరగక పోవడం వల్ల, అంతరిక శక్తిలో మార్పు ఉండదు.

c) వాయువు వ్యాకోచంలో పనిజరగకపోతే, వాయు ఉష్ణోగ్రతలో మార్పు ఉండదు.

d) కాదు. కారణం స్వేచ్ఛావ్యాకోచ ప్రక్రియ మరియు అదుపులో ఉంచలేము. ఈ ప్రక్రియలో, వాయువు సమతాస్థితిలోనికి తిరిగి వచ్చును.

AP Inter 1st Year Physics Study Material Chapter 13 ఉష్ణోగతిక శాస్త్రం

ప్రశ్న 7.
ఒక ఆవిరి యంత్రం నిమిషానికి 5.4 × 108J ల పని జరిపి, నిమిషానికి 3.6 × 109J ల ఉష్ణాన్ని దాని బాయిలర్ ద్వారా సరఫరా చేస్తుంది. ఆ యంత్రం దక్షత ఎంత? నిమిషానికి ఎంత ఉష్ణం వృధాగా పోతుంది?
సాధన:
నిమిషానికి జరిగిన పని = 5.4 × 108 J
నిమిషానికి శోషణం చేసిన ఉష్ణం = 3.6 × 109 J
AP Inter 1st Year Physics Study Material Chapter 13 ఉష్ణోగతిక శాస్త్రం 18
నిమిషానికి ఉపయోగపడని ఉష్ణశక్తి = నిమిషానికి
ఉష్ణశోషణం – నిమిషానికి ఉపయోగపడిన ఉష్ణం
= 3.6 × 109 – 5.4 × 108
= 109 (3.6 -0.54)
= 3.06 × 109

ప్రశ్న 8.
ఒక ఎలక్ట్రిక్ హీటరు 100 W రేటు చొప్పున సాధన. పటం నుండి, పీడనంలో మార్పు, ఉష్ణాన్ని ఒక వ్యవస్థకు అందచేస్తుంది. వ్యవస్థ సెకనుకు 75 jల రేటు చొప్పున పనిచేస్తుంటే, అంతరిక శక్తి ఏ రేటుతో పెరుగుతుది?
సాధన:
సప్లై చేసిన ఉష్ణం ∆Q = 100 w = 100 J/s
ఉపయోగపడిన పని, ∆W = 75 J/s
సెకనుకు అంతరిక శక్తిలో పెరుగుదల, ∆u = ?
As ∆Q = ∆u + ∆w
∴ ∆u = ∆Q + ∆w
= 100 – 75
= 25 J/S

ప్రశ్న 9.
ఒక ఉష్ణగతిక వ్యవస్థను దాని నిజ స్థితి నుంచి ఒక మధ్యస్థ స్థితికి, రేఖీయ ప్రక్రియ ద్వారా పటంలో చూపినట్లుగా తీసుకోవడమైంది.
AP Inter 1st Year Physics Study Material Chapter 13 ఉష్ణోగతిక శాస్త్రం 19
వ్యవస్థ ఘనపరిమాణం, నిజ విలువకు E నుంచి F కు సమపీడన ప్రక్రియ ద్వారా తగ్గించడమైంది. వాయువును D నుంచి Eకు, E నుంచి Fకు చేర్చడానికి జరిగిన మొత్తం పనిని లెక్కించండి.
సాధన:
పటం నుండి పీడనంలో మార్పు,
dp = EF = 5.0 – 2.0
= 3.0 atm = 3.0 × 1015 Nm-2

ఘన పరిమాణంలో మార్పు
dv = DF = 600 – 300
300 cc = 300 × 10-6

D నుండి E నుండి F కు వాయు చేసిన పని = ∆DEF వైశాల్యం
w = \(\frac{1}{2}\) × DF × EF
= \(\frac{1}{2}\) × (300 × 10-6) × (3.0 × 105
= 45 J

AP Inter 1st Year Physics Study Material Chapter 13 ఉష్ణోగతిక శాస్త్రం

ప్రశ్న 10.
ఒక శీతలీకరణ యంత్రంలో ఉంచిన తినే పదార్థాలను ఆ యంత్రం 9°C వద్ద ఉంచుతుంది. గది ఉష్ణోగ్రత 36°C అయితే దాని క్రియాశీలతా గుణకాన్ని లెక్కించండి.
సాధన:
ఇచ్చినవి, T1 = 36°C = 36 + 273 = 309 K
T2 = 10°C = 10 + 273 = 283 K
AP Inter 1st Year Physics Study Material Chapter 13 ఉష్ణోగతిక శాస్త్రం 20

AP Inter 1st Year History Study Material Chapter 8 మొగలుల యుగం

Andhra Pradesh BIEAP AP Inter 1st Year History Study Material 8th Lesson మొగలుల యుగం Textbook Questions and Answers.

AP Inter 1st Year History Study Material 8th Lesson మొగలుల యుగం

వ్యాసరూప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
మొగల్’ చరిత్ర రచనకు ఉపయోగపడే ఆధారాలను వివరించండి.
జవాబు:
మొగల్ అను పదము ఒక వంశనామము. ఇది ‘మంగోల్’ అను పదము నుండి వచ్చింది. మంగోల్ అనే పదం నుండి మొగల్ అనే పదము రూపొందుటకు కారణమేమనగా మొగలులు మన దేశాన్ని పాలించే రోజుల్లో ఐరోపావారు వ్యాపార నిమిత్తం వచ్చి మొగల్ దర్బార్ను సందర్శించిరి. వారి సహజ నామమైన మంగోల్ అనే పదం వారివారి భాషలలో వేరువేరు రూపాలుగా పేర్కొనబడెను.

మొగల్ చరిత్రను తెలుసుకొనుటకు గల ఆధారాలు: భారతదేశ చరిత్రలో మొగలు చరిత్రకు అమిత ప్రాధాన్యత కలదు. ఈ చరిత్రకున్న ఆధారాలు ఏ చరిత్రకు లేవు. ఇందుకు కారణములు ఏమనగా,

  1. మొగల్ చక్రవర్తులలో అనేకులు సాహితీవేత్తలగుట వలన
  2. చక్రవర్తులు కవులను, పండితులను పోషించుట
  3. చక్రవర్తుల ఫర్మానాలు, ప్రభుత్వ ఆజ్ఞాపనా పత్రాలు
  4. యాత్రికులుగా భారతన్ను సందర్శించిన పెక్కు విదేశీ రచనలు.

మొగల్ చరిత్రకు లభ్యమగు ఆధారములను మూడు భాగాలుగా విభజించవచ్చు. అవి ఏమనగా,

  1. వాఙ్మయ ఆధారములు
  2. పురావస్తు ఆధారములు
  3. విదేశీ రచనలు

1. వాఙ్మయ ఆధారములు:
A) బాబరు హుమాయూన్ల కాలము:
తుజు – క్ – ఇ · బాబురి: మొగల్ యుగమున వ్రాయబడిన తొలి చారిత్రక గ్రంథము. బాబరు టర్కీ భాషలో రాసిన స్వీయచరిత్ర’, ‘తుజు-క్-ఇ-బాబురి’ ద్వారా బాబర్ కాలమునకు, హుమాయూన్ కాలమునకు తొలి జీవిత విశేషాలు తెలుస్తున్నవి.

తారీఖ్-ఇ-రషీది: దీనిని బాబరు బంధువగు ‘మీర్జా మహమ్మద్ హైదర్ దుఘాత్’ రాసెను. ఇందు బాబర్ దిగ్విజయములు, షేర్షా – హుమాయూన్ల సంఘర్షణ – కాశ్మీర్ చరిత్ర వర్ణించబడెను.

AP Inter 1st Year History Study Material Chapter 8 మొగలుల యుగం

హబీబ్-ఉన్-సియర్: దీనిని ‘ఖ్వాందాహర్ అమీర్’ వ్రాసెను. బాబరు గురించి హుమాయూన్ మొదటి మూడు సం॥ల పాలన గురించి వ్రాయబడెను.

తారీఖ్-ఇ-షాహి: దీనిని ‘అహ్మద్ యాద్గర్’ వ్రాసెను. ఇందు ఆఫ్ఘనులు, బాబరు, హుమాయూన్లతో పోరాడి, తిరిగి అధికారము పొందిన విధము తెలుస్తున్నది.

షైబానీ నామ: దీనిని ‘మహమ్మద్ పాలిప్’ రాసెను. ఇందు బాబర్కు, ఉజ్జెక్ పాలకుల మధ్యగల సంబంధాలు వర్ణింపబడినవి.

హుమాయూన్ నామ: దీనిని బాబరు కుమార్తెయగు “గుల్బదన్ బేగమ్” రాసెను. ఇందు బాబరు, హుమాయూన్లు తమ బంధుమిత్రులతో వ్యవహరించిన తీరు, వారి మనోభావములు వర్ణింపబడెను.

ఇంకను హుమాయూన్ గూర్చి తెలుసుకొనుటకు తారీఖ్-ఇ-హుమాయూన్, కానూన్-ఇ-హుమాయూన్ మొదలగు రచనలు తోడ్పడుచున్నవి. షేర్షాను గూర్చి తెలుసుకొనుటకు ‘అబ్బాష్వేణి’ రాసిన తారీఖ్-ఇ-షేర్షా ముఖ్యమైనది.

B) అక్బరు కాలము:
తారీఖ్-ఇ-అక్బరు షాహి: దీనిని అక్బరు రెవెన్యూశాఖ ఉద్యోగియైన హజీమహమ్మద్ ఆరిఫ్ కందాహరే వ్రాసెను. ఇందు అక్బరు వ్యక్తిత్వము, అతని పరిపాలనా విస్తరణ ఉంది.
అక్బరు నామ, ఐనీ- అక్బరీ: ఈ రెండు గ్రంథములను అక్బరు ఆస్థాన పండితుడు, అతని మిత్రుడగు ‘అబుల్ ఫజల్’ వ్రాసెను. మొగల్ చరిత్ర ఆధారములలో ఈ గ్రంథములు తలమానికవంటివి.

తబ్కాత్-ఇ-అక్బరీ: ఇది ఒక సామాన్య చారిత్రక గ్రంథము. దీనిని ‘మీర్ బక్షీ ఖ్వాజీ నిజాముద్దీన్” రాసెను. ఇందు మూడు సంపుటములు కలవు. ఇందు ఢిల్లీ సుల్తానత్ యుగము, బాబరు, హుమాయూన్, అక్బర్ పాలనా కాలము, ప్రాంతీయ రాజ్యాల చరిత్ర వివరించబడెను.

C) జహంగీర్ పాలనా కాలము:
తారీఖ్-ఇ-ఫెరిస్టా: దీనిని “మహమ్మద్ ఖాసిం ఫెరిస్టా” రాసెను. ఇందు జహంగీర్ సింహాసనం అధిష్టించు వరకు భారతదేశ ముస్లిం పాలనను గూర్చి మరియు దక్కను సుల్తానుల గురించి వర్ణించెను.

తుజుక్-ఇ-జహంగీర్: ఇది జహంగీర్ స్వీయచరిత్ర. జహంగీర్ వ్యక్తిత్వము, అతని పాలనా విశేషాలు తెలుసుకొనుటకు ఇది ఒక అమూల్యమైన గ్రంథము.
ముతమిధాఖాన్ రచించిన ‘ఇక్బాల్ నామా’
మహ్మదాలీ రాసిన ‘వాకిఆత్-జహంగరీ’
ఖ్వాజానియామతుల్లా రాసిన ‘తారీఖ్-ఇ-ఖాన్-జహనీ’
మొదలగు ఇతర రచనలు కూడా జహంగీరు కాలమునకు సంబంధించినవే.

D) షాజహాన్ కాలము:
షాజహాన్ ఆస్థానమును అలంకరించిన జగన్నాథ పండితుడు, జనార్థనభట్టు రచనలు, అబ్దుల్ హమీద్ లహరి రాసిన ‘బాదుషానామ’, మహమ్మద్ సలీ గ్రంథమగు ‘అమల్-ఇ-సాలీ’, ఇనాయత్ ఖాన్, మహమ్మద్ సాదిక్ల షాజహాన్నామా మొదలగునవి షాజహాన్ కాలమునకు సంబంధించిన రచనలు.

E) ఔరంగజేబు కాలము:
ఔరంగజేబు చరిత్ర రచనను నిషేదించిననూ అతని కాలమున పెక్కు చారిత్రక గ్రంథములు వెలువడుట అబ్బురము. అందు ముఖ్యమైనవి ‘ఆలంఘీర్ నామ’ దీనిని మీర్జా మహ్మద్ ఖాన్ రాసెను. ఇందు ఔరంగజేబు తొలి పది సంవత్సరాల పాలనా కాలము వర్ణించబడెను.

“మ అనిర్-ఇ-అలంఘ” దీనిని మహ్మద్ సాకే ముస్తయిద్’ వ్రాసెను. హకిరీ రాసిన ‘ఔరంగజేబు నామ’ అకిలాన్ వ్రాసిన ‘జఫర్-నామ-ఇ-ఆలంఘీర్’, ఔరంగజేబు రాసిన “ఫత్వా-ఇ-ఆలంఘీర్’ మొదలగు గ్రంథాలు ఔరంగజేబు కాలమునకు చెందినాయి.

2. పురావస్తు ఆధారములు:
A) శాసనములు: మొగల్ చక్రవర్తులు శాసనములను పెద్దగా వేయించలేదు. వేయించిన కొద్ది శాసనాలు వారి చరిత్రకు ప్రామాణికముగా ఉపయోగపడగలవు.

B) నాణెములు: మొగల్ చక్రవర్తులు ముద్రించిన నాణెములు చరిత్ర రచనకు ఎంతగానో తోడ్పడుతున్నాయి. జహంగీర్, నూర్జహాన్ నాణెములు నాటి ఆర్థిక పరిస్థితులను తెలుసుకొనుటకు ఉపయోగపడుచున్నవి.

C) భవన నిర్మాణము: మొగల్ చక్రవర్తులు నిర్మించిన అసంఖ్యాక కట్టడములు వారి కళాపోషణకు నిదర్శనము. అట్టి వానిలో ముఖ్యమైనవి ఆగ్రా కోట, ఎర్ర కోట, ఫతేపూర్ సిక్రీ, తాజ్మహల్, మయూర సింహాసనము మొదలగునవి.

3. విదేశీ రచనలు: మొగల్ యుగమున పెక్కు విదేశీవాసులు భారతదేశమును సందర్శించి తమ అనుభవాలను, నాటి కాల పరిస్థితులను తమ రచనలలో వర్ణించిరి.

A) ఆంగ్లేయులు: రాల్ఫ్ ఫిష్, జాన్ మిల్టన్ హర్, విలియం హాకిన్స్, విలియం ఫించ్, ఎడ్వర్డ్ టెర్రీ, సర్ థామస్ రో రచనలు జహంగీరు కాలమునకు ఆంగ్ల వర్తక కేంద్రస్థాపనా చరిత్రకు అమూల్యమైన ఆధారములు.

B) ఫ్రెంచి, బార్నియర్, టావెర్నియర్, థీవెనాన్: ఈ సందర్భంగా ఔరంగజేబు కాలంలో వచ్చిన జెర్నియార్ అనే ఫ్రెంచ్ యాత్రికుడు ఫ్రెంచ్ భాషలో వ్రాసిన మొగల్ సామ్రాజ్యంలో యాత్రలు అనునది ముఖ్యమైనదిగా పేర్కొనవచ్చు. ఇట్లు స్వదేశీయ, విదేశీయ రచనల్లో పెక్కు చారిత్రకాంశములు మొగల్ చరిత్రకు ఆధారములుగా ప్రకాశించుచున్నవి.

ప్రశ్న 2.
మొగల్ పరిపాలనలోని ప్రధాన అంశాలను తెలపండి.
జవాబు:
మొగల్ పాలనా వ్యవస్థకు రూపకల్పన చేసినవాడు అక్బర్. అక్బర్కు ప్రభుత్వ విధానాల్లో షేర్షా కొంతవరకు మార్గదర్శి. షేర్షా విధానాలను మెరుగుపరచి, కొత్త విధానాలను ప్రవేశపెట్టి, సమర్థవంతమైన పాలకునిగా అక్బర్ చక్రవర్తి మొగల్ చరిత్రలో కీర్తి ప్రతిష్టలు సంపాదించుకున్నాడు.

కేంద్ర ప్రభుత్వం: మొగల్ పరిపాలనా యంత్రాంగానికి చక్రవర్తి సర్వాధికారి. అధికారాలన్నీ అతడి చేతిలో కేంద్రీకృతమై ఉంటాయి. మొగల్ చక్రవర్తి ప్రాజ్ఞ నిరంకుశ ప్రభువు. “నా కింది ఉద్యోగులు నిర్వహించాల్సిన బాధ్యతలను నేను నిర్వహించనవసరం లేదు. పాలకుడు కింది ఉద్యోగులు తప్పులను దిద్దుకుంటూపోతూ తాను చేసే తప్పులను నివారించుకుంటే సరిపోతుంది” అని అక్బర్ చెప్పుకున్నాడు. ప్రభుత్వంలో చక్రవర్తికి (పాదుషాకు) సలహాలిచ్చేందుకు నలుగురు మంత్రులున్నారు. వారు:

1) వకీల్ లేక వకీల్-ఇ-ముత్లాక్ లేక ప్రధానమంత్రి: ఇతడు చక్రవర్తికి ముఖ్య సలహాదారు. అన్ని శాఖలను పర్యవేక్షిస్తాడు.

2) దివాన్ లేక వజీర్ లేక ఆర్థికమంత్రి: ఇతడు సామ్రాజ్య ఆర్థిక వనరులను పర్యవేక్షించేవాడు. భూమిశిస్తు ఇతర పన్నుల వసూలు, సామ్రాజ్య ఖర్చులు ఇతని పర్యవేక్షణలో ఉండేవి.

3) మీరక్షీ: ఇతడు యుద్ధ మంత్రి. పెద్ద ఉద్యోగులకు జీతాలను కూడా బట్వాడా చేసేవాడు. మన్సబార్ల పేర్లు, వారి హోదాలు, వారి జీతాలు ఇతడు నమోదు చేసుకొనేవాడు. రాజప్రాసాద రక్షణ నిమిత్తం గస్తీ ఉద్యోగులను నియమించేవాడు. రాష్ట్రాలలో వార్తాహరులను, గూఢచారులను నియమించటం కూడా ఇతని విధి.

4) సదర్-ఉస్-సదర్: మత విషయాలలో చక్రవర్తికి సలహాలివ్వడం, చక్రవర్తి దానధర్మాలను పర్యవేక్షించటం, ముఖ్య న్యాయాధీశునిగా వ్యవహరించటం ఇతడి విధులు.

రాష్ట్ర ప్రభుత్వం: పరిపాలనా సౌలభ్యం కొరకు మొగల్ సామ్రాజ్యం సుబాలుగా విభజింపబడింది. అక్బర్ కాలంలో దాదాపు 15 సుబాలుండేవి. ఒక రకంగా వీటిని రాష్ట్రాలుగా పరిగణించవచ్చు. రాష్ట్ర పరిపాలనా వ్యవస్థ, కేంద్ర పాలనావ్యవస్థకు ప్రతిరూపం లేక ప్రతీక అని చెప్పవచ్చు. సుబాను పాలించే అధికారి సుబేదార్. సుబాలో శాంతి భద్రతలు కాపాడే బాధ్యతను సుబేదార్ నిర్వహిస్తాడు. దివాన్, భక్షి, సదర్, ఖాజీ అను అధికారులు కూడా రాష్ట్రపాలనా నిర్వహణలో బాధ్యత స్వీకరిస్తారు. వారి విధులు కేంద్ర ప్రభుత్వంలో అదే పేరుగల అధికారుల విధులను పోలి ఉంటాయి.

ప్రధాన నగరాలలో న్యాయ వ్యవహారాలను చూసేందుకు కొత్వాలు అనే ఉద్యోగి ఉండేవాడు. అతడు నగరాలలో శాంతి భద్రతలను కాపాడేవాడు. ప్రభుత్వ ఆజ్ఞలను అమలు పరిచేవాడు. విదేశీయుల కార్యకలాపాలను గమనించేవాడు. సర్కారు పాలన: “సుబాలు” సర్కారులుగా విభజింపబడ్డాయి. సర్కార్లను నేటి జిల్లాలతో పోల్చవచ్చు. సర్కార్లను పాలించడానికి ఈ క్రింది అధికార్లు ఉంటారు.

  • ఫౌజార్: ఇతడు సర్కారు అధిపతి, సైనికాధికారి, తిరుగుబాట్లను అణచివేసి రెవిన్యూ అధికారులకు సహాయం చేయడం ఇతని ముఖ్య విధులు.
  • అమల్ గుజార్: ఇతడు రెవిన్యూ శాఖాధిపతి. భూమిశిస్తు వసూలు చేయడం, ఋణాలను మంజూరు చేయడం ఇతని ముఖ్య విధులు.
  • ఖజానాదార్: ఇతడు కోశాధికారి. వసూలైన భూమిశిస్తును ఖజానాలో భద్రపరచి కేంద్రానికి జాగ్రత్తగా పంపడం ఇతని విధి.
  • బిలక్సీ: ఇతడు భూములకు, భూమిశిస్తులకు సంబంధించిన వివరాలను తయారుచేస్తాడు.

AP Inter 1st Year History Study Material Chapter 8 మొగలుల యుగం

పరగణా పాలన: సర్కార్లు పరగణాలుగా విభజింపబడ్డాయి. ఈ క్రింది అధికారులు పరగణాల యొక్క పరిపాలనను నిర్వహించేవారు.

  • షికార్: ఇతడు పరగణా యొక్క ముఖ్య కార్యనిర్వహణాధికారి. ఇతడు కూడా సైనికాధికారియే. పరగణా యొక్క శాంతిభద్రతలను పర్యవేక్షిస్తాడు.
  • అమీన్: ఇతడు రెవిన్యూ ఉద్యోగి. భూమిశిస్తు విషయాలను నిర్వహిస్తాడు.
  • కానుంగో: పట్వారీలపై అధికారి. ఇతడు భూములకు సంబంధించిన వివరాలను తయారుచేస్తాడు.
  • పోద్దార్: ఇతడు పరిగణా యొక్క కోశాధికారి.

గ్రామ పాలన: పరగణాలు గ్రామాలుగా విభజింపబడ్డాయి. గ్రామం పరిపాలనా వ్యవస్థలో తుది అంశము. ముఖద్దమ్, పట్వారీలు గ్రామాధికారులు. ముఖద్దమ్ శాంతిని పర్యవేక్షిస్తాడు. పట్వారీ భూమిశిస్తు వివరాలను తయారు చేస్తాడు. గ్రామాలలో పంచాయితీ విధానం అమలులో ఉండేది. పంచాయితీలు న్యాయనిర్వహణ బాధ్యతలను నిర్వహించేవి.

సైనికపాలన: మొగల్ చక్రవర్తులు సమర్థవంతమైన సైన్యమును పోషించిరి. వీరి సైనిక విధానమును ‘మన్సబారీ’ విధానమందురు. ‘మన్సబ్’ అంటే ‘హోదా’ లేదా ‘ఉద్యోగం’ అని అర్థం. ఒక విధముగా ఢిల్లీ సుల్తానుల జాగీర్దార్ విధానం వంటిది.

ఆర్థిక విధానం: మొగలుల ఆర్థిక విధానం సమర్థవంతమైనది. ఖరాజ్, ఖమ్స్, జకాత్, జిజియా అనే నాలుగు రకాల పన్నులు వసూలు చేసిరి.

భూమిశిస్తు విధానం: మొగలుల భూమిశిస్తు విధానానికి పూర్తి రూపాన్ని కల్గించినవారు అక్బర్ మరియు ఆయన రెవిన్యూ మంత్రి రాజాతోడరమల్. మొగలుల భూమిశిస్తు విధానంను ‘బందోబస్త్’ విధానమందురు.

న్యాయపాలన: చక్రవర్తితో కూడిన న్యాయమండలి మొగల్ రాజ్యంలో అత్యున్నత న్యాయస్థానం. అతి ముఖ్యమైన వివాదాలను ఈ న్యాయస్థానమే పరిష్కరించేది. చక్రవర్తియే ఉన్నత న్యాయాధీశుడు. ఉద్యోగులలో ప్రధాన ఖాజీ ఉన్నత న్యాయాధికారి. అతడు దిగువ న్యాయస్థానాల యొక్క న్యాయాధిపతులను నియమించేవాడు. ఆ న్యాయస్థానాల నుండి వచ్చే అప్పీళ్లను కూడా ప్రధాన ఖాజీ విచారించేవాడు. చీఫ్ సదర్ మత వివాదాలను పరిష్కరించేవాడు. రాష్ట్రాలలో (సుబాలలో) సదర్ క్రిమినల్ కేసులను, దివాన్ రెవిన్యూ వివాదాలను, ఖాజీ సివిల్ కేసులను పరిష్కరించేవారు. సర్కార్లలో ఫౌజ్దార్లు, ఖాజీలు, పరగణాలలో షికార్లు, అమీన్లు న్యాయనిర్ణేతలుగా వ్యవహరించేవారు. గ్రామస్థాయిలో గ్రామ పంచాయితీలు నేర విచారణ చేసేవి.

ముగింపు: మొగలుల పాలనా విధానము ఉదారమైనది, సమర్థవంతమైనది. ప్రజాక్షేమాన్ని కాంక్షించేది. మహమ్మదీయుల పరిపాలనా వ్యవస్థ మొదటిసారిగా మొగలుల కాలంలోనే ఔన్నత్యాన్ని పొందింది.

ప్రశ్న 3.
మొగల్ సామ్రాజ్య పతనానికి గల కారణాలు చర్చించండి.
జవాబు:
రాజ్య విస్తీర్ణత, సైనిక పటిష్టత, ఆర్థికాభివృద్ధి, సాంస్కృతికాభివృద్ధి వల్ల ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురి చేసిన మొగల్ సామ్రాజ్యం క్రీ.శ. 18వ శతాబ్దం ప్రారంభంలో విచ్ఛిన్నం కావడం ప్రారంభమైంది.

మొగల్ బాబర్ చేత స్థాపించబడి అక్బర్, జహంగీర్, షాజహాన్ పాలనల్లో దేదీప్యమానంగా వెలుగొందిన మొగల్ సామ్రాజ్యం ఔరంగజేబు రెండవ దశలోనూ, ఔరంగజేబు తరువాత పతనమైంది. ప్రసిద్ధ చరిత్రకారుడు వి.ఎ. స్మిత్ అన్నట్లు సామ్రాజ్యం అకస్మాత్తుగా పతనం కావడం ఆశ్చర్యం కలిగించవచ్చు. అయితే చరిత్రపై సాధారణ అవగాహన కలిగిన చరిత్ర విద్యార్థిగా గమనించినట్లయితే మొగల్ సామ్రాజ్యం అంత కాలం ఎలా ఉండగలిగింది అనే సందేహం కలగక మానదు”. కొంత మంది చరిత్రకారులు మొగల్ సామ్రాజ్య పతనానికి ఔరంగజేబుని పూర్తి బాధ్యుడుగా పేర్కొంటే మరికొందరు చరిత్రకారులు ఇతర కారణాలతోపాటు ఔరంగజేబు కొంతమేరకు బాధ్యుడని పేర్కొన్నారు.

ఔరంగజేబు తన పరిపాలన చివరి ఇరవై ఐదు సంవత్సరాలు దక్కన్లో తన అధికారాన్ని శాశ్వతంగా నెలకొల్పాలన్న అతడంతో నిరంతర దాడులు చేశాడు. దక్కన్లోనే మకాం పెట్టాడు. పరిపాలనా వ్యవస్థను నిర్లక్ష్యం చేశాడు. దీని వల్ల భారతదేశంలో మొగల్ అధికారం బలహీనమైంది.

ఔరంగజేబు తరువాత సింహాసనాన్ని అధిష్టించిన మొగల్ పాలకులు అసమర్థులు. ఔరంగజేబు కాలంలో మొదలైన గల్ రాజ్య పతనాన్ని అడ్డుకొనే శక్తి సామర్థ్యాలు వారికి లేవు. వారు మొగల్ అధికారుల చేతుల్లోనే కాకుండా, సావారి చేతుల్లో కూడా కీలుబొమ్మలుగా వ్యవహరించేవారు. వారు సామ్రాజ్యం కంటే కూడా విలాసాలపట్ల మక్కువ ఈ బరిచేవారు. అంతేకాకుండా భారతదేశంలోని అధిక ప్రజలు మొగలులను విదేశీయులుగా భావించడం వల్ల మొగల్ జ్లలకు వారి మద్దతు లభించలేదు. హిందూ మతంలోలాగా మొగలుల్లో వారసత్వ చట్టం లేకపోవడం వల్ల సింహాసనం కోసం వారసత్వ యుద్ధాలు జరిగాయి. అవి మొగల్ రాజ్య పతనానికి దోహదం చేశాయి.

సమైక్యతకు, సామర్థ్యానికి, ప్రతీకగా నిలిచిన మొగల్ కులీనవర్గం సుల్తాన్ల అసమర్థత కారణంగా వివిధ కూటములుగా విడిపోయాయి. స్వార్థపరులుగా తయారయ్యారు. పర్షియన్ షియాలు, సంప్రదాయ సున్నీలు, హిందూస్థానీ మొదలైన కూటములుగా విడిపోయి ఒకరిపై ఒకరు పైచేయి సాధించేందుకు పోరాటం చేయసాగారు.

మొగల్ సామ్రాజ్య పతనానికి అక్బర్ ప్రవేశపెట్టిన మనసబారీ విధానం ఒక కారణమైంది. మనసబారీ విధానం అక్బర్ కాలంలో మంచి ఫలితాలను ఇచ్చింది. అయితే అందులోని ప్రాథమిక లోపాల వల్ల ఈ విధానం భూస్వామ్య వ్యవస్థను పోలి సాధారణ సైనికుడు చక్రవర్తి కంటే కూడా మనసబారులపట్ల గౌరవం ప్రదర్శించేవారు. ఫలికంగా బైరాం ఖాన్, మహబత్ ఖాన్ వంటి వారు తిరుగుబాట్లు జరిపారు. వీటన్నింటివల్ల సైనిక పటిష్టత కోల్పోయింది. నీటన్నింటికి తోడు ఐరోపావారిని ఎదుర్కొనేందుకు నౌకాదళం పట్ల శ్రద్ధవహించకపోవడం కూడా మొగల్ పతనానికి కారణమైంది.

షాజహాన్ పాలనాకాలంలో వర్షాలు లేకపోవడం వల్ల, కరువుల వల్ల ఆర్థిక పరిస్థితి దెబ్బతింది. ఔరంగజేబు కాలంలో పరిస్థితి మరింత అధికమైంది. అసమర్థులైన కడపటి, మొగలుల కాలంలో ఆర్థిక స్థితి మరింత దిగజారింది. వీటికి తోడు అగ్నికి ఆజ్యంతోడైనట్లు నాదిర్ షా, అహ్మద్ షా అబ్దాలీ దండయాత్రలు ఆర్థిక స్థితిని కోలుకోలేకుండా చేశాయి. ఈ దండయాత్రలు మొగల్ సైనిక బలహీనతను ప్రపంచానికి చాటిచెప్పాయి. దీంతో మొగల్ సుబేదారులు స్వాతంత్ర్యాన్ని ప్రకటించుకోసాగారు. హైదరాబాద్ నిజాం, బెంగాల్ ఆలీవర్దీఖాన్, ఔద్ సాదతాఖాన్లు స్వాతంత్ర్యాన్ని ప్రకటించుకొన్నారు. ఈ విధంగా మొగల్ పాలకుల అసమర్థత, సమకాలీన రాజకీయ సంఘటనలు మొగల్ రాజ్య పతనానికి కారణాలయ్యాయి.

ప్రశ్న 4.
శివాజీ పరిపాలనపై ఒక వ్యాసం వ్రాయండి.
జవాబు:
పరిపాలన: శివాజీ కృషితో స్వతంత్ర మహారాష్ట్ర రాజ్యం ఏర్పడింది. శివాజీ గొప్ప వీరుడు. సైనిక నాయకుడే కాకుండా గొప్ప పాలకుడిగా కూడా పేరు పొందాడు.
శివాజీ పాలన సమానత్వం, న్యాయం, సహనంలపై ఆధారపడి కొనసాగింది. శివాజీ తన రాజ్యానికి ‘స్వరాజ్యం’ అని పెట్టాడు. తన రాజ్యం పరిసర ప్రాంతాల నుంచి చౌత్, సర్దేశముఖి వంటి పన్నులను వసూలు చేశాడు.

శివాజీ కేంద్రీకృత పాలనావ్యవస్థను ఏర్పాటు చేశాడు. చక్రవర్తి అయిన శివాజీ సర్వాధికారి. అధికారులను గమించే, తొలగించే అధికారం శివాజీకి ఉండేది. శివాజీ తనకు పరిపాలనలో సహకరించేందుకు ఎనిమిది మంది సభ్యులు గల అష్టప్రధానులు అనే మంత్రిమండలిని ఏర్పాటుచేశాడు. మంత్రులకు వివిధ శాఖలను కేటాయించాడు
అష్ట ప్రధానులు:

  • పీష్వా: ప్రధానమంత్రి – సాధారణ పాలనా వ్యవహారాలను చూసేవాడు.
  • అమాత్య: ఆర్థిక మంత్రి – ఆదాయ వ్యయాలు, బడ్జెట్ చూసేవాడు.
  • మంత్రి: ఆంతరంగిక వ్యవహారాల మంత్రి.
  • సచివ: సమాచారశాఖ మంత్రి.
  • సుమంత్: విదేశీ వ్యవహారాల మంత్రి.
  • పండితరావు దానధర్మాలు, ధర్మాదాయం.
  • సేవాపతి: సర్వసైన్యాధ్యక్షుడు.
  • న్యాయాధీశుడు: అత్యున్నత న్యాయాధికారి.

కేవలం సామర్థ్యాన్ని బట్టి మాత్రమే మంత్రిమండలిలో స్థానం లభించేది. వంశపారంపర్య హక్కు ఉండేది కాదు. మంత్రులు, పాలనా వ్యవహారాలతో పాటు అవసరమైనప్పుడు సైనిక విధులను కూడా నిర్వహించేవారు.

పరిపాలనా విభాగాలు: పరిపాలనా సౌలభ్యం కోసం శివాజీ తన స్వరాజ్యంను నాలుగు రాష్ట్రాలుగా విభజించి దాని పాలనకు వైశ్రాయ్ లేదా గవర్నర్ను నియమించాడు. రాష్ట్రాలను తిరిగి జిల్లాలుగా విభజించాడు. జిల్లాను తిరిగి గ్రామాలుగా విభజించాడు. గ్రామ పాలనకు పంచాయితి, పటేల్, కులకర్ణి అనే అధికారులు నిర్వహించేవారు.
వీటికి తోడు మొగల్ రాజ్యంలోని కొన్ని ప్రాంతాలు పరోక్షంగా శివాజీ ఆధీనంలో ఉండేవి. వారి నుంచి చౌత్ అనే పేరున పన్నులు వసూలు చేశాడు.

భూమిశిస్తు విధానం: శివాజీ జాగిర్దారీ విధానాన్ని రద్దుచేశాడు. మత సంస్థల భూములను శివాజీ స్వాధీనం చేసుకొని వాటికి నగదు చెల్లించాడు. భూమిని సర్వే చేయించి రైత్వారీ విధానాన్ని ప్రవేశపెట్టాడు. పన్నులను ధన రూపంలోగాని, ధాన్యరూపంలోగాని చెల్లించే అవకాశాన్ని కల్పించాడు. ప్రకృతి వైపరీత్యాల సమయంలో రైతులకు రుణాలను ఇచ్చి, వాటిని సులభ వాయిదాల్లో తిరిగి చెల్లించే ఏర్పాటు చేశాడు.

AP Inter 1st Year History Study Material Chapter 8 మొగలుల యుగం

భూమి శిస్తుతోపాటు వాణిజ్య పన్నులు, నాణాల నుంచి ఆదాయం, చౌత్, సర్దేశముఖి మొదలైన వాటి ద్వారా ప్రభుత్వానికి ఆదాయం లభించేది. చౌత్ అనే 1/4 వ వంతు పన్ను యుద్ధాల నుంచి రక్షించినందున తన రాజ్య పరిసరాల్లోని వారి నుంచి వసూలు చేసేవాడు. 1/10 వ వంతు వసూలు చేసే సర్దేశముఖి రాజు పట్ల గౌరవంతో చెల్లించే పన్ను.
సైనిక పాలన: శివాజీ బలమంతా అతని సైన్యంపై ఆధారపడి ఉంది. శివాజీ ప్రతిభావంతమైన, అంకితభావం గల సైన్యాన్ని ఏర్పాటు చేసుకొన్నాడు. ముస్లిం పాలకులను మహారాష్ట్రకు దూరంగా ఉంచి హిందూ ధర్మాన్ని రక్షించడం ప్రధాన లక్ష్యంగా గల శివాజీ అందుకు అనువైన సైన్యాన్ని ఏర్పాటు చేసుకొన్నాడు. శివాజీ సైన్యంలో 45 వేల అశ్విక దళం, 60 వేల కాల్బలం, లక్షమందితో పదాతి దళం ఉండేది. వీటికి తోడు ఏనుగులు, ఒంటెలు, ఫిరంగి దళం కూడా ఉండేది.

జాగీరులకు బదులు మొదటిసారిగా ధనరూపంలో వేతనాలను చెల్లించేవారు. శివాజీ కోటల రక్షణకు ప్రత్యేక చర్యలను తీసుకొన్నాడు. సమర్థులైన వారికి బిరుదులు ఇవ్వడం, ప్రతిభావంతులకు అదనపు సౌకర్యాలను కల్పించడం వంటివి శివాజీ చేశాడు. యుద్ధరంగానికి స్త్రీలను తీసుకువెళ్ళడాన్ని నిషేధించాడు. దీన్ని ఉల్లంఘించిన వారికి మరణ శిక్ష విధించేవాడు. యుద్ధంలో స్వాధీనం చేసుకొన్న సొమ్మంతా చక్రవర్తికి అప్పగించాల్సి ఉండేది.

న్యాయపాలన: న్యాయ వ్యవస్థలో శివాజీ సంప్రదాయ పద్ధతులను పాటించాడు. సమన్యాయాన్ని అనుసరించాడు. ధనవంతుడు, పేదవాడు అనే తేడాలు కానీ, మత తేడాలు కానీ చూపించేవాడు కాదు. గ్రామస్థాయిలో గ్రామ పంచాయితీలు ” న్యాయపాలన చేసేవి. కేంద్ర స్థాయిలో న్యాయపాలన కోసం ‘న్యాయాధీశ్’ నియమించబడ్డాడు. కేసులు విచారించడంలోనూ, తీర్పులను ఇవ్వడంలోనూ ప్రాచీన హిందూ చట్టాలను పరిగణనలోకి తీసుకొనేవారు.

దేదీప్యమానంగా వెలుగొందుతూ ఉన్న మొగలులతో వీరోచితంగా పోరాడి శివాజీ విజయం సాధించాడు. గతంలో అనైక్యంగా చిన్నచిన్న భాగాలుగా ఉన్న హిందూమత శక్తులను ఉన్నతమైన ఆశయాలతో ఏకంచేశాడు.

వీటన్నింటికి తోడు శివాజీ గొప్ప రాజకీయవేత్త, చురుకైన నాయకుడు. జె.ఎన్. సర్కార్ అనే చరిత్రకారుడు అన్నట్లు “శివాజీ మహారాష్ట్రులకు వెలుగు మొగలుల పాలిట సింహస్వప్నం తన వారసులకు స్ఫూర్తిప్రదాతగా నిలిచాడు. శివాజీ గొప్పతనం అతని వ్యక్తిత్వంలోను ఆచరణలోనూ బయల్పడుతుంది”.

లఘు సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
బాబర్ నామ
జవాబు:
మధ్యయుగ భారతదేశ చరిత్రలో గణనీయమైన వ్యక్తులలో బాబరు ఒకడు. భారతదేశమున మొగలు సామ్రాజ్యమును స్థాపించిన ఘనుడు బాబరు. క్రీ.శ. 1483లో బాబరు ఫర్గానాయందు జన్మించెను. ఇతని తండ్రియగు ఉమర్ షేక్ మీర్జా మధ్యఆసియాలోని ఫర్గానా అను చిన్న రాజ్యమునకు అధిపతి. క్రీ.శ. 1494లో తన తండ్రి మరణానంతరము బాబరు 11 సం॥ల ప్రాయమున ఫర్గానా ప్రభువు అయ్యెను. తన మాతృదేశమున నిలువనీడలేక తన దృష్టిని ఆఫ్ఘనిస్తాన్ వైపు మరల్చి 1504లో కాబూల్ ఆక్రమించెను. భారతదేశ రాజకీయ పరిస్థితులు అనుకూలముగా ఉండుటచే క్రీ.శ. 1526లో మొదటి పానిపట్టు యుద్దమున ఢిల్లీ సుల్తాన్గు ఇబ్రహీంలోడిని ఓడించి, వధించి ఢిల్లీ, ఆగ్రాలను ఆక్రమించి భారతదేశమున మొగల్ సామ్రాజ్య స్థాపన చేసెను.

బాబరు పర్షియన్, టర్కీ భాషలలో గొప్ప పండితుడు. టర్కీ భాషలో బాబరు వ్రాసుకొన్న స్వీయచరిత్ర తుజ్-క్- ఇ – బాబురి (తన ఆత్మకథ). మొగల్ యుగమున వ్రాయబడిన తొలి చారిత్రక గ్రంథము. ఇందు బాబరు తురుష్క భాషలోనున్న ప్రావీణ్యము తెలియుచున్నది. తుజ్-క్-ఇ-బాబరి సమకాలీన పరిస్థితులకు దర్పణం పడుతుంది. బాబరు కాలమును, హుమాయున్ తొలి జీవిత విశేషములను తెలుసుకొనుటకు ఈ గ్రంథము అత్యంత దోహదపడుతుంది. అందువల్ల మధ్యయుగాలనాటి ఆత్మకథల్లో దీనికి గణనీయమైన ప్రాముఖ్యత ఉంది.

ప్రశ్న 2.
హుమాయూన్
జవాబు:
బాబర్ మరణానంతరం మొగల్ సింహాసనాన్ని అధిష్టించినవాడు హుమాయూన్. ఇతడు బాబర్ పెద్ద కుమారుడు. హుమాయూన్ అనగా అదృష్టవంతుడని అర్థం. కానీ దీనికి భిన్నంగా అతడి జీవితం గడిచింది.

తొలి జీవితం: హుమాయూన్ 1508, మార్చి 6న జన్మించాడు. బాబర్ కుమారులు నలుగురిలో హుమాయూన్ పెద్దవాడు. తన తండ్రి కోరిక మేరకు హుమాయూన్ మొగల్ రాజ్యాన్ని సోదరులకు పంచాడు. సంభాల్న ఆస్కారీకి, ఆల్వార్ను హిందాల్కు, కాబూల్, కాందహార్ల ను కమ్రాన్కు ఇచ్చాడు. ఈ పంపకమే హుమాయూన్ కష్టాలకు మూలమైంది. కమ్రాన్ కాబూల్, కాందహార్ల తో తృప్తిపడక పంజాబును ఆక్రమించుకున్నాడు. సామ్రాజ్యాన్ని తన సోదరుల మధ్య పంపకం చేసినందువల్ల హుమాయూన్ ఆర్థికంగా, సైనికంగా బలహీనపడ్డాడు.

హుమాయూన్ బలహీనతలు: హుమాయూను కొన్ని వ్యక్తిగత బలహీనతలున్నాయి. అతడికి రాజకీయ చతురత, కార్యదీక్ష, సమయస్ఫూర్తి లేవు. నల్లమందుకు బానిస కావటమే కాక మితిమీరిన భోగలాలసత్వానికి కూడా లోనయ్యాడు.

సమస్యలు: పానిపట్టు, గోగ్రా యుద్ధాలలో బాబర్ చేతిలో ఓడిపోయిన ఆఫ్ఘన్లు తమ సార్వభౌమత్వాన్ని పునః ప్రతిష్టించుకోవటానికి తీవ్రమైన ప్రయత్నాలు మొదలుపెట్టారు. జాన్పూర్లో మహమ్మద్లోడీ, బెంగాల్లో నస్రతా, బీహార్లో షేర్ ఖాన్ బలం పుంజుకుని భారతదేశం నుంచి మొగలులను పారద్రోలటానికి చర్యలు ప్రారంభించారు.

హుమాయూన్ యుద్ధాలు: హుమాయూన్ రాజ్యానికి రాక మునుపే తండ్రితో పాటు పానిపట్టు, కాణ్వా యుద్ధా పాల్గొని మంచి అనుభవం గడించాడు. రాజ్యానికి వచ్చిన తరువాత కూడా అతడనేక యుద్ధాలు చేశాడు.

కలింజర్ దండయాత్ర (1530): కలింజర్ పాలకుడు తన శత్రువులైన ఆఫ్ఘన్లకు సహాయం చేశాడనే కారణంతో, హుమాయూన్ 1530లో కలింజర్పై దండెత్తి, విజయం సాధించాడు. కానీ, దాన్ని స్వాధీనపరుచుకొనక, నష్టపరిహారం మాత్రమే వసూలు చేసుకొన్నాడు. ఇది రాజనీతిజ్ఞతలేని చేష్ట.

దౌరా యుద్ధం: కలింజర్పై హుమాయూన్ దండెత్తినపుడు బీహార్లోని ఆఫ్ఘన్లు మహమ్మద్ డీ నాయకత్వం క్రింద మొగల్ రాష్ట్రమైన జాన్పుర్పై దాడిచేసి, ఆక్రమించారు. కానీ, కొద్దికాలంలోనే హుమాయూన్ ఆఫ్ఘన్లను డౌ యుద్ధంలో ఓడించి, దాన్ని తిరిగి స్వాధీనపరచుకొన్నాడు. మహమ్మద్ డీ బీహార్ కు పారిపోయాడు.

చునార్ యుద్ధం: బీహార్లో షేర్ఖాన్, చునార్ కోటను స్థావరంగా చేసుకొని తన సైనిక చర్యలను ముమ్మరం చేశాడు. షేర్ ఖాన్ ను అణచాలనే ఉద్దేశంతో హుమాయూన్ చుసార్ కోటను ముట్టడించాడు. కానీ, చునారు ఆక్రమించుకొనే సమయంలో షేర్ఫాన్ రాజకీయ చతురత ప్రదర్శించి హుమాయూన్తో సంధి చేసుకొనెను. అనంతరం హుమాయూన్ ఆగ్రా వెళ్లి దాదాపు ఒక సంవత్సరం పైగా విందులు, వినోదాలతో కాలం వృధా చేసుకొనెను. దీనితో బీహార్ లో షేర్ ఖాన్, గుజరాత్లో బహదూర్గా శక్తిని పుంజుకొని హుమాయూన్పై దాడికి సిద్ధమయ్యారు.

షేర్ఖాన్తో పోరాటం: గుజరాత్పై హుమాయూన్ దాడి చేస్తున్న తరుణంలో, షేర్భన్ బీహార్లో తన బలాన్ని పెంచుకొని 1537 నాటికి బెంగాల్ను ఆక్రమించి, హుమాయూన్కు కప్పం కట్టడం మానేశాడు. షేర్ ఖాన్ విజృంభణ తన సామ్రాజ్యం మనుగడకు ప్రమాదకరమని భావించిన హుమాయూన్, షేర్ఖాన్పై యుద్ధానికి సిద్ధపడ్డాదు. షేర్ ఖాస్ బెంగాల్లో ఉన్నందువల్ల హుమాయూన్ సులభంగా బీహార్ను ఆక్రమించుకోగలిగేవాడు. అలాగాక, చూనార్ దుర్గ ముట్టడిలో హుమాయూన్ చాలాకాలం వృథా చేసుకొన్నాడు. అనంతరం బెంగాల్ రాజధాని గౌర్ పైకి నడిచి, గాన్ని తన అధీనంలోకి తెచ్చుకొన్నాడు. గౌర్ ఆక్రమణానంతరం హుమాయూన్ ఎనిమిది నెలలు విలాసాలలో మునిగి తేలాడు. ఈలోపు షేర్ ఖాన్ హుమాయూను నిత్యావసర వస్తువులేవీ చేరకుండా ఢిల్లీ, బెంగాల్ల మధ్య రాకపోకలకు అడ్డంకులు కలిగించాడు. ఈ అరాచక పరిస్థితుల్లో హిందాల్ తనను తాను మొగల్ చక్రవర్తిగా ప్రకటించుకొన్నాడు. ఈ పరిస్థితుల్లో హుమాయూన్ రాజధానికి తిరుగు ప్రయాణం కట్టాడు.

చౌసా యుద్ధం (1539): రాజధాని చేరడానికి ప్రయాణంలో ఉన్న మొగల్ సైన్యం పైన షేర్ఖాన్ గంగానది ఒడ్డున ఉన్న చౌసా వద్ద 1539లో మెరుపు దాడి చేసి విజయం సాధించాడు. ఎలాగో తప్పించుకొని హుమాయ రాజధానికి చేరుకున్నాడు. ఆ తరువాత షేర్ ఖాన్ బీహార్, బెంగాల్లను పూర్తిగా తన ఆధీనంలోకి తెచ్చుకొని, వారికి స్వతంత్ర పాలకుడుగా ప్రకటించుకున్నాడు. ఈ విజయాలతో ఉత్తేజితుడైన షేర్ఖాన్ తన దృష్టిని ఢిల్లీ, ఆగ్రాం పై సారించాడు. ఇదే సమయంలో తన పేరును “షేర్ ” గా మార్చుకున్నాడు.
కనోజ్ యుద్ధం (1540): ఆగ్రావైపు వస్తున్న షేర్ ఖాన్ను ఎదుర్కోవడానికి, హుమాయూన్ రెండు లక్షల సైన్యంతో కనోజ్ చేరుకున్నాడు. 1540లో జరిగిన యుద్ధంలో హుమాయూన్కు పరాజయం సంభవించింది. షేర్షా ఢిల్లీ, ఆగ్రాలను ఆక్రమించాడు.

పైన పేర్కొనబడిన వివిధ అంశాలు హుమాయూన్ విపులతకు కారణమయ్యెను.

ప్రశ్న 3.
అబుల్ ఫజల్
జవాబు:
మన దేశ చరిత్రలో మొగల్ చరిత్రకు లభ్యమగు ఆధారములు ఏ యుగమున లేవు. అట్టి ఆధారములలో ముఖ్యమైనవి ఐని-ఇ-అక్బరీ.

దీనిని అక్బరు ఆస్థాన పండితులైన అబుల్ ఫజల్ వ్రాసెను. మొగల్ యుగ చరిత్ర ఆధారములలో ఈ గ్రంథము తలమానికం వంటిది. ఇందు మూడు సంపుటములు కలవు. మొదటి సంపుటము నందు తైమూర్ నుండి హుమాయూన్ వరకుగల మొగల్ వంశ చరిత్రను రెండు, మూడు సంపుటములందు అక్బరు పరిపాలనా విశేషముల గూర్చి వ్రాసెను.

ఐనీ-ఇ-అక్బరీ: దీనిని కూడా అబుల్ ఫజల్ మూడు సంపుటములుగా వ్రాసెను. ఇందు అక్బరు రాజకీయ విధానములు, పరిపాలనా విషయములు, ప్రజల జీవన స్థితిగతులు, అలవాట్లు సవిస్తరముగా వర్ణింపబడినవి. కనుకనే లూనియా (Luniya) పండితుడు “మొగల్ చరిత్ర వ్రాసే ఏ చరిత్రకారుడైనా ఈ గ్రంథమును సంప్రదింపకుండా ఎట్టి రచన చేయలేదు” అని చెప్పెను.

AP Inter 1st Year History Study Material Chapter 8 మొగలుల యుగం

అక్బరు తన బంధువులకు, కుటుంబ సభ్యులకు వ్రాసిన లేఖల సంకలనం. దీనిని కూడా అబుల్ ఫజల్ సంతరించెను.

తబ్కాత్-ఇ-అక్బరీ: ఇది ఒక సామాన్య చారిత్రక గ్రంథము. దీనిని మీర్భక్షి ఖ్వాజీ నిజాముద్దీన్ మూడు సంపుటములుగా వ్రాసెను. ఇందు ఢిల్లీ సుల్తానత్ యుగము, బాబరు, హుమాయూన్, అక్బరుల పాలనాకాలము, ప్రాంతీయ రాజ్యాల చరిత్ర వివరింపబడెను. గుజరాత్ చరిత్రకు ఇది ఒక అమూల్యమైన ఆధారము.

ప్రశ్న 4.
నూర్జహాన్
జవాబు:
మొగల్ సామ్రాజ్య చరిత్రలో ప్రముఖ పాత్ర వహించిన స్త్రీ నూర్జహాన్. 1611లో జహంగీర్కు నూర్జహాన్తో వివాహం జరిగినప్పటి నుంచి జహంగీర్ జీవితం, మొగల్ వంశ చరిత్ర కొత్త మలుపు తిరిగాయి. నూర్జహాన్ అసలు పేరు మెహరున్నీసా. ఈమె తండ్రి ఘియాస్ బేగ్, తల్లి అస్మత్ బేగం. ఘియాస్ బేగ్ పర్షియా దేశం నుంచి ఉపాధి కోసం భారతదేశం వచ్చి, అక్బర్ ఆస్థానంలో స్థానం పొంది కాబూల్ సుబాకు దివాన్ అయ్యాడు. మెహరున్నీసా అందగత్తె. మెహరున్నీసాకు అక్బర్ కుమారుడైన సలీంకు ప్రేమ కథనం ఉంది. వారి ప్రేమను ఇష్టపడని అక్బర్ ఆమెను షేర్ ఆఫ్ఘన్కు ఇచ్చి వివాహం చేసి, ఆ దంపతులను బెంగాల్లోని బర్వాన్కు పంపించాడని కొందరి అభిప్రాయం. అక్బర్ మరణానంతరం సలీం, జహంగీర్గా సింహాసనమధిష్టించిన తరువాత షేర్ ఆఫ్ఘన్ను వధించి, మెహరున్నీసాను వివాహమాడాడని మరొక కథనం ఉంది. ఆ వివాహం నాటికి ఆమె వయస్సు 33 సంవత్సరాలు. ఆమెకు యుక్తవయస్సు వచ్చిన లాడ్లీ బేగం అనే కుమార్తె కూడా ఉంది. జహంగీర్ మెహరున్నీసాను వివాహం చేసుకొన్న తరువాత నూర్మహల్ (ఇంటికి వెలుగు) నూర్జహాన్ (ప్రపంచానికి వెలుగు) అనే బిరుదులిచ్చాడు. వివాహానంతరం ఆమెకు సర్వాధికారాలు అప్పగించి విలాసవంతమైన జీవితం గడిపాడు.

నూర్జహాన్ అధికార దాహం: నూర్జహాన్ తన అధికారాన్ని పటిష్టం చేసుకోవటానికి అనేక చర్యలు తీసుకొంది. నాణేల మీద జహంగీర్ తో పాటు తన పేరును కూడా ముద్రించుకుంది. తన బంధువులకు, ఆశ్రితులకు ఉన్నత పదవులనిచ్చి ముఠాకు నాయకురాలైంది. తన తల్లిని తన ప్రధాన సలహాదారుగా నియమించుకుంది. తన కుమార్తె లాడ్లీ బేగంను జహంగీర్ మరొక కుమారుడు ప్రియార్కు ఇచ్చి వివాహం చేసింది. ఖుర్రం (షాజహాన్ ) ను కేంద్ర రాజకీయాల నుంచి కాందహార్కు పంపించటానికి ప్రయత్నించింది. దీనితో తిరుగుబాటు చేసిన ఖుర్రంను మహబతాన్ సాయంతో అణచివేసింది. ఖుర్రంపై సాధించిన విజయంతో మహబతాఖాన్ కీర్తి, ప్రతిష్టలు ఇనుమడించాయి. అదీగాక మహబతాన్, జహంగీర్ రెండో కుమారుడు పర్వేజ్ను సింహాసనం ఎక్కించాలనే లక్ష్యంతో ఉన్నాడు. దీనితో మహబతాఖాన్ మీద నూర్జహాన్ కక్ష సాధింపు చర్యలు ప్రారంభించింది. మహబతాఖాన్ ను దక్కన్ నుంచి బెంగాల్కు బదిలీ చేయించింది. దీనితో మహబతాఖాన్ తిరుగుబాటు చేసి, 1626లో జహంగీర్ను నూర్జహాన్ను బందీలుగా పట్టుకొని 3 నెలలకు పైగా పరిపాలన చేశాడు. దీనినే శతదిన పాలన అంటారు. కానీ నూర్జహాన్ మాయోపాయంతో ఖైదు నుంచి జహంగీర్ తోపాటు బయటపడింది. దీనితో ధైర్యం చెదిరిన మహబతాఖాన్ దక్కను పారిపోయి ఖుర్రంతో చేతులు కలిపాడు. అప్పటికే అనారోగ్యంతో బాధపడుతున్న జహంగీర్ 1627లో మరణించాడు. దీనితో సింహాసనం కోసం వారసత్వ యుద్ధం ప్రారంభమైంది.

చివరకు తన శత్రువులందర్నీ ఓడించి, 1628, జూలై 14న ఖుర్రం ఇదివరకే సంపాదించుకున్న “షాజహాన్” అనే బిరుదుతో సింహాసనం అధిష్టించాడు. నూర్జహాన్ తన ఆశలన్నీ అడియాసలయ్యాయని గ్రహించి రాజకీయాల నుంచి పూర్తిగా నిష్క్రమించింది. చివరి రోజుల్లో దైవచింనతలో గడిపి 1645లో లాహోర్ లో మరణించింది. ఏది ఏమైనప్పటికీ తన భర్త వ్యసనపరుడైనప్పుడు రాజ్యాన్ని ఇతరుల హస్తగతం కాకుండా నూర్జహాన్ కాపాడగలిగింది.

ప్రశ్న 5.
తాజ్మహల్
జవాబు:
షాజహాన్ గొప్ప భవన నిర్మాత. ఈ విషయంలో ఇతడి పాలనా కాలాన్ని రోమన్ చక్రవర్తి అగస్టస్ కాలంతో పోల్చడం జరిగింది. ఢిల్లీ, ఆగ్రా, కాబూల్ లో షాజహాన్ కాలానికి చెందిన కట్టడాలు సౌందర్యానికి, కళావైశిష్ట్యానికి నిదర్శనాలుగా నిలిచాయి. రాజధానిగా ఉండటానికి ఆగ్రాకు అర్హతలేదని భావించిన షాజహాన్, షాజహానాబాద్ అనే నూతన రాజధాని నగరాన్ని నిర్మింపచేశాడు. అదే ప్రస్తుత పాత ఢిల్లీ. షాజహాన్ నిర్మాణాల్లో ఆగ్రాలోని తాజ్మహల్, ఢిల్లీలోని ఎర్రకోట, అందులోని దివాన్ ఇ-ఆమ్, దివాన్-ఇ-ఖాన్, జామా మసీద్ ప్రధానమైనవి. షాజహాన్ నిర్మాణాలన్నింటిలో తలమానికమైంది, ఆగ్రాలో యమునా నది ఒడ్డున తన పట్టమహిషి ముంతాజ్ బేగం సంస్మరణార్థం నిర్మించిన తాజ్మహల్. దీనిని ప్రపంచ అద్భుత కట్టడాలలో ఒకటిగా భావిస్తారు. దీని నిర్మాణానికి ఇరవై రెండు సంవత్సరాలు పట్టింది. నాలుగున్నర మిలియన్ పౌన్లు ఖర్చయింది. ఉస్తాద్ అహ్మద్ దీని నిర్మాణంలో ప్రధాన భూమిక నిర్వహించిన వాస్తుశిల్పి. షాజహాన్ భవనాలన్నింటిలోను అలంకరణకు పేరుపొందింది.

ప్రశ్న 6.
పురంధర్ సంధి
జవాబు:
1665 సం॥లో మొగల్ సేనాని రాజా జైసింగ్క, మరాఠా నాయకుడు అయిన శివాజీకి మధ్య పురంధర్ వద్ద కుదిరిన సంధిని పురంధర్ సంధి అని అంటారు. ఈ సంధి ప్రకారం:

  1. శివాజీ తన స్వాధీనంలోని సాలీనా నాలుగు లక్షల రూపాయల ఆదాయాన్ని ఇచ్చే ఇరవై మూడు కోటలను మొగలులు స్వాధీనం చేసుకున్నారు.
  2. బీజపూర్తో మొగలులు చేసే యుద్ధాలలో సహాయం చేసేందుకు శివాజీ అంగీకరించాడు.
  3. తన కుమారుడు శంభూజీని ఐదువేల మంది అశ్వికులతో మొగల్ ఆస్థానానికి పంపేందుకు శివాజీ అంగీకరించాడు.
  4. 13 సంవత్సరాల కాలంలో నలభై లక్షల పన్నులను చెల్లించేందుకు శివాజీ అంగీకరించాడు.
  5. ఐదు లక్షల పన్నులను ఇచ్చే బీజపూర్ రాజ్యంలోని ప్రాంతాలపై శివాజీ అధికారాన్ని మొగలులు గుర్తించారు. ఈ సంధి వల్ల మొగలులు ప్రయోజనం పొందారు. వారి ప్రాభవం వృద్ధి చెందింది. దీనితో శివాజీ అవమానానికి గురి అయినాడు. పురంధర్ సంధి ప్రకారం రాజా జైసింగ్ ప్రోద్బలంతో ఆగ్రాలోని మొగల్ దర్బారును శివాజీ దర్శించాడు.

ప్రశ్న 7.
సాహూ
జవాబు:
శివాజీ మరణానంతరం అతని పెద్ద కుమారుడైన శంభూజీ 1680లో సింహాసనాన్ని అధిష్టించాడు. అతడు బలశాలే అయినా అసమర్థుడు కావడంవల్ల ఔరంగజేబు చేతిలో 1689లో మరణానికి గురయ్యాడు. అనంతరం అతని సవతి సోదరుడు రాజారాం సింహాసనాన్ని అధిష్టించాడు. రాజారాం సమర్థుడు కాకపోయినా రామచంద్ర పంథ్, శాంతాజీ ఘోర్పడే, దానాజీ జాదన్ వంటి సమర్థ అధికారుల సహకారంతో మొగలులను ధైర్యంతో ఎదుర్కొన్నాడు.

దురదృష్టవశాత్తు క్రీ.శ. 1700 సంవత్సరంలో రాజారామ్ మరణించడంతో అతడి భార్య తారాబాయి మహారాష్ట్రకు సారధ్యం వహించింది. ఔరంగజేబు మరణానంతరం సాహు బందిఖానా నుంచి విడుదల చేయడంతో తారాబాయి, సాహుల మధ్య వారసత్వ పోరాటం జరిగి సాహు విజయం సాధించాడు. ఫలితంగా మహారాష్ట్ర రాజ్యం కొల్హాపూర్, సతారాలుగా విడిపోయింది. సాహు 1713లో పీష్వాగా బాలాజీ విశ్వనాధ్ను నియమించాడు. పీష్వా పదవి వంశపారంపర్యమైంది. క్రమంగా పీష్వాలు మహారాష్ట్రకు నిజమైన పాలకులుగా మారారు.

పీష్వాల రాజ్యానికి పునాదులు వేసిన బాలాజీ విశ్వనాధ్న మహారాష్ట్ర సామ్రాజ్య రెండవ స్థాపకుడిగా పిలుస్తారు. బాలాజీ విశ్వనాధ్ తరువాత అతడి కుమారుడు మొదటి బాజీరావు 1720లో సింహాసనాన్ని అధిష్టించాడు. బలమైన సైన్యంతో మొదటి బాజీరావు కృష్ణా, గోదావరి మధ్య ప్రాంతాన్ని మహారాష్ట్రులు కిందకి తెచ్చాడు. హిందూ రాజ్యాన్ని ఏర్పాటు చేయాలని ఇతని ఆశయం. ‘మరాఠా కూటమి’ని ఏర్పాటుచేసిన బాజీరావు గుజరాత్, మాళ్వ, బుందేల్ఖండ్లను ఆక్రమించి ఢిల్లీపై దృష్టి కేంద్రీకరించాడు. అయితే లక్ష్యాన్ని సాధించక ముందే 42 సంవత్సరాల వయస్సులో 1740 సంవత్సరంలో మొదటి బాజీరావు మరణించాడు.

ప్రశ్న 8.
బాలాజీ విశ్వనాధ్
జవాబు:
శివాజీ మరణానంతరం మహారాష్ట్ర సామ్రాజ్యం అంతర్యుద్ధం వలన పతనావస్థకు చేరుకుంది. ఆ కల్లోల పరిస్థితులలో శివాజీ వదిలివెళ్ళిన బాధ్యతలను, ఆయన ఆశయాలను నెరవేర్చటమేగాక, పతనావస్థలో ఉన్న మహారాష్ట్ర రాజ్యాన్ని, సంస్కృతిని కాపాడిన ఘనత పీష్వాలకు దక్కింది. ఈ పీష్వాల వంశమూలపురుషుడు బాలాజీ విశ్వనాధ్ (1713-1720). మహారాష్ట్ర రాజ్యాన్ని, సంస్కృతిని మొదటగా కాపాడిన ఘనుడు బాలాజీ విశ్వనాధ్. ఛత్రపతి సాహుచే పీష్వాగా నియమించబడిన విశ్వనాధ్ సువిశాల సామ్రాజ్యాన్ని స్థాపించి, భారతీయ చరిత్రలో మహారాష్ట్రులకు విశిష్ట స్థానాన్ని సంపాదించాడు. మహారాష్ట్రుల నౌకాదళాధిపతియైన కన్హోజీతో ఒక సంధి కుదుర్చుకొని పోర్చుగీసు వారిని, ఆంగ్లేయులను ఓడించాడు. సయ్యద్ సోదరులతో ఒక ఒప్పందాన్ని కుదుర్చుకొని ఒకప్పుడు శివాజీకి చెందిన భూభాగాలన్నింటిని తిరిగి మొగలాయిల నుండి సంపాదించాడు. మహారాష్ట్రుల కూటమిని ఏర్పరచి మహారాష్ట్రులలో ఐక్యత సాధించాడు. ఇతని విధానాల వలన దేశంలో మహారాష్ట్రుల ప్రాబల్యం పెరిగింది. తన ఆశయాలు పూర్తిగా నెరవేరకమునుపే బాలాజీ విశ్వనాధ్ మరణించాడు.

ప్రశ్న 9.
మూడవ పానిపట్టు యుద్ధం
జవాబు:
అహమ్మదా అబ్దాలీ, మహారాష్ట్రుల సామ్రాజ్యకాంక్ష మూడో పానిపట్టు యుద్ధానికి దారితీసింది. 1757లో ఆఫ్ఘనిస్తాన్కు చెందిన అహమ్మద్ అబ్దాలీ పంజాబ్ను ఆక్రమించుకొని, తన కుమారుడైన తైమూరాను రాష్ట్రపాలకుడిగా నియమించాడు. పీష్వా బాలాజీ బాజీరావు సోదరుడు రఘునాథరావు. మహారాష్ట్ర ప్రభువు మలహరరావ్ హోల్కర్ లు కలిసి పంజాబ్పై దాడిచేసి, అక్కడి నుండి తైమూర్గాను తరిమివేశారు. దీనితో అహమ్మదా అబ్దాలీ, మహారాష్ట్రుల మధ్య యుద్ధం అనివార్యమైంది. 1761 నవంబరులో చారిత్రాత్మకమైన పానిపట్టు మైదానంలో మహారాష్ట్ర, ఆఫ్ఘన్ సైన్యాలు తలపడ్డాయి. ఈ యుద్ధంలో ఆఫ్ఘన్లు తిరుగులేని విజయం సాధించారు. సదాశివరావ్, విశ్వాసరావ్ అంతటి మహారాష్ట్ర వీరులు సైతం నేలకొరిగారు. వేలకొలది మహారాష్ట్ర సైనికులు యుద్ధభూమిలో మరణించారు. 40,000 మంది సైన్యం యుద్ధఖైదీలుగా పట్టుబడ్డారు. ఈ యుద్ధం వల్ల నష్టపోని మహారాష్ట్ర కుటుంబం లేదని జె. ఎన్. సర్కార్ వ్రాశాడు. ఈ పరాజయ వార్త విన్న కొద్దికాలానికే పీష్వా బాలాజీ బాజీరావు కృంగిపోయి మరణించాడు.

AP Inter 1st Year History Study Material Chapter 8 మొగలుల యుగం

సదాశివరావు అహంభావపూరిత స్వభావం, మహారాష్ట్ర నాయకులలో ఐకమత్యం లేకపోవటం, రొహిల్లాలు, అయోధ్య నవాబు వంటి స్వదేశీయులు అబ్దాలీకి సహాయపడటం, అటువంటి సహాయం మహారాష్ట్రులకు లేకపోవటం, సేనానిగా అబ్దాలీ ప్రదర్శించిన నైపుణ్యం, అబ్దాలీ విజయానికి, మహారాష్ట్రుల పతనానికి దోహదం చేశాయి.
మూడో పానిపట్టు యుద్ధం మహారాష్ట్రులకు ఘోరమైన సైనిక పరాజయం. దీనితో మహారాష్ట్రులు అజేయులన్న భావన పటాపంచలైంది. పీష్వా అధికారం క్షీణించి మహారాష్ట్ర సమాఖ్య విచ్ఛిన్నమైనది. ఈ యుద్ధం వలన విజృంభిస్తున్న మహారాష్ట్ర సామ్రాజ్యం అతలాకుతలమైపోయింది. హిందుపదేపదేహి అనే మహారాష్ట్రుల నినాదం గాలిలో కలిసిపోయింది. మొగల్ సామ్రాజ్యం ఇంకా నిర్వీర్యమైపోయింది. మహారాష్ట్రుల వైఫల్యం, మొగలుల బలహీనత ఆంగ్లేయులకు సహకరించాయి. వారిని ఎదిరించి నిలువగలిగిన శక్తి భారతదేశంలో ఎక్కడా లేకుండా పోయింది.

ప్రశ్న 10.
చౌత్, సర్దేశముఖి
జవాబు:
భూమిశిస్తు విధానంలో శివాజీ తనకు ముందు రాజా తోడర్ మల్, మాలిక్ అంబర్లు అనుసరించిన విధానాన్నే చాలా వరకు అనుసరించాడు. భూమిని సర్వే చేయించి, పండిన పంటలో 40 శాతాన్ని శిస్తుగా నిర్ణయించాడు. జమిందారీ విధానాన్ని రద్దుచేసి రైత్వారీ విధానాన్ని ప్రవేశపెట్టాడు. శిస్తును రైతులు ధనరూపంలోగాని, ధాన్యరూపంలోగాని చెల్లించవచ్చు. అవసర కాలంలో రైతులకు వాయిదాల పద్ధతిపై అప్పులు ఇచ్చాడు. విత్తనాలు, పశువుల పెంపకం కూడా చేశాడు. కానీ, వాటి విలువలను వాయిదాల పద్ధతి మీద ప్రభుత్వ అధికారులు తిరిగి రాబట్టుకునేవారు. స్వరాజ్ వెలుపల తాను నేరుగా పాలించని ప్రజల నుంచి చౌత్, సర్దేశముఖ్ అనే రెండు పన్నులను వసూలు చేశాడు. చౌత్ అంటే స్వరాజ్యం వెలుపల ఉన్న భూములు ఆదాయంపై 1/4 వంతు, సర్దేశముఖి అంటే ఆదాయంపై 1/10వ వంతు శిస్తుగా వసూలు చేశాడు. ఈ విధంగా వసూలైన ధనాన్ని మరాఠా రాజ్య నిర్మాణానికి వినియోగించాడు.

AP Inter 1st Year Chemistry Study Material Chapter 9 S బ్లాక్ మూలకాలు

Andhra Pradesh BIEAP AP Inter 1st Year Chemistry Study Material 9th Lesson S బ్లాక్ మూలకాలు Textbook Questions and Answers.

AP Inter 1st Year Chemistry Study Material 9th Lesson S బ్లాక్ మూలకాలు

అతిస్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
ఆవర్తన పట్టికలో కర్ణ సంబంధం ఉండటానికి గల కారణాలను తెలపండి.
జవాబు:
ఆవర్తన పట్టికలో రెండో పీరియడ్లోని ఒక గ్రూపు మూలకానికి మూడో పీరియడ్లోని రెండవ గ్రూపు మూలకానికి సారూప్య ధర్మాలుంటాయి. దీన్ని కర్ణ సంబంధం అంటారు.
ఉదా : (Li, Mg) ; (Be, Al) ; (B, Si)

కారణము :
కర్ణ సంబంధం ఉన్నా ఆయా మూలక పరమాణువుల (లేదా అయాన్ల) పరిమాణాలు సమానంగా ఉండటం లేదా వాటి ఋణ విద్యుదాత్మకత విలువలు సమానంగా వుంటాయి. కర్ణ సంబంధం గల సారూప్య మూలకాలకు ఒకేలాంటి ధృవణ సామర్థ్యం ఉంటుంది.

ధృవణ సామర్థ్యం అంటే అయానిక ఆవేశానికి, అయానిక వ్యాసార్థం వర్గానికి గల నిష్పత్తి.

ప్రశ్న 2
K, Rb ల ఎలక్ట్రాన్ విన్యాసాలను పూర్తిగా రాయండి.
జవాబు:
ఎలక్ట్రానిక్ విన్యాసాలు :
K(z = 19) = [Ar] 4s¹ (లేదా) 1s² 2s² 2p6 3s² 3p6 4s¹
Rb (z = 37) = [Kr] 5s¹ (లేదా) 1s² 2s² 2p6 3s² 3p6 4s² 4p6 5s¹

ప్రశ్న 3.
లిథియమ్ లవణాలు చాలావరకు ఆర్ద్రీకృతమై ఉంటాయి. ఎందుకు?
జవాబు:
Li+ అయాన్ యొక్క హైడ్రేషన్ ఎంథాల్పీ చాలా ఎక్కువ. దీనికి హైడ్రేషన్ ఎంథాల్పీ అవధి ఎక్కువ. కావున Li లవణాల చాలా ఆర్ద్రీకృతమై ఉంటాయి.

ప్రశ్న 4.
క్షారలోహాలలో దేనికి అసాధారణ సాంద్రత ఉంటుంది? గ్రూపు 1 మూలకాల సాంద్రతల మార్పులో క్రమం ఏమిటి?
జవాబు:
‘K’ మూలకానికి అసాధారణ సాంద్రత ఉంటుంది. ‘K’ యొక్క స్ఫటిక జాలకంలో అంతరపరమాణుక దూరాలు ఎక్కువగా ఉంటాయి.
→ IA గ్రూపు మూల కాల సాంద్రత క్రమం
Li < Na > K < Rb < Cs

ప్రశ్న 5.
సోడియమ్ కంటే లిథియమ్ నీటితో జరిపే చర్యాతీక్షణత తక్కువ. కారణాలను తెలపండి.
జవాబు:
సోడియం కంటే లిథియం నీటితో జరిపే చర్యా తీక్షణత తక్కువ.

వివరణ :

  • లిథియంకు పరమాణు పరిమాణం తక్కువ.
  • లిథియంకు హైడ్రేషన్ శక్తి చాలా ఎక్కువ.

AP Inter 1st Year Chemistry Study Material Chapter 9 S బ్లాక్ మూలకాలు

ప్రశ్న 6.
క్షారలోహాల హాలైడ్లలో లిథియమ్ అయొడైడ్ అత్యధిక కోవలెంట్ ధర్మం కలది. కారణాలను తెలపండి.
జవాబు:
క్షారలోహాల హాలైడ్లలో లిథియం అయొడైడ్ అత్యధిక కోవలెంట్ ధర్మం కలది.

వివరణ :

  • Li+అయాన్ కు దృవణతా సామర్థ్యం ఎక్కువ.
  • Li+కు పరమాపరిమాణం తక్కువ
  • Li+అయాన్ ఎలక్ట్రాన్ సమూహంను I అయాన్పై విస్థారం చేయు సామర్థ్యం ఎక్కువ.

ప్రశ్న 7.
క్షారలోహ హైడ్రోజన్ కార్బొనేట్ కంటే లిథియమ్ హైడ్రోజన్ కార్బోనేట్ ఏవిధంగా విభేదిస్తుంది?
జవాబు:
క్షారలోహ హైడ్రోజన్ కార్బొనేట్లలో లిథియం హైడ్రోజన్ కార్బొనేట్ విభేదిస్తుంది. లిథియం హైడ్రోజన్ కార్బొనేట్ ఘన పదార్థంగా ఉండదు. మిగతా హైడ్రోజన్ కార్బొనేట్ ఘన పదార్థాలుగా ఉంటాయి.

ప్రశ్న 8.
ఏవైనా రెండు క్షారమృత్తిక లోహాల ఎలక్ట్రానిక్ విన్యాసాలను పూర్తిగా రాయండి.
జవాబు:
ఎలక్ట్రాన్ విన్యాసం :
అన్ని క్షారలోహాల బాహ్య స్థాయి సాధారణ ఎలక్ట్రాన్ విన్యాసము “ns¹”.

మూలకముఫార్ములాఎలక్ట్రాన్ విన్యాసము
లిథియమ్Li31s2 2s1 [లేదా] [He] 2s1
సోడియమ్Na111s2 2s2 2p6 3s1 [లేదా] [Ne] 3s1
పొటాషియమ్K191s2 2s2 2p6 3s2 3p6 4s1 [లేదా] [Ar] 4s1
రుబిడియమ్Rb371s2 2s2 2p6 3s2 3p6 3d10 4s2 4p6 5s1 [లేదా] [Kr] 5s1
సీసియమ్Cs551s2 2s2 2p6 3s2 3p6 3d10 4s2 4p6 4d10 5s2 5p6 6s1 [లేదా] [xe] 6s1
ప్రాన్షియమ్Fr87[Rn] 7s1

ప్రశ్న 9.
క్షారమృత్తిక లోహాల ద్రవీభవన, బాష్పీభవన స్థానాల మార్పుల గురించి చెప్పండి.
జవాబు:

  • క్షార మృత్తిక లోహాల యొక్క ద్రవీభవన భాష్పీభవన స్థానాలు వాటి సంబంధిత క్షారలోహాల ద్రవీభవన, భాష్పీభవనస్థానాల కంటే ఎక్కువగా ఉంటాయి. దీనికి కారణం వాటి తక్కువ పరిమాణం.
  • తక్కువ అయనీకరణ శక్తి విలువలు కలిగియుండుట వలన వీటి ద్రవీభవన, భాష్పీభవన స్థానాలు సరైన క్రమంలో ఉండవు.

AP Inter 1st Year Chemistry Study Material Chapter 9 S బ్లాక్ మూలకాలు

ప్రశ్న 10.
గ్రూపు 2 మూలకాలు జ్వాలకు కలిగించే స్వాభావిక రంగులు ఏమిటి?
జవాబు:

మూలకంజ్వాల స్వాభావిక రంగు
కాల్షియంఇటుక ఎరుపు
స్ట్రాన్షియంకెంపు
బేరియంఆపిల్ పచ్చ
బెరిలియంరంగులేదు
మెగ్నీషియంరంగులేదు

ప్రశ్న 11.
మెగ్నీషియమ్ లోహాన్ని గాలిలో మండిస్తే ఏం జరుగుతుంది? [A.P. Mar. ’15]
జవాబు:
మెగ్నీషియం లోహాన్ని గాలిలో మండిస్తే కాంతివంతంగా మండి MgO మరియు Mg3N2 లను ఏర్పరచును.
2Mg + O2 → 2MgO
3Mg + N2 → Mg3N2

ప్రశ్న 12.
లిథియమ్ కార్బొనేటికి మిగిలిన క్షారలోహాల కార్బొనేట్ల వలె ఉష్ణ స్థిరత్వం లేదు. వివరించండి.
జవాబు:
లిథియం కార్బొనేట్కు మిగిలిన ‘క్షార లోహాల కార్బొనేట్ల వలె ఉష్ణస్థిరత్వం లేదు.

వివరణ :

  • ‘Li’ కు తక్కువ పరమాణు పరిమాణం కలదు. ఇది (O33 అయానన్ను దృవణత చెందించి స్థిరమైన Li, మరియు CO, లను ఏర్పరచును.
  • గ్రూపులో కిందికి వెళ్ళే కొలది ధన విద్యుదాత్మకత పెరిగి కార్బొనేట్ల ఉష్ణస్థిరత్వం పెరుగును.

ప్రశ్న 13.
గ్రూపు 2 లోహాలు ద్రవ అమ్మోనియాలో అమ్మోనియేటెడ్ లోహ అయాన్లు ఏర్పడటానికి తుల్య సమీకరణాన్ని రాయండి.
జవాబు:
క్షార మృత్తిక లోహాలు ద్రవ అమ్మోనియాలో కరిగి చిక్కని నీలం నలుపు రంగు గల ద్రావణాలను ఏర్పరచును. ఇందులో అమ్మోనియేటెడ్ అయాన్లు ఏర్పరచును.
M + (x + y) NH3 → [M(NH3)x]2+ + 2 [e(NH3)x]

ప్రశ్న 14.
క్షార మృతిక లోహాల ఫ్లోరైడ్లు నీటిలో ఆయా క్లోరైడ్ ల కంటే అల్ప ద్రావణీయత ఉన్నవి. ఎందుకు?
జవాబు:
క్షారమృత్తిక లోహాల ఫ్లోరైడ్లు నీటిలో ఆయా క్లోరైడ్ల కంటే అల్ప ద్రావణీయత కలిగి ఉన్నవి. దీనికి కారణం ఫ్లోరైడ్లకు అధిక జాలక శక్తి కలిగి ఉండును.

ప్రశ్న 15.
ఆర్ద్ర Mg(NO3)2 ని వేడిచేస్తే ఏమౌతుంది? దానికి తుల్య సమీకరణాన్ని ఇవ్వండి.
జవాబు:
ఆర్ద్ర Mg(NO3)2 లవణాన్ని వేడి చేయగా మొదట ఆరు నీటి అణువులను కోల్పోయి తరువాత వేడి చేయగా ఆక్సైడ్ను ఏర్పరచును.
2Mg(NO3)2 → 2MgO + 4NO2 + O2

ప్రశ్న 16.
క్షారమృత్తిక లోహ హైడ్రాక్సైడ్ల జల ద్రావణీయత గ్రూపులో పైనుంచి కిందికి పెరుగుతుంది. ఎందుకో చెప్పండి.
జవాబు:
క్షార మృత్తిక లోహాల హైడ్రాక్సైడ్లో ఆనయాన్ సాధారణం, కాటయాన్ వ్యాసార్థం జాలక ఎంథాల్పీని ప్రభావితం చేయును. హైడ్రేషన్ ఎంథాల్పీ జాలక ఎంథాల్పీకంటే ఎక్కువ. దీనికి కారణం అయానిక పరిమాణం పెరుగును. కావున ద్రావణీయత పెరుగును.

ప్రశ్న 17.
క్షారమృతిక లోహాల కార్బొనేట్ల, సల్ఫేట్ల జలద్రావణీయత గ్రూపులో కిందికి పోయిన కొద్దీ ఎందుకు తగ్గుతుంది?
జవాబు:
ఆనయాన్ పరిమాణం కాటయాన్ కంటే చాలా ఎక్కువ. గ్రూపులో జాలక ఎంథాల్పీ దాదాపుగా సమానంగా ఉండును. గ్రూపులో హైడ్రేషన్ ఎంథాల్పీ తగ్గటం వలన క్షారమృత్తిక లోహ కార్బోనేట్లు, సల్ఫేట్ల ద్రావణీయత తగ్గును.

AP Inter 1st Year Chemistry Study Material Chapter 9 S బ్లాక్ మూలకాలు

ప్రశ్న 18.
పోర్ట్లాండ్ సిమెంట్ సగటు సంఘటనాన్ని తెలపండి.
జవాబు:
పోర్ట్లాండ్ సిమెంట్ సంఘటనం
CaO – 50 – 60%
SiO2 – 20 – 25%
Al2O3 – 5 – 10%
MgO – 2 – 3%
Fe2O3 – 1 – 2%
మరియు SO2 – 1 – 2%

ప్రశ్న 19.
సిమెంట్కి జిప్సమ్ని ఎందుకు కలుపుతారు? [T.S. Mar. ’15 Mar. ’13]
జవాబు:
సిమెంటు జిప్సం కలుపుట వలన సెట్టింగ్ నెమ్మదిగా జరిగి సిమెంట్ తగినంత గట్టిపడుతుంది.

ప్రశ్న 20.
ప్రకృతిలో క్షారలోహాలు స్వేచ్ఛా స్థితిలో ఎందుకు దొరకవు?
జవాబు:
క్షారలోహాలు చాలా చురుకైనవి. అందుచేత అవి స్వేచ్ఛా స్థితిలో దొరకవు. ఎప్పుడూ సంయోగస్థితిలోనే దొరుకుతాయి. ప్రకృతిలో భూతలంపైన అవి విస్తారంగా వితరణ చెంది ఉంటాయి. పరిమాణు సంఖ్య పెరిగే కొలదీ విస్తృతి తగ్గుతుంది.

Na మరియు K లు అతి విస్తారంగా దొరికే క్షారలోహాలు. అవి వాటి హాలైడ్లుగా ఎక్కువగా దొరుకుతాయి.
క్షార లోహాలు త్వరితగతిన ఎలక్ట్రాన్ కోల్పోయి M+ గా మారుతాయి.

ప్రశ్న 21.
సాల్వే పద్ధతిలో పొటాషియమ్ కార్బొనేట్ని తయారు చేయలేం. ఎందుకు?
జవాబు:
పోటాషియం కార్బొనేట్ను సాల్వేపద్ధతిలో తయారు చేయలేము.

వివరణ :
పొటాషియం బై కార్బొనేట్ అధిక ద్రావణీయత కలిగియుండును.
అమ్మోనియం బైకార్బొనేట్ను సంతృప్త KC కు కలుపగా అవక్షేపం ఏర్పడును.

ప్రశ్న 22.
కాప్టిక్ సోడా ముఖ్యమైన ఉపయోగాలను వివరించండి. [A.P. Mar. ’15]
జవాబు:
ఉపయోగాలు :

  • పెట్రోల్ను శుద్ధి చేయుటలో ఉపయోగిస్తారు.
  • బాక్సైట్ను శుద్ధి చేయుటలో ఉపయోగిస్తారు.
  • సబ్బులు, కాగితం తయారీలో ఉపయోగిస్తారు.
  • కృత్రిమ సిల్కు తయారీలో ఉపయోగిస్తారు.
  • చాలా రసాయనాల తయారీలో ఉపయోగిస్తారు.
  • వస్త్ర పరిశ్రమలలో ఉపయోగిస్తారు.
  • ప్రయోగశాలలో రసాయన కారకంగా ఉపయోగిస్తారు.

ప్రశ్న 23.
సోడియమ్ కార్బొనేట్ ముఖ్యమైన ఉపయోగాలను వివరించండి.
జవాబు:
ఉపయోగాలు :

  • Na2CO3 ని గాజు తయారీలో ఉపయోగిస్తారు.
  • Na2CO3 ని బోరాక్స్, కాస్టిక్ సోడా తయారీలో ఉపయోగిస్తారు.
  • కాగితం, రంగుల, వస్త్ర పరిశ్రమలలో ఉపయోగిస్తారు.
  • నీటిలోని కఠినత్వాన్ని తొలగించుటకు ఉపయోగిస్తారు.
  • లాండ్రీలలో ఉపయోగిస్తారు.

AP Inter 1st Year Chemistry Study Material Chapter 9 S బ్లాక్ మూలకాలు

ప్రశ్న 24.
పొడిసున్నం ముఖ్య ఉపయోగాలను వివరించండి. [Mar. ’14]
జవాబు:
ఉపయోగాలు :

  • చక్కెరను శుద్ధి చేయుటలో ఉపయోగిస్తారు.
  • రంజన ద్రవ్యాలను తయారుచేయుటలో ఉపయోగిస్తారు.
  • Na2CO3, NaOH ల తయారీలో ఉపయోగిస్తారు.
  • ఇది చవకైన క్షారరూపం మరియు సిమెంట్ తయారీలో ఉపయోగపడును.

ప్రశ్న 25.
(i) BeCl2 (బాష్పం) (ii) BeCl2 (ఘనపదార్థం) ల నిర్మాణాలను గీయండి.
జవాబు:
(i) BeCl2 (బాష్పం) 1200K వద్ద ఈ కింది రేఖీయ రూపంలో ఉండును.
Cl – Be – Cl

(ii) ఘనస్థితిలో BeCl2 శృంఖల నిర్మాణం కలిగియుండును.
AP Inter 1st Year Chemistry Study Material Chapter 9 S బ్లాక్ మూలకాలు 1

ప్రశ్న 26.
ప్లాస్టర్ ఆఫ్ పారిస్ ప్రాముఖ్యతను వివరించండి. క్షారమృత్తిక లోహాల కార్బొనేట్లలో దేనికి అధిక ఉష్ణ స్థిరత్వం ఉంటుంది? ఎందుకు?
జవాబు:

  • నీటితో ప్లాస్టర్ ఆఫ్ పారిస్ సెట్టింగ్ జరుగును. ఇది ఒక ముఖ్యమైన ధర్మం.
  • 5 నుండి 15 ని.ల వ్యవధిలోనే ఇది గట్టిపడగలదు.
  • దీనిని ఎక్కువగా భవన నిర్మాణాలలో, ప్లాస్టర్లలో ఉపయోగిస్తారు.
  • దంతవైద్యంలో ఉపయోగిస్తారు.
  • విగ్రహాల తయారీలో ఉపయోగిస్తారు.
  • ఎముకలు విరిగినా, నొప్పులు పట్టినా శరీర అవయవాలు కదలకుండా ఉండుటకు ఉపయోగిస్తారు.

ప్రశ్న 27.
కింది చర్యలకు తుల్య సమీకరణాలను రాయండి.
i) Na2O2 నీరు రసాయన చర్య ii) నీటితో KO చర్య
జవాబు:
i) Na2O2 + 2H2O → 2NaOH + H2O2

ii) K2O + H2O → 2KOH

స్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
ఆక్సీకరణ జ్వాలకు క్షారలోహాలు, వాటి సమ్మేళనాలు స్వాభావిక రంగులను ఇస్తాయి. కారణాలను వివరించండి.
జవాబు:
ఆక్సీకరణ జ్వాలకు క్షారలోహాలు, వాటి సమ్మేళనాలు స్వాభావిక రంగులను ఇస్తాయి.

వివరణ :

  • జ్వాల నుండి వెలువడే ఉష్ణం బాహ్య కర్పరంలోని ఎలక్ట్రాన్ను అధికశక్తి స్థాయికి ఉద్రికత్తపరుస్తాయి.
  • అధికశక్తి స్థాయిలోని ఎలక్ట్రాన్ శక్తిని విడుదల చేసి భూస్థాయికి చేరును. ఇది దృగ్గోచర ప్రాంతంలో ఉండును.

ప్రశ్న 2.
కాంతి విద్యుత్ ఘటాల ఎలక్ట్రోడ్లుగా సీసియమ్, పొటాషియమ్ల ఏ ధర్మాలు ఉపయోగపడతాయి?
జవాబు:

  • క్షారలోహాలు వాటి జ్వాల పరీక్షల ద్వారా గుర్తించవచ్చు. మరియు జ్వాల ఫోటోమెట్రి ద్వారా కనుగొనవచ్చు.
  • కాంతితో ఈ లోహలను చర్యజరిపినపుడు, ఆ లోహపరమాణువు ఎలక్ట్రాన్ కోల్పోవుటకు సరైన శక్తిని శోషించుకొనును.
  • కావున సీసియమ్, పొటాషియంలను కాంతి విద్యుద్ఘాటాల ఎలక్ట్రోడ్లుగా ఉపయోగపడతాయి.

ప్రశ్న 3.
క్షార లోహాలు గాలితో చర్యపై లఘు వ్యాఖ్యను రాయండి.
జవాబు:
O2 తో చర్య :
క్షారలోహాలన్నీ ఆక్సిజన్ వేడి చేసినప్పుడు చర్య జరిపి వాటి ఆక్సైజ్లనిస్తాయి. దీనిలో ఉష్ణశక్తి విడుదలవుతుంది. అలా ఏర్పడిన ఆక్సైడ్ లోహం చర్యాశీలతపై ఆధారపడి ఉంటుంది.
4 Li + O2 → 2 Li2O (మోనాక్సైడ్)
Rb + O2 → RbO2 (సూపరాక్సైడ్)
2 Na + O2 → Na2 O2 (పెరాక్సైడ్)
Cs + O2 → 2 CsO2 (సూపరాక్సైడ్)
2K + O2 → K2 O2 (పెరాక్సైడ్)

  • లిథియమ్ ఎక్కువగా LiO ను ఇస్తుంది. K, Rb, Cs లు O2 తో సూపరాక్సైడ్లను ఇస్తాయి.
  • క్షారలోహ అయాన్ పరిమాణం పెరిగిన కొద్దీ జాలక శక్తి పెరుగుతుంది. కాబట్టి సూపరాక్సైడ్ స్థిరత్వం పెరుగుతుంది.
  • భార క్షారలోహాల సూపరాక్సైడ్ జాలక శక్తి అధికం. కాబట్టి వాటికి స్థిరత్వాలు ఎక్కువ.

ప్రశ్న 4.
కింది లోహాలు ఒక్కొక్కదానికి ఏవైనా రెండు ఉపయోగాలను రాయండి.
(i) లిథియమ్ (ii) సోడియమ్
జవాబు:
(i) లిథియం ఉపయోగాలు :
మిశ్రమ లోహాల తయారీలో ఉపయోగిస్తారు.
ఉదా : 1) Li-Pb మిశ్రమలోహం మోటార్ ఇంజన్లలో బేరింగ్లుగా వాడతారు.
2) Li-Al మిశ్రమలోహాలు విమాన భాగాల తయారీలో వాడతారు.

  • ఉష్ణకేంద్రక చర్యలలో ఉపయోగిస్తారు.
  • విద్యుత్ రసాయన ఘటాల తయారీలో ఉపయోగిస్తారు.

(ii) సోడియం లోహం – ఉపయోగాలు :

  1. కర్బన రసాయన చర్యల్లో కారకంగా వాడతారు.
  2. ఐసోప్రీన్ పాలిమరీకరణం చెంది రబ్బర్ ఏర్పడటంలో ఉత్ప్రేరకంగా వాడతారు.
  3. సోడియమ్ ఎమాల్గమ్ (Na – Hg) ఒక మంచి క్షయకరణి.
  4. ద్రవ Na లోహాన్ని న్యూక్లియర్ రియాక్టర్లలో కూలెంట్గా వాడతారు.
  5. Na మిశ్రమ లోహాల తయారీలో ఉపయోగిస్తారు.

AP Inter 1st Year Chemistry Study Material Chapter 9 S బ్లాక్ మూలకాలు

ప్రశ్న 5.
వాషింగ్ సోడా ధర్మాలను రాయండి. [Mar. ’14]
జవాబు:

  • Na2CO3 తెల్లటి (రంగులేని) స్ఫటిక ఘనపదార్థం.
  • ఇది డెకాహైడ్రేట్గా ఉండును. దీనినే వాషింగ్ సోడా (Na2Ca3. 10H2O) అంటారు.
  • ఇది నీటిలో కరుగును.
  • Na2CO3. 10H2O వేడిచేయగా నీటి అణువులను కోల్పోయి మోనోహైడ్రేట్గా మారును. దీనిని 373k కంటే ఎక్కువగా వేడిచేసినపుడు సోడా మాషన్ను ఏర్పరచును.

చర్యలు :
AP Inter 1st Year Chemistry Study Material Chapter 9 S బ్లాక్ మూలకాలు 2
→ Na2CO3 జల ద్రావణం క్షారస్వభావం కలిగియుండును. (PH > 7) ఇది ఆనయానిక్ జలవిశ్లేషణ వలన.
CO3-2 + H2O → HCO3 + OH

ప్రశ్న 6.
సోడియమ్ కార్బొనేట్ ఉపయోగాలను రాయండి.
జవాబు:
ఉపయోగాలు :

  • Na2CO3 ని గాజు తయారీలో ఉపయోగిస్తారు..
  • Na2CO3 ని బోరాక్స్, కాస్టిక్ సోడా తయారీలో ఉపయోగిస్తారు.
  • కాగితం, రంగుల, వస్త్ర పరిశ్రమలలో ఉపయోగిస్తారు.
  • నీటిలోని కఠినత్వాన్ని తొలగించుటకు ఉపయోగిస్తారు.
  • లాండ్రీలలో ఉపయోగిస్తారు.

ప్రశ్న 7.
ముడి సోడియమ్ క్లోరైడ్ నుంచి శుద్ధ లవణాన్ని మీరు ఎట్లా తయారుచేస్తారు?
జవాబు:

  • ముడి NaCl ను తక్కువ పరిమాణంలో నీటిలో కరిగించి మలినాలను వడపోసినపుడు శుద్ధ NaCl లవణం ఏర్పడును.
  • ఈ ద్రావణాన్ని HCl తో సంతృప్తపరచవలెను. అపుడు శుద్ధ NaCl స్ఫటికాలు వేరువుతాయి.
  • Ca మరియు Mg క్లోరైడ్లు NaCl కంటే అధికంగా కరుగుతాయి. కావున ఇవి ద్రావణంలోనే ఉంటాయి.

ప్రశ్న 8.
కాష్టనర్ కెల్నర్ పద్ధతి గురించి మీకేమి తెలుసు? దానిలో ఉన్న సూత్రాన్ని రాయండి.
జవాబు:
కాస్ట్నర్ – కెల్నర్ పద్ధతి – NaOH తయారీ :
దీనిని మెర్క్యురి – కాథోడ్ పద్ధతి అని కూడా అంటారు.

సూత్రం :
ఈ పద్ధతిలో మెర్క్యురిని కాథోడ్గా ఉపయోగించి బ్రైన్ ద్రావణాన్ని విద్యుద్విశ్లేషణం చేయుట ద్వారా NaOH ను తయారు చేస్తారు. ఆనోడ్ వద్ద క్లోరిన్ వాయువు, కాథోడ్ వద్ద సోడియం అమాల్గం ఏర్పడతాయి. ఈ సోడియం అమాల్గం నీటితో చర్య జరిపి NaOH ద్రావణం మరియు H2 వాయువులను యిస్తాయి.

ఘట చర్యలు :
AP Inter 1st Year Chemistry Study Material Chapter 9 S బ్లాక్ మూలకాలు 3

ప్రశ్న 9.
కాప్టిక్ సోడా అనువర్తనాలను రాయండి.
జవాబు:

  • పెట్రోల్ను శుద్ధి చేయుటలో ఉపయోగిస్తారు.
  • బాక్సెట్ను శుద్ధి చేయుటలో ఉపయోగిస్తారు.
  • సబ్బులు, కాగితం తయారీలో ఉపయోగిస్తారు.
  • కృత్రిమ సిల్కు తయారీలో ఉపయోగిస్తారు.
  • చాలా రసాయనాల తయారీలో ఉపయోగిస్తారు.
  • వస్త్ర పరిశ్రమలలో ఉపయోగిస్తారు.
  • ప్రయోగశాలలో రసాయన కారకంగా ఉపయోగిస్తారు.

ప్రశ్న 10.
Na+, K+ అయాన్ల ప్రాముఖ్యతను జీవరసాయన శాస్త్రంలో చెప్పండి.
జవాబు:

  1. కణాల్లోని కర్బన అణువులతో ఉన్న ఋణావేశాలను లోహ అయాన్ల పై నుండే ఆవేశాలు తుల్యం చేస్తాయి. కణాలలో ద్రవాభిసరణ పీడనాన్ని కూడా నిలకడగా ఉంచడానికి ఈ అయాన్లు సహాయపడతాయి.
  2. కణాల నుంచి Na+ అయాన్లు బహిష్కృతమవుతాయి. ఈ అయాన్ రవాణా చర్యలను “సోడియం పంప్” అంటారు. అయితే K+ అయాన్లు బహిష్కృతం కావు. Na+ అయాన్లను బయటికి పంపివేయడానికి లేదా K+ అయాన్లను లోపలికి తీసుకోవటానికి జల విశ్లేషణ వల్ల వస్తుంది.
  3. కణపు పొరకు అటు, ఇటు పక్కల Na+, K+ అయాన్లుంటాయి. దీనివల్ల కణంలో విద్యుత్ శక్మం ఏర్పడుతుంది. Na+ అయాన్లుండటం వల్ల గ్లూకోజ్ కణంలోపలికి వెళుతుంది. అధికంగా ఉన్న Na+ అయాన్లు బహిష్కృతమవుతాయి. ఎమినో ఆమ్లాల చలనాలు కూడా ఇదే మాదిరిగా ఉంటాయి.
  4. పొటాషియమ్ అయాన్లు కణాంతర్భాగంలో గ్లూకోజ్ జీవన క్రియల్లో దోహదపడతాయి. ప్రోటీన్ల సంశ్లేషణలోనూ, కొన్ని నిర్దిష్టమైన ఎంజైమ్లు ఉత్తేజితమవడానికి సహాయపడుతుంది.

ప్రశ్న 11.
Mg లోహం ముఖ్య ఉపయోగాలను చెప్పండి.
జవాబు:

  • Mg లోహం Al, Zn, Mn మరియు Sn లతో ముఖ్యమైన మిశ్రమ లోహాలను ఏర్పరచును.
  • ‘Mg’ పొడి మరియు రిబ్బన్లను ఫ్లాష్ బల్బులలో ఉపయోగిస్తారు.
  • ఇన్సెండియర్ బాంబ్లు మరియు సిగ్నల్లలో Mg ని ఉపయోగిస్తారు.
  • మిల్క్ ఆఫ్ మెగ్నీషియంను ఆమ్లవిరోధి (Antacid)గా ఉపయోగిస్తారు. → టూత్పేస్ట్లలో ఉపయోగిస్తారు.

ప్రశ్న 12.
Be(OH)2 ద్విస్వభావ పదార్థం అని రుజువు చేయండి.
జవాబు:
Be(OH)2 ద్విస్వభావ పదార్థం అనగా ఆమ్ల మరియు క్షార స్వభావం కలిగి ఉండును. ఈ క్రింది చర్యల ద్వారా మనకు Be(OH), యొక్క ద్విస్వభావం తెలుస్తుంది.
Be(OH)2 + 2OH → [Be(OH)4]-2
Be(OH)2 + 2HCl + 2H2O → [Be(OH)4]Cl2
కావున Be(OH)2 ద్విస్వభావ పదార్థం

ప్రశ్న 13.
బెరిలియమ్ అసంగత ప్రవర్తన గురించి ఒక వ్యాఖ్యను రాయండి.
జవాబు:
బెరిలియమ్ అసంగత ధర్మాలు :
ఒక గ్రూపులో మొదటి మూలకం మిగిలిన గ్రూపు మూలకాలతో తేడాలను చూపిస్తుంది. Be మిగిలిన క్షార మృత్తిక లోహాల కంటే భిన్నంగా ఉంటుంది. దీనికి కారణం దీని చిన్న పరిమాణం, అధిక ఋణ విద్యుదాత్మకత. Be మిగిలిన గ్రూపు మూలకాలతో క్రింది అంశాలలో తేడా చూపిస్తుంది.

  1. అధిక ధృవణ సామర్థ్యం ఉండటం వల్ల, Be సమ్మేళనాలు కోవలెంట్ స్వభావం ఎక్కువగా కలవి. దాని లవణాలు జలవిశ్లేషణ చెందుతాయి.
  2. పొడి గాలిలో Be తేలికగా మారదు. సాధారణ ఉష్ణోగ్రతల వద్ద నీటిని విఘటనం చేయదు.
  3. Be ద్వంద్వ స్వభావం గల లోహం. అది క్షారాలలో కరిగి బెరిలేట్లనిస్తుంది.
  4. Be, దాని లవణాలు జ్వాల పరీక్షను ఇవ్వదు. Ca, Sr, Ba లు వాటి వాటి స్వాభావిక జ్వాల రంగులను ఇస్తాయి.
  5. BeSO4 నీటిలో కరుగుతుంది. Ca, Sr, Ba ల సల్ఫేట్లు కరగవు.
  6. Be చాలా సంక్లిష్ట సమ్మేళనాలను ఏర్పరుస్తుంది. అయితే దీనికంటే భార మూలకాలు సంక్లిష్ట సమ్మేళనాలనేర్పరచటానికి సుముఖత చూపించవు.
  7. Be కి అత్యధిక కోవలెన్సీ 4 మిగిలిన మూలకాలకు 6 ఉండవచ్చు.

AP Inter 1st Year Chemistry Study Material Chapter 9 S బ్లాక్ మూలకాలు

ప్రశ్న 14.
Be, Al తో కర్ణ సంబంధం కలిగి ఉంటుంది. చర్చించండి.
జవాబు:
‘Be’ మూలకం ‘Al’ తో కర్ణ సంబంధం కలిగియుండును.

  • Be+2 యొక్క అయానిక వ్యాసార్థం Al+3 కి దాదాపుగా సమానంగా ఉంటుంది.
  • Be, Al రెండును ఆమ్లాలతో చర్యజరుపుతాయి.
  • Al(OH)3, Be(OH)2 రెండు అధిక క్షారంలో కరిగి బెరైలేట్ అయాన్ [Be(OH)3]2+ మరియు అల్యూమినేట్ (Al(OH)4] ను ఏర్పరచును.
  • Be, Al క్లోరైడ్లు భాష్పస్థితిలో వారధి నిర్మాణాలు కలిగి ఉంటాయి.
  • Be, Al క్లోరైడ్లు బలమైన లూయి ఆమ్లాలు.
  • ఫ్రీడల్ క్రాఫ్ట్ చర్యలలో Be, Al క్లోరైడ్లను ఉత్ప్రేరకాలుగా ఉపయోగిస్తారు.
  • Be, Al లు రెండు సంక్లిష్టాలను ఏర్పరుస్తాయి.

ప్రశ్న 15.
ప్లాస్టర్ ఆఫ్ పారిస్ CaSO4 యొక్క హెమి హైడ్రేట్ అంటే ఏమిటి? దాని మీద లఘువ్యాఖ్యను రాయండి.
జవాబు:
తయారీ :

  • జిప్సంను 393k వద్ద వేడి చేసి ప్లాస్టర్ ఆఫ్ పారిస్ ను పొందవచ్చు
  • AP Inter 1st Year Chemistry Study Material Chapter 9 S బ్లాక్ మూలకాలు 4
  • ఉష్ణోగ్రత 393k కంటే ఎక్కువ ఉపయోగిస్తే అనార్ద్ర CaSO ఏర్పడును. దీనినే డెడ్ బర్న్ ప్లాస్టర్ అంటారు.

ఉపయోగాలు :
నీటితో ప్లాస్టర్ ఆఫ్ పారిస్ సెట్టింగ్ జరుగును. ఇది ఒక ముఖ్యమైన ధర్మం.

  • 5 నుండి 15 ని.ల వ్యవధిలోనే ఇది గట్టిపడగలదు.
  • దీనిని ఎక్కువగా భవన నిర్మాణాలలో, ప్లాస్టర్లలో ఉపయోగిస్తారు.
  • దంతవైద్యంలో ఉపయోగిస్తారు.
  • విగ్రహాల తయారీలో ఉపయోగిస్తారు.
  • ఎముకలు విరిగినా, నొప్పులు పట్టినా శరీర అవయవాలు కదలకుండా ఉండుటకు ఉపయోగిస్తారు.

ప్రశ్న 16.
సాయన ప్రవృత్తిలో మెగ్నీషియమ్ లిథియమ్ ఏ రకంగా సారూప్యతను చూపిస్తుంది?
జవాబు:
ఆవర్తన పట్టికలో రెండో పీరియడ్లోని ఒక గ్రూపు మూలకానికి మూడో పీరియడ్లోని తరవాత గ్రూపు మూలకానికి సారూప్య ధర్మాలుంటాయి. దీన్ని కర్ణ సంబంధం అంటారు. ఉదాహరణకు లిథియమ్, మెగ్నీషియమ్లు కర్ణ సంబంధాన్ని చూపిస్తాయి. కర్ణ సంబంధాన్ని చూపే మూలకాల ధృవణ సామర్థ్యాలు లేదా ఋణ విద్యుదాత్మకతలు లేదా సమ్మేళనాల స్వభావాలు సారూప్యంగా ఉంటాయి. పరిమాణం ఆవేశాల ప్రభావం కర్ణ సంబంధాల మీద ఉంటుంది. ఉదాహరణకు ఒక యూనిట్ వైశాల్యంపై ఉండే ఆవేశం. లిథియమ్ క్రింద ఇచ్చిన అంశాలలో మెగ్నీషియమ్తో సారూప్యతను చూపిస్తుంది.

a) లిథియమ్ నీటితో నెమ్మదిగా చర్య జరుపుతుంది. మెగ్నీషియమ్ వేడి నీటిని మాత్రమే విఘటనం చెందిస్తుంది.
2 Li + 2H2O → 2 LiOH + H2;
Mg + 2 H2O → Mg (OH)2 + H2
b) లిథియమ్ N తో నేరుగా కలిసి నైట్రైడ్ను ఇస్తుంది.
6 Ni + N2 → 2 Li3N
c) లిథియమ్, మెగ్నీషియమ్లు రెండూ మోనాక్సైడ్ నిస్తాయి. Li2O, MgO.
d) MgCl2 మాదిరిగానే LiCl కూడా ఉదగ్రాహక పదార్థం, MgCl2 లాగానే LiCl కూడా వేడి నీటితో కొద్ది మేరకు, జలవిశ్లేషణ చెందుతుంది.
e) వాటి కోవలెంట్ స్వభావం వల్ల లిథియమ్, మెగ్నీషియమ్ల హాలైడ్లు కర్బన ద్రావణులలో కరుగుతాయి.
f) Li+, Mg2+ లు రెండూ మిక్కిలి ఆర్ద్రీకృతమైనవే.
g) Li, Mg ల కార్బోనేట్లు, ఫాస్ఫేట్లు, ఫ్లోరైడ్లు నీటిలో స్వల్పంగా కరుగుతాయి.
h) కర్బన పదార్థాల సంశ్లేషణ చర్యలలో లిథియమ్ ఆల్కైల్లు (Li+ R) లు రసాయనికంగా గ్రిగ్నార్డ్ కారణాలతో పోలి ఉంటాయి.

ప్రశ్న 17.
ద్రవ అమ్మోనియాలో క్షార లోహాలను కరిగిస్తే, ద్రావణానికి వివిధ రంగులు వస్తాయి. ఈ రకమైన రంగుల్లో మార్పుకు కారణాలను వివరించండి.
జవాబు:

  • క్షార లోహాలు అమ్మోనియా ద్రావణంలో నీలం రంగు ద్రావణంను ఏర్పరుస్తాయి. ఇవి వాహకతను కలిగి ఉంటాయి.
  • ఈ నీలం రంగు అమ్మోనియేటెడ్ ఎలక్ట్రాన్ల వలన ఏర్పడుతుంది. ఈ ఎలక్ట్రాన్లు శక్తిని దృగ్గోచర శ్రేణిలో శోషించుకొని నీలంరంగును కలిగిస్తాయి.
  • ఈ ద్రావణాలు పారా అయస్కాంత స్వభావం కలిగి ఉంటాయి. ఇవి అలానే ఉంచగా H2 వాయువును విడుదల చేస్తాయి.
    M + (x + y) NH3 → [M(NH3)x]+ +[C(NH3)y]
    M+(am) + C + NH3 → MNH2 + 1/2 H2am
  • ఈ గాఢ ద్రావణాన్ని వేడి చేయగా కంచు రంగులోనికి మారును. ఇది డయా అయస్కాంత స్వభావం కలిగియుండును.

ప్రశ్న 18.
i) సోడియమ్ లోహాన్ని నీటిలో వేస్తే ఏమి జరుగుతుంది?
ii) సోడియమ్ లోహానికి గాలిని స్వేచ్ఛగా సరఫరా చేస్తే ఏమి జరుగుతుంది?
జవాబు:
i) సోడియం లోహాన్ని నీటిలో వేస్తే H2 వాయువును విడుదల చేస్తుంది.
2Na + 2H2O → 2 NaOH + H2

ii) సోడియం లోహానికి గాలిని స్వేచ్ఛగా సరఫరా చేస్తే సోడియం పెరాక్సైడ్ ఏర్పడును.
2Na + O2 → Na2O2 సోడియం పెరాక్సైడ్

ప్రశ్న 19.
కింది వాటికి కారణాలేమిటి?
జవాబు:
i) Na2CO3 జల ద్రావణం క్షార ధర్మం కలిగి ఉంటుంది.
ii) క్షార లోహాలను వాటి గలన క్లోరైడ్లని విద్యుద్విశ్లేషణ చేసి తయారు చేస్తారు.
జవాబు:
i) Na2CO3 జల ద్రావణం క్షార స్వభావం కలిగి ఉంటుంది. ఇది ఆనయానిక్ జల విశ్లేషణ వలన.
CO3-2 + H2O → H CO3 + OH
PH > 7 కావున ద్రావణం క్షార స్వభావం కలిగి ఉండును.

ii) క్షార లోహాలు రసాయనికంగా చరాశీలత కలిగి ఉంటాయి. ఇవి విద్యుత్ రసాయనశ్రేణిలో పైన కలవు. సాధారణ నిష్కర్ష పద్ధతులు వీటికి ఉపయోగపడవు. కావున విద్యుత్ విశ్లేషణ క్షయకరణ పద్ధతుల ద్వారా వీటిని సంగ్రహిస్తారు (గలన క్లోరైడ్ నుండి)
ఉదా : గలన NaCl నుండి ‘Na’ ను పొందుట

ప్రశ్న 20.
కింది పరిశీలనలను మీరు ఎట్లా వివరిస్తారు?
i) BeO దాదాపు కరగదు, కానీ BeSO4 నీటిలో కరుగుతుంది.
ii) BaO నీటిలో కరుగుతుంది, కానీ BaSO4 కరగదు.
జవాబు:
i) BeO కు ద్విస్వభావం కలదు. దీని యొక్క సంయోజనీయ స్వభావం వలన BeO కు ద్రావణీయత నీటిలో తక్కువ. Be+2 కు ఎక్కువ హైడ్రేషన్ శక్తి కలిగి ఉండుట వలన BeSO4 నీటిలో కరుగుతుంది.

ii) BaO నీటిలో కరుగును. దీనికి కారణం అధిక అయానిక స్వభావం.
BaSO4 నీటిలో కరుగదు ఎందువలన అనగా Ba+2 అయాన్కు తక్కువ హైడ్రేషన్ శక్తి కలిగి ఉండును.

దీర్ఘ సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
కింది అంశాలపరంగా క్షారలోహాలను ఒకే గ్రూపులో చేర్చడాన్ని సమర్థించండి.
i) ఎలక్ట్రానిక్ విన్యాసం
ii) క్షయకరణి స్వభావం
iii) ఆక్సైడ్లు, హైడ్రాక్సైడ్లు
జవాబు:
i) ఎలక్ట్రానిక్ విన్యాసం :

1A గ్రూపు మూలకాలుఎలక్ట్రాన్ విన్యాసాలు
లిథియమ్ (Li) – Z = 3[He] 2S1
సోడియమ్ (Na) – Z = 11[Ne] 3S1
పొటాషియమ్ (K) – Z = 19[Ar] 4S1
రుబిడియమ్ (Rb) – Z = 37[Kr] 5S1
సీసియమ్ (Cs) – Z = 55[Xe] 6S1
ఫ్రాన్షియమ్ (Fr) – Z = 87[Rn] 7S1

ఆవర్తన పట్టికలో మొదటి పీరియడ్ మినహా మిగిలిన ఆరు పీరియడ్లు క్షారలోహాలతో ప్రారంభమవుతాయి. సన్నిహిత సంబంధం చూపించే మూలకాలు గల గ్రూపులలో సున్నా గ్రూపు మూలకాల తరువాతి స్థానం క్షారలోహాలదే. ఈ గ్రూపు మూలకాల ధర్మాలలో చాలా సారూప్యత మరియు ఒకే సాధారణ ఎలక్ట్రాన్ విన్యాసాన్ని కలిగివుంటాయి. గ్రూపులో పైనుంచి క్రిందికి పరమాణు సంఖ్య పెరిగే కొలది ధర్మాలలో క్రమమార్పు కనిపిస్తుంది. ఈ గ్రూపు మూలకాలన్నీ లోహాలు, మంచి విద్యుద్వాహకాలు, అధిక చర్యాశీలత కలవి. ఈ అంశాల ఆధారంగా క్షారలోహాలన్నీ ఒకే గ్రూపులో ఉండటాన్ని సమర్థించవచ్చు. ఈ గ్రూపు మూలకాల కొన్ని ముఖ్య ధర్మాలు క్రింద వివరించబడినవి.

ii) క్షయకరణ స్వభావం :

  • క్షార లోహాలు బలమైన క్షయకారిణులు.
  • ‘Li’ అధిక క్షయకరణ స్వభావం గలది. ‘Na’ తక్కువ క్షయకరణ స్వభావం గలది.
  • క్షయకరణ స్వభావానికి ప్రమాణ విద్యుత్ పొటెన్షియల్ (E) ఒక కొలమానం.
  • ‘Li’ కు అధిక హైడ్రేషన్ ఎంథాల్పీ కలదు. దీనికి అధిక రుణాత్మక Eo విలువ కలదు. కావున బలమైన క్షయకారిణి.

iii) a) ఆక్సైడ్లు :
O2 తో చర్య : క్షారలోహాలన్నీ ఆక్సిజన్ వేడి చేసినప్పుడు చర్య జరిపి వాటి ఆక్సైడ్ నిస్తాయి. దీనిలో ఉష్ణశక్తి విడుదలవుతుంది. అలా ఏర్పడిన ఆక్సైడ్ లోహం చర్యాశీలతపై ఆధారపడి ఉంటుంది.
4 Li + O2 → 2 Li2 O (మోనాక్సైడ్)
Rb + O2 → RbO (సూపరాక్సైడ్)
2 Na + O2 → Na2 O2 (పెరాక్సైడ్)
Cs + O2 → CsO2 (సూపరాక్సైడ్)
2K + O2 → K2 O2 (పెరాక్సైడ్)

  • లిథియమ్ ఎక్కువగా Li2O ను ఇస్తుంది. K, Rb, Cs లు O2 తో సూపరాక్సైడ్లను ఇస్తాయి.
  • క్షారలోహ అయాన్ పరిమాణం పెరిగిన కొద్దీ జాలక శక్తి పెరుగుతుంది. కాబట్టి సూపరాక్సైడ్ స్థిరత్వం పెరుగుతుంది.
  • భార క్షారలోహాల సూపరాక్సైడ్ల జాలక శక్తి అధికం. కాబట్టి వాటికి స్థిరత్వాలు ఎక్కువ.

b) హైడ్రాక్సైడ్లు :
క్షార లోహ ఆక్సైడ్లు జల విశ్లేషణ జరిపి హైడ్రాక్సైడ్లు ఏర్పరచును.
M2O + H2O → 2MOH
M2O2 + 2H2O → 2MOH + H2O2
2MO2 + 2H2O → 2MOH + H2O2 + O2 [M = క్షార లోహం]

  • ఇవి రంగులేని స్ఫటిక ఘన పదార్థాలు.
  • ఇవి బలమైన క్షారాలు మరియు నీటిలో కరిగి ఉష్ణాన్ని విడుదల చేయును.

AP Inter 1st Year Chemistry Study Material Chapter 9 S బ్లాక్ మూలకాలు

ప్రశ్న 2.
లిథియముక్కు, మిగిలిన క్షార లోహాలకు మధ్య తేడాలపై వ్యాసాన్ని రాయండి.
జవాబు:
ప్రతి గ్రూపులో మొదటి మూలకం మిగిలిన మూలకాలతో విభేదిస్తుంది. గ్రూపులో మొదటి మూలకం పరమాణు పరిమాణం మిగతా మూలకాల సైజుతో పోలిస్తే చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి మొదటి మూలక సమ్మేళనాలల్లో ఎక్కువ కోవలెంట్ స్వభావం కనిపిస్తుంది. గ్రూపులో మొదటి మూలకాలు సమన్వయ సమయోజనీయ సమ్మేళనాలనేర్పరుస్తాయి.

ఒక గ్రూపులో మొదటి మూలకానికి దాని బాహ్య కర్పరంలో s, p ఆర్బిటాల్లు మాత్రమే ఉంటాయి. కాని తరువాత మూలకాల్లో d-ఆర్బిటాల్లు కూడా s, p – ఆర్బిటాల్లతో పాటు అందుబాటులో ఉంటాయి.

ఆ విధంగా లిథియమ్, IA గ్రూపులో ప్రథమ మూలకం కావటంచేత, అసంగత ప్రవర్తనను చూపిస్తుంది.

కొన్ని ముఖ్యమైన లిథియమ్ అసంగత లక్షణాలు :
(ఎ) లిథియమ్ గట్టి లోహం. మిగిలిన క్షారలోహాలు మెత్తనివి. వాటిని కత్తితో ముక్కలుగా కోయవచ్చు. దాని బాష్పీభవన, ద్రవీభవన స్థానాలు ఎక్కువ.

(బి) లిథియమ్ నేరుగా N2 తో సంయోగం చెందుతుంది. ఏ ఇతర క్షారలోహం N2 తో చర్య జరపదు.
6 Li + N2 → 2 LigN

(సి) లిథియమ్ మూలకం కార్బన్తో కలిసి కార్బైడ్ను ఇస్తుంది. గ్రూపు IA మూలకాలు నేరుగా సంయోగచర్యలో కార్బైడ్లను ఏర్పరచవు. కాని కార్బెట్లను ఇస్తాయి.

(డి) లిథియమ్ హైడ్రాక్సైడ్ (LiOH), లిథియమ్ కార్బోనేట్ (Li2CO3), లిథియమ్ ఫాస్ఫేట్ (Li3PO4), లిథియమ్ ఫ్లోరైడ్ (LiF), ల ద్రావణీయతలు మిగతా క్షార లోహాల సమ్మేళనాలతో పోలిస్తే స్వల్పంగా ఉంటాయి.

ప్రశ్న 3.
సోడియమ్ కార్బొనేట్ని తయారుచేయడం, దాని ధర్మాలను చర్చించండి.
జవాబు:
అమ్మోనియా సోడా (లేక) సాల్వే పద్ధతి – Na2CO3 తయారీ :
ఇది ఆధునిక పద్ధతి. దీనిలో వాడే ముడిపదార్థాలు : (1) సోడియం క్లోరైడ్ (2) సున్నపురాయి (3) అమ్మోనియా.

జరిగే చర్యలు : (సూత్రం)

  1. అమ్మోనియా ద్రావణంలోకి CO2 వాయువును పంపుతారు. అపుడు, అమ్మోనియం బైకార్బొనేటు ఏర్పడుతుంది.
    NH3 + H2O + CO2 → NH4HCO3
  2. అట్లేర్పడ్డ అమ్మోనియం బైకార్బొనేటును సోడియం క్లోరైడుతో చర్య జరిపిస్తారు. సోడియం బైకార్బొనేటు ఏర్పడుతుంది.
    NH4HCO3 + NaCl → NH4Cl + NaHCO3
  3. సోడియం బైకార్బొనేటును వేడిచేస్తే సోడియం కార్బొనేటు ఏర్పడుతుంది.
    2 NaHCO3 → Na2CO3 + H2O + CO2

Na2CO3 ధర్మాలు :

  • Na2CO3 తెల్లటి (రంగులేని) స్పటిక ఘనపదార్థం.
  • ఇది డెకా హైడ్రేట్గా ఉండును. దీనినే వాషింగ్ సోడా (Na2CO3 10H2O) అంటారు.
  • ఇది నీటిలో కరుగును.
  • Na2CO3 . 10H2O వేడిచేయగా నీటి అణువులను కోల్పోయి మోనోహైడ్రేట్గా మారును. దీనిని 373k కంటే ఎక్కువగా వేడిచేసినపుడు సోడా మాషన్ను ఏర్పరచును.

చర్యలు :
AP Inter 1st Year Chemistry Study Material Chapter 9 S బ్లాక్ మూలకాలు 5
→ Na2CO3 జల ద్రావణం క్షారస్వభావం కలిగియుండును (PH > 7) ఇది ఆనయానిక్ జలవిశ్లేషణ వలన.
CO3-2 + H2O → HCO3 + OH

ప్రశ్న 4.
కింది అంశాలపరంగా క్షార మృత్తికలోహాల సారూప్యతను చర్చించండి.
i) ఎలక్ట్రానిక్ విన్యాసం
ii) ఆర్ద్రీకరణోష్ట్రాలు
iii) ఆక్సైడ్లు, హైడ్రాక్సైడ్ స్వభావాలు
జవాబు:
i) ఎలక్ట్రాన్ విన్యాసం :
క్షార మృత్తిక లోహాల సాధారణ ఎలక్ట్రాన్ విన్యాసం [జడవాయువు] ns².

మూలకంసంకేతంఎలక్ట్రానిక్ విన్యాసం
బెరీలియంBe1s² 2s²
మెగ్నీషియంMg1s² 2s² 2p6 3s²
కాల్షియంCa1s² 2s² 2p6 3s² 3p6 4s²
స్టాన్షియమ్Sr1s² 2s² 2p6 3s² 3p6 3d1o 4s² 4p6 5s²
బేరియమ్Ba1s² 2s² 2p6 3s² 3p6 3d10 4s² 4p6 4d10 5s² 5p6 6s² or [Xe) 6s²
రేడియంRa[Rn] 7s²

ii) ఆర్ద్రీకరణోష్టాలు :

  • క్షార మృత్తిక లోహాల ఆర్ద్రీకరణోష్టాలు లోహ అయాన్ పరిమాణం పెరిగేకొలది తగ్గుతాయి. (గ్రూపులో)
    Be+2 > Mg+2 > Ca+2 > Sr+2 > Ba+2
  • క్షార లోహ అయాన్ల ఆర్ద్రీకరణోష్టాల కంటే క్షార మృత్తిక లోహాలకు ఆర్ద్రీకరణోష్టాలు ఎక్కువగా ఉంటాయి.

iii) a) ఆక్సైడ్లు :

  • క్షార మృత్తిక లోహాలు MO రూప ఆక్సైడ్లను ఏర్పరుస్తాయి.
  • ఇవి ఆక్సిజన్లో లోహాలను మండించుట ద్వారా ఏర్పడతాయి.
  • BeO ద్విస్వభావ సంయోజనీయ ఆక్సైడ్. మిగతా ఆక్సైడ్లు అయానిక క్షార స్వభావం కలిగి ఉంటాయి.

b) హైడ్రాక్సైడ్లు :

  • BeO తప్ప మిగిలిన ఆక్సైడ్లు జల విశ్లేషణ చేసినపుడు హైడ్రాక్సైడ్లు ఏర్పడతాయి.
    MgO + H2O — Mg(OH)2
  • క్షార లోహ హైడ్రాక్సైడ్ల కంటే క్షార మృత్తిక లోహ హైడ్రాక్సైడ్లు తక్కువ క్షార స్వభావం కలిగి ఉంటాయి.
    Be(OH), ద్విస్వభావ పదార్థం అనగా ఆమ్ల మరియు క్షార స్వభావం కలిగి ఉండును.
    ఈక్రింది చర్యల ద్వారా మనకు Be(OH)2 యొక్క ద్విస్వభావం తెలుస్తుంది.
    Be(OH)2 + 2OH→ [Be(OH)2]-2
    Be(OH)2 + 2HC + 2H2O. → [Be(OH) ]C,
    కావున Be(OH)2 ద్విస్వభావ పదార్థం.

AP Inter 1st Year Chemistry Study Material Chapter 9 S బ్లాక్ మూలకాలు

ప్రశ్న 5.
క్షారమృత్తిక లోహాల
i) కార్బొనేట్లు,
ii) సల్ఫేట్లు,
iii) నైట్రేట్లు గురించి చర్చించండి.
జవాబు:
i) కార్బొనేట్లు :

  • క్షార మృత్తిక లోహాలు MCO3 రకమైన కార్బొనేట్లు ఏర్పరుస్తాయి.
  • ఇవి నీటిలో కరుగవు.
  • మూలక పరమాణు సంఖ్య పెరిగే కొలది నీటిలో కార్బొనేట్ల ద్రావణీయత తగ్గును.
  • కాటయాన్ పరిమాణం పెరిగే కొలది ఉష్ణ స్థిరత్వం పెరుగును.
  • ఈ కార్బొనేట్లు వేడిచేయగా వియోగం చెంది CO ను ఏర్పరచును.
    AP Inter 1st Year Chemistry Study Material Chapter 9 S బ్లాక్ మూలకాలు 6

ii) సల్ఫేట్లు :

  1. క్షార మృత్తిక లోహాలు MSO4 రకమైన సల్ఫేట్లను ఏర్పరుస్తాయి.
  2. ఇవి తెల్లటి ఘన పదార్థాలు. ఉష్ణ స్థిరమైనవి.
  3. Be+2, Mg+2కు ఆర్ద్రీకరణోష్ణం ఎక్కువ. అందువలన BeSO4 మరియు MgSO4 లు నీటిలో త్వరితగతిన కరుగుతాయి.
  4. CaSO4 నుండి BaSO4 ద్రావణీయత తగ్గును.

iii) నైట్రేట్లు :

  • క్షార మృత్తిక లోహాలు M(NO3)2 రకమైన నైట్రేట్లను ఏర్పరుస్తాయి.
  • ఇవి కార్బొనేట్లను సజల HNO3 తో చర్య ద్వారా ఏర్పడతాయి.
  • Mg(NO3)2 ఆరు నీటి అణువులతో స్ఫటికీకరణం చెందును. Ba(NO3)2 అనార్ధమైనవి.
  • ఈ నైట్రేట్లను వేడిచేయగా ఆక్సైడ్లను ఏర్పరచును.
    2M(NO3)2 → 2MO + 4NO2 + O2 [M = క్షార మృత్తిక లోహం]

ప్రశ్న 6.
క్షారలోహాల సాధారణ భౌతిక, రసాయన ధర్మాలు ఏమిటి?
జవాబు:
ఉనికి :
ఈ మూలకాలన్నీ చాలా చురుకైనవి. అందుచేత అవి స్వేచ్ఛా స్థితిలో దొరకవు. ఎప్పుడూ సంయోగ స్థితిలోనే దొరుకుతాయి. ప్రకృతిలో భూతలంపైన అవి విస్తారంగా వితరణ చెంది ఉంటాయి. పరమాణు సంఖ్య పెరిగిన కొద్దీ విస్తృతి తగ్గుతుంది. వాటి విస్తృతి ప్రకృతిలో సారూప్యంగా ఉంటుంది.

Na, K లు అతి విస్తారంగా దొరికే క్షారలోహాలు. అవి వాటి హాలైడ్లుగా ఎక్కువగా దొరుకుతాయి.
ఉదా : సాధారణ లవణం (NaCl), సిస్వైన్ (KCl), కార్నలైట్ (KCl, MgCl2, 6 H2O)

రసాయనిక చర్యాశీలత :
i) ‘O2‘తో చర్యాశీలత : క్షారలోహాలన్నీ ఆక్సిజన్ వేడిచేసినప్పుడు చర్య జరిపి వాటి ఆక్సైడ్లనిస్తాయి. దీనిలో ఉష్ణశక్తి విడుదలవుతుంది. అలా ఏర్పడిన ఆక్సైడ్ లోహం చర్యాశీలతపై ఆధారపడి ఉంటుంది.

లిథియమ్ ఎక్కువగా లిథియమ్ మోనాక్సైడ్ను ఇస్తుంది. సోడియమ్ ఎక్కువగా సోడియమ్ పెరాక్సైడ్, కొంచెంగా సోడియమ్ మోనాక్సైడ్ను ఆక్సిజన్తో సంయోగం చెంది ఏర్పరుస్తుంది. మిగిలిన క్షారలోహాలు సూపరాక్సైడ్లను ఇస్తాయి. క్షారలోహ అయాన్ పరిమాణం పెరిగిన కొద్దీ జాలక శక్తి పెరుగుతుంది. కాబట్టి సూపరాక్సైడ్ స్థిరత్వం పెరుగుతుంది.

ii) ‘H2‘ తో చర్యాశీలత : 300° – 600°C వద్ద క్షారలోహాలు H2 తో సంయోగం చెంది హైడ్రైడ్లనిస్తాయి. ఆ చర్యను క్రింది విధంగా రాయవచ్చు.
AP Inter 1st Year Chemistry Study Material Chapter 9 S బ్లాక్ మూలకాలు 7

ఇందులో M = Li, Na, K, Rb, Cs. ఈ హైడ్రైడ్లు అయానిక పదార్థాలు, వాటి అయానిక స్వభావం క్షారలోహాల లోహ స్వభావంతో పాటు పెరుగుతుంది.

iii) హాలోజన్లతో చర్యాశీలత :
క్షారలోహాలన్నీ హాలోజన్లతో సంయోగం చెంది ద్విగుణాత్మక సమ్మేళనాలనిస్తాయి. క్షారలోహాల చర్యాశీలత వాటి పరమాణు సంఖ్యతో పెరుగుతుంది.
2 M + X2 → 2 MX, (M = ఏదైనా క్షారలోహం)
క్షారలోహాల హాలైడ్లన్నీ అయానిక సమ్మేళనాలే.

iv) నీటితో చర్యాశీలత :
క్షారలోహాలు నీటితో తీవ్రమైన చర్య జరుపుతాయి. దాని విఘటనం చేసి హైడ్రోజన్ వాయువునిస్తాయి. ఈ మూలకాల రసాయన చర్యాశీలత వాటి పరమాణు సంఖ్యతో పెరుగుతుంది. లోహపు హైడ్రాక్సైడ్ ఏర్పడుతుంది.
2M + 2H2O → 2 MOH + H2
(ఇందులో M = ఏదైనా క్షారలోహం).

ఆక్సీకరణ జ్వాలకు క్షారలోహాలు, వాటి సమ్మేళనాలు స్వాభావిక రంగులను ఇస్తాయి.

వివరణ :

  • జ్వాల నుండి వెలువడే ఉష్టం బాహ్య కర్పరంలోని ఎలక్ట్రాన్ ను అధికశక్తి స్థాయికి ఉద్రిక్త పరుస్తాయి.
  • అధికశక్తి స్థాయిలోని ఎలక్ట్రాన్ శక్తిని విడుదల చేసి భూస్థాయికి చేరును. ఇది దృగ్గోచరప్రాంతంలో ఉండును.

భౌతిక ధర్మాలు :

  • ఇవి వెండివలే మెరిసే తెల్లటి లోహాలు.
  • ఇవి మెత్తటి తేలికైన లోహాలు.
  • వీటి సాంద్రత గ్రూపులో పెరుగును. కాని d(k) < d(Na)]
  • వీటికి ద్రవీభవన, బాష్పీభవన స్థానాలు తక్కువ.

ప్రశ్న 7.
క్షార మృత్తిక లోహాల సాధారణ ధర్మాలని, వాటిలోని క్రమతను గురించి చర్చించండి.
జవాబు:
i) ఎలక్ట్రాన్ విన్యాసం :
→ క్షార మృత్తిక లోహాల సాధారణ ఎలక్ట్రాన్ విన్యాసం [జడవాయువు] ns².

మూలకంసంకేతంఎలక్ట్రానిక్ విన్యాసం
బెర్లీయంBe1s2 2s2
మెగ్నీషియంMg1s2 2s2 2p6 3s2
కాల్షియంCa1s2 2s2 2p6 3s2 3p6 4s2
స్టాన్షియమ్Sr1s2 2s2 2p6 3s2 3p6 3d10 4s2 4p6 5s2
బేరియమ్Ba1s2 2s2 2p6 3s2 3p6 3d10 4s2 4p6 4d10 5s2 5p6 6s2 or [Xe) 6s2
రేడియంRa[Rn] 7s2

ii) ఆర్ద్రీకరణోష్ణాలు :

  • క్షార మృత్తిక లోహాలు ఆర్ద్రీకరణోష్ట్రాల లోహ అయాన్ పరిమాణం పెరిగేకొలది తగ్గుతాయి. (గ్రూపులో)
    Be+2 > Mg+2 > Ca+2 > Sr+2 > Ba+2
  • క్షార లోహ అయాన్ల ఆర్ద్రీకరణోష్టాల కంటే క్షార మృత్తిక లోహాలకు ఆర్ద్రీకరణోష్ట్రాలు ఎక్కువగా ఉంటాయి.

iii) a) ఆక్సైడ్లు :

  • క్షార మృత్తిక లోహాలు MO రూప ఆక్సైడ్ ను ఏర్పరుస్తాయి.
  • ఇవి ఆక్సిజన్లో లోహాలను మండించుట ద్వారా ఏర్పడతాయి.
  • BeO ద్విస్వభావ సంయోజనీయ ఆక్సైడ్. మిగతా ఆక్సైడ్లు అయానిక క్షార స్వభావం కలిగి ఉంటాయి.

b) హైడ్రాక్సైడ్లు :

  • BeO తప్ప మిగిలిన ఆక్సైడ్లు జల విశ్లేషణ చేసినపుడు హైడ్రాక్సైడ్లు ఏర్పడతాయి.
    MgO + H2O → Mg(OH)2
  • క్షార లోహ హైడ్రాక్సైడ్ల కంటే క్షార మృత్తికా లోహ హైడ్రాక్సైడ్ లు తక్కువ క్షార స్వభావం కలిగి ఉంటాయి. Be(OH)2 ద్విస్వభావ పదార్థం అనగా ఆమ్ల మరియు క్షార స్వభావం కలిగి ఉండును.
    ఈక్రింది చర్యల ద్వారా మనకు Be(OH)2యొక్క ద్విస్వభావం తెలుస్తుంది.
    Be(OH)2 + 2OH → [Be(OH)4]-2
    Be(OH)2 + 2HCl + 2H2O → [Be(OH)4]Cl2
    కావున Be(OH)2 ద్విస్వభావ పదార్థం.

i) కార్బొనేట్లు :

  • క్షార మృత్తిక లోహాలు MCO3 రకమైన కార్బొనేట్లు ఏర్పరుస్తాయి.
  • ఇవి నీటిలో కరుగవు.
  • మూలక పరమాణు సంఖ్య పెరిగే కొలది నీటిలో కార్బొనేట్ ద్రావణీయత తగ్గును.
  • కాటయాన్ పరిమాణం పెరిగే కొలది ఉష్ణ స్థిరత్వం పెరుగును.
  • ఈ కార్బొనేట్లు వేడిచేయగా వియోగం చెంది CO2 ను ఏర్పరచును.
    AP Inter 1st Year Chemistry Study Material Chapter 9 S బ్లాక్ మూలకాలు 8

ii) సల్ఫేట్లు :

  • క్షార మృత్తిక లోహాలు MSO4 రకమైన సల్ఫేట్లను ఏర్పరుస్తాయి.
  • ఇవి తెల్లటి ఘన పదార్థాలు. ఉష్ణ స్థిరమైనవి.
  • Be+2, Mg+2కు ఆర్ద్రీకరణోష్ణం ఎక్కువ. అందువలన BeSO4 మరియు MgSO4 నీటిలో త్వరితగతిన కరుగుతాయి.
  • CaSO4 నుండి BaSO4 ద్రావణీయత తగ్గును.

iii) నైట్రేట్లు :

  • క్షార మృత్తిక లోహాలు M(NO3)2 రకమైన నైట్రేట్లను ఏర్పరుస్తాయి.
  • ఇవి కార్బొనేట్లను సజల HNO3 తో చర్య ద్వారా ఏర్పడతాయి.
  • Mg(NO3)2 ఆరు నీటి అణువులతో స్పటికీకరణం చెందును. Ba(NO3)2 అనార్ధమైనవి.
  • ఈ నైట్రేట్లను వేడిచేయగా ఆక్సైడ్లను ఏర్పరచును.
    2M(NO3)2 → 2MO + 4NO2 + O2 [M = క్షార మృత్తిక లోహం]

ప్రశ్న 8.
సాల్వే పద్ధతిలో జరిగే వివిధ చర్యలను చర్చించండి.
జవాబు:
ఇది ఆధునిక పద్ధతి. దీనిలో వాడే ముడిపదార్థాలు : (1) సోడియం క్లోరైడ్ (2) సున్నపురాయి (3) అమ్మోనియా.

జరిగే చర్యలు : (సూత్రం)

  1. అమ్మోనియా ద్రావణంలోకి CO2 వాయువును పంపుతారు. అపుడు, అమ్మోనియం బైకార్బొనేటు ఏర్పడుతుంది.
    NH3 + H2O + CO2 → NH4HCO3
  2. అట్లేర్పడ్డ అమ్మోనియం బైకార్బొనేటును సోడియం క్లోరైడుతో చర్య జరిపిస్తారు. సోడియం బైకార్బొనేటు ఏర్పడుతుంది.
    NH4HCO3 + NaCl. NH4Cl + NaHCO3
  3. సోడియం బైకార్బొనేటును వేడిచేస్తే సోడియం కార్బొనేటు ఏర్పడుతుంది.
    NaHCO3 → Na2CO3 + H2O + CO2

ప్రశ్న 9.
సోడియమ్ క్లోరైడ్ నుంచి కింది వాటిని ఎట్లా తయారుచేస్తారు?
i) సోడియమ్ లోహం ;
ii) సోడియమ్ హైడ్రాక్సైడ్ iii) సోడియమ్ పెరాక్సైడ్
iv) సోడియమ్ కార్బొనేట్
జవాబు:
i) గలన NaCl ను విద్యుద్విశ్లేషణ చేయగా Na లోహం ఏర్పడును
2 NaCl → 2Na+ + 2Cl
2Na+ + 2e → 2Na (కాథోడ్)
2Cl → Cl2 + 2e (ఆనోడ్)

ii) కాస్ట్నర్ – కెల్నర్ పద్ధతి – NaOH తయారీ :
దీనిని మెర్క్యురి – కాథోడ్ పద్ధతి అని కూడా అంటారు.

సూత్రం :
ఈ పద్ధతిలో మెర్క్యురిని కాథోడ్గా ఉపయోగించి బ్రైన్ ద్రావణాన్ని విద్యుద్విశ్లేషణం చేయుట ద్వారా NaOH ను తయారు చేస్తారు. ఆనోడ్ వద్ద క్లోరిన్ వాయువు, కాథోడ్ వద్ద సోడియం అమాల్గం ఏర్పడతాయి. ఈ సోడియం అమాల్గం నీటితో చర్య జరిపి NaOH ద్రావణం మరియు H2 వాయువులను యిస్తాయి.

ఘట చర్యలు :
AP Inter 1st Year Chemistry Study Material Chapter 9 S బ్లాక్ మూలకాలు 9
iii) పైన (i) లో ఏర్పడిన Na లోహాన్ని అధిక ఆక్సిజన్తో
2Na + O2 → Na2O2 సోడియం పెరాక్సైడ్
చర్య జరిపిన సోడియం పెరాక్సైడ్ ఏర్పడును.

iv) అమ్మోనియా సోడా (లేక) సాల్వే పద్ధతి – Na2 CO3 తయారీ :
ఇది ఆధునిక పద్ధతి. దీనిలో వాడే ముడిపదార్థాలు : (1) సోడియం క్లోరైడ్ (2) సున్నపురాయి (3) అమ్మోనియా.

జరిగే చర్యలు : (సూత్రం)
1) అమ్మోనియా ద్రావణంలోకి CO2 వాయువును పంపుతారు. అపుడు, అమ్మోనియం బైకార్బొనేటు ఏర్పడుతుంది.
NH3 + H2O + CO2 → NH4HCO3

2) అట్లేర్పడ్డ అమ్మోనియం బైకార్బొనేటును సోడియం క్లోరైడుతో చర్య జరిపిస్తారు. సోడియం బైకార్బొనేటు ఏర్పడుతుంది.
NH4HCO3 + NaCl → NH4Cl + NaHCO3

3) సోడియం బైకార్బొనేటును వేడిచేస్తే సోడియం కార్బొనేటు ఏర్పడుతుంది.
2 NaHCO3 → Na2CO3 + H2O + CO2

Na2CO3ధర్మాలు :

  • Na2CO3, తెల్లటి (రంగులేని) స్ఫటిక ఘనపదార్థం.
  • ఇది డెకా హైడ్రేట్గా ఉండును. దీనినే వాషింగ్ సోడా (Na2CO3. 10H2O) అంటారు.
  • ఇది నీటిలో కరుగును.
  • Na2CO3 .10H2O వేడిచేయగా నీటి అణువులను కోల్పోయి మోనోహైడ్రేట్గా మారును. దీనిని 373k కంటే ఎక్కువగా వేడిచేసినపుడు సోడా మాషను ఏర్పరచును.

చర్యలు :
AP Inter 1st Year Chemistry Study Material Chapter 9 S బ్లాక్ మూలకాలు 10
Na2CO3 జల ద్రావణం క్షారస్వభావం కలిగియుండును (PH > 7) ఇది ఆనయానిక్ జలవిశ్లేషణ వలన.
CO3-2 + H2O → HCO3 + OH

AP Inter 1st Year Chemistry Study Material Chapter 9 S బ్లాక్ మూలకాలు

ప్రశ్న 10.
i) మెగ్నీషియమ్న గాలిలో వేడిచేస్తే
ii) పొడిసున్నాన్ని సిలికాతో వేడిచేస్తే
iii) తడిసున్నంతో క్లోరీస్ చర్య.
iv) కాల్షియమ్ నైట్రేట్ని బాగా వేడిచేస్తే, ఏం జరుగుతుంది?
జవాబు:
i) Mg ని గాలిలో మండించినప్పుడు కాంతివంతంగా మండి Mg0 మరియు MgO and Mg3N2 ఏర్పడును.
2 Mg + O2 → 2MgO
3Mg + N2 → Mg3N2

ii) పొడిసున్నాన్ని సిలికాతో వేడిచేస్తే కాల్షియం సిలికేట్ ఏర్పడును.
CaO + SiO2 → CaSiO3

iii) తడిసున్నం క్లోరిన్తో చర్య జరిపి బ్లీచింగ్ పౌడర్ను ఏర్పరచును.
2Ca(OH)2 + 2Cl2 → CaCl2 + CaOCl2 + 2H2O

iv) కాల్షియం నైట్రైట్ను బాగా వేడిచేస్తే ఆక్సైడ్ ఏర్పడును.
2Ca(NO3)2 → 2CaO + 4NO2 + O2.

ప్రశ్న 11.
జీవశాస్త్ర ప్రవాహికల్లో సోడియమ్, పొటాషియమ్. మెగ్నీషియమ్, కాల్షియమ్ల సార్థకతను వివరించండి.
జవాబు:

  1. కణాల్లోని కర్బన అణువులతో ఉన్న ఋణావేశాలను లోహ అయాన్ల పై నుండే ఆవేశాలు తుల్యం చేస్తాయి. కణాలలో ద్రవాభిసరణ పీడనాన్ని కూడా నిలకడగా ఉంచడానికి ఈ అయాన్లు సహాయపడతాయి.
  2. కణాల నుంచి Na+ అయాన్లు బహిష్కృతమవుతాయి. ఈ అయాన్ రవాణా చర్యలను “సోడియం పంప్” అంటారు. అయితే K+ అయాన్లు బహిష్కృతం కావు. Na+ అయాన్లను బయటికి పంపివేయడానికి లేదా K+ అయాన్లను లోపలికి తీసుకోవటానికి జల విశ్లేషణ వల్ల వస్తుంది.
  3. కణపు పొరకు అటు, ఇటు పక్కల Na+, K+ అయాన్లుంటాయి. దీనివల్ల కణంలో విద్యుత్ శక్మం ఏర్పడుతుంది. Na+ అయాన్లుండటం వల్ల గ్లూకోజ్ కణంలోపలికి వెళుతుంది. అధికంగా ఉన్న Na+ అయాన్లు బహిష్కృతమవుతాయి. ఎమినో ఆమ్లాల చలనాలు కూడా ఇదే మాదిరిగా ఉంటాయి.
  4. పొటాషియమ్ అయాన్లు కణాంతర్భాగంలో గ్లూకోజ్ జీవన క్రియల్లో దోహదపడతాయి. ప్రోటీన్ల సంశ్లేషణలోనూ, కొన్ని నిర్దిష్టమైన ఎంజైమ్లు ఉత్తేజితమవడానికి సహాయపడుతుంది.

జీవశాస్త్రంలో Mg+2 పాత్ర :

  1. జంతు కణాలలో Mg+2 అయాన్ల గాఢత ఎక్కువగా ఉంటుంది.
  2. ఫాస్ఫో హైడ్రోలేజ్లు, పాస్ఫోట్రాన్స్ఫరేజ్లు లాంటి ఎంజైములలో Mg+2 ఉంటుంది. ఈ ఎంజైములు ATP చర్యలలో పాల్గొంటాయి. శక్తి విడుదల ఈ ప్రక్రియలో జరుగుతుంది. Mg+2, ATP తో సంక్లిష్టం ఏర్పరుస్తుంది.
  3. క్లోరోఫిల్లో Mg+2 ఒక ఘటక పదార్థం. క్లోరోఫిల్ చెట్లలోని ఆకుపచ్చ పదార్థం.

Ca+2 పాత్ర :
మన శరీరంలో 99% కాల్షియం అయాన్లు ఎముకలు మరియు దంతాలు తయారీలో ఉపయోగపడుతుంది. రక్త స్కందనములో (గడ్డ కట్టడంలో) మరియు కణ పొర అయాన్ బదిలీ ప్రక్రియలలో ఈ అయాన్ ముఖ్యపాత్ర వహిస్తుంది. హార్మోన్లు కాల్షియం గాఢతను ప్లాస్మాలో సుమారుగా 100 మి. గ్రా/లీ. గా వుంచుతాయి. కాల్సిటోనిన్ మరియు పెరాథైరాయిడ్ అనే హార్మోన్లు అనేవి కాల్షియం అయాన్ గాఢతను స్థిరీకరించడంలో ప్రముఖంగా తోడ్పడతాయి. పై ప్రక్రియలతో పాటు కాల్షియం అయాన్లు గుండె క్రమంగా కొట్టుకోనే ప్రక్రియలో మరియు కండరాల సంకోచ (ముడుచుకునే) ప్రక్రియలలో కూడా ముఖ్యపాత్రను వహిస్తాయి.

ప్రశ్న 12.
సిమెంట్ని గురించి కొన్ని వాక్యాలు రాయండి.
జవాబు:

  • సిమెంట్ భవన నిర్మాణంలో ముఖ్య పదార్థం.
  • దీనినే పోర్ట్లాండ్ సిమెంట్ అంటారు.
  • పోర్ట్లండ్ సిమెంట్ సంఘటనం
    CaO 50 – 60%
    SiO2 – 20 – 25%
    Al2O3 – 5 – 10%
    MgO – 2 – 3%
    Fe2O3 – 1 – 2%
    మరియు SO2 – 1-2%
  • మంచినాణ్యతగల సిమెంట్కు Si0, మరియు Al2O3 ల నిష్పత్తి 2.5 మరియు 4. సున్నంకు (ECao) మరియు SiO2, Al2O3 మరియు Fe2O3 నిష్పత్తి 2 కు దగ్గరగా ఉండును.
  • సిమెంట్ తయారీకి ఉపయోగిచు ముడిపదార్థాలు సున్నపురాయి మరియు బంకమట్టి.
    బంకమట్టి + సున్నం 4, క్లింకర్.
  • ఈ సిమెంట్ క్లింకర్కు 2-3% జిప్సంతో కలిపి సిమెంట్ను తయారుచేస్తారు.

సిమెంట్ సెట్టింగ్ :

  • సిమెంట్ను నీటిలో కలుపగా గట్టి పదార్థంగా మారును. అనగా సిమెంట్ సెట్టింగ్ జరుగును.
  • జిప్సంను సిమెంట్కు కలుపగా తగినంత గట్టిపడుతుంది.

ఉపయోగాలు :-

  • దీనిని కాంక్రీట్ మరియు ప్రబలిత కాంక్రీట్లలో ఉపయోగిస్తారు.
  • ప్లాస్టరింగ్లో ఉపయోగిస్తారు.
  • వారధులకు, డ్యామ్లను, భవంతుల నిర్మాణంలో ఉపయోగిస్తారు.

సాధించిన సమస్యలు (Solved Problems)

ప్రశ్న 1.
KO2 లో K ఆక్సిడేషన్ స్థితి ఏమిటి?
సాధన:
సూపరాక్సైడ్ జాతిని 04- అని గుర్తిస్తారు. సమ్మేళనం తటస్థ పదార్థం కాబట్టి K ఆక్సిడేషన్ స్థితి +1.

ప్రశ్న 2.
కింది అయాన్లకు Eo(Vలలో)విలువలు ఇవ్వ బడినాయి. Cl2/Clకి + 1.36, I2/I +0.53, Ag+/Agకి +0.79, Na+/ Na కి -2.71, Lit / Li కి -3.04, అయితే I, Ag, Cl, Li, Na క్షయకరణ శక్తుల అవరోహణ క్రమంలో అమర్చండి.
సాధన:
క్రమం : Li > Na > I > Ag > Cl

ప్రశ్న 3.
KO2 ఎందుకు పారా అయస్కాంత ధర్మాన్ని చూపిస్తుంది?
సాధన:
సూపరాక్సైడ్, O2, అయాన్ పారా అయస్కాంత ధర్మాన్ని చూపించడానికి కారణం దాని π*2p అణు ఆర్బిటాల్లో ఒక ఒంటరి ఎలక్ట్రాన్ ఉండటం.

ప్రశ్న 4.
క్షార మృత్తిక లోహాల హైడ్రాక్సైడ్ జల ద్రావణీయత గ్రూపులో కిందికి పోయిన కొద్దీ ఎందుకు పెరుగుతుంది?
సాధన:
క్షారమృత్తిక లోహాల హైడ్రాక్సైడ్లలో ఆనయాన్ ఉమ్మడి అయాన్. అందువల్ల కాటయాన్ వ్యాసార్థం జాలక ఎంథాల్పీని ప్రభావితం చేస్తుంది. అయానిక సైజు పెరిగినప్పుడు ఆర్ద్రీకరణోష్టంలో మార్పు కంటే జాలక ఎంథాల్పీ చాలా తగ్గుతుంది. కాబట్టి హైడ్రాక్సైడ్ ద్రావణీ యత గ్రూపులో కిందికి పోయినకొద్దీ పెరుగుతుంది.

AP Inter 1st Year Chemistry Study Material Chapter 9 S బ్లాక్ మూలకాలు

ప్రశ్న 5.
క్షారమృత్తిక లోహాల కార్బొనేట్లకి, సల్ఫేట్లకి జల ద్రావణీయత గ్రూపులో పైనుంచి కిందికి పోతుంటే ఎందుకు తగ్గుతుంది?
సాధన:
ఆనయాన్ సైజు, కాటయాన్ సైజుతో పోల్చి చూస్తే, చాలా పెద్దదిగా ఉంటుంది. అంటే కాటయాన్; ఆనయాన్ సైజుల మొత్తం విలువ కాటయాన్లో వచ్చే కొద్ది మార్పులతో ప్రభావితం కాదు. దీనితో ఈ విలువ మీద ఆధారపడిన జాలకశక్తి దాదాపు గ్రూపులో పైనుంచి కిందికి స్థిరంగా ఉంటుంది. ప్రధానంగా కాటయాన్లకు మాత్రమే పరిమితమైన హైడ్రేషన్ శక్తి కాటయాన్ల సైజు పెరుగుదల గ్రూపులో పైనుంచి కిందికి తగ్గుతుంది. గ్రూపులో పైనుంచి కిందికి క్షారమృత్తిక లోహాల కార్బొనేట్ లకి, సల్ఫేట్లకి హైడ్రేషన్ ఎంథాల్ఫీ తగ్గుతుంది. దానితోపాటు వాటి ద్రావణీయత తగ్గుతుంది.